Personal Finance
-
ఎస్బీఐ శుభవార్త!.. డిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరింత మంది డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా.. రికవరింగ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) వంటి వినూత్న పథకాలను పరిచయం చేయనుంది. ఆర్థికంగా ఎదగాలనుకునేవారు.. కొన్ని విభిన్న పెట్టుబడి ఎంపికల కోసం చూస్తారు. అలాంటి కస్టమర్ల అభివృద్ధి కోసం ఎస్బీఐ చర్యలు తీసుకుంటోందని చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో చాలామంది పొదుపు చేయడం లేదా పెట్టుబడులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ.. లాభాలనే కోరుకుంటారు. రిస్క్ ఉన్న వాటికంటే కూడా.. వారి పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చే రంగాలవైపు సుముఖత చూపుతారు. కాబట్టి అలాంటి వారి కోసం కొత్త బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టాలని సీఎస్ శెట్టి అన్నారు.కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్, రికవరింగ్ డిపాజిట్స్, సిప్ పెట్టుబడుల కాంబోతో ఓ కొత్త సర్వీస్ తీసుకురావాలనే ఆలోచనలో ఎస్బీఐ ఉన్నట్లు సీఎస్ శెట్టి వెల్లడించారు. ఈ ఆవిష్కరణలు మొత్తం యువ కస్టమర్లను, ముఖ్యంగా Gen Z తరాన్ని ఆకర్షించడానికి ఉద్దేశించినట్లు పేర్కొన్నారు.డిపాజిట్లను పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను పెంచడానికి కూడా యోచిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ వివరించారు. డిపాజిట్ సమీకరణలో కస్టమర్ సర్వీస్, వడ్డీ రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని శెట్టి చెప్పారు. కాబట్టి సమతుల్య వడ్డీ రేట్లు, ఉన్నతమైన కస్టమర్ సేవను అందించడంపైనే ఎస్బీఐ దృష్టి ఉందని సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్‌లో కూడా గణనీయమైన పురోగతి సాధించిన ఎస్బీఐ ప్రతిరోజూ 50000 నుంచి 60000 సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తోందని ఆయన అన్నారు. -
అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
సెప్టెంబర్ నెల ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుదినాల్లో పబ్లిక్ హాలిడేస్, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాల సాధారణ సెలవులు ఉన్నాయి.సెలవుల పూర్తి జాబితా➤అక్టోబర్ 1: రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు 2024 (జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (జాతీయ సెలవుదినం)➤అక్టోబర్ 3: నవరాత్రి (జైపూర్)➤అక్టోబర్ 5: ఆదివారం➤అక్టోబర్ 10: దుర్గాపూజ - మహా సప్తమి (అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 11: దసరా - దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 12: రెండవ శనివారం / విజయదశమి (తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 13: ఆదివారం➤అక్టోబర్ 14: దుర్గా పూజ (గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 16: లక్ష్మీ పూజ (అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి (బెంగళూరు, గౌహతి, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 20: ఆదివారం➤అక్టోబర్ 26: నాల్గవ శనివారం➤అక్టోబర్ 27: ఆదివారం➤అక్టోబర్ 31: దీపావళి (దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు)ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్‌ను అన్‌లాక్ చేస్తాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్ఫామ్లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్‌బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్ల చొప్పున తనిష్క్ వోచర్ల కోసం రివార్డ్ పాయింట్ల రిడీమ్‌ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసా..?
చదువు అయిపోయి కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత ఒక్కసారిగా తమకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తోంది. అప్పటివరకు చిల్లర ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడినవారు ఉద్యోగం రాగానే విచ్చలవిడి ఖర్చుకు ఏమాత్రం ఆలోచించడం లేదు. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు ఏరూపంలో వస్తాయో తెలియదు. కాబట్టి యువతతోపాటు అందరూ కొన్ని చిట్కాలు పాటించి డబ్బు ఆదా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల్లోనే బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఫోన్లు చేస్తుంటాయి. చాలామంది అధికంగా ఖర్చు చేయడానికి క్రెడిట్‌కార్డు ఒక కారణం. నెలవారీ ఖర్చులకు మించి అప్పు చేసి మరీ క్రెడిట్‌కార్డు ఉందనే దీమాతో వస్తువులు కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్డు వాడినా ఒకేసారి బిల్లు చెల్లించేలా ప్రణాళికలు వేసుకోవాలి. నెలవారీ బిల్లులో మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుందనేలా బ్యాంకు మెసేజ్‌లు కనిపిస్తాయి. అలాచేస్తే కట్టాల్సిన మొత్తం పేమెంట్‌పై తదుపరి నెల అధికవడ్డీ వసూలు చేస్తారు.నెలవారీ ఆదాయం, ఖర్చులకు సంబంధించి పక్కా బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి. నెలాఖరులోపు తరచుగా మీకు నగదు కొరత వస్తుందంటే.. ఖర్చులను సమీక్షించాల్సిందే. ఆదాయానికి తగిన బడ్జెట్‌ను తయారు చేసుకుని తప్పకుండా దాన్ని పాటించాలి.నెలవారీ మొత్తం ఖర్చులు అయిపోయిన తర్వాత మిగతా డబ్బును ఆదా చేయాలని చూస్తారు. కానీ ముందు పొదుపు..తర్వాతే ఖర్చు అనే విధానాన్ని పాటించాలి. ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. దీర్ఘకాలంలో క్రమశిక్షణతో సంపదను సృష్టించేందుకు ఇది తోడ్పడుతుంది.ఏదైనా పరిస్థితుల్లో చేస్తున్న ఉద్యోగం కోల్పోయినా ఖర్చులు తట్టుకోవాలంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం ఆరు నెలలకు సరిపడా నిధులను సిద్ధం చేసుకోవాలి. దీన్ని సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో ఉంచుకోవచ్చు.ఉద్యోగం చేస్తున్న సమయంలో బోనస్, ప్రమోషన్, ఇంక్రిమెంట్ల రూపంలో అదనంగా డబ్బు సమకూరుతుంది. దాన్ని విలాసాలు, ఖరీదైన వస్తువులు కొనేందుకు వినియోగించకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే మ్యుచువల్ ఫండ్లను ఎంచుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. మీ వయసు, మీరు చేస్తున్న ఉద్యోగం, మీకు వస్తున్న వేతనం లెక్కించి నెలవారీగా కొంత మొత్తంతో పదవీవిరమణ కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: రెండేళ్లలో అంగారక గ్రహంపైకి స్టార్‌షిప్ మిషన్..?ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసినా ఆదాయంలో 30 శాతం వరకు ఈఎంఐలు మించకూడదు. మారుతున్న ఆహార అలవాట్లతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ముందుగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. ప్రమాదవశాత్తు మీరు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే టర్మ్ పాలసీ తప్పకుండా ఉండాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ రెండు పాలసీలు తప్పకుండా తీసుకోవాలి. వయసు తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తక్కువగా ఉంటుంది. -
EPFO: ఈపీఎస్‌పై కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్)కు సంబంధించి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి మొత్తం లెక్కలు మారవచ్చు.ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ వేతనంలో 12% మొత్తం నెలవారీ కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఈపీఎఫ్‌కు వెళుతుంది. యజమాన్యాలు కూడా ఇంతే మొత్తాన్ని జమచేస్తాయి. అందులో 8.33% ఈపీఎస్-95 కింద పెన్షన్ నిధికి వెళుతుంది. మిగిలిన 3.67% ఈపీఎఫ్‌కి జమవుతుంది. అయితే ఇప్పటివరకు యాజమాన్యాలు జమచేసే 8.33 శాతంపై ఎలాంటి వడ్డీ రావడంలేదు. ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ వరకు ప్రతి నెలా జమవుతూ ఉంటుంది. ఉద్యోగి బేసిక్ జీతంలో రివిజన్ ఉంటే ఈ కంట్రిబ్యూషన్ మారవచ్చు. ఈపీఎఫ్ కార్పస్ కాలక్రమేణా పెరుగుతుంది. దీనిపై ఈపీఎఫ్‌వో నిర్ధిష్ట వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.25% ఉంది. ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి ఈ మొత్తం లెక్కలు మారవచ్చు. మీడియా నివేదిక ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఒక పెన్షనర్ల సమూహం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కి అనుగుణంగా ఈపీఎఫ్ సంపదను లెక్కించాలని, పెన్షన్ కార్పస్‌పై సంవత్సరానికి 8% వడ్డీ రేటును నిర్ణయించాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది.ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్బీఐ స్పషల్ స్కీమ్'ది హిందూ' నివేదిక ప్రకారం.. ఎన్పీఎస్ మాదిరిగానే ఈపీఎస్ కూడా కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని, జమయిన పెన్షన్ మొత్తం ఆధారంగా కాకుండా 'ఫిక్స్డ్ పెన్షన్ జీతం' ఆధారంగా లెక్కించాలని ఐటీఐ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (IRIROA) వాదిస్తోంది.ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లాగానే పని చేస్తుంది. ఈ కొత్త నిర్మాణం ప్రకారం, ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్‌పై ఏటా స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో పదవీ విరమణ నాటికి ఈ పెన్షన్ కార్పస్ భారీగా పెరుగుతుంది. -
పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!
రాజు నెల వేతనం రూ.20 వేలు. ఇంటిఅద్దె రూ.తొమ్మిది వేలు చెల్లిస్తాడు. పిల్లల స్కూల్ ఫీజు ఏటా రూ.40 వేలు అంచనా వేసినా నెలకు రూ.3,500 అవుతుంది. కరెంటు బిల్లు, వైద్యం, రెస్టారెంట్, సినిమా, పార్టీలు, ఫంక్షన్లు, ప్రయాణాలు, సేవింగ్స్ కోసం రూ.నాలుగు వేలు ఖర్చు చేశాడని అనుకుందాం. ఈక్రమంలో నెలవారీ ఇంటి ఖర్చులు రూ.3,500 దాటాయంటే ఈఎంఐ తప్పదు. దీని ప్రభావం వచ్చేనెల ఖర్చులపై ఉంటుంది.దేశంలోని చాలామంది తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా ఖర్చు చేస్తుంటారు. కొందరు అవసరాలకు మాత్రమే అప్పు చేస్తుంటే.. ఇంకొందరు వివిధ కారణాల వల్ల అప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో సరిపడా ఆదాయంలేని వారు ఏ చిన్న వస్తువు కొన్నాలన్నా ఈఎంఐ తప్పడంలేదు. ఇండియాలో ఈఎంఐ కల్చర్ ఎలా ఉందనే అంశాలను తెలియజేస్తూ ఇటీవల కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.దేశంలో దాదాపు 70 శాతం మంది ఐఫోన్ వినియోగదారులు ఈఎంఐ ద్వారానే వాటిని కొనుగోలు చేస్తున్నారని తేలింది. 80 శాతం కారు విక్రయదారులు ఈఎంఐలోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. 60 శాతానికిపైగా ఇళ్లు హోంలోన్ ద్వారానే కొంటున్నారు. అయితే నెలవారీ సంపాదనలో మొత్తం ఈఎంఐలు 30 శాతం లోపే ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి ఈఎంఐ పెట్టాలనుకుంటే మాత్రం సంపాదన పెంచుకోవాలని చెబుతున్నారు. నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, సంపాదన పెరిగితే ఈఎంఐ అవసరం లేకుండానే వస్తువులు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 13 రూ.11కే..?దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొబైళ్లు, దుస్తులు, గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులు అత్యవసరం అయితే తప్పా కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సమాజం మన్ననలు పొందేందుకు ఆర్బాటాలకు పోయి అప్పు చేసి ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటే చివరకు వాటిని చెల్లించడంలో ఇబ్బందులు పడుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా, ప్రణాళికబద్దంగా అత్యవసరమైతేనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. -
గడువు ముగియనున్న ఎస్బీఐ స్పెషల్ స్కీమ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకొచ్చిన 400 రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్ ‘ఎస్బీఐ అమృత్ కలశ్’కు గడువు త్వరలో ముగియనుంది. ఈ పథకం కింద ఎఫ్డీ ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ 30 ముగుస్తుంది.ఏప్రిల్ 12న ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్డీ ప్లాన్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ పథకానికి గడువును పలు సార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వచ్చింది.కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ.. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌తో అందిస్తున్న సాధారణ ఎఫ్డీ పథకాలతో పోలిస్తే అమృత్ కలాష్ ఎఫ్డీ ప్లాన్‌పై సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు సుమారు 30 బేసిస్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తోంది.అమృత్ కలశ్ ఎఫ్డీ రేట్లుఎస్బీఐ అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను సబ్స్క్రయిబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు 7.1% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.6% రేటు లభిస్తోంది. ఇది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్. మరోవైపు 1-2 సంవత్సరాల టెన్యూర్ ఉండే ఎఫ్డీ ప్లాన్‌కు సాధారణ కస్టమర్లకు 6.8%, సీనియర్ సిటిజన్లకు 7.3% వడ్డీని ఎస్బీఐ చెల్లిస్తోంది. -
ఇంక్రిమెంట్లు, బోనస్‌ల పవర్ తెలుసా..?
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు విలాసాలకు, అనవసర ఖర్చులకు డబ్బు వృథా చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి వంటి పండగలకు చాలా కంపెనీలు బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. ఈ డబ్బును పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ రూపంలో అదనంగా సమకూరే డబ్బును దీర్ఘకాల రాబడులిచ్చే ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించాలి. ఇప్పటికే నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇది మరింత డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మదుపునకు అదనంగా జోడించే ఐదుశాతం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం యాభైవేల రూపాయలు అనుకుందాం. ప్రతినెలా రూ.10 వేలు మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 12 శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును ఏటా ఐదు శాతం పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.3.7 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.5.2 కోట్లు అందుకుంటారు. అంటే, ఏటా ఐదుశాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఎక్కువగా సమకూరుతాయి.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని హెచ్చరిక! -
పిల్లలకూ పెన్షన్!
న్యూఢిల్లీ: పిల్లల పేరిట పింఛను పథకం ప్రారంభించి, ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ‘ఎన్పీఎస్ వాత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఎన్పీఎస్ పథకం మెరుగైన రాబడులను అందిస్తోందని, భవిష్యత్ ఆదాయం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్ డెట్‌లో 9.1 శాతం, జీ–సెక్లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నట్టు వివరించారు. ‘పీఎం వాత్సల్య పథకాన్ని అమలు చేసే క్రమంలో దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ సరీ్వసెస్ విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల తెలిపారు. ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..? ఆన్లైన్లో లేదంటే ఆఫ్‌లైన్‌లో బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.1,000తో ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది. -
NPS Vatsalya: పిల్లల కోసం ప్రత్యేక పథకం ప్రారంభం
పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఈ పెన్షన్ ఖాతాలను తెరవచ్చు. 2024-25 యూనియన్ బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ మైనర్ పిల్లలకు పెన్షన్ పొదుపును ప్రారంభించచ్చు. ఇది భారతీయ పౌరులతోపాటు ఎన్ఆర్ఐలకు కూడా సౌకర్యవంతమైన దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా పిల్లలకి 18 ఏళ్లు నిండగానే ప్రామాణిక ఎన్పీఎస్ ఖాతాగా మారుతుంది. తద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం నిరంతర పెట్టుబడిని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్లు లేదా ఈ-ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబై సర్వీస్ సెంటర్లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కొత్త ఖాతాలను నమోదు చేసి సింబాలిక్ ప్రాన్ (PRAN-పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) కార్డ్‌లను జారీ చేసింది. ఐసీఐసీఐ, యాక్సిస్‌తో సహా ప్రధాన బ్యాంకులు ఈ పథకాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చాయి.వీటిలో పెట్టిన మొత్తాన్ని ఈక్విటీలు, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా వచ్చే రిటర్న్స్‌ను ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్పస్ ఫండ్‌ను ఖాతాదారు 60 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది. అయితే మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత విద్య, అనారోగ్యం వంటి కారణాలకు పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. -
ఉద్యోగంలోంచి తీసేస్తే..గ్రాట్యుటీ వస్తుందా? రాదా? ఏం చేయాలి?
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నంపీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్మాన్లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది -
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!
బంధన్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు (FD) 8.55 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.బంధన్ బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.55 శాతం, ఇతర కస్టమర్లకు 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఐదు సంవత్సరాలలోపు కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు ఈ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.ఇదీ చదవండి: కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..మరోవైపు రూ. 10 లక్షలకు మించిన పొదుపు ఖాతా నిల్వలపై 7 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ అందిస్తుంది. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కస్టమర్లు సౌకర్యవంతంగా తమ ఇళ్లు లేదా తాము ఉండే చోటు నుంచే ఫిక్స్డ్ డిపాజిట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా కస్టమర్లు ఎఫ్డీ బుకింగ్ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.కాలవ్యవధి వడ్డీ సీనియర్ సిటిజెన్లకు సాధారణ ప్రజలకు7 నుంచి 14 రోజులు 3.00% 3.75%15 నుంచి 30 రోజులు 3.00% 3.75%31 రోజుల నుంచి 2 నెలలలోపు 3.50% 4.25%2 నెలల నుంచి 3 నెలలలోపు 4.50% 5.25%3 నెలల నుంచి 6 నెలలలోపు 4.50% 5.25%6 నెలల నుంచి ఏడాదిలోపు 4.50% 5.25%ఏడాది 8.05% 8.55%ఏడాది నుంచి ఏడాది 9 నెలలు 8.00% 8.50%21 నెలల 1రోజు నుంచి 2 ఏళ్లలోపు 7.25% 7.75%2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు 7.25% 7.75%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు 7.25% 7.75%5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.85% 6.60%ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ 7.00% 7.50% -
బిజినెస్ లోన్ కావాలా?.. ముందుగా ఇవి తెలుసుకోండి
ఉద్యోగం చేయడం ఇష్టంలేని వారు సొంతంగా బిజినెస్ చేసి ఎదగాలనుకుంటారు. అయితే బిజినెస్ చేయడానికి కావాల్సిన డబ్బు చేతిలో ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. బ్యాంక్ నుంచి బిజినెస్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..సిబిల్ స్కోర్ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలనుంటే ఏ బ్యాంక్ అయినా.. ఫైనాన్స్ సంస్థ అయినా ముందుగా క్రెడిట్ స్కోల్ లేదా సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంత లోన్ వస్తుంది, వడ్డీ రేటు వంటివి నిర్ణయిస్తారు. క్రెడిట్ స్కోర్ 685 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటేనే సులభంగా లోన్ పొందవచ్చు. ఈ స్కోర్ పెంచుకోవాలనుంటే గడువు తేదీ లోపల ఈఎంఐ చెల్లించాలి, క్రెడిట్ కార్డు బిల్లులు కూడా క్లియర్ చేసుకోవాలి.వయసుబిజినెస్ చేయాలనుకునే వ్యక్తి వయసు కూడా చాలా ముఖ్యం. కాబట్టి వ్యాపారం చేయాలనుకునే వ్యక్తి వయసు కనీసం 24 ఏళ్లకంటే ఎక్కువ ఉండాలి. ఈ వయసులో కష్టపడే తత్త్వం ఉంటుంది. సాధించాలనే తపన ఉంటుంది. అంతకన్నా తక్కువ వయసున్న వారు బిజినెస్ చేస్తే.. బహుశా ముందుకు వెళ్ళలేరేమో అని బ్యాంకులు భావిస్తాయి.బిజినెస్ ప్లాన్బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే ముందు.. మీరు ఎలాంటి బిజినెస్ చేస్తారనేది సంబంధిత అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది. మీ బిజినస్ ప్లాన్ బాగుంటే.. భవిష్యత్తులో ఆ వ్యాపారం ముందుకు సాగుతుందని బ్యాంక్ భావిస్తే త్వరగా లోన్ మంజూరవుతుంది. ఇది మీ ఆర్థిక అవసరాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.వార్షిక ఆదాయంలోన్ ఇచ్చే బ్యాంక్ ఖచ్చితంగా.. సదరు వ్యక్తి వార్షిక ఆదాయం ఎంత అనేది కూడా గమనిస్తుంది. దీన్నిబట్టి ఆ వ్యక్తి లోన్ చెల్లించగలడా? లేదా అనేది బేరీజు వేసుకుంటుంది.ఇదీ చదవండి: అందుకే లగ్జరీ కారు కొనలేదు: ఎడెల్వీస్ సీఈఓ బిజినెస్ లోన్ రకాలుపర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటికి.. చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది. బిజినెస్ లోన్ ఇవ్వడానికి రూల్స్ వేరుగా ఉంటాయి. ఆస్తుల ఆధారంగా లోన్ తీసుకోవడం చాలా ఉత్తమం అని పలువురు నిపుణులు చెబుతారు. ఇలాంటి వాటికి వడ్డీ రేటు కూడా కొంత తక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆస్తులు లేకుండా నేరుగా లోన్ తీసుకోవాలనుంటే.. ఇది అందరికీ సాధ్యమవుతుందనుకోవడం కొంత కష్టమే. వీటిని అన్సెక్యూర్డ్ లోన్లు అంటారు. ఒకవేలా ఇలాంటి లోన్స్ తీసుకుంటే వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. -
ఎన్నారైలకూ సమన్లు వస్తాయ్..
మొదలైంది.. ఎన్నారైలకు నోటీసుల పరంపర!! ఎన్నారైలకు విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి, ఆదాయం గురించి.. ఆదాయపు స్టేటస్ గురించి.. ఆదాయపు పన్ను వారి ఇన్వెస్టిగేషన్ యూనిట్ నుంచి నోటీసులు మొదలయ్యాయి. మీకూ తెలిసే ఉంటుంది. పన్ను భారం విధించడానికి ప్రమాణం.. మీ రెసిడెంట్ స్టేటస్. అంతేకాని ఎటువంటి సందర్భంలో పౌరసత్వంతో సంబంధం లేదు.ఒక వ్యక్తి భారతదేశంలో 182 రోజులు లేదా ఎక్కువ రోజులు నివాసం ఉంటే రెసిడెంట్ అవుతారు లేదా ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండి, గత నాలుగు సంవత్సరాల్లో 365 రోజులున్నా రెసిడెంట్లు అవుతారు. మిగతా వారందరూ నాన్–రెసిడెంట్లు అవుతారు. స్థూలంగా చెప్పాలంటే పన్ను విధింపు, లెక్కింపు మొదలైన విషయాల్లో రెసిడెంట్లకు, నాన్–రెసిడెంట్లకు ఎన్నో తేడాలున్నాయి. నోటీసులో ఏయే అంశాలు అడుగుతున్నారంటే..విదేశాలకు ఎప్పుడు వెళ్లారు?ఏ సంవత్సరంలో విదేశాల్లో బ్యాంకు అకౌంటు తెరిచారు? ఆ అకౌంటు వివరాలు ఆ రోజు నుంచి రెసిడెంట్ స్టేటస్ పాస్‌పోర్ట్‌లో రాక/పోకకి సంబంధించి ఎంట్రీలు బ్యాంకు అకౌంటు ఎటువంటిదైనా వివరాలు ఇవ్వాలి స్థిరాస్తి వివరాలు ఆదాయ వివరాలు పన్ను చెల్లింపు వివరాలు సంబంధిత వివరాలువిదేశీ సంస్థల ద్వారా సమాచారం తెలుసుకుని వారికి నోటీసులు.. అవసరమైతే సమన్లు ఇస్తున్నారు. నలభై సంవత్సరాల చరిత్ర అడుగుతున్నారని కొందరు వాపోతున్నారు. ఇది అసమంజసం అని అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని కొట్టేస్తున్నారని అంటున్నారు. చట్టప్రకారం ఒకప్పుడు 16 సంవత్సరాలుగా ఉన్న కాలపరిమితిని 10 సంవత్సరాలకు తగ్గించారు. ఆ పదిని 5 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కాలపరిమితిని అనుసరించి విదేశీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం ఎన్నారైలు కానివారి దగ్గర్నుంచి.. అంటే రెసిడెంట్లు దగ్గర్నుంచి అడుగుతారు.నాన్–రెసిడెంట్లు .. వారున్న దేశం – అంటే విదేశంలోని ఆస్తుల వివరాలు ఇవ్వనవసరం లేదు. ఎటువంటి బాధ్యత లేదు. మరయితే ఎవరిపైన ఈ అస్త్రాలు అంటే.. ‘‘రెసిడెంట్ స్టేటస్‌లో ఉంటూ నాన్–రెసిడెంట్లుగా చలామణీ అవుతున్న’’ వారి మీద. మనం వాడుక భాషలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని ‘ఎన్నారై’లు అనేస్తాం. కానీ, చట్టప్రకారం స్టేటస్ లెక్కించాలి. అనుమానం వస్తే నోటీసుల ఇస్తారు. సమాచారం అడుగుతారు. ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తారు. మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. డిపార్ట్మెంట్ వారు బ్లాక్‌మనీ చట్టానికి సంబంధించిన అధికార్లకు రిఫర్ చేయొచ్చు. వారు వారి పని చేస్తారు. ఎలా బయట పడాలి? విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం/చదువు కోసం వెళ్లినవారు విధిగా అన్ని రికార్డులు నిర్వహించండి. వీలుంటే ఫ్లైట్ టికెట్లు, బోర్డింగ్ పాస్‌లు, సంబంధిత ఈమెయిల్స్, పాస్‌పోర్టులు, పాతవి, లేటెస్టువి, వీసాకు సంబంధించిన కాగితాలు, విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు, ఏ తేదీ నాడు ఎంతెంత చేశారు.. ఏమి కొన్నారు .. స్థిరాస్తులు, మొదలైనవి రెడీగా ఉంచండి. అడిగినప్పుడు సకాలంలో ఇవ్వండి. నిజాయితీగా. ఆలస్యం అవుతుందంటే ఆ విషయం చెప్పండి. గడువు తేదీ లోపల స్పందించండి.మీరు నిజంగానే నాన్–రెసిడెంట్ అయితే, మీరు భయపడక్కర్లేదు. ఎవరినీ భయపెట్టడం లేదు. ముందు నుంచి మనం చెప్పేది ఒకటే. మీరు చేసే ఏ వ్యవహారానికైనా డాక్యుమెంట్లు తప్పనిసరి!! -
స్మార్ట్ సిప్ ఎంపిక సరైనదేనా..?
ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్టాలను నమోదు చేస్తోంది. కనుక స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? - నియతి దూబేరెగ్యులర్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు వినూత్నమైనవే స్మార్ట్ సిప్‌లు. ఇవి ఎలా స్మార్ట్ అంటే.. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం కాకుండా మార్కెట్ తీరు ఆధారంగా వ్యవహరిస్తాయి. కొన్ని అంశాల ఆధారంగా మార్కెట్లు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌకగా ఉన్నాయా..?ఎలా ఉన్నాయన్నది చెప్పే ఆల్గోరిథమ్ (సాఫ్ట్వేర్) వాటికి ఉంటుంది.మార్కెట్ల విలువ చాలా ఖరీదుగా ఉన్నట్టు ఆల్గోరిథమ్ భావిస్తే ఇన్వెస్టర్ నుంచి వచ్చే సిప్ మొత్తాన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత మొత్తాన్నే కేటాయిస్తాయి. ఉదాహరణకు ప్రతి నెలా ఒక ఇన్వెస్టర్ నుంచి రూ.1,000 సిప్ రూపంలో వస్తుంటే, అందులో కొంత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్ (డెట్ ఫండ్)లోకి మళ్లిస్తాయి. మళ్లీ స్టాక్స్ విలువలు దిగొచ్చినప్పుడు తిరిగి ఎక్కువ మొత్తాన్ని స్టాక్స్‌కు, తక్కువ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌కు కేటాయిస్తుంటాయి.స్మార్ట్ సిప్‌లు అంటే ఈక్విటీ, డెట్ పెట్టుబడుల కలబోతగా ఉంటాయి. స్మార్ట్ సిప్‌లు ఇలానే పనిచేస్తుంటాయి. ఇది విజయాన్నిచ్చే విధానం. ఈక్విటీలు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ మొత్తాన్ని డెట్ ఫండ్ రూపంలో ఉంచుకోవడం, మార్కెట్లు చౌకగా మారినప్పుడు దీనికి విరుద్ధంగా వ్యవహరించడం ఇందులో కనిపిస్తుంది. కానీ వాస్తవికంగా చూస్తే మార్కెట్లు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టం.ఎవరూ కూడా నిరాటంకంగా ఈ విషయంలో కచ్చితత్వంతో వ్యహరించలేరు. మార్కెట్ల గమనాన్ని కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితికి ముందు నుంచి ఉన్న సిప్ నిజానికి ఒక పరిష్కారం. ఈ విధానంలో మార్కెట్లు ఖరీదుగా ఉన్నా, చౌకగా ఉన్నా సరే ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఖరీదుగా ఉన్నప్పుడుకొన్ని యూనిట్లు వస్తే, మార్కెట్లు పడిపోయినప్పుడు అంతే సిప్‌తో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. మార్కెట్లగమనం, అంచనా రిస్క్‌ను అధిగమించేందుకు ఇదే మెరుగైన పరిష్కారం. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వె స్ట్ చేసుకుంటూ, దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందు కు ఇది వీలు కల్పిస్తుంది. కనుక రెగ్యులర్ సిప్‌లను ఎంపిక చేసు కోవాలన్నదే మా సూచన.ఇండెక్స్ ఫండ్ ఎంపిక చేసుకునే విషయంలో ఎలాంటి అంశాలను పరిశీలించాలి? -లలావత్ రాములుఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం సులభమే. ఎక్స్పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్ ఈ రెండు అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో కీలకమైనది. ఇది ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ నుంచి వసూలు చేసే నిర్ణీత చార్జీ. ఇది తక్కువగా ఉంటే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులకు వీలుంటుంది.ఉదాహరణకు ఒక ఫండ్ 0.10 శాతం, మరో ఫండ్ 0.25 శాతం వసూలు చేస్తుంటే.. ఈ రెండింటిలో మొదటి పథకంలో ఎక్కువ రాబడులు వస్తాయి. ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఒక పథకం పనితీరుకు, బెంచ్‌మార్క్ సూచీ రాబడులను మధ్య ఉన్న వ్యత్యాసం.ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉంటే, పథకం పనితీరు సూచీలకు తగిన స్థాయిలోనే ఉందని అర్థం. అలాంటి పథకం ఇన్వెస్టర్లకు అనుకూలం. ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, పరిమిత ట్రాకింగ్ ఎర్రర్ ఉన్న పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎక్కువ రాబడులకు అవకాశం ఉంటుంది.ధీరేంద్ర కుమార్ -సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎక్కువ ఖాతాలున్నా.. ప్రయోజనాలు సున్నా
ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తున్నా కానీ, ఇతర పెట్టుబడి సాధనాల ప్రాధాన్యాన్ని విస్మరించలేం. పెట్టుబడులు అన్నింటినీ ఒక్క చోటే పెట్టేయడం రిస్క్ పరంగా అనుకూలం కాదు. వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గించుకుని, మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అందుకే ఒకవైపు ఈక్విటీల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నప్పటికీ.. మరోవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇప్పటికీ ఎంతో మందికి ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాలుగా కొనసాగుతున్నాయి. రిస్క్‌లేని హామీతో కూడిన ఈ పథకాలు ముఖ్యమైన జీవిత లక్ష్యాలకు చేదోడుగా నిలుస్తాయనడంలో అతిశయం లేదు. అయితే ఇందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్సీ పరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం. పీపీఎఫ్ ఒక్కటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునే ఆరి్థక సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత మరో ఐదేళ్ల పాటు గడువును పొడిగించుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపే కాకుండా, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంది. ఈ ప్రయోజనమే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇది చూసే కొంత మంది ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లో ఒకటి, బ్యాంక్‌లో ఒకటి తెరుస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఒకరి పేరిట ఒక పీపీఎఫ్ ఖాతానే ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయగలరని కేంద్ర ఆరి్థక శాఖ జూలై 12న ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఒకటికి మించిన ఖాతాలను గుర్తించినట్టయితే అందులో ఒక దానిని ప్రాథమిక ఖాతాగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండో ఖాతాలో జమలపై ఎలాంటి వడ్డీ రాదన్నది తాజా ఉత్తర్వుల సారాంశం. ఒకవేళ రెండు ఖాతాలున్నట్టు తేలితే రెండో ఖాతాలోని జమలను మొదటి ఖాతాకు బదిలీ చేస్తారు. ఒక ఆర్థిక సంత్సరంలో గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలకు మించి జమ చేసినట్టయితే, అదనంగా ఉన్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా వెనక్కిచ్చేస్తారు. రెండు కంటే ఎక్కువ ఖాతాలున్నట్టు తేలితే అప్పుడు ప్రారంభించిన తేదీ నుంచి సున్నా వడ్డీయే లభిస్తుంది.పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాలు... కొంత మంది పిల్లల పేరుతోనూ ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరుస్తున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. ఒక మైనర్ (బాలుడు/బాలిక) పేరిట ఒక పీపీఎఫ్ ఖాతాకే పరిమితం కావాలి. ఇలా ఒక మైనర్ పేరిట ఒకటికి మించి ఉన్న ఖాతాలను ఇరెగ్యులర్ (అక్రమం) అకౌంట్లుగా గుర్తిస్తారు. అప్పుడు మైనర్ పేరిట ఉన్న ఖాతాల్లో ఒకదానిని మెయిన్ అకౌంట్‌గా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఖాతాకు నిబంధనల మేరకు ప్రస్తుత వడ్డీ రేటు అమలవుతుంది. ఒకటికి మించి అదనంగా ఉన్న ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4 శాతం చొప్పున 18 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తారు. 18 ఏళ్లు నిండగానే మేజర్ అయిన తర్వాత సాధారణ పీపీఎఫ్ ఖాతా కింద దాన్ని పరిగణిస్తారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ ఖాతాపై చర్యలు ఉంటాయి. నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిజానికి ఇద్దరు పిల్లలు ఉంటే విడిగా ఇద్దరి పేరిట రెండు ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. అయినప్పటికీ, తన పేరుతో, తన పిల్లల పేరుతో ఇలా అన్నింటిలోనూ గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేసుకోరాదు. పీపీఎఫ్ ఖాతాను తాత, బామ్మ, అమ్మమ్మలు (గ్రాండ్ పేరెంట్స్) నిర్వహించరాదు. కేవలం తల్లిదండ్రులు మరణించి, పిల్లలకు ఆధారంగా మారిన వారే చట్టబద్ధ సంరక్షకులుగా వ్యవహరించడానికి అనుమతి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన... సుకన్య సమృద్ధి యోజన ఎంతో ప్రాచుర్యం పొందిన పథకం. రోజుల శిశువు నుంచి పదేళ్లలోపు కుమార్తెల పేరిట ఖాతా తెరిచి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఇది కొనసాగుతుంది. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాకు 8.2 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఇందులో చేసే పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇందులో రాబడులపైనా పన్ను లేదు. ఒక కుటుంబం తరఫున గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిటే సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడానికి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను (ఎస్ఎస్ఏఎస్) బాలిక తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తెరవడానికి అనుమతి ఉంటుంది. అయితే, కొందరు మనవరాలి పేరిట కూడా ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పిల్లలకు సహజ సంరక్షకులు అయిన తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయిన వారే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒకవేళ మనవరాలి పేరిట తాత, అమ్మమ్మ, బామ్మలు తెరిచినట్టు గుర్తించినట్టయితే అప్పుడు సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులకు బదిలీ అవుతుంది. ఒక కుటుంబానికి రెండుకు మించి ఖాతాలున్నట్టు తేలితే అదనంగా ఉన్న వాటిని మూసివేస్తారు. వాటిలో జమ చేసే మొత్తాలపై వడ్డీ రాదు.నేషనల్ సేవింగ్స్ స్కీమ్... ఎంతో పాపులర్ అయిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. గతంలో ఏదైనా పోస్టాఫీస్ శాఖలో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ప్రారంభించేందుకు అవకాశం ఉండేది. దీన్ని 2002 నుంచి నిలిపివేశారు. కాకపోతే అప్పటికే తెరిచిన ఖాతాలను కొనసాగించేందుకు అనుమతించారు. 1990 ఏప్రిల్ 2కు ముందు తెరిచిన మొదటి ఖాతాకు ప్రస్తుత పథకం రేటు, రెండో ఖాతాకు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా రేటు (4 శాతం)కు అదనంగా 2 శాతం చెల్లిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఈ రెండు ఖాతాలకు ఎలాంటి వడ్డీ రాదు. 1990 ఏప్రిల్ 2 తర్వాత తెరిచిన నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలకు సైతం అక్టోబర్ నుంచి ఎలాంటి వడ్డీ చెల్లించరు. దీంతో ఈ ఖాతాలను మూసివేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎన్ఆర్ఐలు అలా చేయడం కుదరదు..ఎన్ఆర్ఐ హోదాను వెల్లడించకుండా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం చెల్లదు. అలాంటి ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ రేటు 4 శాతమే అమలవుతుంది. అది కూడా 2024 సెపె్టంబర్ 30 వరకే. ఆ తర్వాత నుంచి బ్యాలన్స్‌పై వడ్డీ రాదు. నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అనుమతి లేదు. ‘‘భారత్‌లో పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత విదేశాలకు వెళ్లి ఎన్ఆర్ఐగా మారితే 15 ఏళ్ల గడువు ముగిసేంత వరకు ఆ ఖాతాను కొనసాగించొచ్చు. అందులో చేసే పెట్టుబడులకు ఇతరులకు మాదిరే వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే, నాన్ రీపాట్రియేషన్ నిబంధనల కిందే వీరు పీపీఎఫ్ ఖాతాను కొనసాగించుకోగలరు. అంటే గడువు ముగిసిన తర్వాత వచ్చే మెచ్యూరిటీని ఎన్ఆర్ఐ తన విదేశీ ఖాతాకు బదిలీ చేసుకోవడం కుదరదు. లేదా విదేశీ కరెన్సీలోకి మార్చుకోవడం కుదరదు. తన నివాస హోదాలో మార్పు చోటుచేసుకున్న వెంటనే సంబంధిత వ్యక్తి బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు తెలియజేయడం తప్పనిసరి’’ అని స్టెబుల్ ఇన్వెస్టర్ వ్యవస్థాపకుడు దేవ్ ఆశిష్ తెలిపారు.మార్గం ఉంది.. పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే.. అప్పుడు దంపతులు ఇద్దరూ తమ పేరిట పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉంటే భార్య, భర్త చెరొక పీపీఎఫ్ ఖాతా తెరిచి గరిష్ట పరిమితి మేరకు ఒక్కో ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాను ఐదేళ్లు నిండిన తర్వాత వైద్య పరమైన అవసరాల కోసం మూసివేసేందుకు అనుమతి ఉంటుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
సెలవులో మార్పు.. ఆర్బీఐ కీలక ప్రకటన
మహారాష్ట్ర ప్రభుత్వం ఈద్-ఈ-మిలాద్‌కు సంబంధించిన పబ్లిక్ హాలిడేను మార్చింది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంక్ హాలిడేను సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 18కు మార్చినట్లు వెల్లడించింది.సెప్టెంబర్ 18న సెలవు కాబట్టి ఆ రోజు గవర్నమెంట్ సెక్యూరిటీలు, ఫారెన్ ఎక్స్చేంజ్, మనీ మార్కెట్, రూపీ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్‌లలో ఎలాంటి లావాదేవీలు, సెటిల్మెంట్లు ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ లావాదేవాలన్నీ కూడా సెప్టెంబర్ 19న యధావిధిగా జరుగుతాయని సమాచారం.ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఈద్-ఇ-మిలాద్ ఒక ముఖ్యమైన వేడుక. దీనిని ముహమ్మద్ పుట్టినరోజు, నబీ దినోత్సవం లేదా మౌలిద్ అని కూడా అంటారు. భారతదేశంలో ఇది ప్రభుత్వ సెలవుదినంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సందర్భాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ఏకంగా 14 రోజులు! హాలిడే ఒక్క మహారాష్ట్రలో మాత్రమే కాకుండా గుజరాత్, మిజోరం, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, జమ్మూ, కేరళ, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు వర్తిస్తాయి. అంటే ఆ రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు ఆ రోజు పనిచేయవు (మహారాష్ట్రలో 18న సెలవుదినం, ఇతర రాష్ట్రాల్లో 16 సెలవుదినం అని తెలుస్తోంది). కాబట్టి బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే ముందుగానే సెలవు గురించి తెలుసుకుని పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. -
లోన్ తీసుకోకుండానే ఇల్లు కొనే చిట్కా!
ఇల్లు కొనడం సామాన్యుడి కల. ఈ కల నెరవేర్చుకోవడం కోసం చాలామంది జీవితాంతం కష్టపడుతుంటారు. కొందరు డౌన్‌పేమెంట్‌కు సరిపడా డబ్బు సంపాదించి మిగతాది లోన్ ద్వారా తీరుస్తుంటారు. అయితే హోంలోన్ వ్యవధి చాలా ఏళ్లు ఉంటుంది. ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసినా ఏటా దాని విలువ తగ్గిపోతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలాగని ఇల్లు కొనకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చిన్న చిట్కా పాటించి ఎలాంటి లోన్ అవసరం లేకుండా పదేళ్ల తర్వాత ఇల్లు కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మీరు కొనలనుకునే ఫ్లాట్ ధర రూ.50,00,000 అనుకుందాం. అందులో రూ.10 లక్షలు డౌన్‌పేమెంట్ కట్టేందుకు సిద్ధంగా ఉంటే మరో రూ.40 లక్షలు లోన్ తీసుకోవాల్సిందే కదా. ముందుగా మీ దగ్గరున్న రూ.10 లక్షలు ఏటా 15 శాతం వృద్ధి చెందే మ్యుచువల్ ఫండ్స్‌లో పదేళ్లపాటు లమ్సమ్(ఒకేసారి పెట్టే పెట్టుబడి) ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాంతో రూ.40.4 లక్షలు సమకూరుతాయి. ఒకవేళ రూ.40 లక్షలు లోన్ తీసుకుని ఇప్పుడే ఇళ్లు కొనుగోలు చేస్తే 20 ఏళ్ల వ్యవధికిగాను 9 శాతం వడ్డీ లెక్కిస్తే నెలవారీ ఈఎంఐ రూ.36 వేలు చెల్లించాలి. అందులో నుంచి రూ.10 వేలు ప్రస్తుతం ఉంటున్న ఇంటి కిరాయికి కేటాయించండి. మిగతా రూ.26 వేలు క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా 14 శాతం వడ్డీ సమకూరే మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. దాని ద్వారా మొత్తం రూ.68 లక్షలు సమకూరుతాయి.ఇదీ చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మందిలమ్సమ్ పెట్టుబడి పెట్టిన రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షలు, ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సిన రూ.26 వేల నుంచి పదేళ్ల తర్వాత రూ.68 లక్షలు కలిపి మొత్తం మీ చేతిలో రూ.1.08 కోట్లు ఉంటాయి. రియల్ఎస్టేట్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించినా ఆ డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పదేళ్ల తర్వాత ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
డిజిటల్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగించే దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఉపాయ్ప్గిస్తున్నారు. అయితే పేమెంట్స్ చేసేటప్పుడు ఇది కొంత ప్రాసెస్‌తో కూడుకున్న పని. పిన్ ఎంటర్ చేయాలి.. ఆ తరువాత ట్రాన్సక్షన్ జరుగుతుంది.దీనిని మరింత సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీనిని చిన్న లావాదేవీలకు మాత్రమే ఉపయోగకోవాలి. ఎందుకంటే ఇందులో రూ. 2000 మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తయిన తరువాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ విధానానికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది.యూపీఐ ఆటో టాప్-అప్లావేదేవీల కోసం యూపీఐ లైట్ ఉపయోగిస్తుంటే.. అక్టోబర్ 31 తరువాత ఆటో టాప్ అప్ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. అంటే యూపీఐ లైట్లో ఆటో టాప్-అప్ ఆప్షన్ ఎంచుకుంటే.. అమౌట్ పూర్తయిన తరువాత మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా అమౌంట్ యాడ్ అవుతుంది. ఇది అక్టోబర్ 31 నుంచి అమలులోకి రానున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.నిజానికి యూపీఐ ట్రాన్సక్షన్ చేయాలనంటే పిన్ ఎంటర్ చేయాలి. కానీ యూపీఐ లైట్ ద్వారా రూ. 500 కంటే తక్కువ లావాదేవీలు జరపడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూపీఐ లైట్ ద్వారా జరిగే లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించవు. -
పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?
చిన్నపిల్లల చదువు, వివాహాలు ఇతర భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ అధీనంలో ఉండి స్థిరంగా వడ్డీ సమకూర్చే పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహించే వారికిసైతం నష్టం కలిగేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరిచిన వారికి ఈ నిబంధనల వల్ల నష్టం కలుగుతుంది. మైనర్ల కోసం తెరిచే పీపీఎఫ్ ఖాతాదారులపై ఈ ప్రభావం పడుతుంది. కొంతమంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు) దేశం విడిచి వెళ్లిపోయి, రెన్యూవల్ చేయకపోయినా తమ ఖాతా యాక్టివ్‌లోనే ఉంటుంది. అలాంటి వారి ఖాతాలను ఉపసంహరించుకునేలా విధానాల్లో మార్పులు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.మైనర్ పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరిస్తే గతంలో దాదాపు 7.1 శాతం వడ్డీ చెల్లించేవారు. అయితే ఇకపై పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు అనుగుణంగా వడ్డీ చెల్లిస్తారు. అంటే మైనర్‌కు 18 ఏళ్లు వచ్చేవరకు 4 శాతం వడ్డీ ఇస్తారు. తర్వాత పీపీఎఫ్ నిబంధనల ప్రకారం వడ్డీ పెంచుతారు.పిల్లల చదువులు, వివాహాల కోసం చాలా మంది తల్లిదండ్రులు వారి పేరుమీద పీపీఎఫ్ ఖాతా తెరుస్తున్నారు. అందులో స్థిరంగా వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. అయితే ఇకపై ఈ అవకాశం లేకుండా పోయింది.ఇప్పటికే ఒక పీపీఎఫ్ ఖాతా నిర్వహిస్తున్నవారు సైతం రెండు కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. పీపీఎఫ్ డిపాజిట్ల వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు ఉండడం దీనికి ప్రధాన కారణం. దాంతో ఎక్కువ ఖాతాలు తెరిచి అధిక వడ్డీ సమకూరేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే ఇకపై ఈ వ్యవహారం కొనసాగదు.ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహిస్తున్న ఖాతాదారులు ప్రాథమిక ఖాతా వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఖాతాల్లోని నగదును రూ.1.5 లక్షల పరిమితికి సర్దుబాటు చేస్తారు. అనంతరం ఇతర ఖాతాల్లో మిగిలిన నగదుపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ప్రస్తుత పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం(పన్ను ఉండదు)గా ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల వల్ల ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలున్నవారు ఈక్విటీ మార్కెట్లను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కనీసం పదేళ్లు స్థిరంగా పెట్టుబడి పెట్టేవారు మ్యూచువల్ ఫండ్లు ఎంచుకుంటే పీపీఎఫ్ కంటే అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే రాబడులపై ట్యాక్స్ మిగుల్చుకోవాలంటే ‘ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్’లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. పదిహేనేళ్ల కాలపరిమితితో గరిష్ఠంగా ఏటా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఏదైనా అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైతే ఖాతా తెరిచిన ఐదేళ్ల తర్వాత ఒకసారి నగదు ఉపసంహరణకు అవకాశం ఉంది. -
విదేశాలకు క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా..
విదేశాల వెళ్లాలనుకునేవారికి ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంటు వారి నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా అనే ప్రశ్న ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి సుందరకాండలో హనుమంతుడి జవాబులాగా ‘‘అక్కర్లేదు’’ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వివరాల్లోకి వెళదాం..ఈ మధ్యే ఆర్థిక శాఖ తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలో విదేశీయానం చేసేవారంతా ఆదాయపు పన్ను శాఖ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలనే అర్థం వచ్చేలా ధ్వనించింది. దీంతో అందరు పౌరులు ఉలిక్కిపడ్డారు. గాభరా పడ్డారు. షాక్ తిన్నారు. ఎందుకంటే, మనం చూస్తూనే ఉన్నాం. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులు చూసేందుకు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్వయంగా చూసేందుకు విదేశాలకు వెళ్తున్నారు.2023 మార్చి 31తో పోలిస్తే 2024 మార్చి 31 నాటికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 15 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 69.6 మిలియన్ల మంది విదేశీయానం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అన్ని రకాల వారూ ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఆపాటి, ఈపాటి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో విదేశీయానం చెయ్యని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.బడ్జెట్లో ఒక కొత్త మార్పు వచ్చింది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం మొదలైనవాటిని చూపించని ఎంతో మంది భారతీయ పౌరులు ఉన్నారు. బ్లాక్‌మనీ 2015 చట్టం ప్రకారం ఇలాంటి ఆస్తులను చూపించకపోవటం నేరం. ఇలాంటి వారి మీద దృష్టి పెడుతోంది డిపార్టుమెంటు. ఒకప్పుడు ఎవరు విదేశీయానం చేసినా, ప్రయాణానికి ముందు క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని నిబంధన ఉండేది. దాన్ని సడలించారు. రద్దు చేశారని చెప్పారు. అంతేకాకుండా 1/4 బిఅని 1/6 అని షరతులు ఉండేవి. ఒక షరతు ప్రకారం స్వయంగా విదేశీయానం చేయకపోయినా ‘టికెట్’ కొని ఉంటే రిటర్నుల్లో చూపించాల్సి వచ్చేది. కాలక్రమేణా సరడలింపుల వల్ల అంతా మర్చిపోయారు.కానీ మొన్న బడ్జెట్లో ఈ ప్రస్తావన రావడంతో అందరిలోనూ గుబులు.. కానీ నిబంధన కొంతమందికే వర్తిస్తుంది. తల్లిదండ్రులెవరూ భయపడక్కర్లేదు. డిపార్టుమెంటుకి వెళ్లక్కర్లేదు. సర్టిఫికెట్ తీసుకోనవసరం లేదు. రిలాక్స్.. రిలాక్స్.. అందరికీ ఇది అవసరం లేదు. మీరంతా నిశ్చింతగా ప్లాన్ చేసుకోవచ్చు.ఎవరికి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి..ఆర్థికపరంగా అవకతవకలు చేసినవారు, పది లక్షలు దాటి పన్ను చెల్లించాల్సిన వారు, ఈ పన్ను భారానికి ‘స్టే’ విధించకపోతే.. ఇటువంటి వారికి కావాలి. ఇది అరుదైన పరిస్థితి. అసాధారణ పరిస్థితి. ట్యాక్స్ చెల్లించకపోవడం నేరం. కట్టకుండా విదేశాలకు వెళ్లే వారి నుంచి .. అంటే డిఫాల్టర్ల నుంచి పన్ను వసూలు చెసే ప్రక్రియలో భాగంగా ఈ సర్టిఫికెట్ అడుగుతారు. పైన చెప్పిన రెండు షరతులు ఫిబ్రవరి 2004 నాడు జారీ చేసిన సూచన .. కాదు.. ఆదేశం అని అనాలి. అంటే 20 సంవత్సరాల మాట .. ఈ ఆదేశానికి, 2015 బ్లాక్ మనీ చట్టానికి లింకు కలిపారు. ఈ విషయాన్నే 2024లో ప్రస్తావించారు. ఇరవై సంవత్సరాల మాట .. ఇప్పుడు ప్రస్తావన తేవడంతో దురదృష్టవశాత్తూ ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది. ఏం గాభరాపడక్కర్లేదు.మీరు ఒక విజయ్ మాల్యాని .. ఒక నీరవ్ మోడీని ప్రస్తావించి గవర్నమెంటు మీద దుమ్మెత్తిపోయకండి. చట్టప్రకారం రిటర్ను వేయడం విధి. పన్ను చెల్లించడం తప్పనిసరి. ఆ దోవలో వెళ్తే మిమ్మల్ని ఎవరూ ఆపరు. అడ్డు చెప్పరు. ఆటంకపర్చరు. ఎయిర్‌పోర్టుకి ఎవరూ రారు. అయితే, ఒక సూచన. మీతోపాటు మీ పాన్‌కార్డు, మీరు అసెస్సీ అయితే లేటెస్ట్ రిటర్ను కాపీ పెట్టుకోండి. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపోయినా రిటర్నులు వేసే అవసరం లేకపోయినా.. అసెస్మెంట్ కాకపోయినా .. అసెస్మెంట్ ఆగిపోయినా 10 లక్షల లోపుల పన్నులు చెల్లించకపోయినా (మనలో మన మాట, బండి అంతవరకు పోనివ్వకండి) గాభరా పడక్కర్లేదు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. బాన్ వొయాజ్.. ఆల్ ద బెస్ట్. -
ఆర్థిక విజయాలకు గణేశుడి బాసట: భవిష్యత్తుకు బాటలు
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మనకు ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్పుతాడు. దారిలో ఉన్న అడ్డంకులను తొలగించి విజయాలకు మార్గం ఏర్పరుస్తాడు. ఇదే ప్రేరణతో మనం కూడా మ్యుచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌గా పెట్టుబడులు పెట్టే విషయంలో వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితమైనదిగా తీర్చిదిద్దుకోవడానికి బాటలు వేసుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ : శుభారంభంవినాయకుడు అంటే వివేకం, దూరదృష్టికి ప్రతీక. మన జీవితాల్లో ఎదురయ్యే విఘ్నాలను తొలగిస్తాడనే నమ్మకం. తగినంత డబ్బు లేకపోవడం లేదా ఆర్థిక భద్రతపరమైన సమస్యలతో మనలో చాలా మంది సతమతమవుతుంటారు. ఆర్థికపరమైన అడ్డంకులనేవి ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల వచ్చే సమస్యలని మనం గుర్తించాలి.వివేకవంతమైన నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించాలి. మనం పొదుపు చేసుకునే మొత్తాన్ని ద్రవ్యోల్బణం అనేది పగలు, రాత్రి చెదపురుగులా తినేస్తుంది కాబట్టి ఆర్థిక భద్రతకు పొదుపు ఒక్కటే సరిపోదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక భద్రతను సాధించాలన్నా, సంపదను పెంచుకోవాలన్నా మన పొదుపును అర్థవంతమైన విధంగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పటికప్పుడు లాభాలు వచ్చేయాలనే తాపత్రయంతో ట్రేడింగ్ టిప్స్, స్పెక్యులేటివ్ పెట్టుబడులపై ఆధారపడకుండా వివేకవంతంగా, క్రమం తప్పకుండా మ్యుచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు.తప్పిదాల నుంచి నేర్చుకోవడంగణేశుడి పెద్ద తల వివేకాన్ని, పాండిత్యాన్ని సూచిస్తుంది. దీన్నే పెట్టుబడులకు అన్వయించుకుంటే, గత తప్పిదాల నుంచి నేర్చుకుని, మెరుగైన ఇన్వెస్టర్లుగా మారే వివేకం కలిగి ఉండాలని అ ర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణ లేకపోవడం లేదా మరీ ఎక్కువ రిస్కులు తీసుకోవడం లేదా అస్సలు రిస్కే తీసుకోకపోవడం, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు. అయితే, దీనితో కుంగిపోకుండా, ఈ అనుభవాలన్నింటినీ విలువైన పాఠాలుగా భావించి, విజయాల వైపు బాటలు వేసుకోవాలి. ప్రొఫెషనల్ సలహా తీసుకోవడంవినాయకుడి పెద్ద చెవులు మనం చక్కని శ్రోతగా ఉండాలనేది సూచిస్తాయి. ఆర్థిక ప్రపంచం విషయాన్ని తీసుకుంటే అర్హత పొందిన ఫైనాన్షియల్ ప్లానర్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఇచ్చే ఆర్థిక సలహాలను స్వీకరించే ఆలోచనా ధోరణిని కలిగి ఉండాలని ఇది సూచిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా మీ డబ్బును సరైన విధంగా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చనేది ఆర్థిక సలహాదార్లు మెరుగైన సలహాలు ఇవ్వగలరు.జీవిత పాఠాలువినాయకుడి ఎడమ దంతం విరిగి ఉంటుంది. మహాభారతాన్ని రాసేందుకు వేదవ్యాసుడు అత్యంత వేగంగా రాయగలిగే సామర్థ్యాలు గల వినాయకుడి సహాయం తీసుకున్నట్లు మన పురాణాలు చెబుతాయి. ఒక దశలో రాస్తున్న ఘంటం విరిగిపోవడంతో గణేశుడు తన దంతాన్నే విరగగొట్టి దాన్నే ఘంటంగా ఉపయోగించి రాయడాన్ని కొనసాగించాడు. అలా వినాయకుడి పట్టుదల, నిబద్ధతతో మనకు మహోత్కృష్టమైన మహాభారతం అందింది. అద్భుతమైన ఆర్థిక లక్ష్యాలతో మొదలెట్టిన పెట్టుబడుల ప్రయాణంలోనూ ఎలాంటి ఆటంకాలు వచ్చినా వెరవకుండా క్రమానుగత పెట్టుబడులు పెడుతూ, నిబద్ధతతో ముందుకు సాగాలని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది.నెలకు కేవలం రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తూ వెడితే 20 ఏళ్లలో ఏకంగా రూ. 1 కోటి మొత్తాన్ని సమకూర్చుకునేందుకు (13 శాతం వడ్డీ రేటు అంచనా), అలాగే నెలకు రూ. 45,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలోనే అంత మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సిప్ సహయపడగలదు. కాబట్టి వాయిదాలు వేయకుండా సాధ్యమైనంత త్వరగా సిప్‌ను ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనాలను అత్యధికంగా పొందవచ్చు. సురేష్ సోని - సీఈవో, బరోడా బీఎన్పీ పారిబా ఏఎంసీ -
మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవంటే..
జీవిత బీమా విషయానికొస్తే మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఎంపిక ఉత్తమం? – జితేంద్రజీవిత బీమా పాలసీ కొనుగోలు చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం. ఆర్థికంగా తమపై ఆధారపడిన వారుంటే తప్పకుండా దీన్ని తీసుకోవాలి. తమకు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు కుటుంబ అవసరాలను ఆదుకుంటుంది. మనీబ్యాక్, యులిప్, పెన్షన్ ప్లాన్లు ఇవన్నీ హైబ్రిడ్ బీమా ఉత్పత్తుఉలు. ఇవి జీవిత బీమాతోపాటు పెట్టుబడుల ప్రయోజనాన్ని ఆఫర్ చేస్తుంటాయి. దీంతో చూడానికి ఆకర్షణీయంగా అనిపిస్తాయే కానీ, వాస్తవంలో కాదు. ఎందుకంటే ఈ తరహా పాలసీలు తగినంత జీవిత బీమా రక్షణను ఇవ్వవు.భారీ రక్షణ కోరుకుంటే ప్రీమియం చాలా ఖరీదుగా మారుతుంది. ఇక ఈ ప్లాన్లలో పెట్టుబడులపై రాబడులు చాలా తక్కువ. కనుక బీమా, పెట్టుబడులను వేర్వేరుగా నిర్వహించుకోవడం మంచిది. పెట్టుబడుల కోసం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా కోసం అచ్చమైన టర్మ్ ప్లాన్‌ను పరిశీలించాలి.హైబ్రిడ్ ప్లాన్లతో పోల్చి చూస్తే టర్మ్ ప్లాన్ల ప్రీమియం ఎంతో అందుబాటులో ఉంటుంది. 35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన పురుషుడికి రూ.కోటి కవరేజీకి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం రూ.15,000. చాలా మంది బీమా పాలసీని ఏజెంట్ లేదా బ్రోకర్ ద్వారా తీసుకుంటుంటారు. దీంతో వారు తమకు అధిక కమీషన్ లభించే హైబ్రిడ్ ప్లాన్లను అంటగడుతుంటారు.అచ్చమైన టర్మ్ ప్లాన్‌లో జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం రాదు. అలాంటివి టర్మ్ ప్లాన్లు అని సులభంగా గుర్తించొచ్చు. కేవలం పాలసీదారు మరణించిన సందర్భంలోనే ఈ ప్లాన్ల కింద పరిహారం అందుతుంది. కానీ, హైబ్రిడ్ ప్లాన్లు జీవించి ఉన్నా కానీ, చివర్లో కొంత మొత్తాన్ని వెనక్కిస్తాయి. ఇందుకోసం అవి అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవి? – వినయడెట్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ స్వల్పకాల అవసరాలకు ఉద్దేశించిన నిధులను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రక్షణ ఉంటుంది. అస్థిరతలు లేకుండా ఊహించతగిన ఆదాయం కోసం షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఎంపిక చేసుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్లకు షార్డ్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి సురక్షితమైనవి. స్థిరత్వంతోపాటు నిలకడైన రాబడులు అందిస్తాయి.డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటే.. ముందుగా ఆ విభాగంలోని పథకాల పనితీరు వివిధ వడ్డీ రేట్ల సైకిల్స్‌లో ఎలా ఉందన్నది విశ్లేషించండి. సంబంధిత ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని డెట్ పత్రాల క్రెడిట్ నాణ్యతను కూడా పరిశీలించాలి. నిర్వహణ ఆస్తుల పరంగా టాప్–10 డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో ఐసీఐసీఐ, కోటక్, ఎస్బీఐ పథకాలు మెరుగ్గా ఉన్నాయి. హెచ్ఎస్బీసీ ఇండియా ఎక్స్పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్హెచ్ఎస్బీసీ మ్యుచువల్ ఫండ్ కొత్తగా హెచ్ఎస్బీసీ ఇండియా ఎక్స్పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 19తో ముగుస్తుంది. ఉత్పత్తులు లేదా సర్వీసుల ఎగుమతుల వల్ల లబ్ధి పొందే సంస్థల షేర్లు, అలాగే ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తయారీ, ఆటోమొబైల్స్, పారిశ్రామికోత్పత్తులు, ఫార్మా, రసాయనాలు, టెక్స్టైల్స్, నిర్మాణం మొదలైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపార ఫండమెంటల్స్, పరిశ్రమ స్వరూపం, వేల్యుయేషన్, ఆర్థిక బలా లు వంటి అంశాల ప్రాతిపదికన షేర్ల ఎంపిక ఉంటుందని సంస్థ సీఐవో–ఈక్విటీ వేణుగోపాల్ మంగత్ తెలిపారు. కోటక్ నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా కోటక్ నిఫ్టీ ఇండియా టూ రిజం ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది సెప్టెంబర్ 16తో ముగుస్తుంది. నిఫ్టీ500లో ట్రావెల్, టూరిజం థీమ్ ఉన్న షేర్లను ఎంచుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ఇండెక్స్‌లోని ఒక్కో స్టాక్‌కి వెయి టేజీ ఉంటుంది. పర్యాటక రంగానికి చోదక విభాగాలు ఇందులో ఉంటాయి. విహారయాత్రలు, వ్యాపార సంబంధ ప్రయాణాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందవచ్చని సంస్థ ఎండీ నీలేశ్ షా తెలిపారు. యూటీఐ నుంచి రెండు ఇండెక్స్ ఫండ్ ఆఫర్లుయూటీఐ ఫండ్ 2 ఇండెక్స్ ఫండ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూటీఐ నిఫ్టీ ప్రైవేటు బ్యాంక్ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ200 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ ఆఫర్లను (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఇండెక్స్ ఫండ్ నిర్వ హణలో తమకున్న విస్తృతమైన అనుభవంతో తక్కువ వ్యయాలతో కూడిన అత్యధిక నాణ్యమైన పెట్టుబడుల ఆప్షన్లు అందిస్తున్నట్టు ఫండ్ పేర్కొంది. యూటీఐ నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్ఫండ్ అన్నది ఇదే సూచీలోని స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ 2 పథకాల ఎన్‌ఎఫ్‌వోలు 16న ముగుస్తాయి. కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ లేదు.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్