అతివలే అధికం | - | Sakshi
Sakshi News home page

అతివలే అధికం

Published Tue, Jan 7 2025 12:15 AM | Last Updated on Tue, Jan 7 2025 12:15 AM

-

● తుది ఓటరు జాబితాలో వారిదే హవా ● కరీంనగర్‌ జిల్లా ఓటర్లు 10,82,751 ● పెద్దపల్లి జిల్లా ఓటర్లు 7,17,390 ● జగిత్యాల 7,20,566.. సిరిసిల్ల ఓటర్లు 4,76,435

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

వును.. రెండో తుది ఓటరు జాబితాలో తామే ముందని చాటారు అతివలు. గతంలో కరీంనగర్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా రెండేళ్లుగా కరీంనగర్‌లోనూ తమ ఓట్లే అధికమని చాటారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తుది ఓటరు జాబితాను విడుదల చేయగా ఇదే స్పష్టమైంది. పురుషుల కన్న మహిళా ఓటర్లు అధి కంగా ఉండటం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి తాజా తుది జాబితా వరకు 28,577 మంది ఓటర్ల సంఖ్య పెరిగింది. అత్యధికంగా కరీంనగర్‌ నియోజకవర్గంలో 7,470 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా చొప్పదండిలో 2,160, మానకొండూరు నియోజకవర్గంలో 3,237 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా హుజూరాబాద్‌లో స్వల్పమే.

అంతటా మహిళలే కీలకం

ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలుండగా కరీంనగర్‌ మినహా మిగతా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కీలకంగా ఉండేవారు. జిల్లా చరిత్రలో వరుసగా రెండోసారి కరీంనగర్‌ నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా నమోదవడం వారి ఓటు స్పృహను చాటుతోంది. కరీంనగర్‌ నియోజకవర్గంలో 1,161, హుజూరాబాద్‌లో 6,988, చొప్పదండి 8,085, మానకొండూరు 5,782 మంది మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కన్న ఎక్కువగా ఉన్నారు. జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల్లోనూ మహిళలు అధికంగా ఉన్నారు. కాగా జగిత్యాల జిల్లాలో 5,157 మంది ఓటర్లను కొత్తగా నమోదు చేయగా 1,465 మంది ఓటర్లను తొలగించారు. పెద్దపల్లిలో 6,147 మందిని నమోదు చేయగా 8,248 ఓట్లను తొలగించగా కరీంనగర్‌లో 7,663 మందిని నమోదు చేయగా 3,970 ఓట్లను తీసివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,523 మందిని కొత్తగా నమోదు చేయగా 1,984 మంది ఓట్లను తొలగించారు.

నియోజకవర్గాల వారీగా ఓటర్లు..

నియోజకవర్గం పురుషులు సీ్త్రలు థర్డ్‌జెండర్‌ మొత్తం సర్వీస్‌

కోరుట్ల 1,17,762 1,30,504 4 2,48,270 50

జగిత్యాల 1,14,499 1,24,593 22 2,39,114 46

ధర్మపురి 1,13,558 1,19,615 9 2,33,182 141

రామగుండం 1,07,892 1,08,258 29 2,16,179 210

మంథని 1,17,660 1,23,091 15 2,40,766 169

పెద్దపల్లి 1,28,180 1,32,258 7 2,60,445 274

కరీంనగర్‌ 1,83,480 1,84,641 45 3,68,166 103

చొప్పదండి 1,13,878 1,21,963 8 2,35,849 204

వేములవాడ 1,08,854 1,19,217 30 2,28,101 63

సిరిసిల్ల 1,20,498 1,27,829 7 2,48,334 106

మానకొండూరు 1,10,301 1,16,083 1 2,26,385 140

హుజూరాబాద్‌ 1,22,678 1,29,666 7 2,52,351 167

హుస్నాబాద్‌ 1,23,083 1,27,837 6 2,50,926 224

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement