క్రీడలతో మానసికోల్లాసం
ములుగు: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా క్రీడల అధికారి ఆధ్వర్యంలో ప్రజా ప్రతి నిధులు, అధికారులకు క్రీడా పోటీలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలను పురష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 8 వరకు క్రీడాపోటీలు నిర్వహించదం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రజా ప్రతినిధులు, అధికారులకు క్రీడా పోటీలను నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రతీ విద్యార్థి విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక ఆసక్తిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీఎం కప్ పోటీలు గ్రామ పంచాయతీల పరిధిలో 7, 8, మండల పరిధిలో 10 నుంచి 12 వరకు, జిల్లా స్థాయిలో 16 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో పాల్గొనే వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు. కబడ్డీ, హ్యాండ్‌బాల్, క్రికెట్ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల ఇన్‌చార్జ్ అధికారి తుల రవి, కబడ్డీ, క్రికెట్, హ్యాండ్‌బాల్ కోచ్‌లు జనార్ధన్, సందీప్, కుమారస్వామి పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment