గిరిజన విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమా?
పాణ్యం: గిరిజన విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. శనివారం పాణ్యం గిరిజన గురుకుల బాలుర పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. ‘సార్ మాకు అమ్మఒడి రాలేదు.. ట్యాబ్‌లు ఇవ్వలేదు.. పరీక్షలు దగ్గర పడుతున్నా ఉపాధ్యాయు లు లేక ఇబ్బందులు పడుతున్నాం.. ఎలాగైనా ఉపాధ్యాయులను పంపండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడు తూ గిరిజన గురుకుల పాఠశాలలో అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్లి 40 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఎఫ్‌సీ ప్యానెళ్లు ఇప్పుడు విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయన్నారు. ఉపాధ్యాయులు లేకపోయినా అందులో పాఠాలు వింటూ పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో పాఠశాలు రూపురేఖలు మారాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌ను విమర్శించే వారు ఒక సారి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చూడాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు కోసం ఇద్దరు వలంటీర్లను నియమించుకోవాలని, వారికి గ్రీన్‌కో సంస్థ సహాయంతో వేతనాలు ఇచ్చేలా మాట్లాడుతానని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణానాయక్‌కు కాటసాని సూచించారు. ఆయన వెంట పార్టీ నేతలు చందమామ బాబు, ఎల్లగౌడ్, లక్ష్మానాయక్, పెద్దస్వామి, రామచంద్రుడు, సత్యాలు, రమణతో పాటు తదితరులు ఉన్నారు.
ఇలాగైతే ‘పది’ విద్యార్థులు
ఎలా పాస్ అవుతారు
ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్తే
పట్టించుకోరా?
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment