Annapurna Studios
-
అన్నపూర్ణ స్టాఫ్‌ని ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున
‘‘రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ వచ్చి, ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు... అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతోమందికి ఏఎన్‌ఆర్‌గారు స్ఫూర్తి’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడాది మొదలైంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనక మా అమ్మ అన్నపూర్ణగారు ఉన్నారనేది ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనిపిస్తుంటుంది. అన్నపూర్ణ స్టాఫ్‌ని మేం ఫ్యామిలీలా భావిస్తాం. స్టూడియో ఇంత కళకళలాడుతోందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం. ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్నలు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది’’ అన్నారు. -
అన్నపూర్ణ స్టూడియోస్ సరికొత్త చరిత్ర..
-
దేశ సినీ చరిత్రలోనే మొదటిసారి.. ఆవిష్కరించిన రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశారు. మనదేశంలోనే మొట్టమొదటిసారి ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన డాల్బీ పోస్ట్ ప్రొడక్షన్(Dolby Technology)ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలో ఇండియాలో ఇప్పటివరకు అందుబాటులో లేని డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. చిత్ర నిర్మాణంలో ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా సినిమాలను తెరకెక్కించనున్నారు. ఆడియన్స్‌కు సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. అది కూడా మన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించడం మరో విశేషం.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సమయంలో డాల్బీ విజన్‌లో సినిమాను అప్ గ్రేడ్ చేయాలనుకున్నా. కానీ ఆ టెక్నాలజీ మనదగ్గర లేదు. దాని కోసం మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. ఇది నాకు కొంత వరకు నిరుత్సాహానికి గురిచేసింది. నా సొంత దేశంలో నా సినిమాని డాల్బీ విజన్‌లో చూడలేకపోయానని నిరాశకు గురయ్యా. కానీ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ సదుపాయాన్ని చూసి థ్రిల్ అయ్యా. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నా నెక్ట్స్ మూవీ విడుదలయ్యే సమయానికి భారతదేశం అంతటా బహుళ డాల్బీ సినిమాలు ఉంటాయి. డాల్బీ విజన్‌లో సినిమా చూడటం పూర్తిగా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోని కథనాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రేక్షకులు ఈ డాల్బీ సదుపాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.అనంతరం నాగార్జున మాట్లాడుతూ..'వర్చువల్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉండటం కోసం ఎల్లప్పుడు ముందుంటాం. దేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సినిమాను వరల్డ్ మ్యాప్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ తన 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డాల్బీని ఏర్పాటు చేయడం విశేషం. అత్యాధునికి టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలకు మరో ముందడుగు"అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్కు సంబంధించిన స్పెషల్ ఫుటేజ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రదర్శించారు.మహేశ్ బాబుతో రాజమౌళి..కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. జనవరి 2న హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.హీరోయిన్‌పై చర్చ..కాగా.. మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అయింది. -
'బిగ్‌బాస్' ఫైనల్ చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో.. భద్రత పెంచిన పోలీసులు
ఈ నెల 15వ తేదీన బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనుంది. ఈ సీజన్ విన్నర్ రేసులో గౌతమ్,నిఖిల్,నబీల్,ప్రేరణ,అవినాష్ ఉన్నారు. బిగ్ బాస్‌లోకి మొత్తం 22మంది ఎంట్రీ ఇస్తే వారిలో ఈ ఐదుమంది మాత్రమే సుమారు 100 రోజులకు పైగా గెలుపు రేసులో ఉన్నారు. అయితే, డిసెంబర్ 15వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లలో ముఖ్య అతిథిగా ఒక సెలబ్రెటీ రావడం సహజమే.. బిగ్ బాస్ రేసులో గెలిచిన వారికి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా ట్రోపీతో పాటు ప్రైజ్ మనీ చెక్‌ను కూడా అందిస్తారు. అయితే, గత సీజన్లో ముఖ్య అతిథిగా ఎవరూ రాలేదు. దీంతో హోస్ట్‌గా షోను నడిపించిన నాగార్జున చేతుల మీదుగానే పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకున్నాడు. దీంతో ఈ సీజన్లో తప్పకుండా సినీ సెలబ్రిటీని ముఖ్య అతథిగా తీసుకురావాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను బిగ్ బాస్‌కు రానున్నారని ప్రచారం జరుగుతుంది. పుష్ప2 విజయంతో బన్నీ విజయోత్సవంలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఫైనల్లో అతిథిగా పాల్గొంటే షో మరింత బజ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బన్నీనే ముఖ్య అతిథిగా బిగ్‌బాస్‌కు వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా జనం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.బిగ్ బాస్ ఫైనల్ కోసం భారీ సెక్యూరిటీబిగ్బాస్ సీజన్–8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల్లో బిగ్‌బాస్ సెట్టింగ్ వేయగా..ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఫైనల్ రోజుకు ముందే 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. -
అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య- శోభిత వెడ్డింగ్.. అసలు కారణం వెల్లడించిన చైతూ!
మరి కొద్ది రోజుల్లోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి జరగనుంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల కొత్త జీవితం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.పెళ్లి వేదిక అక్కడే ఎందుకంటే..అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌నే పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గానే చేయాలని నాగచైతన్య కోరినట్లు నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులు వారిద్దరే చూసుకుంటున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరగడానికి అదే సెంటిమెంట్‌గా తెలుస్తోంది. అక్కడే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉండడమే కారణం.కుటుంబ ఉమ్మడి నిర్ణయం..ఈ పెళ్లికి ఆయన ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమని చైతూ తెలిపారు. అందుకే తన తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ వెల్లడించారు. మా కుటుంబాలు ఒకచోట చేరి ఈ వేడుక జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు చైతన్య పేర్కొన్నారు.తనతో బాగా కనెక్ట్ అయ్యా..శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు చైతూ వెల్లడించారు. ఆమెతో తాను చాలా కనెక్ట్ అయ్యా.. నన్ను బాగా అర్థం చేసుకుంటుందన్నారు. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తాను భర్తీ చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య తెలిపారు. కాగా.. వీరిద్దరి పెళ్లి వేడుక డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. -
ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అక్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ-2024 ఈవెంట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. -
నాగచైతన్య- శోభితల పెళ్లి.. చైతూ కోరడం వల్లే అలా: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న శోభిత- నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. వచ్చేనెల 4వ తేదీన హైదరాబాద్‌లోనే వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పనులపై అక్కినేని నాగార్జున స్పందించారు. పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు ఆయన వివరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ కామెంట్స్ చేశారు.నాగార్జున మాట్లాడుతూ..'ఈ ఏడాది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మా నాన్నగారి శతజయంతి వేడుక కూడా నిర్వహించాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే వీరి పెళ్లి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ స్టూడియో మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నకు చాలా ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరాడు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులతో కలిపి 300 మందిని పిలవాలని నిర్ణయించాం. స్టూడియోలో అందమైన సెట్లో వీళ్ల పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామన్నారని' తెలిపారు.గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించినట్లు నాగార్జున వెల్లడించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని చెప్పినట్లు తెలిపారు. వైజాగ్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని నాగ్ అన్నారు. ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడిందని.. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని కాబోయే కోడలిపై ప్రశంసలు కురిపించారు. -
అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్!
అక్కినేని హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సందడి చేసింది.వచ్చేనెల డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. అయితే పెళ్లి వేదిక విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య- శోభిత పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనుందట. ఎందుకంటే అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్ కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగువారి సినీదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కూడా అక్కడే ఉంది. అందువల్లే పెళ్లి వేడుక అక్కడే నిర్వహిస్తే తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని కుటుంబసభ్యులు భావిస్తున్నారట. కాగా.. ఏఎన్నార్ శతజయంతి వేడుకలు కూడా అక్కడే నిర్వహించారు.పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ప్రత్యేకంగా వేదికను తయారు చేస్తున్నట్లు టాక్. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేలా వీరి వివాహా వేదికను అలంకరించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ విహహం అత్యంత వైభవంగా జరగనుంది. -
అమర్ దీప్ కారుపై దాడి, పోలీసుల లాఠీఛార్జ్
-
అలాంటి కార్తీనే ఇష్టపడుతున్నారు!
‘‘చేసిన పాత్రలనే మళ్లీ చేస్తే నాకు బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు వినూత్నంగా, ప్రయోగాత్మకంగా సినిమాలు చేసే కార్తీనే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అంటే నేను నాలా ఉంటే ఆదరిస్తున్నారు. మరొకరిలా ఉండాలనుకోవడం లేదు. కాబట్టి నా తరహా సినిమాలే నేను చేస్తాను’’ అని కార్తీ అన్నారు. కార్తీ హీరోగా ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ‘జపాన్’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు. ∙‘జపాన్’ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. నిజమైన కథ కాదు. కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూ΄పొందించాం. ఈ సినిమా కేవలం వినోదం ఇవ్వడం మాత్రమే కాదు... మన ఉనికిని, అస్థిత్వాన్ని ప్రశ్నించేలా కూడా ఉంటుంది. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. సోషల్ మీడియా అంశాన్ని కూడా టచ్ చేశాం. అలాగే మనకు ‘జపాన్’ అంటే హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడి గుర్తుకు రావచ్చు. ఆ దాడి తర్వాత జపాన్ దేశం మళ్లీ పుంజుకుని అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఈ రిఫరెన్స్ ‘జపాన్’ పాత్రలో కూడా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మాస్‌తో కూడిన స్ట్రాంగ్ అండ్ సెటైరికల్ రోల్ నాకు మళ్లీ ‘జపాన్’తో వచ్చినట్లు అనిపించింది. ‘జపాన్’ గ్రే క్యారెక్టర్ కాదు.. డార్క్ అంతే. నా క్యారెక్టర్లో డార్క్ హ్యూమర్ ఉంటుంది. ‘జపాన్’ కోసం రెగ్యులర్ కార్తీలా ఉండకూడదని అనుకున్నాను. దర్శకుడు కూడా ఇదే కోరుకున్నారు. ఈ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అయ్యాను. నా వాయిస్ మాడ్యులేషన్, హెయిర్ స్టయిల్ అన్నీ కొత్తగా అనిపిస్తాయి. నేను నటించిన ‘ఊపిరి’ సినిమా తమిళ వెర్షన్‌కు దర్శకులు రాజు ముగరున్ డైలాగ్స్ రాశారు. ఆయనలో మంచి హ్యూమర్ ఉందని ఆ సమయంలో అనిపించింది. కానీ రాజుగారు తీసిన ‘కుకు’, ‘జోకర్’ సినిమాల్లో ఇది అంతగా లేదు. సాధారణంగా నేను నా కోసం ఏవైనా కథలు ఉన్నాయా? అని ఎవర్నీ అడగలేదు. తొలిసారి రాజు మురుగన్‌ని అడిగాను. ఓ డార్క్ ఎమోషనల్ స్టోరీ చెప్పారు. నాకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత మరో కథలోని ఓ క్యారెక్టర్ నచ్చి, ఆ పాత్ర ఆధారంగా కథ రాయమన్నాను. అలా ‘జపాన్’ కథ మొదలైంది. రాజు మురుగన్గారు గతంలో జర్నలిస్ట్‌గా చేశారు. ఆయన తన జీవితంలో చూసిన కొన్ని ఘటనలను ‘జపాన్’లో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే నాగార్జునగారి అన్నపూర్ణ స్టూడియోస్‌తో అసోషియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ∙దర్శకుడు నలన్కుమార్తో నేను చేస్తున్న సినిమా 70 శాతం షూటింగ్ పూర్త యింది. ‘96’ ఫేమ్ ప్రేమ్‌కుమార్‌తో ఓ సినిమా చేయనున్నాను. అలాగే ‘ఖైదీ 2’, ‘సర్దార్ 2’ చిత్రాలు చేయాల్సి ఉంది. -
నాగార్జున వేసుకున్న ఈ షర్ట్‌కి ఓ స్పెషల్ ఉంది.. గుర్తుపట్టారా?
సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారు ధరించే బట్టల దగ్గర్నుంచి చెప్పులు వరకు ప్రతీది కాస్ట్లీగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈవెంట్ ఏదైనా డిజైనర్ వేర్ కాస్ట్యూమ్ ఉండాల్సిందే అనేంతలా ఆకట్టుకుంటారు. వాళ్లు ధరించే వాచ్‌లు, మేకప్, హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్స్,కాస్ట్యూమ్స్.. ఇలా ఒకటేమిటి ప్రతీదాంట్లో యూనిక్‌నెస్ కోరుకుంటారు. ఇక టాలీవుడ్ మన్మథుడు నాగార్జున స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా పర్ఫెక్ట్గా సూటైపోతుంది. 64ఏళ్లు పైబడినా సరే ఇప్పటికీ నాగార్జున గ్రీకువీరుడిలానే అట్రాక్ట్ చేస్తారు. సిక్స్టీ ప్లస్‌లో ఉన్నా, యంగ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న షర్ట్ ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ షర్ట్ రెండేళ్ల క్రితం నాటిది. 2021లో బిగ్‌బాస్ సీజన్5లో ఓ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఈ షర్ట్ వేసుకున్నారు. ఎట్రో పైస్లీ బ్రాండ్‌కు చెందిన లెమన్ ఎల్లో సిల్క్ షర్ట్‌లో భలే అట్రాక్ట్ లుక్‌లో కనిపించారు. దీని ధర దాదాపు $1310 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 83,908 రూపాయలు అన్నమాట. అప్పట్లోనే ఈ షర్ట్ ధర గురించి సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపించింది. అయితే మళ్లీ రెండేళ్లకు ఇప్పుడు నాగార్జున సేమ్ షర్ట్‌లో కనిపించడం విశేషం. ఎంత కాస్ట్లీ బట్టలైనా ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను స్పెషల్ ఈవెంట్స్‌లలో రిపీట్ చేయడానికి మామూలుగానే సెలబ్రిటీలు ఇష్టపడరు. కానీ నాగార్జున ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో ఇలా సింపుల్‌గా కనిపించడం నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
అన్నపూర్ణ స్టూడియోలో ANR శత జయంతి ఉత్సవాలు
-
తెలుగు సినీ దిగ్గజం.. అక్కినేనికిదే శతజయంతి నివాళి!
తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పుట్టి సినీ ప్రపంచంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యం ఏర్పరచుకున్న ఏకైక నటుడు మన అక్కినేని. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో కళామతల్లి ఒడిలో ఒదిగిపోయారు. ఆయన శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. (ఇది చదవండి: భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్) అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ తారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సుమంత్, నాగచైతన్య, అమల, అఖిల్ ఆయనకు నివాళులర్పించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్ రాజు, మోహన్ బాబు, రామ్ చరణ్, మహేశ్ బాబు, సుమ కనకాల, టాలీవుడ్ సినీ పెద్దలు పాల్గొన్నారు. A moment of joy and pride for the fans of #AkkineniNageswaraRao Garu ✨💫 Former Vice President of India Shri. @MVenkaiahNaidu Garu unveils the statue of #ANR garu at @AnnapurnaStdios marking the centenary birthday ❤️ Watch ANR 100 Birthday Celebrations live now! -… pic.twitter.com/5ajMSNFiM1 — Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2023 -
నాగార్జున-కార్తీ కాంబినేషన్లో 'సర్ధార్'..
Karthi Sardar Movie Telugu Distribution Rights To Nagarjuna: నాగార్జున–కార్తీ కాంబినేషన్లో ‘ఊపిరి’ తర్వాత మరో సినిమా రానుంది. ‘ఊపిరి’లో ఈ ఇద్దరూ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం నటులుగా కాదు.. వీరి కాంబినేషన్ రిపీట్ కానున్నది నిర్మాత, హీరోగా. కార్తీ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘సర్దార్’ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదల చేయనున్నారు నాగార్జున. ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని సోమవారం (జూన్ 27) ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని తెలుగు, తమిళ భాషల్లో దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'అభిమన్యుడు' ఫేమ్ పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందిచగా, కెమెరా బాధ్యతలను జార్జ్ సి. విలియమ్స్ చేపట్టారు. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. నా ప్రతి అడుగులో అతను ఉన్నాడు: యంగ్ హీరోయిన్ We are truly elated to be teaming up with @Prince_Pictures to distribute@Karthi_Offl 's Much awaited flick #Sardar in AP & TS 💥💥 WW Releasing this DIWALI 🧨🎇#SardarDiwali 💥@Psmithran @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash @RedGiantMovies_ @lakku76 @ChunkyThePanday pic.twitter.com/jhQM4YI9Cb — Annapurna Studios (@AnnapurnaStdios) June 27, 2022 The Chaos will be 🔛 with his ARRIVAL ! @Karthi_Offl 's Most Awaited Film #Sardar AP & TS Distribution Rights Bagged by #AnnapurnaStudios 💥 WW Releasing this DIWALI 🧨🎇#SardarDiwali 💥@Psmithran @Prince_Pictures @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash @RedGiantMovies_ pic.twitter.com/OwH14sbSDg — Annapurna Studios (@AnnapurnaStdios) June 27, 2022 -
38 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ క్షణాలు.. కపిల్ దేవ్ భావోద్వేగపు వ్యాఖ్యలు
‘‘1983 జూన్ 25న జరిగిన వరల్డ్ కప్ పోటీలో నా సార థ్యంలోని భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచిన క్షణాలు మరచిపోలేనివి. 38 ఏళ్ల తర్వాత ‘83’ ద్వారా మరోసారి ఆ క్షణాలను వెండితెరపై ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకున్న నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకోన్ నటించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో దీపికా పదుకోన్, సాజిద్ నడియాద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘1983లో ఇండియా వరల్డ్ కప్ గెలవగానే భారతదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. ‘83’ ట్రైలర్ చూశాక కపిల్ దేవ్ నటించారా? అనిపించింది. ఆ పాత్రలో రణ్వీర్ అంతలా ఒదిగిపోయారు’’ అన్నారు. రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ– ‘‘కపిల్దేవ్లాంటి లెజెండ్ పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు. విష్ణు ఇందూరి మాట్లాడుతూ– ‘‘83’ రషెస్ చూసుకున్న ప్రతిసారీ కన్నీళ్లు వచ్చాయి.. అంతలా ఈ చిత్రంలోని భావోద్వేగాలుంటాయి’’ అన్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్రను జీవా అద్భుతంగా చేశాడు. నేను, నాగార్జున ఇంజినీరింగ్‌లో క్లాస్మేట్స్. కాలేజ్‌లో సైలెంట్‌గా ఉన్న నాగ్.. ‘శివ’తో వైలెంట్‌గా ట్రెండ్ సెట్ చేశాడు’’ అన్నారు. కబీర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం కపిల్‌తో పాటు అప్పటి టీమ్‌ని కలిసి సలహాలు తీసుకున్నాను. అప్పటి వార్తా కథనాలనూ రిఫరెన్స్‌గా తీసుకున్నాను. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న క్షణాలు, ఆ తర్వాత పరిస్థితులను చూపించాం’’ అన్నారు. ‘‘అందరూ... ముఖ్యంగా యువతరం చూడాల్సిన సినిమా ఇది’’ అని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సుభాశిష్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విడాకుల తర్వాత తొలిసారి అక్కినేని కాంపౌండ్‌లోకి సామ్!
Samantha Spotted In Annapurna Studios Goes Viral : స్టార్ హీరోయిన్ సమంత పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సామ్‌కు సంబంధించిన ప్రతీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సమంత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. తాజాగా సామ్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు వచ్చినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. విడాకుల అనంతరం తొలిసారి అక్కినేని కౌంపాండ్లో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు సమంత అక్కడికి ఎందుకు వెళ్లినట్లు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇటీవలె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్.. డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చిందట. చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా వచ్చి పని పూర్తి ముగించుకొని వెళ్లిందట. కాగా విడాకులు ప్రకటించడానికి కొన్నిరోజుల ముందు నుంచే నాగ చైతన్య జూబ్లీహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో విడిగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే..సామ్, చై ఇద్దరూ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. -
అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం ప్రకటించింది. షూటింగ్ కోసం వేసిన సెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని స్టూడియో నిర్వాహకులు వెల్లడించారు. బిగ్‌బాస్‌కు ప్రమాదం లేనట్టేనా? అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో బిగ్‌బాస్ షూటింగ్ జరుగుతుండటంతో కొంత ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి కుడివైపున బిగ్‌బాస్ హౌజ్ ఉండటమే దీనికి కారణం. అయితే, మంటలు అదుపులోకి రావడంతో బిగ్‌బాస్ నిర్వహణకు ప్రమాదమేమీ లేదని సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని వార్తలు రావడంతో కింగ్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపడేశారు. అంతా బాగానే ఉందని, భయ పడాల్సిందేమీ లేదని ట్విటర్ వెల్లడించారు. (చదవండి: లైఫ్‌లో ఎప్పుడూ నిన్ను బాధపెట్టను: లాస్య) There are some articles in the media that there has been a major fire At Annapurna Studios this morning… Not to worry this is WRONG NEWS and everything is absolutely fine👍😊 — Nagarjuna Akkineni (@iamnagarjuna) October 16, 2020 -
చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ
-
మరోసారి చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ
సాక్షి, హైదరాబాద్ : సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం భేటీ అయ్యారు. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థలం సేకరించాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్చరల్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాల సేకరణ చేయాలని సూచించారు. సినీ, టీవీ కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలన్నారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు ఇస్తామని తెలిపారు. ఎఫ్డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పైరసీ నివారణకు ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కొద్ది రోజుల కిత్రమే చిరంజీవి, నాగార్జునలు మంత్రి తలసానితో భేటీ అయిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే దానికి కొనసాగింపుగానే నేటి సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చదవండి : చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ -
బిగ్‌బాస్-2.. అదే అసలు సమస్య!
బిగ్‌బాస్... విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ రియాల్టీ షో మన దగ్గర తొలుత బాలీవుడ్లో బాగా క్లిక్ అయ్యింది. ఆ ప్రేరణతో మిగతా భాషల్లోనూ ఈ షోలను తెరకెక్కిస్తుండగా.. అక్కడ కూడా మంచి రేటింగ్‌లనే రాబడుతున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులోనూ బిగ్‌బాస్-1 కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే అంచనాలకు అందని పేరున్న ఈ షో.. సెకండ్ సీజన్లో మాత్రం అందుకు అతీతంగానే సాగుతోంది. అందుకు ప్రధాన కారణం లీకేజీలు. (తేజస్వీ సంచలన వ్యాఖ్యలు) తొలి సీజన్ పుణే(మహారాష్ట్ర)లో ప్రత్యేకమైన సెట్ వేసి, బయటి టెక్నీషియన్లతో నిర్వహించటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. కానీ, బిగ్‌బాస్-2ని మాత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి కానిచ్చేస్తున్నారు. ఇదే అసలు తలనొప్పిగా మారింది. సాధారణంగా షోకి సంబంధించిన ఎపిసోడ్లను ఒకరోజు ముందుగానే చిత్రీకరిస్తుంటారు. దీంతో షో కోసం పని చేస్తున్న సిబ్బందికి ఏం జరుగుతుందన్న సమాచారం ముందే తెలిసిపోతుంది. కనుక తమకు కావాల్సిన వారికి ఆ సమాచారాన్ని ముందుగానే చేరవేస్తున్నారు. ఈ దశలో తమకు తెలిసినంత మేర సమాచారాన్ని పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. లీక్‌లు చేసేది సిబ్బంది అని తెలిసి కూడా ఏం చేయలేని స్థితిలో నిర్వాహకులు ఉండిపోయారు. దీనికితోడు కంటెస్టెంట్లు కూడా బయటకు వచ్చేసిన క్రమంలో అత్యుత్సాహంతో వెనువెంటనే తమ సమాచారాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసేసుకుంటున్నారు. వెరసి సమాచారం మొత్తం షో టెలికాస్టింగ్ కంటే కాస్త ముందే మీడియాకి, జనాల్లోకీ చేరిపోతోంది. ఈ పరిణామాలతో ఉత్కంఠంగా సాగాల్సిన ఈ దఫా సీజన్.. ఎలాంటి మసాలా లేకుండా చప్పగా సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
బిగ్ బ్యానర్లో సెకండ్ ఛాన్స్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన యువ నటుడు రాహుల్ రవీంద్రన్. తొలి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు. ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు రాహుల్. ఈ సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాకు ఓకె చెప్పాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రస్టీజియస్ బ్యానర్లో దర్శకుడిగా తన రెండో సినిమా తెరకెక్కనుందట వెల్లడించారు రాహుల్. నటీనటులు సాంకేతిక నిపుణులను ఫైనల్ చేయాల్సి ఉందని తెలిపారు. Here’s the other news am soooper happy to share with you all:) I have signed with @AnnapurnaStdios for my second directorial:) Will be an absolute honour and I will work hard to make it count:) Cast and other details yet to be finalised. — Rahul Ravindran (@23_rahulr) 6 July 2018 -
అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియోలో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎవరైనా హత్యచేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
టాలీవుడ్ సినీ ప్రముఖుల అత్యవసర సమావేశం
-
టాలీవుడ్ రహస్య భేటీ.. హాజరైన అగ్రహీరోలు!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల పలు దుమారాలు టాలీవుడ్‌ను కుదిపేస్తున్న నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి ఈ భేటీ జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర హీరోలు చిరంజీవి, రాంచరణ్, మహేశ్‌బాబు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, నాగచైతన్య, సుమంత్, నాగబాబు, నాని తదితర దాదాపు 20 మంది హీరోలు, సినీ ముఖ్యులు ఈ భేటీలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌ను క్యాస్టింగ్ కౌచ్ దుమారం కుదిపేస్తుండటం, టాలీవుడ్లో మహిళలను లైంగికంగా దోచుకుంటున్నారని నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేయడం, పవన్ కల్యాణ్‌పై ఆమె చేసిన దూషణలు, ఈ వ్యవహారం వెనక తాను ఉన్నట్టు రాంగోపాల్ వర్మ ఒప్పుకోవడం, మీడియాలో కథనాల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఇది రహస్య సమావేశమేనని సంబంధిత వర్గాలు అంటున్నాయి. గత కొన్నిరోజులుగా తాజా వివాదాలపై పలు విభాగాల ముఖ్యులు సమావేశమవుతూ వస్తున్నారు. తాజాగా హీరోల భేటీకి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. గోప్యంగా జరుగుతున్న ఈ భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవలి వివాదాలు, రాంగోపాల్ వర్మ, మీడియా తీరుపై తదితరాలు చర్చకు వచ్చే అవకాశముందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగిందని అంటున్నారు. -
టాలీవుడ్ ప్రముఖులు కీలక భేటీ
-
కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. దాడికి యత్నం!
సాక్షి, హైదరాబాద్ : సినీ పెద్దల విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శనివారం అన్నపూర్ణ స్టూడియోకు రావడం కొంత ఉద్రిక్తత రేపింది. కత్తి మహేశ్ రావడంతో పవన్ అభిమానులు ఆగ్రహించారు. దీంతో కత్తి మహేశ్‌కు, పవన్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు తనపై దాడికి ప్రయత్నించారని కత్తి మహేశ్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ‘అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ లేడు. 24 క్రాఫ్ట్స్ మీటింగ్ లేదు. నేను అక్కడ మీడియాతో మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘జై పవర్ స్టార్’ అని నినాదాలు చేశారు. నా కారు మీద దాడికి ప్రయత్నం జరిగింది’ అని కత్తి మహేశ్ పేర్కొన్నారు. సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు ఈ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను మీడియాకు మాత్రం వెల్లడించలేదు. ముందుగా ఈ సమావేశానికి పవన్ కూడా హాజరవుతారన్న ప్రచారం జరిగినా.. భద్రతా కారణాల దృష్ట్యా హాజరు కాలేదు. -
తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల భేటీ
-
అచ్చతెలుగు కన్నడమ్మాయి
చిలిపితనం, అమాయకత్వం, అందం కలబోస్తే.. మేఘన! కన్నడ దేశంలో పుట్టిన ఈ అమ్మాయి ‘శశిరేఖ’గా టీవీ వీక్షకుల మదిని దోచుకున్నారు. మంగ, నిత్య పాత్రలతో భిన్న పాత్రలను పోషిస్తున్నారు. కథానాయికగాను, ప్రతికథానాయికగానూ నటనలో వైవిధ్యం చూపుతున్నారు. ఈ విలక్షణ నటితో ఆమె ‘టీవీయానం’ గురించి సాక్షి ముచ్చటించింది. మేఘన.. ‘ఆలీబాబా 40 దొంగలు’ అనే కన్నడ నాటకంలోని కథానాయిక ‘హసీనా’ పాత్రతో మొట్టమొదటిసారిగా రంగస్థలం మీద కనిపించారు. తర్వాత ‘రాబిన్‌హుడ్’ నాటకంలో నటించారు. మండ్యా రమేశ్ స్థాపించిన ‘నటన’ రంగ మందిరంలో తన ఎనిమిదవ ఏటనే చేరి స్టేజ్ నాటకాల కోసం నటనలో శిక్షణ పొందారు. ఈ రోజు తాను టీవీ తారను కావడానికి కారణం తన గురువు గారేనంటారు మేఘన. ‘‘నేను పుట్టింది మైసూరులో. అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ, నేను మైసూరులోనే ఉంటున్నాం’ అని వారి ఫ్యామిలీ గురించి మరిన్ని వివరాలు చెప్పారు మేఘన. బెస్ట్ న్యూస్ ఫేస్ ‘‘నేను ఈ రోజు నటిని అయ్యానంటే రమేశ్గారే కారణం. మా అమ్మ, నాన్న కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మా కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదువుకున్నవారే. నేను మాత్రమే మధ్యలో నటన వైపు మళ్లాను. నాకు 14 సంవత్సరాలు వచ్చేవరకు రంగస్థలం మీదే ఉన్నాను. స్కూల్లో కంటే ‘నటన’ సంస్థలోనే ఎక్కువసేపు ఉండేదాన్ని. అయితే నాకై నేను ఎప్పుడూ యాక్టర్‌ని కావాలి అనుకోలేదు. ఇంట్లో అందరికీ కళలంటే అభిమానం. అందువల్ల నాకు ప్రోత్సాహం లభించి ఉంటుంది. మొత్తం 250 నాటక ప్రదర్శనలిచ్చాను. డిగ్రీ చదువుతుండగా తొలిసారి కన్నడ సీరియల్లో అవకాశం వచ్చింది. ఒక భక్తి సీరియల్లో అది సపోర్టింగ్ పాత్ర. ఆ సీరియల్‌కి ‘బెస్ట్ న్యూ ఫేస్’ అవార్డు వచ్చింది. ఆ తరవాత కన్నడలోనే రెండు సీరియల్స్ చేశాను. కొద్ది రోజులకే తెలుగులో అవకాశం వచ్చింది. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్ కోసం తెలుగులో అన్నపూర్ణ సంస్థ వాళ్లు పిలిపించారు. ‘‘నాన్నగారికి ఇష్టం లేకపోయినా నా ఉత్సాహం చూసి సరేనన్నారు. మా అమ్మమ్మ నాగరత్నం ఈ రోజు వరకు నాతో షూటింగులకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘జీ’ తెలుగులో ‘కల్యాణ వైభోగమే’ చేస్తున్నాను. చూసే ఉంటారు ఇందులో మంగ, నిత్య రెండూ నేనే. నెగెటివ్ అండ్ పాజిటివ్. ఇప్పుడు ‘రక్తసంబంధం’ అనే కొత్త సీరియల్ వస్తోంది’’ అని చెప్పారు మేఘన. అటొక అడుగు ఇటొక అడుగు తండ్రి అనారోగ్యం రీత్యా చాలాకాలం షూటింగ్ కోసం మైసూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణాలు చేశారు మేఘన. అందువల్ల కొన్నిసార్లు షూటింగులకు వెళ్లలేకపోయేవారు. దాంతో నటనకు కొంతకాలం విరామం వచ్చింది. ‘‘కిందటి సంవత్సరం నాన్నకి క్యాన్సర్ బయపడింది. సీరియల్స్ చేస్తూ నాన్నను చూసుకోవలసి వచ్చింది. యూనిట్ సహకరించడం వల్లనే మధ్య మధ్యలో మైసూరు వెళ్లి నాన్నని చూసి వచ్చేందుకు వీలైంది. ఓసారి మనసు ఉండబట్టలేక, నాన్న దగ్గర పది రోజులు ఉందామని బయలుదేరాను. కాని మైసూరు వచ్చి ఆసుపత్రిలో ఆయనను చేర్చే లోపే అంతా జరిగిపోయింది. చివరి రోజుల్లో నాన్న దగ్గర ఎక్కువరోజులు ఉండలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ బాధను మరచిపోలేకపోయాను చాలాకాలం’’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు మేఘన. తెలుగు వారే ఆదరించారు బిజీగా ఉంటే కోలుకోవచ్చుననే ఉద్దేశంతో మళ్లీ సీరియల్స్ ఒప్పుకున్నారు. నాలుగైదు రోజులకి ఒకసారి మైసూరు వెళ్లి వస్తున్నారు. తెలుగు సీరియల్స్‌లో బిజీగా ఉండటం వల్ల తెలుగు చిత్రాలకు, కన్నడ సీరియల్స్‌కు చెయ్యలేకపోతున్నారు. ‘‘నన్ను తెలుగు వారు బాగా ఆదరించారు. ‘శశి బి టెక్’ గా నేను పాపులర్ అయ్యాను. అందరూ తెలుగింటి ఆడపడుచుననే అనుకుంటున్నారు’’ అని సంతోషంగా చెప్పారు మేఘన. పరిశ్రమలో ఇంతవరకు తాను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, పరిశ్రమ నుంచి పిలుపు అందుకుని, వచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నాననీ చెప్పారు. – పురాణపండ వైజయంతి -
‘రంగుల రాట్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగుల రాట్నం జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : రాజ్ తరుణ్, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి సంగీతం : శ్రీచరణ్ పాకల దర్శకత్వం : శ్రీ రంజని నిర్మాత : నాగార్జున అక్కినేని ఉయ్యాల జంపాల సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్ తరుణ్ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి అదే బ్యానర్లో నటించిన సినిమా రంగుల రాట్నం. శ్రీ రంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ పోటి మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? కథ : విష్ణు (రాజ్ తరుణ్) బాధ్యత తెలియకుండా పెరిగిన కుర్రాడు. తల్లి(సితార) గారాభం చేయటంతో ఏ పనీ సొంతం గా చేసుకోకుండా అన్నింటికీ తల్లి మీద ఆధారపడుతుంటాడు. పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందని అమ్మాయిని చూడటం మొదలు పెడుతుంది విష్ణు తల్లి. అయితే అదే సమయంలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసే కీర్తి(చిత్రా శుక్లా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు విష్ణు, ఆ అమ్మాయితో పరిచయం పెంచుకునేందుకు అమ్మ పుట్టిన రోజు పార్టీ అని కీర్తిని ఇంటికి పిలుస్తాడు. అలా వారిద్దరి పరిచయం స్నేహంగా మారుతుంది. కానీ కీర్తికి ప్రేమ విషయం చెప్పేలోపే విష్ణు తల్లి చనిపోతుంది. తల్లి చనిపోయిన బాధలో ఉన్న విష్ణు ఆ బాధనుంచి ఎలా బయటపడ్డాడు..? కీర్తికి ఎలా దగ్గరయ్యాడు..? కీర్తి ఓకె చెప్పిన తరువాత విష్ణు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? చివరకు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : గత ఏడాది కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ కొత్త ఏడాదిలో రంగుల రాట్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనకు అలవాటైన మేనరిజమ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథలో బలమైన సన్నివేశాలు లేకపోవటంతో నటుడిగా పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదు. సెంటిమెంట్ సీన్స్‌లో మాత్రం మంచి పరిణతి కనబరిచాడు. హీరోయిన్ చిత్రా శుక్లా పరవాలేదనిపించింది. తల్లి పాత్రకు సీనియర్ నటి సితార ప్రాణం పోసింది. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రియదర్శి మంచి నటన కనబరిచాడు. అక్కడక్కడ ప్రియదర్శి కామెడీ కాస్త నవ్విస్తుంది. విశ్లేషణ : తొలి చిత్రంగా ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ఓ సాధారణ ప్రేమకథను ఎంచుకున్న దర్శకురాలు శ్రీరంజని, ఆ కథను ఆసక్తికరంగా తెర మీద ఆవిష్కరించటంలో పూర్తిగా విఫలమయ్యారు. సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. ఏ దశలోనూ ఆడియన్ను కథలో లీనం చేయలేకపోయారు. బలమైన ఎమోషన్స్, ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ మరింత బలంగా చూపించేందుకు అవకాశం ఉన్నా.. అలాంటి సన్నివేశాలపై పెద్దగా దృష్టిపెట్టినట్టుగా అనిపించదు. శ్రీచరణ్ అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సితార పాత్ర నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : కథా కథనం స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నవ్వుకున్నాం.. ఏడ్చాం : నాగార్జున
వరుస రెండు రోజుల్లో కొన్ని ఆనందకరమైన క్షణాలు, మరికొన్ని బాధాకరమైన విషయాలు జరగటంపై హీరో నాగార్జున స్పందించారు. ఇటీవల ఒక్కటైన నాగచైతన్య, సమంత రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో అక్కినేని కుటుంబసభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే వేడుకలు ముగిసి 24 గంటలు గడవక ముందే ఓ విషాదకర సంఘటన జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం మనం షూటింగ్ జరిగిన సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన ఈ సెట్ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. తన తండ్రి గుర్తుగా ఉంచిన సెట్ కాలిపోవటంతోపై నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు సంఘటనపై స్పందించిన నాగ్, ‘ ఈ వారం ఎంతో భావోద్వేగంగా గడిచింది. నవ్వుకున్నాం.. ఏడ్చాం.. ప్రస్తుతం ఈ రోజు మద్యాహ్నం నుంచి హలో సినిమా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. తొలి సినిమా అఖిల్ తో నిరాశపరిచిన అక్కినేని వారసుడు, రెండో ప్రయ్నతంగా ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఈ రోజు మద్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించనున్నారు. Hello my friends, it’s been a emotional week!! We laughed and we cried and now we are ready to kickstart #Hello promotions this afternoon 2 pm😄 — Nagarjuna Akkineni (@iamnagarjuna) 14 November 2017 -
సినిమా కుదిరిందా?
‘‘అంతా కలిసొస్తే మేం వచ్చే ఏడాది వెండితెరపై మళ్లీ జంటగా కనిపించే అవకాశం ఉంది’’ అని సమంత ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. నాగచైతన్యతో మళ్లీ ఎప్పుడు కలసి నటిస్తారు? అని అడిగితే, సమంత ఈ విధంగా స్పందించారు. ఇప్పుడు మంచి కథ–క్యారెక్టరైజేషన్స్ కుదిరినట్లున్నాయి. నాలుగోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు సమంత, నాగచైతన్య జంట రెడీ అవుతోంది. ఈ ఇద్దరూ ‘ఏ మాయ చేశావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించనున్నారని టాక్. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చుతారట. విజయదశమికి కొబ్బరికాయ కొట్టి, షూటింగ్ షెడ్యూల్‌ను సెప్టెంబర్‌లో మొదలుపెట్టనున్నారని సమాచారం. -
నాగ్ బ్యానర్లో మరో సినిమా
సీనియర్ హీరో నాగార్జున, దర్శకులను సాంకేతిక నిపుణులను మాత్రమే కాదు.. ఇటీవల తన బ్యానర్లో హీరోలను కూడా పరిచయం చేస్తున్నాడు. అలా నాగ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పరిచయం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్. ఆ సినిమా సమయంలోనే అదే బ్యానర్లో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే ఇన్నాళ్లు సరైన కథ దొరక్క ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా రాజ్ తరుణ్, అన్నపూర్ణ స్టూడియోస్‌లో తన రెండో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో రంజని అనే మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ 1న లాంచనంగా ప్రారంభించనున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న రాజుగాడు సినిమా రిలీజ్‌కు రెడీ అవ్వగా, అందగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. -
'వాళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసింది'
హైదరాబాద్ : తెలుగు ప్రేక్షక దేవుళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసిందని యువరత్న నందమూరి బాలకృష్ణ తెలిపారు. నాకు ... నా అభిమానుల మధ్య ఉన్న బంధం ఎన్నటికీ విడదీయరానిదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... నా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రలు చేశానని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం చాటి చెప్పిన మహావ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణి అని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహానీయుడి చరిత్ర గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఈ చిత్రంలో నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. -
ఇలాంటి చిత్రం... గ్యారంటీ హిట్టు!
- నాగార్జున ‘‘పునాది బలంగా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. నాన్నగారు స్థాపించిన స్కూలులో, అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థలో అనేక చిత్రాలకు చునియా పని చేసింది. ఆమె దర్శకత్వం వహించిన సినిమా కావడంతో నేను ప్రమోట్ చేయాలనుకున్నా’’ అని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రలో నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పడేశావే’ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘యూత్ లవ్‌లోని ఇష్టాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. అనూప్ మంచి సంగీతం అందించాడు. ఇలాంటి సినిమా తీస్తే గ్యారంటీ హిట్టవుతుంది. సినిమా చూసి చిరునవ్వుతో బయటికొస్తారు’’ అని నాగా ర్జున అన్నారు. ‘‘నేను సీరియల్ డెరైక్ట్ చేస్తున్నప్పుడు చునియా నా వద్ద జాయిన్ అయింది. తర్వాత రాజమౌళి, ఆ తర్వాత నాగార్జున వద్ద వర్క్ చేసింది. డెరైక్టర్‌గా మంచి పేరు సంపాదించాలి’’ అని దర్శకులు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ‘‘నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాఘవేంద్రరావుగారు, నాగార్జున గారే. ‘మనం’ చిత్ర సమయంలో నాగార్జున గారికి ఈ కథ వినిపించా. ఆయనకు నచ్చడంతో షూటింగ్ స్టార్ట్ చేసి, పూర్తి చేశాను. ఈ నెల 26న పాటలను విడుదల చేస్తాం’’ అని దర్శకురాలు చునియా తెలి పారు. సంగీత దర్శకుడు అనూప్, హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ నిత్యాశెట్టి చిత్రబృందం పాల్గొన్నారు. -
కామెడీకి... 60 లక్షల సెట్!
‘‘ఓ యువకుడు తన లక్ష్యం కోసం కొంతమందితో సీరియస్‌గా ఆటాడేస్తాడు. ఇంతకూ అతని లక్ష్యం ఏంటి? అతనాడిన గేమ్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఆటాడుకుందాం రా’ చూడాల్సిందే’’ అంటున్నారు హీరో సుశాంత్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పాటలు మినహా పూర్తయ్యింది. సుశాంత్ మాట్లాడుతూ - ‘‘మంచి కథ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశా. ఈ కథ నచ్చింది’’ అని చెప్పారు. ‘‘ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో కామెడీ సీన్ కోసం స్పెషల్‌గా 60 లక్షల ఖర్చుతో టైమ్ మెషీన్ సెట్ వేశాం. కామెడీ సీన్ కోసం ఇంత ఖర్చు పెట్టి, సెట్ వేయడం ఇదే ఫస్ట్ టైమ్’’ అని జి. నాగేశ్వరరెడ్డి తెలిపారు. -
కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే!
ఓ పక్క బందరు లడ్డులాంటి సుందరాంగి... ఇంకో పక్క జాంపండులాంటి కోమలాంగి... నారి నారి నడుమ మురారిలాగా చాకులాంటి కుర్రాడు! మంచి లొకేషన్ కుదిరింది. అకేషన్ అదిరింది. ఇంకేముంది... డ్యూయట్ స్టార్ట్. ‘‘జాంపేట కాడ కన్ను కొట్టేస్తనే! నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తనే! కొత్తపేట కాడ కొంగు లాగేస్తనే! కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే!’’... ఇదంతా ‘పండగ చేస్కో’ పాట సంరంభం. రామ్, రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్‌లపై ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో జానీ నృత్య దర్శకత్వంలో, భాస్కరభట్ల రాసిన ఈ పాటను భారీ ఎత్తున చిత్రీకరించారు దర్శకుడు మలినేని గోపీచంద్. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ పాటతో పూర్తయింది. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ ఛానల్ చాలా క్రేజీ ఆఫర్‌తో చేజిక్కించుకున్నట్టు సమాచారం. -
రొమాంటిక్ క్రైమ్ కామెడీ!
సుమంత్ హీరోగా ఓ చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. మనీ, మనీ మనీ, వన్ బై టూ, పట్టుకోండి చూద్దాం, సిసింద్రీ తదితర చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల మూడో వారంలో మొదలు కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్.ఎస్. క్రియేషన్స్, చెర్రీ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. -
అమల క్లాప్, నాగ్ స్విచ్ఛాన్..అఖిల్ ఎంట్రీ.
-
నీతా అంబానీ తదితరులకు 'మనం' ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్: భారత దేశంలో ప్రముఖ కార్పోరేట్ సంస్థల అధినేత్రిలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోను శనివారం సందర్శించారు. అన్నపూర్ణ స్టూడియోలో సందర్శించిన వారిలో బాలీవుడ్ నటి జుహీ చావ్లా, రిలయన్స్ అధినేత్రి నీతా అంబానీ, స్వాతి పిరమిల్, నవాజ్ సింఘానియా, అనన్య గోయోంకాలు, లీనా తివారీ, రాధిక సేథ్, అనుప షెహ్నయ్ లున్నారు. అధినేత అక్కినేని నాగార్జున వారికి స్వాగతం పలికి.. అన్నపూర్ణ స్టూడియోలోని వివిధ విభాగాలను చూపించారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం 'మనం'ను మినీ థియేటర్ లో వారికి నాగార్జున ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. హుదూద్ బాధితులకు వారు 11 కోట్ల రూపాయల సహాయం అందించారు. -
ఈ నెల 30న...పన్నెండు గంటల పాటు మేము సైతం
హుదూద్ తుపాన్ బీభత్సం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సుందర నగరం విశాఖకి పూర్వ శోభను తెచ్చే ప్రయత్నంలో ‘మేము సైతం’ అంటూ తెలుగు చిత్రపరిశ్రమ నడుం బిగించింది. సినిమా స్టార్లందరూ ఒకే వేదికపైకి వచ్చి, 12 గంటల పాటు నిర్విరామంగా సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరిశ్రమలోని వివిధ శాఖల ప్రతినిధులు ఈ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ -‘‘గత నెల 12న జరిగిన ప్రకృతి వైపరీత్యం అందరికీ తెలిసిందే. హుదూద్ తుపాన్ ధాటికి ఉత్తరాంధ్ర తీవ్రంగా దెబ్బతిన్నది. ఇలాంటి విపత్తు పరిణమించిన ప్రతిసారీ... బాధితుల్ని ఆదుకోవడానికి ‘మేము సైతం’ అంటూ సినీ పరిశ్రమ ముందుకొస్తూనే ఉంది. ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా ఈ నెల 30న హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’’ అని తెలిపారు. ‘‘ఈ నెల 30ని సినీపరిశ్రమకు సెలవు దినంగా, వచ్చే నెల రెండో ఆదివారం పనిదినంగా ప్రకటించాం. మంచి దృక్పథంతో 12 గంటల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమం.. అంద రికీ కావల్సినంత వినోదాన్ని పంచుతుంది’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ -‘‘ఈ కార్యక్రమానికి పరిశ్రమ వారు మాత్రమే ఆహ్వానితులు. బయటవారికీ టికెట్లు అమ్ముతాం. అయితే, టికెట్ కొన్నంత మాత్రాన లోపలికి అనుమతించం. లక్కీ డీప్ ద్వారా కొందరిని ఎంపిక చేసి, వారినే అనుమతిస్తాం. టికెట్ ధర రూ. 500. పరిశ్రమనే కమిటీగా భావించి సమష్టిగా చేస్తున్న కార్యక్రమం ఇది. ‘మేము సైతం డాట్ కామ్’ ద్వారా కార్యక్రమ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బు సేకరించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తాం. సినీ పరిశ్రమకు చెందిన స్టార్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అన్నారు. ఇంకా ఏపీ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్, నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎ.శ్యామ్‌ప్రసాదరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, జెమినీ కిరణ్, మధుర శ్రీధర్, కెవీరావు తదితరులు మాట్లాడారు. -
'ఒక లైలా కోసం’ పోస్టర్స్
-
‘మనం’ లోగో రూపకర్త ప్రేమ్‌రాజ్
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన మనం సినిమా లోగోను ఆత్మకూరు మండలం నాగయ్యపల్లె గ్రామానికి చెందిన గిన్నారపు ప్రేమ్‌రాజ్ రూపొందించారు. అక్కినేని నాగేశ్వర్రావు చివరి చిత్రం ఇదే. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర్రావు, నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా, సమంత, శ్రేయ హీరోయిన్లుగా చేశారు. ప్రేమ్‌రాజ్ కొంత కాలంగా సినిమా లోగోలు తయారు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటింగ్) చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ కాశిబుగ్గకు చెందిన అనిల్ ఈ సినిమాకు పోస్టర్ డిజైనర్‌గా చేయడం వల్ల లోగోను రూపొందించి అవకాశం తనకు దక్కిందన్నారు. ఇంతపెద్ద సిని మాకు లోగో తయారు చేయడం అదృష్టంగా భావి స్తున్నానని తెలిపారు. -
తెలుగు సినిమాకు 'అన్నపూర్ణ'
అక్కినేని సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమయంలో హైదరాబాద్‌లో ఉన్నది ఒక్క ‘సారథి’ స్టూడియో మాత్రమే. అందులోనూ అరుదుగా షూటింగులు జరుగుతుండేవి. సినీ పరిశ్రమ మొత్తం మద్రాసులోనే ఉండిపోయింది. అక్కినేని ‘అన్నపూర్ణ స్టూడియో’తోనే హైదరాబాద్‌కు రంగుల కళ వచ్చింది. సినిమాల నిర్మాణమూ ఊపందుకుంది. నిదానంగా భాగ్యనగరం సినీ శోభను సంతరించుకుంది. అసలు తనకు సినిమా భిక్ష పెట్టిన మద్రాసును వదులుకోవాల్సిన పరిస్థితి అక్కినేనికి ఎందుకొచ్చింది? అనే విషయాల్ని విశ్లేషించుకుంటే.. ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. అక్కినేని తమిళంలో పాతిక వరకూ సినిమాలు చేశారు. దాదాపు అన్నీ సిల్వర్ జూబ్లీలే. ఈ విజయాలు తమిళ నటులకు కంటికి కునుకు రాకుండా చేశాయి. అక్కినేని మద్రాసుని వదలడానికి ఇది ఓ కారణం. ఇక అక్కినేనికి చదువంటే ప్రాణం. కానీ, పరిస్థితుల కారణంగా నాల్గో తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. తన పిల్లల్ని మాత్రం బాగా చదివించుకోవాలనుకున్నారు. అయితే, మద్రాసులో తెలుగు నేర్పే సౌకర్యం లేదు. అక్కినేనికి మాతృభాషపై మమకారం మెండు. అందుకే పిల్లల చదువుకోసం హైదరాబాద్‌కు మకాం మార్చేయాలనుకున్నారు. మద్రాసు వదలడానికి ఇదొక కారణం. ఎలాగూ సారథివారి చిత్రాలకు అక్కినేనే హీరో. సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ఉండనే ఉంది. పైగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు.. ఇన్ని రకాలుగా ఆలోచించి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు అక్కినేని. ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే... హైదరాబాద్ వచ్చి తీసుకోవచ్చు’ అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాంతో ఏఎన్నార్‌పై విమర్శలు ఊపందుకున్నాయి. అభిమానించినవారు, ఆరాధించినవారు సైతం మాటల పిడుగుల వర్షం కురిపించారు. పరిశ్రమలో తన ప్రాణమిత్రుడు అనదగ్గ ఎన్టీఆర్ నుంచి నాగిరెడ్డి, చక్రపాణి, నరసరాజు, ఎస్వీరంగారావు... ఇలా అందరూ ఆ క్షణంలో అక్కినేనిని నిందించిన వారే. కానీ అక్కినేని అవేమీ లెక్క చేయలేదు. 1964 నుంచి 1974 వరకూ దాదాపు 60 సినిమాలు కేవలం సారథి స్టూడియోలోనే చేశారు. దాంతో భాగ్యనగరంలో విరివిగా సినిమా ఆఫీసులు వెలిసి, ఇతర నటుల చిత్రాల షూటింగులు కూడా ఊపందుకున్నాయి. అలాంటి సమయంలో అక్కినేనికి గుండెకు సంబంధించిన సమస్య తలెత్తింది. దానికి ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు. స్టూడియో నిర్మాణానికి నాంది.. అక్కినేని అమెరికాలో ఉన్న సమయంలో కృష్ణ నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. దానికి నవయుగ వారు పంపిణీదారులు. ఆ సినిమా ఓ వారంలో విడుదల అవుతోందనగా... అక్కినేని సూచన మేరకు తమ సొంత సంస్థ ‘అన్నపూర్ణ ఫిల్మ్స్’వారు పాత ‘దేవదాసు’ని విడుదల చేశారు. ఈ సినిమా మళ్లీ ప్రభంజనం సృష్టించడం.. కృష్ణ ‘దేవదాసు’ పరాజయం పాలవడం జరిగిపోయింది. దీనిని కృష్ణ స్పోర్టివ్‌గా తీసుకున్నా.. పంపిణీ చేసిన నవయుగవారు మాత్రం తేలిగ్గా తీసుకోలేదు. అక్కినేని సినిమాల షూటింగులకు నెలవైన సారథి స్టూడియోలో నవయుగవారు కూడా భాగస్వాములు. ఆపరేషన్ ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చాక అక్కినేని ఒప్పుకున్న చిత్రం ‘మహాకవి క్షేత్రయ్య’కు స్టూడియో అడిగితే... ‘ఇవ్వం.. నష్టాల్లో ఉన్నాం’ అన్నారు. ‘అయితే మాకివ్వండి.. నడుపుకొంటాం’ అంటే.. ‘మీకు ఇవ్వం.. మేం తెరవం’ అనేశారు. ఇది కక్ష సాధింపని అక్కినేనికి అర్థమైపోయింది. అయితే అక్కినేనిది ధర్మాగ్రహం. అది కనిపించే కోపం కాదు. అనుకున్నది సాధించే కోపం. బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోలో ‘మహాకవి క్షేత్రయ్య’ షూటింగ్‌ని ముగించారు. మనమే ఎందుకు కట్టకూడదు.. నవయుగవారు చేసిన పనితో.. ‘మనమే ఎందుకు స్టూడియో కట్టకూడదు’ అని అక్కినేనికి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనే హైదరాబాద్‌కు వరమైంది. మద్రాసును వదిలినందుకే ఎన్నో విమర్శలు గుప్పించిన సినీజనం.. హైదరాబాద్‌లో స్టూడియో అనగానే.. హేళనగా నవ్వారు. మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సైతం వద్దని వారించారు. కానీ అక్కినేని మొండి పట్టుదలతో జూబ్లీహిల్స్ కొండల్ని పలుగులతో పగలగొట్టించారు. పలుగుల తాకిడికి బద్దలవుతున్న ఆ రాళ్ల శబ్దాలే.. తెలుగునేలపై తెలుగు సినిమా అభ్యున్నతికి జయకేతనాలయ్యాయి. ఇక చెన్నపట్నంలోని తెలుగు సినిమా భాగ్యనగరం వైపు పరవళ్లు తొక్కింది. జూబ్లీహిల్స్ పక్కన కృష్ణానగర్ తయారై.. వేలాది సినీ కార్మికులకు ఆవాసమైంది. అదీ.. అక్కినేని అంటే. ముందు చూపుతో.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు అభివృద్ధి చెందక ముందు.. అదంతా దట్టమైనఅడవి, గుట్టలు, రాళ్లతో నిండి ఉండేది. ఆ ప్రాంతంలోనే దార్శనిక దృష్టితో అక్కినేని ‘అన్నపూర్ణ స్టూడియో’ను నిర్మించారు. ఈ స్టూడియో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1975లో స్థలం కేటాయించింది. 1976 జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోను ప్రారంభించారు. అప్పటి సీఎం జలగం వెంగళరావు, నిర్మాత రామానాయుడు, అప్పటి అగ్రనటి వాణిశ్రీ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోకు ఇటీవలే అదనంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా కళాశాల కూడా చేరింది. స్టూడియో రికార్డుల ప్రకారం.. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 70 లక్షల మంది సందర్శించారు. -
ఎప్పటికీ ఎవర్గ్రీన్
అక్కినేని మృతితో శోకసంద్రంలో రాష్ట్రం గుండెలవిసేలా రోదిస్తున్న అభిమానులు కడసారి చూపునకు తరలివస్తున్న ప్రజలు జనసంద్రమైన అన్నపూర్ణ స్టూడియోస్ సినీ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖుల నివాళులు దేశవ్యాప్తంగా సంతాప సందేశాల వెల్లువ నేడు సినీ షూటింగులు, థియేటర్లు బంద్ శాసనమండలి, అసెంబ్లీ సంతాప తీర్మానాలు మధ్యాహ్నం దాకా అన్నపూర్ణ స్టూడియోస్‌లో భౌతికకాయం అనంతరం ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమయాత్ర అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో సాయంత్రం అంత్యక్రియలు ఓ.. దేవదా.. బోరున వర్షం.. ఉరుములు.. మెరుపులు.. ఒకటే దగ్గు.. నోట్లోంచి తెరలు తెరలుగా రక్తం.. ‘ఇంకెంత దూరం..’.. ‘ఇంకో కోసెడు ఉంది బాబు..’ ‘అంతవరకు బతుకుతానో లేదో, కోరినంత డబ్బు ఇస్తాను త్వరగా పోనీ’ దుర్గాపురం వచ్చేసింది.. చావిట్లో గడ్డిపై పడిపోయిన ఆయన నోట మాట పెగలటం లేదు.. పార్వతిని చూసేందుకు తపించిన ఆ కన్నులు కాసేపటికే మూతపడ్డాయి.. ఇచ్చిన మాట కోసం ప్రాణాలకు తెగించి పట్నం నుంచి వచ్చిన ఓ దేవదా..! నిన్ను పార్వతి కన్నా అమితంగా ఆరాధిస్తున్న కొన్ని కోట్ల గుండెలు పిలుస్తున్నాయి.. మా కోసం మళ్లీ రావా.. మహా నటశిఖరం నేలకొరిగింది. అఖిలాంధ్ర ప్రేక్షకులను ఏకంగా ఏడు దశాబ్దాలకు పైగా ఆనంద సాగరంలో ఓలలాడించిన సినీ దిగ్గజం ఇక సెలవంటూ జీవిత రంగ స్థలం నుంచి నిష్ర్కమించింది. నటనకే కొత్త భాష్యం చెప్పడమే గాక హుషారైన డ్యాన్సులతో తెలుగు సినిమాకు కొత్త పోకడలు నేర్పిన నటసమ్రాట్ మరి లేరన్న వార్త తెలిసి ఆంధ్ర దేశమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. బుధవారం తెల్లవారుజామున అక్కినేని నాగేశ్వరరావు మరణించారన్న విషాద వార్త సూర్యోదయానికి ముందే రాష్ట్రమంతటా దావానలంలా పాకింది. అశేష అభిమానులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోదించారు. తమ అభిమాన నటుణ్ని కడసారి కళ్లారా చూసుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అక్కినేని భౌతికకాయాన్ని ఉంచిన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ అభిమానుల తాకిడితో జనసంద్రంగా మారింది. ఏఎన్నార్ మరణ వార్త తెలిసి తెలుగు సినీ పరిశ్రమ కూడా తల్లడిల్లిపోయింది. తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమ దిగ్గజాలు, ప్రముఖ నటీనటులంతా అక్కినేనికి శ్రద్ధాంజలి ఘటించేందుకు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచీ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు బుధవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కడసారి నివాళులు అర్పించారు. శాసనమండలి, శాసనసభ అక్కినేని మృతికి సంతాపం ప్రకటించాయి. ఏఎన్నార్ మృతికి సంతాప సూచకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. సినీ షూటింగులకు కూడా విరామం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం 11.30 దాకా అన్నపూర్ణ స్టూడియోస్‌లో, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఫిలిం చాంబర్లో ఉంచుతారు. 12.30 నుంచి అక్కినేని అంతిమయాత్ర మొదలవుతుందని ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. ఫిలిం చాంబర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా తిరిగి అన్నపూర్ణ స్టూడియోకు అంతిమయాత్ర చేరుతుందని తెలిపారు. గురువారం సాయంత్రం మూడింటి తర్వాత అక్కినేని పార్ధివ దేహానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అన్నపూర్ణ స్టూడియోలో అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు సినీ పరిశ్రమను మకుటం లేని మహారాజుల్లా ఏలిన అగ్రశ్రేణి ద్వయంలో ఎన్టీఆర్ అనంతరం ఇప్పుడు ఏఎన్నార్ కూడా మహాభినిష్ర్కమణం చేసి కళామతల్లికి కడుపుకోత మిగిల్చారు. ఎన్నెన్ని పాత్రలు! ఎంతటి వైవిధ్యం! ఎంతటి నటనా వైదూష్యం! జానపద నాయకుడిగా మురిపించినా, అల్లరి ప్రియుడిగా కొంటె చేష్టలతో అలరించినా, భగ్న ప్రేమికుడిగా భేష్ అన్పించినా, నవలా నాయకునిగా రాణించినా, విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, సాంఘిక పాత్రల్లో సాటిలేని నటన ప్రదర్శించినా, మహా భక్తునిగా తత్వసారాన్ని రంగరించినా, వయసు పైబడ్డాక కుటుంబ పెద్దగా వెండితెరకే నిండుదనం తెచ్చినా ఆయనకే చెల్లింది. పద్మాలు మొదలుకుని ఫిల్మ్ఫేర్లు, దాదాసాహెబ్ ఫాల్కే దాకా అక్కినేనిని వరించినన్ని అవార్డులు, ఆయనకు దక్కినన్ని సన్మానాలు మరే సినీ ప్రముఖుడికీ లభించలేదు. తెలుగు సినీ పరిశ్రమ ఆనాటి మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడంలో ఆయనదే కీలక పాత్ర. 1974లోనూ, ఆ తర్వాత మరోసారి 1988లోనూ పెను సవాలు విసిరిన తీవ్రమైన గుండె జబ్బును అంతులేని ఆత్మవిశ్వాసంతో జయించి, ఆపరేషన్ చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ఆ తర్వాత కూడా దశాబ్దాల పాటు చెక్కుచెదరని ఆరోగ్యంతో జీవించి చూపించిన రియల్ హీరో ఏఎన్నార్. 90 ఏళ్ల వయసులో కూడా తన కుటుంబంలోని మూడు తరాల వారితోనూ కలసి తాజాగా ‘మనం’ అనే సినిమాలో నటించారాయన. కేన్సర్ మహమ్మారి తనను కబళించేందుకు ప్రయత్నిస్తోందని, అభిమానుల ఆశీర్వాద బలంతో దాన్ని కూడా జయిస్తానని ఆ షూటింగ్లో ఉండగానే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ప్రకటించిన అంతులేని ఆత్మబలం అక్కినేని సొంతం. అక్కినేనిని కేర్‌కు చేర్చిన 108 అంబులెన్స్ ఏఎన్నార్‌కు ఇటీవలే కిమ్స్‌లో మలద్వార కేన్సర్ శస్త్రచికిత్స జరగడం తెలిసిందే. అప్పటినుంచీ ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. కోలుకుంటున్నారని అంతా అనుకుంటున్న సమయంలో అధిక విరేచనాలతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఏఎన్నార్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన మనవరాలు సుప్రియ వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆ సమయంలో సరిగ్గా జూబ్లీహిల్స్ చౌరస్తాలోనే ఉన్న అంబులెన్స్ నాలుగు నిమిషాల్లో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 17లోని అక్కినేని నివాసానికి చేరుకుంది. అంబులెన్స్ సిబ్బంది వడివడిగా ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు లోనికి వెళ్లి అక్కినేనికి ప్రథమ చికిత్స చేశారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను 10 నిమిషాల్లోనే బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కినేనితో పాటు మనవరాలు సుప్రియ, మనవడు సుమంత్ కూడా అంబులెన్స్‌లోనే ఆస్పత్రికి వెళ్లారు. కన్నీరుమున్నీరైన నాగార్జున బుధవారం తెల్లవారుజాము 1.45 గంటలకు 108 అంబులెన్స్ అక్కినేనిని కేర్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి చేర్చింది. డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని వైద్య బృందం మొదట ఆయనకు సీపీఆర్, తర్వాత ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించింది. ఇదంతా జరుగుతుండగానే ఆయన పల్స్‌రేటు పడిపోయింది. వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. అక్కినేని చనిపోయినట్టు తెల్లవారుజాము 2.45కు వైద్యులు ధ్రువీకరించారు.ఆయన మృతికి గుండెపోటే కారణమని విశ్వసనీయంగా తెలిసింది. అనంతరం ఆయన గుండెకు గతంలో అమర్చిన పేస్‌మేకర్‌ను కూడా తొలగించారు. ఈ సమయంలో ఏఎన్నార్ కుమారుడు నాగార్జున సహా కుటుంబసభ్యులంతా అక్కడే ఉన్నారు. తండ్రి లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక నాగార్జున సహా వారంతా కన్నీరుమున్నీరయ్యారు. తర్వాత మృతదేహాన్ని తెల్లవారుజాము 3 గంటలకు ఆయన నివాసానికి తరలించారు. బుధవారం ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు. తండ్రి పార్ధివ దేహంతో పాటు నాగార్జున కూడా స్టూడియోకు చేరుకున్నారు. సోదరి నాగసుశీల అక్కడకు రావడంతోనే దుఃఖాన్ని ఆపుకోలేక బోరుమని విలపించారు. నాగార్జున రోదన చూసి ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా కన్నీరుమున్నీరయ్యారు. నాగార్జునను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అరగంట పాటు ఆయన గుక్కపట్టి ఏడ్చారు. అది చూసి అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఏఎన్నార్ పేస్‌మేకర్‌ను హృద్రోగంతో బాధపడుతున్న ఎవరైనా నిరుపేద కళాకారునికి ఉచితంగా అందజేయవచ్చని సమాచారం. అభిమానులతో కిక్కిరిసిన అన్నపూర్ణ స్టూడియో అక్కినేని మరణవార్త తెలియగానే అభిమానులు తండోపతండాలుగా అన్నపూర్ణ స్టూడియో వద్ద బారులుతీరారు. బుధవారం తెల్లవారుజామున మూడింటి నుంచే అక్కడ క్యూలు కట్టారు. వారి సంఖ్య గంటగంటకూ పెరిగిపోవడంతో స్టూడియో పరిసరాలన్నీ కిటకిటలాడాయి. 70 వేల మందికి పైగా తరలిరావడంతో స్టూడియో ఆవరణంతా అభిమానులతో నిండిపోయింది. ఆ ప్రాంతమంతా ఇసకేస్తే రాలనంతగా కిక్కిరిసింది. ప్రముఖుల రాక మొదలవడంతో రోడ్లకు రెండు వైపులా వాహనాల పార్కింగ్‌లతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టూడియో ప్రధాన ద్వారం నుంచి క్యూ ఏర్పాటు చేసి అభిమానులను లోనికి పంపారు. నుంచునేచోటు కూడా లేక చాలామంది చెట్ల పెకైక్కి, అక్కడి నుంచే తమ నటుణ్ని కడసారి చూసుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాక కూడా రద్దీ కొనసాగుతూనే ఉంది. సందర్శించిన ప్రముఖులు అక్కినేని పార్ధివ దేహాన్నిపలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన లోటు తీర్చలేనిదని కొనియాడారు. అక్కినేని భారతీయ చిత్ర పరిశ్రమకే మేరునగమని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని పార్ధివ దేహాన్ని సందర్శించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కేంద్ర మంత్రులు చిరంజీవి, దగ్గుబాటి పురందేశ్వరి, సర్వే సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కె.చక్రపాణి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, టీజీ వెంకటేష్, గీతారెడ్డి, డీకే అరుణ, వట్టి వసంత్‌కుమార్, సి.రామచంద్రయ్య, దానం నాగేందర్, కె.జానారెడ్డి, గల్లా అరుణకుమారి, కాసు కృష్ణారెడ్డి, మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్, షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, టి.సుబ్బిరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, సీఎం రమేశ్, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, రామోజీరావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, మర్రి శశిధర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శంకర్రావు, జూలకంటి రంగారెడ్డి, డి.శ్రీనివాస్, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, మ్యాట్రిక్స్ ప్రసాద్ తదితరులున్నారు. సినీ ప్రముఖుల నివాళులు అక్కినేనికి నివాళులర్పించిన సినీ ప్రముఖుల్లో నటుడు కృష్ణ, హీరోలు వెంకటేశ్, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు రామానాయుడు, సురేశ్‌బాబు, వీబీ రాజేంద్రప్రసాద్, కవి సి.నారాయణరెడ్డి, నటి అనుష్క, రోజా, తమిళ నటులు శరత్‌కుమార్, రాధిక దంపతులు, నాగేంద్రబాబు, హరికృష్ణ, జయప్రద, రానా, సాయిధరమ్ తేజ్, అలీ, అల్లు అరవింద్, వేణుమాధవ్, శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, జయసుధ, వాణిశ్రీ, జమున, రమాప్రభ, గీతాంజలి, మోహన్‌బాబు తదితరులున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: డీకే అరుణ అక్కినేని మృతి పట్ల సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. - సాక్షి నెట్వర్క్ -
అక్కినేని కుటుంబానికి ప్రముఖుల పరామర్శ
-
అక్కినేని కుటుంబానికి ప్రముఖుల పరామర్శ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు సుచరిత, శోభా నాగిరెడ్డి ఉన్నారు. కాగా ఎన్నాఆర్ మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి వ్యక్తి చేశారు. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు మృతితో సినిమా పరిశ్రమ దిగ్ర్భాంతికి గురైంది. ఆయన మరణం గురించి తెలియగానే పరిశ్రమకు చెందిన సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలపడానికి ఆయన నివాసానికి క్యూ కట్టారు. అక్కినేనితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు... ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. కృష్ణ, జమున, డి.రామానాయుడు, విబి రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్ బాబు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, పరుచూరి బ్రదర్స్, చలపతిరావు, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణంరాజు దంపతులు, జగపతి బాబు, రాజీవ్ కనకాల, సురేష్ కొండేటి, దగ్గుబాటి సురేష్ బాబు, జయసుధ, నితిన్ కపూర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నన్నపనేని రాజకుమారి, జూలకంటి రంగారెడ్డి, రాజేంద్రప్రాసాద్, నాదెండ్ల మనోహర్, జయప్రకాష్ నారాయణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
ఎర్రగడ్డ శ్మశానవాటికలో రేపు ఏఎన్నార్ అంత్యక్రియలు
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియాలు గురువారం ఎర్రగడ్డ స్మశానవాటికలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులుఎ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు గత రాత్రి అస్వస్థతకు గురి కావటంతో వెంటనే ఆయన్ని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎన్నార్ మృతి చెందారు. ఈరోజు సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థీవ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుతారు. కాగా అక్కినేని నివాసంలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. -
విష్ణుదేవా దర్శకత్వంలో సుశాంత్
కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలతో మంచి ఈజ్ ఉన్న నటునిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందనుంది. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల కలిసి నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ప్రభుదేవా శిష్యుడు విష్ణుదేవా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్లో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘ప్రభుదేవా పర్యవేక్షణలో తయారైన కథ ఇది. సుశాంత్‌కి ఈ కథ చాలా బాగుంటుందని అందరికీ అనిపించిన తర్వాతే ఈ కథను ఓకే చేశాం. ప్రఖ్యాత నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య వద్ద శిష్యరికం చేసి, వాంటెడ్, రామ్‌లీలా, రాంబో రాజ్‌కుమార్ లాంటి భారీ చిత్రాలకు సోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు విష్ణుదేవా. తప్పకుండా దర్శకునిగా కూడా తను విజయం సాధిస్తాడని మా నమ్మకం. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి స్వరాలందించే పనిలో ఉన్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం’’ అని తెలిపారు. ‘‘స్విట్జర్లాండ్‌లో ‘అడ్డా’ పాటల చిత్రీకరణ టైమ్‌లో విష్ణుదేవా ఈ లైన్ చెప్పాడు. ‘అడ్డా’ విడుదలయ్యాక.. లైన్‌ను డెవలప్ చేసి మరింత డీటైల్డ్‌గా కథ చెప్పాడు. నేను ఎలాంటి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నానో... సరిగ్గా అలాంటి కథనే విష్ణు చెప్పాడనిపించింది. ఆడియన్స్‌కూ, అక్కినేని ఫ్యాన్సుకూ నచ్చే సినిమా అవుతుంది’’ అని సుశాంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పోరాటాలు: కనల్ కణ్ణన్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్. -
పంపిణీదారుడిగా నాగార్జున
హీరోగా సూపర్ సక్సెస్... నిర్మాతగానూ సూపర్ సక్సెస్... స్టూడియో, ఫిలిం స్కూల్ అధినేతగానూ సూపర్ సక్సెస్. నాగార్జున ఏం చేసినా అంతే. ఇప్పుడాయన ఖాతాలో మరో శాఖ చేరబోతోంది. పంపిణీరంగంలోనూ నాగ్ అడుగుపెట్ట బోతున్నారు. వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఓ పంపిణీసంస్థను ఆయన ప్రారంభించారు. తను హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భాయ్’ చిత్రంతో ఈ పంపిణీసంస్థ శ్రీకారం చుట్టుకోనుంది. ఈ చిత్రాన్ని వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ చేయనుంది. త్వరలో ఇతర ఏరియాల్లో కూడా పంపిణీ శాఖలను ప్రారంభించాలనుకుంటున్నామని నాగార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
‘భాయ్’ స్టిల్స్
నాగార్జున, రిచా గంగోపాధ్యాయు హీరో హీరోయిన్లుగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నాగార్జున హీరోగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘భాయ్’. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్, ఫేస్బుక్ పేజ్, అన్నపూర్ణ స్టూడియో వెబ్‌సైట్‌ను నాగార్జున ఆవిష్కరించారు. -
'భాయ్' ఫస్ట్ లుక్ స్టిల్స్
అక్కినేని నాగార్జున తాజా చిత్రం భాయ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్ అభిమానులకు ఫేస్ బుక్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. వైవిధ్యంగా ఉన్న మూడు స్టిల్స్ కూడా ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకర్సిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న భాయ్ చిత్రానికి దర్శకుడు వీరభద్రం. భాయ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. Courtesy: https://www.facebook.com/AnnapurnaStudios