delhi assembly elections
-
ఢిల్లీ సీఎం సస్పెన్స్‌కు నేడు తెర!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం సస్పెన్స్‌కు నేడు తెర పడనుంది. సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీ బీజేపీల్పీ(Delhi BJPLP) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల, పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. ఈ మేరకు అధిష్టానం అంతర్గత సంప్రదింపులు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత.. ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది అనే దానిపై స్పష్టత రానుంది.ఇక నేటి సమావేశంలో కొత్త సీఎం, మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా.. మాజీ సీఎం కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. అశీశ్ సూద్, రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నట్లు , రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. -
మోదీషా మంత్రాంగంతో ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్
-
ఆప్ ఓటమి.. ఢిల్లీ సచివాలయం సీజ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ఆప్ ఓటమితో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకెళ్లకూడదంటూ సచివాలయ అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని కూడా మోదీ తెలిపారు. ఫైల్స్, రికార్డ్స్ భద్రతపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల హ్యాట్రిక్ కల నెరవేరలేదు. బీజేపీ పైచేయి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ, 23 స్థానాల్లో ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు. -
బీజేపీ భారీ విజయం.. కాషాయ నేతల సంబరాలు
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మ్యాజిక్ ఫిగర్(36) మార్క్‌ను దాటేసింది. దాదాపు 45 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. మరికాసేపట్లో అధికారికంగా ఈసీ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.ఢిల్లీలో అధికార ఆప్ ఆశలకు బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ ఢిల్లీలో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. దాదాపు 45 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఏడు గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ రానున్నారు. పార్టీ అగ్ర నేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పూర్తి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. విజయం కోసం పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమించారు. ఢిల్లీ సమస్యల ఆధారంగా మేం ఎన్నికల్లో పోరాడాం. కానీ అరవింద్ కేజ్రీవాల్ సమస్యల నుంచి దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అవినీతికి పాల్పడిన కారణంగానే ఎన్నికల్లో కేజ్రీవాల్, సిసోడియా, అతిశి ఓటమిని చూడబోతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై వీరేంద్ర సచ్‌దేవా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం పోస్టుపై అగ్రనాయకత్వం నిర్ణయమే ఫైనల్. అది మాకు పెద్ద సమస్య కాదు. ముఖ్యమంత్రి ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | #DelhiElectionResults | BJP Delhi state president Virendraa Sachdeva says, "We welcome the trends but we will wait for the results. We believe that people have voted against corruption in an election which was centred around BJP's good governance versus AAP's bad… pic.twitter.com/js2KS5d5QY— ANI (@ANI) February 8, 2025 -
మోదీ మార్క్ రాజకీయం.. ఢిల్లీ సీఎం ఎవరు?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది. భారీ మెజార్టీతో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి ముఖ్యంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మోదీ మార్క్ రాజకీయాల్లో భాగంగా మహిళకు అవకాశం ఇస్తారా? అనే విషయం తెరపైకి వచ్చింది.ఇక, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నా రు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం పోస్టుపై అగ్రనాయకత్వం నిర్ణయమే ఫైనల్. అది మాకు పెద్ద సమస్య కాదు. ఆప్‌ను ఓడించడమే మా లక్ష్యం అంటూ కామెంట్స్ చేశారు.అయితే, హర్యానా-మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. పార్టీ సమావేశం.. ఆ తరువాతనే సీఎంను ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. మహిళా సీఎం ఉంటారనే వాదన అనూహ్యంగా తెర మీదకు రావటంతో కొత్త సమీకరణాలపైన చర్చ జరుగుతోంది. 1993లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మరోసారి మహిళకే సీఎం పగ్గాలు ఇవ్వాలని నిర్ణయిస్తే రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. అదే విధంగా ఎన్నికల ప్రచారంలోనూ మహిళా ఓటర్లే లక్ష్యంగా హామీలు గుప్పించిన విషయం తెలిసిందే.సీఎం రేసులో ఉన్న ముఖ్య నేతలు వీరే..దుష్యంత్ కుమార్ గౌతమ్ముఖ్యమంత్రి రేసులో ఉన్న కీలక పేర్లలో ఒకరు దుష్యంత్ కుమార్ గౌతమ్. ఆయన కరోల్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత నాయకుడు. గౌతమ్ రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. దుష్యంత్ గౌతమ్ రాజకీయంగా, సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు.పర్వేష్ వర్మఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై నూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో ఫలితాల ప్రారంభమైన సమయం నుంచి పర్వేష్ వర్మ ఆధిక్యంలో ఉన్నప్పటికీ తాజాగా వెనుకంజలో ఉన్నారు. ఒకవేళ పర్వేష్ గెలిస్తే ఈయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వర్మ జాట్ నేపథ్యం బీజేపీ రాజకీయ లెక్కల్లో కీలక పాత్ర పోషిస్తుంది.విజేందర్ గుప్తా..విజయేందర్ గుప్తా పార్టీ సీనియర్ నాయకుడు. ఢిల్లీలో ఆప్ ఆధిపత్యం ఉన్నప్పటికీ ఆయన 2015 మరియు 2020 రెండింటిలోనూ రోహిణి స్థానం నుంచి విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ అయిన గుప్తా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఆప్ ధాటిని ఎదుర్కొన్న ఆయన అనుభవం అత్యున్నత పదవికి బలమైన పోటీదారుగా చేయనున్నాయి.సతీష్ ఉపాధ్యాయ్ఆయన మాలవీయ నగర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తిపరంగా సతీష్ ఉపాధ్యాయ్ వ్యాపారం, రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. అనుభవజ్ఞుడైన సతీస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. సతీష్‌కు కూడా సీఎం అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
/telugu-news/national/liveblog/delhi-assembly-election-result-2025-live-updates-check-counting-votes
-
Delhi Results Live: ఢిల్లీ ప్రజలకు పండుగ రోజు: ప్రధాని మోదీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్.. -
ఢిల్లీలో ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు
-
70 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన పలువురు నేతలు
-
నేడే హస్తిన సమరం
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల సంఘం అధికారులు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,000 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.220 కంపెనీల పారామిలటరీ బలగాలను, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది, 19,000 మంది హోంగార్డులను మోహరించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం చేస్తోంది. క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్(క్యూఎంఎస్) యాప్‌ను తీసుకొచ్చింది. ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది ఓటర్లు బారులు తీరి ఉన్నారో దీనిద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. జనం తక్కువగా ఉన్న సమయంలో వెళ్లి ఓటు వేయొచ్చు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల కోసం 733 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6,980 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు దేశ రాజధానిలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరాట పడుతుండగా, పూర్వవైభవం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీపడి మరీ హామీలు గుప్పించాయి. ప్రజలు ఎవరిని విశ్వసించారో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఓటింగ్ శాతం సైతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం భారీగా నమోదైతే ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువరు కేంద్ర మంత్రులు.ఆ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్ తరపున పార్టీ జాతీయ కన్వినర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ, యమునా నది కాలుష్యం, ఓట్ల తొలగింపు వంటి అంశాలను పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి. పదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసుగెత్తిపోయారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ పెద్దలు తేల్చిచెబుతున్నారు. -
కాలుష్యంపై కానరాని హామీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అటు ఆప్, ఇటు బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా పరిణమించాయి. రెండు పార్టీలూ ఉచిత పథకా లను వాగ్దానం చేయడంలో పోటీపడుతున్నాయి. కాని, కాలు ష్యంతో కునారిల్లుతున్న రాజధాని ఢిల్లీ పరిస్థితిని బాగు చెయ్యడంపై ఎటువంటి హామీలూ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నట్లు మరో మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా అభివృద్ధి చెందినా ఇటువంటి రాజధాని నగరంతో అంతర్జాతీయ యవనికపై భారత్ సగర్వంగా నిలబడలేదు. ఒక వంక మురికి కాలువగా మారిపోయిన యమునా నది, ఇంకోవైపు ఎటుచూసినా కనిపించే వ్యర్థపదార్థాలు వంటి ఎన్నో కారణాల వల్ల ఢిల్లీ కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, వైఫల్యాలను ఈ స్థితి తెలుపుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ప్రజాజీవనం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి కేసులో జైలుకు వెళ్లిరావడం, ఆయన సహచరులూ అనేకమంది జైలుపాలు కావడం వల్ల ఆప్ ఆత్మరక్షణలో పడింది. తమ నాయకులపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్షసాధింపుతో నమోదు చేసినవి అని చెబుతున్నా, ఆ కేసులు న్యాయస్థానాల ముందు నిలబడే అవకాశాలు ఉన్నా, లేకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే తన రాజకీయ జీవనంలో పెనుసవాల్‌ను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. 2014 నుండి వరుసగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 7 లోక్ సభ సీట్లనూ గెల్చుకుంటున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పరాజయం తప్పడం లేదు. మీడియాలో సంచలనాలు సృష్టించే నాయకులపై ఆధారపడుతోంది కానీ ఇతర పార్టీల మాదిరిగా క్షేత్రస్థాయిలో జనం మధ్యలో పని చేసే నాయకులను ప్రోత్సహించడం లేదు. దానితో బీజేపీకి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం పరాజయం తప్పలేదు. ‘శీష్ మహల్’ గురించి కొంతమేరకు కేజ్రీవాల్‌ను ఇరకాటంలో పడవేసిన బంగారు పూత పూసిన టాయిలెట్ ఫిట్టింగ్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ప్రచారాలు అవాస్తవమని వెల్లడి కావ డంతో వెంటనే బీజేపీ తమ ప్రచారాన్ని మార్చి వేసింది. ‘ఒక్కసారి అధికారం ఇస్తే ఢిల్లీ రూపురేఖలను మార్చగలం’ అని ఇప్పుడు చెబున్నారు. ఢిల్లీ తీవ్ర మైన నీటి సమస్య ఎదుర్కొంటున్న సమయంలో పొరుగున ఉన్న హరి యాణాలోని బీజేపీ ప్రభుత్వం సహ కరించే విధంగా కేంద్రం ఎటువంటి చొరవ తీసుకోలేక పోయింది.వాస్తవానికి కేజ్రీవాల్‌తో సమా నంగా ప్రజాదరణ గల నాయకులు ఎవ్వరూ ఢిల్లీ బీజేపీలో లేరు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఆ పార్టీ వెనకాడుతోంది. కేవలం ప్రధాని మోదీ ప్రజాకర్షణపైననే ఆధారపడుతోంది. ఆప్ ఈ ఎన్నికలలో గెలుపొందితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ వంటి వారు కలిసి బలమైన ప్రత్యా మ్నాయం అందించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవన్మరణ సమస్య అయిన కాలు ష్యాన్ని వదిలేసి ఆప్, బీజేపీలు ఉచిత పథకాలపై హామీలు గుప్పించి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నాయి. – సభావట్ కళ్యాణ్‌లా విద్యార్థి, ఢిల్లీ యూనివర్సిటీ ‘ 90143 22572 -
జాట్లు తలరాతలు మార్చేస్తారు..!
సాక్షి, న్యూఢిల్లీ: జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ రాసిన లేఖతో హస్తినలో ఈ సామాజిక వర్గం పేరుమీద రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ రాజకీయాల్లో జాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సుమారు 12 ప్రాంతాల్లో 8 నుంచి 28 శాతం వరకు జాట్లున్నారు. ఢిల్లీకి హరియాణా రాష్ట్రంతో సరిహద్దు ఉంది. సుమారు 225 సరిహద్దు గ్రామాల్లో బలమైన సంఖ్యలో జాట్లున్నారు. ఫలితంగా, చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో వీరి ఓట్లు నిర్ణయాత్మకంగా మారాయి. ఇక్కడి మొత్తం ఓటర్లలో 7నుంచి 8 శాతం వాటా వీరిదే. వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది. ఇటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, అటు బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల అనుగ్రహంపైనే ఆశలు పెట్టుకున్నాయి. వారిని ఆకర్షించేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఢిల్లీలోని 12 అంసెబ్లీ నియోజకవర్గాల్లో జాట్ల ప్రభావం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 8నుంచి 28 శాతం జాట్ల జనాభా ఉందంటున్నాయి. ముండ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో 28 శాతం, నజఫ్గఢ్లో 25, నరేలా, బిజ్వాసన్లలో 23, బవానా, నాంగ్లోయి జాట్లలో 20, మటియాలా, మెహ్రోలిల్లో 16, ఉత్తమ్‌నగర్‌లో 15, వికాస్పురిలో 10, ఛత్తర్‌పూర్‌లో 9, కిరాడిలో 8శాతం వరకు జాట్లు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కైలాశ్‌ను జాట్ నేతగా ప్రమోట్ చేసిన ఆప్ ఒకప్పుడు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. అయితే, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేసిన 8 మంది జాట్ ఎమ్మెల్యేలు, 2020లో 9 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఈ ప్రాంతాలపై ఆప్ మంచి పట్టు సాధించింది. జాట్ నేతగా కైలాశ్ గెహ్లాట్‌ను ప్రమోట్ చేసి మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే, ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. కొన్ని చోట్ల బీజేపీకి అనుకూలం గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మంచి ఆధిక్యం కనబరిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జాట్ల ప్రాబల్యం ఉన్న వార్డుల్లో బీజేపీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. పొరుగు రాష్ట్రమైన హరియాణాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జాట్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే న్యూఢిల్లీ స్థానం నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న పర్వేశ్ వర్మ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. పర్వేశ్‌కు టికెట్ ఇచ్చి జాట్ల ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. -
మేము సహకరించకుండా ఉండి ఉంటే.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సూటి ప్రశ్న
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) భాగంగా అధికార ఆప్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత హీట్‌ను పెంచుతోంది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఆప్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆప్ కూడా మోదీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. ‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం.అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారుదీనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కూడా తీవ్రంగానే స్పందించారు. ‘ మీకు ఎప్పుడూ ఆప్‌ను తిట్టడమే పని. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే మీరు ఢిల్లీ ప్రజల్ని కూడా తిడతున్నట్లే. ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మీరు ప్రారంభించిన ఆర్ఆర్టీఎస్ కారిడార్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఢిల్లీ ప్రజల కోసం ఏ మంచి పని అయినా స్వాగతిస్తాం. మీరుప్రారంభించిన ప్రాజెక్టులో మా సహకారం ఉంది. అటు కేంద్రం, ఇటు మా ప్రభుత్వం సహకారం వల్ల అది ఈ రోజు మీరు ప్రారంభించకలిగారు. మేము ప్రజల కోసమే పని చేస్తామనేది మీరు ప్రారంభించిన ప్రాజెక్టే ఉదాహరణ. మీరు మా నాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నా మీరు చేపట్టే ఏ ప్రాజెక్ట్‌కు మేము అడ్డుచెప్పలేదు. మేము మీకు సహకారం అందించకపోతే ఆర్ఆర్టీఎస్ కారిడార్ ను మీరు ప్రారంభించేవారా? అది మాకు ఢిల్లీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. మేము దేన్నీ సమస్యగా మార్చలేదు. ప్రజల కోసం పని చేయడమే మాకు తెలిసిన రాజకీయం’ అని కేజ్రీవాల్ బదులిచ్చారు.‘ నేటి మీ ప్రసంగం 38 నిమిషాలు పాటు సాగితే.. అందులో 29 నిమిషాల పాటు ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీ వ్యాఖ్యల్ని చూసి నేను చింతిస్తున్నా. ఈరోజు మీరు ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను 2020లో ఇచ్చిన హామీకే మేరకే అమలు చేశారు. ఇందులో మా సహకారం మీకు పూర్తిగా లభించింది కాబట్టే అది జరిగింది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అంతకుముందు ఆర్ఆర్టీఎస్ కారిడార్‌ను ప్రారంభించిన క్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా తొలి ప్రాధాన్యం.దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారు’ అని మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు. -
ప్రియాంకపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి సీఎం అతిషిపై బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బిదూరి తాజాగా ప్రియాంకపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఆయన చేసింది తప్పయితే తనది కూడా తప్పేనన్నారు. లాలూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రియాంకగాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని బిదూరి గుర్తు చేశారు.ఇదీ చదవండి: సోషల్‌మీడియాలో ఆప్ వర్సెస్ బీజేపీ..ఢిల్లీలో హాట్ పాలిటిక్స్ -
టఫ్ ఫైట్ తప్పదా?
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం(జనవరి4) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలకు గట్టి పోటీ తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేయనున్నారు. పర్వేష్‌సింగ్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఢిల్లీ బీజేపీలో సీనియర్ నేత. వెస్ట్ ఢిల్లీ నుంచి 2014,2019లో రెండుసార్లు కమలం గుర్తుపై ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లోనైతే ప్రత్యర్థిపై ఏకంగా ఐదు లక్షల 78వేల పై చిలుకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడే పర్వేష్‌సింగ్ వర్మ. త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు పర్వేష్‌సింగ్ వర్మ గట్టిపోటీ ఇవ్వగలరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.సీఎం అతిషిపై పోటీచేయనున్న రమేష్ బిదూరి ఎవరు..ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అతిషిపై పోటీ చేయనున్న రమేష్ బిదూరి బీజేపీ సీనియర్ నేత. న్యాయవాది కూడా అయిన బిదూరి రెండుసార్లు ఎంపీగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేత బిదూరి. 2019లో దక్షిణ ఢిల్లీ నుంచి ఆప్ నేత రాఘవ్ చద్దాను ఓడించి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన బిదూరి సీఎం అతిషికి సరైన ప్రత్యర్థని భావించి పోటీకి దించిందని తెలుస్తోంది. కాగా, అతిషిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేయనున్నారు. -
ఢిల్లీ బీజేపీ తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 29 మంది పేర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ తరఫున పర్వేష్ వర్మ పోటీ చేయబోతున్నారు. అలాగే కల్కాజీ నుంచి సీఎం అతిషిపై పోటీకి రమేష్ బిదురిని బీజేపీ రంగంలోకి దింపింది. ఢిల్లీ బీజేపీ(BJP) చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరంటూ తొలి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి . ఈలోపు.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. రేఖా గుప్తా, సుశ్రీ కుమారి రింకూలకు కమలం పార్టీ తొలి జాబితాతో అవకాశం కల్పించింది. ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gehlot) కిందటి ఏడాది నవంబర్‌లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో నజఫ్‌గఢ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి నెగ్గిన కైలాష్.. ఈసారి బీజేపీ తరఫున బిజ్వాసన్ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే పదేళ్లపాటు షీలా దీక్షిత్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ.. కిందటి ఏడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ఎలక్షన్స్‌లో ఈస్ట్ ఢిల్లీ గాంధీనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు.ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుండగా.. ఆలోపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక.. 2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో.. ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.दिल्ली बीजेपी ने विधानसभा चुनाव को लेकर 29 उम्मीदवारों की लिस्ट जारी की Delhi BJP | #BJP pic.twitter.com/nFVRcxASCV— News24 (@news24tvchannel) January 4, 2025 -
బీజేపీ కుట్రలను సమర్థిస్తున్నారా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, పూర్వాంచల్ ప్రజల ఓట్లను, దళితుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తుండగా, ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తాజాగా రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 30వ తేదీతో రాసిన ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న తప్పుడు పనులను మీరు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుందా? అని భగవత్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచడం, కొందరు ఓటర్ల పేర్లను తొలగించడం మీకు సమ్మతమేనా? అని అడిగారు. దేశాన్ని బలహీనపర్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం..సీఎం వర్సెస్ ఎల్జీ -
పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ మరో వరాల జల్లు కురిపించింది. ఆలయాల్లో పూజారులు, గురుద్వారాల్లో సేవచేసే గ్రంథీలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ ఆలయం నుంచి ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. ముందుగా హనుమాన్ ఆలయం అర్చకుల పేర్లను నమోదు చేస్తారు. ఆ తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీలోని అన్ని దేవాలయాలు, గురుద్వారాలకు వెళ్లి పూజారులు, గ్రంథిల పేర్లు నమోదు చేస్తారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహిళా సమ్మాన్, సంజీవని యోజన లాగా ‘పూజారి, గ్రం«థి సమ్మన్ యోజన’కు ఎలాంటి అవాంతరాలు కలిగించవద్దని బీజేపీని వేడుకుంటున్నా. అయినాసరే అడ్డుకుంటామంటే బీజేపీకి మహాపాపం చుట్టుకుంటుంది. పూజారులు, గ్రంథులు మనకు దేవుడికి మధ్య వారధులుగా ఉంటూ మన ఆచారాలను భవిష్యత్ తారాలకు అందజేస్తున్నారు. సమాజంలో పూజారులు, గ్రంథీలు కీలక పాత్ర పోషిస్తున్నా వారు ఇన్నాళ్లూ నిర్లక్షానికి గురయ్యారు. దేశంలోనే తొలిసారిగా వీళ్లను ఆదుకునేందుకు ఈ పథకం తెస్తున్నాం. ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పథకం అమల్లోకి వస్తుంది. గతంలో ఏ పార్టీ, ప్రభుత్వం ఇలాంటి ప్రయోజనం అర్చకులకు, సేవకులకు చేకూర్చలేదు. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అర్చకుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రారంభిస్తాయని ఆశిస్తున్నా’’అని కేజ్రీవాల్ అన్నారు. ‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలను తరాలుగా కొనసాగిస్తున్న అర్చకులను ఆదుకునేందుకు ఉద్దేశించిన చక్కని పథకమిది’’అని ఢిల్లీ సీఎం అతిశి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. మరోవైపు ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ పరిధిలోని మసీదుల్లో సేవలందించే ఇమామ్‌లు కేజ్రీవాల్ నివాసం బయట ఆందోళకు దిగారు. ఇమామ్‌లకు అందాల్సిన నెలవారీ గౌరవ వేతనం రూ.18,000, ముయేజిన్లకు అందాల్సిన రూ.16వేల గౌరవ వేతనం గత ఏడాదిన్నరగా అందట్లేదని వారు నిరనసన తెలిపారు. -
ఓటర్ జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనే 11 వేల ఓట్లను తొలగించాలంటూ ఈసీకి బీజేపీ దరఖాస్తులు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ స్థానంలోనూ 12,500 పేర్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసింది. మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లడం వల్ల పేర్ల తొలగింపు ఆగిపోయింది’’ అని వివరించారు. బీజేపీ ఆటలను సాగనివ్వబోమన్నారు. -
కేజ్రీవాల్ నాయకత్వానికి అగ్ని పరీక్ష
2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కు సవాలుగా నిలుస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారైనా గద్దె దింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దానికితోడు ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అంటూ ఇద్దరు నేతలు నిష్క్రమించడం, దాని మద్దతుదారుల్లో చీలికను సృష్టించింది. అలాగే, పొత్తుకు ఆప్ నిరాకరించడంతో ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా ఉండే ముస్లింల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే, పడినా నిలబడ గలిగే కేజ్రీవాల్ సామర్థ్యం, సంక్షేమంపై ఆయన దృష్టికోణం, వాగ్దానాలను అమలు చేయడంలో పార్టీ ట్రాక్ రికార్డ్ ఆయనకు బలమైన పునాది కాగలవు.2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కూ, ఆమ్ ఆద్మీ పార్టీకీ కీలకమైన ఘట్టంగా మారబోతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించిన కేజ్రీవాల్‌కు ఇప్పుడు సవాళ్లు పెరుగు తున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య దేశ రాజధానిపై తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ, చావో రేవో అనే పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నారు.అవినీతి వ్యతిరేక పోరాట యోధుడి స్థానం నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు కేజ్రీవాల్ సాగించిన ప్రయాణం సాధారణ మైనదేమీ కాదు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఘనవిజయం సాధించింది. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మొత్తం 70 సీట్లలో వరుసగా 67, 62 స్థానాలను గెలుచుకుని బలీయమైన రాజకీయ శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే, అప్పటి నుండి రాజకీయ చిత్రం గణనీయంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు 2025 శాసనసభ ఎన్నికలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.దూకుడు పెంచిన బీజేపీఢిల్లీపై బీజేపీ రెట్టించిన బలంతో వ్యూహాత్మక దృష్టిని కేంద్రీకరించడం దీనికి అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి. ఇప్పటివరకూ ఆప్ నుంచి ఢిల్లీని చేజిక్కించుకోలేక పోయిన బీజేపీ, కేజ్రీవాల్‌ను గద్దె దింపేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను ఆ పార్టీ పోటీకి దింపింది. దీనితో పోటీ ఇక్కడ తీవ్రంగా మారింది. అదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపడంతో ఈ పోటీ మరింత రసవత్తరం కానుంది.కేజ్రీవాల్ పదవీకాలం ఏమీ వివాదాలు లేకుండా సాగలేదు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆయన ప్రచారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అవినీతి ఆరో పణలు, తదుపరి న్యాయ పోరాటాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అంతేకాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మందు గుండు సామగ్రిని ఇవి అందించగలవు.పైగా, ఆప్‌లోని అంతర్గత చోదక శక్తులు కూడా సవాళ్లను విసిరాయి. ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించిన రాజేంద్ర పాల్ గౌతమ్, రాజ్‌కుమార్ ఆనంద్ వంటి కీలక నేతలు రాజీనామా చేయడం పార్టీ మద్దతుదారుల్లో చీలికకు కారణమైంది. వీళ్ల ఫిరాయింపులు... ఒకప్పుడు ప్రధాన బలాలుగా ఉన్న సామాజిక న్యాయం,అందరినీ కలుపుకొనిపోవడం లాంటి విషయాల్లో ఆప్ నిబద్ధతపైనే ప్రశ్నలను లేవనెత్తాయి.సంక్షేమం కొనసాగింపుఈ సవాళ్లు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ ఓటర్లను గెలుచుకోవడానికి తన పాలనా రికార్డును, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ జనాభాలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఆప్ అనేక కార్యక్రమాలను ప్రకటించింది. ఇళ్లకు ఉచిత విద్యుత్తు కొనసాగింపు, మహిళలకు ఆర్థిక సహాయం అందించే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’, సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే ‘సంజీవని యోజన’, ఆటో రిక్షా డ్రైవర్లకు ప్రయోజనాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ పథకాలు సంక్షేమం, అభివృద్ధిపై కొనసాగుతున్న ఆప్ దృష్టిని ప్రతిబింబిస్తాయి. ఇది దాని ఎన్నికల వ్యూహానికి మూలస్తంభం.విద్య, ఆరోగ్య సంరక్షణపై కేజ్రీవాల్ దృష్టి సారించడం కూడా ఆయన రాజకీయ విజయానికి ముఖ్యమైన అంశమైంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడం, మొహల్లా క్లినిక్‌ల స్థాపన విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాయి. ఆప్ తన వాగ్దానాలను నెరవేర్చే పార్టీగా కీర్తిని పెంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. 2025 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ప్రతికూల కథనాలను ఎదుర్కో వడానికీ, ఢిల్లీ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న నాయ కుడిగా తన ఇమేజ్ను బలోపేతం చేసుకోవడానికీ కేజ్రీవాల్ ఈ విజయాలను హైలైట్ చేసే అవకాశం ఉంది.ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ‘ఇండియా’ బ్లాక్‌లోని గమనాత్మక శక్తులు కూడా రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఆప్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ, అవి ఢిల్లీలో మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలకు ముందు పొత్తు లేక పోవడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ చేసిన ప్రకటన సంకీర్ణ రాజకీ యాల సంక్లిష్టతలనూ, ఇండియా కూటమిలో ఐక్యతను కొనసాగించడంలో ఉన్న సవాళ్లనూ నొక్కి చెబుతోంది.బలమైన వర్గాలు కీలకంసాంప్రదాయికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన మద్దతు పునాదిగా ఉన్న దళితుల ఓట్లు 2025 ఎన్నిక లలో కూడా కీలకమైన అంశం కానున్నాయి. కానీ కీలక దళిత నేతల ఫిరాయింపులు, దళిత వ్యతిరేక పార్టీ అనే ఆరోపణలు ఆప్‌కు అవగాహనా సమస్యను సృష్టించాయి. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ అసంతృప్తిని పెట్టుబడిగా వాడుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ఈ ఆందోళనలను శీఘ్రంగా పరిష్కరించాలి. దళిత సంఘాలు ఆప్‌కు తమ మద్దతును కొనసాగించడానికి, చాలా ముఖ్యమైన సమస్యల పట్ల ఆప్ నిజమైన నిబద్ధతను ప్రదర్శించాలి.అదేవిధంగా ఢిల్లీ జనాభాలో దాదాపు 15–18 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు కూడా అంతే కీలకం కానున్నాయి. చారిత్రకంగా,ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ముస్లిం సమాజం ముఖ్య పాత్ర పోషించింది. 2015 అసెంబ్లీ ఎన్నికలలో, ఆప్ ఈ విష యంలో గణనీయమైన పురోగతిని చవిచూసింది. 77 శాతం ముస్లిం ఓటర్లు అప్పుడు ఆ పార్టీకి మద్దతునిచ్చారని అంచనా.అయితే, 2020 నాటికి, ఈ మద్దతు కొద్దిగా తగ్గింది. 69 శాతం మంది ముస్లింలు ఆప్‌కు మద్దతు ఇచ్చారు. అయితే, 2025 ఎన్ని కలలో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కాబట్టి, ముస్లిం ఓటర్లలో పెరుగుతున్న పరాయీకరణ భావాన్ని కాంగ్రెస్ త్వరితగతిన ఉపయోగించుకునే వీలుంది. దీనివల్ల ఈ క్లిష్టమైన వర్గంపై ఆప్ ప్రభావం మరింతగా తగ్గుతుంది.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కేజ్రీవాల్ నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారు. ఆ యా పార్టీలు గతంలో కంటే ఎక్కువ పట్టుదలగా ఉన్నాయి. పైగా సవాళ్లు పెరిగాయి. బీజేపీ దూకుడు ప్రచారం, వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచు తున్నాయి.అయినప్పటికీ, పడినా నిలబడగలిగే సామర్థ్యం, ఓటర్లతో అనుసంధానం కాగలిగే నైపుణ్యం కేజ్రీవాల్ బలాలు. పాలనపై, సంక్షే మంపై ఆయన దృష్టికోణం, వాగ్దానాలను అమలు చేయడంలో తన ట్రాక్ రికార్డ్ వంటివి ఆయన ప్రచారానికి బలమైన పునాదిని అంది స్తాయి. రాబోయే ఎన్నికలు కేజ్రీవాల్ నాయకత్వ పటిమనూ, కల్లోల రాజకీయాల్లో ఎదురీదే ఆయన సామర్థ్యాన్నీ పరీక్షించనున్నాయి.సాయంతన్ ఘోష్ వ్యాసకర్త కాలమిస్ట్, రీసెర్చ్ స్కాలర్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్‌కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్‌పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్‌పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్‌పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్‌కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్‌కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్‌పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ ‘సంజీవని’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు. #WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga— ANI (@ANI) December 18, 2024 మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్‌ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది. -
సార్! నేను కాంగ్రెస్ వాడిని కాను! 'ఆప్' నేతను టోపీ సేమ్ టూ సేమ్ అంతే!
-
ఓట్లను తొలగిస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దళితులు, ఎస్పీలు, పూర్వాంచల్‌కు చెందిన బలహీనవర్గాల ఓట్లను బీజేపీ పనిగట్టుకొని తొలగించేలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘భారత పౌరులుగా ప్రజలకు ఉన్న ఓటు హక్కును బీజేపీ లాగేసుకుంటోంది. ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించింది. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. భారత పౌరులుగా ప్రజలకున్న హక్కులను బీజేపీ లాగేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఈసీకి మూడు వేల పేజీల ఆధారాలను సమర్పించామని కేజ్రీవాల్ తెలిపారు. భారీస్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. దీన్ని అడ్డుకోవాలని, ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. షాహ్దారా నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 11,008 ఓట్లను తొలగించాలని ఈసీకి ఒక జాబితాను సమర్పించారని, ఈసీ రహస్యంగా వీటిని తొలగించే పనిలో ఉందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఉండదని ఈసీ తమకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై దృష్టి పెడతామని, బూత్‌స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ రెండో జాబితా.. సిసోడియా స్థానం మార్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనునన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల షెడ్యూల్, తేదీలు ప్రకటించకముందే.. ప్రజాక్షేత్ర సమరానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆప్ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆప్.. తాజాగా సోమవారం 20 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది.ఈ జాబితా ప్రకారం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్గంజ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన్ను జంగ్‌పురాకు మార్చారు. పట్పర్గంజ్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సివిల్ సర్వీసెస్ ఉపాధ్యాయుడు అవధ్ ఓజాను ఆప్ బరిలోకి దించుతోంది. 2013లో ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మణీందర్ సింగ్ ధీర్ గెలిచినప్పటి నుంచి జంగ్‌పురా సీటు ఆప్‌లో ఉంది. అనంతరం మణీందర్ సింగ్ బీజేపీలోకి వెళ్లడంతో 2015, 2020 ఎన్నికలలో ఆప్ ప్రవీణ్ కుమార్‌ను పోటీకి నిలిపింది. ఆయనే రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే ఈసారి జంగ్‌పురా నుంచి ఆప్ సిసోడియాను ఎంపిక చేసింది. ప్రస్తుత జంగ్‌పురా ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌కు జనక్‌పురి సీటు కల్పించింది.కాగా సిసోడియా 2013లో పట్పర్గంజ్ నుంచి తన ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై విజయం సాధించి తొలిసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2015 ఎన్నికలలో బిజెపికి చెందిన వినోద్ కుమార్ బిన్నీపై, గత 2020 ఎన్నికలలో రవీందర్ సింగ్ నేగిపై విజయం సాధించారు.ఇదిలా ఉండగా గత నెలలో విడుదల చేసిన తొలి జాబితాలో 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేటిజాబితాలో 20 అభ్యర్థులను వెల్లడించింది. ఇక 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. -
కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఆప్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు.మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్నికల కోసం ఎవరితోనూ పొత్తు ఉండదు. ఇండియా కూటమితో పొత్తుకు మేము సిద్ధంగా లేమంటూ కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నేను చేసిన తప్పు ఏంటి..? ఢిల్లీ శాంతిభద్రతల విషయంలో కేంద్రమంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ, దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే.. గ్యాంగ్స్టర్లను అరెస్టు చేయించండి. అంతే కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.#WATCH | AAP national convener Arvind Kejriwal says, "There will be no alliance in Delhi (for assembly elections)." pic.twitter.com/KlPKL9sWrY— ANI (@ANI) December 1, 2024అయితే, కేజ్రీవాల్‌పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే కేజ్రీవాల్‌పై దాడి జరిగిందని వారు మండిపడుతున్నారు. కాగా, ఆప్ ఆరోపణలను బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ స్పందిస్తూ.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పుకొచ్చారు. ప్రజలు సింపథీ కోసమే ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ఇక.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ప్రకటనతో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, ఇండియా కూటమి నేతలు, బీజేపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. -
ఢిల్లీలో ఒంటరి పోరే..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలనే నిశ్చయానికి వచ్చింది. బీజేపీతో ప్రత్యక్షపోరు కొనసాగిస్తున్న మాదిరే ఆప్‌తోనూ అదే వైఖరిని అవలించాలని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నేతలకు సూచనలు చేసింది. ఢిల్లీలో షీలాదీక్షిత్ హయాంలో వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. మొన్నటి లోక్‌సభలో ఆప్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా రెండు పార్టీలు ఒక్క సీటును గెలువలేకపోయాయి. అనంతరం జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తు ఉంటుందని భావించినా, సీట్ల పంపకాలలో విభేదాలతో పొత్తు కుదరలేదు. దీంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాయి. 6 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ఆప్ ప్రత్యక్ష కారణమైంది. హరియాణా ఓటమి నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవాల న్నా, ఓట్ల చీలికను ఆపాలన్నా రెండు పార్టీలు కలిసి పోటీ చేయడమే ఉత్తమమనే భావనను కొంతమంది నేతలు వ్యక్తం చేశారు. అయితే ఆప్ పార్టీలోని సోమ్నా«థ్ భారతి వంటి కీలక నేతలు పొత్తును వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుతో ఆప్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదని, పైగా బీజేపీకి విమర్శల దాడిని అ్రస్తాన్ని అందించినట్లు అవుతుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే లు హాజరయ్యారు. కార్యక్రమంలో కేజ్రీవాల్, రాహుల్, ఖర్గేలు చాలాసేపు ముచ్చటించుకోవడం సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆప్‌తో పొత్తు ఖాయమైందని చా లా మంది భావించారు. శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స మావేశం సందర్భంగా పొత్తు అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్న వేళ కాంగ్రెస్ అనూహ్య నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి పొత్తులు ఉండవ ని ఒంటరి పోరుకు సిద్ధం కావాలని అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ శనివారం ఒక ప్రకటన చేశారు. ‘ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ పరిపాలనలో వృద్ధులకు పింఛన్లు అందడం లేదు. పేదలకు రేషన్‌కార్డు అందడం లేదు. రోడ్లు పాడైపోయాయి. కాలుష్యం అదు పు తప్పింది. యువత నిరుద్యోగులయ్యారు. ద్రవ్యోల్బణంతో మహిళలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కేవలం ప్రదర్శన కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ మొహల్లా క్లినిక్‌లను తెరిచింది. ఇదీ కేజ్రీవాల్ మోడల్’అంటూ విమర్శలు గుప్పించారు. అటు బీజేపీ, ఇటు ఆప్ రెండూ ఢిల్లీ సర్వనాశనం చేశాయన్నారు. రెండు పార్టీలను ఒంటరిగా ఎదుర్కొంటామని, ముఖ్యమంత్రి ఎవరనేది ఫలితాల అనంతరం నిర్ణయిస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు. -
హస్తినలో మొదలైన ఎన్నికల హడావుడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతో క్రమంగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే తమ ఎన్నికల కసరత్తును బీజేపీ, ఆప్ పార్టిలు ముమ్మరం చేసి దాడి, ఎదురుదాడులను మొదలు పెట్టాయి. ఆప్ నేత కైలాశ్ గహ్లోత్ బీజేపీలో చేరిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో ఢిల్లీ ప్రజలతో సంప్రదింపులు జరుపుతుండగా, మరోవైపు బీజేపీ తమ ఢిల్లీ నేతలను క్రియాశీలం చేసింది. గురువారం 11 మందితో ఆప్ తొలిజాబితాను సైతం విడుదల చేసింది. పోటీపోటీగా ఆప్, బీజేపీ..వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక, వ్యూహాల అమలులో ఆప్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతో పాటు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్‌లపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బీజేపీ, అనంతరం సైతం ఏమాత్రం తగ్గకుండా అంతకంతకూ పెరుగుతున్న యమునా నది కాలుష్యం, పెరిగిన వాయు కాలుష్యం, తాగునీటి ఎద్దడి, ముంపు ప్రాంతాల్లో బాధితులకు అందని సహకారం వంటి అంశాలపై గడిచిన నాలుగు నెలలుగా తన పోరాటాన్ని ఉధృతం చేసింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై గడిచిన వారం రోజులుగా పోస్టర్ వార్తో పాటు వీధి పోరాటాలు చేస్తోంది. ఇక ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని ఆప్ ఎదురుదాడి చేస్తోంది. ప్రజా ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వకుండా.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అసాధారాణ అధికారాలు కట్టబెట్టి, సమస్యలను జటిలం చేస్తోందని ఆప్ సైతం తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. ఈ పరిణామాలు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ఆప్ కీలక నేత, మాజీ మంత్రి కైలాశ గహ్లోత్ బీజేపీలో చేరారు. దీనికి బదులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝాని తన పార్టీలో చేర్చుకుంది ఆప్. ఈడీ కేసుల భయంతోనే గహ్లోత్ పార్టీ మారారని ఆప్ ఆరోపిస్తే, కేజ్రీవాల్‌కు రాజకీయ ఆశయాలు పెరగడం వల్లే ఆయన పార్టీ మారారని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ఇక మరోపక్క ఎన్నికల అభ్యర్థులను త్వరగా ఖరారు చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ సచ్‌దేవా ఇప్పటికే పార్టీ స్టీరింగ్ కమిటీ, మెనిఫెస్టోకమిటీతో భేటీలు జరుపగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ వీధి సభలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 70 స్థానాలకు గానూ 2015లో 67, 2020లో 62 స్థానాలు గెలిచిన ఆప్ తిరిగి 60కి పైగా స్థానాలను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. పొత్తు లేదు.. కాంగ్రెస్‌తో పోరే ఇక ఢిల్లీ ఎన్నికల సన్నాహాల్లో పూర్తిగా వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసినా రెండు పార్టిలు ఏడింటిలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయాయి. ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీచేసి అన్నిచోట్ల పరాజయం పాలయ్యాయి. అనంతరం జరిగిన హరియాణా ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉంటుందని భావించినా, సీట్ల సర్దుబాటు కుదరక రెండు పార్టిలు ఒంటరిగానే పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లోనూ రెండు పార్టిలు విడివిడిగానే కొట్లాడుతాయని ఇప్పటికే సంకేతాలు వెళ్లడంతో కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్‌లు న్యాయ్ యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆప్ తొలి జాబితా విడుదలఆరుగురు ఇతర పార్టిల నుంచి వచ్చిన వారే సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే సిద్ధమైంది. 2025, ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 11మంది అభ్యర్థులతో తొలి జాబితాను జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ గురువారం విడుదల చేశారు. ఛత్తర్పూర్ అభ్యర్థిగా బ్రహ్మసింగ్ తన్వర్, బదార్పూర్ అభ్యర్థిగా రామ్‌సింగ్ నేతాజీ, లక్ష్మీనగర్ అభ్యర్థిగా బీబీ త్యాగీ, సీలంపూర్ అభ్యర్థిగా చౌదరి జుబిర్ అహ్మద్, సీమాపురి అభ్యర్థిగా వీర్‌సింగ్ ధింగాన్, రోహ్తాస్ నగర్ అభ్యర్థిగా సరితాసింగ్, ఘోండా అభ్యర్థిగా గౌరవ్ శర్మ, విశ్వాస్‌నగర్ అభ్యర్థిగా దీపక్ సింగ్లా, కర్వాల్‌నగర్ అభ్యర్థిగా మనోజ్ త్యాగి, కిరారీ అభ్యర్థిగా అనిల్‌ఝా, మటియాలా అభ్యర్థిగా సోమేశ్ షోకీన్‌ల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. 11మంది అభ్యర్థుల జాబితాలో ఆరుగురు ఇతర పార్టిల నుంచి వచ్చినవారే ఉన్నారు. వీరిలో ముగ్గురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చివారు కావడం గమనార్హం. ఛత్తర్పూర్, కిరాడీ అభ్యర్థులుగా ఖరారైన బ్రహ్మ సింగ్ తన్వర్, అనిల్ ఝాలు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు. వీరు ఈ ఏడాది ఆ పార్టీకి రాజీనామా చేసి ఆప్‌లో చేశారు. వీరు ఇరువురూ రెండుసార్లు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా కూడా గెలిచారు. ఇక, దీపక్ సింఘ్లా కిందటి ఎన్నికల్లో బీజేపీ నేత ఓమ్ ప్రకాశ్ శర్మ చేతిలో ఓటమిపాలయ్యారు. సరితా సింగ్ ఆప్ విద్యార్ధి విభాగం ఛత్ర యువ సంఘర్షణ సమితి అధ్యక్షురాలు. రోహతాస్ నగర్ నుంచి గతంలో గెలిచారు. -
కేజ్రీవాల్ సంచలనం.. ఢిల్లీ ఎన్నికలకు ఆప్ తొలి జాబితా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా గురువారం విడుదల చేసింది. మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.ఛత్తర్పూర్ నుంచి బ్రహ్మ సింగ్ తన్వార్, కిరాడి నుంచి అనిల్ ఝా, విశ్వాస్ నగర్ నుంచి దీపక్ సింగ్లా, రోహతాన్ నగర్ నుంచి సరితా సింగ్, లక్ష్మీ నగర్ నుంచి బీబీ త్యాగి, బదార్పూర్ నుంచి రామ్ సింగ్, సీలమ్పూర్ నుంచి జుబీర్ చౌధురి, సీమాపురి నుంచి వీర్ సింగ్ ధిగాన్, ఘోండా నుంచి గౌరవ్ శర్మ, కర్వాల్ నగర్ నుంచి మనోజ్ త్యాగి, మాటియాలాలో సోమేశ్ షౌకీన్ పేర్లను కేజ్రీవాల్ ఖరారు చేశారు.ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల ఆప్‌లో చేరిన ఆరుగురు నేతలు ప్రముఖంగా ఉన్నారు. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మ్‌సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగితో పాటు కాంగ్రెస్ మాజీ నాయకులు చౌదరి జుబేర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేష్ షోకీన్‌లను అభ్యర్థులుగా ఆప్ ప్రకటించింది. అయితే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్ నిరాకరించింది. -
కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ఆప్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బొర్లా పడిన కాంగ్రెస్‌కు ఎటు తోచని పరిస్థితి నెలకొంది. రాష్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో వ్యవహరించిన హస్తానికి ఫలితాలు కోలుకోలేని దెబ్బ కొట్టింది. అంచనాలన్నీ తలకిందలు కావడంతో.. అనూహ్య ఫలితాలతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ వైఖరిపై మిత్రపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్య పక్షాలను హస్తం పార్టీ పట్టించుకోలేదని మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అతివిశ్వాసం మితిమీరిందని విమర్శిస్తున్నాయి.తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ మాట్లాడుతూ.. తన భాగస్వామ్య పక్షాలను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వారికి అతివిశ్వాసం మితిమీరిపోయిందని, ఆ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు.లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ హర్యానాలో ఆప్, సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్, అహంకార బీజేపీపై పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని అన్నారు.ఢిల్లీలో పదేళ్లుగా ఒక్క అసెంబ్లీ సీటు గెలవని కాంగ్రెస్‌కు ఇటీవల లోక్‌సభలో మూడు సీట్లు ఇచ్చామని.. అయినప్పటికీ హరియాణా ఎన్నికల్లో మిత్రపక్షాలకు తోడుగా నిలవలేదని ఆప్ విమర్శించింది. హరియాణా ఎన్నికల్లో పొత్తుకోసం ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడింది.కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని ముందుగా కాంగ్రెస్, ఆప్ భావించాయి. కానీ సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్-ఆప్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి చవిచూశాయి. మెజార్టీ మార్కుకు కాంగ్రెస్ దూరం కాగా.. ఆప్ అసలు ఖాతా తెరవలేదు. దాంతో హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. -
Arvind Kejriwal: ఉచిత విద్యుతిస్తే బీజేపీకి ప్రచారం చేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలోని 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానన్నారు. పదేళ్లలో ఒక్క మంచి పని కూడా చేయని మోదీ రిటైర్మెంట్కు ముందు కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఆప్ బహిరంగ సభలో బీజేపీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ‘‘వచ్చే ఏడాది సెప్టెంబర్ 17కు మోదీకి 75ఏళ్లు వస్తాయి. రిటైరవుతారు. ప్రధానిగా ఆయనకు మరో ఏడాది సమయమే ఉంది. ఈలోగా ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింట్లోనూవిద్యుత్తు ఉచితంగా ఇవ్వండి. బడులు, ఆసుపత్రులు బాగు చేయండి. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల్లోపు ఆ పని చేసి చూపిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తా’’ అన్నారు. ‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వమటే ‘డబుల్ దోపిడీ, నిరుద్యోగం, అధిక ధరలు’. హరియాణాలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ దిగిపోనుంది. జార్ఖండ్, మహారాష్ట్రల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పోతాయి’’ అన్నారు. తన జేబులో ఆరు స్వీట్లున్న ప్యాకెట్ ఉందని కేజ్రీవాల్ అన్నారు. ‘‘ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్ర, ఆరోగ్య వసతులు, విద్య... ఇవే ఆ ఆరు స్వీట్లు’’ అని చెప్పారు. ఢిల్లీలో పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఆ ఆరు స్వీట్లు ప్రజలకు అందకుండా పోతాయన్నారు. -
Jairam Ramesh: హరియాణా, ఢిల్లీలో ఆప్‌తో పొత్తు లేనట్టే!
న్యూఢిల్లీ: హరియాణా, ఢిల్లీలో మరో ఏడాదిలోగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మధ్య పొత్తు కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. కానీ, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పారీ్టలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి పారీ్టలు తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టంచేశారు. అవగాహన కుదిరిన చోట కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలందరూ గురువారం సమావేశమయ్యారు. అనంతరం గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని తెలిపారు. ఆప్ మంత్రి గోపాల్ రాయ్కాగా ఢిల్లీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ భారీ విజయాలను నమోదు చేసింది. బీజేపీ వరుసాగా మూడు, ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. ఇక ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 13 ఎస్సీ రిజర్వ్డ్గా కేటాయించారు. అలాగే ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటరీ నిమోజకవర్గంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏడు స్థానాలకు గానూ ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడుచోట్ల పోటీ చేశాయి. -
ఆప్ ‘హ్యాట్రిక్’సంబరాలు
-
ఇది ఢిల్లీ ప్రజల విజయం
-
అసెంబ్లీ రద్దుకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్స్
-
న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది .సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆప్ 18 స్థానాల్లో విజయం సాధించి, 40 స్థానాల్లో ముందంజలో ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్‌లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విజయం సాధించారు. సంగంవిహార్, దేవ్లీలో ఆప్ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్‌లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. -
ఢిల్లీ ఫలితాలు : ప్రశాంత్ కిశోర్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఆప్‌కు భారీ విజయం కట్టబెట్టినందుకుగాను ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. ‘ భారత దేశ ఆత్మను కాపాడిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కేజ్రీవాల్‌కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీప్ స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఆమె విమర్శించారు. అభివృద్దే ఢిల్లీలో ఆప్‌ను గెలిపించిందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆప్ 15 స్థానాల్లో విజయం సాధించి, 43 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ రెండు చోట్ల విజయం సాధించి, 10 స్థానాల్లో ముందంజలో ఉంది. -
ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్ తివారీ
-
సత్తా చాటిన ఆప్
-
ఆప్ సంబరాలు.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 58 స్థానాల్లో(ఉదయం 11.30గంటలకు) స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ మంత్రులు కూడా ఆయా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. (చదవండి : ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర) ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. టపాసుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఆప్ శ్రేణులు టపాసులు పేల్చడం లేదు. టపాసులకు బదులు బెలూన్లను గాల్లోకి వదిలి, స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
ఓటమికి బాధ్యత వహిస్తా :మనోజ్ తివారీ
-
పుంజుకున్న బీజేపీ..పత్తాలేని కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 10.35గంటలకు ఆప్ 49 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 21 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. ఈసారి పుంజుకుంది. గతం కంటే ఐదింతలు మెరుగైంది. 27 స్థానాల్లో ఆప్, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా ఉంది. 14 స్థానాల్లో ఆప్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మెడల్ టౌన్లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ముందంజలో ఉన్నారు. చాందినీలో ఆప్ 9, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ4, ఈస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ 4 , న్యూఢిల్లీలో ఆప్ 9, బీజేపీ 1, నార్త్ వెస్ట్ ఢిల్లీలో ఆప్ 8, బీజేపీ2, వెస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ4, సౌత్ ఢిల్లీలో ఆప్ 7, బీజేపీ3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. -
ఆప్ కార్యాలయంలో సంబరాలు
-
నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
-
హస్తిన తీర్పు : మోదీ, రాహుల్ ట్వీట్
నా ప్రత్యేక అభినందనలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మించిన ఫలితాలతో అఖండ విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ప్రశంసల జల్లులు కురుస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఆంద్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు జాతీయ, స్థానిక నేతలు కేజ్రీవాల్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఫలితాల అనంతరం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి శుభాకంక్షలు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను’అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్‌కు తన ప్రత్యేక అభినందనలు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆప్ 62.. బీజేపీ 8 ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్ వన్ సైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఫలితాలతో ‘సామాన్యుడి’ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా, కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా.. ఏ తరుణంలోనూ కనీసం ఆధిక్యం కూడా ప్రదర్శించ లేదు. ఇక వరుసగా మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 2015లో ఆప్ 67 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 3 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో ఆప్ ఐదు స్థానాలను చేజార్చుకోగా.. బీజేపీ మరో ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకుమించి 2015 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల ఫలితాల్లో పెద్దగా తేడా ఏం కనిపించలేదు. కేజ్రీవాల్ అండ్ టీమ్‌కు అభినందనలు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా ప్రనిచేసిన కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీని అభివృద్ది చేస్తుందనే నమ్మకంతోనే అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి పట్టం కట్టారన్నారు. ఇక అసెంబ్లీలో ప్రజా సమస్యలు లెవనెత్తుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్రను బీజేపీ పోషిస్తుందన్నారు. ఇక ఢిల్లీ అభివృద్దికి కృషి చేస్తుందనే నమ్మకంతో కేజ్రీవాల్ అండ్ టీమ్‌కు అభినందనలు అంటూ నడ్డా ట్వీట్ చేశారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్ వన్ సైడ్‌గా నిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం కేజ్రీవాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ఢిల్లీ ప్రజలు విజయం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. అభివృద్దికే ప్రజలు ఓటేశారు. ఈ విజయం కొత్త రాజకీయాలకు నాంది. ఢిల్లీ తన కుమారుడిని మరోసారి నమ్మింది’అంటూ ఆ ప్రకటనలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్ విక్టరీ సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలదన్ని అఖండ విజయంతో ఆప్ దూసుకపోతోంది. ఇప్పటికే 45 స్థానాల్లో ఆప్ గెలుపొందగా.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కేజ్రీవాల్ అండ్ టీం సాధించిన ఈ సూపర్బ్ విక్టరీపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌కి, ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి విజయ ఢంకా మోగించిన అరవింద్ కేజ్రీవాల్‌కు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సైతం కేజ్రీవాల్‌కు శుభాభినందనలు తెలిపారు. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు. త్వరలోనే కేజ్రీవాల్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సింగిల్ డిజిట్‌కే బీజేపీ పరిమితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పట్నుంచి 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన బీజేపీ మెల్లిమెల్లిగా పట్టువదిలింది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థానాలకే బీజేపీ పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌కు రిక్త హస్తమే మిగిలింది. కనీసం ఒక్క స్థానంలో కూడా కనీసం ఒక్కసారైనా ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు డిప్యూటీ సీఎం విజయం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్పర్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవి నేగిపై దాదాపు 3,571 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మరోసారి కంగుతినిపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్‌లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విజయం సాధించారు. సంగంవిహార్, దేవ్లీలో ఆప్ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్‌లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్‌కు ప్రశాంత్ కిశోర్ అభినందనలు ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. కాగా,ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. టాపాసులు కాల్చకండి : కేజ్రీవాల్ ఆప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. పటాకుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. ఐదింతలు పెరిగిన బీజేపీ బలం దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 11 గంటలకు ఆప్ 54 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 16స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ఉచిత విద్యుత్‌తో ఆప్‌కు అనుకూలం: బీజేపీ ఎంపీ నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు ఉండదని కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో పేదల ఓటింగ్‌పై ప్రభావం చూపిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధురి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్ తివారీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. ఆప్ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. 70 స్ధానాలు కలిగిన ఢిల్లీలో ఆప్ ప్రస్తుతం 50 స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 20 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్ధానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది. సంబరాల్లో ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్ట విజయం ఖాయమవడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆరు జిల్లాల్లో ఆప్ ఏకపక్షంగా దూసుకుపోతోంది. సత్తా చాటిన ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ మొదటి నుంచి లీడ్‌లో కొనసాగుతుతోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్ 50 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ద్వారాకా, జనక్ పురి, కృష్ణానగర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ అధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మనీష్ అక్షర్ ధామ్ కౌంటింగ్ సెంటర్లో ప్రతాప్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థి రవినేగి పాల్గొన్నారు. అక్కడక్కడ మెరుస్తోన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 54 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. ఆప్‌కు గట్టి పోటీ ఇవ్వకపోయినా.. అక్కడక్కడ బీజేపీ ముందంజలో ఉంది. రోహిణిలో బీజేపీ అభ్యర్థి విజయేంద్రకుమార్ లీడ్‌లో కొనసాగుతున్నారు. బగ్గాలో తాజిందర్‌పాల్ సింగ్ ఆప్ అభ్యర్థిని వెనక్కినెట్టి ముందంజలో కొనసాగుతున్నారు. ముందంజలో కేజ్రీవాల్, సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 55 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 13 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దూసుకెళ్తున్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 15, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆప్ నేత,ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. కౌంటింగ్ ప్రారంభం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గెలుపుపై ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఆప్ మద్దతు దారులు పెద్ద ఎత్తును కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. పిల్లలతో సహా కేజ్రీవాల్ ఇంటికి... శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ఈ ఉదయం నుంచే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు. పిల్లలతో కలిసి వారంతా కేజ్రీవాల్ నివాసానికి వస్తుండటం విశేషం. మరోవైపు బీజేపీ నాయకుడు విజయ్ గోయల్.. కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన నివాసంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వత్రా ఉత్కంఠ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎన్నికల సంఘం తుది పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మంది మహిళలు సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్ సీవీ రామన్ ఐటీఐ, రాజీవ్ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 33 మంది పరిశీలకులను నియమించారు. 13, 780 పోలింగ్‌బూత్‌లలో పోలైన ప్రతి ఓటును ప్రిసైడింగ్ అధికారులు పరిశీలిస్తారని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. అభివృద్ధినే ఎజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఈసారి కూడా తమదే అధికారమనే ధీమాతో ఉంది. జాతీయతావాదం, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ కూడా ఢిల్లీ సీఎం పీఠం తమకే దక్కుతుందని అంచనా వేస్తోంది. -
ఢిల్లీలో మందకొడిగా పోలింగ్
-
నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
కాంగ్రెస్ గెలిస్తే నిరుద్యోగ భృతి ఎంతో తెలుసా..!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్‌లు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను, 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 20 వేల లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇవ్వగా... దానికి ప్రతిగా కాంగ్రెస్ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని మాటిచ్చింది. ఆటోలు, ఈ-రిక్షాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం ఇస్తోన్న బియ్యం, గోధుమలను రెట్టింపు చేస్తామని తెలిపింది.ఇందులో నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్‌కు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు రూ.5,000, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.7.500 చొప్పున ప్రతి నెలా నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఈ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చింది. 'అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న రూపంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను అమలు చేసేది లేదు' అని పేర్కొంది. సుప్రీంకోర్టులో సీఏఏను సవాలు చేస్తామని తెలిపింది. గతంలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. కాగా, ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. -
బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా!
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న అధ్యక్ష పదవికి నామినేషన్లు్ల వేస్తారని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. కేవలం నడ్డా మాత్రమే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీకి చెందిన 36 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సంస్థాగత ఎన్నికల్లో ఇప్పటికే 21 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయని బీజేపీ సీనియర్ నేత రాధా మోహన్ సింగ్ చెప్పారు. పార్టీ విధివిధానాల ప్రకారం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం సగం స్థానాల్లో ఎన్నికలు పూర్తయితే ఆ పార్టీ దేశ స్థాయి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ వచ్చే నెల 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా 57 స్థానాల అభ్యర్థులను పార్టీ ఢిల్లీ విభాగపు అధ్యక్షుడు మనోజ్ తివారీ శుక్రవారం విడుదల చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మల్యే కపిల్ మిశ్రాతోపాటు విజేందర్ గుప్తా, మాజీ మేయర్లు రవీందర్ గుప్తా, యోగేందర్ ఛండోలియాలకు తొలి జాబితాలో చోటు దక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసేదెవరన్నది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్‌గానే మిగిలిపోయింది. జాబితాలో మొత్తం 11 మంది ఎస్సీలు కాగా, మహిళా అభ్యర్థులు నలుగురికి చోటు కల్పించారు. కపిల్ మిశ్రా మోడల్ టౌన్ నుంచి, రవీందర్ గుప్తా రోహిణి స్థానం నుంచి బరిలోకి దిగుతారని, కేజ్రీవాల్‌పై పోటీ చేసే వ్యక్తిని త్వరలో ప్రకటిస్తామని మనోజ్‌తివారీ తెలిపారు. ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఆమ్ఆద్మీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్
-
ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి ఎన్నికలలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. ఓటర్ల గుర్తింపు సులువుగా వేగంగా పూర్తయ్యేందుకు అధికారులు అందరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. 13,659 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పోలింగ్ స్టేషన్‌కు రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో దేశంలోనే మొదటిసారిగా ఈ వెసులుబాటును కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో తమ పార్టీ రిపోర్టు కార్డుతోనే మరోసారి విజయం సాధించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అశిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ఆయన సమ్మోహకశక్తి తమ ప్రచారాస్త్రాలని బీజేపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షీలాదీక్షిత్ మరణంతో చతికిలబడ్డ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఇటీవల పార్టీ జార్ఖండ్‌లో సాధించిన విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ముక్కోణపు పోటీ 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. నాడు బీజేపీ మూడు సీట్లు గెలవగా, కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. ఈసారి ఎన్నికలలో అరడజను పైగా పార్టీలు తలపడనున్నా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. ఈ మూడు పార్టీలు ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆప్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుండగా 22 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ, 15 ఏళ్లు ఢిల్లీని ఏకధాటిగా ఏలినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్.. సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. -
‘ఢిల్లీ’లో ఆప్‌తో పొత్తు ఉండదు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో తమ పార్టీ ఎలాంటి పొత్తు పెట్టుకోబోదని కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు సుభాశ్ చోప్రా శుక్రవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ సొంతంగానే మెజారిటీ స్థానాలు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదంటూ ఆప్ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి కొన్ని రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. -
ప్రధానికి మనోజ్ తివారీ లేఖ
న్యూఢిల్లీ: దేశంలో బాలల దినోత్సవాన్ని నవంబర్ 14వ తేదీకి బదులు డిసెంబర్ 26న జరపాలని కోరుతూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలా చేస్తే అది సిక్కుల పదో గురువైన గురు గోవింద్ సింగ్ ఇద్దరు కొడుకులకు ఘన నివాళి అవుతుందని లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎందరో బాలలు ఎన్నో త్యాగాలు చేశారని, కానీ వారిలో గురు గోవింద్ సింగ్ కుమారులైన జొరావర్ సింగ్, ఫతే సింగ్‌ల త్యాగం గొప్పదన్నారు. 1705వ సంవత్సరంలో డిసెంబర్ 26నే వాళ్లిద్దరు ధర్మాన్ని రక్షించడానికి తమ ప్రాణాలర్పించారన్నారు. స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని ప్రతి ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనోజ్ తివారీ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కు ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆయన లేఖాస్త్రం సాధించారన్న వాదనలు వినబడుతున్నాయి. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ఆయన బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుంజలో ఉన్నారు. పూర్వాంచల్ వాసులు కూడా ఢిల్లీలో గణనీయంగా ఉన్నారు. (చదవండి: ‘మఫ్లర్'మ్యాన్‌కు ఏమైంది?) -
ప్రశాంత్ కిశోర్‌తో కేజ్రీవాల్ జట్టు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) తో జట్టు కట్టారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. 2014లో మోదీ తరఫున ప్రశాంత్ ప్రచార వ్యూహాలు సిద్ధంచేశారు. ప్రస్తుతం ప్రశాంత్ బిహార్‌లోని జనతా దళ్ (యూ) ఉపాధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ శనివారం చేసిన ట్వీట్‌కు స్పందనగా ‘‘పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రత్యర్థిగా చూశామని, కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాల కారణంగా కాంగ్రెస్‌ను విజయం వరించిందని’’ఐప్యాక్ మరో ట్వీట్ చేసింది. ‘‘పంజాబ్ ఎన్నికల ఫలితాల తరువాత మిమ్మల్ని (కేజ్రీవాల్) మేము ఎదుర్కొన్న బలమైన ప్రత్యర్థిగా గుర్తించాం. ఇప్పుడు కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలపడం సంతోషాన్నిస్తోంది’’అని తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీపార్టీలతో ముక్కోణపు పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ యూటర్న్ తీసుకున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యూటర్న్ తీసుకున్నారు. ఆయన కేంద్రంతో వ్యవహరించే శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. గతంలో కేంద్రంతో చీటికి మాటికి గిల్లికజ్జాలు పెట్టుకునే శైలికి స్వస్తి చెప్పి సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఆయన పలుమార్లు కేంద్రానికి కృతజ్ఞత తెలిపారు. తాజాగా çశుక్రవారం సుంగర్పుర్ గ్రామంలో యమునా తీరాన చెరువు తవ్వే పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు ముందు కూడా ఆయన తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినందుకు మోదీ సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభ ఫలితాలతో మారిన తీరు! లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ శైలి మారిపోయిందని, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆయన తన వైఖరిని మార్చుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ ప్రభుత్వ సంబంధాలు మెరుగయ్యాయన్న సందేశాన్ని కేజ్రీవాల్ ప్రజలకు ఇవ్వదలచుకున్నారని వారు అంటున్నారు. అంతకుముందు కేజ్రీవాల్ తమ ప్రతి పనికి కేంద్రం అడ్డుపడ్తోందని ఆరోపించేవారు. ఆయన ఇప్పుడామాటే ఎత్తడం లేదు. జూన్ 21న ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయానికి అభినందించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని, తాము సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. అనధికార కాలనీల క్రమబద్దీకరణ ప్రతిపాదనకు అనుమతి ఇచ్చినందుకు కేజ్రీవాల్ జూలై 18న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అనధికార కాలనీలలో రిజిస్ట్రేషన్ పనులు త్వరలో మొదలవుతాయని ప్రకటిస్తూ కేజ్రీవాల్ ఢిల్లీవాసుల తరపున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. యమునా తీరాన భూగర్భ జల సంరక్షణ కోసం యమునా తీరాన కుంటలు తవ్వే ప్రతిపాదనకు త్వరగా అనుమతినిచి్చందుకు కేజ్రీవాల్ హర్షం çప్రకటిస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఓఖ్లాలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు శంకుస్థాపన సందర్భంగా కేజ్రీవాల్ జూలై 8న కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కలిసి యమునను శుద్ధి చేయడంలో విజయం సాధిస్తాయన్న నమ్మకం తనకుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో నేరాలను తగ్గించడం కోసం తాము లెప్టినెంట్ గవర్నర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జూలై 30న చెప్పారు. -
ఢిల్లీ మహిళలకు శుభవార్త
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానిలోభాగంగా రాజధానిలో బస్సు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘ఢిల్లీలో డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వారి ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుంది’ అని సోమవారం ఢిల్లీలో కేజ్రీవాల్ చెప్పారు. 2, 3 నెలల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 వందల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో రోజూ పాతిక లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఉచిత ప్రతిపాదన వల్ల ప్రయాణికుల సంఖ్య మరో లక్ష పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో 1.50 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు ఆమోదించామని తెలిపారు.ఈ డిసెంబరు నాటికి 70వేల కెమెరాలు అమర్చుతామన్నారు. కాగా, ఉచిత ప్రయాణ ప్రతిపాదనపై వ్యాఖ్యానించడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిరాకరించింది. -
ఢిల్లీ అసెంబ్లీకి ‘ముందస్తు’ ముప్పు
-
ఢిల్లీ అసెంబ్లీకి ‘ముందస్తు’ ముప్పు
న్యూఢిల్లీ: జోడు పదువుల్లో కొనసాగుతున్న 29 మంది ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల చుట్టూ ఎన్నికల కమిషన్ ఉచ్చు బిగుస్తుండడంతో ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 21 మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంక్షేమ కమిటీ చైర్మపర్సన్లుగా నియమితులైన ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కనీసం పది మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రమాదం ఉంది. అప్పుడు ఆప్ పార్టీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ వారిని చేర్చుకోవడమే ఇక తరువాయి. బవానా నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ ఇటీవలనే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే బీజేపీ తరఫున పోటీ చేస్తారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లున్న విషయం తెల్సిందే. ముందస్తు ఎన్నికలు జరిగేందుకు పూర్తి అవకాశాలు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో ముందుస్తు ఎన్నికల్లో విజయం సాధించాలనే కతనిశ్చయంతో బీజేపీ అప్పుడే రంగంలోకి దిగింది. ‘విస్తారక్’ కార్యక్రమం కింద పార్టీని నగరంలో నలుమూలల విస్తరించుకునే కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయం స్ఫూర్తితో ముందుకు దూసుకుపోతోంది. పార్టీకి చెందిన విస్తారక్‌లు జూన్ 23వ తేదీ నుంచే క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారని, లక్షన్నర మంది సభ్యులను కొత్తగా పార్టీలో చేర్చుకోవాల్సిందిగా వారికి లక్ష్యాన్ని నిర్దేశించామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి తెలిపారు. ఢిల్లీలో తీవ్ర రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉండడంతో ముందుస్తు ఎన్నికలు జరిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, అందుకని తాము ముందస్తు ఏర్పాట్లలో ఉన్నామని మరో బీజేపీ నాయకుడు తెలిపారు. న గరంలో 9,227 మంది పార్టీ విస్తారక్‌లను నియమించామని, వారు 13,200 పోలింగ్ కేంద్రాల పరిధిలో పర్యటించి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని, కనీసం ఒక్కో విస్తారక్ యాభ మైంది కొత్త సభ్యులను ముఖాముఖి కలసుకుంటారని నగర బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేష్ భాటియా తెలిపారు. ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నియామకం ప్రక్రియను చేపట్టినందున పార్టీ కూడా పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదుకు కషి చేస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం జూలై 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఢిల్లీలో చోటుచోసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. విరివిగా తమ నియోజక వర్గాల్లో పర్యటించాల్సిందిగా ఆప్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేజ్రివాల్ కూడా తన నియోజకవర్గం న్యూఢిల్లీలో నెల రోజుల్లో నాలుగు సార్లు పర్యటించారు. ఆయన ఆదివారం సాయంత్రం ఫేస్బుక్ ద్వారా పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు. ఇలా ఇరు పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతుండడంతో 29 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసన సభ్యుల అధికారాల స్వతంత్య్రను కాపాడేందుకు, వివిధ అధికార హోదాల వేర్వేరు అధికారాలను పరిరక్షించేందుకు చాల దేశాలు జోడు పదవుల విధానాన్ని రద్దు చేయగా, అదే బాటలో భారత్ కూడా ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ చట్టాన్ని 2006లో తీసుకొచ్చింది. ఎన్నికైన అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులు ఆర్థికంగా లేదా మరో విధంగా తనకు లబ్ధి చేకూర్చే ఇతర హోదాలో ఉండ కూడదు. ఈ కారణంగానే నాడు ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు లోక్‌సభ సభ్యురాలైన సోనియా గాంధీ ‘జాతీయ సలహా మండలి’ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయల్సి వచ్చింది. ‘ఉత్తరప్రదేశ్ చలనచిత్ర అభివద్ధి సంస్థ’ చైరపర్సన్‌గా ఉన్నందున నాడు జయాబచ్చన్ రాజ్యసభ బహిష్కరణను ఎదుర్కోవాల్సి వచ్చింది. -
ప్రతీకారం తీర్చుకున్నారు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో మూడేళ్ల వరకు సమయం ఉంది. ఈలోపే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తిప్పికొట్టింది. ఢిల్లీలోని మొత్తం మూడు కార్పొరేషన్లలోనూ మూడింట రెండొంతులకు పైగా మెజారిటీ సాధిస్తూ దూసుకెళ్తోంది. మొత్తం 272 సీట్లకు గాను 270 చోట్ల ఎన్నికలు జరగ్గా, 185 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. దాంతో వరుసగా మూడోసారి కూడా కార్పొరేషన్లను గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికలు.. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 స్థానాలు రాగా ఆప్‌కు 28 వచ్చాయి. అయితే కాంగ్రెస్ (8) మద్దతుతో ఆప్ అధికారాన్ని చేపట్టింది. అప్పట్లో బీజేపీకి 33%, ఆప్‌కు 29.5%, కాంగ్రెస్‌కు 24.5% చొప్పున ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో కలిసేది లేదన్న కేజ్రీవాల్.. ఆ పార్టీతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి.. కేవలం 49 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. జన లోక్‌పాల్ బిల్లు విషయంలో విభేదాలు రావడంతో కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికలు.. 49 రోజుల పాటు రాజధానిని పాలించిన తానే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీకి సరైన ప్రత్యర్థినని అరవింద్ కేజ్రీవాల్ భావించారు. దాంతో వారణాసిలో నేరుగా మోదీతో ఢీకొన్నారు. ఆ ఎన్నికల్లో కేవలం మోదీ చేతుల్లో ఓడిపోవడమే కాదు.. వారణాసిలో ఆయన ఐదో స్థానంలో నిలిచి డిపాజిట్ కూడా కోల్పోయారు. మొత్తం 543 స్థానాలకు పోటీ చేసిన ఆప్.. కేవలం 4 చోట్లే గెలిచింది. ఢిల్లీలో ఉన్న మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. దాంతో తాను ఢిల్లీకే పరిమితం అయితే మంచిదని కేజ్రీవాల్‌కు తెలిసింది. 2015 అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ తన బలమేంటో నిరూపించుకున్నారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏకంగా 67 స్థానాలు గెలుచుకున్నారు. ఆయనకు 54% ఓట్లు వచ్చాయి. బీజేపీ కేవలం 33% ఓట్లతో మూడు స్థానాలే గెలిచింది. 2013 అసెంబ్లీ ఎన్నికల కంటే 1 శాతం ఓట్లే తగ్గినా, 28 సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్ కనీసం ఒక్కచోట కూడా గెలవలేదు. 2017 ఎంసీడీ ఎన్నికలు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తినడానికి ముందే కేజ్రీవాల్‌కు పంజాబ్, గోవా ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌ను జాతీయ పార్టీ చేయాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి. ఎంసీడీ ఎన్నికల ఫలితాలతో ఇక ఆప్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ రెండో స్థానం వచ్చినా కూడా మొత్తం 272 స్థానాలున్న ఎంసీడీలో కేవలం 40కి కాస్త అటూ ఇటూగానే ఆప్ పరిమితం కావాల్సి ఉంటుంది. దాంతో కార్పొరేషన్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉండదు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మంచి ఫలితాలే సాధించినట్లవుతుంది. దాదాపు 40కి అటూ ఇటూగానే కాంగ్రెస్ కూడా ఉంది. 2019 లోక్‌సభ.. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఇప్పుడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. ఇక 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, 2020లో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - ఆప్ తలపడాల్సి ఉంటుంది. అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో, ఎవరు ఏ స్థానంలో ఉంటారో చూడాల్సి ఉంటుంది. అయితే తాము ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎంల మీదకు నెపం నెట్టేయడాన్ని మాత్రం అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ నాయకులు మానుకుంటే మంచిది. -
జైట్లీని ఎందుకు దూరంగా పెట్టారు?
పాట్నా: బీహార్‌లో జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనతాదళ్ (యు) కూటమిని విజయపథాన నడిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈసారి ఎందుకు బీహార్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు? వ్యూహరచన గురించి పక్కన పెట్టిన కనీసం ఎన్నికల ప్రచారంలోనైనా ఎందుకు పాల్గొనడం లేదు? ఆయనే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా లేదా పార్టీయే ఆయనను పక్కన పెట్టిందా ? 2005లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా ఆయనే పని చేశారు. ఎవరూ ఊహించనివిధంగా మొట్టమొదటిసారిగా పార్టీకి 58 సీట్లను కట్టబెట్టారు. 88 సీట్లను సాధించిన జనతాదళ్ (యు)తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవంతో 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని విజయపథాన నడిపించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 91, జేడీయూకు 115 సీట్లు వచ్చాయి. గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయానికి కారణమైన జైట్లీని మంచి ఎన్నికల వ్యూహకర్తగా, మేధావిగా పార్టీ శ్రేణులు కీర్తించాయి. కారణం ఏదైనా ఈసారి మాత్రం బీహార్ ఎన్నికల విషయంలో పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికల్లో పార్టీ విజన్ డాక్యుమెంటును విడుదల చేయడానికే పరిమితం చేసింది. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలే ఎన్నికల వ్యూహరచన చేయగా వారికి సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, జేపీ నడ్డా, రవి శంకర్ ప్రసాద్, రాజీవ్ ప్రతాప్ రూఢీ సహకరిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవమే కారణమా? పార్టీ ఎన్నికల విజయ సారథిగా గుర్తించినందునే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సారథ్యం వహించాల్సిందిగా పార్టీ మళ్లీ అరుణ్ జైట్లీని కోరింది. ఢిల్లీతో ఆయనకు, ఆయన కుటుంబానికున్న అనుబంధం కూడా పార్టీ విజయానికి ఉపయోగపడుతుందని భావించింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, ధర్మేంధ్ర ప్రధాన్‌లను తీసుకొని జైట్లీ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ సృష్టించిన పెను తుపానులో జైట్లీ అదృష్టం కాస్త కొట్టుకుపోయింది. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం బీజేపీకి మూడంటే మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పటి వరకు అజేయమైన ఎన్నికల వ్యూహకర్తగా జైట్లీని వర్ణించిన ద్వితీయ శ్రేణి పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా దుమారం రేపారు. మోదీ ఇమేజ్, అమిత్ షా వ్యూహాలపై పూర్తిగా ఆధారపడకుండా జైట్లీని నమ్ముకోవడం వల్లనే పార్టీ నట్టేట మునిగిందంటూ విమర్శలు కురిపించారు. అందుకే ఇప్పుడు ఆయన్ని దూరంగా పెట్టి మోదీ, అమిత్ షాలను నమ్ముకొని బీహార్ బరిలో ముందుకు దూసుకుపోతున్నామని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
పంథా మారేనా! పరువు దక్కేనా!
రెండువేల ఏళ్ల క్రితం రోమన్ చక్రవర్తి ఒకరి దగ్గర ఎప్పుడూ ఒక బంటు ఉండేవాడట. అతని బాధ్యత - ‘మీరు దేవుడు కాదు, మానవమాత్రులే సుమా!’ అని సదా చక్రవర్తికి గుర్తు చేస్తూ ఉండడమే. ఇలాంటి స్పృహ కలిగించడం మన నేతలకు కూడా అవసరం. అయితే మోదీకి ప్రతిపక్షాల విమర్శలు ఒక వరంలా పరిణమించే అవకాశమే ఎక్కువ. ‘శత్రువు తప్పు చేస్తూ ఉంటే అడ్డుపడకు’ అంటాడు నెపోలియన్ బోనాపార్టి. విపక్షాలు నిరంతరం మోదీని విమర్శిస్తూ పప్పులో కాలు వేయకుండా జాగ్రత్త పడేటట్టు మాత్రం చేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ, నరేంద్ర మోదీలకు ఒక హెచ్చరిక గానే వెలువడ్డాయి. ఆ ఎన్నికలూ, వాటి ఫలితాలూ గొప్ప ప్రాధాన్యం ఉన్నవి కావు. అయినా వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోక తప్పని ఒక వ్యూహంలోకి బీజేపీని దింపారు. దారుణమైన మూల్యాన్ని చెల్లించి తెచ్చుకునే విజయానికే చరిత్రలో ‘పైరిక్ విజయం’ అన్న పేరు. శక్తికి మించిన మూల్యాన్ని చెల్లించి విజయం కోసం పాకులాడనక్కరలేదని పురాతన గ్రీకుల భావన. పైరిక్ విజ యం అంటే అలాంటిదే. ఢిల్లీ ఎన్నికలలో స్వయంగా నరేంద్ర మోదీ కూడా ప్రచారానికి పూనుకున్నారు. సర్వశక్తులు ఒడ్డారు. నిజానికి అక్కడ గెలిచినంత మాత్రాన బీజేపీకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. భిన్నాభిప్రాయాలు నరేంద్ర మోదీ పనితీరు ఇంతవరకు విజయవంతంగానే ఉన్నదని జనాభి ప్రాయం. అదే సమయంలో వ్యవహార శైలిని ఆయన మార్చుకోవడం అవసర మన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. లేకపోతే ఆయన వైఫల్యాల పర్వం ప్రారంభం కాక తప్పదు. ప్రఖ్యాత న్యాయవాది రాం జఠ్మలానీ మోదీకి పెద్ద మద్దతుదారుడు. ‘వైఫల్యాలు తొలిదశలోనే మోదీ దృష్టికి వెళ్లడం ఆయన అదృష్టం, ఆ వైఫల్యాలతో పతనం కావడానికి ముందే సరిదిద్దుకోగలరు’ అన్నారాయన. నిజానికి గడచిన ఐదేళ్లలో భారత ఆర్థికవ్యవస్థ కుదేలైంది. విదే శాంగ విధానాన్ని పూర్తిగా విస్మరించారు. ఓట్లు ఎలా సాధించాలి? జాతీయ సలహా మండలి వంటి అంశాలను గురించి మాత్రమే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆలోచించారు. స్వప్రయోజనాలు, రాజకీయ మనుగడ గురించి తప్ప, దేశం కోసం ఆమెకు ప్రత్యేకమైన వ్యూహం కూడా ఏదీ లేదు. కానీ మోదీ అధి కారం చేపట్టాక గడచిన 9 మాసాలలో ఆర్థిక వ్యవస్థ పుంజుకో వడం ప్రారం భించింది. జైరాం రమేశ్, జయంతి నటరాజన్‌లు పర్యావరణ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినపుడు ఐదు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పథకాలు అతీగతీ లేకుండా ఉండిపోయాయి. వారి అసమ ర్థత, అవినీతి వల్ల మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ప్రతిష్టతో పాటు దేశ ప్రతిష్ట కూడా దిగజారింది. ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కాకుండా మోదీ నిలువరించగలిగారు. అలాగే దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను వెతకడం ప్రారంభించారు. మోదీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిశ్రమలపైన, చైనాలో ఉద్యోగాల కల్పన జరిగిన తీరు గురించీ భారతీయులు దృష్టి పెట్టేలా చేసింది. ఇక్కడ కూడా ఇలాంటి ప్రయత్నం జరగాలన్న ఆలోచన ఆరంభమైంది. స్వచ్ఛ భారత్ కూడా మంచి కార్యక్రమం. ఎనిమిది, తొమ్మిది మాసాల మోదీ హయాంలో విదేశీ వ్యవహారాలు కూడా విజయవంతమైనాయి. భారత్ ఉనికిని ప్రపంచ దేశాలకు చాటడంలో ఆయన విజయం సాధించారు. మోదీ అమెరికా పర్యటన; అమెరికా, చైనా దేశాల అధ్యక్షుల భారత పర్యటన కూడా విజయవంతంగానే జరిగాయి. ఆర్థిక, భద్రత వంటి అంశాలలో విజయవం తమైన ఫలితాలు సాధించడానికి భారత్‌కు పటిష్టమైన విదేశాంగ విధానం అవసరం. మన ఇరుగు పొరుగు అంతా శత్రువులు తప్పితే మిత్రులు కాన రారు. దీనికి పరిష్కారం మంచి విదేశాంగ విధానమే. ఈ విషయంలో మోదీ ధైర్యంగా ముందడుగు వేశారు. ఎల్.కె. అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నాయకులకు విశ్రాంతి ఇచ్చి ఉండవలసింది కాదని ఒక వర్గం మీడియా అభిప్రాయపడుతోంది. కానీ అలాంటి నాయకులతో పార్టీకి ఒనగూడిన గొప్ప ప్రయోజనం ఏమీ లేదు. వారు ప్రజాదరణ కోల్పోయారు కూడా. నాలుగు దశాబ్దాల పాటు అధికారం లో ఉండి, కొత్తవారికి అవకాశం లేకుండా వారు చేశారు. కానీ మోదీ కొత్త తరానికి అవకాశం ఇచ్చారు. మోదీ పగ్గాలు చేపట్టిన తరువాత, ఇంతవరకు ఆట్టే ఉనికి లేని రాష్ట్రాలకు సైతం పార్టీని విస్తరించారు. కేరళ మొదలుకొని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం- ఈశాన్య రాష్ట్రాలలో కూడా పార్టీ ఉనికిని చాటుకోగలిగింది. ఈ రాష్ట్రాలన్నిం టిలోను 250 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కానీ వాటిలో బీజేపీ ఖాతాలో జమ అయినవి కేవలం పదిహేను. 2014 మే నెల నుంచి ఆయా ప్రాంతాల లో కమలం తన ఉనికిని చాటుకునే క్రమం మొదలైంది. ఇటీవల అసోం, బెంగాల్ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలబడింది. ఒడిశాలో ఇప్పటికే ప్రతిపక్షం. ఇలాంటి విజయాలు పాతతరం నేతలు సాధించి ఉండేవారా? తప్పిదాలను అంగీకరించాలి! మంచి రాజకీయవేత్తలు తప్పిదాలను అంగీకరించడానికి వెనుకాడరు. ఈ విషయంలో గాంధీజీ నుంచి మోదీ నేర్చుకోవాలి. బీజేపీ ప్రభుత్వం మోదీ అనే ఏక వ్యక్తి తమాషాగా కనపడుతున్న మాట వాస్తవం. నియంతృత్వాలలో ఇలాంటిది సాగినా, ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన ప్రధాని అందుకు తగిన రీతిలో వ్యవహరించడం అవసరం. నిజానికి ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానుల వ్యవహార శైలి అంతా నియంతల శైలినే మరిపిస్తుంది. అన్ని అంశాలు వారి కనుసన్నలలో సాగాలనీ, తనను మించి ఎవరూ మిన్నగా కనిపించరాదన్నట్టూ వారు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇలాం టి ముద్ర ప్రజాస్వామ్యంలో సరికాదు. నిజం చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నది కూడా ఏక వ్యక్తి తమాషాయే! కేజ్రీవాల్ మాదిరిగా ప్రజల దృష్టిలో ఉండాలని మోదీ భావించకున్నా, ఆయన ఎవరి మాట ఆలకించరు అన్న అపప్రథ మాత్రం లేకుండా చూసుకోవాలి. ఎవరు ఏమి చెప్పినా ఆయన వింటారన్న భావన ఉండాలి. బీజేపీ మంత్రిమండలి చాలా బలహీనమైనది. మంత్రులు మంచి ఫలితాలను సాధించలేకపోతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యత మాత్రం మోదీదే అవుతున్నది. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తప్ప మిగిలినవారు అత్తెసరు మార్కులు కూడా తెచ్చుకోవడం లేదు. ఇతర మంత్రులలో చాలామంది మీడియాతో చక్కగా మాట్లాడడం తప్పిస్తే, పాలనానుభవం లేనివారే. ఈ మంత్రులను మార్చకుంటే, మోదీ వైఫల్యం మొదలైపోతుంది. మోదీ ధరించే దుస్తుల విషయం కూడా వివాదాస్పదంగా తయారైంది. ఖరీదైన ‘సూటు’ వ్యవహారం ఇంతవరకు ఆయన మీద ఉన్న సదభిప్రా యాన్ని మారుస్తోంది. యథాతథంగా కాకున్నా, తనకు పూర్తి భిన్నంగా ఉండే ‘మఫ్లర్ మ్యాన్’ కేజ్రీవాల్‌ను మోదీ గమనంలోకి తీసుకోవాలి. అలా అని రాహుల్ గాంధీ శైలిలో అతి నాటకీయత జోలికి మాత్రం మోదీ వెళ్లవలసిన అవసరం లేదు. రాహుల్ ఒక రాత్రి పూరి గుడిసెలో నిద్రిస్తారు. కానీ నెల నెలా విదేశాలకు విహారయాత్రలకు వెళతారు. పార్లమెంటులో మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల నైపుణ్యం కూడా విజయవంతంగా లేదు. ప్రతిపక్షాల దాడిని వారు అధిగమించలేకపోతున్నారు. మోదీ కూడా ప్రతిపక్ష నేతలకు దగ్గర కావాలి. వారిని గౌరవించాలి. లాలూ ప్రసాద్, ములాయం వంటి వారిని ఇరుకున పెట్టాలని భావించడం సరైన రాజకీయం కాదు. ఇలాంటి వైఖరిని మార్చుకోకుంటే మోదీ ప్రభుత్వ పతనం మొదలైపోతుంది. పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటులో మనకి ఆధిక్యం ఉన్నప్పటికీ ప్రతిపక్షాలతో సర్దుకుపోవడమనే సంప్రదాయం పాటించాలి. ఈ వైఖరి మారాలి భారీ వ్యాపార, వాణిజ్య వర్గాలను సంతృప్తి పరచడానికి మోదీ చేస్తున్న ప్రయ త్నం ప్రమాదకరమైనది. వారు ప్రభుత్వం నుంచి ఆశించేది వారి పరిశ్రమ లకు భూములు, ప్రభుత్వం నుంచి రాయితీలు, విదేశాల నుంచి పెట్టుబడు లు. మోదీ ఆదరాబాదరా తీసుకువచ్చిన భూసేకరణ చట్టంతో దేశంలో చాలా గందరగోళమే మొదలైంది. చాలా వాస్తవాలను పరిగణనలోనికి తీసుకోకుం డానే మోదీ దేశంలోని భారీ వాణిజ్య, వర్తక వర్గాల మెప్పు కోసం ప్రయత్నిసు ్తన్నారని అనిపిస్తుంది. ఈ విధానాన్ని కూడా మోదీ ఆపివేయాలి. అలాగే ఆయ న భావిస్తున్నట్టు ఇతర దేశాల నేతలు మోదీకి మిత్రులు కారు. మోదీని వారం తా గౌరవిస్తున్నారంటే, అందుకు కారణం వారి మధ్య వ్యక్తిగత మైత్రి కాదు, మోదీ ఈ దేశానికి ప్రధాని. ‘దేశాలకు శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరు, కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి’ అని రెండు వందల ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ ప్రధాని మార్ల్‌బరో చెప్పాడు. ఇటీవల బరాక్ ఒబామా వచ్చినప్పుడు మోదీ ఆయనను పేరు పెట్టి పిలవడం దేశ ప్రజలకు ఇబ్బందిక రంగా తోచింది. రెండువేల ఏళ్ల క్రితం రోమన్ చక్రవర్తి ఒకరి దగ్గర ఎప్పుడూ ఒక బంటు ఉండేవాడట. అతని బాధ్యత - ‘మీరు దేవుడు కాదు, మానవమా త్రులే సుమా!’ అని సదా చక్రవర్తికి గుర్తు చేస్తూ ఉండడమే. ఇలాంటి స్పృహ కలిగించడం మన నేతలకు కూడా అవసరం. అయితే మోదీకి ప్రతిపక్షాల విమర్శలు ఒక వరంలా పరిణమించే అవకాశమే ఎక్కువ. ‘శత్రువు తప్పు చేస్తూ ఉంటే అడ్డుపడకు’ అంటాడు నెపోలియన్. విపక్షాలు నిరంతరం మోదీ ని విమర్శిస్తూ పప్పులో కాలు వేయకుండా జాగ్రత్త పడేటట్టు చేస్తున్నాయి. పెంటపాటి పుల్లారావు (వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మొబైల్ :9868233111) -
డామేజ్ కంట్రోల్ దిశగా ఆర్ ఎస్ ఎస్?
న్యూఢిల్లీ: ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంతో దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను తిరిగి గాడినపెట్టేందుకు దాని సిద్ధాంతకర్త ఆర్ ఎస్ ఎస్ చర్యలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...ఈ సంవత్సరం జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. బీహార్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం సమావేశమైన పార్టీ చర్చించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీహార్ ఇన్చార్జ్ భూపేంద్ర యాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పాల్గొన్నారు. బీజేపీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఆర్ ఎస్ ఎస్ ఇలాగే జోక్యం చేసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో జోరుమీదున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోడీకి పెద్ద షాకే ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లకు 67 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. -
'ఏపీకి ప్రత్యేక హోదా సులభం కాదని చెప్పాగా'
హైదరాబాద్: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి, ప్రధాని మోదీకి సంబంధం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో వెంకయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మాకు సవాల్ విసిరాయన్ని అన్నారు. అయినా ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో మా వ్యతిరేక పక్షాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దానిని సవాల్‌గా స్వీకరిస్తామన్నారు. దేశంలో పేదలకు, ధనికులకు మధ్య అంతరం తగ్గించేందకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నాగార్జున సాగర్ జలాల సమస్య ఇద్దరు సీఎంలు కలసి పరిష్కరించుకోవడం శుభపరిణామం అని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంత సులభం కాదని ఆనాడే చెప్పానని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీయేలో టీఆర్ఎస్ చేరతుంది అని విలేకర్లు ప్రశ్నించాగా... అవి ఊహాగానాలే అని తెలిపారు. బీహార్‌లో పరిణామాలకు మోదీకి సంబంధం లేదని, అది జనతా పరివార్ అంతర్గత సమస్య అని వెంకయ్య వెల్లడించారు. -
బీజేపీని మురికిగా మార్చి ఊడ్చేసిన ఆప్
సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యలు సాక్షి, ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుపై పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని మురికిలాగా ఊడ్చేసిందని శివసేన బుధవారం తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. బీజేపీ ఘోర వైఫల్నాకి ప్రధాని మోదీయే కారణమని పేర్కొంది. కేవలం ఎన్నికల వాగ్దానాలు, ప్రసంగాలతోనే విజయం సాధించలేమని, బీజేపీకి ఢిల్లీ గుణపాఠం నేర్పిందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన బీజేపీని ఆప్ మురికిగా మార్చేసిందని తెలిపింది. తాము గెలిచిన సీట్లను లెక్కించేందుకు బీజేపీ నేతలకు చేతి వేళ్లు కూడా అవసరం లేదని ఎద్దేవా చేసింది. కిరణ్‌బేదీని ఓటమికి బాధ్యురాలిని చేయడం సరి కాదని సూచించింది. అమిత్‌షా తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోయారని, చివరి అస్త్రంగా మోదీని ప్రయోగించినా విఫలమయ్యారని ఎత్తిపొడిచింది. ఇది మోదీ పరాజయమని అన్నా హజారే వ్యాఖ్యానించారని, తాము కూడా అలాగే భావిస్తున్నామని శివసేన తెలిపింది. ఓ కార్పొరేషన్లో శివసేన ఓడితే... ఉద్దవ్ ఠాక్రే ఓడినట్టు భావించాలా..? : సిఎం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని పేర్కొనడం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. నాసిక్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఏదైనా కార్పొరేషన్లో శివసేన ఓడిపోతే అది ఉద్ధవ్ ఠాక్రే పరాజయంగా భావించాలా..? అని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ పరాజయాన్ని నరేంద్ర మోడీ పరాజయంగా పేర్కొనరాదన్నారు. ముఖ్యంగా పక్కింట్లో పిల్లాడు పుట్టాడన్న సంతోషాన్ని ఎక్కువ రోజులు వ్యక్తపరచరాదని కూడా ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో పరాజయంపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకుంటుందన్నారు. -
ఢిల్లీ ప్రజల విలక్షణ తీర్పు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరిచ్చిన తీర్పు విలక్షణమైనదీ.. సలక్షణమైనదీనూ.. భారతీయ ఓటరు సరైన సమయంలో స్పష్టమైన తీర్పునిచ్చి తానెంత విజ్ఞతతో వ్యవహరించగలడో తెలియజేశాడు. ఈ ఎన్నికల ఫలితం ఢిల్లీ పరిధి దాటి దేశం పైనే ప్రభావం చూపగలదు. చిన్నవాడిని, తప్పటడుగులేశాను, లెంపలేసుకున్నాను. మళ్లీ తప్పు చేయను అని నిజాయితీగా ముందుకొచ్చిన కేజ్రీవాల్‌కి అఖండ మెజారిటీ ఇవ్వటం ఢిల్లీవాసులు తీసుకున్న సముచిత నిర్ణయం. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మూడు స్థానాలకే పరిమితమవ్వడం పరిశీలకుల అంచనాకు కూడా అందలేదు. దశాబ్దాలుగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ డకౌట్ అవ్వడం ఆ పార్టీకి చరిత్రాత్మక అవమానం. అవినీతి, ఆశ్రీత పక్షపాతం కాంగ్రెస్‌ను మట్టి కరిపించాయి. అహంకారం, అంతఃకలహాలు బీజేపీకి చావు తప్పి కన్నుపోయే పరిస్థితిని తీసుకువచ్చాయి. పరిమితికి మించిన వేగం ప్రమాదకరమని, అభివృద్ధి పేరుతో అసంఖ్యాక ప్రజానీకాన్ని, వారి సంక్షేమాన్ని విస్మరించడం కుదరదని ఓటరు మహాశయులు మోదీని హెచ్చరించారు. చేసిన అవినీతి, అవకతవకల పాలనను ఇప్పుడిప్పుడే మర్చిపోలేమని కాంగ్రెస్‌కు ఓటర్లు బుద్ధి చెప్పిన తీరు నుంచి ఆ రెండు జాతీయ పార్టీల వారు పాఠాలు నేర్చుకోవాలి. అలాగే కేజ్రీవాల్ మీద అనేక ఆశలతో ఢిల్లీ ప్రజలు ఓట్లు వేసి ఘనవిజయం కట్టబెట్టారు. ఈ తిరుగులేని మెజారిటీని చూసుకుని ఆయన కర్తవ్యాన్ని మరచిపోరాదు. గతంలో జరిగిన తప్పులను ఎట్టి పరిస్థితిలోనూ పునరావృతం కానీయరాదు. సామాన్యుడు కేంద్రంగా నిజాయితీ రాజకీయాలకు ఇదే నాంది కావాలి. -డా. డి.వి.జి. శంకరరావు మాజీ ఎం.పి., పార్వతీపురం, విజయనగరం -
'కొన్ని తప్పులు చేయడం వల్లే ఢిల్లీలో ఓటమి'
హైదరాబాద్: కొన్ని తప్పుల చేయడం వల్లే ఢిల్లీలో తమ పార్టీ ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హస్తిన ఎన్నికలపై ఆయన స్పందించారు. ఆప్ ఇచ్చిన ప్రజాకర్షక హామీలవైపు ప్రజలు మొగ్గు చూపారని తెలిపారు. కాంగ్రెస్, బీఎస్పీలు బీజేపీని ఓడించాలని ఆప్ కు మద్దతు ఇచ్చాయన్నారు. బలాన్ని పెంచుకోలేక ఓడిపోయామన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచాలనుకోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ కోతలతో పరిశ్రమలు కుంటుపడుతున్నాయని చెప్పారు. బిల్డింగ్లు కట్టి అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని టీఆర్ఎస్ సర్కార్ భావించడం సరికాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. -
'ఆప్'కాజోష్
- కర్ణాటకలో మిన్నంటిన సంబరాలు - జైన్ భవన్ నుంచి ఎంజీ రోడ్ వరకు ‘ఆప్’ నేతల ర్యాలీ బెంగళూరు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సాధించిన ఘన విజయంతో ఆప్ కర్ణాటక శాఖలో సంబరాలు మిన్నంటాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయానికి ఒక్కో మెట్టు దగ్గరవుతున్న కొద్దీ ఆప్ రాష్ట్ర శాఖ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. నగరంలోని అశోక్ నగర్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచే ఆప్ కార్యకర్తల సందడి కనిపిస్తూ వచ్చింది. ఆప్‌కు విజయం ఖాయమని పోలింగ్ రోజునే ఎగ్జిట్ పోల్స్ సైతం తేల్చి చెప్పడంతో ఆప్ రాష్ట్ర శాఖ నేతల ముఖాల్లో విజయంపై ఆత్మవిశ్వాసం కనిపించింది. అయితే ఇంతటి ఘన విజయాన్ని తాము సైతం ఊహించలేదని ఆప్ రాష్ట్రశాఖ నేతలు పేర్కొన్నారు. ఈ విజయం ఢిల్లీలోని ప్రతి సామాన్యుడి విజయమని ఆప్ నేత రవికృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. సామాన్యుడి శక్తిని తక్కువ అంచనా వేసిన జాతీయ పార్టీల నేతలకు ఢిల్లీలోని ఓటర్లు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. ఇక రానున్న రోజుల్లో ఇదే ఫలితాలు కర్ణాటకలో సైతం పునరావృతమవుతాయని ఆప్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ విజయం అందించిన స్పూర్తితో కర్ణాటకలో సైతం తమ పార్టీని బలపరిచే దిశగా ప్రణాళికలు రచించే పనిలో ఆప్ రాష్ట్ర శాఖ నేతలు నిమగ్నమయ్యారు. ఇక ఆప్ సంబరాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆప్ కార్యకర్తలు నగరంలోని జైన్ భవన్ నుంచి ఎంజీ రోడ్ వరకు ర్యాలీని నిర్వహించారు. చాలాకాలంగా ఆప్‌కు మద్దతుగా నిలుస్తున్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్.ఎస్.దొరెస్వామి ఈ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయానికి దొరెస్వామి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యుడు ఆప్ పై పెట్టుకున్న ఆశలన్నింటిని నెరవేర్చేదిశగా ముందుకు ఢిల్లీలో ఆప్ పాలన సాగుతుందనే ఆశాభావాన్ని దొరెస్వామి వ్యక్తం చేశారు. 14న పౌరసరఫరాల శాఖ ఫిర్యాదుల స్వీకరణ హొసూరు : క్రిష్ణగిరి జిల్లాలో ప్రతినెలా రెండవ శనివారం తాలూకా స్థాయిలో పౌరసరఫారాల శాఖ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రేషన్‌కార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులు తదితర సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల వద్ద ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల రెండవ శనివారం 14వ తేదీ ఐదు తాలూకాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు ఆ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్రిష్ణగిరి తాలూకాలో పాత క్రిష్ణాపురం గ్రామంలో, హొసూరు తాలూకాలో ముగళపల్లి గ్రామంలో, డెంకణీకోట తాలూకాలో బేళాళం గ్రామంలో, పోచ్చంపల్లి తాలూకాలో రంగంబట్టి గ్రామంలో, ఊత్తంగేరి తాలూకాలో కుళ్లంపట్టి గ్రామంలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ‘ఆప్’కు బెంగళూరు : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలనే ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకు చెందిన సంప్రదాయ ఓట్లన్నీ ఆప్‌కు పడ్డాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. అందువల్లే తాము ఓడిపోయామని విశ్లేషించారు. కెంగల్ హనుమంతయ్య జయంతి సందర్భంగా విధానసౌధ ప్రాంగణంలోని కెంగల్ హనుమంతయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా పనిచేయలేదన్నారు. ఇప్పటికైనా ఆయన ఆలోచన తీరును మార్చుకుని ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని సిద్ధరామయ్య సూచించారు. -
'ఇక అంతా దేవుడి చేతుల్లోనే'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరుణంలో విజయంపై ప్రధాన పార్టీల నాయకులు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. వారికి లోపల మాత్రం కాస్త సందిగ్ధత నెలకొంది. ఢిల్లీ గెలుపుపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. 'ఇక ఎన్నికలు ముగిశాయి. మా ప్రయత్నం నిజాయితీగా నిర్వర్తించాం. మా ప్రయత్నంలో ఎటువంటి స్వార్ధం లేదు. ఇక మా విజయం దేవుడి చేతుల్లోనే ఉంది'అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. హస్తిన గద్దెపై మళ్లీ సామాన్యుడే అధిష్ఠించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపుతున్నాయి. సర్వేల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్దగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో మరోసారి పీఠాన్ని అధిరోహించేందుకు కేజ్రీవాల్ ఆశగా ఎదురు చూస్తున్నారు. -
ఆప్‌కు మద్దతివ్వాలంటూ ముస్లింలకు బుఖారీ పిలుపు
-
బుఖారీ ఆఫర్‌ని చీపురుతో ఊడ్చిన ఆప్
న్యూ ఢిల్లీ : జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఇచ్చిన ఆఫర్‌ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. ఢిల్లీలో నివసించే ముస్లింలందరూ ఆప్‌కి ఓటు వేయాలని బుఖారీ పిలుపునిచ్చారు. మసీదులో ప్రార్థనలకి వచ్చిన ముస్లింలందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒకే పార్టీకి ఓటు వేయాలన్నారు. మతతత్వ పార్టీలకి కాకుండా లౌకిక పార్టీలని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీజేపీ దేశాన్ని మతపరంగా విభజించాలని చూస్తుందని ఆయన విమర్శించారు. ముస్లింల అభివృద్ధికి సహకరించే లౌకిక పార్టీ అయిన ఆప్‌కి ఓటు వేయాలని సూచించారు. కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బుఖారీ ఆప్‌కి వ్యతిరేకంగా మట్లాడి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు. బుఖారీ భావజాలానికి ఆప్ వ్యతిరేకం అని తమకి ఆయన మద్దతు అవసరం లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. బుఖారీ తన కుమారున్ని జామా మసీదు తదుపరి షాహీ ఇమామ్‌గా పట్టాభిషేకం చేసే కార్యక్రమానికి భారత ప్రధానిని ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని పిలిచి బుఖారీ తన అసలు రంగు బయట పెట్టుకున్నారని సంజయ్ సింగ్ విమర్శించారు. -
‘ఢిల్లీ’ కొత్త గాలికి సంకేతమా?
వరుస విజయాలతో అప్రతిహతంగా సాగుతున్న బీజేపీకి, ఏడాదిన్నర క్రితం ఆవిర్భవించిన ఆప్‌కు మధ్య సాగుతున్న ఎన్నికల సమరమిది. ఢిల్లీలో స్థిరంగా ప్రభుత్వం నడిపిన ఏ పార్టీ అయినా, దేశ రాజకీయాల్ని శాసించే శక్తిగా ఎదుగుతుందనేది చరిత్ర చెప్పే సత్యం. ఆప్‌లాంటి సంప్రదాయేతర పార్టీ ఢిల్లీలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పరచి, మనగలిగే పరిస్థితిని ఢిల్లీ ఓటరు కల్పిస్తే, పార్టీలతో నిమిత్తం లేకుండా భారత భవిష్యత్తు రాజకీయాల్లో రాగల పరిణామాల్ని మనం అంచనా వేయొచ్చు! ఓటర్ల నుంచి ‘ఢిల్లీ బహుత్ దూర్ నహీ’ అనగల తీర్పు వస్తుందా? చేరాల్సిన గమ్యం, మరోమాటలో... సాధించాల్సిన లక్ష్యం ఇంకా దూరంగా ఉన్నపుడు ‘‘ఢిల్లీ బహుత్ దూర్ హై’’ (ఢిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది) అనడం రివాజు. ఢిల్లీ ఎన్నికల సమరంలో ఇప్పుడీ మాట వర్తించేది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనేమో! దాని పరిస్థితి పోలింగ్‌కు ముందే పోటీ నుంచి వైదొలగినట్టుంది. కాగా, నువ్వా? నేనా? అన్నట్టు పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు లక్ష్యానికి సమీపంగా ఉన్నాయి. ఎవరు లక్ష్యాన్ని ఛేదిస్తారన్నదే వేచి చూడాల్సింది. మొన్నీ మధ్య దాకా బీజేపీదే పైచేయి అని ప్రచారం జరగ్గా, పోలింగ్‌కు సరిగ్గా వారం ముందు అనూహ్యంగా ఆప్ గ్రాఫ్ పైకొచ్చేసింది. అది కడదాకా కొనసాగేనా? అన్నది కోటి రూకల ప్రశ్న! అయితే, బీజేపీ కన్నా, ‘ఆప్’ కన్నా రేపు, శనివారం నాటి అసలు పరీక్ష ఢిల్లీ ఓటర్లకు. వారు ఎవర్ని గెలిపించి, గద్దెనెక్కించి దేశ భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా మారుతారన్నదే సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ ఎన్నికలు ఇంతగా ప్రాధాన్యతను సంతరించుకోడానికి కారణం, అవి సంప్రదాయ రాజకీయాల స్థానే, ఆధునిక రాజకీయ వ్యవస్థను ప్రతిష్ఠించే ఊపులో ఉండటమేనని నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ తమ వైఖరికి భిన్నంగా కిరణ్‌బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితు ల్లోకి ఆప్ దానిని నెట్టేయగలగడం వంటి ఇటీవలి పరిణామాలు అందుకు నిదర్శనం. కేంద్రంలో అధికారంలో ఉండి, వరుస విజయాలతో అప్రతిహ తంగా సాగుతున్న బీజేపీకి, ఏడాదిన్నర క్రితం ఆవిర్భవించిన ఆప్‌కు మధ్య సాగుతున్న ఎన్నికల సమరమిది. మరుగుజ్జు లాంటి ఢిల్లీ రాష్ట్రంలో స్థిరంగా ప్రభుత్వం నడిపిన ఏ పార్టీ అయినా, దేశ రాజకీయాల్ని శాసించే శక్తిగా ఎదుగుతుందనేది చరిత్ర చెప్పే సత్యం. ఆప్‌లాంటి సంప్రదాయేతర రాజ కీయ పార్టీ ఢిల్లీలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పరచి, మనగలిగే పరిస్థితిని ఢిల్లీ ఓటరు కల్పిస్తే, పార్టీలతో నిమిత్తం లేకుండా భారత భవిష్యత్తు రాజకీయాల్లో రాగల పరిణామాల్ని మనం అంచనా వేయొచ్చు! విధానాల చుట్టూ అనేక మలుపులు అవినీతి గురించి అన్ని పార్టీలూ గట్టిగానే మాట్లాడతాయి. అవినీతి అంతం చేస్తామంటూ బహిరంగ సభల్లో బడా నేతలూ ఘనంగా ప్రకటిస్తారు. కానీ ఆయా పార్టీల గత చరిత్రను ఎరిగిన ప్రజలు ఆ మాటలను పెద్దగా పట్టించుకోరు. జన్ లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు సాగుతున్న సమయంలో.. ‘‘దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మాట్లాడాలంటూ’’ రాజకీయ పార్టీలన్నీ విసిరిన సవాళ్లను ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్వీకరించారు. ఫలితంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పేరిట కొత్త పార్టీ వచ్చింది. తక్కువ సమయంలోనే ఎన్నికల్లో పోరాడింది. మెజారిటీ సాధించ లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాధా రణంగా ప్రతి చిన్న విషయానికీ ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండు చేస్తుంటాయి. కానీ అధికార పక్షం స్పందించే సందర్భాలు ప్రస్తుత రాజకీయాల్లో అరుదే. కానీ జన్ లోక్‌పాల్ బిల్లుకు కేంద్రం మద్దతు కోరుతూ పార్లమెంట్ ముందు ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ధర్నాకు దిగడమే సంచలనమైతే, కేంద్రం సహకరించనందుకు, మద్దతిచ్చిన కాంగ్రెస్ తోడు నిలువనందుకు రాజీనామా చేయడం కూడా అంతే సంచలనమైంది. అయితే ఆయన ఆశించిన దానికి భిన్నంగా ప్రజలు స్పందించారు. ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి కేజ్రీవాల్ పారి పోయారని విమర్శలను ఎదుర్కోవాల్సివచ్చింది. ఆప్ పని అయిపోయినట్లే నని అం దరూ అనుకున్నారు. ఆ తర్వాత నరేంద్రమోదీ ఇమేజ్ ముందు కేజ్రీవాల్ వెల వెలపోయారని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెప్పాయి. ఢిల్లీ ప్రస్తుత ఎన్ని కల్లో కూడా కేజ్రీవాల్ ప్రభావం పెద్దగా ఉండదని, బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ, వేగంగా పరిస్థితులు మారాయి. సంప్రదాయ రాజ కీయాలతో కేజ్రీవాల్‌ను ఢీకొట్టడం సాధ్యం కాదని ఎన్నికల వేడి మొదలైన వెంటనే బీజేపీ పెద్దలకు అర్థమైంది. అందుకే రాజకీయాలతో సంబంధమే లేని... ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్‌బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర పైకి తీసుకొచ్చారు. స్వచ్ఛమైన రాజకీయాలతోనే ఢిల్లీ ఎన్నికల్లో నెట్టుకురాగల మని భావించడం వల్లే ఆమెను రంగంలోకి దించారు. కానీ, ఇక్కడో మెలిక ఉంది. రాజీనామా చేయడం తప్పేనని అంగీకరించడంతో కేజ్రీవాల్‌కు ‘పరివర్తన’ (ఇదివరకు ఆయన నడిపిన స్వచ్ఛంద సంస్థ) చెందిన నేతగా మార్కులు పెరిగాయి. తన సహజ వైఖరికి భిన్నంగా కిరణ్‌బేడీని తెచ్చి, ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి బీజేపీ మార్కులు తగ్గాయి. ఆశించిన ‘అచ్ఛాదిన్’ కనిపించకపోవడంతో, ఈ ఆరేడు మాసాల మోదీ ప్రభుత్వాన్ని, జనహిత నిర్ణయాలతో పనిచేసిన 49 రోజుల కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఢిల్లీ సగటు పౌరులు పోల్చుకుంటున్నారు. ఆప్ విధా నాల్ని కాక కేజ్రీవాల్‌ను లక్ష్యం చేసుకొని బీజేపీ సాగిస్తున్న విమర్శలు దానికే నష్టాన్ని కలిగించి, ఆయనకు లాభాన్ని చేకూరుస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్తగాలితో మారిన ముఖచిత్రం రెండు దశాబ్దాల క్రితం వరకు ఢిల్లీ ఎన్నికలు స్థానిక రాజకీయాలకు సంబం ధించినవే. జుగ్గీజోపిడీలు(మురికివాడలు), స్థానికులు ఎక్కువగా నివసించే కాలనీల్లోనే ఎన్నికల హంగామా కనిపించేది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత తొలి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మదన్‌లాల్ ఖురానా తొలి ముఖ్య మంత్రి అయ్యారు. రెండేళ్ల తర్వాత.. ఖురానా స్థానంలో సాహిబ్సింగ్వర్మను బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. ఎన్నికలు సమీపిస్తుండగా ఉల్లి ధర మండి సామాన్యుడి చేత కంటతడి పెట్టించినప్పుడు.. గెలుపుపై విశ్వాసం కోల్పో యిన ఆ పార్టీ వర్మ స్థానంలో సుష్మాస్వరాజ్‌ను ముఖ్యమంత్రిని చేసింది. నాటి ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలు షీలాదీక్షిత్‌కు దీటైన అభ్యర్థి సుష్మా అని అప్ప ట్లో బీజేపీ ప్రకటించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని లేదా బీజేపీ ఓట మిని సుష్మా నిలువరించలేకపోయారు. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్ని కల్లో బీజేపీ పరాభవం పాలైంది. 15 ఏళ్ల షీలాదీక్షిత్ పాలన పట్ల ప్రజలకు ముఖం మొత్తడం, కామన్వెల్త్ క్రీడల్లో అంతులేని అవినీతి, విద్యుత్ సరఫరా వ్యవస్థ మీద ప్రైవేటు కంపెనీల పెత్తనం, నల్లా ఛార్జీల పెంపు తదితర కారణా లతో ఆమె పాలన మీద ప్రజల్లో తీవ్రవ్యతిరేకత వ్యక్తమైంది. దేశాన్ని కుదిపే సిన ‘నిర్భయ’ ఉదంతం.. ఇంగ్లిష్‌లో అనేట్టు శవపేటికపై ఆఖరి మేకయింది. షీలాదీక్షిత్ అధికారంలో ఉన్న ఆ 15 ఏళ్లలో ఢిల్లీ ముఖచిత్రం మారిపోయింది. మెరుగైన రోడ్లు, మెట్రోరైలు, మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లను ఏర్పాటు చేసి, పాల నలో ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడానికి షీలా ప్రభుత్వం చేప ట్టిన ‘భాగిదారి’ కార్యక్రమం.. ఢిల్లీలోని అన్ని వర్గాలను స్థానిక రాజకీయాల్లో మమేకం చేసింది. విద్యావంతులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు పార్లమెంట్ ఎన్నికల పట్ల మాత్రమే ఆసక్తిని చూపే తీరు మారి.. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లోనూ పాల్గొనడం ప్రారంభించారు. కేజ్రీవాల్ వచ్చి దాన్ని శీర్షస్థితికి తీసు కువెళ్లారు. సెంట్రల్ ఢిల్లీతో పాటు మొత్తం దాదాపు 50 నియోజకవ ర్గాల్లో విద్యావంతుల ప్రభావం అధికం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి మొదలు అత్యున్నత స్థానాల్లో ఉన్న పలువురు ఢిల్లీ ఓటర్లు కావడం గమనార్హం. ఉన్నత, మధ్యతరగతి ఓటర్లలో కూడా శాసనసభ ఎన్నికల పట్ల ఆసక్తి పెరగడంతో వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. 1998లో 48.99 శాతం, 2003లో 53.42 శాతం, 2008లో 57.58 శాతం, 2013లో 65.63 ఓటింగ్ శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లోనూ 65-68 మధ్య ఓటింగ్ శాతం నమోదు కావచ్చని అంచనా. నిజానికి ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుగుదల సంకేతాలే! సంప్రదాయ రాజకీయ శక్తుల బండారం బయటపడటం, ఆధునిక రాజకీయ వ్యవస్థ బాలారిష్టాల్ని అధిగమించడం నిన్నా, ఇవాల్టి ఢిల్లీ ఎన్నికల కొత్తగాలి. మినీ ఇండియా తేల్చేదేమిటి? ఢిల్లీ విచిత్రమైన నగరం. దేశంలోని మరే మెట్రో నగరంలో లేనంతగా, ‘నాకేంటి?’ అనే వ్యక్తిగత చింతన ఢిల్లీ ప్రజలది. అంతర్జాతీయ దౌత్యవిధా నాలో, దేశానికి ఊతమిచ్చే ఆర్థిక-పారిశ్రామిక విధానాలో, ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లజేసే పాలనా సంస్కరణలో వారిని పెద్దగా ప్రభావితం చేయవు. ఉద్యోగ, వ్యాపార వర్గాలే అత్యధిక జనాభాగా ఉండే ఢిల్లీ పౌరుల్ని స్థానిక పాలన, భద్రత, పౌర సదుపాయాలు, ఆర్థికావకాశాల కల్పన, నిత్యావసరాల ధరల్ని నియంత్రించడం వంటివే ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. ఢిల్లీలో దక్షి ణాది ఓటర్లు 10 శాతానికిపైగా ఉంటారని అంచనా. తమిళ, మలయాళీల తర్వాత స్థానం తెలుగువాళ్లదే. కన్నడిగులూ ఉంటారు. దక్షిణాది ప్రజల తర్వాత బెంగాలీయుల సంఖ్య ఎక్కువ. దేశ రాజధానిని బ్రిటిష్ ప్రభుత్వం కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు.. ఉద్యోగులంతా అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. ఢిల్లీ గతంలో పంజాబ్ ప్రావిన్స్‌లో భాగం కాబట్టి పంజా బీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ప్రభావం ఢిల్లీ రాజకీయాల మీద అధి కం. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు మూడు దశాబ్దాల తర్వాత కూడా ఎన్నికల అంశం కావడానికి కారణం పంజాబీల ప్రభావమే. పూర్వాంచలీయ (బిహారీల) ఓటర్ల సంఖ్య తక్కువేమీ కాదు. జుగ్గీ జోపిడీలు (మురికివాడలు), అనధికారిక కాలనీల్లో బిహారీల సంఖ్య గణనీయంగా ఉంటుంది. పొరుగున ఉన్న హర్యానా ప్రభావం ఔటర్ ఢిల్లీలో పెద్దగా నగరీకరణ చెందని 20 నియోజకవర్గాల్లో ఉంటుంది. ఆయా నియో జకవర్గాల్లో కుల రాజకీయాలు, కాప్ పంచాయతీల ప్రభావం అధికం. ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు గాను ఈ 20 స్థానాల్లో అన్ని వ్యవహారాలూ కుల రాజకీయాల చుట్టూనే తిరుగుతాయి. మిగతా 50 నియోజకవర్గాలు మినీ ఇండియాను తలపిస్తాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రస్తుతం శివార్లలోని ఈ 20-30 నియోజకవర్గాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇన్ని సమీకర ణాల మధ్య... భారతదేశ భవిష్యత్ రాజకీయాల్లోకి కొత్త గాలిని నింపడంలో ‘ఢిల్లీ బహుత్ దూర్ నహీ’ అనగల తీర్పు వస్తుందా? వేచి చూద్దాం. సమకాలీనం: దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ఢిల్లీ లో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఢిల్లీ: గతకొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన ఢిల్లీ చల్లబడింది. గురువారంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో ప్రధానంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ లు ప్రచారంతో హోరెత్తించాయి. బీజేపీ ప్రచార సారథిగా ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ఆకట్టుకునే యత్నం చేశారు. ప్రధానంగా ఆప్ నే లక్ష్యంగా చేసుకుని ప్రధాని విమర్శలు గుప్పించారు. అయితే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్నికల్లో తన మార్క్ ప్రచారం నిర్వహించి మరోసారి ఆకట్టుకునే యత్నం చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది. ఈ నెల ఏడో తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుండగా, 10 వ తేదీ కౌంటింగ్ జరుగనుంది. -
ప్రియమైన అమ్మా నాన్నా..
* తల్లిదండ్రులు ఓటు వేసేవిధంగా పిల్లలతో కౌన్సెలింగ్ * ఓటింగ్ శాతం పెంచడానికి స్కూలు విద్యార్థులను ఆశ్రయించిన ఈసీ * సంకల్ప పత్రాలపై సంతకాలు పెట్టించి తీసుకురావాలని సూచన సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆశ్రయించింది. తమ తల్లిదండ్రులతో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించాల్సిన బాధ్యతను వారిపై ఉంచింది. పిల్లల భవిష్యత్తు కోసం ఫిబ్రవరి 7న ఓటు వేస్తామని ప్రతిజ్ఞ పత్రంపై తల్లిదండ్రులతో సంతకం చేయించి తీసుకురావాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు విద్యాశాఖ స్కూలు విద్యార్థులను కోరింది. ‘ప్రియమైన అమ్మా నాన్నా ... మీరు నన్ను ఎంతో ప్రేమిస్తారని, నా భవిష్యత్తును ఉజ్వలంగా ఉంచడం కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తారని నాకు తెలుసు. నా భవిష్యత్తు పటిష్టమైన ప్రజాస్వామ్యంతో గట్టిగా ముడిపడిఉంది. అందుకే మీరు ఫిబ్రవరి 7న ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయాలని నేను కోరుతున్నాను. మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారన్న నమ్మకం నాకుంది..’ అని రాసి ఉన్న సంకల్పపత్రాలను విద్యాశాఖ విద్యార్థులకు పంచింది. విద్యార్థులు వీటి పై తల్లిదండ్రులతో సంతకం చేయించి స్కూలు టీచర్లకు తిరిగి ఇవ్వవలసి ఉంది. ఢిల్లీ సర్కార్, ఎమ్సీడీ, ఎన్డీమ్సీ , ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు నడిపే స్కూళ్లలో ఇటువంటి సంకల్ప పత్రాలను విద్యార్థులకు పంచినట్లు జాయింట్ చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ రాజేష్ గోయల్ తెలిపారు. ఈ పత్రాలను పిల్లలకు ఇచ్చి వారి తల్లిదండ్రులతో సంతకం చేసిన తర్వాత వాటిని తిరిగి ఫిబ్రవరి 5 వరకు పిల్లల నుంచి సేకరించవలసిన బాధ్యతను విద్యాశాఖ స్కూలు అధికారులకు అప్పగించింది. పిల్లలు ఈ పత్రాలను ఇంటికి తీసుకుపోవడం వల్ల కుటుంబసభ్యుల మధ్య కొంత చర్చ జరుగుతుందని, దాని వల్ల ఓటింగ్‌పై అవగాహన పెరుగుతుందని ఎన్నికల కమిషన్ ఆశిస్తోంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం పిల్లలకు కూడా కల్పించడం వల్ల ఓటింగ్ శాతం పెరగడంతో పాటు రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం కూడా పిల్లలకు లభిస్తుందని స్కూలు ప్రిన్సిపాళ్లు అంటున్నారు. గత ఎన్నికల సమయంలోనూ తల్లి దండ్రులతో ఓటు వేయించాలని పిల్లలను కోరినప్పటికీ సంకల్పపత్రాలను పంచి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించడం మాత్రం ఇదే మొదటిసారని వారు అంటున్నారు. -
విరాళాల హోరు!
జాతరను తలపించేలా సాగుతున్న ఢిల్లీ ఎన్నికల ప్రచార హోరులో జనం సమస్యలు తప్ప అన్నీ ప్రస్తావనకొస్తున్నాయి. క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖంగా చర్చకొచ్చిన మహిళల భద్రత అంశం ఈసారి ఎటో కొట్టుకుపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినందువల్ల ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చే అంశాన్ని బీజేపీ ఇప్పుడు ప్రస్తావించడమే మానుకుంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు చెక్కుల రూపంలో వచ్చిన రూ. 2 కోట్ల విరాళాలపై మూడు రోజులుగా మోత మోగుతోంది. దీనికి ‘అర్ధరాత్రి హవాలా’ అని ఒక పేరు కూడా పెట్టారు. ఈ విరాళాల సంగతి బయటపెట్టింది ఆప్‌కు ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన ఆప్ వలంటీర్ యాక్షన్ మంచ్(ఆవామ్) అయినా అందిపుచ్చుకున్నది మాత్రం బీజేపీనే! ఇతర పార్టీలకన్నా నీతిమంతులమని చెప్పుకునే ఆప్ అసలు రూపం బయటపడిందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. 2013 ఎన్నికల్లో ఇలా ఆప్ ‘అసలు రూపాన్ని’ బయటపెట్టే బాధ్యతను అప్పుడు యూపీఏ సర్కారుకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ స్వీకరించింది. పెద్ద గొడవచేసింది. చేతిలో ప్రభుత్వం ఉన్నది గనుక దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఇలా గొడవ చేయడంవల్ల ఆప్ తప్ప మిగిలిన పార్టీలన్నీ నిజాయితీగా ఉంటున్నాయని అందరూ భావించారు. తీరా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఏడబ్ల్యు) సంస్థలు విడుదల చేసిన గణాంకాలు బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చట్టాలను బేఖాతరుచేసి విరాళాలు ఎలా స్వీకరిస్తున్నాయో వెల్లడించాయి. మరి ఆప్ తీసుకున్న విరాళాలపైనే ఎందుకింత రగడ చేయాల్సివస్తున్నదో ప్రధాన రాజకీయ పార్టీలే చెప్పాలి. రూ. 2 కోట్ల విరాళంపైన మాత్రమే కాదు... తమకొచ్చిన చందాల న్నిటిపైనా దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ ప్రకటించడంతోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి రాజకీయ పార్టీల విరాళాలపై ఆరా తీయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి 2003లో చేర్చిన సెక్షన్ 29సీ ప్రకారం రూ.20,000కు మించి విరాళాలిచ్చినవారి పేర్లను ప్రతి పార్టీ ఎన్నికల సంఘానికి వెల్లడించాలి. అలాంటివారి పాన్ నంబర్లను, చిరునామాలను అందించాలి. చిన్న మొత్తాలే అయినా ఏడాదిలో ఒకసారికన్నా ఎక్కువ సందర్భాల్లో ఇస్తే అలాంటి సంస్థ లేదా వ్యక్తి పేరును కూడా వెల్లడించాలి. ఇక విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టమైతే విదేశీ సంస్థలనుంచి లేదా ఇక్కడున్న వాటి అనుబంధ సంస్థల నుంచీ విరాళాలు తీసుకోవడం నిషిద్ధమని చెబుతున్నది. కేవలం మన దేశంలోని ప్రైవేటు కంపెనీల నుంచి మాత్రమే పార్టీలు విరాళాలు సేకరించవచ్చు. రూ. 20,000 లోపు విరాళా లిచ్చిన వారి పేర్లు ఇవ్వనవసరం లేదన్న లొసుగు ఉన్నది గనుక చాలా పార్టీలు అలాంటి విరాళాల ద్వారా సమకూరిన మొత్తం ఎంతో చెప్పడంలేదు. ఆ మొత్తానికి పైబడి ఇచ్చే వారికి సంబంధించిన వివరాలను కూడా చాలా సందర్భాల్లో అసం పూర్తిగా ఇస్తున్నాయి. ఇచ్చినవారెవరో... వారికి ఆ పార్టీతో ఉన్న అనుబంధం ఎలాం టిదో ఆరా తీయడం అసాధ్యమవుతున్నదని ఏడీఆర్ వాపోయింది. 2004-13 మధ్య జాతీయ పార్టీలకు మొత్తం రూ. 4,368.75 కోట్లు వచ్చాయని, ఇందులో 73 శాతం ‘గుర్తు తెలియని వర్గాల’నుంచి ఆ పార్టీలకు అందాయని వివరించింది. ఇందులో సగానికిపైగా మొత్తం ఎన్నికలకు నాలుగు నెలల ముందు వచ్చాయని విశ్లేషణలో తేలింది. నిబంధనలైతే చాలానే ఉన్నాయి. కానీ ప్రధాన రాజకీయ పార్టీలే విరాళాల విషయంలో పారద ర్శకతను పాటించడం లేదని దీన్నిబట్టి అర్థమవుతున్నది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి నిర్ణీత కాల వ్యవధిలో చట్టసభలకు ఎన్నికలు జరుగుతుంటాయి. చిత్రమేమంటే ఈ ఎన్నికల సమయంలోనే భారీ యెత్తున నల్లధనం రంగు మార్చుకుని మొత్తం వ్యవస్థనే బలహీనపరుస్తున్నది. ఈ నల్లధనానికి... దాంతోపాటు సాగే అవినీతికి, నేర కార్యకలాపాలకూ పార్టీల కొచ్చే లెక్కచూపని విరాళాలే ప్రధాన వనరు అని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. 45 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు కంపెనీలు విరాళాలివ్వడాన్ని నిషేధిస్తూ కంపెనీల చట్టానికి సవరణ తీసుకొచ్చింది. అంత వరకూ కొద్దో గొప్పో పారదర్శకత ఉండేదంతా దాంతో తుడిచిపెట్టుకు పోయింది. ఆనాటినుంచి కంపెనీలు ‘గుప్త దానాలు’ చేయడం మొదలెట్టాయి. అటు తర్వాత చాన్నాళ్లకు కంపెనీల చట్టాన్ని సవరించి ప్రతి సంస్థా లాభనష్టాల పట్టికలో పార్టీలకిచ్చిన విరాళాల వివరాలివ్వాలన్న నిబంధనపెట్టారు. కంపెనీలకూ, రాజకీయ పార్టీలకూ మధ్య సాగే అక్రమ వ్యవహారాలను నిరోధించడానికి 1964లో సంతానం కమిటీ విలువైన సిఫార్సులు చేసింది. 1978లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పార్టీలకొచ్చే నిధులపై తార్కుండే కమిటీ ఏర్పాటుచేశారు. ఆ కమిటీ ఎన్నో సూచనలు చేసింది. 1980లో గోస్వామి కమిటీ కూడా ఎన్నికల్లో నల్లధనం ప్రభావం తగ్గించడానికంటూ ఎన్నో సిఫార్సులు చేసింది. కంపెనీలు విరాళాలిచ్చే విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వమే నిధులు సమకూర్చేలా చట్ట సవరణ జరగాలని సూచించింది. ఏ ప్రభుత్వాలూ ఈ సూచనలనూ, సిఫార్సులనూ పట్టించుకున్న పాపాన పోలేదు. చెప్పాలంటే ఆప్ విరాళాలిచ్చిన దాతల పేర్లను తన వెబ్సైట్లో మొదటినుంచీ పొందుపరుస్తున్నది. చెక్కుల రూపంలో సొమ్ము వచ్చిన పక్షంలో ఆ చెక్కు నంబర్లను సైతం ఇస్తున్నది. ఈ వెబ్సైట్ ద్వారా లభించిన సమాచారంతోనే ఆప్ ప్రత్యర్థులు ‘అర్థరాత్రి హవాలా’ గురించి హడావుడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే చర్చకొచ్చి అటు తర్వాత ఎవరూ పట్టించుకోని ఈ విరాళాల అంశంపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టిపెట్టాలి. పార్టీలన్నీ విరాళాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేలా చట్టానికి సవరణలు తీసుకురావాలి. ఇలాంటి సంస్కరణలకు సిద్ధపడకపోతే ఎన్నికల విధానంలోనే ఈ దేశ పౌరులు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. -
1984 అల్లర్లపై మళ్లీ విచారణ ?
సిట్‌ను ఏర్పాటు చేయాలని మాథుర్ కమిటీ సిఫారసు! న్యూఢిల్లీ: ఢిల్లీలో 30 సంవత్సరాల కిందట సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై కేంద్రం తాజాగా విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1984 నాటి ఈ అల్లర్లపై పునర్ విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికే బీజేపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించాయి. అప్పటి అల్లర్లపై పునర్విచారణ జరపడానికి గల అవకాశాలను పరిశీలించడంకోసం ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీపీ మాథుర్ నాయకత్వంలో గత ఏడాది డిసెంబర్ 23న ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గతవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తన నివేదికను సమర్పించింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఈ అల్లర్లపై విచారణకోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈనెల 7న అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సిట్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ఆ వర్గాలు వెల్లడించాయి. అప్పటి అల్లర్లలో మొత్తం 3,325 మంది మృతి చెందగా, ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ప్రధాని మోదీ ఇటువంటి జిమ్మిక్కులు చేస్తున్నారని, ఇది పూర్తిగా దిగజారుడు చర్య అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్‌సింగ్ సూర్జేవాలా విమర్శించారు. అప్పటి అల్లర్లలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పాత్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. ఆమ్ఆద్మీ పార్టీ కూడా ఈ చర్యపై ధ్వజమెత్తింది. విచారణ గురించి కావాలనే లీకులు ఇస్తున్నారని ఆ పార్టీ నేత హెచ్ఎస్ పూల్కా అన్నారు. -
అధికారమిస్తే.. ఆవాస హక్కు: రాహుల్
న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెనక్కు తేవడంలో దారుణంగా విఫలమైన ప్రధాని నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనలో మాత్రం రూ. 10 లక్షల విలువైన సూట్ ధరించారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో గురువారం ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు ఆవాస హక్కు(రైట్ టు షెల్టర్)ను కల్పిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ‘విదేశాల్లో భారతీయులు దాచిన కోట్ల రూపాయల బ్లాక్‌మనీని వెనక్కు తెస్తానని లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ టామ్‌టామ్ చేశారు. ప్రతీ పౌరుడి బ్యాంక్ అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తానన్నారు. మీ అకౌంట్లోకి ఆ డబ్బులు రాలేదు కానీ ఆయన మాత్రం రూ. 10లక్షల విలువైన సూట్ ధరించారు’ అని ఎద్దేవా చేశారు. ‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే స్వచ్ఛ భారత్ అంటూ చీపురు చేతికిచ్చి.. తాను మాత్రం అమెరికా, ఆస్ట్రేలియాలకు వెళ్తాడు’ అంటూ చురకలంటించారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో బీజేపీ కావాలనే మత విద్వేషాలను రెచ్చగొట్టి ఘర్షణలను సృష్టిస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. గతంలో ప్రతీ అంశంపైనా నిరసనలు, ధర్నాలు నిర్వహించిన కేజ్రీవాల్ ఇప్పుడెందుకు చేయడం లేదని ప్రశ్నించారు. -
పార్టీకి కిరణ్‌బేడీ అవసరముంది..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్‌బేడీ వంటి నాయకుల అవసరం పార్టీకి ఉందని, అందుకే ఆమెను పార్టీలో చేర్చుకున్నట్లు అమిత్‌షా స్పష్టం చేశారు. ఆయన శనివారం ఢిల్లీలోని హరినగర్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కిరణ్‌బేడీ చేరిక వల్ల పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఏర్పడిన అసంతృప్తిని పోగొట్టడానికి ఆయన ప్రయత్నించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ఆయన జోస్యం చెప్పారు. సగానికి పైగా సీట్లలో ఆప్ ధరావతు కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపారు. ఢిల్లీలోనూ మోదీ ప్రభంజనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ఏడు నెలల్లో మోదీ సర్కార్ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని, ఢిల్లీవాసుల కోసం అనేక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని ఆయన వివరించారు. కాగా, పార్టీ ఎన్నికల్లో గెలవడానికి కార్యకర్తల సహకారం ఎంతో అవసరమన్నారు. కార్యకర్తలందరూ ఇంటింటికి తిరిగి పార్టీ కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ మేరకు ప్రతి కార్యకర్త సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజలను కలవాలని ఆయన ఆదేశించారు. కిరణ్‌బేడీ సుడిగాలి ప్రచారం కిరణ్‌బేడీ చేరికతో కమలదళం ఎన్నికల ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణిస్తున్న బేడీ.... సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. నగరంలోని మొత్తం 70 విధానసభ నియోజకవర్గాల్లో జనసభలు నిర్వహిస్తారని అంటున్నారు. రోజుకు ఐదు విధానభ నియోజకవర్గాల్లో ఆమె సభలు జరుగుతాయని తెలిసింది. రోహిణీ ప్రాంతంలో ఆదివారం జరిగే రోడ్‌షోలో ఆమె పాల్గొననున్నారు. నరేంద్ర మోదీ మాదిరిగా తాను కూడా సామాజిక మాధ్యమాన్ని ప్రచార సాధనంగా వాడుకోనున్నట్లు బేడీ వెల్లడించారు. ఆమె ప్రతి రోజూ ట్విటర్లో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. -
ఎన్నికల బరిలో శివసేన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ, బీఎస్పీ లతో పాటు ఈసారి శివసేన కూడా తన అభ్యర్థులను నిలబెడుతోంది. ఈ ఎన్నికల్లో 40 స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీ నేత ఉద్ధవ్‌థాక్రే నిర్ణయించారు. పార్టీ నిర్ణయం మేరకు శివసేనకు చెందిన శివ్ కాశీ తివారీ సోమవారం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్, కాంగ్రెస్ తరఫున కిరణ్ వాలియా పోటీచేయనున్న సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి ఎవరన్నది త్వరలో తేలనుంది. కాగా, నామినేషన్ దాఖలు చేయడం కోసం కాశీ తివారీ ఒంటెపై ఊరేగింపుగా వెళ్లడం పలువురి దృష్టిని ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా, ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి శివసేన పోటీతో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శివసేన, బీజేపీ కలిసి మహారాష్ట్రలో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కాగా, శివసేన అభ్యర్థులు బీజేపీ ఓట్లకు కొంతమేర గండి కొట్టే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీకి జరిగే నష్టం గురించి తాము ఆలోచించేపరిస్థితి లేదని శివసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
'ఆప్'పడమేనా ?
అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీని స్థాపించడం ... ఆ వెంటనే దేశ రాజధాని హస్తినకు అసెంబ్లీకి ఎన్నికలు రావడం .... ఆ ఎన్నికల్లో 28 సీట్లు చీపురుతో లాగేసుకుని తన ఖాతాలో వేసుకుని కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్టించడం... ఆ తర్వాత కేవలం 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే అనూహ్య పరిణామాలతో మళ్లీ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందా లేకా 'అప్'పడమేనా అనేది ఓటర్లు తేల్చవలసి ఉంది. కాగా గత ఎన్నిక సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పటికే ముచ్చటగా మూడుసార్లు సీఎం పీఠాన్ని అలంకరించిన షీలా దీక్షిత్‌పై కేజ్రీవాల్ పోటీ చేసి విజయం సాధించారు. దాంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ 31 స్థానాలు గెలుచుకున్నా అధికారం చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో కేవలం 8 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ పొత్తుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదంతా గతం. అయితే ప్రస్తుత పరిస్థితులు వేరు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వరుసగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కమలం వికసించింది. కాషాయం అంతగా కనిపించని కాశ్మీర్లో కూడా ఆ పార్టీ అధిక సీట్లు గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. దాంతో దేశమంతా కాషాయమయం కావాలని కమలనాథులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. అంతేకాకుండా కమలదండు ఇప్పటికే దేశ రాజధాని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు దూసుకుపోతుంది. అందులో భాగంగా ఒకప్పటి కేజ్రీవాల్ సన్నిహితులుగా ముద్రపడిన కిరణ్ బేడీ, షాజియా ఇల్మీలు కమల తీర్థం పుచ్చుకున్నారు. ఆ క్రమంలో బీజేపీ మరింత బలం పుంజుకునే అవకాశాలున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గతంలో కంటే మరిన్నీ స్థానాలు గెలుచుకుని... చీపురుతో కమలాన్నీ ఊడ్చేస్తారా లేక కమల రేకుల కింద పడి 'ఆప్'పడమవుతుందా అనేది చూడాలి. -
ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె , కథక్ నర్తకి శర్మిష్ట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. ఆ పార్టీ మూడో విడత విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు లభించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తున్నారు. -
కొత్త సీఈసీగా హరిశంకర్ బ్రహ్మ
ఈ నెల 25న ఈఆర్‌ఎంఎస్ ప్రారంభం న్యూఢిల్లీ: దేశ 19వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ(64) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రపంచం దృష్టి అంతా ప్రస్తుతం ఢిల్లీపై ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సీఈసీగా ఉన్న వీఎస్ సంపత్ గురువారం పదవీవిరమణ చేశారు. అత్యుత్తమ సేవలందించడం ఎన్నికల సంఘం దీర్ఘకాలిక లక్ష్యమని బ్రహ్మ వివరించారు. ఎన్నికల నిర్వహణను మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఎన్నికల సంఘం ‘ఎలక్ట్రానిక్ రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఆర్‌ఎంఎస్)’ను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తోందని వెల్లడించారు. ఇటీవలి సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు ప్రవాస భారతీయులకు ఈ- ఓటింగ్ ద్వారా ఓటుహక్కు కల్పించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోందన్నారు. 1975 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి బ్రహ్మ అసోంకు చెందినవారు. ఈ ఏప్రిల్ 19తో ఆయనకు 65 ఏళ్లు నిండనుండటంతో అప్పటివరకు మాత్రమే ఆయన సీఈసీగా ఉంటారు. ముందే నిషేధించాలి: వీఎస్ సంపత్ హత్య తదితర తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘం సిఫారసు చేసిందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ వెల్లడించారు. అలాగే, చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలని కూడా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు సంపత్ గురువారం తెలిపారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ఖర్చుపైనా పరిమితి విధించాలని సిఫారసు చేశామన్నారు. శిక్ష పడిన తరువాత నిషేధించడం కాకుండా.. కోర్టుల్లో ఐదేళ్లు, లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న కేసులున్న వ్యక్తులందరినీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడం ద్వారా రాజకీయాల్లో నేరచరితుల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చన్నారు. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి చాన్నాళ్లుగా ఈసీ ఈ డిమాండ్ చేస్తోందని.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సంబంధిత సవరణ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఆరేళ్లపాటు సంపత్ ఎన్నికల కమిషనర్‌గా సమర్థ్ధవంతంగా విధులు నిర్వర్తించారు. సంపత్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు.. ఎన్నికల కోడ్‌ను చట్టంగా మార్చే ప్రతిపాదనకు ఈసీ వ్యతిరేకం నా హయాంలో ఓటరు కేంద్రంగా ఈసీ మారడం సంతృప్తినిచ్చింది రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల విషయంలో పారదర్శకత లేదు. సంబంధిత చట్టం చాలా బల హీనంగా, అసంపూర్తిగా ఉంది. భారత్‌లో రాజకీయ పార్టీల నియంత్రణకు సమగ్ర చట్టం లేదు లోక్‌సభ ఎన్నికల సమయంలో వారణాసిలో నరేంద్రమోదీ పాల్గొంటున్న ర్యాలీకి అనుమతి నిరాకరించడం తప్పని భావించడం లేదు. -
కమలదళంలోకి కిరణ్ బేడీ
* బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో చేరిక * ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ ఐపీఎస్ * మోదీ స్ఫూర్తితోనే చేరానని, కేజ్రీవాల్‌పై పోటీకి సిద్ధమని వ్యాఖ్య * ఆప్ మాజీ నాయకురాలు షాజియా ఇల్మీకీ బీజేపీ సభ్యత్వం న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో గురువారం ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బేడీ పోటీ చేస్తారని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు. తమ పార్టీ సీఎం అభ్యర్థిని తర్వాత ప్రకటిస్తామన్నారు. బేడీ చేరిక వల్ల ఢిల్లీలో బీజేపీ బలపడుతుందని పేర్కొన్నారు. అనుభవం, విశ్వసనీయత కలిగిన బేడీని పార్టీలో చేర్చుకోవడం తమకు ఎంతో లాభిస్తుందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కాగా, పార్టీ ఆదేశిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేయడానికి సిద్ధమని కిరణ్ బేడీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితోనే బీజేపీలో చేరినట్లు చెప్పారు. తనకున్న 40 ఏళ్ల పాలనానుభవాన్ని ఢిల్లీ అభివృద్ధి కోసం వినియోగిస్తానన్నారు. రాష్ట్రానికి పటిష్టమైన, అనుభవం కలిగిన సుస్థిర ప్రభుత్వం అవసరముందన్నారు. తనకు పనిచేయడం, పనిచేయించడం వచ్చునని ఆమె వ్యాఖ్యానించారు. తాను స్థాపించిన రెండు స్వచ్ఛంద సంస్థలు 26 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నాయని వివరించారు. కాగా, కిరణ్ బేడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని అమిత్ షా వెల్లడించలేదు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కాగల సత్తా ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉందని, సీఎం అభ్యర్థిని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు బీజేపీలో ఆమె చేరిక షాక్‌కు గురిచేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. అయితే రాజకీయాల్లో చేరాలని కిరణ్ బేడీని ఒప్పించడానికి గతంలో తీవ్రంగా ప్రయత్నించానని, ఇప్పటికైనా ఆమె ఆ పని చేశారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఢిల్లీ అభివృద్ధి కోసం తాను పోరాడుతుంటే, తనను ఓడించడానికే బీజేపీ కంకణం కట్టుకున్నదని పేర్కొన్నారు. ఇక ఏడాది కాలంగా కిరణ్‌బేడీ తనతో మాట్లాడలేదని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే తెలిపారు. ఆమె బీజేపీలో చేరే విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. మరోవైపు ఆప్ మాజీ నాయకురాలు షాజియా ఇల్మీ కూడా బీజేపీలో చేరారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. మార్పు, అభివృద్ధి ఎజెండాతో బీజేపీ కొత్త ఒరవడిని సృష్టిస్తోందని ఆమె కొనియాడారు. ప్రధాని మోదీ స్ఫూర్తితోనే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆదేశాలను అనుసరిస్తానని పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిపై ఆప్ ఆరోపణలు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయకు విద్యుత్ పంపిణీ సంస్థ బీఎస్‌ఈఎస్‌తో ఆర్థిక సంబంధాలున్నాయన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇందుకు సంబంధించి న ఆధార పత్రాలను కూడా ఆమ్ఆద్మీ పార్టీ బయటపెట్టింది. సతీశ్ ఉపాధ్యాయ వెంటనే రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేసింది. ఆయనకు ఆరు కంపెనీలు ఉన్నాయని, అందులో రెండింటికి చట్టవిరుద్ధంగా ఒకటికన్నా ఎక్కువ వ్యాట్ నంబర్లు ఉన్నాయని ఆప్ నేత కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ అరవింద్ కే జ్రీవాల్‌కు సతీశ్ ఉపాధ్యాయ లీగల్ నోటీసులు పంపారు. బీఎస్‌ఈఎస్‌తో సంబంధాలున్న ఎన్‌సీఎన్‌ఎల్ కంపెనీతో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. -
మోదీ హవాను ఆప్ అడ్డుకుంటుందా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి మోదీ, కేజ్రీవాల్‌లను కేంద్రంగా చేసుకునే జరుగనున్నాయి. 2013 ఎన్నికల సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పొలిటికల్ గ్రాఫ్ దూసుకెళ్లి ఎన్నికల ఫలితాలను శాసించింది. ప్రధాని నరేంద్రమోదీ హవా జాతీయ స్థాయిలో దాదాపుగా అదేసమయంలో ఊపందుకుంది. మోదీ, కేజ్రీవాల్‌ల వ్యక్తిగత ప్రతిష్ట స్థాయిలో నాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, కాంగ్రెస్ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ నేత.. 49రోజులైనా పరిపాలన చేయలేక రాజీనామా చేయటంతో ఆయన గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. దాని పర్యవసానం దాదాపు ఏడాది పాటు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధింపు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ కొంచెం కూడా పుంజుకోలేదు సరికదా.. నాయకత్వ లేమి ఆ పార్టీని వెంటాడుతోంది. దీంతో మరోసారి ఎన్నికలకు మోదీ, కేజ్రీవాల్‌లు కేంద్ర బిందువుగా మారారు. ఇద్దరూ కూడా ఇప్పటికే ఒకరికొకరు లక్ష్యంగా వాడివేడి ప్రచారాన్ని ప్రారంభించారు. గతవారం రామ్‌లీలా మైదానంలో మోదీ తొలి ఎన్నికల ప్రచార సభ మొత్తం కూడా ఆప్ లక్ష్యంగానే సాగింది. పరిపాలన ఎలా చేయాలో చేతకాని వాళ్లు, అరాచక వాదులుగా ఆప్ నేతలను మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏడాది పాటు ఢిల్లీలో ప్రభుత్వమనేది లేకుండా చేసిన వాళ్లను తీవ్రంగా శిక్షించాలనీ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్‌కు ఈ ఎన్నికలు రాజకీయ జీవిత పోరాటంగా మారాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తమను తేలిగ్గా తీసుకున్నాయని, అలాంటి సమయంలోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని.. ఇప్పుడు భారీ మెజారిటీతో గెలవబోతున్నామని సోమవారం బెంగళూరులో కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ హవాను ఆప్ ఎంతవరకు ఆపగలుగుతుందో చూడాలి. - సెంట్రల్ డెస్క్ బీజేపీ మిషన్ 60 ఈ విధానసభ ఎన్నికలు భారతీయ జనతాపార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకుని అతిపెద్దపార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి నాలుగు స్థానాల దూరంలో ఆగిపోవటం ఆ పార్టీకి నిరాశ కలిగించింది. అయితే, ఒకటిన్నర నెల కూడా అధికారంలో ఉండలేని కేజ్రీవాల్ స్వయంకృతం కమలనాథులకు కొంతమేరకు కలిసివచ్చే అంశం కావచ్చు. అందుకే 70 స్థానాల అసెంబ్లీలో ఏకంగా 60 స్థానాలు గెలుచుకోవాలన్న టార్గెట్‌తో వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువస్తోంది. ఈ ఎన్నికలు బీజేపీ కంటే కూడా మోదీ ఇమేజికి అత్యంత కీలకమని చెప్పవచ్చు. మోదీ హవాతో జమ్మూ, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరుస విజయాలతో ఉత్సాహంగా ఉండటంతో, ఢిల్లీలో గెలుపొందటానికి కూడా బీజేపీకి మోదీపై ఆధారపడటం మినహా మరోమార్గం లేదు. కనీసం 15 ర్యాలీలలోనైనా మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయంటేనే.. ఈ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 2013లో బీజేపీ సీఎం అభ్యర్థి అయిన హర్షవర్ధన్ ఇప్పుడు కేంద్ర మంత్రి కావటంతో, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ సారథిగా మాకెన్ ఢిల్లీ విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే కుదేలైన కాంగ్రెస్ ఢిల్లీలోనైనా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ అసలు బరిలో నిలబడటానికి ఆసక్తి కనపరచటం లేదు. కేంద్ర మాజీమంత్రి కపిల్‌సిబల్ కానీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు జైప్రకాశ్ అగర్వాల్ కానీ ఏ ఒక్కరూ బరిలో నిలబడే అవకాశాలు లేవు. విచిత్రమేమంటే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయన పేరు కాంగ్రెస్ తొలిజాబితాలోనే ప్రకటించింది. ఇన్ని కష్టాల మధ్య ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షునిగా పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ అజయ్ మాకెన్‌ను నియమించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల కమిటీ సోమవారం సమావేశమై 39మంది అభ్యర్థులతో రెండో జాబితాను సిద్ధం చేసింది. కృష్ణతీరథ్, మహాబల్ మిశ్రాలకు ఈ జాబితాలో చోటు దక్కినట్లు సమాచారం. ఆనాటి క్రేజ్ ఇప్పుడు ఏది? అవినీతిపై పోరాటం చేసిన టీమ్ అన్నాలో సభ్యుడిగా తొలి అడుగు వేసిన కేజ్రీవాల్.. 2012లో ఆమ్ఆద్మీపార్టీ స్థాపించి ‘క్రేజీ’వాల్‌గా మారిపోయారు. అదే సంవత్సరం డిసెంబర్ 16న నిర్భయ గ్యాంగ్‌రేప్ ఉదంతం, అడ్డగోలు విద్యుత్తు బిల్లులపై నిరాహార దీక్ష, మీడియా విపరీతమైన ప్రచారం నెలల కాలంలోనే కేజ్రీవాల్‌ను హీరోగా మార్చింది. ఆ దూకుడుతోనే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు గెల్చుకుని మొదట కింగ్‌మేకర్‌గా.. ఆ తరువాత కింగ్‌గా మారారు. డిసెంబర్ 28న మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే విద్యుత్తు చార్జీల తగ్గింపు, ఉచిత మంచినీరు వంటి పథకాలు అమలు చేశారు. తన మంత్రి సోమ్నాథ్భారతీ విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ విచిత్రంగా ముఖ్యమంత్రి హోదాలో నిరాహారదీక్షకు కూర్చున్న తొలి నేత కేజ్రీవాల్. జనలోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంలో విఫలమయి రాజీనామా చేయాల్సివచ్చింది. 2013 నాటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు లేవన్నది వాస్తవం. మీడియాలో ఆయనకు ఆనాటి ప్రచారమూ లేదు. ఈ నేపథ్యంలో ఆప్ ఏ వ్యూహంతో అధికారంలోకి రాగలుగుతుందన్నది వేచిచూడాలి. -
ఢిల్లీలో ఎన్నికల నగారా
అందరూ ఎంతోకాలంనుంచి ఆత్రంగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారయింది. వచ్చే నెల 7న పోలింగ్ నిర్వహించి, 10న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 2013 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. తమ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్న విశ్వాసంతో ఉన్న బీజేపీకి కొత్తగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నుంచి ఊహించని సవాలు ఎదురైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 31 స్థానాలు గెల్చుకోగా మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక స్థానం కలిస్తే అది 32 దగ్గరే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 36 అవసరం గనుక ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉండిపోయింది. ఆప్‌కు 28 స్థానాలూ, కాంగ్రెస్‌కు 8 వచ్చాయి. కాంగ్రెస్ ఇవ్వజూపిన మద్దతును స్వీకరించడానికి ఎంతో ఊగిసలాడిన కేజ్రీవాల్ చివరకు ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చారు. అయితే, ఆయన నిండా రెండు నెలలు కూడా ప్రభుత్వాన్ని నడపలేకపోయారు. 49 రోజులు గడిచాక అవినీతి వ్యతిరేక బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందకపోవడాన్ని కారణంగా చూపిస్తూ హఠాత్తుగా పదవికి రాజీనామాచేసి అందర్నీ దిగ్భ్రమపరిచారు. వెళ్తూ వెళ్తూ అసెంబ్లీ రద్దుకు సిఫార్సుచేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించివుంటే ఆ సిఫార్సును యథాతథంగా ఆమోదించి ఉండేవారు. ఎందుకంటే ఏ విధంగా లెక్కలేసినా అంతకుమించి గత్యంతరం లేదు. గడిచిన మే నెలలో లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలూ వస్తాయని అందరూ ఊహిస్తే కేంద్రంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధపడక రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపింది. తదుపరి ఏర్పడిన ఎన్డీయే సర్కారు కూడా దాన్నే కొనసాగించింది. చివరకు విషయం సుప్రీంకోర్టుకెక్కి, కార్యనిర్వాహక వర్గానికి అది కర్తవ్యాన్ని గుర్తుచేశాకగానీ అసెంబ్లీ రద్దు కాలేదు. వివిధ సర్వేలు బీజేపీ విజయావకాశాలను గట్టిగా చెబుతూనే ఆప్‌కున్న ప్రజాదరణను వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌నే అధిక సంఖ్యాకులు కోరుకుంటున్నారని చెబుతున్నాయి. అందువల్లనే ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజులనాడు బీజేపీ ప్రచారాన్ని ప్రారంభిస్తూ తమ పార్టీ ప్రధాన ప్రత్యర్థి ఎవరో సరిగానే పోల్చుకున్నారు. తన ప్రసంగంలో అధిక భాగాన్ని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలకే ఆయన కేటాయించారు. ఢిల్లీని వరసగా మూడుసార్లు...అంటే పదిహేనేళ్లపాటు ఏలిన కాంగ్రెస్నుకాక కేవలం 49 రోజులు మాత్రమే పాలించిన కేజ్రీవాల్‌పైనే దాడిని కేంద్రీకరించారు. కేజ్రీవాల్ పేరెత్తకుండానే ఆయన తనను తాను అరాచకుడిగా అభివర్ణించుకోవడాన్ని ఢిల్లీవాసులకు గుర్తుచేసి...అదే నిజమైతే అడవులకు పోయి నక్సల్స్‌లో చేరాలని మోదీ సలహా ఇచ్చారు. ఢిల్లీలో మంచివాళ్లకే తప్ప నక్సలైట్లకు స్థానం లేదని కూడా చెప్పారు. కేజ్రీవాల్లో నక్సలిజం ఎంత ఉన్నదో, అరాచకవాదం పాలెంతో పక్కనబెడితే...ఆయన 38 నిమిషాల ప్రసంగంలో కాంగ్రెస్‌ను కేవలం అయిదుసార్లే ప్రస్తావించారని, పేరెత్తి ఉండకపోవచ్చుగానీ ఎక్కువ భాగం ఆప్కే కేటాయించారని మీడియా లెక్కలుగట్టి మరీ చెప్పింది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జైత్రయాత్రను గుర్తుచేసేందుకు వేదికపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, హర్యానా సీఎం ఎం.ఎల్. ఖత్తార్, జార్ఖండ్ సీఎం రఘువర్‌దాస్, జమ్మూ-కశ్మీర్‌కు చెందిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ను కూర్చోబెట్టారు. అయితే, తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించుకోలేని అశక్తతలో ఉండటం బీజేపీకున్న బలహీనత. పట్టణ ప్రాంత మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతుల్లో బీజేపీపైనా, మోదీపైనా ఉన్న ఆకర్షణవల్ల... స్వయంగా మోదీయే ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నందువల్లా ఈ బలహీనతను సులభంగానే అధిగమించగలమన్న విశ్వాసం ఆ పార్టీకున్నది. కేంద్రంలో అధికారానికొచ్చి ఏడు నెలలు కావస్తున్నది గనుక సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలపై బీజేపీ ఈ ఎన్నికల్లో జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. నల్లడబ్బును రప్పించడం ఇంతవరకూ ఎందుకు సాధ్యం కాలేదన్నది అందులో ప్రధానమైనది. రాజధానిలో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండటం, ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామన్న వాగ్దానంపై ఇంతవరకూ చేసిందేమిటో చెప్పలేకపోవడం,అధిక ధరలు వంటివి బీజేపీకి ఇబ్బందికరమైనవే. అలాగే మోదీ కేజ్రీవాల్ వ్యవహారశైలిని విమర్శించారు తప్ప కరెంటు చార్జీల తగ్గింపు, నిరుపేదవర్గాలకు ఉచితంగా మంచినీటి సరఫరా వంటి తమ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టలేకపోయారంటున్న ఆప్ వ్యాఖ్యలను కొట్టిపారేయడానికి లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటంవల్ల వచ్చిన వెసులుబాటువల్ల గత కొంతకాలంగా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ తన పనులను చక్కబెట్టుకుంటున్నది. రెండేళ్లక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశ రాజధాని నగరంలోని పేదలు ఆప్ వెనకున్నారని గ్రహించి ఇప్పటికే ఢిల్లీలోని చట్టవిరుద్ధమైన 899 కాలనీలను క్రమబద్ధీకరించారు. ఆ ప్రాంతాలకు చకచకా మౌలిక సదుపాయాల కల్పన మొదలైంది. కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఢిల్లీ ప్రభుత్వోద్యోగుల పే స్కేళ్లు పెరిగాయి. రిటైర్మెంట్ వయస్సు తగ్గించడానికి ఎన్డీయే సర్కారు యోచిస్తున్నదన్న వదంతిని నమ్మొద్దని స్వయంగా మోదీయే విజ్ఞప్తిచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత అధ్వాన్న స్థితికి చేరుతుందని సర్వేలు చెబుతున్నాయి. తాము ‘అవసరమైతే’ మరోసారి ఆప్‌కు మద్దతిచ్చేందుకు వెనకాడబోమని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటించి ఆ జోస్యాన్నే ధ్రువపరుస్తున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో మైనారిటీలపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని పార్టీలూ సహకరించాల్సిన అవసరం ఉన్నది. అధికారం కోసం జరిగే హోరాహోరీ పోరు సామాన్య పౌరుల పాలిట శాపంగా పరిణమించరాదని అందరూ గుర్తించాలి. -
వాళ్లను మీరు శిక్షించాల్సిందే: మోదీ
ఢిల్లీ వాసులకు రోజుకు 24 గంటలూ విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామని, అందరికీ ఇళ్లు కట్టిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రం ప్రజలు శిక్షించి తీరాలని పిలుపునిచ్చారు. ప్రజలిచ్చిన అధికారాన్ని కాదని అర్ధంతరంగా ప్రభుత్వం నుంచి వైదొలగినందుకు వాళ్లను శిక్షించాల్సిందేనని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీస్థాయిలో జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అరాచకవాది అని.. అలాగే ఉండాలనుకుంటే ఆయన వెళ్లి మావోయిస్టుల్లో చేరి అడవులకు పోవాలని విమర్శించారు. కాంగ్రెస్ మీద కూడా ఆయన విమర్శలు గుప్పించినా.. ప్రధానంగా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీనే లక్ష్యంగా చేసుకున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 28 స్థానాల్లో గెలిచింది. అప్పట్లో బీజేపీ 31 సీట్లు గెలుచుకుంది. ఈసారి అలా కాకుండా.. ఢిల్లీ వాసులు తమకు బలమైన, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపోయేలా మంచి మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు. -
ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల్లో వెలువడే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఢిల్లీ లో ఏర్పడ్డ అనిశ్చితిని తొలగించేందుకు ఎన్నికల కమిషన్ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఫిబ్రవరి రెండు వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 15వ తేదీ నాటికి ఎన్నికల చీఫ్ కమిషనర్ వీఎస్ సంపత్ కు 65 ఏళ్లు నిండుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం సంపత్ చేతుల మీదుగా విడుదల చేసే నోటిఫికేషన్ ఇదే అవుతుంది. ఇదిలా ఉండగా జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ బీజేపీ నేతలను ఉత్సాహపరిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావం పనిచేసింది. ఇదే విధంగా తాము ఢిల్లీ పీటాన్ని దక్కించుకొంటామనే నమ్మకం పార్టీ నాయకత్వంలో బలపడింది. కాగా, 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండవచ్చనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 49 రోజుల తరువాత ఢిల్లీ అధికారాన్ని వదిలి పలాయనం చిత్తగించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. -
మై బనియా హూ!దందా సమజ్తా హూ!!
న్యూఢిల్లీ: తనను తాను వ్యాపారిగా అభివర్ణించుకున్న ఆమ్ ఆద్మీపార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట నగర వ్యాపారులను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో పన్నుల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తానని, వ్యాట్ విభాగం బలవంతపు వసూళ్ల ర్యాకెట్‌ను అరికడతానని వాగ్దానం చేశారు. నెహ్రూప్లేస్‌లో సోమవారం జరిగిన వ్యాపారుల ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. వ్యాపారుల కోసం ఆయన వాగ్దానాలు చేశారు. తాను అధికారంలోకి వస్తే వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తానని చెప్పారు. ఢిల్లీని టోకు వ్యాపార, పంపిణీ కేంద్రంగా మారుస్తానని అన్నారు. ‘‘మై బనియా హూ! దందా సమజ్తా హూ’’ (తాను వ్యాపార వర్గం నుంచి వచ్చానని తనకు వ్యాపారం తెలుసు)నని చెప్పారు. వ్యాపారులు నిజాయితీగా వ్యాపారం చేసి, పన్నులు కట్టాలని తాము ఆశిస్తున్నామని ఆప్ నేత చెప్పారు. వ్యాపారుల విషయంలో ప్రభుత్వ జోక్యం నామమాత్రంగా ఉంటుందని అన్నారు. దాడులకు పాల్పడటం తమ పార్టీ విధానం కాదని, వ్యాపారులను నమ్మటం తమ విధానమని పేర్కొన్నారు. వ్యాట్ దాడులు, బలవంతపు వసూళ్లను తమ ప్రభుత్వం నిలిపివేస్తుందని, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తామని చెప్పారు. తాను పదవి నుంచి దిగిపోయిన వెంటనే వ్యాపారులను వ్యాట్ విభాగం వేధింపులకు గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. తాము వ్యాపారులను వేధింపులకు గురి చేయలేదని, అయినా తమ 49 రోజుల పాలనలో వ్యాట్ వసూళ్లు అత్యధికంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఢిల్లీలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు పన్నుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఢిల్లీలో వ్యాపారం చేయాలనుకునే వారికి అనుమతులు మంజూరుచేసేందుకు ఏకగవాక్ష (సింగిల్ విండో) వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుల విధానాన్ని కూడా సరళతరం చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించేందుకు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌కు మారుస్తామని చెప్పారు. ఇంట్లో నుంచే లెసైన్సులకు దరఖాస్తు చేసి, అక్కడే వాటిని పొందవచ్చని అన్నారు. అవినీతి, అధికారస్వామ్యం కారణంగా వ్యాపారం దెబ్బతింటోందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఏడు రోజుల్లో అనుమతులన్నీ మంజూరు చేస్తామని చెప్పారు. అయినా ఆలస్యమైతే వారు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి అనుమతి పొందవచ్చని భరోసానిచ్చారు. వచ్చే ఐదేళ్లలో దేశంలోనే అతి తక్కువ వ్యాట్ ఢిల్లీలో ఉండగలదని వాగ్దానం చేశారు. వ్యాట్ తగ్గింపు వల్ల ధరలు తగ్గుతాయని, తద్వారా ద్రవ్యోల్బణం తగ్గుతుందని కేజ్రీవాల్ వివరించారు. వ్యాపారుల భాగస్వామ్యం లేకుండా వారికి సంబంధించిన ఎటువంటి విధానాన్నీ రూపొందించబోమని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ని వ్యతిరేకిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. అయితే ఇ-కామర్స్ వెబ్సైట్లకు మాత్రం తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. -
సోషల్ మీడియాలో బీజేపీ హల్చల్
న్యూఢిల్లీ : రాజధానిలో రానున్న అసెంబ్లీ ఎన్నిక కోసం ‘సాంకేతిక’ ప్రచారం ఊపందుకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ-ఆమ్ఆద్మీపార్టీలు ఈ సారి సరికొత్త ప్రచార యుద్ధానికి తెరలేపాయి. లాప్టాప్స్, కంప్యూటర్స్, ఐటీ నిపుణులతో కూడిన బృందాలు పోటాపోటీగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఆయా పార్టీల కార్యాలయాలు సాంకేతిక ప్రచార యుద్ధానికి వేదికలుగా మారాయి. హామీల వర్షం: నగరంలోని 14, పండిట్ పంత్ మార్గంలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో గతనెల ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేసింది. ఇందులో ఐటీ నిపుణులను పార్ట్‌టైంలో పనిచేస్తూ బీజేపీ ఎజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి నిరంతరం కుస్తీపడుతున్నారు. రాజకీయ విశ్షేషణలు, నాయకుల ప్రకటనలను ముఖ్యంగా ఆమ్ఆద్మీ పార్టీ వైఫల్యాలను‘ఫేస్బుక్’తోపాటు ‘ట్విట్’లో ఎండగడుతున్నారు. బీజేపీ ఐటీ సెల్ అధినేత సుమీత్ బాసిన్ నాయకత్వంలో ‘వార్‌రూమ్’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పార్టీ వైఖరిని తెలియజేస్తూనే, ప్రతిపక్షాలైన ఆప్, కాంగ్రెస్ పార్టీల వల్ల గతంలో జరిగిన నష్టాన్ని, వైఫల్యాలను ప్రజలకు వివ రిస్తూనే, ఆయా సమస్యలపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో ఆయా సమస్యలకు ప్రాధాన్యం కల్పిస్తామని ‘వార్సెల్’ సెల్ హామీ ఇస్తోంది. సత్ఫలితాలు సాధిస్తాం : బాసిన్ అగ్రనాయకుల సూచనల మేరకు..సోషల్ మీడియాపై తమ పార్టీ ఆదిపత్యం కొనసాగించేందుకు పార్టీ సాంకేతిక నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ‘ వార్రూమ్స్ ప్రతిఎన్నికల ముందు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా ముందుకుసాగుదాం. ఫలితాలు సాధిస్తాం’ అని బాసిన్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం పార్టీకి కొత్తేమీ కాదు, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేసి సత్ఫలితాలు సాధించినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో నాలుగు నెలల్లోనే 11 నుంచి 13 లక్షల మంది ఫేస్బుక్లో పార్టీ పేజీల ద్వారా మద్దతు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం పార్టీ పోస్టులు ఆమ్ఆద్మీ పార్టీ పోస్టులకన్నా రెట్టింపు ఇష్టపడుతున్నారని, బీజేపీ సమాచారాన్ని 10,000ల మంది ఇష్టపడుతుండగా. ఆమ్ఆద్మీ సమాచారాన్ని కేవలం 5,000 మంది మాత్రమే ఇష్టపడుతున్నారని, పార్టీ ఆధిక్యతకు ఇది నిదర్శనమని అన్నారు. రంగంలోకి వాలంటీర్లు: ఈ ప్రచారంలో ఫేస్బుక్, ట్విట్లతో పాటు స్కౌట్స్, వాలంటీర్లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రచారంలో సుమారు 100 మంది వాలంటీర్లు 52 నుంచి 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి 500 మంది వాలంటీర్లు రంగంలోకి దిగారు. వీరంతా పార్టీ వైఖరిని సాధారణ ప్రజలకు వివరించడంతోపాటు వారి అభిప్రాయాలను స్వీకరించి పార్టీ నాయకత్వానికి తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. వార్ రూమ్ ఫేస్బుక్, ట్విట్, వాట్స్ఆప్, ఈమేయిల్స్, ఎస్ఎంఎస్లపై దృష్టి సారించింది. ట్విట్టర్ ప్రచారాన్ని వచ్చేనెలలో ఉధృతం చేస్తామని, వాట్స్ఆప్ ద్వారా పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ప్రారంభించడానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ ఇప్పటికే వాట్స్ఆప్ను వినియోగిస్తోంది. దీని ద్వారా 15,000ల మంది పార్టీ నాయకులు, 250 గ్రూపులుగా అధినాయకత్వంతో పరస్పరం ఎన్నికల్లో విజయం సాధించడానికి కసరత్తుచేస్తున్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో మహిళా సభ్యత్వాల నమోదు న్యూఢిల్లీ : మహిళలు రాజకీయాల్లో రాణించాలని భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. దేశవ్యాప్తంగా మహిళా సభ్యత్వాలపై బీజేపీ దృష్టి సారించిందని, ఇందులో భాగంగా శనివారం నగరంలోని పాలికా బజార్లో బీజేపీ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలువురు మహిళలకు సభ్యత్వం అందజేశారు. డిసెంబర్ 30వ తేదీ వరకు సభ్యత్వం నమోదు కొనసాగుతోందని ఆయన అన్నారు. మహిళలు పార్టీలో అధిక సంఖ్యంలో చేరుతున్నారని ఆయన అన్నారు. దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఎదగాలని అన్నారు. బీజేవైఎం 2 కోట్ల సభ్యులను చేర్పించాలని పార్టీ టార్గెట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే నాలుగురోజులుగా మహిళల సభ్యత్వ నమోదు చేస్తున్నామని అన్నారు. -
ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వినోద్ జోషి, సీఈఓ విజయదేవ్, జిల్లాల ఎన్నికల అధికారులు(డీఈఓలు) సమావేశమై సమీక్ష జరిపారు. ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన డ్రైవ్‌పై చర్చించారు. అదేవిధంగా బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎన్నికలకు అవసరమయ్యే మానవ వనరులు తదితర విషయాలపై కసరత్తు చేశారు. ఈ మేరకు నివేదికలు అందించాలని డీఈఓలను ఆదేశించినట్లు సమాచారం. -
ఢిల్లీ పీఠంపై కోటి ఆశలు
న్యూఢిల్లీ : జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ బీజేపీ నేతలను ఉత్సాహపరిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావం పనిచేసింది. ఇదే విధంగా తాము ఢిల్లీ పీటాన్ని దక్కించుకొంటామనే నమ్మకం పార్టీ నాయకత్వంలో బలపడింది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం ఘనంగా జరుపుకొని, అదే సందర్భంగా నిర్వహిస్తున్న ‘సుపరిపాలన దినోత్సవం’ రోజు ఎన్నికల ప్రచారాన్ని రెట్టించిన ఉత్సాహంతో చేపట్టనున్నట్లు పార్టీ బీజేపీ నేతలు చెబుతున్నారు. హరియాణా, మహారాష్ట్రల తరువాత జార్ఖండ్ లో సాధించిన విజయం జమ్మూకశ్మీర్‌లో మునుపెన్నడూ లేనంత భారీ సంఖ్యలో సీట్లుగెలిచి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధం కావడంతో ఢిల్లీలోనూ పార్టీకి గెలుపుఖాయనమన్న అభిప్రాయం కార్యకర్తల్లో బలపడింది. ఇదే ఉత్సాహంతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. చలో మోదీకే సాత్ అభివృద్ధి, చలో మోదీకే సాథ్ నినాదాలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ వాసులను ఆకట్టుకోగలమని నేతలు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చుట్టూ రూపొందించిన ప్రచారాన్ని రేడియో జింగిల్స్, రోడ్డుపక్క పోస్టర్లు, హోర్డింగులతో ఇప్పటికే ప్రారంభించింది. ప్రతి కాలనీలో చిన్నచిన్న జనసభలు జరిపేందుకు వ్యూహం రూపొందించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ జనసభలలో నొక్కి చెబుతారు. పెట్రోలు, డీజిల్ , పళ్లు కూరగాయల ధరలు తగ్గడం మొదలైన వాటిని తన ప్రచారంలో వినియోగించుకోనుంది. కేజ్రీవాల్ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు రాన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తన ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించిన బీజేపీ ఆ పార్టీని ఎదుర్కొనేందు తన ప్రచార వ్యూహాన్ని వ్యూహాన్ని రూపొందించింది. ఆమ్ ఆద్మీ పార్టీకన్నా, ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తమకు ప్రధాన శత్రువు అన్న విషయాన్ని బైటకు చెప్పక పోయినప్పటికీ అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేయడానికి ఢిల్లీవాసులు సుముఖంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్‌నే ఇ్టపడుతున్నారని సర్వేలు వెల్లడించిన విషయంపై తీవ్రంగా ఆలోచిస్తోంది. అందుకే కేజ్రీవాల్‌పై నేరుగా దాడి చేసేలా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. 49 రోజుల తరువాత అధికారాన్ని వదిలి పలాయనం చిత్తగించిన నేతగా కేజ్రీవాల్ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. పరోక్షంగా కేజ్రీవాల్‌ను ఎగతాళి చేస్తూ రేడియోలో ప్రసారమవుతోన్న జింగిల్స్ ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ దృష్టి న్యూఢిల్లీ : జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కమిషన్ దృష్టి ఢిల్లీపై పడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పరిస్థితిని అంచనావేయడానికి ఎన్నికల కమిషన్ బుధవారం స్టేక్ హోల్డర్లతో సమావేశం జరిపింది. ఓటర్ల జాబితా అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఓటరు జాబితాను అప్డేట్ చేయడం, జాబితాలో తమ పేర్లు లేవన్న పిర్యాదులను తగ్గించడం కోసం చేపట్టే కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో చర్చించారు. ఎన్నికల నిర్వహణకు కావలసిన సిబ్బంది లభ్యత తదితర విషయాలు చర్చించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీ పర్యటన, త్రిలోక్‌పురి, బవానాలో మతఘర్షణలు. సీమాపురలో చర్చిలో అగ్నిప్రమాదం ఘటనల నేపథ్యంలో నగరంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. నగరంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి అవసరమైన రోడ్ మ్యాప్ సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఢిల్లీ పోలీసులను కోరినట్లు సమాచారం. -
బోగస్ ఓటర్లను తొలగించాలి
న్యూఢిల్లీ : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘బోగస్ ఓటర్ల’ ఏరివేతపై దృష్టి సారించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు అరవిందర్ సింగ్ ఆధ్వర్యంలో నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషన్ర్ వీఎస్ సంపత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ముండ్కా, వికాస్పురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు లక్ష బోగస్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం డీపీసీసీ నేత అరవిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారని, ఈ నియోజకవర్గాల్లో కొందరు 10 నుంచి 15 ఓట్లు కలిగి ఉన్నారని గుర్తించారని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈసీఐ ప్రత్యేక బృందాలు ఆయా నియోజకవర్గాల్లో సర్వే జరిపి, బోగస్ ఓటర్ల ఏరివేతకు చర్యలు తీసుకొంటామని ఈసీఐ హామీ ఇచ్చినట్లు సింగ్ వెల్లడించారు. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయకుండా దేశరాజధానిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీఐని కోరినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్ట కుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఢిల్లీపై ఎలాంటి ప్రభావం ఉండదు’ జార్ఖాండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని అరవిందర్ సింగ్ అన్నారు. సాధారణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకొంటున్నారని, రాబోయే ఎన్నికల ఫలితాలు ప్రతిఒక్కరూ ఆశ్చర్యపడేలా రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో డీపీసీసీ అధ్యక్షుడితోపాటు పార్టీ సీనియర్ నాయకులు హరూన్ యూసఫ్, డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ ఉన్నారు. -
కమలం వికసిస్తుంది
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధిక సీట్లు రావచ్చని, ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలవవచ్చని ఇండియా టుడే గ్రూప్, సిసెరో ఢిల్లీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. ముఖ్యమంత్రిగా మాత్రం అర్వింద్ కేజ్రీవాల్ ఉండాలని ఢిల్లీవాసుల్లో అత్యధికులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీకి చెందిన హర్షవర్ధన్ రెండో స్థానంలో నిలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం పని తీరు ప్రభావం చూపనుందని, తద్వారా బీజేపీ లబ్ధి పొందగలదని ఆ సర్వే అంచనా వేసింది. బీజేపీ 39 శాతం ఓట్లను పొంది ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, 36 శాతం ఓట్లతో ఆప్ రెండో స్థానంలో ఉంటుందని ఆ సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రి పదవికి 35 శాతం కేజ్రీవాల్‌ను ఎన్నుకోగా, 19 శాతం మాత్రమే హర్షవర్ధన్‌కు మద్దతు పలికారు. ప్రభుత్వాన్ని నడపడానికి బదులు నిరసనలు, ఆందోళనలపైనే కేజ్రీవాల్ దృష్టి కేంద్రీకరించారని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని పాలించే అవకాశం అతనికే ఇవ్వాలని 55 శాతం మంది చెప్పారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,273 ఓటర్లను ప్రశ్నించి ఈ వివరాలు సేకరించారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కు ఒక శాతం, బీజేపీకి 5.9 శాతం ఓట్లు పెరుగుతాయని ఆ సర్వే అంచనా వేసింది. కాగా కాంగ్రెస్‌కు 8.5 శాతం ఓట్లు తగ్గుతాయని తెలిపింది. ఈ ఎన్నికల్లో అవినీతి ప్రధాన అంశం కానుంది. అవినీతిని అరికట్టే వారికే పట్టం గడతామని 21 శాతం మంది తేల్చి చెప్పారు. మరో చర్చనీయాంశమైన మహిళల భద్రతకు 17 శాతం మంది ప్రాముఖ్యతనిచ్చారు. 15 శాతం తాగునీటిని, 12 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని, కరెంటు సమస్యను పది శాతం మంది ప్రాధాన్యత అంశాలుగా చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పాలన దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కన్నా ఢిల్లీపై అధిక ప్రభావం చూపగలదని ఆ సర్వే తెలిపింది. మోడీ సర్కారు ఊహించినదాని కన్నా బాగా పని చేస్తోందని 34 శాతం పేర్కొనగా, తమ ఊహలకు దగ్గరగా ఉందని 33 శాతం మంది చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ పాలన తమ ఊహలను మించిపోయిందని 35 శాతం మంది అభిప్రాయపడ్డారు. తాము ఆశించిన విధంగానే ఆప్ సర్కారు పని చేసిందని 32 శాతం మంది చెప్పగా, తమ ఆశలను నీరుగార్చిందని 22 శాతం మంది అన్నారు. కేజ్రీవాల్ తన బాధ్యతల (సీఎం పదవి) నుంచి పారిపోయాడని, ఇందుకు అతడిని క్షమించలేమని 55 శాతం మంది అన్నారు. అయితే 49 రోజుల పాలనా కాలంలో అవి నీతిని తగ్గించాడని 60 శాతం మంది ప్రశంసించారు. విద్యుత్, నీటి చార్జీలను తగ్గించాడని వారు చెప్పారు. సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది కాంగ్రెస్‌ను అవినీతి పార్టీ అని, బంధు ప్రీతిని ప్రోత్సహిస్తుందని 51 శాతం మంది పేర్కొన్నారు. -
నాలుగు సీట్లలో కొత్త ముఖాలు!
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీకి కంచుకోటలుగా భావించిన నాలుగు సీట్లలో, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటమి ఎదురు కావడంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ సీట్ల నుంచి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం! గ్రేటర్ కైలాష్, రోహిణీ, షాలీమార్‌బాగ్, షాకుర్బస్తీ.. ఈ నాలుగు సీట్లు బీజేపీకి కంచుకోటలుగా పేరొందాయి. ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి బీజేపీ పలుమా ర్లు విజయం సాధించింది. కానీ గత ఎన్నికలలో మా త్రం ఓటమిపాలైంది. దాంతో ఈ నియోజకవర్గాల నుంచి కొత్తవారిని నిలబెట్టాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 70 సీట్ల లో 32 సీట్లు గెలిచింది. ఈ నాలుగు సీట్లలో కూడా బీజే పీ అభ్యర్థులు గెలిచినట్లయితే ఢిల్లీలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేది. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజే పీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ తగిన సం ఖ్యాబలం లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిం ది. ఈ సీట్లను తిరిగి గెలిచినట్లయితే వాటి ప్రభావం పక్కనున్న సీట్లపై కూడా పడుతుందని, బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల వ్యూహరచన కోసం ఆ పార్టీ జరుపుతోన్న సమావేశాలలో ఈ అంశం చర్చకు వచ్చింది. మితీమిరిన ఆత్మవిశ్వాసం, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం, అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీ ఈ నాలుగు నియోజకవర్గాలను కోల్పోయింది. ఇప్పుడీ సీట్లనుంచి ఇతరులను బరిలోకి దింపాలని పార్టీ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ కైలాష్‌లో ఓటమిని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. 2008 అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవ ర్గం నుంచి సీనియర్ నేత విజయ్‌కుమార్ మల్హోత్రా గెలిచారు. 2013 ఎన్నికలలో ఆయన కుమారుడు అజయ్ మల్హోత్రాకు టికెట్ లభించింది. కానీ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. మరో బీజేపీ నేత విజయ్ జోలీ కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మేయర్ ఆర్తీ మెహ్రా కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆమెను మాలవీయనగర్ నుంచి బరిలోకి దింపవచ్చు. రోహిణీ విషయానికి వస్తే 1993 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భగవాన్ గోయల్ 2013 ఎన్నికలలో ఓడిపోయారు. దాంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ విజేందర్గుప్తాకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో విజేందర్ గుప్తా న్యూఢిల్లీ నియోజవర్గం నుంచి షీలాదీక్షిత్, అర్వింద్ కేజ్రీవాల్లతో పోటీపడి ఓడిపోయారు. షాకుర్ బస్తీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈసారి ఇక్కడనుంచి శ్యామ్లాల్గర్గ్ లేదా రేఖా గుప్తాకు టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. షాలీమార్బాగ్కు 1998 నుంచి ప్రాతినిధ్యం వహించిన రవీంద్ర భన్సల్ గత ఎన్నికలలో ఆప్ చేతిలో ఓడిపోవడంతో ఇక్కడ కూడా కొత్త వారికి టికెట్ ఇచ్చే విషయం పార్టీ పరిశీలనలో ఉంది. -
బరిలోకి ప్రణబ్, షీలాల తనయులు
ఎన్నికల అరంగేట్రం సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమార్తె లతికా దీక్షిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శర్మిష్ట ముఖర్జీ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి, లతికా దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. గ్రేటర్ కైలాష్ నుంచి..శర్మిష్ట ముఖర్జీ గ్రేటర్ కైలాష్ నుంచి పార్టీ తనకు టికెట్ ఇచ్చినట్లయితే పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మరొకరికి టికెట్ ఇచ్చినా తాను ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమని కూడా ఆమె చెప్పారు. పార్టీకి గ్రేటర్ కైలాష్ సీటు గెలిచిపెట్టడమే తన ఉద్దేశమని ఆమె అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ గెలిచారు. ఆయన బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రాను ఓడించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నుంచి మాజీ మేయర్లు ఆర్తీ మెహ్రాకు గానీ, సరితా చౌదరికి గానీ టికెట్ ఇవ్వవచ్చు. సౌరభ్ భరద్వాజ్‌కే మళ్లీ టికెట్ ఇవ్వనున్నట్లు ఆప్ ఇదివరకే ప్రకటించింది. పలు ఉద్యమాల్లో .. శర్మిష్ట ముఖర్జీ ఈ సంవత్సరమే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు, ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అలంకరణ కోసం కేటాయించిన పార్కులలో తమకు ఆడుకునే హక్కు ఉందని డిమాండ్ చేస్తూ దక్షిణ ఢిల్లీలోని పిల్లలు ప్రారంభించిన గివ్ బ్యాక్ అవర్ ప్లేగ్రౌండ్స్ ఉద్యమానికి కూడా ఆమె చేయూత నందిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి లతికా దీక్షిత్.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నియోజకవర్గం నుంచి షీలాదీక్షిత్ కుమార్తె లతికా దీక్షిత్ సయ్యద్‌ను నిలబెట్టాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న లతికా దీక్షిత్‌ను ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆమె సోదరుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఒప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం కూడా ఈ నియోజకవర్గం నుంచి లతికా దీక్షిత్‌ను నిలబెట్టడానికి సముఖంగా ఉందని అంటున్నారు. లతికా పిన్న వయస్కురాలు అయినప్పటికీ షీలాదీక్షిత్‌కు కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సత్సంబంధాల కారణంగా న్యూఢిల్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి మళ్లీ పోటీ చేస్తారని ఆప్ అంటుండగా, తాను కూడా న్యూఢిల్లీ నుంచే పోటీ చేస్తానని ఆప్ తిరుగుబాటు నేత, లక్ష్మీనగర్ మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ప్రకటించారు. -
ఢిల్లీలోనూ కాలు మోపుతాం: శివసేన
ముంబై/న్యూఢిల్లీ: బీజేపీతో స్నేహ బంధాన్ని తెంచుకున్న శివసేన, తన పూర్వ మిత్రునికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. హిందూత్వ ఎజెండా విషయంలో బీజేపీని ఒంటరిని చేసేందుకు శివసేన మహారాష్ట్ర వెలుపల కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభించాలని భావిస్తున్నామని శివసేన ఎమ్మెల్సీ దివాకర్ రావుతే చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి తమ పార్టీని విస్తరించాలని నిర్ణయించామని, తమ ప్రణాళిక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ‘‘హిందూత్వ లక్ష్యాన్ని సాధించేందుకు కలిసే ఉందాం అని ఉద్ధవ్జీ (శివసేన అధ్యక్షుడు) కోరితే వారు (బీజేపీ) మొండిగా వ్యవహరించారు’’ అని రావుతే పేర్కొన్నారు. దేశంలోని మూలమూలకూ విస్తరించేందుకు, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఎన్నికలను ఒక మాధ్యమంగా వాడుకుంటామని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల్లో తమ పాత్ర నామమాత్రమేనని, ఎన్ని సీట్లలో పోటీ చేయాలని, అభ్యర్థులెవరు అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం శివసేనకు లేకపోయినప్పటికీ, బీజేపీ అవకాశాలను దెబ్బతీయాలన్నదే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఢిల్లీలోని మైనారిటీల అభివృద్ధికి అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందినందునే ప్రాంతీయ పార్టీలు అక్కడ విస్తరిస్తున్నాయని రావుతే అభిప్రాయపడ్డారు. ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా ఉన్న ముస్లిమ్‌లు ఇప్పుడు ఆ పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. దీనిని ఎంఐఎం అవకాశంగా తీసుకుని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లోనే పట్టున్న మజ్లిస్ పార్టీ ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుపొందింది. ఇటువంటి పార్టీలు విస్తరించకుండా అడ్డుకుంటామని రావుతే చెప్పారు. భవిష్యత్తులో దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని తెలిపారు. -
‘ప్రణాళిక’ రూపకల్పనలో రాజకీయ పార్టీలు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ‘మేనిఫెస్టో’లను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా రూపొందించి ప్రజల మద్దతు కొల్లగొట్టాలనే పట్టుదలతో కదులుతున్నాయి. ఇటీవలే ఆమ్ఆద్మీ పార్టీ ‘డిల్లీ డైలాగ్’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇదేక్రమంలో బీజేపీ కూడా నగర అభివృద్ధికి తగ్గట్టుగా మేనిఫెస్టో రూపొందించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ‘వెబ్సైట్’ను శుక్రవారం ప్రారంభించారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ఏమి చేయాలనే విషయాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. రాష్ర్టంలోని మూడు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ఈ పనుల్లో బీజిగా మారాయి. ఓ అడుగు ముందుకేసి ఆప్ అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితా 22 మందితో విడుదల చేసింది. త్వరలో కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను వెల్లండించనున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఏర్పాటు చేసుకొన్న వెబ్సైట్లకు సలహాలు, సూచనలు అందజేయాలని ప్రజలను కోరుతున్నాయి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొంటామని హామీ ఇస్తున్నాయి. అందరం కలిసి నగరాన్ని నందనవనంగా తీర్చిదిద్దుదామని పిలుపు ఇస్తున్నాయి. ఫేస్బుక్కుల్లోనూ హల్చల్ ముఖ్యమైన సమాచారాన్ని ‘ఫేస్బుక్’ల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాయి. సుమారు 15 లక్షల మందికి నూతనంగా పార్టీ సభ్యత్వాలు అందజేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నామని బీజేపీ అధ్యక్షుడు ఉపాధ్యాయ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. మొదటి రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగింది. ఇందులో 3.7 లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకొన్నారని చెప్పారు. సభ్యత్వ నమోదుకు నగరలో అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి సంపూర్ణ మద్దతు అందజేస్తారని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
నేతల తలరాతలు మార్చే..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వివిధ సామాజిక గ్రూపులు, పూర్వాంచలీయులు ప్రభావిత వర్గాలుగా ఎదిగిన తీరు ప్రస్తుతం ప్రధాన చర్శనీయాంశమైంది. దేశానికి స్వాతంత్యం వచ్చిన తొలి దశబ్దాలలో ఢిల్లీలోరాజకీయం జాట్లు, యాదవులు, గుజ్జర్లు, పంజాబీలు, వైశ్యుల శాసించే పరిస్థితి ఉండేది. రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు పూర్వాంచలీయులు నగరంలో బలమైన రాజకీయశక్తిగా ఎదిగారు. రాజకీయాలను శాసించే స్థితికి చేరుకొన్నారు. వారిని నిర్లక్ష్యం చేయడానికి ఏ రాజకీయ పార్టీ సాహసించడం లేదు. అధికార పగ్గాలు దక్కాలంటే, అది పూర్వాంచలీయుల చేతిలోనే ఉన్నదని రాజకీయ పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి. పొట్టచేతపట్టుకుని ఉపాధిని అన్వేషిస్తూ రాజధానికి వలస వచ్చిన బీహార్, ఉత్తరప్రదేశ్ వాసులంటే గతంలో చులకనభావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గతంలో నోరుజారిన రాజకీయ నేతలు ఇప్పుడు వారి విషయంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యాలు చేయడం లేదు. మద్దతు కోసం అన్ని పార్టీల ఆరాటం ఇటీవల ఛత్ పూజ సందర్భంగా పూర్వాంచలీయుల మద్దతు సాధించడానికి రాజకీయ పార్టీలు పడిన పాట్లు నగరంలో వారికున్న బలాన్ని చెప్పకనే చెప్పాయి. ఛత్ పూజ కోసం ఘాట్లను శుభ్రం చేయించడంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయి. ఛత్ పూజ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడంలో ప్రముఖపాత్ర పోషించిన బీజేపీ వారి మెప్పు కూడా పొందిందనే చెప్పవచ్చు. రాజధానిలో నివసించే 70 -80 లక్షల పూర్వాంచల్ వాసుల మనోభావాలను కించపరచరాదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అనడం వెనుక వారి మద్దతు సాధించాలనే తపన తేటతెల్లమవుతోంది. ఇలా అన్ని పార్టీలు ఆ వర్గాల ప్రజల మద్దతు సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాగా, మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ విజయం వెనుక పూర్వాంచలీయుల మద్దతు ఉందన్న విషయం రాజధానిలో బీజేపీని మరింత జాగ్రత్తగా మసులకునేలా చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఈ రెండు రాష్ట్రాల్లో పూర్వాంచలీయులు బీజేపీకి మద్దతుగా నిలిచారు. పాతిక సీట్లలో బలమైన శక్తి.. ఢిల్లీలో కూడా అధికారంలోకి రావాలంటే పూర్వాంచలీయుల మద్దతు ఎంతో అవసరం. నగరంలో 1,600 అనధికార కాలనీలు ఉన్నాయి. వీటిలో పూర్వాంచలీ ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది, ఢిల్లీలో పాతిక సీట్లలో వారు జయాపజయాలను నిర్దేశించే బలమైన శక్తిగా ఉన్నారు. ఒకప్పుడు పూర్వాంచలీయులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేవారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వారు ఆమ్ ఆద్మీపార్టీకి అండగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికలలో మనోజ్ తివారీ విజయం పూర్వాంచలీ ఓటర్ల మద్దతు వల్లే సాధ్యం అయ్యింది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు పూర్వాంచలీ ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సారి కూడా వారి మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. మరి ఎవరికి మద్దతు ఇస్తారో తేలాల్సి ఉంది. -
విధానసభ ఎన్నికల బరిలో దిగను
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందా అంటూ ఓ టీవీ చానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఢిల్లీవాసుల నుంచి నాకు జవాబు లభించింది. ఢిల్లీ రూపురేఖలను మార్చలేరు. మీరు బయటకు వెళాల్ల్సిన తరుణం ఆసన్నమైందని వారు స్పష్టం చేశారు’ అని తెలిపారు. నగరవాసులు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారన్నారు. కాగా గత విధానసభ ఎన్నికల్లో షీలా దీక్షిత్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 25 వేలకు పైగా ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ప్రజలు తన తలరాతను నిర్ణయించారని, తాను దానిని అంగీకరించానని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసినప్పటికీ అందుకు తగిన గుర్తింపు లభించలేదన్నారు. ఢిల్లీ రాజకీయాలనుంచి బయటపడ్డానని, ఎన్నికలలో పోటీచేయాలన్న ఆసక్తి తనకు లేదన్నారు.ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు ఎలాంటి పాత్ర అప్పగించలేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇస్తానని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలిపారు. ఢిల్లీలో రాజకీయ గందరగోళానికి ఆమ్ ఆద్మీ పార్టీయేనని షీలా అభిప్రాయపడ్డారు. అరవింద్ అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదారిపట్టించారని ఆరోపించారు. ఆప్ విన్నపం మేరకు తాము మద్దతు ఇచ్చామని, అయినప్పటికీ సమర్థంగా పనిచేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి మాట్లాడుతూ ఆప్, బీజేపీ ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయని, అయితే తమ పార్టీ ఇంకా ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. గత ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ గుణపాఠం నేర్చుకుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమష్టి నాయకత్వం కింద పనిచేస్తుందన్నారు. కాగా తాను విధానసభ ఎన్నికల బరిలోకి దిగబోనంటూ షీలాదీక్షిత్ ప్రకటించడం ఢిల్లీ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నవారందరికీ నిరాశ కలిగించింది. -
ఎన్నికలకే పోదాం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘన విజయం సాధించడంతో ఒత్తిడి పెరిగింది. నగరంలో ప్రభుత్వం ఏర్పాటుచేయరాదని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయా న్ని చూపుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గల ప్రజాదరణ వల్లనే డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ ఘనవిజయం సాధిం చిందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలల తర్వాత కూడా ప్రధాని నరేంద్రమోడీకి ప్రజాదరణ తగ్గలేదని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయని వారు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నగర బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మెజారిటీ తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడమే మంచిదని, నరేంద్ర మోడీ ప్రభావం ఉన్న దరిమిలా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీకి అఖండ విజయం ఖాయమని వారు అంటున్నారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలకే సుతరామూ ఇష్టం లేదని అనధికారికంగా వార్తలు వెలువడుతున్నాయి. కొంత ‘రిస్క్’ తీసుకుని ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఏం ఇబ్బంది ఉండదని వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ రెండు వర్గాలు వారివారి వాదనలపై గట్టిగా నిలబడటంతో ఆ పార్టీ అధిష్టానం కూడా ఎటూ పాలుపోని స్థితిలో ఉంది. కాగా, గత 12వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ ఘన విజయం సాధించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడమే మంచిదంటున్న వారికి ఈ విజయం బాగా కలిసివచ్చింది. దాంతో వారు ఎన్నికలపై తమ స్వరం పెంచారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజాదరణ తగ్గలేదన్న విషయాన్ని డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ చారిత్రక విజయం రుజువు చేసిందని, అసెంబ్లీ ఎన్నికలు జరిపించినా పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని వారు అంటున్నారు. యువత బీజేపీపై మక్కువ కలిగి ఉందన్న విషయాన్ని ఈ ఎన్నికలు నిర్ధారించాయని వారు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్ట్టీకి మద్దతు ఇచ్చిన యువ ఓటర్లు లోక్‌సభ ఎన్నికల నాటికి నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులై బీజేపీవైపు మళ్లారని, ఇప్పటికీ వారు బీజేపీ వెంటే ఉన్నారని మధ్యంతర ఎన్నికలు జరిపించాలని కోరుతున్నవారు గణాంకాలతో వివరిస్తున్నారు. తగిన సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి అప్రతిష్ట మూటగుట్టుకోవడానికి బదులు వెంటనే ఎన్నిక లు జరిపించాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ వరుస ఓటముల నుంచి కోలుకోలేదని, ఆ పార్టీ ఇంకా బలహీనంగానే ఉందని, ఆమ్ ఆద్మీ పార్టీ నిజరూపం ప్రజ లకు తెలిసిపోయిం దని ఇలాంటి పరిస్థితిల్లో ఎన్నికలు జరిపించ డంవల్ల బీజేపీకే ఎక్కువ లాభమని వారు అంటున్నారు. -
ప్రత్యర్థులను ‘ఆప్’తుందా?
- విద్యుత్, నీటి సమస్యలపై పోరాటాలకు వ్యూహాలు - అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు - ప్రజల నుంచి తప్పని వ్యతిరేకత సాక్షి, న్యూఢిల్లీ: అనూహ్య విజయంతో దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని రాజకీయ పార్టీగా ఎదిగింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలతో సై అంటోంది. ఢిల్లీలో పాలన పగ్గాలు చేపట్టిన 49 రోజుల్లోనే వ్యూహాత్మకంగా తప్పుకున్న ఆ పార్టీ నాయకులు భారీ వ్యూహాలతో ముందుకు కదులుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరోమారు ఢిల్లీలో తమ సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ తమను ఇరుకున పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మరోమారు మంచినీరు, విద్యుత్ సమస్యలను తెరపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు లేని నజఫ్‌గఢ్, మటియాలా, ఉత్తమ్‌నగర్, ద్వారకా, పాలం, బవానా, ముండ్కా, సుల్తాన్పూర్ మజ్రా, నంగ్లోయి ప్రాంతాల్లో మంచినీటి సమస్య అధికంగా ఉంది. దీనికి తామైతేనే శాశ్వత పరిష్కారం చూపగల్గుతామని భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికల్లోనూ విద్యుత్, మంచినీటి సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లేందుకు ఆప్నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకటి రెండు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నాయని, వాటికి సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ సహా ముఖ్యనేతల నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు సూచనలు అందినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆప్ ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి అధికారులను సమన్వయం చేస్తూ తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఆప్ సర్కార్ అధికారంలో లేకపోవడంతో కొన్నిచోట్ల అధికారుల నుంచి విముఖత వ్యక్తం అవుతోంది. ఇటీవల దేవ్లీ ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ ధర్నాలు చేసిమరీ జల్‌బోర్డు అధికారులతో పోరాడి అదనంగా పది ట్యాంకర్లను స్థానికుల అవసరాలకు కేటాయించేలా చేశారు. తప్పని వ్యతిరేకత... స్థానికుల సమస్యలు పరిష్కరిస్తామంటూ నియోజకవర్గాలకు వెళుతున్న ఆప్ ఎమ్మెల్యేలకు ప్రజావ్యతిరేకత తప్పడం లేదు. చాలా చోట్ల వారికి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో నమ్మకంగా ఓట్లు వేస్తే మధ్యలో వదిలి వెళ్లారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ చెప్పినట్టు ప్రతి ఇంటికి రోజుకు 700 లీటర్ల మంచినీటి సరఫరా హామీ అన్ని చోట్లా అమలు కావడం లేదు. అదే విధంగా విద్యుత్ చార్జీలు సైతం వచ్చే నెల నుంచి మోత మోగనున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆప్ ఎమ్మెల్యేలు స్థానికులకు వీలైనంత ఎక్కువగా అందుబాటులో ఉండి వ్యతిరేకత తగ్గించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకేసారి ఎన్నికల ముందు వెళితే ఇతర పార్టీలకు ఆప్‌కి తేడా లేదన్న అపవాదు వస్తుందనే ఆలోచనతో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలంతా ఎప్పటికప్పుడు స్థానికుల సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఆప్ వేసే ఎత్తులు జనం ఏమేరకు అర్థం చేసుకుంటారన్నదే అసలు ప్రశ్న. -
నేడే ఆఖరు
ఓటు వజ్రాయుధం వంటిది. ఇదే ఓటు జారిపోతే భావి భారత పౌరులుగా విఫలమైనట్టే.. ఓటు నమోదు చేసుకునే వయసున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అవినీతి ప్రభుత్వాలను పెంచిపోషించినట్టే.. మొన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకంగా మారాయి..! ఎన్నికల సంఘం ఓటు నమోదు చేసుకునే సదావకాశాన్ని కల్పించింది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ఓటుహక్కును సాధించుకోండి.. అవినీతిపై సమరశంఖం పూరించండి.. మంగళవారం చివరి రోజు.. సాయంత్రం ఐదు గంటల వరకే సమయం ఉంది.. యువతీయువకులు రండి.. కదలిరండి.. ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : 2014 సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఓటర్ల జాబితా, సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 18న ప్రారంభించింది. డిసెంబర్ 10వ తేదీతో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తికావాల్సి ఉండగా గడువును 17వ తేదీకి పెంచింది. మంగళవారంతో గడువు ముగియనుంది. జిల్లాలో 1,94,498 కొత్త ఓటర్ల నమోదు లక్ష్యం కాగా ఈనెల 15 వరకు 1,38,431 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజైన మంగళవారం 18 ఏళ్లు నిండిన యువతీయువకులు నిర్లిప్తత వీడి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే సాధార ణ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదైం ఉండాలి. ఒక వేళ జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలి. మంగళవారం వరకు దరఖాస్తు చేసుకున్న వారందరి పేర్లు జనవరి 25 నాటికి ఓటర్ల జాబితాలో ఉంటాయి. వారికి గుర్తింపు కార్డులు జారీ అవుతాయి. ఈ రోజు తర్వాత కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వాటిని ఫిబ్రవరి లేదా మార్చిలోగా అధికారులు పరిష్కరించడం సాధ్యం కాదు. ఈలోగా ఎన్నికలు వస్తే ఓటు వేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల జాబితాలో పేర్లు లేని అర్హులు మంగళవారం ఓటరుగా నమోదు చేసుకోవడానికి మంచి అవకాశం. గుర్తింపు కార్డు పొందండి.. జనవరి 1, 2014 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో, జనన ధ్రువీకరణ పత్రం, తీసుకుని మీ సమీపంలోని బూత్ స్థాయి అధికారులను సంప్రదించండి. ఒక నియోజకవర్గంలో నమోదై ఉండి వేరే నియోజకవర్గానికి మారినట్లయితే కూడా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిరక్షరాస్యులైతే తల్లిదండ్రులచే అఫిడవిట్‌ను జతచేయాలి. ఏ పేరునైన జాబితా నుంచి తొలగించాలనుకుంటే, అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే (చనిపోయిన, నివాసం మారినప్పుడు మొదలైనవి) ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటర్ జాబితాలోని మన వివరాల్లో ఏవైన మార్పులు చేయాలనుకుంటే(ఫొటోలు, మీ పేరు, తండ్రి, భర్త, భార్య పేర్ల సవరణ మొదలగునవి) ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అదే నియోజకవర్గం పరిధిలో మీ నివాసం ఒక పోలింగ్ స్టేషన్ పరిధి నుంచి మరో పోలింగ్ స్టేషన్ పరిధికి మార్చడానికి ఫారం-8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున గుర్తింపు కార్డు (ఎపిక్) అందజేయడం జరుగుతుంది. తద్వారా యువతీయువకులు మొదటిసారి ఓటు వేసే అనుభూతిని పొందేందుకు ఇది మంచి అవకాశం. జిల్లా జనాభా : 27.41 లక్షలు పురుషులు : 13,69,597 మహిళలు : 13,71,642 మొత్తం ఓటర్లు : 17,42,691 పురుషులు : 8,80,290 మహిళలు : 8,62,401 ఓటరు నమోదు లక్ష్యం : 1,94,498 వచ్చిన దరఖాస్తులు : 1,38,431 -
'కామెడీ నైట్స్ విత్ కపిల్` షోకు కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తా
ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన `ఆమ్ ఆద్మీ పార్టీ` నిర్వాహణ తీరు తాననెంతో ఆకట్టుకుందంటూ 'కామెడీ నైట్స్ విత్ కపిల్' ఫేమ్ కపిల్ శర్మ వ్యాఖ్యనించాడు. తాను నిర్వహిస్తున్న `కామెడీ నైట్స్ విత్ కపిల్` కామెడీ షోకు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓ రోజు అతిధిగా ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తన షో అభిమానులకు అతను తెలిపాడు. టీవీ ప్రేక్షుకులను ఎంతోగానూ అలరిస్తున్న హాస్యపూరిత కార్యక్రమం `కామెడీ నైట్స్ విత్ కపిల్` కామెడీ షో నిర్వహకుడిగా కపిల్ శర్మ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానిస్తూ తనదైన శైలీలో అతను కామెడీని పండిస్తుంటాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై కపిల్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ పార్టీ రాకతో భారతీయ ప్రజలలో కొత్త మార్పు రాబోతుందని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నట్టు అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలంతా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని, ప్రజలందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఆసక్తిగా చూస్తున్నారంటూ కపిల్ శర్మ అభిప్రాయ పడ్డాడు. -
ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఏ పార్టీకీ రాని నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు అనివార్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గురువారం రాత్రి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా.హర్షవర్ధన్ చర్చల అనంతరం ఈ విషయం స్పష్టమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ లేనందున తాము ప్రతిపక్షంలోనే కూర్చునేందుకు సిద్ధపడుతున్నట్టు గవర్నర్‌కు తెలిపినట్లు ఆయనను కలిసిన అనంతరం రాత్రి 8 గంటలకు హర్షవర్ధన్ మీడియాతో ప్రకటించారు. మరోమారు ఎన్నికలకు వెళ్లి అయినా స్పష్టమైన మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఏడు రోజుల్లో బలం నిరూపించుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిపక్షంలోనే కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఢిల్లీ ప్రజలను క్షమాపణ కోరుతున్నాం’ అని అన్నారు. ఢిల్లీలో మరోమారు ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా మేం పూర్తి బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని అనుకుంటున్నామన్నారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు రావడానికి బీజేపీ కారణం కాబోదని, అది ప్రజల తీర్పని అన్నారు. ఇతరులు ప్రభుత్వం ఏర్పాటుచేస్తే స్వాగతిస్తామన్నారు. కానీ ఆప్‌కు మద్దతునిస్తారా? లేదా? అన్నది మాత్రం స్పష్టంచేయలేదు. కేజ్రీవాల్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆహ్వానం... ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన పార్టీ బీజేపీ విముఖత చూపడంతో ఆ తర్వాత ఎక్కువ స్థానాలు వచ్చిన ఆప్‌ను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఉదయం చర్చలకు రావాలంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు గవర్నర్ గురువారం ఆహ్వానం పంపారని పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తాము ఎవరికీ మద్దతునివ్వమని, ఎవరి మద్దతూ తీసుకోబోమని కేజ్రీవాల్ బుధవారమే ప్రకటించినందున ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు జరగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఢి ల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 32 (ఎస్ఏడీ స్థానంతో కలిపి), ఆప్‌కు 28, కాంగ్రెస్‌కు 8 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు కావల్సి ఉండగా ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీకి కూడా నాలుగు స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో సర్కారు ఏర్పాటుపై ప్రతిష్టంబన ఏర్పడింది. ‘ఆప్’కు మద్దతుపై కాంగ్రెస్ పరిశీలిస్తోంది: రాహుల్ ప్రభుత్వ ఏర్పాటుకోసం ఆప్‌కు మద్దతు ఇచ్చే విషయాన్ని తమ పార్టీ పరిశీలిస్తోందని గురువారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నేపథ్యంలో ఆప్ కు కాంగ్రెస్ మద్దతునిస్తుందా? అన్న విలేకరుల ప్రశ్నకు రాహుల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. అంతకుముందు ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన 8 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై వారి గెలుపు, పార్టీ ఓటమికి గల కారణాలను ఆరా తీశారు. -
20 చోట్ల రెండోస్థానంలో ‘ఆప్’
రాజకీయ, సినీ వర్గాల నుంచి ప్రశంసలు న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ప్రయత్నంలోనే 28 స్థానాలను గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మరో 20 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గాల్లో ‘ఆప్’ నామమాత్రపు ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆర్కే పురం నుంచి ‘ఆప్’ అభ్యర్థి షాజియా ఇస్లామీ తన బీజేపీ ప్రత్యర్థి అనిల్‌కుమార్ శర్మ చేతిలో కేవలం 326 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుల్తాన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జైకిషన్ కేవలం 1,100 ఓట్ల తేడాతో ‘ఆప్’ అభ్యర్థిపై గెలుపొందారు. బిజ్వాసన్, ద్వారక, కల్కాజీ, త్రినగర్ నియోజకవర్గాలను ‘ఆప్’ 2 వేల నుంచి 3 వేల ఓట్ల తేడాతో జారవిడుచుకుంది. దక్షిణ ఢిల్లీ, గ్రేటర్ కైలాస్, కస్తూర్బానగర్, సంఘం విహార్, అంబేద్కర్‌నగర్, దియోలీ నియోజకవర్గాల్లో బీజేపీకి దాదాపు సమ ఉజ్జీగా నిలిచింది. కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ: కేజ్రీవాల్ నేతృత్వంలో ‘ఆప్’ సాధించిన ఫలితాలకు బాలీవుడ్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. భారీ తారాగణం లేకుండానే సూపర్‌హిట్ అయిన చిత్రం మాదిరిగా ‘ఆప్’ కూడా ఎన్నికల్లో హిట్ అయ్యిందంటూ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారు. ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్‌కు ఉత్తమ తొలి ప్రదర్శన అవార్డు ఇవ్వాలని బాలీవుడ్ నటి ప్రీతీ జింటా వ్యాఖ్యానించారు. రచయిత చేతన్ భగత్ ఢిల్లీ ఫలితాలను ‘ఆప్’ నైతిక విజయంగా అభివర్ణించారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షమైన శివసేన సైతం కేజ్రీవాల్‌పై ప్రశంసలు కురిపించింది. -
జెయింట్ కిల్లర్!
సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన కేజ్రివాల్.. ఆతర్వాత అన్నా హజారే జన లోక్ పాల్ ఉద్యమం ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వాలను, ఢిల్లీ ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించిన 'నిర్భయ' ఘటనకు కేజ్రివాల్ ఆయన బృందం స్పందించిన తీరు పౌరులను ఆకట్టుకుంది. ఆటోల మీద ఏర్పాటు చేసే వ్యాపార ప్రకటనల మీద స్థానిక సంస్థలు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమించిన తీరు కే్జ్రివాల్ పై మరింత నమ్మకం పెంచింది. నీటీ, విద్యుత్ బిల్లుల పెంపును వ్యతిరేకిస్తూ.. బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ స్థానికంగా ప్రజల్లోకి దూసుకెళ్లింది. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ఉద్యమాల ద్వారా ఢిల్లీ ప్రజలకు భరోసా కల్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ నాయకులకు ప్రాధాన్యత కల్పించకుండా..సామాన్య వ్యక్తులనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పెట్టి ఓటర్ల దృష్టిని ఆకర్షించడంలో కేజ్రివాల్ సఫలమయ్యారు. రోజు రోజుకూ ఆమ్ ఆద్మీ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వణుకు పుట్టించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టిస్తున్న ప్రభంజనాన్ని జీర్టించుకోలేక షీలా దీక్షిత్ 'ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే. ఆప్ అసలు పార్టీయే కాదు', విమర్శలు చేయగా, 'దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మాట్లాడాలి' అంటూ ఇతర పార్టీలు విసిరిన సవాళ్లకు ఆమ్ ఆద్మీపార్టీ నేత, కామన్ మ్యాన్ అరవింద్ కేజ్రివాల్ దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పారు. 15 సంవత్సరాలపాటు ఢిల్లీని పాలించిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, క్లీన్ ఇమేజ్ తో బీజేపీ విజయేంద్ర గుప్తాలకు దిమ్మ తిరిగేలా ఓటమి రుచి చూపించిన కేజ్రివాల్ కు రాజకీయ అనుభవం శూన్యమే. అయినా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రివాల్ అనుసరించిన పంథా, పార్టీ విధానాలు ప్రజల్లో, ఓటర్లలో విశ్వాసం పెంచాయి. షీలా దీక్షిత్ ఓడించడమే తన లక్ష్యం అని, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పోటీ చేసినా తాను అక్కడే పోటీ చేస్తానని సవాల్ విసిరి కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంపొందించారు. షీలా దీక్షిత్, కేజ్రివాల్ ల మధ్య పోరులో బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన విజయేంద్ర గుప్తాను రంగంలో నిలుపడంతో పోటీ మరింత ఆసక్తిగా మారింది. పదిహేనేళ్ల షీలా హయాంలో చోటుచేసుకున్న కామన్ వెల్త్ క్రీడల కుంభకోణం, నిర్భయ ఘటన, చార్జీల పెంపుకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమేకాకుండా, చైతన్యాన్ని కూడా కేజ్రివాల్ నింపారు. రాజకీయ ఉద్దండుల ప్రచారం, పార్టీల బలమైన వ్యూహాలు కేజ్రి'వాల్'ను ఏమి చేయలేక చతికిలపడ్డాయి. కొద్దికాలంలో రాజకీయాల్లో దూకుడు, పరిణతి చెందిన నిర్ణయాలకు సానుకూలంగా స్పందించిన ఓటర్లు..ఓ సామాన్యుడికి కూడా రాజకీయాల్లో స్థానం ఉంటుందనే అభిప్రాయాన్ని ఓటు ద్వారా ప్రజలు ఎలుగెత్తి చాటారు. ప్రజలు అందించిన మద్దతుతో రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న షీలా దీక్షిత్ ను, గుప్తాలను మట్టికరిపించి న్యూఢిల్లీ నియోజకవర్గంలో 25,864 ఓట్ల విజయంతో 'జెయింట్ కిల్లర్'గా నిలిచాడు. -
హర్షవర్ధన్: భలే డాక్టర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇంకో నెల రోజుల్లో ఉన్నాయనగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చిన హర్షవర్ధన్‌కు నిజాయితీపరుడని పేరుంది. ఈఎన్టీ వైద్యునిగా బాగా పేరున్న ఆయన సాదాసీదాగా వ్యవహార శైలితో అన్ని గ్రూపులనూ కలుపుకునిపోవడం ద్వారా పార్టీని విజయపథంలో ముందుకు నడిపించారు. ఒకవిధంగా ఆయన్ను సీఎం అభ్యర్థి చేయడం వల్లే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి, అటు కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలిగిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అనూహ్యంగా పెరిగిపోయిన కరెంటు చార్జీలను 30 శాతం మేరకు తగ్గిస్తానన్న ఆయన హామీ ఈ ఎన్నికల్లో ఢిల్లీవాసులను బాగా ఆకట్టుకుంది. ఆరెస్సెస్ కార్యకర్త అయిన 59 ఏళ్ల హర్షవర్ధన్ అందరికీ డాక్టర్ సాబ్‌గా సుపరిచితుడు. 1993లో కృష్ణనగర్ అసెంబ్లీ స్థానం నుంచి నెగ్గడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 1998, 2003, 2008ల్లో అక్కడి నుంచి వరుసగా గెలిచారు. వైద్య మంత్రిగా ఢిల్లీని పోలియో విముక్త రాష్ట్రంగా చేయడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని పోలియో నిర్మూలన పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేసింది. ఢిల్లీలో ఆయన అమలు చేసిన ధూమపాన నిషేధ చట్టం కూడా ఇదేవిధంగా 2002లో దేశవ్యాప్తమైంది. మంత్రిగా ప్రతి ఒక్కరికీ నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల్లోనూ హర్షవర్ధన్ ఎంతగానో ఆదరణను పెంచుకున్నారు. -
పొత్తుల విషయంలో స్పష్టత ఇవ్వని క్రేజీవాల్
-
కేజ్రీవాల్‌పై షీలా దీక్షిత్‌కు ఆధిక్యం
న్యూఢిల్లీ: అత్యంత పటిష్టాత్మకంగా మారిన న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటా పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్‌పై షీలా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కృష్ణానగర్ లో బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్థన్ కు ఆధిక్యంలో ఉన్నారు. 14 కేంద్రాల్లో భారీ భద్రత నడుమ ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 810 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
గెలిచినా.. ఓడినా షీలాకే..!
న్యూఢిల్లీ: అన్నీతానై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడిపించిన ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌కే కాంగ్రెస్ పార్టీ గెలుపోటముల కీర్తి-అపకీర్తి దక్కనుంది. పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనపై ఢిల్లీవాసులు ఆగ్రహంగా ఉన్నారని, వారంతా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మొండిచెయ్యి చూపనున్నట్టు సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. అయితే అనూహ్య పరిణామాలతో గెలిచి తీరతామన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఇంకా మిగిలే ఉంది. అదే జరిగితే ఆ క్రెడిట్ అంతా షీలాదీక్షిత్‌కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని నిత్యం చెప్పే షీలాదీక్షిత్‌కి ఇటీవల కొన్ని సంఘటనలు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. శాంతిభద్ర తల అంశం ఆమె చేతుల్లో లేనప్పటికీ నిర్భయ ఘటనతో షీలాదీక్షిత్ ప్రతిభ మసకబారింది. అదే సమయంలో చుక్కల్లోకి చేరిన ఉల్లి, కూరగాయల ధరలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. పదిహేనేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటమి తప్పదన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం షీలాదీక్షిత్‌ను ఒంటరిని చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణ కావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభలకు జనం పల్చబడడంతో ఆయన నెమ్మదిగా మెహం చాటేశారు. మొదట బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి ధీటుగా రాహుల్ సభలు నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత పరిణామాలతో మరింత నష్టం జరుగుతుందని భావించిన పార్టీ అధిష్టానం రాహుల్ ప్రచార సభలు తగ్గించి ఆయనను తప్పించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఒక్కటంటే ఒక్కటే సభతో సరిపెట్టారు. ఇక ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ బహిరంగ సభలో పాల్గొంటారని ప్రకటించినా మోడీ సభలకు వస్తున్న స్పందన చూసి ఆ సాహసం చేయలేక విదేశీ అధ్యక్షుల పర్యటనను సాకుగా చూపి చాలించుకున్నారు. పార్టీ ఎంపీల్లోనూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జేపీ అగర్వాల్ మినహా మరెవరూ ఆసక్తి చూపలేదు. కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సైతం రెండు మూడు సభలకే పరిమితమయ్యారు. అధిష్టానం మొహం చాటేసినా 75 ఏళ్ల షీలాదీక్షిత్ ఒంటి‘చేత్తో’ ప్రచారరథాన్ని నడిపించారు. పదిహేనేళ్ల పాలనలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మరోమారు తనను ఢిల్లీ గద్దెపై కూర్చోబెడతాయన్న ధీమాతో షీలా ఉన్నారు. -
‘నోటా’కు బాగానే పడ్డాయ్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’కు భారీగా ఓట్లు పడ్డాయి. రాజకీయ పార్టీలపై ఆశలు కోల్పోయిన చాలామంది ‘పై అభ్యర్థుల్లో ఎవరూ కాదు’(నోటా) బటన్‌ను నొక్కారు. రాజకీయ పోటీ తీరును మార్చడానికి దీనికి ఓటేశామని వారు చెప్పారు. ఓటర్లకు అభ్యర్థులందర్నీ తిరస్కరించే హక్కు ఉందని, దీని కోసం ఈవీఎంలలో బటన్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశంపై రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలతోపాటు ఢి ల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’ను అమల్లోకి తీసుకొచ్చారు. తమకు నోటా బటన్‌ను నొక్కే మంచి అవకాశం ఈ ఎన్నికల్లో లభించిందని పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి వాసి అరవింద్ త్యాగి చెప్పారు. తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ఆయన ఏకరువు పెట్టారు. ఈ బటన్‌ను ఇదివరకే తీసుకొచ్చి ఉంటే బాగుండేదని మరో ఓటరు చెప్పారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ పోటీ చేస్తున్న కృష్ణ నగర్లో చాలా మంది యువతీయువకులు నోటాకు ఓటేశామన్నారు. అయితే ఈ దీని గురించి తమకు తెలియదని దక్షిణ ఢిల్లీలోని చాలామంది ఓటర్లు తెలిపారు. నోటా వల్ల ఉపయోగం లేదని, దానికి ఓటేసే బదులు ఇంట్లోనే కూర్చుంటే సరిపోతుందని సర్దార్ బజార్ అనే వ్యక్తి అన్నాడు. -
భవిష్యత్తు తేల్చే ఫలితాలు!
సంపాదకీయం: ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం జరిగిన పోలింగ్‌తో రెండు నెలలుగా హోరెత్తిన ఎన్నికల జాతర పూర్తయింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఛత్తీస్గఢ్తోసహా రాష్ట్రాలన్నిటా పోలింగ్ ముమ్మరంగానే సాగింది. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు పరస్పర నిందారోపణల్లో, విమర్శల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. బీజేపీ ప్రధాన ప్రచార సారథి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రతి చర్యనూ, పలుకునూ నిశితంగా గమనించి ఎప్పటికప్పుడు ఎద్దేవా చేస్తూ పిడుగులు కురిపిస్తే... కాంగ్రెస్‌కు సంజాయిషీలు ఇవ్వడానికే సరిపోయింది. ఎదురుదాడికి ఇక సమయమెక్కడిది? మోడీ చేసే విమర్శలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా... కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ ఏం మాట్లాడి పీకలమీదికి తెస్తారోనని కాంగ్రెస్ శ్రేణులు వణికిపోయాయి. నాలుగేళ్ల క్రితం గుజరాత్లో ఒక యువతి కదలికలపై మోడీ ప్రభుత్వం నిఘా ఉంచింద న్న కథనం వెల్లడయ్యేవరకూ కాంగ్రెస్‌ది అదే పరిస్థితి. సర్దార్ పటేల్ మొదలుకొని 370 అధికరణం వరకూ చరిత్రలోని వ్యక్తులనూ, ఉదంతాలనూ ఉదహరించడంలో తప్పులు చేస్తూ పోయిన నరేంద్రమోడీ ఆ బాణీని చివరివరకూ కొనసాగిం చారు. ఎవ రెన్నివిధాల చెప్పిచూసినా, ఎత్తి చూపినా ఆయన మారింది లేదు. విషాదమేమంటే, ఏ రాష్ట్రంలోనూ ఆయా పాలకపక్షాల అయిదేళ్లపాలనలోని లోటుపాట్లుగానీ, ఆ పార్టీల విధానాలుగానీ సరిగా చర్చకు రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యేముందు మావోయిస్టుల జరిపిన దాడిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. మావోయిస్టులతో కుమ్మక్కయింది మీరంటే మీరని ఆరోపించుకోవడం తప్ప అక్కడ నెలకొన్న పరిస్థితులపై లోతైన చర్చ జరగలేదు. దాదాపు తొమ్మిదిన్నరేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంటున్న యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్... ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనూ భరోసాతో లేదు. పాలించే రాష్ట్రంలో దాన్ని నిలుపుకోగలమనిగానీ, విపక్షంగా ఉన్నచోట్ల అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలమనిగానీ ఆ పార్టీకే నమ్మకం లేదు. ఏ సర్వేలు గమనించినా, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినా కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టుగానే ఉన్నదని వెల్లడవుతున్నది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆదరాబాదరాగా ఆహారభద్రతా చట్టం మొదలుకొని మహిళా బ్యాంకు వరకూ ఎన్నిటినో అమల్లోకి తెచ్చినా ఏ మాత్రం ప్రయోజనం లేకపోయిందన్నది అర్ధమవుతోంది. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు... మరీ ముఖ్యంగా సామాన్యుడికి అందకుండాపోయిన ఉల్లిగడ్డలు కాంగ్రెస్ విజయావ కాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీని మట్టికరిపించలేని కాంగ్రెస్... రాజస్థాన్ లోనూ, ఢిల్లీలోనూ అధికారాన్ని కోల్పోనున్నదని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చెబుతున్నాయి. రాజస్థాన్ బీజేపీ వైపు మొగ్గుచూపుతుండగా, ఢిల్లీలో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడ గలదనుకున్న ఛత్తీస్‌గఢ్‌లో సైతం బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటున్నారు. ఎన్నికలనేసరికి ప్రభుత్వాల పనితీరు, వాటి విధానాలు... వివిధ అంశాలపై పార్టీల వైఖరులు చర్చకు రావడం రివాజు. కానీ, ఈమధ్యకాలంలో అదంతాపోయి విమర్శలు, పరస్పర దూషణలే మిగులుతున్నాయి. కేవలం ఎవరు గద్దెనెక్కాలన్న అంశంలో తప్ప... దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పాలక, ప్రతిపక్షాలు రెండూ దాదాపు ఒకే వైఖరితో ఉండటమే ఇందుకు కారణం. విధానాలు, ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య ఘర్షణగా ఉండాల్సిన ఎన్నికలు వ్యక్తుల నిందారోపణలకూ, ధనబలానికీ ప్రతీకలవుతున్నాయి. అవతలి పక్షంతో పోలిస్తే తమది సమూల మార్పును కోరుకుంటున్న పార్టీ అని చెప్పడానికి అవసరమైన విధానాలు ఏ పార్టీకీ లేవు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఒక్క ఢిల్లీ మాత్రం ఈ మూసనుంచి బయటపడింది. అక్కడ తొలిసారి బరిలోకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ప్రత్యామ్నాయ విధానాలనూ, ఆలోచనలనూ ఓటర్ల ముందుంచగలిగింది. ఎన్నికల ప్రణాళిక మొదలుకొని అభ్యర్థుల ఎంపికవరకూ విలక్షణమైన మార్గాన్ని ఎంచుకుంది. గంభీరమైన మాటలతో, ఆదర్శాలతో, అలవిమాలిన హామీలతో నిండివుండే ఎన్నికల ప్రణాళికకు భిన్నంగా నియోజకవర్గాలవారీ ప్రణాళికలను ప్రకటించింది. సాధారణంగా ఎన్నికల సమయంలో చర్చకు రాని మహిళల భద్రత వంటి అంశాన్ని ప్రధానాంశంగా మార్చింది. రాజకీయ అందలాలగురించి ఎలాంటి ఆశా లేని వేలాదిమంది యువ వలంటీర్లను సమీకరించగలిగింది. పాత ఓటర్లలో ఆలోచనలు రేకెత్తించడంతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించగలిగింది. అయితే తాము లేదా అవతలి పార్టీ తప్ప మూడో పక్షానికి అవకాశమే ఉండరాదన్న కాంగ్రెస్, బీజేపీలకు ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి షాకే ఇవ్వగలిగింది. కేజ్రీవాల్ లేవనెత్తిన అంశాలపై మౌనంగా ఉండటం ద్వారా ఆయన పార్టీ ప్రాధాన్యతను తగ్గించవచ్చనుకున్న రెండు పార్టీలూ అందులో విజయం సాధించలేకపోయాయి. పోలింగ్ నాలుగైదు రోజులుందనగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులపై సాగిన స్టింగ్ ఆపరేషన్ల ప్రహసనమే దాని ప్రాధాన్యతను తెలియజెప్పింది. మొదట్లో గట్టి పోటీ మాత్రమే ఇవ్వగలదని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీపై ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించగలదన్న అంచనాలు ఏర్పడ్డాయి. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం సందర్భంగా ఉవ్వెత్తున చెలరేగిన ఆందోళనల తర్వాత యువతరం ఆలోచనల్లో వచ్చిన మార్పు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వేళ్లూనుకోవ డానికి దోహదపడింది. నాలుగురోజుల్లో వెల్లడయ్యే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశం ఎటు మొగ్గుచూపబోతున్నదో తెలియజెబుతాయి. అందుకే ఈ ఫలితాలపై అందరికీ అంత ఆసక్తి. -
భవితవ్యం ఈవీఎంలలో భద్రం
సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం సాయంత్రంతో ఢిల్లీలో ఓట్ల పండుగ ముగిసింది. 65 శాతం మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా... గెలుపు ఎవరిది..? ఎవరి బలం ఎంత? నిర్ణయించడం మాత్రం ఇప్పటికీ కష్టంగానే కనిపిస్తోంది. అభివృద్ధే తారక మంత్రంగా ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేతలు నాలుగోమారు ఢిల్లీ గద్దెపైకి ఎక్కుతామన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌పై ఎక్కుపెట్టిన విమర్శలతోపాటు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రచారం తమకు కలిసి వస్తుందని బీజేపీ నాయకులు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నింటా వినూత్న పద్ధతులు అనుసరిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈనెల 8 నిర్వహించబోయే ఓట్ల లెక్కింపులోనూ ఊహించని ఫలితాలు నమోదు చేయనున్నట్టు ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. ఉత్కంఠగా ఎదురుచూపు... బుధవారం ఉదయం పోలింగ్ మొదలైన ప్పటి నుంచి మందకొడిగా ఉన్న ఓటింగ్ శాతం అనూహ్యంగా చివరి రెండు గంటల్లోనే రికార్డు స్థాయికి చేరుకుంది. ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం ఆయా పార్టీల నాయకులంతా తమదే గెలుపు అంటూ మీడియా ముందు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రె స్‌పార్టీలో దిగ్గజాల ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఓటింగ్ ఫలితాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ పోటీపడుతుండంతో అక్కడి ఫలితాలపై అంతా దృష్టి సారిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి డా. హ ర్షవర్ధన్ కృష్ణానగర్ నుంచి మరోమారు గెలుస్తారని ధీమాగా ఉన్నా, ఈసారి ఓట్ల సంఖ్య తగ్గించడంలో కాంగ్రెస్ అభ్యర్థి డా.మంగూసింగ్ ఏమేరకు సఫలమవుతారో వేచి చూడాలి. 15 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే మరోమారు తమను అధికారంలోకి తెస్తాయని కాంగ్రెస్ నమ్మకంగా ఉన్నా ఇటీవల పెరిగిన కూరగయాల ధరలు, మహిళల భద్రత అంశాలు ఆపార్టీకి నిరాశే మిగల్చనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్న ఢిల్లీవాసులు మద్దతుతో కమల వికాసం తప్పదని బీజేపీ ధీమా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పాలనను చూసిన ఢిల్లీ ఓటర్లు ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో కీలకం కానుంది. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 18 స్థానాలు, బీజేపీకి 32 స్థానాలు, ఆమ్ఆద్మీపార్టీకి 18 స్థానాలు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాస్త అటు ఇటూ అయినా ఆమ్ ఆద్మీకి మరింత లాభం చేకూరవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. -
ఢిల్లీ భవితపై మహిళా ఓటర్ల ముద్ర
న్యూఢిల్లీ: స్థానిక ఎన్నికల్లో ఈసారి మహిళలు అధికసంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బుధవారంనాటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా మహిళలు ఓటు వేశారు. భద్రత లేమి, నిత్యావసరాల పెరుగుదల వంటి సమస్యలతో తల్లడిల్లుతున్న మహిళలు దక్షిణ ఢిల్లీలోని ఆర్.కె.పురం, మాలవీయనగర్, ఛత్తర్పూర్, తుగ్లఖాబాద్ వంటి నియోజకవర్గాల్లో అధికసంఖ్యలో ఈసారి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు ఓటును ఆయుధంగా వాడుకున్నారు. ముఖ్యంగా మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న మహిళలు తమ ఓటుతో స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలమనే ధీమాను వ్యక్తం చేశారు. ఆర్కేపురంలో 800 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటల వరకే మహిళలు 50 శాతానికి పైగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని స్థానిక పోలింగ్ అధికారి సంజయ్ కిషోర్ తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అభ్యర్థిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఛత్తర్పూర్ నియోజకవర్గంలోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 35 వేల మంది ఓటర్లు ఉండగా ఉదయం 11 గంటల వరకు 4,200 మంది ఓటేసినట్లు ఎన్నికల అధికారి రమేష్ రాజ్పుట్ చెప్పాడు. తుగ్లకాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 వేల ఓటర్లు ఉన్న ఇందిరా క్యాంప్ మురికివాడల్లో స్థానిక సమస్యలే ఓటర్ల భవితవ్యాన్ని ప్రభావితం చేయనున్నాయి. ‘ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ చాలా అధ్వానం. చాలా తక్కువ మరుగుదొడ్లు ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి మార్పును కోరుతున్నాం. మా సమస్యలు పట్టించుకునేవారినే ఎన్నుకోవాలనుకుంటున్నాం..’ అని 48 ఏళ్ల క్యాంప్ నివాసి లాల్ సింగ్ చెప్పాడు. మాలవీయనగర్‌లో కొత్తపార్టీ హవా కనిపిస్తోంది. ‘ఇక్కడ వాహనాల పార్కింగ్ చాలా పెద్ద సమస్య. రక్షణ, ధరలు, కరెంటుతో పాటు పార్కింగ్ సమస్యను పరిష్కరించే వారికే ఈసారి మా మద్దతు..’ అని అవ్నీత్ కౌర్ తెలిపారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆప్ నాయకుడు కేజ్రీవాల్ పోటీపడుతున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలోనూ మొదటిసారి ఓటుహక్కు పొందిన మహిళా ఓటర్లు అధికసంఖ్యలో ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. అయితే జంగ్‌పురా,బాదర్పూర్, సంగం విహార్ వంటి ప్రాంతాల్లో మాత్రం మిహ ళా ఓట్ల శాతం తగ్గిందని చెప్పవచ్చు. -
సోనూతో గొంతు కలిపిన గడ్కారీ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన వాతావరణంలో కాకలు తీరిన నేతలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయం ఇది. బుధవారం సమావేశానికి హాజరైన బీజేపీ నేత నితిన్ గడ్కారీ ప్రసిద్ధ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్‌తో గొంతు కలి పాడు. ఇండియా టుడే గ్రూప్ మీడియా నిర్వహించి న ఎజెండా ఆజ్‌తక్ సమావేశంలో గడ్కారీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తొలుత ‘సోనూ కీ సర్గమ్’ పేరుతో సోనూ నిగమ్ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే సమావేశంలో రెండవ సెషన్ లో గడ్కారీ మాట్లాడాల్సి ఉంది. సోనూ కచేరీ వినడానికి సిద్ధమైన గడ్కారీ సోనూనిగమ్ తన అభిమాన గాయకుల్లో ఒకడని పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన ‘సందేశే అతే హై’ పాటను కోరాడు. సోనూ మాట్లాడుతూ‘బార్డర్‌లోని ఈ పాట నా వృత్తి జీవితంలో ముఖ్యమైనది. బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ఈ పాట నాకు ఊతమైంది’ అని వివరించి పాట ఆలపించాడు. తర్వాత గడ్కారీ సోనూతో కలిసి ‘తుజ్సే నారాజ్ నహీ జిందగీ... హైరాన్ హూ మై’ అనే పాటను ఆల పించాడు. 1983లో విడుదలైన మౌసమ్ చిత్రంలోని ఈ గీతం ఎన్నికల నేపథ్యంలో గడ్కారీ మానసిక స్థితికి అద్దం పట్టినట్లుగా అనిపించింది. తర్వాత సంగీత పరిశ్రమలో చోట్టు చేసుకుంటున్న కొత్త వరవడులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ప్రసిద్ధ గజల్ విధ్వాంసులు తలత్ అజీజ్, పంకజ్ ఉదాస్లు ప్రేక్షకుల్లో కూర్చొని సోనూ నిగమ్ మీద ప్రశంసలు కురిపించారు. -
ఢిల్లీ పీఠం ఎవరికో?
హస్తిన అసెంబ్లీకి నేడే పోలింగ్ కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌ల మధ్య ముక్కోణపు పోటీ బరిలో 810 మంది అభ్యర్థులు హంగ్ ఏర్పడుతుందంటున్న ప్రీపోల్ సర్వేలు 8న ఓట్ల లెక్కింపు న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది ఘట్టానికి తెరలేచింది. మొత్తం 70 స్థానాలున్న హస్తిన అసెంబ్లీకి బుధవారం పోలింగ్ జరగనుంది. ఈసారి ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్‌నే మళ్లీ అందలం ఎక్కిస్తారా లేక నరేంద్ర మోడీ ప్రభావంతో కాస్త పుంజుకున్న బీజేపీని బలపరుస్తారా లేదంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అవకాశం ఇస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ద్విముఖ పోటీకే పరిమితమైన ఢిల్లీ పీఠం.. ఆప్ రాకతో సీన్ మారిపోయింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఆప్ నిలబడడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు చెమటోడ్చి ప్రచారం చేశాయి. వరుసగా నాలుగోసారి కూడా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది . కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, మోడీ, అరుణ్‌జై ట్లీ, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కారీ తదితరులు ప్రచారంలో పాలు పంచుకున్నారు. ఇక ఈ ఎన్నికలతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆప్.. వినూత్న ప్రచారంతో జనాల్లోకి దూసుకె ళ్లింది. ఇంటింటి ప్రచారం నిర్వహించడంతోపాటు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పలు రోడ్‌షోల ద్వారా ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా హస్తినలో ప్రచారం చేశారు. అన్ని పార్టీలూ ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. మహిళా భద్రత, అవినీతి, ధరల పెరుగుదల, సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా వాటి హామీలపర్వం కొనసాగింది. విజయంపై ప్రధాన పార్టీలు వేటికి అవే ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ.. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ప్రీపోల్ సర్వేలు తేల్చాయి. సీఎం అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, బీజేపీ నుంచి డాక్టర్ హర్షవర్ధన్, ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్‌లు బరిలో ఉన్నారు. షీలాదీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్‌లు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉండగా, అక్కడ బీజేపీ తన అభ్యర్థిగా పార్టీ ఢిల్లీ విభాగం మాజీ చీప్ విజేంద్ర గుప్తాను రంగంలోకి దించింది. దీంతో అక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, ఆప్‌లు మొత్తం 70 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టగా.. బీఎస్పీ(69), బీజేపీ(68), ఎన్సీపీ(9), సీపీఎం(3), శిరోమణి అకాలీదళ్ నుంచి ఇద్దరు, ఇతరులు 509 మంది పోటీలో నిలిచారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్ దేవ్ వెల్లడించారు. 32,801 మంది ఢిల్లీ పోలీసులతోపాటు 107 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలను మోహరించినట్టు చెప్పారు. పార్టీల ప్రధాన హామీలు ఇవే... కాంగ్రెస్: షీలాదీక్షిత్ ఢిల్లీలోని 73 లక్షల మంది ప్రజలకు ఆహార భద్రత చట్టం కింద సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందజేస్తాం గృహ వినియోగదారులకు 40 లీటర్ల వరకు సబ్సిడీపై నీళ్లు సరఫరా చేస్తాం. మూడు కొత్త వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం {పస్తుతం ఉన్న మరికివాడల స్థానంలో హౌసింగ్ యూనిట్లు నిర్మిస్తాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నాలుగు లక్షల ఫ్లాట్లు ఇస్తాం బీజేపీ: డాక్టర్ హర్షవర్ధన్ విద్యుత్ చార్జీలు 30 శాతం మేర తగ్గిస్తాం. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోగా కూరగాయల ధరలు తగ్గిస్తాం. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 12కి పెంచుతాం మహిళా భద్రత కోసం సీఎం పర్యవేక్షణలో ప్రత్యేక దళంతోపాటు 24 గంటల కాల్‌సెంటర్లు ఏర్పాటుచేస్తాం. మహిళలపై జరిగిన నేరాల కేసులను త్వరితగతిన విచారించేందుకు మరిన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తాం ఢిల్లీలో సైకిల్ సంస్కృతిని ప్రోత్సహిస్తాం. ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడానికి వీలుగా కేంద్రీకృత ట్రాఫిక్ ప్రణాళిక రూపొందిస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ: అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ చార్జీలను 50 శాతం మేర తగ్గిస్తాం. రోజుకు ఒక్కో గృహానికి 700 లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తాం మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో త్వరితగతిన న్యాయం అందేలా చూస్తాం. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోగా జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తాం. ఢిల్లీ ఎన్నికల ముఖచిత్రం మొత్తం సీట్లు: 70 పోలింగ్ బూత్‌లు: 11,763 మొత్తం ఓటర్లు: 1.19 కోట్లు బరిలో ఉన్న అభ్యర్థులు: 810 ఎక్కవ మంది అభ్యర్థులు ఉన్న స్థానం: బురారీ(23 మంది) తక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గం: పటేల్‌నగర్(నలుగురు) ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గం: వికాస్పురి (2,82,632) -
ఢిల్లీలో.. నేడే పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఐదో విధానసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కోటి మందికి పైగా ఓటర్లు విధానసభ ఎన్నికలలో పోటీపడ్తోన్న 810 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నారు. అభ్యర్థుల జాబితాలో ఉన్నవారెవరికీ ఓటు వేయకూడదనుకునేవారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పైనున్న ఆఖరి బటన్ నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ- పైవారిలో ఎవరూ కాదు) నొక్కే అవకాశం ఢిల్లీ ఓటర్లకు బుధవారం తొలిసారిగా అందుబాటులోకి రానుంది. ఓటింగ్ కోసం నగరంలో 11వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 630 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా వ్యవస్థతో పాటు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ 45 పోలింగ్ కేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా గుర్తించింది. ఈ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఓటు వేయడం కోసం పొడవాటి క్యూలలో నిల్చోవాల్సిన అవసరం లేదు. ఓటు వేయడానికి వచ్చేవారికి టోకెన్లు ఇస్తారు. ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స ఓటర్లకు అందుబాటులో ఉంటాయి.ఓటర్లకు సహాయపడడం కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఓటరు గుర్తింపు కార్డులేనివారు పాస్‌పోర్టు లేదా డ్రైవింగ్ లెసెన్స్ లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ/ప్రభుత్వ రంగసంస్థ ఉద్యోగి ఫొటో గుర్తింపుకార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్, ప్యాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్జీఏకార్డు, కార్మిక మంత్రిత్వశాఖ ఆరోగ్య పథకం స్మార్ట్ కార్డు, ఫొటోతో కూడిన పింఛను డాక్యుమెంట్‌ను చూపి తమ ఉనికిని నిరూపించుకుని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవడానికి మూడు పార్టీల మధ్య జరుగుతోన్న పోరులో ఓటింగ్ శాతం కీలక పాత్ర పోషించనుంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ విధానసభ ఎన్నిక లలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడంతో ఢిల్లీలోనూ అదే ధోరణి కొనసాగవచ్చని ఎన్నికల అధికారులు ఆశిస్తున్నారు. ఢిల్లీలో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం నగర ఎన్నికల కార్యాలయం అనేక జాగరూకత కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వేతర సంస్థల సహాయంతో జాగరూకత కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు సినీతారలు, టీవీ నటులు, ఇతర సెలబ్రిటీలతో ఓటు హక్కు ఆవశ్యకతను నగర ఓటర్లకు వివరించేందుకు కృషిచేసింది. యువ ఓటర్లను నమోదుచేయడానికి, ఓటరు జాబితాలోని బూటకపు పేర్లను తొలగించడానికి కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. విధానసభ ఎన్నికలలో గెలుపు తమదే అని అధికారం కోసం పోటీపడ్తోన్న మూడు పార్టీలు చెబుతున్నప్పటికీ నిజంగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది హేమాహేమీలైన రాజకీయ పండితులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరిలో ప్రవేశించడం వల్ల ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని అంటున్నారు. ఎన్నికల ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే సీట్లు నిర్దేశిస్తాయని వారు అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందని బీజేపీ విమర్శిస్తున్నప్పటికీ ఆ పార్టీ వల్ల అధిక నష్టం కాంగ్రెస్‌కే వాటిల్లనుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం వల్ల రాజకీయ వాతావరణం ఆ పార్టీకి పూర్తి అనుకూలంగా మారకపోయినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారిందని వారు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగడం బీజేపీకి లాభిస్తుందని మరికొందరు అంచనావేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు, అససమ్మతి రాజకీయాలు బీజేపీకి ప్రతికూలాంశాలుగా ఉన్నాయి. సిటింగ్ ఎమ్మెల్యేల సీట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నప్పటికీ వారిలో పలువురి విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలుస్తారనే ఆశతో ఇటీవల పార్టీలోకి చేర్చుకుని టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేల గెలుపు కూడా సందేహాస్పదంగా మారింది. ఆప్ ఎన్నికల బరిలోకి దిగడం వల్ల 2008 అసెంబ్లీ ఎన్నికలలో సునాయాసంగా గెలిచిన పలువురు నేతల విజయావకాశాలు ఈ ఎన్నికలలో ప్రశ్నార్థకంగా మారాయి. 1993 నుంచి వరుసగా విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్, బీజేపీ శాసనసభ్యులు కూడా తమ గెలుపు కోసం ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. బీజేపీ కూడా వారు పోటీపడ్తోన్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి విజేందర్ ఉగప్తాను బరిలోకి దింపి ఎన్నికను ముక్కోణపు పోటీగా మార్చివేసింది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్తోన్న ముగ్గురు నేతలలో డాక్టర్ హర్షవర్ధన్ గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ఆప్ ఆయనకు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి వీకే మోంగా ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనితో ఈ నియోజకవర్గం నుంచి హర్షవర్ధన్ గెలుపు నల్లేరుపై నడకగా మారనుంది. అందుకే ఆయన తన నియోజకవర్గ ప్రచార బాధ్యతను కార్యకర్తలపైనా, తన భార్యపైనా పెట్టి మిగతా నియోజకవర్గాలలో ప్రచారంపై దృష్టిసారించారు. కానీ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అర్వింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌లకు ఈ సౌలభ్యం కరువైంది. వారు తమ పార్టీ అభ్యర్థుల కోసమేకాక తమ కోసం కూడా ప్రచారం చేసుకోవలసివచ్చింది. మంత్రుల విషయానికి వస్తే 2008 అసెంబ్లీ ఎన్నికలలో గాంధీనగర్ నుంచి అత్యధికంగా 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఈసారి తన ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సివచ్చింది. మంగోల్‌పురిలో రాజ్‌కుమార్ చౌహాన్, లక్ష్మీనగర్‌లో ఏకే వాలియా, బల్లీమారన్లో హరూన్ యూసఫ్, మాలవీయనగర్‌లో కిరణ్వాలియా, రాజేందర్‌నగర్‌లో రమాకాంత్ గోస్వామి కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. -
50 స్థానాలు గెల్చుకుంటాం: ఏఏపీ
న్యూఢిల్లీ: తొలిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) తమకు 38 నుంచి 50 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఓ న్యూస్ పోర్టల్ నిర్వహించిన రహస్య శూలశోధనతో ఇబ్బందుల్లో పడినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెల్చుకుంటామని చెబుతోంది. తమ పార్టీ నిర్వహించిన నాలుగు, ఐదో రౌండ్ల సర్వే ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ ఆదివారం విడుదల చేశారు. తమ పార్టీకి 35.6 శాతం ఓట్లు వస్తాయని, 38 నుంచి 50 సీట్లు గెల్చుకుంటుందని సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. బీజేపీకి 27 శాతం, కాంగ్రెస్‌కు 26 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. ఆమ్ ఆద్మీయ పార్టీ సానుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని తెలిపారు. -
ఓటుహక్కు వినియోగించుకోనున్న 15 వందల మంది సెక్స్‌వర్కర్లు
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం తీసుకున్న ప్రత్యేక చొరవతో నగరంలోని సెక్స్‌వర్కర్లు కూడా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటిదాకా వీరి పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడం తో అనామకులుగానే ఉన్నారు. తాజాగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు నమో దు ప్రక్రియ ను రెడ్‌లైట్ ఏరియాలో కూడా నిర్వహించడంతో దాదాపు 1,500 మంది సెక్స్‌వర్కర్లు తమ పేర్ల ను నమోదు చేసుకున్నారు. వీరంతా డిసెంబర్ 4న జరగనున్న విధానసభ ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయనున్నారు. జీబీ రోడ్డులోని రెడ్‌లైట్ ఏరియాలో ఉంటున్న నఫీసా(పేరు మార్చాం) ఈ విషయమై మాట్లాడుతూ... ‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో నాతో కలిసి దాదా పు 300 మంది ఓటరుగా వారి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు ఓటు వేయనున్నారు. వారిలో నేనూ ఉన్నందుకు సం తోషంగా ఉంద’ని పేర్కొంది. ‘ఇలా వివిధ ప్రాం తాల్లో 1,500 మంది సెక్స్ వర్కర్ల పేర్లు ఓటరు జాబితాలోకెక్కాయి. వీరంతా తమకు ఓటరు గుర్తింపు కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా పరిశీలన జరపాల్సి ఉంద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 2003లో ఇలా 300 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా 2008లో 1,200 మంది నమోదు చేసుకున్నారు. ఈ సంవత్సరం దాదాపు 1,500 మంది ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతం లో నాలుగు గోడల మధ్యే ఉండడానికి ఇష్టపడే వీరు ఇప్పుడు గుర్తింపు కార్డు కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే సరైన పత్రాలు చూపించడం వీలుకాకపోవడంతో వీరికి ఓటరు గుర్తింపు కార్డు అంత సులభంగా లభించడంలేదు. ఈ విషయంపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని పలువురు సెక్స్ వర్కర్లు కోరుతున్నారు. -
వారు విషం చిమ్ముతున్నారు: సోనియాగాంధీ
మోడీ, బీజేపీలపై సోనియా ధ్వజం వారు కళ్లు మూసుకున్నారు, అభివృద్ధి కనపడదు అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తోంటే... ఇక రుజువులెందుకు విమర్శించడమే వారి పని న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన ప్రచారానికి మరింత పదునుపెట్టారు. బీజేపీపైనా, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైనా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సంకుచిత సిద్ధాం తంతో వారు విషాన్ని చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు. దేశంలోని అన్ని చిన్న రాష్ట్రాలకంటే ఢిల్లీ అభివృద్ధిలో వెనుకబడి ఉందన్న మోడీ వ్యాఖ్యలను సోనియా తిప్పికొట్టారు. వారు కళ్లు మూసుకున్నారని, అబద్ధాలే మాట్లాడాలని కంకణం కట్టుకున్నారని ఆమె విమర్శించారు. గత 15 ఏళ్లలో తమ పార్టీ పాలనలో ఢిల్లీ ఎంతగానో అభివృద్ధి చెందిందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను కొనియాడారు. రాజధాని నగరం ప్రగతిపథంలో వెళ్తున్నా విపక్షానికి కనిపించకపోవడం విడ్డూరమన్నారు. ఆమె మోడీ పేరునుగానీ, బీజేపీ పేరునుగానీ ప్రస్తావించకుండా పరోక్షంగా తమ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని మాట్లాడారు. 12 నిమిషాలపాటు హిందీలో కొనసాగిన సోనియా ప్రసంగం వ్యంగ్యాస్త్రాలు, సూక్తులతో ఎంతగానో ఆకట్టుకుంది. ‘నేను కూడా ఢిల్లీవాసినే. ఢిల్లీలో గత 15 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి మనమంతా సాక్షులుగా ఉన్నాం. కళ్లెదురుగా కనిపిస్తున్న దానికి రుజువులు అక్కర్లేదు అనే ఒక సూక్తి ఉంది. అయితే కొంతమంది కావాలనే కళ్లు మూసుకొని అబద్ధాలు మాట్లాడేందుకు కంకణబద్దుల య్యారు’ అని బీజేపీపై మండిపడ్డారు. షీలా అభివృద్ధిలో ఢిల్లీని మోడల్‌గా తీర్చిదిద్దారని సోనియా కితాబునిచ్చా రు. అయితే ప్రతిపక్షం దీన్ని విస్మరించి మాట్లాడుతోందని దుయ్యబట్టారు. గతవారం ఢిల్లీలోని దక్షిణ్పురిలో రాహుల్ గాంధీ పాల్గొన్న సభలో జనం మధ్యలోనే లేచివెళ్లపోవడంతో అభాసుపాలైన కాం గ్రెస్ అలాంటి ఘటన పునరావృ తం కాకుండా జాగ్రత్తలు తీసుకుం ది. దీంతో ఆదివారం నాటి సోని యా సభ జనంతో కళకళలాడింది. -
‘ఆప్ టేప్‌ల’పై ఈసీ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన అభ్యర్థులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ‘మీడియా సర్కార్’ వెబ్సైట్ విడుదల చేసిన సీడీల వ్యవహారంపై ఎన్నికల సంఘం దర్యాప్తు ప్రారంభించింది. ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, యోగిందర్ యాదవ్‌లు శనివారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్‌ను కలిశారు. తమపై ఆరోపణలకు కారణమైన సీడీల పంపిణీని వెంటనే నిలిపివేయాలని కోరారు. సీడీల పంపకం ఎన్నికల నియామావళి ఉల్లంఘన కిందకు వస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
వారిని పోటీ నుంచి తప్పించం: ఆమ్ ఆద్మీ పార్టీ
న్యూఢిల్లీ: అక్రమ మార్గాల్లో డబ్బు వసూళ్లకు పాల్పడుతూ ‘స్టింగ్ ఆపరేషన్ ’లో చిక్కినట్లు పేర్కొంటున్న తమ అభ్యర్థులను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించేది లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టం చేసింది. అసలు సీడీని ట్యాంపర్ చేశారని, స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ‘మీడియా సర్కార్’ వెబ్సైట్ అసలు సీడీ ఇచ్చేందుకు నిరాకరించిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆరోపణలున్న తమ అభ్యర్థులపై చర్యలు తీసుకోవడం సహ జ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. మీడియా సర్కార్‌పై పరువునష్టం దావా వేస్తామని తెలిపింది. ఈమేరకు పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్‌లు శుక్రవారమిక్కడ వెల్లడించారు. వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. సీడీ వ్యవహారంపై విచారణకు అంతర్గత కమిటీని నియమిం చామని, అసలు సీడీని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు తమకివ్వాలని వెబ్‌సైట్‌ను కోరామని, అయితే ఆ వెబ్సైట్ నిరాకరించిందని తెలిపారు. ఎన్నికల సంఘం(ఈసీ) అసలు సీడీని క్షుణ్ణంగా పరిశీలించాలని, తమ అభ్యర్థులు తప్పు చేసినట్లు తేలితే పోటీ నుంచి తప్పుకుంటారని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆప్’ తరఫున పోటీ చేస్తున్న షాజియా ఇమ్లీ, కుమార్ విశ్వాస్ సహా తొమ్మిది మంది పార్టీ నేతలు అక్రమ మార్గాల్లో డబ్బు వసూళ్లకు పాల్పడుతూ తమ స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కారని ‘మీడియా సర్కార్’ గురువారం వెల్లడించం తెలిసిందే. -
పెరుగుతున్న ఉల్లం‘ఘనులు’..!
ఢిల్లీ ఎన్నికల్లో అతిక్రమణలపై 313 కేసులు ఆమ్‌ఆద్మీపార్టీపై 90, బీజేపీపై 68, కాంగ్రెస్‌పై 59 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీకి దిగుతున్న అరవింద్ కేజ్రీవాల్ కూడా తాజాగా ఈ ఉల్లం‘ఘనుల’ జాబితాలో చేరారు. మతం పేరుతో ముస్లింల ఓట్లు అడిగిన కారణంగా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు మరో 12 రోజులే మిగిలి ఉండడడంతో ఎన్నికల అధికారులు అభ్యర్థుల ప్రచారసరళిని డేగకళ్లతో పరిశీలిస్తున్నారు. ఏమాత్రం కట్టుదాటినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ నిబంధనల కొరడా ఝులిపిస్తుండడంతో అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా మసలుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉల్లంఘనల్లో ఆప్ నేతలే టాప్.. ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 2,908 ఫిర్యాదులు రాగా.. 313 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆమ్ఆద్మీపార్టీ నాయకులపైనే అత్యధికంగా 90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బీజేపీ నాయకులపై 68, కాంగ్రెస్ నాయకులపై 59 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)పై కూడా 23 కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కొన్ని ప్రింటింగ్ ప్రెస్‌ల నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా నేర చరిత్ర ఉన్న 7,708 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 920 లెసైన్స్డ్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 222 మందిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
210 నామినేషన్లు తిరస్కరించిన ఈసీ
న్యూఢిల్లీ: వచ్చే నెల నాలుగున జరగనున్న 70 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కోసం 900 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే 210 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ తెలిపారు. వారి దరఖాస్తుల్లో తప్పులు ఉండటం వల్లే అలా చేశామని వివరించారు. ఏఏపీ నుంచి 75, కాంగ్రెస్ నుంచి 70, బీఎస్పీ నుంచి 69, బీజేపీ నుంచి 68, సీపీఐ నుంచి 10, ఎన్సీపీ నుంచి 9, సీపీఐ(ఎం) నుంచి ముగ్గురి నామినేషన్లను ఆమోదించామన్నారు. అలాగే 296 మంది స్వతంత్ర అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 300 మంది కూడా బరిలో ఉన్నారని తెలిపారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 1,134 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఈసీ 194 పత్రాలను తిరస్కరించిందని దేవ్ గుర్తు చేశారు. -
'ఆప్' కు ఒక్క చాన్స్ ఇద్దామా!
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలన్న ఆలోచనలో యువత బాసటగా నిలుస్తామంటున్న పేదలు గెలుపు కష్టమేనని మధ్యతరగతి వర్గాల అభిప్రాయం ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వైపు యువత కాస్త మొగ్గుచూపుతున్నట్లు ఆదివారం ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ధరల పెరుగుదలపై తమ పక్షాన నిలబడి పోరాడిన ఆ పార్టీకి బాసటగా నిలుస్తామని పేదలు పేర్కొనగా మధ్యతరగతి ప్రజలు మాత్రం ‘ఆప్’ గెలుపు కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని విభిన్న ప్రాంతాలకు చెందిన స్థానికులు, ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారి నుంచి ‘సాక్షి’ సేకరించిన అభిప్రాయాల ప్రకారం ఢిల్లీలో పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందిన ఢిల్లీవాసులు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా విద్యుత్, నిత్యావసరాల ధరల పెరుగుదల, ‘నిర్భయ’ ఘటన నేపథ్యంలో మహిళా భద్రత, కాంగ్రెస్ నేతల అవినీతి ఆ పార్టీకి ప్రతికూలాంశాలుగా మారనున్నాయి. అయితే ఇన్నేళ్లూ ప్రజలకు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీయే ఉండగా తాజాగా ‘ఆప్’ విధానాలు సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారిలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. సరికొత్త విధానాలతో దూసుకె ళుతున్న ఈ పార్టీ ప్రతి అడుగును అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆటోవాలాలు, పేద లు కొంతమేర ఆ పార్టీవైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. సామాన్యుల కోసం పోరాడే పార్టీనే గెలిపించాలన్న వాణి వారిలో వినిపిస్తోంది. కానీ మధ్యతరగతి ప్రజల్లో మాత్రం ఆ పార్టీ గెలుపుపై అనుమానాలున్నాయి. గత 15 ఏళ్లుగా ఎంతో కొంత అభివృద్ధి పనులు చేసిన కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఓట్లుగా మార్చుకోగలరా? ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను ఓట్లుగా మార్చుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత మేరకు సఫలమవుతోందన్న దానిపైనే పార్టీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కొత్త పార్టీకి మద్దతు ఇవ్వడంతో లాభం ఉండదనే అభిప్రాయం ఎగువ మధ్యతరగతితోపాటు కొన్నివర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలే ప్రత్యర్థులన్నది ఓటర్ల మనసుల్లో బలంగా నాటుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీలకు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కార్యకర్తలు ‘ఆప్’కు లేకపోవడం ఆ పార్టీని కలవరపెట్టే అంశంగా పరిగణించవచ్చు. మా ఓటు ‘ఆప్’కే ఈసారి జాడూ(ఆప్ ఎన్నికల గుర్తు చీపురుకట్ట)కే ఓటు వేస్తాం. మేమంతా మీటింగ్ పెట్టుకుని మరీ ఆ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. - చిరాగ్గుప్తా, వ్యాపారి కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం గత ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు. ముస్లింల్లో కాంగ్రెస్ అంటే చాలా వ్యతిరేకత వచ్చింది. మేం ఈసారి ‘ఆప్’కు ఓటు వెయ్యాలనుకుంటున్నాం. - మహ్మద్ షంషేర్‌ఖాన్ ‘ఆప్’కు అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చూశాం. ‘ఆప్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వారి పనితీరు తెలుస్తుంది. - భాగ్యశ్రీ (తెలుగు విద్యార్థిని) -
తెలుగువారంతా మావెంటే
కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఢిల్లీ సీఎం షీలా సాక్షి ప్రతినిధి ఎన్.సత్యనారాయణ: న్యూఢిల్లీ: హస్తినలో వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని ‘హస్త’గతం చేసుకోబోతున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 4న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యేనన్నారు. తొలిసారి రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీని ఆమె తేలిగ్గా తీసుకున్నారు. అది రాజకీయ పార్టీనో కాదో ఎన్నికల తర్వాత తేలిపోతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ‘సాక్షి’కి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు... ప్రశ్న: ఈ సారి ఢిల్లీలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? జవాబు: కచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. ఎలాంటి సందేహమూ లేదు. ప్రశ్న: ఢిల్లీలో 10 లక్షల మంది తెలుగు వారున్నారు. వారు ఎవరి వైపు మొగ్గొచ్చు? జవాబు: ఢిల్లీలో ఇంతమంది తెలుగు వారుండటం మాకెంతో గౌరవం. రాష్ట్రాభివృద్ధిలో వాళ్లది కీలకపాత్ర. వారు గతంలో మా వెంటే ఉన్నారు. ఈసారీ మావెంటే ఉంటారని నమ్ముతున్నాం. ప్రశ్న: ఆమ్ ఆద్మీ, బీజేపీల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఏది? జవాబు: ఎన్నికల్లో పోటీచేసే హక్కు అందరికీ ఉంది. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. ప్రశ్న: కాంగ్రెస్ ఓటు బ్యాంకైన బడుగులు, ముస్లిం మైనారిటీల ఓట్లను ఆమ్ ఆద్మీ చీలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి? జవాబు: అదసలు రాజకీయ పార్టీనో కాదో ఇంకా తేలలేదు! ప్రజలు ఆ పార్టీ వైపు ఉన్నారో లేదో ఎన్నికల్లో తేలుతుంది. ప్రశ్న: ఆమ్ ఆద్మీ వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటోంది కదా? జవాబు: ప్రచారంతో గెలుపు సాధ్యం కాదు. ఓట్లు రావు. ప్రశ్న: మీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కామన్వెల్త్ క్రీడల స్కాం, ఉల్లి, టమాట ధరలు గెలుపుపై ప్రభావం చూపుతాయా? జవాబు: అవినీతికి ఆధారాలున్నాయా? ఉల్లి, టమోటా ధరలు తగ్గాయి. జనానికి పార్టీ మేనిఫెస్టో ఏమిటనేదే ప్రధానం. ప్రశ్న: ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన, మహిళలకు భద్రతపై మీ స్పందన? జవాబు: నిర్భయ ఘటన బాధాకరం. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను మా ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. సీఎం కార్యాలయంలో ‘181’ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశాం. పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు తీసుకున్నాం. -
‘ఆమ్ ఆద్మీ’పై ప్రతాపం!
అనుభవం పరిణతిని తీసుకురావాలి. సంయమనాన్ని, హుందాతనాన్ని నేర్పాలి. కానీ, అలాంటి లక్షణాలు తనకు లేవని ఎప్పటిలా కాంగ్రెస్ నిరూపించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గట్టి పోటీ కాగలదనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడం ఎలాగో తెలియక, దాని ప్రభంజనాన్ని తట్టుకోవడం ఎలాగో అర్ధం కాక కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం తనకలవాటైన వేధింపుల పర్వానికి తెరతీసింది. ఆ పార్టీకి విదేశాలనుంచి వచ్చిన విరాళాలపై దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. ‘మీ పార్టీకొచ్చిన నిధులెక్కడివ’ంటూ ఒక బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన మర్నాడే కేంద్రం ఈ చర్యకు పూనుకున్నది. ఢిల్లీ ఎన్నికలు వచ్చే నెల 4న జరగబోతున్నాయి. పుట్టి నిండా ఏడాది కాకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ జనం ఆదరాభిమానాలను పొందిందన్న సంగతిని దాదాపు ఎన్నికల సర్వేలన్నీ ప్రకటించాయి. ఆ పార్టీకి గణనీయమైన సంఖ్యలో స్థానాలు లభించే అవకాశం ఉన్నదని, ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీది కీలక పాత్ర కాబోతున్నదని సర్వేలన్నీ అంటున్నాయి. పర్యవసానంగా ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు మొదలైంది. ఆ రెండు పార్టీలూ ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్న సిద్ధాంతాలనూ, అది ఇస్తున్న హామీలనూ పూర్వ పక్షం చేసివుంటే... అందులోని డొల్లతనాన్ని నిరూపించగలిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. రాజకీయంగా సవాల్ చేస్తూ ముందుకొచ్చిన పక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం నిజాయితీ ఉన్నవారు చేసేపని. కానీ, కాంగ్రెస్ ఎప్పుడూ తనకలవాటైన మార్గాన్నే ఎంచుకుంది. ప్రత్యర్థుల్ని వేధించడమనే వెనకటి గుణాన్నే మరోసారి ప్రదర్శించింది. తమ పార్టీకొస్తున్న విరాళాల వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీయే స్వయంగా ప్రకటించింది. విరాళాలిచ్చినవారి పేర్లను కూడా ఆన్లైన్లో ఉంచింది. అందులో విదేశాలనుంచి అందిన విరాళాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ నెల 8 వరకూ తమకు రూ.19 కోట్లు వచ్చినట్టు ఆ పార్టీ వివరించింది. ఇందులో రూ.13.44కోట్లు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి రాగా, మిగిలిన సొమ్ము విదేశాలనుంచి వచ్చింది. ఇందులో అమెరికానుంచి రూ.1.98కోట్లు, హాంకాంగ్‌నుంచి రూ.1.14కోట్లురాగా మిగిలిన సొమ్ము సింగపూర్, యూఏఈ, బ్రిటన్ల నుంచి వచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టానికి 2003లో తీసుకొచ్చిన సవరణద్వారా చేరిన సెక్షన్ 29బీ ప్రకారం రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ కంపెనీలు మినహా ఇతర కంపెనీలనుంచి విరాళాలు స్వీకరించవచ్చు. అయితే, అవన్నీ మన దేశానికి సంబంధించినవే అయివుండాలి. ‘విదేశీవర్గాల’నుంచి కూడా విరాళాలు సేకరించడం పూర్తిగా నిషిద్ధం. అది విదేశీ సంస్థ అయినా, విదేశీ సంస్థకు అనుబంధమైనా అలాంటి సంస్థలనుంచి విరాళాలు తీసుకోరాదని చట్టం స్పష్టంగా చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిబంధనలను ఉల్లంఘించి విరాళాలు స్వీకరించివుంటే అది చట్టప్రకారం నేరమే అవుతుంది. కానీ, తమకు విదేశాలనుంచి వచ్చిన విరాళాలన్నీ అక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న ప్రవాస భారతీయుల నుంచి అందినవేనని ఆ పార్టీ చెబుతోంది. అలా డబ్బులిచ్చినవారంతా భారత పాస్‌పోర్టులు కలిగివున్నవారేనని అంటున్నది. నిజానికి విదేశాల్లోనివారి నుంచి విరాళాలు వచ్చినట్టు ఆ పార్టీ చెబితేనే తెలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన విషయాన్ని యథాతథంగా నమ్మాలని ఏంలేదు. అందులో నిజానిజాల గురించి దర్యాప్తు చేయడంలో తప్పేమీ లేదు. కానీ, అందుకు ఎంచుకున్న సమయమూ, సంద ర్భమూ తప్పు. దర్యాప్తునకు ఆదేశించారు గనుక అందులో ‘ఏదో ఉన్నట్టుంద’ని అం దరూ భావించడానికి ఆస్కారం కల్పించడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసిం దని వర్తమాన పరిణామాలను గమనిస్తున్నవారెవరికైనా స్పష్టంగానే అర్ధమవుతుంది. అయితే, ఇది తమకు పుట్టిన బుద్ధి కాదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది గనుక ఈ దర్యాపును చేబట్టామని అంటున్నారు. అది నిజమే. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఇంత తొందరగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం పనిలో పనిగా కాంగ్రెస్, బీజేపీలకు అందుతున్న విరా ళాల విషయంలోనూ దర్యాప్తు చేయడానికి సిద్ధపడితే ఎవరికీ అభ్యంతరం ఉండక పోయేది. ఎందుకంటే సరిగ్గా ఇలాంటి ఆరోపణలే కాంగ్రెస్,బీజేపీలపైనా వచ్చాయి. ఆ పార్టీలకు బ్రిటన్‌కు చెందిన వేదాంత గ్రూప్ సంస్థనుంచి, దానికి అనుబంధంగా ఇక్కడ పనిచేస్తున్న స్టెరిలైట్వంటి సంస్థలనుంచి కోట్లాది రూపాయలు విరాళాలుగా అందాయని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదులను ఎన్నికల సంఘం గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర హోంశాఖకు పంపినా దాని అతీగతీ తేల్చలేదు. చివరకు ఆ సంస్థ గత మార్చిలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మీ సంజాయిషీ ఏమిటని న్యాయస్థానం నిలదీసినప్పుడు కేంద్రం ఇచ్చిన జవాబు వింతగా ఉంది. ఎన్నికల సంఘం పంపిన ఫిర్యాదులపై ఆయా పార్టీలను వివరణకోరామని, వాటినుంచి జవాబు రావలసి ఉన్నదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ న్యాయస్థానానికి తెలిపింది. అది అంతకుమించి ముందుకెళ్లింది లేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలొచ్చిన నేపథ్యంలో మొత్తం అన్ని పార్టీలకు అందిన విరాళాలపైనా దర్యాప్తునకు ఆదేశిస్తే కేంద్రం నిజాయితీ వెల్లడ య్యేది. నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు చెప్పుకోవడానికి ఉండేది. కానీ, ఆరోపణ లొచ్చినా మన్నుతిన్న పాముల్లా కూర్చున్నవారిని వదిలి... ఏ పార్టీ చేయనివిధంగా విరాళాల గురించి బాహాటంగా ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీపై మాత్రమే ప్రతాపం చూపింది. ఇలా వ్యవహరించడం యూపీఏ ప్రభుత్వానికి ఇది మొదటిసారి కాదు. చివరిసారి కూడా కాబోదు. ఎన్నిసార్లు తలబొప్పి కడుతున్నా తమ వ్యవహారశైలిని సవరించుకోవాలని కాంగ్రెస్ పెద్దలకు తోచడంలేదు. ఒక పార్టీని వేధించడం ద్వారా నో, ప్రజల్లో ఆ పార్టీపై అనుమానాలు కలగజేయడంద్వారానో చిత్తు చేయవచ్చన్న చవకబారు ఎత్తుగడలకు కాంగ్రెస్ ఎంత త్వరగా స్వస్తి పలికితే అంత మంచిది. -
కాంగ్రెస్ తర్వాతే బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికలకు సంబంధించి 70 స్థానాలకు గాను 62 (అకాళీదళ్కి కేటాయించిన నాలుగు స్థానాలతో కలిపి) మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ. మరో ఎనిమిది స్థానాలలో బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లు వెల్లడించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాతే ఎనిమిది మంది అభ్యర్థులెవరన్నది వెల్లడించనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు చూశాక అవసరమైన మార్పులు, చేర్పులకు అనువుగా ఉండేందుకే ఈ స్థానాలను ప్రకటించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన స్థానాలకు సంబంధించి అసంతృప్త నేతలు ఒక్కరొక్కరుగా రోడ్డు ఎక్కుతుండడంతో రెండోవిడత జాబితా విడుదల జాప్యం చేస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్త కలహాలు ముదిరాక మిగిలిన సీట్లను ప్రకటిస్తే కాస్తయినా నష్టం కలగకుండా ఉంటుందన్నది బీజేపీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. అసంతృప్త నేతలు పార్టీ కార్యాలయంలో ఘర్షణలకు దిగుతుండడాన్ని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ లైట్ తీసుకున్నారు. ఇలాంటివి మామూలే అని, మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందంటూ వ్యాఖ్యానించారు. -
దీపావళి తర్వాతే!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ సైతం కాంగ్రెస్ బాటలోనే నడుస్తోంది. దీపావళి తర్వాతే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ స్పష్టం చేశారు. ఆశావహుల్లో మరింత ఉత్కంఠను పెంచుతూ గురువారం మధ్యాహ్నం గోయల్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ..ఉత్తమ పనితీరు కనబర్చిన ఎమ్మెల్యేలకు మరలా టికెట్లు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ టికెట్ల పంపిణీలో అన్ని సామాజిక వర్గాల వారికి సమప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీసుకుంటున్న ప్రాధమ్యాలను వివరిస్తూ ‘క్షేత్రస్థాయిలో పనితీరు, ఎలాంటి ఆరోపణలు లేకపోవడం, పార్టీ విధివిధానాలను పాటించడంతోపాటు గెలుపు అవకాశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి చర్యలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంతోపాటు వీలైనంత ఎక్కువ మందికి చేరువయ్యేందుకు నిర్ణయించిన ‘ఘర్ ఘర్ బీజేపీ’ కార్యక్రమం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించనున్నట్టు గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని మొత్తం 11,763 పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రతి బూత్‌కి సంబంధించి 32 మంది సభ్యుల బృందాలను నియమించినట్టు తెలిపారు. ఇప్పటికే 14 జిల్లాల్లోని 280 మండలాల్లో కార్యకర్త సమ్మేళనాలు నిర్వహించినట్టు చెప్పారు. గడపగడపకు ప్రచారం, బహిరంగ సభలు, స్థానికంగా ఉన్న ఆర్‌డబ్ల్యూఏలతో సమావేశాల రూపంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఢిల్లీని అవినీతి రహితంగా చేయడంతోపాటు పారదర్శక పాలన అందిచాలన్న ధ్యేయంతో బీజేపీ కృషి చేస్తోందన్నారు. 15 ఏళ్ల ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పాలనకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో చరమగీతం పాడనున్నామని ధీమా వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ప్రజలు ఇప్పటికే ఎంతో విసిగిపోయారని, బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రతి ఢిల్లీవాసి కోరు కుంటున్నారన్నారు. మీ పరిధిలో చూసుకోండి: హర్షవర్ధన్ రాజధాని నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామంటూ బదర్ పురాలో బుధవారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేసిన ప్రసంగాన్ని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా. హర్షవర్ధన్ తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను షీలాదీక్షిత్ మోసగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో కన్నాట్‌ప్లేస్ పునరుద్దరణ పనులు సైతం పదిహేనేళ్లలో చేపట్టలేకపోయారనిఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి పనులు కొనసాగుతుండడంతో గోతుల్లో ఎంతో మంది పడి గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిస్థితి మారుమూల గ్రామంలా ఉందని ఎద్దేవా చేశారు. పదమూడు మురికివాడల్లోని 30 వేల మంది ప్రజలకు నేటికీ తాగునీరు అందని దుస్థితి ఉందన్నారు. వాల్మీకి బస్తీల్లోని 15 వేల మంది అత్యంత దయనీయమైన జీవనాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గ పరిధిలోనే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక మైన రాష్ట్రపతి భవనం, పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసం, కేంద్ర మంత్రులు, ఎంపీల నివాసాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు కన్నాట్‌ప్లేస్, జన్‌పథ్, గోల్ మార్కెట్, కాలిబడీమార్గ్, పంచ్కున్యారోడ్, ఖాన్‌మార్కెట్, జోర్‌బాగ్, సుజన్‌సింగ్ పార్క్, పండారారోడ్డు, లక్ష్మిబాయినగర్, కిద్వాయి నగర్, సరోజిని నగర్, సఫ్దర్‌జంగ్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు షీలాదీక్షిత్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. 2009 మార్చి నుంచి 2012 వరకు ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.8.85 కోట్లు ఖర్చుచేశారన్నారు. దీనిలో ఎక్కువగా 30.9 శాతం నిధులు పోర్టాక్యాబిన్లు (తాత్కాలిక షెల్టర్లు), మంత్రులు, ఎంపీల ఇళ్లకు ప్రహ రీ గోడల నిర్మాణానికి 13.7 శాతం, 14.2 శాతం నిధులు రోడ్ల నిర్మాణానికి, 12.4 శాతం నిధులు మెట్లు నిర్మిచేందుకు, 5.3 శాతం నిధులు ఇతర పనులకు వినియోగించినట్టు హర్షవర్ధన్ వెల్లడిం చారు. నేటికీ ముఖ్యమంత్రి నిధుల్లో రూ.కోటీ 75 లక్షలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి పనులను పట్టించుకోని సీఎం ఢిల్లీ నగరాన్ని అభివృద్ధిబాట పట్టించామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
లిస్టులో ఫస్టెవరో!!
సాక్షి, న్యూఢిల్లీ:ఎన్నికల పరుగులో లక్ష్యాన్ని ముద్దాడాలంటే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. మొదటి అడుగు మరింత కీలకం. ఇలా చూస్తే ఎన్నికల్లో మొదటి అంకం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం. అసలు కథంతా ఇక్కడే దాగి ఉంటుంది. సరైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే అధికార పీఠం దక్కుతుంది. వివిధ కారణాల రీత్యా అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు పార్టీలు తాత్సారం చేస్తున్నాయి. ఎదుటి పార్టీ నిలబెట్టే అభ్యర్థిని బట్టి తాము బరిలోకి దింపాలన్న యోచనతో ఉన్నాయి. ఎన్నికలకు మరో 35 రోజులే గడువున్నా ప్రధాన పార్టీలు జాబితాలు విడుదల చేయడం లేదు. బీజేపీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును ప్రకటించడంతో బీజే పీ స్పీడుకి బ్రేకులు పడ్డాయి. నేర చరితులు లేకుండా, కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న నియమాలు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. ఇరుపార్టీల అభ్యర్థులు తెలిస్తేకానీ రంగంలోకి దిగొద్దని బీఎస్పీ కాసుకూచ్చుంది. అన్నింటికి పరోక్షంగా ఆప్ అనుసరిస్తున్న వ్యూహమూ కారణమవుతోంది. దీంతో అన్ని పార్టీల్లోని ఆశావహులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉన్నదంతా ఖర్చుచేసుకుని మరి తమవంతు ‘ప్రయత్నాలు’చేసుకుంటున్నారు. అభ్యర్థు జాబితా విడుదలలో తాత్సారం ఏ క్షణాన ఎవరి కొంప ముంచుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వర్గపోరుతో నెమ్మదించిన బీజేపీ బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్‌ను కాదని సచ్చీలుడైన వ్యక్తి కావాలంటూ డా.హర్షవర్ధన్ పార్టీ సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ స్పీడు కాస్త తగ్గింది. అంతకముందు తాను సీఎం అభ్యర్థిని అన్న ఉత్సాహంతో పార్టీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ అంతా తానై నడిపించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేయడంతోపాటు తన వర్గంలోని వారికి టిక్కెట్లు వచ్చేలా ప్రణాళిలకు రూపొందించి పెట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వడంతో గోయల్ తెల్లబోయారు. సీఎం అభ్యర్థి హర్షవర్ధన్‌తో పైకి సఖ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అభ్యర్థుల ఎంపికలో తన ముద్ర ఉండేలా ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిత్వంలో ఇప్పటికే పార్టీ బుజ్జగింపులకు తలొగ్గిన విజయ్‌గోయల్...పార్టీ టిక్కెట్ల విషయంలో పట్టుబట్టేలా కనిపిస్తోంది. దీంతో దీపావళికి ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటనలు చేసిన బీజేపీ కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో చేసినట్టే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్జన భర్జనల్లో కాంగ్రెస్... కాంగ్రెస్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ వర్గపోరునకు మించి ఇతర అర్హతలు ఆశావహుల తలరాతలు మారుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలలో వీలైనంత ఎక్కువ మందికి మరోమారు అవకాశం ఇవ్వాలని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఇప్పటికే 31 మందికి ఆమోదం తెలిపినట్టు సమాచారం. నేర చరిత్ర, వయస్సును పరిగణనలోకి తీసుకుని కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను దీపావళి తర్వాత విడుదల చేయాలన్న యోచనలో కాంగ్రెస్‌పార్టీ అధిష్టాన వర్గం ఉన్నట్టు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలను ‘ఆప్’తున్న కేజ్రీవాల్.. తొలిసారిగా ఢిల్లీ విధానసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆమ్ఆద్మీపార్టీ కొత్త పంథాలో వెళుతూ ఇతర పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆమ్ఆద్మీపార్టీ నిజాయితీ కలిగిన అభ్యర్థులకే సీట్లు వచ్చేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. గత రెండు నెలలుగా పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు పార్టీ వెబ్సైట్ ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. దీంతో ఇతర పార్టీలు సైతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నంతలో కాస్త నిజాయితీ కలిగిన నాయకులకు టికెట్ ఇవ్వాలన్న ధోరణిలో ఉన్నాయి. ఈ సరికొత్త విధానం ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా విడుదలలో ఓ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీఎస్పీ సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. డిసెంబర్ నాలుగున జరగనున్న ఎన్నికల్లో పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తుండగా, ఇప్పటికే 63 స్థానాలు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైనట్టు బీఎస్పీ ఢిల్లీప్రదేశ్ నాయకుడు ఎమ్.ఎల్.తోమర్ పేర్కొన్నారు. కాంగ్రెస్,బీజేపీ జాబితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. -
ఢిల్లీ అసెంబ్లీ దక్కితే.. కేంద్రంలో అధికారం మనదే: రాజ్‌నాథ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే చాలు.. హస్తిన అగ్రపీఠం అందుకోడానికి మార్గం సుగమం అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా చెప్పారు. ''ఢిల్లీ దేశానికి గుండెకాయ లాంటిది. మనమిక్కడ గెలిస్తే, దేశమంతా గెలుస్తాం'' అని దాదాపు వెయ్యిమందికిపైగా కార్యకర్తలు పాల్గొన్న కార్యక్రమంలో ఆయన అన్నారు. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఆయన తాల్కతోరా స్టేడియంలో ప్రారంభించారు. ఢిల్లీ అసెంబ్లీలో దాదాపు 14 ఏళ్లుగా బీజేపీకి అధికారం అందని ద్రాక్షగానే ఉంది. 14 ఏళ్ల కాంగ్రెస్ పాలన దేశ రాజధానిని భ్రష్టుపట్టించిందని, సగానికి పైగా నగరం మురికివాడలేనని రాజ్‌నాథ్ మండిపడ్డారు. కార్యకర్తలంతా ఒక్క మాటమీద నిలబడి, కష్టపడి కృషిచేసి పార్టీని విజయతీరాలకు చేర్చాలని కోరారు. ప్రజలు మార్పుకోసం చూస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి నితిన్ గడ్కరీ కూడా షీలా సర్కారు పాలనపై ధ్వజమెత్తారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, విద్యుత్ చార్జీలు మండిపోతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాసిగా ఉందని, ఆహార పదార్థాల ధరలు ఆకాశంలో ఉన్నాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 24 గంటలూ తాగునీరు, విద్యుత్ బిల్లుల్లో 30 శాతం తగ్గింపు, మహిళలకు భద్రత కల్పిస్తామని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ గోయల్ హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న నాయకులంతా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ఆకాశానికెత్తేశారు. మోడీని ఎదుర్కోడానికి కాంగ్రెస్‌లో ఒక్క పేరు కూడా లేదని సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు.