● పడకేసిన కొత్త రోడ్ల నిర్మాణం
శృంగవరపు కోట మండలంలో గిరిజనుల డోలీ మోత కష్టాలను తప్పించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దారపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని దబ్బగుండ గ్రామం నుంచి పల్లపుదుంగాడ వరకు ఆరు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5.30 కోట్ల నిధులను మంజూరుచేసింది. ఎర్త్‌వర్క్ పూర్తి అయ్యింది. మిగతా పనులు మొదలవగానే కూటమి ప్రభుత్వం రావడంతో అవికాస్తా పడకేశాయి. అవి 2025 సంవత్సరంలోనైనా పూర్తి చేయాలని గిరిజనులు ఆశిస్తున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలోని గిరిజనులు, గిరిజనేతరులకే కాదు ఏజెన్సీలో ఏ ప్రమాదం జరిగినా ఆపద్బాంధువు ఎస్.కోట సామాజిక ఆస్పత్రిని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే వంద పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. నిర్మాణ పనులను 2025లో పూర్తిచేస్తే ప్రజలకు మరింత ఉపయోగంగా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలోనే రూ.36 కోట్లతో వేపాడ–ఆనందపురం రహదారి మంజూరైంది. సుమారు 16 కిలోమీటర్ల పొడవున తారురోడ్డు పూర్తి అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment