● ‘రాజాం’లో ఏం చేస్తారో?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజాం అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిన సంగతి తెలిసిందే. 2019 సంవత్సరానికి ముందు నుంచి దీర్ఘకాలంగా అపరిష్కృతంగానున్న సమస్యలపై దృష్టి సారించింది. ఫలితంగా ఆర్టీసీ కాంప్లెక్స్ కొత్తరూపు సంతరించుకుంది. కోటి రూపాయలకు పైగా నిధులతో ఎర్రవాని చెరువు కొత్తగా పార్కు అయ్యింది. వైఎస్సార్ పార్కు కూడా మరింత సౌకర్యవంతమైంది. అన్నింటికన్నా ముఖ్యంగా రాజాం ప్రధాన రహదారి 80 అడుగుల మేర తొలివిడత విస్తరణ పనులు పూర్తి అయ్యాయి. రూ.13 కోట్ల వ్యయంతో రాజాం–పాలకొండ మధ్య డబుల్ రోడ్డు విస్తరణ సాకారమైంది. ఇప్పుడు గాయత్రీ కాలనీ నుంచి జీఎంఆర్‌ఐటీ వరకూ రూ.20 కోట్లతో రెండో విడత పనులు జరుగుతున్నాయి. వీటిని కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరంలో శరవేగంగా పూర్తి చేయించాల్సి ఉంది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడని వంగర మండలంలో రుషింగి వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేయించింది. సంతకవిటి మండలం వాల్తేరు వద్ద బలసలరేవును ఆనుకుని నాగావళి నదిపై వంతెన నిర్మిస్తానని 1998 సంవత్సరంలోనే స్థానిక ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు... అధికార పీఠం ఎక్కిన తర్వాత పట్టించుకోలేదు. మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే రూ.37 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ వంతెన కోసం చంద్రబాబు పరిపాలన సమయంలోనే ఏడాదిన్నర పాటు రిలేనిరాహార దీక్ష సాగించిన 50 గ్రామాల ప్రజల కోరికను ఈ కూటమి ప్రభుత్వంలో 2025 సంవత్సరంలోనైనా మన్నిస్తుందేమో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment