పశువైద్యశాలలకు మందుల సరఫరా
విజయనగరం ఫోర్ట్: ప్రాంతీయ, గ్రామీణ, సంచార పశువైద్యశాలల్లో మందుల కొరతతో మూగ జీవాల వైద్యానికి ప్రైవేటు వెటర్నరీ మెడికల్ షాపుల్లో రైతులు మందులు కొనుగోలు చేస్తున్నారన్న అంశంపై గత నెల 30న ‘మూగజీవాల వైద్యానికి మందుల్లేవ్’ అనే శీర్షిక ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి పశు సంవర్థక శాఖ అధికారులు స్పందించారు. పశువైద్యశాలలకు మందులు సరఫరా చేశారు.
రెవెన్యూ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా కమిటీ రూపొందించిన 2025 వార్షిక డైరీను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన చాంబర్‌లో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాడి గోవింద్, ప్రధాన కార్యదర్శి సూర్య, రాష్ట్ర కార్యదర్శి బంగారురాజు, కలెక్టరేట్ విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఉద్యోగవర్గాల శుభాకాంక్షలు
విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ క్యాంపు ఆఫీసుకు చేరుకొని శుభాకాంక్షలు చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్‌కు కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లయిస్ అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది శుభాంక్షలు తెలిపారు.
ఉద్యోగాల్లో కొనసాగించాలి
● మహిళల ఆందోళన
తగరపువలస: విజయనగరం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 170 మంది మహిళలు బుధవారం ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం స్ప్రింట్ సీ ఫుడ్స్ సంస్థ ముందు ఆందోళన చేపట్టారు. పదేళ్ల నుంచి పనిచేస్తున్న తమను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని వారు ఆరోపించారు. నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంతో మాట్లాడేందుకు మహిళలు ప్రయత్నం చేయగా.. సిబ్బంది అనుమతించలేదు. దీంతో గేటు ముందు బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment