● ‘భోగాపురం’ దశ తిరిగేనా?
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ దశలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమవ్వలేదు. కేంద్రం నుంచి అనుమతులూ లేవు. అయినా 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసేశారు. అడ్డంకులన్నీ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిష్కరించింది. రైతులకు పరిహారం పెంచి ఇచ్చింది. కోర్టు కేసులన్నింటినీ అధిగమించింది. నిర్వాసితులకు రెండు మోడల్ కాలనీలను నిర్మించింది. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే 2023 మే నెలలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో జీఎంఆర్ సంస్థ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. దాదాపు 60 శాతం వరకూ పనులు పూర్తి అయ్యాయని అధికారులు చెబుతున్నారు. 2026 మార్చి నాటికి తొలిదశ పనులు పూర్తికావాలంటే 2025 సంవత్సరం చాలా కీలకం. అలాగే డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లోని రైతులకు సాగునీరు, విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు తాగునీటితో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అవసరాలకు నీటి సరఫరాకు ఉద్దేశించిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులనూ ఈ సంవత్సరంలోనైనా కొలిక్కి తీసుకురావాల్సి ఉంది. ఇప్పటివరకూ సుమారు 63 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment