గణిత పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: జిల్లా విద్యాశాఖ, తెలంగాణ గణిత ఫోరం సంయుక్తంగా స్థానిక సైన్స్ సెంటర్‌లో బుధవారం జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పా ఠశాలలు, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 90 మంది విద్యార్థులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ చూపిన విజయలక్ష్మి, శ్రీవాణి, ఎం.రాంచరణ్, షేక్ ఆశ్వక్, ఆకుల అన్వేష్, కార్తీక్, ఎన్.చరణ్, విశ్వరూప్, కె.చరణ్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ వో మాళవిక, సెక్టోరల్ అధికారులు చౌదరి, స త్యనారాయణమూర్తి, డీఎస్‌వో మధుబాబు, తెలంగాణ గణిత ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం పద్మజా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment