క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనున్నాయి. ఇక వన్డే ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్ 4 జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఆపై రెండు జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
దాయాదుల సమరం ఎప్పుడంటే?
ఇక ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్ జట్లు ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఆ రోజు పాకిస్తాన్ సారధి బాబర్ ఆజం జన్మదినం కావడం విశేషం.
దాయాదుల పోరు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుండడంతో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కెపాసిటీ 1 లక్షా 32 వేలుగా ఉంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది కాబట్టి పరుగులు వరద పారడం ఖాయం.
ఇక ఇది ఇలా ఉండగా.. ఐసీసీ వరల్డ్ కప్‌లలో టీమిండియాకి పాకిస్తాన్‌పై ఘనమైన రికార్డు ఉంది. అయితే 2021 టీ20 వరల్డ్ కప్‌లో మొదటిసారి భారత్‌పై పాకిస్తాన్ వరల్డ్ కప్ విజయాన్ని అందుకుంది. అనంతరం టీ20 వరల్డ్ కప్-2022 లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియా పాక్‌పై సంచలన విజయం సాధించింది.
ఇక ఈ వరల్డ్‌కప్‌కు ముందు మరోసారి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఆసియాకప్-2023లో పాకిస్తాన్-భారత్ జట్లు తలపడనున్నాయి. కాబట్టి ఇరు దేశాల అభిమానులకు పండగే అని చెప్పుకోవాలి.
వరల్డ్‌కప్‌లో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..
అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై)
నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు)
చదవండి: ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment