విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

Published Sun, Dec 29 2024 6:55 AM | Last Updated on Sun, Dec 29 2024 6:55 AM

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

అనంతగిరి: రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం భూ లభ్యత, పాత ధాన్యం సేకరణ, ధాన్యం నిల్వ చేసిన భవనాలు, ధరణి పెండింగ్‌ దరఖాస్తులపై అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్‌, సుధీర్‌, సబ్‌ కలెక్టర్‌ ఉమా శంకర్‌ ప్రసాద్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిస్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ధరణిలో ఎలాంటి పెండింగ్‌ ఉండరాదన్నారు. పీహెచ్‌సీల కోసం గుర్తించిన భూముల వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తును తమకు పంపాలని సూచించారు. పాఠశాలలకు పంపే బియ్యం, బియ్యం నిల్వ గోదాములను, రేషన్‌ దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వాసుచంద్ర, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

ధరణి దరఖాస్తులుపెండింగ్‌లో ఉంచరాదని ఆదేశం

దరఖాస్తుల ఆహ్వానం

పరిగి: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్‌ గురుకుల పాఠశాలల్లో 5నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ థామస్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. 23న పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఫిబ్రవరి ఒకటిలోపు దరఖాస్తు చేసుకోవాలి

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్‌ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి ఒకటవ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 – 26 సంవత్సరం 5వ తరగతి ప్రవేశ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించాలని తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు సాధ్యం కాకుంటే స్థానికంగా ఉండే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కులం, ఆదాయం, పుట్టిన తేదీ ధ్రువ పత్రాలు, ఆధార్‌ నంబర్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి పరీక్షలకు విద్యార్థులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement