general elections
-
ఆస్ట్రేలియాలో మే 3న ఎన్నికలు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో మే 3న సార్వత్రిక ఎన్నికలు జరగను న్నాయి. ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ (62) శుక్రవారం ఉదయం గవర్నర్ జనరల్ శామ్ మోస్టిన్ను కలిసి ఎన్నికలకు అనుమతి కోరారు. అనంతరం మీడియా ముందు ఆ మేరకు ప్రకటన చేశారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించేందుకు కృషిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యర్థి పీటర్ డట్టన్ (54)ను ఎన్నుకుంటే దేశం వెనక్కు పోతుందన్నారు. ‘‘ప్రపంచం కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాపై విమర్శలు గుప్పిస్తోంది. అనిశ్చిత సమయాల్లో మనం ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాలన్నది మన చేతుల్లో లేదు. కానీ వాటికి ఎలా స్పందించాలన్నది మన చేతుల్లోనే ఉంది. మా ప్రభుత్వం ఎన్నో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంది. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి అందమైన భవిష్యత్తు అందించేందుకు కృషిని కొనసాగిస్తాం’’ అన్నారు. దశాబ్దం పాటు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని ఓడించి ఆల్బనీస్‌కు చెందిన సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీ 2022 మేలో అధికారం చేపట్టింది. అప్పటికి ఎనిమిదేళ్లలో ఏకంగా ఆరుసార్లు ప్రధానులు మారారు! సుదీర్ఘ రాజకీయ అస్థిరత తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా చేసిన నేతగా ఆల్బనీస్ నిలిచారు. కానీ ఆయన పాలనపై కూడా కొంతకాలంగా జనం పెదవి విరుస్తున్నారు.సమస్యలతో సావాసంఆస్ట్రేలియా పార్లమెంటులో 150 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 76 సీట్లు అవసరం. వామపక్ష భావజాలమున్న లేబర్ పార్టీ, మితవాద లిబరల్ నేషనల్ పార్టీలదే ఆస్ట్రేలియా రాజకీయాల్లో చాలాకాలంగా ఆధిపత్యం. ప్రధాన అభ్యర్థులుగా ఆల్బనీస్, లిబరల్ పార్టీ సారథి డట్టన్ బరిలో ఉన్నారు. వారితో పాటు పలువురు స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు. వ్యయం, ఆర్థిక అవ్యవస్థ, చైనా ఆధిపత్యం ఎన్నికల్లో ప్రధానాంశాలు కానున్నాయి. చౌక గృహాల కొరత, అధిక వడ్డీ రేట్లతో ప్రజలు సతమతం అవుతున్నారు. ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. అద్దె, విద్యుత్ బిల్లులపై పన్ను కోతలు, సబ్సిడీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. రికార్డు స్థాయి వలసలు, నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
ఎన్నికల ‘మాయ’పై కాంగ్రెస్ చింత!
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన సాధారణ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు దాని నేతృత్వంలోని ఇండియా కూటమి విజయాలను అడ్డుకోవడంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కంట్లో నలుసులా మారుతుండటంపై కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. పార్టీ జయాపజయాలను నిర్ణయించే ఓట్లను చీల్చడంలో బీఎస్పీ తన పాత్రను సమర్ధంగా పోషిస్తోందని, ఇది పరోక్షంగా అధికార బీజేపీ కూటమికి లబ్ధి చేకూరుస్తోందన్న వాదనను బలంగా తెరపైకి తెస్తోంది. బీఎస్పీతో జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్ష్యంగా విమర్శలు గుప్పించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యూపీ సహా అనేక చోట్ల పనిచేస్తున్న ‘మాయ’ గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓట్లకు భారీ గండి కొట్టాలనే బలమైన లక్ష్యంగా సమాజ్‌వాదీతో ముందస్తు పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, బీఎస్పీని సైతం కూటమిలోకి ఆహ్వానించింది. దీనికి మాయవతి అంగీకరించకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 80 లోక్‌సభ స్థానాలకు గానూ 33.8 శాతం ఓట్లతో ఎస్పీ 37, 9.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. రెండె పార్టీల ఓట్ల వాటా 43.3 ఓట్ల శాతం. ఇదే సమయంలో బీఎస్పీ ఒక్క సీటు గెలవలేకున్నా పారీ్టకి మాత్రం 9.39 శాతం ఓట్లు వచ్చాయి. కూటమిలో భాగస్వామిగా ఉండుంటే ఓట్ల శాతం 52 శాతానికి పైగా పెరిగి మరిన్ని సీట్లు గెలిచే వారమని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో 16 సీట్లలో కూటమి అభ్యర్థుల విజయాన్ని బీఎస్పీ అడ్డుకుంది. 16 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఓడిన మార్జిన్ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అమ్రోహా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి డానిష్ అలీ 28 వేల ఓట్ల తేడాతో ఓడితే బీఎస్పీకి అక్కడ 1.20 లక్షల ఓట్లు వచ్చాయి. బాన్స్గౌవ్ స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి 3 వేల ఓట్లతో ఓడితే బీఎస్పీకి 64వేల ఓట్లు వచ్చాయి. ఇదే మాదిరి చాలా స్థానాల్లో బీఎస్పీ కూటమి అభ్యర్థుల విజయాలకు గండికొట్టింది. యూపీలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టు పట్టు ఉంది. దీనికి తోడు కాన్షీరాం వారసత్వ పారీ్టగా హిందీ రాష్ట్రాల్లోనూ బీఎస్పీ ప్రాబల్యం బలంగా ఉంది. దళితులు–ముస్లిం ఫార్ములాను ముందుపెట్టి గడిచిన రెండేళ్లలో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, చత్తీస్‌గఢ్ వంటి రా్ర‹Ù్టరాల్లో పోటీ చేసి 2–4 శాతం ఓట్లను రాబట్టుకుంది. ఈ ఓట్లన్నీ పరోక్షంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఓటమికి కారణమయ్యాయి. మొన్నటి హరియాణా ఎన్నికల్లో బీఎస్పీ, ఐఎన్ఎల్డీ పారీ్టలు కలిసి పోటీచేసి ఏకంగా 5.96 శాతం ఓట్లను రాబట్టుకున్నాయి. ఇందులో బీఎస్పీకి 2 శాతం ఓట్లున్నాయి. ఈ ఓట్లే కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. మధ్యప్రదేశ్‌లోనూ కచి్చతంగా తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భావించినా 3.40 శాతం ఓట్లను రాబట్టుకున్న బీఎస్పీ కాంగ్రెస్‌ను భారీ దెబ్బకొట్టింది. ఈ ఏడాది నవబంర్‌లో జరిగే బిహార్ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిధ్దమవుతోంది. గత ఎన్నికల్లో బిహార్‌లో 78 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ 1.5 శాతం ఓట్లను రాబట్టుకుంది. దానికి మిత్రపక్షంగా పోటీ చేసిన ఎంఐఎం మరో 2శాతం ఓట్లు రాబట్టుకుంది. దీంతో ఓట్లు చీలి జేడీయూ, బీజేపీకి అధిక సీట్లు వచ్చేందుకు మద్దతిచి్చనట్లయింది. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ బీఎస్పీ తమకు ఇక్కట్లకు గురిచేస్తుండటం కాంగ్రెస్ పారీ్టకి తలనొప్పి వ్యవహారంలా మారింది. ఈ నేపథ్యంలోనే యూపీలో పర్యటిస్తున్న రాహుల్ బీఎస్పీ అధినేత్రి మాయవతి లక్ష్యంగా విమర్శలు చేశారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిసి పనిచేసి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని, అయితే మాయావతి తమతో కలిసి రాలేదన్నారు. ఇది పరోక్షంగా బీజేపీ గెలుపుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. ఈ విమర్శలు ఇప్పుడు మాయావతి ప్రభావాన్ని మరోమారు చర్చకు పెట్టాయి. -
కళ్లెదుటి ఫలితాలకు కారణమేంటి?
గడచిన సార్వత్రిక ఎన్నికలు అన్ని పక్షాలనూ సమంగా ఆశ్చర్యపరిచాయి. మునుపటికన్నా ఎక్కువ మెజారిటీ సీట్లు సాధిస్తామని ఆశించిన బీజేపీ కలలు కల్లలుకాగా, అందలం అందుకోవటమే ఆలస్యమన్నట్టు పొంగిపోయిన ఇండియా కూటమికి భంగపాటు తప్పలేదు. ఈ ఫలితాల ఆంతర్యమేమిటి... ఎవరెవరు ఎలా, ఎందుకు దెబ్బతిన్నారన్న అంశాలపై సీనియర్ పాత్రికేయుడు, టీవీ న్యూస్ ప్రెజెంటర్ రాజ్‌దీప్ సర్దేశాయి వెలువరించిన తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’. ఈ అసమ సమాజంలో నిత్యం దగా పడుతున్న సగటు మనిషి మౌనంగా, ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతూనే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఇచ్చిన తీర్పు ఇది అంటారు రాజ్‌దీప్. అందుకే ఈ ఎన్నికల అసలు విజేత సగటు వోటరేనని చెబుతారు.పార్లమెంటరీ రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్నవారికి సైతం వెగటుపుట్టించే విధంగా మన ఎన్నికల తంతు తయారైంది. ఇంతటి రణగొణ ధ్వనులమధ్య కూడా నాయకులతో చర్చించటం, సాధారణ పౌరులను కలవటం, ఎవరివైపు మొగ్గు ఉందో అంచనావేయటం వివిధ చానెళ్లు చేస్తున్న పని. దీన్ని ఎంతో నిష్ఠగా, దీక్షగా నెరవేర్చే కొద్దిమంది పాత్రికేయుల్లో రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒకరు.ఉత్తేజాన్నివ్వని హ్యాట్రిక్!రాజ్‌దీప్ తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’ 528 పేజీల సమగ్ర గ్రంథం. ఇప్పుడే కాదు... ‘2014 ది ఎలక్షన్ దట్ ఛేంజ్డ్ ఇండియా’ మొదటి పుస్తకంగా, 2019 ‘హౌ మోదీ వన్ ఇండియా’ రెండో పుస్తకంగా వచ్చాయి. తాజా పుస్తకం మూడోది. దీనికి ‘హ్యాట్రిక్ 2024’ అన్న శీర్షిక పెడదామనుకున్నారట. కానీ ఫలితాలు విశ్లేషించాక పునరాలోచనలో పడ్డారట. రచయిత దృక్ప థమేమిటో పుస్తకం శీర్షికే వెల్లడిస్తుంది. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి అందలం అందుకున్నది మోదీ మాత్రమే! ఆ రకంగా ఆయనకైనా, బీజేపీకైనా ఇది ఘనవిజయం కిందే లెక్క. కానీ 272 అనే ‘మేజిక్ మార్క్’ ఎక్కడ? కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేక 240 దగ్గరే బీజేపీ ఆగిపోయింది. అందుకే ‘హ్యాట్రిక్’ విజయోత్సవ హోరు లేదు. 2024 ఎన్నికలు అందరినీ సమంగా ఆశ్చర్యపరిచాయి. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదమిచ్చి తమ శ్రేణుల్ని ముందుకురికించారు.అందరం కలిశాం గనుక, ‘ఇండియా’ అన్న సంక్షిప్తీకరణ పదం దొరి కింది గనుక విజయం ఖాయమన్న భ్రమలో ప్రతిపక్ష కూటమి నాయ కులున్నారు. లాక్‌డౌన్‌తో జనం ఆర్థిక అగచాట్లు, వేలాది కిలోమీటర్ల నడక, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, పీఎమ్ కేర్స్ ఫండ్, సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం, సీఏఏ, విపక్ష సర్కార్ల కూల్చివేతలు, విద్వేష పూరిత ప్రసంగాలు... ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వంపై ఏవగింపు కలిగించాయని ‘ఇండియా’ కూటమి నమ్మింది. విపక్ష నేతలపై ఈడీ, ఐటీ దాడులు, అరెస్టులు విపక్ష వ్యూహాన్ని ఏదో మేర దెబ్బతీసిన మాట వాస్తవమే. కానీ ఇందుకే మెజారిటీ సాధనలో ‘ఇండియా’ విఫలమైందని చెప్పటం కష్టమంటారు రాజ్‌దీప్. బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ను చేజార్చుకోవటం, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయంలో తప్ప టడుగుల వంటివి దెబ్బతీశాయన్నది ఆయన విశ్లేషణ. ఇలాంటివి చోటుచేసుకోనట్టయితే బీజేపీకి ఇప్పుడొచ్చిన 240 స్థానాల్లో మరో 40 వరకూ కోతపడేవని రాజ్‌దీప్ అభిప్రాయం. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయేగా బరిలోకి దిగినా బీజేపీ సొంతంగానే మెజా రిటీ సాధించుకుంది. కేవలం మిత్ర ధర్మాన్ని పాటించి మాత్రమే భాగ స్వామ్య పక్షాలకు పదవులిచ్చింది. ఇప్పుడలా కాదు... నిలకడలేని టీడీపీ, జేడీ(యూ) వంటి పార్టీల దయాదాక్షిణ్యాలపై నెట్టుకురాక తప్పదు.ఒక్కటైన దళిత, ముస్లిం వర్గాలుగతంలో ఇతర వర్గాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచిన దళిత ఓటుబ్యాంకు 2024 ఎన్నికల్లో బీజేపీకి దూరమైందని రాజ్‌దీప్ చెబు తారు. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఆ వర్గాలు భయపడ్డాయి. కంచుకోట అనదగ్గ యూపీలో 2022లో ‘బుల్డోజర్ మ్యాండేట్’ వస్తే రెండేళ్లు గడిచేసరికల్లా ‘మండలైజ్డ్ కుల స్పృహ’ పెరిగి దళిత ఓటుబ్యాంకుకు అక్కడ 10 శాతం కోతపడిందని ఆయన విశ్లేషణ. వీరికి ముస్లింల ఓటు బ్యాంకు తోడైందంటారు. 2015–16 నుంచి 2022–23 మధ్య సంఘటిత రంగంలో 63 లక్షలు, అసంఘటిత రంగంలో కోటీ 60 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యాయన్న ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఐఆర్ఆర్) సంస్థ గణాంకాలను రాజ్‌దీప్ ఉటంకిస్తారు. రాజ్‌దీప్ పుస్తకం కళ్ల ముందు జరిగిన అనేక పరిణామాల వెనకున్న కారణాలేమిటో, నాయకుల అతి విశ్వాసంలోని అంతరార్థమేమిటో విప్పిజెబుతుంది. మనమంతా చూస్తున్నట్టు ఇప్పుడేలుతున్నది నిజంగా బీజేపీ యేనా? రాజ్‌దీప్ లెక్కలు చూస్తే క్షణకాలమైనా ఆ ప్రశ్న రాకమానదు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 114 మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నేతలకు బీజేపీ టిక్కెట్లు వచ్చాయట. బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదం కాస్తా ‘కాంగ్రెస్ యుక్త బీజేపీ’ అయిందంటారాయన. అసలు జాతీయ రాజకీయాల్లో మోదీ ఆగమనానికి ముందే ఒక పార్టీగా కాంగ్రెస్ మతాన్ని పులుముకోవడం, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, నిలదీసిన సొంత పార్టీ నేతలపై సైతం అక్రమ కేసులు మోపి జైళ్లపాలు చేయడం వగైరాలు పెంచింది. ఆ రకంగా మోదీ రాకకు ముందే ‘మోదీయిజాన్ని’ పరిచయం చేసింది. ఆ నొప్పి ఎలా ఉంటుందో దశాబ్దకాలం నుంచి చవిచూస్తోంది.ఫలిస్తున్న ‘ప్రచారయావ’ప్రచారం విషయంలో మోదీ తీసుకునే శ్రద్ధను రాజ్‌దీప్ వివరి స్తారు. గుజరాత్లో బీజేపీ కార్యక్రమాలపై సింగిల్ కాలమ్ వార్త ఇవ్వ టానికి కూడా మీడియా సిద్ధపడని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల నుంచీ ప్రచార రథాలను తరలించి అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన ప్రతి పాదించారట. ఇందువల్ల డబ్బు ఖర్చుతప్ప ఒరిగేదేమీ లేదని పార్టీ నాయకులు గుసగుసలు పోగా, ర్యాలీ జరిగిన మర్నాడు ఎప్పుడూ లేనట్టు మీడియాలో అది ప్రముఖంగా వచ్చిందట. ప్రచారం భారీ స్థాయిలో చేయటం అప్పటినుంచీ మోదీకి అలవాటు. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ వెనకా ఈ వ్యూహమే ఉంది.‘గోదీ మీడియా’ ప్రస్తావనఅమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల తీరుతెన్నులపై రాజ్ దీప్ వివరంగానే ప్రస్తావించారు. సద్విమర్శలను వ్యక్తిగతంగా తీసు కుని బెదిరించటంలో, అమర్యాదగా ప్రవర్తించటంలో అమిత్ మాల వీయ వంటి కొందరు బీజేపీ నేతల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పారు. మరోపక్క మీడియా మొత్తాన్ని చాలామంది ఒకే గాటనకట్టి ‘గోదీ మీడియా’గా ముద్రేయటంపై విచారిస్తూనే కొన్ని ప్రధాన చానెళ్ల, పత్రికల తీరుపై ఈ గ్రంథంలో నిశితమైన విమర్శ వుంది. తాను ఈసారి ఎన్డీయే ఓడుతుందని భావించకపోయినా ‘మేజిక్ ఫిగర్’ దాటుతుందని గుడ్డిగా నమ్మిన వైనాన్ని వివరిస్తారు. అదే సమ యంలో ఎప్పుడూ అంచనాలు తప్పని ప్రదీప్ గుప్తా వంటి ప్రఖ్యాత సెఫాల జిస్టు సైతం ఎన్డీయేలో ఒక్క బీజేపీకే 322–340 మధ్య వస్తాయని చెప్పడాన్ని వెల్లడిస్తారు. సుదీర్ఘకాలం ఢిల్లీలో పాత్రికేయు డిగా పని చేసిన అనుభవం, ఉన్నత స్థానాల్లోని వారితో కలిగిన పరి చయాలు పుస్తక రచనలో రాజ్‌దీప్‌కు బాగా అక్కరకొచ్చాయి. ‘ఈవీఎంల గారడీ’ ఎక్కడ?అయితే ఒక విమర్శ – ఈవీఎంల వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఏకరువు పెట్టిన అంశాల గురించి ప్రస్తావించినా ఆ ఎపిసోడ్‌ను లోతుగా చర్చించకపోవటం లోటనే చెప్పాలి. వాస్తవానికి దానిపై విడిగా పుస్తకమే రావాలి. మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 537 చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ పొంతన లేదని ఏడీఆర్ బయటపెట్టింది. ‘ఇది కేవలం సాంకేతిక లోపమే... దీనివల్ల అంతిమ ఫలితం తారుమారు కాబోద’ని వాదించటానికి ముందు కనీసం అందుకు హేతుబద్ధమైన సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యతని ఎన్నికల సంఘం గుర్తించక పోవటం విచారించదగ్గది. మొదలుపెడితే చివరి వరకూ చదివించే శైలితో, ఆశ్చర్యపరిచే సమాచారంతో ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి గ్రంథం ఇంగ్లిష్‌లో మాత్రమే సరి పోదు. ప్రాంతీయ భాషల్లో సైతం వస్తేనే ప్రజల అవగాహన పెరుగుతుంది.తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై మంగళవారం పత్రికాసమావేశంలో మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి అమిత్ సుదీర్ఘంగా మాట్లాడారు. జనగణన ఎప్పుడో త్వరలో చెప్తాం జనగణన ఎప్పుడు జరపబోయేది త్వరలోనే వెల్లడిస్తామని, ప్రకటన చేశాక సంబంధిత వివరాలను తెలియజేస్తామని అమిత్ చెప్పా రు. జనగణన, కులగణన తక్షణం జరపాలంటూ విపక్షాల నుంచి విపరీతమైన డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో అమిత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రైతుల కోసం రూ.15 లక్షల కోట్ల పథకాలు ‘‘రైతాంగం బాగు కోసం సాగురంగంలో 14 విభాగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన పథకాలను ఈ 100 రోజుల్లో అమల్లోకి తెచ్చాం. వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు మౌలిక సాగు నిధి ఏర్పాటుచేశాం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి నిర్ణయం రైతుల కోసమే తీసుకున్నారు. మెరుగైన మౌలిక వసతులకు రూ.3 లక్షల కోట్లు కేటాయించాం.25వేలకు పైగా కుగ్రామాలకు రోడ్ల అనుసంధానం పెంచుతున్నాం. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించాం. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడ్డాం. ఆస్తుల దురి్వనియోగాన్నీ వక్ఫ్ (సవరణ) బిల్లు అడ్డుకుంటుంది. గత నెలలో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుంది’’ అని షా అన్నారు. -
సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు
-
బీజేపీపై 18 శాతం జీఎస్టీ విధించిన ప్రజలు..ఆప్ ఎంపీ చద్దా సెటైర్లు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర బడ్జెట్‌పై సెటైర్లు వేశారు. ఇంగ్లాండ్ తరహాలో భారతీయులు ట్యాక్స్‌లు కడుతుంటే సర్వీసులు మాత్రం సోమాలియా తరహాలో ఉన్నాయని మండిపడ్డారు.రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని, బీజేపీ మద్దతు దారులు, ఓటర్లతో సహా సమాజంలోని అన్నీ వర్గాల ప్రజల్ని సంతృప్తి పరచడంలో విఫలమైందని పేర్కొన్నారు.సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, సమాజంలోని కొన్ని వర్గాలు సంతోషంగా, మరికొన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేయడం సర్వసాధారణం. అయితే ఈసారి కేంద్రం అన్నీ వర్గాల వారిని అసంతృప్తికి గురి చేసింది. అందులో బీజేపీ మద్దతు దారులు సైతం ఉన్నారని తెలిపారు.అదే సమయంలో కేంద్ర వసూలు చేస్తున్న ట్యాక్స్‌లపై మండిపడ్డారు. గత పదేళ్లుగా ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీ, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వంటి పన్నులు విధించి ప్రజల ఆదాయంలో 70-80 శాతం మొత్తాన్ని తీసుకుంటోంది. అందుకు ప్రతిఫలంగా కేంద్రం ప్రజలకు ఎలాంటి ప్రయోజనాల్ని అందిస్తోంది? అని ప్రశ్నించారు. ట్యాక్స్ కడుతున్నందుకు ప్రజలకు ఎలాంటి సేవల్ని అందిస్తున్నారని ప్రశ్నించిన చద్దా.. మేము ఇంగ్లండ్‌లో లాగా పన్నులు చెల్లిస్తాము, కానీ సోమాలియాలో సేవలను పొందుతున్నాము. ప్రభుత్వం మాకు ఎలాంటి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, రవాణా విద్యను అందిస్తోంది? అని విమర్శలు గుప్పించారు.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై స్పందించిన ఆప్ ఎంపీ.. 2019లో బీజేపీ ప్రభుత్వానికి 303 సీట్లు వచ్చాయి. అయితే దేశ ప్రజలు ఆ సీట్లపై 18 శాతం జీఎస్టీ విధించి వాటిని 240కి తగ్గించారని ఎద్దేవా చేశారు. బీజేపీ సీట్ల సంఖ్య తగ్గడానికి ఆర్థిక వ్యవస్థతో పాటు ఆహార ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తలసరి ఆదాయం వంటి అనేక ఇతర కారణాలను పేర్కొన్నారు. ఈ పోకడలు కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య 120 సీట్లకు పడిపోయే అవకాశం ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
రిషి సునాక్‌కు షాక్ తప్పదా.?.. తాజా సర్వే ఏం చెప్పింది?
లండన్ : ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. రిషి సునాక్‌కు ఓటమి తప్పేలా లేదు. బ్రిటన్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు రిషి సునాక్‌కు ఓడిపోవడం ఖాయమని చెప్పగా.. తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.రిషి సునాక్‌కు షాక్ తప్పదా.? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. బ్రిటన్‌కు తొలి భారత సంతతి ప్రధాని అయిన రిషి సునాక్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఒపీనియన్ పోల్స్ ఇదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటికే మూడు సర్వేలు వెల్లడించగా.. తాజాగా మరో సర్వే కూడా జూలై 4న జరుగనున్న ఎన్నికల్లో సునాక్ ఘోరంగా ఓడిపోతారని అంచనా వేసింది.సండే టెలిగ్రాఫ్ పత్రిక కోసం మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత సర్వేను నిర్వహించింది. జూన్ 12 నుంచి 14 మధ్య సర్వే చేసినట్లు వెల్లడించింది. ఈ సర్వేలో ప్రతిపక్ష లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్లు తగ్గి 21 శాతానికి చేరుకుంది. రాబోయే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్కిన్స్ తెలిపారు. ఇక.. ప్రజలు పోస్టల్ బ్యాలెట్లు అందుకోవాడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే సర్వే ఫలితాలు వెలువడటం విశేషం.కన్జర్వేటివ్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని సర్వే సంస్థలు చెబుతున్నాయి. 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. 200 ఏండ్ల బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఇదే అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాగా, మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు. -
దాడులు, హింసపై పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత నిర్థి ష్టంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, హింసను అణిచివేసి, బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించాలని కోరుతూ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం జస్టిస్ కిరణ్మయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజల హక్కులు, స్వేచ్ఛ ముడిపడి ఉందిఈ వ్యాజ్యంలో ప్రజల హక్కులు, స్వేచ్ఛ ముడిపడి ఉందని రాజు రామచంద్రన్ అన్నారు. దాడులు, హింసను అడ్డుకునేందుకు హైకోర్టు ఏ ఆదేశాలిచ్చినా అవి దేశం మొత్తానికి మార్గదర్శకాలు అవుతాయన్నారు. ఫిర్యాదులు ఇస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయడంలేదన్నారు. ఈ నేపథ్యంలో.. తాము కోర్టుకు నిర్థిష్టమైన అభ్యర్థనలు చేశామన్నారు.కొంతమంది లక్ష్యంగా చేసుకుని హింసకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థి0చామన్నారు. అలాగే, ఈ హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని కూడా కోరామన్నారు. అంతేకాక.. హింసకు కారణమైన వారిని గుర్తించి, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసేలా.. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా కూడా ఆదేశాలు జారీచేయడంతో పాటు, హింసకు దారితీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలన్నారు. పూర్తి వివరాలు మా ముందుంచండివాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. ఈ పిల్ విచారణార్హతపై కూడా తమ వాదనను వినిపిస్తామన్నారు. అలాగే, పూర్తి వివరాలు కూడా కోర్టు ముందుంచుతామని చెప్పారు. అనంతరం.. ధర్మాసనం తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇళ్లు.. ఊళ్లూ ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల ఫలితాల తరువాత నుంచి నేటివరకు యథేచ్చగా హింస కొనసాగుతూ వస్తోందన్నారు. నిర్ధిష్టంగా కొన్ని వర్గాలపైనే ఈ హింస, దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో, పేపర్ సాక్ష్యాలున్నాయని, వాటిని పరిశీలించాలని కోరారు. ఇలా విధ్వంసం సృష్టిస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. అందువల్ల హింసను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పైగా.. ఇళ్లు, ఊళ్లు ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. హింసను, దాడులను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఓ స్థాయీ నివేదిక ఇచ్చేలా ఆదేశాలివ్వాలని రామచంద్రన్ కోరారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఎవరినీ కూడా ఇందుకు బాధ్యులను చేయడంలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా అణగారిన వర్గాలే దాడులకు గురవుతున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిపై, ఆ పార్టీకి మద్దతు తెలిపిన వారిపైనే ప్రధానంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వీరిందరి పక్షానే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు రాజు రామచంద్రన్ బదులిచ్చారు. -
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
కౌంటింగ్‌లో ఓట్ల తేడాలపై అధ్యయనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేడాలపై అధ్యయనం చేస్తున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పోలింగ్ అక్రమాలపై కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. ఆయన గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించిందని చెaప్పారు.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని విద్య, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని, ప్రజల తలసరి ఆదాయాన్ని, వారి కొనుగోలు శక్తినీ పెంచామని వివరించారు. అంతకన్నా మెరుగ్గా సంక్షేమ పథకాలను అందిస్తామన్న కూటమిని నమ్మి ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ఆ హామీలన్నీ అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టుల్లో కొద్దిపాటి మిగులు పనులనూ పూర్తి చేసి ప్రజలకు వాటి ఫలాలను అందించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందన్నారు.ఏమాత్రం తేడా చేసినా నష్టపోయేదీ ప్రజలేనని అభిప్రాయపడ్డారు. ప్రజలు నష్టపోకూడదని, వారికి అన్నివిధాలా మేలు జరగాలని పార్టీ తరఫున ఆశిస్తున్నామన్నారు. ఐదేళ్ల పాటు ప్రజాసేవకు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇకపైన కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా, ప్రత్యర్థులు ఇబ్బందులకు గురిచేసినా ఏమాత్రం వెరవకుండా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.వారికి అన్నివేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సురే‹Ùబాబు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆగుతున్న అభిమానుల గుండెలు
సాక్షి, నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమిని తట్టుకోలేక గురువారం కూడా పలువురు గుండెపోటుతో మృతిచెందారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు సమీపంలోని గాం«దీగనర్కు చెందిన వైఎస్సార్సీపీ నేత కిల్లో మోహన్ తండ్రి కిల్లో అప్పారావు(55) ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపులో జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఎన్నికల ఫలితాలను చూసి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం 108లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.తిరుపతి జిల్లాలో..తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైఎస్సార్సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్‌రెడ్డికి విజయం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అన్నం తినడం మానేశాడు. తల్లి ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అబ్బయ్యచౌదరి ఓటమితో అభిమాని ఆత్మహత్యదెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఓటమితో వైఎస్సార్సీపీ వీరాభిమాని రామారావుగూడెం యువకుడు సూరవరపు సాయిలింగాచార్యులు(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన సాయిలింగాచార్యులు వైఎస్సార్సీపీకి, కొఠారు అబ్బయ్యచౌదరికి వీరాభిమాని. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. జూన్ నాలుగో తేదీన వెలువడిన ఫలితాలు చూసి మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం అబ్బయ్యచౌదరిని కలుస్తానని చెప్పి బయలుదేరగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల దాడులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు ఆగి వెళదామని స్థానిక వైఎస్సార్సీపీ నేతలు నచ్చజెప్పారు. ఈ క్రమంలో అభిమాన నేత ఓటమిని భరించలేక.. తీవ్ర మనోవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ఆత్మహత్య సమాచారం అందుకున్న అబ్బయ్యచౌదరి ఏలూరు వైద్యశాలకు వెళ్లి సాయి భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ జిల్లా తెల్లపాడుకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని మాలేపాటి పెద్దనరసింహులు (65) గురువారం మృతిచెందాడు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తన స్వగృహంలో టీవీ చూస్తూ వైఎస్సార్సీపీ ఓటమిని చూసి తట్టుకోలేక ఒక్కసారికి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడికి భార్య పార్వతి, కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా కొమ్మూరు ఎస్సీ కాలనీకి చెందిన మూకిరి ఏషయ్య(46)వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు. మూడు రోజుల కిందట వెలువడిన ఎన్నికల ఫలితాలను చూసి అన్యాయం జరిగిందంటూ తీవ్ర మనో వేదనకు లోనవుతూ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుడు చెప్పాడు. ఆటో నడుపుకొనే ఏషయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.అనకాపల్లి జిల్లాలో.. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడికి చెందిన చిరుకూరి రాజుబాబు(72) వైఎస్సార్సీపీ అభిమాని. వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవుతారని గ్రామంలో అందరితో చెబుతుండేవాడు. కౌంటింగ్ పూర్తయ్యాక వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లు రాలేదని తెలియడంతో ఆందోళన చెందాడు. ఇక వలంటీర్లు పెన్షన్లను ఇంటికి తీసుకువచ్చి ఇవ్వరంటా.. అనే ప్రచారం జరగడంతో రెండు రోజులుగా దిగాలుగా ఉన్నాడు. గురువారం గుండెల్లో మంట వస్తుందంటూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ప్రకాశం జిల్లాలో.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేములకు చెందిన వైఎస్సార్ వీరాభిమాని అన్నపురెడ్డి చినగురవారెడ్డి(71) వైఎస్సార్సీపీ అభిమాని. దర్శి ఎమ్మెల్యేగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలవడంతో బుధవారం గ్రామస్తులతో కలిసి దర్శి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డితో చినగురవారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరికీ అన్యాయం చేయలేదని, అందరికీ న్యాయం చేశారని, ఆయనకు ఇంత అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే దిగులుతో ఇంటికి చేరుకున్న చినగురవారెడ్డి గురువారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. మృతుడి కుటుంబానికి కొడాలి నాని రూ.5 లక్షల సాయం తన ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్యచేసుకున్న కుటుంబానికి భరోసాసార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కొడాలి నాని ఓటమిని జీర్ణించుకోలేక కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని సైదేపూడికి చెందిన పిట్టా అనిల్‌కుమార్(26) ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాగా గురువారం రాత్రి అనిల్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ నాయకులతో కలసి వెళ్లి పరామర్శించారు. రూ.5 లక్షల సాయమందించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనిల్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. -
విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణుల దాడులు
సాక్షి నెట్వర్క్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ–జనసేన శ్రేణులు మంగళవారం విజయోత్సాహంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేశారు. గుంటూరులోని మంత్రి విడదల రజిని కార్యాలయం, పల్నాడు జిల్లాలో ఓ సచివాలయంతోపాటు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణమండపాన్ని ధ్వంసం చేశారు.విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్‌ను తొలగించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి ఊరేగింపులు చేయరాదని, బాణాసంచా కాల్చరాదని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎంత ప్రచారం చేసినా టీడీపీ–జనసేన శ్రేణులు ఎక్కడా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ దాడులు జరిగాయంటే..» ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముఖ ద్వారం, గేట్‌ను టీడీపీ నేతలు జేసీబీతో కూల్చివేశారు. ఈ ముఖ ద్వారం, గేట్‌ను గ్రామానికి చెందిన దాత ముప్పా సుబ్బారావు కుటుంబ సభ్యులు ముప్పా రోశయ్య పేరు మీద 2010లో సుమారు రూ.5 లక్షలతో పాఠశాలకు వీటిని నిర్మించారు. అనంతరం టీడీపీ నేతలు గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, బీసీ కులానికి చెందిన పెరుగు మాల్యాద్రి ఇంటిని కూల్చడానికి జేసీబీని తీసుకొచ్చి గొడవకు దిగారు. దీంతో మాల్యాద్రితోపాటు అతని భార్య ఆదిలక్ష్మి అడ్డుకోవడంతో టీడీపీ నేతలు వారిపై దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. జెడ్పీ పాఠశాల ముఖ ద్వారాన్ని కూల్చివేసిన జేసీబీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, తెలుగు తమ్ముళ్లు దాని నెంబర్ ప్లేట్‌ను తొలగించడం గమనార్హం. » పల్నాడు జిల్లా కొండూరులో టీడీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండాలతో గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలోకి వెళ్లగానే కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వచ్చి మీ ఓట్లు ఇక్కడలేవు కదా వెళ్లి గ్రామాల్లోనే ప్రదర్శనలు చేసుకోండి అనడంతో గొడవలు ప్రారంభమై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన పోతిపోగు సమాధానం, బండారు వందనం, బుర్రి పుల్లయ్య, పోతిపోగు దేవయ్య, పోతిపోగు యాకోబు, పోతిపోగు మణమ్మ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను అచ్చంపేట పీహెచ్‌సీకి తరలించారు. కోనూరులోను ఇదే పరిస్థితి నెలకొంది. విజయోత్సవం పేరుతో టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో దాడులు నిర్వహించడంతో పలువురు గాయపడ్డారు. బందరులో రాళ్ల దాడి..కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, బందరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కార్యకర్తలు పెద్దఎత్తున వాహనాలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలుండే ప్రాంతాలకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇలాగే రెచ్చగొట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించేందుకు యత్నించారు. కొంతమంది సీనియర్ నేతలు కార్యకర్తలను సముదాయిస్తుండగా కూటమి కార్యకర్తలు కొడాలి నాని అనుచరుల కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో కూటమి కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మద్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల విసురుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.కొవ్వూరులో విధ్వంసం..ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో టీడీపీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోనూ విధ్వంసం సృష్టించారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు కార్యాలయానికి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి అక్కడున్న రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు వారిస్తున్నా వారిని గెంటేసి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వైఎస్సార్సీపీ ప్రచార రథంతో పాటు ఇన్నోవా కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సుమారు 50 మంది యువకులు పది నిమిషాల పాటు భయానక వాతావరణం సృష్టించారు. ఆ సమయంలో వెంకట్రావు కుటుంబ సభ్యులందరూ కార్యాలయంలోనే ఉన్నారు. టీడీపీ దాడితో వారు తీవ్ర భయాందోళన చెందారు. అక్కడ నుంచి టీడీపీ శ్రేణులు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని మెప్మా కార్యాలయం తాళాలు పగులగొట్టి అందులోని కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంలోని రికార్డులన్నింటినీ బయటకు విసిరేశారు. టీడీపీ హయాంలో ఇదే కార్యాలయంలో అన్న క్యాంటీన్ నడిచేది. తాను అన్ని పార్టీల వారితో స్నేహ భావంతో ఉంటానని, ఇలాంటి వి«టద్వంసం తానెన్నడూ చూడలేదని తలారి వెంకట్రావు అన్నారు. » పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్ల వద్ద బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మండలంలోని మండపాక గ్రామంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు ఇంటిముందు వీరు బాణసంచా కాల్చడంతో ఆ నిప్పురవ్వలు పడి ఇంట్లోని దుప్పట్లు, ఇతర సామగ్రి దగ్థమయ్యాయి. » ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. దీంతో పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పలువురు టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ల రెక్కలు విరిచి ద్విచక్ర వాహనాలకు కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత జయచంద్రారెడ్డి కారును పరిటాల సునీత అనుచరులు ధ్వంసం చేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులను ఇళ్ల వద్దకెళ్లి కవ్వించి కొందరిని గాయపరిచారు. టపాసులు పేల్చి ఇళ్లపైకి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయం ధ్వంసం..గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘మండలి’ విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్తూ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఫర్నిచర్, కంప్యూటర్ సామాగ్రి ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బూతులు తిడుతూ కార్యాలయంలోని మొత్తం సామగ్రి పగులగొట్టారు. » చిత్తూరు నగరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని ధ్వంసంచేసి, పెట్రోలు పోసి నిప్పంటించారు. మార్కెట్ హరి అనే వ్యక్తికి చెందిన రూ.కోటి విలువైన సిగరెట్ స్టాకు గోదాముకు నిప్పంటించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్న కన్నన్ నాయకర్, మండీ ప్రభాకర్‌రెడ్డి, ప్రసన్నకు చెందిన హోటళ్లను, బేకరీలను నేలమట్టం చేశారు. పూతలపట్టులోని పాలకూరులో వైఎస్ విగ్రహాన్ని కూలదోశారు. ఎగువ పాలకూరు, బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో దళితుల ఇళ్లలోకి చొరబడి వారిపై దాడులు చేయగా పలువురు గాయపడ్డారు. పూతలపట్టు నయనంపల్లెలో కిరణ్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లెలో కృష్ణమూర్తి యాదవ్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త జేసీబీను అపహరించి, అతని ఇంటి ప్రహరీనే కూల్చేశారు.» పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎండుగుంపాలెం బీసీ కాలనీలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు, గొడ్డళ్ళలో ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి ట్రాక్టర్‌కు కట్టి ఎన్ఎస్పి కాలువ వద్దకు ఈడ్చుకెళ్లారు. పోలీసులు ధ్వంసమైన విగ్రహాన్ని యథాస్థానానికి చేర్చారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలకు ఫ్యాన్లు కట్టి ఈడ్చుకెళ్లారు. పోలీసుల ఆంక్షలున్నా బాణాసంచా కాల్చి భయభ్రాంతులకు గురిచేశారు. తూబాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు రోడ్ల మీద పసుపు నీళ్లు చల్లారు. » గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూల్చేశారు. గ్రామానికి చెందిన దుర్గారావు అనే నేత ట్రాక్టరుతో గుద్దించి విగ్రహాన్ని కూలగొట్టాడు. అతని కోసం వెతుకుతున్నారు. గ్రామస్తులు అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. » గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోదరుడు కర్నుమా ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అద్దాలను టీడీపీ శ్రేణులు పగలగొట్టి దాడికి యత్నించారు. కౌంటింగ్ సందర్భంగా కర్నుమా నాగార్జున యూనివర్శిటీకి వచ్చి అనంతరం కుటుంబ సభ్యులతో కారులో గుంటూరు బయల్దేరారు. టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చి రాళ్లు, కర్రలతో కారుపై అద్దాలు పగలగొట్టి దాడికి యత్నించారు. కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. కర్నుమా కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. » పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ వైఎస్సార్సీపీ నాయకురాలు, గ్రామ సర్పంచ్ చికిలే మంగతాయారు ఇంటి సమీపంలోకి రాగానే కూటమి అభిమానులు తారాజువ్వలు వేస్తూ, మోటార్ సైకిళ్ల సైలెన్సర్లను తొలగించి భీకర శబ్దాలతో నానా హంగామా చేశారు. ఇదే సమయంలో పెదపేటకు చెందిన యువకులతో టీడీపీ–జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఘర్షణలకు పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. » అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దాదాపు పదిమంది గ్రామ సచివాలయానికి చేరుకుని విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించారు. కిటికీ అద్దాలను పగలగొట్టారు. కంప్యూటర్‌పై నీళ్లు పోశారు. ప్రింటర్‌ను, బాత్రూమ్ డోర్లను పగలగొట్టారు. సచివాలయంపైన ఉన్న సింథటిక్ ట్యాంకు పైపులను ధ్వంసం చేశారు. సుమారు రూ.50 వేల మేర నష్టపరిచారు. ఇదే గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడిచేశారు.» ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో ఓ పెట్రోలు బంకుతోపాటు దాని యజమాని ఇంటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడిచేసి రాళ్లు రువ్వారు. దీంతో ఆ యజమాని, మండల వైస్ ఎంపీపీ అయిన వేమూరి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. » ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఒక కూల్‌డ్రింక్ షాపు వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఎన్నికల ఫలితాలపై వాగ్వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కూల్‌డ్రింక్ సీసాలతో దాడి చేసుకున్నారు.ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ లక్కాబత్తుల సిద్ధిరాజు, లక్కాబత్తుల సురేష్, బిరుదుగడ్డ కిరణ్, అల్లాడ సురేష్, లక్కాబత్తుల జాన్‌బాబు, బిరుదుగుడ్డ కల్యాణ్, డీజే రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఒక విలేకరి సెల్‌ఫోన్‌ను లాక్కుని అతడిని గాయపరిచారు. మరోవైపు.. ఇక్కడి కూటమి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిమిత్తం ఎస్సై సతీష్‌తో ఘర్షణకు దిగారు.» ఇదే జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి, అంబర్‌పేట, సూరప్పగూడెం, కురెళ్లగూడెం, భీమడోలు తదితర గ్రామాల్లోనూ గొడవలు చోటుచేసుకున్నాయి. పోలసానిపల్లిలో జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ చేసుకుంటూ ఎంపీటీసీ అంబటి దేవీ నాగేంద్రప్రసాద్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, ఎంపీటీసీ కుమారుడు, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అధిక సంఖ్యలో ఉన్న జనసేన కార్యకర్తలు ఎంపీటీసీ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులపై దాడిచేశారు. వారి దుస్తులను చించివేశారు. అలాగే, అంబర్‌పేట రైతుభరోసా కేంద్రంలోకి చొరబడిన టీడీపీ కార్యకర్తలు రూ.1.50 లక్షల విలువైన కంప్యూటర్, íప్రింటర్లు, ర్యాక్‌లు, కుర్చీలను ధ్వంసం చేశారు. సిబ్బంది ఎంత వారించినా టీడీపీ కార్యకర్తలు వినలేదు.విడదల రజిని కార్యాలయం అద్దాలు ధ్వంసం..గుంటూరులో టీడీపీ శ్రేణులు ఎన్నికల విజయోత్సవంలో భాగంగా పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరి వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు నినాదాలు చేసి కార్యాలయంపై రాళ్లు విసిరారు. అక్కడున్న పోలీసు సిబ్బంది వారిని వారించినా లెక్కచేయకుండా కార్యాలయం అద్దాలను పగులగొట్టారు. కార్యాలయం షట్టర్లు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసు అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. అయినా టీడీపీ కార్యకర్తలు పోలీసులను లెక్కచేయకుండా కార్యాలయంపై రాళ్లు విసిరారు. » పల్నాడు జిల్లా కొచ్చర్ల సచివాలయంపై మంగళవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. ఇరు పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కర్రలు, గడ్డపార్లతో సచివాలయంపై దాడిచేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం లోపల ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసంచేసి సర్పంచ్ కుర్చీని బయటపడేసి తగలబెట్టారు. లోపలున్న కంప్యూటర్ను, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం పైకెక్కి టీడీపీ జెండాను ఏర్పాటుచేశారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయంపైకి రావడంతో సచివాలయ సిబ్బంది పరుగులు తీశారు. పోలీసులు వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. » ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్సార్ పేరును టీడీపీ నేతలు తొలగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీడీపీకి సానుకూలంగా ఫలితాలు రావడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ వద్దకు వెళ్లి, మెయిన్ గేటు వద్ద ఉన్న పేరును కాళ్లతో తన్ని ఊడగొట్టడంతో పాటు, భవనం పైకెళ్లి పేరులోని వైఎస్ అక్షరాలను తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీ అక్షరాలను పెట్టారు. » పల్నాడు జిల్లా వినుకొండ కారంపూడి రోడ్డులోని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణ మండపాన్ని మంగళవారం కొంతమంది అల్లరి మూకలు రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. కళ్యాణ మండపంలోని అద్దాలను పగలగొట్టడమే కాకుండా అక్కడున్న కారును కూడా కాళ్లతో తన్నుతూ సుమారు అరగంటసేపు విధ్వంసం సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలపై కల్యాణ మండపంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టి వెళ్లిపోయారు. దీంతో అక్కడ సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. -
దెబ్బ తీసిన దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలు కావడం అనూహ్యంగా ఉందని తల పండిన రాజకీయ నాయకులు సైతం విస్తుపోతున్నారు. నవరత్నాల హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసిన వైఎస్సార్సీపీ పట్ల ఓటర్లు మొహం చాటేయడం ఆశ్చర్యకరంగా ఉందని సీనియర్ రాజకీయనాయకులు విస్మయంవ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు అత్యల్పంగా రావడం ఊహకు అందనిదని, దుష్ప్రచారాలను క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం సమర్థంగా తిప్పికొట్టలేకపోయిందని.. గ్రామ, మండల, జిల్లా స్థాయిలోఎక్కడికక్కడ వీటిని ఖండించడంలో విఫలమైందని పేర్కొంటున్నారు. దీంతో దుష్ప్రచారాలదే పైచేయి అయిందని, ప్రజలు దాన్నే విశ్వసించారని విశ్లేషిస్తున్నారు. కోవిడ్ సంక్షోభంలోనూ సీఎం జగన్ ప్రభుత్వం సంక్షేమ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినా ప్రజలు అండగా నిలవకపోవడం అంతుపట్టకుండా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వేధింపులు లేకపోయినా ఉద్యోగులు దూరమయ్యారని, దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చినప్పటికీ ఆ తరువాత ఫిట్‌మెంట్‌ను అంతకన్నా తక్కువగా ఇవ్వడంతో ఉద్యోగులు దూరమయ్యారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను తప్పుదోవ పట్టించారనే అభిప్రాయాన్ని ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పొదుపు సంఘాల మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని మాట ఇచ్చిన సీఎం జగన్ మాట మేరకు రూ.25 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేశారు. దీంతో మహిళల ఓటింగ్ పెరగడంతో అక్కచెల్లెమ్మలంతా ‘ఫ్యాన్’కే ఓటు వేశారని పోలింగ్ రోజు సర్వత్రా చర్చ జరిగినా ఫలితాల్లో అది కనిపించలేదు. 45–60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలను వారి కాళ్ల మీద నిలబెట్టాలనే తపనతో సీఎం జగన్ వైఎస్సార్ చేయూత కింద రూ.19,189,59 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వారంతా ఆకర్షణకు గురై ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.26,067 కోట్ల మేర లబ్ధి పొందిన మహిళల విషయంలోనూ ఇదే జరిగినట్లు విశ్లేషిస్తున్నారు. మందు ప్రభావం..దశల వారీ మధ్య నియంత్రణలో భాగంగా షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచడం మందుబాబులకు రుచించలేదని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. మద్యాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం కూడా ప్రభావితం చేసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలన్నింటినీ కొనసాగిస్తామని, పింఛన్ రూ.3,500కి పెంచుతామని సీఎం జగన్ ఆచరణ సాధ్యమైన హామీలనే ఇచ్చారు. అయితే చంద్రబాబు పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచడంతోపాటు ఏప్రిల్ నుంచి మూడు నెలల బకాయిలతో కలిపి జూలైలో మొత్తం రూ.7 వేలు అందచేస్తామని వాగ్దానం చేశారు. దీంతో పెన్షనర్లు ఆకర్షితులయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.దేశమంతా మెచ్చినా..వీటన్నింటికి తోడు ఎన్నికల్లో సీఎం జగన్‌పై కూటమి నేతలు వ్యక్తిగత దుష్ప్రచారానికి దిగారు. భూములపై యజమానులకు శాశ్వత హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో వందేళ్ల అనంతరం సమగ్ర భూ సర్వేలో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకొస్తే భూములు లాక్కుంటున్నారంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున అసత్య ప్రచారానికి పాల్పడ్డారు. అర్హతే ప్రామాణికంగా పేదలకు వివక్ష లేకుండా పథకాలను అందించినా ఆయా వర్గాలు పూర్తి స్థాయిలో అండగా నిలవలేదనేది ఫలితాల సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ఇంటి ముంగిటే అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందినా ప్రజలు ఈ ఎన్నికల్లో పార్టీని ఎందుకు ఆదరించలేదో అర్ధం కావడం లేదని ఓ సీనియర్ రాజకీయ వేత్త వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసులను, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్..ఇదిలా ఉంటే.. సి–విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు మీనా తెలిపారు. -
జనం తీర్పు ఏం చెప్పనుంది?
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఈ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. ప్రస్తుత బీజేపీ పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగు పరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? అధికార ప్రతి పక్షాలు రెండూ తమవైన వివరణలను జోడించి చేసిన 85 శాతం–15 శాతం ప్రచారాన్ని ఓటర్లు ఎలా తీసుకున్నారు? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా? ఇలాంటి ప్రశ్నలకు ఓ రెండ్రోజుల్లో సమాధానం లభిస్తుంది.జూన్ 4న వెల్లడి కానున్న సార్వత్రిక ఎన్నికల లెక్కల్లో బీజేపీ 303 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చు. లేదా దాని స్థానాలు 272 నుంచి 303 మధ్య ఉండవచ్చు. లేదా మెజారిటీ మార్కు కంటే తక్కువగా ఉండవచ్చు. వీటి గురించి ఇప్పటికైతే ఎవ్వరికీ తెలియదు. అయితే నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు మనకు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఆ ఫలితాలను పరిశీలించండి.గత దశాబ్దం గురించిన స్పష్టమైన మొదటి పరికల్పనను ఇక్కడ చూద్దాం. నరేంద్ర మోదీ రాజకీయాలను పునర్నిర్వచించారు. ప్రతి ఎన్నికా స్థానిక, జాతీయ సమతూకంతో ఉంటుంది. అయితే సంక్షేమ పథకాల పంపిణీ, ఎడతెగని జాతీయ సందేశపు ప్రదర్శనతో మోదీ జాతీయతను, స్థానికతను అనుసంధానించారు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఎదుర్కొన్న ప్రతికూలతలను పూడ్చడానికి మోదీ ప్రజాదరణ సరిపోయింది. మరోవైపున ఓటర్లు కూడా తమ శాసనసభా కార్యకలాపానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే అంశానికన్నా, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు అనేదానికి ప్రాధాన్యతను ఇచ్చారు.2024 తీర్పు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో, కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఇంకా ఎక్కువ మంది ఓటర్లను మోదీ ఆకర్షిస్తున్నారా, లేదా? బీజేపీ అభ్యర్థి స్వభావం లేదా కుల సమీకరణలు లేదా ఆర్థిక ఆందోళన నుండి ఉత్పన్నమయ్యే స్థానిక బలహీనతలను పూడ్చడానికి మోదీ ఇమేజ్ సరిపోతుందా? ఓటర్లు భారత ప్రభుత్వ అధికారంలో ఒక బలమైన నాయకుడిని కోరుకుంటున్నారా లేక బలమైన తనిఖీలతో 1989–2014 మధ్యకాలపు తరహా ఏర్పాటు తిరిగి రావాలని కోరుకుంటున్నారా?ఇక రెండో పరికల్పన హిందూ మత–రాజకీయ గుర్తింపునకు పెరుగుతున్న భావన గురించి. దీన్ని బీజేపీ స్పష్టమైన అవగాహనతోనే పెంచి పోషించింది. హిందూ మత గుర్తింపునకు సంబంధించిన రాజకీయ ప్రకటనకు ప్రభుత్వ మద్దతు ఉంది. కల్పిత మనోవేదనల సమాహారం ద్వారా ముస్లింలను ఇతరులుగా మార్చే భావన మరొకటి. వెనుకబడిన, దళిత ఉప సమూహాలకు సాంస్కృతిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించడం ద్వారా సమ్మిళిత హిందూ గుర్తింపును నిర్మించడం కూడా దీని వెనుక ఉంది. అయోధ్యలో లేదా కశ్మీర్లో లేదా దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక అన్యాయాల ‘సవరణ’ ఉంది. హిందువులు ఐక్యంగా ఉంటే, వారు ముస్లిం ఓట్లను అసంగతం చేయగలరనీ, ముస్లిం ప్రాతినిధ్యాన్ని చాలావరకు తగ్గించగలరనీ చూపించడానికి ఒక ఎన్నికల నమూనా కూడా దీని వెనుక ఉంది.కులాలకు అతీతంగా హిందుత్వ సామాజిక గాఢత కనబడటం, ‘లౌకికవాదం’ ప్రతిధ్వనులు ఎక్కడా వినిపించకపోవడం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) మద్దతు వంటివి తనకు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నీరుగారిపోయింది. బీజేపీ తరహా రాజకీయ మతపరమైన గుర్తింపును సవాలు చేసే కథనం తన దగ్గర లేకపోవడంతో కుల గణన, మరిన్ని రిజర్వేషన్లు, అన్ని రంగాలలో అన్ని కుల సమూహాలకు దామాషా ప్రాతినిధ్యాన్ని వాగ్దానం చేసింది. ఇది చారిత్రాత్మకం!జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్... దేశాన్ని కుల సమూహాలు, మతాలు, జాతుల మొత్తంగా కాకుండా హక్కులతో కూడిన, వ్యక్తిగత పౌరులతో కూడిన ఒక పెద్ద సమూహంగా భావించింది. మౌలికమైన అస్తిత్వ ఆధారిత విధానాల కంటే సామాజిక ప్రయోజనాలను సమతుల్యం చేసే క్రమానుగతమైన మార్పును విశ్వసించింది. ఈ రెండు అంశాలకు సంబంధించినంతవరకూ నెహ్రూ పార్టీని రాహుల్ గాంధీ భారత రాజకీయాలను సామ్యవాద స్రవంతి వైపు తిరిగి మళ్లించారు. పైగా కమ్యూనిస్ట్ స్రవంతి నుండి అరువు తెచ్చుకున్న బలమైన పెట్టుబడిదారీ వ్యతిరేక వైఖరిని దానికి జోడించారు.హిందూ గొడుగులోని సంకీర్ణ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, ప్రతిపక్షాలు ఎన్నికలను 85%–15% యుద్ధంగా మలిచాయి. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 15 శాతం అంటే ‘ఇతరులైన’ ఉన్నత కులాలు. దళితులు, ఓబీసీలు, గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ఉద్దేశించినట్లు అది తప్పుగా పేర్కొంది. మరోవైపున తన సొంత హిందూ సామాజిక సంకీర్ణాన్ని కొనసాగించడానికి, బీజేపీ ఈ ఎన్నికలను 85% వర్సెస్ 15% యుద్ధంగా రూపొందించింది. ఇక్కడ 15 శాతం అంటే ‘ఇతరులైన’ ముస్లింలు ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరోపించింది. అట్టడుగు హిందువుల రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఉద్దేశించినట్లు బీజేపీ తప్పుగా ఆరోపించింది. అన్ని ప్రశ్నల పరంపరకు ఈ ఎన్నికల తీర్పు సమాధానం ఇస్తుంది. ఏకీకృత హిందూ రాజకీయ గుర్తింపునకు చెందిన ఆలోచన భౌగోళికంగా దక్షిణాదిలో కూడా విస్తరించి, సామాజికంగా దళితులు, గిరిజనులలో లోతుగా పాతుకుపోయిందా? రిజర్వేషన్ నిర్మాణాన్ని మరింత విస్తరించడానికి ఈ తీర్పు పార్టీలను ఎంతవరకు ఒత్తిడికి గురి చేస్తుంది?మూడవ పరికల్పన రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి. మోదీ నమూనా మౌలిక సదుపాయాలలో తయారీపై, పెట్టుబడులు పెంచడంపై ఆధారపడినది. ప్రైవేట్ వ్యవస్థాపకతను ముందుకు తీసుకుపోవడానికి డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులను ఉపయోగించడం; ఆర్థిక మార్కెట్లను విస్తరించడం; పరపతిని సరళీకరించడం; ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం; సేవలలో భారతదేశ బలాన్ని పెంచడం; నగదు, గృహాలు, నీరు, ఆహారం, విద్యుత్, వంటగ్యాస్ వంటి వాటిని అందుకునే కోట్లాది మంది ప్రజలతో కూడిన సంక్షేమ వలయాన్ని సృష్టించడం ఈ నమూనాలో భాగం. సంక్షేమం ఒక తరగతి లబ్ధిదారులను సృష్టించింది, గుర్తింపులు, ప్రాంతాల వ్యాప్తంగా మహిళా ఓటర్ల మద్దతును గెలవడానికి ఇవి మోదీకి సహాయపడ్డాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంపై ప్రజల్లో కోపం, బాధ పెరుగుతున్నాయని కూడా స్పష్టమైంది. గరిష్ఠంగా నగదు బదిలీలు, ప్రభుత్వ రంగ ఉపాధి, ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ ప్రణాళికతో సహా మరింత సంక్షేమానికి ప్రతిపక్షాలు వాగ్దానం చేశాయి. ప్రస్తుత పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? ఓటర్లను, ముఖ్యంగా మహిళలను, యథాతథ స్థితికి కట్టుబడి ఉండటానికి లేదా బీజేపీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరడానికి సంక్షేమం ప్రేరేపణ కలిగించిందా? రాజకీయ–క్యాపిటల్ నెట్‌వర్క్‌పై ప్రజలకు ఆగ్రహం ఉందా? మహమ్మారి అనంతరం వివిధ రూపాల్లో దేశం కోలుకోవడం జరిగిందా? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా?తమను ఎవరు నడిపించాలనుకుంటున్నారు, తమను ఎలా నిర్వచించాలనుకుంటున్నారు, తమ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి వారు ఎవరిని విశ్వసిస్తారు అనే కీలకాంశాలను రెండ్రోజుల్లో ఓటర్లు ప్రకటిస్తారు. ఇది 2024కి సంబంధించిన అసలైన కథ.- వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -ప్రశాంత్ ఝా -
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడే 6వ దశ పోలింగ్
-
ఎన్నికలు vs ఏఐ
ఈ వేసవి ఎంత వేడిగా వుందో ప్రస్తుత ప్రపంచ రాజకీయ వాతావరణం అంతే వేడిగా వుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో ఎన్నికలు పూర్తి కాగా మరికొన్ని దేశాలలో త్వరలో జరగనున్నాయి. ఇదే మే నెలలో దక్షిణాఫ్రికాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా నవంబరులో అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. ఇంతటి మహాయజ్ఞంలో ఇప్పుడు మానవ మేధస్సు కంటే ఎక్కువగా ఎన్నికల్లో ఏఐ (అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) పాత్ర పెరిగింది.ఏఐ అంటే ఏంటీ?ఆర్టీఫిషియల్ ఇంటెలిజన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో కూడిన యంత్రాంగం. అంటే మనిషి లానే ఆలోచించి ఇంకా చెప్పాలంటే మనిషి కన్నా వందల రెట్లు వేగంగా ఆలోచించి జవాబులు చెప్పే యాంత్రిక సాధనం. ఈ సాంకేతిక విప్లవం ఇప్పుడు ఎన్నికలలో విపరీతంగా వాడుకలోకి వచ్చింది. అభ్యర్ధులు తమ ప్రచారం కోసం ఏఐ వాడకాన్ని విపరీతంగా పెంచేశారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రజల మనోభావాలను ఇట్టే పసిగట్టేయడానికి, సోషల్ మీడియాలో పోస్టులను విశ్లేషించడానికి, ప్రచార వ్యూహాలను, క్యాంపెయిన్లను రూపొందించడానికి ఏఐ సాంకేతికతను విపరీతంగా వాడేశారు. అక్కడితే ఆగిపోయారా.. అంటే లేదు అని చెప్పాలి. లెక్కకు మిక్కిలి ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలను అసలు కంటే మిన్నగా ఏఐతో రూపొందిస్తున్నారు.ఏఐ ఎలా పని చేస్తోంది?ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (AI) మానవ మేధస్సు నుంచి వేగంగా నేర్చుకుంటుంది. సమస్య - పరిష్కారం, ఎలాంటి అవసరాలు వస్తాయి? ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? ఆలోచించడానికి, అనుకరించడానికి, పోల్చుకోడానికి దేన్ని పరిశీలించాలి? వీటన్నింటిని ఒక కోడింగ్ పద్ధతిలో AI తనలో దాచుకుంటుంది. ఒకసారి AI పూర్తిగా నేర్చుకుంది అంటే.. తన దగ్గర ఉన్న డాటా నుంచి అద్భుతాలు సృష్టిస్తుంది. మానవులు ఆలోచించేదానికంటే వేగంగా, ఎన్నో అంశాలను పరిశీలించి జవాబులు చెబుతుంది. ఇది ఎంత సహజంగా ఉంటుందంటే.. సాధారణ మనుష్యులు గుర్తించలేదు. నమూనాలను గుర్తించడం, అంచనాలను రూపొందించడం, కొత్త సమాచారాన్ని స్వీకరించడం ఇవన్నీ అత్యంత సులువుగా చేస్తుంది.ఎన్నికలలో ఏం చేసింది?ముఖ్యంగా డేటాను విశ్లేషించడానికి ఏఐని అన్ని పార్టీలు వాడాయి. అలాగే ప్రచార వ్యూహాలను మెరుగుపరచడానికి, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కూడా ఏఐ వాడేశారు. సోషల్ మీడియాను మానిటరింగ్ చేయడం, ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది తెలుసుకోవడం, కీలక సమస్యలను గుర్తించడం, దానికి అనుగుణంగా ప్రచారాన్ని మార్చుకోవడం, తమ ఎజెండాను ప్రజలు ఒప్పుకునేలా చేయడం వంటి వాటిని ఏఐ సాయంతో పార్టీలు చేసేశాలయి. అలాగే చారిత్రక డేటా, పోలింగ్ డేటా తదితర సంబంధిత అంశాల ఆధారంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి AIను వాడారు.ఇటీవల అమెరికాలో న్యూహాంప్‌షైర్‌లోని ఓటర్లు ప్రైమరీలలో ఓటు వేయవద్దని నేరుగా ప్రెసిడెంట్ బైడ్‌న్ నుంచి కాల్ వచ్చింది. అలాగే పాకిస్తాన్ ఎన్నికల సమయంలో ఇమ్రాన్ లైవ్ చాట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి, జైల్లో ఉన్న ఇమ్రాన్ వీడియోల్లో లైవ్‌లో జనం అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానాలిచ్చారో అర్థం కాక ఆశ్చర్యపోయారు చాలా మంది.భద్రత కోసం ఏఐఎన్నికల ప్రక్రియలో మోసాన్ని అరికట్టేందుకు ఏఐను వాడారు. అలాగే సాంకేతికత వ్యవస్థ ధృడంగా ఉండేందుకు హ్యాకింగ్ బారి నుంచి కాపాడుకునేందుకు ఏఐని వాడుకున్నారు. ఫేక్ వీడియోలను అరికట్టడానికి, తప్పుడు పోస్టింగ్‌లను నిరోధించడానికి ఏఐని వాడారు. సిసి కెమెరాల విశ్లేషణను, పోలింగ్ డాటా అప్డేట్స్కు ఏఐను వాడారు.కొత్త, కొంగొత్తస్పీచ్, టెక్స్ట్అనాలిసిస్‌లో ఏఐ వాడకం బాగా పెరిగింది. మనతో ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్టుగానో, లేక అభ్యర్థి స్వయంగా మనకు ఫోన్ చేసి పలకరించినట్టుగానే మాడ్యుల్స్ తయారు చేశారు. AI-పవర్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) పద్ధతులను ఏఐ వాడి అనుసరించారు. ఓటర్ ఎంగేజ్మెంట్, చాట్బోట్లలో వీపరీతంగా ఏఐని దించేశారు. వర్చువల్ అసిస్టెంట్లు రియలిస్టిక్‌గా మారిపోయాయి. ఓటర్లతో పరస్పరచర్చలు జరిపాయి. అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాయి. పైగా ఇవన్నీ చాలా సులభంగా జరిగిపోయాయి. యాక్సెసిబిలిటీ, వాయిస్ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్ తదితర ఫీచర్లతో ఓటర్లు గుర్తించలేనంతగా సర్వీసులనిచ్చాయి.ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్ల మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారు, పాల్గొంటున్నారు. ఏఐ వల్ల అంతా మంచేనా అంటే ఒప్పుకోలేం. ఏఐ వల్ల ఎంత మంచి ఉందో, అంతకు రెట్టింపు ముప్పు ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసిరావాలి. యంత్ర మేధస్సు మంచిదే కానీ, ఆ వలయంలోనే మనుష్యులు మునిగిపోకూడదు. ఎన్నికలలో ఎన్నికయ్యే నాయకుడు ప్రజల నాడీ అయి ఉండాలి కానీ ఆర్టీఫిషియల్ బాడీ అవకూడదు. మనం దేవుడిని భౌతికంగా చూడలేం కాని దివ్యత్వాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే యంత్ర మేధస్సు మనం చెబితే ఆచరించాలి తప్ప మన భావోద్వేగాలలో భాగం కాకూడదు.- హరికృష్ణ ఇంటూరు, సాక్షి యూట్యూబ్ -
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి, ఫలితాల అంచనాపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా స్పందించారు. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని, మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా పని చేసిన ఐ–ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయాన్ని సీఎం జగన్ గురువారం సందర్శించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఐ – ప్యాక్ కార్యాలయానికి వచ్చిన ఆయన సుమారు అరగంట సేపు గడిపారు. ఐ–ప్యాక్ ప్రతినిధులను అభినందించి సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. 2019 ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించిందని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ దఫా అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయ పతాకం ఎగురవేసి వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.మరింత మంచి చేద్దాం..ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని.. ఫలితాలు వెల్లడైన తర్వాత దేశం మొత్తం మన వైపు చూస్తుందని సీఎం జగన్ చెప్పారు. 59 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజలకు మంచి చేశామని.. రాబోయే ఐదేళ్లలో ఇంకా ఎక్కువ మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో ఐ–ప్యాక్‌తో ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు.విశ్వసనీయతే విజయానికి మెట్టు..గత ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తొలి ఏడాదే మేనిఫెస్టోలోని హామీల్లో 95 శాతం అమలు చేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలను అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా వివక్ష, లంచాలకు తావు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా 59 నెలల్లో పేదల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు. చెప్పిన ప్రతి హామీని అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయానికి ఇదే బాటలు వేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.మహిళలు, గ్రామీణులు వైఎస్సార్సీపీ వైపే..అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు సీఎం జగన్ సుస్థిర బాటలు వేశారు. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మరీ మహిళలకు పట్టం కట్టారు. ఇంటి స్థలంతోపాటు ఇంటిని కూడా మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మహిళా సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్ నాయకత్వంపై మహిళల్లో మద్దతు మరింత పెరిగింది. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి గుమ్మం వద్దే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. ఊరు దాటాల్సిన అవసరం లేకుండా పనులన్నీ జరుగుతుండటంతో సీఎం జగన్ నాయకత్వంపై గ్రామీణుల నమ్మకం మరింత పెరిగింది.ఇటు ప్రభుత్వం.. అటు ప్రైవేట్ రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడంతో సీఎం జగన్ నాయకత్వంపై యువతలో విశ్వసనీయత రెట్టింపైంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, గ్రామీణులే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహిళలు, గ్రామీణులు పెద్ద ఎత్తున సీఎం జగన్ నాయకత్వానికి మద్దతుగా ఓటు వేయడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని, వైఎస్సార్సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. -
Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్ హవా!
సార్వత్రిక ఎన్నికల వేడి సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టిస్తోంది. ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్‌స్టా.. ఎక్స్.. యూట్యూబ్.. ఇలా సోషల్ ప్లాట్ఫాముల్లోనే మునిగి తేలుతున్న నెటిజన్లకు చేరువయ్యేందుకు పారీ్టలు కూడా ఆ వేదికలనే అడ్డగా మలచుకుంటున్నాయి. రాజకీయ విశ్లేషకులతో పాటు కంటెంట్ క్రియేటర్లు కూడా జోరు పెంచడంతో రెండు నెలలుగా డిజిటల్ ప్రచారం దుమ్ము రేగిపోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టలు ఎక్కువగా ఫేస్‌బుక్‌పై దృష్టి పెట్టగా 2019కు వచ్చేసరికి ప్రధానంగా వాట్సాప్‌ను నమ్ముకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం డిజిటల్ క్యాంపెయినింగ్‌కు యూట్యూబ్ కీలక వేదికగా మారింది... సాధారణంగా యూట్యూబ్‌లో వినోదాత్మక కంటెంట్‌కు మంచి గిరాకీ ఉంటుంది. ఎన్నికల పుణ్యమా అని నెల రోజులుగా సీరియస్ రాజకీయ కంటెంట్‌కు ఒక్కసారిగా వ్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సబ్‌్రస్కయిబర్లు భారీగా ఎగబాకుతున్నారు. సోషల్ మీడియా డేటాను విశ్లేíÙంచే సోషల్ బ్లేడ్ గణాంకాల ప్రకారం రాజకీయ థీమ్‌తో కంటెంట్ క్రియేట్ చేస్తున్న ధృవ్ రాఠీకి ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 25 లక్షల మంది యూజర్లు దక్కడమే ఇందుకు నిదర్శనం! ఇక డిజిటల్ న్యూస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన రవీశ్ కుమార్, అభిసార్ శర్మ వంటి టీవీ జర్నలిస్టుల యూట్యూబ్ ఛానెల్స్ కూడా మూడు లైక్‌లు, ఆరు షేర్లుగా దూసుకెళ్తున్నాయి. వీరిద్దరి ఛానెల్స్ నెలవారీ వ్యూస్ వరుసగా 175 శాతం, 115 శాతం చొప్పున ఎగబాకాయి! షార్ట్ వీడియోలే ట్రెండింగ్... గత ఎన్నికల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా డిజిటల్ మెసేజ్‌లను పార్టీలన్నీ బాగా వాడుకున్నాయి. ఇందుకోసం కొన్ని పారీ్టలైతే ఏకంగా 2 లక్షలకు పైగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసినట్లు రషీద్ చెబుతున్నారు! కానీ ఇప్పుడు నెటిజన్ల అభిరుచులతో పాటు ట్రెండ్ కూడా మారిపోయింది. ముఖ్యంగా 30 సెనక్ల కంటే తక్కువ నిడివిగల చిన్నపాటి వీడియో క్లిప్‌లకు భలే క్రేజ్ ఉంది. వాస్తవానికి ఈ ట్రెండ్ టిక్‌టాక్‌తో మొదలైంది. దాన్ని బ్యాన్ చేయడంతో యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్ ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లు భారీగా పెరగడం, డేటా చౌకగా లభించడం, మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం కూడా దీనికి ప్రధాన కారణాలే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చౌక డేటా ప్లాన్లు ఉన్న దేశాల్లో భారత్‌ది ఏడో స్థానం. స్మార్ట్ ఫోన్లోనే ఈజీగా కంటెంట్ క్రియేట్ చేయగల వీడియో ఎడిటింగ్ యాప్‌లు అందుబాటులోకి రావడం షార్ట్ వీడియోలకు బాగా కలిసొస్తోంది. కేవలం ఫొటో, మెసేజ్‌లతో కాకుండా చిన్న వీడియోలతో పారీ్టలు తమ అభిప్రాయాలను మరింత ప్రభావవంతంగా ఓటర్లకు చేరవేసేందుకు వీలవుతుండటం వల్లే యూట్యూబ్ ఈ ఎన్నికల్లో కీలక ప్రచార వేదికగా మారింది. అంతేగాక ప్రధాన టీవీ ఛానెళ్లలో ముఖ్యమైన ప్రజా సమస్యలకు తగిన కవరేజీ దక్కడం లేదని యూట్యూబ్ క్రియేటర్లు అంటున్నారు. దాంతో అలాంటి వార్తలు చూపించే యూట్యూబ్ ఛానెళ్లకు డిమాండ్ బాగా పెరుగుతోందని చెబుతున్నారు.రాజకీయ యాడ్లకూ తగ్గేదేలే... యూట్యూబ్ డిజిటల్ ప్రచార హవా పార్టీల అడ్వర్టయిజింగ్ వ్యయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మే 4 మధ్య బీజేపీ, కాంగ్రెస్ గూగుల్ యాడ్స్ కోసం కేవలం వీడియోలపైనే అత్యధిక నిధులను వెచి్చంచాయి. వివిధ ఫార్మాట్ల ద్వారా మెటా యాడ్స్‌కు ఖర్చు చేసిన దానికంటే ఇది మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. వీడియో కంటెంట్‌కు సంబంధించి కాషాయ పార్టీ గూగుల్ యాడ్స్‌కు రూ.50.4 కోట్లు ఖర్చు చేయగా, మెటా యాడ్స్‌కు రూ. 15.4 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక కాంగ్రెస్ గూగుల్ యాడ్స్‌కు రూ.24.5 కోట్లు, మెటాకు రూ.8.1 కోట్ల చొప్పున వెచ్చించింది.యూజర్లు రయ్.. రయ్.. ఎన్నికల హడావుడి మొదలైన ఫిబ్రవరి నుంచి చూస్తే... చాలామంది నాయకులు, పారీ్టల యూట్యూబ్ సబ్‌్రస్కయిబర్లు 2 నుంచి ఏకంగా 4 రెట్లు పెరగడం విశేషం. వీరిలో రాఘవ్ చద్దా (ఆప్–4.2 లక్షల యూజర్లు), శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ– 2.7 లక్షలు), రేవంత్ రెడ్డి (కాంగ్రెస్– 2.05 లక్షలు) వంటి నేతలు ప్రధానంగా ఉన్నారు. పారీ్టలపరంగా ప్రస్తుతం యూట్యూబ్‌లో ఆమ్ ఆద్మీ పారీ్టదే హవా! ఏకంగా 63.4 లక్షల సబ్స్రయిబర్లతో ఆప్ దేశంలోనే టాప్‌లో ఉంది. బీజేపీకి 59.1 లక్షల మంది యూజర్లుండగా కాంగ్రెస్ సబ్ర్స్కయిబర్ల సంఖ్య 48 లక్షలు.ఫేస్బుక్ టు యూట్యూబ్.. వయా వాట్సాప్! 2019 ఎన్నికల్లో డిజిటల్ ప్రచారానికి వాట్సాప్ ప్రధాన వేదికైంది. అదే సమయంలో నిజానిజాలతో పనిలేకుండా ఫేక్ న్యూస్ పెరిగిపోవడానికి కూడా ఇది కారణమైంది. వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయ్యే సమాచార ప్రామాణికతను చెక్ చేసే యంత్రాంగం లేకపోవడం ఈ మాధ్యమంపై బాగా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ప్రతికూలత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వార్డ్‌లను 5 యూజర్లకు పరిమితం చేయడం కూడా ఈ ప్లాట్‌ఫాం వినియోగానికి బ్రేక్ వేసిందనే చెప్పాలి. పైగా వాట్సాప్ ఫార్వార్డ్లు లేనిపోని సమస్యలు తెచి్చపెడుతుండటంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో యూట్యూబ్ కీలక ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించిందని కంటెంట్ రీసెర్చర్ విజేత దహియా చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో యూట్యూబ్‌కు 50 కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లుండటం కూడా దీనికి ఊతమిస్తోంది. రాజకీయ విశ్లేషకులు, ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే విమర్శకులతో పాటు పారీ్టలు కూడా ఏడాదిగా యూట్యూబ్‌లో జోరు పెంచాయి. యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని చెక్ చెసే యంత్రాంగం సమర్థంగా పని చేస్తుండటం కూడా పార్టీలు, నేతలు దీనికి అధిక ప్రాధాన్యమిచ్చేందుకు మరో కారణంగా నిలుస్తోంది. లైవ్ స్ట్రీమ్‌లను, ర్యాలీ వీడియోలను, ఇంటర్వ్యూలను యూజర్లకు చేరువ చేసేందుకు చాలామంది నేతలు తమ సొంత యూట్యూబ్ ఛానెల్స్‌ను ప్రారంభించారు. అంతేగాక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు, పాడ్కాస్టర్ల సహకారంతో నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారని రాజకీయ వ్యూహకర్త, డిస్కోర్స్ కన్సలి్టంగ్ సహ వ్యవస్థాపకుడు తల్హా రషీద్ పేర్కొన్నారు. ‘‘దశాబ్దకాలంగా సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టల సోషల్ ట్రెండ్ రకరకాలుగా మారుతోంది. 2014లో ఫేస్బుక్ పేజీలను, ఈవెంట్లను పారీ్టలు బాగా వాడుకున్నాయి. ఆ ఎన్నిలకప్పుడు పోలింగ్ రోజున ఫేస్బుక్ అలర్టులు సైతం అందించింది’’ అని ఆయన గుర్తు చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మరోసారి ఫ్యాన్ సునామీ
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత (పాజిటివ్) పోటెత్తింది. ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు భారీ ఎత్తున కదలివచ్చారు. సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లే కనిపించారు. వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కొన్ని కేంద్రాల్లో రాత్రి పది గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తమ్మీద గత ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ పోలింగ్ నమోదు 80 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎండల ప్రభావం తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి దోహదం చేసింది.నిర్దేశించేది మహిళలు, గ్రామీణ ఓటర్లే..పోలింగ్ సరళిపై ఇండియాటుడే ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సోమవారం రాత్రి టీవీలో చర్చ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను విస్తారంగా పర్యటించానని.. మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న సెఫాలజిస్ట్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే యాక్సి మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తా దీనిపై ఏకీభవించారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ఫలితాలను మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. రోడ్లు గురించి కాకుండా ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయన్నదే ప్రామాణికంగా తీసుకుని 80 శాతం మంది మహిళలు ఓటు వేస్తారని తెలిపారు.ఇంటింటి అభివృద్ధిని ప్రతిబింబించిన పోలింగ్ సరళి..నవరత్నాల పథకాలను గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు, సుపరిపాలనతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంటింటి అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికలను పెత్తందారులు – పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా బడుగు, బలహీన వర్గాలు భావించడం వల్లే భారీగా పోలింగ్ నమోదైందని పేర్కొంటున్నారు. -
జగన్ కోసం జనం సిద్ధం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం శనివారం సా.6 గంటలకు ముగిసింది. గత 59 నెలలుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా చేసిన మంచిని వివరిస్తూ.. అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో మరింత మంచి చేస్తానని హామీ ఇస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచారం నిర్వహించారు. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలంటూ ఆయన వినమ్రంగా చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘జగన్ కోసం సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 47 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో 2.50 లక్షల మంది బూత్ కన్వినర్, సభ్యుల బృందం నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో.. కోటి మందికిపైగా ప్రజలు స్వచ్ఛందంగా స్టార్ క్యాంపెయినర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మంచేమీ లేకపోవడంతో చెప్పుకునేందుకు ఏమీలేక చంద్రబాబు, పవన్.. సీఎం జగన్‌పై తిట్లు, శాపనార్థాలకు పరిమితమయ్యారు.కూటమి ప్రచార సభలు వెలవెల.. టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు.. బీజేపీతో 2 పార్టీలు జతకలిశాక ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభ జనంలేక వెలవెలబోయాయి. మూడు పారీ్టల కలయికను అవకాశవాదంగా జనం భావించడంవల్లే ఆదిలోనే ఆ పొత్తును తిరస్కరించారనడానికి తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట సభలే నిదర్శనమని అప్పట్లో రాజకీయ పరిశీలకులు చెప్పారు. ఇక ఎన్నికల షెడ్యూలు వెలువడ్డాక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి తరఫున చంద్రబాబు, పవన్ సంయుక్తంగా.. వేర్వేరుగా నిర్వహించిన ప్రచార సభలకు జనం నుంచి స్పందన లభించలేదు. ఇది బాబు, పవన్‌కు నిరాశ, నిస్పృహకు గురిచేసింది. దాంతో సీఎం జగన్‌పై బూతులు, శాపనార్థాలతో వారు విరుచుకుపడ్డారు. నీ అమ్మ మొగుడు.. నీ అమ్మమ్మ మొగుడు.. సీఎం జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ చంద్రబాబు తన స్థాయిని మరిచి, దిగజారి బూతులు అందుకుంటే.. పవన్‌కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ నేతలను తరిమితరిమి కొట్టండి అంటూ రంకెలేశారు. చివరకు.. సాక్షాత్తూ ప్రధాని మోదీని రప్పించి.. రాజమహేంద్రవరం, అనకాపల్లి, కలికిరిలలో నిర్వహించిన సభలకు, విజయవాడలో నిర్వహించిన రోడ్‌షోకు ఆశించినంత జనస్పందన లభించలేదు. కళ్ల ముందు ఘోర పరాజయం కన్పిస్తుండటంతో చంద్రబాబు, పవన్ తమ నోటికి మరింతగా పనిచెప్పారు. ప్రచారం ముగింపులో నంద్యాల సభలో సిగ్గెగ్గులు గాలికొదిలేసిన చంద్రబాబు.. సీఎంగా విశాఖపట్నంలో కాదు ‘ఇడుపుపాయలో మీ నాన్న సమాధి వద్ద ప్రమాణం స్వీకారం చెయ్.. శ్మశానంలో చెయ్’ అంటూ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడటంతో జనం విస్తుపోయారు. సిద్ధం.. సిద్ధం అంటూ హోరెత్తిన జనం.. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జనసంద్రాలను తలపించాయి. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమన్నది సిద్ధం సభల్లోనే వెల్లడైందని రాజకీయ పరిశీలకులు అంచనాకొచ్చారు. ఎన్నికల తొలివిడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మార్చి 27న ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో ప్రారంభించిన బస్సుయాత్ర ఏప్రిల్ 24న టెక్కలి సమీపంలో ముగించారు. మొత్తం 22 రోజులు.. 23 జిల్లాలు.. 106 నియోజకవర్గాల్లో సాగిన ఈ యాత్రలో 16 చోట్ల జగన్ నిర్వహించిన బహిరంగ సభలు ‘సిద్ధం’ సభలను తలపించాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో నిర్వహించిన రోడ్ షోలకైతే లక్షలాది మంది జనం బస్సుయాత్ర వెంట పరుగులు పెడుతూ.. మంచిచేసిన మిమ్మల్ని గెలిపించే పూచీ మాది అంటూ భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడు అధికారంలోకి వస్తే నాయకులు హామీలు ఇవ్వడం సాధారణం. కానీ.. బస్సు యాత్రలో తద్భిన్నంగా మంచి చేసిన మిమ్మల్ని గెలిపించి.. సీఎంగా చేసుకునే పూచీ మాది అంటూ జనం సీఎం జగన్‌కు భరోసా ఇవ్వడాన్ని రాజకీయాల్లో అపూర్వ ఘట్టంగా పరిశీలకులు అభివరి్ణస్తున్నారు. ఇలా బస్సుయాత్రతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా vముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చేశారు. -
Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోనున్నాయి. మే 13న జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. పోలింగ్ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే‹Ùకుమార్‌మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది.చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే సవరించబడుతుంది. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.ఏజెంట్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను రిటరి్నంగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు. -
పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి నెట్వర్క్: ఓటమి భయం వెంటాడుతుండటంతో టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు హాజరయ్యే ఉద్యోగులను ప్రలోభపెట్టేలా.. ఎన్నికల నియమావళి యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అకృత్యాలకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది.వివిధ ప్రాంతాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాలకు పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాగా.. వారిని సామ, దాన, దండోపాయాలతో లోబర్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే నగదు పంపిణీ చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పచ్చదండు దాడులకు యత్నించింది. టీడీపీ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసిన వారితో ఉద్యోగులకు ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు. కొన్నిచోట్ల పోలింగ్ అధికారులను, పోలీసులను సైతం బెదిరించారు.విశాఖలో ఇలా..సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఏయూ తెలుగు, ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో చేపట్టారు. పోలింగ్ కేంద్రం ఎదురుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు అనుచరులు హల్చల్ చేశారు. వెలగపూడి అనుచరుడు కాళ్ల శంకర్, టీడీపీ నాయకుడు పోతన్న రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొట్ట వెంకట రమణ అక్కడే ఉండి ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేశారు. వెలగపూడికి చెందిన రెండు ప్రచార వాహనాలు ఏయూ ఇన్‌గేట్, అవుట్ గేట్ మధ్యలో భారీ శబ్ధంతో కూడిన మైక్‌లను పెట్టుకుని అటూఇటూ తిరుగుతూ ప్రచారం చేశారు. కొంతమంది ఓటర్లకు డబ్బులు పంపిణీ, మరికొందరికి గూగుల్‌పే, ఫోన్ పే చేస్తూ ప్రలోభాలకు గురి చేశారు.చిత్తూరులోనూ ఇదే పద్ధతితిరుపతిలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం పేరుతో టీడీపీ నేతలు హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు అత్యంత సమీపంలోనే కొందరు ఓటర్లకు బలవంతంగా నగదు పంపిణీకి యత్నించారు. ఎన్నికల అధికారులను, పోలీసుల హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్కచేయలేదు. ఉద్యోగ సంఘ మాజీ నేతలు కొందరు ప్రలోభాల పర్వానికి సహకరించారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ ప్రచార వాహనాలు యథేచ్ఛగా తిరిగినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు.చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేశారు. పుంగనూరులో ఓటర్లను బెదిరించారు. పూతలపట్టులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. పలమనేరులోని ఓ హోటల్లో ఉద్యోగులకు విందు ఏర్పాటు చేశారు. నగరిలో ఉపాధ్యాయులకు యూనియన్ మాజీ నేతల ద్వారా ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు.పులివెందులలో అధికారికి బెదిరింపువైఎస్సార్ జిల్లా పులివెందులలో పోలింగ్ ట్రైనింగ్ అధికారి సంగం మహేశ్వరరెడ్డిపై టీడీపీ నాయకులు అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి, దర్బార్‌బాషా, అంజుగట్టు రవితేజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఆయనను దుర్భాషలాడుతూ బయటకు నెట్టివేశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. టీడీపీ నాయకులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగకుండా ఇలాంటి వివాదాలకు పాల్పడుతున్నట్టు అవగతమవుతోంది.బద్వేలులోని జెడ్పీ హైస్కూల్లోని ఫెసిలిటేషన్ సెంటర్‌కు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో తిష్టవేసిన టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీచేశారు. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు షేక్‌హుస్సేన్ ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు.తిరుపతిలో తాయిలాల ఎరతిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద టీడీపీ, జనసేన అభ్యర్థులు హల్చల్ చేశారు. ముందురోజు రాత్రే కొందరు ఉద్యోగులకు తాయిలాల ఎర చూపారు. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సెంటర్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ హడావుడి చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన ఆయనను పోలీసు అధికారులు ప్రశ్నించడంతో సుధీర్ మీ అంతు చూస్తా అంటూ బూతు పురాణం అందుకున్నారు.గుంటూరులో తికమకపెట్టేలా..గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగులను తికమకపెట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలు పోస్టింగ్‌లు పెట్టారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. అధికారుల మధ్య సమన్వయలోపం, అవగాహన రాహిత్యం బట్టబయలయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి కార్యాలయం నుంచి బ్యాలెట్ ఓటింగ్ వద్ద గొడవ జరుగుతోందని, రెచ్చగొట్టే విధంగా మెసేజ్‌లు పెట్టారు. -
ప్రశాంత ఎన్నికలకు ‘పోలీస్’ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ సన్నద్ధమవుతున్నది. ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్గదర్శకాలను పాటిస్తూ కార్యాచరణను ఖరారు చేసింది. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే 14,141 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు పోలీస్ శాఖ గుర్తించింది. ప్రస్తుతం.. 46,165 పోలింగ్ కేంద్రాలు.. మరో 887 కేంద్రాలకు ప్రతిపాదనలు.. 2024 సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే 46,165 పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. అదనంగా మరో 887 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రతిపాదనలను పంపారు. దీనిపై ఈసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే 14,141 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రానికి చెందిన 1,14,950మంది సివిల్ పోలీసులు, 52 కంపెనీల రాష్ట్ర సాయుధ బలగాలతోపాటు అదనంగా 491 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను నియోగించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో భద్రతా విధుల్లో నియోగించాలని నిర్ణయించారు. ఇక 14,141 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్‌ను నిశితంగా పర్యవేక్షిస్తారు. ఇక ఒక మైక్రో అబ్జర్వర్‌ను ఆ పోలింగ్ కేంద్రాల్లో ఒక మైక్రో అబ్జర్వర్‌ను కూడా నియమించాలని ఈసీ నిర్ణయించింది. ఆ పోలింగ్ కేంద్రాల పరిధిలో రాష్ట్ర పోలీసు, కేంద్ర సాయుధ బలగాలు క్రమం తప్పకుండా తరచూ కవాతు నిర్వహిస్తాయి. ఆ పరిధిలో పెండింగ్ నాన్‌బెయిలబుల్ వారంట్లను త్వరితగతిన జారీ చేయాలని ఇప్పటికే ఆదేశించింది. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్నవారి కదలికలపై నిఘాను పటిష్టపరిచారు. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఎప్పటికప్పుడు బందోబస్తు, నిఘా చర్యలను పర్యవేక్షిస్తూ ఎన్నికల ప్రధాన అధికారికి నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.జైళ్లలోనూ నిఘా పటిష్టం.. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లోని జైళ్లను తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. జైళ్ల మాన్యువల్ సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఇక గతంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం జైళ్లలో ఉన్న ఖైదీలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇప్పటికే అటువంటి ఖైదీలకు ములాఖత్‌లు రద్దు చేశారు. ఎన్నికలు ముగిసేవరకు ఖైదీలను ఒక జైలు నుంచి మరో జైలుకు తరలించకూడదని నిర్ణయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఉంటే తప్పా ఖైదీలను ఇతర జైళ్లకు తరలించ వద్దని ఆదేశించారు. -
నవతరం కదలాలి.. పోలింగ్ పెరగాలి...
యువతరమే ముందు యుగం దూతలు..పావన నవజీవన, బృందావన నిర్మాతలు... అని శ్రీశ్రీ ఒక పాటలో అభివర్మించారు.. వారు తల్చుకుంటే సమాజాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలరని కొనియాడారు. అది నూరు శాతం వాస్తవం. ముఖ్యంగా ఎన్నికల్లో వారి పాత్ర కీలకం... యువత ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి రావాలే కానీ రాజకీయ తీరుతెన్నులే మారిపోతాయి. సంక్షేమానికి పట్టం కడుతున్నదెవరో, ఓట్ల కోసం మేనిఫెస్టోలనే బుట్టదాఖలు చేస్తున్నదెవరో యువత ఇట్టే గ్రహిస్తుంది.అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే తపన పడేదెవరో– ఆ వర్గాల వంచకులెవరో గుర్తించే శక్తియుక్తులు వారికే ఉన్నాయి...దేశంలో ఈ సారి తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్న యువత 1.85 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే మొత్తం ఓటర్లలో 20 శాతం 30 ఏళ్లలోపు యువతే ఉంది...ఎన్నికల సంఘం ఈ యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20 శాతం మంది 30 ఏళ్లలోపే ఉన్నారు.18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే అందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18–19 ఏళ్ల వారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియచేసే విధంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రెటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వయోవృద్ధులకు ఇంటి వద్దే.. రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు.దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండటంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 83 శాతం దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
యూపీఏకు ప్రజామోదం
2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారమంతా లౌకికవాదం, ఉగ్రవాదం, మతతత్వం చుట్టూ తిరిగింది. ఐదేళ్లలో అభివృద్ధిని కాంగ్రెస్ ప్రధానంగా నమ్ముకుంది. ఉద్యోగావకాశాల కల్పన, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలను ప్రజలకు గుర్తు చేసింది. మత, భాష, ప్రాంతీయ వాదం, కుల వాదాలకు తాము వ్యతిరేకమంటూ ప్రచారం చేసింది. యూపీఏ హయాంలో ఉగ్రవాదం పెచ్చు మీరిందని బీజేపీ ఎంతగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదు. మరోవిడత యూపీఏనే ఆశీర్వదించారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2009లో 15వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుంచి మే 13 దాకా ఐదు దశల్లో జరిగాయి. 2004లో జనం తన పాలనను తిరస్కరించడంతో నొచ్చుకున్న వాజ్‌పేయి ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. దాంతో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎల్కే అద్వానీ తెరపైకి వచ్చారు. కానీ ఆయన పట్ల పలు ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా లేవు. యూపీఏలోనూ కాస్త అనిశ్చితి నెలకొంది.మళ్లీ గెలిస్తే రాహుల్‌ను ప్రధాని చేస్తారన్న ప్రచారం సాగినా మన్మోహనే కొనసాగుతారని సోనియా స్పష్టం చేశారు. ఎన్నికలకు 5 నెలల ముందు ముంబై ఉగ్ర దాడి 170 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో దేనికీ మెజారిటీ రాకపోవచ్చని అంతా అంచనా వేశారు. కాంగ్రెస్ బలం 145 నుంచి 206 ఎంపీలకు పెరిగింది. బీజేపీ 22 స్థానాలు కోల్పోయి 116కు పరిమితమైంది. యూపీఏకు 261 స్థానాలు దక్కాయి. మిత్రపక్షాల సాయంతో మొత్తం 322 మంది ఎంపీల మద్దతుతో మన్మోహన్ మరోసారి ప్రధాని అయ్యారు. కాంగ్రెస్‌కు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 33 స్థానాలు లభించాయి! సీపీఎం సారథ్యంలోని థర్డ్ ఫ్రంట్‌కు 78 సీట్లొచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ఆధారంగా 2008లో లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగింది. ఇది కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందంటారు. 499 స్థానాల స్వరూపం మారింది. ఆ మేరకు ఓటర్ల జాబితాల్లోనూ మార్పుచేర్పులు చేయాల్సి వచ్చింది. కుంభకోణాలతో అప్రతిష్ట యూపీఏ పాలనలో అతి పెద్ద కుంభకోణాలు వెలుగు చూశాయి. 2జీ స్కాం వీటిలో ముఖ్యమైనది. డీఎంకే నేత ఎ.రాజా టెలికం మంత్రిగా ఉండగా 2008లో 122 కొత్త టెలికం లైసెన్స్‌లు జారీ చేశారు. అనుభవం లేని కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. దాంతో ఖజానాకు ఏకంగా రూ.1.76 లక్షల కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. 2004–11 మధ్య 194 బొగ్గు గనులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల మరో రూ.1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు తేల్చింది! విశేషాలు 2009 సార్వత్రిక ఎన్నికలు ఇద్దరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల సారథ్యంలో జరగడం విశేషం! ఏప్రిల్ 20న తొలి దశ పోలింగ్ ఎన్.గోపాల స్వామి ఆ«ధ్వర్యంలో, మిగతా దశలు నవీన్ చావ్లా పర్యవేక్షణలో జరిగాయి. వీరి విభేదాలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ 20న రిటైరైన గోపాలస్వామి, ఆలోగా ఒక విడత పోలింగైనా నిర్వహించాలని భావించారు. దాన్ని ఎన్నికల కమిషనర్‌గా చావ్లా వ్యతిరేకించడం, ఆయన్ను తొలగించాలంటూ రాష్ట్రపతికి గోపాలస్వామి సిఫార్సు చేయడం కలకలం రేపింది. ► 2009 ఎన్నికల్లో ఏకంగా 114 మంది అభ్యర్థులు కేవలం 3 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ►యూపీఏ తొలి ఐదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 9.8 శాతంతో ఆల్‌టైం గరిష్టానికి చేరింది. ► 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని యూపీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది. ఫొటో ఓటర్ జాబితాలు ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ల స్టాంప్ సైజు ఫొటోలతో జాబితాలను ప్రవేశపెట్టింది. దాంతో 2009 లోక్‌సభ ఎన్నికలను ఫొటో ఓటర్ల జాబితాలతో జరిగాయి. అప్పటిదాకా వాటిపై కేవలం పేర్లే ఉండేవి. అయితే అసోం, నాగాలాండ్, జమ్మూ కశీ్మర్లో మాత్రం ఫొటోల్లేని జాబితాలనే ఉపయోగించారు. 15వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) పార్టీ స్థానాలు కాంగ్రెస్ - 206 బీజేపీ - 116 ఎస్పీ - 23 బీఎస్పీ - 21 జేడీయూ - 20 టీఎంసీ - 19 డీఎంకే - 18 బిజూ జనతాదళ్ - 14 శివసేన - 11 ఇతరులు - 86 స్వతంత్రులు - 9 -
ఈవీఎం వివాదం చల్లారేనా!
సార్వత్రిక ఎన్నికల రెండో దశ కూడా పూర్తికావస్తుండగా శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వినియోగంపై వచ్చిన వ్యాజ్యాలను తోసిపుచ్చింది. విపక్షాలను విమర్శించటానికీ, ఆరోప ణలు సంధించటానికీ వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోని ప్రధాని నరేంద్ర మోదీ... ఇంకా అయిదు దశల పోలింగ్ జరగాల్సిన తరుణంలో మౌనంగా ఎందుకుంటారు? అందుకే కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టన్నారు. ఈవీఎంలపై సందేహాలు రేకెత్తించిన పాపానికి క్షమాపణలు చెప్పాలని కూడా మోదీ డిమాండ్ చేశారు. దేన్నయినా సందేహించటం దానికదే పాపం కాదు. పాపమే అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ సహా దాదాపు అందరికందరూ ఆ పాపం చేసినవారే. ఒకటి రెండు పార్టీలు మినహాయిస్తే పరాజితుల ప్రథమ కోపం ఎప్పుడూ ఈవీఎంలపైనే. వరసగా 2004, 2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు బీజేపీ ఈవీఎంలనే తప్పుబట్టింది. 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది. హ్యాకర్ల ద్వారా ఈవీఎంల సోర్స్ కోడ్ మార్చి అకాలీదళ్ తమ విజయాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఇక యూటర్న్ల సిద్ధ హస్తుడైన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకైతే ఇలాంటి ఆరోపణలు మంచినీళ్లప్రాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు ఈవీఎంలపైనే ఆయన ఆగ్రహం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినప్పుడు మాత్రం చప్పుడు చేయలేదు. మళ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాక ఈవీఎంలపై వీరంగం వేశారు. మధ్యలో ఈవీఎంలు దొంగిలించిన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి వాటిని తారుమారు చేయొచ్చని చూపించే ప్రయత్నం చేసింది కూడా చంద్రబాబే. మళ్లీ ఎన్డీఏ పంచన చేరినందువల్ల ఈవీఎంల వివాదంపై ఇప్పుడాయన కిక్కురుమనటం లేదు. ఇతరుల మాటెలావున్నా ప్రస్తుతం ఈవీఎంల వినియోగాన్ని సవాలు చేసిన సంస్థల్లో విశ్వసనీయతగల అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ కూడా వుంది. కనుక ఈవీఎంలను సందేహించటం స్వప్రయోజనాల కోసమేనని భావించలేం. అదో పెద్ద నేరంగా పరిగ ణించలేం. అలాగని పేపర్ బ్యాలెట్ విధానం సవ్యంగా సాగిందా? పోలింగ్ బూత్‌లు చేజిక్కించు కుని, బ్యాలెట్ పేపర్లు గుంజుకుని తమ గుర్తుపై ముద్రలు వేసుకుని పెత్తందారులు చెలరేగిపోలేదా? రిగ్గింగ్ ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు రీపోలింగ్ జరపక తప్పలేదు! ఈవీఎంల వల్ల ఈ జాడ్యం ఎంతో కొంత కట్టడి అయింది. నిమిషానికి కేవలం అయిదు ఓట్లు మాత్రమే వాటిల్లో నమో దయ్యే అవకాశం వుండటం వల్ల పోలింగ్ కేంద్రాలు ఆక్రమించిన దుండగులకు గతంలోని వెసులు బాటు పోయింది.వెనువెంటనే బలగాలు ఆ పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవ కాశం వుండటం వల్ల వారి ఆటలు సాగటం లేదు. 1982లో తొలిసారి ఈవీఎంలతో కేరళలో ఒక ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే తగిన చట్టం లేకుండా ఈవీఎంల వినియోగం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసింది. 1998లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కేవలం కొన్ని నియోజక వర్గాల్లో 45 ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈవీఎంలపై తరచు ఫిర్యాదులు వస్తున్నందువల్ల వాటికి ప్రింటర్లను అనుసంధానించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరిమితంగా దాన్ని అమలు చేసినా... ఆ తర్వాత కాలంలో వీవీ ప్యాట్ల పూర్తిస్థాయి వినియోగం మొదలైంది. ఓటరు తనకు నచ్చిన గుర్తుకు ఓటేసిన వెంటనే ప్రింటర్‌పై ఆ పార్టీ పేరు, గుర్తు ఏడు సెకన్లపాటు కనబడే ఏర్పాటుచేశారు. ఆ వెంటనే ఒక స్లిప్పై అది ప్రింటయి దానికి అనుసంధానించిన బాక్స్‌లో పడుతుంది. పోలింగ్ సమయంలోనైనా, కౌంటింగ్ సమయంలోనైనా ఈవీఎంలను దేనితోనూ అనుసంధానించటం సాధ్యంకాదని... రిమోట్ కంట్రోల్, బ్లూటూత్, వైఫైలతో నియంత్రించటం కూడా అసాధ్యమని ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన బెంగళూరు బెల్, హైదరాబాద్ ఈసీఐఎల్ వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. పోలింగ్‌కు ముందు ఈవీఎంల తనిఖీకి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. చిత్రమేమంటే ఈ ప్రక్రియపై ఓటర్లనుంచి ఎప్పుడూ ఫిర్యాదులు లేవు. ఇప్పుడు మళ్లీ బ్యాలెట్ పేపర్‌కు మళ్లాలన్న వినతిని తోసిపుచ్చటంతోపాటు వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లే తీసుకునేలా, పరిశీలించుకున్నాక వారే బ్యాలెట్ బాక్స్‌లో వేసేలా చూడాలన్న కోరికను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈవీఎంల ద్వారా వెల్లడయ్యే ఓట్ల సంఖ్యనూ, వీవీప్యాట్ స్లిప్‌లనూ లెక్కించి రెండూ సరిపోలినప్పుడే ఫలితం ప్రకటించాలన్న పిటిషనర్ల వినతిని కూడా తిరస్కరించింది. అయితే పార్టీల గుర్తులను కంప్యూటర్ ద్వారా ఈవీఎంలలో లోడ్ చేయటానికి ఉప యోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను ఎన్నికల పిటిషన్లు పడిన సందర్భాల్లో పరిశీలించేందుకు అనువుగా 45 రోజులు భద్రపరచాలని ఆదేశించింది. అంటే ఇకపై ఈవీఎంలతో పాటు ఎస్ఎల్యూలు కూడా సీల్ చేసివుంచటం తప్పనిసరి. అలాగే రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఫిర్యాదుచేస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ 5 శాతం ఈవీఎంలనూ, ఎస్ఎల్యూలనూ ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చు. అయితే ఫలితాలొచ్చిన ఏడు రోజుల్లో ఫిర్యాదులు చేయాలి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్‌లు లెక్కించే యంత్రాలు సమకూర్చుకునే ఆలోచన చేయాలని ఈసీని కోరింది. ఏదేమైనా బాహాటంగా బయట పడిన సంద ర్భాలుంటే తప్ప ఈవీఎంలపై అనవసర రాద్ధాంతానికి ముగింపు పలకటం అవసరం. ఇందుకు బదులు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవటం ఎలా అన్న అంశంపై పార్టీలు దృష్టి సారించాలి. -
విదేశీ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్ ఫైర్
విదేశీ మీడియాపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. సరైన సమాచారం లేకుండా భారత దేశంపై విదేశీ మీడియా విషం చిమ్ముతోందని మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం లేని పాశ్చాత్య మీడియా విమర్శలతో రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. మంగళారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ పలు అంశాలుపై మాట్లాడారు. ‘విదేశీ మీడియా భారత ప్రజాస్వామాన్ని హేళన చేస్తోంది. వారికి మన దేశానికి సంబంధించి సరైన సమాచారం లేదు. ఎందుకుంటే వారు కూడా మన దేశ ఎన్నికల్లో రాజకీయలు, జోక్యం చేసుకోవాలని యోచిస్తున్నారు. విదేశీ మీడియాలో పలు కథనాలు చదివారు. భారత్‌లో ప్రస్తుతం అత్యధిక వేడిగా ఉంది. ఈ సమయంలో భారత్ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తోంది ?అని రాస్తున్నారు. అయినా పాశ్చాత్య దేశాల్లో ఓటింగ్ శాతం కంటే భారత్‌లో ఓటింగ్ శాతం ఎక్కువ...మన దేశంలోని రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ రాజకియాలు.. ప్రస్తుతం భారత్‌లోకి చొరబడాలని భావిస్తున్నాయి. విదేశీ మీడియా మన ఎన్నికల వ్యవస్థలో భాగమని భావిస్తోంది. కానీ పాశ్చాత్య మీడియా ఆలోచనలకు చెక్ పెట్లాల్సిన సమయం వచ్చింది. విదేశీ మీడియా కథనాలకు తిప్పికొట్టాలి. మన ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘంపై విదేశీ మీడియా విమర్శలు చేస్తోంది’ అని జైశంకర్ అన్నారు. -
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మొదటి దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 19న (శుక్రవారం) ప్రారంభం కానున్న లోక్‌సభ ఎలక్షన్స్ 21 రాష్ట్రాల్లో మొత్తం 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో (ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు) జరగనున్నాయి. జూన్ 4న వెలువడే ఫలితాలు దేశ ప్రధానిని నిర్ణయిస్తాయి. ఏప్రిల్ 19న ఓటింగ్ జరిగే నియోజకవర్గాల రాష్ట్రాల వారీగా జాబితా: అరుణాచల్ ప్రదేశ్ 1. అరుణాచల్ వెస్ట్ 2. అరుణాచల్ తూర్పు అస్సాం 1. కాజిరంగ 2. సోనిత్పూర్ 3. లఖింపూర్ 4. దిబ్రూగర్ 5. జోర్హాట్ బీహార్ 1. ఔరంగాబాద్ 2. గయా 3. 39 నవాడ 4. జాముయి ఛత్తీస్‌గఢ్ 1. బస్తర్ మధ్యప్రదేశ్ 1. సిద్ధి 2. 12 షాహదోల్ 3. 13 జబల్పూర్ 4. 14 మండల 5. 15 బాలాఘాట్ 6. చింద్వారా మహారాష్ట్ర 1. రామ్‌టెక్ 2. నాగ్‌పూర్ 3. భండారా - గోండియా 4. గడ్చిరోలి - చిమూర్ 5. చంద్రపూర్ మణిపూర్ 1. ఇన్నర్ మణిపూర్ 2. ఔటర్ మణిపూర్ మేఘాలయ 1. షిల్లాంగ్ 2. తురా మిజోరం 1.మిజోరం నాగాలాండ్ 1. నాగాలాండ్ రాజస్థాన్ 1. గంగానగర్ 2. బికనీర్ 3. చురు 4. ఝుంఝును 5. సికర్ 6. జైపూర్ రూరల్ 7. జైపూర్ 8. అల్వార్ 9. భరత్పూర్ 10. కరౌలి-ధోల్పూర్ 11. దౌసా 12. నాగౌర్ సిక్కిం 1. సిక్కిం తమిళనాడు 1. తిరువళ్లూరు 2. చెన్నై నార్త్ 3. చెన్నై సౌత్ 4. చెన్నై సెంట్రల్ 5. శ్రీపెరంబుదూర్ 6. కాంచీపురం 7. అరక్కోణం 8. వెల్లూరు 9. కృష్ణగిరి 10. ధర్మపురి 11. తిరువణ్ణామలై 12. అరణి 13. విలుప్పురం 14. కళ్లకురిచ్చి 15. సేలం 16. నమక్కల్ 17. ఈరోడ్ 18. తిరుప్పూర్ 19. నీలగిరి 20. కోయంబత్తూరు 21. పొల్లాచ్చి 22. దిండిగల్ 23. కరూర్ 24. తిరుచిరాపల్లి 25. పెరంబలూరు 26. కడలూరు 27. చిదంబరం 28. మయిలాడుతురై 29. నాగపట్టణం 30. తంజావూరు 31. శివగంగ 32. మధురై 33. తేని 34. విరుదునగర్ 35. రామనాథపురం 36. తూత్తుక్కుడి 37. తెన్కాసి 38. తిరునెల్వేలి 39. కన్నియాకుమారి త్రిపుర 1. త్రిపుర వెస్ట్ ఉత్తరప్రదేశ్ 1. సహరన్పూర్ 2. కైరానా 3. ముజఫర్‌నగర్ 4. బిజ్నోర్ 5. నగీనా 6. మొరాదాబాద్ 7. రాంపూర్ 8. పిలిభిత్ ఉత్తరాఖండ్ 1. తెహ్రీ గర్వాల్ 2. గర్వాల్ 3. అల్మోరా 4. నైనిటాల్-ఉధంసింగ్ నగర్ 5. హార్డ్వార్ పశ్చిమ బెంగాల్ 1. కూచ్‌బెహర్ 2. అలీపుర్దువార్స్ 3. జల్పాయ్ గురి అండమాన్ అండ్ నికోబార్ 1.అండమాన్ అండ్ నికోబార్ దీవులు జమ్మూ అండ్ కాశ్మీర్ 1. ఉదంపూర్ లక్షద్వీప్ 1. లక్షద్వీప్ పుదుచ్చేరి 1. పుదుచ్చేరి -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
-
నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ.. ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రధాని మోదీ సినిమా ఫ్లాప్.. కల్యాణ్ బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారని కానీ సినిమా అంతా ఫ్లాప్ అయిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర కేటాయిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రచారం పేరుతో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో మాకు జాబితా అందించండి. 2014 నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. గత పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన ఒక నకిలీ నటుడు. ప్రజలు నకిలీ నటుడు మోదీకి, బీజేపీ ఓటు వేయొద్దు. ప్రధాని మోదీ ట్రైలర్లో ఫెయిల్ అయ్యారు. సినిమా కూడా సక్సెస్ కాబోదు. మోదీ ఇక గుజరాత్ వెళ్లిపోతారు. మార్కెట్లో మోదీ సినిమా ఎక్కవ కాలం పని చేయదు. విదేశాలకు వెళ్లి కరచాలనాలు చేసే నకిలీ నటుడికి ప్రజలు అస్సలు ఓటువేయొద్దు’ అని ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఇక.. జనవరిలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారీగా ఎంపీలను సస్పెండ్ చేసిన విషయంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మణ్ జగదీప్ ధన్‌ఖడ్ తీరును ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
హెలికాఫ్టర్‌లో బయలుదేరిన పోలింగ్ సిబ్బంది.. వీడియో వైరల్
బీజాపూర్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జాతీయ పార్టీలు మాత్రమే కాకుండా.. ప్రాంతీయ పార్టీలు సైతం విజయమే ప్రధానంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ తరుణంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. దేశం మొత్తం మీద ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ప్రారంభంలో మొదటి దశలో చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది హెలికాఫ్టర్లలో పయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవితున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు MI-17 ఛాపర్లను ఉపయోగించి పోలింగ్ బృందాలు బయలుదేరాయి. శాంతియుతంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి ఎన్నికల అధికారులకు, ఓటర్లకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే, ఎస్పీ జితేంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. ఎన్నికలు జరగటానికి మూడు రోజులు ముందుగానే పోలింగ్ సిబ్బందిని.. పోలింగ్ జరిగే ప్రాంతాలకు పంపడం ప్రారంభిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే పేర్కొన్నారు. ఇవన్నీ ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మెడకు జరుగుతాయని ఆయన అన్నారు. నేటి నుంచి పోలింగ్ అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.. ఎన్నికల అధికారులందరికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM), అవసరమైన అన్ని పరికరాలను సంబంధిత అధికారులకు అందించారు. చత్తీస్ఘఢ్లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. అయితే ఏప్రిల్ 19వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరగున్నాయి. రెండు, మూడో దశల్లో మిగిలిన నియోజక వర్గాల్లో జరుగుతాయి. #WATCH | Chhattisgarh: Ahead of Lok Sabha elections, polling teams leave by helicopter to Naxal-hit areas, in Narayanpur 11 Lok Sabha seats in Chhattisgarh will go to polls in three phases on April 19, April 26 and May 7. Bastar will be the only seat to go to polls in the first… pic.twitter.com/bxQYMuwbVx — ANI (@ANI) April 16, 2024 -
జైలు నుంచే పాలన.. వారానికి ఇద్దరు మంత్రులతో కేజ్రీవాల్ సమీక్ష
ఢిల్లీ: మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతి వారం ఇద్దరు మంత్రులతో సమావేశమై వారి శాఖల పనుల పురోగతిని సమీక్షిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 'సందీప్ పాఠక్' రాబోయే రోజుల్లో వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. వచ్చే వారం నుంచి ముఖ్యమంత్రి ప్రతి వారం ఇద్దరు మంత్రులను జైలుకు పిలుస్తారని.. అక్కడే వారి శాఖల పనిని సమీక్షించి వారికి మార్గదర్శకాలు, ఆదేశాలు ఇస్తారని పాఠక్ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతించిన సందర్శకుల జాబితాలో మంత్రులు అతిషి, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్ ఉన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకోవాలని కేజ్రీవాల్ కోరారని పాఠక్ చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా ఎమ్మెల్యేలు పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఎమ్మెల్యేలు మునుపటి కంటే రెట్టింపు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని కేజ్రీవాల్ పేర్కొన్నట్లు.. పాఠక్ వెల్లడించారు. -
అనిల్ ఆంటోని గెలుపు సాధ్యమేనా.. బీజేపీ వ్యూహం అదేనా?
తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరిన 'అనిల్ కె ఆంటోనీ' కూడా ప్రజలవద్దకు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని గతంలోనే పేర్కొన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం రక్షణ మంత్రిగా ఉన్న ఎకె ఆంటోనీ వల్ల అనిల్ కే ఆంటోనీ గొప్ప ఇమేజ్ లభించింది. ఇమేజ్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తాడని నమ్మకం లేదని పలువురు భావిస్తున్నారు. అభివృద్ధి కోసం ఎదురుచూసే యువతను తనవైపు తిప్పుకోవడంతో పాటు, ప్రత్యర్థుల ప్రతికూల అంశాలను ఉపయోగించుకుని గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, అనిల్‌ను తక్కువ అంచనా వేయకూడదని పతనంతిట్టలో కొందరు భావిస్తున్నారు. కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. అంతేకాకుండా 2019లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదం కారణంగా బీజేపీ ఓట్ల శాతం అంతకు ముందుకంటే రెండు రెట్లు పెరిగింది. ఏకే ఆంటోనీ పలుకుబడిని ఉపయోగించుకుని సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ నియామకానికి అనిల్ మధ్యవర్తి నుంచి లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఊపందుకున్న సమయంలో.. తన తండ్రి లాంటి చాలా మంది కాంగ్రెస్ నేతలు కాలం చెల్లిపోయి కుక్కల్లా ఉన్నారని అనిల్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు సంచనలం రేపాయి. పతనంతిట్టలో క్రైస్తవుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో క్రైస్తవులలో గణనీయమైన ప్రభావం ఉన్న జోస్ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ ఇప్పుడు సీపీఎం సంకీర్ణ భాగస్వామిగా ఉన్నందున సీపీఎం కూడా ఈసారి క్రైస్తవ ఓటు బ్యాంకుల్లోకి రావాలని భావిస్తోంది. -
తమిళనాడును అవే తీవ్రంగా దెబ్బతీశాయి.. జైరాం రమేష్
కోయంబత్తూర్‌లో జరిగిన ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరాం రమేష్' బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) భారతదేశంలో ఉద్యోగ సృష్టికర్తలని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి చెందిందని.. 10 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండేవని జైరాం రమేష్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నోట్ల రద్దు, జీఎస్టీ, సరైన ప్రణాళిక లేని కోవిడ్ లాక్డౌన్ వంటివి రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు. తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక దాదాపు 1,000 చిన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వస్త్ర ఎగుమతులు రూ.30000 కోట్ల నుంచి రూ.26000 కోట్లకు పడిపోయాయని ఆయన అన్నారు. ఎంఎస్ఎంఈలకు ఎన్డీఏ ప్రభుత్వం వేసిన రెండో దెబ్బ జీఎస్టీ అని రమేష్ అన్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వాణిజ్య పరిమాణం బాగా తగ్గింది. 2017-18లో తిరుప్పూర్ నుంచి రూ. 16,000 కోట్ల మేరకు వస్త్ర ఎగుమతులు తగ్గాయి. మూడు లక్షల మంది కార్మికులకు ఆసరాగా నిలుస్తున్న శివకాశి బాణాసంచా పరిశ్రమలో ఉత్పత్తి 20 నుంచి 25 శాతం తగ్గిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. -
యూసీసీ అమలుపై 'పీయూష్ గోయల్' కీలక ప్రకటన
ముంబై: త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయడానికి దేశంలోని చిన్నా, పెద్దా.. పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ అగ్రనేతలు కూడా రంగంలోకి దూకారు. ఈ తరుణంలో ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్దమైన 'పీయూష్ గోయల్' కీలక ప్రకటనలు చేశారు. దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)అమలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను కూడా తోసిపుచ్చారు. యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారతదేశంలో పౌరుల కోసం వ్యక్తిగత చట్టాలను రూపొందించి అమలు చేయడానికి అవసరమైన ఒక ప్రతిపాదన. ఇది వారి మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తిస్తుంది. ప్రస్తుతం, వివిధ సంఘాల వ్యక్తిగత చట్టాలు వారి మత గ్రంథాలచే నిర్వహించబడుతున్నాయి. దేశంలో యూసీసీని అమలు చేయాలని బీజేపీ నిర్చయించుకుందని, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తప్పకుండా అమలు చేస్తామని పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కసరత్తు చేసిందని కూడా పేర్కొన్నారు. అంతే కాకుండా వికసిత్ భారత్ కేవలం నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు. -
అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టాలి
సాక్షి, అమరావతి/సింగరాయకొండ (మర్రిపూడి)/శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా)/నెల్లూరు(బారకాసు): త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలు, మద్యం గొడౌన్ల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ–నిల్వ చేసే స్థలాల వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గోడౌన్ల నుంచి షాపులకు మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఈనెల 15లోగా ఏర్పాటు చేసి ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. అదేవిధంగా తనిఖీలను ముమ్మరం చేయాలని అబ్కారీ శాఖ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపరచకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రలోభాలపై గట్టి నిఘా రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలపై గట్టి నిఘా ఉంచామని, ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులు జప్తు చేశామని ముకేశ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారా అలాగే పోలీస్, ఎక్సైజ్, ఐటీ, ఫారెస్టు, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో నిరంతరం నిఘా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జప్తు చేసిన వాటిలో రూ. 25.03 కోట్ల నగదు, రూ. 12.49 కోట్ల విలువైన మద్యం, రూ.2.05 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 51.23 కోట్ల విలువైన లోహాలు, రూ. 2.42 కోట్ల విలువైన ఉచితాలు, రూ. 7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులను జప్తుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. నామినేషన్లకు 18న నోటిఫికేషన్ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి గురువారం ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం అవుతుందని చెప్పారు. కోడ్‌ను అమలు చేస్తున్న తీరు పరిశీలించి అధికారులను అభినందించారు. ఓటు ఆవశ్యకతను తెలుపుతూ ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన మస్కట్‌ను ఆవిష్కరించారు. ముక్కంటి సేవలో మీనా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆర్డీవో రవిశంకర్‌రెడ్డి, ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు మీనాకు ఆశీర్వచనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. సింగరాయకొండ చెక్‌పోస్టు తనిఖీ ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం ముకేశ్ కుమార్ మీనా తనిఖీ చేశారు. ఈమార్గంలో వస్తున్న వాహనాలను సిబ్బంది తనిఖీ చేస్తున్న తీరు, వీడియో రికార్డింగ్ చేస్తున్న విధానాన్ని ఆయన చెక్‌పోస్టు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు, నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రయాణికుల బ్యాగులను కచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాలని సూచించారు. తగిన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు పైగా నగదు ఉంటే దానిని సీజ్ చేసి ట్రెజరీకి జమచేయాలన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఎన్నికల రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలో విచారణ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Microsoft: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి
న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్‌లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ ఒక నివేదికలో వెల్లడించింది. సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్‌లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్’ అధ్యయనం నిర్వహించింది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో చైనా సైబర్ గ్రూప్‌లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేలి్చచెప్పింది. ► చైనాకు చెందిన ఫ్లాక్స్ టైఫNన్ అనే సైబర్ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది. ► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్ ఇండియా వంటి కార్పొరేట్ సంస్థల ఆఫీసులను టార్గెట్ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది. ► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్‌హబ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ► మయన్మార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్–1376 అనే సైబర్ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది. ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చించారు. ► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. -
శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందన్నారు. ఓర్పు, సమన్వయంతో వ్యవహరించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హింసకు, రీపోలింగ్‌కు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, మద్యం, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్టుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గోవా, హరియాణాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తు చేయాలని ఆదేశించారు. వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగేయాలని, వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా త్వరలో నిర్దిష్ట నిబంధనలను (ఎస్వోపీ) ప్రకటించనున్నామని తెలిపారు. 10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం ఇవ్వండి.. రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ ప్రత్యేక సాధారణ పరిశీలకులు రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన పలు సూచనలను డీఈవో, ఎస్పీలకు వివరించారు. రూ.10 లక్షలకు పైబడి జప్తు చేసిన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. మద్యం, గంజాయి రవాణా చేసే కింగ్పిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు సీఈవో పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ అదనంగా ఏఆర్వోలు కావాల్సినవారు సంబంధిత జాబితాలను మూడు రోజుల్లో సీఈవో కార్యాలయానికి పంపిస్తే, వాటిని కన్సాలిడేట్ చేసి ఈసీ ఆమోదం కోసం పంపిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవో హరేందిరప్రసాద్, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో కె.విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు చేపట్టాలి.. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటా ప్రచారానికి ముందుగా పొందాల్సిన అనుమతి విషయంలో మరింత స్పష్టత కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని మీనా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తగిన వివరణ అందేలోపు ఇంటింటా ప్రచారానికి అభ్యర్థులు సంబంధిత ఆర్వో, పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిందని, వీరే ఈసీకి కళ్లు, చెవులు వంటి వారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో ప్రత్యేక సాధారణ పరిశీలకులు, ప్రత్యేక వ్యయ పరిశీలకులు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ కార్యాలయం నుంచి పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకున్నాకే నివేదిక పంపాలని సూచించారు. -
UK Elections: చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమా?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ.. బ్రిటన్‌లో దాదాపు పదిహేన్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా ఆ దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి(ప్రధాని, మంత్రుల రాజీనామాలు.. తొలగింపులు), మరీ ముఖ్యంగా భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో ఆ పార్టీ ఇమేజ్ మరింత దిగజారిపోయిందని ఆ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో యూకేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(తేదీలు ఖరారు కావాల్సి ఉంది) లేబర్ పార్టీ ప్రభంజనం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. కన్జర్వేటివ పార్టీ గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలీను నెరవేర్చకపోగా.. దేశాన్ని వరుస సంక్షోభాల్లోకి నెట్టేసిందన్న అభిప్రాయంలో ఉన్నారు అక్కడి ప్రజలు. పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ సైతం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా.. మార్చి 7వ తేదీ నుంచి 27 తేదీ మధ్య YouGov ఓ పబ్లిక్ సర్వే నిర్వహించింది. అందులో 18, 761 మంది పౌరులు పాల్గొన్నారు. వాళ్లలో మెజారిటీ పౌరులు.. లేబర్ పార్టీకే ఓటేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో.. అధికారం చేపట్టాలంటే 326 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే యూజీవోవీ సర్వేలో లేబర్ పార్టీకి 403 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ కేవలం 155 స్థానాలు దక్కించుకుంటాయని సదరు సర్వే తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇదే సంస్థ జరిపిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీకి 169 స్థానాలు రావొచ్చని అంచనా వేయగా.. తాజా సర్వేలో ఆ స్థానాలు మరింత తగ్గడం గమనార్హం. పోల్ ఆఫ్ పోల్స్ పోలిటికో సైతం ఇలాంటి ట్రెండ్‌నే ప్రకటించింది. మార్చి 31వ తేదీన వెల్లడించిన సర్వేలో.. 44 శాతం లేబర్ పార్టీకి, 23 శాతం కన్జర్వేటివ్పార్టీకి సీట్లు దక్కవచ్చని వెల్లడించింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ అక్టోబర్ 24, 2022లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ముందు పెను సవాళ్లు ఉండగా.. ఆయన వాటిని అధిగమిస్తానని స్పష్టం చేశారు. అయితే.. అప్పటి నుంచి బ్రిటన్ సంక్షోభం మరింత ముదిరింది. ఈ మధ్యలో ఆయన పైనా విమర్శలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మే 2వ తేదీన యూకేలో మేయర్, లోకల్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని కన్జర్వేటివ్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, కోర్టులు అందుకు అంగీకరించలేదు. ఇక ఈ ఎన్నికల్లోనూ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి తప్పదంటూ ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. -
కట్టుదిట్టంగా ‘కోడ్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ని కట్టుదిట్టంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ వెబ్‌సైట్లన్నింటిలోనూ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలు, ఆడియో, వీడియోలు కూడా వెంటనే తొలగించాలని సీఎస్ స్పష్టంచేశారు. అంతేకాక.. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలను, ఫ్లెక్సీలతోపాటు ప్రభుత్వ ఆస్తులపైనున్న రాజకీయ ప్రకటనలన్నీ కూడా తొలగించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై జవహర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఏ శాఖపైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వోద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కోడ్ అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలుచేసేందుకు అధికారులందరూ చర్యలు తీసుకోవాలి. చాలావరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్నందున వారంతా కోడ్ మార్గదర్శకాలపై అవగాహన పెంచుకోవాలి. కోడ్‌కు సంబంధించి సీఈఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్లో కార్యదర్శులందరూ నివేదిక ఇవ్వాలి. పెన్షన్ల పంపిణీ, ఉపాధి పనులకు అభ్యంతరంలేదు : ముఖేష్ కుమార్ మీనా ♦ ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. ♦ బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు నిషిద్ధం. ♦వర్క్ఆర్డర్ ఉండి క్షేత్రస్థాయిలో మొదలు కాని పనులను చేపట్టకూడదు. పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధంలేదు. ♦ అలాగే, వివిధ రకాల పించన్లపంపిణీకీ ఎలాంటి అభ్యంతరంలేదు. ♦ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్డ్ లబ్ధిదారులకు యధావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చు. కోడ్ అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆ ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. కానీ, టెండర్లను ఖరారు చేయడానికి వీల్లేదు. ♦ కోడ్ అమలులోకి వచ్చాక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించకూడదు. ♦ పీఎం, సీఎం సహాయ నిధి కింద రోగుల చికిత్స నిమిత్తం నిధులు మంజూరు చెయ్యొచ్చు. అన్ని రకాల ప్రకటనలనూ నిలిపివేయాలి.. ఇక కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ వెంటనే తొలగించాలి. అలాగే, వివిధ పబ్లిక్ ఆస్తులు అంటే.. బహిరంగ ప్రదేశాలు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైలు..రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ ప్రకటనలు.. వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నింటినీ వెంటనే తొలగించాలి. అదే విధంగా.. ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ ప్రకటనలను కూడా నిలిపివేయాలి. మంత్రులెవరూ అధికారిక వాహనాలు వాడరాదు.. ఎన్నికల ప్రకటన వచ్చేసినందున ఇక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదు. ఎంపీ లేదా ఎంఎల్ఏ నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ప్రజాప్రతినిధుల ఫొటోలు కూడా ఉండరాదు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలూ ఉండకూడదు. అలాగే, విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై కూడా ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి కూడా ఉండకూడదు. ప్రభుత్వోద్యోగులెవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర ఏ రకమైన లబి్ధపొందినా అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, వై. శ్రీలక్ష్మి, కె. విజయానంద్, వర్చువల్‌గా.. ఎం.టి. కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్‌కుమార్, హరీశ్‌కుమార్ గుప్తా, ప్రవీణ్‌ప్రకాశ్, సునీత, కాంతిలాల్ దండే, చిరంజీవి చౌదరి, వాణీమోహన్, పలువురు కార్యదర్శులు, కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
వంట గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గింపు. నారీశక్తికి లబ్ధి చేకూరుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ..ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: ఖాయంగా తు‘ఫ్యానే’
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని టౌమ్స్ నౌ – ఈటీజీ రీసెర్చ్ సర్వే తేల్చి చెప్పింది. వైఎస్సార్ సీపీ 49 శాతం ఓట్లతో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. టీడీపీ – జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3 నుంచి 4 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని తేల్చింది. బీజేపీ 2 శాతం ఓట్లు, కాంగ్రెస్, వామపక్షాలు తదితరులు 4 శాతం ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది. జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని ఇప్పటికే తేల్చాయి. టీడీపీ – జనసేన పొత్తు కుదిరాక గతేడాది డిసెంబర్ 13 నుంచి ఈనెల 7 వరకూ రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది అభిప్రాయాలను సేకరించి సర్వే ఫలితాలను రూపొందించినట్లు టైమ్స్‌నౌ – ఈటీజీ సర్వేను శుక్రవారం టైమ్స్‌నౌ ఛానెల్లో సమర్పించిన సంస్థ సీనియర్ న్యూస్ ఎడిటర్ పద్మజా జోషి వెల్లడించారు. ఆ అభిప్రాయాలను క్రోడీకరిస్తే వైఎస్సార్సీపీ సంచలన విజయం సాధించడం ఖాయమని తేలిందన్నారు. టీడీపీ–జనసేన పచ్చి అవకాశవాదంతో పొత్తు పెట్టుకున్నాయని అధిక శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. హామీల్లో 99 శాతం అమలు, సుపరిపాలన ద్వారా సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత చాటుకున్నారని, వైఎస్సార్సీపీ ఘనవిజయానికి ఇదే బాటలు వేస్తున్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు. -
ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నియమావళిని పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి (వైఎస్సార్సీపీ), ఎ.రాజేంద్రప్రసాద్ (టీడీపీ), ఐ.కె.అన్నపూర్ణ (బీజేపీ), వె.వి.రావు (సీపీఐ–ఎం) పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూలు ప్రకటన, ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ, వ్యయ పర్యవేక్షణ ఎంతో కీలకమైన అంశాలని చెప్పారు. ఈ అంశాలపై సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. నోటిఫికేషన్ మాత్రం ఐదారు రోజుల తరువాత వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మీనా వివరించిన నియమావళిలో ప్రధానాంశాలు.. ♦ ఎటువంటి బహిరంగ కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి పొందాలి ♦ పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే అన్ని కా>ర్యక్రమాలను పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తాం ♦ కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్ధం ♦ అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేలకు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్ధం ♦ స్టార్ క్యాంపెయినర్లు రూ. లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదు ♦ పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదుని సీజ్ చేస్తాం ♦ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది ♦ ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థులు రూ.25 వేలు, శాసన సభ అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపేణాగానీ లేదా ఆర్.బి.ఐ./ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చెక్కులు, బ్యాంకు డ్రాప్టులు అనుమతించం ♦ ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారు ♦ నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తాం ♦ అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తాం ♦ ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది ♦ ప్రతి లోక్‌సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థికి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుంది ♦ ఈ వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాలి ♦ ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, బహుమతులు, లిక్కరు, ఇతర వస్తువులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తాం ♦ ఎన్నికల వ్యవయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించాలి ♦ రోజువారీ రిజిస్టరుతో పాటు నగదు, బ్యాంకు రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా నిర్వహించాలి -
కమర్షియల్ వాహనాలకు ఎలక్షన్స్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు 2024–25లో 4–7 శాతం తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున మౌలిక సదుపాయాల కార్యకలాపాలలో విరామం కారణంగా జనవరి–మార్చి త్రైమాసికంలో వాణిజ్య వాహనాల విక్రయాలు స్తబ్దుగా ఉంటాయని అంచనా. దేశీయ సీవీ పరిశ్రమ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. సీవీల కోసం దీర్ఘకాలిక డిమాండ్ చెక్కుచెదరకుండా ఉంటుంది. మౌలిక రంగ మూలధన వ్యయంపై నిరంతర దృష్టి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ, తయారీ కార్యకలాపాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి కమర్షియల్ వెహికిల్స్ పరిశ్రమకు దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉంటుంది. సమీప కాలంలో సార్వత్రిక ఎన్నికల ప్రారంభంతో కొన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాల్లో అస్థిర నియంత్రణల మధ్య పరిమాణం అధిక స్థాయిలో ఉండవచ్చు’ అని ఇక్రా తెలిపింది. -
ప్రజాప్రతినిధిగా ఉండాలనుకుంటున్నా
పుదుచ్చెరి: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరోక్షంగా చెప్పారు. పుదుచ్చేరి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పుదుచ్చేరిలో తన అధికారిక నివాసం(రాజ్ నివాస్)లో మీడియాతో ఆమె మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పుదుచ్చేరి నుంచి ఎంపీగా బరిలో దిగుతారనే ఊహాగానాల నడుమ అదే అంశాన్ని ఆమె ప్రస్తావించడం గమనార్హం. ‘‘నేనొక సాధారణ వ్యక్తిని. ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి ఏం ఆదేశిస్తారో అది మాత్రమే నేను ఒక సాధారణ కార్యకర్తలా చేస్తా. లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చెరి నుంచి పోటీచేయబోతున్నానని నేను ఎక్కడా అనలేదు. నా జీవితంలో ఇది కావాలని ఏనాడూ అడగలేదు. అగ్రనాయకత్వం నుంచి వచ్చే ఆదేశాలను శిరసావహిస్తా. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. అయితే అది నెరవేరుతుందా లేదా అనేది ప్రధాని మోదీ తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’అని ఆమె అన్నారు. ‘‘కోవిడ్ విపత్తుకాలంలో పుదుచ్చెరిలో కరోనా వ్యాక్సిన్లు సకాలంలో అందించడంలో సఫలమయ్యా. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడితో పుదుచ్చేరిని అందరికీ ఆదర్శంగా నిలిపా. అరబిందో, సుబ్రమణ్యభారతి వంటి వారికి పుదుచ్చేరితో ఎంతో అనుబంధం ఉంది. నాకూ అలాంటి అనుబంధమే ఉంది. కానీ ఇన్నేళ్లు ఇక్కడ ఉన్నా కొందరు ఇంకా నన్ను ‘బయటివ్యక్తి’అనడం నాకెంతో బాధగా ఉంటుంది’’అని అన్నారు. ‘‘మూడేళ్లకాలంలో పుదుచ్చేరిలో వేర్వేరు రంగాల్లో, ముఖ్యంగా వైద్యరంగంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేశా. ఇక్కడి ఎన్నుకున్న ప్రభుత్వ సహాయసహకారాలతో ఉత్తమంగా పాలించే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’అని ఆమె అన్నారు. -
బీఆర్ఎస్తో పొత్తు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెరదించారు. ఢిల్లీలో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుని హోదాలో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవిత కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది : కిషన్‌రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విజయసంకల్ప యాత్రలు మంగళవారం నుంచి ప్రారంభమవనున్న సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర రథాలను స్వయంగా నడిపారు. అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తాం. 20 నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రలు జరుగుతాయి. సమిష్టి నాయకత్వంలో, పార్టీ జెండా కింద యాత్రలు కొనసాగుతాయి. యాత్రల్లో భాగంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలను కలుస్తాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సైతం బీజేపీ గెలవడం ఖాయం’ అని చెప్పారు. ఇదీ చదవండి.. ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు -
ప్రధాని సుడిగాలి పర్యటనలు.. ప్రసంగాల్లో ఆ అంశంపైనే ఫోకస్ !
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభల్లో ఈ పదేళ్లలో తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించనున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ప్రధాని ఈ తరహాలోనే దేశవ్యాప్తంగా పర్యటించారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా ఈ నెలలో 15 రోజులు ఈ పనిమీదే ప్రధాని దృష్టిపెట్టనున్నారు. ఈ వారంతంలో ప్రధాని ఒడిషా,అస్సాంలలో పర్యటించనున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు కాకుండా ప్రధాని తన ప్రసంగాల్లో అయోధ్యలో ఇటీవల జరిగిన రామమందిర ప్రారంభోత్సవ అంశం కంటే ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాజాగా పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రసంగం తర్వాత ఆయన గోవాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ కూడా అయోధ్య ప్రస్తావన తీసుకురాలేదు. దీన్ని బట్టి ఆయన ఇక ముందు కూడా తన ప్రసంగాల్లో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెబుతున్నారు. అయితే అయోధ్య రామమందిర అంశాన్ని కూడా అవసరమైనపుడు తప్పకుండా ప్రచారంలో వాడుతారని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇదీ.. చదవండి.. టీఎంసీ మిత్ర పక్షమే: రాహుల్ గాంధీ -
‘‘ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని ప్రధాని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. అంత పక్కాగా చెప్పగలుగుతున్నారంటే ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని అధిర్ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకు ఈవీఎంల గోల్‌మాల్‌పై మాకు కచ్చితమైన సమాచారం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో ప్రధాని అంత పక్కాగా చెప్పడం చూస్తుంటే ఈవీఎంలలో ఏవో రహస్యాలు దాగి ఉన్నాయనిపిస్తోంది. కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినందు వల్లే బీజేపీకి 370 సీట్లు వచ్చాయని వాళ్లు ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. ఒక వ్యవస్థ తర్వాత మరొక వ్యవస్థను బీజేపీ కబ్జా చేసింది. ఈ దేశంలో ఎన్నికలను కూడా ఒక తమాషాలా తయారు చేశారన్న భావన కలుగుతోంది’ అని అధిర్ అన్నారు. #WATCH | On PM Modi's statement "370 to BJP, 400 to NDA", Congress MP AR Chowdhury says, "...Lagta hai ki EVM mein Modi ji ka koi haath chalega..." pic.twitter.com/0KK3AEEIiZ — ANI (@ANI) February 6, 2024 ఇదీచదవండి.. క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి -
ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్దత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈ లోపే పోలింగ్ స్టేషన్లు, మౌలిక వసతులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ నెల 5వ తేదీకల్లా ర్యాంపుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులనే తప్పనిసరిగా నియమించాలని, సకాలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లోనూవెబ్ టెలికాస్టింగ్ జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని చెప్పారు. సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లలతో పాటు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలీకాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. వెబ్ కాస్టింగ్‌పై తాత్కాలిక నివేదికను వెంటనే పంపాలన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 50 శాతం పోలింగ్ స్టేషన్లు వెబ్ టెలీకాస్టింగ్‌లో కవర్ అవ్వాలని, ఇది పోలింగ్ స్టేషన్‌కే పరిమితం కాకుండా చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలు కూడా కవర్ అవ్వాలని తెలిపారు. ప్రాంతాలవారీగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్ కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే సోమవారానికల్లా ఎన్నికల నిర్వహణ ముసాయిదా పంపాలి ప్రతి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ముసాయిదా ప్రతిని వచ్చే సోమవారానికల్లా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీల సమన్వయంతో అక్రమ నగదు, లిక్కరు, ఇతర నిషేధిత సామగ్రి రవాణాపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. కేవలం రాష్ట్ర సరిహద్దుల్లోనే కాకుండా జిల్లాల్లోనూ అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఇందుకు సంబందించిన నివేదికలను తమకు సకాలంలో పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు ఎస్.మల్లిబాబు, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మంగంపేట గనులపై దొంగరాతలా?
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంగా రామోజీరావు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒకలా బురదజల్లి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన చంద్రబాబుకు మేలు చేయాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే మంగంపేట బెరైటీస్ గనుల టెండర్లపైనా అడ్డగోలు రాతలు రాశారు. ‘మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనాన్ని శుక్రవారం ఈనాడులో అచ్చేశారు. నిబంధనల ప్రకారమే అంతా సక్రమంగా జరిగినా అబద్ధాలతో ఆ కథనాన్ని నింపేశారు. అన్నమయ్య జిల్లా మంగంపేటలో గనుల్లో ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్‌ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సగటున 10 లక్షల టన్నులు ‘ఎ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బి’ గ్రేడ్ కాగా, మిగిలిన 17 లక్షల టన్నులు ‘సీ, డీ – డబ్ల్యూ (వేస్ట్)’ గ్రేడ్లుగా ఉంటుంది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ తక్కువగా ఉండటంతో గత కొన్నేళ్లుగా వాటి నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్ నిల్వలు అమ్ముడవకుండా ఉండిపోయింది. దాని విక్రయం, బెనిఫికేషన్ కోసం గతంలో పలుసార్లు టెండర్లు పిలిచినా సరైన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఏపీఎండీసీ ఆ నిల్వల విక్రయానికి టెండర్లు పిలిచింది. సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ ఖనిజానికి టెండర్లు పిలుస్తారు. కానీ కొనుగోలుదారుల నుంచి స్పందన రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున ఐదేళ్లకు ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలిచారు. ఈ వాస్తవం తెలియకుండా అభూత కల్పనలతో ఒకేసారి కోటి మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచారంటూ మతి లేని కథనాన్ని ఈనాడు ప్రచురించింది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి రిజర్వు ధరను తగ్గించారంటూ మరో తప్పుడు ఆరోపణ చేసింది. నిజానికి రిజర్వు ధర నిర్ణయానికి సంబంధించి జీవో 262ను 2017లో చంద్రబాబు హయాంలోనే విడుదల చేశారు. ఆ జీవోలోని నిబంధనలకు అనుగుణంగానే ఇప్పుడు రిజర్వు ధరను నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు తగ్గట్టు రేటును పెట్టారు. ఎంఎస్టీసీ పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియ టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారమే ధరావత్తు ఖరారు చేశారు. 17 రోజుల్లో టెండర్లను పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే. టెండర్ డాక్యుమెంట్ ధరను ఖరారు చేసే క్రమంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ చార్జీలు, ఎంఎస్టీసీ చెల్లింపులకయ్యే మొత్తాన్ని లెక్కించి ధర నిర్ణయించారు. సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే ఈ విధానాన్ని ఈనాడు మాత్రం అక్రమం అంటూ చిత్రీకరించడం విడ్డూరం. న్యాయ సమీక్షకు పంపలేదంటూ అవగాహనారాహిత్యాన్ని ఆ కథనంలో చూపించింది. రూ.100 కోట్లకుపైగా వ్యయం అయ్యే ప్రాజెక్టును నిర్వహించే టెండర్లను మాత్రమే న్యాయ సమీక్షకు పంపుతారు. బెరైటీస్ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం లేకుండా ఆ కథనాన్ని ప్రచురించినట్లు స్పష్టమవుతోంది. దుర్బుద్ధితోనే ఈ కథనం రాసినట్లు తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం నాణ్యమైన బెరైటీస్‌తో పాటు సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ ఖనిజాన్ని ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దోపిడీగా చిత్రీకరించడం దారుణం. ఈ తప్పుడు కథనంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, వీసీ అండ్ ఎండీ, ఏపీఎండీసీ -
ఆ 982 పోస్టులను త్వరగా భర్తీ చేయండి
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం (కలెక్టరేట్లు), అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు మంజూరైన 982 పోస్టులను త్వరగా భర్తీచేసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్ఈసీ) ముఖేశ్‌కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు. ఇప్పటికే పీఆర్ అండ్ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు పోలీస్, రెవెన్యూ శాఖల్లో కొంతమేర బదిలీలు జరగ్గా మిగాతా బదిలీలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయాలని సీఎస్ ఆదేశించారు. అలాగే.. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు కూడా రెండు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. చెక్‌పోస్టుతో అక్రమ రవాణాకు కళ్లెం.. ఇక ఎన్నికల్లో పటిష్ట నిఘా నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 105 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటుచేయగా వాటిలో 20 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులని.. పోలీసు శాఖ ద్వారా 62, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా 9, అటవీశాఖ ద్వారా 14 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. గత నెలరోజుల్లో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ద్వారా రూ.2.35 కోట్ల నగదు, 51,143 లీటర్ల మద్యం, 1,323 కిలోల వివిధ మాదకద్రవ్యాలను, ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ చెక్ పోస్టులన్నీ రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. అలాగే, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ముఖ్యంగా తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపుల ఏర్పాటు వంటి సౌకర్యాలను త్వరగా ఏర్పాటుచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎస్ చెప్పారు. లాజిస్టిక్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోండి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ లాజిస్టిక్ ఏర్పాట్లకు ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంకా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి తీసుకోవాల్సిన ఇతర అంశాలపై ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ కోటేశ్వరరావు, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ సూర్యకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణయాధికారం ‘ఆమె’దే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. రాష్ట్రం మొత్తం ఓటర్లలో ఎలక్ట్రోలర్ లింగ నిష్పత్తి సగటు కూడా ఎక్కువగానే ఉంది. పదేళ్లుగా పెరుగుతున్న నిష్పత్తి రాష్ట్రంలో 2014 నుంచి వరుసగా 2024 వరకు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. అర్హులైన యువతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో 18 నుంచి 19 సంవత్సరాల వయసుగల ఎలక్ట్రోరల్ లింగ నిష్పత్తి 778 నుంచి 796కు పెరిగింది. ఈ వయసుగల మహిళా ఓటర్లు 3.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనుల్లోని ప్రత్యేక సంచార జాతులను కూడా ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4.29 లక్షలుండగా 18 సంవత్సరాలు నిండిన 2.94 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. బోడో గడబా, గుటోబ్ గడబా, చెంచు, బొండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరేంగి పోర్జా, డోంగ్రియా ఖోండ్, కుటియా ఖోండ్, కోలం, కొండారెడ్డి, కొండ సవరాల జాతుల్లోని అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
ఎన్నికలతో సంబంధం ఉన్న .. అధికారులను 25లోగా బదిలీ చేయండి
సాక్షి, అమరావతి: ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని ఈ నెల 25వ తేదీలోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్ల కోసం ర్యాంపులు వంటివి కల్పించాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతో పాటు పటిష్ట నిఘాకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్లు) కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి త్వరగా చర్యలు తీసుకోవాలని సీఈవో, సీసీఎల్ఏను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ బదిలీ చేయాల్సిన అధికారులు, సిబ్బందిని గుర్తించామని, ఇప్పటికే కొందరిని బదిలీ చేశామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్), పోలీస్ శాఖల్లో మూడు రోజుల్లోగా బదిలీలు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ఎస్.బాగ్చి, సీడీఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్, ఐజీ రవీంద్ర బాబు, అదనపు సీఈవో కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిషాంతి పాల్గొన్నారు. ఆ ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపాలి: సీఎస్ సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం నిర్దిష్ట అంశాల ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపించి అనుమతి తీసుకోవాలని సీఎస్ డా. కేఎస్ జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, బడ్జెట్, ప్రాజెక్టు పనులు, సవరించిన అంచనాలు, విధానపరమైన అంశాల ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపించి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇటీవల ఈ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని శాఖలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తరువాత ఆర్థిక శాఖకు ఫైళ్లు పంపిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, బడ్జెట్ మంజూరు, నిధుల విడుదల, అదనపు నిధులు, ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్టులు, పనులు, సర్వీసెస్ పరిపాలన అనుమతులు, సవరించిన అంచనాలు, కార్యక్రమాలు, పథకాలు, ఇన్స్టిట్యూషన్స్, విధానపరమైన అంశాలు, చట్టాలు, జీవోలు, విధివిధానాల మార్గదర్శకాలకు సంబంధించిన ఫైళ్లను తప్పనిసరిగా ఆర్థిక శాఖకు పంపి, అనుమతి పొందాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల కార్యదర్శులు ఆర్థిక శాఖకు పంపే ఫైళ్లపై తగిన సిఫార్సులు కూడా చేయాలని, నిబంధనల మేరకు సంబంధిత అథారిటీ అనుమతి మేరకే ఫైళ్లు పంపుతున్నారా లేదా అనే విషయాలను కూడా ఫైళ్లలో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చే ముందు అందుకు తగిన నిధులు ఉన్నాయా లేదా, సంబంధిత ఫైళ్లకు సంబంధించిన అంశాల వల్ల ప్రభుత్వ ప్రాధాన్యతలు నెరవేరుతాయా లేదా అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. శాఖలు పంపే ప్రతిపాదనలు ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఉన్నాయా లేదా, బడ్టెట్ కేటాయింపులున్నాయా లేదా అనే విషయాలను ఆ ర్థికశాఖ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. -
క్లీన్‌స్వీపే లక్ష్యం
సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్ర్సీపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. జనబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ అవసరమైన అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో సమన్వయకర్తలను మారుస్తున్నారు. ఇప్పటికే 50 శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు కొత్తగా సమన్వయకర్తలను నియమించారు. మెరుగైన ఫలితాలు సాధించడానికి అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తూనే.. క్లీన్‌స్వీపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కార్యకర్తలతో సమావేశమై.. 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో తొలుత ఉత్తరాంధ్ర ప్రాంత కార్యకర్తలతో విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఈనెల 25న సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇలా ఐదుచోట్ల కార్యకర్తల సమావేశాలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సంక్షేమాభివృద్ధి, సంస్కరణలతో విప్లవాత్మక మార్పు.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం సీఎం జగన్ అమలుచేశారు. ఇప్పటికి 99.5% హామీలు అమలుచేశారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. పునర్విభజన ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుతో సహా వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.67 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ వెరసి రూ.4.13 లక్షల కోట్ల లబ్ది చేకూర్చారు. ఇందులో 75% నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. సంక్షేమాభివృద్ధి, సుపరిపాలనతో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఆ మార్పును గుర్తుచేసి.. మరింత మేలుచేయడానికి ఆశీర్వదించాలని కోరుతూ 2022, మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇంటింటా ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పైపైకి.. ఇక ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో మార్పు కళ్లెదుటే కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం సుసాధ్యమేనని గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ప్రతి ఇంటికీ చేసిన మంచిని వివరించడానికి చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో 80% ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించి, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇది జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రస్ఫుటితమైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గడాది అక్టోబరు 10న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సదస్సు నిర్వహించి 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
Central Budget: ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9న ముగియనున్నాయి. సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సమావేశాలు ప్రారంభమయ్యే తొలిరోజు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.ఈ ప్రసంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తారు. ఈ ఏడాది పార్లమెంట్ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ టర్ములో చివరగా జరగబోయే ఈ బడ్జెట్ సమావేశాలు రాజకీయ ప్రాధాన్యాన్ని ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదీచదవండి.. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొత్త చట్టంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు -
వద్దు బాబూ..మీకో దండం!
సాక్షి, తిరుపతి: అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లాపడటం ఖాయంగా కనిపిస్తోంది. సొంత జిల్లాలో ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోంది. చిత్తూరు జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తేటతెల్లం చేస్తుండటంతో టీడీపీ నుంచి అభ్యర్థులుగా బరిలో దిగేందుకూ నాయకులు వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ పార్టీ ఇంకా అభ్యర్థుల కోసం వెంపార్లుడుతోంది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్నారు. చిత్తూరు పార్లమెంట్‌కు అంజనం వేసినా అభ్యర్థి కనిపించటం లేదు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవటంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. సర్వేలో బహిర్గతమైన ఓటమి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారని స్పష్టమవడంతో మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ఇటీవల మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి మరోసారి అమలు చేయలేని హామీలు కురిపించారు. కుప్పంలో విమానాశ్రయం నిర్మించి అమెరికాకు కూరగాయలు అమ్మిస్తానని మోసపూరిత ప్రకటనలు చేశారు. చంద్రబాబు చేసిన ప్రకటనతో కుప్పం వాసులు ఇలాంటి వ్యక్తినా తాము ఇన్నేళ్ల నుంచి గెలిపిస్తూ వచ్చింది? అని నోరెళ్లబెట్టారు. ఇన్నేళ్లు చంద్రబాబుని గెలిపిస్తున్నా కనీసం స్థానికంగా సొంత ఇల్లు కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాంతిపురం మండలంలో హడావుడిగా ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. మాజీ మంత్రికి ఓటమి భయం పలమనేరు టీడీపీ నేత చంద్రబోస్ వైఎస్సార్సీపీలో చేరిపోవటంతో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డికి మరోసారి ఓటమి భయం పట్టుకుంది. గతంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచి, టీడీపీ అధికారంలోకి వచ్చిందని తిరిగి పచ్చకండువా కప్పుకున్నందుకు 2019తో అమర్‌కు స్థానికులు గుణపాఠం చెప్పారు. చంద్రబాబుతో పాటు అమర్నాథ్రెడ్డిని వెన్నుపోటు వెంటాడుతోంది. పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్‌పై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. మరో వ్యక్తికి టికెట్ ఇప్పించేందుకు స్థానిక టీడీపీ నేతలు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. పొత్తులో భాగంగా జిల్లా కేంద్రాలైన చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌పై జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే ఆ రెండు చోట్లా తన అభ్యర్థులనే బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా చంద్రబాబు తన పార్టీకి చెందిన టీటీడీ బోర్డు మాజీ చైర్మెన్ డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యను రంగంలోకి తీసుకొచ్చారు. జనసేన తరుపున చిత్తూరు లేదా శ్రీకాళహస్తి టికెట్ ఇప్పించేందుకు బాబు స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల కోసం అన్వేషణ గంగాధర నెల్లూరు స్థానానికి అసలు టీడీపీ నుంచి అభ్యర్థే లేరు. సరైన నాయకుడు దొరక్కపోవటంతో సీటు కోసం చాలా మంది పోటీపడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. పుంగనూరులో మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం ఖాయం అని తెలిసినా పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. అక్కడ చల్లా రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదనే నిర్ణయానికి వచ్చారు. సోషల్ మీడియా ప్రతినిధులకు ప్యాకేజీ ఇచ్చి ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్న రామచంద్రయాదవ్ని జనసేన నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తున్నారు. చంద్రగిరిలో ఈ సారి కూడా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఢీకొట్టటం సాధ్యం కాదని, సొంత సర్వేల్లో కూడా టీడీపీకి ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించుకుంటున్న పులివర్తి నానిని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగానే ఇద్దరు వ్యక్తుల పేర్లను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపైనా పులివర్తి నాని వర్గీయులు చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. తిరుపతిలో పలాయనమే.. తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీలోకి దించడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టం లేదు. అందుకే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించాలని నిర్ణయానికి వచ్చారు. జనసేన అభ్యర్థిగా తన పార్టీ నాయకురాలు సుగుణమ్మను బరిలోకి దించనున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న జనసేన సైనికులు చంద్రబాబు కుట్రలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జెండా మోస్తున్న తమకు కేటాయించకుండా పథకం ప్రకారం టీడీపీ వారినే జనసేన అభ్యర్థులుగా దింపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి పవన్ తలూపటంపైనా జనసైనికులు మండిపడుతున్నారు. పచ్చకండువా కప్పుకున్న నాయకులకు గింగిరాలే.. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చకండువా కప్పుకున్న ఆనం రాంనారాయణరెడ్డిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సు«దీర్‌రెడ్డిపై నమ్మకం లేకపోవటంతో ఎస్సీవీ నాయుడు లేదా మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మెన్ గురవయ్య నాయుడు కుమారుడు లేదా ఆయన కోడల్ని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్యవేడులో టీడీపీ ఓటమి ఖాయం కావటంతో డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మధ్య పోటీ రాజేశారు. ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతూ వారి మధ్య విభేదాలు సృష్టించారు. సీటు కోసం పోటీపడుతున్నట్లు డిమాండ్ సృష్టించారు. సూళ్లూరుపేట నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సారి బరిలో దిగేందుకు సుముఖంగా లేరు. చెన్నైలో స్థిరపడిన ఓ వైద్యుడిని పోటీ చేయాలని అభ్యర్థించినట్లు తెలిసింది. ఆయన అంగీకరించడంతో ముందుగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పేరు వినిపిస్తున్నా, ఆయన గతంలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చ కండువా కప్పుకున్నారు. సునీల్‌ని బరిలోకి దింపాలా? లేదా జనసేనలో చురుగ్గా ఉన్న తీగల చంద్రశేఖర్‌ని పోటీకి దింపాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తుండటంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేయడంతోపాటు వాటిలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను అదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ, కలెక్టర్లు, వివిధ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. పోలింగ్ స్టేషన్లలో శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష తొలుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డితో సమావేశమైన జవహర్‌రెడ్డి అక్రమ మద్యం రవాణాను అరికట్టడం, పటిష్టమైన బందోబస్తు, చెక్ పోస్టుల ఏర్పాట్లు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలో ఉన్న కేసులకు సంబంధించి త్వరలో చార్జిïÙట్లు దాఖలు చేయడంపై సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల వద్ద పటిష్టమై చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు పోలీస్ బలగాలను పెద్దఎత్తున నియమించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. అడిషనల్ సీఈవో హరేందిరప్రసాద్, అడిషనల్ డీజీ బాగ్చి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, ఎస్ఈబీ డైరెక్టర్ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలకు సమప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ ఓటర్ల జాబితాతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య హక్కును కాపాడాలని, పోలింగ్‌లో పెద్దఎత్తున పాల్గొనాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ 2024 ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కలిసి విజయవాడలో రాజీవ్ కుమార్ రెండు రోజుల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా 2024లో తొలి సమీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మొదలు పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల సన్నద్ధతపై స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో 159 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం శుభపరిమాణమన్నారు. 2014లో 1013గా ఉన్న పురుష, మహిళా ఓటర్ల నిష్పత్తి ఇప్పుడు 1036కు పెరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 5.8 లక్షల మంది ఉన్నారని, వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ కాకుండా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు ఫాం12డీ పూర్తి చేయడం ద్వారా అవకాశం పొందవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో 18–19 ఏళ్లు ఉన్న 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగంచుకోనున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 22న విడుదల చేయనున్నట్లు చెప్పారు. ధన ప్రవాహం తగ్గించే విధంగా చర్యలు ఎన్నికల్లో ధన ప్రవాహంతగ్గించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వివిధ శాఖలకు చెందిన 139 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. మద్యం, నగదు పంపిణీ, బహుమతుల పంపిణీ వంటి వాటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టడి చేసేందుకు కేంద్రరాష్ట్రాలకు చెందిన 20 టాస్క్‌ఫోర్స్‌లు సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో పెద్దఎత్తున నగదు జప్తు చేశామన్నారు. 2018–19లో రూ. 366 కోట్ల నగదును సీజ్ చేస్తే 2022–23లో ఆ మొత్తం విలువ రూ. 3,247 కోట్లకు చేరిందన్నారు. అందుబాటులోకి సీవిజిల్ యాప్ నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని ఓటర్లకు పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందుకోసం సీవిజిల్ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సీవిజిల్ యాప్ ద్వారా ఏదైనా ఫిర్యాదు వస్తే 100 నిమిషాల్లోనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను అందిస్తున్నామని, అలాగే అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా సమర్పించే అఫిడవిట్లు, ర్యాలీల అనుమతి కోసం సువిధ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మొదట ఏ పార్టీ దరఖాస్తు చేస్తే ఆపార్టీకే అనుమతివ్వాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్ర తెలుసుకునే విధంగా కేవైసీ (నో యువర్ కాండిటేట్) యాప్‌ను తీసుకురావడంతో పాటు అభ్యర్థి నేరచరిత్రను తప్పనిసరిగా మూడుసార్లు దినపత్రికలు, టీవీ ఛానల్స్‌లో ప్రచురించాల్సిందిగా కోరారు. దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద అని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్‌గోయల్, రాష్ట్ర ఎన్నికలప్రధాన అధికారి ముఖేష్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Bangladesh Elections: ప్రారంభమైన పోలింగ్
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం(జనవరి 7) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా డమ్మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను బరిలో నిలిపిందని బీఎన్పీ ఆరోపిస్తోంది. పోలింగ్ ప్రారంభం కాగానే ఢాకాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రధాని షేక్ హసీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ తమకు నమ్మకమైన మిత్ర దేశమని చెప్పారు. 1971 లిబరేషన్ సందర్భంగా, 1975లో బంగ్లాదేశ్‌కు భారత్ సహకారం మరవలేనిదన్నారు. దేశంలో మొత్తం 11 కోట్ల 90 లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 300 యోజకవర్గాలకుగాను 299 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరుగుతోంది. కొన్ని కారణాల వల్ల ఒక్క నియోజకవర్గానికి తర్వాత ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 27 రాజకీయ పార్టీల నుంచి 1500 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 436 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కించుకోనుందని అంచనాలున్నాయి. ఈసారి గెలిస్తే అవామీ లీగ్‌కు దేశంలో ఐదోసారి అధికారం దక్కినట్లవుతుంది. #WATCH | Dhaka: In her message to India, Bangladesh Prime Minister Sheikh Hasina says, ''You are most welcome. We are very lucky...India is our trusted friend. During our liberation war, they supported us...After 1975, when we lost our whole family...they gave us shelter. So our… pic.twitter.com/3Z0NC5BVeD — ANI (@ANI) January 7, 2024 ఇదీచదవండి...లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ -
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ భారీ స్కెచ్.. 250 స్థానాల్లో సొంతంగా పోటీ
న్యూఢిల్లీ: మరికొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. పోటీ చేసే స్థానాలు, కూటమి మధ్య సీట్ల పంపకాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్.. సింహ భాగం స్థానాల్లో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొత్తం 543 లోక్‌సభ నియోజక వర్గాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 300 నుంచి 350 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఈ మేరకు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు. వీటిలో 250 స్థానాల్లో సొంతంగా బరిలోకి దిగాలని ఆలోచిస్తుండగా.. ‘ఇండియా కూటమి’లోని మిత్ర పక్షాలతో కలిసి తొమ్మిది రాష్ట్రాల్లో 75 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలతోపాటు బీజేపీకి ప్రత్యక్ష పోటీ ఉన్న రాష్ట్రాల్లో అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక (28 సీట్లు), రాజస్థాన్ (25 సీట్లు). గుజరాత్ (26 సీట్లు), రాజస్థాన్ (25 సీట్లు), ఆంధ్రప్రదేశ్ (25 సీట్లు), అస్సాం (14 సీట్లు), ఛత్తీస్‌గఢ్ (11 సీట్లు), హర్యానా (10 సీట్లు), అరుణాచల్ ప్రదేశ్(2) వంటి రాష్ట్రాల్లో సీట్లు పంచుకునేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయడం లేదు. చదవండి: మహువా పిటిషన్: లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం కోర్టు నోటీసు కాగా ఇండియా కూటమితో కలిసి తొమ్మిది రాష్ట్రాల్లో సీట్ల పంపకాలకు కాం్గరెస్ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే మహారాష్ట్రలో 48 స్థానాలు ఉండగా ఎక్కువ స్థానాల్లో పోటీలోకి దిగాలని భావిస్తోంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుండగా.. మిగిలిన వాటిలో ఉద్దవ్ వర్గం శివసేనకు 15, శరద్ పవార్ ఎన్సీపీకి 15 సీట్లు ఇవ్వనుంది. ఈ క్రమంలో మిత్రపక్షాల నుండి గట్టి సవాలును ఎదుర్కొంటోంది. ఇక బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని ఆ పార్టీ(కాంగ్రెస్) నాలుగు స్థానాల్లో బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఆర్జేడీ, జేడీయూలు 17 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. నాలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమిలో మిత్రపక్షమైన ఆప్‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్ తీవ్ర సవాల్‌ను ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గోవా విషయానికొస్తే ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే ఆప్ కోరితే ఒక సీటు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా 26 స్థానాలున్న గుజరాత్లో ఆప్‌కు ఐదు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఆప్ సైతం రెండు మూడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జార్ఖండ్‌లోని 14 స్థానాల్లో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మిగిలిన ఏడు సీట్లు దాని మిత్రపక్షాలైన జేఎంఎం (4 సీట్లు), ఆర్జేడీ-జేడీయూ-లెఫ్ట్ (3 సీట్లు) కోసం కేటాయించింది. కేరళలో 16 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్న కాంగ్రెస్, మిగిలిన స్థానాలను(4) స్థానిక పార్టీలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బెంగాల్‌తో పాటు పంజాబ్, మహారాష్ట్రలో మిత్రపక్షాలతో పొత్తు అంశం కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారింది. ఇక పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఇటు కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు డిసెంబరు 26న పంజాబ్‌లోని పార్టీ అగ్రనేతలతో జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది. -
వన్ ఉమన్ షో!
ఎన్నికల ‘చిత్రా’నికి పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో సర్వం సిద్ధమైంది. అక్కడ జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాకపోతే వాటి ఫలితం మాత్రం ముందే తేలిపోయింది. విపక్ష పార్టీల బాయ్‌కాట్ నేపథ్యంలో పాలక అవామీ లీగ్ విజయం, పార్టీ అధినేత్రి షేక్ హసీనా ప్రధానిగా కొనసాగడమూ లాంఛనప్రాయమే కానుంది. హసీనా వంటి నియంత చేతిలో అధికారం ఉన్నంత వరకూ ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఆమె పదవి నుంచి తప్పుకుని తటస్థ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని, దాని పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరపాలని అవి పలుమార్లు డిమాండ్ చేశాయి. వాటిని హసీనా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. దాంతో ఎన్నికల బహిష్కరణ తప్ప తమకు మరో మార్గం లేదని విపక్షాలన్నీ ఇప్పటికే ప్రకటించాయి. బేగం ఖలీదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ), దాని భాగస్వాములతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికలను బాయ్‌కాట్ చేశాయి. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలపై కేవలం అధికార అవామీ లీగ్, దాని భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు, స్వతంత్రులు మాత్రమే ఉండనున్నారు! ఇంటా బయటా విమర్శలే... హసీనా పూర్తిగా ఏకపక్ష పోకడలు పోతున్నారన్న ఆరోపణలు ఇప్పటివి కావు. బంగ్లాదేశ్‌లో 2009 నుంచీ ఆమే ప్రధానిగా అధికారం చలాయిస్తున్నారు. ఆ క్రమంలో గత పదేళ్లుగా హసీనా కరడుగట్టిన నియంతగా మారారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని, విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కంట్లో నలుసుగా మారిన వారిని ఏకంగా చంపిస్తున్నారని మండిపడుతున్నాయి. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని కోరుతున్నాయి. వాటి వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. విపక్ష నేతలు, ముఖ్యంగా బీఎన్పీకి చెందిన వారు భారీగా జైలుపాలయ్యారు. కనీసం 20 మందికి పైగా తమ నేతలు, కార్యకర్తలు జైలుపాలైనట్టు బీఎన్పీ నాయకుడు అబ్దుల్ మొయీన్ ఖాన్ ఆరోపించారు. బీఎన్పీ చీఫ్ బేగం ఖలీదా జియా కూడా అవినీతి ఆరోపణలపై గృహ నిర్బంధంలో మగ్గుతున్నారు. 78 ఏళ్ల జియా ఆరోగ్యమూ బాగా క్షీణించింది. తన నియంతృత్వం, అణచివేత బయటి ప్రపంచానికి తెలియకుండా అడ్డుకునేందుకు మీడియాపైనా హసీనా ఉక్కుపాదం మోపారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్‌ను కేసులతో వేధించడం ఆపాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఏకంగా 170 మంది అంతర్జాతీయ ప్రముఖులు హసీనాకు గత ఆగస్టులో బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది! అయినా ఆర్థిక అవకతవకల కేసులో ఆయనకు తాజాగా ఆర్నెల్ల జైలు శిక్ష పడటం గమనార్హం! ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అణచివేత తీవ్రతరం కావడంతో నిర్బంధం నుంచి తప్పించుకునేందుకు బీఎన్పీతో పాటు పలు విపక్షాల నేతలు భారీగా అజ్ఞాతంలోకి వెళ్లారు!! జర్నలిస్టులతో పాటు ఎవరికీ బంగ్లాదేశ్‌లో సురక్షిత పరిస్థితులు లేవని ఐరాస స్వయంగా పేర్కొంది. భిన్న పార్శ్వం హసీనా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రస్థానంలో భిన్న పార్శ్వంన్నాయి. ఒకటి పుష్కర కాలంగా దేశం సాధించిన స్థిరమైన ఆర్థిక ప్రగతి. మరొకటి ప్రధానిగా ఆమె ఒంటెత్తు పోకడలు, విచ్చలవిడి అణచివేత విధానాలు. ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటిగా చెప్పే బంగ్లాదేశ్ హసీనా హయాంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి సాధించింది. ఆర్థిక వృద్ధిలో భారత్‌ను కూడా మించిపోయింది. దేశంలో గత పదేళ్లలో తలసరి ఆదాయం మూడింతలు పెరిగింది. గత 20 ఏళ్ల కాలంలో కనీసం 2.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డట్టు ప్రపంచ బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు హసీనా తెర తీశారు. దుస్తుల ఎగుమతిలో చైనా తర్వాత రెండో స్థానం బంగ్లాదేశ్‌దే. అయితే ఈ అభివృద్ధంతా ప్రజాస్వామిక విలువలకు పాతరేసిన ఫలితమేనన్న వాదన ఉంది. మరోవైపు కరోనా కల్లోలం బంగ్లాను అతలాకుతలం చేసింది. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం 9.5 శాతం దాటింది! విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ నియంతగా మారిన హక్కుల నేత! 76 ఏళ్ల షేక్ హసీనా బంగ్లాదేశ్ జాతి పిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ పెద్ద కూతురు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కరడుగట్టిన నియంతగా విమర్శల పాలవుతున్న ఆమె ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రముఖంగా గళమెత్తడం విశేషం! 1980ల్లో సైనిక పాలకుడు జనరల్ హుసేన్ మహమ్మద్ ఎర్షాద్ నియంతృత్వంపై ఖలీదా జియాతో పాటు అన్ని పార్టీల నేతలతోనూ కలిసి పోరాడారామె. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారితో పాటు వీధి పోరాటాలూ చేశారు. 1996 ఎన్నికల్లో నెగ్గి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. 2001లో ఖలీదా చేతిలో ఓటమి చవిచూశారు. 2006లో అవినీతి ఆరోపణలపై నిర్బంధం పాలయ్యారు. 2008లో జైలు నుంచి విడుదలయ్యాక ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. నాటినుంచీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆమె ఇప్పటికే మొత్తమ్మీద 19 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న మహిళా దేశాధినేతగా ఇప్పటికే రికార్డులకెక్కారు. -
మిత్రపక్షం శివసేనకు కాంగ్రెస్ షాక్.. అందుకు నో!
ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనకు (ఉద్ధవ్‌వర్గం) కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 23 సీట్లలో పోటీ చేస్తామంటూ శివసేన చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామమ్యులైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించేందుకు నేతలు సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఎంవీఏ కూటమీ పేరులో మహారాష్ట్రలో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే 2022లో శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని రెండుగా చీల్చాడు. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. దీంతో ఎంవీఏ కూటమి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన శివసేనలో ఏక్నాథ్ షిండే వైపే మెజార్గీ నేతలు వెళ్లిపోయారు. ఉద్దవ్ వర్గంలో తగినంత అభ్యర్థులు లేకపోయినప్పటికీ 23 స్థానాలు కోరడం సరికాదని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. సీట్లు గెలుచుకోవడంపై నేతలు విభేదాలు మానుకోవాలని అన్నారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు, కానీ వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. సంక్షోభం అనంతరం శివసేన నేతలు వెళ్లిపోయారని, వాళ్లకు అభ్యర్థుల కొరత సమస్య. ఉంది’ అని తెలిపారు. శివసేన, శరద్‌పవార్ ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కటే స్థిరమైన ఓట్‌షేర్‌తో కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు సమావేశంలో తెలిపారు.పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. ప్రతి పార్టీ సీట్లు ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ చేయడం ఎక్కవ అని అభిప్రాయపడ్డారు. -
సామాన్యులను వేధించే ప్రశ్నలెన్నో!
ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు అలా ముగిశాయో లేదో... 2024 సాధారణ ఎన్నికల ఫలితాల గురించిన ఊహాగానాలు అప్పుడే మొదలైనాయి.ఈ ఫలితాల ఊపుతో బీజేపీనే తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతున్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ముస్లింలకు సీట్లు ఇవ్వని బీజేపీ మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తుందనే ప్రశ్న వేధిస్తోంది. అంకెలకు ఉద్వేగాలు ఉండవు. నిరావేశంగా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, వాస్తవాలు నిగ్గుదేలుతాయి. అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ ఓట్ల శాతంలో తేడా అతి తక్కువ. ఆ ఎన్నికల ఫలితాలకు ముందూ, తరువాతా ఆయా పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పు లేదు. మరి 2024లో ప్రతిపక్షాల విజయం ఒక ఎండమావి అని ఎలా నిర్ణయిస్తారు? ఈనాడు భారతదేశం మొత్తం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల గురించే ఆలోచిస్తోంది. అయితే ఈ ఎన్నికల కంటే కూడా 2024 సాధారణ ఎన్నికలలో బీజేపీ మళ్లీ గెలుస్తుందా లేక కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండియా’ కూటమి వస్తుందా అనే దాని గురించి ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ‘ఇండియా’ కూటమికి సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల సీట్ల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అలసత్వం చేసింది. ఈ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్‌కూ వచ్చిన ఉన్న ఓట్ల శాతంలో తేడా అతి తక్కువ. అసలు ముస్లివ్ులకు సీట్లు ఇవ్వని బీజేపీ, మళ్ళీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తుంది అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. మొన్న తెలంగాణ ఎన్నికలలో గెలిచాక ప్రోటెవ్‌ు స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను కాంగ్రెస్ నియమించినందుకు అసెంబ్లీలో ఆయన సార థ్యంలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయకుండా బీజేపీ బాయ్ కాట్ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య. ఎందుకంటే ముస్లివ్ుల పాత్ర లేకుండా హైదరాబాద్ జీవితమే లేదు. ప్రపంచ మొత్తం పర్యాటకులు హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడతారు. చార్మినార్ దగ్గర సెంటు, గాజులు కొనుక్కొనని హిందూ స్త్రీలు లేరు. వారి ఉత్పత్తులను అనుభవిస్తూనే వారిని శత్రువులుగా చూడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి సంగీతాన్ని ఆస్వాదిస్తూ, వారి హీరోలతో సినిమాలు నిర్మించి వందల కోట్లు సంపాదిస్తూ, రాజకీయంగా వచ్చేటప్పటికి మాత్రం వారిని నిరోధించడం అప్రజాస్వామికం కాదా! మరో పక్క సామాజిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు ఏంటంటే, ఈ ఎన్నికలలో వచ్చిన సీట్ల సంఖ్య మనకు అంత ప్రధానం కాదు. ఓట్ల శాతమే మనకు నమూనా. మూడు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బేననడం సందేహం లేదు. అంతేకాదు 2024లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్న వారికి ఆ ఫలితాలు తీవ్ర ఆశాభంగం కలిగించాయని కూడా చెప్పొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్రాత్మక పునరాగమనంతో నెల కొన్న ఉత్సాహాన్ని ఉత్తరాది అపజయాలు ఒక విధంగా తగ్గించి వేశాయి. తదుపరి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి అవి అనేక అను కూల తలను సృష్టించాయని కూడా అంటున్నారు. కానీ ఇదెంతవరకు నిజం? అంకెలకు ఉద్వేగాలుండవు. నిరావేశంగా ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించండి, వాస్తవాలు నిగ్గు దేలుతాయి. ఆ ఎన్నికల ఫలితాలకు ముందూ, తరువాతా ఆ యా పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పు లేదని స్పష్టమవుతుంది. మరి 2024లో ప్రతిపక్షాల విజయం ఒక ఎండమావి అని ఎలా నిర్ణయిస్తారు? మూడు రాష్ట్రాలలో బీజేపీకి తిరుగులేని విజయం లభించడంతో, కేంద్రంలో ఆ పార్టీని మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ప్రధాన రాజ కీయ పక్షాలకు లభించిన ఓట్ల గణాంకాలను చూద్దాం. మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మొత్తం 12.29 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో బీజేపీకి 4.82 కోట్లు, కాంగ్రె స్కు 4.92 కోట్లు (‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొంటే 5.06 కోట్లు) లభించాయి. మధ్యప్రదేశ్‌లో మినహా, ఓట్ల పరంగా బీజేపీకి లభించిన ఆధిక్యత స్వల్ప స్థాయిలో మాత్రమే ఉంది. తెలంగాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు లభించాయి. మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓట్ల లోటును తెలంగాణ గణ నీయంగా భర్తీ చేసింది. మీడియా ఊదరకు విరుద్ధంగా తాజా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ప్రజల మద్దతు మరీ విశేషంగా ఏమీ లభించలేదని చెప్పొచ్చు. అసలు బీజేపీ ప్రాతినిధ్యం వహించే హిందూ ధార్మిక వ్యవస్థ గురించి అంబేడ్కర్ విశ్లేషించారు. హిందూమతం ధర్మవ్యాపక సంస్థ (మిషనరీ మతం) అవునా, కాదా అనేది చర్చనీయాంశం. హిందూ మతం ఏనాడూ ప్రచారక మతంగా లేదని కొందరంటారు. ఒకానొక కాలంలో హిందూ మతం ప్రచారక మతంగా ఉన్నదనడమే సరిౖయెన వాదంగా కన్పిస్తుంది. అది ప్రచారక మతం కాకపోతే భారత భూభాగంలో ఇంతగా వ్యాపించి ఉండేది కాదు. ఈనాడు అది ప్రచారక మతం కాదనేది కూడా సత్యమే. ఒకప్పుడు ప్రచారక మతంగా ఉన్న హిందూమతం ఇప్పుడెందుకు దానికి వ్యతిరేకంగా మారింది? ఈ ప్రశ్నకు నా జవాబు ఇది: హిందూమతం ప్రచారక మతంగా ఎప్పుడాగి పోయిందంటే, హిందువులలో కులవ్యవస్థ ఏర్ప డినప్పుడు! కుల వ్యవస్థకూ, మతం మార్పునకూ పొసగదు. మతం మార్పునకు కావలసింది విశ్వాసాలూ ,సిద్ధాంతాలూ స్వీకరించడం మాత్రమే కాదు; ఈ మతం మార్పులో అంతకంటే ముఖ్యమైన మరొక విషయం ఉంది. అది – మతం మార్చుకొన్న వారికి సంఘ జీవనంలో లభించే స్థానం. ఈనాడు ఇతరుడెవరైనా హిందూ మతాన్ని స్వీకరించదలిస్తే, హిందూ మతంలో అతని స్థానమెక్కడ? ఏ కులంలో చేర్చుకోవడం? అన్యులైన వారిని తన మతంలో చేర్చుకోవాలనుకునే ప్రతీ హిందువునీ తికమకపరిచే సమస్య ఇది. ఏదో ఒక క్లబ్బులో చేరినట్టు ఒక కులంలో అందరూ చేరడానికి వీలు లేదు. క్లబ్బు సభ్యత్వం వలే కుల సభ్యత్వం స్వేచ్ఛాయుతమైంది కాదు. ఆ కులంలో పుట్టిన వారికే ఆ కులంలో సభ్యత్వం. అది కుల న్యాయం. ఈ న్యాయం కింద ఏ కులానికి ఆ కులమే స్వయం స్వతంత్రం. ఎవరైనా కొత్త వారిని ఏ కులంలోనైనా చేర్పించే అధికారం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. నిజానికి అంబేడ్కర్ హిందూ భారతాన్ని ఆశించ లేదు. లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద భారతాన్ని ఆశించాడు. ఆయన మార్గంలో నడవకపోతే భారతదేశం ఆర్థిక, సాంఘిక,సాంస్కృతిక, విద్య, తాత్విక రంగాలలో అణగారిపోతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు
సాక్షి, అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్), సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవాటెల్‌లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ (వ్యయం) యశ్చి0ద్ర సింగ్‌తో పాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర తదితరులు హాజరయ్యారు. జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్చికరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా, శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ప్రతి దశలో అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఓటర్ల జాబితాలన్నీ దోష రహితంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా ఒక్క మరణించిన వ్యక్తి కానీ, డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితాల స్వచ్చికరణ జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా, నిర్భయంగా, సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఈవీఎంలు, ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్‌ను మైక్రో ప్లాన్‌కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు. లొకేషన్ మేనేజ్మెంట్ (డిస్పాచ్ సెంటర్, రిసీట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్లు)కు కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలు కూడా కీలకమని చెప్పారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక స్వీప్ ప్రణాళిక గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకొని, దాని ఆధారంగా ప్రాంతాలనుబట్టి ప్రత్యేక సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యలకు కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, స్థానికుల్లో భయాలను పోగొట్టాల్సిందిగా చెప్పారు. సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), ఎథికల్ ఓటింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్ తదితరాలపైనా ఎన్నికల సంఘం ప్రతినిధులు మార్గనిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల సమీక్షలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, సమ్మిళిత ఎన్నికల నిర్వహణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భేష్ రెండు రోజుల సమీక్ష సమావేశాలకు మంచి ఏర్పాట్లు చేసి, విశిష్ట ఆతిథ్యమిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు నేతృత్వంలోని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ బృందం ధన్యవాదాలు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికలపై ఈసీఐ అధికారుల నేతృత్వంలో విజయవంతంగా జరిగిన నిర్మాణాత్మక సమీక్ష సమావేశాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు మార్గదర్శిగా నిలిచాయని కలెక్టర్ డిల్లీరావు చెప్పారు. ఈ సందర్భంగా ఈసీఐ అధికారులను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచాలి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. వారు శనివారం సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం సరఫరా వంటివి నిరోధించడానికి ఎక్సైజ్ శాఖ, సెబ్ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని స్థాయిల్లో సమాచారం నిరంతరాయంగా వెళ్లేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇంటెలిజెన్స్ సహాయంతో సకాలంలో చర్యలు తీసుకోగలమని తెలిపారు. దుర్గమ్మ సేవలో కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శర్మ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, ప్రత్యేక అధికారి ధర్మేంద్ర శర్మ శనివారం దర్శించుకున్నారు. ధర్మేంద్ర శర్మకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. ధర్మేంద్రశర్మ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు. -
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలపై సీఈసీ కసరత్తు
సాక్షి, అమరావతి: వచ్చే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు సహా మొత్తం ఏడుగురు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సమీక్షిస్తారు. తదనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరాలపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలసి పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. -
ఐపీఎల్-2024 విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! కారణాలు?
IPL 2024: క్రికెట్ ప్రేమికులకు ఏటా కావాల్సినంత వినోదం పంచుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలోనే ధనిక టీ20 లీగ్‌గా పేరొందిన ఈ మెగా టోర్నీని ప్రతి ఏడాది ప్రథమార్థం ముగింపు దశలో నిర్వహిస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే, ఈసారి మాత్రం ఐపీఎల్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు తప్పేలా లేవు. ఓవైపు లోక్‌సభ ఎన్నికలు.. మరోవైపు టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో క్యాష్‌రిచ్ లీగ్ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. కాగా సాధారణ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో దేశ, విదేశాల నుంచి వచ్చే స్టార్ క్రికెటర్లు పాల్గొనే ఐపీఎల్ కూడా నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిన తర్వాతే ఈ నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను వాయిదా వేయాలని భావిస్తే జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ ఈవెంట్ అడ్డుతగులుతుంది. దీంతో ఈసారి ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ విషయంలో ఐపీఎల్ పాలకమండలి లోక్‌సభ ఎన్నికల నగారా మోగే వరకు ఎదురుచూసి అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్లు పీటీఐ వెల్లడించింది. గతంలో సౌతాఫ్రికా, యూఏఈలో కాగా 2009, 2014, 2019 సాధారణ ఎన్నికల సమయంలో కూడా ఐపీఎల్ నిర్వహణ విషయంలో ఇలాంటి సమస్యలే తలెత్తాయి. రెండో ఎడిషన్(2009)లో వేదికను మొత్తంగా సౌతాఫ్రికాకు తరలించగా.. ఏడో సీజన్(2014)లో మొదటి సగం మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించారు. ఇక 2019లో తొలి 19 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. ఎన్నికల తేదీల విషయంలో స్పష్టత వచ్చాక మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించి ఇండియాలోనే టోర్నీని నిర్వహించింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 19 ఐపీఎల్-2024 మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: బీసీసీఐ అలా చేస్తే.. అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు: రసెల్ -
772 సెట్ల నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 4,798 మంది అభ్యర్థులు మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. పరిశీలన అనంతరం 3,307 సెట్ల నామినేషన్లను స్వీకరించగా, మరో 772 సెట్ల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన సెట్ల పరిశీలకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి వరకు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఈ నెల 15తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. – ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 73 నామినేషన్లను తిరస్కరించారు. నాగార్జునసాగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి.. ప్రపోజర్స్ సంతకాలు సరిపడా చేయించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలుచేసిన మోత్కుపల్లి నర్సింహులు అఫిడవిట్ అందజేయకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. – ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలుచేసిన పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. -
ఫిబ్రవరి 8న పాకిస్తాన్ ఎన్నికలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరుపుతామని అధ్యక్షుడు అరిఫ్ అల్వీ గురువారం ప్రకటించారు. దేశంలో ఆర్థిక అస్థిరత తీవ్రరూపం దాలి్చన ఈ సమయంలో అధ్యక్షుడితో చర్చించి, ఎన్నికల తేదీని ఖరారు చేయాలంటూ అంతకుముందు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్(ఈసీపీ) చీఫ్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా, కమిషన్‌లోని నలుగురు సభ్యులు, అటార్నీ జనరల్ ఉస్మాన్ అవాన్ కలిసి అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కలిశారు. ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికల తేదీని 2024 ఫిబ్రవరి 8గా నిర్ణయించినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్‌కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్‌తో నగదును హైదరాబాద్‌లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
ఒకే రోజు రూ.35 కోట్లు జప్తు
సాక్షి, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజాంపేట్, రఘునాథపల్లి: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో బుధవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో మొత్తం రూ.35.52 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో బుధవారం నాటికి రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.165.81 కోట్లకు పెరిగిపోయింది. బుధవారం రూ.6.25 కోట్ల నగదును జప్తు చేయగా, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.77.87 కోట్లకు పెరిగింది. 7వ తేదీ నుంచి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.8.99 కోట్లు విలువ చేసే 59,091 లీటర్ల మద్యం, 18,088 కిలోల నల్లబెల్లం జప్తు చేశారు. రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత బుధవారం రూ.3 కోట్లు విలువ చేసే 1,086 కేజీల గంజాయిని పట్టుకోగా, ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం గంజాయి విలువ రూ.7.55 కోట్లకు పెరిగింది. కాగా ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం బంగారం, ఇతర ఖరీదైన లోహాల విలువ రూ.62.73 కోట్లకు చేరింది. బుధవారం రూ.2.3 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు, వాహనాలను జప్తు చేయగా, ఇప్పటివరకు జప్తు చేసిన ఇలాంటి వస్తువుల మొత్తం విలువ రూ.8.64 కోట్లకు చేరింది. దీంతో జప్తు చేసిన మొత్తం నగదు, ఇతర వస్తువుల విలువ రూ.165.81 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధాణ ఎన్నికల్లో మొత్తం రూ.97 కోట్ల నగదు, రూ.34 కోట్లు విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వికాస్‌రాజ్ తెలిపారు. గిఫ్ట్ ఆర్టికల్స్, బెడ్‌షీట్స్ స్వాధీనం హైదరాబాద్ దక్కన్, దానాపూర్–సికింద్రాబాద్ రైళ్లలో పార్శిల్ సర్వీసు ద్వారా సికింద్రాబాద్‌కు చేరుకున్న 30 భారీ కాటన్ పార్శిళ్ల స్టెయిన్లెస్ స్టీల్ గిఫ్ట్ ఆర్టికల్స్, బెడ్షీట్లను రైల్వేపోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 26 కాటన్ పార్శిళ్లల్లో రూ.1.29 కోట్ల విలువ చేసే 2,160 కిలోల స్టెయిన్ లెస్ స్టీల్ ఆర్టికల్స్, మరో నాలుగు కాటన్ పార్శిళ్లల్లో రూ.78 వేల విలుచేసే దుప్పట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరో కేసులో సికింద్రాబాద్ జనరల్ బజార్‌కు చెందిన కిషోర్‌సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 538 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 2.25 కోట్ల విలువైన చీరల పట్టివేతబాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ప్రగతినగర్‌లోనిపంచవటి అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్నఏపీ 16టీవీ 3280 నంబరు గల లారీలో సరుకును పరిశీలించగా భారీ మొత్తంలో చీరలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.2,25,98,500 ఉంటుందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పంచవటి అపార్ట్మెంట్లో ఓ రాజకీయపార్టీ సమావేశం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. రూ.1.37 కోట్ల బ్యాంక్ డబ్బు సీజ్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద క్యూ ఆర్ కోడ్ సరిగా లేని బ్యాంకు నగదు రూ.1,37,50,000ను పోలీసులు సీజ్ చేశారు. -
నోట్ దిస్ పాయింట్.. రూ.50 వేల వరకు తీసుకెళ్లేందుకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం వెలువడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు విభాగం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేయడం ప్రారంభించింది. ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వినియోగించే అక్రమ మద్యం, నగదుపై డేగకన్ను వేసింది. సోమ, మంగళవారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల క్రతువు ముగిసేవరకు ఈ తనిఖీలు సాగనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వృత్తి, వ్యాపార, క్రయవిక్రయాల కోసం నగదు తరలించే వారిలో అనేక సందేహాలున్నాయి. కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రూ.50 వేలకు మించితే... ఓ వ్యక్తి తన వెంట రూ.50 వేల వరకు మాత్రమే నగదును తీసుకెళ్లవచ్చు. అంతకుమించిన మొత్తం తీసుకెళ్లాలంటే దాని మూలాలను నిరూపించే ఆధారాలు కచ్చితంగా కలిగి ఉండాలి. వ్యాపారులు దానికి సంబంధించిన పత్రాలు, లావాదేవీల బిల్లులు కలిగి ఉండాల్సిందే. సాధారణ వ్యక్తులు తీసుకెళ్తుంటే బ్యాంకు నుంచి డ్రా చేసిన పత్రాలు లేదా ఆ నగదు ఎక్కడ నుంచి వచి్చందో, ఎందుకు వినియోగిస్తున్నామో చెప్పడానికి అవసరమైన ఇతర ఆధారాలు చూపించాలి. ♦ రూ.2 లక్షలకు మించిన నగదు తలింపును మాత్రం పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ మొత్తం తమ వద్దకు ఎలా వచి్చంది? ఏం చేయబోతున్నారు? అనే వాటికి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో పోలీసులు నగదు స్వా ధీనం చేసుకుంటారు. ఇలా సీజ్ చేసిన నగదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే అది జిల్లా ఎన్నికల అధికారి నియమించే కమిటీ వద్దకు వెళ్తుంది. ♦ నలుగురు సభ్యులతో ఉండే ఈ జిల్లా కమిటీ ఎదుట నగదు యజమాని హాజరై నగదు మూలం, అవసరాలకు సంబంధించి వివరణ ఇవ్వాలి. దీనిపై కమిటీ సంతృప్తి చెందితే నగదు తిరిగి అప్పగిస్తుంది. లేదంటే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఆదేశిస్తుంది. ♦ పోలీసులు స్వాదీనం చేసుకున్న నగదు రూ.10 లక్షలకు మించితే విషయం ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. నగదును స్వా«దీనం చేసుకునే ఆ అధికారులు బాధ్యులకు నోటీసులు జారీ చేస్తారు. వారిచ్చే సమాధానాన్ని వివిధ కోణాల్లో పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటారు. ♦ కొత్త బంగారం, వెండి నగలు, వస్తువులతోపాటు గిఫ్ట్ ఆర్టికల్స్, కుక్కర్లు, క్రికెట్ కిట్స్ వంటి సామగ్రి విలువ రూ.10 వేలకు మించితే పోలీసులు స్వా«దీనం చేసుకుంటారు. యజమానులు వాటిని వ్యాపార నిమిత్తం తరలిస్తున్నట్లు పత్రాలు చూపించి, నిరూపించుకుంటేనే తిరిగి అప్పగిస్తారు. లేదంటే విషయం ఎన్నికల అధికారుల వద్దకు వెళ్తుంది. ♦ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సైతం తాము ఖరీదు చేసే ప్రచార, ఇతర సామగ్రికి సంబంధించి విక్రేతలకు రూ.10 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయకూడదు. అంతకంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయాలంటే చెక్కులు, ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థి లేదా అతని ఏజెంట్ కూడా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. ♦ పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు (రూ.50 వేలలోపు అయినా), వస్తువులు (రూ.10 వేల కంటే తక్కువ విలువైనవి అయినా) ఓటర్లను ప్రలోభ పెట్టడానికని ఆధారాలు లభిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. బాధ్యులపై ఐపీసీ 171(బీ) రెడ్‌విత్ 171(సీ) సెక్షన్లతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 123 ప్రకారం వీటిని రిజిస్టర్ చేసి దర్యాప్తుచేస్తారు. బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశమూ ఉంది. -
Telangana: ఎన్నికలొచ్చాయ్..
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. అదే నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం శాసనసభలకు ఎన్నికల ఏర్పాట్లు, ఇతర వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్,ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సోమవారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఒకే దశలో.. : వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగిసే తెలంగాణ అసెంబ్లీలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈసారి ఒకే విడతలో జరుగనుంది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ దాఖలుకు నవంబర్ 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 13న దరఖాస్తుల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఇస్తారు. అదే నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో, మిగతా మూడు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ పూర్తికానుంది. ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ వేర్వేరు తేదీల్లో ఉన్నా.. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మాత్రం డిసెంబర్ 3వ తేదీనే చేపట్టి, ఫలితాలను ప్రకటించనున్నారు. ఐదు రాష్ట్రాలు.. 16.14 కోట్ల మంది ఓటర్లు ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2,900కు పైగా పోలింగ్ కేంద్రాలను యువత నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపు, ఉచితాలు, బహుమతులు, మద్యం, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి విస్తృత తనిఖీలు చేపట్టనున్నామని.. ఈ మేరకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 940 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మొదటిసారిగా ‘సీజర్ మేనేజ్మెంట్ సిస్టం’ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ను ఎవరైనా అతిక్రమించినట్టు గుర్తిస్తే.. సీవిజిల్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు తప్పనిసరిగా కేసులకు సంబంధించి పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొదటిసారిగా ‘ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం’ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ఖర్చుపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలతోపాటు రైల్వే, పోస్టల్ కార్గోలను క్షుణ్నంగా తనిఖీ చేస్తామని చెప్పారు. వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తామన్నారు. -
వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం: లక్ష్యం.. క్లీన్ స్వీప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. గత 53 నెలలుగా సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇంటికీ, గ్రామానికీ, నియోజకవర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని మరింత ప్రభావవంతంగా వివరించడం.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు. ఇందుకు ‘రాష్ట్రానికి జగనే కావాలి’ (వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమాన్ని చేపట్టాల్సిన తీరుపై ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు సీఎం సందేశాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తారు. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఇప్పటికే 99.5 శాతం హామీలు అమలు చేశా>రు. గత 53 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.69 లక్షల కోట్ల ప్రయోజనం పేదలకు చేకూర్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. వార్డు, గ్రామ సచివాలయాలు, జిల్లాల పునర్విభజన ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పోర్టులు, షిప్పింగ్ యార్డులు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేశారు. దాంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తోంది. తద్వారా సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడంతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయభేరి మోగించడం అందుకు నిదర్శనం. నిత్యం ప్రజలతో మమేకం అధికారంలోకి వచ్చాక అనునిత్యం ప్రజలతో సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ప్రజాప్రతినిధులు మేమకమవుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రతి ఇంటికీ వివరించడానికి 2022 మే 11న చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి 29 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 1.45 కోట్ల కుటుంబాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు మమేకమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘మెగా పీపుల్స్ సర్వే’లో 1.16 కోట్ల కుటుంబాల ప్రజలు అంటే 80 శాతం మంది ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించారు. ఇటీవల ప్రముఖ జాతీయ ఛానల్ టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని తేలడమే అందుకు నిదర్శనం. ప్రజల్లో అత్యంత సానుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సమన్వయంతో పనిచేస్తే 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం సాధ్యమేనని పార్టీ ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు సమాయత్తం : సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో సోమవారం పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నాలుగున్నరేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ సమర్థవంతంగా తిప్పికొట్టి.. ప్రజల ఆశీర్వాదం కోరే దిశగా శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారని వివరించారు. విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆదివారం ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు చల్లా మధుసూధనరెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయలని సూచించారు. భద్రత ఏర్పాట్ల గురించి విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా వివరించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగడం ఐదుకోట్ల మంది ప్రజలకు చారిత్రక అవసరం అన్నారు. అవినీతి పరుడైన చంద్రబాబు ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లినట్లుగా టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభకు హాజరయ్యే ఆహ్వానితులు సకాలంలో సభ ప్రాంగణానికి చేరుకోవాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం ఆయన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల కూర, పీతల వేపుడు, రసం, కుండ పెరుగు.. తదితర 30 రకాల వంటకాలతో పసందైన భోజనం అందిస్తామన్నారు. ఆహ్వానితులు ఉదయం 8.30 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోవాలన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని, పోలీసులు స్టేడియం లోపల, బయట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. -
వచ్చే జనవరిలో పాకిస్థాన్ ఎన్నికలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో జరగనున్నాయి. ఈ మేరకు పాక్ ఎలక్షన్ కమిషన్(ఈసీపీ) గురువారం ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విజనపై ఈసీపీ ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ నెల 27న మొదటి లిస్టును విడుదల చేయనుంది. డీలిమిటేషన్ మొదటి లిస్టుపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత నవంబర్ 30న తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత దాదాపు 54 రోజులపాటు ఎన్నికల ప్రచారానికి సమయం కేటాయించారు. 2024 జనవరి చివరి వారంలో పోలీంగ్ జరగనున్నట్లు ఈసీపీ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో జాతీయ సభ ఆగష్టు 9న గడువుకు ముందే రద్దు చేయబడింది. డీలిమిటేషన్, జనగణన ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని షహబాజ్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ప్రభుత్వం రద్దు అయిన 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ సమయం దాటిపోతున్నందున డీలిమిటేషన్ ప్రక్రియకు గడువు కుదించాలని రాజకీయ పార్టీలు ఈసీపీపై ఒత్తిడి పెంచాయి. కానీ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నాలుగు నెలలు పడుతుంది. ఇదీ చదవండి: ఐరాసలో కశ్మీర్ అంశంపై తుర్కియే వివాదాస్పద వ్యాఖ్యలు -
కేంద్రం మరో సంచలనం: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే.. అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. 2024 ఎన్నికలకు ముందు కేంద్రం మోటార్ ఇంధన ధరలపై దృష్టి పెట్టే అవకాముందని సిటీ గ్రూప్ నివేదించింది. ఎల్పీజీ సిలిండర్ల రేటును తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గనుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలకమైన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే దేశ ప్రజలకు ఊరట కల్పించనుందని అంచనా వేస్తున్నారు. వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం ద్రవ్యోల్బణాని చెక్ పెట్టడమేకాకుండా, కొన్ని ప్రధాన పండుగలు, కీలక ఎన్నికలకు ముందు గ్యాసోలిన్, డీజిల్ ధరల తగ్గింపు వైపు దృష్టి సారించనుందని సిటీ గ్రూప్ తన కథనంలో పేర్కొంది. ఎల్పీజీ తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి, ఎం. జైదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టొమాటో ధరల తగ్గుదల, తాజా చర్యతో సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 6శాతం దిగువకు చేరే అవకాశం ఉందన్నారు. జులైలో 15 నెలల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ధరలను చల్లబరచడానికి అధికారులు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎల్పీజీ సిలిండర్ల ధరలను 14.2 కిలోగ్రాముల గ్యాస్‌ను 200 రూపాయలు తగ్గింపుతో దాదాపు 300 మిలియన్ల వినియోగ దారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఆహార ధరలను తగ్గించడానికి గృహ బడ్జెట్లను అదుపులో ఉంచడానికి భారతదేశం ఇప్పటికే బియ్యం, గోధుమలు , ఉల్లిపాయలు వంటి ప్రధాన వస్తువుల ఎగుమతులను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడితోపాటు, కే- ఆకారపు రికవరీ నేపథ్యంలో, గ్యాస్ ధర తగ్గింపు వినియోగదారుల సెంటిమెంట్‌కు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్‌లో డిమాండ్-సరఫరా కొరత కారణంగా ఉల్లి ధర పెరుగుతుందన్న అంచనాలను గమనించాలన్నారు.అలాగే గ్లోబల్ క్రూడ్ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, గత ఏడాదినుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదనీ, ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ కోతద్వారా ఇంధన ధరలను తగ్గించవచ్చని, ఎన్నికల ముందు ఈ అంశాన్ని తోసి పుచ్చలేమని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ, మిజోరం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది చివరల్లో జరగ నున్నాయి. ఆ తర్వాత 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
Times Now ETG Survey: మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ సర్వేలో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని తెలిపింది. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తేలిన విషయం తెలిసిందే. జూన్ 15– ఆగస్టు 12వ తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయని తెలిపింది. ఏప్రిల్‌లో జరిగిన సర్వే, తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఆ తేడా జాతీయ స్థాయి ఫలితాల్లోనే కనిపించింది. ఏపీకి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని తేలింది. కాగా, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పాలన.. వైఎస్సార్సీపీకి జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యం కాదని ఆ పార్టీ తొలి నుంచి చెబుతోంది. If BJP joins TDP, they're strengthening Chandrababu Naidu. Else, YSRCP can sweep all 25 seats: @sreeramjvc, on seat share in AP as per @ETG_Research Survey In last 3 LS polls, Cong's highest seat share in K'taka was 9, while BJP has got 25: @Sanju_Verma_ tells @PadmajaJoshi pic.twitter.com/4xm06LEprr — TIMES NOW (@TimesNow) August 16, 2023 -
బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది...
భువనేశ్వర్: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బిజూ జనతాదళ్ (బీజేడీ) మధ్య పొత్తు వ్యవహారాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా స్పష్టంగా తోసిపుచ్చారు. రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆయన ఆదివారం ఈ విషయం వెల్లడించారు. తాజా ఎన్నికల్లో పోటీ కోసం ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య పొత్తు ఉంటుందని వ్యాపించిన ఊహాగానాల పట్ల కేంద్ర మంత్రి ఇలా స్పందించడం విశేషం. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో స్నేహపూర్వకంగా మెలగడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపట్ల ఒకరితో ఒకరు పోటాపోటీగా పొగడ్తలు గుప్పించిన నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీతో బీజేపీ జట్టు కడుతుందనే ఊహాగానాలకు బీజం పడింది. తాజాగా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా పొత్తు సమీకరణాల్ని నిరాకరించారు. రాష్ట్రంలో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. రెండు రాజకీయ పార్టీలు ఇప్పట్లో కానీ, సమీప భవిష్యత్తులో కానీ పొత్తు పెట్టుకోబోవని గట్టిగా ఒక్కాణించారు. గత ఎన్నికల మాదిరిగానే బీజేడీతో ఎటువంటి పొత్తు, మైత్రి, కూటమి లేకుండా బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రామాణికలకు ప్రాణం పోసే దిశలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వేగవంతమైన అభివృద్ధితో దేశ సమగ్రాభివృద్ధికి నిరవధికంగా కృషి చేస్తుందని చెప్పారు. ఈ పాలన తీరు దేశ వ్యాప్తంగా ప్రజల హృదయాల్ని స్పందింప జేసిందన్నారు. ప్రాంతీయం నుంచి పార్లమెంటు వరకు మోదీ నేతృత్వంలో బీజేపీ విజయానికి ఏమాత్రం ఢోకా ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా కాషాయ పార్టీ ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో పూర్తి ఆధిక్యతతో ఏకై క బలమైన పార్టీగా ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బాహాటంగా సవాలు విసిరారు. సంస్థాగత వ్యవహారాలు పటిష్టం.. భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాలు పటిష్టత పుంజుకున్నాయి. తాజా రాజకీయ స్థితిగతుల దృష్ట్యా భావి పరిణామాలకు దీటుగా ఈ వ్యవహారాల కార్యాచరణ పూర్తి భిన్నంగా పార్టీ రూపొందించింది. -
‘కేంద్రంలో సంకీర్ణమే.. బీఆర్ఎస్ లేకుండా ఎవరూ ప్రధాని కాలేరు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికలపై సంచలన కామెంట్స చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మద్దతు లేకుండా ఎవరూ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ శనివారం యాదాద్రి భువనగిరి పర్యటనలో ఉన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నేతన్నకు ప్రతీక మగ్గం. సీఎం కేసీఆర్‌కు నేతన్నల కష్టాలు తెలుసు. నేతన్నల సంక్షేమం కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. నేతన్నకు చేయూత పేరిట పొదుపు పథకం తీసుకొచ్చాం. రైతుబీమా తరహాలో నేతన్నకు బీమా తెచ్చాం. ఇవన్నీ కేసీఆర్ సీఎం కావడం వల్లే సాధ్యమైందన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఉంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు. ఉప్పల్‌లో హ్యాండ్లూమ్ మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోచంపల్లి చేనేత కళాకారులు భాగస్వాములై వినియోగించుకోవాలి. నేత కార్మికులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అండగా ఉంటుంది. మాది కోతల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం. 2001లో భూదాన్ పోచంపల్లిలో నేతన్నలను కాపాడుకునే ప్రయత్నం చేశామని కేటీఆర్ వివరించారు. ఇది కూడా చదవండి: నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు.. వైన్స్ టెండర్లు మాత్రం క్లియర్.. కేసీఆర్ సర్కార్ బీజేపీ ఫైర్ -
రాజకీయ గాలివాటం మారనుందా?
ఇటీవల దేశంలోని పదిహేను ప్రతిపక్ష పార్టీలు పట్నాలో సమావేశమై, రానున్న ఎన్నికల్లో అధికార బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ లేదా కాంగ్రెసేతర పక్షాలతో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు దాదాపుగా లేవు. ‘సహజ నేత’ విషయంలో పట్టుబట్టబోమని ఇప్పటికే కాంగ్రెస్ సూచనప్రాయంగా స్పష్టం చేసింది. అయితే అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు నమ్మదగ్గ సైద్ధాంతిక ఆలోచన మాత్రం ప్రతిపక్షాల వద్ద కరవైంది. పరిపాలన విషయంలోనూ ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సి ఉంటుంది. బలమైన ప్రత్యర్థిగా ఎదగాలంటే భాగస్వామ్య పక్షాలన్నీ తమ బలాలు, బలహీనతలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బిహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన పదిహేను ప్రతిపక్ష పార్టీల సమావేశానికి వర్త మాన రాజకీయ పరిస్థితుల్లో ప్రాముఖ్యత ఏర్పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాన్ని పక్కనపెడతే, ప్రతిపక్షాల సమావేశం సరైన దిశలోనే సాగిందని చెప్పాలి. అలాగే ఈ సమావేశంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో రాజకీయ అవగాహన, పొత్తు ఉండే అవకాశాలూ సన్నగిల్లాయి. అయితే పట్నా మీటింగ్‌తో మూడు విషయాలైతే స్పష్టమయ్యాయి. మొదటిది... సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ లేదా కాంగ్రెసేతర పక్షాలతో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు దాదాపుగా లేవు. ప్రతిపక్ష కూటమి ఏదైనా ఏర్పడాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంగానే జరగాలి. అప్పుడే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమితో ధీటైన పోటీ సాధ్యం. రానున్న కొన్ని నెలల్లో రాజ కీయ శక్తుల పునరేకీకరణ జరగనుంది. రెండోది... పట్నా సమావేశానికి హాజరు కాని పార్టీలు ఒక దగ్గర చేరే అవకాశాలు లేకపోవడం. తెలుగుదేశం, అకాలీదళ్, ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం వంటివి బీజేపీ వైపు మొగ్గుతూంటే... వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ ఏ కూటమిలోనూ చేరే అవకా శాలు లేవు. భారత రాష్ట్ర సమితి కూడా ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ తాము ఏ పక్షమన్నది స్పష్టం చేయకపోవచ్చు. ప్రతిపక్ష కూటమి తమ భాగస్వాముల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి బహుజన్ సమాజ్ మంచి ఉదాహరణ. ప్రతిపక్ష కూటమిలో చేరతామంటూనే గతంలో ఈ పార్టీ పార్లమెంటులో బీజేపీకి మద్దతిచ్చిన విషయం ప్రస్తావనార్హం.మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీఎస్పీ మద్దతును కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 2018లో బీఎస్పీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలుపొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ సంగతి ఏమిటన్నది కూడా ప్రతిపక్ష కూటమి నిర్ణయించుకోవాలి. ముచ్చటగా మూడో అంశం... భాగస్వాముల విషయంలో కాంగ్రెస్ గతం కంటే ఎక్కువగా కొంత పట్టువిడుపుల ధోరణితో వ్యవహరిస్తుందనేందుకు కొన్ని తార్కాణాలు కనిపిస్తున్నాయి. ‘సహజ నేత’ విషయంలో పట్టుబట్టబోమని ఇప్పటికే కాంగ్రెస్ సూచన ప్రాయంగా స్పష్టం చేసింది. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఒత్తిడికి గురి చేసి లోకసభ స్థానాలు తక్కువగా కేటాయించినా ఆ పార్టీ ఇదే విషయానికి కట్టబడి ఉంటుందా అన్నది చూడాలి. బీజేపీని ఎదుర్కొనే విషయంలో ఇంకా ఏమేం చేయాలన్న విషయంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు జూలై నెలలో సిమ్లాలో మరోసారి సమావేశం కానున్నాయి. బహుశా ఈ కూటమి తమ బలాలు, బలహీనతలు, అవకాశాలు, భయాల విశ్లేషణ (స్వాట్ అనాలసిస్) చేసుకుంటుందేమో! బలాలు: కూటమి ఒక రూపం సంతరించుకుంటే మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలోని సామాజిక సమీకరణలు కచ్చితంగా బీజేపీని దెబ్బతీయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఎంతమేరకన్నది ప్రస్తుతానికి అస్పష్టం. 2019లో ఉత్తర ప్రదేశ్‌లో జరిగనట్లుగానే చాలా స్వల్పమైన మార్పే ఉండవచ్చు. మూడేళ్ల క్రితం అక్కడ సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు రెండూ జట్టు కట్టినా అట్టడుగు స్థాయిలోని వైరుద్ధ్యం తగిన లాభాలు ఇవ్వలేక పోయింది. బీజేపీ వేసిన సామాజిక సమీకరణలు, ప్రధాని నరేంద్ర మోదీ పలుకుబడి ముందు నిలవలేకపోయాయి. ఒక్కటైతే వాస్తవం. ప్రతిపక్షాలు విడివిడిగా కంటే ఉమ్మడిగా పోటీచేస్తేనే బీజేపీకి ధీటైన సవాలు విసరగలవు. బలహీనతలు: ‘మోదీ హఠావో’ వంటి ఊకదంపుడు పిలుపులతో ప్రయోజనం ఉండదు. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు నమ్మదగ్గ సైద్ధాంతిక ఆలోచన ప్రతిపక్షాల వద్ద కరవైంది. పరిపాలన విషయంలోనూ ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువల పతనం, క్రోనీ కేపిటలిజమ్ అంటూ ఎంత గోలపెట్టినా వచ్చే లాభం అంతంతే. ఇదే సమయంలో దేశాద్యంతం మోదీ మాదిరిగా అందరినీ మెప్పించగల నాయకుడు కూడా ప్రతిపక్ష కూటమిలో కని పించరు. ఇది ఒకరకమైన విచిత్రమైన పరిస్థితి కల్పిస్తుంది. కూటమి తరఫున ఒక నేతను ప్రతిపాదిస్తే, అధ్యక్ష తరహా ఎన్నికల రూపు సంతరించుకుంటుంది. గతంలో ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. పేరు చెప్పకుండానే ఎన్నికలకు వెళితే బీజేపీ కాస్తా ప్రతిపక్ష కూటమి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించవచ్చు. వచ్చే ఎన్ని కలు వారసత్వ రాజకీయాలకూ, ఈ దేశపు మట్టి మనిషికీ మధ్య జరిగేవని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రతిపక్ష కూటమి ఏర్పాటును తక్కువ చేసే ప్రయత్నం చేశారు. మోదీ ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. వచ్చే ఎన్నికలు కష్టపడి రోజంతా పనిచేసే రాజకీయ నేతకూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికీ మధ్య జరిగేవన్నారు. అవకాశాలు: గత పన్నెండు నెలల్లో జరిగిన అనేక ఒపీనియన్ పోల్స్, సర్వేలు దేశంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్న విష యాన్ని స్పష్టం చేశాయి. చాలామంది భారతీయులు అర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. 2019, 2014లలో బీజేపీ వెంట నిలిచిన యువ ఓటర్లు ఇప్పుడు అంత ప్రేమగా ఏమీ లేరు. 2022లో జరిగిన ‘ది ఆక్సిస్–మై ఇండియా’ ఎగ్జిట్ పోల్‌లో 18 – 25 ఏళ్ల వారు వేసిన ఓట్లలో బీజేపీ, ఎస్పీల మధ్య అంతరం ఒక్క శాతమే. 25 ఏళ్ల పైబడ్డ వారిలో రెండు పార్టీల మధ్య అంతరం ఎక్కువ. ఈ ఏడాది ‘ఇండియా టుడే, సీ ఓటర్’ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలోనూ చాలామంది ఉద్యోగాల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తి 18–34 మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఉండటం గమ నార్హం. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల పనితీరు అంత గొప్పగా ఏమీ లేదు. 2014 నుంచి ఇప్పటి వరకూ 57సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ 29 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇటీవలి కర్ణాటక ఎన్నికలు మారుతున్న పరిస్థితు లకు ప్రబల తార్కాణం. వీటి వల్లనే ప్రతిపక్షాలు రానున్న ఎన్నికలను వీలైనంత వరకూ స్థానికాంశాలపై జరిగేలా చూడాల్సి ఉంటుంది. ముప్పు: 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రాంతీయ స్థాయిలో కాకుండా, జాతీయ స్థాయి అంశాలపై జరిగితే బీజేపీకి కొంత మెరు గైన అవకాశాలు ఏర్పడతాయి. మత, జాతీయవాద రాజకీయాలతో బీజేపీ జనాలను తనవైపు తిప్పుకోగలగడం దీనికి కారణం. 2019లో ముఖాముఖి పోరులో కాంగ్రెస్ నుంచి తొంభై శాతం సీట్లను బీజేపీ లాక్కోగలిగింది. యూపీలో బీజేపీ మును పటి స్థాయిలో సీట్లు సాధించగలిగితే, మిగిలిన చోట్ల ఫలితాలు ఎలా ఉన్నా కేంద్రంలో మెజారిటీకి కూతవేటు దూరంలోకి వచ్చేస్తుంది. పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం 2024 ఎన్నికల హంగామాకు శ్రీకారం చుట్టింది. సిమ్లా సమావేశం నాటికి కూటమి... ప్రజలకు ఏ రకమైన సందేశం ఇవ్వాలి అన్న విషయంతో పాటు దాన్ని నియోజకవర్గాల వారీగా చేరవేసేది ఎవరు? ప్రణాళికలు, వ్యవస్థా గతమైన యంత్రాంగం వంటి వాటిని నిర్ధారించుకోవాలి. లోక్‌సభ ఎన్నికల సినిమా అనేది ఇప్పడు రాష్ట్రాల్లో మాత్రమే నడవడం లేదని ప్రతిపక్ష కూటమి గుర్తించాలి. జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులను కూడా ప్రతిపక్ష కూటమి గుర్తించి మరీ తాము చెప్పదలచుకున్న విషయాలను చెప్పాల్సి ఉంటుంది. లేదంటే ప్రతిపక్ష పార్టీల సమావేశాలు మంచి ఫొటోలు తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. రాహుల్ వర్మ వ్యాసకర్త ఫెలో, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, న్యూఢిల్లీ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు
పాట్నా: లోక్‌సభకు ముందస్తుగానే ఎన్నికలు జరుగుతాయని, ఈ ఏడాదే జరిగినా ఆశ్చర్యం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పనులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024 జనవరి కంటే ముందే ఈ పనులు పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియదని, కచ్చితంగా వచ్చే ఏడాదే జరగాలన్న నియమం ఏమీ లేదని, ముందుగానే జరిగే అవకాశాలున్నాయని, ఈ ఏడాదే జరగొచ్చని, అలా జరగడం సాధ్యమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని అధికారులకు నితీశ్ సూచించారు. పనులన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తయితే తాను సంతోషిస్తానని పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని, ఇప్పుడు దాన్ని 60 శాతానికి తగ్గించారని ఆక్షేపించారు. 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపుతున్నారని చెప్పారు. ‘ప్రధానమంత్రి సడక్ యోజన’ అని పేరుపెట్టిన పథకానికి కేంద్రం 60 శాతం నిధులే ఇస్తోందన్నారు. ఈ నెల 23న పాట్నాలో జరగబోయే ప్రతిపక్షాల కీలక సమావేశంలో ముందస్తు ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారంముందస్తు ఎన్నికలు వస్తాయన్న నితీశ్ కుమార్ వ్యాఖ్యలను బిహార్ బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ కొట్టిపారేశారు. నితీశ్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారని, ఊహాగానాల్లో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. #WATCH | I have always been saying that the (Lok Sabha) elections should be conducted early. It is better if the polls are conducted early. Nobody knows when the elections will be conducted, so I request to do it as early as possible: Bihar CM Nitish Kumar (Source: IPRD Bihar) pic.twitter.com/gQOVHJEIVI — ANI (@ANI) June 14, 2023 ఇది కూడా చదవండి: బెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్లో ఉద్రిక్తత.. -
2024 Elections: పాన్ ఇండియా లెవల్లో తనిఖీలు షురూ
ఢిల్లీ: వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కసరత్తులు మొదలుపెట్టింది కేంద్రం ఎన్నికల సంఘం. ఈ మేరకు మొదటి స్థాయి తనిఖీలను పాన్ ఇండియా లెవల్లో మొదలుపెట్టింది. మొదటి స్థాయి తనిఖీ (FLC) ప్రక్రియలో.. మాక్ పోల్స్ కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఈసీ స్పష్టం చేసింది. ఇది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రక్రియ. ముందుగా కేరళలోని అన్ని నియోజకవర్గాల నుంచి మొదలుపెట్టాం. మొదటి స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ స్థానాల్లో ఈవీఎంలు, పేపర్‌ట్రైల్ మెషిన్ల తనిఖీలను దశల వారీగా నిర్వహిస్తున్నాం అని ఈసీ పేర్కొంది. ఈ తరుణంలో వయనాడ్‌లోనూ నిర్వహిస్తున్నారా? అని మీడియా ఎన్నికల ప్రతినిధిని వివరణ కోరగా.. ఎన్నికల కమిషన్ విడుదల చేసే క్యాలెండర్, తదనంతరం స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని పేర్కొన్నారు. పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడడం, లోక్‌సభ సభ్యుడిగా ఆయన సభ్యత్వం రద్దు కావడం తెలిసిందే. దీంతో వయనాడ్ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఇక లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోనూ ఎఫ్ఎల్సీ ప్రక్రియ చేపట్టనుంది ఈసీ. అలాగే ప్రస్తుతానికి వయనాడ్(కేరళ)తో పాటు పూణే(మహారాష్ట్ర), చంద్రాపూర్(మహారాష్ట్ర), ఘాజిపూర్(యూపీ), అంబాలా(హర్యానా) లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. FLCలో ఏం చేస్తారంటే.. మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియలో.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(EVMs), పేపర్‌ట్రైల్ మెషీన్లు రెండు పరికరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలైన BEL, ECILలు ఈ రెండు మెషిన్లను తయారు చేస్తున్నాయి. దీంతో వాటి నుంచి రప్పించిన ఇంజనీర్లు వాటిని తనిఖీ చేసి.. ఏమైనా లోపాలు ఉన్నాయా? గుర్తిస్తారు. లోపభూయిష్ట యంత్రాలు మరమ్మత్తు చేయడం, లేదంటే రీప్లేస్మెంట్ కోసం తీసుకెళ్తారు. ఎఫ్‌ఎల్‌సీలో మరో కీలకమైన ప్రక్రియ.. మాక్ పోలింగ్. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ రెండు యంత్రాలను తనిఖీ చేసేందుకు మాక్ పోల్ కూడా నిర్వహిస్తారు. -
త్వరలో విపక్షాల కీలక భేటీ!
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగుకు రంగం సిద్ధమవుతోంది. విపక్షాల ఉమ్మడి భేటీకి మూహూర్తాన్ని, వేదికను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీలతో బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ జరిపిన భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. విపక్షాల భేటీ పట్నాలోనే ఉండొచ్చని నెల క్రితం ఖర్గేతో భేటీ అనంతరం నితీశ్ పేర్కొనడం తెలిసిందే. కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసిన నేపథ్యంలో ఐక్యతా యత్నాలను మరింత ముమ్మరం చేయాలని తాజా సమావేశంలో నేతలు నిర్ణయించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహరచన విపక్షాల భేటీలో ఏయే అంశాలను చర్చించాలనే దానిపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఖర్గే, రాహుల్, నితీశ్ సమావేశమవడం గత నెలన్నరలో ఇది రెండోసారి కావడం విశేషం. జేడీ(యూ) అధినేత లాలన్‌సింగ్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అనారోగ్యంతో రాలేకపోయారని సమాచారం. ఇప్పుడిక దేశమంతా ఒక్కటవుతుందంటూ భేటీ అనంతరం ఖర్గే ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మా సందేశం. దేశానికి నూతన దిశానిర్దేశం చేసే ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని నితీశ్‌తో భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొన్నారు. అతి త్వరలో విపక్షాలన్నీ భేటీ కావాలని నిర్ణయించినట్టు వేణుగోపాల్, లాలన్‌సింగ్ మీడియాకు తెలిపారు. విపక్షాల అధినేతలంతా అందులో పాల్గొటారని చెప్పారు. కొన్నాళ్లుగా వరుస భేటీలు నితీశ్ కొద్ది రోజులుగా విపక్ష నేతలందరినీ వరుసబెట్టి కలుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో నితీశ్ మరోసారి సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఢిల్లీ ప్రభుత్వాధికారులపై అజమాయిషీ విషయమై కేంద్రంతో జరుపుతున్న పోరాటంలో ఆప్ సర్కారుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని హామీ ఇచ్చారు. శనివారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా జాతీయ స్థాయిలో విపక్ష నేతలంతా వేదికపైకి వచ్చి సమైక్యతా సందేశమివ్వడం తెలిసిందే. నితీశ్‌తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు వీరిలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కూడా విపక్ష కూటమిలోకి తీసుకొచ్చేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారు. ఇవే కీలకం! ప్రధాని మోదీకి దీటుగా విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని తమ సారథిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. అయితే పోటీదారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిపై ఏకాభిప్రాయం ఎలా కుదుదరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తమకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయించాలని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నాయి. అవి కోరినట్టుగా తాను 200 సీట్లలోనే పోటీకి పరిమితమయ్యేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. బలమైన విపక్ష కూటమి ఏర్పాటై లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలంటే దీనిపైనా వీలైనంత త్వరగా స్పష్టత రావాల్సి ఉంది. -
పెద్ద నోటు రద్దు... ఏ కట్టడికి?! అసలు కారణం ఇదేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఇంతకీ 2 వేల నోటు ఉపసంహరణ లేదా రద్దు ఎవరి కోసం? నల్లధనం కట్టడికా! రాజకీయ ప్రత్యర్థుల కట్టడికా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితం కంటిమీద కునుకు లేకుండా చేసినట్టుంది. డిసెంబరులో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా ఈ నోటు రద్దును ఎందుకు భావించకూడదు? ఎన్నికల్లో ధనప్రవాహం అభిలషణీయం కాదు కానీ, దాన్ని ఆపడం ఇప్పటివరకు ఎవరి వల్లా కాలేదు. ఇకపై కాదు కూడా! మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ సోదాల్లో 375 కోట్లకు పైగా (డబ్బు, మందు, కానుకలు) దొరికింది. దొరకనిది ఇంకెన్ని రెట్లుంటుందో! ఓటర్లకు ఎర వేయడం తప్పనప్పుడు, ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం యుద్ధనీతిలో భాగమే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. 2016లో నోట్ల రద్దును గొప్ప ప్రయోగంగా, ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప మలుపుగా ప్రధానమంత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రకటించినప్పుడు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ చర్య బడా బాబులతో పాటు సగటు జీవులకూ కొన్ని నెలల పాటు కునుకు లేకుండా చేసింది. చివరికి దానివల్ల ఏం ఒరిగింది? నల్లధనంగా భావించిన మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా మళ్లీ బ్యాంకుల్లోకి చేరిపోయింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ (ఆపరేషన్ విజయవంతం, కానీ రోగి దక్కలేదు)’ చందంగా తయారైంది. నోట్ల రద్దును అప్పుడు మోదీ ప్రకటిస్తే, శుక్రవారం నాడు మాత్రం 2 వేల నోటు రద్దును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బహుశా నోటు రద్దుకు రాజకీయ రంగు అంటకుండా కేంద్రం తీసుకున్న జాగ్రత్త ఇది. దేశ ఆర్థిక రంగాన్ని చిన్నదో పెద్దదో ఏదో ఒక కుదుపుకు లోను చేసే ఇలాంటి నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించడంలోనే అసలు అంతరార్థం అవగతమవుతుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ (యుద్ధంలోనూ ప్రేమలోనూ సర్వం సబబే)’ అన్న నానుడి తెలుసు కదా! ఇదే సూత్రాన్ని రాజకీయాలకు అన్వయిస్తే సరిపోతుందేమో! బీజం పడిందక్కడే...! రాజకీయ అవసరాలను పక్కన పెడితే ఈ పెద్ద నోటు రద్దు ఎవరికి నష్టం? రెండు వేల నోటు ముద్రణ నిలిపివేసి చాలా ఏళ్లవుతోంది. బ్యాంకులు కస్టమర్లకు వాటిని జారీ చేయడం నిలిపివేసి కూడా చాలా రోజులవుతోంది. చలామణిలో లేకపోవడంతో సగటు జీవులు ఈ నోటును కళ్లజూసి కొన్ని నెలలవుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో, సినిమా రంగంలో చలామణిలో ఉన్న మాట వాస్తవం. ఆర్బీఐ లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు మార్కెట్లో ఉన్నాయి. ఇందులో అధిక శాతం బడా బాబుల చేతుల్లోనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు 2 వేల రూపాయల నోట్లే పంచారన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది కాబట్టి ఆ నోటుపై వేటు వేస్తే ప్రతిపక్షాలను దెబ్బ తీయొచ్చనేది అసలు వ్యూహం. ప్రతిపక్షాల కూటమికి తనను సారథిని చేస్తే ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తానని ఓ నేత అన్నట్టు ఓ ప్రముఖ ఇంగ్లిష్ చానల్లో ఆ చానల్ తాలూకు ప్రముఖ జర్నలిస్టు బాహాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా రెండు వేల నోటుపై వేటుకు అక్కడే బీజం పడి ఉంటుంది. కాదంటారా!? -
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజు జనతా దళ్ (బీజేడీ) ఒంటరి పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని మోదీని కలిసి మంతనాలు జరిపారు. బీజేపీకి, కాంగ్రెస్‌కి సమానదూరం పాటిస్తానని తర్వాత మీడియాతో పట్నాయక్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నవీన్ పట్నాయక్‌ను కలుసుకున్న మర్నాడే ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తేల్చి చెప్పడం విశేషం. నితీశ్ భువనేశ్వర్‌కు వచ్చి తనను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పట్నాయక్ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ అప్పట్నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య వచ్చే వివాదాస్పద అంశాల్లో తటస్థ వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. -
కాంగ్రెస్ కథ ముగిసినట్టా?
తమ పార్టీ తిరిగి ఎలాగైనా లేస్తుందని ఏ రాజకీయ నాయకుడైనా నమ్ముతాడు. ఆ పునరుజ్జీవనం తదుపరి ఎన్నికల్లో లేదా కొన్ని ఎన్నికల తర్వాత జరగవచ్చు. అలాంటప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పడం ‘హాస్యాస్పదమైన ఆలోచన’ అవదా? కానీ వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ విషయంలో అది ఎంతమాత్రమూ హాస్యాస్పదం కాకపోవచ్చు. పార్టీలు ప్రభ కోల్పోతాయన్న విషయాన్ని ఆమోదించడానికి మీరు ఒకప్పటి బ్రిటన్ ఉజ్జ్వలమైన ఉదారవాదుల కేసి చూడనవసరం లేదు. మన దేశంలోనే అలాంటి ఘటనలు చాలా సమీపంలో జరిగాయి. స్వతంత్ర, జనతా పార్టీ, బహుశా భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా అలాంటి స్థితి ఏర్పడింది. కాంగ్రెస్ సొంత ఉదంతం విషయానికి వస్తే – బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో క్షీణతను చవిచూశాక, అది అధికారంలోకి రాలేకపోయింది. ఓటమికి సంబంధించిన నిరాశా నిస్పృహల నడుమ ఉంటున్నప్పటికీ, తమ పార్టీల పున రుజ్జీవన సంకేతాలను రాజకీయ నాయకులు చూస్తున్నట్లయితే అది అర్థం చేసుకోదగినదే. ఆ పునరుజ్జీవనం తదుపరి ఎన్నికల్లో లేదా కొన్ని ఎన్నికల తర్వాత జరగవచ్చు. అలాంటప్పుడు వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడం ‘హాస్యాస్పదమైన ఆలోచన’ అవుతుందా? కచ్చితంగా కాదు. ప్రభ కోల్పోయిన పార్టీలు పార్టీలు ప్రభ కోల్పోతాయన్న విషయాన్ని ఆమోదించడానికి మీరు ఒకప్పటి బ్రిటన్ ఉజ్జ్వలమైన ఉదారవాదుల కేసి చూడనవసరం లేదు. మన దేశంలోనే అలాంటి ఘటనలు చాలా సమీపంలో జరిగాయి. స్వతంత్ర, జనతా పార్టీ, బహుశా భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా అలాంటి స్థితి ఏర్పడింది. కాంగ్రెస్ సొంత ఉదంతం విషయానికి వస్తే – బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్ని కల్లో క్షీణతను చవిచూశాక, అది అధికారంలోకి రాలేక పోయింది. అయినప్పటికీ, కాంగ్రెస్ కథ ‘ముగిసిందని’ చెప్పడం హాస్యాస్పదమైనదని రాహుల్ గాంధీ అతిశయిస్తున్నారంటే దాన్ని నిజమని రుజువు చేయాల్సి ఉంటుంది. ఊరికే వేచి ఉండడం ద్వారా, మంచి జరుగుతుందని ఆశించడం ద్వారా అది జరగదు. ప్రొఫెసర్ సుహాస్ పల్శీకర్ ఎత్తి చూపి నట్లుగా, ‘బహుళ పార్టీ సమాఖ్య రాజకీయాల్లో పోటీలో ఉండటం’ అనేది దాదాపు కాంగ్రెస్‌కు 35 ఏళ్లనుంచీ సవాలుగానే ఉంటోంది. 1989లో పార్టీ అధికారం కోల్పోయినప్పుడు ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి అది ప్రభుత్వంలో ఉంటూ వచ్చి నప్పటికీ, మెజారిటీని ఎన్నడూ గెలుచుకోలేదు. త్వరలోనే ఈ సవాలు ‘దాటలేనిది’గా మారి పోయింది. అలా జరగకూడదంటే, కాంగ్రెస్ పార్టీ సంస్థా గతంగా, రాజకీయ సమీకరణల పరంగా రెండు రంగాల్లో తప్పక పనిచేసితీరాలని పల్శీకర్ విశ్వాసం. ఆ పార్టీ ఆయన సలహాను పాటించడానికి సమ్మతించక పోయినప్పటికీ, ఉజ్జ్వల ప్రతిపక్షాన్ని కోరుకుంటూ, కాంగ్రెస్ పునరుత్థానంపై నమ్మకం పెట్టుకున్న మనలాంటి వారికి అది మంచి ఆశను కలిగిస్తోంది. ఎన్నికలే ప్రాణ వాయువు రాజకీయ సంస్థ గురించి పల్శీకర్ రెండు అంశాలు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, పార్టీ పనితీరును ప్రజా స్వామ్యీకరించడమే! వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా, పార్టీ ప్రజాస్వామ్యీ కరణ విషయంలో కాంగ్రెస్ విఫలమైంది. ఎన్నికలు సృష్టించే మథనం పార్టీకి ‘ప్రాణ వాయువు’ను ఇస్తుంది కాబట్టి ఇది ముఖ్యమైనదని పల్శీకర్ అంటారు. నామినేషన్లు అనేవి సుప్తావస్థను కొన సాగేలా చేస్తాయి. రెండో సంస్థాగతమైన అవసరం ఏమిటంటే, ఒక కుటుంబానికి ఒక పదవి అనే నిబద్ధతను పూర్తి చేయడమే! ఇది గాంధీలకు మాత్రమే అన్వయించదు. ‘స్థానిక పార్టీ యూనిట్లను నియంత్రించే అనేక కుటుంబాల స్థిరపడిన ఆసక్తులతో ఇది ఎక్కువగా ముడిపడి ఉంది. ఇది ఎక్కువగా స్థానిక రాజకీయాల నిర్వహణకు సంబంధించినది’. ఈ ఆధిపత్య కుటుంబాలు ‘యువ కార్యకర్తలను స్పర్థాత్మక రాజకీయాల్లోకి అనుమతించడం’ ముఖ్యమని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయ సమీకరణపై కూడా పల్శీకర్ రెండు అంశాలను జోడించారు. పెద్ద మాటలు, పవిత్రమైన ఆశలను పక్కనపెడితే... కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యమైన పోటీదారును ఎదుర్కొంటున్న సమయంలో సంకీర్ణం కోసం సరైన ఫార్ములాను ఎంచుకోవలసిన అవసరముంది. ఆయన సలహా సరళమైనదే కానీ పదునైనది. ‘కాంగ్రెస్ పార్టీ మరింత నమ్రతతో ఉండడానికి సిద్ధం కావలసి ఉంటుంది’. మరో మాటలో చెప్పాలంటే, కాంగ్రెసే నాయకత్వం వహిస్తుందని పట్టుబట్టొద్దు. సమర్థంగా వివరించాలి సమీకరణ గురించిన రెండో అంశం మరింత సవాలుతో కూడుకున్నది. ఇది కాంగ్రెస్ సైద్ధాంతిక సందేశానికి సంబంధించింది. ‘ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం, మతతత్వం వంటి అంశాలపై ప్రజారాశులను పార్టీ ఎలా మేల్కొల్పబోతోంది?’ ఎందుకంటే ఇవి సాధారణ ప్రజలు పెద్దగా పట్టించుకోని నైరూప్య భావనలు. వారి రోజువారీ జీవి తాలకు అనువుగా వీటిని సమర్థంగా వివరించ కుంటే ఫలితం ఉండదు. ఇప్పటికైతే వీటిని చెబుతున్నప్పుడు వాటి అర్థం నష్టపోతోంది. బీజేపీకి వ్యతిరేకంగా మతతత్వ ఆరోపణల గురించి మాట్లాడే విషయాలను పల్శీకర్ ప్రత్యేకించి నొక్కి చెప్పారు. ‘మంచి హిందువుగా ఉండటం లేదా మంచి జాతీయవాదిగా ఉండటానికి ముస్లిం వ్యతిరేకిగా ఉండాల్సిన అవసరం లేదని సగటు హిందువుకు అర్థం అయ్యేట్టు చెప్పాలి, ఇది కొంచెం కష్టమైన పనే’. దీనికి సమాధానం ఏమిటంటే తన సొంత హిందూ విశ్వసనీయతపై ఆడంబరంగా చెప్పుకోవలసిన పనిలేదు కానీ హిందూయిజం గురించి కాంగ్రెస్ మాట్లాడాల్సి ఉంది. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం గురించి అది విభిన్నరీతిలో నొక్కి చెప్పాల్సి ఉంది. కానీ ఇది చేయడం కంటే చెప్పడం సులభం! హాస్యాస్పదం కాదు కాంగ్రెస్ పార్టీ తన సందేశాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడం ఓటర్ల దృష్టిలో ఎంతో విలువైన విషయం. కులం, తెగ,సంస్కృతి, ఆహార ప్రాధాన్యతలు వంటి అంశాల్లో వ్యత్యాసాలను అధిగమించడం చాలా కష్టమైన పని. ఇది నేను ఎక్కడ మొదలెట్టానో అక్కడికే నన్ను తీసుకెళుతోంది. సవాలును కాంగ్రెస్ అధిగమించలేకపోతే, పార్టీ భవిష్యత్తు సందేహంలో పడుతుందని సుహాస్ పల్శీకర్ చెప్పడం నిజంగా హాస్యా స్పదమైన విషయమేనా? కాకపోతే ఈశాన్య భారత్‌లో ఫలితాలు భిన్నమైన విషయాన్ని సూచి స్తున్నాయి. అయినా కూడా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను నిలుపుకోవడంలో విఫలమైతే, కర్ణాటకలో గెలుపు సాధించలేకపోతే మాత్రం అది స్పష్టమైన సంకేతం. తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు ఎటూ ఉండనే ఉన్నాయి. అయితే, అయితే, అయితే... బ్రిటన్‌లో కేమరాన్ నాయకత్వంలో తిరిగి అధికారంలోకి రావడానికి ముందు వరుసగా మూడు ఎన్నికల్లో టోరీలు ఓడిపోయారు. లేబర్ పార్టీ అదృష్టాన్ని టోనీ బ్లెయిర్ మార్చివేయడానికి ముందు నాలుగు సార్లు ఆ పార్టీ కూడా అపజయం ఎదుర్కొంది. అయితే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అలాంటిది తెచ్చిపెట్టగలరా అనేదే ప్రశ్న! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా?
ఒక రాష్ట్రంలో మోదీ మేనియాతో ఊగిపోయే ప్రజలు, మరో రాష్ట్రంలో స్థానిక సమస్యలే ముఖ్యమని ఎలుగెత్తి చాటిన ఓటర్లు .. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో రెండు విభిన్నమైన తీర్పులు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ? ప్రధాని మోదీ బ్రాండ్ ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉంటుందా ? మోదీని ఢీ కొట్టే నాయకుడు కేజ్రీవాలా ? రాహులా ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు చెబుతున్నదేంటి ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న చర్చ మొదలైంది. విపక్షాలను నిరీ్వర్యం చేసి అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని, హిందుత్వ–జాతీయవాదాన్ని జనంలోకి బాగా తీసుకువెళ్లాలని, ఉచితాలకు బదులుగా అభివృద్ధి బాట పడితేనే దేశానికి మేలు జరుగుతుందన్న బీజేపీ ఎజెండాకు గుజరాత్ ఫలితాలు ఆమోద ముద్ర వేశాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా పని చేస్తుందన్న ధీమాను నింపాయి. అదే సమయంలో స్థానిక సమస్యలపై గట్టి పోరాటం చేస్తే బీజేపీని, మోదీ బ్రాండ్ ఇమేజ్ను ఎదుర్కోవడం కష్టం కాదన్న ఆశ కూడా ప్రతిపక్ష పారీ్టల్లో చిగురించింది. బ్రాండ్ మోదీ ప్రభావం మోదీ ఇమేజ్ చెక్కు చెదరకపోయినప్పటికీ బలమైన స్థానికాంశాలుంటే రాష్ట్రాల్లో గెలుపుకు విపక్షాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. హిమాచల్‌లో పాత పెన్షన్ పునరుద్ధరిస్తామన్న ఒకే ఒక్క హామీ కాంగ్రెస్‌ని అధికార పీఠానికి చేర్చింది. సోలన్ ప్రాంతంలో మోదీ ర్యాలీలకు జనం పోటెత్తినా అక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్కటీ నెగ్గలేకపోయింది! కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూత్వ, జాతీయవాదమే కీలకపాత్ర పోషించేలా కనిపిస్తున్నాయి. హిమాచల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో తేడా ఒక్క శాతమే! ‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టడం సులభం కాదు. హిమాచల్‌లో మాదిరిగా స్థానికాంశాలు లోక్‌సభ ఎన్నికల్లో పని చేయవు’’ అని జేఎన్‌యూ పొలిటికల్ సైన్స్ ప్రొఫసర్ మణీంద్రనాథ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. హిమాచల్ ఓటమితో ఇమేజ్‌కు వచి్చన ఢోకా ఏమీలేదన్నారు. కాంగ్రెస్ పక్కలో బల్లెం ఆప్ బీజేపీతో తలపడడానికి, హిందూత్వ ఎజెండాతో ఓటర్లను ఏకీకృతం చేస్తున్న కమలనాథుల కు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఆప్ రూపంలో కొత్త శత్రువు ఎదురైంది. గుజరాత్లో ఆప్ ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కొల్లగొట్టడంతో 17 స్థానాలకే పరిమితమవాల్సి వచి్చంది. కాంగ్రెస్ ఓట్లు 41% నుంచి 27శాతానికి పడిపోతే, ఆప్ 13% ఓట్లు సాధించిందంటే కాంగ్రెస్ ఓట్లకు గంటికొట్టినట్టయింది. ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు అసలు సిసలు శత్రువు ఆప్ అంటే అతిశయోక్తి కాదు. విపక్షాల మధ్య ఓట్లు చీలిపోతుంటే బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోంది. ఆప్‌ను ఎదుర్కొనే బలమైన వ్యూహాన్ని కాంగ్రెస్ తక్షణమే రచించాలి.’’ అని ఎన్నికల విశ్లేషకుడు ఠాకూర్ హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అది కాంగ్రెస్‌కి కలిసొచ్చింది. అదే ఆప్ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్ పని అయిపోయి ఉండేదని ఆ పార్టీ మాజీ నాయకుడు సంజయ్ ఝా అన్నారు. అయితే హిమాచల్‌లో విజయం సాధించడం వల్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడుకి చేరడంతో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచినట్టయింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెమీ ఫైనల్స్ ఫలితాలే కీలకం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఉందా లేదా అనేది వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాల్లో జరిగే సెమీఫైనల్స్ వంటి ఎన్నికల ఫలితాలే కీలకం కానున్నాయి. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ పార్టీ హోదా లభించిన ఉత్సాహంలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో కాంగ్రెస్ అటు బీజేపీ, ఇటు ఆప్‌ను సమర్థంగా ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే నాయకుడు కేజ్రివాలా? రాహులా? అన్నది తేలిపోతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమిత్ షా యాక్షన్ ప్లాన్.. ఆ సీట్లపైనే గురి
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రాంతీయ పార్టీ నేతల దూకుడు.. విపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో.. 2024 ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన వ్యూహకర్త అమిత్ షా అధ్యక్షతన పార్టీ మెగా సమావేశం జరిగింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులు సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మంత్రులను కొన్ని స్థానాలపైనే దృష్టిసారించమని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు వెళ్లి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి.. ఫీడ్‌బ్యాక్ అందించాలని అమిత్ షా మంత్రులకు సూచించినట్లు సమాచారం. అంతేకాదు ఆయా స్థానాల్లో పార్టీని గ్రౌండ్ లెవల్లో బలపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని షా చెప్పినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణతో పాటు బీజేపీకి అవకాశాలు ఉన్న మరికొన్ని చోట్ల ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఆయన కేంద్రమంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ 144 సీట్లే! బీజేపీ మేధోమదన సమావేశంలో షా సూచించిన కొన్ని స్థానాల సంఖ్య 144గా తేలింది. అవేంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెల్చుకుంది. ఎన్డీయే కూటమిగా మొత్తం 353 సీట్లకు బలం పెంచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం 37.36గా వచ్చింది. 1989 ఎన్నికల తర్వాత.. ఒక పార్టీకి ఇంత ఓటు షేర్ రావడం ఇదే ప్రథమం. అయితే.. ఆ ఎన్నికల్లో 144 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాలతో ఓడిపోయారు. ఈ తరుణంలో ఆ 144 సీట్లే ప్రధానంగా దృష్టిసారించాలని అమిత్ షా మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ప్రధాని పదవిపై నాకు వ్యామోహం లేదు -
యాత్రతో రాత మారేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో వరుస పరాజయాలు.. కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఈ యాత్రపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న వేళ 3,500 కిలోమీటర్ల పై చిలుకు యాత్ర పార్టీకి పునరుత్తేజం తెస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. రాహుల్ యాత్రతో పార్టీకి ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమమే స్ఫూర్తిగా... ఎనభై ఏళ్ల క్రితం గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టనున్నారు. 117 మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఐదు నెలలు పాదయాత్ర చేయనున్నారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, అసహన రాజకీయాలను ప్రస్తావించడంతోపాటు జీవనోపాధిని నాశనం చేసే ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయం చూపాలని భావిస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ వంటి అంశాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లనుంది. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడంతో పాటు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం, రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బలమైన రాజకీయ ఆకాంక్షతో కాంగ్రెస్ ఈ యాత్ర చేపడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి పరీక్షగా నిలవనున్నాయి. వీటిలో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోరాడాల్సి ఉంది. ముఖ్యంగా గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాల పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలి. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. గుజరాత్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్రమిస్తోంది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ మళ్లీ గద్దెనెక్కడం అంత సులభం కాదు. అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్‌కు అగ్నిపరీక్ష 1985 నుంచి ఇప్పటి వరకు 27 ఏళ్లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేనంత భారీ ఓటమిని కాంగ్రెస్ 2014, 2019 ఎన్నికల్లోనూ చవిచూసింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టాక జరిగిన ఈ ఎన్నికల్లో 2014లో 19.3 శాతం, 2019లో 19.5 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఇక 2014–2022 మధ్య జరిగిన 49 అసెంబ్లీ ఎన్నికలకు గానూ 39 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. కేవలం 4 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిందని, మరో 6 సందర్భాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ఇక రాహుల్ వైఖరిని విమర్శిస్తూ కేంద్ర మాజీ మంత్రులు గులాంనబీ జాద్, కపిల్ సిబల్, అశ్వినీ కుమార్, ఎస్పీ సింగ్, మురళీ దేవ్‌రాతోపాటు పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ ఏమాత్రం యోగ్యుడు కాదంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్ర ఆయనకు అగ్ని పరీక్షేనని చెప్పక తప్పదు. -
వైఖరి మారకుంటే సార్వత్రిక ఎన్నికల్లోనూ మద్దతు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఓటమే లక్ష్యంగా మునుగోడు శాస నసభ ఉప ఎన్నిక వరకే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర పార్టీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదనపై స్పందిస్తూ ప్రస్తుతం బీజేపీ పట్ల టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి అప్పుడు కూడా కొనసాగితే తప్పకుండా మద్దతిస్తామని చెప్పింది. శనివారం సీఎం కేసీఆర్‌తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారా ములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి భేటీ అయ్యారు. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని సీఎం కోరగా... ఆ మేరకు కట్టుబడి పని చేద్దామని సీపీఎం నేతలు పేర్కొనట్లు తెలిసింది. భవిష్యత్తులో పరి స్థితులకు అనుగుణంగా ముందుకెళ్తామన్నట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలోని వివిధ వర్గాల సమస్యల పైనా సీపీఎం నేతలు ముఖ్య మంత్రితో చర్చించారు. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు. సీపీఎం లేవనెత్తిన ప్రధాన అంశాలు ► 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు రైతులకు పట్టాల పంపిణీ చేయాలి. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులివ్వాలి. ► వ్యవసాయ కార్మికులకు కనీస వేతన జీవో సవరణ చేయాలి. రోజు కూలీ రూ.600 ఇవ్వాలి. ► అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణా నికి రూ.5లక్షల సాయం చేయాలి. ఆర్టీసీలో యూనియన్లను అనుమతి ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ధరణి పోర్టల్‌లో సవరణలు చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. రూ.లక్ష లోపు రైతుల రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చే యాలి. గిరిజన జనాభా ► నిష్పత్తి ప్రకారం 10శాతానికి రిజర్వేష న్లను పెంచాలి. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సమర్పించాలి. తెలంగాణలో మత విద్వేషాలకు తావు లేదు : సీఎం కేసీఆర్ తెలంగాణలో మత విద్వేషాలకు తావులే దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజల్లో విద్వేషాలను పెంచేందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామ న్నారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసి రావాలని మేధావులను కేసీఆర్ ఆహ్వానించారు. స్వార్థ రాజ కీయాల కోసం విచ్ఛిన్నకర శక్తులు పచ్చని తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామికవా దులు, మేధావులు, రాజకీయవేత్తలు కదిలి రావాలని తాని చ్చిన పిలుపునకు స్పందించి మద్దతు ప్రకటించేందుకు వచ్చిన సీపీఎం పార్టీకి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మత విద్వేష శక్తులను ఎదుర్కునేందుకు సీఎం చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. చదవండి: ‘సిట్టింగులందరికీ సీట్లు’ -
ఎన్నికలకు పోదాం.. తేదీ ఖరారు చేయండి: కేసీఆర్
హైదరాబాద్: విపక్షాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికలకు తాను సిద్ధం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించిన కేసీఆర్.. రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా మాట్లాడారు. ముందుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కేసీఆర్.. చివరగా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని విపక్షాలకు చాలెంజ్ విసిరారు. తాను అసెంబ్లీని రద్దు చేస్తానని, ఎన్నికల పోదాం అంటూ కేసీఆర్ సవాల్ చేశారు. దమ్ముంటే ఎన్నికల తేదీ ఖరారు చేయాలన్నారు సీఎం కేసీఆర్. ఇవి కూడా చదవండి: డబుల్ ఇంజిన్ కాదు.. పరిగెత్తే ఇంజిన్ కావాలి.. మోదీపై కేసీఆర్ సెటైర్లు భారీ వర్షాలు.. ప్రజలను హెచ్చరించిన సీఎం కేసీఆర్ మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయి: సీఎం కేసీఆర్ -
ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు!
గాల్లో దీపం మాదిరి మినుకు మినుకుమంటూ ఎప్పుడేమవుతుందోనన్న సంశయాల మధ్యే నెట్టుకొస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం చిట్టచివరకు కుప్పకూలింది. పార్లమెంటు కెన్సెట్ను రద్దు చేయాలని ఆ చట్టసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించడంతో దాదాపు నాలుగేళ్ల వ్యవధిలో అయిదోసారి ఆ దేశంలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే నవంబర్ 1న ఈ ఎన్నికలుంటాయి. చట్టసభల్లో బలాబలాలతో నిమిత్తం లేకుండానే, ఎన్నికల బెడద రాకుండానే రాష్ట్ర ప్రభుత్వాల ఉత్థానపతనాలు రివాజైపోయిన మన దేశంలో ఇజ్రాయెల్ పరిణామాలు సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తాయి. నిబంధనల ప్రకారమైతే పార్లమెంటు కాల వ్యవధి నాలుగేళ్లు. లికుడ్ పార్టీ అధినేత, మితవాది అయిన బెంజమిన్ నెతన్యాహూ వరసగా మూడు దఫాలు ఎన్నికై, ఇతర పార్టీల సహకారంతో పన్నెండేళ్లపాటు అధికారం నిలబెట్టుకుని రికార్డు సృష్టించారు. అయితే 2019 ఏప్రిల్ ఎన్నికల నాటినుంచీ దేశంలో అస్థిరత తప్పడం లేదు. 120 మంది సభ్యులుండే పార్లమెంటులో కనీస మెజారిటీ 61 ఎవరికీ రాలేదు. దాంతో పొసగని పార్టీలు కూటములుగా ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయక తప్పలేదు. 2018 నుంచి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని స్థితి ఏర్పడింది. నెతన్యాహూ ఎప్పటికప్పుడు అనామతు ఖాతాలతో నెట్టుకొచ్చారు. చివరకు ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, వాటికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో నెతన్యాహూ అధికారం నుంచి వైదొలిగారు. నిరుడు జూన్‌లో ఎన్నికల అనంతరం ప్రధానిగా ప్రమాణం చేసిన నఫ్తాలీ బెనెట్ పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించారు. అయితే కూటమిలోని వివిధ పక్షాలను సంతృప్తి పరిచేందుకు రాజీపడటం స్వపక్షమైన యామినా పార్టీలో ముసలం పుట్టించింది. ఆ పార్టీ ఎంపీ గత ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. పర్యవసానంగా బెనెట్ ప్రభుత్వం కొన ఊపిరితో సాగుతోంది. సైద్ధాంతిక సారూప్యతలేని పార్టీలు అధికారం కోసమే దగ్గరైనప్పుడు విభేదాలు తప్పవు. కలిసి పనిచేసే క్రమంలో కొన్నిసార్లు పరస్పర అవగాహన ఏర్పడుతుందనీ, ఆ పార్టీల వైఖరుల్లో మార్పు వస్తుందనీ కొందరి వాదన. కానీ నిలువునా చీలిన ఇజ్రాయెల్ సమాజంలో అది సాధ్యపడలేదు. అధికార కూటమిలో ఎనిమిది పార్టీలుండగా అందులో మధ్యేవాద, కుడి, ఎడమ పక్షాలతోపాటు స్వతంత్ర అరబ్ పక్షం రాహంబా పార్టీ కూడా ఉంది. అరబ్బులకు ప్రాతినిధ్యం వహించే పార్టీల్లో ఒకటి పాలనలో భాగస్వామ్యం తీసుకోవడం ఇజ్రాయెల్ చరిత్రలో అదే తొలిసారి. అందువల్లే ఈ కూటమిపై మొదట్లో అందరూ ఆశలు పెట్టుకున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు పరి ష్కారం దొరుకుతుందనుకున్నారు. కానీ యూదులకూ, పాలస్తీనా ప్రాంత ప్రజలకూ మధ్య విద్వే షాలు రేకెత్తించడంలోనే దశాబ్దాలుగా మనుగడ వెదుక్కునే పార్టీల పుణ్యమా అని ఈ ప్రయోగం బెడిసికొట్టింది. నెతన్యాహూపై అవినీతిపరుడన్న ముద్ర ఉన్నా ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేయ డానికి ఒక అరబ్ పక్షం ప్రయత్నించి విజయం సాధించిందన్న వాస్తవాన్ని ఇజ్రాయెల్ సమాజం జీర్ణించుకోలేకపోయింది. అందుకే వారితో చేతులు కలిపి అధికారంలో కొనసాగిన మితవాద పక్షం యామినా పార్టీకి పౌరుల్లో పరపతి అడుగంటింది. రాబోయే ఎన్నికల్లో నెతన్యాహూను సమర్థించే మితవాద పక్షాలకు అధిక స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. అంతో ఇంతో వామపక్షాల వైపు సానుభూతిగా ఉండేవారు సైతం ఈసారి మితవాదంవైపు మొగ్గుచూపుతున్నారని సర్వేలంటు న్నాయి. ఈ సర్వేల విశ్వసనీయత సంగతలావుంచి ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న వెస్ట్‌బ్యాంక్‌లో అయిదు లక్షలమంది యూదులకు 120 ఆవాసాలు ఏర్పరిచారు. అక్కడున్న 30 లక్షలమంది పాల స్తీనా పౌరులు ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ఆ కాలనీలను ఇజ్రాయెల్‌లో విలీనం చేసేం దుకు మొన్న ఏప్రిల్‌లో అధికార కూటమి ప్రయత్నించినప్పుడు పాలస్తీనా వాసులకు ప్రాతినిధ్యం వహించే రహంబా పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తాత్కాలికంగా ప్రభుత్వం నుంచి తప్పు కుంది. దాంతో ప్రధాని బెనెట్ రాజీపడక తప్పలేదు. యూదు కాలనీలపై చట్టం వస్తే ఆ ప్రాంతం ఇజ్రాయెల్‌లో భాగంగా మారుతుందన్నది పాలస్తీనా వాసుల వాదన. ఇప్పటికే యూదులకూ, పాల స్తీనా వాసులకూ అక్కడ వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. అటు యూదులకు సైతం ఇదొక సంకటంగా మారింది. ప్రస్తుతం ఆ కాలనీల్లో సైనిక పాలన ఉన్నందువల్ల ఇతర ఇజ్రాయెల్ పౌరుల మాదిరి వారు పూర్తి స్థాయి హక్కులు పొందలేకపోతున్నారు. ఈనెల 1వ తేదీతో గడువు ముగు స్తున్న దశలో ఈ చట్టం కోసం రూపొందించిన బిల్లు గత నెల 10న పార్లమెంటులో వీగిపోయింది. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నచోట ‘అందరి ప్రభుత్వం’ ఏర్పాటు చేయడం, అది నాలుగేళ్లూ మనుగడ సాగించటం సహజంగానే అసాధ్యం. నెతన్యాహూ అధికారంలో ఉండగా ఈ వైషమ్యాలను మరింత పెంచి, భవిష్యత్తులో మళ్లీ అందరూ విధిగా తనవైపే చూడకతప్పని స్థితి కల్పించారు. ఆర్థికాభివృద్ధికి పాటుపడటం, శాంతి సాధనకు ప్రయత్నించడం వంటి ఆదర్శాలకు కాలం చెల్లి, వైషమ్యాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరుకోవడం ఆందోళనకరమే. ఈసారి ఎన్నికైతే యూదులకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాననడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి, నిత్యావసరాల ధరలను తగ్గిస్తానని నెతన్యాహూ వాగ్దానం చేస్తున్నారు. తదుపరి ఏర్పడ బోయేది ‘పటిష్టమైన’ జాతీయవాద ప్రభుత్వమా... అరబ్ పార్టీల పలుకుబడి కొనసాగే ‘యూదు వ్యతిరేక’ ప్రభుత్వమా అన్నది నవంబర్ 1 తర్వాత తేలుతుంది. -
ఇది ఎన్నికల శంఖారావమే!
ఇప్పుడు దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయ శక్తి లేదు. అక్కడక్కడా కొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ వాటికి పరిమితులున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. బహుశా ఇక్కడి నుంచే 2024 సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం పూరించే అవకాశం ఉంది. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలకూ రాజకీయ వ్యూహాలు ఇక్కడే రూపుదిద్దుకోనున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి బలమున్న తెలంగాణను కైవసం చేసుకోవడమే తక్షణ లక్ష్యమని జాతీయ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై 2, 3 తేదీలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగ నున్నాయి. ఇక్కడే భవిష్యత్ రాజకీయ వ్యూహాలు పదునుదేల నున్నాయి. అలాగే రాబోయే రెండేళ్ల పాటు పార్టీ అనుసరించవలసిన రాజకీయ ఎత్తుగడలు రూపొందుతాయి. 2024 ఎన్నికల శంఖాన్ని ఒక విధంగా హైదరాబాద్ నుండే పూరించనుంది. 2019 ఎన్నికలలో నరేంద్ర మోదీ తిరుగులేని ప్రజా తీర్పుతో మరోసారి అధికారం చేపట్టిన తర్వాత... మొదటిసారిగా బీజేపీ కార్యవర్గం పూర్తి స్థాయిలో ఇక్కడ సమావేశమవుతోంది. గతంలో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్న సమయంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యవర్గ సమావేశాల తర్వాత, రెండు దశాబ్దాలకు మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరగ బోతున్నాయి. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, తన పరిధిని దేశంలో విస్తృతంగా పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇప్పడు పార్టీ అధి కారంలో లేని రాష్ట్రాలు, ఇప్పటివరకు గెలుపొందని లోక్‌సభ నియో జకవర్గాలపై దృష్టి సారిస్తున్నది. బీజేపీ తదుపరి మజిలీ ప్రధానంగా తెలంగాణ అని ఇప్పటికే పార్టీ జాతీయ నాయకత్వం పలు సందర్భాలలో స్పష్టం చేసింది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత బీజేపీ అధికారంలోకి రాగల అవకాశాలు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది. ఆ దిశలో నేరుగా కేంద్ర నాయకత్వ పర్యవేక్షణలో తెలంగాణలో పార్టీ ప్రజలలోకి చొచ్చుకు పోయే ప్రయత్నం చేస్తున్నది. ఒక విధంగా, ఇప్పటి వరకు మరే రాష్ట్రంలో చేయని మహత్తర ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు మూడు రోజుల పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరినీ ఒకొక్క నియోజకవర్గం చొప్పున మొత్తం 119 నియోజక వర్గాలకు పంపింది. వారు అక్కడనే మకాం వేసి, స్థానిక పార్టీ శ్రేణులతో కలిసిపోయి వచ్చే ఎన్నికలలో పార్టీ విజయావకాశాలను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు ఏమేరకు చేరుతున్నాయో తెలుసుకొని, వారికి వాటి గురించి చెప్పడంతో పాటు క్షేత్రస్థాయిలో కేసీఆర్ పాలనా వైఫల్యాల ప్రభావాన్నీ అధ్యయనం చేస్తారు. అలాగే బీజేపీ పార్టీ సంస్థాగత పరిస్థితులు, నెలకొన్న రాజ కీయ వాతావరణాన్ని పరిశీలిస్తారు. ఒక్కో నాయకుడూ తాము పరి శీలించిన నియోజకవర్గంలో గెలుపొందడానికి పార్టీ పరంగా తీసుకో వలసిన చర్యల గురించి నాయకత్వానికి నివేదిక ఇస్తారు. ఒక విధంగా తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా సిద్ధపడే విధంగా ఇప్పటినుండే కార్యాచరణకు ఉపక్రమిస్తు న్నట్లు దీన్ని భావించవచ్చు. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఈ ఏడాది ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లలో కూడా బీజేపీ గెలుపొందే విధంగా కార్యప్రణాళికలను ఇప్ప టికే సిద్ధం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకన్నా ముందే జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికలను సహితం బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. గత ఎన్నికలలో బీజేపీ రెండో స్థానంలో ఉన్న 144 లోక్‌సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిం చడం ఇప్పటికే ప్రారంభించింది. వచ్చే 25 ఏళ్ళ పాటు భారతదేశ అభివృద్ధి లక్ష్యాలను ఏర్పరచుకొని, స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లకు చేరుకొనే సమయానికి భారత్‌ను ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలిపేం దుకు అవసరమైన సాధన సంపత్తులను సిద్ధం చేయడంలో మోదీ ప్రభుత్వం తలమునకలై ఉంది. ఈ చారిత్రక పరిస్థితిలో బీజేపీ శ్రేణులు చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్య వర్గ సమావేశాలు మార్గదర్శనం చేయనున్నాయి. నేడు దేశంలో రాజకీయంగా బీజేపీకి జాతీయ స్థాయిలో పోటీ అన్నది లేదు. కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలీయంగా ఉన్నా వాటికి చాలా పరిమితులు ఉన్నాయి. తాజాగా లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో తమకు కంచుకోటల వంటి రెండు నియోజకవర్గాలలో ప్రాంతీయ పార్టీలు ఓటమి చెందడమే అందుకు ప్రబల తార్కాణం. రాజకీయ అవసరాల కోసం, సైద్ధాంతికంగా పొందికలు లేకుండా ఏర్పడే కూటములు నిలదొక్కుకోలేవని మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి బీజేపీ ఎంపిక చేయడం దేశంలో అణగారిన వర్గాల సాధికారత పట్ల పార్టీకి గల చిత్తశుద్ధిని వెల్లడి చేస్తుంది. ఆధునికతకూ, అభివృద్ధికీ దూరంగా ఉంటున్న దేశంలోని 12 కోట్ల మంది గిరిజన ప్రజల సాధికారత పట్ల మొదటిసారి దేశం దృష్టి సారించేట్లు చేయగలిగింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని సంపన్న దేశాలు సహితం ఆర్థికంగా కుదేలై, కోలుకోలేని పరిస్థితుల్లో ఉండగా భారత్ మాత్రమే సత్వరం కోలుకోగలుగుతున్నది. తిరిగి అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. శాస్త్ర, సాంకేతిక, రక్షణ రంగాలలో భారత్ సాధించిన అభివృద్ధిని నేడు అగ్రరాజ్యాలు సహితం గుర్తించ డమే కాకుండా, భారత్‌తో కలసి పనిచేయడం కోసం ఉత్సాహం చూపుతున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, ప్రపంచానికే మార్గదర్శకంగా నిల బడింది. సమర్ధవంతమైన చర్యల ద్వారా మహమ్మారిని కట్టడి చేయ డంతో పాటు, టీకాలను భారీ సంఖ్యలో అందుబాటులోకి తీసుకు వచ్చి, కేవలం మన ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచ ప్రజలకు అందుబాటులో ఉంచింది. టీకా కార్యక్రమం కారణంగా భారత్‌లో 42 లక్షల కరోనా సంబంధిత మరణాలను నివారించినట్లు అయ్యిందని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేయడం గమనార్హం. అగ్నిపథ్ ద్వారా రక్షణ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు మన రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠ పరుస్తున్నాయి. ఆయుధాలకు విదేశాలపై ఆధారపడుతూ వస్తున్న మన రక్షణ రంగం ఇప్పుడు స్వదేశంలోనే వాటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ఉండటం ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రయాణిస్తున్నాం. ప్రభుత్వం కేవలం ఉద్యో గాలు కల్పించే వ్యవస్థగా మిగలకుండా, దేశంలో ఉద్యోగ అవకా శాలను ముమ్మరంగా పెంపొందించే సంధాన కర్తగా ఉండాలనే మోదీ ప్రభుత్వ విధానం విశేషమైన ఫలితాలు ఇస్తోంది. స్టార్టప్‌లలో మనం సాధిస్తున్న విశేష పురోగతి, రికార్డు స్థాయిలో ఎగుమతులు జరుగుతూ ఉండటం అందుకు తార్కాణం. అత్యాధునిక డ్రోన్లను కేవలం రక్షణ రంగానికి పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం వంటి రంగా లకు సహితం విస్తరింపజేస్తూ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి జరుగుతున్నది. ఉక్రెయిన్ యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను సంక్షో భంలోకి నెట్టినా స్వతంత్రమైన విదేశాంగ విధానం ద్వారా, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో స్థిరంగా నిలబడటం ద్వారా భారత నాయకత్వం అనూహ్యమైన చొరవను ప్రదర్శించింది. 2024లో జరిగే ఎన్నికలు కేవలం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించే ఎన్నికలు కాబోవు. వచ్చే 25 ఏళ్లలో భారత్ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ప్రపంచంలో అగ్రదేశంగా ఎలా నిల వాలో నిర్ణయించేవి కూడా. అందుకనే హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అందుకు అవసరమైన భూమికను, కార్యప్రణాళికను రూపొందించనున్నాయి. ఓ విధంగా దేశ గమనాన్ని నిర్దేశించడంలో ఈ సమావేశాలు కీలకం కాబోతున్నాయి. - బండి సంజయ్‌కుమార్ వ్యాసకర్త బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ -
Sakshi Cartoon: ...ప్రశాంత్ కిశోర్లోకి కాంగ్రెస్ కాదయ్యా!!
...ప్రశాంత్ కిశోర్లోకి కాంగ్రెస్ కాదయ్యా!! -
పోర్చుగల్‌లో సోషలిస్టుల గెలుపు
లిస్బన్: పోర్చుగల్‌లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్‌తో కునారిల్లిన పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు. 116 సీట్ల మెజార్టీ.. పార్లమెంట్లో మెజార్టీకి అవసరమైన 116 సీట్లను సోషలిస్టులు గెలుచుకుంటారా? లేక చిన్న పార్టీల మద్దతు అవసరంపడుతుందా అనే విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పోర్చుగీస్ టెలివిజన్ చానెళ్ల ప్రత్యేక ఎగ్జిట్ పోల్స్ మాత్రం సోషలిస్టులకు పూర్తి మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి. పోర్చుగల్‌లో కొత్త ప్రభుత్వంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ యూరప్‌లో పేదదైన ఈ దేశానికి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించనుంది. ఈ మొత్తంలో మూడింట రెండు వంతులు ప్రధాన మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే ఈ నిధుల కేటాయింపు, వ్యయం సజావుగా సాగుతాయని నిపుణులు భావిస్తున్నారు. 2022 కోసం అప్పటి మైనారిటీ సోషలిస్ట్ ప్రభుత్వం రూపొందించిన వ్యయ ప్రణాళికను పార్లమెంటు గత నవంబర్‌లో తిరస్కరించింది. దీంతో నూతన వ్యయప్రణాళిక అమలుకు స్థిర ప్రభుత్వ అవసరం ఉంది. 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వార్షిక బడ్జెట్‌ను ఆమోదానికి ప్రతిసారీ మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది. కానీ రెండు నెలల క్రితం ఈపార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్లమెంట్లో సోషలిస్ట్ ప్రధాన మంత్రి ఆంటినో కోస్టాకు మెజార్టీ మద్దతు గగనమైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సోషలిస్టులకు తగినంత బలాన్ని ఇవ్వనుంది. చేగా.. గెలుపు పోర్చుగల్‌లో వరుసగా రెండుమార్లు సోషలిస్టు పార్టీనే అధికారంలో ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థి సోషల్ డెమొక్రాటిక్ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశంలో దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నాయి. కానీ ఈసారి చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా (చాలు అని అర్థం) ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను కొల్లగొట్టినట్లు ఆర్టీపీ పోల్స్ అంచనా వేసింది. దీంతో ఈ పార్టీకి పార్లమెంట్లో 13 సీట్లు దక్కవచ్చని అంచనా. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీకి 3– 5 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 48.6 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా కారణంగా అర్హులైన ఓటర్లలో దాదాపు 10 లక్షలమంది ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డీసౌజా సైతం ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. -
తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2021 సంవత్సరం అఖండ విజయాలను అందించింది. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో విజయదుందుభి మోగించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వాగ్దానాల్లో 95 శాతం హామీలను ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఆయన అమలుచేశారు. ఫలితంగా.. సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. అందిస్తున్న సుపరిపాలనతో వైఎస్సార్సీపీపై ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాలను (88 శాతం) దక్కించుకున్న వైఎస్సార్సీపీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడమే అందుకు తార్కాణం. 1983 ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు.. 1989లో కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. దొంగ ఓట్లు.. దౌర్జన్యాలు, ప్రలోభాలతో మూడు దశాబ్దాలకు పైగా చంద్రబాబు కుప్పంను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. కానీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. టీడీపీని వైఎస్సార్సీపీ చావుదెబ్బ తీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మాజీ కమిషనర్ నిమ్మగడ్డ ద్వారా ఏడాదిపాటూ స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు అడ్డుకున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఆయన్ను చావుదెబ్బ తీశారు. వంద శాతం కార్పొరేషన్లు వైఎస్సార్సీపీకే.. చివరకు ఈ ఏడాది మార్చి, నవంబర్లలో రెండు విడతలుగా 13 కార్పొరేషన్లు (నగర పాలక సంస్థలు), 86 నగర పంచాయతీ, మున్సిపాల్టీలకు ఎన్నికలను ఎస్ఈసీ నిర్వహించింది. ఈ ఎన్నికల్లో వంద శాతం అంటే.. 13 కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. 87 నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో 84 నగర పంచాయతీ, మున్సిపాల్టీల (98 శాతం)ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కేంద్రంలోని కుప్పం మున్సిపాల్టీలో సైతం వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించడం గమనార్హం. గ్రామ పంచాయతీల్లోనూ పాగా మొత్తం 13,092 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. 10,536 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అంటే 80.4 శాతం గ్రామ పంచాయతీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుందన్న మాట. అదే కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలకుగానూ 74 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించి.. టీడీపీ కోటను బద్దలుకొట్టారు. 100% జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీకే.. రాష్ట్రంలో 652 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలు (జెడ్పీటీసీ), 9,717 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ)కు ఎన్నికలు జరిగితే.. 642 జెడ్పీటీసీ స్థానాల (98.46 శాతం)ను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని అఖండ విజయాన్ని సాధించింది. అలాగే, మొత్తం 13 జెడ్పీ చైర్మన్ పదవులనూ ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక 9,717 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 8,380 స్థానాలు (86.24 శాతం) స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 96 శాతం మండల పరిషత్ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని మొత్తం నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలకుగానూ 63 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ‘మండలి’లో సంపూర్ణ ఆధిక్యం శాసన మండలిలో 58 స్థానాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ మండలిలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం, పలువురు టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఇటీవల ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో మండలిలో వైఎస్సార్సీపీ బలం 18 నుంచి 32కు ఒక్కసారిగా పెరిగి సంపూర్ణ ఆధిక్యత సాధించినట్లయింది. దేశ చరిత్రలో రికార్డు..: గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా గ్రామ పంచాయతీలతోపాటు 13 జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు.. ఇలా అన్నింటా వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకునే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. -
రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు: అరవింద్ కేజ్రివాల్
చంఢీఘడ్: రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. పంజాబ్‌లోని మాన్సాలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకుండా చూస్తామని కేజ్రివాల్ అన్నారు. స్వాత్రంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపోందిస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. మీకు నేను.. వాగ్దానం చేసి చెబుతున్నాను.. ఒక నెల తర్వాత మళ్లి వచ్చాక దాని వివరాలు తెలియజేస్తామని తెలిపారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 117 స్థానాల్లో అభ్యర్థులు పోటిచేస్తారని అన్నారు. కాగా, ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు. అరవింద్ కేజ్రివాల్ రెండు రోజులపాటు పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఆయన రేపు(శుక్రవారం) భటిండా వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. చదవండి: ఏపీ గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్ జగన్ దంపతులు -
ఎన్నికల కేసులు వీగిపోకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులపై వివిధ జిల్లా కోర్టుల్లో ఉన్న కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయటానికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేసులు వీగిపోకుండా ప్రాసిక్యూషన్ తగిన శ్రద్ధ వహించాలని సుపరిపాలన వేదిక (ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. మొత్తం 507 కేసులు నమో దు అయ్యాయని ఆయా కేసులను నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని తెలిపారు. అన్ని కేసులు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ కాకపోవడంతో ప్రాసిక్యూషన్ వారి అలసత్వం తో అనేక కేసులు వీగిపోతున్నాయన్నారు. దీంతో శిక్ష పడిన కేసుల్లో స్టేలు రావడం వంటి వాటితో ప్రజలకు పోలీసుశాఖ, న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని విమర్శించారు. చదవండి: రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్ -
యూపీలో బీజేపీ సామాజిక వ్యూహం
న్యూఢిల్లీ: ప్రాంతీయంగా, సామాజికంగా బలంగా ఉన్న చిన్న పార్టీలను, ఇతర పార్టీల్లో ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా బలంగా ఉన్న నాయకులను కలుపుకుని ఎన్నికల్లో గెలవడాన్ని బీజేపీ చాన్నాళ్లుగా ఒక వ్యూహంగా కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యూహాన్నే 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయవంతంగా ఉపయోగించింది. వచ్చేఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ దిశగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షాతో ఇతర సీనియర్ నాయకులు అప్నాదళ్ (ఎస్), నిషాద పార్టీ నాయకులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలే అయినా, ప్రభుత్వంలసరైన ప్రాతినిధ్యం లభించలేదన్న అసంతృప్తితో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ కీలక నేత జితిన్ ప్రసాదను ఇప్పటికే పారీ్టలో చేర్చుకున్నారు. రాష్ట్రంలో ప్రభావశీల బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన జితిన్ ప్రసాదను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అసంతృప్తితో ఉన్న కొన్ని బ్రాహ్మణ వర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అమిత్ షాతో భేటీపై ఇప్పటివరకైతే అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్ నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు. అణగారిన వర్గమైన ‘నిషాద్’లకు రాష్ట్ర ప్రభుత్వంలో తగిన భాగస్వామ్యం కల్పిపంచడమే తమ ఏకైక డిమాండ్ అని నిషాద్ పార్టీ నేత సంజయ్ నిషాద్ స్పష్టం చేశారు. వెనుకబడినవర్గాలుగా పరిగణిస్తున్న కేవట్ వర్గీయులకు షెడ్యూల్డ్ కులాలకు అందించే ప్రయోజనాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఆదిత్యనాథ్ ప్రాబల్యం అధికంగా ఉన్న గోరఖ్‌పూర్ నుంచి గెలుపొందడం బీజేపీని షాక్‌కు గురిచేసింది. దాంతో, 2019 ఎన్నికల్లో వారిని అనుకూలంగా మార్చుకుంది. అప్నాదళ్‌కు చెందిన, కుర్మి సామాజిక వర్గానికి చెందిన అనుప్రియ పటేల్ మోదీ తొలి ప్రభుత్వం లో మంత్రిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్ కాంగ్రెస్‌తో పొత్తుకు విఫలయత్నం చేసినందువల్లనే ఆమెకు రెండోసారి మంత్రి పదవి లభించలేదని వార్తలు వచ్చాయి. మాజీ మిత్రపక్షం సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీని కూడా మళ్లీకలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఆ వార్తలను ఆ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తోసిపుచ్చారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని, చిన్న పార్టీలతో పొత్తుకు వ్యతిరేకం కాదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ పలు చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాల నేతల కు దగ్గరయ్యే ప్రయత్నాలను ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా ప్రారంభించారు. కరోనా కట్టడిలో విఫలమయ్యారని, కరోనా తీవ్రతను అడ్డుకోలేకపోయారని సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. దీనిపై కొందరు నేతలు అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. దీనిపై నష్ట నివారణ చర్యలను కూడా అగ్ర నాయకత్వం చేపట్టింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఈ దిశగా అమిత్ షా మిత్రపక్షాలతో చర్చలు కూడా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. -
ఏపీకి బెస్ట్ స్టేట్ అవార్డు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు అవార్డులు వరించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏపీకి రెండు అవార్డులు దక్కాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఏపీ బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు గానూ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ బెస్ట్ సీఈవో అవార్డు సొంతం చేసుకున్నారు. శనివారం ఢిల్లీలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఈ అవార్డులను స్వీకరించడానికిగానూ గోపాలకృష్ణ ద్వివేది గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలు దేరారు. ద్వివేదీకి నాగిరెడ్డి అభినందనలు ప్రస్తుతం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ద్వివేదీని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అభినందించారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ద్వివేది అని నాగిరెడ్డి అన్నారు. ద్వివేదీపై అనవసర ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకొంటాడని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పురాలేదని, శాసనమండలి చైర్మన్‌పై కూడా వత్తిడి తెచ్చి అభివృద్ధి బిల్లుకు ఆటంకం సృష్టించారని మండిపడ్డారు. ఒత్తిడులకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేసే అధికారులకు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందనడానికి ద్వివేదీ ఒక నిదర్శనమన్నారు. -
ముగిసిన బ్రిటన్ ఎన్నికలు
లండన్: బ్రిటన్ ప్రతినిధుల సభకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్ల్లోని మొత్తం 650 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,322 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా, అప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రతిపక్ష నేత జెరెమి కార్బిన్ ఉదయమే ఓటేశారు. బ్రిటన్‌లో డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగడం దాదాపు ఒక శతాబ్దం అనంతరం ఇదే తొలిసారి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ పార్లమెంట్ ఏర్పడనుందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడించాయి. పోలింగ్ ముగియగానే కౌంటింగ్ ప్రారంభమైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయానికి ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. 2017లో జరిగిన ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన 12 మంది విజయం సాధించారు. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. -
కెనడా ఎన్నికలు: మరోసారి ట్రూడో మ్యాజిక్..
-
మరోసారి ట్రూడో మ్యాజిక్..
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 388 సీట్లుకు లిబరల్స్ 156 స్థానాలు దక్కించుకోగా.. ప్రతిపక్ష కన్సర్వేటీవ్స్ 122 స్థానాలకే పరిమితమయ్యారు. ప్రవాస భారతీయుడు జగ్మీత్సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ 23స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. కెనడాలో మెజార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 170 స్థానాలు అవసరం. కాబట్టి చిన్న పార్టీలతో కలిసి ట్రూడో మైనార్టీ ప్రభుత్వాన్ని నడపనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలియజేశారు. తమ ప్రగతిశీల అజెండాకు ప్రజలు పట్టంకట్టారని, ఆధునిక కెనడా ఆవిష్కరణకు కృషి కొనసాగిస్తానని ట్రూడో ఎన్నికల విజయం అనంతరం ప్రకటించారు. -
‘ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి’
సాక్షి, కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎంపీ హర్షకుమార్ చెప్పిన పార్టీకి సపోర్టు చేయకుండా తాము వైఎస్సార్ సీపీకి పని చేయడంతో తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని మహాసేన దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాజేష్ సరిపెల్ల వివరించారు. శుక్రవారం కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హర్షకుమార్ అనుచరులు తమను రకరకాలుగా బెదిరింపులకు దిగుతున్నారని, హర్షకుమార్ వల్ల తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మీని కలసి వివరించినట్టు తెలిపారు. హర్షకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు, మహాసేన సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. -
ఎన్నికల ఖర్చు అక్షరాలా 60వేల కోట్లు
-
2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్
-
నాడు 6 పైసలు.. నేడు రూ.46
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంటే, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. మొదటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీలు పెరిగాయి. అభ్యర్థులూ పెరిగారు. దాంతో పాటే ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ వ్యయం కూడా పెరుగుతోంది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి రూ.10 కోట్లు ఖర్చయ్యాయి. అంటే ఒక ఓటరుకు 6 పైసలు ఖర్చయినట్టు. అదే 2014 నాటికి ఎన్నికల వ్యయం రూ.3,870 కోట్లకు చేరింది. అంటే ఒక ఓటరుపై రూ.46 వెచ్చిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఒక ఓటరుపై రూ.15 ఖర్చు చేసింది. అభ్యర్థుల ప్రచార వ్యయం, భద్రతా ఏర్పాట్ల ఖర్చు మినహా మిగతా ఖర్చు ఇది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రచారం చేపట్టడం, దాని కోసం భారీగా ప్రకటనలు జారీ చేయడం, ఎన్నికల జాబితాలను డిజిటలైజ్ చేయడం వంటి చర్యలతో ఇటీవల ఎన్నికల వ్యయం బాగా పెరిగింది. అలాగే, ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న గౌరవ భృతి పెరగడం, వారికి శిక్షణ నివ్వడానికి రాకపోకల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీల ప్రచారాన్ని, పోలింగ్ సరళిని వీడియో తీస్తున్నారు. దీని ఖర్చు కూడా ఎన్నికల సంఘం ఖాతాలోకే వెళుతుంది. అమెరికా కంటే ఎక్కువ దేశంలో ఎన్నికల నిర్వహణ భారీ వ్యయంతో కూడుకుందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. 2019 ఎన్నికల వ్యయం దేశ చరిత్రలోనే అత్యధికంగా ఉండవచ్చని, బహుశా ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంత ఖర్చు ఉండదని వారంటున్నారు. 2016లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, కాంగ్రెస్ ఎన్నికలు కలిపి జరిగాయి. వీటికి మొత్తం 650 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 2014లో మన దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు 500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయని అంచనా. 2019 ఎన్నికల వ్యయం దీన్ని మించిపోతుందని కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ థింక్ ట్యాంక్‌కు చెందిన మిలన్ వైష్ణవ్ చెప్పారు. -
ఎన్నికలు ముగిసే వరకూ ఉద్రిక్తతలే
ఇస్లామాబాద్: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు భారత్–పాక్‌ల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ మరో దుస్సాహసానికి ఒడిగడుతుందేమోనని తాను భావిస్తున్నానన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రస్థావరంపై భారతవాయుసేన దాడి చేయడం తెల్సిందే. ‘ప్రమాదం ఇంకా ముగియలేదు. భారత్‌లో ఎన్నికలు ముగిసేవరకు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంటుంది. ఇండియా దాడి చేస్తే ప్రతిఘటనకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ఇమ్రాన్ అన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది. చికిత్స కోసం షరీఫ్‌కు బెయిలు అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అల్ అజీజియా ఉక్కు మిల్లు లంచం కేసులో షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడగా గతేడాది డిసెంబర్ నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఆరోగ్యం బాగా లేదనీ, చికిత్స కోసం బెయిలు మంజూరు చేయాలంటూ షరీఫ్ చేసిన విజ్ఞప్తిని గతంలో ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించింది. -
ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం సర్వసన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు తదితర యంత్ర పరికరాలను సన్నద్ధం చేసుకోవాలని, సాంకేతిక అంశాలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. శనివారం సచివాలయం నుంచి 13 జిల్లాల అధికారులతో ఈవీఎం, వీవీప్యాట్, న్యూ సువిధా, 1950 కాల్ సెంటర్ అంశాలపై అదనపు సీఈవోలు సుజాతా శర్మ, వివేక్ యాదవ్‌లతో కలిసి ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికపరమైన అంశాలపై జిల్లా యంత్రాంగం స్పందించి ఈ రోజే నివేదికను సమర్పించాలన్నారు. ఎఫ్‌ఎల్‌సిపై నివేదికను సత్వరమే అందజేయాలన్నారు. డిఫెక్టివ్ పరికరాలను ఫ్యాక్టరీకి తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పరికరాలు కేటాయిస్తారని తెలిపారు. 1950 కి సంబంధించి జిల్లా స్థాయిలో నిర్వహించే డిస్ట్రిక్ కాల్ సెంటర్లకు ఇక నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించాలని ఆదేశించారు.1950 జిల్లా కాల్ సెంటర్లు శనివారం, ఆదివారం కూడా పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఒక్కో షిఫ్టులో ఇద్దరు పనిచేస్తున్నారని, మరో ముగ్గురిని తీసుకుని ఐదుగురితో పనిచేసేలా ఏర్పాటు చేయాలని ద్వివేదీ ఆదేశించారు. 1950 కి వచ్చే ప్రతి కాల్కి స్పందన ఉండాలని, ప్రజలు అడిగిన ప్రశ్నలపై నిర్ణీత కాలవ్యవధిలో జిల్లా యంత్రాంగం పరిష్కరించాలని ఆయన సూచించారు. అదనపు సీఈవో వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల నిరంతర పర్యవేక్షణలో భాగంగా న్యూ సువిధ అప్లికేషన్‌ను రూపొందించినట్లు చెప్పారు. నామినేషన్ వివరాలతో పాటు మీడియా మానిటరింగ్ సర్టిఫికెట్, రెవెన్యూ, పోలీసు, ఫైర్ తదితర శాఖలకు చెందిన ప్రతి ఒక్క అనుమతులను ఆన్లైన్లో ఇచ్చే వెసులుబాటు కల్పించి మరింత సులభతరం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ప్రతి అనుమతిని న్యూ సువిధా ద్వారా ఇవ్వాలని ఆయన సూచించారు. ఆయా అనుమతుల కోసం 48 గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. న్యూ సువిధా యాప్ నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో గ్రూప్–1 అధికారిని నియమించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు న్యూ సువిధా మొబైల్ యాప్ ద్వారా అనుమతులకు దరఖాస్తులు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. దరఖాస్తు స్టేటస్‌ను మొబైల్లో తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు. -
తెలుగుదేశం పార్టీ చందాల దందా
సాక్షి, గుంటూరు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేత తనయుడు అడ్డదారులు తొక్కుతున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీపడేందుకు అవసరమైన ఖర్చు భరించాలంటూ పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, భూస్వాములు, కాంట్రాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఆ ముఖ్యనేత తనయుడు వారికి హుకుం కూడా జారీచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా గుంటూరులోని ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌లో రెండు రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తూ భారీ మొత్తంలో చందాలు వసూలు చేసే కార్యక్రమానికి ఆయన తెరతీశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని చిన్నస్థాయి వ్యాపారుల నుంచి బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, భూస్వాములు ఇలా అన్ని వర్గాలకు చెందిన ముఖ్యులను గుంటూరుకు పిలిపించి వారి సామర్థ్యాన్ని బట్టి ఎంత చందా ఇవ్వాలనేది నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఇలా రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు చందాల జాబితాను తయారుచేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అందరిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతుండటంతో అంతా విస్తుపోతున్నారు. సమావేశంలో ముఖ్యనేత తనయునికి ఎదురు చెప్పలేక వారంతా సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలో ఓ ముఖ్యనేత తనయుని దెబ్బకు గత నాలుగున్నరేళ్లుగా రెండు నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల వారు అల్లాడిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బిల్డింగ్ కట్టాలన్నా.. ల్యాండ్ కన్వర్షన్ చేయాలన్నా.. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా.. దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణం ఏర్పాటు చేసుకోవాలన్నా.. బార్ లైసెన్సు పొందాలన్నా.. ఆయనకు ‘కే’ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఓ రైల్వే కాంట్రాక్టర్ పర్సంటేజీ ఇవ్వలేదనే కారణంతో పనులు నిర్వహించే ప్రాంతంలో రేకుల షెడ్డును కూల్చివేసి నిర్మాణ సంస్థ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులపై సైతం దాడులకు పాల్పడిన సంఘటన రాష్ట్రం మొత్తానికి తెలిసిందే. రైల్వే కాంట్రాక్టర్లు సాక్షాత్తు సీఎం, కేంద్ర రైల్వే శాఖామంత్రి దృష్టికి తీసుకెళ్లినా సదరు నేత ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ‘కే’ ట్యాక్స్‌లు కట్టకుండా ఎదురుతిరిగే వారిపై అక్రమ కేసులు బనాయించడం, దాడులకు సైతం తెగబడ్డ ఘటనలు అనేకం. ఇలా చెప్పుకుంటూపోతే నాలుగున్నరేళ్లలో సదరు ముఖ్య నేత తనయుని అరాచకాలకు అంతేలేదు. దీంతో వీరికి ఎదురుతిరిగే అధికారిగానీ, వ్యాపారస్తులుగానీ లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లతో గుంటూరు నగరంలోని ఓ ద్విచక్రవాహన షోరూమ్‌లో రహస్య సమావేశం నిర్వహించి ఎన్నికల ఖర్చు కోసం చందాలు ఇవ్వాలంటూ హుకుం జారీచేశారు. దీంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆయన చెప్పిన దానికి తలాడించి అక్కడ నుంచి బయటపడ్డారు. ఈ సమావేశంలో చిన్న వ్యాపారుల మొదలు బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.లక్షల్లో నిర్ణయించి చందాల జాబితా తయారుచేసినట్లు సమాచారం. జాబితా ప్రకారం డబ్బులు సిద్ధంచేసి పెట్టుకోవాలని తాము చెప్పిన సమయానికి, చెప్పిన వారికి ఆ డబ్బు అందించాల్సి ఉంటుందని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఎలా ఉన్నా, ఎన్నికల సమయంలోనైనా తమ జోలికి రాకుండా ఉంటారని భావించిన వ్యాపారులకు చందాలంటూ ముఖ్యనేత తనయుడు ఊహించని షాక్ ఇవ్వడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. లక్షలకు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ సన్నిహితుల వద్ద వారు వాపోతున్నట్లు సమాచారం. ఇవ్వలేమని చెబితే వారి స్పందన ఎలా ఉంటుందో తమకు తెలుసని, అందుకే ఏం మాట్లాడకుండా వచ్చేశామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలోనూ హడల్ మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ వ్యాపారులు కూడా హడలిపోతున్నారు. ముఖ్యనేత తనయుడు సత్తెనపల్లి నియోజకవర్గానికే పరిమితమవుతారా.. తమను కూడా పిలిచి చందాలు అడుగుతారా అంటూ భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.వేల కోట్లు దోచేసిన ఆయన అందులో నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీయకుండా చందాల ద్వారా వసూలుచేసి ఆ మొత్తాన్ని ఎన్నికలకు ఖర్చుపెట్టడం ఏమిటని బాధితులు వాపోతున్నారు. -
వాట్సాప్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలనం నిర్ణయం తీసుకుంది. రానున్న కాలంలో లక్షలకొద్దీ అనుమాన్సాద వాట్సాప్ ఖాతాలను తొలగించనుంది. ముఖ్యంగా అసంబద్ధ వార్తలను, ఫేక్ న్యూస్ లను వ్యాప్తి చేసే గ్రూపులే టార్గెట్‌గా ఈ చర్యను చేపట్టనుంది. అంతేకాదు ఈ మేరకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు కూడా హెచ్చరికలను జారీ చేసింది. ఎన్నికల సమయంలో బల్క్‌గా సందేశాలను పంపించే అవకాశం ఉందని, తద్వారా తాము అందించే ఉచిత సేవ దుర్వినియోగంకానుందని వ్యాఖ్యానించింది. ఈ ప్రయత్నాలను అడ్డకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ గురువారం ఒక ప్రకన జారీ చేసింది. దీని ద్వారా తమ మెసేజింగ్ ప్లాట్‌ఫాంను సురక్షితంగా ఉంచాలని భావిస్తునట్టు తెలిపింది. అలాగే ఈ ఏడాది జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, ఇతర అధికారులతో చర్చించిన అనంతరం ఈ ప్రక్రియను మరింత విస్తరిస్తామని వెల్లడించింది. వివిధ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున వాట్సాప్ సందేశాలను పంపిస్తున్న ఖాతాలను గుర్తించి మరీ వేటు వేయనుంది. నెలకు 20లక్షల అనుమానిత ఖాతాలను రద్దు చేస్తోందట. గతంలో వివాదాస్పదంగా వ్యవహరించిన, వేధింపులకు పాల్పడిన ఫోన్ నంబర్‌ను, లేదా రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించిన కంప్యూటర్ నెటవర్క్‌ను తమ వ్యవస్థలు గుర్తించగలవని పేర్కొంది. తమది బ్రాడ్కాస్ట్ ప్లాట్‌పాం కాదు అనే విషయాన్ని దేశంలోని పలు రాజకీయ పార్టీలు గుర్తించాలని వాట్సాప్ కమ్యూనికేషన్ హెడ్ కార్ల్ వూగ్ ప్రకటించారు. గత కొన్ని నెలలుగా దీనిపై వారికి అవగాహన కల్పించామని, దీన్ని గుర్తించాలని లేదంటే అలాంటి వివాదాస్పద అకౌంట్లను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు. కాగా వాట్సాప్‌కు భారతదేశంలో 200 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. -
ఎన్నికల ముందు మతఘర్షణలు!
వాషింగ్టన్: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళితే భారత్‌లో మతఘర్షణలు చెలరేగే అవకాశముందని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు, విద్వేషం పెరిగాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఎదురుకానున్న విపత్కర పరిస్థితులపై కోట్స్ సెనెట్ సెలక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ ముందు హాజరై నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కోట్స్ మాట్లాడుతూ..‘మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ అజెండాను ప్రచారాస్త్రంగా చేసుకుంటే భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముంది. దాంతో, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు భారత్‌లో సులభంగా తమ ప్రాబల్యాన్ని విస్తరిస్తాయి’ అని హెచ్చరించారు. భారత్‌పై ఉగ్రదాడులు కొనసాగుతాయి.. అంతేకాకుండా భారత్–పాకిస్తాన్ సంబంధాలు లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ మెరుగుపడే అవకాశం లేదని కోట్స్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్, అఫ్గానిస్తాన్‌పై 2019లోనూ దాడులు కొనసాగిస్తాయని హెచ్చరించారు. తమకు ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదులను మాత్రమే ఏరివేస్తూ, ఇతర ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ అమెరికా ఆగ్రహానికి గురికాక తప్పదని వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై పోరాడుతున్న అమెరికాకు పాక్ వ్యవహారశైలి నిరాశపరుస్తోందన్నారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మత ఉద్రిక్తతలు, అఫ్గానిస్తాన్‌లో 2019, జూన్–జూలై నెలల్లో అధ్యక్ష ఎన్నికలు సందర్భంగా తాలిబాన్ల దాడులు, ఉగ్రవాదుల పూర్తిస్థాయి ఏరివేతకు పాక్ నిరాకరణ వంటి కారణాల వల్ల ఈ ఏడాది దక్షిణాసియాలో హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. సెనెట్ సెలక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ ముందు కోట్స్‌తో పాటు సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్, ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే, రక్షణ నిఘా సంస్థ(డీఐఏ) డైరెక్టర్ రాబర్ట్ అష్లేతో పాటు పలువురు హాజరయ్యారు. -
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ఫిబ్రవరిలోనే!
-
మార్చి తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ ?
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగనుంది. మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు సాగుతున్నట్టు ఎన్నికల కమిషన్ (ఈసీ) వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3తో ముగియనుంది. ఎన్నికలను ఏయే తేదీల్లో ఎన్ని దశల్లో నిర్వహించాలనే అంశంపై ఈసీ తర్జనభర్జనలు సాగిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. భద్రతా దళాల లభ్యత, వాతావరణ పరిస్థితులు సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈసీ ఎన్నికల తేదీలను ఖరారు చేయనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసి మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తుందని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలనూ నిర్వహించవచ్చని ఈసీ వర్గాలు పేర్కొన్నారు. ఇక 2014లో మార్చి 5న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ ఏప్రిల్-మే నెలల్లో తొమ్మిది విడతలుగా పోలింగ్ నిర్వహించింది. ఏప్రిల్ 7న తొలివిడత పోలింగ్ చేపట్టిన ఈసీ మే 12న తుది విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియను ముగించింది. -
20లోగా టీడీపీ, కాంగ్రెస్‌ల పొత్తుపై క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు నిర్ణయంపై ఈ నెల 20లోగా స్పష్టత వస్తుందని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పార్టీ సంసిద్ధం కావాలని అధిష్టానం సూచిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే మేనిఫెస్టో, అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పొత్తులపై కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 20లోగా ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకైతే పొత్తులపై ఎలాంటి క్లారిటీ లేదని చెప్పారు. -
బంగ్లా ఎన్నికల్లో మళ్లీ హసీనా దూకుడు
ఢాకా : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ ఫలితాల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని పాలక అవామీ లీగ్ దూసుకుపోతోంది. హసీనా సారథ్యంలో మళ్లీ అవామీ లీగ్ విజయ ఢంకా మోగించే దిశగా సాగుతోంది. పాలక పార్టీ 144 స్ధానాల్లో ముందంజలో ఉండగా విపక్ష బీఎన్పీ కేవలం మూడు స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. జతియో పార్టీ ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉంది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు విస్పష్ట ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా,అవామీ లీగ్ ఇప్పటికే 19 స్ధానాల్లో విజయం సాధించింది. అంతకుముందు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం హింసాత్మక ఘటనల నడుమ ముగిసింది. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది మర ణించారు. రాజ్షాహి, చిత్తగావ్, కుమిల్లా, కాక్స్‌బజార్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. ఇక బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్, సిల్హెట్లో చెలరేగిన అల్లర్లలో ఒక్కరి చొప్పున మరణించారు. మృతుల్లో పాలక అవామీ లీగ్ కార్యకర్తలే అధికంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. -
బంగ్లా సార్వత్రిక పోలింగ్ రక్తసిక్తం
ఢాకా : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం హింసాత్మక ఘటనల నడుమ ముగిసింది. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది మర ణించారు. రాజ్షాహి, చిత్తగావ్, కుమిల్లా, కాక్స్‌బజార్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. ఇక బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్, సిల్హెట్లో చెలరేగిన అల్లర్లలో ఒక్కరి చొప్పున మరణించారు. మృతుల్లో పాలక అవామీ లీగ్ కార్యకర్తలే అధికంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ప్రధాని షేక్ హసీనా సర్వశక్తులు ఒడ్డుతుండగా, అధికార పక్షానికి చెక్ పెట్టాలని విపక్ష బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చెమటోడ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు 40,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ప్రధాని షేక్ హసీనా ఢాకా సిటీ కాలేజ్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని నియమించారు. -
వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 23వ తేదీన సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. 11వ సాధారణ ఎన్నికలు దేశ వ్యాప్తంగా డిసెంబర్ 23వ తేదీన జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ నూరుల్ హుదా ప్రకటించారు. దేశంలోని మొత్తం 10.42 కోట్ల ఓటర్లు 300 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటారు. 100 నియోజకవర్గాల్లో 1.50 లక్షల ఈవీఎంలను వినియోగించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివిధ అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రతిపక్ష నేత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అధినేత్రి ఖలేదా జియా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి జైలుకు వెళ్లిన కొద్దిగంటల్లోపే ఎన్నికల సంఘం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఖలేదా పోటీకి దిగే అవకాశాల్లేవని తెలుస్తోంది. -
తెలంగాణలో టీఆర్ఎస్కు ఆధిక్యం
తెలంగాణలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని సీ–ఓటర్ సర్వే చెబుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 9, కాంగ్రెస్‌కు 6, బీజేపీ, ఎంఐఎంలకు చెరో సీటు దక్కుతాయని సర్వే తేల్చింది. 2014లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు ఆ పార్టీకి దాదాపు 35 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే 2 సీట్లు తగ్గుతాయని సర్వే అంటోంది. తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ, ఇతర పార్టీలు కలిసి ఎన్నికల్లో కూటమిగా పోటీచేయాలని ఇప్పటికే నిర్ణయించడం తెలిసిందే. 2014లో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేయగా ఇరు పార్టీలూ చెరో సీటును గెలిచాయి. ఇటీవలే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇప్పుడు బీజేపీ తన ఒక్క సీటును నిలుపుకోనుండగా టీడీపీ మాత్రం ఆ సీటును కూడా కోల్పోనుందని తేలింది. మరోవైపు కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచినప్పటికీ టీడీపీ, ఇతర పార్టీల కూటమితో లాభపడి ఈసారి ఆరు సీట్లు గెలవనుందని సర్వే పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 2014లో వచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు 22 శాతం ఓట్లు అధికంగా వస్తాయనీ, అయితే ఆ పార్టీ ఒక్క సీటుకే పరిమితమవుతుందంది. -
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని సీ ఓటర్ సంస్థ జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీలో ప్రసారమయ్యాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని సెప్టెంబర్ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీలో నిలిస్తే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్సీపీకి 21 సీట్లు, టీడీపీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. (చదవండి: మళ్లీ ఎన్డీయేనే.. కానీ..!) అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవంది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా సీ ఓటర్ సర్వేలో వైఎస్సార్సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. నాడు వైఎస్సార్సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. -
మళ్లీ ఎన్డీయేనే.. కానీ..!
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే అధికారంలోకి రానుందని తేలింది. అయితే 2014 లాగా ఈసారి కమలం పార్టీకి సొంతగా మెజారిటీ రాదని స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై రిపబ్లిక్ టీవీ, సీ–వోటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 276 చోట్ల గెలుపొందనుందని వెల్లడైంది. అటు కాంగ్రెస్ కాస్త పుంజుకున్నప్పటికీ యూపీఏ 112 స్థానాలకే పరిమితం కానుందని సర్వే పేర్కొంది. అయితే ప్రాంతీయ పార్టీలే ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి 155 స్థానాల్లో విజయం సాధించి కీలకభూమిక నిర్వహించవచ్చని సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 335 స్థానాలు రాగా.. ఒక్క బీజేపీయే 282 చోట్ల విజయం సాధించింది. అయితే.. ఈసారి బీజేపీ సొంతంగా 230–240 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే ద్వారా వెల్లడైంది. కీలకమైన రాష్ట్రాల వారిగా పార్టీల విజయావకాశాలను ఓసారి గమనిస్తే.. ఉత్తరప్రదేశ్: ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 71 చోట్ల విజయదుందుభి మోగించింది. ఇదే బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఈసారి ఎన్డీయే కూటమికి ఇక్కడ ఎదురుగాలి వీయనుందని సర్వేలో వెల్లడైంది. మహాఘట్బంధన్ పేరుతో ఎస్పీ, బీఎస్పీ ఏకమైతే బీజేపీ సీట్లకు గండికొట్టడం ఖాయంగా కనబడుతోంది. రిపబ్లిక్ టీవీ–సీ వోటర్ సర్వే ప్రకారం, ఈసారి బీజేపీ 36 చోట్ల విజయం సాధించేందుకు అవకాశాలుండగా.. ఎస్పీ, బీఎస్పీ కూటమికి (కాంగ్రెస్ లేకుండా) 42 స్థానాల్లో గెలవొచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ కేవలం 3 చోట్ల గెలిచే అవకాశం ఉంది. అయితే మహాకూటమి నుంచి బీఎస్పీ విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ మళ్లీ 70 చోట్ల గెలుపొందేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుందని పేర్కొంది. రాజస్తాన్: ఇక్కడ మొత్తం 25 సీట్లున్నాయి. 2014లో మొత్తం సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే సీఎం వసుంధరా రాజేపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కారణంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కమలానికి కాస్తంత ఎదురుగాలి వీయడం ఖాయమని వెల్లడైంది. ఈసారి బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలిచేందుకు అవకాశమున్నట్లు సర్వే తెలిపింది. మధ్యప్రదేశ్: ఇక్కడ మొత్తం 29 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 27, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి బీజేపీకి కాస్తంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. దీని ప్రకారం బీజేపీ 23 చోట్ల, కాంగ్రెస్ 6 చోట్ల గెలవనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. బిహార్: బిహార్ ఎన్డీయేకు కీలక రాష్ట్రంగా మారింది. ఇక్కడ నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పొత్తు నేపథ్యంలో బీజేపీ ఎక్కువ సీట్లను వదులుకునేందుకు సిద్ధమైంది. ఇది బీజేపీకి కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా.. 2014లో బీజేపీ 22చోట్ల, ఎల్జేపీ 6 చోట్ల గెలవడంతో ఎన్డీయే కూటమికి 28 సీట్లు వచ్చాయి. అయితే అప్పుడు జేడీయూ రెండు సీట్లలో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి జేడీయూ చేరికతో ఎన్డీయే బలం 31కి పెరుగుతుందని సర్వే పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ కలిసి 9 చోట్ల గెలిచే అవకాశం ఉంది. కర్ణాటక: కర్ణాటక (28 సీట్లలో)లో కాంగ్రెస్, జేడీఎస్‌లు వేర్వేరుగా పోటీ చేస్తే.. సంయుక్తంగా 10 సీట్లు గెలుస్తాయని సర్వే పేర్కొంది. బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్ 7 స్థానాల్లో, జేడీఎస్ 3 చోట్ల గెలుస్తాయని వెల్లడైంది. ఇది కూటమి పార్టీలు వేర్వేరుగా కలిసి పోటీచేస్తే.. 15 స్థానాలు గెలవొచ్చనే ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. పశ్చిమబెంగాల్: మమత పోరాటగడ్డపై ఈసారి బీజేపీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకానుందని సర్వే తెలిపింది. మొత్తం 42 సీట్లలో బీజేపీ 16 చోట్ల గెలిచేందుకు వీలుందని తేలింది. 2014లో 34చోట్ల విజయం సాధించిన మమత ఈసారి 25 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. యూపీలో జరిగే నష్టానికి ఇక్కడినుంచి కాస్తైనా ఉపశమనం పొందాలనే బీజేపీ వ్యూహం ఫలించే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడు: ఎప్పుడూ ఏకపక్షంగా ఒక పార్టీకి ఓట్లు వేసే తమిళ ఓటర్లు ఈసారి కూడా అదే పంథాను అనుసరించనున్నారు. గత ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని డీఎంకేకు అత్యధికంగా 28 చోట్ల గెలిపించనున్నారని సర్వే తెలిపింది. బీజేపీ రెండుస్థానాల్లో అన్నాడీఎంకే 9 చోట్ల విజయం సాధించొచ్చని పేర్కొంది. గుజరాత్: ఈ రాష్ట్రంలోని మొత్తం 26 స్థానాలనూ 2014లో బీజేపీ గెలుచుకుంది. అయితే ఈసారి ఎదురుగాలి వీస్తుంది. కాంగ్రెస్‌తోపాటు పటేళ్ల ఉద్యమ నాయకుడి పోరాటం కారణంగా రెండు చోట్ల బీజేపీకి ఓటమి తప్పదని సర్వే వెల్లడించింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి ఎదురేలేదని ఉన్న 11 చోట్ల బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పేర్కొంది. మహారాష్ట్ర: బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ప్రాంతం మహారాష్ట్ర. ఇక్కడున్న 48 స్థానాల్లో 2014లో బీజేపీ 23 చోట్ల గెలిచింది. శివసేన 18, యూపీఏ (కాంగ్రెస్+ఎన్సీపీ) 6 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి ఒంటరిపోరు తప్పదని శివసేన ప్రకటించిన కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. బీజేపీ 22 చోట్ల గెలుస్తుందని తెలిపింది. కూటమి నుంచి విడిపోతే శివసేన (7 చోట్ల మాత్రమే)కు నష్టం తప్పదని పేర్కొంది. ఇది కాంగ్రెస్, ఎన్సీపీలకు కలిపి 19 సీట్లు కట్టబెట్టే అవకాశం ఉంది. అయితే శివసేన ఓట్లను బీజేపీ రాబట్టుకోగలిగితే మరో ఐదారు చోట్ల గెలిచేందుకు వీలుంది. ఒడిశా: నవీన్ పట్నాయక్ గడ్డపై ఈసారి బీజేపీ ఎక్కువసీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని రిపబ్లిక్ టీవీ సర్వే పేర్కొంది. మొత్తం 21 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల, బీజేడీ 6 చోట్ల గెలవనుండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో పాగా వేయొచ్చని వెల్లడించింది. ఇక్కడ గెలవడం బీజేపీకి అత్యంత ఆవశ్యకంగా మారింది. ఉత్తరభారతంలో కోల్పోయే సీట్లకు పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో విజయంతో ఉపశమనం పొందనుంది. పంజాబ్‌లో మాత్రం ఎన్డీయేకే ఘోర పరాజయం తప్పదని స్పష్టమైంది. అకాలీదళ్‌పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి పెనునష్టాన్ని మిగిల్చనుంది. ఈ సారి సిక్కుల గడ్డపై ఎన్డీయే ఒకే ఒక సీటు గెలుస్తుందని సర్వే తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికొస్తే.. అండమాన్, దాద్రానగర్ హవేలీ, చండీగఢ్, డయ్యూడమన్‌లలో ఉన్న ఒక్కో సీటును, ఢిల్లీలోని 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుండగా.. పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలోని ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోనుందని సర్వే పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలు: ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లున్న (13) అస్సాంలో బీజేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకోనుంది. 2014లో ఏడు సీట్లలో గెలిస్తే ఈసారి 9 చోట్ల విజయం సాధించొచ్చని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ 4, స్వంతంత్రులు ఒక చోట గెలిచే వీలుందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన 11 స్థానాల్లో ఎన్డీయే 9 చోట్ల, యూపీఏ 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. -
భవిష్యత్‌ను నిర్ణయించేది మహిళా ఓటర్లే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో మహిళా ఓటర్ల పాత్ర చరిత్రాత్మక దశకు చేరుకుంది. 1990వ దశకంలో ఎన్నికల్లో ఓటేసిన పురుషులకంటే మహిళల సంఖ్య పది శాతానికి పైగా తక్కువగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఓటేసిన మహిళల సంఖ్య 65.5 శాతానికి చేరుకుంది. అదే ఎన్నికల్లో 67 శాతం పురుషులు ఓటేశారు. అంటే పురుషులతో పోలిస్తే ఓటేసిన మహిళల సంఖ్య ఒకటిన్నర శాతం మాత్రమే తక్కువ. ఏకంగా దేశంలోని 87 లోక్‌సభ నియోజక వర్గాల్లో పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రిజిస్టర్ చేసుకున్న పురుషుల ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్లే కంటే ఎక్కువే. అయినప్పటికీ రిజిస్టర్ చేసుకున్న మహిళల్లోనే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. అంటే ఓ ప్రభుత్వాన్ని, ఓ రాజకీయ పార్టీ భవిష్యత్తును శాసించే దశకు వారు చేరుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను కూడా మహిళలే శాశిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1994 నుంచి 2014వరకు జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్ సరళి చూస్తే పురుషులకన్నా మహిళలే కాంగ్రెస్‌వైపు ఎక్కువ మొగ్గు చూపారు. కాంగ్రెస్ కన్నా బీజేపీకి రెండు, మూడు శాతం తక్కువ మంది మహిళలు ఓట్లు వేశారు. అంతర్జాతీయంగా కూడా మహిళా ఓటర్ల ప్రభావం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికులకన్నా డెమోక్రట్లకే ఎక్కువ మంది మహిళలు ఓటేశారు. 2016 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి ఓటేసిన వారిలో 56 శాతం మంది మహిళలు ఉండగా, 44 శాతం మంది మహిళలు ఉన్నారు. బ్రిటన్ ఎన్నికల్లో కూడా లేబర్ పార్టీకన్నా కన్జర్వేటివ్ పార్టీకే మహిళల ఓట్లు ఎక్కువ పడ్డాయి. దేశంలో లోక్‌నీతి జరిపిన జాతీయ ఎన్నికల అధ్యయనం ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి ఒకే రీతిన అంటే, 19 శాతం పురుషులు, 19 శాతం పురుషులు ఓట్లు వేశారు. అదే బీజేపీకి 33 శాతం మంది పురుషులు ఓటేయగా, 29 శాతం మంది మహిళలు ఓటేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్‌కు స్త్రీ, పురుషులు సమానంగా వేయగా, ప్రతి చోటా బీజేపీకి పురుషులకన్నా స్త్రీలు తక్కువ సంఖ్యలో ఓటేశారు. కొన్ని రాష్ట్రాల్లో స్త్రీ, పురుషుల ఓటింగ్ సరళిలో కూడా ఎంతో వ్యత్యాసం కనిపించింది. అస్సాం రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు కాంగ్రెస్‌కు ఓటేయగా, ఎక్కువ మంది పురుషులు బీజేపీకి ఓటేశారు. కర్ణాటకలో కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీని కోరుకోగా పురుషులు బీజేపీ పార్టీని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలనే స్త్రీ, పురుషులు కోరుకున్నారు. ఈ రెండు పార్టీలకే మహిళలు కూడా ఎక్కువ ఓటేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు 15 శాతం మంది పురుషులు ఓటేయగా, ఐదు శాతం మంది మహిళలు మాత్రమే ఓటేశారు. గుజరాత్లో మాత్రం స్త్రీ, పురుషులు దాదాపు సమానంగా బీజేపీకే ఓటేశారు. తెలంగాణలో కే. చంద్రశేఖర రావు, బీహార్‌లో నితీష్ కుమార్, మధ్యప్రదేశ్లోలో శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌లు మహిళా ఓటర్లను ఎక్కువ ఆకర్షించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులోని అన్నాడిఎంకే (జయలలిత) పార్టీలు మహిళా ఓటర్లను ఎక్కువ ఆకర్షించాయి. అలాగే 2014 అనంతరం తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల సరళిని లోక్‌నీతి సంస్థ పరిశీలించగా మహిళా ఓటర్లే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెల్సింది. మహిళా నాయకత్వంలోని అన్ని పార్టీలకు పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు. 2017, నవంబర్‌లో ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ జరిపిన అధ్యయనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పురుషులకన్నా స్త్రీల మద్దతు కాస్త తగ్గింది. మతమరమైన అంశాలను మోదీ సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారన్నదే వారి అభియోగం. కానీ 2018 మే నెలలో లోక్‌నీతి జరిపిన అధ్యయనంలో 2014 ఎన్నికలతోపోలిస్తే బీజేపీకి మహిళల మద్దతు కొద్దిగా పెరిగింది. అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నమాట. -
ధరలను తగ్గించకుంటే మోదీకి కష్టమే
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆదివారం హెచ్చరించారు. 2014లో మాదిరి వచ్చే సాధారణ ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా, బీజీపీ తరఫున తాను ప్రచారం చేయననీ స్పష్టం చేశారు. అయితే అన్ని పార్టీలూ తనకు సమానమేననీ, రాజకీయాల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రామ్‌దేవ్ చెప్పారు. ‘మోదీ ప్రభుత్వ విధానాలను ఎందరో పొగుడుతున్నారు. కానీ వాటిలో కొన్నింటికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ధరల పెరుగుదల ప్రధాన సమస్య. నియంత్రణ చర్యలకు ఉపక్రమించకపోతే మోదీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని రామ్‌దేవ్ అన్నారు. -
పెరగనున్న పోలింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ విషయంలో అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 30,518 పోలింగ్ కేంద్రాలున్నాయి. తాజాగా దాదాపు 1,686 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా వచ్చే సాధారణ ఎన్నికలకు 32,204 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఓ పోలింగ్ బూత్ ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 1,200 ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 1,500 మందికి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 85 వేల ఈవీఎంలు: సాధారణ ఎన్నికలకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సేకరణను రాష్ట్ర ఎన్నికల కార్యాలయం చేపడుతోంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే 85 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. షెడ్యూ ల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 4న ఓటర్ల తుది జాబితా సిద్ధం కానుంది. -
పాక్ ఎన్నికల్లో ఉగ్రనేతలు..!!
ఇస్లామాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్‌లోలష్కరే తొయిబాకు చెందిన నేతలు పోటీ చేయనున్నారనే ఊహాగానాల మధ్య అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్ఈటీతో సంబంధాలున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని కోరినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రజాస్వామ్య హక్కులను కాలారాస్తూ ఎన్నికల్లో పోటీకి దిగిన వారిపై ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఒక ప్రకటలో వెల్లడించింది. కాగా, మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పేరిట ఓ పార్టీ రిజిస్ట్రేషన్‌కు యత్నించింది. అయితే, ఎంఎంఎల్‌కు లష్కరే సంస్థతో సంబంధాలున్నాయని పేర్కొంటు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ జూన్‌లో రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై అమెరికా సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు పాక్‌లో ఎన్నికలు సామరస్యంగా, రక్షణాత్మకంగా నిర్వహించాలని కోరుతూ ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి భయాలకు వెరవకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నిలదొక్కుకునేలా చేయాలని ఆకాక్షించింది. -
‘ముందస్తు’ వ్యూహాలు!
సాక్షి, మేడ్చల్ జిల్లా: సాధారణ ఎన్నికల ‘ముందస్తు’ ప్రచారంతో జిల్లాలో ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా బీఎల్ఎఫ్, టీజేఎస్, వామపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీలు ప్రణాళికలు రూపొందించుకునే పనిలో పడ్డాయి. అధికార టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న కొందరికి మళ్లీ టికెట్ ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్ నుంచి మౌఖిక సందేశాలు అందటంతో.. వారు మరింత చురుగ్గా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. ఇందులో మేడ్చల్, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కమలనాథుల సమధికోత్సాహం.. జిల్లాలో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానం ఉప్పల్‌తో పాటు మేడ్చల్, కూకట్పల్లి, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో నిలబెట్టనున్న అభ్యర్థులకు మౌఖిక సంకేతాలివ్వటంతోపాటు కేంద్ర మంత్రులు, జాతీయ, రాష్ట్ర నేతల పర్యటనలతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్‌నగర్‌లో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిర్వహించిన మార్పు కోసం.. బీజేపీ జన చైతన్య యాత్ర సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించారు. కాంగ్రెస్‌లో కదనోత్సాహం.. జిల్లాలో అధికార టీఆర్ఎస్తో సహా పలు పార్టీలు ‘ముందస్తు’ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ సైతం కదనోత్సాహానికి ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ఆవిర్భావం అనంతరం ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పెద్దగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నప్పటికీ.. పార్టీ కార్యకర్తల వరకు పరిమితమై నాయకులు పర్యటనలు సాగిస్తున్నాయి. ఎట్టకేలకు ఇందిరా భవన్లో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఏఐసీసీ కార్యదర్శి బోస రాజుతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇతర పార్టీల్లోనూ.. బీఎల్ఎఫ్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు సైతం ప్రజా సమస్యల పరిష్కారానికి మండల, జిల్లాస్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. బీఎల్ఎఫ్ ఒకడుగు ముందుకేసి పార్లమెంట్, అసెంబ్లీ కన్వీనర్లను నియమించి జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. -
ఎర్రకోట నుంచి సంచలన ప్రకటన!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఆగస్ట్ 15న ఢిల్లీలోని ఎర్రకోట నుంచి చేసే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారా? ఒకవేళ అదే నిజమైతే.. ఆ ప్రకటన దేని గురించి అయి ఉంటుంది?.. ప్రస్తుతం దేశ రాజధానిలో రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలకు సంబంధించి విరివిగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మోదీ అకస్మాత్తుగా రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేసిన విషయాన్ని కూడా ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా వారణాసిలో పార్టీ సీనియర్ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలతో రహస్యంగా జరిపిన సమావేశం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేశారని చెబుతున్న వ్యాఖ్యలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ‘ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. త్వరలో ప్రధాని నుంచి ఓ కీలక ప్రకటన వెలువడబోతోంది. ఆగస్ట్ 15 తరువాత దేశమంతా ‘ఎలక్షన్‌మోడ్’లోకి వెళ్లబోతోంది. పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. 2014లో ఇక్కడ మనకొచ్చిన 44% ఓట్ల శాతాన్ని 50 శాతానికి పెంచే దిశగా కృషి చేయాలి’ అంటూ ఆ భేటీలో అమిత్‌షా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. షా వ్యాఖ్యలను బట్టి ఆగస్ట్ 15న ప్రధాని నుంచి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ వర్గాలను సమాయత్తపరిచేందుకు షా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఖరీఫ్ సీజన్‌కు వరి, పత్తి సహా 14 పంటల కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వం పట్ల రైతాంగంలో నెలకొన్న వ్యతిరేకతను తగ్గించే దిశగా తీసుకున్న నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారం కోసం ముందస్తు ఎన్నికలపై ఒకవైపు వార్తలు వినిపిస్తుంటే.. మరోవైపు, అది సాధ్యం కాదని, అవన్నీ నిరాధార కథనాలేనని బీజేపీ సీనియర్లే చెబుతున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మూడు రాష్ట్రాల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఉపయోగపడేలా.. కుల సమీకరణాల నేపథ్యంలో.. మోదీ ప్రకటన ఉండవచ్చని బీజేపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, మోదీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదంటూ ఆయనే ముక్తాయించడం గమనార్హం. -
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
-
వరికి కనీస మద్దతు ధర పెరిగింది
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతుల మన్ననలు పొందేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది. దీంతో ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరి కనీస మద్దతు ధర 2018-19లో క్వింటాకు 200 రూపాయలు పెరిగి, రూ.1,750గా నిర్ణయమైంది. 2017-18లో ఈ ధర రూ.1,550గా ఉండేది. గ్రేడ్ ఏ రకం వరి కనీస మద్దతు ధర కూడా 160 రూపాయలు పెరిగి రూ.1,750 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వరికి కనీస మద్దతు ధర పెరగడంతో, 2016-17(అక్టోబర్-సెప్టెంబర్) మార్కెటింగ్ ఏడాది ప్రకారం ఆహార రాయితీ బిల్లు కూడా రూ.11 వేల కోట్ల కంటే ఎక్కువ పెరగనుందని తెలిసింది. వరితో పాటు పత్తి(మిడియం స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా రూ.4,020 నుంచి రూ.5,150కు పెరిగింది. అదేవిధంగా పత్తి(లాంగ్ స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా క్వింటాకు రూ.4,320 నుంచి రూ.5,450కు పెంచారు. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,450 నుంచి రూ.5,675కు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సన్ ప్లవర్ ధర క్వింటాకు 1,288 రూపాయలు, పెసర్ల ధర క్వింటాకు 1,400 రూపాయలు, రాగుల ధర క్వింటాకు 997 రూపాయలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మంగళవారమే ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, నీతి ఆయోగ్ ప్లానింగ్ బాడీ అధికారులు సమావేశమయ్యారు. -
సార్వత్రికమే టార్గెట్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయనే భ్రమలు తొలిగిపోవడంతో అధికార పార్టీ నేతలు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల దిశగా వేస్తున్న అడుగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తోడయ్యారు. ఇటీవల బహిరంగ సభలోనే ఆయన ముందస్తు ఎన్నికలు జరుగుతాయని సూచనప్రాయంగా చెప్పడంతో టీఆర్ఎస్లోని సిట్టింగ్‌లు అలర్ట్ అయ్యారు. ముందస్తు ఎన్నికలు జనవరిలోగా పూర్తవుతాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సర్వేలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు సమాచారం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా, ఆయా నియోజకవర్గాల్లో పార్టీపై ప్రజల్లో 60 శాతం వరకు అనుకూలత ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో తమపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతను కూడా అధిగమించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల జంఝాటం తొలిగిపోవడంతో తమ ప్రతిష్టను పెంచుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్ సీట్లను కేసీఆర్ మార్చరని బలంగా నమ్ముతున్న కొందరు ఎమ్మెల్యేలు పడిపోయిన బలాన్ని, జారిపోయిన బలగాన్ని తిరిగి సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులను సైతం టీఆర్ఎస్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుబంధు, బీమాలపై గంపెడాశ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మొదటి దశ ముగి సింది. స్థానికంగా ఉన్న భూ వివాదాలు, ఇతర సమస్యల కారణంగా కొందరికి చెక్కులు, పాస్ పుస్తకాలు రాకపోయినా తొలిదశ విజయవంతమైందనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అర్హులైన వారందరికి త్వరలోనే చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంఎల్సీ ఆర్డీవోలు, తహసీల్దార్లతో మా ట్లాడుతూ చెక్కుల పంపిణీ సజావుగా పూర్తిచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో రైతులకు రూ.5లక్షల బీమా పథకం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధిం చి మార్గదర్శకాలు ఇప్పటికే జిల్లాలకు అందాయి. వచ్చే రెం డు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో జిల్లాల యంత్రాంగం ఉంది. వచ్చే నవంబర్‌లో రెండో విడత రైతుబంధు కింద చెక్కుల పంపిణీ జరుగనుంది. డిసెంబర్ లేదా జనవరిలో ముందస్తు ఎన్నికలు జరగడానికి ముం దే ఈ చెక్కుల పంపిణీ కూడా పూర్తయితే రైతుల్లో ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఏర్పడుతుందని, ఎమ్మెల్యేల తప్పులు కూడా ఇందులో తుడిచిపెట్టుకుపోతాయని వారి అంచనా. ఈ నేపథ్యంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. సిట్టింగ్‌ల్లో ఎవరికి భయం..? ఉమ్మడి జిల్లాలోని పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లపై ఒకరిద్దరికి అనుమానం ఉంది. స్థానికంగా ఉన్న పరిస్థితులకు తో డు పోటీ నాయకత్వం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ల్లో తెలియని ఆందోళన కనిపిస్తోం ది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సీట్లు మళ్లీ గెలవడం ఖాయమని తెలిసినప్పుడు అధిష్టానం ప్రయోగా లు చేయబోదనే విశ్వాసం ఉన్నప్పటికీ, పార్టీలోని బలమైన ప్రత్యర్థుల గురించే కొంత ఆందోళన. అయితే స్థానిక అంశాలు, కుల సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల బలాన్ని పరిగణలోకి తీసుకొనే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టిక్కెట్ల కోసం పోటీ ఉంద ని భావించిన ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలలో సైతం ఎమ్మెల్యేలు తమదే పైచేయి అని నమ్ముతున్నారు. ప్రత్యర్థుల మైనస్ పాయింట్లను చాపకింది నీరులా ప్రచారంలోకి తెస్తున్నారు. అదే సమయంలో స్థాని కంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంపీల మార్పు కూడా ఉండదేమో..? ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నగేష్‌ను కదల్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదని ఓ ప్రజాప్రతినిధి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పా రు. ఆదివాసీ ఉద్యమం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నగేష్‌ను కదల్చే సాహసం చేయబోరని ఆయన వాదన. నగేష్ ఎం పీగానే తిరిగిపోటీ చేస్తే బోథ్ నుంచి బాపూరావుకే తిరిగి సీటు ఖాయం. ఖానాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మె ల్యే రేఖానాయక్‌కు స్థానికంగా మెజారిటీ ఓట్లు ఉన్న ఓ వర్గం మద్దతు ఉంది. ఇక్కడ రమేష్రాథో డ్ పోటీ చేయనున్నట్లు చెపుతున్నా, మహిళగా ఆమె పట్లనే సానుభూతి ఉంటుందని పార్టీ అంచనాకు వచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. రేఖానాయక్ భర్త ఆర్టీఏ అధికారి శ్యాంనాయక్ ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత ఆదివాసీ ఉద్యమ నేపథ్యంలో అది సాధ్యం కాదు. ఆసిఫాబాద్‌లో వివాదాస్పదం కావడంతో ఆయనను ఆదిలాబాద్‌కు బదిలీ చేయడంతో రాజకీయ ప్రస్థానంపై కొంత వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను కూడా అసెంబ్లీకి పోటీ చేయిస్తారనే ప్రచారం గత కొంతకాలంగా ఉంది. మాజీ ఎంపీ వివేక్ కోసం సుమన్ సీటును ఖాళీ చేయిస్తారని భావించినప్పటికీ, స్థానిక పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా పార్టీకి ఇబ్బంది కలుగుతుందని భావిస్తే ‘ఎక్కడి వారక్కడే’ అనే విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెపుతున్నారు. ఆదివాసీ ఉద్యమంపై ప్రత్యేక సర్వే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న ఆదివాసీలు ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను అమలు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఆదివాసీ రాష్ట్ర నాయకులుగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యేలు సోయం బాబూరావు (బోథ్), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్) కాంగ్రెస్ నుంచి పోటీ చేయ డం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో వీరి ప్ర భావం ఎన్నికల్లో ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ దృష్టి పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే ఓసారి సర్వే చేయించిన పార్టీ నాయకత్వం మరోసారి ఆదివాసీల పల్స్ తెలుసుకునే ప్ర యత్నంలో ఉంది. ఆసిఫాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు ఎంపీ నగేష్ కూ డా ఆదివాసీనే కావడంతో వీరి నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ తయారవుతోంది. -
రాహుల్ గాంధీ రాస్తా ఎటు?
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత రాజకీయ సిద్ధాంతం ఏమిటీ? దృక్పథం ఏమిటీ? 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆచరణీయ వ్యూహం ఏమిటీ? ఎలా గెలవాలనుకుంటోంది? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి రాహుల్ గాంధీని ఎప్పుడు కదిపినా, ఎవరు కదిపినా ‘బీజేపీని ఓడించడమే మా లక్ష్యం’ అని చెబుతున్నారు. ఎలా ఓడిస్తారన్న ప్రశ్నకు ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఎన్నికల్లో అన్ని భావసారూప్యత పార్టీలను, అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతామని చెబుతున్నారు తప్పా, అది కూడా ఎలా ? అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్న సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నాయిగానీ, స్వరాష్ట్రంలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ, తెలంగాణలో కేసీఆర్ బీజేపీ యేతర ఫ్రంట్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇక ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ పార్టీతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ పార్టీయే సుముఖంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ దృక్పథం ప్రాతిపదికన, ఏ వ్యూహం ప్రకారం రానున్న సార్వత్రిక ఎన్నికలను రాహుల్ గాంధీ ఎదుర్కోవాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీకిగాని, ప్రాంతీయ పార్టీలకుగానీ తమకంటూ ఓ ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం అంటూ ఉంది. బీజేపీకి హిందూత్వ ఎజెండా ఉండగా, ప్రాంతీయ పార్టీలకు ఆయా ప్రాంతాల సామాజిక వర్గాల సంక్షేమం కోసం కషి చేయడమన్న రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి గాంధీ సిద్ధాంతం, ఆ తర్వాత విస్తృతార్థంలో లౌకిక సిద్ధాంతం అంటూ ఉండేది. లౌకిక సిద్ధాంతం ప్రాతిపదికన సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లోకి దూసుకెళ్లి పునాదులు వేసుకొంది. ఆ పునాదులన్నీ ఇప్పుడు పూడుకుపోయాయి. ఒకప్పుడు ప్రతి సమాజిక వర్గంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వారు అంతో ఇంతో ఉండేవారు. అనేక ప్రాంతాల్లో పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో, నిరక్ష్యరాసుల్లో ఆదరణ ఉండేది. దాదాపు అన్ని వర్గాల వారికి పార్టీ దూరం అవుతూ వచ్చింది. అగ్రవర్ణాల వారు, ఇతర వెనకబడిన వర్గాల వారు బీజేపీ వెంట వెళ్లారు. దళితులు, బీసీలు, ఇతర వెనకబడిన వర్గాల వారు ప్రాంతీయ పార్టీల దరి చేరారు. మైనారీటీలు కూడా సొంత పార్టీలవైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణమైన పటేళ్లతోపాటు దళితులను, ఇతర వెనకబడిన వర్గాల ప్రజలను కలుపుకుపోయేందుకు కాంగ్రెస్ పార్టీ కషి చేసి కొంత మేరకే విజయం సాధించింది. కర్ణాటకలో మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ‘అహిందా’ దక్పథంతో దళితులు, వెనకబడిన వర్గాల వారిని, మైనారిటీలను కలుపుకుని పోయేందుకు ప్రయత్నించారు. అందులో ఆయన విజయం కూడా అసంపూర్ణమే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే ఇష్టమున్నా, లేకున్నా అన్ని పార్టీలను రాహుల్ గాంధీ కలుపుకుపోవాలి. మతతత్వ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమంటే సరిపోదు, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలి! అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేస్తాం, మైనారిటీలపై దాడులు నివారిస్తాం, మహిళలకు సాధికారిత కల్పిస్తాం....లాంటి నినాదాలు తీర్మానాలకే పరిమితం అవుతున్నాయి. సమావేశ మందిరాలను దాటి అవి బయటకు రావడం లేదు. నేటి బీజేపీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, కవులు, కళాకారులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. భావ ప్రకటన స్వాతంత్రం కనుమరుగవుతోంది. కుహనా జాతీయ వాదం కదంతొక్కుతోంది. వీటన్నింటిని పటిష్టంగా ఎదుర్కొంటూ, పార్టీ అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి చెప్పాలి. రాజ్యాంగ రక్షణకు కట్టుబడి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పునరంకితమవుతూ చిత్తశుద్ధితో ప్రజల్లోకి వచ్చినప్పుడే రాహుల్ నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆహ్వానిస్తారు, పట్టం కడతారు! -
రిజర్వేషన్లపై టెన్షన్
జిల్లాలో గ్రామ పంచాయతీలు 468 వార్డులు 4,750 మొత్తం ఓటర్లు 7,25,660 మహిళలు 3,61,914 పురుషులు 3,63,746 సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లౖòపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్ కానుందోననే సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 721 గ్రామ పంచాయతీల్లో 719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయావర్గాల నేతలు తాము పోటీ చేయదల్చుకున్న స్థానాలకు రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారుల గుర్తింపు పూర్తి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొనే అధికారుల గుర్తింపు ఇప్పటికే పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఆఫీసర్లు(పీఓ)లు 1439 మందిని గుర్తించారు. ఇందులో మహబూబ్‌నగర్ డివిజన్లో 691, నారాయణపేట్‌లో 148 మందిని ఎంపిక చేశారు. ఏపీఓలు 2,271 మందిని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కేత్రస్థాయి పరిశీలన చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,366 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గుర్తించారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎన్నికల నిబంధన మేరకు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు జిల్లాలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడెప్పుడా అని రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ఆరంభమైన తరువాత ఒక్కసారిగా పల్లె వాతావరణం వేడెక్కనుంది. ఆగస్టు 2, 2013న కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. అంతలోపు ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు, 4,750 వార్డులు ఉన్నాయి. మొత్తం 7,25,660మం ది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,61,914 మహిళ ఓటర్లు, 3,63,746 పురుష ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీనిప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లను అమలు చేయనుండగా, బీసీలకు ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల అమలుచేస్తారు. దీంతోపాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు ఉంటుంది. అన్ని కేటగిరీల్లోనూ 50శాతం పదవులు మహిళలకు కేటాయించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్ పదవులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఓటర్ల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు బీసీలకే కేటాయించే రిజర్వేషన్లను వారి ఓటర్ల సంఖ్య ఆధారంగా కేటాయించనున్నారు. జిల్లాలో 4,61,542 బీసీ ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,30,319 పురుష, 2, 31,223మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 34శాతం మేరకు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీని ప్రకారం జిల్లాలో బీసీలకు 243 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఎస్టీలకు 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీంతో తండాలను కలుపుకుని 148 స్థానాలు సర్పంచ్ స్థానాలు దక్కనున్నాయి. ఎస్సీలకు 20.46 శాతం రిజర్వేషన్లను ఎస్సీలకు కేటాయిస్తారు. మొత్తం 714 స్థానాల్లో ఎస్సీలకు 146 స్థానాలు దక్కనున్నాయి. జనరల్‌కు వివిధ వర్గాలకు 60శాతం మేరకు రిజర్వేషన్ల కేటాయించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 6,366 వార్డులు జిల్లా వ్యాప్తంగా 721 గ్రామ పంచాయతీలు, 6366 వార్డులు ఉన్నాయి. ఇందులో 34 శాతం లెక్కన బీసీలకు 2,164 స్థానాలు రానున్నాయి. వాటిలో 1,082 మహిళలకు, 1,082 బీసీ జనరల్ స్థానాలకు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీలకు 20.46శాతం లెక్కన 1,302 స్థానాలు దక్కనున్నాయి. వాటిలో 651 మహిళలకు, మిగతావి ఎస్సీ జనరల్‌కు దక్కే అవకాశాలున్నాయి. అలాగే ఎస్టీలకు 5.73శాతం మేరకు 365 స్థానాలు దక్కనుండగా, వాటిలో 182 మహిళలకు, 183 ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్లు పోగా 2,535 స్థానాలు జనరల్‌కు దక్కనున్నాయి. వాటిలో జనరల్ మహిళలకు 1,267 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. మార్గదర్శకాలు రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి తమకు పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు అందాల్సి ఉంది. గత ఎన్నికల్లో నిర్వహించిన మాదిరిగానే రిజర్వేషన్లు కేటాయించాలని సూచనప్రాయంగా తెలిపారు. అందులో అంతగా స్పష్టత లేదు. మరో 4, 5 రోజుల్లో పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. – వెంకటేశ్వర్లు, డీపీఓ -
డేంజర్ జోన్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ఓట్లు కురిపించే పథకాలకు మరింత పదును పెడుతోంది. తద్వారా గులాబీ పార్టీకి ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, వారి అనుచరులు వ్యవహరించే తీరు మైనస్‌గా మారుతోందని గుర్తించారు. అంతర్గత సర్వేల ద్వారా ఇవి బయట పడుతుండడంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. పాలమూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో సగంమంది డేంజర్ జోన్లో ఉన్నారని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ కొద్ది మందిని స్వయంగా గులాబీ దళపతి సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ఇకనైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. ఏడు నుంచి తొమ్మిది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ రానున్న సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతా గులాబీ పార్టీకి సానుకూల పవనాలు బలంగా వీచినా ఒక పార్లమెంంట్, ఏడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన నారాయణపేట ఎస్.రాజేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలం తొమ్మిదికి చేరింది. పనితీరుపై ఆరా ఇంతకాలం ఎమ్మెల్యే పనితీరుపై పెద్దగా దృష్టి సారించని సీఎం కేసీఆర్ ఇటీవల తరచుగా అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది.. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలను కూడా బహిర్గతం చేశారు. తాజాగా చేయించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నట్లు తేలిందని సమాచారం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ముగ్గురి పరిస్థితి ‘డేంజర్ జోన్’లో ఉన్నట్లు గుర్తించారని చెబుతున్నారు. డేంజర్ జోన్ ఉన్నట్లు చెబుతున్న ఓ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తన నియోజకవర్గ కేంద్రంలో కేవలం ఒక్కసారి మాత్రమే రాత్రివేళ విడిది చేశారట. ఇలాంటి పరిస్థితులో నియోజకవర్గ ప్రజలు ఎలా విశ్వసిస్తారని సీఎం కేసీఆర్ గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఇదే మాదిరిగా మిగతా ఎమ్మెల్యేల బలహీనతలను స్వయంగా సీఎం కేసీఆర్ వారికే నేరుగా చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, మెజార్టీ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల సాను కూలత వ్యక్తమైందని సర్వేల్లో వెల్లడవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా రానున్న ఎన్నికల్లో పాల మూరు ప్రాంతంలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేయాలని అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకోసం రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ఉమ్మడి పాలమూరు పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న వైనా న్ని ప్రస్తావిస్తున్నారు. అయితే పార్టీకి సానుకూల పవనాలు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి ముప్పుగా మారే ప్రమాదం ఉం దని సర్వేల ద్వారా వెల్లడైందట. చాలా మంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోతే ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు ఎంచుకోవాలనే యోచనలోగులాబీ బాస్ ఉన్నట్లు సమాచా రం. ఇప్పటికే రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతల తో పాటు ద్వితీయశ్రేణి నాయకులు భారీ సంఖ్య లో కారె క్కారు. పార్టీ తరఫున ఎవరిని నిలి పితే విజయం తథ్యమనే దిశగా పార్టీ అధిష్టానం యో చిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. -
ముషార్రఫ్‌కు షాక్ ఇచ్చిన పాక్ సుప్రీం కోర్టు
లాహోర్ : పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌కు భారీ షాక్ ఇచ్చింది. అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు షరుతులతో కూడిన అనుమతినిచ్చిన కోర్టు గురువారం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. 2013లో పెషావర్ హైకోర్టు ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ముషార్రఫ్ 2016 నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నాడు. తనపై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా ముషారఫ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూలై 25న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతవారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అలాగే జూన్ 13వ తేదీన కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశించింది. దీంతో ముషార్రఫ్ ఈ సారి ఎన్నికల్లో చిత్రాల్ నుంచి పోటీ చేసేందుకు దుబాయ్ నుంచే నామినేషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు ముషార్రఫ్ బుధవారం కోర్టుకు హాజరుకాకపోవడంతో అతని లాయర్ మరింత సమయం ఇవాల్సిందగా కోర్టుకు అభ్యర్థించడంతో.. న్యాయమూర్తి ముషారఫ్‌కు గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇచ్చారు. అయిన కూడా ముషారఫ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఈవీఎంలుంటే ఎన్నికల్ని బహిష్కరించండి: ఉద్ధవ్
ముంబై: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) చుట్టూ నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించకుంటే ప్రతిపక్షాలన్నీ ఐక్యమై 2019లో సార్వత్రిక ఎన్నికల్ని బహిష్కరించాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పిలుపునిచ్చారు. పాల్ఘర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాత్రికిరాత్రి ఓటింగ్ శాతం పెరిగిపోవడంపై ఎన్నికల సంఘాన్ని కోర్టుకు ఈడుస్తాతామని హెచ్చరించారు. ‘వేడి కారణంగానే ఈవీఎంలు పనిచేయడం లేదని ఎన్నికల కమిషనర్ చెప్పడం హాస్యాస్పదం. దేశంలో వాతావరణ పరిస్థితులపై ఎన్నికల కమిషనర్‌కు కనీస అవగాహన ఉందా? ఆ లెక్కన ఐపీఎల్ తరహాలో 2019 ఎన్నికల్ని రాత్రిపూట నిర్వహిస్తారా?’ అని ప్రశ్నించారు. ‘పాల్ఘర్లోని 8 లక్షల మంది ఓటర్లలో ఆరు లక్షలమంది బీజేపీని తిరస్కరించారు. 2014 ఎన్నికల్లో పాల్ఘర్లో లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ ఈసారి కేవలం కొన్నివేల ఓట్లతో గట్టెక్కడమే ఇందుకు నిదర్శనం’ అని అన్నారు. -
తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివద్ధి పథకాలు కేంద్రం ఇస్తున్న నిధులతోనే కొనసాగుతున్నాయి. కానీ ఈ పథ కాల అమలులో కేంద్రం ప్రస్తావన కూడా చేయ కుండా మొత్తం తమ ఘనతగా కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంటూండటం విచారకరం. మిషన్ భగీ రథ, రూపాయికి కిలో బియ్యం, మిషన్ కాక తీయ, పెన్షన్లు, ఆరోగ్య పథకం వంటి పలు తెలం గాణ ప్రభుత్వ పథకాలు కేంద్రం చేయూత తోనే కొనసాగుతుండటం వాస్తవం. అందుకే ఈ అంశంపై నిజాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల కోసమని కాకుండా, కేంద్రం సహాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ సాధించలేవనే వాస్త వంపై బీజేపీ నాయకులు, కార్య కర్తలు తెలంగాణలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తూ ఓటర్లకు నిజాన్ని వివరించి చెబుతున్నారు. అధికార, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తెలంగాణలో బలమైన ప్రత్యా మ్నాయం దిశగా బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మొత్తం మీద చూస్తే తెలం గాణలో 2019లో జరుగనున్న శాసనసభ ఎన్ని కల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలు బలపడే అవ కాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ధనబలం, కులబలం, అధికార దాహం ఆధారంగా 2019లో తెలంగాణలో మళ్లీ అధికారం చేపట్టాలని అటు తెరాస ఇటు కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయగలిగానని గొప్పలు చెప్పుకుంటున్న తెరాసకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకుని ఒడ్డెక్కేందుకు వివిధ పార్టీలనుంచి నేతలను చేర్చుకోవడంపై కాంగ్రెస్ దష్టి సారించింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అంతర్గత కుమ్ము లాటలు ఎక్కువయ్యాయి. దీంతో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు బలపడే అవకా శాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీన్ని అవకా శంగా తీసుకుని తెలంగాణలో ఏర్పడిన రాజకీయ శూన్యతను ఛేదించాలన్న పట్టుదలతో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యలతో దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరగడం, దీంతోపాటు మోదీ ఇమేజ్ వ్యక్తిగతంగా మెరుగవడం అనేవి వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశా లను మరింతగా మెరుగుపర్చనున్నాయి. పైగా, తెలంగాణలోనూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు బీజేపీ పట్ల ఆదరణ పెరిగింది. 2019లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 350 స్థానాలు సాధించే లక్ష్యంతో పాటు, తెలంగాణ రాష్ట్రంపై కూడా బీజేపీ ప్రత్యేక దష్టి సారిస్తోంది. తెలంగాణలో గెలుపు లక్ష్యంగా బీజేపీ అధినాయ కత్వం వ్యూహాత్మక కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతగా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దేశవ్యాప్తంగా మూడు మాసాలపాటు ప్రతి రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి క్షేత్రస్థాయి పని వేగ వంతం అయ్యేలా పురమాయించారు. దీంట్లో భాగంగానే తెలంగాణలో పార్టీకి వ్యూహాలను, కార్యాచరణ, లక్ష్యాలను నిర్దేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతుండటం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ క్షీణదశకు చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ప్రభావాన్ని తగ్గించే వ్యూహాత్మక, ఆచరణాత్మక కార్యాచరణను బీజేపీ తెలంగాణ పార్టీ సిద్ధం చేసుకుంది. తెలంగాణలో బీజేపీని బూత్ స్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది వచ్చే ఎన్నికలలో సత్ఫలితాలను సాధిస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయాలని అసెంబ్లీ ముట్టడి, నిరుద్యోగ సమరభేరి పేరుతో సభ నిర్వహించాం. రైతు పంచాయితీ పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తూ రైతులను సంఘటిత పరుస్తున్నాం. రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించడం ఖాయం. కొట్టె మురళీకృష్ణ , (వ్యాసకర్త బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్) -
పాకిస్తాన్లో మొగిన ఎన్నికల నగారా
-
పాకిస్తాన్లో ఎన్నికల నగారా
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. జూలై 25న దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్ రాసిన లేఖకు అధ్యక్షుడు స్పందించారు. జూలై 25న ఎన్నికల నిర్వహణకు ఆయన అనుమతినిచ్చారు. ఆ దేశ నియమావళి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే దేశ అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం ప్రభుత్వ పదవీ గడువు మే 31తో ముగియనుండటంతో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా 105 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
నాలుగేళ్ల పాలనలో మోదీ సాధించిందేంటి...?
-
నరేంద్ర మోదీ @4
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టనుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే వచ్చే ఏప్రిల్,మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు కొన్ని నెలలు ముందుగానే అంటే ఈ ఏడాది చివర్లోనే జరగొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రాంతీయ, తదితర పార్టీల మధ్య కొనసాగుతున్న అనైక్యత కాస్తా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కొంత సయోధ్య కుదిరే దిశకు మళ్లింది. నాలుగేళ్ల క్రితం అధికారాన్ని చేపట్టినపుడు బీజేపీ ఇచ్చిన ‘అచ్చేదిన్’,‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ వంటి ఆకర్షణీయమైన నినాదాల అమలు ఏమైందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 2022 వరకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండింతలు, ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన, అవినీతిరహిత పాలన వంటి ప్రధాన అంశాలను లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోఉత్పత్తుల ధరలు గరిష్టస్థాయికి చేరుకోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల లేమి, శాంతి,భద్రతల సమస్య వంటివి ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్ 48 ఏళ్ల పాలనతో పోల్చితే మోదీ ప్రభుత్వం 48 నెలల్లో సాధించిన విజయాలంటూ బీజేపీ కార్యాచరణను చేపట్టనుంది. విజయాలు : విద్యుత్‌రంగంలో సాధించిన విజయాలు. అన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు,రోజుకు 28 కి,మీ మేర రోడ్ల నిర్మాణం, ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ వంటివి బీజేపీ ప్రభుత్వ విజయాల్లో భాగంగా ఉన్నా... ప్రధానంగా జీఎస్టీ :గత పదేళ్లుగా కసరత్తు జరుగుతున్నా గతేడాది జులైలో వస్తు,సేవా పన్ను (జీఎస్టీ) విధానం అమలు. తొలిదశలో దీని అమల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రత్యక్ష పన్నుల విధానం ద్వారా మేలు చేకూరింది. విదేశీ విధానం : ప్రధానిగా మోదీ 53 దేశాల్లో పర్యటించారు. ఈ విదేశీ పర్యటనలపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. చైనా తదితర దేశాలతో మిత్రత్వం సాధించగలిగారు. డోక్లామ్ వద్ద చైనాతో తలెత్తిన ఘర్షణలు నెమ్మదిగా సమసిపోయాయి. అయితే జమ్మూ,కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో సమస్య అలాగే కొనసాగుతోంది. దాయాది దేశం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారడంతో అక్కడ ఉద్రిక్తతలు సాగుతున్నాయి. ఆర్థిక ఎగవేతదారుల బిల్లు : దేశంలోని బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు చెక్కేసిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, తదితరుల విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విమర్శలొచ్చాయి. అయితే విదేశాలకు పారిపోయిన ఈ ఎగవేతదారుల ఆస్తుల స్వాధీనానికి గత ఏప్రిల్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రశంసలు అందుకుంది. అవినీతిరహిత ముద్ర : మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు రాలేదు. అందుకు భిన్నంగా యూపీఏ ప్రభుత్వంపై పెద్దెత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా అవి నిరూపితం కాలేదు. ట్రిపుల్ తలాఖ్ : అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్, ఫోన్, లే ఖల ద్వారా మూడుసార్లు తలాఖ్ అంటూ ఇచ్చే విడాకులు (తలాఖ్–ఏ బిద్దత్–ఇన్స్టంట్ తలాఖ్) చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2017 ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. వైఫల్యాలు : పెద్దనోట్ల రద్దు : నల్లధనం అదుపు, నకిలీనోట్ల నియంత్రణకు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే ఆశించిన మేర ఫలితాలు మాత్రం పెద్దగా రాలేదు. లెక్కలోకి రాని సంపద దేశ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఇతర రూపాల్లో రాకుండా అడ్డుకోలేకపోయారు. కొత్తగా వచ్చిన కరెన్సీ నోట్లకు కూడా నకిలీల జాడ్యం పట్టిపీడిస్తోంది. నకిలీ కరెన్సీ ముద్రణకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మేకిన్ ఇండియా : మేకిన్ ఇండియా పేరిట స్వదేశంలో తయారయ్యే వస్తువులకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ ఉత్పత్తులను స్థానికంగానే తయారుచేయడంతో పాటు కొత్త నైపుణ్యాల సృష్టికి ఉపయోగపడుతుందని భావించిన ఈ కార్యక్రమం పెద్దగా విజయవంతం కాలేదు.గత జనవరి వరకు కేవలం 74 స్టార్టప్అప్ కంపెనీలు మాత్రమే పన్ను ప్రయోజనాలు పొందాయి. వసూలు కాని రుణాలు : ప్రభుత్వాన్ని 9 లక్షల కోట్లకు (ట్రిలియన్ల) పైగా వసూలు కాని రుణాలు పట్టి పీడిస్తున్నాయి. గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా ఈ సమస్య వచ్చినా దీని ప్రభావం మోదీ సర్కార్‌పైనా పడింది. ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకులను కాపాడేందుకు 2 లక్షల కోట్లకు పైగా ఉద్ధీపన ప్రణాళిక తీసుకొచ్చింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.13 వేల కోట్లకు పైగా కుంభకోణంలో మునగడం, ఇతర బ్యాంకుల్లో సైతం అడపాదడపా కుంభకోణాలు బయటపడడం ప్రతిబంధకంగా మారింది. వ్యవసాయం : కేంద్ర ప్రభుత్వాన్ని బాధిస్తున్న వాటిలో వ్యవసాయరంగ సమస్యలు ముఖ్యమైనవే. జీడీపీ వృద్ధిలో ఈ రంగం నుంచి అందుతున్న సహకారం అంతంత మాత్రమే. 2018 బడ్జెట్‌కు పూర్వం చేసిన ఆర్థిక సర్వే ప్రకారం... దీర్ఘకాలికంగా చూస్తే వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయరంగ ఆదాయం 25 శాతం వరకు తగ్గిపోయే అవకాశాలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రుణమాఫీ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఏటా కోటి ఉద్యోగాలు : ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసినా గత నాలుగేళ్లలో పదిలక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రమే కల్పించారు. ఈ ఏడాది బడ్జెట్లో జాతీయ ఉద్యోగ, ఉపాధి విధానాన్ని ప్రకటిస్తారని భావించినా అది జరగలేడు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగరంగంపై ప్రత్యేక దృష్టి నిలిపేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా?
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడంతో మరోసారి లోక్‌సభ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మ్యాజిక్ చెక్కు చెదరలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం«ధీ నైతిక స్థైర్యాన్ని ఈ ఎన్నికలు బాగా దెబ్బతీశాయనే చెప్పాలి. గుజరాత్ ఎన్నికల్లో మోదీని దీటుగా ఎదుర్కొని సత్తా చాటిన రాహుల్ గాంధీ, కర్ణాటక విషయానికొచ్చేసరికి చతికిలపడిపోయారు. మోదీలా ఒంటి చేత్తో ఎన్నికల భారాన్ని మోసే సామర్థ్యం రాహుల్‌కి లేదని తేలిపోయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పొత్తులే శరణ్యమని, ఇతర పార్టీలతో చేతులు కలపకుండా లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి సులభం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి పార్టీలు చేతులు కలిపితే బీజేపీ దూకుడుని అడ్డుకోగలరని ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తేటతెల్లమైంది. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్, లేదంటే థర్డ్ ఫ్రంట్‌కు ఒక రూపు రేఖలు రావడానికి గడువు ఇవ్వకుండా బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎన్నికలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచన బీజేపీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 2003 నుంచి ఆ పార్టీ అధికారంలో ఉంది. దీంతో అక్కడ బీజేపీ గెలుపు సులభంకాదనే అంటున్నారు. ఇక రాజస్థాన్‌లో కూడా బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. పైగా కర్ణాటక మాదిరి ప్రతీ ఎన్నికల్లో పాలకపక్షాన్ని ఓడించే సంస్కృతి రాజస్థాన్‌ది. ఆ మూడు రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్, అమిత్ షా చాణక్య వ్యూహాలు పనిచేయవనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఆ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్ని నిర్వహిస్తే బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సా«ధారణ పరిస్థితుల్లో 77 శాతం మంది ఒకే పార్టీకి ఓటు వేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రాలను కొల్లగొడుతున్నా తగ్గుతున్న బీజేపీ ప్రభ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ తనకున్న ఇమేజ్‌తో ఒంటిచేత్తో పార్టీని అత్యధిక రాష్ట్రాల్లో విజయతీరాలకు చేర్చినప్పటికీ, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన సీట్లను, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పరిశీలించి చూస్తే తగ్గుతూ వస్తున్నాయి. బీజేపీ హవా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్‌సభ స్థానాలుగా మార్చి చూసినప్పుడు, 2014 ఎన్నికలతో పోల్చిచూస్తే ఇప్పటివరకు బీజేపీ 45 లోక్‌సభ స్థానాలను కోల్పోయినట్టు ఎన్నికల విశ్లేషకుల అంచనా. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వచ్చిన 15 రాష్ట్రాల్లో 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ ఓట్ల శాతం తగ్గిపోతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆ 15 రాష్ట్రాల్లో బీజేపీకి 39 శాతం ఓట్లు వస్తే, ఆ తర్వాత అదే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29 శాతానికి ఆ పార్టీ ఓటు షేరు పడిపోయింది. ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి వచ్చే ఓట్ల శాతం మరింత పడిపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే వీటితో పాటు లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు బీజేపీ సై అంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించడంలో సాధకబాధకాలను బీజేపీ చర్చిస్తోంది. ఈ ఏడాది చివర్లో లోక్‌సభను రద్దు చేసి తమతో కలిసొచ్చే రాష్ట్రాలతో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ అయితే మొదలైంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు మోదీ ఇమేజ్ను కొంత డ్యామేజ్ చేసినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సగానికి పైగా మంది ఆయన పరిపాలనపై సంతృప్తిగా ఉన్నారని ఇటీవల సర్వేల్లో వెల్లడి కావడం కమలనాథుల్లో హుషారు నింపింది. ఇప్పుడు కర్ణాటకలో అధికారానికి కొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయినా ఈ ఫలితాలు దక్షిణాదిలోనూ సత్తా చాటగలమన్న ఆత్మవిశ్వాసాన్ని బీజేపీ శ్రేణుల్లో నింపాయి. ఇలాంటి సమయంలోనే లోక్‌సభ ఎన్నికల్ని ముందస్తుగా నిర్వహించి మరోసారి అధికార అందలాన్ని అందుకోవాలన్న వ్యూహంలో బీజేపీ ఉందనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
దుబాయ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లా.?
-
దుబాయ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లా.?
ముంబై : వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను దుబాయ్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. దేశంలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో 2019 ఐపీఎల్‌ను దుబాయ్‌కి తరలించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 12వ సీజన్ ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 మధ్య జరగనుంది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ కష్టంగా మారనుంది. ఐపీఎల్‌ను తరలించే పరిస్థితులు ఏర్పడితే దానికి తాము సిద్దంగా ఉన్నామని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఒకవేళ ఐపీఎల్ తరలించాల్సి వస్తే భారత ప్రజలు ఎక్కువగా ఉండే దుబాయ్‌కి తరలిస్తామన్నారు. ఇక గతంలో రెండు సార్లు ఐపీఎల్‌ను ఇతర దేశాల్లో నిర్వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికలతో దక్షిణాఫ్రికాలో నిర్వహించగా.. 2014 ఎన్నికలతో యూఏఈలో నిర్వహించారు. ఇక యూఏఈలో దుబాయ్, అబుదాబి, షార్జాలతో మొత్తం మూడు వేదికలున్నాయి. -
‘వల’సలే బలం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సాధారణ ఎన్నికల్లో వివిధ రాజకీయపక్షాల తరఫున పోటీకి ఆసక్తి చూపుతున్న ఔత్సాహిక నేతలు క్షేత్ర స్థాయిలో సొంత బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించారు. అధికార, విపక్ష పార్టీలనే తేడాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత బలం ఉంటేనే టికెట్ వేటలో సొంత పార్టీలో పోటీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలాలు, గ్రామాల వారీగా వివిధ పార్టీల్లో చురుగ్గా ఉన్న నేతలు, కార్యకర్తలపై దృష్టి పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తివాదులు, అవకాశవాదులు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. వీలైన చోటల్లా పార్టీ కండువాలు కప్పుతూ చేరికల పేరిట హడావుడి సృష్టిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా లోక్‌సభ, శాసనసభా నియోజకవర్గాలు అన్నింటిలోనూ అధికార టీఆర్ఎస్ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 2019 ఎన్నికల్లో ఎంత మందికి తిరిగి అవకాశం దక్కుతుందనే అంశంపై సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, తమకు అవకాశం ఇస్తారని ఔత్సాహిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దించాలని టీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలోనూ టికెట్ల కేటాయింపులో నాటకీయ పరి ణామాలు చోటు చేసుకుంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ స్థానాలతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాల్లో బలహీన లేదా బహుళ నాయకత్వం ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియని పరిస్థితి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొత్త ముఖాలను బరిలోకి దించే ఉద్దేశంతో ఇప్పటికే వడపోత ప్రారంభించింది. టీడీపీ పూర్తి స్థాయిలో జిల్లా రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగు కాగా, కొత్తగా టీజేఏసీ, బీఎల్ఎఫ్ తదితర పార్టీలు, కూటములు తెరమీదకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సొంత బలం కోసం నేతల తంటాలు.. ఎన్నికల్లో బహుముఖ పోటీతో పాటు పార్టీల్లోనూ టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా బహుళ సంఖ్యలో ఉన్నారు. ఓ వైపు అధిష్టానం వద్ద టికెట్ కోసం లాబీయింగ్ చేస్తూనే.. క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి ఔత్సాహిక నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత పార్టీలో టికెట్ ఆశిస్తున్న ప్రత్యర్థిపై సొంత బలం ద్వారా పైచేయి సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో నర్సాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి నియోజవకర్గాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొంది. సొంత బలాన్ని కలిగిఉంటే సిట్టింగులున్నా, వారిని కాదని టికెట్ ఇస్తారనే ఆశ సదరు నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో సిద్దిపేట, దుబ్బాక, మెదక్, పటాన్చెరు నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వం ఉండగా, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటాపోటీగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. వివాహాలు, విందులు, మరణాలు తదితర సందర్భాల్లో గ్రామాల్లోకి వెళ్తూ ఆర్థిక సాయం ద్వారా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ తన కేడర్‌తో పాటు, వివిధ పార్టీల్లో కార్యకర్తలు, నాయకుల వివరాలు సేకరిస్తోంది. చేరికల పేరిట హడావుడి.. గ్రామాల వారీగా వివిధ పార్టీల్లో చురుకైన నేతలు, కార్యకర్తల వివరాలపై ఆరా తీస్తూ వారిని అధికార, విపక్షమనే తేడా లేకుండా తమ దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామంలో పలుకుబడి ఉన్న పెద్దలు, మాజీ సర్పంచ్‌లు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందే సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆర్థిక సాయం చేస్తామంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు, నాయకులను పార్టీలో చేర్చుకుంటూ పార్టీ కండువాలు కప్పుతున్నారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుతం తమ వెంట ఉన్న కేడర్ చేజారకుండా చూసుకుంటూనే, ఇతర పార్టీల కార్యకర్తలను దరికి చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తమ వెంట వస్తే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్థికంగా చేయూతనందిస్తామని చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థికి కేడర్ లేకుండా చేయడం ద్వారా మానసికంగా బలహీనపర్చాలనే వ్యూహంతో సాగుతున్నారు. దీంతో గ్రామ స్థాయిలో ఒకే పార్టీలో రెండు, ఆపైన గ్రూపులు తయారు కావడంతో నేతలు కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలోనూ రాజకీయ వలసలు మరింత ఊపందుకునేలా ఉన్నాయి. -
ఎన్నికల తర్వాత ‘విద్యుత్’ వాత!
సాక్షి, హైదరాబాద్: రానున్న సాధారణ ఎన్నికలు ముగిశాక ప్రజలపై భారీగా విద్యుత్ చార్జీల భారం పడే ప్రమాదముందని విద్యుత్‌రంగ నిపుణులు, పారిశ్రామిక, రైతు, వినియోగదారుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రూ. 9,970.98 కోట్లకు ఎగబాకిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆదాయ లోటు అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా అని ప్రశ్నించాయి. దీన్ని పూడ్చుకోవడానికి డిస్కం లు ఎన్నికలయ్యాక ‘ట్రూ అప్’పేరుతో చార్జీలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తే అనుమ తించొద్దని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. గత రెండేళ్లుగా డిస్కంలు కావాలనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించలేదని, దీనివల్ల ఉత్పన్నమైన భారీ ఆదాయ లోటును పూడ్చుకోవడానికి ట్రూ అప్ల పేరుతో చార్జీలు పెంచడానికి డిస్కంలకు అధికారం లేదని స్పష్టం చేశాయి. 2018–19కి సంబం ధించి డిస్కంలు ప్రతిపాదించిన వార్షిక ఆదా య అవసరాల (ఏఆర్ఆర్) నివేదికపై సోమ వారం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ నియం త్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణలో వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొని తమ అభ్యంతరాలు, సలహాలు, సూచలను తెలియజేశారు. సర్‌చార్జీల వాత పెడితే పెట్టుబడులు కష్టం: ఫ్యాప్సీ క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీల పేరుతో వేస్తున్న కోట్లాది రూపాయల భారాన్ని పరిశ్రమలు భరించలేకపోతున్నా యని, ఇలా అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారుతుందని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫ్యాప్సీ) స్పష్టం చేసింది. ఓపెన్ యాక్సెస్ పద్ధతి కింద బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరిపే పరిశ్రమలపై యూనిట్‌కు రూ. 2.06 పైసలు చొప్పున అదనపు సర్‌చార్జీలు విధించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త విద్యుత్ చట్టం అమల్లోకి రాక ముందే ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లు ఉండేవని, ఇప్పుడు కొత్తగా అదనపు సర్‌చార్జీలను విధించడం సరికాదని ఫ్యాప్సీ ప్రతినిధి టి.సుజాత పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కేటగిరీ సృష్టించి తక్కువ చార్జీలు విధించాలని సూచించారు. ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లపై అదనపు సర్‌చార్జీలను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఇంజనీర్ జీవీ మల్లికార్జునరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీలో రైల్వేకు తక్కువ విద్యుత్ చార్జీలున్నాయని, అందువల్ల తెలంగాణలోనూ చార్జీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు విద్యుత్ కొనుగోళ్లు ఎందుకు మిగులు విద్యుత్ ఉందంటూనే మళ్లీ అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్‌రావు ప్రశ్నించారు. రూ. వేల కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంపై డిస్కంలు వివరణ ఇవ్వాలన్నారు. జెన్కోలో విద్యుదుత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) 70 శాతానికి తగ్గిందని, ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల కోసమే జెన్కోలో ఉత్పత్తి తగ్గిస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యధికంగా 2,300 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకోవడం వెనక చీకటి కోణాలున్నాయని..అధికారంలో ఉన్న వారికి, ప్రైవేటు డెవలపర్లకు దోచి పెట్టడానికే ఈ సౌర విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రూ.2.50 నుంచి రూ.3లకు యూనిట్ చొప్పున సౌర విద్యుత్ విక్రయించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నా రాష్ట్రంలో రూ. 6 నుంచి రూ. 6.50 ధరతో కొనుగోళ్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. దీంతో 25 ఏళ్లపాటు ప్రజలు దోపిడీకి గురికానున్నారన్నారు. రైతుల పొలాల్లో బలవంతంగా టవర్లు పరిహారం చెల్లించకుండానే రైతుల పొలాల్లో బలవంతంగా విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకులు తెచ్చిన టెలిగ్రాఫ్ చట్టాన్ని సాకుగా చూపి పొలాల్లో భారీ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. విద్యుత్ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ తెలిపారు. కలెక్టర్లు పరిహారం ఇప్పించకపోతే రైతులు ఈఆర్సీలో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. -
ఎన్డీఏకు 258.. యూపీఏకు 202!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే 40 శాతం ఓట్లతో ఎన్డీఏ కూటమి 258 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే– కార్వీ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. మొత్తం 543 సీట్లకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 38 శాతం ఓట్లతో 202 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. ఇతర పార్టీలు 22 శాతం ఓట్లతో 83 సీట్లు సొంతం చేసుకుంటాయి. ఇండియా టుడే పోల్ ప్రకారం.. తదుపరి ప్రధానిగా 53 శాతం ఓట్లతో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 22 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. స్వాతంత్య్రం అనంతరం దేశంలో అత్యుత్తమ ప్రధానిగా మోదీకి 28 శాతం, ఇందిరా గాంధీకి 10 శాతం, అటల్ బిహారి వాజ్‌పేయికి 10 శాతం, నెహ్రూకు 8 శాతం మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగం(29 శాతం), ధరల పెరుగుదల(23 శాతం) ఎక్కువ ప్రభావితం చేసే అంశాలుగా పోల్‌లో వెల్లడైంది. -
కేంద్రం - రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది! కేంద్రంలోని మోదీ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తోందన్న సమాచారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నవంబర్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ పార్టీ ముఖ్యులను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ‘‘ఈ ఏడాది నవంబర్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే అనివార్యంగా మనమూ వెళ్లక తప్పదు. బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తిగా నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టండి. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొందాం. వివిధ సర్వేల్లో మనకు అంతా అనుకూలంగానే ఫలితం వస్తోంది. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నా ఈలోగా సర్దుకుందాం. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయన్న స్పృహతోనే ఉండాలి. అంతా అప్రమత్తంగా పనిచేయాలి..’’ అని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నట్లు టీఆర్ఎస్లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, కులాలు, వర్గాల వారీగా ప్రకటిస్తున్న వరాలు, పార్టీలోకి జరుగుతున్న చేరికలు వంటి అంశాలన్నీ ముందస్తు ఎన్నికల సంకేతాలను చూపుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, రాజకీయ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన కేసీఆర్.. అవసరమైన చోట మరమ్మతులు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి ముఖ్యులు అనుకున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియ వేగం పుంజుకుందని, ఇదంతా ముందస్తు కసరత్తులో భాగమేనని చెబుతున్నారు. ఈ నెల 15న నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఆ రోజు బీజేపీ తన వైఖరిని ఖరారు చేస్తుందన్న సమాచారం ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది జూన్ 2వ తేదీతో శాసన సభ కాల పరిమితి పూర్తవుతోంది. ఈ ఏడాది 5.. వచ్చే ఏడాది 8 దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఐదు, వచ్చే ఏడాది జూన్ కల్లా ఎనిమిది రాష్ట్రాలు కలుపుకొని మొత్తంగా 13 రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్‌సభ కాల పరిమితి కూడా వచ్చే ఏడాది జూన్ 3తో ముగియనుండటంతో ఏప్రిల్–మే మధ్య ఎన్నికలు జరపాలి. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటకలకు ఈ ఏడాది మేలో నిర్ణీత గడువులోగానే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మిజోరాంలో ఈ ఏడాది నవంబర్‌లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరిలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ కాల పరిమితి ముగియనుంది. వీటికి ఈ ఏడాది డిసెంబర్–వచ్చే ఏడాది జనవరిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో వీటి ఎన్నికలను ముందుకు జరిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలల మధ్య, తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వచ్చే ఏడాది మే–జూన్ మధ్య ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఎనిమిది రాష్ట్రాలకు ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 3తో కాలపరిమితి ముగియనున్నందున లోక్‌సభకు కూడా ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రాలు కూడా ఎన్నికలకు వెళ్లడం అనివార్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. లోక్‌సభతోపాటే శాసన సభ ఎన్నికలకు వెళ్లక తప్పదని టీఆర్ఎస్ అధినేత ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వద్ద ఈ అంశాన్ని ఇటీవల ప్రస్తావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.