new variant
-
చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం
బీజింగ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (mpox) వైరస్‌లోని కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. గురువారం మంకీపాక్స్ కొత్త వేరియంట్ క్లాడ్ ఐబిని గుర్తించినట్లు చైనా (china) ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్ క్లేడ్ ఐబి అనే కొత్త వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. సదరు కాంగో ప్రయాణికుడితో సన్నిహితంగా ఉండడం వల్ల నలుగురికి ఎంపాక్స్ కొత్త వేరియంట్ సోకిందని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ సోకిన రోగుల్లో చర్మంపై దద్దుర్లు,బొబ్బలు లక్షణాలు ఉన్నాయని గుర్తించింది. మంకీపాక్స్లోని కొత్త వేరియంట్ కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ సైతం తాజాగా, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత ఆగస్ట్‌లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) నుంచి ఎంపాక్స్ ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక చైనా గుర్తించిన మంకీపాక్స్లోని కొత్త వేరియంట్ క్లాడ్ ఐబీ లైంగికంగా కలవడం వల్ల వేంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది. -
Hyundai Venue E+: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అదిరిపోతున్న కొత్త వేరియంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అప్డేట్ చేసిన ‘వెన్యూ ఈప్లస్’ (Hyundai Venue E+) వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 లక్షలతో ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ జోడింపుతో ఈ లైనప్‌లో మొత్తం వెన్యూ వేరియంట్ల సంఖ్య పదికి చేరింది.‘వెన్యూ ఈప్లస్’ మోడల్‌ను ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్రెస్ట్ వంటి సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేశారు. ఇక కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, వీటికి టూస్టెప్ రిక్లైన్ ఫంక్షన్ ఇచ్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రయాణికులకు భద్రత కల్పిస్తాయి. డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఇంజిన్ గురించి చెప్పుకోవాలంటే ‘వెన్యూ ఈప్లస్’ 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌తో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజిన్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే.. 82 బీహెచ్పీ, 114 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే ఈ, ఎస్, ఎస్ ప్లస్, ఎస్ (O), ఎగ్జిక్యూటివ్, ఎస్ (O) ప్లస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్, ఎస్ఎక్స్ ( O) వేరియంట్లు ఉన్నాయి. కొత్త ఈప్లస్ మోడల్ కావాలంటే ‘వెన్యూ ఈ’ వేరియంట్‌పై రూ. 29,000 అదనంగా ఖర్చవుతుంది. -
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ @ 4 కోట్లు
న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ భారత్‌లో కొత్త వాంటేజ్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్రక్టానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, బావర్స్ అండ్ విలి్కన్స్ 15 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్ పవర్, 800 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్ కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్‌లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపా రు. సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్‌ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్ భారత్‌లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది.. సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించడానికి కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్లెట్ రానుంది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్ తెలిపారు. -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మహీంద్రా XUV700 కొత్త వేరియంట్.. ప్రత్యేకతలివే..
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్డీ సూపర్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్‌ను AX5 సెలెక్ట్ వేరియంట్ అందిస్తుంది.సాధారణంగా హై-ఎండ్ మోడల్‌లతో ఇలాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్లు బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు AX5 మంచి ఎంపికగా నిలుపుతున్నాయి. 2022లో విడుదలైన మహీంద్రా XUV700 దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ఆదరణ పొంది గ్లోబల్ ఎస్‌యూవీగా మారింది.మహీంద్రా ఇటీవలే MX వేరియంట్లో 7-సీటర్‌ను విడుదల చేసింది. బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో లిమిటెడ్ బ్లేజ్ ఎడిషన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వేరియంట్‌ను బట్టి నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు కస్టమర్లకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. -
రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా?
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తాజాగా మూడు మోడల్స్ కార్లలో అయిదు కొత్త వేరియంట్లను దేశీ మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టింది. క్విడ్, ట్రైబర్, కైగర్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. వీటి ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 10.99 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మూడు మోడల్స్‌లో కలిపి మొత్తం మీద పది కొత్త ఫీచర్లను జోడించినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. మరోవైపు, రెనో, రెనోయేతర యూజ్డ్ కార్ల విక్రయాలు, కొనుగోళ్ల కోసం రెన్యూ పేరిట కొత్త బ్రాండ్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెంకట్రామ్ తెలిపారు. వీటిలో కొత్త మోడల్స్‌తో పాటు కైగర్, ట్రైబర్‌లో కొత్త వేరియంట్లు కూడా ఉంటాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా గతేడాది అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనప్పటికీ కొత్త మోడల్స్ ఊతంతో ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెనో గతేడాది దేశీయంగా 49,000 కార్లను విక్రయించగా, 28,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో చిన్న కారు క్విడ్ విక్రయాలను కొనసాగిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నిబంధనలు అనుమతించే వరకు సదరు సెగ్మెంట్లో అమ్మకాలను కొనసాగిస్తామని వెంకట్రామ్ స్పష్టం చేశారు. -
India: టెన్షన్ పెడుతున్న జేఎన్-1 వేరియంట్.. భారీగా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్-1 తీవ్ర కలకలం సృష్టిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. మొత్తం 12 రాష్ట్రాల్లో కలిపి 819 జేఎన్-1 వేరియంట్ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక, జేఎన్-1 కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 250, ఆ తర్వాత కర్ణాటకలో 199, కేరళలో 148 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. అదే సమయంలో కొత్తగా 475 కోవిడ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,919కి చేరాయని తెలిపింది. 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒక కోవిడ్ బాధితుడు చనిపోయినట్లు పేర్కొంది. A total of 819 cases of JN.1 series variant have been reported from 12 states in India till 8th January 2024: Sources — ANI (@ANI) January 9, 2024 కర్ణాటక గవర్నర్‌కు కరోనా ఇదిలా ఉండగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఆయన కోలుకునే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు రాజ్‌భవన్ మంగళవారం తెలిపింది. ఆయన రాజ్‌భవన్‌లోనే క్వారంటైన్లో ఉన్నారని, చికిత్స అవసరం లేదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్‌లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్‌లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్‌లలో టెలిఫోటో లెన్స్‌లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్‌లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్‌తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
India: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 600 మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలను వైద్యశాఖ మరోసారి హెచ్చరించింది. తాజాగా వైద్యారోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 602 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. COVID-19 | India reports 602 new cases, 5 deaths in the last 24 hours; Active caseload at 4,440 — ANI (@ANI) January 3, 2024 ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు మంగళవారం నాటికి 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు. -
TS: కరోనా కేసులపై దొంగ లెక్కలు?
హైదరాబాద్, సాక్షి: దేశంలో చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే.. మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని అనుకున్నారంతా. ఇప్పుడది పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చేరింది. భూపాలపల్లి, కరీంనగర్, తాజాగా మంచిర్యాలలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కానీ, అధికారిక లెక్కల్లో మాత్రం వాటిని చూపడం లేదు!. కరోనా వైరస్‌లో జేఎన్.1 వేరియెంట్.. వ్యాప్తి శరవేగంగా ఉంటోంది. చలికాలం.. ఫ్లూ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు.. ఆఖరికి కరోనా బులిటెన్‌ను విడుదల చేయడంలోనూ ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. గత రెండు రోజలుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనేం చేయడం లేదు. అధికారుల్ని అడిగితే.. ప్రభుత్వమే ఇకపై గణాంకాలు విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటూ తేల్చడం లేదు. రెండ్రోజులకొకసారి విడుదల చేస్తారని చెప్పినా.. అందులోనూ స్పష్టత లేదు. మరీ ఇంత తక్కువా? రెండు రోజుల కిందట బులిటెన్‌ను పరిశీలిస్తే.. 1,333 టెస్ట్‌లు చేయగా అందులో ఎనిమిది మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలిందట. మొత్తంగా.. ఆ రోజునాటికి యాక్టివ్ కేసుల సంఖ్యను 63గా పేర్కొంటూ.. రెండు కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే.. జిల్లా వైద్యాధికారులేమో అధికారిక లెక్కల విషయంలో పొంతనే లేదంటున్నారు. వింటర్ సీజన్.. బస్సుల్లో రద్దీ, మెట్రోలో రద్దీ, పైగా పెళ్లిళ్లతో పాటు పండుగ సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండటం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకుంటున్నవాళ్లు.. పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవాళ్ల లెక్కను అందులో కావాలనే చేర్చడం లేదనే విమర్శా బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. వైరస్ విజృంభించే అవకాశాలున్న సమయంలో రాష్ట్రంలో కొవిడ్ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్యనిపుణులు. కొత్తగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. -
తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసుల కలకలం
-
భారత్‌లో కరోనా: 4,170 యాక్టివ్ కేసులు
ఢిల్లీ/బెంగళూరు, సాక్షి: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికే 4 వేలు దాటేసింది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. కొత్త వేరియెంట్ జేఎన్.1 మూలంగానే అధిక కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది. మరోవైపు కర్ణాటకలో కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం అక్కడి ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఒక్క బెంగళూరులోనే 20 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఈ వేరియెంట్ ధాటికి.. కర్ణాటక వ్యాప్తంగా ముగ్గురు మరణించారు. బెంగళూరులో ఇద్దరు, రామనగర జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడి మరణించారు. అయితే వాళ్ల వయసులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మరణాలకు కారణమా? అనేదానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు కొత్త కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో.. కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ►వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వ్యాప్తి అధికమవుతోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం.. కేవలం జేఎన్.1 కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. ►తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా సోమవారం మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. ►తెలంగాణలో సోమవారంనాటికి 10 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒకరు వైరస్ బారిన నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 55కి చేరింది. మరోవైపు ఏపీలోనూ యాక్టివ్ కేసుల సంఖ్య 24కి చేరింది. కొత్త వేరియంట్‌గా వ్యాప్తి చెందుతున్న జేఎన్.1 ఉపరకం కేసుల భయం తెలుగు రాష్ట్రాలను పట్టుకుంది. ఇప్పటికే నమోదు అయిన కేసుల శాంపిల్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు.. ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశారు. ►జేఎన్.1 అంత ప్రమాదకరమైందేం కాదని మొదటి నుంచి వైద్య నిపుణులు, ఆఖరికి డబ్ల్యూహెచ్‌వో కూడా చెప్పింది. అయితే వైరస్ తేలికపాటిదే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జాగ్రత్తలు చెబుతూ వస్తోంది. తాజాగా కొత్త వేరియెంట్ కేసుల విజృంభణ నేపథ్యంలో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది. -
భారత్‌లో కరోనా: 17 రాష్ట్రాల్లో కేసులు
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది. తాజాగా.. శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి చేరింది. మొత్తం 17 రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో 9, ఏపీలో 8 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక..రాజస్థాన్‌లో ఒకరి చొప్పున వైరస్ బారినపడి మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్‌లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియంట్.. అదే జరిగితే తట్టుకోగలమా? -
‘జేఎన్ 1’పై జాగ్రత్త
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘జేఎన్ – 1’ వ్యాప్తి నేపథ్యంలో కట్టడి చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అత్యంత బలమైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను అప్రమత్తం చేయాలని సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులకు రాకుండానే రికవరీ జేఎన్–1 వేరియంట్‌పై ప్రస్తుతానికి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. దీని బారిన పడ్డవారు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆస్పత్రుల వరకూ రాకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. దీనికి డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తెలిపారు. అయితే జేఎన్–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందన్నారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్‌కు తరలించి వేరియంట్లను విశ్లేషిస్తున్నామన్నారు. సచివాలయాల్లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్, ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చికిత్సకు అవసరమైన మందులన్నీ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ సదుపాయాలను సిద్ధం చేస్తున్నామన్నారు. పీఎస్ఏ ప్లాంట్లు సత్వర వినియోగానికి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డి–టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు ఇందులో పాల్గొన్నారు. సన్నద్ధత ఇలా.. ♦ రాష్ట్రవ్యాప్తంగా జీజీహెచ్‌లలోని 13 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను యాక్టివేట్ చేసిన వైద్య శాఖ. రోజుకు కనీసం వెయ్యి పరీక్షల నిర్వహణ. ♦ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణ. ♦ వైరస్ అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేలా గ్రామ/వార్డు సచివాలయాల్లో ఐదు చొప్పున ర్యాపిడ్ కిట్లు అందుబాటులో. ♦ శబరిమల, కేరళ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకు స్క్రీనింగ్. వీరిపై ప్రత్యేకంగా ఫోకస్. ♦ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 12,292 జనరల్, 34,763 ఆక్సీజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకల చొప్పున మొత్తం 56,741 పడకలు అందుబాటులో. -
కరోనా నిరోధకానికి హోమియో మందులు!
సాక్షి, హైదరాబాద్: కరోనా జెఎన్1 వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడకుండా రెండు హోమియో ఔషధాలు వాడి ఎవరికి వారు రక్షించుకోవచ్చని ప్రముఖ హోమియో వైద్యులు డా. అంబటి సురేంద్ర రాజు ‘సాక్షి’కి తెలిపారు. అర్సెనిక్ ఆల్బం 30 (Arsenic Album 30)ను వరుసగా 3 రోజులు, ఇన్ఫ్లుయెంజినమ్ 30 (Influenzinum 30)ను వరుసగా 3 రోజులు వాడాలి. ఉదయం 7 గంటలకు పరగడుపున నాలుకపై ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుంటే చాలు. ఇలా ఒకొక్క మందును వరుసగా 3 రోజులు, రోజుకు ఒకసారి మాత్రమే.. మొత్తం వరుసగా 6 రోజులు వాడాలి. ప్రామాణిక జర్మనీ కంపెనీ మదర్ టింక్చర్లు వాడితే ఫలితం బాగుంటుందని డా. సురేంద్ర రాజు వివరించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ మందులు ఒక విడత వాడితే రోగనిరోధక శక్తి ఇనుమడించి సురక్షితంగా జీవించ వచ్చన్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను మాములుగా హడలెత్తించలేదు. అది పెట్టిన భయం అంత ఇంత కాదు. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ మార్పు చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్‌తో ఎంతలా భయబ్రాంతులకు గురించేసిందో తెలిసిందే. ఎటూ చూసిన ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. క్రమేణ ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించనంత స్థాయిలో మాయం అయ్యింది కూడా. హమ్మాయా! అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 హడలెత్తిస్తోంది. ఒకటో రెండో కేసులే కదా అనకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇది వరకటి పరిస్థితికే చేరుకుంటామా? అని గుబులు తెప్పించేస్తుంది. ఇప్పటికే నిపుణుల భయపడొద్దని సూచిస్తూ మరోవూపు మాస్క్‌లు సామాజిక దూరం అని చెబుతుంటే మళ్లీ టెన్షన్.. టెన్షనే..అని భయాందోళనకు గురవ్వుతున్నారు. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే వైద్యులు ఏమంటున్నారంటే.. ఈ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే గత నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా వ్యాక్సినేషన్లు వేశారు. 95% మంది తొలి రెండు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా, సుమారు 25% మంది బూస్టర్ డోస్‌లను కూడా వేయించుకున్నారు. మరీ ఇప్పుడూ ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్ డోస్లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా? అని పలువురిని వేధిస్తున్న సందేహం. అయితే నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గానీ మరో బూస్టర్ తీసుకోవద్దదని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంత్లాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లో ఉండటం వంటివి చేయాలని సూచించారు. మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా..? ఐతే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారుఉన్నారని అన్నారు నిపుణులు. అలాగే రెండు సార్లు కరోనాని ఫేస్ చేసిన వారకు కూడా ఉన్నారు. అయితే వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు, పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 దగ్గరకొచ్చేటప్పటికీ.. రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవికూడా తేలికపాటి లక్షణాలే అని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ నాలుగైదు రోజుల్లో నయం అయిపోతుంది. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి, లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి, వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ప్రమాదకారి కావొచ్చు కాబట్టి వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు సరిగా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్నా..అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్‌డోస్ లేదు రెండు వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. ఐతే కొద్దిమంది ఆరోగ నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్‌లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. మళ్లీ వేయించుకుంటే మంచిదేనా..? అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్‌ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం. కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిదా? కాదనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు పరిశోధకులు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న రోగులకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. (చదవండి: ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?) -
కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలు.. అశ్రద్ధ వద్దు
ఏడాదిన్నర కిందట కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. విపరీతమైంగా వైరస్ వ్యాప్తికి కారణమైంది. కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరారు చాలామంది. వైరస్ ఉధృతిని తట్టుకోలేక.. అదే సమయంలో వాళ్లకున్న ఆరోగ్య సమస్యలతో పలువురు మరణించారు కూడా. ఆ తర్వాత వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టి.. జనాలు కరోనాను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. కరోనాతో మమేకమై బతికేందుకు మానసికంగా సిద్ధమైపోయారు. అయితే.. ఆ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 ఇప్పుడు భారత్‌లో మళ్లీ కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. కరోనా వైరస్ జేఎన్.1 ఉపరకం తొలి కేసు అమెరికాలో వెలుగు చూసింది. సెప్టెంబర్‌లో ఇది అక్కడ విజృంభించింది. తాజాగా.. డిసెంబర్ మొదటివారంలో చైనాలోనూ కేసులు వెలుగుచూశాయి. ఇక ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. జేఎన్.1 వేరియంట్ అంత ప్రమాదకరమైంది ఏం కాదు.. ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.. ఇది ఇప్పుడు వైద్యనిపుణులు చెబుతున్నమాట. ఈ మాటనే.. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ఆధారంగా సమర్థించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కానీ.. పెరుగుతున్న కేసులు చలికాలం.. ఫ్లూ సీజన్. ఇదంతా కామన్ అని అనుకుంటారంతా. కానీ, ఏడు నెలల తర్వాత కేసుల్లో కనిపిస్తున్న పెరుగుదల. కొత్త వేరియెంట్ కేసుల గుర్తింపుతో పాటు సింగిల్ డిజిట్ ఫిగర్ దాటే దిశగా కరోనా మరణాలు. ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటి?. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అందుకు తగ్గట్లే కేసుల్లో రోజూవారీ కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. లక్షణాలివే.. జ్వరం, ఒళ్లు నొప్పులు జలుబు.. ముక్కు కారడం, గొంతు నొప్పి, వాసన-రుచి శక్తిని కోల్పోవడం, తలనొప్పి.. కొందరిలో కడుపు నొప్పి, గ్యాట్రిక్ సమస్య వాంతులు, విరేచనాలు మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు పై లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. ఈ తరహా లక్షణాలు కనిపించినప్పుడు.. నిర్లక్ష్యం వద్దు. దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్‌లకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే.. ఐసోలేషన్ ద్వారా జాగ్రత్త పడాలి. తద్వారా చుట్టూ ఉండేవాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చు. మాస్కులు ధరించడం, స్వీయ శుభ్రత పాటించడం ద్వారా అసలు వైరస్సే సోకకుండా జాగ్రత్త పడొచ్చు. సామాజిక వ్యాప్తికి ఎంట్రీ దశలో.. నవంబర్‌కు ముందు దాకా.. భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా కేసుల్లో 1 శాతం మాత్రమే కోవిడ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. నవంబర్ తర్వాత నుంచి 9 శాతంగా బయటపడ్డాయి. ఇప్పుడది.. 30 శాతంకి చేరింది. అందుకు ఉదాహరణగా.. కొచ్చిలో ఒక్కరోజు వ్యవధిలో జ్వరాలు, జలుబులతో కొందరికి టెస్టులు చేశారు. వాళ్లలో 30% మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ పేషెంట్ల ఇంట్లోవాళ్లకు, చుట్టుపక్కలవాళ్లకు పరీక్షలు చేయించగా.. వాళ్లలో కూడా కొందరికి పాజిటివ్ వచ్చింది. ఒక్క కేరళలోనే కాదు.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ.. ఇలా పలు రాష్ట్రాల్లోనూ కొత్త వేరియెంట్ కేసులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. అక్కడా టెస్టులు చేస్తే అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. సామాజిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు నిపుణులు. అధ్యయనాల సంగతి గుర్తు చేస్తూ.. కోవిడ్ అంటే లైట్.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని అనుకునేవాళ్లే ఇప్పుడు ఎక్కువ. కానీ, కోవిడ్‌ను సాధారణ జలుబు జ్వరం ఎంతమాత్రం అనుకోవద్దని.. తీసి పారయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అంటున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారామె. శరీరంపై సుదీర్ఘకాలం ప్రతికూల ప్రభావం చూపెడుతుందని.. గుండెజబ్బులతో పాటు మానసిక సమస్యలకు కారణమవుతుందని పలు అధ్యయనాల నివేదికల్ని గుర్తు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ద్వారా ప్రకటించిన ఆరోగ్య-అత్యవసర పరిస్థితి ముగిసినా.. మానవాళి ఆరోగ్యం మీద అది చూపించే ప్రతికూలత తగ్గలేదనే అంటున్నారామె. తట్టుకోగలమా? కరోనా తొలినాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు. ప్రాణాంతక డెల్టా వేవ్‌ను ఎదుర్కొన్న అనుభవమూ ఉండొచ్చు. వ్యాక్సినేషన్ అందించే ధైర్యం మరో కారణం కావొచ్చు. కానీ, ఇప్పుడు గనుక కేసులు పెరిగితే?.. ఒమిక్రాన్ ఉపరకం అయినా జేఎన్.1.. మాతృక వేరియెంట్లాగే చెలరేగిపోతే!. వైరస్ బారినపడి వాళ్లకు దానిని తట్టుకోగలిగే శక్తి లేకపోతే. ఆ భారం ఆస్పత్రులు, వైద్య సిబ్బందిపై కచ్చితంగా పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంచెం జాగ్రత్త ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వైరస్ సోకుండా జాగ్రత్తలు పాటించడం కష్టమేమీ కాదు. వయసు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు, పిల్లలు, మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మాస్క్‌లు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’.. తాజా సమీక్షలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచన ఇది. -
HYD: కరోనా కొత్త వేరియంట్ అలర్ట్.. మళ్లీ పెరిగిన కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల జాగ్రత్తలు పాటించడం మంచింది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం తెలంగాణలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్‌లోనే నమోదు కావడం గమనార్హం. దీంతో, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జేఎన్-1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
అప్రమత్తంగా ఉందాం.. భయమొద్దు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్(ఉపరకం) జేఎన్.1 (COVID subvariant JN.1) కారణంగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పరిస్థితులపై సమీక్ష కోసం బుధవారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ రాష్ట్రాల అధికారుల కీలక సూచనలు చేశారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ రాష్ట్రాలకు తెలిపారు. आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की। बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा। pic.twitter.com/rYkDCIkg2F — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 20, 2023 పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ జేన్.1 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. మరోవైపు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని అధికారులను సూచించింది. -
ఏపీలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు
సాక్షి,విజయవాడ : కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందునే కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి కృష్ణబాబు తెలిపారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. ‘ఏపీ నుంచి ఈ సీజన్‌లోలో కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు ఎక్కువ ఉంటారు. శబరిమల వెళ్లి వచ్చిన భక్తులకి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు. ‘ప్రతీ గ్రామ సచివాలయానికి పది ర్యాపిడ్ కిట్లు పంపించాం. ఫీవర్ ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తాం. ఇందులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేశాం. పాజిటివ్ వచ్చిన వారిలో కోవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తాం’ అని చెప్పారు. జ్వరం, పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు జెఎన్ 1 కొత్త వేరియంట్లో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మాస్క్ ధరించడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏపీలో 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్లకు, కోవిడ్ మందులకి కొరత లేదు’అని కృష్ణబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసిన RTPCR ల్యాబ్ లను క్రియాశీలకం చేయాలి. రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా సిద్ధం కావాలి. విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి. ఫ్లూ జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు RTPCR టెస్ట్ లను తప్పనిసరి చేయాలి. గ్లౌజ్‌లు, మాస్క్ లు, శానిటైజర్లు వంటి రక్షణ పరికరాలను అన్ని ఆస్పత్రులలో సిద్ధంగా వుంచుకోవాలి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం LMO, PSA, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వాటిని, డి టైప్ సిలిండర్లను సిద్ధంగా ఉంచాలి. జ్వరం, దగ్గు వంటి ఎటువంటి స్వల్ప లక్షణాలు కన్పించినా సంబంధిత వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలి. దీనితో పాటు రానున్న పండుగ సీజన్లలో అన్ని ప్రాంతాలలో రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజల్ని కోరారాయన. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా వారు తక్షణణం దగ్గరలోని విలేజ్ క్లనిక్ లో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు తాజాగా ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదని, అయితే కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలో వున్న విలేజ్ క్లినిక్ లు అన్నింటికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పటికే అందచేశామని ఆయన చెప్పారు. అక్కడ ఏదైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే దానిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు పంపటానికి వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో టెస్ట్ లకు అవసరమైన సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. అక్కడ కూడా పాజిటివ్ నిర్ధారణ అయితే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి దాని వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేరళ, తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇటువంటి సమస్య తలెత్తలేదని, అయితే మనం ముందు జాగ్రత్త పాటించటం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ లు ధరించటం, సామాజిక దూరం పాటించటం, పరిశుభ్రతను పాటించటం వంటి చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఆయన సూచించారు. ఇదీచదవండి..జమ్ములో ఆంధ్రప్రదేశ్ జవాను మృతి -
జేఎన్.1పై WHO కీలక ప్రకటన
జెనీవా: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో.. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్‌తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది. ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ప్రకారం.. జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదంలేదని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్‌తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది. జేఎన్.1 వేరియెంట్‌ను మొదటిసారి అమెరికాలో సెప్టెంబర్ నెలలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ ఇంతకు ముందే చెప్పింది. వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే.. మరింత ఆందోళన కలిగించేది అని అర్థం. అంటే.. ఆ వేరియెంట్‌కు త్వరగా వ్యాప్తి చెందడం, చికిత్సకు కష్టతరం కావడం, లక్షణాలు తీవ్రంగా ఉండడం ఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ కేటగిరీలో చేర్చడం ద్వారా.. డెల్టా, ఒమిక్రాన్లాగా ఇది గ్రీకు భాష ద్వారా ఓ కొత్త పేరు పెట్టడానికి వీలుంటుంది. అయితే జేఎన్.1 ఈ కేటగిరీ కిందకే వచ్చినా.. ప్రాణాంతకమైంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు వేరియెంట్లను(ఆల్ఫా, బీటా, గామా, డెల్టా) వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్‌గా గుర్తించింది. తర్వాతి కాలంలో విజృంభిస్తున్న వేరియెంట్లను వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద డబ్ల్యూచ్వో మానిటరింగ్ చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: భారత్‌లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
తెలంగాణలో కొత్త వేరియెంట్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వేరియెంట్ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నాలుగు కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది. కొత్త వేరియెంట్ విజృంభించే అవకాశం ఉండడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. తాజా కేసుల్లో స్వాబ్ నమునాలను పరీక్షలకు పంపగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చలికాలం కావడంతో ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త వేరియెంట్ జేఎన్.1 కలకలం రేగింది. దీంతో చాలామంది కరోనా పరీక్షలకు వెళ్తున్నారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా 402 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఇందులో నాలుగు పాజిటివ్‌గా తేలాయి. వాళ్లకు సోకిన వేరియెంట్‌ను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. మరోవైపు కేంద్రం సూచనతో రాష్ట్ర వైద్య విభాగం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. కేరళ, శబరిమల నుంచి వచ్చిన వాళ్లను ట్రేస్ చేసి.. పరీక్షలు నిర్వహించాలనుకుంటోంది. ఇంకోవైపు అధికార యంత్రాంగం సైతం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో యాభై బెడ్లతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. వెంటిఏటర్లు, ఆక్సిజన్ బెడ్లతో పాటు సాధారణ బెడ్లను అందుబాటులో ఉంచారు. -
కరోనా వేరియంట్ భయం.. గాంధీ ఆసుపత్రి రాజారాం కీలక వ్యాఖ్యలు
కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రూపం మార్చుకుని మళ్లీ వచ్చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ JN.1 విజృభిస్తోంది. రెండురోజులుగా కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏకంగా మళ్లీ కరోనా మరణాలను గుర్తుచేస్తోంది. అసలు జెఎన్–వన్ వెరియంట్ ఎంటీ? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కొత్త వెరియంట్ ఎంత వరకు ప్రమాదకరం.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ బారినపడి ఆరుగురు మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వెరియంట్ వేగంగా విస్తరించింది. చాలా మందిని ఇబ్బందిని పెట్టింది. అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది. తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వెరియంటే JN-1. ఒమిక్రాన్ రూపం మార్చుకుని జెఎన్-1 గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డ్‌లో బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల, సంక్రాంతి పండుగ సందర్భంలో కొత్త వేరియంట్ కట్టడి సవాల్‌గా మారనుంది. సో.. బీ కేర్ ఫుల్.. బీ అలెర్ట్. ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
భారత్‌లో కరోనా.. JN.1 ప్రమాదకారా?
దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజా కేసులపై మంగళవారం అప్డేట్ ఇచ్చింది. 142 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కొత్త వేరియెంట్ జేఎన్.1 వేరియెంట్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కేరళలో కరోనా కొత్త వేరియెంట్ జేఎన్.1 వేరియెంట్ వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించింది. ఈ వేరియెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు తమకు పంపాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు లేఖ రాశారు. మరోవైపు కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమై.. 60 ఏళ్లు పైబడిన వాళ్లకు మాస్క్ తప్పనిసరి చేసింది. కర్ణాటక, కేరళ సరిహద్దులో బందోబస్తును పెంచినట్లు ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. కేరళలో పాజిటివ్ కేసులు అధికమైతే ఆ రాష్ట్ర వాహనాలు కర్ణాటకలోకి రాకుండా పూర్తిగా నిలిపి వేయడంతో పాటు ప్రయాణికుల బస్సులను కూడా బంద్ చేస్తామని చెప్పారు. జేఎన్.1 అమెరికాలో.. కరోనా ఇప్పుడు అత్యవసర పరిస్థితికి దారి తీయకపోయినా.. అప్రమత్తంగా ఉండడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త వేరియెంట్లు వెలుగు చూస్తున్నాయి. జేఎన్.1 వేరియెంట్ కేసులు అమెరికా, చైనా తర్వాత భారత్‌లో బయటపడుతున్నాయి. ఒమిక్రాన్‌లోని పిరోలా వేరియెంట్(బీఏ.2.86)కి జేఎన్.1 ఉపరకం. జేఎన్.1 వేరియెంట్ తొలి కేసు అమెరికాలో సెప్టెంబర్‌లో వెలుగు చూసింది. ఇప్పటివరకు 11 దేశాల్లో ఈ వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. డిసెంబర్లో చైనాలో 7 కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగానే ఉంటుందని అమెరికా వైద్య విభాగం సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్షన్ హెచ్చరించింది. భారత్‌లో ఎలాగంటే.. దేశంలో తొలిసారి.. కేరళ తిరువనంతపురం కారకుళంలో జేఎన్-1 స్ట్రెయిన్ కేసు వెలుగు చూసింది. 79 ఏళ్ల వృద్ధురాలికి జరిగిన ఆర్టీ పీసీఆర్ పరీక్షలోనే ఇది బయటపడింది. అయితే పెషెంట్ మరణంతో జేఎన్-1 వేరియెంట్‌పై ఆందోళన వ్యక్తం కాగా.. సదరు పేషెంట్ వైరస్ వల్లే మరణించలేదని, కిడ్నీ ఇతరత్ర సమస్యల కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గత వేరియెంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ అంత వేగంగా జేఎన్.1 వ్యాప్తి చెందట్లేదని వైద్యనిపుణులు గుర్తించారు. అయితే.. వ్యాప్తి మాత్రం ఉంటుందని, చలికాలం సీజన్ కావడంతో వైరస్ వ్యాప్తి నియంత్రణ కష్టతరంగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు. జేఎన్.1 కరోనా వైరస్ గతంలో వైరస్ నుంచి కోలుకున్నవాళ్లకు, అలాగే ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకూ సోకుతుందని.. అయితే ఈ వేరియెంట్ వ్యాక్సిన్లకు లొంగే రకమని గురుగ్రామ్ సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన వైద్యుడు తుషార్ తయాల్ తెలిపారు. లక్షణాలు.. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి.. కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. గత వేరియెంట్లతో పోలిస్తే జేఎన్.1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలు లేవు. పైగా ఆస్పత్రుల్లో చేరాల్సినంత అవసరమూ రాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా.. ఇన్ఫెక్షన్ సోకకుండా చేతులు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. సింగపూర్‌లో ఉధృతం.. ఆసియా దేశం సింగపూర్‌లో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 56 వేల కేసులు.. అదీ వారం వ్యవధిలోనే నమోదు కావడంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేసింది ఆ దేశం. కేసుల్లో పెరుగుదల కనిపిస్తే లాక్డౌన్ విధించే ఆలోచన చేస్తామని అక్కడి ఆరోగ్యశాఖ చెబుతోంది. మరోవైపు మలేషియాలోనూ 20వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ రెండు దేశాల్లో వైరస్ వ్యాప్తికి జేఎన్.1 కారణమా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
కేరళలో కోవిడ్ వేరియంట్
పత్తనంతిట్ట: కేరళలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసు బయటపడింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఆదివారం ప్రకటించారు. అయితే, దీనితో ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు. ‘కొన్ని నెలల క్రితం సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ సందర్భంగా ఈ సబ్ వేరియంట్‌ను గుర్తించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ కొత్త వేరియెంట్లను గుర్తించారు. తాజాగా, జేఎన్.1 ఉప వేరియెంట్ తిరువనంతపురం కరకుళంలో బయటపడింది. దీనితో కంగారు పడాల్సిన పనిలేదు’అని మంత్రి అన్నారు. అయితే, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్ )సాధారణ పరీక్షల్లో భాగంగా ఒక శాంపిల్‌లో ఈ వేరియంట్‌ను నవంబర్ 18న గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి పేర్కొంది. 79 ఏళ్ల బాధిత మహిళ ఇన్ప్లూయెంజా వంటి తేలికపాటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారని వివరించింది. -
ప్యూర్ ఈవీ నుంచి ఎకోడ్రిఫ్ట్ బైక్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ప్యూర్ ఈవీ తమ కొత్త మోటార్ సైకిల్ వేరియంట్ ఎకోడ్రిఫ్ట్ 350ని ఆవిష్కరించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే 171 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ప్రతి రోజూ ఎక్కువ దూరాలు ప్రయాణించే వినియోగదారులకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని సంస్థ తెలిపింది. దీనితో నెలవారీగా రూ. 7,000 పైచిలుకు ఆదా కాగలదని వివరించింది. దీని ధర రూ. 1,29,999గా ఉంటుందని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వదేరా తెలిపారు. సులభతరమైన ఈఎంఐ సదుపాయం రూ. 4,000 నుంచి ఉంటుందని పేర్కొన్నారు. 110 సీసీ సెగ్మెంట్లో హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి మోటార్‌సైకిల్స్‌తో దీటుగా పోటీపడగలిగేలా దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇందులో రివర్స్ మోడ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 75 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. -
అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి వేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ హెచ్వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం ఈ వేరియంట్ కారణమని తేల్చింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్ వేరియంట్ అని, ఇటీవల నమోదైన కేసుల్లో నాలుగో వంతు కంటే మించి హెచ్వీ.1 వేరియంట్ కేసులేనని గుర్తించారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా గణాంకాల ప్రకారం జూలైలో 0.5 శాతంగా ఉన్న ఈ వేరియంట్ కేసులు సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. దీన్ని ఒమిక్రాన్ గ్రాండ్ చైల్డ్‌గా వాండర్బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డా. విలియం షాఫ్నర్ పేర్కొన్నారు. అలాగే పిలోరా జేఎన్.1 వేరియంట్‌ను ఐస్లాండ్, పోర్చుగల్, స్పెయిన్‌తో సహా 12 దేశాలలో కనుగొన్నారు. కోవిడ్ టంగ్ ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి లాంటివి కోవిడ్‌లో కీలక లక్షణాలు. అయితే, ఈ కొత్త వేరియంట్ సోకిన వారి నోటిలో కోవిడ్ టంగ్ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దీని ప్రకారం ఒమిక్రాన్ హెచ్వీ.1, పిరోలా జాతి జేఎన్.1 వేరియంట్స్ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతోపాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయిదే మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం వైరస్‌తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుణిని సంప్రదించాలని చెప్పారు. ఈ వేరియంట్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు హెచ్వీ.1 లాంటి వేరియంట్ కొత్త వేరియంట్ల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.ఎక్కువ మ్యుటేషన్ అయ్యే వేరియంట్లు తక్కువ హాని కలిగిస్తాయని వీరు పేర్కొన్నారు. -
కియా సెల్టోస్ కొత్త వేరియంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా సెల్టోస్ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) లెవెల్–2 సాంకేతికతతో ఇవి రూపుదిద్దుకున్నాయి. జీటీఎక్స్ ప్లస్ (ఎస్), ఎక్స్-లైన్ (ఎస్) వేరియంట్లలో పెట్రోల్ ఇంజన్‌తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఇంజన్‌తో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఇవి తయారయ్యాయి. ఎక్స్షోరూలో ధర రూ. 19.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త సెల్టోస్ సగటు వెయిటింగ్ పీరియడ్ 15=16 వారాలు ఉంది. నూతన వేరియంట్లను 7-9 వారాల్లోనే డెలివరీ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రెండు నెలల్లోనే కొత్త సెల్టోస్ 50,000 యూనిట్ల బుకింగ్స్ మైలురాయిని అధిగమించిందని కియా ఇండియా వెల్లడించింది. -
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెలో గుబులు పడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గజగజ వణికించింది. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కరోనా ఉధృతితో పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీని బాధితులుగా మారారు. ఊహించని ముప్పుతో ప్రాణాలు విడిచారు. అంతలా ప్రజలను భయాందోళనకు గురిచేసిన మహమ్మారి పీడ ప్రస్తుతం విరిగిపోయినట్లే కనిపిస్తుంది. భారత్‌లో గత కొన్ని నెలలుగా వైరస్ కేసులు పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలు హమ్మయ్యా అనుకుంటూ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆలోపే మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈజీ. 5 (EG.5) అనే వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి చెందిన ప్రస్తుతమున్న ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2 స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో అదనంగా ఒక మ్యూటేషన్ (జన్యుమార్పు) కలిగి ఉందని, ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. శరీరంలోని కణాలకు వైరస్ సోకేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకమన్న విషయం తెలిసిందే. చదవండి: మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్.. అయితే ఈ కొత్త మ్యూటేషన్ ఇంతకముందు ఇతర కరోనా వేరియంట్లలో కూడా కనిపించిందని వెల్లడించారు. మరోవైపు ఈజీ.5 నుంచి ఇప్పటికే ఈజీ.5.1 (EG.5.1) అని పిలవబడే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది కూడా వేగంగా వ్యాపిస్తోంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ డా. డేవిడ్ హో ఈ వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. కరోనా టీకాలతో శరీరంలో ప్రేరేపితమైన యాంటీబాడీల నుంచి ఈ వైరస్ ఏమేరకు తప్పించుకుంటోందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా నిరోధక యాంటీబాడీల నుంచి ఈ రెండు కొత్త వేరియంట్లు కొంత మేర తప్పించుకోగలుగుతున్నాయని గుర్తించారు. ఫలితంగా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. XBB సిరీస్‌లోని ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఇది రోగ నిరోధకవ్యవస్థ నుంచి మరింత సమర్థవంతంగా తప్పించుకుంటోందని పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్స్‌తో వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈజీ.5 వేరియంట్ ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జపాన్, చైనాలలో కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. మరోవైపు ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి.. ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. -
మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్..
ముంబయి: కరోనా పేరు విని చాలాా రోజులు అయి ఉంటుంది! ఎక్కడా పెద్దగా కేసులు నమోదుకాకపోవడంతో ఇక అయిపోయిందని అనుకున్నాం. కానీ కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ వచ్చి.. కొత్తగా కేసులు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా కరోనా మొదటి, రెండవ దశలో ఎక్కువగా నష్టపోయిన మహారాష్ట్రలోనే మళ్లీ కొత్త రకం కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త రకం కరోనా వైరస్ ఈజీ.5.1 కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఈ వేరియంట్ రకానికి చెందిన కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా ముంబై లో 43 కేసులు నమోదయ్యాయి. పూణేలో 34 కేసులు వెలుగులోకి రాగా.. థానేలో 25 చొప్పున యాక్టీవ్ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య రంగాన్ని అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. కరోనా కొత్త రకం వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున మాస్కులు తరహా రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ -
బాబోయ్ ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు అన్ని కోట్లా? లగ్జరీ లంబోర్ఘినికే ఝలకా?
అతి ఖరీదైన ఫోన్లు అనగానే యాపిల్ ఐఫోన్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం రూ. 1,27,999 ధర పలుకుతున్న ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్‌గా భావిస్తాం. దీని లేటెస్ట్ వెర్షన్ ధర కళ్లు చెదిరే ధర పలుకుతోంది. డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ చేసిన ఐఫోన్ ధర సుమారు రూ. 5 కోట్లు (616,000 డాలర్లు) పలుకుతోంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్నోఫ్లేక్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. డైమండ్ మోడల్ బ్యాక్ప్లేట్కు లాకెట్టు అమర్చారు. దీన్ని అతి ఖరీదైన ప్లాటినం, వైట్ గోల్డ్‌తో రూపొందించారు. ఈ రౌండ్ అండ్ మార్క్యూస్-కట్ డైమండ్స్‌తో తయారు చేసిన లాకెట్టు ధర ఒక్కటే దాదాపు రూ. 62 లక్షలు. దీనికి అదనంగా,18 కేరట్ల వైట్ గోల్డ్ బ్యాక్ప్లేట్ను కూడా అమర్చారు. దీనికి 570 వజ్రాలను అమర్చారట. ప్రస్తుతానికి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచినట్టుతెలుస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రూ.3.7 కోట్లకు లభ్యమవుతున్న లంబోర్గిని హురాకాన్ ఎవో సూపర్‌కార్ ధర కంటే ఎక్కువ కదా బాసూ అంటే కమెంట్ చేస్తున్నారు. కాగా 1,39,900 రూపాయల వద్ద భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ మోటరోలా కొత్తగా మోటో జీ32 ఫోన్లో రెండు రంగుల్లో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. రోజ్ గోల్డ్, శాటిన్ మెరూన్ వీటిలో ఉన్నాయి. దీనితో జీ32 మొత్తం నాలుగు వేరియంట్స్‌లో లభిస్తున్నట్లవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. గత సంవత్సరం 4జీబీ+ 64జీబీ మోడల్ విడుదలకాగా ఈ సంవత్సరం ప్రారంభంలో 8జీబీ + 128జీబీ వెర్షన్ లాంచ్ అయింది. జీ32 ధర రూ. 11,999 గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ టర్బోపవర్ చార్జర్, 50 ఎంపీ క్వాడ్ ఫంక్షన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా–కోర్ ప్రాసెసర్, 6.5 అంగుళాల డిస్ప్లే తదితర ఫీచర్స్ ఉన్నాయి. -
మరింత అందంగా తయారైన ఎంజీ గ్లోస్టర్ - అదిరిపోయే లుక్ & అంతకు మించిన ఫీచర్స్!
MG Gloster Blackstorm edition: భారతదేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎంజీ మోటార్' కంపెనీ ఎట్టకేలకు గ్లోస్టర్ ఎస్యువి కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు 'బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్'. ఈ ప్రీమియం కారు ధరలు, అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్' ధర రూ. 40.30 లక్షలు. ఇప్పటికే ప్రీమియం విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న గ్లోస్టర్ ఇప్పుడు మరింత అద్భుతంగా తయారైంది. ఇది తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. డిజైన్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ బయట, లోపలి భాగంలో ఎక్కువ భాగం బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇది రెండు పెయింట్ ఆప్షన్లతో మెటల్ బ్లాక్ అండ్ మెటల్ యాష్‌తో పాటు రూప్ రైల్స్, టెయిల్ల్యాంప్, హెడ్‌ల్యాంప్ హౌసింగ్, విండో చుట్టూ ఉండే ట్రిమ్, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, అల్లాయ్ వీల్స్ వంటివి బ్లాక్‌స్టార్మ్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా బయట వైపు రెడ్ కలర్ యాక్సెంట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది హెడ్‌ల్యాంప్స్, బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, వింగ్ మిర్రర్లపై చూడవచ్చు. పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగం బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్ పొందుతుంది. ఇది ఇంటీరియర్ అపోల్స్ట్రే, స్ట్రీరింగ్, డ్యాష్‌బోర్డ్‌లలో కనిపిస్తుంది. గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ 6 అండ్ 7-సీటర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక దాదాపు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్‌రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) Presenting THE ADVANCED GLOSTER BLACKSTORM with an all-new dark exterior, sporty-red accents and a luxurious dark-theme interior. With its Intelligent 4X4, 7-Terrain Modes & ADAS features you can take on anything the road throws at you and #DriveUnstoppable on your adventures! pic.twitter.com/bTqkG6BaLK — Morris Garages India (@MGMotorIn) May 29, 2023 ఇంజిన్ & పర్ఫామెన్స్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ఇంజిన్, పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు పొందలేదు. 2WD వెర్షన్ 163 hp ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ సింగిల్ టర్బో-డీజిల్ ఇంజన్.. 4WD వెర్షన్ 218 hp పవర్ అందించే 2.0-లీటర్ ట్విన్ టర్బో-డీజిల్ ఇంజన్ పొందుతాయి. రెండు ఇంజిన్స్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్త రెనాల్ట్ కైగర్ కాంపాక్ట్ ఎస్ యూవీనికొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. రెనాల్ట్ XT (O) MT వేరియంట్ ధరను 7.99 (ఎక్స్ షోరూం) లక్షలుగా నిర్ణయించింది. రెనాల్ట్ కైగర్ ఎక్స్‌టీ(ఓ) ఎ ంటీ ఇంజీన్, ఫీచర్లు 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 99bhp, 152Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు రెనాల్ట్ కైగర్ గ్లోబల్ ఎన్‌సిఎపి ద్వారా అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీకి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా అందుకుంది, డ్రైవర్ ఫ్రంట్ ప్యాసింజర్ భద్రత కోసం, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ-టెన్షనర్లతో కూడిన సీట్‌బెల్ట్‌లు, స్పీడ్ అండ్ క్రాష్-సెన్సింగ్ డోర్ లాక్‌లు , ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్) వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎన్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్ , హై సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లున్నాయి.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి వినూత్న ఫీచర్లను అందిస్తోంది. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) రెనాల్ట్ ఆర్ఎక్స్ జెడ్‌పై డిస్కౌంట్ కొత్త వేరియంట్ లాంచ్‌తో పాటు, Renault RXZ ట్రిమ్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్ కొనుగోలపై రూ. 10వేల నగదు, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 12వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్‌తోపాటు రూ. 49వేల లాయల్టీ ప్రయోజనాలు లాంటి ఆఫర్లను కూడా ప్రకటించింది ఇదీ చదవండి: దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ! -
హోండా నుంచి ఏటా కొత్త కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్ లేదా వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో కంపెనీ వాటాను పెంచుకోవడం లక్ష్యంగా వచ్చే 3–5 ఏళ్లపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. హోండా వాటా ప్రస్తుతం 2.5 శాతం మాత్రమే. 2023 సెప్టెంబర్‌లోగా ఒక ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ఒకటి రానుందని చెప్పారు. అలాగే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని వెల్లడించారు. 2022–23లో 8 శాతం వృద్ధితో దేశీయంగా 92,000 యూనిట్ల అమ్మకాలను కంపెనీ ఆశిస్తోంది. అలాగే 25 శాతం వృద్ధితో ఎగుమతులు 23,000 యూనిట్లు నమోదు కానున్నాయి. రాజస్థాన్‌లోని ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 1.8 లక్షల యూనిట్లు. -
దేశంలో కరోనా కొత్త వేరియంట్.. ఫోర్త్ వేవ్ వస్తుందా?
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని పేర్కొంది. 76 కేసుల్లో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పాండిచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కోటి ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ మొదటగా జనవరిలో 2 శాంపిళ్లలో బయటపడింది. ఫిబ్రవరిలో 59కి చేరింది. మార్చిలో 15 శాంపిళ్లలో బయటపడ్డట్టు ఇన్సాకాగ్ పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ 12 దేశాల్లో బయటపడినప్పటికీ అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల కంటే భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మాజీ కన్వీనర్ విపిన్ ఎం. వశిష్ట చెప్పారు. ఈ వేరియంట్ కారణంగా దేశంలో గత 14 రోజుల్లో కేసులు 281%, మరణాలు 17% పెరిగాయని ట్వీట్ చేశారు. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 800 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 126 రోజుల తర్వాత ఇదే అత్యధికం. యాక్టివ్ కేసులు 5,389కు చేరాయని కేంద్రం తెలిపింది. -
అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే?
చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్‌లంటూ వస్తూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఆల్ఫా, డెల్టా అంటూ తీవ్రమైన వేరియెంట్ల రూపంలో అనేక మంది ఉసురు తీశాయి. మూడో వేవ్‌గా వచ్చిన ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదుగానీ ఇంతలోనే ఒమిక్రాన్ తాలూకు మరో సబ్–వేరియెంట్ అయిన ఎక్స్‌బీబీ 1.5 వచ్చి అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. భారత్‌లోని ఇంటికొకరు చొప్పున అమెరికాలో నివాసముంటూ... రోజూ కొన్ని లక్షల మంది యూఎస్ నుంచి ఇండియాకీ, ఇక్కణ్ణుంచి మళ్లీ యూఎస్‌కు వెళ్తూ వస్తూ, పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఈ సబ్ వేరియెంట్ ప్రమేయం (రెలవెన్స్) ఏమిటీ, ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసమే ఈ కథనం. ప్రతి జీవీ తన మనుగడ కోసం కొత్త మ్యూటేషన్స్‌తో ముందుకంటే మరింత సమర్థమైన జీవిగా పరిణామం చెందడానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఒమిక్రాన్ సబ్–వేరియెంట్ కూడా జన్యుపరమైన మార్పులను చేసుకుంటూ 500 కంటే ఎక్కువ రూపాలను సంతరించుకుంది. ఈ ఎక్స్‌బీబీ 1.5 కూడా ఇలాంటి ఓ కొత్త సబ్–వేరియెంటే! ఎక్స్‌బీబీ 1.5 అనే ఈ తాజా సబ్–వేరియెంట్... రెండు రకాల వేరియంట్స్ కలిసినందువల్ల, మరో కొత్త వేరియంట్ గా మారింది. అంటే... బీజే–1 (బీఏ.2.10.1.1) అనే ఒక వేరియంటూ, అలాగే బీఏ.2.75 (బీఏ.2.75.3.1.1.1) మరో వేరియెంట్ల కలయిక వల్ల ‘ఎక్స్‌బీబీ’ అనే ఈ సబ్–వేరియంట్ పుట్టుకొచ్చింది. అది మరొక మ్యుటేషన్‌కి గురికావడంతో తాజాగా తన ప్రభావం చూపిస్తున్న ఈ ‘ఎక్స్‌బీబీ – 1.5’ తయారయింది. ఈ సబ్–వేరియెంట్ పుట్టుకకు కారణమైన మ్యుటేషన్‌ని ‘ఎఫ్486పీ’ అని పిలుస్తున్నారు. దీనికి ఓ ముద్దుపేరూ ఉంది... ఎక్స్‌బీబీ 1.5కి ఓ ముద్దు పేరూ ఉంది. ‘క్రాకాన్’ అన్నది దీని పెట్‌నేమ్. అంటే ‘సముద్ర భూతం’ అని అర్థం. అయితే... ఈ నిక్–నేమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇవ్వలేదు. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీనికా పేరు పెట్టారు. ఇందుకో కారణం కూడా ఉంది. అదేమిటంటే... ఒమిక్రాన్‌కు ఉన్న అనేక వేరియంట్ల కంటే కూడా... ఈ ‘ఎక్స్‌బీబీ–1.5’ అన్నది మానవ వ్యాధినిరోధక వ్యవస్థను (ఇమ్యూనిటీని) తప్పించుకోవడంలో దిట్ట అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ ఎక్స్‌బీబీ 1.5’ సబ్–వేరియెంట్... మునుపటి వేరియంట్ల కంటే మరింత తేలిగ్గా, మరింత బలంగా ‘ఏసీఈ2 రిసెప్టార్’లతో అనుసంధానితమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకే వారు ఈ సబ్–వేరియంట్‌కు ‘క్రాకన్’ అనే నిక్–నేమ్ ఇచ్చారు. మనదేశంలో ఎక్స్‌బిబి 1.5 వ్యాప్తికి అవకాశమెంత? ఇప్పుడు ప్రపంచంలోని ఓ మూల నుంచి మరో మూల వరకు రాకపోకలు మామూలైపోయాయి. ప్రపంచమో పల్లెటూరుగా మారినందుకే ఇప్పుడు భూగోళాన్ని ‘గ్లోబల్ విలేజ్’ అంటూ అభివర్ణిస్తున్నారు. పెద్ద ఎత్తున పెరిగిన రవాణా, రాకపోకలూ, వలసల వంటి వాటివల్ల ఈ కొత్త వేరియంట్ అమెరికా నుంచి అన్ని ప్రాంతాలకూ, ఆ మాటకొస్తే మన దేశానికి సైతం పాకే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఒకసారి భారత్‌కు వచ్చాక మన దేశవాసులు ఈ ఎక్స్‌బిబి 1.5 తో ఎలాంటి ఇబ్బందులకు లోనవుతారనే విషయాన్ని అంచనా వేయడానికి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడానికి లేదు. ఒమిక్రాన్ కారణంగా మన దేశవాసుల్లో కరోనా పట్ల ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా వచ్చింది. అందువల్ల వేగంగా విస్తరించినప్పటికీ ఈ ‘ఎక్స్ బి బి 1.5’ మన దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తుందనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని చెప్పవచ్చు. అందుకే ఈ వేరియంట్ వల్ల మనదేశవాసులంతా భయాందోళనలకు గురికావలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కానీ వ్యాధినిరోధక శక్తి కాస్తంత తక్కువగా ఉన్నవారు, ఇతరత్రా వ్యాధులతో ఇప్పటికీ బాధడుతున్నవారు మాత్రం ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది? అమెరికాలోని వ్యాధుల నిపుణురాలు (ఎపిడిమియాలజిస్టు) అయిన మేరియా వాన్ కెర్కోవ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ వచ్చిన అన్ని కరోనా వైరస్ల కన్నా ఈ ఎక్స్‌బీబీ 1.5 చాలా ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది. అంతేకాదు ప్రస్తుతం దీని ప్రభావం అమెరికాతో పాటు మరో 29 దేశాలలో కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘అందువల్ల అమెరికా మాత్రమే కాకుండా మిగతా అన్ని దేశాల ప్రజలతో పాటు అమెరికా నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల ప్రజలూ, విమాన ప్రయాణీకులందరూ మునపటిలాగే మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు చేపట్టడం అవసరం’’ అంటూ ఆమె (మేరియా) పేర్కొన్నారు. ఇక గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం బూస్టరు డోసులు తీసుకోవాలంటూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ సూచిస్తోంది. నిర్ధారణ పరీక్షలు గతంలో మాదిరిగానే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో గాని రాపిడ్ టెస్టుల్లో గాని ఈ వేరియంట్ కూడా తక్కిన ఒమిక్రాన్ వేరియంట్లలా బయటపడుతుంది. ఈ వేరియంట్ లక్షణాలేమిటి? మిగతా కరోనా వేరియెంట్లు, ఒమిక్రాన్ మాదిరిగానే ఎక్స్‌బిబి 1.5 కూడా... జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు కలగజేస్తుంది. వృద్ధుల్లోనూ, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి (ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్)లోనూ, ఇప్పటికే ఇతరత్రా తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలున్న(కో–మార్బిడిటీ)వారిలో ఈ వేరియెంట్ కాస్తంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉండవచ్చు. అంతే తప్ప మిగతా వారందరిలో ఇదో చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి తగ్గిపోయే అవకాశాలే చాలా ఎక్కువ. మందులేమిటీ/ నివారణ ఏమిటి? ఈ వేరియెంట్‌కు ‘మోనోక్లోనల్ యాంటీ బాడీ’ ఇంజక్షన్లు పనిచేయవు. ఇప్పటికే భారతదేశంలో అనుమతి పొందిన ‘పాక్స్ లోవిడ్’ ట్యాబ్లెట్లు ఈ సబ్–వేరియంట్‌కి కాస్తంత సమర్థంగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో ఇప్పుడు అందుబాటులో ఉన్న బై వాలెంట్ కరోనా వ్యాక్సిన్లు దీని నుంచి రక్షణ కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక గతంలో మాదిరిగానే మాస్కులు ధరించడం, సబ్బుతోగానీ, శ్యానిటైజర్లతోగానీ చేతులు తరచూ శుభ్రపరచుకోవడం, ఇంటినీ, పరిసరాలను డిస్–ఇన్ఫెక్టెంట్లతో తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సమూహాల్లోకి, గుంపుల్లోకి (క్రౌడ్స్‌లోకి) వేళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలను పాటిస్తే చాలు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
పంజా విసురుతోన్న కోవిడ్ ‘సూపర్ వేరియంట్’.. అంత ప్రమాదకరమా?
వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5(సూపర్ వేరియంట్) ప్రస్తుతం కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో నమోదవుతున్న కేసుల్లో 40 శాతం కేసులు ఈ సూపర్ వేరియంట్ కారణమవుతున్నట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్7తో పాటు ఎక్స్‌బీబీ.1.5 సూపర్ వేరియంట్‌పై ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం ఎక్స్‌బీబీ వేరియంట్‌గా పేర్కొన్నారు మిన్నేసోటా వర్సిటీ నిపుణులు డాక్టర్ మిచెల్ ఓస్టెర్హోమ్. అమెరికాలో తీవ్రత ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలోని 7 రాష్ట్రాల్లో ఎక్స్‌బీబీ కేసులే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో బీఏ.2, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ1.5ల కారణంగా 44.1 శాతం కేసులు నమోదయ్యాయి. తొలికేసు భారత్‌లోనే.. ఎక్స్‌బీబీ వేరియంట్‌ను తొలుత భారత్‌లోనే ఈ ఏడాది ఆగస్టులో గుర్తించారు. కొద్ది రోజుల్లోనే భారత్‌తో పాటు సింగపూర్‌లో ఈ వేరియంట్ వేగంగా విస్తరించింది. ఇది ఎక్స్‌బీబీ.1, ఎక్స్‌బీబీ1.5 వేరియంట్లుగా రూపాంతరం చెందింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని లక్షణాలు వేరుగా ఉన్నాయని, దీంతో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు జాన్ హోప్కిన్స్ వర్సిటీ నిపుణులు తెలిపారు. ఎక్స్‌బీబీ.1.5 వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలేంటి? ఎక్స్‌బీబీ1తో పోలిస్తే ఎక్స్‌బీబీ1.5 శరీరంలోని యాంటీబాడీలను తప్పించుకోవటమే కాదు, రోగనిరోధక శక్తిని దాటుకుని కణాల్లోకి ప్రవేశిస్తోందని తెలిపారు పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అలాగే కీలక గ్రాహకాల ద్వారా కణాలను తన అధీనంలోకి తెచ్చుకుంటుని హెచ్చరించారు. ఎక్స్‌బీబీ ఉప రకాలు పుట్టుకస్తున్న కొలది ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గిపోతుందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడంతో పాటు ఒకసారి సోకినవారికి సైతం మళ్లీ సులభంగా అంటుకుంటుందని వెల్లడించారు. ⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc — Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022 ఇదీ చదవండి: భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్ కారులో చేసేది కాదు: రాహుల్ -
సమాచారం దాచి.. సంక్షోభం పెంచి
బీజింగ్: తొలిసారిగా వూహాన్లో కరోనా వైరస్ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్ కరాళనృత్యం కొనసాగేవరకూ ఏ విషయాన్నీ స్పష్టంగా ప్రపంచదేశాలతో పంచుకోని చైనా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది. దాంతో ఈసారీ ఇంకా ఎలాంటి వేరియంట్లు పడగవిప్పుతాయో తెలీక ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. చైనా హఠాత్తుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక అక్కడ విజృంభించిన కరోనా కేసులు, కోవిడ్ మరణాల సంఖ్యపై ఎలాంటి సమగ్ర వివరాలను అధికారికంగా బయటపెట్టకపోవడంతో ప్రపంచ దేశాలను ఆందోళన చెందుతున్నాయి. దీంతో ముందస్తుచర్యగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ కొన్ని దేశాలు నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇటలీ, మలేసియా ఇప్పటికే చైనా ప్రయాణికులపై కోవిడ్ నిబంధనలను అమలుచేస్తున్నాయి. ‘ చాంద్రమాన నూతన సంవత్సరం సందర్భంగా 30,000 మంది తైవానీయులు చైనా నుంచి స్వదేశం వస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ టెస్ట్ చేయాల్సిందే. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకత లోపించింది. చైనా ఇతరదేశాలతో సమాచారం పంచుకోకపోవడమే ఇక్కడ అసలు సమస్య’ అని తైవాన్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ అధినేత వాంగ్ పీ షెంగ్ అన్నారు. అప్పుడే సమగ్ర వ్యూహరచన సాధ్యం ఎప్పటికప్పుడు డాటా ఇస్తున్నామని చైనా తెలిపింది. కాగా,‘ఐసీయూలో చేరికలు, ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితిపై పూర్తి సమాచారం అందాలి. అప్పుడే ప్రపంచదేశాల్లో క్షేత్రస్థాయిలో సన్నద్ధతపై సమగ్ర వ్యూహరచన సాధ్యమవుతుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనోమ్ ఘెబ్రియేసెస్ అన్నారు. ‘కరోనాను అంతం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన చైనా హఠాత్తుగా కోవిడ్ పాలసీని ఎత్తేయడం ఆందోళనకరం. చైనా దేశీయ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడంతో పశ్చిమదేశాలు ఆగ్రహంతో ఉన్నాయి’ అని వాషింగ్టన్‌లోని మేథో సంస్థ హాడ్సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైల్స్ యూ వ్యాఖ్యానించారు. -
షాకింగ్ రిపోర్ట్: కోవిడ్ కొత్త వేరియంట్ల తయారీ కేంద్రంగా చైనా!
బీజింగ్: చైనాలో కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. కొద్ది రోజుల్లోనే దేశంలోనే 60 శాతం జనాభాకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందనే నివేదికలు కలవర పెడుతున్నాయి. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7తో పాటు మరో మూడు వేరియంట్లు కారణమని గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్-19 విజృంభణతో చైనా కొత్త వేరియంట్ల పుట్టుకకు బలమైన కేంద్రంగా మారబోతోందని ఆరోగ్య విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాగ్రహంతో జీరో కోవిడ్ పాలసీకి మంగళం పాడిన చైనా ప్రభుత్వం, జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనలనూ ఎత్తివేసింది. మరోవైపు.. రోజువారీ కోవిడ్ నివేదికలను వెల్లడించటాన్ని ఆపివేసింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్. కొద్ది రోజులుగా వేలాది మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సినేషన్ సరిగా లేకపోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చైనాలో.. ప్రపంచ జనాభాలోని ఐదోవంతు మందిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో కొత్త వేరియంట్లు అభివృద్ధి చెందేందుకు చైనా కేంద్ర బిందువుగా మారబోతోందని ఇతర దేశాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారిలోకి వైరస్ ప్రవేశించినప్పుడు అది మ్యూటేషన్ చెందేందుకు అవకాశం ఉంటుందని జెనీవా యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ ఆంటోయిన్ ఫ్లాహాల్ట్ పేర్కొన్నారు. ‘ఒక్కసారిగా సుమారు 1.4 బిలియన్ ప్రజలు సార్స్ కోవ్2 బారినపడ్డారు. ఇది కచ్చితంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే వాతావరణాన్ని కల్పిస్తుంది. కొద్ది నెలల్లోనే 500లకుపైగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను గుర్తించాం. అయితే, అవి తొలుత ఎక్కడ మ్యుటేట్ అయ్యాయనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం.’ అని పేర్కొన్నారు ఆంటోయిన్. మరోవైపు.. వైరస్‌కు వంశవృద్ధి కోసం చైనా బలమైన కేంద్రంగా మారనుందని ఫ్రాన్స్‌కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ బ్రూనో లీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Corona In China: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం! -
కొత్త వేరియంట్ ప్రభావం భారత్‌పై తక్కువే
సాక్షి, హైదరాబాద్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి స్పష్టం చేశారు. భారతీయులకు ఇప్పటికే మూక రోగనిరోధకత వచ్చి ఉండటం ఇందుకు కారణం అని అయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు కొనసాగించడం అవసరమన్నారు. గతంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో కొందరికి బీఎఫ్–7 సోకే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా వైరస్‌ను ఎదుర్కొన్నాక దేశంలో వాక్సినేషన్ జరిగిందని, ఆ తరువాత ఒమిక్రాన్ వచ్చినప్పుడు బూస్టర్ డోసులు వేసుకున్న కారణంగా భారతీయులు మెరుగైన రోగ నిరోధక శక్తితో ఉన్నారని అయన వివరించారు. అందుకే చైనా లాంటి పరిస్థితులకు ఇక్కడ అవకాశం ఉండదన్నారు. -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. ఆక్సిజన్‌పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. చైనాలో అలా ఎందుకంటే? చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్ పాలసీతో అక్కడ కఠినమైన లాక్డౌన్ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వాతావరణం కూడా.. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్–7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. రెండు మూడు నెలల క్రితమే.. మన దేశంలో బీఎఫ్–7 వేరియంట్ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. -
చైనా పరిస్థితి ఒక హెచ్చరిక.. లోక్‌సభలో మంత్రి కీలక ప్రకటన
ఢిల్లీ: కరోనా పరిస్థితిపై లోక్ సభలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా కీలక ప్రకటన చేశారు. పొరుగు దేశం చైనాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియెంట్, మరణాలపైనా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గురువారం ఆయన లోక్‌సభలో ప్రసంగించారు. పొరుగు దేశం చైనాలో కేసుల పెరుగుదల.. ప్రపంచానికి ఒక హెచ్చరికలాంటిది. అక్కడి కేసుల పెరుగుదల, మరణాలను చూస్తున్నాం. పరిస్థితి ముందు ముందు మరింత ఘోరంగా అక్కడ మారే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే మన దగ్గర రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా మాస్క్ వాడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆయన కోరారు. ముఖ్యంగా కొత్త కరోనా వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని, కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ఆయన పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ప్రపంచంలో చాలా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. కాబట్టి, ఈ సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చైనాలో కరోనా కేసులు, మరణాలు పెరగుతుండడం చూస్తున్నట్లు తెలిపారు. మహమ్మరి పరిస్థితిని అదుపు చేసేందుకు ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉందని, గతంలో రాష్ట్రాలకు ఆర్థికంగానూ సహకరించిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో 220 కోట్ల వ్యాక్సిన్ షాట్స్ అందించినట్లు ఆయన ప్రకటించారు. పండుగలు, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో.. కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని, ప్రికాషనరీ డోసులు విషయంలో తగిన సూచనలు పాటించాలని కోరారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులలో RT-PCR టెస్టులు ప్రారంభించినట్లు, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మాన్షుక్ మాండవియా స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌కు సంబంధించిన పరిణామాలను భారత్ గమనిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు. -
కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే, బుధవారం రోజున తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. చదవండి: (Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు) -
ఏపీ: కరోనాపై అప్రమత్తంగానే ఉన్నాం
సాక్షి, విజయవాడ: కోవిడ్ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నిరంతర పర్యవేక్షణ నడుస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ బుధవారం వెల్లడించారు. నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులొచ్చాయి. అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి అని ఆయన వెల్లడించారు. దేశంలో చైనా నుంచి వచ్చిన కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందిస్తూ.. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో వున్నాయని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. -
భారత్‌లోకి చైనా వేరియంట్ ఎంట్రీ.. అప్పుడే మూడు కేసులు..
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కారణంగా నిపుణులు వెల్లడించారు. తాజాగా ఆ వేరియంట్ భారత్‌కూ వ్యాపించటం కలకలం సృష్టిస్తోంది. చైనాలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్లో రెండు కేసులు నమోదు కాగా.. ఒడిశాలో మరో కేసు వెలుగు చూసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వేరియంట్‌పై వివరాలు వెల్లడించారు నిపుణులు. బీఎఫ్7 వేరియంట్ కేసులు గుర్తించినప్పటికీ వ్యాప్తిలో ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్లపై నిఘా పెట్టడం చాలా కీలకమని పేర్కొన్నారు. చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగటం, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవటం వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. బీఎఫ్.7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రజల్లోని రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి ఉప రకం. దీనికి ఒకరి నుంచి ఒకరికి సోకే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఈ బీఎఫ్7 వేరియంట్‌ను అమెరికా, యూకే, ఐరోపా దేశాల్లోనూ గుర్తించారు. విమానాశ్రయాల్లో హైఅలర్ట్.. చైనా సహా విదేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోకి వచ్చే వారికి రాండమ్‌గా కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల కోసం ఉన్న మార్గదర్శకాలు యథాతథంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి: కేంద్రం సూచన -
కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. విదేశాల్లో కరోనా కేసుల పెరుగుదలపై భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని, పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ‘జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్ నెట్వర్క్ ద్వారా ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలి. అలా చేయడం ద్వారా సరైన సమయంలో కొత్త వేరియంట్లను గుర్తించగలుగుతాం. దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం.’ - కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్. ప్రజాగ్రహంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది చైనా. దీంతో రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో మంగళవారం 112 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,490 ఉన్నాయి. ఇదీ చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు.. లక్షల్లో మరణాలు! -
జాగ్రత్తలు పాటించాల్సిందే!
రెండు సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి దెబ్బకు బతుకులు దయనీయంగా మారిన తీరు అందరికీ జ్ఞాపకం ఉంది. కొన్నాళ్లపాటు లాక్డౌన్ పేరున అందరూ తలుపులు పెట్టుకుని ఇళ్లలోనే బందీలు అయిన సంగతి వెంటాడుతూనే ఉన్నది. అయినా చాలా మంది మూతికి మాస్కులు పెట్టుకోవాలి అన్న సంగతి మరచిపోయారు. గుంపులు గుంపులుగా చేరడం గురించి ఎవరూ భయపడడం లేదు. చేతులు, పరిసరాలను శానిటైజ్ చేసుకోవడమూ తగ్గిపోయింది. బహుశా కోవిడ్ కేసులు బాగా తగ్గిపోవడం వల్లనే చాలామంది ఇలా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నట్టున్నారు. అయితే కోవిడ్ పీడ ఇంతటితో విరగడైందని భావించరాదు. మహమ్మారి మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘సైన్స్’ పత్రికలో గ్రెచెన్ ఫోగెల్ అనే పరిశోధకుడు ఈ మధ్యనే ఒక పరిశోధన పత్రం వెలువరించాడు. మరొక పెద్ద కోవిడ్ వేవ్ రానున్నదని ఆ పత్రంలో ఆయన ప్రకటించాడు. కోవిడ్ గురించి బాగా పట్టించుకున్న వాళ్లకు ఒమిక్రాన్ అన్న పేరు జ్ఞాపకం ఉంటుంది. సార్స్ కోవ్ 2 అనే వైరస్ వల్ల కోవిడ్ వచ్చిందని తెలుసు. ఆ వైరస్‌లో జన్యు మార్పులు జరిగి కొత్త రకాలు వచ్చినట్టు కూడా తెలుసు. అందులో చివరిది ఒమిక్రాన్. అది కూడా మళ్లీ ఒకసారి మార్పులకు గురైందట. ఫలితంగా వచ్చిన మరో కొత్త రకానికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తట్టుకునే బలం ఎక్కువగా ఉందట. అటువంటి రకాలు ఒకటి కన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పరిశోధకులు. చలికాలం ముంచుకు వస్తున్నది. అప్పటికల్లా ఈ కొత్త రకాలు తలెత్తవచ్చు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద కొత్త కోవిడ్ కేసులు బాగా తరిగిన మాట వాస్తవమే. కానీ చైనా, యూరప్‌లలో అవి మళ్లీ తలెత్తుతున్నాయి. యూరప్‌లో వచ్చిన కేసులను బాగా పరిశీలించారు. అక్కడ రెండు రకాల వైరస్లు కనిపించాయి. అవి రెండూ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే బలం గలవని కూడా తెలిసింది. టీకా వేయించుకున్న వారికీ, అంతకుముందు వ్యాధి వచ్చి తగ్గిన వారికి కూడా ఈ కొత్త వైరస్ రకాల వల్ల వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అమెరికా లాంటి దేశాలలో ఎక్కువ వైరస్ రకాల మీద పనిచేయగల వ్యాక్సిన్లను ఇచ్చారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ ఎక్కడ వచ్చినా ప్రపంచమంతటా వ్యాపించడానికి అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ‘సైన్స్’ వ్యాసంలో వ్యాధి ముందుగా అమె రికా, యూరప్‌లలో కని పిస్తుంది అని వివరించారు. కరోనా వైరస్ కనిపించకుండా పోయింది, ఇక వచ్చే అవకాశం లేదు అని చాలామంది భ్రమలో ఉన్నారు. కానీ ఈ కొత్తరకం వైరస్లు త్వరలోనే ప్రపంచాన్ని మళ్లీ గడగడలాడించ నున్నాయని మరికొన్ని పత్రికలు కూడా రాశాయి. కొత్త వేవ్‌ను తట్టుకునేందుకు ఏం చేయాలనే సంగతులపైనా పరిశోధనలు మొదలయ్యాయి. ప్రస్తుతం బీఏ 2.75.2, బీక్యూ 2.1 అనే స్ట్రెయిన్లు కొత్తగా కనిపిస్తున్నాయి. మనిషిలోని రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే బలం ఈ రెంటిలోనూ ఇంతకు ముందు వచ్చిన అన్నిరకాల కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశోధకులు. ఇందులో బీక్యూ 2.1 రకం త్వరగా వ్యాపిస్తుంది కూడా! త్వరలోనే ఇది ప్రపంచమంతటా ఉత్పాతం కలిగిం చనుందనేది పరిశోధకుల అభి ప్రాయం. ఈ చలి కాలంలో వైరస్ గనుక వచ్చిందంటే దానితో పోరాడ డానికి అన్ని రకాలా మనం సిద్ధంగా ఉండాలి అని వారు హెచ్చ రిస్తున్నారు. వ్యాధి వచ్చినప్పుడు తొందరగా ఏదో చేయాలని టీకాలు వేశారు తప్పిస్తే, ఎక్కువ కాలం ఆ వ్యాక్సిన్లు పనిచేసే తీరును గురించి పరిశీలించడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆ దిశలోనూ శోధన జరగాలి. శాస్త్రవేత్తలు జనాన్ని భయపెట్టడం కోసం ఇటువంటి హెచ్చ రికలు చేయడం లేదు. రానున్న ముప్పు గురించి ముందుగానే జాగరూకులను చేయడం వారి విధి. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత. మన అజాగ్రత్త మరో మృత్యుహేలను సృష్టిస్తుందనేది అందరూ గుర్తించాలి. కేబీ గోపాలం వ్యాసకర్త అనువాదకుడు, రచయిత -
సేల్స్‌లో టాటా నెక్సాన్ అదరహో! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది
సాక్షి,ముంబై: ప్రముఖ వాహన తయారీ దారు టాటా మోటార్స్ టాటా నెక్సాన్ కొత్త వేరియంట్నులాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసిన కారు ధరను రూ. 11.37 లక్షలతో నిర్ణయించింది. ఇదీ చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్ టాటా మోటార్స్ పూణేలోని రంజన్‌గావ్ ఫ్యాక్టరీనుంచి కాంపాక్ట్ ఎస్‌యూవీల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. దీనికి గుర్తుగా దేశంలో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో, అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ ధర రూ. 11,37,900 (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ). ఇది చదవండి: Axis Bank: యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్ టాటా మోటార్స్ 3 లక్షల ఎస్‌యూవీల మైలురాయిని దాటిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నాలుగు లక్షల మార్క్‌ను టచ్ చేసింది. సెప్టెంబరు 2017లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. కేవలం ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో నాలుగు లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించడం విశేషం. 72 శాతం వృద్దితో కంపెనీ సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది నెక్సాన్. (యూట్యూబ్ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం) ఇంజన్, ఫీచర్లు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్. 1.5-లీటర్ రెవోటార్క్ టర్బో డీజిల్ ఇంజన్లను అందిస్తోంది. ఒక ఇంజన్ గరిష్టంగా 120 PS పవర్ అవుట్‌పుట్, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.. ఇక రెండోది 110 PS , 260 Nm లను విడుదల చేస్తుంది.వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో ఈ కారు లభ్యం. ఇంకా, కొత్త XZ+(L) వేరియంట్ నెక్సాన్ #డార్క్ ఎడిషన్‌లో కూడా లభ్యం. కాగా ప్రస్తుతం అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వాహనం టాటా టియాగో ఈవీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్ గుర్తింపు.. కలకలం
ఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. మరో కలకలం మొదలైంది. భారత్‌లోకి ప్రవేశించిన.. కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్ దేశరాజధానిలో అలజడి సృష్టిస్తోంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి వచ్చిన శాంపిల్స్‌లో ఈ సబ్‌వేరియెంట్ నమునాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ 2.75.. చాలా శాంపిల్స్‌లో గుర్తించినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు.. పాజిటివిటీ రేటు పెరిగిపోతున్న వేళ.. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్యా పెరుగుతోందని డాక్టర్ సురేష్ వెల్లడించారు. ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ ద్వారా సంక్రమించిన ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌ను లెక్కచేయకుండా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోందని వైద్యులు వెల్లడించారు. వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండే ఈ సబ్‌వేరియెంట్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయన్నారు. ఇక 90 శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధ్యయనాలు చేస్తున్నారు. యాంటీ బాడీలు ఉన్నవాళ్లతో పాటు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవాళ్లపైనా ఇది ప్రభావితం చూపిస్తోందని వైద్యులు తెలిపారు. అయితే తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. వయసుపైబడిన వాళ్లపై ఇది తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేలకు పైనే కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 15.41 శాతంగా ఉంది. ఏడుగురు కరోనాతో మరణించగా.. ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే. దీంతో కేంద్రం.. అప్రమత్తం అయ్యింది. ఇదీ చదవండి: చైనాలో కొత్త వైరస్.. ఆందోళన -
టాటా టియోగో కొత్త వెర్షన్ కమింగ్ సూన్, అందుబాటు ధరలో
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ టియాగో ఎన్ఆర్జీ మోడల్లో త్వరలోనే కొత్త వేరియంట్‌ను లాంచ్‌చేయనుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో టాటా మోటార్స్ హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌గా, అందుబాటులో ధరలో కొత్త ‘‘టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టి ట్రిమ్’’ టీజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన ధర ఫీచర్ల వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. టాటా మోటార్స్ పాపులర్ మోడల్ టియాగో కొనసాగింపుగా ఎక్స్జెడ్ ప్లస్ కాకుండా ఎక్స్‌టీ వేరియంట్‌గా ఉంటుందని కొత్త కారు ఉండనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత టియాగో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.అలాగే ధరకు తగ్గట్టుగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు ఆడియో సిస్టమ్, టాటా కనెక్ట్ నెక్స్ట్ యాప్, రియర్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్క్ అసిస్ట్‌లతో డిస్ప్లే, ఆటో డోర్ లాక్ ఫాలోమి లాంటి కొన్ని ఫీచర్లు కూడా మిస్ అవుతాయట. కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి వేరియంట్ ఫీచర్ల అంచనాలను పరిశీలిస్తే బ్లాక్-అవుట్ బి-పిల్లర్, వెనుక పార్శిల్ షెల్ఫ్, ప్యాసింజర్ వైపు వానిటీ మిర్రర్ , హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీటును అందించవచ్చు. అయితే ఇంజన్ లో ఎలాంటి లేకుండా 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజనే అమర్చింది. ఇది 86PS పవర్ , 113Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఏరియంట్లలో ఉంటుంది. టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ ధర దాదాపు రూ. 6.3 లక్షల నుండి రూ. 6.8 లక్షల వరకు ఉండవచ్చు. టియాగో ఎక్స్జెడ్ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్ ధర రూ. 6 లక్షలు, ఏఎంటీ వెర్షన్ ధర రూ. 6.55 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. Do you chase the XTraordinary? Get ready for a dose of XTra eNeRGy coming your way! Stay tuned!#Tiago #TiagoNRG #SeriouslyFun #LiveDifferent #TataMotorsPassengerVehicles #CarsDaily #Cargram #CarsOfInstagram #Hatchback pic.twitter.com/OmonEJMpAf — Tata Motors Cars (@TataMotors_Cars) July 31, 2022 -
కరోనా సరికొత్త వేరియెంట్.. సెంటారస్!.. మనదేశంలోనూ ఉందా?
ఒకప్పుడు బాగా సైన్స్ తెలిసిన వాళ్లకే కొన్ని గ్రీకు, రోమన్లాంటి పారిభాషిక పదాలు తెలిసేవి. కానీ కరోనా పుణ్యమా అని చాలా చాలా కొత్త కొత్త పేర్లు అందరికీ తెలిసి వస్తున్నాయి. ఆ కోవలో ఇప్పుడు సరికొత్తగా మరో పదం తెలిసివచ్చింది. దాని పేరే ‘సెంటారస్’. ఇది కూడా కరోనాకు చెందిన సరికొత్త వేరియెంట్. అయితే ఇది ఒమిక్రాన్ తాలూకు ఒక సబ్ వేరియెంట్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఒక వైరస్ తాలూకు వేరియెంట్‌కు మనుషులు నిరోధకత సాధించగానే... తన మనుగడ కోసం కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కోవిడ్‌కు సంబంధించి... ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి అనేక పేర్లు విన్నాం. ఆ తర్వాత వాటిల్లోనే డెల్టా, ఒమిక్రాన్ కలిసిపోయి... డెల్మిక్రాన్ వంటివీ, ఒమిక్రాన్ ఫ్లూతో కలవడంతో ఫ్లూరాన్ వంటి మరికొన్ని సబ్వేరియెంట్లూ పుట్టుకొచ్చాయి. ఇదే వరసతో కోవిడ్‌కు సంబంధించి ఇప్పుడు తాజాగా మరో సబ్–వేరియెంట్ ఆవిర్భవించింది. దాని పేరే ‘సెంటారస్’. ఈ పేరుకు ఇంకా కొన్ని ప్రాధాన్యాలున్నాయి. ‘సెంటారస్’ అనే పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా పెట్టలేదు. అయితే... మనకు (భూమికి) చాలా దూరంలో ఉన్న సెంటారస్ అనే గ్యాలక్సీ పేరు దీనికి పెట్టారనీ... గ్రీకు మైథాలజీ ప్రకారం సగం గుర్రం, సగం మానవ దేహం ఉన్న గ్యాలక్సీ పేరు దీనికి ఇచ్చారనీ... గుర్రం పరుగులా వేగంగా విస్తరించే స్వభావం ఉన్నందునే ఈ పేరు పెట్టారంటూ ‘గ్సేబియర్ ఆస్టేల్’ అనే కోవిడ్ పరిశీలకుడి మాట. అయితే ఇప్పటివరకైతే దాని తీవ్రత అంతగా కనిపించడం లేదు. తొలిసారిగా ‘నెదర్లాండ్’లో అవును ఉంది. సెంటారస్ (బీఏ 2.75) సబ్–వేరియెంట్‌ను ఈ ఏడాది మే నెలలోనే మన దేశంలోనూ ఉన్నట్లు గుర్తించారు. అయితే తొలిసారిగా దీన్ని ‘నెదర్లాండ్’లో కనుగొన్నారు. ఇప్పుడు ఈ వేరియెంట్ యూఎస్ఏ, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో సోకుతోంది. ఇప్పుడీ వేరియెంట్ పై దేశాలు కలుపుకుని దాదాపు పది దేశాల్లో విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంత తీవ్రమైనదేమీ కాదు... ఈ సెంటరాస్ వేరియెంట్ చాలా వేగంగా పాకుతుందంటూ కొంతమంది శాస్త్రవేత్తలు తొలుత ఆందోళన పడ్డారు. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన పడ్డట్టుగానీ ఇది కూడా అంత తీవ్రమైనది కాదని తొలి పరిశీలనల్లో తేలింది. పైగా ఇది ఒమిక్రాన్ తర్వాత వచ్చిన సబ్–వేరియెంట్ కావడం... కొత్త కొత్త వేరియెంట్లు వస్తున్నకొద్దీ వాటి తీవ్రత తగ్గుతూ పోతుండటం వల్ల... ఇది శాస్త్రవేత్తలు అంచనా వేసినంత తీవ్రంగా లేకపోవడం ఓ సానుకూల అంశం. జెనీవాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆంటోనీ ఫ్లాహాల్ట్ మాట్లాడుతూ... ‘‘ఇలా వేరియెంట్లు రూపు మార్చుకుంటున్న కొద్దీ ఈ కొత్త కొత్త స్ట్రెయిన్ల కారణంగా కరోనాలోని ఫలానా వేరియెంట్‌కు అంటూ నిర్దిష్టంగా వ్యాక్సిన్ కనుగొనడం కష్టమవుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. డచ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరో నిపుణుడు మాట్లాడుతూ ‘‘మనం సార్స్–సీవోవీ–2 కోసం రూపొందించిన వ్యాక్సిన్ కోటగోడను దాటుకుని ఇవి లోనికి ప్రవేశించగలవా లేదా అన్న అంశం ఇంకా తెలియద’’ని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియాకు చెందిన ప్రొఫెసర్ పాల్ హంటర్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ ఇది చాలా నెమ్మదిగానే ఉంది. పెద్దగా విధ్వంసకారిలా అనిపించడం లేదు’’ అని తెలిపారు. ఇంకా మనదేశానికి చెందిన ‘సార్స్–సీవోవీ–2’ జీనోమిక్ కన్సార్షియమ్ కో–ఛైర్ పర్సన్ డాక్టర్ ఎన్.కె. అరోరా మాట్లాడుతూ ‘‘ఇది మన దేశంలో కొత్తగా, అరకొరగా మరికొన్ని కేసులకు కారణమవుతున్నప్పటికీ, తీవ్రమైనదేమీ కాదు. దీనివల్ల కొత్తగా నాలుగో వేవ్ రాదు’’ అంటూ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే మన దేశవాసుల్లోని చాలామంది డబుల్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండటం, మరికొందరు బూస్టర్ డోసుకూడా తీసుకోవడం, మూడో వేవ్‌లో ఒమిక్రాన్ చాలామందికి స్వాభావికమైన నిరోధకత ఇచ్చి ఉండటంతో పాటు... తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో డోసు బూస్టర్‌ను కూడా ఉచితంగా ఇవ్వనుండటంతో ఇకపై ఈ వేరియెంట్ ఓ పెద్ద సమస్య కాబోదనేది చాలా మంది నిపుణుల భావన. -
దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా ఓమిక్రాన్ వైరస్ కొత్త ఉప–వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. దీనికి బీఏ.2.75 అని పేరు పెట్టారు. యూరప్–అమెరికాలో బీఏ.4 , బీఏ.5 కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. భారత్ వంటి దేశాల్లో బీఏ.2.75 అనే కొత్త సబ్–వేరియంట్ ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ వేరియంట్ తొలిసారిగా భారత్‌లో కనిపించిందని, తర్వాత మరో 10 దేశాల్లోనూ గుర్తించామని ఆయన వెల్లడించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. కాగా, గత 24 గంటల్లో భారత్‌లో 18,930 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో మరో 35 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 1,17,893కు పెరిగాయి. చదవండి: (10 నెలల చిన్నారికి ఉద్యోగమిచ్చిన రైల్వే) -
వేల సంఖ్యలో కోవిడ్ కేసులు.. మరో వేవ్‌కు సంకేతమా?
పారిస్: కరోనా పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. ప్రపంచాన్ని పట్టి కుదిపేసిన కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసిరేలా ఉంది. పలు దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఈ భయాలను మరింత పెంచుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో కోవిడ్ తీవ్ర రూపు దాల్చేలా ఉందని ఫ్రెంచ్ వ్యాక్సినేషన్ చీఫ్ అలేన్ ఫిష్చర్ అన్నారు. ఫ్రాన్స్-2 టెలివిజన్‌తో బుధవారం ఆయన మాట్లాడారు. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని, ఇది మరో వేవ్‌కు సంకేతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఇదేమాదిరిగా అధిక కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదని చెప్పారు. అయితే, కొత్త వేరియంట్లతో కూడిన తాజా వేవ్ తీవ్రత ఎలా ఉంటుందన్నదే అసలైన సవాల్ అని వ్యాఖ్యానించారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై పాక్ దిగ్గజ క్రికెటర్ భౌతిక దూరం పాటించడం, జనం గుంపులోకి వెళ్లినప్పుడు మాస్కు ధరించడం తప్పనిసరి అని సూచించారు. ఇతర యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా పోర్చుగల్‌లో రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వెలుగుచూశాయని తెలిపారు. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు తెలిపారు. అయితే, వ్యాప్తిలో వేగం ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పుకొచ్చారు. కాగా, మంగళవారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో 90 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీడెవడ్రా బాబు! ఇలా వెళ్తున్నాడు.. తేడా కొడ్తే అంతే సంగతులు -
గుజరాత్లో కొత్తవేరియెంట్ ఎక్స్ఈ కేసు గుర్తింపు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌లో అత్యంత వేగవంతంగా వ్యాపించే ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియెంట్ కేసు గుజరాత్లో నమోదు అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సైతం నిర్ధారించినట్లు తెలుస్తోంది. గుజరాత్లో మార్చి 13న కరోనా బారిన పడ్డ సదరు పేషెంట్.. వారం తర్వాత కోలుకున్నాడు. అయితే శాంపిల్ జీనోమ్ సీక్వెన్సింగ్‌లో సదరు పేషెంట్ ఎక్స్ఈ సబ్ వేరియెంట్ బారినపడినట్లు తెలుస్తోంది. అతని వివరాలు, ట్రావెల్ హిస్టరీ తదితర వివరాలను వెల్లడించేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో ముంబైలో తొలి ఎక్స్ఈ కేసు నమోదు అయ్యిందని అధికారుల ప్రకటన హడలెత్తించింది. అయితే కేంద్రం మాత్రం ఆ ప్రకటనను ఖండించింది. ఒమిక్రాన్‌లో బీఏ-2 అత్యంత వేగంగా వ్యాపించే వేరియెంట్‌గా గుర్తింపు ఉండేది. ఈ జనవరిలో యూకేలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్ఈను.. ఒమిక్రాన్ బీఏ-2 కన్నా పది రెట్లు వేగంగా వ్యాపించే వేరియెంట్‌గా గుర్తించారు. ఇది అంత ప్రమాదకరమైంది ఏం కాదని, కాకపోతే వేగంగా వ్యాపించే గుణం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరించారు. మరోవైపు దేశంలో 18 ఏళ్లు పైబడినవాళ్లకు మూడో డోసు(ప్రికాషన్) వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. -
కొత్త వేరియెంట్ XE కేసుపై సందిగ్ధం!
Mumbai XE Variant Case: ముంబై(మహారాష్ట్ర)లో ఒమిక్రాన్ మ్యూటేషన్ కొత్త వేరియెంట్ ఎక్స్ఈ(XE) కేసు వెలుగు చూసిందంటూ వార్తలు హోరెత్తిన విషయం తెలిసిందే. నెల కిందట సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్(50)కు చెందిన శాంపిల్స్‌లో వేరియెంట్ ఆనవాలు గుర్తించినట్లు బీఎంసీ(బృహణ్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్) బుధవారం ప్రకటించుకుంది. అయితే.. ఈ విషయంలో ముంబై అధికారులు తొందరపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. కరోనా వైరస్‌లో ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియెంట్‌ను వేగంగా వ్యాపించేదిగా గుర్తించారు వైద్యులు. ఒమిక్రాన్‌లో బీఏ.2 ఉపవేరియెంట్ వ్యాప్తి ఇంకా వేగంగా ఉండేదని అనుకున్నారు. అయితే ఇంతకంటే పది రెట్లు ఎక్స్ఈ వేరియెంట్ వ్యాపించే గుణం ఉందని, అయినా అంతప్రమాదకరమైంది కాదని, కేసులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా మాత్రం ఉండాలంటూ.. వైద్య నిపుణులు దానిని గుర్తించినప్పుడే హెచ్చరించారు. తాజాగా దేశంలోనే తొలి ఎక్స్ఈ కేసుగా బీఎంసీ ప్రకటించుకుంది. గ్లోబల్ జెనోమిక్ డాటా ప్రకారం.. అది ఎక్స్ఈ అని తేల్చేసింది కూడా. కానీ.. కేంద్ర ఆరోగ్య సంస్థ ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కాన్సోర్టియమ్ మాత్రం అది ఎక్స్ఈ కేసు కాదని కొట్టిపారేసింది. బీఎంసీ అభ్యర్థన నేపథ్యంలో.. మరో దఫా ఆ శాంపిల్స్‌ను పరిశీలించాలని భావిస్తోంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్‌కు శాంపిల్స్‌ను పంపించింది. ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఈలోపే ముంబైలో తొలి ‘ఎక్స్ఈ’ కేసు నమోదు అయ్యిందని ప్రకటించడాన్ని కేంద్ర ఆరోగ్య సంస్థలు తప్పుబడుతున్నాయి. అది ఎక్స్ఈ కేసుగా ఇంకా ధృవీకరణ కాలేదని కేంద్ర ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సూచనల మేరకు.. బీఎంసీ అధికారులు సైతం నివేదికలు వచ్చేదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ‘‘తొలుత మేం ఆ శాంపిల్‌ను ఎక్స్ఈ కేసుగానే భావించాం. కానీ, జీనోమిక్ పిక్చర్తో అది సరిపోలకపోవడంతో ఎందుకైనా మంచిదని మరోసారి టెస్టులకు పంపించాం’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు ఈ పాటికే దాని ప్రభావం చూపాల్సి ఉందని, ప్రస్తుతానికి భారత్‌లో ఎక్స్ఈ కేసులు నమోదు అయినట్లు తాము భావించడం లేదని ఆయన అంటున్నారు. యాభై ఏళ్ల వయసున్న సౌతాఫ్రికన్ మహిళ.. ఫిబ్రవరి 10వ తేదీన భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 27న ఆమెకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ఓ హోటల్ గదిలో క్వారంటైన్లో ఉంచారు. ఆపై శాంపిల్‌ను కస్తూర్బా ఆస్పత్రి లాబోరేటరీకి జీనోమ్సీక్వెన్సింగ్ కోసం పంపించారు. అందులో ఎక్స్ఈ వేరియెంట్‌గా నివేదిక రావడంతో ముంబై అధికారులు ప్రకటన చేశారు. విశేషం ఏంటంటే.. ఆమెకు స్వల్పలక్షణాలే ఉండగా.. మరోసారి టెస్ట్ నిర్వహించినప్పుడు నెగెటివ్‌గా తేలిందంట. ఆ తర్వాత మరోసారి టెస్టులు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఆమె.. ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఎక్స్ఈ వేరియెంట్.. ఒమిక్రాన్ స్ట్రెయిన్లు బీఏ.1, బీఏ.2ల మ్యూటెంట్ వేరియెంట్. జనవరి 19న ఈ ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియెంట్ తొలి కేసును యూకేలో గుర్తించారు. ప్రస్తుతం అక్కడ కరోనా విజృంభణకు కారణం.. ఇదే. సంబంధిత వార్త: కొత్త వేరియంట్ ఎక్స్ఈ.. లక్షణాలివే! -
కొత్త వేరియెంట్లు రావని అనుకోవడానికి లేదు
సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని దేశాల్లో కోవిడ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఐరోపా, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే అతి విశ్వాసాన్ని వీడాలి. మరో నెలరోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఇతర దేశాల్లోని పరిస్థితులను గమనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.కె. శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇతర దేశాల నుంచి ప్రమాదం పొంచే ఉంది ఒమిక్రాన్ వేరే దేశాల్లో ఇంకా పరిభ్రమిస్తోంది. రూపును మార్చుకుంటోంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కాకుండా ఎక్స్, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ అనే కొత్త వేరియెంట్లు అధిక ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అది కొత్తరూపంలో మళ్లీ మనదేశంలోకి ప్రవేశిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మనలో ఏర్పడిన రోగనిరోధక శక్తి మూడు, నాలుగు నెలల తర్వాత కూడా ఉంటుందా అన్నది తెలియదు. అంటే ఆ తర్వాత అధికశాతం మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు తగ్గాక కొత్త వేరియెంట్లు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటనేది చెప్పలేం. వైరస్ స్థిమితంగా ఉండటం లేదు ఇప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని కొందరు చెబుతున్నారు. గతంలోనూ థర్డ్‌వేవ్‌కు ఆస్కారం లేదని చెప్పారు. అయితే, ఒమిక్రాన్ వచ్చింది. అందువల్ల ఇక కొత్త వేరియెంట్లు రావనుకోవడానికి లేదు. ఒకవేళ మన దగ్గర 2, 3 నెలల్లోనే కొత్తవి వచ్చినా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏ వేరియెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేం. ఎందుకంటే వైరస్ ఇంకా పరిణామ దశలోనే ఉంది. అది ఇంకా పూర్తిగా స్థిమితంగా ఉండటం లేదు. వచ్చే వేరియెంట్లతో తీవ్రత పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. వైరస్ తీరు తేలేదాకా అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోవడమే మంచిది. 12 ఏళ్లలోపు వారికి పెద్దగా ప్రమాదం లేదు ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్ల లోపు వారికి తీవ్రమైన జబ్బు చేసే ఆస్కారం చాలా తక్కువగా ఉంది. అందువల్ల వారికి టీకాలు వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఆ వయసు వారికి కరోనా టీకాలు ఇవ్వడం వల్ల అంతకంటే ప్రమాదకర జబ్బులను ఎదుర్కునే శక్తిని తగ్గించినట్టు అవుతుందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇప్పటికైతే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టీకా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అన్ని వేరియెంట్లపై పనిచేసేలా టీకాలు ఏ వేరియెంట్‌పై అయినా ప్రభావవంతంగా పనిచేసే టీకా తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే కేవలం టీకాపైనే ఆధారపడకుండా మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలను కొనసాగించాలి. ఇదివరకు జపాన్, దక్షిణ కొరియాల్లో ఎవరికైనా జలుబు చేస్తే మాస్క్‌లు వేసుకుని వెళ్లే వాళ్లు. అలాంటి అలవాట్లను మనం కూడా అలవరచుకోవాలి. వారికి బూస్టర్ డోస్‌లు మంచిది 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్‌లు ఇవ్వడం మంచిదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక జబ్బులున్న వారికి బూస్టర్‌డోస్‌లు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఈ కేటగిరిలోని వారు సులభంగా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. -
యుద్ధం, కోవిడ్–19పై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ అంశాలపై అధికంగా ఆధారపడనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అధిక శాతం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశమున్నట్లు అత్యధికులు అంచనా వేశారు. దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడం దీనికి కారణంకాగా.. రష్యా– ఉక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న యుద్ధం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క ఇటీవల చైనాలో తలెత్తిన కోవిడ్–19 కొత్త వేరియంట్ కొన్ని యూరోపియన్ దేశాలకూ విస్తరించనున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయవచ్చని తెలియజేశారు. ఈ నెల 14న ప్రారంభమైన బడ్డెట్ రెండో దశ చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ గత కొద్ది రోజులుగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపనున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం మార్కెట్లు ర్యాలీ బాటలో సాగవచ్చని చెబుతున్నారు. దేశీయంగా ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ సంకేతాలే మార్కెట్లను నడిపించవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరోనా పరిస్థితులు, చమురు ధరల కదలికలు వంటివి కీలకమని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితులు ముదరడం, కోవిడ్–19 సవాళ్లు పెరగడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చని తెలియజేశారు. చమురు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నెల మొదటి వారంలో 130 డాలర్లను అధిగమించి 2008 తదుపరి గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. 75.5–76 స్థాయిలో కదులుతోంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను దేశీ ఇండెక్సులు అనుసరించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. దేశీ ఆర్థిక పరిస్థితులను చమురు ధరలు ప్రభావితం చేయగలవని, దీంతో వీటి కదలికలను ఇన్వెస్టర్లు సునిశితంగా పరిశీలించే వీలున్నదని వివరించారు. భారత్ భేష్ వర్థమాన మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ చేశాయని, దీంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లవైపు దృష్టిపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లు మరింత పురోగమించేందుకు దారిచూపవచ్చని విశ్లేషించారు. అంతేకాకుండా మార్కెట్లు ఇప్పటికే యుద్ధ భయాలను డిస్కౌంట్ చేశాయన్నారు.. కాగా.. సమీపకాలంలో దేశీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చన్నది కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఈక్విటీ హెడ్ హేమంత్ అంచనా. గత వారం స్పీడ్ గత శుకవ్రారం(18న) హోలీ సందర్భంగా సెలవుకావడంతో 17తో ముగిసిన వారంలో దేశీ స్టాక్ మార్కెట్లు 4 శాతం జంప్‌చేశాయి. సెన్సెక్స్ 2,314 పాయింట్లు దూసుకెళ్లి 57,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 657 పాయింట్లు జంప్‌చేసి 17,287 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 2 శాతంపైగా ఎగశాయి. -
ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం
కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బుధవారం ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్ష చేయగా కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక, ఈ రెండు స్ట్రెయిన్లు కలిగిన కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాల్లు ఉన్నట్లు తెలిపింది. రెండు వేరియంట్ల కరోనా గురించి తెలుసని, ఈ కొత్త వేరియంట్ వల్ల ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ పాండమిక్ రెస్పాన్స్ చీఫ్ సల్మాన్ జర్కా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వ్యాప్తి, కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందడం లేదని తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక చికిత్స కూడా అవసరం లేదని ఆయన అభిప్రాపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్‌లోని సుమారు 92 లక్షల మంది ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడు డోసులు పొందినట్లు సల్మాన్ జర్కా వెల్లడించారు. -
మళ్లీ విజృంభిస్తున్న కరోనా!... 79 కొత్త కోవిడ్ కేసులు
పుణె: మహారాష్టలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పుణెలో 79 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఎటువంటి మరణాలు సంభవించ లేదని తెలిపింది. అసలు ఇప్పటి వరకు పుణెలో సుమారు 1.45 మిలియన్ల మంది కరోనా సోకింది. అందులో దాదాపు 1.43 మిలియన్ల మంది కోలుకోగా..20,509 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు కొత్త కరోనాకి సంబంధించి పుణె రూరల్‌లో 54, పూణె నగరంలో 23, పింప్రి-చించ్వాడ్లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కొత్త కరోనాకి సంబంధించిన కేసుల సంఖ్య 425,256కి చేరుకుంది. అయితే పుణె రూరల్‌లో మరణాల సంఖ్య 7,143 , పుణె నగరంలో 9,427 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 17.46 మిలయన్ డోస్‌ల వ్యాకిన్లు వేశారు. అందులో 9.52 మిలియన్లు మొదటి డోస్‌లు, 7.68 మిలియన్లు రెండవ డోస్‌లు, 2,48,055 మందికి ముందు జాగ్రత్త డోస్‌లు వేశారు. (చదవండి: Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన) -
బెస్ట్ సెల్లింగ్ కార్.. 5 లక్షల కంటే తక్కువ ధరలోనే రెనాల్ట్ క్విడ్
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లకు భారీ ఆదరణ నెలకొంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా సరికొత్తగా రెనాల్ట్ క్విడ్ MY22 ఆర్ఎక్స్(ఓ)కారును లాంచ్ చేసింది. రెనాల్ట్ క్విడ్‌ను కంపెనీ 2015లో ప్రారంభించగా ఇప్పటివరకు 4 లక్షలకు పైగా క్విడ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. క్విడ్ అమ్మకాలను మరింత పెంచేందుగాను రెనాల్ట్ ఇండియా సరికొత్త MY22 రెనాల్ట్ క్విడ్‌ను RXL(O) వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఈ కారు 1.0L MT, 0.8L రెండు ఎంపికలలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. డిజైన్‌లో సరికొత్తగా..! క్విడ్ క్లైంబర్ ఎడిషన్ కొత్త ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కలర్‌తో స్పోర్టీ వైట్ యాక్సెంట్లను కలిగి ఉంది. 8 అంగుళాల టచ్‌స్క్రీన్ MediaNAV ఎవల్యూషన్‌తో ఇన్ఫోటైన్మెంట్ రానుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వీడియో ప్లేబ్యాక్, వాయిస్ రికగ్నిషన్‌కు సపోర్ట్ చేయనుంది. ఈ కారుకు సిల్వర్ స్ట్రీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో మరింత ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటుగా రివర్స్ పార్కింగ్ కెమెరా , ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఓఆర్వీఎమ్ ఉన్నాయి. ధర ఎంతంటే..! 2022 రెనాల్ట్ క్విడ్ లాంచ్ ధర రూ. 4.49 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) ఉంది. డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్‌తో మెటల్ మస్టర్డ్ , ఐస్ కూల్ వైట్, మోనోటోన్ మూన్లైట్ సిల్వర్, జన్స్కార్ బ్లూ కలర్ ఆప్షన్లలో 2022 MY22 రెనాల్ట్ క్విడ్ అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! కొత్త క్విడ్‌లో ఎలాంటి మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. రెండు పెట్రోల్ ఇంజన్ల ఎంపికతో అందుబాటులో ఉండనుంది. 0.8-లీటర్ ఇంజన్ క్విడ్ 53 బిహెచ్పి, 72 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మరొక వేరియంట్ 1.0-లీటర్ ఇంజన్67 బీహెచ్పీ, 91 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. చదవండి: మహీంద్రా థార్‌కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..! -
కొత్త వేరియంట్ కలకలం.. చైనాలో లాక్డౌన్.. టెన్షన్లో ప్రపంచ దేశాలు..!
బీజింగ్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న సంతోషంతో ఉన్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్డౌన్ విధించారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని టెక్ హబ్‌గా పిలువబడే షెన్జెన్లో ఒకే రోజు 66 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. షెన్జెన్లో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా హువావే, టెన్ సెంట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్‌జెన్‌లోనే ఉన్నాయి. షెన్జెన్ నగరం హంకాంగ్‌తో సరిహద్దును కలిగి ఉంది. ఇదిలా ఉండగా.. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్ చున్‌లో శుక్రవారం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. షాన్ డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజింగ్‌లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్నినిషేధించారు. దీంతో చైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. -
Coronavirus: జూన్‌లో నాలుగో వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ సుమారుగా జూన్ 22న ప్రారంభమై ఆగస్ట్ చివరికల్లా తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వేవ్ నాలుగు నెలలపాటు ఉండేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకనుబట్టి నాలుగో వేవ్ తీవ్రత ఉంటుందని కాన్పూర్ ఐఐటీ మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌కు చెందిన శబరప్రసాద్ రాజేశ్ భాయ్, సుభ్ర శంకర్ ధార్, శలభ్ తమ పరిశోధన పత్రంలో తెలిపారు. నాలుగో వేవ్ జూన్ 22న మొదలై ఆగస్ట్ 23 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుని, అక్టోబర్ 24వ తేదీ నాటికి ఆగిపోతుందని వెల్లడించారు. అయితే, కొత్త వేరియంట్‌ను బట్టే తమ విశ్లేషణ పూర్తిగా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త కేసులు 8,013 దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 10వేల లోపునకు పడిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4,29,24,130కి చేరినట్లు వెల్లడించింది. అదేసమయంలో, మరో 119 మంది కరోనా బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,13,843కు పెరిగాయని తెలిపింది. -
Corona Latest Updates: కరోనాపై గుడ్ న్యూస్
-
తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. ఆంక్షలు సడలింపు
భారత్‌లో కరోనా మహమ్మారి దాదాపు నాలుగు వారాల నుంచి స్థిరమైన క్షీణతను చూపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి బుధవారం జనవరి 21 నుంచి కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందంటూ అన్నిరాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు, నిర్వాహకులకు పంపిన లేఖలో వెల్లడించారు. అంతేకాదు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లావాదేవీలకు అవాంతరం కలగకుండా రాష్ట్రాల సరిహద్దుల వద్ద అదనపు ఆంక్షలను తొలగించమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో కరోనా మహమ్మారి ఎపిడెమియాలజీ మారుతున్నందున, కొత్త కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు సమీకరించి నవీకరించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తదనుగుణంగా ఫిబ్రవరి 10న అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను సవరించిందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడూ కేసుల ఉధృతి, తగ్గుదలను పర్యవేక్షించాల్సిందేనని లేఖలో నొక్కి చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, కొత్త కేసులు, సానుకూలత రేటును పరిగణనలోకి తీసుకుని కోవిడ్-19 పరిమితులను సడలించమని కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిందన్నారు. గత వారంలో సగటు రోజువారీ కేసులు 50,476 కాగా, 24 గంటల్లో 27,409 కొత్త కేసులు నమోదయ్యాయని, రోజువారీ కేసు సానుకూలత రేటు బుధవారం 3.63 శాతానికి తగ్గిందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. (చదవండి: భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!) -
మాస్కులు త్వరలో పోతాయి
వాషింగ్టన్: అమెరికన్లు మాస్కు ధరించాల్సిన అవసరం లేని రోజులు త్వరలో వస్తాయని ఆ దేశ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి జోస్యం చెప్పారు. అది రెండు నెలల్లో, ఆర్నెల్లలో, లేదా ఓ ఏడాదిలో కావచ్చన్నారు. అలాగని వ్యక్తిగత జాగ్రత్తలను పక్కన పెట్టడం అంత మంచిది కూడా కాదని ఆయన హెచ్చరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కరోనా వంటి పెను మహమ్మారి రాత్రికి రాత్రే మాయమైపోదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. పాత, లేదా కొత్త వేరియంట్లు మళ్లీ తెరపైకి రావచ్చు. కానీ దానికి భయపడకుండా మళ్లీ స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కరోనాపై పోరాడేందుకు ఏడాదిగా మనం తయారు చేసుకున్న నాణ్యతతో కూడిన వ్యాక్సిన్లు, బూస్టర్లు అందరికీ సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉండాలి. అప్పుడు కరోనా మరణాలను దాదాపుగా తగ్గించుకోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. యువతపై ప్రభావం యువత మానసిక ఆరోగ్యంపై కరోనా చాలా ప్రభావం చూపుతోందని భారత సంతతికి చెందిన మూర్తి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయమిది. మానసిక ఆరోగ్య నిపుణుల సాయంతో వారికి దన్నుగా నిలవడం చాలా అవసరం’’ అన్నారు. కరోనా తెరపైకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికాలో నల్ల జాతీయులకు, లాటిన్, నేటివ్ అమెరికన్లకు వ్యాక్సిన్ల లభ్యత అంతగా ఉండేది కాదన్నారు. తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పారు. -
మరో బాంబు పేల్చిన చైనా.. ఆ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి
Wuhan Scientists Warn, New Corona NeoCov Found in South Africa: కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్లతో సతమతమై ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ చైనా మరో బాంబ్ పేల్చింది. కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలే ఈ కొత్త మహమ్మారి గురించి వార్నింగ్ బెల్స్ మోగించారు. కొత్తరకం కరోనా వైరస్ నియోకోవ్తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇది అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాలు రేటు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టుల వార్నింగ్ ఇచ్చారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2012-15 పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్సికోవ్కు నియోకోవ్‌కు సంబంధం ఉందని వెల్లడించారు. నియోకోవ్‌ను తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని ఇప్పటివరకు మనుషులకు సోకలేదని వివరించారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వ్యూహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో నిర్ధారణ అయింది. సార్స్కో-2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌తో కలిసి వ్యూహాన్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం బయో ఆర్షయోలో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్ రివ్యూ చేయలేదు. చదవండి: (తరోన్‌ను భారత ఆర్మీకి అప్పగించిన చైనా ఆర్మీ) -
పారాసెటమాల్ 650 ఎంజీ చాలు.. అనవసర మందులు వాడొద్దు
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సలో పారాసెటమాల్ 650 ఎంజీ వాడితే చాలని, అనవసర మందులు వాడొద్దని రాష్ట్ర కరోనా నిపుణుల కమిటీ సభ్యుడు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎ. ప్రేమ్‌కుమార్ తెలిపారు. అనేక దేశాలు, డబ్ల్యూహెచ్‌వో దీనినే నిర్ధారించాయని చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స తదితర అంశాలపై డాక్టర్ ప్రేమ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఒమిక్రాన్ బారిన పడిన వారు పారాసెటమాల్ మూడు పూటలా మూడు నుంచి ఐదు రోజులు వేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని తేమ ఆవిరి రూపంలో చర్మం నుంచి బయటికి వెళ్తుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకుండా రోజుకు 2.5 లీటర్లకు తగ్గకుండా నీళ్లు, మజ్జిగ, పళ్ల రసాలు తీసుకోవాలి. కొందరిలో ఐదు రోజుల తర్వాత దగ్గు ఉంటుంది. తీవ్రమైన దగ్గుతో బాధపడే వారు బుడెసోనైడ్ ఇన్హేలర్ను 800 మైక్రో గ్రామ్స్ ఉదయం, రాత్రి 5 రోజులు పీల్చాలి. ఇప్పటికీ కొందరు విచ్చలవిడిగా ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింకోవిట్, స్టెరాయిడ్స్ వంటివి సూచిస్తున్నారు. అవేమీ అవసరం లేదు. ఒమిక్రాన్ చికిత్సలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ కూడా పనిచేయదు. హోమ్ ఐసోలేషన్ ప్రధానం సామాజిక వ్యాప్తి దశకు ఒమిక్రాన్ చేరుకుంది. వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందువల్ల హోమ్ ఐసోలేషన్ ముఖ్యం. పాజిటివ్ అయిన వారు వారం రోజులు ఇంట్లోనే ఉండాలి. రోగికి ఇంట్లో ఇతరులు ఎదురుపడాల్సి వస్తే ఇరువురు ఎన్–95 మాస్క్ లేదా డబుల్ సర్జికల్ మాస్క్ వేసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు మూడు రోజులు దాటి తీవ్రంగా ఉన్నా, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, కళ్లు తిరిగిపడటం, మగత వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. ఒకే ప్రభావం ఉండదు ఒమిక్రాన్ సోకిన చాలా మందిలో ఒకే లక్షణాలు ఉంటున్నాయి. ప్రభావం మాత్రం అందరిపైనా ఒకేలా లేదు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కీళ్ల నొప్పులు, ఇతర రోగాలకు స్టెరాయిడ్స్ వాడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరిపై ప్రభావం ఎక్కువే. యువత, ఆరోగ్యవంతుల్లో ఏమీ కాదన్న ధీమా ఎక్కువగా ఉంది. వీరికి ఏమీ అవ్వకపోవచ్చు. జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరిగితే ఇళ్లలో, చుట్టుపక్కల ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీరి ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలి. -
కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు చేపట్టేందుకు, రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల అమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆక్సిజన్, పరికరాలు అందుబాటులో ఉంచడం, హోం ఐసొలేషన్ కిట్లు సరఫరా, ఫీవర్ సర్వే, అత్యవసర మందులు తదితర అంశాలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారులతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఐఏఎస్ అధికారులు, వారి బాధ్యతలు ► ఎం.టి.కృష్ణబాబు: కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన ఆహారం సరఫరా, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు ► ఎం.రవిచంద్ర: జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, కోవిడ్ కేర్ సెంటర్లలో శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, కోవిడ్ కేసుల రోజువారీ సమాచారం, ప్రజల్లో చైతన్యం కలిగించడం, సహాయ చర్యల్లో జాయింట్ కలెక్టర్లు, ఎన్జీవోలు, యునిసెఫ్‌తో సమన్వయం ► ఎ.బాబు: రాష్ట్ర, జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లు సమర్ధంగా పనిచేసేలా చూడటం, హెల్ప్ డెస్క్, సీసీ టీవీ వ్యవస్థల పర్యవేక్షణ ► వి.వినయ్‌చంద్: ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు, ల్యాబ్ మేనేజ్మెంట్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంబులెన్స్‌ల పర్యవేక్షణ ► మురళీధర్ రెడ్డి: కోవిడ్ మందులు, పరికరాల కొనుగోలు, ఆక్సిజన్ లైన్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లు సక్రమంగా పనిచేసేలా చూడటం, శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచడం ► జె.సుబ్రహ్మణ్యం: కోవిడ్ కేసుల వివరాల సేకరణ, విశ్లేషణ, నివేదికలు రూపొందించడం, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరగకుండా రోజూ కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సమర్ధవంతమైన చర్యలు చేపట్టడం ► ఐఏఎస్‌లు జి.సృజన, షాన్మోహన్, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి: మెడికల్ ఆక్సిజన్ సరఫ రా,పరిశ్రమల యూనిట్లు, రైల్వేతో సమన్వ యం, ఎల్ఎంఓ కేటాయింపు, ఉత్పత్తి బాధ్యత ► వి.వినోద్‌కుమార్: క్లినికల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్, క్లినికల్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్, వెంటిలేటర్ల సరఫరా, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచడం ► రవి శంకర్: అత్యవసర మందులు అందుబాటులో ఉంచడం, మందుల ధరల నియంత్రణ ► జి.ఎస్. నవీన్‌కుమార్: ఫీవర్ సర్వే పర్యవేక్షణ, హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం -
దేశంలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్
-
ఎకానమీ స్పీడ్ 5 శాతం దాటకపోవచ్చు
ముంబై: ఎకానమీపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8–5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. కాగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఇక్రా స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021–22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.5 నుంచి 10 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. ఏజెన్సీ చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపిన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మూడవ వేవ్ ఇప్పుడే ప్రారంభమైనందున, ఈ అంశంపై తక్షణం ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ముందస్తు సూచనలు, కొత్త అంటువ్యాధి విస్తరణ విశ్లేషణల ఆధారంగా మున్ముందు పరిస్థితిని అంచనావేయవచ్చు. మొబిలిటీ ఆంక్షల వల్ల ముఖ్యంగా కాంటాక్ట్ ప్రాతిపదికన ఉపాధి రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే వీలుంది. ► ఇప్పటికి 2021–22లో 9 శాతం వృద్ధి అంచనాలనే కొనసాగిస్తున్నాం. మూడవ వేవ్ ప్రభావంపై డేటా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డిసెంబర్లో ప్రభుత్వ వ్యయాల గణాంకాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. ► కేంద్రం గత నెల్లో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు ఎంత మేర పెరిగితే అంతమేర మూడవవేవ్ ప్రభావం తగ్గుతుంది. దీనికితోడు మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వాలు, కుటుంబాల సంసిద్ధత, ఆరోగ్య వ్యవస్థ పటిష్టత వంటి అంశాలూ ఇక్కడ కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇంకా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ► సరఫరాల కొరత తగ్గడం, పండుగల సీజన్ వంటి అంశాల నేపథ్యంలో మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 6 నుంచి 6.5 శ్రేణిలో కొనసాగిస్తున్నాం. ► ఇటీవలి కోవిడ్–19 కేసుల పెరుగుదల, అనిశ్చితికి దారితీసే అంశాల నేపథ్యంలో ‘ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన సరళతర విధానాన్ని ఇప్పుడే విడనాడకపోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే వరుస 10వ ద్వైమాసిక సమావేశాల్లోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే వీలుంది. -
ఆకర్షణీయమైన లుక్స్‌తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఆకర్షనీయమైన లుక్స్‌తో సరికొత్త మారుతి సుజుకీ బాలెనో ఫేస్‌లిఫ్ట్ 2022 ఎడిషన్ కారును త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ కారును వచ్చే నెల ఫిబ్రవరిలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలెనోతోపాటుగా మారుతి సుజుకీ సెలెరియో సీఎన్జీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుంది. న్యూ లుక్స్‌తో..! మారుతి సుజుకీ బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌లో మెకానికల్ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని సమాచారం. అయితే డిజైన్, ఇంటిరీయర్స్ విషయంలో సరికొత్త మార్పులను జతచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి సుజుకీ బాలెనో ఫేస్‌లిఫ్ట్ 2022 ఎడిషన్‌లో భాగంగా ... భారీ గ్రిల్, న్యూ రాప్అరౌండ్ హెడ్‌ల్యాంప్స్, న్యూ ఎల్ ఈడీ డీఆర్ఎల్ సిగ్నేచర్స్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్, రియర్ సైడ్ రీడిజైన్ట్ టెయిల్ ల్యాంప్స్, న్యూ బంపర్, రివైజ్డ్ డిజైన్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లతో రానుంది. న్యూ బాలెనో 2022 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది. చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..! -
వృద్ధి రేటులో 0.3 శాతం ‘ఒమిక్రాన్’పాలు!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పతి (జీడీపీ) విలువలో కొంత మొత్తం ఒమిక్రాన్ వల్ల హరించుకుపోనుందని విశ్లేషించింది. వృద్ధి రేటులో 0.2– 0.3 శాతం శ్రేణి మేర కోతపడే అవకాశం ఉందని పేర్కొంది. క్యూ4లో 6.1 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నది తమ తొలి అంచనాకాగా, ఇది 5.9–5.8 శాతం శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వెల్లడైన గణాంకాల ప్రకారం క్యూ1, క్యూ2ల్లో జీడీపీ వృద్ధి రేటు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయ్యాయి. తాజా నివేదికలో బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్ని... ► రాష్ట్రాలు కోవిడ్–సంబంధిత ఆంక్షలు విధించడంతో (ప్రజల రాకపోకలపై రాత్రిపూట కర్ఫ్యూ, 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, వివిధ రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు పనిచేయడం) 2021–22 క్యూ4లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ► ప్రస్తుత తరుణంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనికితోడు గ్లోబల్ రికవరీ మందగించడం వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే వీలుంది. ► కోవిడ్ మహమ్మారికి సంబంధించి మునుపటి వేవ్‌ల అనుభవాలను బట్టిచూస్తే, కోవిడ్ కేసులు పెరిగేకొద్దీ కదలికలపై (మొబిలిటీ) పరిమితులు మొదలవుతాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ► భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 60 శాతం కొత్త వేరియంట్‌కు సంబంధించినవిగా ఉంటున్నాయి. ► నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య సోమవారంనాటికి (3వ తేదీ) 1,700గా ఉంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను తనిఖీ చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ పరీక్షా సౌకర్యాలు ఉన్నందున ఒమిక్రాన్ కేసుల వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని మీడియా నివేదికలు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులను 18,000గా అంచనా వేస్తుండడం గమనార్హం. ► ఒమిక్రాన్ భయాందోళనలు ఉన్నప్పటికీ, డాలర్ మారకంలో రూపాయి విలువ 74–76 శ్రేణిలో ఉండే వీలుంది. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకునే వీలుంది. ► తాజా వేరియంట్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడం వల్ల ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరికొంత కాలం సరళతరం రీతిలోనే కొనసాగించే వీలుంది. అలాగే బ్యాంకుల్లో అదనపు దవ్య లభ్యతను వెనక్కు తీసుకునే చర్యలనూ తక్షణం తీసుకోకపోవచ్చు. దీనిప్రకారం ఫిబ్రవరిలో ఆశించిన రివర్స్ రెపో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంపు ఉండకపోవచ్చు. తగిన ద్రవ్య లభ్యత, ఈల్డ్స్ కట్టడి వంటి అంశాలపై ఆర్బీఐ దృష్టి సారించే వీలుంది. ద్రవ్యల్బణం కట్టడి, వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును 4శాతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
కరోనా కొత్త వేరియంట్ కలకలం
-
ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్!
న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఒమిక్రాన్ వేగానికి భయపడుతున్న తరుణంలో కరోనా మరో వేరియంట్ బయటపడింది. ఒమిక్రాన్ కన్నా అధిక మ్యుటేషన్లతో కూడిన కొత్త వేరియంట్‌ను ఫ్రాన్స్‌లో కనుగొన్నారు. ఈ నూతన వేరియంట్‌తో 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇన్స్టిట్యూట్ ఐహెచ్‌యూ మెడిటరేరియన్ ఇన్ఫెక్షన్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి తాత్కాలికంగా ఐహెచ్‌యూ (బీ. 1. 640.2) అని పేరుపెట్టారు. ఆఫ్రికాకు చెందిన కామెరూన్ నుంచి వచ్చిన వారివల్ల కొత్త వేరియంట్ వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రవర్తనపై ఎలాంటి అంచనాలు లేవని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే దీనిపై ఒక అవగాహనకు రావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిపై జరిపిన అధ్యయన వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. ఈ వేరియంట్లో 46 మ్యుటేషన్లు జరిగాయని వీటిలో 37 డిలీషన్లు(మ్యుటేషన్లలో ఒకరకం) ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. ఈ వేరియంట్లో కొత్తగా 30 అమీనో ఆమ్లాల మార్పులు జరగగా, 12 అమీనో ఆమ్లాల డిలీషన్ జరిగిందని తెలిపింది. అమీనో ఆమ్లాల మార్పుల్లో 14, డిలీషన్లలో తొమ్మిది స్పైక్ ప్రొటీన్‌లో జరగడం గమనార్హం. మానవ కణాల్లోకి కరోనా చొచ్చుకుపోవడంలో ఈ స్పైక్ ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో జరిగే మ్యుటేషన్లుతో వేరియంట్ వేగంగా వ్యాపించే వీలు కలుగుతుంది. కరోనా టీకాలు ఈ స్పైక్ ప్రొటీన్‌పై పనిచేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. వ్యాప్తి ఆరంభం కాలేదు ఐహెచ్‌యూ వేరియంట్‌ను ఇంకా ఇతర దేశాల్లో గుర్తించలేదు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూహెచ్ఓ) ఇంతవరకు దీన్ని వీయూఐ (పరిశీలనలో ఉన్న వేరియంట్– వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్)గా ప్రకటించలేదు. వేరియంట్ తీవ్రతను గుర్తించి ప్రకటించడం, దానికి పేరు పెట్టడం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తుంది. గతేడాది నవంబర్‌లో జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఒకదానిలో ఈ వేరియంట్‌ను తొలిసారి గుర్తించామని పరిశోధకులు తెలిపారు. అప్పటి నుంచి దీనిపై పరిశీలనలు జరిపి నూతన వేరియంట్‌గా నిర్ధారించామన్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకువస్తూనే ఉంటాయని, అలా వచ్చే అన్ని వేరియంట్లూ ప్రమాదకరమైనవని చెప్పలేమని ప్రముఖ వైద్యనిపుణులు ఎరిక్ ఫిగ్డింగ్ అభిప్రాయపడ్డారు. ఒక వేరియంట్ ఎత ప్రమాదకరమనే విషయాన్ని, అది ఎంత ఎక్కువ బలంగా వ్యాపించగలదనే అంశమే నిర్ణయిస్తుందన్నారు. ఒక వేరియంట్ వేగంగా, భారీగా వ్యాపిస్తుంటే అప్పుడే దాన్ని వీఓసీ(వేరియంట్ ఆఫ్ కన్సెర్న్– ఆందోళన కలిగించే వేరియంట్)గా నిర్ణయిస్తారన్నారు. ప్రస్తుత వేరియంట్ ఏ కేటగిరీలోకి వస్తుందో వేచిచూడాల్సిఉందన్నారు. అదేవిధంగా టీకాలు ఈ వేరియంట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయమై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని నిపుణులు తెలిపారు. ఒకపక్క ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి కొనసాగుతున్న వేళ మరో వేరియంట్ బయటపడడంపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. భయపెట్టే ఆ రెండు మ్యుటేషన్లు ఐహెచ్‌యూ వేరియంట్లో దాదాపు 46 మ్యుటేషన్లు (ఉత్పరివర్తనాలు) గుర్తించారు. ఒమిక్రాన్‌లో 37 మ్యుటేషన్లే ఉన్నాయి. ఐహెచ్‌యూ స్పైక్ ప్రొటీన్‌లో గమనించిన మ్యుటేషన్లలో రెండు మ్యుటేషన్లు పరిశోధకులను భయపెడుతున్నాయి. కొత్త వేరియంట్ టీకాలను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఉ484 ఓ మ్యుటేషన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా తొందరగా వ్యాపించేందుకు N501 ్గ మ్యుటేషన్ దోహదం చేస్తుంది. ఈ రెండు మ్యుటేషన్లు గత వేరియంట్లలో ఉన్నాయి. ఇవి ప్రస్తుత ఐహెచ్‌యూ వేరియంట్లో ఉన్నట్లు పరిశోధన వెల్లడిస్తోంది. ఈ వేరియంట్‌పై డబ్ల్యూహెచ్ఓ స్పందించాల్సిఉంది. చదవండి: కరోనా కల్లోలం: భారత్‌లో పెరుగుతున్న కేసులు -
సరికొత్త లుక్స్‌తో యమహా నయా బైక్..! ధర ఎంతంటే..?
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్స్ భారత మార్కెట్లలోకి అప్డేట్డ్ వెర్షన్ ఎఫ్‌జెడ్ మోడల్ బైక్‌ను లాంచ్ చేసింది. యమహా FZS-Fi Dlx అనే కొత్త వేరియంట్‌తో పాటుగా FZS-Fi మోడల్ శ్రేణిని విడుదల చేస్తున్నట్లు కంపెనీ సోమవారం రోజున ప్రకటించింది. ఈ సిరీస్ బైక్స్ ఈ నెల రెండో వారం నుంచి అన్నీ యమహా డీలర్షిప్ సెంటర్లలో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ధర ఎంతంటే..? యమహా FZS-Fi ధర రూ. 1, 15,900 కాగా, యమహా FZS-Fi Dlx ట్రిమ్ ధర రూ. 1,18,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' చొరవలో భాగంగా కొత్త FZS-Fi శ్రేణి బైక్‌ను ప్రవేశపెట్టినట్లు యమహా పేర్కొంది. స్టైలింగ్ విషయానికి వస్తే..! కొత్త యమహా ఎఫ్జెడ్ఎస్ శ్రేణిలో ఈ బైక్స్ క్రేజీ లుక్స్‌తో బైక్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేస్తోంది. కొత్త FZS-Fi మోడల్ రిఫ్రెష్ స్టైలింగ్‌తో పాటుగా అప్డేట్ ఫీచర్స్‌తో రానుంది. రెండు కొత్త యమహా FZS-Fi మోడల్స్‌లో బ్లూటూత్ ఫీచర్ కానెక్ట్ ఎక్స్ యాప్‌తో పనిచేయనుంది FZS-Fi Dlx వేరియంట్లో ఎల్ఈడీ ఫ్లాషర్స్ జోడింపుతో పాటు ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఇతర ఫీచర్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ బైక్స్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ డీప్ రెడ్, సాలిడ్ గ్రే అనే మూడు రంగుల ఎంపికలలో రానుంది. కలర్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్స్‌తో రెండో-స్థాయి సింగిల్ సీటును కూడా పొందుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే కొత్త యమహా FZS-Fi బైక్ అదే బ్లూ కోర్ టెక్నాలజీ 149సీసీ ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్ 7,250 ఆర్పీఎమ్ వద్ద 12.4 పీఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 5500 ఆర్పీఎమ్ వద్ద 13.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. చదవండి: రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు -
తెలంగాణ పై పడగవిప్పిన ఓమిక్రాన్
-
కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి
-
కోవిడ్ బాధితులకు స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి: అరవింద్ కేజ్రీవాల్
-
2022 ప్రారంభ వేడుక... ఇంట్లోనే న్యూ ఇయర్ ఇలా..!
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఎందుకు అన్నారో గాని ఈ కాలంలో ఆ మాట పదేపదే వల్లె వేసుకోవాల్సి వస్తోంది. గుడి కన్నా ఇల్లు పదిలం అని కూడా అనుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు మనం ఉంటున్న ఇంటివైపే కన్నెత్తి కొత్తగా చూడాలి. కొత్తగా అలంకరించుకోవాలి. కొత్తగా కొత్త సంవత్సరానికి ఇంట్లో ఉంటూ ఆహ్వానం పలకాలి. ఎలా చేస్తే బాగుంటుంది? మళ్లీ కొత్త వేరియంట్ అంటున్నారు. బయటకు వెళ్లొద్దంటున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. పార్టీలను అవాయిడ్ చేయమంటున్నారు. కొన్నిచోట్ల డిసెంబర్ 31న నైట్ కర్ఫ్యూలు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్నేల? న్యూ ఇయర్ పార్టీని ఇంట్లోనే ఉండి చేసుకోవడం మేలని నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులు, హితవరులు హితవు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్‌కి ఏ గోవాకో, కేరళకో వెళ్లడం ఆనవాయితీ. ఈసారి మానేస్తే ఏం పోతుంది? లేదంటే కారులో బయలుదేరి సొంత ఊరుకు వెళ్లడం పరిపాటి. వద్దు అనుకోవడం మంచిదే కదా. సిటీలోని ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకొని ఇండియన్ ఐడల్ కొత్త సింగర్స్ పాడే పాటలకు నాలుగు డాన్స్‌లు చేయాలని కోరిక ఉంటుంది. ఈసారి నో అనుకుంటే సరిపోదా? ‘జాన్ హైతో జహా హై’ అని సామెత. అంటే ‘ప్రాణాలు ఉంటే ప్రపంచం’ ఉంటుంది అని అర్థం. ప్రాణాలు ఉండాలేగాని భవిష్యత్తులో బోలెడన్ని న్యూ ఇయర్ పార్టీలు బయట చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వెల్కమింగ్ పార్టీకి బెస్ట్ ప్లేస్ ఇల్లే అనుకుందాం ఈసారి. సరిగ్గా ట్రై చేస్తే ఇంట్లోనే మంచి పార్టీ చేసుకోవచ్చు. కొత్త హుషారు తెచ్చుకోవచ్చు. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పొచ్చు. ఏం చేద్దాం. ఒకటి రెండు కుటుంబాల్ని ఎంచుకోండి బయట పార్టీ వద్దన్నారు కానీ ఇంట్లో స్నేహితులతో వద్దు అనుకోలేదు. ఏ ఇంటి పార్టీ అయినా మనకు మనం చేసుకుంటే అంత బాగుండదు. మీకు బాగా ఇష్టమైన ఒకటి రెండు కుటుంబాలను పిల్చుకోండి. చాలా రోజులుగా రాని కొడుకు వచ్చినా కూతురు వచ్చినా మరీ మంచిది. బంధువుల కన్నా స్నేహితుల వల్లే సరదా అనుకున్నా సరే. ఆ గెస్ట్‌లను పిలవడం పూర్తి కాగానే పార్టీ పనుల్లో దిగండి. లైట్లు వెలిగించండి లైట్లు కొత్త వెలుతురును కాంతిని తెస్తాయి. బయట రెడిమేడ్ సీరియల్ సెట్లు దొరుకుతాయి. అవి తెచ్చి ఇంటి గేటు కు, కాంపౌండ్ వాల్‌కు, ముంగిలిలో ఉన్న చెట్లకు, మొక్కలకు, మిద్దెకు వేలాడ దీసి వెలిగించండి. కొనలేకపోతే ఏ ఎలక్ట్రీషియన్‌కు చెప్పినా ఒక రాత్రికి ఇంతని అద్దె తీసుకొని వేసి పోతాడు. అవి ఒక్కసారి మిలమిలమని వెలగడం ప్రారంభిస్తే ఇంటికి కొత్త కళ పార్టీ కళ వచ్చేస్తుంది. పెరడు ఉంటే అక్కడ రెండు ఫ్లాష్లైట్లు వెలిగించండి. వంట పనులకు కూడా పనికి వస్తుంది. దీనికి ముందు ఇల్లు నీట్‌గా సర్దుకోండి. కొత్త కర్టెన్లు వేలాడగట్టినా మంచాల మీద కొత్త దుప్పట్లు పరిచినా కొత్త కళ వచ్చేస్తుంది. షామియానా వేయండి షామియానా వేస్తే వచ్చే కళ వేరు. ఇంటి ముందు బుజ్జి షామియానా వేయించండి. పెరడు ఉంటే అక్కడ కూడా చిన్న షామియానా వేస్తే ఆ షామియానా కింద కుర్చీలు వేసుకుని కూచోబుద్ధవుతుంది. ఆ షామియానా కిందే వంట పనులు చేసుకుంటే ఆ హుషారే వేరు. అతిథులు డిసెంబర్ 31 మధ్యాహ్నానికే చేరుకుంటే సాయంత్రం నుంచి వంటలు మొదలెట్టుకోవచ్చు. అందరూ కలిసి సరదాగా వండొచ్చు. పార్టీలో పానీయాలు ఉంటే స్టార్టర్లు, పిల్లలకు స్నాక్స్, మెయిన్ కోర్సు, డిన్నర్ తర్వాత డిజర్ట్లు, సరిగ్గా 12 గంటలకు కోయడానికి కేక్ ఇవన్నీ సిద్ధం చేసుకోవడమే ఒక పార్టీ. అదంతా ఎంజాయ్ చేయండి. అదే సమయంలో డైనింగ్ టేబుల్ని కూడా అందంగా అలకరించండి. అందమైన ప్లేట్లు బయటకు తీయండి. ఆ పార్టీ... ఆ భోజనం రెండూ గుర్తుండిపోవాలి. ఫొటో కార్నర్ ఇంట్లో ఏ ప్రాంతంలో మంచి ఫోటోలు వస్తాయో అక్కడ ఒక ఫోటో కార్నర్ ఏర్పాటు చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022 అని రాసిన ఫ్రేమ్ తయారు చేసి దాని వెనుక నిలబడి ఫొటోలు దిగవచ్చు. లేదా అలాంటి అక్షరాలు హ్యాంగ్ చేసిన గోడ దగ్గర అయినా సరే. ఫొటోలు బాగా వచ్చే సెల్‌ఫోన్‌నే వాడండి. అందరూ నవ్వుతూ సంతోషంగా ఫొటోలు దిగండి. రోజులు గడిచిపోతాయి. కాని ఫోటోలు నిలిచిపోతాయి. మన ఇంటి పెద్దలతో తప్పక గ్రూప్ ఫోటో దిగండి. ఫోన్లు చేయండి పార్టీ ఒక వైపు నడుస్తుంటుంది. మీరు మీ అయిన వారికి ఆత్మీయులకు వీడియో కాల్స్ చేస్తూ మీ దగ్గరే వారు కూడా ఉన్నట్టు వారి దగ్గర మీరూ ఉన్నట్టు ఫీల్ రానివ్వండి. కెమెరాను ఇల్లంతా జూమ్ చేస్తూ పార్టీ హడావిడి చూపించండి. వారి హడావిడి చూస్తూ జోక్స్ కట్ చేయండి. చాలా రోజులుగా పలకరించని మిత్రులను పలకరించండి. కొత్త సంవత్సరం మన బంధాలు మరింత గట్టి పడాలని కోరుకోండి. ప్రార్థన చేయండి కొత్త సంవత్సర ఘడియలు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలు మౌనంగా కూచుని ప్రార్థన చేయండి. ప్రార్థన వంటి పదాలు నచ్చని వారు ఈ విశ్వంలోకి పాజిటివ్ ఆలోచనలు పంపండి. అందరూ బాగుండాలని అంతా మంచే జరగాలని కోరుకోండి. మీరు ఎంత గట్టిగా కోరుకుంటే ఈ విశ్వం అంత బాగుంటుంది. న్యూ ఇయర్ పార్టీకి ఈ పద్ధతిలో రెడీ అయిపోండి. హ్యాపీగా జరుపుకోండి. సురక్షితంగా జరుపుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. మ్యూజిక్ అండ్ డాన్స్ పార్టీలో మ్యూజిక్ లేకపోయినా డాన్స్ లేకపోయినా అస్సలు బాగోదు. అద్దెకు బాక్సులు దొరుకుతాయి. తెచ్చుకోండి. లేదా సొంతవి ఉంటే రెడీ చేసుకోండి. రకరకాల మ్యూజిక్ యాప్‌లు ఉన్నాయి. వాటి నుంచి మంచి డాన్స్ నంబర్లు ప్లే చేయండి. షామియానా కిందో, ఇంటి డాబా పైనో చిన్న స్టేజ్ కట్టుకుంటే అందరి నృత్యకౌశలం చూసి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు ఫస్ట్ సెకండ్ అని పోటీ పెట్టకండి. వారు ఏ చిన్న కళ ప్రదర్శించినా ఒక బహుమతి ఇవ్వండి. మన ఇంటి పాట వీధికి కళ తెస్తుంది. వీధికి కళ వస్తే ఊరికి వస్తుంది. అలాగని మరీ పెద్దగా సౌండ్ పెట్టకండి. మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండాలి. డిస్ట్రబ్ చేస్తున్నట్టుగా కాదు. -
PM Modi Mann Ki Baat: స్వీయ అప్రమత్తతే దేశానికి బలం
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాధికారక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను భారత్ ఓడించాలంటే పౌరులంతా స్వీయ క్రమశిక్షణతో, అప్రమత్తతో వ్యవహరించాలని ప్రధాని మోదీ హితవు పలికారు. వైరస్‌పై యుద్ధంలో పై చేయి సాధించాలంటే పౌరుల వ్యక్తిగత అప్రమత్తతే అసలైన బలమని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేడియోలో ప్రధాని మోదీ దేశంలోని తాజా స్థితిగతులపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాల్లో కొన్ని.. ► ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా ప్రక్రియలతో పోలిస్తే భారత్ కోవిడ్ వ్యాక్సినేషన్ రేటులో అద్భుతమైన పురోగతిని సాధించింది. అయినాసరే, ప్రజలు ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తవహించాల్సిందే. ►ఒమిక్రాన్ గుట్టుమట్లను తెల్సుకునేందుకు మన శాస్త్రవేత్తలు అనుక్షణం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దీంతో అందివస్తున్న కొత్త విషయాలు, సమాచారానికి తగ్గట్లు కేంద్రప్రభుత్వం సైతం తగు చర్యలకు పూనుకుంటోంది ►మహమ్మారిగా పరిణమించిన కోవిడ్‌ను ఎదుర్కోవడంలో 2019 నుంచీ మన రెండేళ్ల అనుభవం ఎంతగానో దోహదపడుతోంది. అందుకే ‘దేశ ఆరోగ్య పరిస్థితి’చేయిదాటిపోకుండా అడ్డుకోగలిగాం. ఇదంతా మన సమష్టి కృషి ఫలితమే. ఇంతే బాధ్యతాయుతంగా ఉంటూ 2022 కొత్త ఏడాదిలోకి అడుగుపెడదాం. ►వ్యాక్సినేషన్లో 141 కోట్ల మైలురాయిని దాటేశాం. ఇదంతా ప్రతీ ఒక్క భారతీయుడి విజయం. వ్యవస్థపై, శాస్త్రంపై, శాస్త్రవేత్తలపై భారతీయులు పెట్టుకున్న విశ్వాసానికి నిదర్శనం. ►ప్రతీ ఏడాదిలాగే ఈసారీ ‘పరీక్షా పే చర్చ’కార్యక్రమం ద్వారా ప్రతీ విద్యార్థితో మాట్లాడతాను. Myజౌఠి. జీn ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోండి. ► భిన్నజీవ జాతులకు నెలవైన అరుణాచల్ ప్రదేశ్‌లో పక్షుల వేటను ఆపేస్తూ ఎయిర్గన్లను ప్రజలు స్వచ్ఛందంగా త్యజించడం గొప్ప మార్పు. ►కూనూర్‌లో వాయుసేన హెలికాప్టర్ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి తుదివరకు పోరాడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. శౌర్య చక్ర వంటి పురస్కారాలు సాధించినా తన మూలాలను మర్చిపోలేదు. తన పాఠశాల విద్యకు సంబంధించిన వివరాలతో వరుణ్ సింగ్ రాసిన ఉత్తరాన్ని మోదీ గుర్తుచేశారు. -
డెల్టా + ఒమిక్రాన్ = డెల్మిక్రాన్!!
ముంబై: కరోనా కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి మాత్రం సరికొత్త రూపాల్లో మానవాళిపై దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్ వల్ల పాశ్చాత్య దేశాలు విలవిల్లాడుతున్నాయని అందరూ భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ ఒక్కదాని వల్ల జరగడం లేదని, డబుల్ వేరియంట్ వల్లనే ఈ కల్లోలం జరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. యూరప్, యూఎస్ సహా పశ్చిమాదిన కలకలం సృష్టిస్తున్నది ‘డెల్మిక్రాన్’ అనే డబుల్ వేరియంట్ అని, దీనికి డెల్టా తీవ్రత, ఒమిక్రాన్ వేగం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో కరోనా రహిత ప్రపంచాన్ని చూడొచ్చన్న ప్రజల ఆశలకు ఈ డెల్మిక్రాన్ వమ్ముచేసిందంటున్నారు. పశ్చిమ దేశాల్లో కేసుల సునామీకి ఇదే కారణమని కోవిడ్ పరిశోధకుడు డా. శశాంక్ జోషి అభిప్రాయపడ్డారు. ఆల్ఫా, బీటా లాగా డెల్మిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ కాదని, ఇది ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో ఏర్పడిందని వివరించారు. అంటే దీన్ని డబుల్ వేరియంట్‌గా చెప్పవచ్చు. ఇలాంటి డబుల్ వేరియంట్లు రూపొందడం చాలా అరుదుగా జరుగుతుంది. డెల్టా కేసులు భారత్‌లో ఈ ఏడాది సెకండ్ వేవ్‌కు కారణమయ్యాయి. తాజాగా ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ దశలో ఇండియాలో ఈ రెండు వేరియంట్ల కలయిక ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిఉందని జోషి చెప్పారు. డబుల్ ఇబ్బందులు వైరస్‌లో జరిగే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ ఏర్పడేందుకు కారణమవుతాయి. కానీ ఇలాంటి డబుల్ వేరియంట్లు ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో రూపొందుతాయని సైంటిస్టులు వివరించారు. ఉదాహరణకు ఇప్పటికే డెల్టా వేరియంట్ సోకి కోలుకుంటున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకితే అతనిలో డెల్మిక్రాన్ రూపొందే అవకాశం ఉందన్నారు. డెల్మిక్రాన్లో అటు డెల్టా నుంచి తీవ్ర వ్యాధి కలిగించే లక్షణాలు, ఇటు ఒమిక్రాన్ నుంచి వేగంగా వ్యాపించే లక్షణం వచ్చాయి. అందుకే ఇది ప్రస్తుతం పాశ్చాత్య దేశాలను ముంచెత్తుతోంది. డెల్మిక్రాన్ సోకిన వారిలో అధిక జ్వరం, నిరంతర దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతులో గరగరలాంటి లక్షణాలను నిపుణులు గమనించారు. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంతవరకు డెల్మిక్రాన్ వేరియంట్ జాడ మాత్రం భారత్‌లో లేదు. భారత వాతవరణానికి ఒమిక్రాన్ ఎలా స్పందిస్తుందోనని నిపుణులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం ఇండియాలో డెల్మిక్రాన్ ప్రమాదం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్, డెల్మిక్రాన్.. ఏదైనా సరే టీకాలు తీసుకోవడం, సరైన నిబంధనలు పాటించడంతో దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చని ఆరోగ్య నిపుణుల సూచన. -
AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు విస్తృతంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉంటూ కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మరోదఫా మహమ్మారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ‘స్పందన’లో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై పలు సూచనలు చేశారు. అధికార యంత్రాంగానికి అభినందనలు కోవిడ్ నియంత్రణపై అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేస్తోంది. 32 దఫాలు ఇంటింటి సర్వే చేసి డేటా సేకరించారు. కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.36 శాతం కాగా రాష్ట్రంలో 99.21 శాతం ఉంది. మరణాల రేటు దేశంలో 1.37 శాతం అయితే మన దగ్గర 0.7 శాతం మాత్రమే ఉంది. సంపూర్ణ వ్యాక్సినేషన్ దిశగా... రాష్ట్రంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. డబుల్ డోస్ వ్యాక్సినేషన్ కూడా వీలైనంత త్వరగా పూర్తవ్వాలి. డోసుల మధ్య విరామాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందా? ఉంటే.. ఎలా చేయాలి? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అధికారులను ఆదేశించాం. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే దీని ఉద్దేశం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొదటి డోసు వంద శాతం పూర్తయింది. కలెక్టర్, సిబ్బంది అందరికీ అభినందనలు. వ్యాక్సినేషన్లో వెనకబడ్డ జిల్లాలపై ధ్యాస పెట్టాలి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, చిత్తూరు, విశాఖ కలెక్టర్లు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ తరహా మరెక్కడా లేదు.. వంద పడకలు దాటిన ప్రైవేట్ ఆస్పత్రులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాం. పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చాం. వారికి సబ్సిడీ కూడా అందించాం. దీనిపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. డీ–టైప్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తగినన్ని అందుబాటులో ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం 144 పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నెలాఖరున వీటిని ప్రారంభించబోతున్నాం. మరే రాష్ట్రంలోనూ ఈ తరహా ఏర్పాటు లేదు. ఇంత పెద్ద సంఖ్యలో ఎవరూ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పలేదు. కోవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 104 వన్ స్టాప్ సెంటర్ 104 కాల్ సెంటర్‌పై మరోసారి అధికారులు సమీక్ష చేయాలి. కాల్ చేయగానే వెంటనే స్పందన ఉండాలి. కోవిడ్ నివారణ చర్యలు, చికిత్సకు 104 వన్ స్టాప్ సొల్యూషన్. నిర్దేశించుకున్న సమయంలోగా కాల్ చేసిన వారికి సహాయం అందాలి. కాల్ చేస్తే స్పందన లేదనే మాట ఎక్కడా వినిపించకూడదు. -
వెంటాడిన ‘ఒమిక్రాన్’ భయాలు!
ముంబై: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలున్నప్పటికీ.., స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభంతో గట్టెక్కింది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1244 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 153 పాయింట్లు పెరిగి 57,261 వద్ద ముగిసింది. నిఫ్టీ 379 పాయింట్లు పరిధిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసే సరికి 28 పాయింట్ల లాభంతో 17,054 వద్ద స్థిరపడింది. జియో మొబైల్ టారీఫ్‌ల పెంపుతో అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు ఒకటిన్నర శాతం లాభపడింది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్బీఐ సానుకూల ప్రతిపాదనలతో ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 23 పైసల పతనంతో ఎగుమతులపై ఆధారపడే ఐటీ షేర్లు రాణించాయి. మరోవైపు చిన్న, మధ్య తరహా షేర్లలో భారీగా లాభాల స్వీకరణ జరగడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండు శాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,332 కోట్ల షేర్లను అమ్మేశారు. గత 7 సెషన్లలో రూ.28 వేల కోట్ల ఈక్విటీలను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,611 కోట్ల షేర్లను కొన్నారు. కొత్త వేరియంట్ కట్టడికి పలు దేశాలు లాక్డౌన్ విధింపు, సరిహద్దుల మూసివేత నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. 1244 పాయింట్ల పరిధిలో ట్రేడింగ్... ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 79 పాయింట్ల పతనంతో 57,028 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 17,056 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారాంతంలో భారీ నష్టాల నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల్లోకి మళ్లాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం కూడా సూచీలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు పెరిగి 57,626 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 17,161 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. మిడ్ సెషన్ తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు లాభాలన్నీ హరించుకుపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(57,626) నుంచి 1244 పాయింట్ల పాయింట్లు నష్టపోయి 56,383 వద్ద, నిఫ్టీ డే హై(17,161) నుంచి 379 పాయింట్లు క్షీణించి 16,782 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. అయితే చివర్లో మరోసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ‘‘కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌పై మరింత స్పష్టత వచ్చే వరకు మార్కెట్లో ఒడిదుడుకులకు లోనుకావచ్చు. ఇన్వెస్టర్లు సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ, మౌలిక రంగ, వాహన విక్రయ, ద్రవ్యలోటు గణాంకాలపై దృష్టి సారించారు’’ రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్ర తెలిపారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు మూడు శాతం పెరిగి రూ.2020 వద్ద స్థిరపడింది. ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ కోటక్ బ్యాంకులో తన వాటాను పది శాతానికి పెంచుకోవడం ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.2,044 స్థాయిని అందుకుంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో నష్టాలను ప్రకటించడంతో పిన్‌టెక్ సంస్థ పేటీఎం షేరు మూడు శాతం నష్టపోయి రూ.1734 వద్ద ముగిసింది. ► ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో స్థానం కోల్పోవడంతో ఆదానీ పోర్ట్స్ రెండు శాతం క్షీణించి రూ.703 వద్ద నిలిచింది. ఐదు వారాల కనిష్టానికి రూపాయి 18 పైసల నష్టంతో 75.07కు డౌన్ ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 18 పైసలు నష్టపోయి 75.07కు పడిపోయింది. గడచిన ఐదు వారాల్లో భారత్ కరెన్సీ ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. కోవిడ్–19 కొత్త వేరియంట్ భయాలు, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి ధోరణి దీనికి ప్రధాన కారణం. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 74.84 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ 74.82 గరిష్ట–75.16 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి నష్టాల్లో ముగుస్తోంది. ఆర్థిక అనిశ్చితిపై భయాలు ఒకవైపు– వడ్డీరేట్లు పెరగవచ్చన్న భయాలు మరోవైపు నెలకొన్న నేనథ్యంలో డాలర్ ఇండెక్స్ కూడా పటిష్టంగా కొనసాగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ నష్టాల్లో 75.05 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96.40 వద్ద ట్రేడవుతోంది. -
Omicron Variant: మళ్లీ ఆంక్షల చట్రంలోకి.. మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి
లండన్, జోహెన్నెస్‌బర్గ్, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్(బి.1.1.529) కేసులు పలు దేశాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లో కేసులు నిర్ధారణయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బ్రిటన్‌లో ముగ్గురికి, ఆస్ట్రేలియాలో ఇద్దరికి, జర్మనీలో ఇద్దరికి, ఇటలీ, ఇజ్రాయెల్, బెల్జియంలలో ఒక్కొక్కరికీ ఈ వేరియెంట్ సోకిందని పరీక్షల్లో తేలింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 61 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైతే వారిలో 13 మందికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఖతర్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. డెల్టా కంటే శరవేగంగా ఈ వేరియెంట్ కేసులు వ్యాపిస్తూ ఉండడంతో భయాందోళనలకు లోనైన 18 దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకల్ని నిలిపివేశాయి. ఇజ్రాయెల్ తమ దేశాల సరిహద్దుల్ని మూసేసింది. ఆఫ్రికాలోని 50 దేశాల నుంచి రాకపోకల్ని నిషేధించింది. యూకేలో మళ్లీ మాస్కులు ఇంగ్లాండ్‌లో మంగళవారం నుంచి దుణాకాలు, వ్యాపారసముదాయాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మంగళవారం నుంచి మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరి చేయనున్నారు. యూకేకు వచ్చే విదేశీ ప్రయాణీకులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేస్తామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావేద్ ఆదివారం వెల్లడించారు. మొరాకో సోమవారం నుంచి రెండువారాల పాటు తమ దేశంలోకి వచ్చే విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రపంచానికి త్వరితంగా వెల్లడిస్తే శిక్షిస్తారా? ఒమిక్రాన్ వేరియెంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా నిర్ధారణ కాకుండానే అంతర్జాతీయ సమాజం రవాణా ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల్ని రానివ్వకపోవడం అత్యంత క్రూరమైన చర్యని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాము ఎంతో ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించి కొత్త వేరియెంట్‌ని కనుగొనడం తమకు శిక్షగా మారిందని అంటోంది. ‘‘సైన్స్ అద్భుతం చేస్తే ప్రశంసించాలి కానీ శిక్షించకూడదు’’ అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ‘రిస్క్’ ఉన్న దేశాల నుంచి వస్తే... ఆర్టీ–పీసీఆర్ ఫలితాలొచ్చాకే ఇంటికి న్యూఢిల్లీ: ‘రిస్క్’ దేశాల నుంచి (ఒమిక్రాన్ జాడలు బయటపడుతున్న దేశాలు) లేదా వాటిమీదుగా వస్తున్న ప్రయాణికులు అందరూ భారత్‌లో దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, పరీక్షల ఫలితాలు వచ్చేదాకా వారు విమానాశ్రయంలోనే వేచి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ట్రాన్సిట్‌లో ఉన్న వారు కూడా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే... తదుపరి ప్రయాణం నిమిత్తం విమానాల్లోకి బోర్డింగ్ కావొచ్చని తెలిపింది. సురక్షిత జాబితాలోని దేశాల నుంచి వచ్చే వారు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిస్తారని, అయితే 14 రోజుల పాటు వీరు స్వీయ ఆరోగ్యపరిరక్షణ చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముప్పులేని దేశాల నుంచి వచ్చేవారిలోనూ ఐదుశాతం మందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యోశాఖ వెల్లడించింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా ఈ నెల 24వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ వేరియెంటో, కాదో తేల్చుకోవడానికి అతని శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ రక్షణను ఏమార్చొచ్చు: గులేరియా ‘‘ఒమిక్రాన్ వేరియెంట్ వైరస్ కొమ్ములో 30 పైచిలుకు జన్యుపరమైన మార్పులున్నట్లు సమాచారం. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోగలదు. కాబట్టి ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయనేది (ఈ వేరియెంట్ నుంచి ఎంతమేరకు రక్షణ కల్పిస్తాయనేది) నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వైరస్ పైనుండే కొమ్ముల ద్వారానే కరోనా ఆతిథ్య కణంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతుందనే విషయం తెలిసిందే. ‘ఎక్కువమటుకు వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్ (వైరస్‌పై నుంచే కొమ్ములకు)లకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలను తయారుచేయడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. అలాంటి స్పైక్ ప్రొటీన్‌లో పెద్దసంఖ్యలో జన్యుపరమైన మార్పులుంటే యాంటీబాడీలు వాటిని అంత సమర్థంగా అడ్డుకోలేకపోవచ్చు’ అని గులేరియా పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనేది పరిశోధించి నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ ముప్పు అన్ని దేశాలకు పొంచి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచడం, కరోనా పరీక్షలు ఎక్కువ చేయడం, కరోనా హాట్‌స్పాట్‌ల్లో నిరంతర పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయడం, ప్రజలందరూ కోవిడ్–19 నిబంధనల్ని తుచ తప్పకుండా పాటించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్, బోస్ట్వానా నుంచి వచ్చే ప్రయాణికుల్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయాలని, అందరికీ కరోనా పరీక్షలతో పాటు ఏ వేరియెంట్ సోకిందో తెలిసే వరకు క్వారంటైన్లో ఉంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించానికి ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ ల్యాబొరేటరీకి శాంపిల్స్ పంపాలన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా వైరస్ ఎంతవరకు వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం కష్టమవుతుందన్నారు. 5శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉండేలా రాష్ట్రాలన్నీ చర్యలు చేపట్టాలన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్ అన్న విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు కృషి చెయ్యాలన్నారు. -
భారత్‌లో ఒమిక్రాన్ ప్రకంపనలు.. అప్రమత్తమైన రాష్ట్రాలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ మన దేశంలోకి విస్తరించి, మరో వేవ్‌కు దారి తీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. మహారాష్ట్రలో.. విదేశాల నుంచి మహారాష్ట్రలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోవాలని లేదా 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్రమత్తమైన దేశ రాజధాని బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకూండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టాలని.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన దేశాల నుంచి భారత్‌కు విమానాలను నిలిపివేయాలని ప్రధానికి కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఎన్టీఆర్ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు) విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విదేశీ ప్రయాణికుల విషయంలో గుజరాత్ ప్రభుత్వం కొత్త ఆంక్షలను ప్రకటించింది. యూరప్, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ , బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ నుంచి గుజరాత్‌లోకి వచ్చేవారు పూర్తి స్థాయి కరోనా టీకా తీసుకోనట్లైతే.. విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. పూర్తి స్థాయి టీకా తీసుకున్నవారికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేసి, ఎలాంటి లక్షణాలు లేకపోతేనే.. రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పింది. ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం ఉంటేనే కర్ణాటకలోకి కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం చూపిస్తేనే తమ రాష్ట్రంలోకి అనుమితిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 16 రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన విద్యార్థులు.. మరోసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్‌లో పని చేసే వారంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా పెంచాం: కేరళ విదేశాల్లో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా పెంచామని చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, అందరూ టీకా తీసుకోవాలని ఆమె కోరారు. చదవండి: కోవిడ్ ‘ఒమిక్రాన్’ వేరియెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కలవరం -
కరోనా కొత్త వేరియంట్ కలకలం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికలను సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారులను కోరారు. కొత్త వేరియంట్‌కు సంబంధించిన పరిణామాలపై క్లుప్తంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా 'ప్రమాదంలో' ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. వీటితో పాటు ముఖానికి మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రధాని మోదీ సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డా. వీకే పాల్ హాజరుకానున్నారు. దక్షిణాఫ్రికాలో వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షడంతో పాటు దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకనేందుకు తగిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు -
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు
జొహన్నెస్‌బర్గ్: గత కొంత కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఆరోగ్యం పరంగానేగాక ఆర్థికంగానూ దెబ్బతిన్నాయి. ఇటీవలే వైరస్ రక్కసి నుంచి తప్పించుకున్నామని కాస్త ఊపిరి పీల్చుకునేలోపే ప్రపంచానికి దక్షిణాఫ్రికా ఓ బాంబు పేల్చింది. ఆ దేశంలో.. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్ కొందరిలో వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) ఇది కనపడుతోందని ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది. కోవిడ్-19 ఎపిడెమియాలజీలో హానికరమైన మార్పును సూచించే సాక్ష్యాధారాల ఆధారంగా.. డబ్ల్యూహెచ్ఓ B.1.1.529 వేరియంట్‌కు ‘ఒమిక్రాన్’గా నామకరణం చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూహెచ్ ఒమిక్రాన్‌ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్ జాబితాలో చేర్చింది. తాజాగా ఇజ్రాయిల్, బెల్జియంలోనూ ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భారత్ దక్షిణాఫ్రికా మద్య జరగనున్న క్రికెట్ సిరీస్ కూడా సందిగ్థంలో పడింది. ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకలను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది. కొత్త వేరియంట్ తెరపైకి రావడంతో స్టాక్ మార్కెట్లు, పతనం వైపుకు పరుగులు పెరుగుతున్నాయి. అంతేగాక ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఈ వేరియంట్ ఆటంకంగా మారనుంది. చదవండి: Covid Variant: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్ -
ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
బ్రస్సెల్స్/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. పతనమైన సెన్సెక్స్.. భారీగా నష్టపోయిన మదుపరులు.. పెరిగిన ముడి చమురు ధరలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు.. వీటన్నంటికీ కారణం ఒకేఒక్క కొత్త రకం కరోనా వైరస్. అదే బి.1.1.529. ఆఫ్రికా ఖండం బోట్స్వానా దేశంలో బయటపడిన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్యమంత్రి జెన్స్ స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్‌కు ఉందన్న సమాచారం బెంబేలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులంటున్నారు. కరోనా టీకా తీసుకున్నా కొత్త వేరియంట్ జనాభాలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. తమ దేశంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. మలావీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ బయటపడిందని వెల్లడించింది. అతడితోపాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపింది. వీరు గతంలో టీకా తీసుకున్నారంది. ఆంక్షలు వద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ బి.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొత్త వేరియంట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని, భయాందోళనలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ భరోసానిచ్చారు. దేశాలు సరిహద్దులను మూసివేయొద్దని, ప్రయాణాలపై ఆంక్షలు సరికాదని సూచించారు. మైఖేల్ ర్యాన్ వినతిని బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను నిలిపివేసినట్లు జర్మనీ ప్రకటించింది. కేవలం జర్మన్ పౌరులు మాత్రం రావొచ్చని, స్వదేశానికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని ఇటలీ ఆరోగ్య శాఖ చెప్పింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తమ పౌరులు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. బోట్స్వానా, ఎస్వాటినీ, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వారిపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్ సంగతేంటి? ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదే శాలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సలహాదారుల ప్రత్యేక భేటీ బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహాదారుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 గురించి తమకు పెద్దగా తెలియదని, కానీ, ఇందులో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని సాంకేతిక సలహా బృందం సభ్యుడు మారియావాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్ల పనితీరు తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమన్నారు. బి.1.1.529 వేరియంట్‌పై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని సాంకేతిక సలహా బృందం చైర్మన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. -
మళ్లీ కోవిడ్ కల్లోలం!
ముంబై: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలింది. వైరస్ కట్టడికి పలు దేశాల లాక్డౌన్ విధింపు యోచనలు ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను రెకేత్తించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 37 పైసల పతనమైంది. క్రూడాయిల్ అనూహ్య పతనం, వడ్డీ రేట్ల పెంపు భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ట్రేడింగ్ మొదలు.., తుదిదాకా అమ్మకాల సునామీ జరిగింది. ఒక్క ఫార్మా మినహా అన్నిరంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏడాదిలో అతిపెద్ద మూడో పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1688 పాయింట్లు నష్టపోయి 57,107 వద్ద, నిఫ్టీ 510 పాయింట్లు క్షీణించి 17,026 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల పతనం సూచీల భారీ క్షీణతకు కారణమైంది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, ఏషియన్ సిమెంట్స్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5786 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.2294 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడేలో 17వేల దిగువకు నిఫ్టీ సెన్సెక్స్ ఉదయం 540 పాయింట్ల నష్టంతో 58,255 వద్ద, నిఫ్టీ 17,339 పాయింట్ల పతనంతో 17,339 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 1801 పాయింట్లును కోల్పోయి 56,994 వద్ద, నిఫ్టీ 550 పాయింట్లు పతనమైన 17వేల స్థాయిని కోల్పోయి 16,986 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 2,529 పాయింట్లు, నిఫ్టీ 738 పాయింట్లు నష్టపోయాయి. నిమిషానికి రూ.1962 కోట్ల నష్టం సూచీలు మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.7.36 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.1962 కోట్ల నష్టం వాటిల్లింది. వెరసి ఇన్వెస్టర్ల ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.258 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. నష్టాలకు నాలుగు కారణాలు కలవరపెట్టిన కొత్త వేరియంట్ ... ఇప్పటికే డెల్టా వేరియంట్ విజృంభణతో యూరప్ దేశాలు విలవిలాడుతుండగా.., తాజాగా దీని కంటే అత్యంత ప్రమాదకారి, అసాధారణ రీతిలో మ్యూటేషన్ల(ఉత్పరివర్తనాలు)కు గురౌతున్న బి.1.1529 వేరియంట్‌ను దక్షిణాఫిక్రాలో గుర్తించారు. ఈ రకం కొత్త కేసులు రోజురోజుకూ శరవేగంగా పెరుగుతుండటంతో భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ ఒక్కసారిగా దెబ్బతింది. ఆసియాలో జపాన్ 2.53%, హాంగ్‌సెంగ్ 2.67%, జకార్తా 2.06% నష్టపోయాయి. యూరప్‌లోని ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ మార్కెట్లు 3–4 శాతం వరకు క్షీణించాయి. అమెరికాకు చెందిన ఎస్అండ్పీ, నాస్డాక్ ఫ్యూచర్లు ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. తెరపైకి లాక్డౌన్ విధింపు ఆందోళనలు... కేసుల కట్టడికి పలు దేశాలు రాత్రి కర్ఫ్యూను విధించాయి. స్లోవేకియా రెండు వారాల సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. జపాన్, బ్రిటన్ దేశాలు ప్రయాణాలపై నిషేధాన్ని విధించాయి. చెక్ రిపబ్లిక్ బార్లు, రెస్టారెంట్లతో సహా జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలను మూసివేసింది. జర్మనీలో కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య లక్ష దాటింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు లాక్డౌన్లను ప్రకటించవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మూడో వేవ్ మరింత ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉండడంతో సూచీలు కుంగాయి. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపరం కొనసాగడం ప్రతికూలంగా మారింది. ఈ నవంబర్లోనే ఇప్పటి వరకు(25 తేది) రూ.25 వేల కోట్ల దేశీయ ఈక్విటీలను అమ్మినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత స్టాక్ సూచీలు అక్టోబరులో జీవితకాల గరిష్టాలకు చేరుకున్న తరువాత షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే కారణంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా అమెరికా వడ్డీరేట్లను వేగంగా పెంచవచ్చనే అంచనాలు వారి విక్రయాల ప్రక్రియను మరింత ప్రేరేపింస్తున్నాయి. తొలి దశ కోవిడ్, లెమన్ బ్రదర్స్ సంక్షోభ సమయాల్లోనూ ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర భయాలు... ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికాతో సహా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను వేగంగా పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు తెరపైకి వచ్చా యి. వీలైనంత తొందర్లో ఉద్దీపన ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్‌లో తెలిపింది. ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఈ అంశాలన్నీ సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. లాభాల్లో టార్సన్స్ ప్రోడక్ట్స్ లిస్టింగ్... టార్సన్స్ ప్రోడక్ట్స్ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.662తో పోలిస్తే ఆరుశాతం లాభంతో రూ.700 వద్ద లిస్టయ్యాయి. స్టాక్ మార్కెట్ భారీ పతనంతోనూ ఈ షేర్లకు డిమాండ్ వెల్లువెత్తింది. ఫలితంగా ఇంట్రాడేలో 27% దూసుకెళ్లి రూ.840 అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 26.30 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ ఏడాదిలో టాప్–3 పతనాలు తేది సెన్సెక్స్ నిఫ్టీ ఫిబ్రవరి 26 1,939 568 ఏప్రిల్ 12 1,707 524 నవంబర్ 26 1,687 510 -
కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం
బెర్లిన్: జర్మనీలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోంది. రోజుకు 76 వేలకు పైనే కోవిడ్ కేసులు నమోదు కావడం అక్కడ వణుకుపుట్టిస్తోంది. ఇప్పటివరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు జర్మనీ ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాదు ఆ కేసుల ఉధృతి ఎంతలా ఉందంటే ఆస్పత్రులన్ని కరోనా రోగులతో కిటకిటలాడిపోవడంతో ఆ రోగులను వేరే ఆస్పత్రలకు తరలించే నిమిత్తం ఆఖరికి వైమానికి దళాన్ని కూడా రంగంలోకి దింపింది. అంతేకాదు జర్మనీలోని దక్షిణ నగరం అయిన మెమ్మింగెన్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉన్న కరోనా రోగులను ఉత్తర ఓస్నాబుక్ సమీపంలోని ముయెన్స్టర్కు తరలించేందుకు జర్మనీ విమానంలో "ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు" గా పిలిచే ఆరు పడకల ఐసీయూని ఏర్పాటు చేసింది. (చదవండి: 13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన) అయితే ఈ విధంగా జర్మనీ విమానాలను వినియోగించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో బెర్లిన్ ఈ కొత్త కరోనా వేరియంట్‌ని గుర్తించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాను కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రాంతంగా ప్రకటించనుందని జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పైగా జర్మనీ దేశం దక్షిణాఫ్రికా నుండి జర్మనులు జర్మనీకి రావడానికి మాత్రమే విమానాలు అనుమతిస్తామని, పైగా వ్యాక్సిన్లు తీసుకున్నవారితో సహా అందరూ 14 రోజులు క్యారంటైన్లో ఉండాలని సూచించింది. అంతేకాదు ఈ కొత్త వైరంట్ని బి.1.1.529 పిలుస్తారని, ఇది యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగల సామర్థ్యం గలదని దక్షిణాఫ్రికా శాస్రవేత్తలు ప్రకటించని సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా గుర్తించిన ఈ వేరియంట్ మరిన్ని సమస్యలను సృష్టింస్తుందన్న ఆందోళనతోనే తాము ముందుగానే తగు చర్యలు తీసుకుంటున్నామని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) -
దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్
లండన్/ జొహన్నెస్‌బర్గ్: అబ్బో... ఎన్నో వేరియెంట్లను చూసేశాం. అలసిపోయాం... ఇక కరోనాతో సహజీవనం మనకు అలవాటైపోయిందని ఒక రకమైన నిశ్చింతకు వచ్చాం. ఇంతలోనే దక్షిణాఫ్రికా మరో బాంబు పేల్చింది. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్ వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) ఇది కనపడుతోందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్ టామ్ పీకాక్ వెల్లడించారు. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని, మరింత వేగంగా వ్యాప్తిచెందగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, బోట్స్వనాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించినట్లు తెలిపారు. బి.1.1.529 ఎంతటి ప్రమాదకరం, దీని మూలంగా ఎదురయ్యే విపరిణామాలు ఎలా ఉండనున్నాయనేది అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్తలు గురువారం సమావేశమయ్యారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్ఐవీ/ ఎయిడ్స్ సోకి చికిత్స పొందని వ్యక్తి శరీరంలో ఈ మ్యూటెంట్ అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమేరకు వేగంగా వ్యాప్తి చెందగలదు, ఎంతటి హానికరమనేది ప్రస్తుత దశలో ఏమీ చెప్పలేమని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తమ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తూ.. దీని పరిణామక్రమాన్ని నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది. హాంగ్‌కాంగ్‌లోనూ ఈ వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. ► దీంట్లో ఏకంగా 32 మ్యూటేషన్లు ఉన్నాయి. ► కె417ఎన్– కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను ఏమార్చగలదు ► ఈ484ఏ– యాంటీబాడీలకు చిక్కదు ► ఎన్440కే– యాంటీబాడీలను బొల్తా కొట్టించగలదు ► ఎన్501వై.. వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుంది. ► ఈ వైరస్ కొమ్ముల్లో మరే దాంట్లోనూ లేనన్ని మ్యూటేషన్లు ఉన్నాయి. ► ప్రస్తుత వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ఇప్పటిదాకా వ్యాప్తిలో ఉన్న వేరియెంట్లనే (వైరస్‌పై ఉండే కొమ్ములనే) గుర్తుపట్టగలవు ► కాబట్టి ఇది తేలిగ్గా యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగలదు. అక్కడి నుంచి వచ్చేవారితో జాగ్రత్త కొత్త వేరియెంట్ అనవాళ్లు బయటపడ్డ దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంగ్‌కాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షించాలని, టెస్టులు ముమ్మరం చేయాలని భారత ప్రభుత్వం గురువారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రదేశాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ దేశాల మీదుగా (వయా) వస్తున్న వారినీ కఠిన పరీక్షల తర్వాతే అనుమతించాలని సూచించింది. అందరి శాంపిల్స్ తీసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. -
ఏ.వై. 4.2పై ఆందోళన వద్దు: ఇన్సాకాగ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 కొత్త వేరియంట్ ఏ.వై.4.2 వ్యాప్తిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) స్పష్టం చేసింది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఏవై.4.2 వేరియంట్‌కు సంబంధించిన కేసులు 0.1% మాత్రమేనని తెలిపింది. ‘ఏవై.4.2. వేరియంట్ వ్యాప్తి పెరుగుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై పరిశీలన కొనసాగుతోంది’అని ఇన్సాకాగ్ తెలిపింది. ప్రస్తుతానికి దేశంలో డెల్టా వేరియంట్ (బి.1.617.2 మరియు ఏవై.ఎక్స్) మాత్రమే ఆందోళనకర స్థాయిలో ఉందని తెలిపింది. అదేవిధంగా, ఏవై.4.2 వేరియంట్‌పై టీకాల ప్రభావం మిగతా డెల్టా వేరియంట్ల మాదిరిగానే ఉందని ఇన్సాకాగ్ తన వారాంతపు బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కొత్త వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్సాకాగ్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ 250
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బజాజ్ ఆటో తాజాగా సరికొత్త పల్సర్ 250 బైక్‌ను ఆవిష్కరించింది. ఎఫ్ 250, ఎన్ 250 వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.38 లక్షల నుంచి ప్రారంభం. ఎఫ్ 250 ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే 250 సీసీ డీటీఎస్–ఐ ఆయి ల్ కూల్డ్ ఇంజన్, 24.5 పీఎస్ పవర్, 21.5 ఎన్ఎం టార్క్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, గేర్ ఇండికేటర్, యూఎస్బీ మొబైల్ చార్జింగ్, మోనోషాక్ సస్పెన్షన్, ఇన్ఫినిటీ డిస్ప్లే కన్సోల్ వంటి హంగులు ఉన్నాయి. 2001 అక్టోబర్‌లో కంపెనీ భారత మార్కెట్లో పల్సర్ స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఎన్ 250 -
ఏవై.4.2 కలకలం; 6 రాష్ట్రాలు.. 17 కేసులు
న్యూఢిల్లీ: భారత్‌కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో దేశంలో కొత్త వేరియెంట్ ఏవై.4.2 కేసులు ఆందోళనని పెంచుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌లలో ఈ కేసులు నమోదు కావడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. డెల్టా ప్లస్ వేరియెంట్ నుంచి జన్యు మార్పులు చోటు చేసుకొని ఈ కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. తొలిసారిగా బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ప్రస్తుతం బ్రిటన్, రష్యా, అమెరికాతో సహా 10కి పైగా దేశాలకు విస్తరించింది. ఈ వేరియెంట్ త్వరితంగా వ్యాప్తి చెందుతోంది కానీ ఇదెంత ప్రమాదకరమో శాస్త్రవేత్తలు అంచనాకి రాలేకపోతున్నారు. -
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
-
తెలంగాణలోనూ ఏవై.4.2 వేరియంట్
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ను వణికిస్తున్న ‘ఏవై.4.2’రకం కరోనా కేసులు తెలంగాణలోనూ వెలుగుచూశాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఈ విషయం బయటపడింది. ఇద్దరిలో ఈ తరహా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇన్షియేటివ్ ఇన్ షేరింగ్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (జీఐఎస్ఏఐడీ) వెల్లడించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 26 వేల ‘ఏవై.4.2’కేసులు జీఐఎస్ఏఐడీలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తన తాజా నివేదికలో పేర్కొంది. బాధితుల వివరాలు గోప్యం సెప్టెంబర్‌లో తెలంగాణలో నమోదైన కరోనా కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. కాగా వీటిల్లో రెండు (0.6%) ‘ఏవై.4.2’రకం కేసులు ఉన్నట్లు తేలింది. 48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల మహిళకు సంబంధించిన ఆ రెండు రక్త నమూనాలు నిమ్స్ నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు వచ్చాయి. ఈ మేరకు వివరాలను అక్టోబర్‌లో జీఐఎస్ఏఐడీకి కేంద్రం అందజేసింది. అయితే రాష్ట్రంలో బయటపడిన రెండు ఏవై.4.2 బాధితుల వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇప్పుడెలా ఉన్నారు? వారికి కరోనా పూర్తిగా నయమైందా? ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన చర్యలేంటన్న విషయాలపై స్పష్టత లేదు. డెల్టా కంటే 12.4 శాతం వృద్ధి: డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికించిన విషయం విదితమే. తెలంగాణలోనూ సెకండ్ వేవ్‌లో డెల్టాతో వేలాది మంది కరోనా బారినపడగా, వందలాది మంది చనిపోయారు. కాగా డెల్టా వేరియంట్లో మూడు ఉప వర్గాలున్నాయి. వాటిలో 67 రకాల స్ట్రెయిన్లు ఉన్నాయి. అందులో ‘ఏవై.4.2’రకం ఒకటి. దీనిలో మిగతా వాటితో పోలిస్తే అదనంగా రెండు మ్యుటేషన్లు ఉన్నాయి. ఏ222వీ, వై145హెచ్ అనే ఈ మ్యుటేషన్లు ఉండటమే దీనికి, డెల్టా వేరియంట్‌కు ప్రధానమైన తేడాగా చెబుతున్నారు. ఇక ఏవై.4.2 డెల్టా వేరియంట్ వైరస్‌తో పోలిస్తే, 12.4 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిర్ధారిం చారు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయని యూకే చెబుతుండగా, డబ్ల్యూహెచ్ఓ మాత్రం కేసులు పెరుగుతున్నాయే కానీ, మరణాలు పెద్దగా లేవని చెబుతుండటం కొంత ఊరటనిస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే.. వాస్తవానికి ఏవై.4.2 కేసులు కొన్నింటిని జూలైలోనే మన దేశంలో గుర్తించారని, కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదని నిపుణులు అంటున్నారు. అయితే ఏవై.4.2 రకం కేసులు ఇంకా తెలంగాణలో ఎన్ని ఉండొచ్చన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏమైనా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏమరుపాటు తగదని స్పష్టం చేసింది. -
యూకేను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్
లండన్/వాషింగ్టన్: కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా వేరియెంట్ ఉపవర్గమైన ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండేళ్లుగా కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే డెల్టా వేరియెంట్ తరహాలో మరేది ఇప్పటివరకు వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు డెల్టా ఉపవర్గమైన ఏవై.4.2 కరోనా కేసులు యునైటెడ్ కింగ్డమ్(యూకే)ను వణికిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా ఈ కొత్త రకం వేరియెంట్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారత్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. కానీ, అవేవీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. తాజాగా ఏవై.4.2 వ్యాప్తి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేరియెంట్ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరో నా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిత్యం 50 వేలకుపైగా కేసులు బ్రిటన్‌లో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 52,009 కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసుల పెరుగుదలని నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఇటీవలి కాలంలో యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో 96 శాతం ఏవై.4.2 వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా లండన్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్ వెల్లడించారు. రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు, కేసులు మాస్కో: రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోద వుతుండటంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 37,141 కొత్త కేసులు నమోదు కాగా, 1,064 మరణాలు సంభవించినట్లు తెలిపింది. యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,28,453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్ ప్రజల ను కోరారు. మాస్క్ ధరించకపో వడంతోనే కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యంత్రాంగం ప్రజా రవాణా వ్యవస్థను కూడా బంద్ చేయాలని యోచిస్తోంది. రాజధాని మాస్కోలోని స్కూళ్లు, సినిమా హాళ్లు, వినోద ప్రదేశాలు, స్టోర్లను ఈనెల 28 నుంచి మూసి వేయనున్నారు. పిల్లలకీ ఫైజర్ టీకా సురక్షితం! 91% సమర్థంగా పనిచేస్తోందన్న కంపెనీ అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ 5–11 ఏళ్ల వయసు వారిలో 91 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఈ కంపెనీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమేనని తేలింది. ఇప్పటికే 12 ఏళ్ల పైబడిన వారికి అమెరికాలో టీకాలు ఇస్తున్నారు. 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి నవంబర్ నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్రిస్మస్ పండుగ నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి జో బైడెన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పిల్లల్లో ఫైజర్ వ్యాక్సిన్‌కి సంబంధించిన అధ్యయనం వివరాలను ఆన్లైన్లో ఉంచారు. దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తన సొంత సమీక్ష చేసిన తర్వాత పిల్లలకు వ్యాక్సిన్‌ను సిఫారసు చేయనుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ టీకాపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అమెరికాలో 5–11 ఏళ్ల వయసు మధ్య వారు దాదాపుగా 2.8 కోట్ల మంది ఉంటారు. వీరందరికీ టీకాలు ఇవ్వాలని, అప్పుడే నిర్భయంగా పిల్లలందరూ స్కూళ్లకి వస్తారని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలకిచ్చే టీకాలకు సంబంధించి సూదుల్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. -
కొత్త వేరియంట్లలో బీఎండబ్ల్యూ ఎక్స్5
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ బీఎండబ్లు్య కొత్త వేరియంట్లలో ఎస్యూవీ ఎక్స్5 ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.77.9 లక్షల నుంచి ప్రారంభం. పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రోప్లేటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టేబుల్ రోలర్ సన్‌బ్లైండ్స్ వంటివి పొందుపరిచారు. ఎక్స్‌డ్రైవ్30డీ స్పోర్ట్ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్, 265 హెచ్‌పీ, 620 ఎన్ఎం టార్క్, గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. ఎక్స్‌డ్రైవ్40ఐ స్పోర్ట్ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 340 హెచ్‌పీ, 450 ఎన్ఎం టార్క్, 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో చేరుకుంటుంది. -
టీకాలకు లొంగని ఎంయూ వేరియంట్: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
WHO Warns On MU Variant Of Covid 19 జెనీవా: కోవిడ్–19 మహమ్మారిలో ప్రమాదకరమైన కొత్త రకాలు పుట్టుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎంయూ (బి.1.621) అనే కొత్త వేరియంట్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలకు లొంగడం కష్టమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లను తట్టుకొనే శక్తి ఈ కొత్త వేరియంట్‌కు మెండుగా ఉందని తెలిపింది. బి.1.621 వేరియంట్ కరోనాను తొలుత ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో గుర్తించారు. అనంతరం యూరప్‌తోపాటు అమెరికా, యూకే, హాంకాంగ్‌లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తాజాగా తమ వీక్లీ బులెటిన్‌లో వెల్లడించింది. (చదవండి: న్యూయార్క్‌లో తుపాను బీభత్సం) ఇప్పటిదాకా 39 దేశాల్లో ఎంయూ రకం కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. ఎంయూ అనేది నిశితంగా గమనించిదగ్గ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్) వేరియంట్ అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎంయూ వేరియంట్ కేసులు 0.1 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. కొలంబియా, ఈక్వెడార్‌లో మాత్రం దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఎంయూ వేరియంట్‌ను డబ్ల్యూహెచ్ఓ ఆగస్టు 30న వాచ్‌లిస్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన బీటా వేరియంట్ తరహాలోనే ఎంయూ వేరియంట్ సైతం మనుషుల్లో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నట్లు తమ ప్రాథమిక అధ్యయనంలో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. (చదవండి: కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్న టీఎస్ఆర్టీసీ..!) -
రూపం మార్చుకున్న కరోనా.. టీకా రక్షణను దాటుకుని..
న్యూఢిల్లీ: అందరూ భయపడుతున్నట్లే కరోనా వైరస్ మరోమారు కొత్త రూపు దాల్చింది. తాజాగా కరోనా కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో గుర్తించామని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్ఐసీడీ) సైంటిస్టులు తెలిపారు. దక్షిణాఫ్రికాకు చెందిన కేఆర్ఐఎస్పీ సంస్థతో కలిసి జరిపిన పరిశోధనలో కరోనా కొత్త వేరియంట్ సీ.1.2 బయటపడిందని తెలిపారు. మేలోనే ఈ వేరియంట్‌ను గుర్తించామని, ఆగస్టు నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లో దీని జాడలు కనిపించాయని హెచ్చరించారు. (చదవండి: ఇది మన విజయం; అమెరికాతో పాటు ఇతర దేశాలతో కూడా) ఈ వైరస్ కరోనా టీకాలు కల్పించే రక్షణను దాటుకొని సోకుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్లో అధిక ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఉన్నాయని ఎన్ఐసీడీ సైంటిస్టులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో ప్రతినెలా ఈ వేరియంట్ జీనోమ్స్ సంఖ్య పెరుగుతూవస్తోందని అధ్యయనం వెల్లడించింది. గతంలో బీటా, డెల్టా వేరియంట్లలో కూడా జీనోమ్స్ ఇలాగే పెరిగాయని తెలిపింది. కొత్తగా కనుగొన్న వేరియంట్లో మ్యుటేషన్ రేటు సంవత్సరానికి 41.8 శాతమని, ఇతర వేరియంట్ల మ్యుటేషన్రేటు కన్నా ఇది దాదాపు రెట్టింపని అధ్యయనం వివరించింది. సగానికిపైగా సీ.1.2 సీక్వెన్సుల్లో 14 మ్యుటేషన్లున్నాయని, ఇతర స్వీక్వెన్సుల్లో అదనపు మ్యుటేషన్లు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. కొత్త వేరియంట్ స్పైక్ (కొమ్ము) ప్రాంతంలో జరుగుతున్న మ్యుటేషన్లలో 52 శాతం గత వేరియంట్లలో కనిపించినవేనని, మిగిలినవి కొత్త మ్యుటేషన్లని పేర్కొంది. స్పైక్ ప్రొటీన్ ద్వారానే కరోనా వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఇప్పుడున్న పలు వ్యాక్సిన్లు ఈ స్పైక్ప్రాంతాన్నే టార్గెట్‌గా చేసుకొని పనిచేస్తున్నాయి. అయితే కొత్తగా ఈ వేరియంట్లో కనిపిస్తున్న ఎన్ 440కే, వై 449హెచ్ మ్యుటేషన్లు కొన్ని యాంటీబాడీల నుంచి తప్పించుకొని పోయేందుకు ఉపయోగపడేవని సైంటిస్టులు వివరించారు. ఈ కొత్త మ్యుటేషన్లు ఇప్పటివరకు ఉన్న వేరియంట్లలో లేవని, సీ.1.2లో మాత్రమే కనిపించే వీటితో క్లాస్3 యాంటీబాడీలను వైరస్ తప్పించుకోగలదని(ఇమ్యూన్ ఎస్కేప్) తెలిపారు. (చదవండి: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు) -
భారత్‌లో కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్‌వేవ్!
న్యూఢిల్లీ: ఇప్పుడున్న కరోనా వేరియంట్ల కన్నా డేంజర్ వేరియంట్ సెప్టెంబర్‌లో బయటపడితే దేశంలో కరోనా థర్డ్‌వేవ్ వస్తుందని ఐఐటీ కాన్పూర్ సైంటిస్టు మనీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే రాబోయే అక్టోబర్– నవంబర్ మధ్య కాలంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కనిపిస్తుందని అంచనా వేశారు. అయితే ఎంత ప్రమాదకరమైన వేరియంట్‌తో థర్డ్‌వేవ్ వచ్చినా, దాని తీవ్రత సెకండ్ వేవ్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మేథమేటికల్ మోడలింగ్‌లో ఆయన నిపుణుడు. దేశంలో ఇన్ఫెక్షన్ల పెరుగుదలను అంచనా వేసే ముగ్గురు సభ్యుల బృందంలో ఆయన ఒకరు. సెప్టెంబర్ నాటికి కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే మాత్రం ఎలాంటి థర్డ్ వేవ్ రాదని ఆయన వెల్లడించారు. థర్డ్‌వేవ్ ఉధృత దశలో దేశీయంగా రోజుకు లక్ష కేసులు బయటపడవచ్చని అంచనా వేశారు. సెకండ్‌వేవ్ ప్రబలిన సమయంలో దేశీయంగా రోజుకు 4 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే! ‘‘న్యూ మ్యూటెంట్ రాకున్నా, కొత్త వేరియంట్ కనిపించకున్నా యథాతథ స్థితి ఉంటుంది. కొత్త వేరియంట్ సెప్టెంబర్ నాటికి బయటపడితే థర్డ్‌వేవ్ అవకాశాలుంటాయి.’’అని అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్, తద్వారా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు 1/33 వంతులని అంచనా వేశారు. ఇప్పటివరకు డెల్టాను మించిన ప్రమాదకరమైన వేరియంట్ ఇంకా బయటపడలేదు. డెల్టా కారణంగా థర్డ్‌వేవ్ ఆరంభమైనా, కొత్త వేరియంట్ పుట్టకపోవడంతో ఉధృతి కొనసాగడం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా నమోదైతున్న కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయి. -
త్వరలోనే థర్డ్ వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ముగిసిపోయి, మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్–అక్టోబర్ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించింది. థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించాలంటే కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి త్వరగా టీకా ఇవ్వాలని సూచించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) సమర్పించింది. మూడో వేవ్‌లో పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు ఉంటుందని తెలిపింది. భారీ సంఖ్యలో పిల్లలు వైరస్ బారినపడితే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం కొత్త వేరియంట్లతో ముప్పు జనాభాలో 67 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా యాంటీబాడీలు పెరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లేనని నిపుణుల కమిటీ గతంలో అభిప్రాయపడింది. ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాల్సిందేనని తాజాగా తెలిపింది. ఒకసారి సోకిన కరోనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా శరీరంలో పెరిగిన రోగ నిరోధక శక్తి నుంచి కొత్త వేరియంట్లు తప్పించుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. కొత్త వేరియంట్ల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వీలుగా సామూహిక నిరోధకత సాధించడానికి జనాభాలో 80–90 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలని తెలిపింది. సామూహిక నిరోధకత సాధించేదాకా.. భారత్‌లో ఇప్పటిదాకా 7.6 శాతం మందికే (10.4 కోట్లు) పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. వ్యాక్సినేషన్లో వేగం పెంచకపోతే థర్డ్ వేవ్‌లో నిత్యం 6 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని తేల్చిచెప్పింది. ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా సామూహిక నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించేదాకా కరోనాలో కొత్త వేవ్‌లు వస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారని గుర్తుచేసింది. కరోనా నియంత్రణ నిబంధనలను ఎత్తివేయడాన్ని బట్టి ఇండియాలో థర్డ్ వేవ్ మూడు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ–కాన్పూర్ నిపుణులు గతంలో తెలిపారు. ఒకటి.. థర్డ్ వేవ్ అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 3.2 పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయి. రెండోది.. అధిక తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో థర్డ్ వేవ్ సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజూ 5 లక్షల కేసులు బయటపడతాయి. ఇక మూడోది.. అక్టోబర్ మాసాంతంలో థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 2 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయి. వైరస్‌లో మార్పులు.. పిల్లలకు సవాలే థర్డ్ వేవ్‌లో పెద్దల కంటే పిల్లలే అధికంగా ప్రభావితం అవుతారని చెప్పడానికి ఇప్పటివరకైతే తగినంత సమాచారం లేదని నిపుణులు కమిటీ వివరించింది. కరోనా వైరస్‌లో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అవి పిల్లలకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని గుర్తుచేసింది. ఒకవేళ చిన్నారులకు కరోనా సోకినా అసలు లక్షణాలేవీ కనిపించకపోవడం, స్వల్పంగా కనిపించడం వంటివి ఉంటాయని వివరించింది. వారు అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నవారైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో 60–70 శాతం మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పిల్లల్లో అపాయకరమైన ఎంఐఎస్–సి(మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్) తలెత్తే అవకాశం ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో తెలియజేసింది. చదవండి:Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..! ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకొస్తేనే థర్డ్ వేవ్ కరోనాలో డెల్టా కంటే ఎక్కువ తీవ్రత కలిగిన కొత్త వేరియంట్ ఉద్భవిస్తే థర్డ్ వేవ్ నవంబర్‌లో గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ప్రముఖ సైంటిస్టు మహీంద్ర అగర్వాల్ సోమవారం చెప్పారు. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికి పూర్తి క్రియాశీలకంగా మారుతుందని అన్నారు. డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకురాకపోతే థర్డ్ వేవ్ దాదాపు రానట్లేనని అగర్వాల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి కొత్త వేరియంట్ బయటపడితే మూడో వేవ్‌లో నిత్యం 1.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
వేగంగా కోవిడ్ పూర్వ స్థాయికి ఎకానమీ
న్యూఢిల్లీ: కరోనావైరస్ కొత్త వేరియంట్లు, మరిన్ని వేవ్‌లు రావడంపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు వేగంగా కోవిడ్–19 పూర్వ స్థాయికి చేరుతున్నాయని పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. మహమ్మారిపరమైన ఆర్థిక సమస్యలను అదుపులో ఉంచడానికి రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు తోడ్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఇక టీకాల ప్రక్రియ పుంజుకుంటోండటంతో థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనే సామర్థ్యాలను భారత్ మెరుగుపర్చుకోగలదని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా బిర్లా ఈ విషయాలు తెలిపారు. నేషనల్ ఇన్ఫ్రా పైప్‌లైన్ ప్రాజెక్టులకు సంబంధించి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెట్టుబడులు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు, కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడా మహమ్మారిని ఎదుర్కొనడంలో చెప్పుకోతగ్గ స్థాయిలో సామర్థ్యాలు కనబర్చాయని బిర్లా వివరించారు. ఉత్పాదకత, డిజిటైజేషన్ చర్యలు వేగవంతంగా అమలు చేశాయని తెలిపారు. -
కేరళలో కొత్త వేరియంట్
-
అదిరిపోయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వర్షన్..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వెర్షన్‌ను బుధవారం రోజున విడుదల చేసింది. కొత్త డిస్కవరీలో న్యూ ఎల్ఈడీ హెడ్లైట్లు, టెయిల్ లైట్లు, ఫ్రెష్ ఫ్రంట్ రియర్ బంపర్లను అమర్చారు. అంతేకాకుండా కారు ఇంటిరీయర్స్‌లో న్యూ పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్తో 11.4 అంగుళాల హెచ్డి టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్‌తో ఆధునాతన కనెక్టివిటీ కల్గి ఉంది. న్యూ డిస్కవరీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ వేరియంట్లతో రానుంది.కారులో స్ట్రెయిట్-సిక్స్ ఇంజినియం ఇంజన్లను ఏర్పాటు చేశారు. పెట్రోల్ వేరియంట్ 265 కిలోవాట్ల సామర్థ్యాన్ని, 500ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజీల్వేరియంట్ 221 కిలోవాట్ల సామర్థ్యాన్ని 650ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిస్కవరీ కొత్త వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ .88.06 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డిస్కవరీ ఆధునాతన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రానుంది. భారత్‌లో ల్యాండ్ రోవర్ శ్రేణిలో రేంజ్ రోవర్ ఎవోక్ (రూ .59.04 లక్షలు నుంచి), డిస్కవరీ స్పోర్ట్ (రూ .65.30 లక్షలు), డిఫెండర్ 110 (రూ .83.38 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 91.27 లక్షలు) రేంజ్ రోవర్ రూ. 2.10 కోట్లుగా ఉన్నాయి. జెఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ దర్శకుడు రోహిత్ సూరి మాట్లాడుతూ..కొత్త డిస్కవరీ, ల్యాండ్ రోవర్ కార్లలో తన సామర్ధ్యాన్ని నిలుపుకుంటూ, నూతన ఆవిష్కరణతో, లగ్జరీ లుక్‌ను అందిస్తోంది. అడ్వెంచరస్ ప్రయాణాలకు ఉత్తమమైన ఎస్యూవీ అని ఒక ప్రకటనలో తెలిపారు. -
మార్కెట్లోకి నయా ఆడి ఎలక్ట్రిక్ కారు వేరియంట్లు..! ధర ఎంతంటే
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు ఆడి భారత విపణిలోకి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లు ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ అనే రెండు రకాల బాడీ స్టైల్స్‌తో ఆడి కస్టమర్లకు అందించనుంది. తొలిసారిగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మల్టీపుల్ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చిన లగ్జరీ కార్ల సంస్థగా ఆడి నిలిచింది. ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లలో ఈ-ట్రోన్50, ఈ-ట్రోన్55, ఈ-ట్రోన్55 స్పోర్ట్స్ బ్యాక్ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఆడి ఈ-ట్రోన్50 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 99 లక్షలు, ఈ-ట్రోన్55 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.1కోట్లు, ఈ-ట్రోన్55 స్పోర్ట్‌బ్యాక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.2 కోట్లుగా నిర్ణయించారు. ఈ కార్లు 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. ఈ ట్రోన్ కారుని న్యూ ఏజ్ లగ్జరీ ఎస్‌యూవీగా ఆడి పేర్కొంటోంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్ల ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ EQC, జాగ్వర్ ఐ పేస్ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. -
దేశంలో కొత్త కరోనా వేరియంట్ కలకలం
-
యూపీలో ‘కప్పా’ వేరియంట్ కలకలం, ఒకరు మృతి
సాక్షి, లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్ కలకలం రేపుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళన రేపిన ఆందోళన ఇంకా సమసిపోకముందే యూపీలో కరోనా కొత్త వేరియంట్ ‘కప్పా’ పాజిటివ్ నిర్ణారణ అయిన 66 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇతడిని సంత్ కబీర్ నగర్ జిల్లా నివాసిగా అధికారులు గుర్తించారు. జూన్ 13 న రొటీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో భాగంగా సేకరించిన నమూనాలో దీన్ని గుర్తించారు. అనంతరం వీటి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ కి పంపించారు. మే 27 న కోవిడ్ -19 కు పాజిటివ్ నిర్ధారణ కాగా, జూన్ 12 న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడికల్ కాలేజీకి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ జూన్ 14న కన్నుమూశాడని కాలేజీ మైక్రోబయాలజీ విభాగం అధిపతి అమ్రేష్ సింగ్ ధ్రువీకరించారు. అంతకుముందు యూపీలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాగా రాష్ట్రంలో గురువారం (జూలై 8) నాటి గణాంకాల ప్రకారం 112 కొత్త కేసులతో మొత్తం సంఖ్య 17,07,044 కి చేరింది. 10 మరణాలతో ఈ సంఖ్య 22,676 కు చేరుకుంది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌ను ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 50కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇపుడిక కప్పా వేరియంట్ ఉనికి ఆందోళన రేపుతోంది. -
కరోనా సంబంధ మిస్సిజబ్బు.. 5 ఏళ్ల బాలిక మృతి..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): కరోనా సంబంధ మిస్సి జబ్బుతో ఐదేళ్ల బాలిక దావణగెరెలో మృతిచెందింది. దావణగెరె జిల్లా కలెక్టర్ మహంతేశ్ బీళగి తెలిపిన వివరాల మేరకు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చిత్రదుర్గ నుంచి తీసుకొచ్చిన బాలిక చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చనిపోయింది. దావణగెరెలో మొత్తం 10 మిస్సి కేసులు నమోదు కాగా వారిలో 8 మంది కోలుకోగా, ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరైన బాలిక కన్నమూసింది. కరోనాకు గురైన, కోలుకున్న 8 నుంచి 18 ఏళ్లు లోపు పిల్లల్లో ఈ రోగం కనబడుతుంది. 70 శాతం కంటే తక్కువ మందిలో శ్వాసకోశ, రక్తపోటు ఇబ్బందులు, న్యూమోనియా పీడించే ప్రమాదముంది. వివిధ అవయవాలు విఫలమయ్యే ప్రమాదముంది. చికిత్సకు లక్షల రూపాయల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చదవండి: రోమియోకు కటకటాలు.. -
Lamborghini : వావ్... అప్పటి వరకు ఆగలేం?
హై ఎండ్ అల్ట్రా మోడ్రన్ లంబోర్గిని తన ఫ్యాన్స్‌కు కిర్రెక్కించే పని చేసింది. సూపర్ కార్గా పేరొందిన అవెంటడోర్ మోడల్లో నెక్ట్స్ వేరియంట్‌కి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టులలో అవెంటడోర్ లుక్స్ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. జులైన 7న మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు లంబోర్గిని తెలిపింది. చివరి వేరియంట్ సక్సెస్ఫుల్ మోడల్ అవెంటడోర్కి ఘనమైన ముగింపు పలికేందుకు లంబోర్గిని సిద్ధమైంది. 2011లో తొలిసారిగా అవెటడోర్ని మార్కెట్లోకి తెచ్చింది. సూపర్‌కార్‌గా మార్కెట్‌ని ఉర్రూతలూగించింది అవెంటడోర్. పదేళ్లు గడిచిన తర్వాత అవెంటడోర్లో చివరి వేరియంట్‌ని అవెంటడోర్ ఎస్ జోటా పేరుతో లంబోర్గిని రిలీజ్ చేయబోతుంది. కేవలం ఒకే ఒక్క ఫోటో రిలీజ్ చేసి లంబోర్గిని లవర్స్‌లో ఉత్సుకతని రేపింది. 2021 జులై 7వ న కంపెనీ వెల్లడించే వివరాల కోసం ఎదురు చూసేలా చేయడంలో లంబోర్గిని విజయం సాధించింది. ఈవీపై ఫోకస్ అవెంటడోర్ మోడళ్లలో అత్యంత పవర్ఫుల్ కారుగా ఎస్ జోటా రాబోతుంది. ఇందులో 1.5 లీటర్ వీ 12 ఇంజన్ని అమర్చారు. ఈ కారు 796 హర్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా లంబోర్గిని కూడా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న హురకాన్, అవెంటడోర్, ఉరస్ స్పోర్ట్స్ మోడళ్లలో ఒకదాన్ని పూర్తిగా ఈవీకి షిఫ్ట్ చేసే దిశగా లంబోర్గిని అడుగులు వేస్తోంది. చదవండి : హైస్పీడులో లగ్జరీ కార్ సేల్స్ -
Stockmarkets: డెల్టా సెగ, ఇన్ఫీ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాల్గవ సెషన్లో కూడా నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 164 పాయింట్లు క్షీణించి 52,318 వద్ద ముగియగా, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 15,680 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్ 52500, నిఫ్టీ 15700 స్థాయిని కోల్పోయాయి. ఆటో, ఫార్మ లాభపడగా,బ్యాంకింగ్ ,రియాల్టీ ఇతర రంగాల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిసాయి. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి డెల్టా, డెల్టా ప్లస్ కొత్త వేరియంట్లు పెరుగుతున్న ఆందోళన పెట్టుబడిదారులను వెంటాడినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టిసిఎస్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.డాక్టర్ రెడ్డి ల్యాబ్, బజాజ్-ఆటో, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టైటాన్ లాభపడ్డాయి. చదవండి: Stockmarkets : నష్టాలు, వొడాఫోన్ ఐడియా ఢమాల్! Twitter down: సమ్‌థింగ్ వెంట్ రాంగ్.. -
సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..!
ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ టియాగో కొత్త వర్షన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టాటా మోటార్స్ హ్యచ్‌బ్యాక్ కార్లలో భాగంగా కొత్త టియాగో ఎక్స్‌టీ(ఓ) వేరియంట్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5. 48 లక్షలుగా నిర్ణయించారు. కొత్త ఎక్స్‌టీ(ఓ), ట్రిమ్ బేస్ ఎక్స్ ఈ, మిడ్ ఎక్స్‌టీ టియాగో కార్ల శ్రేణిలో నిలవనుంది. కొత్త ఎక్స్‌టి (ఓ) ట్రిమ్ ధర టియాగో ఎక్స్‌టి ట్రిమ్ కంటే కేవలం రూ .15,000 తక్కువ. ఎక్స్ఇ ట్రిమ్ కంటే రూ .47,900 ఎక్కువ. ఎక్స్ఇ ట్రిమ్‌తో పోల్చినప్పుడు, ఎక్స్‌టీ(ఓ) 14-అంగుళాల స్టీల్ రిమ్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో ఔట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్‌తో పాటు(ఓఆర్వీఎమ్)తో పాటు వీల్ క్యాప్స్‌ను అందిస్తోంది. ఇంటీరియర్ విషయానికి వస్తే ... స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఐఆర్విఎం, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికలి అడ్జస్ట్ చేయగల ఓఆర్వీఎమ్లు, నాలుగు స్పీకర్లు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లను కలిగి ఉంది. స్టీరింగ్ వీల్‌పై ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. కొత్త ఎక్స్‌టి (ఓ) ట్రిమ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇంజన్ 84 బిహెచ్పి సామర్ధ్యంతో 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బ్యాక్స్ సిస్టమ్‌ను కారులో అమర్చారు. చదవండి: కరోనా కట్టడిలో టాటా గ్రూపు -
థర్డ్‌వేవ్ భయంతో లాక్డౌన్ ఎత్తివేత్తపై యూకే తర్జనభర్జన!
లండన్: బ్రిటన్‌లో కరోనా డెల్టా వేరియంట్ కేసులు వారంలో 33,630కి పెరిగాయి. దీంతో దేశంలో మొత్తం డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య 75,953కు చేరింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులన్నింటిలో 99 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. యూకేలో వేరియంట్ ఆఫ్ కన్సెర్న్(వీఓసీ– ఆందోళన కరమైన వేరియంట్) కేసులను పర్యవేక్షించే పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ), ప్రకారం ఆల్ఫా వీఓసితో పోలిస్తే డెల్టా వీఓసీతో ఆస్పత్రి పాలయ్యే రిస్కు అధికంగా ఉంది. దేశంలో ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రి పాలయ్యే ముప్పు గణనీయంగా తగ్గిందని పీహెచ్ఈ గణాంకాలు వెల్లడించాయి. కాగా జూన్ 14 నాటికి డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో 806మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 527 మంది టీకా తీసుకోనివారు కాగా, 84 మంది రెండు డోసులు తీసుకున్నవారున్నారు. డెల్టా వేరియంట్ కారణంగా మరణాలు ఎక్కువగాలేవని, అయితే సాధారణంగా కొత్త వేరియంట్లు వచ్చిన తర్వాత మరణాల రేటు కొన్ని వారాల అనంతరం పెరుగుతుందని, అందువల్ల డెల్టా వేరియంట్ మరణకారక రేటును ఇప్పుడే మదింపు చేయలేమని పీహెచ్ఈ తెలిపింది. కోవిడ్ టీకా తీసుకున్న వారిలో మరోమారు కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయని తెలిపింది. యూకేలో థర్డ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ కారణమవుతుందన్న భయాలతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడానికి ప్రభుత్వం వెనకాముందాడుతోంది. చదవండి: డెల్టాప్లస్ మూడో వేవా? కొత్త వేరియంట్‌పై ఆందోళన -
డెల్టాప్లస్ మూడో వేవా? కొత్త వేరియంట్‌పై ఆందోళన
మొదటి వేవ్ చివరిలో ఏర్పడిన కరోనా వేరియంట్లు మ్యుటేట్ అయి ఈ ఏడాది జనవరిలో డెల్టా వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. ఇది రెండో వేవ్‌కు కారణమైంది. ఇప్పుడా డెల్టా రకం మరింతగా మ్యుటేషన్ చెంది ‘డెల్టా ప్లస్ (ఏవై 1)’గా మారింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో దీనితో కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ దీంతో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటించకుంటే మరో నెల రోజుల్లోనే మూడో వేవ్ మొదలవుతుందని, డెల్టా ప్లస్ విజృంభించే చాన్సుందని మహారాష్ట్ర సర్కారు ఇటీవలే హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆ రాష్ట్రంలో తొలిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. ఓ మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించిన అధికారులు.. కాంటాక్టులకు టెస్టులు చేయిస్తున్నామన్నారు. జార్ఖండ్‌లోనూ డెల్టా ప్లస్ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర సర్కారు పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ స్థాయిలో కేసులకు కారణమైన కరోనా డెల్టా వేరియంట్ నియంత్రణలోకి వస్తోంది. కానీ ఇంతలోనే డెల్టా వేరియంట్ మ్యుటేషన్ చెంది.. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారిందని పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. ఈ వేరియంట్ కారణంగా మూడో వేవ్ రావొచ్చన్న అంచనాలతో మరోసారి ఆందోళన మొదలైంది. ఇప్పటికే దేశాన్ని గడగడలాడించిన డెల్టా నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనివల్ల ప్రమాదం ఎంత వరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, వ్యాక్సిన్లతో ప్రయోజనం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో ఇప్పటికే చాలామంది డెల్టా వేరియంట్ బారినపడి కోలుకున్నందున.. డెల్టా ప్లస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కొందరు వైద్య నిపుణులు, పరిశోధకులు చెప్తున్నారు. మరోవైపు దేశంలో కొన్ని కేసులే నమోదయ్యాయని, దాని ప్రభావమేంటో తెలిసేందుకు ఒకట్రెండు నెలలు పడుతుందని.. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండక తప్పదని మరికొందరు సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్, మూడో వేవ్ అంచనాలపై పల్మనాలజిస్ట్ వీవీ రమణప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్ మాదల తమ అభిప్రాయాలు పంచుకున్నారు. డెల్టా ప్లస్‌తో మూడో వేవ్! సైద్ధాంతికంగా చూస్తే మనదేశంలో కరోనా మూడో వేవ్ డెల్టా ప్లస్ వేరియెంట్‌తోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోదశ రావొచ్చనే అంచనాలు ఎక్కువగానే ఉన్నందున.. అది డెల్టా ప్లస్ ఆ రూపంలోనే ఉండే అవకాశాలు ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు అవసరం. వ్యాక్సిన్లను కూడా తప్పించుకుని ‘ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం’ కిందకు కొత్త వేరియంట్ మారుతుందని కొందరు సూత్రీకరణలు చేస్తున్నా.. అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. దేశంలో కరోనా రెండో వేవ్ ఉధృతికి కారణమైన డెల్టా వేరియెంట్‌పై ఇప్పటికే మన దగ్గరున్న వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని వివిధ పరిశోధనలు తేల్చాయి. అందువల్ల ప్రస్తుతం వ్యాక్సినేషన్ అనేది కీలకంగా మారింది. వీలైనంత త్వరగా అవకాశమున్న మేర రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రస్తుత లాక్ డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలి. రెండో వేవ్ మాదిరిగానే మూడో వేవ్‌కు కూడా మహారాష్ట్ర నుంచే డెల్టా ప్లస్ వేరియెంట్‌తో మొదలయ్యే అవకాశం ఉంది. మూడో వేవ్ రాదనే అజాగ్రత్త వదిలేసి, డెల్టా ప్లస్ వేరియెంట్ పట్ల మరింత జాగరూకతతో వ్యవహరించాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు, ప్రజలు అంతా అప్రమత్తంగా వ్యవహరించాలి. డెల్టా ప్లస్ వేరియెంట్ ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుందనే ఒకటి రెండు నెలల్లో స్పష్టత వస్తుంది. ఒకవేళ డెల్టా ప్లస్ వేరియెంట్ విపరీతంగా వ్యాప్తి చెందినా.. తీవ్రత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం. - డాక్టర్ వీవీ రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ప్రమాదం పెద్దగా ఉండకపోవచ్చు వైరస్ మ్యుటేషన్లలో సాధారణంగా స్పైక్ ప్రోటీన్ , రెసెప్టార్ బైండింగ్ డొమైన్ వంటివి మారుతుంటాయి. మనదేశంలో ఈ ఏడాది జనవరిలో బి.1.617 వేరియెంట్‌తో మహారాష్ట్రలో సెకండ్ వేవ్ మొదలైంది. మార్చి నాటికి అది డెల్టా (బీ.1.617.2) వేరియంట్‌గా రూపాంతరం చెంది తీవ్రత, వ్యాప్తి వేగం పెరిగింది. ఏప్రిల్ కల్లా దేశంలోని 50 శాతం కేసులకు, మే నాటికి 90 శాతం కేసులకు ఆ వేరియెంటే కారణమైంది. ఇప్పుడు రెండో వేవ్ తగ్గుతున్న దశలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా శాంపిళ్లను పరిశీలిస్తే 20 శాతం దాకా డెల్టా వేరియంట్ వ్యాప్తిలో ఉంది. కొత్తగా నమోదయ్యే కేసుల్లో.. అమెరికాలో పదిశాతం, బ్రిటన్‌లో 60 శాతం దాకా ఇదే ఉంది. ప్రస్తుతం విదేశాల్లో ఈ వేరియెంట్ విస్తృతి దశలో ఉంది. అంటే.. మనకు ఇటీవలి మార్చిలో ఉన్నప్పటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ అలాంటి సమయంలోనే రెండు మార్పులు జరిగి డెల్టాగా మ్యుటేషన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. మనం ఉధృతి దశను దాటి వచ్చేశాం. డెల్టా వేరియెంట్‌కు ఇప్పటికే దేశంలో చాలా వరకు ప్రజలు ఎఫెక్ట్ అయ్యి ఉంటారని అహ్మదాబాద్ సెరో ప్రివెలెన్స్ సర్వేను బట్టి తెలుస్తోంది. దేశంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరికి యాంటీబాడీస్ కూడా ఉత్పత్తయి ఉంటాయని అంచనా వేశారు. ప్రజలు ఇంత భారీగా ఒక మ్యుటేషన్‌తో ప్రభావితమయ్యాక.. కొద్దికాలంలోనే మరో మ్యుటేషన్ బారిన పడటం జరగదని అంచనా వేస్తున్నారు. అదీగాక డెల్టా నుంచే, కేవలం 10 శాతం మార్పులతో వచ్చే మ్యుటేషన్‌కు పెద్దగా ప్రభావం చూపేంత శక్తి ఉండదు. అలాగాకుండా ఇండియాదే మరో తీవ్రమైన మ్యుటేషన్ వస్తే ప్రమాదకరం అయ్యే అవకాశాలు ఉంటాయి. - డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి నెల రోజుల్లోనే మూడో వేవ్! దేశంలో కరోనా రెండో వేవ్ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్ కూడా మొదలుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఇదే హెచ్చరిక చేసింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మూడో వేవ్ రావొచ్చని అంచనా వేసింది. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, భారీగా గుమిగూడటం ఇలాగే కొనసాగితే.. మరో నెల రోజుల్లోనే మూడో వేవ్ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా పరిస్థితిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇటీవల ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మూడో వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించారు. మూడో వేవ్ తీవ్రంగా ఉండొచ్చని, కేవలం మహారాష్ట్రలోనే యాక్టివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరొచ్చని.. బాధితుల్లో పది శాతం వరకు పిల్లలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. కాగా మన దేశంలో వచ్చిన కరోనా రెండు వేవ్‌లలో మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితమైంది. తొలివేవ్‌లో 19 లక్షల కేసులు, రెండో వేవ్‌లో ఏకంగా 40 లక్షల కేసులు వచ్చాయి. మూడో వేవ్‌లో ఇంతకు రెండింతలుగా ఏకంగా 80 లక్షల వరకు కేసులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. బెడ్లు, ఆక్సిజన్, మందుల స్టాకుపై దృష్టి మూడో వేవ్ సన్నద్ధతలో భాగంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని.. బెడ్లు, ఆక్సిజన్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మహారాష్ట్ర సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టాలని సూచించారు. పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవాలని.. ప్రజలంతా భౌతిక దూరం, మాస్కులు వంటి కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లోనూ కేసులు.. జార్ఖండ్ రాష్ట్రంలోనూ పలు డెల్టా ప్లస్ కోవిడ్ కేసులను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కొందరు పేషెంట్ల శాంపిల్స్‌ను భువనేశ్వర్‌లోని ల్యాబ్‌కు పంపామని, అక్కడ చేసిన వైరస్ జన్యు పరీక్షల్లో డెల్టా ప్లస్‌గా గుర్తించినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరం కావొచ్చని, దీని వ్యాప్తి తీవ్రతపై ఇంకా నిర్ధారణ జరగాల్సి ఉందని జార్ఖండ్‌లోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మైక్రో బయాలజీ విభాగం అధిపతి మనోజ్ కుమార్ వెల్లడించారు. స్పైక్ ప్రొటీన్‌లో మార్పులతో.. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ (బీ.1.167.2)లో మ్యూటేషన్లు జరిగి డెల్టా ప్లస్ (ఏవై.1)గా రూపాంతరం చెందింది. కరోనా వైరస్ మన శరీర కణాలకు అతుక్కుని, లోపలికి ప్రవేశించేందుకు తోడ్పడే స్పైక్ ప్రొటీన్‌లో మార్పులు జరిగాయి. ఈ మార్పును ‘కే417ఎన్’గా పిలుస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసిన వ్యాక్సిన్లలో చాలా వరకు ఈ స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే పనిచేస్తాయి. ఇప్పుడీ ప్రొటీన్లోనే మార్పులు రావడంతో వ్యాక్సిన్లు ఎంత వరకు ప్రభావం చూపగలవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ సోకడం, వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీల నుంచి కొత్త వేరియంట్ తప్పించుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా ప్లస్ వేరియంట్లో వచ్చిన కొత్త మార్పులు కేవలం పదిశాతమేనని, దాని ప్రభావం మరీ ఎక్కువగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వ్యాప్తి విపరీతంగా ఉన్నా.. ప్రమాదకరంగా మారే అవకాశం తక్కువనే ఆశాభావం కనిపిస్తోంది. కాగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ ఔషధం ప్రభావం నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ తప్పించుకుంటున్నట్టుగా ఇటీవలి పరిశోధనల్లో గుర్తించారు. -
జడుపు వీడి జాగ్రత్తపడదాం
భయాలను అధిగమించే సాక్షాధారాలు, శాస్త్రీయ సమాచారమే మనిషి మనుగడకు దీపదారి. మానవేతిహాస సుదీర్ఘ గమనంలో కాలపరీక్షకు నిలిచిన నిజాలే మనిషి జీవన గమనాన్ని శాసించాయి. నిష్కారణ భయాలు, నిర్హేతుక ఆందోళనలు కాలం గడిచే కొద్దీ గాలికి కొట్టుకు పోయే దూదిపింజల్లా కనుమరుగయ్యాయి. ఏ కొత్త పరిణామం విషయంలోనైనా... అనిశ్చితి వల్ల భయాందోళనతో గడపటమా? భరోసాతో నిర్భయంగా ఉండటమా అన్నది వాస్తవిక సమాచారాన్ని బట్టే ఉంటుంది. కోవిడ్-19 మూడో అల గురించి, ముఖ్యంగా పిల్లలకు ప్రమాద మని వస్తున్న వార్తలు, వార్తా కథనాలు గగుర్పాటు పుట్టిస్తున్నాయి. ఆయా కథనాలు, అంచనాల వెనుక శాస్త్రీయత ఎంత? సాక్షాధారాలపై అధ్యయనాలు చెబుతున్నదేమిటి? నిపుణుల విశ్లేషణలెలా ఉన్నాయి...? అని చూసినపుడు పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. వాస్తవికత కన్నా అంచనాలే అధికం. సాక్షాధారాల కన్నా ప్రమాద ఆస్కారపు భయాలే ఎక్కువ ప్రచారం లోకి వచ్చాయి. వీటిని గుడ్డిగా నమ్మకుండా, కాస్త లోతుగా విశ్లేషించినపుడు... కలతతో భయాందోళన చెందాల్సినంత ప్రమాదం లేదనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. కొన్ని అధ్యయనాల్లో పౌరుల, పిల్లల మానసిక స్థితి అదుపు తప్పి అరిష్టాలు సృష్టించిన ఉదంతాలున్నాయి. కనుక, ప్రాథమిక అవగాహన, సంపూర్ణ విషయ పరిజ్ఞానంతో మసలుకోవడమే మేలు. అంటే... నిర్లక్ష్యంగానో, ఏదీ పట్టనట్టో ఉండా లని కాదు! అలా అని, లేని భయాలతో పరుగులు పెట్టి స్వయంగాను, ఇతరులను ఆందోళనకు గురిచేయవద్దనేది భావన! కోవిడ్-19 కారణమవుతున్న కరోనా వైరస్ తరచూ ఉత్పరివర్తన చెందుతూ స్వభావాన్ని మార్చుకుంటున్న తీరు, ప్రభావితం చేస్తున్న పోకడ ప్రమాదకరంగానే ఉంది. మొదటి అల కన్నా రెండో అల సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూశాం. దేశంలో నిలకడగా రోజూ నాలుగు లక్షలకు తగ్గకుండా కేసులు నమోదైన దుస్థితి! పాతిక రోజుల్లో లక్షమంది మరణించారు. కొత్త వైవిధ్యం ‘డెల్టా’ వల్ల ఇంతటి ఉపద్రవం అనేది విశ్లేషణ! ఇలాగే, ‘డెల్టా ప్లస్’, మరో ఉత్పరి వర్తన- వైవిధ్యంతో వైరస్ రేపు ఇంకో రూపు సంతరించుకుంటే అనివార్యంగా ‘మూడో అల‘ పుట్టొచ్చు! ప్రతికూల ప్రభావమూ చూపొచ్చు. దాన్నెవరూ కాదనలేరు. అది చూపే తీవ్రత, కలిగించే నష్టం మాత్రం, మన వ్యవహార శైలిని బట్టే ఉంటుంది. మొదటి అల ప్రభావం తగ్గిన వెంటనే... మనం ఆంక్షలు సడలించి, నిర్భందం ఎత్తేసి, కట్టడిని తొలగించిన వైనం సవ్యంగా లేకుండింది. మార్గదర్శకాల్ని గాలికి వదిలి... మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా, గుంపులుగా కలియతిరుగుతూ జనం చేసిన స్వేచ్ఛా విహారం వైరస్ వ్యాప్తిని పెంచింది. ఫలితంగా రెండో అల ఉదృతమైంది. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) పూర్తిగా మరిచాం. ప్రమాదస్థితి చెయిదాటి, మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మొదటి, రెండో అలల సందర్భంగా దేశంలో, ప్రపంచ వ్యాప్తంగానూ పిలల్లలపై అవి చూపిన ప్రభావం గురించి పలు అధ్యయనాలు జరిగాయి. కోవిడ్ సోకిన పిల్లల్లో (నవజాత శిశువులు కాకుండా పదేళ్ల లోపు వారు) 0.1 నుంచి 1.9 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. ఆస్పత్రి పాలైన వారిలోనూ 1.3 నుంచి 3.2 శాతం మంది మరణించారు. అందులో 40 శాతం మంది, అప్పటికే ఇతరేతర జబ్బుల (కోమార్బిడిటీస్)తో ఉన్నవారు. మన దేశంలో కోవిడ్ వల్ల మరణించిన మొత్తం 3.7 లక్షల మందిలో పిల్లలు 0.1 శాతం అనేది గుర్తించాలి. కారణం ఏమైతేనేం, రెండు అలల సందర్భంగా పిల్లల విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పటివరకు పెద్దలకు టీకా మందు ఇప్పిస్తున్నాము. పిల్లల టీకా గురించి ఇంకా ఆలోచించలేదు. టీకా పొందిన వారికి వైరస్ సోకినా ప్రాణాంతక ప్రమాదం లేక, వారు వైరస్ వాహకులుగా పిల్లలకు వ్యాధిని అంటించవచ్చు... ఇలాంటి వేర్వేరు కారణాల వల్ల రేపు, మూడో అల వచ్చి, ఉదృతంగా ఉంటే... పిల్ల లకు అధిక ప్రమాద ఆస్కారం ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇదొక ముందు జాగ్రత్త! అంతే తప్ప, మూడో అలలో వైరస్ పిల్లల కోసమే రాదు! వారికి వైరస్ సోకనీకుండా, సోకే ఆస్కారం తొలగించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలపై తీవ్రత ప్రభావం అధ్యయనానికి ప్రత్యే కంగా ఏర్పాటైన ‘లాన్సెట్–కోవిడ్ కమిషన్ ఇండియా టాస్క్‌ఫోర్స్’ నిపుణులు కూడా ఇదే సూచించారు. పిల్లల మానసిక స్థితిపై కోవిడ్ ప్రభావం గురించి 10 దేశాల్లో జరిగిన 15 అధ్యయనాల ప్రకారం... 22,996 మంది పిల్లలు/ కౌమారుల్లో, 79.4 శాతం మంది కోవిడ్‌కు భయపడి క్వరంటైన్ అయ్యారు. 21.3 శాతం మంది నిద్రలేమి/ నిద్రా భంగానికి గురయ్యారు. 22.5 శాతం మంది భయం వల్ల ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. పిల్లలు మానసికంగా ఆందోళనకు గురికాకుండా చూడాలని నిపుణుల సూచన. వైరస్ సోకే ఆస్కారం లేకుండా జాగ్రత్త పడాలి. మంద్రంగా లక్షణాలు కనిపించినా ఇంట్లోనే వేరుగా (ఐసొలేషన్) ఉంచి, జ్వరం మాత్రలు వేయాలి. కొంచెం తీవ్రత, ఇన్ఫెక్షన్ వంటివి వస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియను ముమ్మరం చేయాలి. ప్రస్తుత కట్టడిని దశల వారిగా ఉపసంహరించాలి. పౌరులు కోవిడ్ సముచిత ప్రవర్తనతో మెదలాలి. పిల్లల్ని కాపాడుకోవడమంటే మన భవిష్యత్తును భద్రపరచుకోవడమే! ఇది మనవిధి, అంతకు మించి కర్తవ్యం! -
దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం
►మళ్లీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తే డెల్టా వేరియంట్ లేదా కొత్త వేరియంట్లు, మ్యూటెంట్ల వల్ల ప్రమాదం పెరిగే అవకాశాలున్నాయి. ఇక రాబోయే కొత్త వేరియంట్ల స్వభావ, స్వరూపాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఎవరూ ముందుగా ఊహించలేరు. సాక్షి, హైదరాబాద్: ఫస్ట్‌వేవ్ తర్వాత జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంతో సెకండ్‌వేవ్‌కు కారణ మైన విధంగానే మళ్లీ వ్యవహరిస్తే.. థర్డ్‌వేవ్‌ను చేజేతులా మనమే ఆహ్వానించినట్టు అవుతుందని ఢిల్లీ లోని ఎయిమ్స్ పల్మనరీ క్రిటికల్ కేర్ మాజీ విభాగాధిపతి, పీఎస్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్ ఆఫ్ పల్మనరీ, స్లీప్‌మెడిసిన్స్ చైర్మన్ డాక్టర్ జీసీ ఖిల్నానీ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గుతున్నా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్, ఇతర వేరియంట్లను టీకాలు పూర్తిస్థాయిలో అడ్డుకోలేక పోవడం ఆందోళన కలిగిస్తున్న అంశమని అన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్క టే మార్గమని స్పష్టం చేశారు. దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్న జనాభా కూడా 4 శాతం లోపే ఉండడాన్ని ప్రత్యేకంగా గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండుడోసుల టీకా తీసుకున్న 5 నుంచి 10 శాతం మందికి కోవిడ్ నుంచి రక్షణ లభించడం లేదని, దాదాపు 27% జనాభాలో ఇన్ఫెక్షన్లు సోకినా లక్షణాలు కనిపించడం లేదని (అసింప్టమాటిక్), వైరస్లలో 64% దాకా వేరియెంట్లు (మ్యూటెంట్లు) ఆందోళనకు కారణమవుతున్నట్టుగా అమెరికాలోని సీడీసీ అధ్యయనం పేర్కొన్న విషయాన్ని ఆయన ఉటంకించారు. కొన్ని వేరియంట్లపై వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల రెండో డోసు తీసుకునే వ్యవధిని తగ్గించాలని ఇటీవల లాన్సెట్ జర్నల్ తన అధ్యయనంలో స్పష్టం చేసిందంటున్న ఖిల్నానీతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దాడి చేశాకే లక్షణాలు తెలుస్తాయి ప్రమాదకరంగా మారిన డెల్టాతో పాటు కొత్త వేరియంట్ల ప్రభావాన్ని బట్టి థర్డ్‌వేవ్‌లో వ్యాధి తీవ్రత, దాని పర్యవసనాలు ఆధారపడి ఉంటాయి. ఇతర వేరియంట్లతో పోల్చితే డెల్టాకు 40 నుంచి 80 శాతం అధికంగా సోకే గుణంతో పాటు ఎక్కువ తీవ్రత కారణంగా ఎక్కువ మరణాలు సంభవిచ్చవచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. సెకండ్‌వేవ్ అన్లాకింగ్ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ నిర్లక్ష్యం వహిస్తే అదే డెల్టా వేరియంట్ లేదా కొత్త వేరియంట్లు, మ్యుటెంట్లు దాడిచేశాకే ఆయా లక్షణా లు తెలుస్తాయి. అందువల్ల మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి మ్యూటెంట్లు, వేరియంట్ల నుంచి అయినా రక్షణ లభిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. డాక్టర్ జీసీ ఖిల్నానీ కఠిన లాక్‌డౌన్‌తోనే అదుపులోకి.... ప్రస్తుతం భారత్‌లో లాక్డౌన్ కఠినంగా అమలు చేయడం, వైరస్ వ్యాప్తి నిరోధానికి అనుసరించిన ‘కంటైన్మెంట్ స్ట్రాటజీ’కారణంగానే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనాపై పోరుకు వ్యాక్సినే ప్రధాన ఆయుధంగా నిలుస్తున్నా.. కనీసం 60, 70 శాతం మందికి వ్యాక్సిన్లు వేసే వరకు కోవిడ్ నియంత్రణకు అవసరమైన ప్రవర్తనా నియమావళే మనకు రక్షణగా నిలవనుంది. సెకండ్‌వేవ్‌కు అదే కారణం సెకండ్‌వేవ్ తీవ్రస్థాయిలో దాడి చేయడానికి గత అక్టోబర్–మార్చి మధ్యకాలంలో మాస్క్‌లు, భౌతికదూరం, ఇతర జాగ్రత్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ప్రధానకారణమని అందరూ గ్రహించాలి. కోవిడ్ మహమ్మారి ఇక ముగిసిన అధ్యాయమన్న భ్రమకు, భావనకు అధికశాతం మంది లోనుకావడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం రెండోదశ క్షీణదశకు చేరుకుని కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో మళ్లీ పాత కథ పునరావృతం కాకూడదు. అదే జరిగితే వేగంగా రూపుమార్చుకుంటూ వ్యాక్సిన్లకు లొంగని కరోనా కొత్త మ్యూటెంట్లు, వేరియంట్లు విజృంభిస్తే కొత్త ఉపద్రవాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. -
ఆ వేరియంట్ వల్లే భారీగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రెండు నెలలుగా భారీగా కోవిడ్ కేసులు పెరగడానికి బి.1.617 వేరియంటే ప్రధాన కారణమని ఇండియన్ సార్స్–కోవ్–2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్(ఇన్సాకాగ్) స్పష్టం చేసింది. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా భారీగా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారిగా యూకేలో బయటపడిన వైరస్ వేరియం ట్ బి.1.1.7 లేదా ఆల్ఫా కేసులు ఇప్పుడు దేశంలో ఒకటిన్నర నెలలుగా తగ్గుముఖం పట్టాయని దేశం లోని 10 జాతీయ స్థాయి ప్రయోగశాలల ఉమ్మడి వేదిక ఇన్సాకాగ్ తెలిపింది. కోవిడ్ వేరియంట్ బి.1.617 కేసులు మొదటిసారిగా మహారాష్ట్రలో బయటపడగా ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణల్లోనూ పెరిగినట్లు తెలిపింది. గడిచిన 2 నెలలుగా కొన్ని రాష్ట్రా ల్లో భారీగా కేసులు పెరగటానికి బి.1.617 వేరియంట్‌కు సంబంధం ఉందని ఇన్సాకాగ్ పే ర్కొంది. ఈ వేరియంట్ ఇప్పుడు బి.1.617.1, బి.1.617.2, బి1.671.3 అనే వేరియంట్లుగా మారినట్లు తెలిపింది. ఇందులోని బి.1.617.2 వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల దీనికి డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసినట్లు గుర్తు చేసింది. వారణాసి ప్రాంతంలో 7 వేరియంట్లు సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతంలో కనీసం 7 కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ, (బీహెచ్‌యూ) సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్త అధ్యయనంలో తేలింది. వారణాసి పరిసర ప్రాంతాల్లోని పలు వేరియంట్ల జన్యుక్రమాలను విశ్లేషించి పరిశీలించినప్పుడు ఈ ఏడు రకాలు ఆ ప్రాంతంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తెలిసిందని సీసీఎంబీ తెలిపింది. దేశంలో రెండో దఫా కోవిడ్ కేసులు పెరిగేందుకు కూడా ఈ వేరియంటే కారణమని బీహెచ్‌యూ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సింగ్ తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే బి.1.617.2 లేదా డెల్టా వేరియంట్ కూడా ఈ ప్రాంతంలో చాలా సాధారణంగా కనిపించిందని ఆయన వివరించారు. సేకరించిన నమూనాల్లో 36 శాతం ఈ వేరియంట్‌వేనని తెలిపారు. వీటితోపాటు దక్షిణాఫ్రికాలో గుర్తించిన బి.1.351 వేరియంట్‌ను తొలిసారి వారణాసి ప్రాంతంలో గుర్తించామని సీసీఎంబీ గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. చదవండి: ఏడాదిలోపే కోవిడ్ ఆయుధాలు సిద్ధం -
డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం
జెనీవా: భారత్‌లో మొట్టమొదటిసారిగా బయటపడిన బి.1.617 కోవిడ్–19 వేరియెంట్లో ఒక రకం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా అని పేరు పెట్టిన ఈ రకం జూన్ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు వ్యాపించిందని తెలిపింది. ఈ రకం కరోనాతో ఆసియా దేశాలకు ఎలాంటి ముప్పు ఉందో ఊహించడానికే కష్టంగా ఉందని తన వారాంతపు నివేదికలో పేర్కొంది. కరోనాలో బి.1.617 వేరియంట్ తొలిసారిగా భారత్‌లో బయట పడింది. ఆ తర్వాత అది తన జన్యు స్వరూపాన్ని మార్చుకొని బి.1.617.1, బి.1.617.2, బి.1617.3... ఇలా మూడు రకాలుగా మారి వ్యాపించడం మొదలైంది. వీటిలో బి.1.617.2 రకం (దీనిని డెల్టా వేరియెంట్‌గా పిలుస్తున్నారు) అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని, ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన రెండు రకాలతో పెద్దగా ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ప్రమాదంలో ఆసియా దేశాలు భారత్‌లో బయటపడిన డెల్టా రకంతో ఆసియా దేశాలకు పెను ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. శరణార్థులకు కూడా ఈ వైరస్ సోకుతూ ఉండడంతో ఏం చేయాలో తెలీని పరిస్థితి నెలకొందని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) అధికార ప్రతినిధి ఆండ్రేజ్ మహెకిక్ అన్నారు. ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలోపేతంగా లేకపోవడం, వ్యాక్సిన్ అన్ని దేశాలకు అందుబాటులో లేకపోవడంతో డెల్టా వైరస్ అత్యధిక దేశాలకు విస్తరిస్తోందని అన్నారు. డెల్టా వేరియంట్ కారణంగా గత రెండు నెలల కాలంలోనే ప్రపంచ దేశాల్లో 3.8 కోట్ల కేసులు నమోదయ్యాయని, 5 లక్షలకు పైగా మరణాలు సంభవించాయన్నారు. అన్ని దేశాల్లోనూ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. -
టియాగో.. కొత్త వేరియంట్
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ తన హ్యాచ్‌బ్యాక్ ఎంట్రీ లెవల్ టియాగో లైన్–అప్‌లో ‘‘టాటా టియాగో ఎక్స్‌టీఏ’’ పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కారు ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షలుగా ఉంది. కొత్త వేరియంట్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్(ఏఎంటీ)లో వస్తుంది. ‘‘భారత్‌లో ఆటోమేటిక్ టాన్స్‌మిషన్(ఏటీ) సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోంది, అందుకే ఏటీఎస్ ప్రాధాన్యతను గుర్తించిన కంపెనీ టియాగో ఎక్స్‌టీఏ వెర్షన్ శ్రేణిని మార్కెట్‌కు పరిచయం చేసింది’’ అని టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు. కొత్త వేరియంట్ మిడ్–హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీనివ్వడమే కాకుండా, కస్టమర్లు చెల్లించే ధరకు తగిన సదుపాయాల్ని ఇస్తుందని శ్రీవాస్తవ విశ్వాసం వ్యక్తం చేశారు. -
2021 టాటా సఫారీ: బుకింగ్స్ ప్రారంభం
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సఫారీ కారును భారత మార్కెట్లో టాటా మోటార్స్ సోమవారం ఆవిష్కరించింది. ఐకానిక్ సఫారీ కొత్త వాహన శ్రేణిని తీసుకొచ్చింది. మొత్తం ఆరు వేరియంట్లలో టాటా సఫారీ 2021 యూఎస్వీ కార్లను లాంచ్ చేసింది. పరిచయ ధరగా బేసిక్ మోడల్ ధరను 14.69 లక్షలుగా నిర్ణియించింది కంపెనీ. టాప్ ఎండ్ మోడల్ ఖరీదు 21.45 లక్షలుగా ఉంది. ఇప్పటికే బుకింగ్‌లను మొదలుపెట్టింది. అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద రూ. 30 వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ఈ, ఎఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌టీ ప్లస్, ఎక్స్జెడ్, ఎక్స్జెడ్ ప్లస్ అనే మోడళ్లలో టాటా సఫారీ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అడ్వెంచర్ పర్సోనా పేరుతో కొత్త వేరియంట్‌ను కూడా రిలీజ్ చేసింది .దీని విలువ 20.20 లక్షలు (ఎక్స్-షోరూమ్‌న్యూఢిల్లీ) గా ఉండనుంది. కాగా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 2021 టాటా సఫారీని టాటా మోటార్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీగా ఇది నిలిచింది. -
బీఎండబ్ల్యూ ఎక్స్3 కొత్త వేరియంట్
సాక్షి, ముంబై: జర్మనీ కంపెనీ బీఎండబ్ల్యూ తన ఎస్యూవీ మోడల్ ఎక్స్3లో ‘‘స్పోర్ట్ఎక్స్’’ పేరుతో పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 56.5 లక్షలుగా ఉంది. ఇందులో 252 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసే రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఈ కొత్త వేరియంట్ 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దేశీయంగా చెన్నై ప్లాంట్‌లో తయారయ్యే ఈ కారు అమ్మకాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 28 లోపు ఆన్లైన్లో బుకింగ్స్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా సర్వీస్ ప్యాకేజీతో పాటు రూ.1.50 లక్షల విలువైన ఉపకరణాలను ఉచితంగా పొందవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పాహా మాట్లాడుతూ ... బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పరిధిని పెంచే ప్రణాళికల్లో భాగంగా పెట్రోల్ వేరయంట్లో స్పోర్ట్స్ఎక్స్ వేరియంట్‌ను విడుదల చేశామన్నారు. -
ఎంజీ హెక్టార్ సరికొత్తగా, ధర ఎంత?
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన ఎస్యూవీ హెక్టార్లో 8-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ షోరూం వద్ద దీని ప్రారంభ ధర రూ.16.51 లక్షలుగా ఉంది. మెరుగైన బ్యాటరీ ప్యాక్, చక్కటి డ్రైవింగ్ శ్రేణితో వీటిని తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్లో ఐదు సీట్లతో హెక్టార్ 2021, ఆరు సీట్లతో హెక్టార్ ప్లస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పెట్రోల్ హెక్టార్ ఇప్పుడు మొత్తం నాలుగు ఆప్షన్లో లభ్యం కానుంది. మాన్యువల్, హైబ్రీడ్ మాన్యువల్, డ్యూయల్ - క్లచ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఆవిష్కరించిన సీవీటీ ఆప్షన్ వెర్షన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ప్రయాణాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 12.89 లక్షలు నుండి రూ. 18.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఎంజీ హెక్టార్ సీవీటీ వేరియంట్లో స్మార్ట్, షార్ప్ ట్రిమ్ మోడళ్ల ధరలు రూ. 16.51 లక్షలు -18.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆరు సీట్ల హెక్టార్లోప్లస్ కూడా కొత్త సీవీటి గేర్‌బాక్స్‌ను జోడించింది. వీటి ధరలు 17.21 లక్షలు - 18.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తాయి. -
అమెరికాలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం
వాషింగ్టన్ : 2021లో కూడా కరోనా మహమ్మారి పీడ వదిలేటట్టు లేదు. ఇప్పటికే బ్రిటన్ స్ట్రెయిన్ కొత్త వేరియంట్ భయాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. జన్యుమార్పులతో ఇది మరోసారి విజృంభిస్తోందన్న ఆందోళన కొనసాగుతుండగానే అమెరికాలో మరో వైరస్ ఉనికి మరింత ఆందోళన రేపుతోంది. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా కంటే ఇది 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అమెరికా రకం కరోనా వేరియంట్ బ్రిటన్‌లో స్ట్రెయిన్ మాదిరిగానే వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ గుర్తించిన యూఎస్ రకం వ్యాప్తి తీరు కూడా ఉందని ఫుండ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. ఇది స్ట్రెయిన్ యూఎస్ రకం అయి ఉండొచ్చు. యూకే స్ట్రెయిన్‌తో పాటుగా ఇది కూడా వ్యాపించిందని అంచనావేశారు. దీని వ్యాప్తి 50 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ హెచ్చరించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలను ప్రజలు సక్రమంగా పాటించకపోవడంతో ఈ వైరస్ వేరియంట్ వ్యాప్తి చెంది, తీవ్రం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, అమెరికాలో 52 యూకే రకం వైరస్ కేసులను గుర్తించారు. అయితే దీని వల్ల మరణాల తీవ్రత అధికంగా ఉంటుందనే ఆధారాలు మాత్రం లభించలేదని నిపుణులు అంటున్నారు. కాగా కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా విలవిల్లాడిపోయింది. జనవరి చివరి నాటికి మొత్తం మరణాలు 4 లక్షలు దాటాయి. దాన్ని ప్రభావం ఇంకా చల్లాకరకముందే, కరోనా అంతానికి టీకాలు వచ్చాయనే ఆనందం కంటే.. కొత్త వైరస్ ఎక్కువ వణికిస్తోంది. తన రూపాన్ని మార్చుకున్న మహమ్మారి మరింత వేగంతో వ్యాపించడం ఆందోళనకు గురిచేస్తోంది.యూకే, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోంది. యూకే స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ యూకే కంటే ప్రమాదకారని, దీనికి ప్రస్తుత టీకాలు పనిచేయవని నిపుణులు భావిస్తున్నారు. ఇండియాలో కూడా యూకే కరోనా రకం కేసులు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఫార్చూనర్ కొత్త వెర్షన్...
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రీమియం ఎస్యూవీ ఫార్చూనర్ కొత్త వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద దీని ధర రూ.29.98 –-రూ.37.43 లక్షల మధ్య ఉంది. మొత్తం ఏడు వేరియంట్లలో వస్తున్న ఈ కారు లెజెండర్ వేరియంట్ ధర రూ. 37.58 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త టయోటా ఫార్చూనర్ పెట్రోల్, డిజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. సీట్ వెంటిలేషన్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థతో పాటు 11 స్పీకర్లతో జేబిల్ ఆడియో, ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ లాంటి లేటెస్ట్ ఫీచర్లను ఇందులో సమకూర్చారు. కొత్త డిజైన్ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కార్ల డెలివరీ త్వరలో ప్రారంభమవుతుంది. భారత్‌లో గడిచిన 11 ఏళ్లతో సుమారు 1.7 లక్షల ఫార్చూనర్ కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. -
బెంజ్ కొత్త ఎడిషన్ కారు.. ధర ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన అగ్రశ్రేణి ఎస్ క్లాస్ విభాగంలో సరికొత్త మాస్ట్రో ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద మోడల్ ధర రూ.1.51 కోట్లుగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో ‘‘మెర్సిడెస్ మీ కనెక్ట్’’ టెక్నాలజీ తాజా వర్షెన్‌ను అప్లోడ్ చేశారు. మొమరీ ప్యాకేజ్‌తో ముందు సీట్లను ఏర్పాటు చేయడంతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్‌ను లాంటి అధునాతన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. కస్టమర్లకు కనెక్టెడ్ కార్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారి అభిరుచికి అనుగుణంగా కొత్త మోడళ్లను రూపొందించడమే ఈ కొత్త ఏడాదిలో తమ లక్ష్యమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగపు ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ సరికొత్త మాస్ట్రో ఎడిషన్ దేశవ్యాప్తంగా ఉండే అన్ని మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్‌ల వద్ద లభ్యమవుతాయి. -
ద.ఆఫ్రికాలో కొత్త వేరియంట్
లండన్: దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను గుర్తించారు. దీనివల్లనే అక్కడ కేసుల సంఖ్యతో పాటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని నిర్ధారించారు. ఇది కరోనా సెకండ్‌వేవ్ అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ రెండో రకం కరోనా వైరస్‌ను తాజాగా యూకేలోనూ గుర్తించారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ కరోనా వైరస్‌ను బ్రిటన్‌లో కరోనా బారిన పడిన ఇద్దరిలో గుర్తించామని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్కాక్ వెల్లడించారు. వారిద్దరూ ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను యూకే నిషేధించింది. గత రెండు వారాల్లో దక్షిణాఫ్రికా వెళ్లివచ్చినవారు, వెళ్లి వచ్చిన వారిని కలిసిన వారు వెంటనే క్వారంటైన్‌కు వెళ్లాలని హాన్కాక్ సూచించారు. ‘ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందనేదే ఆందోళనకర అంశం. యూకేలో గుర్తించిన వైరస్ వేరియంట్ కన్నా ఇది ఎక్కువ ఉత్పరివర్తనాలు చెందిన వైరస్’ అని పేర్కొన్నారు. కొత్త వైరస్ కట్టడి విషయంలో, సంబంధిత సమాచారం తమకు అందించే విషయంలో దక్షిణాఫ్రికా పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. యూకేలో గుర్తించిన కొత్త వేరియంట్‌కు, దక్షిణాఫ్రికాలో గుర్తించిన వేరియంట్‌కు పోలికలున్నప్పటికీ.. అవి వేరువేరు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండూ ఎన్501వై మ్యూటేషన్‌కు గురయ్యాయన్నారు. రెండు కూడా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉన్నాయని ప్రొఫెసర్ సుసాన్ వివరించారు. యూకేలోని మరిన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు! కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కఠిన లాక్డౌన్ ఆంక్షలను యూకేలోని మరిన్ని ప్రాంతాలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో మంత్రివర్గం బుధవారం ప్రత్యేకంగా సమావేశమై, లాక్డౌన్ ప్రాంతాలను విస్తరించాలనే విషయంలో చర్చలు జరిపారు. కొత్తగా గుర్తించిన కరోనా వైరస్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని, అయితే, ఈ కొత్త వైరస్ లండన్, ఆగ్నేయ ఇంగ్లండ్ ప్రాంతాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉందని యూకే కమ్యూనిటీస్ మంత్రి రాబర్ట్ జెన్రిక్ తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే టయర్ 4 ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు. మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే ఈ వైరస్ స్ట్రెయిన్ ఎక్కువగా కనిపించడం లేదని, అయినా, ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాల్లోనూ కఠిన లాక్డౌన్ ఆంక్షలను విధించే విషయమై ఆలోచిస్తున్నామని వివరించారు. మరోవైపు, బ్రిటన్ నుంచి ప్రయాణీకులు, సరుకు రవాణాలపై నిషేధాన్ని ఫ్రాన్స్ రెండు రోజుల పాటు సడలించింది. యూకేలో బుధవారం 39,237 కరోనా కేసులు, 744 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 23,950 పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 23,950 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 333 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కు, మరణాల సంఖ్య 1,46,444కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 96,63,382 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 95.69 శాతానికి చేరింది. మరణాల రేటు 1.45 శాతానికి పడిపోవడం ఊరట కలిగించే పరిణామం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,89,240 మాత్రమే ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి కేవలం 2.86 శాతమే. జాన్సన్ రాక కష్టమే! న్యూఢిల్లీ: వచ్చేనెల రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావడం అనుమానమేనని బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ చైర్ ఆఫ్ కౌన్సిల్ చా. చాంద్ నాగ్‌పాల్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త రూపుతో దాడి చేస్తున్న తరుణంలో బోరిస్ జాన్సన్ దేశం విడిచి వెళ్లకపోవచ్చన్నారు. ఇప్పటికైతే బ్రిటీష్ ప్రభుత్వం జాన్సన్ ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇదే వేగంతో కరోనా వ్యాప్తి కొనసాగితే మాత్రం ఆయన వెళ్లరని చెప్పారు. ఒకవేళ లండన్ సహా ఇతర ప్రాంతాల్లో విధించిన లాక్డౌన్ తదితర ఆంక్షల ఫలితంగా పరిస్థితి అదుపులోకి వస్తే జాన్సన్ ప్రయాణం ఉండొచ్చన్నారు. -
టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) : ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ ప్రీమియం ఫీచర్లు,ఆధునిక సాంకేతికలతో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లు, సరసమైన ధరలతో నెక్సాన్ ను మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో విడుదల చేశామని టాటా మోటార్స్ ప్రకటించింది. ఇది నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజీన్ ఆప్షన్లలో, ఎంటీ, ఎఎంటీ వేరియంట్లలో లభ్యం. టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) 8.36 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరకు అందిస్తోంది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్లు, డ్రైవర్, కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, హర్మన్ అండ్ మల్టీ డ్రైవ్ మోడ్ల కనెక్ట్నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (ఎకో, సిటీ) లాంటి అత్యాధునిక స్పెసిషికేషన్స్ జోడించింది. నెక్సాన్ మోడల్ కారు టాటా మోటార్స్‌కు గర్వకారణమనీ, మారుతున్న కస్టమర్ల డిమాండ్లకనుగుణంగా ఉత్పత్తులను మరింత తాజాగా ఉంచుతామన్న హామీని కొనసాగిస్తూ, నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) ప్రారంభిండం సంతోషంగా ఉందని టాటా మోటార్స్ మార్కెటింగ్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) హెడ్, వివేక్ శ్రీవత్స తెలిపారు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అత్యుత్తమ లక్షణాలతో, ఆకర్షణీయమైన ధరలకు ప్రీమియం డ్రైవింగ్ ఆనందాన్నిచ్చేలా అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఇంజీన్లు: పెట్రోల్ వెర్షన్లు 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి,. ఇది 118 బిహెచ్పి, 17.33టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజీన్ 108 బిహెచ్పీ పవర్ ను అందిస్తుంది. ధరలు నెక్సాన్ ఎక్స్ఎం (ఎస్) పెట్రోల్ ధర రూ .8.36 లక్షలు నెక్సాన్ ఎక్స్ఎం (ఎస్) డీజిల్ ధర రూ .9.70 లక్షలు నెక్సాన్ ఎక్స్ఎంఎ (ఎస్) ఏఎంటీ పెట్రోల్ ధర రూ .8.96 లక్షలు నెక్సాన్ ఎక్స్ఎంఎ (ఎస్) ఏఎంటి డీజిల్ ధర రూ .10.30 లక్షలు -
రెడ్మి నోట్ 8 కొత్త వేరియంట్ చూశారా?
సాక్షి,ముంబై: షావోమి రెడ్మి నోట్ 8లో కాస్మిక్ పర్పుల్ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ సందర్భంగా దీనిపై అంచనాలను వెలువరించింది. రెడ్మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ కలర్ వేరియంట్ అమెజాన్, ఎంఐ.కాం ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కొత్త కాస్మిక్ పర్పుల్ కలర్ ఎంపికతో పాటు, ఇతర కలర్ ఆప్షన్లలో కూడా ఈ స్మార్ట్ఫోన్లభిస్తుంది. రెడ్మి నోట్ 8 ఫీచర్లు 6.39 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే 1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 సాక్ ఆండ్రాయిడ్ 9 పై 48+8+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా 13 ఎంపీ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 9,999 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 12,999 Mi fans, presenting a new avatar of the #RedmiNote8. The all-new Cosmic Purple colour variant. Like it? You can soon own it. Get it during the #BlackFridaySale from 29th November. RT if you love this new colour! pic.twitter.com/CE0d5o6xcO — Redmi India for #MiFans (@RedmiIndia) November 27, 2019 -
శాంసంగ్ మరో అదరిపోయే ఫోన్
సియోల్: ప్రముఖ మొబైల్ తయారీ దారు శాంసంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా శాసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. సరసమైన ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుందని సమాచారం.గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్లో గెలాక్సీ ఎ 91( ఇంకా లాంచ్ కాలేదు) మాదిరిగానే 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ , స్నాప్‌డ్రాగన్ 855 చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. జీఎస్ఎం ఎరేనా రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్ 10 లైట్ ఫీచర్లు ఈ విధంగా ఉండనున్నాయి. శాంసంగ్ ఎస్10 లైట్ ఫీచర్లపై అంచనాలు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 855 8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 ఎంపీ డెప్త్ సెన్సార్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావొమీ ‘గోల్డ్’ ఫోన్ @ 4.8 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్న చైనా టెక్నాలజీ కంపెనీ షావొమీ.. మరో సంచలనానికి సిద్ధమైంది. ‘రెడ్మీ కె20 ప్రో’ మోడల్ ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్‌లో అత్యంత ఖరీదైన వేరియంట్ తయారీకి శ్రీకారం చుట్టింది. దీని ఖరీదు రూ.4.8 లక్షలు. బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్‌తో ఇది రూపుదిద్దుకుంది. 100 గ్రాముల పసిడి వాడారు. ప్యానెల్ వైపు ‘కె’ అనే అక్షరంపై 20 వజ్రాలను పొదిగారు. కేవలం 20 పీసులను మాత్రమే తయారు చేస్తారు. విశేషమేమంటే ఇవి భారత్‌లో తయారవుతున్నాయి. అంతేకాదు భారత్‌కు మాత్రమే ప్రత్యేకం. ఫోన్ నుంచి ప్యానెల్‌ను విడదీయడానికి వీలుకాకుండా డిజైన్ చేశారు. చారిటీకి వినియోగిస్తాం.. ఈ వేరియంట్‌ను విక్రయించాలా వద్దా అన్న విషయం ఇంకా నిర్ణయించలేదని షావొమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇన్విటేషన్ ద్వారా విక్రయించాలా, బహుమతిగా ఇవ్వడమా, వేలం వేయడమా అన్నది ఇంకా తేల్చలేదు. వీటి విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తాం. కె20 గుర్తుగా బ్యాక్ ప్యానెల్‌పై ‘కె’ అని ముద్రించాం. ఇప్పటికే ఆసక్తి కనబరిచిన కస్టమర్లు ‘కె’ బదులు, తమ పేరులోని మొదటి అక్షరాన్ని ముద్రించాలని కోరారు’ అని వివరించారు. కస్టమైజ్ చేయాల్సిందే.. చైనాలో షావొమీ విస్తృత శ్రేణిలో పలు ఉత్పత్తులను రూపొందించి విక్రయిస్తోందని, వీటిని భారత్‌లో ప్రవేశపెట్టాలంటే ప్రతి ఉత్పాదనలో మార్పులు చేయాల్సి ఉంటుందని మను కుమార్ వెల్లడించారు. దశలవారీగా వీటిని ఇక్కడ పరిచయం చేస్తామన్నారు. షావొమీ కోసం షూస్, టీ–షర్ట్స్, ఫిట్నెస్ బ్యాండ్స్ తయారీకై దేశంలోని పలు మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లకై సంస్థకు దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఏడు తయారీ కేంద్రాలున్నాయి. సెకనుకు మూడు ఫోన్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. -
వివో వి 15 ప్రొ కొత్త వేరియంట్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్ తయారీదారు వివో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. వివో వి 15 ప్రొలో హై ఎండ్ వేరియంట్‌గా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. దీని ధరను రూ. 29,990గా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. వివో వి 15 ప్రొ ఫీచర్లు 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 2340 x 1080 పిక్సెల్స్ స్ర్కీన్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 675 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ /128స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే అవకాశం 48+8+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
నోకియా 5.1ప్లస్.. ఎయిర్టెల్ ఆఫర్
సాక్షి, ముంబై : హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 5.1 ప్లస్ మోడల్లో అధిక ర్యామ్, స్టోరేజీతో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఇప్పటి వరకు 3జీబీ ర్యామ్, 32 జీబీ రామ్ మోడల్ మాత్రమే ఉండేది. తాజాగా 4జీబీ/64జీబీ, 6జీబీ/64జీబీ వేరియంట్లను కూడా తీసుకొచ్చింది. ‘నోకియా 5.1 ప్లస్‌ను యూజర్లు ఎంతో అభిమానిస్తున్నారు. దీనికి అనుకూలంగా వారు ఎన్నో వేదికల్లో రేటింగ్ కూడా ఇస్తున్నారు. కనుక అధిక సామర్థ్యంతో కూడిన రకాలను తీసుకొచ్చినట్టు’ హెచ్ఎండీ గ్లోబల్ దేశీయ అధిపతి అజేయ్ మెహతా తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆండ్రాయిడ్ వన్ తదితర బెస్ట్ ఫీచర్లతో మంచి పనితీరుతో ఉంటుందన్నారు. బ్లూ, బ్లాక్ కలర్స్‌లో ఫ్లిప్‌కార్ట్, నోకియా స్టోర్లలోఈ స్మార్ట్ఫోన్లు లభ్యం. మరోవైపు ఎయిర్టెల్ వినియోగదారులకు రూ.2వేల క్యాష్‌బ్యాక్‌తోపాటు 240 జీబీ అదనపు డేటా కూడా లభించనుంది. నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు 5.8 అంగుళాలా నాచ్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టాకోర్ ప్రాసెసర్ 720×1520 పిక్సెల్స్ రిజల్యూషన్ 13+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 3060 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6జీ/64జీబీ మోడల్ ధర రూ.16,499 4జీబీ/64జీబీ వెర్షన్ ధర రూ.14,499 -
నోకియా 8.1 కొత్త వేరియంట్..లాంచింగ్ ఆఫర్లు
సాక్షి, ముంబై : గత డిసెంబరు లాంచ్ చేసిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను నోకియా గురువారం లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్, 128స్టోరేజ్ కెపాసిటీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఫిబ్రవరి 6వ తేదీనుంచి అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. దీనిధర రూ. 29,999గా ఉంచింది. ప్రీ బుకింగ్‌లు రేపటి (ఫిబ్రవరి 1) నుంచి ప్రారంభం. 6.8ఫుల్ హెచ్డీ డిస్ప్లేనోకియా 1080x2244 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగన 710 సాక్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 400జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13+14 డ్యుయల్ రియర్ కెమెరా 20ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇక ఎయిర్టెల్ ద్వారా రూ.199 ప్రారంభమయ్యే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీచార్జ్‌లపై దాదాపు 1 టీబీ 4జీబీ దాకా డేటాను ఆఫర్ అందిస్తోంది. లాంచింగ్ ఆఫర్‌గా హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫిబ్రవరి 6నుంచి 17 మధ్య కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. దీంతోపాటు ఇంకా చాలా ఆఫర్లను నోకియా ప్రకటించింది. పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో లభ్యం. నోకియా 8.1 ఫీచర్లు -
బజాజ్ కేటీఎం 200డ్యూక్..సరికొత్తగా
ప్రముఖ ద్విచక్ర తయారీదారు బజాజ్ ఆటో బజాజ్ బైక్స్‌లో కొత్త వెర్షనను లాంచ్ చేసింది. బజాజ్ ఆటోలో 49శాతం వాటావున్న ఆస్ట్రియన్ బైక్ బ్రాండ్ కేటీఎంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్) ఫీచర్‌తో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2019, ఏప్రిల్ 1 కొత్త ఏబీఎస్ చట్టానికి అనుగుణంగా ఈ మార్పులు చేపట్టింది. కెటిఎమ్ 200 డ్యూక్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త వెర్షన్ 125 సి.సి బైక్ ధర రూ. 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా ఉండనుంది. కొత్తగా జోడించిన ఏబీఎస్ ఫీచర్ మెరుగైన, నియంత్రిత శక్తిని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే నాన్ఏబీఎస్ కేటీఎం200డ్యూక్ వేరియంట్ కూడా రూ.1.51 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 450ప్రత్యేకమైన కేటీఎం దుకాణాల్లో ఈ రెండు వేరియంట్స్ కస్టమర్లకు అందుబాటులోఉన్నాయని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ అమిత్ నంది వెల్లడించారు. -
మహీంద్ర స్కార్పియో కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్ర అండ్ మహీంద్ర తన పాపులర్ మోడల్లో కొత్త వేరియట్‌ను తీసుకొచ్చింది. స్కార్పియో ఎస్‌యూవీలో ఎస్9 పేరుతో ఈ సరికొత్త వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. అంతేకాదు కీలక ఫీచర్లతో స్కార్పియో ఎస్ 11 కంటే తక్కువ ధరకే దీన్ని వినియోగదారులకు అందిస్తోంది. మహీంద్ర స్కార్పియో ఎస్ 9 ఎస్యూవీ ధరను రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తమ డీలర్ల దగ్గర ఈ వాహనం తక్షణమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2.2-లీటర్ టర్బోడీజిల్ ఇంజీన్ కెపాసిటీ, 140 హెచ్‌పీ వద్ద 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, 5.9 ఇంచెస్ టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే స్టీరింగ్ వీల్‌పై ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్తోపాటు, ఆడియో, క్రూయిస్ కంట్రోల్ బటన్లను అమర్చింది. ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే.. టాటా హెక్సాతో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
హువావే నోవా 3ఐ కొత్త వేరియంట్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: హువావే నోవా 3ఐ స్మార్ట్‌ఫోన్ లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. 6జీబీ, 128జీబీ స్టోరేజిను మూడవ వేరియంట్‌గా విడుదల చేసింది. దీని ధర రూ .25,500 కంపెనీ నిర్ణయించింది. బ్లాక్, పర్పుల్ , వైట్తోపాటు అకాసియా రెడ్ కలర్లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. నోవా 3ఐ ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టా-కోర్ హై సిలికాన్ కిరిన్ 710 సాక్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరించుకోవచ్చు 16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ -
వోల్వో ఎక్స్‌సీ40లో రెండు కొత్త వేరియంట్స్
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ తాజాగా ఎక్స్‌సీ40 కాంపాక్ట్ ఎస్‌యూవీలో మరో రెండు కొత్త వేరియంట్స్‌కు బుకింగ్స్ ప్రారంభించింది. ఇందులో ఎక్స్‌సీ40 డీ4 మొమెంటమ్ రేటు రూ. 39.9 లక్షలుగాను, డీ4 ఇన్స్క్రిప్షన్ వేరియంట్ ధర రూ.43.9 లక్షలుగాను (ఎక్స్ షోరూం) ఉంటుందని వోల్వో కార్స్ ఇండియా ఎండీ చార్లెస్ ఫ్రంప్ తెలిపారు. ఈ నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని చెప్పారాయన. మరోవైపు, ఆర్–డిజైన్ వేరియంట్ రేటును రూ. 42.9 లక్షలకు పెంచినట్లు ఆయన తెలిపారు. జూలై 4న ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ. 39.9 లక్షలకు అందించినట్లు, ఇప్పటిదాకా 200 యూనిట్లకు ఆర్డర్లు వచ్చినట్లు ఫ్రంప్ వివరించారు. -
వివో వి9 : కొత్త వేరియంట్ లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: వివో తన పాపులర్ ఫోన్లో కొత్త వేరియంట్‌ను ఇండోనేసియాలో లాంచ్ చేసింది. వివో వి9లో 6జీబీ వేరియంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను సుమారు 20,600లుగా ఉండనుంది. గత ఏడాది 4 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చిన వివో వి9 స్మార్ట్‌ఫోన్‌లో ఇపుడు 6జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా తాజా డివైస్‌లో కెమెరా, ప్రాసెసర్‌లో కూడా మార్పులు చేసింది. జూలై 5 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్‌తో మార్కెట్లో వున్న ఒప్పో ఎఫ్7 కి ఇది గట్టి పోటీగా నిలవనుంది. వివో వి9 ఫీచర్లు (64జీబీ) 6.3 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డ్రాగెన్ 660 ఎస్వోసీ 13 +2 ఎంపీ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ అల్ట్రా హెచ్డీ మోడ్ 6జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే అవకాశం 3260ఎంఏహెచ్ బ్యాటరీ -
సుజుకి జిక్సర్‌లో కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 155 సీసీ జిక్సర్ లో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్)తో రూపొందించిన ఈ బైక్ ధరను రూ. 87,250 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తేజకరమైన రైడింగ్ అనుభవాన్ని సొంతం చేసుకున్నతమ వినియోగదారులకు ఏబీఎస్ ఆప్షన్ మరింత ఉత్సాహాన్నిస్తుందని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఈవీపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సజీవ్ రాజశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిక్సర్ సిరీస్ తమ ఇండియా ప్రోడక్ట్-స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన మోడల్ అని తెలిపారు. అయితే ఏబీఎస్ ఆప్షన్ జోడింపు తప్ప గిక్సర్ కొత్త వేరియంట్లో అదనంగా మార్పులు చేయలేదు. 155 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 8,000ఆర్పీఎం వద్ద 14.8హెచ్‌పీ , 6,000ఆర్పిఎం వద్ద14ఎన్ఎంను ఉత్పత్తి చేస్తుంది. -
నోకియా6 కొత్త మోడల్ : సేల్ షురూ
సాక్షి, ముంబై: నోకియా 6 కొత్త వేరియంట్ విక్రయాలు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మంగళవారం మధ్యాహ్నం 12నుంచి ప్రారంభం కానున్నాయి. నోకియా 64జీబీ వేరియంట్‌ను మొట్టమొదటిసారిగా ఇండియాలోకి తీసుకొస్తోంది. మ్యాట్ బ్లాక్ బ్లాక్ కలర్లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను. రూ. 16, 999గా నిర్ణయించింది. దీనితోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చేసిన కొనుగోలుపై 5శాతం డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది . అలాగే నోకాస్ట్ ఈఎంఐ అవకాశం కూడా ఉంది. నోకియా 6 (3జీబీ) జనవరిలో విడుదలైంది. దీని ధర రూ.14,500లు. నోకియా 6 స్పెసిఫికేషన్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 430 ఎస్ఓసీ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటో ఎక్స్ 4 కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: మోటో ఫ్యామిలీలో మరోకొత్త వేరియంట్ సార్ట్‌ఫోన్ చేరింది. సోమవారం మోటోరోలా కొత్త డివైస్నులాంచ్ చేసింది. మోటో ఎక్స్ 4 6జీబీని మార్కెట్లో విడుదల చేసింది. గత మోటో నవంబర్‌లో వచ్చిన ఎక్స్4 స్మార్ట్‌ఫోన్‌కు తాజాగా 6 జీబీ ర్యామ్ వేరియెంట్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.24,999గా నిర్ణయించింది. జనవరి 31వ తేదీ నుంచి మోటో హబ్స్ , ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభ్యం. లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొంటే రూ.1500 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అలాగే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.3వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. వొడాఫోన్ నుంచి డేటా ఆఫర్ కూడా లభిస్తుంది. రూ. 199 ప్లాన్‌పై 490 జీబీ డేటాను అలభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్. ఈ ఆఫర్ ఫిబ్రవరి 2(శుక్రవారం)వరకు మాత్రమే లభ్యం. మోటో ఎక్స్4 ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్టీపీఎస్ ఐపీఎస్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12+8 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్. -
నోకియా 5 సరికొత్త ర్యామ్ వేరియంట్
నోకియా 5లో 3జీబీ ర్యామ్ వేరియంట్‌ను హెచ్ఎండీ గ్లోబల్ సోమవారం లాంచ్ చేసింది. దీని ధర రూ.13,499గా కంపెనీ పేర్కొంది. నవంబర్ 7 నుంచి ఈ కొత్త 3జీ వేరియంట్ నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి వస్తోంది. అనంతరం ఇది నవంబర్ 14 నుంచి ఆఫ్‌లైన్‌గా కూడా అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను జియో-నోకియా అదనపు డేటా ఆఫర్‌గా ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్ఫామ్లో లిస్టు చేసింది. ఈ భాగస్వామ్యంలో జియో ప్రతి రూ.309 రీఛార్జ్ లేదా ఆపై మొత్తాలపై అదనంగా 5జీబీ డేటాను 2018 ఆగస్టు 31 వరకు అందించనుంది. మాట్ బ్లాక్, టెంపెడ్ బ్లూ రంగుల్లో ఈ వేరియంట్ లభ్యం కానుందని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. తొలుత ఏడాది జూన్‌లో నోకియా 5ను హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసింది. ఈ సమయంలో కేవలం 2జీబీ వేరియంట్‌నే మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం నోకియా 5 3జీబీ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. నోకియా 5 3జీబీ ర్యామ్ వేరియంట్ ఫీచర్లు... ర్యామ్ మినహాయిస్తే మిగిలిన ఫీచర్లన్నీ 3జీబీ ర్యామ్ వేరియంట్‌కు, 2జీబీ ర్యామ్ మోడల్‌కు ఒకే మాదిరిగా ఉండనున్నాయి డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ 5.2 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
లీటర్ ఇంజిన్‌తో రెడీ-గో..ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ : జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ కొత్తగా ఒక లీటరు ఇంజిన్‌తో డాట్సన్ రెడీ-గో కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.3.57 లక్షలుగా నిస్సాన్ తెలిపింది. ఈ కొత్త వాహనం లీటరుకు 22.5 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కారు టాప్-వేరియంట్ మోడల్ ధర రూ.3.72 లక్షలుగా ఉంది. గతేడాది విజయవంతంగా లాంచ్ చేసిన రెడీ-గోలో ప్రస్తుతం తీసుకొచ్చిన 1.0 లీటర్ ఇంజిన్ వేరియంట్ అత్యంత శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించనున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా చెప్పారు. ఈ కొత్త మోడల్ అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుందని, కస్టమర్లకు స్టయిల్‌గా, అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫైవ్ స్పీడు మాన్యువల్ ట్రాన్సమిషన్ ఇది కలిగిఉంది. గతేడాదే 800సీసీ రెడీ-గోను నిస్సాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత ఈ మోడల్‌ను లిమిటెడ్ ఎడిషన్‌లో స్పోర్ట్స్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. 2014లో భారత్‌లో ఎంట్రీ లెవల్ డాట్సన్ గో లాంచ్ చేయడంతో నిస్సాన్, డాట్సన్ బ్రాండును గ్లోబల్‌గా రీలాంచ్ చేసింది. గో, గో ప్లస్ కార్ల తర్వాత డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ మూడో కారుగా రెడీ-గోను తీసుకొచ్చింది. చిన్న కార్ల మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ-గోను డాట్సన్ తీసుకొచ్చింది. డాట్సన్ బ్రాండులో ఇప్పటివరకు 90,000 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. -
హార్లే డేవిడ్సన్.. కొత్త ‘స్ట్రీట్ రాడ్’@రూ. 5.86 లక్షలు
ముంబై: అమెరికా బైక్‌ల కంపెనీ హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ మోడల్లో కొత్త వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.5.86 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). పెరుగుతున్న యువత లక్ష్యంగా ఈ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని హార్లే డేవిడ్సన్ ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్) పల్లవి సింగ్ చెప్పారు. 750 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ బైక్‌లో స్లి్పట్ సీట్ డిజైన్, ముందు భాగంలో కొత్త విండ్‌స్క్రీన్, వెనుక భాగంలో కొత్తగా డిజైన్ చేసిన ఎల్ఈడీ లైట్స్, ఫోల్డ్ చేసుకునే వీలున్న రియర్ వ్యూ మిర్రర్స్, 17 అంగుళాల అలాయ్ వీల్స్,, ముందు, వెనుక భాగాల్లో 300 ఎంఎం డిస్క్ బ్రేకులు తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. -
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. కొత్త వేరియంట్
• పెట్రోల్ కార్ల ధరలు రూ.4.58– రూ.6.82 లక్షల రేంజ్లో • డీజిల్ కార్ల ధరలు రూ.5.68– రూ.7.32 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ గ్రాండ్ ఐ10లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్లో పెట్రోల్ ఇంజిన్ కార్ల ధరలు రూ.4.58 లక్షల నుంచి రూ.6.82 లక్షల రేంజ్లో, డీజిల్ ఇంజిన్ కార్ల ధరలు రూ.5.68 లక్షల నుంచి రూ.7.32 లక్షల రేంజ్(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. భారత్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా గ్రాండ్ ఐ10 కార్లు 5.5 లక్షలకు పైగా అమ్ముడయ్యాయని కంపెనీ ఎండీ, సీఈఓ వై.కె. కూ చెప్పారు. ఈ తాజా వేరియంట్లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, కొత్త అలాయ్ వీల్స్, ముందు వైపు ఎయిర్ కర్టెన్స్, వెనక ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. -
నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్
ముంబై: నిస్సాన్ ఇండియా తాజాగా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘మైక్రా’లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కొత్త ఇంటీరియర్స్‌తో కూడిన ఈ ఆటోమేటిక్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఈ కొత్త వేరియంట్లో నిస్సాన్ ఎక్స్-ట్రానిక్ సీవీటీని అమర్చామని, ఇది మాన్యువల్ వేరియంట్ కన్నా అధిక మైలేజ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. కాగా నిస్సాన్ కంపెనీ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. దేశం నుంచి ఎగుమతి అవుతోన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మైక్రాదే అగ్రస్థానం. ప్రస్తుతం మైక్రా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. -
1000 సీసీ సామర్థ్యంతో రెనో క్విడ్..
♦ ధరలు రూ.3.82-3.95 లక్షల రేంజ్లో ♦ మైలేజీ 23 కిమీ. న్యూఢిల్లీ: రెనో ఇండియా కంపెనీ చిన్న కారు క్విడ్ మోడల్లో కొత్త వేరియంట్లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ 1.0 లీటర్ క్విడ్ మోడల్లో రెండు వేరియంట్లను-ఆర్ఎక్స్టీ, ఆర్ఎక్స్టీ(ఓ) పేరిట అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఆర్ఎక్స్టీ ధర రూ.3.82 లక్షలు, ఆర్ఎక్స్టీ(ఓ)ధర రూ.3.95 లక్షలని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) తెలియజేసింది. మంచి పనితీరు కనబరిచేలా ఈ కొత్త వేరియంట్లను తీర్చిదిద్దామని కంపెనీ సీఈఓ, ఎండీ సుమిత్ సాహ్ని తెలిపారు. డోర్ల మీద స్పోర్ట్స్ డిజైనర్ గ్రాఫిక్స్, ప్రొ-సెన్స్ సీట్ బెల్ట్, ప్రి-టెన్షనర్ష్ విత్ లోడ్ లిమిటర్స్, 300 లీటర్ల బూట్ స్పేస్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. ఆర్ఎక్స్టీ(ఓ) వేరయంట్లో పవర్ విండోలు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ నావిగేషన్, యూఎస్బీ, ఏయూఎక్స్ సపోర్ట్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్) తదితర ప్రత్యేకతలున్నాయని వివరించారు. మైలేజీ 23 కిలోమీటర్లు ఇస్తుందని ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ధ్రువీకరించినట్లు తెలిపారు. మారుతీ సుజుకి ఆల్టో కే10, హ్యుందాయ్ ఇయాన్, టాటా టియాగోలకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏడాదికొక కొత్త మోడల్... ప్రస్తుతం రెనో కంపెనీ 800 సీసీ ఇంజిన్ కెపాసిటితో క్విడ్ కారును రూ.2.64 లక్షలు నుంచి రూ.3.73 లక్షల రేంజ్లో విక్రయిస్తోంది. కాగా ప్రధాన పోటీ కారు అయిన ఆల్టో కె10 కార్ల ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.3.82 లక్షల రేంజ్లో ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్లతో మరింత మంది వినియోగదారులకు చేరువ కానున్నామని సుమిత్ సాహ్ని అశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్ల ఉత్పత్తిని మరింతగా పెంచామని, దీంతో ఈ కారు వెయిటింగ్ పీరియడ్ 2-3 నెలల కాలం నుంచి 1-2 నెలల కాలానికి తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం నెలకు పదివేల క్విడ్కార్లను తయారు చేస్తున్నామని, కొత్త వేరియంట్లు కూడా వచ్చాక, డిమాండ్‌ను బట్టి ఉత్పత్తిని మరింత పెంచుతామని వెల్లడించారు. ఆటో గేర్ స్విఫ్ట్ ట్రాన్సిమిషన్ మోడల్‌ను కూడా తేవాలనుకుంటున్నామని తెలిపారు. రానున్న కొన్నేళ్లలో ఏడాదికొక కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తెస్తామని చెప్పారాయన. గత ఏడాదిలో మార్కెట్లోకి క్విడ్‌ను తెచ్చామని, ఇప్పటికే 1.65 లక్షల కార్లను విక్రయించామని, క్విడ్ కారు మంచి విజయాన్ని సాధించిందని వివరించారు. ఈ ఏడాది చివరికల్లా 5 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. డీలర్ల నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని సాహ్ని తెలిపారు. -
హోండా అమేజ్ లో కొత్త వేరియంట్
ధర రూ.5.29 లక్షల నుంచి రూ.8.19 లక్షల రేంజ్లో హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా కంపెనీ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కొత్త హోండా అమేజ్ కార్ల ధరలు రూ.5.29 లక్షల నుంచి రూ.8.19 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)రేంజ్లో ఉన్నాయని హోండా కార్స్ ఇండియా తెలిపింది. వాహన భద్రత అనేది తమకు అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈఓ కత్సుషి ఇనోయి చెప్పారు. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్‌తో ఈ అమేజ్ కొత్త వేరియంట్లను అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తామందించే ప్రతి హోండా వాహనంలో డ్యుయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉంటాయని వివరించారు. హోండా అమేజ్‌ను 2013 ఏప్రిల్‌లో మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 2 లక్షల వాహనాలను విక్రయించామని వివరించారు. బ్లూ టూత్ ఎనేబుల్డ్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ సీ, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే తదితర ఫీచర్లు కొత్త అమేజ్ కార్లలో ఉన్నాయని తెలిపారు.