యువత ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉండాలి
విజయవాడ కల్చరల్: యువత ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉండాలని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. రుషీపీఠం విజయవాడ, సనాతన ధర్మ వేదిక ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించే మన కోసం మన పురాణాల అంశంగా ప్రవచనాలు, సామవేదం రచించిన శివ పదాలకు నృత్యరూపకం కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. సామవేదం మాట్లాడుతూ పురాణాలు ధర్మాలను ఎలా ఆచరించాలో చెప్పాయన్నారు. అవి కథలు కాదని మన జీవన గమనం మార్చే జీవన మార్గాలన్నారు. అమెరికాకు చెందిన నృత్య కళాకారిణి శర్వాణీ యల్లాయ్ సామవేదం రచించిన శివపదాలకు స్వీయ నృత్య దర్శకత్వంలో నృత్యాలను అభినయించారు. కార్యక్రమాన్ని కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ సమన్వయ పరిచారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్, తొండెపు హనుమంతరావు, పాటిబండ్ల సుందరరావు, ఆలమూరి అమర్నాథ్, ఆలమూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment