కొనసాగుతున్న ఉద్యోగుల నిరసన
ములుగు: తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమగ్రశిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ సమీపంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారానికి మూడో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు జిల్లా వ్యాప్తంగా పెన్‌డౌన్, చాక్‌డౌన్ పేరుతో కేజీబీవీ యూఆర్‌ఎస్, ఉన్నత పాఠశాలల్లోని పార్ట్ టైం ఇన్స్‌స్ట్రక్చర్లు, ఎంఆర్‌సీ సిబ్బంది తమకు పనితో పాటు విద్యార్హతను పరిగణలోకి తీసుకొని వేతనాలు అందించాలని సమ్మె ప్రదేశంలో నినాదాలు చేశారు. 20 సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి గురవుతూ అతి తక్కువ వేతనాలతో కుటుంబాలను నెట్టుకుంటూ వస్తున్నామని వా పోయారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్, కోశాధికారి కుమార్ పాడ్య, సభ్యులు నాంపెల్లి చిరంజీవి, అనిత, స్వాతి, యశోద, తిరుమల పాల్గొన్నారు.
కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని జనసేన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమురి శంకర్‌గౌడ్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేక పూజలు చేసి శ్రీశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశా రు. ఆయనను అర్చకులు బైకుంఠపాండా శా లువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం టు మహదేవపూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి పీఎం మోదీ శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచినా ఆలస్యం అవుతుందన్నారు. త్వరగా పనులు చేపట్టాలని చెప్పారు. పనుల విషయమై మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. వారి వెంట సనత్, రాజశేఖర్, దీన్‌మహ్మద్, అవినాష్, రవికాంత్, రాకేష్, సుమన్, ప్రశాంత్, రాజు, రమేష్ ఉన్నారు.
నియామకం
భూపాలపల్లి రూరల్: తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇమామ్ బాబా షేక్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సయ్యద్ అజారుద్దీన్ నియామకమయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశంలో నూతనంగా ఎన్నుకున్న రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం దక్కింది.
గుడుంబా విక్రయిస్తున్న
ఇద్దరిపై కేసు
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో వేర్వేరుగా గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మొగుళ్లపల్లికి చెందిన దేవునూరి పద్మ ఇంటి వద్ద గుడుంబా అమ్ముతున్న క్ర మంలో వచ్చిన సమాచారం మేరకు 50 గుడుంబా ప్యాకెట్లను పట్టుకున్నట్లు తెలిపారు. చిట్యా ల మండలం గిద్దముత్తారం గ్రామానికి చెందిన ఇస్లాతు తిరుపతి 50 గుడుంబా ప్యాకెట్లను విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుడుంబా తయారీ, విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లోని ప్రజలు గుడుంబాపై సమాచారం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్సై తెలిపారు.
మొలకెత్తిన ధాన్యం
చిట్యాల: శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొంతమేరకు తడిసిపోయింది. చిట్యాల వ్యవసాయ మార్కెట్‌కు 20 రోజుల క్రితం తీసుకవచ్చిన ధాన్యాన్ని ఇంతవరకు అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి కురిసిన వర్షంతో బస్తాలు తడిసిపోయాయి. దీంతో రైతులు ఆదివారం ఉదయం మార్కెట్‌కు వచ్చి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వారం రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికి తడిసిన ధాన్యం మొలకెత్తడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. 20 రోజుల క్రితం తెచ్చిన ధాన్యానికి ఇంత వరకు మ్యాచర్ రాలేదా.. లేక రైతుల పట్ల చిన్న చూపా తెలియడంలేదు. ఇప్పటికై నా తడిసిన ధాన్నాన్ని వెంటనే కోనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment