ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను హర్షిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాలక్ష్మీ, గృహజ్యోతి, రూ.500 గ్యాస్ సబ్సిడీ, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, సన్నాలకు రూ.500 బోనస్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ముఖ్యంగా మంత్రి సీతక్క జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కొంతమంది కావాలని ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వాటన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇస్తూ వస్తుందని తెలిపారు. మహిళలకు ఇస్తున్న ఉచిత బస్సు సర్వీస్ పథకం అన్ని గ్రామాల్లోని మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, ఇంచర్ల పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్‌పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్, ఎండీ అప్సర్, బండి శ్రీను. అనిల్, ఆయా మండలాల మహిళా అధ్యక్షురాళ్లు నాగమణి. నిర్మల, అమృత, చిలుకమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్యాణి
Comments
Please login to add a commentAdd a comment