భూ సర్వేకు సన్నాహాలు
దుద్యాల్: మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భూ సర్వేకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం హకీంపేట్ రైతులతో రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాల్లో భూ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిషన్ మాట్లాడుతూ.. హకీంపేట్ పరిధిలోని 351 ఎకరాల అసైండ్ భూములకు గాను సర్వే చేయనున్నట్లు తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా రైతులు పొజిషన్‌లో ఉన్నారా లేదా అనే విషయాలు గుర్తిస్తామన్నారు. ఇందుకు రైతులు సహకరించాలని, సర్వే సమయంలో అందుబాటులో ఉండాలని కోరారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. పట్టా పాసుపుస్తకాలు ఉన్న చాలా మంది రైతులు పొజిషన్‌లో లేదని తెలిపారు. సర్వే చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో కొడంగల్ తహసీల్దార్ విజయ్‌కుమార్, ఉప తహసీల్దార్ వీరేశ్ బాబు, ఆర్‌ఐ నవీన్, సర్వేయర్ మహేశ్, రికార్డ్ అసిస్టెంట్ ఊశప్ప తదితరులు పాల్గొన్నారు.
హకీంపేట్ రైతులతో సమావేశం
31 నుంచి ప్రక్రియను ప్రారంభిస్తాం: తహసీల్దార్ కిషన్
Comments
Please login to add a commentAdd a comment