హిందూ మాదిగ.. మాల ఎలా అయ్యారు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ఉంచిన ఎస్సీల కులాల నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉందని దీనిపై సమగ్ర విచారణ జరిపాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌కు సోమవారం వచ్చిన వన్‌మెన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు మందకృష్ణ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఇంటి పేరు మంద.. మంద అనే ఇంటి పేరు రాష్ట్రంలో ఎక్కడైన మాదిగ కులంలో ఉంటుందని, కాని కొన్ని ప్రాంతాల్లో మంద ఇంటి పేరు ఉన్నవారు మాల అని నోటిఫై చేశారని, అదే విధంగా కొని ప్రాంతాల్లో మాదిగలకు హిందూ మాదిగ అని ఉంటుంది, కాని మాదిగ క్రిస్టియన్ అని నోటిఫై చేశారని ఆరోపించారు.
దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీస్ పోరాడుతూనే ఉందని, వర్గీకరణ అంశం చివర దశకు వచ్చిన సమయంలో మాదిగల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక సామాజిక వర్గం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వారే ఉండటంతో మాదిగలను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వన్‌మెన్ కమిషన్ పూర్తిగా విచారణ చేపట్టి మాదిగలకు, ఎస్సీలోని ఉప కులాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.
ఐక్యత అనేది బూటకమే ...
వర్గీకరణ చేయాలనేది మాదిగల కోసమే కాదని, ఎస్సీల్లోని అట్టడగు కులాల వారీకి కూడా అందాలనే ఉద్దేశంతో మేం వర్గీకరణ చేయాలని కోరుతున్నామని కృష్ణమాదిగ చెప్పారు.
సమగ్ర విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
Comments
Please login to add a commentAdd a comment