ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కొత్త సంవత్సరం వేడుక రసాభాసగా మారింది. అంతా చక్కగా న్యూ ఇయర్ వేడుకులు ఆనందంగా జరుపుకుంటుండగా కొందరు వ్యక్తుల కారణంగా ఘర్షణకు దారితీసింది. ఈ మేరకు నోయిడాలోని గౌర్ సిటీ ఫస్ట్ అవెన్యూ సోసైటీలో న్యూ ఇయర్ వేడుకల్లో కొందరూ వ్యక్తులు ఇద్దరు మహిళలతో బలవంతంగా సెల్ఫీలు దిగేందుకు యత్నించారు. దీన్ని ఆ మహిళల భర్తలు వ్యతిరేకించడంతో వారికీ, ఆయా వ్యక్తులకు మధ్య వాగ్వాదం తలెత్తింది.
నిందితులు ఆ మహిళల భర్తలను కొట్టడంతో అక్కడే ఉండే నివాసితులు, సెక్యూరిటీ గార్డు ఈ ఘటనపై జోక్యం చేసుకున్నారు. ఐతే నిందితులు వారిపై కూడా దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగతా నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ అపార్ట్‌మెంట్ సోసైటీకి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, తన స్నేహితుడి భార్యతో బలవంతంగా సెల్ఫీలు దిగేందుకు కొందరూ వ్యక్తులు యత్నించినట్లు పోలీసులకు తెలిపాడు.
దీనికి వారు అభ్యంతర చెప్పడంతో తనపై, అతడి స్నేహితుడిపై దాడి చేశారని, అలాగే వారిని కాపాడేందుకు జోక్యం చేసుకున్న నివాసితులు, సెక్యూరిటీ గార్డుపై కూడా దారుణంగా దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Big Fight At Noida New Year Party After Women "Forced" For Selfies https://t.co/gDlae7A0mD pic.twitter.com/G5oxm5CGIL
— Breaking News (@feeds24x7) January 1, 2023
(చదవండి: న్యూ ఇయర్ రోజున విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా..)
Comments
Please login to add a commentAdd a comment