‘సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం’ | - | Sakshi
Sakshi News home page

‘సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం’

Published Thu, Dec 12 2024 9:04 AM | Last Updated on Thu, Dec 12 2024 9:04 AM

‘సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం’

‘సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం’

మంచిర్యాలఅగ్రికల్చర్‌: సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ఎస్‌ఎస్‌ఏ జేఏసీ నాయకులు అన్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మెలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ ఎదుట మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ విద్యాశాఖలో గత 15 ఏళ్లుగా అనేక సమస్యలతో సతమతం అవుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఉద్యోగుల రెగ్యులర్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, పే స్కేల్‌ అమలు చేయాలని, ఉద్యోగ జీవిత బీమా రూ.10 లక్షలు, పదవీ విరమణకు రూ.25 లక్షలు, తదితర డిమాండ్లు నెరవేర్చాలని తెలిపారు. సమ్మెకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement