ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు నవంబర్ నెలకు సంబంధించి శుక్రవారం కేవలం 35 శాతం జీతం చెల్లించింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో కేవలం 35 శాతం జీతం చెల్లించడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం సెప్టెంబర్ జీతం 50 శాతం, అక్టోబర్ జీతం 35 శాతం, నవంబర్ పూర్తి జీతం పెండింగ్ పెట్టింది. డిసెంబర్ నెల పూర్తి జీతంతో మొత్తం 285 శాతం జీతం పెండింగ్‌లో పెట్టింది. గత నెలలో పూర్తి జీతం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఈ నైలెనా మొత్తం జీతం ఇస్తారని ఆశించగా నవంబర్ నెలకు సంబంధించి కేవలం 35 శాతం ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుంచి జూనియర్
కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
విశాఖ విద్య: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు శనివారం నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుందని జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ అధికారిణి బి. రాధ తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పెదగంట్యాడ మండలం అగనంపూడి జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఈ కార్యక్రమం అమలు జరగనుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment