ఊరు మాయం.. పేరు పదిలం!
శిథిలావస్థకు చేరిన బురుజు
కాలగర్భంలో కలిసిన గండ్ల్లపల్లి
● గత్తరతో గ్రామం ఖాళీ
● రెండు శతాబ్దాల క్రితం కనుమరుగు
● పక్క ఊళ్లకు వెళ్లి అక్కడే స్థిరపడిన స్థానికులు
● క్షేత్రస్థాయిలో ఊరు లేకపోయినా.. అదే పేరుతో రెవెన్యూ రికార్డులు
● చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న శిథిలాలు
కొడంగల్ మండలం టేకుల్‌కోడ్ పంచాయతీకి అనుబంధంగా ఉండేది గండ్లపల్లి గ్రామం. చుట్టూ ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతం. రాళ్ల గనులు, పచ్చని పంట పొలాలతో కళకళలాడేది. నాపరాతి గనులు అధికంగా ఉండటంతో ఈ ఊరిని ‘గనులపల్లి’ అని పిలిచేవారు. వ్యవసాయ పనులు లేని సమయంలో.. ఇక్కడి ప్రజలు గనుల్లోని రాళ్లను తవ్వి జీవనం సాగించేవారు. గనులపల్లి కాలక్రమేణా గండ్లపల్లిగా మారింది. సీన్ కట్ చేస్తే.. రెండు వందల ఏళ్ల క్రితం ఈ ఊరిని మహమ్మారి(అంటువ్యాధి) ఆవరించింది. అంతుచిక్కని గత్తర(రోగం) ప్రాణాలను కబళించసాగింది. బతుకు జీవుడా అంటూ ప్రజలంతా వలస వెళ్లడంతో గ్రామం పూర్తిగా కనుమరుగైనా.. రికార్డుల్లో పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. – కొడంగల్
వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment