ఐటీ ఆధారిత సేవలు అందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని అన్ని పీఏసీ ఎస్‌లు కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఐటీ ఆధారిత సేవలను సంఘ సభ్యులు, సభ్యేతరులకు అందించాలని జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి అన్నారు. బుధవారం కేసీటీసీ వరంగల్ ప్రిన్సిపాల్ ఎల్.యాకూబ్ నాయక్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని యూని వర్సల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో సీఎస్‌సీ అంశంపై పీఏసీఎస్ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సహకార అధికారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సౌకర్యాలను కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందిపుచ్చుకుని పౌర సేవలను గ్రామ ప్రజలకు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌సీ జిల్లా మేనేజర్ తృప్తి రోహిత్, బ్యాంక్ సీఈవో, సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment