Prakasam
-
ప్రకాశం
32/22జిల్లా స్థాయి షూటింగ్ బాల్ జట్లు ఎంపిక సంతనూతలపాడు: ప్రకాశం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల జట్లను పేర్నమిట్ట జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం ఎంపిక చేశారు. వివిధ గ్రామాల నుంచి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో 12మంది బాలురు, 12 మంది బాలికలు, సబ్ జూనియర్ విభాగంలోనూ 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ జట్లు అనంతపురం జిల్లాలో జరిగే 43వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున పాల్గొంటాయని ప్రకాశం జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణరావు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పార్వతిశాంతి, సీనియర్ ఉపాధ్యాయులు ఫణీంద్ర కుమార్, గాండ్ల ప్రతాప్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.రత్నకుమార్ పాల్గొన్నారు.7గరిష్టం/కనిష్టంవాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. వాతావరణంలో తేమ శాతం అధికం. రాత్రి చలిగాలులు వీస్తాయి. గురువారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2024 -
ప్రజా సమస్యలపై నిరంతర పోరు
ఒంగోలు టౌన్: కార్యకర్తలు, నాయకులందరూ సమష్టిగా ఉంటూ ప్రజా సమస్యలపై ఐక్యంగా గళమెత్తి పోరాడుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవి పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కలిసి నిలబడి కలబడదామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, జిల్లా, రాష్ట్ర నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తోందని, అరెస్టులు చేసి బెదిరింపులకు దిగుతోందని తెలిపారు. గత ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అమలు చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వ పాలకులు తమ తప్పులను ఎత్తిచూపకుండా సోషల్ మీడియా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. అధికారం ఉంది కదాని వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులను కార్యకర్తలు, నాయకులు సమష్టిగా ఎదుర్కొంటామని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి పాలనపై ఐదు నెలలకే విసిగి పోయారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో గెలిచి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఇస్తామని, భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకు పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లి నెలకోసారి వచ్చి పోయే నాయకుడిని కాదని, ప్రతి రోజూ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను, కార్యకర్తల కష్టాలు తెలుసని అన్నారు. జగనన్న ఇచ్చిన అవకాశానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సంక్షోభ సమయంలో పార్టీ అప్పగించిన బాధ్యతలు తీసుకున్న చుండూరి రవి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ అన్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్ చెప్పారు. అధికార పార్టీ ఇబ్బందులు పెడుతుందని తెలిసి కూడా పార్టీని వీడకుండా పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులను పార్టీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. పార్టీని వీడే ప్రసక్తి లేదు: కార్పొరేటర్లు ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తి లేదని కార్పొరేటర్లు స్పష్టం చేశారు. నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ గెలుపోటముల సహజమని, పార్టీని బలోపేతం చేసుకొని ఒంగోలు నియోజకవర్గంలో విజయపతాకాన్ని ఎగరేస్తామని చెప్పారు. చుండూరి రవి నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కో ఆప్షన్ మెంబర్ శ్యాం సాగర్ మాట్లాడుతూ..ఇప్పుడు ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపే చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అసమర్ధ పాలనపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని షేక్ నాగుర్ అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బెదిరించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని, టీడీపీ దోపిడీని ప్రజల ముందు పెడదామని బీసీ సెల్ నాయకుడు బొట్ల సుబ్బారావు చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్ ప్రవీణ్, వెంకట మహాలక్ష్మి, తేళ్ల విక్టర్ పాల్, నరసింహ గౌడ్, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ షేక్ రషీదా, దామరాజు క్రాంతి కుమార్, కరుణాకర్, అంజిరెడ్డి, కటారి ప్రసాద్, నరాల రమణారెడ్డి, షేక్ మీరావలి, భూమిరెడ్డి రవణమ్మ, పిగిలి శ్రీనివాసరావు, మధు, పిగిలి శ్రీనివాసరావు, డేవిడ్, శ్రీనివాసరెడ్డి, రాము, చావలి శివ, రొండా అంజిరెడ్డి, ఫణిదపు సుధాకర్, నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాం పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తాం టీడీపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చుండూరి రవి -
వలంటీర్లపై మాటమార్చిన డోల..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గ్రామ వలంటీర్ వ్యవస్థపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఇప్పటి వరకు రోజుకో మాట చెబుతూ వస్తున్నారు. వలంటీరు వ్యవస్థను రద్దు చేయం అంటూ చెప్పుకొచ్చిన మంత్రి తాజాగా మాట మార్చేశారు. శాసన మండలి వేదికగా అసలు ఈ వ్యవస్థ ఉండదంటూ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. నాడు అలా.. గతంలో మంత్రిగా స్వామి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా వల్లూరమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. అలాగే పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘‘గ్రామ వలంటీర్లను కొనసాగిస్తాం... నా వాట్సప్ మెసేజ్‌లతో నిండిపోయింది. వైఎస్సార్సీపీ నాయకులు బలవంతంగా వలంటీర్ల చేత రాజీనామా చేయించారు. ప్రస్తుతం ఉన్న వలంటీర్లతో పనిచేయించుకుంటాం. వలంటీర్లకు ఇచ్చిన మాటకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వలంటీర్ వ్యసస్థ రద్దు చేస్తారనడం అవాస్తవం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తే సహించేది లేదు’’ అని మంత్రి స్వామి ఆనాడు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైతం ఇదే విధమైన ప్రకటనలు చేశారు కూడా. నేడు ఇలా.. తాజాగా మంత్రి స్వామి మాట్లాడుతూ వలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే కొనసాగించేవాళ్లం. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం. పిల్లాడికి పేరు పెట్టలేదు అంటే లేని పిల్లాడికి పేరు ఎలా పెట్టాలి అన్నట్లుంది వలంటీర్ వ్యవస్థ తీరు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు వరకు వలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు జీఓ ఇచ్చింది. తరువాత వలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు జీఓ ఇవ్వలేదు. అని శానసమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి స్వామి సమాధానమిచ్చారు. అనుకున్నదే జరిగింది గ్రామ వలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణితోనే ఉందని కొండపి నియోజకవర్గ వలంటీర్ల సంఘం అధ్యక్షుడు పిల్లిపోగు జీవన్‌కుమార్ అన్నారు. ఎన్నికల సమయంలో రూ.10 వేల జీతం ఇస్తామని చంద్రబాబు దగ్గర నుంచి అందరూ మాయమాటలు చెప్పారని, గెలిచిన తరువాత కూడా పలువురు మంత్రులు వలంటీర్లను కొనసాగిస్తాం అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారన్నారు.. మంత్రి డోల ఒక అడుగు ముందుకేసి జిల్లాలో, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటూ ప్రకటనలు చేశారని తెలిపారు. ఇప్పుడేమో జీఓ లేదు... వలంటీర్ వ్యవస్థ లేదు.. లేని బిడ్డకు పేరు ఎలా పెడతాం అని డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నట్లు జీఓ జారీ చేయవచ్చుగదా అని అన్నారు. -
ట్రబుల్..!
రియల్ చీమకుర్తి: కూటమి ప్రభుత్వం కొలువుదీరింది..రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు గడించవచ్చనుకున్న టీడీపీ నాయకులకు అడియాశలే మిగిలాయి. నూతన ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అమరావతిలో పెడితే కాయకు కాయ అంటూ ఒక వైపు టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఊదరగొట్టారు. వీరి మాటలు నమ్మి చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి అమరావతి పరిసరాల్లో పొలాలు, ప్లాట్లు కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. అనుకోకుండా విజయవాడలోని వరదలు ఒక్కసారిగా ముంచెత్తటంతో విజయవాడ, అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారు తమ ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా చివరకు డ్రోన్ కెమెరాల ద్వారా చూసుకున్నా కూడా కనిపించే పరిస్థితి లేదని ఆందోళన చెందారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చతికిలపడిందని గ్రహించే లోపే పెట్టిన పెట్టుబడుల్లో సగానికి సగం కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. అమరావతి ప్రభావం జిల్లాలోని రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగానే చూపింది. జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన రిజిస్ట్రేషన్ల గణాంకాలు పరిశీలిస్తే ఎంతగా ప్రభావం చూపిందో తెలుస్తుంది. గత ఏడాది 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 69,508 డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు జరిగి రూ.213.63 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయిన నెల అక్టోబర్ వరకు రిజిస్ట్రేషన్లు 34,075 డాక్యుమెంట్లకు తగ్గింది. ఆదాయం కూడా రూ.181.51 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 11 వేల డాక్యుమెంట్లు తగ్గటంతో రూ.32 కోట్ల ఆదాయం పడిపోయింది. జిల్లాలో ఒంగోలు, మార్కాపురం, కంభం, గిద్దలూరు, పొదిలి, యర్రగొండపాలెం, కనిగిరి, సంతనూతలపాడు, చీమకుర్తి, దర్శి, సింగరాయకొండ, అమ్మనబ్రోలు తదితర ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో రోజుకు 250 నుంచి 300 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. సగటున జిల్లా కేంద్రం ఒంగోలులో ఉన్న జాయింట్–1, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో రోజుకు 50 నుంచి 60 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. మార్కాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సగటున రోజుకు 25, కంభంలో 15, గిద్దలూరులో 15, పొదిలిలో 15, యర్రగొండపాలెంలో 10, కనిగిరిలో 50 నుంచి 60, సంతనూతలపాడులో 15, చీమకుర్తిలో 15, దర్శిలో సుమారు 30 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ప్లాట్లు, ఆరు రిజి స్ట్రేషన్లుగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్లు అడిగే వారు లేరని వాపోతున్నారు. ఈ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఎప్పటికి వస్తాయోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముఖం చాటేస్తున్న మధ్యవర్తులు ప్లాట్లు కొనేటప్పుడు మాత్రం ఈశాన్యం బిట్టు, తూర్పు వాస్తు, 30–40 అడుగుల వెడల్పు రోడ్లు, పక్కనే కల్యాణ మండపం, సినిమా థియేటర్లు కడతారంట అంటూ లేని పోని ఊహలు కల్పించి ప్లాట్లను మీడియేటర్లు కొనిపించారు. అంతటితో పోకుండా ఈ వెంచర్లో పేరున్న కంపెనీ వారు విల్లాలను కూడా నిర్మిస్తున్నారంటా అంటూ శంకుస్థాపనలు కూడా చేసినట్లు ఫ్లెక్లీలు, శంకుస్థాపనల గుంతలను తవ్వి ప్లాట్ల అమ్మకాలకు తెర తీశారు. తీరా ప్లాట్లను అమ్ముకొని పోయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని తెలుసుకునే లోపు వారికి ప్లాట్లను అమ్మించిన మీడియేటర్లు కనిపించకుండా ముఖం చాటేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్‌లలో వేస్తే వడ్డీ తక్కువ, వడ్డీకి ఇస్తే వడ్డీ తర్వాత సంగతి అసలు కూడా రావడం లేదని పొలాలు, ప్లాట్లపై పెట్టుబడి పెడితే చివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పడిపోవడంతో కొనుగోలు చేసిన ప్లాట్లు అమ్ముడు పోతాయో లేదోనని మనసంతా హద్దురాళ్ల చుట్టే ప్రదక్షిణలు చేస్తుందని జనం వాపోతున్నారు. పేరుకు ఇంట్లో ఉన్నారనే గానీ రోజుకు ఒకటి రెండు సార్లు ప్లాట్ల వైపు తొంగిచూసి ఏమైనా అడిగే వారున్నారా...? అంటూ పెట్టిన పెట్టుబడికి వడ్డీ కాదుగదా... అసలులో సగమైనా వస్తుందా..? అని పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కుప్పకూలిన రియల్ ఎస్టేట్ వ్యాపారం గత ఏడాది 69,508 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌తో రూ.213 కోట్ల ఆదాయం ఈ ఏడాది 34,075 డాక్యుమెంట్లకు పరిమితమై రూ.181 కోట్లకు తగ్గుదల దాదాపు రూ.32 కోట్లు తగ్గిన ఆదాయం అమరావతిలో స్థలాలు కొనిపించిన టీడీపీ నేతలు కృష్ణా వరదల ప్రభావంతో పడిపోయిన వ్యాపారం ఆందోళనలో కొనుగోలుదారులుస్థిరాస్తి రంగంలో స్తబ్ధత నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా వ్యాప్తంగా ఆస్తుల క్రయ, విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య జరిగిన వాటితో పోల్చుకుంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. ఫలితంగా రూ.32 కోట్ల మేర ఆదాయం పడిపోయింది. ఈ ఏడాది రూ.181 కోట్ల ఆదాయం వచ్చింది జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.181.51 కోట్ల ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్లు 34,075 డాక్యుమెంట్లు జరిగాయి. అదే గత ఏడాది 69,508 డాక్యుమెంట్ల ద్వారా రూ.213.63 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 11 వేల డాక్యుమెంట్ల రిజి స్ట్రేషన్ తగ్గి రూ.32 కోట్ల ఆదాయం పడిపోయింది. – బాలాంజనేయులు, జిల్లా రిజిస్ట్రార్, ఒంగోలు -
కుంట స్థలంలో హద్దురాళ్ల తొలగింపు
సింగరాయకొండ: మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ బకరాల గుంట స్థలం ఆక్రమణపై ఈనెల 18వ తేదీ సోమవారం ‘కుంటను మింగిన ఘనులు’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. కోట్లాది రూపాయల విలువైన బకరాల గుంటకు చెందిన సుమారు 3 ఎకరాల స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేసేందుకు ప్రయత్నించి అందులో ఒక్కొక్కటి 2.50 సెంటు చొప్పున 60 ప్లాట్లు వేశారు. దీనిపై ప్రచురితమైన కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో ఉన్న హద్దురాళ్లను పూర్తిగా తొలగించారు. పోలీసు కానిస్టేబుల్ పై దాడి ఒంగోలు టౌన్: మద్యం మత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేసి కొట్టడం సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం... తాలూకా పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు పై స్థానిక శివ ప్రసాద్ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్ ట్రావెల్స్ యజమాని బోడపాటి రాంబాబు అసభ్యంగా తిడుతూ దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ శ్రీనివాసరావు ముంగమూరు రోడ్డులో ఇండియన్ గ్యాస్ మూలమీద ఉన్న ఒక కాకా హోటల్లో మంగళవారం రాత్రి టిఫిన్ చేస్తున్నాడు. అతడి మోటారు బైకును రోడ్డు పక్కన నిలబెట్టాడు. అప్పుడే అటుగా కారులో వెళుతున్న రాంబాబు రోడ్డుకు అడ్డంగా ఉన్న బైకును తీయమన్నాడు. టిఫిన్ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసరావు లేచి వెళ్లి బైకును తీశాడు. అంతటితో సంతృప్తి చెందని రాంబాబు ‘‘ఏరా.. ఈ రోడ్డు నీ అబ్బ సొమ్మనుకున్నావా నా..’’ అంటూ తిట్టడం మొదలెట్టాడు. కారు దిగి వచ్చి కానిస్టేబుల్ మీద దాడికి దిగాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దాడి చేస్తున్న రాంబాబును కానిస్టేబుల్ శ్రీనివాసరావు పట్టుకోగా అతడి చేతిని కొరికాడు. కానిస్టేబుల్ నుంచి విడిపించుకొని కారు ఎక్కి వెళుతుండగా శ్రీనివాసరావు అడ్డుగా నిలుచున్నాడు. అయినప్పటికీ అతడిని రాసుకుంటూ కారులో వేగంగా వెళ్లిపోయాడు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు అర్ధరాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఎమ్మెల్యే జనార్దన్ ఫోన్... కానిస్టేబుల్ మీద దాడి చేసిన రాంబాబు పై కేసు పెట్టవద్దంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తాలూకా పోలీసులకు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాంబాబు పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి వున్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
కూటమి సైకోలపై చర్యలు తీసుకోవాలి
ఒంగోలు టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సైకోలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవి, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నగర అధ్యక్షుడు కఠారి శంకర్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో నాయకులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ చేరుకున్నారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో చుండూరి రవి మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కూటమి నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విష సంస్కృతి టీడీపీదేనని, 2014 నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద నీచంగా పోస్టులు పెట్టిస్తున్నారని తెలిపారు. షర్మిలమ్మ, విజయమ్మల మీద ఐ టీడీపీ నుంచే అసభ్యంగా పోస్టులు పెట్టించారన్నారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింహాసనం మీద శునకం కూర్చుందని పోస్టులు పెట్టించారన్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీతులు చెబుతున్నారని, జగన్ కుటుంబ సభ్యుల మీద పెట్టిన పోస్టుల మీద నోరు మెదపడంలేదని అన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున ఇచ్చిన ఫిర్యాదులపై కూడా విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, చివరకు మాజీ మహిళా మంత్రుల మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేస్తున్నామని లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ తెలిపారు. మహిళల అత్మగౌరవం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని, మద్యం మత్తులో మహిళలు, బాలికలను కూడా వదిలిపెట్టకుండా లైంగికదాడులకు పాల్పడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా సోషల్ మీడియా పేరుతో కూటమి పాలకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినాయకుడు జగన్ మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కూటమి పార్టీల సోషల్ మీడియా సభ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఎన్.శ్రీనివాసరావు, కె.సంపత్ కుమార్, కె.శేషారెడ్డి, డి.హరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవి ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు -
అన్ని రంగాల్లో జిల్లా బిడ్డలు ప్రకాశించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: ప్రపంచ యవనికపై అన్ని రంగాల్లో ప్రకాశం జిల్లా బిడ్డలు ప్రకాశించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.వి.ఆర్ బాలుర హైస్కూల్లో బుధవారం వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న బంగారు బాల్యం ముగింపు సభ నిర్వహించారు. బంగారు బాల్యం బాలోత్సవాల ముగింపు వేడుకలను పురస్కరించుకొని ఒంగోలులోని ఓల్డ్ గుంటూరు రోడ్డులో రవిప్రియా మాల్ వద్ద నుంచి పి.వి.ఆర్ బాలుర ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాలలపై నేరాలు జరగకుండా, బాలకార్మికులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా జిల్లా పిల్లలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలనేది తన కలన్నారు. బాల్యం తీపిగుర్తుగా ఉండాలే తప్ప గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ బిడ్డా నిరుత్సాహపడే పరిస్థితి రాకూడదన్నారు. బాల్య వివాహ రహిత, బాలకార్మిక రహిత, ఆరోగ్యకర, అక్షర చైతన్యవంతమైన ప్రకాశం జిల్లా ఆవిష్కృతమే లక్ష్యంగా బంగారు బాల్యం కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈ ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ లీడర్లను కూడా భాగస్వాములను చేసి సమన్వయంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ బంగారు బాల్యానికి తల్లిదండ్రుల ప్రేమ, ఉపాధ్యాయుల శ్రద్ధ, మంచి స్నేహితుల సాంగత్యం, పోలీసుశాఖ వంటి రక్షణ వ్యవస్థలు ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు బంగారు బాల్యం బాలోత్సవాల కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం మండల, డివిజన్, జిల్లా స్థాయిలో బంగారు బాల్యం బాలోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్, లోగో, స్లోగన్స్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డీఈవో అత్తోట కిరణ్‌కుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఐసీడీఎస్ పీడీ కె.మాధురి, సార్డ్స్ ప్రతినిధి సునీల్, డీఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
No Headline
మేసీ్త్ర వ్యవస్థ ఉండదు... నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో ఇక నుంచి మేసీ్త్ర వ్యవస్థ ఉండదు. వాళ్లు వర్కర్లుగానే చేరారు. వర్కర్‌గానే పనిచేయాలి. పనిచేయకుండా, కొందరు మస్టర్ కూడా వేసుకోకుండానే జీతాలు తీసుకుంటున్నారు. అందుకోసమే ప్రక్షాళన చేస్తున్నాను. ఇందులో రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఏమీ లేదు. పోస్టులు అమ్ముకుంటున్నారని అనుకోవటం వాస్తవం కాదు. అందరి చేత పనిచేయించి నగర అభివృద్ధికి పాటుపడాలన్నదే లక్ష్యంగా ముందుకు పోతున్నా. – కే.వెంకటేశ్వర రావు, ఒంగోలు నగర కమిషనర్ నాయకులు అమ్ముకోవటానికే.... అధికార పార్టీ నాయకులు మేసీ్త్ర పోస్టులను అమ్ముకోవటానికి నగర కమిషనర్ మేసీ్త్రలను పక్కన పెట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ ఉద్యోగాలను అమ్ముకోవటానికి వాటాలు వేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు, వాళ్ల పేరుతో ఇతరులకు ఈ ఉద్యోగాలను అమ్ముకునేందుకు ఇప్పటికే బేరాలు పెట్టారు. 20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న వారిని ఉద్యోగం నుంచి తీసేయటం అత్యంత దుర్మార్గం. దీనిని సీఐటీయూ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. – టీ.మహేష్, సీఐటీయూ ఒంగోలు నగర కార్యదర్శి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఒంగోలు నగరంలోని పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులను తొలగించారు. కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా తీసేయటం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం మేసీ్త్ర వ్యవస్థను తీసేయాలని కనీసం సర్క్యులర్ కూడా జారీ చేయలేదు. ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్క వాళ్ళు ఏది చెబితే అది చేస్తున్నారు. కార్మికుల్లో చిచ్చు పెట్టి కొందరిని తిరిగి మేసీ్త్రలుగా కొనసాగిస్తానని వాళ్లకు మాయమాటలు చెప్పి ధర్నాకు రాకుండా చేస్తున్నాడు కమిషనర్. కార్మికులను విభజించి పాలిస్తున్నాడు. – కొర్నిపాటి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి -
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి
ఒంగోలు అర్బన్: ప్రతి ఒక్కరూ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూడాలని వాటిని శుభ్రంగా ఉంచుకుంటూ వినియోగించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రకాశం భవనంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో హరిత అంబాసిడర్లను సత్కరించారు. అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవానికి సంబంధించిన అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌ల మరమ్మతులపై దృష్టి సారించాలని వాటిని ప్రజలు పూర్తిగా వినియోగించుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలన్నారు. పాఠశాలలు, వసతిగృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మరుగుదొడ్ల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించి ఏవైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలన్నారు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ‘మా టాయిలెట్ మా గౌరవం’ అనే నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మరుగుదొడ్ల మంజూరుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. దీనిలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, డీఈఓ కిరణ్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 5 వరకు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల మరమ్మతులు కలెక్టర్ తమీమ్ అన్సారియా -
సొంత వైద్యం ఆరోగ్యానికి చేటు
ఒంగోలు టౌన్: సొంత వైద్యం ఆరోగ్యానికి చేటు చేస్తుందని, ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని క్విస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ఫార్మా డీ విభాగం హెచ్ఓడీ డా.చంద్రకళ చెప్పారు. నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్‌ను పురస్కరించుకొని మంగళవారం జీజీహెచ్‌లో ఫార్మా డీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ నినాదంతో ర్యాలీ నిర్వహించిన ర్యాలీలో జీజీహెచ్‌లోని రోగులకు ఔషధాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వైద్యుడిని సంప్రదించిన తరువాత వారు సూచించిన మందులు మాత్రమే వాడాలని చంద్రకళ చెప్పారు. వైద్యులు రోగి వయసు, బరువుకు తగిన డోసును నిర్ధారించిన మందులు సూచిస్తారని, వారు చెప్పిన సమయం ప్రకారం వాటిని వాడడం సురక్షితమని తెలిపారు. మందులు వాడే సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి వివరించారు. ఈ ర్యాలీలో ఫార్మసీ విజిలెన్స్ హెడ్ డా.ఝాన్సీ, ప్రిన్సిపాల్ ఎం.కిశోర్ బాబు, ఫార్మసీ విభాగం హెచ్ఓడీ డా.జాలిరెడ్డి పాల్గొన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై మహాధర్నా
ఒంగోలు టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 26వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంచిపుస్తకం వద్ద మహాధర్నా కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయదారులు, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అలంబిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవం రోజైన ఈ నెల 26వ తేదీ దేశ వ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాల్లో మహాధర్నా చేపట్టినట్లు వివరించారు. ఈ ధర్నాకు కూడా కేంద్రం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావల సుధాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రజల ప్రాథమిక హక్కులు, లౌకికతత్వం, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, పి.పేరయ్య, డా.శ్రీనివాసులు యాదవ్, పేరం సత్యం, పిన్నికి శ్రీనివాస్, లింగా వెంకటేశ్వర్లు, మస్తాన్‌రావు, దాసరి సుందరం, కరవది సుబ్బారావు, ఎం జార్జీ తదితరులు పాల్గొన్నారు. -
మేస్తిరి..!
పోస్టులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరుద్యోగులపై విరుచుకుపడుతోంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది. మరి కొందరితో బలవంతంగా రాజీనామాలు చేయించింది. తాజాగా ఒంగోలు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలపై కన్నుపడింది. కూటమి నేతల ఒత్తిడితో కార్పొరేషన్ అధికారులు 108 మందిని నోటిమాటతో తొలగించారు. కొత్తవారిని నియమించే విషయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంగోలుకు చెందిన ముఖ్య నేతతో పాటు అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే మేసీ్త్రల పోస్టులకు బహిరంగ మార్కెట్లో బేరంపెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఒంగోలు నగర పాలక సంస్థలోనే మేసీ్త్ర వ్యవస్థ నిలిపేశారు. అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం, వారికి అనుకూలంగా కమిషన్ వ్యవహరిస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త కమిషనర్‌గా కే.వెంకటేశ్వరరావు బాధ్యలు చేపట్టారు. ఆయన వచ్చిన తర్వాత మొదటి వేటు పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలపై వేశారు. నోటి మాటతో వారిని తొలగించారు. అధికార పార్టీ నేతలకు జీ హుజూర్.... అధికార కూటమి నాయకులు ఏది చెబితే అది కమిషనర్ ఆఘమేఘాలపై చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15, 20 సంవత్సరాల నుంచి పారిశుధ్య విభాగంలో మేసీ్త్రలుగా పనిచేస్తున్న వారిని ఉన్నట్టుండి ఎందుకు ఆపాల్సి వచ్చిందో వారికే తెలియాలి. ఇప్పుడు పనిచేస్తున్న మేసీ్త్రలు గత టీడీపీ ప్రభుత్వంలో కూడా పనిచేసిన వారే. అయినా వారిని తొలగించడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. పారిశుధ్య విభాగంలో మొత్తం 108 మంది మేసీ్త్రలు పనిచేస్తున్నారు. వీళ్లందరినీ తీసేసి టీడీపీ కూటమి పార్టీల నాయకులకు ధారాదత్తం చేయటానికేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు చెప్పారు కాబట్టి ‘‘జీ హుజూర్’’ అంటూ కమిషనర్ అమలు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బహిరంగ మార్కెట్లో పోస్టులు: పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలను నోటి మాటతో నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికార పార్టీకి చెందిన టీడీపీ కూటమి నాయకులు ఆయా పోస్టులను బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనుల పరిశీలన పేరుతో కూటమి పార్టీలకు చెందిన కొందరిని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు కూడా. అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలైనా సరే కొందరు కార్పొరేటర్లు, ముఖ్య నాయకురాలు ఎవరికి వాళ్లు ఒక్కో పోస్టును రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏరియాల వారీగా సైతం పంచుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఉద్యోగ భద్రత కల్పించిన అప్పటి సీఎం వైఎస్ జగన్: 2019 అధికారం చేపట్టిన అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంట్రాక్టు వ్యవస్థలో ఉన్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు. అప్పటి వరకు కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తున్న వారిని కాంట్రాక్టర్లు ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగాలు పీకేయటంతో పాటు రాజకీయ కక్షలకు కాంట్రాక్టు వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భావించి రాష్ట్రంలో ఆప్కాస్ అనే ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారు. తద్వారా జీతాలు పెంచి, అలవెన్స్‌లు పెంచి ఉద్యోగ భద్రత కల్పించారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆత్మ స్థైర్యం నెలకొంది. మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి పరిస్థితి తారుమారైంది. ఒంగోలు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో మేసీ్త్రల తొలగింపు ఏళ్ల తరబడిపనిచేస్తున్న 108 మంది నోటిమాటతో ఊస్టింగ్ కూటమి నేతల ఒత్తిడితోనే బరితెగింపు కమిషనర్ తీరుపై వెల్లువెత్తుతున్న నిరసనలు అమ్మకానికి పోస్టులు ఏరియాల వారీగా పంచుకుంటున్న కూటమి నేతలు ఆపద సమయాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసినా ఒంగోలు నగరంలోని పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రలు, పారిశుధ్య కార్మికులు ఆపద సమయాల్లో ప్రాణాలకు తెగించి పనిచేశారు. కోవిడ్ వరుసగా రెండు, మూడు సంవత్సరాల పాటు పారిశుధ్య విభాగంలో మేసీ్త్రలు, కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా సోకిన వారి ఇళ్లకు వెళ్లి మరీ సేవలందించారు. విజయవాడ వరదల్లో కూడా ఒంగోలు నగరానికి చెందిన దాదాపు 300 మందికి పైగా కార్మికులు, మేసీ్త్రలను విజయవాడ పంపించి మరీ పనిచేయించుకున్నారు. అయినా కనికరం లేకుండా నిలువునా ఆపేస్తే మా కుటుంబాలు ఏం కావాలని వారు బోరున విలపిస్తున్నారు. -
ప్రకాశం
32/227గరిష్టం/కనిష్టంట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి మోటారు సైకిల్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో మంగళవారం జరిగింది.పత్తి రైతుకు ధరాఘాతం పత్తి ధరలు రైతులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది పెట్టుబడి సొమ్ము కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. వాతావరణంలో తేమ శాతం అధికం. రాత్రి వేళ చలిగాలులు వీస్తాయి. బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024– 8లో.. -
జీజీహెచ్‌లో కంగారు మదర్ కేర్ సెంటర్
● కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడి ఒంగోలు టౌన్: బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు జీజీహెచ్‌లో కంగారు మదర్ కేర్ సెంటర్(కేఎంసీ) ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా వెల్లడించారు. మంగళవారం ఆమె జీజీహెచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. న్యూ బార్న్ మదర్ కేర్ కార్యక్రమంలో భాగంగా కనిగిరి సీహెచ్‌సీలో కేఎంసీ పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో భాగంగా జీజీహెచ్‌లోని గైనిక్, నవజాత శిశు విభాగాలను పరిశీలించినట్లు తెలిపారు. కంగారు తన పిల్లలను సహజసిద్ధమైన పొత్తిళ్లలో దాచి ఎలా సంరక్షిస్తుందో అదే తరహాలో నెలలు నిండకుండా పుట్టిన శిశువులను, బరువు తక్కువగా పుట్టిన చిన్నారులను కాపాడేందుకు కేఎంసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. సరైన విధానంలో పాలు పట్టడం, పోషణ, శుభ్రత తదితర అంశాలపై తల్లుకు అవగాహన కల్పించడమే కేఎంసీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. టాయిలెట్ల నిర్వహణపై అసంతృప్తి సుమారు రెండు గంటలపాటు జీజీహెచ్‌లోని లేబర్ రూమ్‌తోపాటు గైనిక్ వార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వార్డులు, మరుగుదొడ్లలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత హెడ్ నర్సులకు చార్జ్ మెమో ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. జీజీహెచ్‌లో ప్రసవాల తీరు, క్రిటికల్ కేర్ ప్రొసీజర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నవజాత శిశు కేంద్రాన్ని, పోషకాహార కేంద్రాన్ని పరిశీలించిన ఆమె పిల్లలతో గడిపారు. కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, పలువురు హెచ్ఓడీలు ఉన్నారు. -
మనల్నెవర్రా ఆపేది...
మార్కాపురం రూరల్: కూటమి నాయకులకు మట్టి బంగారంలాగా మారింది. అధికారంలోకి రాగానే ఇసుక, మట్టిని తమ కబంద హస్తాల్లో ఉంచుకుని లక్షల రూపాయలను అర్జిస్తున్నారు. మార్కాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన టీడీపీ నేత మట్టిని తవ్వడం.. అమ్ముకోవడం.. వ్యాపారంగా మార్చుకుని అధికారులకు తమ నేత పేరును చెబుతూ బెదిరించుకుంటూ పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా జేసీబీల సాయంతో చెరువుల్లో తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీని చూసి వెనక్కు తగ్గుతున్నారు. దీంతో ఆ నేత మనల్నెవ్వర్రా ఆపేదంటూ..ట్రాక్టర్ మట్టిని వెయ్యి రూపాయలు, టిప్పర్ అయితే రూ.4 వేలకు విక్రయిస్తున్నాడు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మట్టి అవసరం బాగా ఉంది. దీనిని సదరు టీడీపీ నేత సొమ్ము చేసుకుంటున్నాడు. దీంతో మార్కాపురం ప్రాంతంలోని పలు చెరువుల రూపురేఖలు మారిపోతున్నాయి. చెరువు మధ్యలోనూ, అంచుల వెంట కూడా జేసీబీతో తవ్వడంతో వర్షాలకు నీరొస్తే కట్ట తెగే ప్రమాదం ఉంది. గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. మండలంలోని నికరంపల్లి, వేములకోట, యాచవరం, నాగులవరం తదితర గ్రామాల్లో ఉన్న చెరువుల్లోని మట్టిని పట్టపగలే మట్టిమాఫియా తరలిస్తున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ తతంగమంతా అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మట్టి మాఫియాను అడ్డుకోవాలంటూ రైతు సంఘం నాయకులు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు మట్టి మాఫియాను అడ్డుకొని చెరువులను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు -
మహిళలు అన్ని రంగాల్లో ముందంజ
ఒంగోలు టౌన్: చదువుతో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ జి. అర్చన అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, అసిస్టెంట్ లైబ్రేరియన్ కె. సంపూర్ణ ఆధ్వర్యంలో సభ జరిగింది. సభకు పలువురు మహిళా అధికారులు, కవయిత్రులు హాజరయ్యారు. ప్రపంచంలో మహిళలు అడుగు పెట్టని రంగం లేదని, అడుగు పెట్టిన ప్రతి చోట విజయం సాధించారని బీసీ వెల్ఫేర్ అధికారి ఎం. అంజల చెప్పారు. సంప్రదాయాలను గౌరవిస్తునే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని, అప్పుడు మాత్రమే ముందడుగు వేయడం సాధ్యమౌతుందని డ్వామా విజిలెన్స్ అధికారి ఝాన్సీ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళామూర్తులను ఆదర్శంగా తీసుకోవాలని మైనారిటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె. ధనలక్ష్మి పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ధీరవనితలుగా నిలిచిన ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మిబాయిలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని సభకు అధ్యక్షత వహించిన కవయిత్రి తేళ్ల అరుణ చెప్పారు. తొలుత ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మిబాయి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. కవయిత్రులు మానేపల్లి సూర్యకుమారి, సింహాద్రి జ్యోతిర్మయి, పరాంకుశం కృష్ణవేణి, బీరం అరుణ, సునీత, పుణ్య కీర్తన, సంతోషిణి చదివిన కవితలు, గాయకుడు నూకతోటి శరత్‌కుమార్ పాడిన పాట ఆకట్టుకున్నాయి. -
వైపాలెం టీడీపీలో రచ్చ
యర్రగొండపాలెం: యర్రగొండపాలెం టీడీపీలో నాయకుల మధ్య పంచాయితీ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాయానికి చేరింది. నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా చెలామణి అవుతున్న గూడూరి ఎరిక్షన్ బాబు తలనొప్పిగా మారాడని, పార్టీని రెండు వర్గాలుగా విభజించి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆ పార్టీకి చెందిన ఒక వర్గం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడి నేతలతో మొరపెట్టుకున్నారు. ఎరిక్షన్ బాబు అరాచకాలను తట్టుకోలేక మంగళవారం మండలం నుంచి దాదాపు 40 వాహనాల్లో 250 మంది ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా నియోజకవర్గంలో ప్రతినెలా నజరానాలు సమర్పించుకునే 10 మంది బియ్యం, లిక్కర్ మాఫియాలకు ఆయన వత్తాసు పలుకుతున్నాడని పార్టీ పెద్దలకు తెలిపారు. పెద్దమొత్తాల్లో డబ్బులు గుంజి పంచాయతీరాజ్ డీఈ సుబ్బారెడ్డి, యర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తాము ఉద్యోగాలు చేపట్టి 5 సంవత్సరాలు దాటినప్పటికీ వారిని స్థాన చలనం చేయకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. గ్రామాల్లో నీళ్లు తోలకుండా బిల్లులు చేయించుకునేవారికే పెద్దపీట వేస్తున్నాడని, మండలంలోని మురారిపల్లెలో తన అనుమతిలేకుండా ఉచితంగా నీళ్లు సరఫరా చేస్తున్న రమణారెడ్డిపై కక్షకట్టి తాగే నీటిలో తన మనుషులతో పురుగుల మందు కలిపించాడని, అంతేకాకుండా పోలీసులను ఇంటిపైకి పంపి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని వారు ఆరోపించారు. పార్టీ అభివృద్ధి కోసం కాకుండా తన అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని అందినకాడికి డబ్బులు గుంజి వెనకేసుకుంటున్నాడని వారు ఆవేదన వ్యక్త చేశారు. వెంటనే నియోజకవర్గ ఇన్చార్జిని నియమించాలని లేకుంటే రెండు, మూడు రోజులకు ఒక మండలం నుంచి టీడీపీ వర్గీయులు అధిక సంఖ్యలో కేంద్ర కార్యాలయానికి రావలసి వస్తోందని వారు వాపోయారు. టీడీపీ రాష్ట్ర నాయకులు షరీఫ్, వర్ల రామయ్య, రాంబాబులతో కలిసి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పరిస్థితుల గురించి వివరించినట్లు వారు తెలిపారు. మంగళగిరికి వెళ్లినవారిలో ఆ పార్టీ నాయకులు చేకూరి ఆంజనేయులు, వడ్డముడి లింగయ్య, షేక్ జిలానీ, పోతిరెడ్డి రమణారెడ్డి, నాగరాజు వెంకటేశ్వర్లు, వెన్నా వెంకటరెడ్డి ఉన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరిన పంచాయితీ పార్టీకి తల నొప్పిగా మారిన ఎరిక్షన్ బాబు బియ్యం, లిక్కర్ మాఫియాలకు వత్తాసు డబ్బులు గుంజి అవినీతి అధికారులను బదిలీ చేయించని వైనం ఆవేదన వ్యక్తం చేసిన నియోజకవర్గ టీడీపీ నేతలు -
సైనికుల బైక్ ర్యాలీ ●
● ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు అర్బన్: మాజీ సైనికులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ 244వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ గ్రూపునకు చెందిన సైనికులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు జ్ఞాపికలు అందజేశారు. ఇటీవల వాయనాడులో మంద్రాసు ఇంజినీరింగ్ గ్రూపు సభ్యులు నిర్వహించి సాహసోపేతమైన బైక్ స్టంట్లను కొనియాడారు. దీనిలో సైనిక సంక్షేమ అధికారి రజనీకుమారి, మాజీ సైనిక సంఘం సభ్యులు నెప్పలి నాగేశ్వరావు, శ్రీరామమూర్తి, మాజీ సైనికులు, ఎన్సీసీ కాడెట్స్ పాల్గొన్నారు. -
సాంప్రదాయ క్రీడల్లో రాణించాలి
● ఏకేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు ఒంగోలు సిటీ: విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు చదువుతో పాటు సాంప్రదాయక క్రీడల్లో బాగా రాణించాలని ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు అన్నారు. ఏకేయూ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మహిళల ఐసీటీ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ బి.హరిబాబు పాల్గొని మాట్లాడుతూ క్రీడల్లో మహిళలు ఆసక్తి కనబరచాలన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్య విషయంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆటల పోటీల్లో గెలుపోటములు సహజమేనని, ప్రతి ఒక్క క్రీడాకారిణి క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. అంతకుముందు అంతర కళాశాలల మహిళల కబడ్డీ టోర్నమెంట్ పోటీలను రిజిస్ట్రార్ హరిబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డీడీ డాక్టర్ దేవి వరప్రసాద్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహనరావు, డీన్ ప్రొఫెసర్ సోమశేఖర, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చే నెల 8న టీటీడీ భగవద్గీత పోటీలు ఒంగోలు మెట్రో: తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డిసెంబర్ 8వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక మంగమూరు రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం, రఘుపథంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రోగ్రాం అసిస్టెంట్ రామకృష్ణ తెలిపారు. భగవద్గీత 6 వ అధ్యాయం ఆత్మ సంయోగంలో 6, 7 తరగతులు ఒక గ్రూప్ గా, 8,9 తరగతులు రెండో గ్రూప్ గా పోటీలు నిర్వహిస్తారు. సంపూర్ణ భగవద్గీతలో 18 సంవత్సరాల లోపు వారు ఒక గ్రూప్ గా, 18 పై బడినవారు రెండో గ్రూప్ గా పోటీలు నిర్వహిస్తారు. మొత్తం నాలుగు గ్రూపులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తారు. పోటీల్లో పాల్గొనదలచినవారు ఈ నెలాఖరు లోపు తమ వివరాలు వాట్సాప్ నెం: 9849203399 కు పంపవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన సెల్: 7386662048 ను సంప్రదించాలన్నారు. 366 శివలింగాలతో మహా లింగార్చన ● వైభవంగా నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఒంగోలు మెట్రో: స్థానిక వీరన్ ఎన్కే గ్రీన్ సిటీ కందులూరులో నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహా లింగార్చన భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన 366 శివలింగాలతో 11 ఆవరణలతో ఏర్పాటు చేసి మహాలింగ అర్చన సామూహికంగా భారతుల శ్రీనివాస శర్మ నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధనలో నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి ●ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ఒంగోలు సిటీ: ఒంగోలు విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్్ కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఒంగోలులోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనంలో జిల్లా పట్టణ, తాలుకా సంఘ నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో 2025 డైరీకి సంబంధించి యాడ్స్, సభ్యత్వ నమోదు వేగవంతంపై చర్చించారు. ఒంగోలులో ఖాళీగా ఉన్న ఆఫీస్ బేరర్ పోస్టులను వెంటనే ఈసీ మీటింగ్ జరుపుకొని భర్తీ చేసుకోవాలన్నారు. డీఈఓ కార్యాలయంలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న కె.వి.సురేష్‌కు నిబంధనల ప్రకారం సీనియర్ సహాయకునిగా పదోన్నతి కల్పించాలని డీఈఓను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వరకుమార్, కోశాధికారి విజయభాను, పట్టణ ఉపాధ్యక్షుడు రామ్మోహనరావు యాదవ్, పట్టణ అధ్యక్షుడు రంగారెడ్డి పాల్గొన్నారు. -
జాతీయ నూతన విద్యా విధానంతో నష్టం
● ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య పొదిలి: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానంతో నష్టం జరుగుతుందని విద్యార్థులు అనేక కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు. ఏఐఎస్ఎఫ్ 20వ జిల్లా మహాసభలు పొదిలిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యను పూర్తిగా కాషాయికరణ, కార్పొరేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పిన మూడోసారి గద్దె నెక్కిన నరేంద్ర మోడీ ఎక్కడ ఎవరికి, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థి లోకం సమరశీల పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుల్లాయి స్వామి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని యూనివర్సీటీకి సొంత భవనాలతో పాటు, హాస్టల్ వసతి కల్పించాలన్నారు. ముందుగా విద్యార్థులు పెద్ద బస్టాండ్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కరుణానిధి, జిల్లా సహాయ కార్యదర్శి రామంజనేయులు, మాజీ జిల్లా కార్యదర్శి పి.ప్రభాకర్, సీపీఐ కార్యదర్శి కేవీ రత్నం, జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్, స్టాలిన్, ఎంఎల్ నారాయణ, నాసరయ్య, జీపీ రామారావు, కొండయ్య పాల్గొన్నారు. -
No Headline
పత్తి ధరలు రైతులను తీవ్ర నిరాశా నిస్పృహల్లోకి నెడుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో ధర పలికిన పత్తికి ఈ ఏడాది పెట్టుబడి సొమ్ము కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గులాబీ పురుగు ఉధృతి, గత నెలలో వారం రోజులపాటు కురిసిన వర్షాలకు పత్తి చేలు ఉరకెత్తడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి తోడు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర దక్కనీయకుండా చేస్తుండటంతో ఏమి చేయాలో దిక్కు తెలియక రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే పరిస్థితులు దాపురించాయి. -
డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ
ఒంగోలు టౌన్: డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణకు శ్రీకారం చుట్టారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసి దాని వినియోగాన్ని మహిళా పోలీసులకు వివరించారు. ప్రతి మహిళా పోలీసు డ్రోన్ పైలెట్‌గా శిక్షణ పొందాలని సూచించారు. జిల్లాలోని పోలీసులందరికీ డ్రోన్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామని, ఇప్పటి వరకు జిల్లాలో 300 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో డ్రోన్ డివైన్ పోలీసింగ్ చేపడతామని, డ్రోన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, వివిధ బందోబస్తులు, జాతరలు, ఊరేగింపుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, విపత్తులను ఎదుర్కోవడానికి కూడా డ్రోన్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. హైవేలపై బైక్ రేసులను అరికట్టడానికి ఇకపై డ్రోనులను విరివిగా ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఈవ్‌టీజింగ్, నాటుసారా తయారీ, అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ల ద్వారా నిఘా పెడతామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ కేవీ రాఘవేంద్ర , ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ వి. సూర్యనారాయణ, పీసీఆర్ ఇస్ఐ ప్రభాకర్ రెడ్డి, తాలుకా పీఎస్ ఎస్సైలు కృష్ణ పావని, అనిత పాల్గొన్నారు. -
వైభవంగా నాసర్ మహమ్మద్ వలి గంధ మహోత్సవం
పొదిలి రూరల్: పొదిలి మండలంలోని మదాలవారిపాలెంలో నాసర్ మహమ్మద్ వలి గంధ మహోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు ఉరుసు మహోత్సవంలో పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా దర్గాతోపాటు రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రి ప్రతి ఇంటి నుంచి జెండాల ఊరేగింపుతో దర్గాకు చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. పొదిలి నుంచి ముస్లింలు ప్రత్యేక వాహనంలో గంధం తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
No Headline
మార్కాపురం: జిల్లాలో మార్కాపురం డివిజన్లో పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. పశ్చిమ ప్రకాశంలో ఈ ఏడాది సుమారు 8,840 హెక్టార్లలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. మార్కాపురం డివిజన్లోని 12 మండలాలతోపాటు కందుకూరు డివిజన్లోని తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల, దర్శి, మర్రిపూడి, కనిగిరి ప్రాంతాల్లో పత్తి తీత ప్రారంభించారు. జూన్, జూలైలో సాగు చేసిన పత్తి దిగుబడి వస్తుండగా, కొద్దిగా ఆలస్యంగా సాగు చేసిన పత్తి మరో రెండు మూడు రోజుల్లో తీతకు రానుంది. సర్కారు నిర్లక్ష్యం దళారులకు వరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు మార్కాపురంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం దళారులకు వరంగా మారింది. రైతులు తాము పండించిన పత్తిని దళారులు చెప్పిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళారులు క్వింటా పత్తికి రూ.5500 నుంచి రూ.6 వేలు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది మధ్యస్థ రకం పత్తి మద్దతు ధర 7020గా ఉండగా క్వింటా పత్తిని రైతులు రూ.12 వేల వరకు అమ్ముకున్నారు. గత నెలలోనూ క్వింటా రూ.8 వేల వరకు పలికిన పత్తి ధర.. సరిగ్గా దిగుబడి చేతికొచ్చే సమయంలో నేల చూపులు చూడటం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ 30న మార్కాపురం మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. క్వింటా పత్తి కనీస మద్దతు ధర 7020 ప్రకటించడంతో రైతులు యార్డుకు తెచ్చి పత్తిని అమ్మారు. ఈ సీజనన్‌లో కూడా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటవుతుందని రైతులు ఆశించగా, ఇంత వరకు కొనుగోలు కేంద్రాన్ని మార్కాపురంలో ప్రారంభించలేదు. పెట్టుబడి చేతికొచ్చేనా? క్వింటా పత్తికి రూ.9 వేలు దక్కితేనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశిస్తున్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. రోజూ పశ్చిమ ప్రకాశం నుంచి సుమారు 10 నుంచి 15 లారీల పత్తి గుంటూరు మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. కొంత మంది రైతులు గ్రూపుగా ఏర్పడి లారీలను బాడుగకు మాట్లాడుకుని ఒక్కో లారీలో 150 క్వింటాళ్ల పత్తిని గుంటూరు చేరుస్తున్నారు. ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి వ్యయప్రయాసలకోర్చి పండించిన పత్తికి గిట్టుబాటు ధర దక్కకపోతుండటంతో పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. త్వరలో ప్రారంభిస్తాం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కాపురం మార్కెట్ యార్డులో ప్రారంభించాలని ఉన్నతాధికారులను కోరాం. త్వరలోనే కేంద్రం ప్రారంభం కానుంది. రైతులు పండించిన పత్తిని ఇక్కడే అమ్ముకోవచ్చు. – కోటేశ్వరరావు, కార్యదర్శి, మార్కాపురం మార్కెట్ యార్డు -
గురుకుల పాఠశాల విద్యార్థినుల సత్తా
సింగరాయకొండ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల మూడవ జోన పోటీల్లో పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచారని ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పల్నాడు జిల్లా ఉప్పలపాడు గురుకుల పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో 40 మంది విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారన్నారు. సీనియర్ వాలీబాల్, జూనియర్ వాలీబాల్, జూనియర్ త్రోబాల్ పోటీల్లో విన్నర్స్‌గా నిలిచారన్నారు. అథ్లెటిక్స్‌లో 1500 మీటర్ల విభాగంలో మొదటిస్థానం, 800 మీటర్ల విభాగంలో మొదటి, మూడవ స్థానాలు, 4..100 మీటర్ల విభాగంలో మొదటి స్థానం, డిస్కస్‌త్రోలో రెండవ స్థానం, లాంగ్‌జంప్‌లో రెండవ స్థానం, జావాలిన్ త్రోలో రెండు, మూడు స్థానాలు సాధించటమే కాక గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఓవరాల్ ఛాంపియన్షిప్ కై వసం చేసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పీడీ ఎస్ సుధారాణి, పీఈటీ బి.అరుణకుమారి, విద్యార్థినులను ఎంపీడీఓ డి. జయమణి, ప్రిన్సిపాల్ రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ వసుధలను అభినందించారు.