Fashion
-
ఫ్యాషన్.. ప్రయాణం.. ఒరు పెన్!
అభిరుచినే వృత్తిగా చేసుకునే అవకాశం కొందరికే దొరుకుతుంది. ఆ కొందరిలో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ ప్రజన్య ఆనంద్‌ను చేర్చవచ్చు! అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలకు రూపం ఇస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తన సిగ్నేచర్‌ను క్రియేట్ చేసుకున్న ఆమె గురించి..చెన్నైకి చెందిన ఒరు పెన్ (ఒక వనిత) ప్రజన్య. ఆమెకు ఫ్యాషన్ అన్నా, ప్రయాణాలు అన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు తన తోబుట్టువులకు, ఫ్రెండ్స్‌కి రకరకాల జడలువేసేది. మేకప్ చేసి వాళ్లను మురిపించి, తాను మురిసిపోయేది. ఊహ తెలిశాక ప్రయాణాల్లోని మజాను ఆస్వాదించసాగింది. కాలేజ్ డేస్ నుంచి సోలో ట్రావెల్‌ను స్టార్ట్ చేసింది. అలా ప్రయాణాల్లో తనకు పరిచయమైన కళలు, తెలుసుకున్న సంస్కృతి, కనిపించిన ఒరవడి అన్నిటితో స్ఫూర్తి పొంది సరికొత్త డిజైన్స్‌కు రూపమిచ్చేది. అప్పుడనుకుంది తన కాలింగ్ ఫ్యాషనే అని! సెకండ్ థాట్ లేకుండా పర్ల్ అకాడమీలో చేరింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర ఇంటర్న్‌గా జాయిన్ అయి పనిలో మెలకువలను నేర్చుకుంది. తర్వాత అవకాశాల వేట మొదలుపెట్టింది. నాలుగేళ్లు ఫ్యాషన్ ఇండస్ట్రీ కారిడార్లోనే గడిపింది. అవకాశాలను అందుకోవడం అంత సులువుకాదని గ్రహించింది. దాంతో దాన్నో సవాలుగా తీసుకుంది. ప్రతి అడ్డంకిని లక్ష్యానికి మెట్టుగా మార్చుకుంది. ఆ పట్టుదలకు చాన్స్‌లు చలించి.. ప్రజన్య చెంత చేరాయి. తన డిజైన్స్కున్న ప్రత్యేకతను చూపింది. కాస్ట్యూమ్స్‌లోనే కాదు జ్యూల్రీ, మేకప్, హెయిర్ స్టయిల్.. ఇలా స్టయిలింగ్కి సంబంధించిన ప్రతి రంగంలోనూ తనకున్న పట్టును ప్రదర్శించింది. నాలుగేళ్ల నిరీక్షణ విలువేంటో చాటింది. ‘ప్రజన్య’ పేరుతో లేబుల్నూ లాంచ్ చేసి, బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తన అద్భుతమైన డిజైన్స్‌తో ఐశ్వర్యా రాయ్, నయనతార, హృతిక్ రోషన్ల మెప్పు పొందింది. ఇంకెందరికో అభిమాన స్టయిలిస్ట్ అయింది. ‘డిజైన్డ్ స్టూడియో’ పేరుతో ఫ్యాషన్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వటమూ ప్రారంభించింది. ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్స్‌ను కూడా నిర్వహిస్తోంది ప్రజన్య. -
పగడాలను ఎలా భద్రపర్చాలి? అసలు, నకిలీ ఎలా గుర్తించాలి?
జాతిరత్నాల్లో రాణిగా ముత్యాన్ని చెబుతారు. పగడాన్ని అందమైన రత్నంగా వ్యవహరిస్తారు. ఇది కూడా ముత్యంలాగానే సముద్రంలోనే ఆవిర్భవిస్తుంది. అయితే ముత్యాన్ని సముద్రంలో తయారయ్యే పద్ధతిలోనే బయట కూడా కల్చర్ చేయవచ్చు. పగడానికి అలాంటి అవకాశం లేదు. అందుబాటులో ఉన్న పగడాల్లో కొన్ని అసలైనవి, కొన్ని నకిలీవి. ఇందులో కల్చర్డ్ కోరల్ అనేది ఇంత వరకు లేదు. సముద్రపు మొక్క నుంచి పగడం తయారవుతుంది. పగడంలో ఎరుపు, గులాబీరంగు, ఆరెంజ్, బ్రౌన్‌తో పాటు వైట్, ఎల్లో, గ్రీన్, పర్పుల్, బ్లాక్ కోరల్స్ కూడా ఉంటాయి. పగడం అసలుదా నకిలీదా అని తెలుసుకోవడానికి టర్మరిక్ టెస్ట్ సులువైన పద్ధతి. పగడం మీద పసుపు కొమ్ముతో రుద్దాలి. అప్పుడు పగడం మీదున్న ఎరుపు రంగు పగడాన్ని వదిలి పసుపు కొమ్ముకి రంగు అంటితే అది నకిలీ పగడం. అసలు పగడం మీద పసుపు కొమ్ముతో ఎంత రుద్దినా పగడం రంగు వదలదు, పసుపు కొమ్ముకి రంగు అంటదు. స్వచ్ఛమైన పగడాన్ని ధరిస్తే అది మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతతనిస్తుంది. ఆధ్యాత్మిక చింతనకు దోహదం చేస్తుంది. డిప్రెషన్, స్ట్రెస్, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.పగడం చెట్టు నుంచి ఆవిర్భవించినది కాబట్టి ప్రాణం ఉన్న వస్తువులాగానే దీనికి గాలి అందుతుండాలి. ముత్యాలు, పగడాలను సుదీర్ఘకాలం గాలి అందని అలమారల్లో పెట్టరాదు. ముత్యాలు, పగడాల ఆభరణాలను ధరించడం వాటి మన్నిక కోసమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యం కోసం కూడా. సాధారణ పగడాల వరుస అయితే భద్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. బంగారంలో పొదిగిన ఆభరణాల విషయంలో ఆభరణం నుంచి రాలిపోకుండా ఉండడానికి మెత్తటి కుషన్ ఉన్న బాక్సుల్లో పెట్టాలి. నగధగలుపగడాలేం చెబుతున్నాయి – జియా నస్రీన్, జెమాలజిస్ట్ -
40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!
ఇటీవల అమ్మమ్మలు, అమ్మలు ధరించిన పెళ్లినాటి చీరలను సరికొత్తగా డిజైన్ చేయించుకుని ధరించడం ట్రెండ్‌గా మారింది. సరిగ్గా చెప్పాలంటే రెట్రో ఫ్యాషన్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు దీన్నే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ల పెళ్లి నాటి చీరలు, ఒకప్పుడు ధరించిన ఫ్యాషన్ వేర్లను కాస్త మార్పులు చేసి.. సరికొత్తగా కనిపించేలా ధరిస్తున్నారు. ప్రస్తుతం ఆ కోవలోకి ప్రిన్సెస్ అన్నే కూడా చేరిపోయారు. రాజ కుటుంబానికి చెందిన అన్నే ఈ ఫ్యాషన్‌కి మద్దతివ్వడం అందరిని విస్మయపరిచింది. ఇటీవల బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఖతారీ రాజకుటుంబానికి ఇచ్చిన ఆతిథ్యంలో తన తన అన్న ప్రిన్స్ చార్లెస్ IIIతో కలిసి అన్నే కూడా భాగమయ్యారు. ఆ ఆతిథ్యంలో అన్నే 40 ఏళ్ల నాటి క్రీమ్ గౌనుతో ఆకట్టుకుంది. ఆమె ధరించి డిజైనర్‌వేర్ చూస్తే ఇటీవలే డిజైన్ చేసినట్లుగా చూడముచ్చటగా కనిపిస్తుంది. కానీ ఇది నలభైఏళ్ల నాటిది. ఈ గౌనులో 1985 నాటి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తొలిసారిగా కనిపించారు. అప్పుడు ఆమె వయసు 35 ఏళ్లు. మళ్లీ ఇన్నేళ్లకు ధరించినా.. ఆమె ఒంటికి చక్కగా సరిపోవడమే గాక అలనాటి అందాల అన్నేని జ్ఞప్తికి తెచ్చింది. ఆ డిజైనర్‌వేర్‌కి తగ్గట్టుగా డైమండ్‌తో పొదగిన ఆక్వామెరైన్ పైన్ఫ్లవర్ కిరీటం రాయల్టీని తెలియజేస్తుంది. ఈ కిరీటాని అన్నేకి దివగంత అమ్మమ్మ బహుమతిగా ఇచ్చారు. దుస్తులు కూడా వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న తరుణంలో అందరిని ఆకర్షించే విధంగా..ఓ ఉద్యమంలా తీసుకొచ్చిన ఈ రెట్రో ఫ్యాషన్‌లో రాజకుటుంబికులు కూడా తమ వంతుగా భాగస్వామ్యం కావడం విశేషం. ఓ సామాన్యురాలి వలే ఏళ్ల నాటి డిజైనర్ గౌనుతో కనిపించి.. రాజదర్పానికి అసలైన అర్థం ఇచ్చి.. అందరిచేత ప్రశంసలందుకుంది.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
అద్దాల మిలమిలల్లో పెళ్లికూతురి లుక్ వైరల్
ప్రముఖ స్టైలిస్ట్ ఆకృతి సెజ్పాల్ డ్రీమ్ వెడ్డింగ్ నెట్టింట ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ధరించిన ముసుగు, లెహంగా అతిథులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా మొత్తం అద్దాలతో తయారు చేసిన లెహెంగాలో వధువు ‘ఆకృతి’ మరింత ఆకర్షణగా నిలిచింది.వధువు ఆకృతి సెజ్పాల్ 3డీ డిజైన్, పూర్తిగా పూలతో చేసిన పెళ్లి కూతురు వేసుకునే మేలి ముసుగులను చూశాం. కానీ పూర్తిగా మిర్రర్ వర్క్‌తో రూపొందించడం విశేషంగా నిలిచింది. లెహెంగాకు తోడుగా ఏమాత్రం క్లాత్ వాడకుండా తయారు చేసిన దుపట్టా కమ్ మేలి ముసుగుతో పెళ్లి కళతో కళకళలాడింది ఆకృతి. ఇంకా స్వీట్హార్ట్-నెక్లైన్ బ్లౌజ్, హెవీ లెహంగా స్కర్ట్, ఓపెన్ హెయిర్‌స్టైల్‌పై పిన్ చేసిన షీర్ దుపట్టాలో అందంగా మెరిసిపోయింది. చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ జుమ్కీలు, పాపిట బిళ్లతో తన లుక్‌ను మరింత అద్భుతంగా ముస్తాబైంది.< View this post on Instagram A post shared by Itrh (@itrhofficial)br> -
ఫిట్.. సెట్..
సొగసైన శరీరాకృతి అందరూ కోరుకుంటారు. అయితే దానికి మన వంతుగా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎవరైనా నిత్యం వ్యాయామం చేస్తూ, జిమ్ ట్రైనర్స్ సూచనలు పాటిస్తే మెరుగైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. దీనికి ఆహారపు అలవాట్లు, శరీరతత్వం, ఉద్యోగ సమయం, ఆరోగ్యం పరిస్థితులు, తదితర అంశాలు సైతం శరీరంపై ప్రభావం చూపిస్తాయి. నగరంలో యువత, మహిళలు అధిక శాతం మంది జిమ్ బాట పడుతున్నారు. ఇందులో కొంత మంది ప్రాథమిక వ్యాయామానికే పరిమితం అవుతుండగా, మరికొంత మంది మాత్రం తమ శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలపై దృష్టి పెడుతున్నారు. ట్రైనర్స్ ఏం చెబుతున్నారు? ఎలాంటి డైట్ పాటించాలి? తెలుసుకుందాం..! నగర యువత అత్యధిక శాతం మంది తమ శరీరాకృతిని ఆరు పలకల ఆకృతిలోకి మార్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పొట్ట ప్రదేశంలో అనవసరమైన కొవ్వులను కరిగించుకోడానికి ఆబ్డామిన్ స్ట్రెచ్చెస్, క్రంచెస్ వంటి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పొట్ట భాగం సరైన ఆకృతిలోకి వస్తోంది. జంపింగ్ స్వా్కట్స్ చేయడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు. ఎత్తుకు సరిపడేంతగా సన్నబడడం, షోల్డర్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తున్నారు. శరీరంలో వృధాగా పేరుకుపోయే కొవ్వులు, కేలరీలను కరిగించేందుకు బర్పీస్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మౌంటెనింగ్, క్లైంబింగ్స్ వంటివి ఫ్లాట్ స్టొమక్ని అందిస్తాయి. డంబెల్స్‌తో డిఫరెంట్ సెట్స్.. చూడచక్కని షోల్డర్స్ కోసం డంబెల్స్‌తో వర్కౌట్ చేయాలి. బెంచ్ ప్రెస్ చేయడం వల్ల గుండె భాగంపై ప్రభావం కనిపిస్తుంది. చెస్ట్ కండరాలు స్పష్టమైన అమరికతో ఆకర్షిణీయంగా తయారవుతాయి. వీపు వైపు బలంగా, ఫిట్‌గా ఉండాలంటే పుల్ డౌన్, నడుము బలంగా తయారవడానికి డెడ్ లిఫ్ట్ వర్కౌట్ చేయాలి. ప్లాంక్ ఫోశ్చర్పై పరుగు తీస్తే గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామాలు ముఖ్యంగా భుజాలు, గుండె భాగం, కాళ్లపై ప్రభావం చూపిస్తాయి. మజిల్స్ బలంగా తయారై, శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుతుంది. మహిళలను వేధిస్తున్న అధిక బరువు.. ఇటీవలి కాలంలో జిమ్‌లకు వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పిల్లలు పుట్టిన తరువాత మహిళలు బరువు పెరుగుతున్నారు. ఇంట్లో సరైన వ్యాయామం లేకపోవడంతో వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బెల్లీఫ్యాట్ తగ్గించుకోవడం, గుండె భాగం ఫిట్‌గా ఉండటం, నడుము బలంగా తయారు కావడానికి వ్యాయామాలు చేస్తున్నారని ట్రైనర్స్ పేర్కొంటున్నారు.శరీరం దృఢంగా ఉండాలంటే.. శరీరం దృఢంగా, బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. అయితే బిజీ సిటీ లైఫ్‌లో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్ర అనేక అంశాలు శరీర పటుత్వంపై ప్రభావం చూపిస్తాయి. సరైన వ్యాయామం చేయకుంటే అనేక వ్యాధులకు మనం ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శరీరం ఫిట్‌గా ఉండేందుకు క్రాస్ ఫీట్, బరీ్పస్, జంపింగ్ తదితర వ్యాయామాలు చేయడం మంచిది. శరీర కండరాలు సరైన ఆకృతిలో పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారపు క్రమశిక్షణ అవసరం. బయట చిరు తిళ్లు, నూనె వంటకాలకు దూరంగా ఉండాలని జిమ్ ట్రైనర్స్ సూచిస్తున్నారు.శరీరం ఫిట్‌గా తయారైంది.. రెండేళ్లుగా నిత్యం జిమ్ చేస్తున్నాను. వారంలో కనీసం మూడు రోజులు 60 నుంచి 70 కిలో మీటర్ల వరకూ పరుగెత్తుతాను. గతంలో కిడ్నీలో స్టోన్స్, అల్సర్, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు బాధించేవి. వ్యాయామం చేయడం మొదలు పెట్టిన తర్వాత సుమారు 20 కిలోల వరకూ బరువు తగ్గాను. ఇప్పుడు శరీరం ఫిట్‌గా తయారైంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే రాష్త్ర స్థాయి పరుగు పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాను. – శ్రీశైలంగౌడ్, బండ్లగూడక్రమశిక్షణ అవసరం.. యువతలో ఎక్కువ మంది జిమ్ చేసే సమయంలో శరీరాకృతి కోసం అడుగుతున్నారు. పెద్దలు సాధారణ వ్యాయామాలపై దృష్టిసారిస్తున్నారు. మహిళలు సన్నబడటం, బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గించుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. డైట్ పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సమయం నడక, పరుగు తీయడం మంచిది. – సద్దాం, జిమ్ ట్రైనర్ -
రూ.1.43 కోట్ల డ్రెస్‌లో అదరగొట్టిన వ్యాపారవేత్త, మోడల్ మోనా పటేల్
ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త మోనా పటేల్ మరోసారి తన ఫ్యాషన్ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024కి హాజరైన మోలా పటేల్ వింటేజ్ సిల్వర్ కలర్ కార్సెట్‌ను ధరించింది. అంతేకాదు ఈ డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చింది మోనా పటేల్. ఈ సందర్బంగా తనదైన ఐకానిక్ స్టైల్లో, వింటేజ్ స్కర్ట్‌లో దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. క్రిస్టియన్ లాక్రోయిక్స్ హాట్ కోచర్ కలెక్షన్లోనిది ఈ డ్రెస్. దీన్ని వేలంలో సుమారు రూ. 1.43కోట్లు (169,828.65డాలర్లు) మోనాగానీ, ఆమె స్టైలిస్ట్ గానీ కార్సెట్‌ను కొనుగోలు చేసి ఉంటారని అంచనా. దీన్ని చేతితో దయారు చేశారు. దీనికి చక్కని ఎంబ్రాయిడరీని కూడా జతచేశారు. వేలకొద్దీ చేతితో కుట్టిన స్ఫటికాలు, భుజంపై ఉన్న సున్నితమైన సిల్క్ ఆర్గాన్జా పూసల సీతాకోకచిలుక, స్వరోవ్స్కీ పూసలు, స్ఫటికాలుతో తీర్చి దిద్దారు.మోనా 3డీ సీతాకోక చిలుకలను కైనెటిక్ మోషన్ ఆర్టిస్ట్ కేసీ కుర్రాన్ సహాయంతో స్వయంగా డిజైన్ చేసిందట. ఈ ఏడాది ప్రారంభంలో మెట్ గాలాలో తొలిసారి పాల్గొన్న మోనా పటేల్ ఐరిస్ వాన్ హెర్పెన్ కోచర్ బటర్ ఫ్లై మోడల్ డ్రెస్‌లో అందర్నీ కట్టిపడేసిన సంగతి తెలిసిందే. -
కేకుపుట్టించే టేస్ట్!
ప్రయాణం చేస్తూనే అల్పాహారం తీసుకోవాలనుకున్న ఓ యువ ప్రొఫెషనల్ దీని కోసం అరటి వాల్నట్ కేక్ తయారు చేసుకుంటాడు. బిజీగా ఉండే ఓ మోడ్రన్ మదర్.. చిన్నపిల్లల స్నాక్ బాక్స్ కోసం తన ప్యాంట్రీలో నిల్వ చేసిన ఫ్రూట్ పుడ్డింగ్ కేక్‌ని బయటకు తీసి రెడీగా ఉంచుతుంది. ఇలా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం నుంచి రాత్రి పూట ఆస్వాదించే బ్రౌనీస్ వరకూ.. కేక్స్ నగరవాసుల వేగవంతమైన డైలీ రొటీన్లో భాగం అయిపోయాయి. ఇక న్యూఇయర్‌ని, క్రిస్మస్లను మోసుకొచ్చే డిసెంబర్ నెలలో అయితే కేక్‌ల సందడికి హద్దే ఉండదని చెప్పాలి. కేకుల వినియోగంలో సౌలభ్యంతో పాటు వాటి రుచి కారణంగా చాలా మందికి ఆహారపరంగా ప్రాధాన్యత జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన సిటిజనులు హోమ్ బేకింగ్‌ను అలవాటు చేసుకున్నారు. అలా పదుల సంఖ్యలో పుట్టుకొచి్చన హోమ్ బేకర్స్.. ఆన్లైన్ వేదికగా అనేక మందికి వీటిని చేరువ చేశారు. దీంతో ఈ డెజర్ట్ సిటిజనులకు మరింత ఇష్టమైన ఆహారంగా మారింది. హాట్ కేక్.. ఈట్ రైట్.. సిటీలో విరివిగా వినియోగంలో ఉన్నవాటిని ప్యాకేజ్డ్ కేకులు: ఆరి్టసానల్ కేక్‌లుగా విభజించవచ్చు. వీటిలో స్పాంజ్ కేక్‌లు, కప్ కేక్‌లు, చీజ్ కేక్‌లు, కేక్ పాప్స్ వంటివి వేగంగా తినే పని ముగించాలనుకునేవారికి ఇష్టమైనవిగా మారాయి. దీనికి తోడు పలు బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న వివిధ రుచులు ఆకట్టుకునే ప్యాకేజ్లతో మరింతగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్లెయిన్ స్పాంజ్ కేకులు, ఫ్రాస్టెడ్ ఐసింగ్, స్విస్ రోల్స్, ఫ్రూట్ ఫిల్డ్ మఫిన్ల వరకు అందుబాటులో ఉన్న అనేక రకాల ప్యాకేజ్డ్ కేక్‌లకు డిమాండ్ బాగా ఉంది. గులాబ్ జామూన్, రస్మలై కేకులు లేదా ఫిర్ని తిరమిసు ఇలా బ్రెడ్ తయారీదారులు మన రుచులతో పాశ్చాత్య డెజర్ట్‌లను చొప్పిస్తున్నారు. పండుగలకూ పసందే.. పుట్టిన రోజులు లేదా వివాహాలతో పాటు కేక్ సంప్రదాయం భారతీయ పండుగలకు కూడా విస్తరించింది. రాఖీ, దీపావళి భాయ్ దూజ్ వంటి పండుగలు సంప్రదాయ స్వీట్లు – బహుమతులతో పాటు కేక్‌లను బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయ స్వీట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నప్పటికీ, కేక్‌ను బహుమతిగా ఇవ్వడం అనేది కూడా క్రమక్రమంగా ఊపందుకుంటోంది. అలా ఇచ్చి పుచ్చుకోవాలనుకునేవారి కోసం రిచ్ ప్లమ్ కేక్, విక్టోరియన్ ప్లమ్ కేక్, చాకొలెట్ ఐసింగ్ కేక్, వెనీలా ఐసింగ్ కేక్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కేక్, క్యారామిల్ కేక్, చాకొలెట్ ఆల్మండ్ కేక్.. వంటì వెన్నో.. సిటీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఊపుతెచ్చిన.. ఈ–కామర్స్ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కొన్ని గంటల్లో ఫ్యాన్సీ కేక్‌లను పంపడం/స్వీకరించడం çసర్వసాధారణమైపోయింది. కేక్ గిఫ్టింగ్ కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసి, బహుమతిగా పంపే సౌలభ్యంతో కేక్‌ల విక్రయాల్లో 12–15% పెంపునకు ఈ సైట్లు కారణమయ్యాయని అంచనా. ప్రముఖ ఆన్లైన్ బేకరీ రిటైల్ చైన్ అయిన విన్నీ విక్రయాల తీరు రాఖీ, భాయ్ దూజ్ లేదా దీపావళి వంటి పండుగల సమయంలో డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఏతావాతా ప్లాట్‌ఫారమ్‌ల వెల్లువ కేక్ గిఫ్టింగ్ మార్కెట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాఖీ, భైదూజ్ దీపావళి వంటి పండుగల సమయంలో కేక్ విక్రయాల దాదాపు 20% వృద్ధి రేటును చూసింది. సోషల్.. సోస్టైల్.. డిజైనర్ కేక్స్ హవాకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. ఆకర్షణీయమైన వెరైటీలను సోషల్ వేదికలపై ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్లు తాజా కేక్ డిజైన్లను క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కేక్‌ల వైపు వినియోగదారుల చూపు మళ్లేలా చేస్తున్నారు. పరిశ్రమ నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో కేక్ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా 20శాతం వరకూ పెరుగుతోందట.సందర్భమేదైనా.. సందడి కేక్స్దే.. ఒకప్పుడు కేక్స్‌ను కేవలం బర్త్‌డేలకు మాత్రమే ఎక్కువగా వినియోగించేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్లతో పాటు ఇప్పుడు ఇవి విభిన్న సందర్భాలకు విస్తరించాయి. చిన్నారుల పుట్టిన రోజుల్ని ప్రతినెలా జరపడం దగ్గర నుంచీ వివాహ వార్షికోత్సవాల దాకా అలాగే కొత్తగా జాబ్‌లో చేరడం దగ్గర నుంచీ ప్రమోషన్స్, పదవీ విరమణ దాకా.. ఇలా అనేకానేక సందర్భాలకు కేక్స్‌ను వినియోగించడం జరుగుతోంది. పైనాపిల్ కేక్, బటర్‌స్కాచ్ కేక్, ఛీజ్ కేక్, బిస్కోటి కేక్.. తదితర వెరైటీలకు ఫుల్ డిమాండ్ ఉంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ -
నేడు శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టాకీస్ ప్రకటించింది. మై మ్యూజిక్, మై కంట్రీ అందిస్తున్న రెండో లైవ్ షో కోసం శ్రేయా ఘోషల్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, అరిజిత్ సింగ్ వంటి ప్రముఖులు హోస్టింగ్ చేయనున్న ఈ ఈవెంట్లో సంగీతం, ఆహారం, వినోదం వంటి మరపురాని జ్ఞాపకాలను అందిస్తుందని తెలిపారు. -
కుంచె గీసిన చిత్రం..
నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్ పిల్లర్లు, అండర్ పాస్ గోడలు కలర్ ఫుల్ పెయింటింగ్స్‌తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాల్ పెయింటింగ్స్‌తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్ వంతెన, అండర్ పాస్ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్కో రకమైన థీమ్‌తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్ డ్యాన్సర్స్ చిత్రాలు తీర్చిదిద్దారు. ఫ్లెక్సీ ప్రింటింగ్‌తో ముప్పు..ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.36 ఏళ్లుగా ఇదే వృత్తి..1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్ పెయింటింగ్స్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – అశోక్, కళాకారుడు, హయత్నగర్ఆరు నెలలు పని కలి్పంచాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే సమాజంలో డిమాండ్ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. – సత్యం, కళాకారుడు, హయత్‌నగర్ -
నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!
కొన్ని చీరలు మన భారతీయ హస్తకళా నైపుణ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. కాలాలు మారుతున్న వాటి ఉనికి ప్రకాశవంతంగా నిలిచే ఉంటుంది. ఎన్నో వెరైటీ డిజైన్లు వచ్చినా.. పురాతన హస్తకళతో కూడిన చీరలే అగ్రస్థానంలో అలరారుతుంటాయి. తరతరాలు ఆ చీరలను ఆదరిస్తున్నే ఉంటారు. అలాంటి చీరల కళా నైపుణ్యానికి సెలబ్రిటీలు, ప్రముఖులు దాసోహం అంటూ వాటిని ప్రోత్సహిస్తూ భవిష్యత్తు తరాలు తెలసుకునేలా.. ఆ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు కూడా. అలాంటి 900 ఏళ్ల నాటి హస్తకళా నైపుణ్యానికి పేరుగాంచిని పటోలా చీరల విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి సైతం ఈ చీరలంటే మహా ఇష్టం. ఆ మక్కువతోనే ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించిన చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహంలో ఈ చీరలనే అతిధులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతలా కట్టిపడేసేలా ఆ పటోల చీరల్లో ప్రత్యేకత ఏముందంటే..?ఎక్కడ నుంచి వచ్చాయంటే..ఈ పటోలా చీరలు గుజరాత్‌లోని పటాన్ ప్రాంతం నుంచి వచ్చాయి. ఈ చీరలు శక్తిమంతమైన రంగుల కలయికతో క్లిష్టమైన డిజైనలతో ఉంటాయి. ఈ చీరల తయారీ అనేది శ్రమతో కూడిన హస్తకళ అని చెప్పాచ్చు. అంబానీల ఇంట జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత నుంచి వీటి అమ్మకాలు బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చాలామంది మగువలు ఏరికోరి ఈ పటోలా చీరలను తెప్పించుకుని మరీ కొంటున్నారు. ప్రత్యేకతలు..పటోలా చీర తయారీ అంత ఈజీ కాదు. తొందరగా అయ్యిపోయే పనికూడా కాదు. ప్రతిభాగానికి దాదాపు పది నుంచి పన్నెండు మంది కళాకారుల బృందంతో సుమారు ఆరు నెలల శ్రమ ఫలితం ఈ చీరలు. చక్కటి పట్టు దారాలతో నేసిన చీరలివి. భారతదేశ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించేలా చక్కటి మనికతో ఉంటాయి. వీటి సరిగ్గా వాడితే శతాబ్దం వరకు చెక్కు చెదరవట. అయితే ఈ పటోలా చీరలను మాములు పద్ధతిలో వాష్ చేయకూడదు. వీటిని డ్రై-క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి..పటోలా చీరల కీర్తీ సరిహద్దులు దాటి..జర్మనీ, యూఎస్ఏ, రష్యా వంటి దేశాల అభిమానం కూడా సంపాదించుకుది. బనారసీ చీరల తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న సాంప్రదాయ వస్త్రాలలో ఇవి ఒకటి. అయితే వీటి ధరలు ప్రారంభ ధర రూ. 10 వేల నుంచి మొదలై దాదాపు ఏడు లక్షలుదాక పలికే లగ్జీరియస్ చీరలు కూడా ఉన్నాయి. (చదవండి: ప్రమాణ స్వీకారంలో కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?) -
ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్‌లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్‌తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్‌లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్‌ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్‌లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్‌సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు. అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది. ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.(చదవండి: ఫేస్ యోగా"తో..సెలబ్రిటీల మాదిరి ముఖాకృతి సొంతం!) -
క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను.. వెరీ ఇంట్రెస్టింగ్!
బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II పెళ్లి నాటి గౌను వెనుక చాల పెద్ద కథ ఉంది. ఆమె 1947 నవంబర్ 20న ప్రిన్స్ ఫిలిప్‌ని వివాహం చేసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. దీంతో బ్రిటన్ దేశం ప్రజలు పొదుపు పాటించేలా గట్టి చర్యలు తీసుకుంది. అంటే ఆ సమయంలో ఎలాంటి ఫంక్షన్లకు విలాసవతంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. ఇది బ్రిటన్ రాజ వంశానికి కూడా వర్తిస్తుందట. ఎందుకుంటే యథా రాజా తథా ప్రజాః అన్న ఆర్యోక్తి రీత్యా బ్రిటన్ రాజవంశానికి కూడా పొదుపు పాటించక తప్పలేదు. దీంతో అదే టైంలో రాణి ఎలిజబెత్ II వివాహం జరగనుండటంతో ఆమె దుస్తుల ఖర్చుల కోసం ఆ రాజవంశం ఎలా పొదుపు పాటించిందో వింటే ఆశ్చర్యపోతారు.దివంగత క్వీన్ ఎలిజబెత్ II వివాహం వెస్ట్మిన్స్టర్ అబ్బేలో ఘనంగా జరిగింది. రాణి వివాహ గౌనులో అత్యద్భుతంగా కనిపించింది. అక్కడకు విచ్చేసిన అతిధులందరి చూపులను ఆకర్షించింది. ఆమె గౌనుని బ్రిటన్ రాజ వంశానికి చెందిన ప్రముఖ ప్యాషన్ డిజైనర్ డచెస్ శాటిన్ రూపొందించారు. దీన్ని చక్కటి పూలు, ముత్యాలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అతని డిజైన్‌కి అనుగుణంగా వివాహ వెడ్డింగ్ హాలు పెయింటింగ్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆ గౌనుపై దాదాపు 10 వేలకు పైగా ముత్యాలను వినియోగించారు. సుమారు 14 అడుగుల పొడవుతో ఎంబ్రాడరీ డిజైన్‌తో తీర్చిదిద్దారు. అయితే ఈ డిజైనన్ని పెళ్లికి మూడు నెలల ముందుగా ఆమోదించింది రాజకుటుంబం. అందువల్ల ఆ డిజైన్‌కి అనుగుణంగా వెడ్డింగ్ డెకరేషన్‌ని ఏర్పాటు చేశారు. దీని ధర వచ్చేసి ఆ రోజుల్లే దాదపు రూ. 25 లక్షల ధర పైనే పలికిందట. అయితే రెండో ప్రపంచ యుద్ధం దృష్ట్యా పొదుపుకి పెద్ద పీట వేస్తూ బ్రిటన్ దేశం ఇచ్చిన రేషన్ కూపన్లను వినియోగించుకుని విలాసవంతంగా డబ్బులు వెచ్చించకుండా జాగ్రత్త పడిందట రాజ కుటుంబం. యుధ్దం కారణంగా బ్రిటన్ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఆహారం, బట్టలు, సబ్బులు వంటి కొన్ని వాటిని రేషన్ చేసింది. దీంతో రాజకుటుంబం ఆ రేషన్‌ని ఉపయోగించుకునే మన రాణి ఎలిబబెత్ పెళ్లి గౌనుని కొనుగోలు చేసిందట. తాము రాజవంశస్తులమనే దర్పం చూపక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది బ్రిటన్ రాజ కుటుంబం. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
500 కుక్కలు.. 100 పిల్లులు
సలుకి, బిచాన్ ఫ్రైజ్, అమెరికన్ బుల్లీ, హెయిరీ డాచ్‌షండ్ వంటి అరుదైన కుక్కలు నగరంలో సందడి చేశాయి. కుక్కలు, పిల్లుల పెట్ లవర్స్ కోసం ఆదివారం నగరంలోని నార్సింగి వేదికగా ఓం కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘పెడిగ్రీ ప్రో హైకాన్–24’ శునకాల ప్రపంచాన్ని నరవాసులకు పరిచయం చేసింది. ఈ ప్రదర్శనలో 500కు పైగా కుక్కలు, 100కు పైగా పిల్లులతో పాటు దాదాపు 5 వేల మంది పెట్ లవర్స్ పాల్గొన్నారు. హైదరాబాద్ కెనైన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన షోలో తెలంగాణ అడిçషనల్æ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ తన ఉమే గోల్డెన్ రిట్రీట్తో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ హరి చందన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్ డాగ్ షో, ఇండియన్ క్యాట్ క్లబ్ క్యాట్ షోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో టాప్ 10 బ్రీడ్ అవార్డ్లు అందించారు. ఇందులో మైనే కూన్స్ దేశీయ జాతి పొడవైన పిల్లి ధర రూ. 2.5 లక్షలు పైనే. మరో విదేశి జాతి బ్రిటిష్ షార్ట్హైర్స్ ధర రూ.1.2 లక్షల పై మాటే. వీటి ఆహారం, పెంపకం, సంరక్షణ తదితర అంశాకు చెందిన పరిశ్రమల స్టాల్స్ ఇందులో కొలువుదీరాయి. బ్రీడ్స్ నాణ్యత కాపాడాలి.. కుక్కల పెంపకం, సంరక్షణ పై అవగాహన కల్పించడమే లక్ష్యం. ఇందులో భాగంగా 150కి పైగా విభిన్న జాతుల నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలి. కరోనా సమయంలో చాలామంది జంతువులను దత్తత తీసుకున్నారు. కానీ కోవిడ్ ముగిసిన తర్వాత చాలా మంది విడిచిపెట్టడం బాధాకరం. – డాక్టర్ ఎం ప్రవీణ్ రావు, కెనైన్ క్లబ్ ప్రెసిడెంట్కుక్కలకూ సప్లిమెంట్లు.. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సప్లిమెంట్ ‘అబ్సొల్యూట్ పెట్’. భారత్‌లో నూతనంగా ఆవిష్కరించాం. చర్మ సమ్యలు, ఫుడ్‌పాయిజన్ తదితర సమస్యలకు మంచి ఫలితాలను అందిస్తుంది. – జాహ్నవి, అబ్సొల్యూట్ పెట్. -
నట్టింటి నుంచి.. నెట్టింటికి..
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని సినీ గేయ రచయిత ఆత్రేయ పాట అందరికీ తెలిసిందే.. అయితే ఆ పాటలో చెప్పిన విధంగా పెళ్లివారి నట్టింట్లో అచ్చం అలాంటి సందడే కొనసాగేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది.. పెళ్లి సందడి నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి చేరింది. దీంతో రకరకాల ఆధునిక పోకడలు ఈ తతంగంలో కనిపిస్తున్నాయి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా బ్రదర్ అని మరో కవి అన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యే విధంగా తతంగం నడుస్తోంది. పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ మొదలు, పెళ్లి అనంతరం జరిగే తతంగాల వరకూ అన్నీ సోషల్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిలో నేటి ఆధునిక పోకడలపైనే ఈ కథనం.. నేటి తరానికి ప్రతిదీ సెలబ్రేషనే.. సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రీవెడ్డింగ్, పెళ్లి వేడుకలు, పోస్ట్ వెడ్డింగ్, సీమంతం ఇలా ఒక్కటేమిటి ప్రతి సందర్భాన్నీ వీడియోలు, ఫొటోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా విభిన్నంగా, వినూత్నంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి సంబంధించిన పొట్టి వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల సరికొత్త ట్రెండ్ వచి్చంది. అదేంటంటే.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ వీడియోలు తాజాగా ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. సంతోషాన్ని పంచుకునేందుకు.. ఇటీవల తమ జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను ప్రపంచంతో పంచుకోవడం అలవాటైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పెడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపులకు సంబంధించిన అంశాలను చాలా గోప్యంగా ఉంచేవారు. అంతా సెట్ అయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్నీ గుర్తుంచుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు కారు దిగిన దగ్గరి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్న తతంగం మొత్తాన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. అటు పెళ్లి కొడుకు, ఇటు పెళ్లి కూతురు నవ్వుతూ సిగ్గు పడుతుంటే అదో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లి కొడుకు తరపు బంధువులు ఈ సందర్భంగా సరదాగా జరిపే మాటామంతీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సంభాషణలను ఆధారంగా చేసుకుని ఎన్నో ఫన్నీ వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తున్నారు. కామెంట్ల వెల్లువ.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను చక్కగా ఎడిటింగ్ చేసి, సూటయ్యే పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్‌చేసి అప్లోడ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు తెగ పాపులర్‌గా ఉండేవి. ఇటీవల కాలంలోనే మన దగ్గర కూడా ఇలా పెళ్లి చూపుల వీడియోలు తీసి ఇన్‌స్ట్రాగామ్ వంటి వేదికల్లో పోస్టు చేస్తున్నారు. దీంతో మన దగ్గర కూడా ఈ రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రీల్స్ చూసిన వీక్షకులు కూడా నూతన వధూవరులకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు మాత్రం ఈ వీడియోలను చూస్తుంటే ‘పెళ్లి చేసుకుంటే బాగుండూ అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికీ ఈ ఏడాది పెళ్లి చూపుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. జాగ్రత్త అంటున్న నిపుణులు.. ఇటీవల చాలావరకూ ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్, బేబీ బంప్ వీడియోలు షూట్ చేసుకోవడం కామన్‌గా మారిపోయింది. అయితే ఏదైనా కానీ మితి మీరనంత వరకే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి అతిగా ప్రవర్తిస్తే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సెన్సేషన్ కోసమో.. వినూత్నంగా, విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనో వెరైటీగా షూటింగ్స్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోలు నేటి టెక్నాలజీ కారణంగా మిస్ యూజ్ అయిన సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం.. -
ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..
ఇటీవల విశ్వ సుందరి పోటీల్లో అందానికి అర్థం మారుతుందన్నట్లుగా విజేతలను నిర్ణయించారు నిర్వాహకులు. అందులో పాల్లొన్న అందాల బామ్మలు కూడా మచ్చలేని శరీరమే సౌందర్యం కాదని ఆత్మవిశ్వాసమే అసలైన అందమని చాటిచెప్పేలా పాల్గొని అందర్ని ఆశ్చర్యపరిచారు. అలానే ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కాలేజ్ యువత మాత్రమే ట్రెండ్ సెంట్ చేస్తారనుకుంటే పొరపాటే. క్రియేటివిటీ, అభిరుచి ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది ఎనిమిపదుల గ్రానీ. రెస్ట్ తీసుకునే వయసులో సరికొత్త ట్రెండ్ సృష్టించి ఔరా..! అని ప్రశంలందుకుంటోంది ఈ బామ్మ. ఇంతకీ ఎవరామె అంటే..జాంబియాలోని ఓ గ్రామానికి చెందిన 85 ఏళ్ల మార్గరెట్ చోలా అనే బామ్మకు ఫ్యాషన్ ఐకానిక్‌గా స్టార్డమ్ తెచ్చుకుంది. అందుకు సోషల్ మీడియానే కారణం. సరదాగా గ్రానీ సిరీస్ 'లెజండరీ గ్లామా'లో నటించింది. అందులో ఆమె వివిధ రకాల ఫ్యాషన్ గెటప్‌లతో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు ప్రపంచమంతటా మారు మ్రేగిపోయింది. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరితీమైన ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. ఆమె మనవరాలు డయానా కౌంబానే దీనంతటికీ కారణం. ఈ బామ్మ తన హై ఫ్యాషన్ వార్డ్ రోబ్‌తో సోషల్ మీడియాలో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. మొదట్లో ఇబ్బంది పడ్డ ఆ తర్వాత ఆ ఆధుని ఫ్యాషన్ డ్రెస్‌లకు అలవాటు పడిపోయింది బామ్మ చోలా. డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రతిదాంట్లోనూ ప్రత్యేక కేర్ తీసుకుంటుంది మనవరాలు కౌంబా. ఆమె కారణంగానే ఇంత అందంగా కెమెరాకు ఫోజులిస్తోంది ఈ ఎనభై ఐదేళ్ల బామ్మ. అంతేకాదండోయ్..టీ షర్ట్స్, జీన్స్ వేసినప్పుడు చక్కటి లుక్ కోసం చేతి గోర్లు కూడా పెంచుతోందట. ఇంతకముందు తన జీవితం ఎలా సాగిందనేది అంత గుర్తు లేదు. కానీ ఇప్పుడు తన మనవరాలి పుణ్యమా అని.. సరొకొత్త రూపంతో మీ ముందుకు వస్తుంటే అసలు జీవితం అంటే ఇది కదా..! అనిపిస్తోంది. కొత్తదనంతో అందంగా మలుచుకోవడమే లైఫ్ అని అంటోంది ఈ బామ్మ. అంతేగాదు ఆమె నటించిన సిరీస్ కూడా.. "మాకు కూడా కొన్ని కోర్కెలు ఉంటాయి..మేము కూడా ప్యాషన్‌కి తీసిపోం అనిపించేలా సీనియర్ సిటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేగాదు ఆ సిరీస్‌లో.. నలుగురు మనవరాళ్లు తమ గ్రానీలను అందంగా తీర్చిదిద్దే పనిని ఈ స్టైలిష్ బామ్మకు అప్పగించితే.. ఆమె ఎలా ట్రెండ్ సెట్ చేస్తుందనేది ప్రధాన ఇతివృత్తం. ఏదీఏమైన ఈ ఏజ్‌లో ఇలా ఫ్యాషన్‌గా తయారవ్వడం అంటే మాటలు కాదు. పైగా తన సరికొత్త రూపంతో అందరికీ ప్రేరణ కలిగించి, ఆదర్శంగా నిలిచింది బామ్మ చోలా. View this post on Instagram A post shared by Dee (@thevintagepoint_) (చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!) -
పియర్సింగ్ సర్వీస్ గురించి తెలుసా..! సానియా మీర్జా..
పియర్సింగ్ సర్వీస్ గురించి సిటీలో ఉండేవాళ్లకు బాగా తెలుస్తుంది. ఇటీవల చెవితో సహా బాడీకి రకరకాల జ్యువెలరీని కుట్టించుకుంటున్నారు. ఇలా పెట్టుకోవడం ఓ ట్రెండ్‌లా ఫీలవ్వుతోంది యువత. కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఇంట్లో ఉండే గృహిణుల వరకు అందరూ వీటిని ధరిస్తున్నారు. ఒకప్పుడు చిన్నిపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు తొమ్మిదో నెల లేదా సవంత్సరంలోపు చెవులు కుట్టించేవారు పెద్దవాళ్లు. పైగా అదొక పెద్ద హడావిడి తంతులా ఉండేది. కానీ ఇప్పుడు సింపుల్‌గా కానిస్తున్నారు. ఎలాంటి ఏడుపులు ఉండవు. రక్తం కారకుండా మంచి సాంకేతికతో కూడిన పరికరాలతో చక్కగా కుట్టేస్తున్నారు. అదికూడా ఇంట్లోనే హాయిగా కుట్టించుకోవచ్చు. దీన్నే ఆంగ్లంలో పియర్సింగ్ సర్వీస్ అని పిలుస్తారు. ఇటీవల సానియా కూడా ఈ సర్వీస్‌తో ఇంట్లోనే చెవుల కుట్టించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో సానియా దుబాయ్‌లోని తన ఇంటి నాలుగు గోడల మద్య ఓ సాంకేతిక నిపుణుడితో చెవులు కుట్టించుకున్నట్లు తెలిపింది. తన స్నేహితులు, సోదరి అనమ్ మీర్జాతో కలిసి మిరుమిట్లు గొలిపై స్టడ్ చెవిపోగులను కుట్టించుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన ఈ మధుర క్షణాన్ని వీడియోలో బంధించిన దానికి "పర్ఫెక్ట్ గర్ల్స్ నైట్ ఇన్" అనే క్యాప్షన్‌తో నెట్టింట పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సానియా తన చెవి అంతటా అద్దుతమైన చెవిపోగులను పెట్టుకుంది. View this post on Instagram A post shared by The PiercingSpot (@piercingspot)పియర్సింగ్ సర్వీస్:ప్రస్తుతం ఇది ఓ మంచి స్టైలిష్ వ్యాపారంలా సాగుతుంది. ఈ సర్వీస్‌తో నొప్పిలేకుండా చెవులు ఈజీగా కుట్టించుకోవచ్చు. కొందరు బాడీ అంతటా రకరకాలుగా కుట్టించుకుంటారు. జస్ట్ ఒక్క కాల్‌తో ఇంటికే నేరుగా వచ్చి సర్వీస్ అందిస్తారు. పైగా మనకు నచ్చిన చెవిపోగులను ఎంచుకుని మరీ పెట్టించుకోవచ్చు. ఇలాంటి హై రేంజ్ సర్వీస్ దుబాయ్, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులో ఉన్న జస్ట్ సాంకేతికతో స్టడ్చెవిపోగులు పెడతారంతే. అయితే ఈ అత్యాధునిక సర్వీస్‌లో మాత్రం ఫ్యాన్సీ, బంగారం లేదా వెండి చెవిపోగులను కూడా సెలెక్ట్ చేసుకుని మరి పెట్టించుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సర్వీస్ అందిచడమే గాక కనీసం రక్తం కూడా రాకుండా చాలా సింపుల్‌గా చెవులు కుట్టేస్తారు. View this post on Instagram A post shared by Anam Mirza (@anammirzaaa) (చదవండి: 'లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్'..!) -
సింపుల్ అండ్ గ్రేస్‌ఫుల్..!
‘డ్రెస్‌ని ఖరీదుతో చూడకూడదు. ఆ డ్రెస్ కలర్, ఫిటింగ్ మనకు ఎంత బాగా నప్పాయి... అనేవి చెక్ చేసుకొని తీసుకోవాలి’ అంటున్నారు హైదరాబాద్‌లోని భరత్‌నగర్ వాసి రాధ పర్వతరెడ్డి. తక్కువ బడ్జెట్లో డ్రెస్ డిజైనింగ్‌ని స్పెషల్‌గా, కంఫర్ట్‌గా, క్రియేటివ్‌గా ఎలా ప్లాన్న్ చేసుకుంటున్నారో వివరిస్తున్నారు.‘‘ఎంత సింపుల్‌గా రెడీ అయితే అంత గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాం. అందుకే నా వార్డ్ రోబ్‌లో ప్లెయిన్ శారీస్‌కు ఎక్కువ చోటు ఉంటుంది. ప్లెయిన్ సిల్క్ శారీస్ జాబితా ఎక్కువే ఉంటుంది. వాటిలోనూ లైట్ కలర్స్వే తీసుకుంటాను. వీటికి కాంట్రాస్ట్ కలర్లో ఉన్న కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేస్తాను. పొడవుగా ఉన్నవారికి ఈ కాంబినేషన్ చీరలు బాగుంటాయి. గెట్ టు గెదర్ పార్టీలకు ఈ స్టైల్ బాగా నప్పుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకునే సదుపాయం ఉంది. యూ ట్యూబర్ని కాబట్టి స్పెషల్ లుక్స్ కోసం ట్రై చేస్తుంటాను. ఈ కాంబినేషన్‌కి హెయిర్ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. నా జుట్టు పొడవుగా ఉంటుంది. శారీ కట్టుకుంటే మాత్రం జుట్టుకి ఒక చిన్న క్లిప్ పెట్టుకొని, మిగతా హెయిర్ అంతా లీవ్ చేస్తుంటాను. జుట్టు బాగుంటే డ్రెస్సింగ్ కూడా బాగుంటుంది కాబట్టి, హెయిర్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. చందేరీ స్పెషల్దుపట్టా పెద్దగా ఉండే చుడీదార్స్ అంటే ఇష్టం. వీటిలోనూ లైట్ కలర్స్కే పప్రాధాన్యత. రెడీ టు వేర్ ఉండే డ్రెస్సులు ఈ జాబితాలో ఉంటాయి. పండగల సమయాల్లో అయితే చందేరీ శారీస్ ఎంచుకుంటాను. చందేరీ చీరల రంగులు బాగుంటాయి. చూడటానికి ప్రత్యేకంగానూ ఉంటాయి. ఏ సంప్రదాయ వేడుకల్లోనైనా ఈ చీరలు బాగుంటాయి. బ్లౌజ్‌కి కొంచెం డిజైన్ ఉన్నా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నేను వీటికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్లనే మ్యాచ్ చేసుకుంటాను. చందేరీ చీరల్లో బ్రైట్ రెడ్, గ్రీన్ కలర్స్ ఎంచుకుంటాను. పెళ్లి వేడుకల్లో పట్టు చీరలు, లెహంగాలు ఎంచుకుంటాను. లెహంగాకు మ్యాచ్ చేయడానికి కొంచెం స్టైల్స్‌లో మార్పుకు క్రాప్‌టాప్స్, మ్యాచింగ్ దుపట్టాలు సెలెక్ట్ చేసుకుంటాను.ప్రింటెడ్ బ్లౌజులుబ్లౌజ్ డిజైన్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అనే విషయానికి చాలా దూరంగా ఉంటాను. ప్రింటెడ్ కాటన్ మెటీరియల్స్ చాలా రకాల డిజైన్లలో మార్కెట్లో లభిస్తున్నాయి. వీటితో శారీ లుక్ స్పెషల్ అనిపించేలా డిజైన్ చేయిస్తాను. షార్ట్ స్లీవ్స్, స్ట్రాప్స్ .. యంగ్ లుక్‌ని మరింత ఎలివేట్ చేస్తాయి.సౌకర్యమే ఫస్ట్... టూర్స్‌కి వెళ్లినప్పుడు సౌకర్యానికే పప్రాధాన్యత. గంటల సమయాన్ని ప్రయాణంలోనే గడపాలి. అందుకని జీన్స్‌కు బదులు జెగ్గింగ్స్, టీ షర్ట్స్, నైట్ డ్రెస్‌లకే ఓటు వేస్తాను. ఎక్కువ లైట్ కలర్స్‌కి పప్రాముఖ్యం ఇచ్చినా నాకు ఇష్టమైన కలర్ మాత్రం బ్లాక్. లైట్–బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు నా వద్ద చాలానే ఉన్నాయి’’ అంటూ తన డ్రెస్ సెలక్షన్, కలెక్షన్ గురించి వివరించారు రాధ. (చదవండి: బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నారా..? స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్న నిపుణులు) -
తిరా ఈవెంట్ : ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ, ఇషా: ఇక బ్యాగ్స్ అయితే!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఆరు పదుల వయసులోనూ స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని సైతం మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అంతేనా ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగాముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో జరిగిన ఈహై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో అంబానీ లేడీస్ తమ ప్రత్యేక నిలుపుకున్నారు. రిలయన్స్ బ్యూటీ వెంచర్ తిరా తన కొత్త స్టోర్‌ను ముంబైలో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఇషా అంబానీపిరామిల్ మెరిసే లావెండర్ పవర్ ప్యాంట్‌సూట్ అందన్నీ ఆకట్టుకోగా, నీతా అంబానీ, లూజ్ ప్యాంట్, చెకర్డ్ బ్లేజర్‌తో ప్రత్యేకంగా దర్శనమిచ్చింది. ముఖ్యంగా వారి బ్యాగ్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.నీతా అంబానీ పాప్‌కార్న్ బ్యాగ్నీతా అంబానీ పాప్‌కార్న్ పర్స్ స్పెషల్ ఎట్రాక్షన్.. రెసిన్, ఎనామెల్, ఇమిటేషన్ ముత్యాలు, గోల్డ్-టోన్ మెటల్‌తో తయారు చేశారట.ఇషా అంబానీ బో క్లచ్ఫ్యాషన్ గేమ్‌లో తగ్గేదే లేదు అన్నట్టుంది ఇషా అంబానీ చేతిలోని పర్స్. చిన్న వెండి విల్లు ఆకారపు క్లచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యూటీ రిటైల్ చైన్ అయిన తీరా ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ప్రారంభించింది. భారతదేశంలో ప్రీమియం బ్యూటీ షాపింగ్ డెస్టినేషన్ అని కంపెనీ ప్రకటించింది. ఈ విస్తారమైన 6,200 చదరపు అడుగుల స్టోర్‌లో టాప్ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్లతో హై-ఎండ్ రిటైల్ అనుభవాన్ని అందించనుంది. ఈ హై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో ఫ్యాషన్ క్రిటిక్ ఇన్ఫ్లుయెన్సర్, సూఫీ మోతీవాలా, పలువురు బాలీవుడ్ క్వీన్లు మెరిసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Limelight Nova (@limelightnova) ఇదీ చదవండి : పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
ఇండియన్ ట్రెడిషన్..ఫ్యాషన్ వాక్..
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే రీతిలో సాగిన ఫ్యాషన్ వాక్ ఔరా అనిపించింది. ఆయా రాష్ట్రాల వస్త్రధారణతో సాగిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ భావజాలమైన వారసత్వ చేనేత వ్రస్తాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన అవతరణ్–2024లో భాగంగా బుధవారం ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఎఫ్‌డీడీఐ(ఫుట్‌వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్)లోని ఫ్యాషన్ డిజైన్ విభాగం రెండో సంవత్సరం విద్యార్థులు ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలిచే చీర కట్టు, పంచెకట్టుతో ర్యాంప్‌పై విద్యార్థులు మెరిశారు. యువతులు వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. సాంఘిక సంస్కరణల చుట్టూ ఉండే సంప్రదాయ కథలలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో వ్రస్తాలను డిజైన్ చేశారని ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.తేజ్ లోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ మధుప్రియ ఝా ఠాకూర్, ఎల్జీఏడీ సీనియర్ ఫ్యాకల్లీ సి.వేణుగోపాల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బెస్ట్ డిజైనర్, బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయనున్నారు. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి విన్నారా..?. ఈ ఫ్యాబ్రిక్ ఒక మీటర్ ఖరీదే దాదాపు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. ఇది మార్కెట్లో దొరకడం కూడా కష్టమే. ఖరీదు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. ఏంటి ఈ ప్యాబ్రిక్ విశిష్టత..?. ఎందుకంత ఖరీదు అంటే..ఈ ఫ్యాబ్రిక్ ఉన్నిని దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాల్లో ఉండే వికునా అనే ఒక విధమైన ఒంటె నుంచి సేకరిస్తారట. అందువల్లే ఈ ఫ్యాబ్రిక్‌ని వికునా అని పిలుస్తారు. దీనితో టానీ అనే కోటులు డిజైన్ చేస్తారట. ఏదో గొర్రెల మాదిరి పెంపుడు జంతువుగా ఈ ఒంటెలను పెంచడం సాధ్యం కాదట. అలాగే ఈ ఒంటె నుంచి ఉన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సేకరించగలరట.అలాగే ఇవి తక్కువ ఉన్నినే ఉత్పత్తి చేస్తాయట. ఆండియాన్ ఎత్తైన పర్వతాల్లో ఉండే చలి నుంచి రక్షణగా ఆ ఒంటెలపై ఈ మృదువైన ఉన్ని ఉంటుందట. ఇది గాలిని ఏ మాత్రం చొరబడనీయకుండా శరీరానికి హత్తుకుపోయేల వెచ్చగా ఉంచుతుందట. అలాగే వికునాల నుంచి ఉన్నిని సేకరించడానికి చాలా సమయం పడుతుందట కూడా. అత్యంత జాగ్రత్తలు తీసుకుని చాలా ఓపికతో ఆ జంతువు నుంచి ఉన్నిని సేకరించాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఎవరు ధరిస్తారంటే..రాయల్టీకి చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్‌ని ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు ధరిస్తారు. అయితే ప్రస్తుతం స్పానిష్ ఆక్రమణతో ఈ జంతువుల అంతరించిపోయే జంతువులు జాబితాలో చేరిపోయిందని చెబుతున్నారు ప్యాషన్ నిపుణులు. అదీగాక ఈ జంతువుల పెంపకం సాధ్యం కానీ పని అయితే వాటి నుంచి ఉన్నిని సేకరించడం అనేది కూడా అత్యంత క్లిష్టమైన పని అందువల్లే ఈ ఉన్ని ఒక మీటరు ముక్క ధర సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందని చెబుతున్నారు ఫ్యాషన్ ఔత్సాహికులు.ఇప్పటి వరకు అత్యం లగ్జరియస్ ఫ్యాబ్రిక్‌లు అయిన మెరినో, కష్మెరె వంటి ఉన్ని దుస్తులు కంటే ఇదే అత్యంత ఖరీదైనది. అయితే మెరినో, కష్మెరె వంటివి అందుబాటులో ఉన్నంత ఈజీగా ఈ వికునా ఫ్యాబ్రిక్ ఉన్ని దొరకడం బహు కష్టం. ఈ ఉన్నితో చేసిన కోటు ధర రూ. 17 లక్షలకు పైనే ఉంటుందట. లోరో పియానా, బ్రియోని, కిటాన్తో సహా పలు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ హౌస్‌ల్లో ఈ వికునా కలెక్షన్స్ ఉంటాయట.(చదవండి: మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!) -
మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!
ప్రఖ్యాత క్లాసిక్ మిసెస్ ఆసియా ఇంటర్నేషల్ పేజెంట్ 2024లో భారత్ తరపున తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఏ విజయ శారదా రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీ ఈ నెల 13 నుంచి 19 వరకూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ ఏడాది మిసెస్ ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకున్న విజయ గతేడాది మిసెస్ ఇండియా– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను సూపర్ క్లాసిక్ కేటగిరిలో సొంతం చేసుకోవడంతో జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం ఆమె అసాధారణ ప్రతిభ, మహిళలను ప్రేరేపించే కృషికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో రంగాల్లో విజయకేతాలను ఎగురవేసిన విజయ రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు పొందడమే కాకుండా విద్య, వ్యాపార రంగాల్లో ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పేజెంట్ 2024లో ఆమె పాల్గొనడం దేశానికే గర్వకారణంగా పేర్కొనవచ్చు. అందం, విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ కాంటెస్టులో ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన వారు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. (చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి..!) -
కళింగలో పట్టు ప్రదర్శన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కళింగ కల్చరల్ హాలు వేదికగా ప్రతిష్టాత్మక ‘జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన’ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శణను రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ ఫౌండర్, ఆక్యుపేషనల్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళింగ కల్చరల్ హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూ్యమ్స్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సాతి్వక గుప్తా అన్నారు. ఈ సందర్భంగా చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి 75 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు.