Orissa
-
రోడ్డున పడిన రక్తబంధం
చీపురుపల్లి: అండగా నిలవాల్సిన అన్నదమ్ములు శత్రువుల్లా మారారు.. అక్కున చేర్చుకోవాల్సిన కన్నతండ్రి కనికరించలేదు.. ఇద్దరు అన్నదమ్ములు తండ్రితో కలిసి రక్తం పంచుకుపుట్టిన మరో సోదరుడి కుటుంబంపై పగబట్టారు. అర్థరాత్రి సమయంలో ఆ కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేశారు. వారికి సంబంధించిన బట్టలు, సామగ్రి, పిల్లల పుస్తకాలను రోడ్డుపైకి విసిరేశారు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలతో సహా ఆ భార్యభర్తలు రోడ్డున పడ్డారు. తలదాచుకునేందుకు మరో ఇల్లులేక పిల్లలతో సహా రోడ్డుపైనే కాలంగడుపుతున్నారు. కాలనీలో ఎవరో ఒకరు ఇచ్చే ఆహారం తింటూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా పదిహేను రోజులుగా ఎలాంటి న్యాయ సహాయం అందలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చీపురుపల్లి మండలం నిమ్మలవలస గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి బాధిత దంపతులు కోడిగుడ్ల బాలకృష్ణ, మంజుల ఆవేదన వారి మాటల్లోనే... నిమ్మలవలస గ్రామానికి చెందిన కోడిగుడ్ల మహేష్‌కు రాజ్‌కుమార్, బాలకృష్ణ, శ్యామ్ అనే ముగ్గురు కొడుకులం. అందులో రెండో వాడిని నేను. భార్య మంజు, ఇద్దరు పిల్లలతో కలిసి చాలా కాలంగా విశాఖపట్టణంలో నివసిస్తూ ఆరు నెలల కిందటే సొంతూరు నిమ్మలవలస వచ్చాం. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా కుటుంబం అంటే తండ్రికి నచ్చదు. పెద్ద ఇల్లు ఉన్నా వంట ఇంటిని మాకు కేటాయించారు. అందులోనే భార్య, పిల్లలతో కలిసి సర్దుకుపోతున్నాం. అయినా సరే తండ్రి మద్యం మత్తులో వచ్చి నిత్యం వేధిస్తున్నారు. కుటుంబాన్ని దూషిస్తున్నారు. 15 రోజుల కిందట అర్థరాత్రి సమయంలో ఇద్దరు సోదరుల సహాయంతో తమ కుటుంబాన్ని రోడ్డుపైకి గెంటేశారు. బట్టలు, సామాన్లు విసిరేసి, పిల్లలతో సహా తమను రోడ్డుపైకి తోసేశారు. అప్పటి నుంచి రోడ్డుపైనే ఉంటూ స్థానికులు ఇచ్చే ఆహారంతో జీవనం సాగిస్తున్నాం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు వచ్చి చూసి వెళ్లారు. ఎలాంటి న్యాయం జరగలేదు. చలిలో పిల్లలతో కలిసి రోడ్డుపై జీవిస్తున్నా... న్యాయం చేయాల్సిన పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదు. తమకు న్యాయం చేయకుంటే పిల్లలతో కలిసి ఆత్మహత్యే శరణ్యమంటూ బాలకృష్ణ, మంజు దంపతులు బోరున విలపించారు. నిమ్మలవలస గ్రామానికి చెందిన కోడిగుడ్ల మంజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మంజు, బాలకృష్ణ కుటుంబాన్ని ఇంటి నుంచి వెల్లగొట్టిన ఫిర్యాదులో కోడిగుడ్ల మహేష్, రాజ్‌కుమార్, శ్యామ్‌లపై కేసు నమోదు చేశాం. – ఎల్.ధామోదరరావు, ఎస్ఐ, చీపురుపలి్ల కేసు నమోదు చేశాం.. తండ్రితో కలిసి ఇద్దరు సోదరుల దుశ్చర్య! మరో సోదరుడి కుటుంబాన్ని రోడ్డుపైకి గెంటివేత దుస్తులు, సామగ్రిని బయటకు విసిరేసిన వైనం పిల్లలతో కలిసి గజగజ వణికిస్తున్న చలిలో 15 రోజులుగా రోడ్డుపైనే నివాసం న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటున్న కుటుంబం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినా న్యాయం జరగలేదంటూ ఆవేదన కేసు నమోదు చేశాం: ఎస్ఐ ధామోదరరావు -
29న ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్‌లో ఈ నెల 29న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ పురుషులు అర్హులని అన్నారు. ఏసీ ఫ్రిజ్ మెకానిక్ వర్క్స్ (75 రోజులు), ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ (30 రోజులు)లో పాటు శిక్షణ ఉంటుందని అన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డులతో పాల్గొనాలని సూచించారు. శిక్షణా కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామని అన్నారు. వివరాలకు 90147 16255, 94917 41129, 98669 13371, 99899 953145 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 108 అంబులెన్స్ సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలి పార్వతీపురం టౌన్: 108 అంబులెన్స్ సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ డిమాండ్ చేసారు. పార్వతీపురం గిరిజన సామాజిక భవనంలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడుజి కిషోర్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2005వ సంవత్సరం నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న 108 వ్యవస్థ నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వలన అంబులెన్స్ సేవల్లో నాణ్యత కొరవడిందన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, అంబులెన్స్‌లు అత్యవసర పరిస్థితులలో సకాలంలో చేరుకోక అనేకమంది అత్యవసర వైద్య సేవలు అందక మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన 108 వ్యవస్థలో కార్పొరేట్ శక్తులు ప్రవేశించి తమ లాభాలను పెంచుకునేందుకు ఈ అంబులెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 108 వ్యవస్థలో పని చేస్తున్న 3,500 మంది సిబ్బందికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 108 వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు గుంట్రెడ్డి రవికుమార్, జి.శ్రీనివాసరావు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, సంచాన ఉమామహేశ్వరరావు, పి.సంఘం, మన్మధరావు, బంకురు సూరిబాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి.రమేష్, 104 ఉద్యోగ సంఘం నాయకుడు జి దుర్గారావు, చెరువుల పరిరక్షణ సమితి నాయకులు వంగల దాలినాయుడు, 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొర్లి అప్పలనాయుడు, కార్యదర్శి తెర్లి వెంకటరమణ, తెంటు రాంబాబు, ఆవాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తక్షణమే వితంతు పింఛన్ మంజూరు : కలెక్టర్
పార్వతీపురం: ఎన్టీఆర్ భరోసా పింఛను పొందే వ్యక్తి మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామి (వితంతువు)కి కుటుంబ పోషణ కోసం తక్షణమే పింఛన్ పథకం కింద అర్హత మేరకు పింఛన్‌ను మంజూరు చేయబడుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారుడు 2024 నవంబర్ 1వ తేదీ లేదా ఆ తర్వాత మరణించినచో, వారి జీవిత భాగస్వామికి డిసెంబర్ 1వ తేదీ నుంచి పింఛను ప్రాసెస్ చేయబడుతుందన్నారు. ప్రతి నెలా పింఛన్లు పంపిణీ పూర్తయిన పిదప, పింఛను చెల్లించని పింఛనుదారుల రిమార్కును నమోదు చేయుటకు ప్రొవిజన్ మొబైల్ యాప్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంటు వారికి ఇవ్వబడుతుందన్నారు. పురుష పెన్షనర్ డెత్ రిమార్క్ నమోదు చేసేటప్పుడు, జీవిత భాగస్వామి వివరాలు, ఆధార్, ఫోను నంబర్లు, పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ తీసుకొంటారన్నారు. పింఛన్‌కు సంబందించి ఎలాంటి సమస్యలైనా డీఆర్డీఏ పీడీ పరిశీలిస్తారని తెలిపారు. -
హోటళ్లపై విస్తృత దాడులు
రాయగడ: పట్టణంలోని పలు హోటళ్లపై సబ్ కలెక్టర్ కల్యాణి సంఘమిత్రా దేవి, ఏసీఎస్వో సుధాంశు భోయ్, సిబ్బంది గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని విజయలక్ష్మి, కేజీఎన్ హోటళ్లలో సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా నియమాలకు విరుద్ధం వంటగ్యాస్‌ను వినియోగిస్తుండడంతో ఆయా హోటళ్ల నుంచి 12 డొమస్టిక్ గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక గాంధీ నగర్‌లోని ఒక స్వీట్ తయారీ కంపెనీలో పరిసరాల శుభ్రత పాటించకపోవడంతో ఆ తయారీ కేంద్రాన్ని మూసివేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పలు హోటళ్లలో నాణ్యత లోపించిన ఆహారం విక్రయిస్తున్నారని, అదేవిధంగా అవసరానికి మించి అధిక శాతం కెమికల్స్ వంటి పదార్థాలు వినియోగిస్తున్నారన్నారు. అనంతరం పలు హోటళ్లపై భారీ జరిమానా విధించారు. -
మేళతాళాలతో ...
ప్రాచీన తీరం మొవులియా క్షేత్రం నుంచి శ్రీ జగన్నాథుని కోసం ప్రథమాష్టమి సామగ్రిని సంప్రదాయ మేళతాళాలతో తరలిస్తారు. భొయి సేవకులు ఆధ్యాత్మిక పతాకంతో ముందడుగు వేస్తుండగా ఢొలియా, మొహురియా సేవకులు దారి పొడవునా వాద్య సంగీతంతో ఉర్రూతలూగిస్తారు. వీరి వెంబడి గొడువా సేవకులు పాయికా నృత్య (యుద్ధ విన్యాసాలు) ప్రదర్శనతో అత్యంత ఆనందోత్సాహాలతో శ్రీనీలమాధవుడు సమర్పించిన సామగ్రిని యాత్రగా శ్రీ జగన్నాథుని కోసం తరలిస్తారు. ఈ యాత్ర రెండు విడతల్లో సాగుతుంది. మొవులియా క్షేత్రం నుంచి తొలుత పూరీ శ్రీ గుండిచా మందిరం ప్రాంగణానికి చేరుతుంది. కాసేపటి విరామంతో మలి విడత యాత్రగా శ్రీ మందిరానికి యాత్ర మొదలవుతుంది. పూజా సామగ్రిని శ్రీ మందిరం అధికారిక కార్యాలయంలో జమ చేస్తారు. దేవస్థానం పండితుల సూచన మేరకు శాస్త్రోక్తంగా ఈ సామగ్రిని ప్రధాన దేవాలయానికి తరలిస్తారు. ప్రాచీ తీరం నుంచి మాధవ, చంద్రమౌలి, చారిఛొకొ, గోప్, గణేశ్వరపూర్, నాగపూర్, షోలపూర్, మదరంగ్, ఛొయితొనా, బల్లిఘాయి, బల్లిగువాలి మీదుగా పూరీ గుండిచా మందిరం వరకు యాత్ర సాగుతుంది. -
మేళతాళాలతో ...
ప్రాచీన తీరం మొవులియా క్షేత్రం నుంచి శ్రీ జగన్నాథుని కోసం ప్రథమాష్టమి సామగ్రిని సంప్రదాయ మేళతాళాలతో తరలిస్తారు. భొయి సేవకులు ఆధ్యాత్మిక పతాకంతో ముందడుగు వేస్తుండగా ఢొలియా, మొహురియా సేవకులు దారి పొడవునా వాద్య సంగీతంతో ఉర్రూతలూగిస్తారు. వీరి వెంబడి గొడువా సేవకులు పాయికా నృత్య (యుద్ధ విన్యాసాలు) ప్రదర్శనతో అత్యంత ఆనందోత్సాహాలతో శ్రీనీలమాధవుడు సమర్పించిన సామగ్రిని యాత్రగా శ్రీ జగన్నాథుని కోసం తరలిస్తారు. ఈ యాత్ర రెండు విడతల్లో సాగుతుంది. మొవులియా క్షేత్రం నుంచి తొలుత పూరీ శ్రీ గుండిచా మందిరం ప్రాంగణానికి చేరుతుంది. కాసేపటి విరామంతో మలి విడత యాత్రగా శ్రీ మందిరానికి యాత్ర మొదలవుతుంది. పూజా సామగ్రిని శ్రీ మందిరం అధికారిక కార్యాలయంలో జమ చేస్తారు. దేవస్థానం పండితుల సూచన మేరకు శాస్త్రోక్తంగా ఈ సామగ్రిని ప్రధాన దేవాలయానికి తరలిస్తారు. ప్రాచీ తీరం నుంచి మాధవ, చంద్రమౌలి, చారిఛొకొ, గోప్, గణేశ్వరపూర్, నాగపూర్, షోలపూర్, మదరంగ్, ఛొయితొనా, బల్లిఘాయి, బల్లిగువాలి మీదుగా పూరీ గుండిచా మందిరం వరకు యాత్ర సాగుతుంది. -
హోటళ్లపై విస్తృత దాడులు
రాయగడ: పట్టణంలోని పలు హోటళ్లపై సబ్ కలెక్టర్ కల్యాణి సంఘమిత్రా దేవి, ఏసీఎస్వో సుధాంశు భోయ్, సిబ్బంది గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని విజయలక్ష్మి, కేజీఎన్ హోటళ్లలో సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా నియమాలకు విరుద్ధం వంటగ్యాస్‌ను వినియోగిస్తుండడంతో ఆయా హోటళ్ల నుంచి 12 డొమస్టిక్ గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక గాంధీ నగర్‌లోని ఒక స్వీట్ తయారీ కంపెనీలో పరిసరాల శుభ్రత పాటించకపోవడంతో ఆ తయారీ కేంద్రాన్ని మూసివేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పలు హోటళ్లలో నాణ్యత లోపించిన ఆహారం విక్రయిస్తున్నారని, అదేవిధంగా అవసరానికి మించి అధిక శాతం కెమికల్స్ వంటి పదార్థాలు వినియోగిస్తున్నారన్నారు. అనంతరం పలు హోటళ్లపై భారీ జరిమానా విధించారు. -
మృతదేహం కోసం బంధువుల రాక
మల్కన్‌గిరి: పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి కోసం ఆయన బంధువులు వచ్చారు. వారికి మృతదేహాన్ని అప్పగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం రాత్రి సమయంలో మావోయిస్టులు శబరి నది దాటుతుండగా ఎదురు కాల్పులు జరిగాయి. అయితే మావోలు నది దాటడానికి ఎంక సునమ్ అనే మత్స్యకారుడు సాయం చేశారు. ఈయన పొడియ సమితి మెటగూఢ గ్రామపెద్ద. మావోలను అడవిలోకి పంపేందుకు తన పడవలో దింపాడు. అడవిలో మార్గం చూపిస్తుండగా డీబీఎఫ్ జవాన్లు తారసపడ్డారు. అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో ఎంక సునమ్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఎంక సునమ్ భార్య, ఆయన సోదరుడు శుక్రవారం మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. మావోయిస్టులు వచ్చి నది దాటించాలని కోరారని, పోలీసులే మావోయిస్టు ముద్ర వేసి చంపేశారని చెప్పారు. పోలీసులు మాత్రం ఎంక పూర్తిగా మావోల సానుభూతిపరుడని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం ఎంక మృతదేహన్ని అప్పగించారు. -
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
● ఇంటింటా వేడుక ● ఎండురి రుచుల ఘుమఘుమలు ● తొలి సంతానానికి మేనమామ కానుకలు ● శ్రీక్షేత్రం, ఏకామ్ర క్షేత్రాల్లో ప్రత్యేక యాత్ర జగన్నాథుని సేవలో గవర్నర్ రాష్ట్ర గవర్నర్ రఘుబర దాస్ పూరీలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ మందిరం సందర్శించి రత్న వేదికపై కొలువై ఉన్న శ్రీ జగన్నాథుని దర్శించుకున్నారు. – భువనేశ్వర్పింఛన్ కోసం మూడు కిలోమీటర్లు! ● ప్రతినెల ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు రాయగడ: ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ కోసం ఆ వృద్ధురాలు ప్రతినెలా మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. జిల్లాలోని మునిగుడ సమితి ఘుముటిగుడ పంచాయతీ పరిధి జబగుడ గ్రామానికి చెందిన పునాలు వయసు 80 ఏళ్లు. ప్రభుత్వం అందించే మూడు వేల రూపాయల పింఛనే ఆమెకు ఆధారం. అయితే గ్రామంలో పింఛను అందజేసే అవకాశం లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలోని గురుండి పంచాయతీకి అధ్వానంగా ఉన్న రోడ్డుపై నడుకుంటూ వెళ్లి పింఛన్‌ను తీసుకుంటుంది. ఆ మార్గంలో వాహనాలు లేకపోవడంతో కాలినడకనే వెళ్లాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు దయతలచి గ్రామంలోనే పింఛన్ డబ్బులను అందించే ఏర్పాటు చేయాలని పునాలు కోరుతున్నారు. రైతులకు పరిహారం అందించాలి పర్లాకిమిడి: ఈ ఏడాది ఖరీఫ్ పంట చేతికి వస్తుందని రైతులు సంబర పడుతుండగా కాశీనగర్ సమితిలో ఏనుగులు సంచారం, గుసాని సమితిలో అడవిపందుల స్వైర విహారంతో పంట నష్టాలకు గురిచేస్తున్నాయని గజపతి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ పట్నాయిక్ అన్నారు. కాశీనగర్ సమితిలో గోరిబంద, అల్లడ, గుసాని సమితిలో కత్తలకవిటి, పుడ్డుని, అగరఖండి తదితర గ్రామాల్లో అడవిపందులు రాత్రిళ్లు వరి పంట నాశనం చేస్తున్నాయని అందువల్ల అటవీ శాఖ అధికారులు వన్యప్రాణులను పారద్రోలడానికి తగు చర్యలు చేపట్టాలని లేదా పంటనష్టం రైతులకు అందజేయాలని సూర్యనారాయణ పట్నాయిక్ డిమాండు చేశారు. తొలి సంతానానికి ప్రథమాష్టమి పూజ (ఫైల్)భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రథమాష్టమి వేడుకలకు అంతా సిద్ధమైంది. స్థానిక పంచాంగ గణాంకాల ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్ష అష్టమి ప్రథమాష్టమిగా ప్రతీతి. ఈ తిథిని సౌభాగిని అష్టమి, కాల భైరవ అష్టమి, పాప నాశిని అష్టమిగా కూడా చెబుతారు. శ్రీక్షేత్రం, ఏకామ్ర క్షేత్రంలో ప్రథమాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటింటా వేడుక ఈ తిథి నాడు కుటుంబంలో తొలి సంతానం ముద్దు, ముచ్చటతో ఆనందోత్సాహాలతో వేడుక చేసుకుంటారు. జ్యేష్ట సంతానం దీర్ఘాయుష్షు కోసం జ్యేష్టా దేవిని పూజిస్తారు. ఈ సందర్భంగా ఆడ, మగ నిమిత్తం లేకుండా తొలి సంతానం ఎవరైనా వారికి కొత్త బట్టలు తొడిగి పీటపై కూర్చోబెట్టి జ్యేష్టా దేవికి దీపారాధన చేసి నుదుట తిలకం దిద్ది శిరసున అక్షతలు జల్లి పెద్దలు ఆశీర్వదిస్తారు. ఆచారం.. ఆత్మీయం ప్రథమాష్టమి వేడుక ఆచారం, ఆత్మీయతల మేలి కలయిక. తోబుట్టువుకు తొలి సంతానం కలగడం మేనమామకు ఎనలేని ఆనందం పంచి పెడుతుంది. ఈ మనోభావానికి ప్రతీకగా ఏటా మార్గశిర మాసం అష్టమి నాడు మేనల్లుడు లేదా మేనగోడలకి కొత్త బట్టలు, మిఠాయి కానుకగా సమర్పించడం ఆచారం. ప్రాచీన కాలంలో మార్గ శిరం ఏడాదిలో తొలి మాసం. ఈ మాసంలో తొలి అష్టమి ప్రథమాష్టమిగా ప్రాచుర్యం సాధించడంతో నేటికి ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. ఎండురి పిండి వంటకం ప్రథమాష్టమి వేడుకలో ఎండురి పిండి వంటకం విభిన్నం. ఏడాదిలో ఒకే ఒకసారి ఈ వంటకం తారసపడుతుంది. మినప రుబ్బులో కొబ్బరి కోరు, బెల్లం, పెసర పప్పు మిశ్రమం పసుపు కొమ్ముల ఆకుల్లో పేర్చి ఆవిరి పట్టించడంతో ఎండురి పిండి వంటకం సిద్ధం అవుతుంది. ఈ వంటకం జ్యేష్టా దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా పరిగణిస్తారు. ప్రథమాష్టమి మినహా ఏడాది పొడవునా ఇతర సందర్భాల్లో ఈ వంటకం జాడ ఉండకపోవడం విభిన్నం. దీంతో పాయసం కూడా ఆరగిస్తారు. పాత్ర ప్రత్యేకం ఎండురి ఆవిరి పెట్టేందుకు వినియోగించే పాత్ర ప్రత్యేకం. దీని కోసం కొత్తగా ఒక మట్టి పాత్రని సిద్ధం చేస్తారు. 7 రోజులు ముందుగా దీన్ని సిద్ధం చేసుకుని ఎండురి వంటకం కోసం వినియోగిస్తారు. ఈ వంటకం తయారీ పూర్తి కావడంతో ఈ కుండని పగలగొట్టడం ఆచారం. ప్రధాన రహదారిపై కొనసాగుతున్న వారపు సంతరాయగడ: జిల్లాలోని అంబొదల వద్ద ప్రతీ సొమవారం జరిగే వారపు సంతను వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు కావడంతో రాకపొకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందువల్ల దీనిని వేరే ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేకంగా వారపు సంత కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని వ్యాపారులు వదిలేసి ప్రధాన రహదారిపై సంతను ఏర్పాటు చేస్తుండడంతో వాహన రాకపొకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే విషయమై పంచాయతీ, సమితి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపొతుందని ఆవేదన వ్యక్త ం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని వారపు సంతను తన యథాస్థానం వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.న్యూస్రీల్శ్రీక్షేత్రంలో ప్రథమాష్టమి పూరీ శ్రీ జగన్నాథుని సంస్కృతిలో ప్రథమాష్టమి వేడుకగా నిర్వహిస్తారు. స్వామికి మేనమామ దగ్గర నుంచి సంప్రదాయ భారం (కావడి) సంప్రదాయరీతిలో తరలి వస్తుంది. నియాలి ప్రాంతం మొవులా క్షేత్రం నుంచి పూరీ శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరానికి ప్రథమాష్టమి పూజా సామగ్రి చేరుతుంది. సప్తమి నాడు ఒక రోజు ముందుగా ఈ సామగ్రి తరలిస్తారు. వీటిలో పచ్చి బియ్యం, మినుములు, కొబ్బరి, బెల్లం, అరటి పండ్లు, నెయ్యి, చందనపు చెక్క, కర్పూరం, జాజికాయ, తమలపాకులు, వక్క, ఏలకులు, లవంగాలు, గోపాల వల్లభ భోగం కోసం పలు రకాల పండ్లు, కాయలు మరియు భగవంతుని అలంకరణ కోసం పద్మ పూలు ఉంటాయి. మొవులా క్షేత్రం అధిష్టాన దైవం శ్రీ మాధవుడు శ్రీ జగన్నాథుని మేనమామగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ప్రథమాష్టమి పురస్కరించుకుని స్వామి కోసం శ్రీ మందిరానికి ప్రథమాష్టమి సరుకులు చేరుతాయి. రాకపోకలకు ఇబ్బంది కేటాయించిన స్థలంలో సంతను నిర్వహించాలని ప్రజల డిమాండ్ -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
రాయగడ: అప్పుల బాధ తాళలేక ఒక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి హజరిడంగ్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. హజరిడంగ్ గ్రామంలో నివసిస్తున్న నరసింహ కుసులియా(55) అనే వ్యక్తి చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా వ్యాపారంలో తీవ్ర నష్టాలను చవిచూడడంతో గత్యంతరం లేక కొంత మొత్తం అప్పులు చేసి వ్యాపారాన్ని కొనసాగించాడు. అయితే తెచ్చిన అప్పులను సకాలంలో తీర్చలేకపోవడంతో అప్పులు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో విరక్తి చెందిన నరసింహ జంబుగుడ గ్రామ సమీపంలోని ఒక జీడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. అయితే అంతకుముందు తన కొడుకై న లోకేష్‌కు ఫోన్‌చేసి, తను జంబుగుడ వద్దనున్న ఒక జీడితోటలో ఉన్నట్లు చెప్పి అక్కడికి రమ్మన్నాడు. కొద్ది సమయం తర్వాత లోకేష్ జీడి తోటకు వెళ్లి తన తండ్రిని వెదుకుతుండగా ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే అక్కడి వారికి చెప్పాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. -
క్రీడాకారుడు ఉపేంద్ర మహరాణ మృతికి సంతాపం
జయపురం: కొరాపుట్ జిల్లాలో ప్రముఖ క్రీడాకారుడు ఉపేంద్ర మహరాణ అకాల మృతిపై క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక విక్ర మ మైదానంలో శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. ఉపేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. జయపురం సబ్‌డివిజన్ అట్లథిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయిక్ అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో ఉపేంద్ర మహారాణ క్రీడా రంగానికి చేసిన సేవలు కొనియాడారు. ఆయన ఆకస్మిక మృతి క్రీడాలోకానికి తీరని లోటన్నారు. ఉపేంద్ర పుట్‌బాల్, వాలీబాల్ విశేష ప్రతిభ ప్రశంసనీ యమన్నారు. అతడి శిక్షణతో పలువురు యువకులు మంచి ఆటగాళ్లు అయ్యారని గుర్తు చేశారు. సంతాపసభలో మోహణ గౌఢ, మోహణ మఝి, శివశంకర బిశ్వాల్, రమేష్ సాహు, తరుణ కుమార్ మహాప్రాత్ర, టిను పాణి గ్రహి, బలియ పాణిగ్రహి పాల్గొన్నారు. -
మా పొట్ట కొట్టే ఎయిర్‌పోర్టు వద్దు
వజ్రపుకొత్తూరు రూరల్/కాశీబుగ్గ: మందస, వజ్రపుకొత్తూరు మండలాల సరిహద్దు ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్డు నిర్మాణానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఉద్దాన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో ఓ వైపు కేంద్ర బృందం(ఏఏఐ) స్థల పరిశీలన చేస్తుంటే.. మరో వైపు స్థానిక ఉద్దాన రైతులు నుంచి వ్యతిరేక సెగలు మొదలయ్యాయి. ఆయా మండలాల సరిహద్దు గ్రామాల్లో రైతులు చర్చలు జరిపి మందస మండలం రాంపురం పంచాయతీలో శుక్రవారం ఉద్దాన రైతులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి వ్యతిరేకింగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్దాన రైతులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఉద్యాన పంటలను నమ్ముకొని పిల్లాపాపలతో జీవనోపాధి సాగిస్తున్నామని చెప్పారు. తాము నమ్ముకున్న భూమిని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాకు నష్టం కలిగించే ఎలాంటి ఎయిర్‌పోర్టులు వద్దు.. మా భూములే ముద్దు అంటూ ముక్తకంఠంతో నినదించారు. -
నేడే ప్రథమాష్టమి
లింగరాజు యాత్ర భువనేశ్వర్ లింగరాజు మహా ప్రభువు ప్రథమాష్టమి వేడుకని యాత్రగా జరుపుకోవడం విశేషం. ఈ తిథి నాడు మహా ప్రభువు మేన మామ సన్నిధికి తరలి వెళ్తాడు. స్థానిక కపాలి మఠం లింగ రాజు మహా ప్రభువు మేనమామ సన్నిధి. ఈ సన్నిధి ఆరాధ్య దైవం వరుణేశ్వర్, బలదేవ్. ఈ మఠం ప్రాంగణంలో పాపనాశిని పుష్కరిణి ఉంటుంది. ప్రథమాష్టమి పురస్కరించుకుని ఈ పుష్కరిణి జలం స్వీకరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.తాంత్రిక ప్రాముఖ్యత ప్రథమాష్టమి తాంత్రికంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. తంత్ర సాధకులకు ఈ రాత్రి అత్యంత కీలకం. తాంత్రిక సంప్రదాయంలో ఘోర రాత్రిగా పేర్కొంటారు. ఈ తిథి నాడు ఆది శక్తి కాల రాత్రి రూపంలో అవతరించినట్లు తాంత్రిక వర్గీయులు పరిగణిస్తారు. -
రహదారి రక్తసిక్తం
● ట్రక్కు, బైక్ ఢీకొని నలుగురు మృతిజయపురం: జయపురం–బొయిపరిగుడల మధ్య విజయవాడ–రాంచీ 326 జాతీయ రహదారిలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. జయపురం సమితి పాత్రోపుట్ గ్రామ పంచాయతీ జబకనాడి గ్రామం సమీపంలో లోడుతో వస్తున్న ఒక ట్రక్కు జాతీయ రహదారిపై వెళ్తుండగా బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆనవాళ్లు కూడా లేకుండా మృతదేహాలు ఛిద్రమైపోయాయి. పొగమంచు దట్టంగా ఉండడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న జయపురం సదర్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. -
హత్య కేసులో నిర్దోషిగా మావో నేత సవ్యసాచి
రాయగడ: మావోయిస్టు నేత సవ్యసాచి పండాను ఒక హత్య కేసుకు సంబంధించి నిర్దోషిగా గుణుపూ ర్ ఏడీజే కోర్టు తీర్పునిచ్చింది. శుక్రవారం ఈ కేసు కు సంబంధించి పూర్తి పోలీసు బందోబస్తు మధ్య సవ్యసాచి పండాను కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2004 ఆగస్టు 13న చంద్రపూర్ సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తు న్న డాకు మాఝి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలొ మావో నేత సవ్యసాచి పండాను ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. డాకు మాఝి సమితి కార్యకలాపాల ను నిర్వహించి బైకుపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాన రహదారి వద్ద కొందరు మావోయిస్టులు అతనిపై దాడి చేసి హత్య చేశారు. ఇందులో సవ్యసాచి పండా కీలక పాత్ర పొషించినట్లుగా భావించిన పొలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రాగా శుక్రవా రం గుణుపూర్ ఏడీజే కోర్టు 18 మంది సాక్షులను విచారించి తీర్పు వెల్లడించిందని పండా తరఫు న్యాయవాది బ్రహ్మానంద పట్నాయక్ తెలిపారు. -
మావోల కదలికలపై నిఘా
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాకు అనుకుని ఉన్న మూడు రాష్ట్రాల సరిహద్దులను సీజ్‌చేసి మావోల కదలికలపై నిఘా పెట్టేందుకు ఒడిశా–చత్తీస్‌గఢ్, చత్తీస్‌గఢ్–తెలంగాణ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు పెట్టారు. శుక్రవారం తొలి డ్రోన్ కెమెరా ఎంవీ 79 పోలీస్ స్టేషన్ పరిధిలో గల జినెల్గూఢ అడవిలో ఎగిరింది. శబరి నది ప్రాంతంలో ఉన్న మెటగూఢ, కాటన్పల్లి మధ్య ఉన్న గ్రామాల్లోకి హెలికాప్టర్ ద్వారా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి అక్కడ కూడా డ్రోన్ వాడారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమ జిల్లా ఒడిమ్గూఢ–ఎర్రబార గిరిజన గ్రామాల మధ్య సరిహద్దులోనూ డ్రోన్లు ఎగరేశారు. అలానే మల్కన్‌గిరి జిల్లా నుంచి కలిమెల సమితి మోటు మీదుగా వెళ్లే రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసేశారు. జినెల్గూఢ, టోంకెల్గఢ రహదారుల్లో జవాన్లు ముమ్మరంగా గస్తీ కాస్తున్నారు. వాహనాలను పరిశీలించాకే వదులుతున్నారు. అడవిలో డ్రోన్ కెమెరా అప్డేట్ మిషన్ -
పెరుగుతున్న వాయు కాలుష్యం
భువనేశ్వర్: నగరంలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో వాయు నాణ్యత శాతం దిగజారుతోంది. ప్రధానంగా ఈ ఏడాది దీపావళి తర్వాత నుంచి ఈ కాలుష్యం మరింత అధికమైంది. తాజా సమాచారం ప్రకారం నగరంలో వాయు నాణ్యత 171 యూనిట్లకు పరిమితం అయింది. జాతీయ స్థాయిలో కలవరపరుస్తున్న ఢిల్లీ వాయు నాణ్యత (ఏక్యూఐ) 371 యూనిట్లు కొనసాగుతున్న తరుణంలో నగరంలో పరిస్థితి దీని చేరువకు పాకుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. నగరంలో తాజా వాయు నాణ్యత లెక్క ప్రకారం భువనేశ్వర్ రెడ్ కేటగరీలోకి చేరింది. ఏక్యూఐ 151 నుంచి 200 యూనిట్ల మధ్య చేరితే ఆ ప్రాంతం వాయు కాలుష్యం ప్రమాదం అంచుల్లో ఉన్నట్లు పరగణిస్తారని వాతావరణ నిపుణుల సమాచారం. -
మోహనలో ఆశా వర్కరు పోస్టుకు కుమ్ములాటలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ టి.లక్ష్మీపూర్ గ్రామానికి ఆశా వర్కరు పదవి ఒకటి ఖాళీగా ఉందని అధికారులు ప్రకటించారు. ఆశా వర్కరు ఒక్క పోస్టు కోసం మోహనా మెడికల్ ఆఫీసర్ వద్ద కుమ్ములాట సాగింది. ఈ ఉద్యోగం కోసం పాణిగండ పంచాయతీ టి.లక్ష్మీపూర్ గ్రామం నుంచి మమ తా నాయక్, శ్రీమంజలి మల్లిక్ అనే ఇద్దరు మహిళ లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మమతా నాయక్ స్థానికేతర అభ్యర్థి అని, లక్ష్మీపురం గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోహన మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. కటక్‌కు చెందిన మమ తా నాయక్ టి.లక్ష్మీపూర్‌లో ఇటీవల వచ్చి నివాసం ఉంటోందని, ఆమె స్థానికేతర మహిళ అని సర్పంచు, వార్డుమెంబరు ప్రణతి బలియార్ సింగ్, గ్రామ అభివృద్ధి కమిటీ ఇవ్వాలని గురువారం మోహనా మెడికల్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆశా వర్కరు పోస్టుకు ఆర్హతపై ఉన్నతాధికారులు ఎంపిక చేస్తార ని మెడికల్ ఆఫీసర్ అన్నారు. -
రహదారి ఏర్పాటు చేయాలని ఆందోళన
రాయగడ: జిల్లాలోని మునిగుడలో టికిరపడ రైల్వే క్రాసింగ్ వద్ద అండర్ గ్రౌండ్ రహదారిని నిర్మించాలని ప్రగతి మంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. దీనిలో భాగంగా మునిగుడలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ కూడలి నుంచి రైల్వేస్టేషన్ వరకు వందలాది మంది ఆందోళనకారులు ర్యాలీలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. అనంతరం రైల్వేస్టేషన్ ఎదుట బైఠాయించారు. టికిరిపడ ప్రధాన రహదారి వద్దనున్న రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు పడుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు ఎదురవుతున్నాయన్నారు. అందువలన అండర్ గ్రౌండ్ రహదారి ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళన చేస్తున్నామని ప్రగతి మంచ్ అధ్యక్షుడు సీహెచ్ గణేశ్వరరావు, నందకిషోర్ పట్నాయక్, సింహా చల్ పండ తదితరులు తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
జయపురం: మార్నింగ్ వాక్కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన బొరిగుమ్మలో చోటు చేసుకుంది. బొరిగుమ్మ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పితాంబర పూజారి(59) రోజూ మార్నింగ్ వాక్కు వెళ్తుంటారు. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో బొరిగుమ్మ 28వ నంబర్ రాష్ట్ర రహదారి దుల్లాగుడ సమీప రాణిగుడ వరకు వెళ్లి బొరిగుమ్మ తిరిగి వస్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో పూజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూచిన వారు వెంటనే బొరిగుమ్మ పోలీసులకు తెలియజేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూజారిని బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పూజారి మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతదేహానికి పోస్టుమార్టం జరిపి అతడి బంధువులకు అప్పగించారు. బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి తపశ్వణీ కొహార్, ఎస్ఐ రొచిత మడకామి, మానస హేబ్రమ్, మేఘనాత్ సోరెన్, ద్రోణాచార్య బాగ్, ఏఎస్ఐ సస్మిత నాయిక్, గోపాల్ హరిజన్, బసంత కుమార్ బాగ్, చందన ప్రసాద్ మఝి తదితరులు నివాళులర్పించారు. ఢీకొన్న వాహణం కొట్‌పాడ్ దిశలో వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. రైతుల సేవలో బొరిగుమ్మ లేంపునకు రాష్ట్రస్థాయి బహుమతి జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగు మ్మ లేంపు రాష్ట్ర స్థాయిలో రెండో ఉత్తమ బహు మతి పొందింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ జయదేవ్ భవనంలో గురువారం నిర్వహించిన 71 వ అఖిల భారత సహకారోత్సవాల్లో బొరిగుమ్మ లేంపునకు ఈ గౌరవం దక్కింది. విధానసభ స్పీకర్ సురమ్ పాఢీ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని బొరిగుమ్మ లేంప్ వ్యవసాయ ఉన్నతికి రైతులకు అందించిన సేవలకు మెచ్చి ప్రశంసా పత్రంతో పాటు మెమోంటో లతో లేంపు అధ్యక్షుడు లాలూమణిసంగ్, లేంపు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న మిశ్ర సన్మానించారు. ఏడు బైక్‌లు సీజ్ జయపురం: శబ్ద కాలుష్యం చేస్తున్న బైక్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం రాత్రి జయపురం పట్టణ పోలీసులు శబ్దాలు సృష్టిస్తున్న 7 బైక్‌లను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను తొలగించినట్లు పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొళాయి శుక్రవారం వెల్లడించారు. ఆయా మోటారు బైక్ యజమానుల నుంచి రూ.4,000 జరీమానా వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. పోలీసు సిబ్బంది 326 విజయవాడ–రాంచీ జాతీయ రహదారిలో తనిఖీలు చేస్తూ ఎక్కువ శబ్దంతో వెళ్తున్న బైక్‌లను ఆపి సైలెన్సర్లను తొలగించారు. సైలెన్సర్లను మార్చిన తర్వాత వారికి బైక్ లు అప్పగించినట్లు తెలిపారు. గుడారిలో గంజాయి తోట ధ్వంసం రాయగడ: జిల్లాలోని గుడారి పోలీస్ స్టేషన్ పరిధి గుమ్మి అటవీ ప్రాంతంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి తోటను పోలీసులు, అబ్కారి శాఖ అధికారులు సంయుక్తంగా శుక్ర వారం నిర్వహించిన దాడుల్లో నాశనం చేశారు. రహస్యంగా అందిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ ఆదేశానుసారం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయితోను గుర్తించి కట్ చేసి తగులబెట్టారు. సుమారు 18 వేల గంజాయి మొక్కలు నాశనం చేసినట్టు అధికారులు చెప్పారు. రాష్ట్రపతి పర్యటనకు సన్నద్ధత భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆమె 4 రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు నెల 3 నుంచి 7వ తేదీ వరకు పలు జిల్లాలు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకు స్థాపన, ప్రముఖులతో భేటీ, విద్యార్థులతో ముచ్చటతో స్వగ్రామం సందర్శన, సొంత ఇంటిలో బస వంటి కార్యక్రాలు ఉన్నాయి. రాష్ట్ర పర్యటన ముగించుకుని కోల్కత్తా మీదుగా న్యూఢిల్లీ తిరుగు పయనం అవుతారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆగమనం నుంచి తిరుగు ప్రయాణం వరకు ఆద్యంతాలు భద్రతా ఏర్పాట్లతో వసతి, పర్యటన ఇతరేతర అనుబంధ కార్యకలాపాల సన్నద్ధతని ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా శుక్రవారం సమీక్షించారు. -
అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి
భువనేశ్వర్: రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, పంపిణీ, విక్రయం వంటి కార్యకలాపాల్ని పూర్తిగా అణచి వేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని అబ్కారి శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ శుక్ర వారం తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల తరచూ తలెత్తుతున్న అక్రమ మద్యం రవాణా, కల్తీ సారా మృతులు వంటి సంఘటనలతో ప్రభుత్వం ఘాటుగా స్పందించి ఈ మేరకు నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. అక్రమ మద్యం డిస్టిలరీలు ఇతర తయారీ స్థావరాలపై నిఘా వేసి ఉత్పాదన, పంపిణీ, విక్రయాల లావాదేవీల్ని మూలాలతో తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయా ప్రాంతాలపై తమ విభాగం నిరంతరం నిఘా వేసి ఉంటుందన్నారు. అక్రమ మద్యం అణచి వేత పురస్కరించుకుని చట్ట సంస్కరణ సోపానంగా ప్రభు త్వం నిర్ధారించింది. ఈ దిశలో చర్యలు చేపట్టేందు కు అనుబంధ వర్గాల నిపుణులు, అనుభవజ్ఞులతో విభాగం ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతుంది. వీరి సలహాలు, మార్గదర్శకాలి క్రోడీకరించి చట్ట సంస్కరణలు చేపట్టనున్నారు. మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల లావాదేవీల్ని విభాగం అరికడుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ, అబ్కారి విభాగాన్ని సమన్వయ పరచి వ్యూహాత్మక కార్యాచరణకు తుది మెరుగులు దిద్దుతోందని విభాగం మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల్ని మట్టుబెట్టడం లక్ష్యంగా పేర్కొన్నారు. బీజేడీ పార్లమెంటరీ సమావేశం భువనేశ్వర్: భారత పార్లమెంటు శీతాకాలం సమావేశాలను పురస్కరించుకుని బిజూ జనతా దళ్ పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. స్థానిక నవీన్ నివాస్‌లో బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఈ సమావేశం శుక్రవారం జరిగింది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాలం సమావేశంలో పార్టీ వైఖరిపై సభ్యులకు అవగాహన కల్పించారు. జవాన్ మృతితో విషాదం సోంపేట: మండలంలోని తురకశాసనాం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వెదుళ్ల నాగేశ్వరరావు (58) గురువారం అరుణాచల్‌ప్రదేశ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈయన 28 ఏళ్లుగా జిఆర్ఈఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో వైద్యసేవలు అందజేసినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నాగేశ్వరరావుకు భార్య కమలమ్మ, కుమారుడు ఆకాష్, కుమార్తె అనూష ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఆర్మీలోనే విధులు నిర్వహిస్తున్నాడు. నాగేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నారు. -
వీధికెక్కిన వెండితెర ప్రముఖులు
భువనేశ్వర్: ఒడియా వెండి తెర ప్రముఖుల వివా దం వీధికి ఎక్కింది. వీరిలో దర్శకుడు బాబీ ఇస్లాం, నటుడు మనోజ్ మిశ్రా ఉన్నారు. వీరితో మరో దర్శకుడు జ్యోతి దాస్ ఉన్నాడు. బాబీ, మనోజ్ మధ్య మనస్ఫర్థలు తొలగించి వివాదం పరిష్కారం కోసం నగర కమిషనరేటు పోలీసులు పిలిపించారు. ఈ సందర్భంగా ఈ రెండు వర్గాలు శుక్రవారం నగ ర డీసీపీ కార్యాలయం ఆవరణకు చేరడంతో రెచ్చి పోయారు. బాహాబాహిగా తలపడ్డారు. నడి రోడ్డు మీద వెండి తెర ప్రముఖుల ప్రత్యక్ష పోరుతో సాధారణ ప్రజానీకం అవాక్కయ్యారు. పోలీసులు చొరవ కల్పించుకుని ఇరువుర్ని శాంతింపజేసి మంతనాలు ప్రారంభించారు. నటుడు మనోజ్ మిశ్రా దర్శకుడు బాబీ ఇస్లాంకు వాట్సాప్ ఫోను సంభాషణలో ప్రాణం తీస్తానని బెదిరించినట్లు ఆరోపణ. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇదే పరిస్థితి తనకు కూడా ఎదురైనట్లు మరో దర్శకుడు జ్యోతి దాస్ తోడయ్యా డు. మనోజ్, బాబీ మధ్య వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు పోలీసుల పిలుపు మేరకు విచ్చేసిన ఇరు వర్గాలు తలపడడంతో డీసీపీ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. -
రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాలి : పీఓ
పార్వతీపురం టౌన్: జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆకాంక్షించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి నేపథ్యంలో జన్ జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు జరిగాయి. అందులో భాగంగా వాలీబాల్, జావలింగ్ త్రో, ఆర్చరీలలో విజేతలుగా ఎంపికై న 28 మంది విజేతలకు శుక్రవారం ఆయన కార్యాలయం వద్ద పీఓ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొంది పతకాలతో తిరిగిరావాలని ఆశీర్వదించారు. 24న జరగబోయే రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలకు 33 మంది విద్యార్థినులు, 22 మంది గిరిజన కళాకారుల బృందం పాల్గొంటున్నట్లు తెలిపారు. 25న రాష్ట్ర స్థాయిలో జరగనున్న వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వ పోటీల్లో 9 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. -
మూడు నెలల వరకు పింఛన్ బకాయి చెల్లింపు
పార్వతీపురం: ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద మూడు నెలల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శుక్రవారం టెలి కాన్షరెన్స్ ఆయన నిర్వహించారు. పింఛను పంపిణీ వ్యవధిలో అందుబాటులో లేనివారు, పింఛను తీసుకోని పింఛనుదారులకు మూడు నెలల వరకు పింఛను బకాయిలు చెల్లించడం జరుగుతుందన్నారు. బకాయిల చెల్లింపు 2024 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి విడుదల అవుతుందని ఆయన వివరించారు. పింఛనుదారు ఏదైనా కారణం చేత పింఛను తీసుకోకపోతే, అది తాత్కాలిక వలసగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా పింఛనుదారు ఒక నెలలో పింఛను (తాత్కాలిక వలస) తీసుకోకపోతే, ఒక నెల బకాయితో పాటు రెండవ నెల పింఛను విడుదల చేయడం జరుగుతుందని, పింఛనుదారులు రెండవ నెలలో కూడా పింఛను తీసుకోని పక్షంలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద పింఛనుదారులకు సౌకర్యాలు కల్పించేందుకు రెండు నెలల బకాయిలతో పాటు మూడవ నెల పింఛను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు. పింఛనుదారులు మూడు నెలలు వరుసగా పింఛను తీసుకోకపోతే శాశ్వత వలసగా పరిగణించి వారి పింఛను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత నిబంధనలపై పింఛనుదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పింఛను పంపిణీని పర్యవేక్షించాలని అన్నారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ -
లక్ష్మణ్‌నాయక్ ఆశయాలను కొనసాగించాలి
● నివాళులర్పించిన ప్రముఖులు రాయగడ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీ నాయకుడు సహీద్ లక్ష్మణ్ నాయక్ ఆశయాలను కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు. లక్ష్మణ్ నాయక్ 125వ జయంతిని శుక్రవారం అధికారికంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాయగడ లోని శాసీ్త్రనగర్లో ఉన్న లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరైతా, వాటర్ షెడ్ పీడీ దయానిధి బాగ్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంతకుమార్ ప్రధాన్ తదితర ప్రముఖు లు హాజరై లక్ష్మణ్ నాయక్ సేవలను గుర్తు చేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు లక్ష్మణ్ నాయక్ పొరాట పటిమను గురించి కొనియాడారు. కొరాపుట్: స్వాతంత్య్ర పోరాటంలో బలిదానం చేసిన కొరాపుట్ జిల్లాల గిరిజన యోధుడు సాహీద్ లక్ష్మణ్ నాయక్ జయంతిని కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌లోని లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి పొట్టంగి ఎమ్మెల్యే రాం చంద్ర ఖడం, కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలకలు పూల మాలలు వేసి నివాళులర్పి ంచారు. కొరాపుట్ జిల్లా సునాబెడా మున్సిపల్ చైర్మన్ రాజేంద్రకుమార్ పాత్రో పట్టణంలోని సహచర కౌన్సిలర్లతో వెళ్లి లక్ష్మణ్ నాయక్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆయన విగ్రహానికి విద్యార్థులు నివాళులర్పించారు. జయపురం: సహిద్ లక్ష్మణ నాయక్ జయంతి కార్యక్రమాన్ని జయపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. స్థానిక గుప్తేశ్వర కాప్లెక్స్ ప్రాంగణంలోని లక్ష్మణ నాయక్ విగ్రహానికి జయపురం సబ్‌కలెక్టర్ ఎ.శొశ్యరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమెతో పాటు జయపురం సబ్‌డివిజన్ ఏడీపీఆర్వో యశోద గదబ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ నాయక్ జన్మస్థలం తెంతులిగుమ్మకు సబ్ కలెక్టర్ శొశ్యరెడ్డి వెళ్లారు. అలాగే లక్ష్మణ నాయక్ స్మృతి సమితి జయపురం వారు నాయక్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పి్ంచారు. కార్యక్రమంలో స్మృతి సమితి అధ్యక్షుడు మదన మోహననాయక్, కార్యదర్శి మాధవ చౌదురి, ఉపాధ్యక్షులు గౌరవ బోత్ర, సహాయ కార్యదర్శి వెంకటరావు పట్నాయక్, సలహాదారులు బాలా రాయ్, కృష్ణ చంద్రహొత్త, సురేంద్రఖొర, అదివాసీ, దళిత మహాసంఘం మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు మమత నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు. కొట్పాడ్లో.. కొట్పాడ్లో సాహిద్ లక్ష్మణ నాయక్ జయంతిని ఆదివాసీ సంఘం నిర్వహించారు. లక్ష్మణ నాయిక్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్ అవరణలో ఉన్న లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ సోమానాథ్ప్రధన్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్కన్‌గిరి జిల్లా కోసం లక్ష్మణ్ నాయక్ వ్యక్తిగా కాకుండా శక్తిగా చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో ప్రమిళ మాఝి, పాఠశాల ఉపాధ్యాయుడు ధఉష్మంతో జెన, ఇతర అధికారులు పాల్గొన్నారు.