Vasundhara Raje
-
సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే!
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. రాజే బుధవారం రాత్రి 10:30 గంటలకు ఇండిగో ఎయిర్వేస్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే గురువారం ఉదయం జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నారు. రాజస్థాన్‌లో అధికారాన్ని వసుంధర రాజేకు అప్పగించాలని పార్టీ హైకమాండ్ మరోసారి భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. డిసెంబరు 3న రాజస్థాన్‌లో బీజేపీకి మెజారిటీ వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. ఈ జాబితాలో వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజేంద్ర రాథోడ్, దియా కుమారి, బాబా బాలక్‌నాథ్, ఓం బిర్లా పేర్లు ఉన్నాయి. సీఎం రేసులో అనేక మంది పేర్లు ఉండటంతో వసుంధర రాజే చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఆమె విందుకు ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆమెను ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించారని వసుంధర మద్దతుదారులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో రాజే ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఎంపీ పదవికి 10 మంది రాజీనామా -
రాజస్తాన్ రాజెవరో?
రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి పరాభవం ఎదురైంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. రాజస్తాన్ రాజు ఎవరవుతారో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రధానంగా నలుగురు ముఖ్యనేతలు సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సభ్యురాలు దియా కుమారి(ఈ ఎన్నికల్లో విద్యాధర్‌నగర్ స్థానం నుంచి గెలిచారు), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహంత్ బాలక్‌నాథ్ యోగి సైతం సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. వసుంధర రాజే వసుంధర రాజే గతంలో రెండుసార్లు రాజస్తాన్ సీఎం చేశారు. ఈ ఎన్నికల్లో జాల్రాపటాన్ స్థానం నుంచి భారీ మెజారీ్టతో గెలుపొందారు. ఆమె బీజేపీ అధిష్టానాన్ని విభేదిస్తున్న నేతగా పేరుగాంచారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పెద్దగా సత్సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. బీజేపీలో పాతతరం నేత అయిన వసుంధర రాజేను మూడోసారి గద్దెనెక్కించడానికి పార్టీ అగ్రనేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకపోవడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కుదించుకుపోయాయి. దియా కుమారి రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. జైపూర్ దివంగత మహారాణి గాయత్రి దేవి మనవరాలైన దియా కుమారి బీజేపీలో వసుంధర రాజేకు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. రాచరిక నేపథ్యం, రాజ్‌పుత్ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. చాలాఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో సవాయ్‌మాధోపూర్ ఎమ్మెల్యేగా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రశంలందుకున్నాయి. రాజస్తాన్‌లో నూతన ముఖ్యమంత్రిని నియమించే విషయంలో పార్టీ అధిష్టానం దియా కుమారి వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మహంత్ బాలక్‌నాథ్ యోగి రాజస్తాన్‌లోనూ ఉత్తరప్రదేశ్ తరహా ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు మహంత్ బాలక్‌నాథ్ యోగి. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ మఠాధిపతి అయిన ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. బాలక్‌నాథ్ ప్రస్తుతం రాజస్తాన్‌లో అల్వార్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. గతంలో సన్యాసం స్వీకరించారు. మహంత్ చాంద్‌నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. రాష్ట్రంలో బలమైన అనుచరవర్గం ఉంది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గజేంద్రసింగ్ షెకావత్ రాజస్తాన్ బీజేపీలో మరో సీనియర్ నేత గజేంద్రసింగ్ షెకావత్. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అవినీతి వ్యవహారాలపై పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా పనిచేశారు. ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పించారు. తదుపరి సీఎం రేసులో తాను ఉన్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. సీఎం పోస్టుపై గజేంద్రసింగ్ ఆశలు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇది మోదీ సునామీ: సీఎం రేసులో బీజేపీ రేసు గుర్రాలు
రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యం అప్రతి హతంగా కొనసాగుతోంది. కీలక నేతలు భారీ మెజారిటీతో విజయం సాధించి గెలుపు గుర్రాలు నిలిచారు. ముఖ్యంగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 53,193 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. దీంతో ఆమె మళ్లీ రాజస్థాన్ ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించాలని ఆమె మద్దతుదారులు కోరుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఎంసీ దియా కుమారి విద్యాధర్ నగర్లో 71,368 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై విజయం సాధించారు. రాజకుటుంబానికి చెందిన కుమారికూడా సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. తన విజయం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె దేశవ్యాప్తంగా మోదీ సునామీ వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు ప్రధాని మోదీ, అమిత్ షా జీ, జేపీ నడ్డా జీ, రాష్ట్ర నాయకులు పార్టీ కార్యకర్తలకే చెందుతుంతన్నారు. రాజస్థాన్‌తో పాటు ఎంపీ ,ఛత్తీస్‌గఢ్‌లో కూడా మోదీజీ మ్యాజిక్ పనిచేసింది, రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తాం.. ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు కనిపిస్తున్నాయి.. ఇక సీఎం ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని దియా వ్యాఖ్యానించారు. మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జోత్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై ఆయన సునాయాసంగా విజయాన్ని నమోదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ శ్రేణులకు, జోత్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చెప్పేది చేసే పార్టీకి చెందిన వారమని ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. #WATCH | Rajasthan BJP MLA candidate Diya Kumari, in Jaipur says, "The credit for this win goes to PM Modi, Amit Shah ji, JP Nadda ji, state leaders and party workers. Modi ji's magic worked in Rajasthan and also MP & Chhattisgarh...We will ensure good governance and development… pic.twitter.com/3stn8l8Vj1 — ANI (@ANI) December 3, 2023 VIDEO | Rajasthan elections 2023: "I would like to thank PM Modi, BJP workers and the people of Jhotwara. People know that we belong to a party that do what it says," says @Ra_THORe, BJP candidate from Jhotwara, as party continues to maintain lead in Rajasthan.… pic.twitter.com/BO2v3PCmu1 — Press Trust of India (@PTI_News) December 3, 2023 -
ఆధిక్యంలో ఉన్న వసుంధర రాజే..ముచ్చటగా మూడోసారి ఆమెనా..?
రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌తో బీజేపీ దూసుకుపోతోంది. ఝల్రాపతన్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 25వ రౌండ్ కౌంటింగ్ 53,193 ఓట్లతో ఆధిక్ష్యంలో కొనసాగుతున్నారు. ఎలాగైన కాంగ్రెస్‌ని మట్టికరిపించి పాగా వేయాలనుకున్న బీజేపీ చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక వసుంధర రాజే పోటీ చేసిన నియోజక వర్గం నుంచే రామ్‌లాల్ చౌహాన్ సవాల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. ఇక వంసుధ రాజే 2003 నుంచి ఝలావర్ జిల్లాలోని ఝల్రాపతన్ అసెంబ్లీ సీటును గెలుస్తూ ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న వసుంధర రాజే మళ్లీ సీఎం కావావలని ఆ కుర్చీని ఆశిస్తున్నారు. రాజస్థాన్‌లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పిండ్వారా అబూ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సమరం 13,094 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లీలారామ్ గ్రాసియా కంటే ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి గోవింద్ ప్రసాద్ కూడా 24,865 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి కైలాష్ చంద్ మనోహర్ థానా కంటే ఆధిక్యంలో ఉన్నారు. అలాగే విద్యాధర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై బీజేపీ నాయకురాలు దియా కుమారి ఆధిక్యంలో ఉన్నారు. ఇక దియా కుమారి 17వ రౌండ్ కౌంటింగ్ తర్వాత 56,025 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 1,30,231 ఓట్లను సాధించారు. బీజేపీ ఎంపీ, ఝోత్వారా అభ్యర్థి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై ఆధిక్యంలో ఉన్నారు. పదిహేనవ రౌండ్ కౌంటింగ్ తర్వాత రాథోడ్ 36723 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 123312 ఓట్లను సాధించారు. మధ్యాహ్నాం వరకు సాగిన కౌంటింగ్‌లో.. బీజేపీ కాంగ్రెస్ ఇతరులు 114 71 15 ఇక వసుంధర రాజే రెండు పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ముచ్చటగా మూడోసారి ఆమె సీఎం అవతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మహంత్ బాలక్‌నాథ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, రాజస్థాన్‌లో నవంబర్ 25న 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మెజారిటీ మార్కు 100 కాగా, ఆ మార్కుని బీజేపీ క్రాస్ చేసి ముందంజలో ఉండటం విశేషం. (చదవండి: ఏళ్లుగా సాగుతున్న 'పరంపర" సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్! సీఎం ఎవరంటే..?) -
రాజస్థాన్‌లో గెలిస్తే సీఎం ఎవరు? దియా కుమారి స్పందన
రాజస్థాన్ పీఠం ఎవరికి దక్కనుంది అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 199 స్థానాలకు నవంబర్ 25నాటి పోలింగ్‌లో ప్రజలు తమ తీర్పును నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించు కుంటుందా లేక బీజేపీ విజయం సాధిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అయితే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో ఎవరు బీజేపీ సీఎం ఎవరు అవుతారనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు సీఎం అభ్యర్థిని బీజేపీ ప్రతిపాదించ లేదు. ప్రధానంగా సీఎం పదవిరేసులో బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ ఊహగానాలపై తాజాగా స్పందించారు. ఫలితాల తర్వాత పార్లమెంటరీ బోర్డు, పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ తనకు ఏ పని ఇచ్చినా, దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతున్న దియాకుమారి పోటీ రాజస్థాన్ బీజేపీలో కలకలం రేపింది. అయిదు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి , సింధియా విధేయుడు ,మాజీ ఉపాధ్యక్షుడు భైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు నర్పత్ సింగ్ రాజ్వీని కాదని దియాను ఎంపిక చేయడం పార్టీలో వివాదం రేపింది. దీంతో రాజ్వీకి పాత నియోజకవర్గం చిత్తోర్గడ్ను కేటాయించడంతో ఇది సద్దుమణిగింది. అయితే 15 ఏళ్ల తర్వాత చిత్తోర్‌గఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ జాదావత్పై మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, సీనియర్ నేత రెండు సార్లు రాజస్థాన్ సీఎంగా పనిచేసిన వసుంధర రాజే కూడా సీఎం పీఠంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే సంఘ్ నేతలు, బీజేపీ హైకమాండ్‌తో విభేదాలు, అసంతృప్తితో ఈ అవకాశాలు తక్కువే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఒకవేళ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంటే అపుడు వసుందర రాజే పేరేను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. అటు అర్జున్ రాఘ్ మేఘ్వాల్ సీఎం పదవికి ప్రముఖంగా వినిపిస్తున్న మరో కీలక పేరు.ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది అనే చర్చ జోరందుకుంది. #WATCH | Rajasthan: On the face of CM in Rajasthan, BJP MP and candidate from Vidhyadhar Nagar, Diya Kumari says, "This will be decided by the parliamentary board and top leadership of the party after the results... Whatever work the party gives me, I always complete it..." pic.twitter.com/nroHLxHiZq — ANI (@ANI) December 2, 2023 -
పొమ్మనలేక పొగ!
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుతోంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీలో ముగ్గురు కీలక నేతల పరిస్థితి ఆసక్తికరంగా మారింది. శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజె సింధియా, రమణ్‌సింగ్ గతంలో అన్నీ తామై ఒంటి చేత్తో ఎన్నికల భారం మోసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బీజేపీ అధిష్టానం కొత్తగా తెరపైకి తెచ్చిన సమష్టి నాయకత్వ సూత్రాన్ని మూడు రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని అసలు ఉద్దేశం వారు ముగ్గురినీ పక్కన పెట్టడమేనని చెబుతున్నారు. అక్కడ సీఎం అభ్యర్థులుగా ఎవరినీ ప్రకటించకపోవడం అందులో భాగమేనని అంటున్నారు. శివరాజ్‌కు బై బై...! మధ్యప్రదేశ్‌లో శివరాజ్ రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముఖ్యంగా సీఎంగా ఉమాభారతి దారుణమైన పనితీరు అనంతరం బాబూలాల్ గౌర్‌కు అవకాశమిచ్చి భంగపడ్డాక చివరికి శివరాజ్‌కు ప్రభుత్వ పగ్గాలను పార్టీ అప్పగించింది. దాన్ని ఆయన రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. వరుసగా రెండుసార్లు పార్టీని గెలిపించి 13 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నరేంద్ర మోదీ ప్రాభవానికి ముందు జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక నేతగా ఎదిగేలా కనిపించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైంది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలి 2020లో నాలుగోసారి శివరాజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇమేజీ, ఆదరణ ఈ మూడు సంవత్సరాల్లో క్రమంగా తగ్గుముఖమే పడుతూ వచ్చాయి. దాంతో మోదీ–అమిత్ షా ద్వయం ఆయనపై బాగా అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అందుకే ఈసారి శివరాజ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లరాదని నిర్ణయించారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలకు కొద్ది నెలల ముందునుంచే శివరాజ్ ప్రాధాన్యం మరింత తగ్గుతూ వచి్చంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం ఆ దిశగా మరింత బలమైన సంకేతాలే అని చెప్పొచ్చు. ► ఈసారి బీజేపీ నెగ్గినా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్గీయ ముఖ్యమంత్రి అభ్యర్థులవుతారని చెబుతున్నారు. ► లేదంటే మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ద్వారా కమల్‌నాథ్ సర్కారు పుట్టి ముంచిన జ్యోతిరాదిత్య సింధియాకు కుర్చీ దక్కినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. వసుంధరకు వీడ్కోలే..! రాజస్తాన్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకురాలు వసుంధర రాజె సింధియాదీ దాదాపు అదే పరిస్థితిలా ఉంది. భైరాన్‌సింగ్ షెకావత్ అనంతరం రాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడిపిన నాయకురాలిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఈ రోజుకూ రాజస్తాన్ బీజేపీలో కరిష్మా ఉన్న నాయకురాలు వసుంధరా రాజె మాత్రమే. అంతేగాక ప్రజాదరణ విషయంలో ఇప్పటికీ ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. ఆమెకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నాయకత్వం తెరపైకి తెస్తున్న అర్జున్‌రామ్ మెఘ్వాల్, సతీశ్ పునియా, సీపీ జోషీ, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా తదితరులెవరూ సామాన్య ప్రజానీకంలో మంచి ప్రజాదారణ ఉన్న నాయకులు కాదు. పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వారికి పెద్ద ఆదరణ లేదు. అయినా సరే, బీజేపీ ఈసారి వసుంధరకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండానే ఎన్నికల బరిలోకి దిగింది! కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఆయన మంత్రివర్గ సహచరులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలకు ప్రధానిగా మోదీ కరిష్మా తోడై సులువుగా గెలుస్తామని నమ్ముతోంది. అనంతరం రాష్ట్రంలో కొత్త నాయకులను తీర్చిదిద్దుకోవడం కష్టమేమీ కాదనే భావనలో ఉంది. రమణ పర్వానికి తెర! కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పరిస్థితి మరీ ఆశావహంగా ఏమీ లేదు. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ దూకుడు మీదున్నారు. రకరకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల హామీల సమర్థ అమలు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 15 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా చేసిన రమణ్‌సింగ్‌ను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టినట్టుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగించేదే. ఫలితంగా బీజేపీకి ఒకరకంగా రాష్ట్రాస్థాయి కీలక నాయకత్వమంటూ లేకుండా పోయింది. ఏదేమైనా రాష్ట్రంలో పారీ్టకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే మోదీ–అమిత్‌షా ద్వయం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ కేవలం మోదీ కరిష్మా మీదే భారం వేసి బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ, అనంతరం కర్ణాటకలోనూ ఇదే ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న వైనాన్ని తలచుకుని బీజేపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజస్థాన్‌లో బీజేపీ ముఖచిత్రం ఎవరంటే..?
చిత్తోఢ్: రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల్లో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. సీటు దక్కించుకోవడానికి నాయకుల అలకలు బయటపడుతున్నాయి. ఇటీవల బీజేపీ నిర్వహించిన పలు సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజేతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు గౌర్హాజరైన నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థిపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిత్తోఢ్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నేరాల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిపిందని ఆరోపించారు. సీఎం అశోక్ గహ్లోత్ హయంలో రాష్ట్రంలో అల్లర్లు, రాళ్లదాడులు, మహిళలపై ఆకృత్యాలు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఇందుకే ఓటేశారా..? అని ప్రశ్నించారు. బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు చెలరేగుతున్న క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరని ప్రధాని మోదీని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు..' బీజేపీకి ముఖచిత్రం కమలమే. ప్రజలు కమలాన్ని మాత్రమే చూస్తారు. బీజేపీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. రాజస్థాన్ అభివృద్ధికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన్యతనిస్తుంది.' అని అన్నారు. ఈ మేరకు చిత్తోఢ్‌లో రూ.7000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. మాజీ సీఎం వసుంధర రాజే, సీనియర్ నాయకుల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. సీఎం అభ్యర్థిగా తమను ప్రకటించాలని సీనియర్ నాయకులు అధిష్ఠానాన్ని అభ్యర్థిస్తున్నారు. మళ్లీ రాజేకే పట్టం కట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ చీఫ్ నడ్డా రాష్ట్ర నాయకులతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఇదీ చదవండి: విపక్షాలకు విజన్ లేదు, రోడ్‌మ్యాప్ లేదు -
వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ
జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజస్థాన్‌లో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేయనున్న రెండు కమిటీ సభ్యులను ప్రకటించింది. కానీ ఈ కమిటీల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే పేరు లేకపోవడం విశేషం. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంలో సంకల్ప్ మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ పేరిట రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యుల ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా నేతృత్వం వహిస్తుండగా 25 మంది సభ్యుల సంకల్ప్ కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నాయకత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో ఎంపీ కిరోడీ లాల్ మీనా, మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు చోటు లభించగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ల పేర్లను ఈ కమిటీ జాబితాల్లో చేర్చకపోవడం చర్చనీయాంశమంది. గత కొన్నాళ్లుగా వీరంతా రాష్ట్రంలో బీజేపీ ప్రచార బాధ్యతలను భుజాన మోస్తున్నారు. మాజీ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ రాష్ర అధ్యక్షుడు సతీష్ పూనియాలకి కూడా ఈ కమిటీల్లో చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తోపాటు మహిళలపై జరుగుతున్న అరాచకాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అయితే మరో అడుగు ముందుకేసి 'నహీ సహేగా రాజస్థాన్' పేరిట పేపర్ లీకేజీ, రైతు సమస్యలపై నిరసన తెలుపుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎలా చూసినా గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తిప్పికొట్టడమే బీజేపీకి పెను సవాలుగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు, ఆరోగ్య హక్కు బిల్లు వంటి ప్రజాహితమైన పథకాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊతంగా నిలవనున్నాయి. కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఐదు గ్యారెంటీలతో రూపందించిన పథకాలు అక్కడ ఆ పార్టీ అధికారంలో రావడానికి దోహద పడ్డాయి. రాజస్థాన్‌లో కూడా అదే పాచిక పారుతుందని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉండగా బీజేపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసమే కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు.. -
కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది?
ఎస్.రాజమహేంద్రారెడ్డి సచిన్ పైలట్‌కు హఠాత్తుగా కోపం వచ్చింది. నాలుగున్నరేళ్లుగా లోలోపల రగిలిపోతున్న అసంతృప్తిని ఒకే ఒక్క చర్యతో బలంగా బహిర్గతం చేశారు. ఎంత బలంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం కంగుతినేంతగా! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఉక్కిరిబిక్కిరయ్యేంతగా! మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె అవినీతిపై విచారణకు ఆదేశించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ గహ్లోత్ తీరును బాహాటంగానే దుయ్యబట్టిన పైలట్ ఈ నెల 11న ఏకంగా ఒక రోజు నిరసన దీక్షకు కూడా కూర్చున్నారు! అధిష్టానం హెచ్చరించినా, బుజ్జగించినా ఆయన ససేమిరా అన్నారు. దీన్ని ఏమీ పట్టించుకోనట్టుగా గహ్లోత్ పైకి గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. స్వపక్షీయుడే అయిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన పైలట్ ప్రతిపక్షంలా తనపైనే దాడికి దిగడం గహ్లోత్‌కు అసలు మింగుడు పడలేదు. ఎవరేమనుకున్నా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యాన్ని పైలట్ కాస్త గట్టిగానే వినిపించారు. ఒకవిధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారన్నమాట! సీఎం పదవిపై ఉన్న కాంక్షను వెలిబుచ్చడం ఒకటైతే, ప్రస్తుత ముఖ్యమంత్రి గహ్లోత్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని వేలెత్తిచూపడంరెండోది. అంతా బాగుందనుకున్న రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఇది సరికొత్త ముసలం...! ► గహ్లోత్–పైలట్ తలనొప్పిని ఎలా పరిష్కరించాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకు కూర్చుంది. ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో ఆరితేరిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఎవరినీ ఏమీ అనలేక, మధ్యేమార్గంగా ‘మేజర్ సర్జరీ’తో వివాదం సద్దుమణిగేలా చేస్తామన్నారు. అయితే ఆ శస్త్రచికిత్స ఎప్పుడు, ఎలా అన్నది మాత్రం దాటవేశారు. బహుశా సోనియా, రాహుల్‌గాంధీల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పైలట్‌లో ఈ రీతిన అసంతృప్తి పేరుకుపోవడానికి అధిష్టానం వైఖరే కారణం. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 2018లో పార్టీని విజయపథాన నడిపించిన పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్టే పెట్టి, గహ్లోత్ చాణక్యానికి తలవంచడం అసంతృప్తిని రాజేసింది. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆనందం ఆవిరవకుండా పైలట్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారు. సందర్భాన్ని బట్టి అప్పట్లో ఆ పదవితో పైలట్ సంతృప్తి పడినట్టు కనిపించినా రెండేళ్లు తిరిగేసరికి తనను తాను సర్దిబుచ్చుకోలేక రాజీనామా చేసి అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా దీక్షకు దిగి గహ్లోత్తోనూ, అధిష్టానంతోనూ అమీతుమీకే సిద్ధమయ్యానన్న సంకేతాలను పంపగలిగారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఎస్.ఎస్.రణ్‌ధవా నేరుగానే హెచ్చరించారు. అయితే పైలట్ మాత్రం ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. ఈసారి సీఎం పదవి చేజారితే మరో ఐదున్నరేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన భయం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ గహ్లోత్‌నే సీఎంగా చూడటం పైలట్‌కు సుతరామూ ఇష్టం లేదు. మరోవైపు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతున్న రాజస్తాన్ పడవ వివాదాల సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి రుచించడం లేదు. గహ్లోత్‌ను మళ్లీ సీఎం పదవి నుంచి తప్పించడానికి అధిష్టానం విముఖంగా ఉంది. ఎన్నికల ముందు సీఎంను మార్చి ఓటర్లను గందరగోళంలో పడేయడం తప్పుడు సంకేతాలను పంపినట్టవుతుందని భావిస్తోంది. గహ్లోత్‌పై పైలట్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చడం కూడా కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టం లేదు. పంజాబ్‌లో సిద్ధూ ఉదంతం అక్కడి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నిచ్చిందో కాంగ్రెస్‌కు అనుభవమే కాబట్టి మరోసారి అదే తప్పును పునరావృతం చేయడానికి సాహసించడం లేదు. అయితే ఈ సాకులన్నీ తనను మోసగించడానికేనని పైలట్ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత పోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం గమనార్హం. ఇప్పటికిప్పుడు బీజేపీ పరిస్థితి అమాంతం మెరుగయ్యేలా లేకపోయినా కులం కార్డు తమకు ఈసారి లాభిస్తుందని కమలనాథుల ఆశ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ జోషి (బ్రాహ్మణ్), బీజేపీ పక్ష నాయకుడిగా రాథోడ్ (రాజ్‌పుత్), ఉప నాయకుడిగా సతీశ్ పునియా (జాట్)లను నియమించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పథకాలను నమ్ముకున్న గహ్లోత్ 2018 నుంచి ఇప్పటిదాకా తను ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు 2023లో మరోసారి విజయం అందిస్తాయని గహ్లోత్ దృఢంగా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా ఇతర నాయకులతో తనకున్న సత్సంబంధాలు కూడా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక అడుగు ముందుకేసి గహ్లోత్ గుణగణాలను ప్రశంసించడం గమనార్హం. అయితే మరో ఆరేడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే గహ్లోత్–పైలట్ తమ విభేదాలను పక్కన పెట్టి సామరస్యంగా పనులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే కోరుకుంటోంది. కానీ వారు బహిరంగంగానే సై అంటే సై అనుకోవడం కాంగ్రెస్‌పై ఓటర్లకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. వివాదాలను తెగేదాకా లాగడం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటుగా మారింది. సెప్టెంబరులోనే అధికార మార్పిడికి ఒకసారి విఫలయత్నం చేసి చేతులెత్తేసిన గాంధీలు మరోసారి అలాంటి సాహసానికి దిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఖర్గే కూడా గాంధీల మార్గంలోనే పయనిస్తున్నారు. ఉన్నపళంగా పైలట్‌ను సీఎం చేసే దుస్సాహసానికి ఒడిగట్టే స్థితిలో ఆయన కూడా లేరు. పైలట్ కూడా ఇప్పటికిప్పుడు సీఎం పీఠం అధిష్టించాలన్న ఆలోచనలో లేరు. తాను వచ్చే ప్రభుత్వానికి ‘పైలట్’ కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. 2020లో తిరుగుబాటు చేసినప్పుడు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో పైలట్ విఫలమై ఉన్న డిప్యూటీ సీఎం పదవి కూడా వదులుకున్నారాయన. ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యం మరోసారి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షునిగా ఎంపికై తన మద్దతుదార్లకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడం ఒక్కటే! అదీ అధిష్టానం అనుకూలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ తాజా దీక్షతో ఆ అవకాశం కూడా పైలట్ చేజారినట్టు కన్పిస్తోంది! ఇక పైలట్‌కు మిగిలింది... ► చిన్న పార్టీలైన హనుమాన్ బెనీవాల్ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీలతో జతకట్టి స్వతంత్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. ► సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించి భావసారూప్యం గలవారిని చేర్చుకోవడం. ► పైలట్ గుజ్జర్ వర్గానికి చెందిన వారు కాబట్టి గుజ్జర్ల ఓట్లతో గెలవగలిగిన మొత్తం 30 అసెంబ్లీ సీట్లపైనా పూర్తిగా పట్టు బిగించడం. ► ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం. అయితే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయిన కేజ్రీవాల్‌తో కూడటం ఆయనకు రుచించకపోవచ్చు. ► కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాటం కొనసాగిస్తూనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. కొసమెరుపు.. రాజస్తాన్ ప్రభుత్వాన్ని పైలట్‌గా ముందుండి నడిపించాలన్న సచిన్ ఆశ నెరవేరుతుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కాంగ్రెస్ గనక ఈసారి ఆయన లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే 2013లో వచ్చిన 21 సీట్లు కూడా రాకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. అంటే సచిన్ కాస్త కష్టపడితే రాష్ట్రానికి ‘పైలట్’ అవుతారనే కదా!! -
అనివార్యతే వారిని ఏకం చేసిందా..?
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత కలహాలకు అడ్డాగా మారిన రాజస్థాన్ రాజకీయాల్లో ఉప ఎన్నికలు కాస్త మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే మార్పు అనేది కేవలం అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైందని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మూడు స్థానాల ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న మనస్పర్థలను సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు పక్కనబెట్టి ఒకే వేదికపై కలిసి ఉన్నారనే సంఘీభావ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే అజయ్ మాకెన్ అనేక ప్రయత్నాల తర్వాత అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లను ఒకే వేదికపైకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. కానీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతను సచిన్ పైలట్ మద్దతుదారులకు అశోక్ గహ్లోత్ అప్పగించలేదు. కానీ ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లోని రెండు స్థానాల్లో గుజ్జర్లు కీలకంగా ఉండడంతో పైలట్‌ను తమతో కలుపుకోవడం సీఎం గహ్లోత్‌తో పాటు పార్టీకి అనివార్యంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ప్రకటన అనంతరం కొత్త తలనొప్పి మొదలైంది. సహదా, రాజ్సమండ్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన తరువాత అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ కాస్త నష్టపోవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మరోసారి బయటపడ్డ కమలదళ అంతర్గత కలహాలు విపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో నాయకుల మధ్య ఎలాంటి సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తానే అని అనుయాయులతో ప్రకటింపచేసుకున్న వసుంధరా రాజేను రాష్ట్ర పార్టీలో పట్టించుకొనే నాథుడే కరువయ్యాడనిపిస్తోంది. ఎందుకంటే ఉప ఎన్నికల కోసం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజేను ఐదవ స్థానానికి నెట్టేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ అరుణ్ సింగ్ మొదటి స్థానంలో ఉండగా, కో–ఇంఛార్జ్ భారతి బెన్ను రెండవ స్థానంలో ఉంచారు. రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా 3వ స్థానంలో, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా నాలుగో స్థానంలో నిలిచారు. ముగ్గురు కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెఖావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాష్ చౌదరిలతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను స్టార్ క్యాంపెయినర్ల జాబితా చేర్చారు. మొత్తం 30 మంది నాయకుల జాబితాలో వసుంధర మద్దతుదారుల్లో కేవలం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి పేరు చేర్చారు. కానీ వసుంధరా రాజేను తీవ్రంగా వ్యతిరేకించే ప్రత్యర్థులను పలువురిని క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. వీరిలో పార్టీ జాతీయ కార్యదర్శి అల్కా గుర్జర్, రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా, ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్, మదన్ దిలావర్, జోగేశ్వర్ గార్గ్‌లు ఉన్నారు. ప్రచారానికి నో ఛాన్స్ మంగళవారం మూడు స్థానాలకు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తరువాత వసుంధరా రాజే ప్రత్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి హాజరుకాలేదు. అయితే ఆ సమావేశంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల్లో పార్టీకి సంబంధించిన 10 మంది నాయకుల ఫోటోలు ఉంచినప్పటికీ, వసుంధరా రాజే ఫోటోను చేర్చలేదు. రాష్ట్ర నాయకత్వమే కాకుండా పార్టీ కేంద్ర నాయకత్వం ఆమెపై శీతకన్ను వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి హోదాలో పలువురు నాయకులను ప్రచారం కోసం పంపించినప్పటికీ రాజేను కావాలనే పక్కనపెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల నుంచి దాదాపు దూరం పెడుతూ వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న వసుంధరా రాజే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఏ ఒక్క నిర్ణయాన్ని, చర్యను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.సతీష్ పూనియా, ఆయన మద్దతుదారులు వదులుకోవట్లేదు. -
రాజస్తాన్ కమలంలో వర్గపోరు !
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ కమలదళంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర పార్టీ నిర్ణయాలను పెడచెవిన పెడుతూ కీలక నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవట్లేదంటూ వసుంధరా రాజే వర్గ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. నాయకుల మధ్య ఉన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్ర నాయకుల మధ్య పెరుగుతున్న వర్గపోరు, అసమ్మతితో పాటు విబేధాలను తగ్గించేందుకు నడ్డా రాజస్థాన్‌లో పర్యటించారు. రాష్ట్రంలోని నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను మరచి ఐక్యంగా ఉండాలని నడ్డా ఇచ్చిన సందేశం కాస్తా గాలికి కొట్టుకుపోయినట్లు కనిపిస్తోంది. నడ్డా పర్యటన ప్రభావం రాష్ట్ర నాయకుల మధ్య కనిపించకపోగా, వర్గపోరు మరింత పెరిగేందుకు కారణంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శిబిరాలుగా విడిపోతూ... అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే వర్గం ఒకవైపు, ఆమె ప్రత్యర్థి, బీజేపీ రాజస్తాన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా, ఉప నాయకుడు రాజేంద్ర రాథోడ్ శిబిరాలుగా విడిపోయినట్లు కనిపించింది. శాసనసభలో పార్టీ విప్‌ను నియమించాలని వసుంధర రాజే చేసిన విజ్ఞప్తిని పునియా, కటారియా, రాథోడ్ పట్టించుకున్న దాఖలాలు లేవు. గత రెండున్నరేళ్ళుగా ఖాళీగా ఉన్న విప్ పదవిని భర్తీ చేయాలని రాజే కోరుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా పునియా, కటారియా అందుకు సిద్ధంగా లేరు. రాష్ట్ర నాయకులు అందరూ కలిసి పనిచేయాలని జేపీ నడ్డా ఇచ్చిన సందేశాన్ని ఖాతరు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రకు వసుంధరా రాజే శిబిరం సిద్ధమైంది. నడ్డా పర్యటన ముగిసిన తర్వాత వసుంధర యాత్రకు దూరంగా ఉండా లని పునియా, రాథోడ్, కటారియాలు తమ వర్గ అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించారు. వసుంధర యాత్రకు దూరంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయాలకు ఇప్పటికే సమాచారాన్ని అందించారని పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పైకి ఎత్తినప్పటికీ, వారి మధ్య ఉన్న దూరం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది. రెండున్నరేళ్ళ క్రితం సీఎం పేరు ప్రకటన విషయంలో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లను దగ్గరికి చేస్తూ రాహుల్ గాంధీ బలవంతంగా కలిపే ప్రయత్నం చేశారు కానీ ఆ వివాదం ఇంకా అలానే కొనసాగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ రాజస్తాన్‌లో నాయకుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు ప్రభావం త్వరలో జరగబోయే 4 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలపై పడకూడదనే ఆయన జైపూర్ వెళ్లాల్సి వచ్చింది. కానీ నడ్డా పర్యటన అనంతరం పరిస్థితులు సానుకూల దిశలో పయనిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. గతంలో పార్టీకి సంబంధించి జరిగిన అనేక కీలక సమావేశాలకు వసుంధరా రాజే డుమ్మా కొట్టారు. ఇటీవల జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి ఆమె మాత్రమే కాకుండా రాజే వర్గంలోని ఎమ్మెల్యేలు చాలామంది హాజరుకాలేదు. వసుంధర రాజేకు మద్దతు ఇస్తున్న సుమారు 15మందికి పైగా ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదు చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ పంపారు. పార్టీ నాయకత్వం తమకు అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదని, తమ నియోజకవర్గాల్లో సమస్యలను లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వట్లేదని ఆరోపించారు. వాస్తవానికి, రెండేళ్ల క్రితం బీజేపీ అధికారం నుంచి వైదొలిగినప్పటినుంచి వసుంధర రాజే, ఆమె అనుచర బృందం రాష్ట్ర నాయకత్వ నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లోనూ వారి అభిప్రాయాన్ని తీసుకోవట్లేదు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, డివిజనల్ స్థాయి వరకు జరిగిన పార్టీ నియామకాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా.. వసుంధర ప్రత్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నా మినహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి 14 మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రంలో పార్టీకి సమాంతరంగా రాజే మద్దతుదారులు పనిచేస్తున్నారని, దీని కారణంగా ప్రజల్లో పార్టీపై భరోసా కోల్పోతామంటూ షెకావాత్, కటారియా, రాథోడ్, పునియా ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సింధియా వర్గీయులు తమ దూకుడును తగ్గించుకోవట్లేదు. దీంతో రాజస్తాన్‌లో కమలం వికసిస్తుందనే భావనలో ఉన్న పార్టీ అధిష్టానానికి వర్గపోరు తలనొప్పి వ్యవహారంలా మారింది. చదవండి: బెంగాల్లో ‘దీదీ’నే: టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు -
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో అంతర్గత రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు సందర్భోచితంగా బహిర్గతమవుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ వంటి మహిళానేతను ధీటుగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళూరుతున్న కమలదళ పెద్దలకు, సొంత పార్టీలోని ఇతర రాష్ట్రాల మహిళానేతల ప్రణాళికలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిష్టాన నిర్ణయాలతో రాజస్తాన్ రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉన్న వసుంధరా రాజే మరోసారి యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉన్నప్పటికీ పార్టీలో మరోసారి తన పట్టును పెంచుకొనేందుకు, తన బలాన్ని హైకమాండ్ ముందు నిరూపించుకొనేందుకు వసుంధరారాజే ఏ అవకాశాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే మార్చి 8న తన పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభించి తమ బలాన్ని నిరూపించుకోవాలని వసుంధరా రాజే సింధియా వర్గం నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో రాజస్తాన్ బీజేపీలో పైచేయి సాధించే గొడవ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మౌన ముద్రలో వసుంధర.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యానికి మాజీ సీఎం వసుంధరారాజేపై విధేయత కారణంగా జిల్లాల్లో పార్టీకి సమాంతరంగా పార్టీ యూనిట్లు పనిచేయడమే కారణమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు జరిగిన 90 మున్సిపల్‌ల్లో బీజేపీ 38 గెలుచుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ 50 గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వసుంధరా రాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె వర్గం నాయకులు అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 2019లో కమలదళం అధిష్టానం వసుంధరా రాజే అనుయాయులను పక్కనబెట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సతీష్ పూనియాను నియమించడంతో పాటు, రాష్ట్ర నాయకులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘవాల్, కైలాష్ చౌదరి వంటి వారికి కేంద్ర ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత కల్పించినప్పటి నుంచి ఆమె మౌనముద్రలో ఉన్నారు. గతేడాది జూలైలో సీఎం గహ్లోత్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలోనూ ఆమె మౌనంగా ఉన్న కారణంగా కమలదళం ఆ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పూర్తిగా విఫలమైంది. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాజే మద్దతుదారులు ఇప్పుడు ఆమె మళ్ళీ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో ముందుండాలని కోరుకుంటున్నారు. గత ఆదివారం వసుంధరా రాజేకు గట్టి పట్టున్న కోటాలో జరిగిన ఒక అంతర్గత సమావేశానికి సింధియా వర్గ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరై, 2023 ఎన్నికల్లో ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అధికార గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించే సామర్థ్యం, ఛరిష్మా ఉన్న లీడర్ కేవలం వసుంధరా రాజే అని ఆమె వర్గ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఆ ర్యాలీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజే మౌనంగా ఉన్న కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 8న ప్రారంభమయ్యే గోవర్ధన్ యాత్ర కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే యూనుస్ ఖాన్ సమన్వయం చేస్తారని రాజే వర్గం తెలిపింది. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో దక్కని ప్రాధాన్యత.. సతీష్ పునియాను రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిన తర్వాత పార్టీలో అంతర్గత సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. రాజే మనస్తత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అధికార పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం ఇష్టపడదని, అధిష్టాన పెద్దలతో సఖ్యత లోపించినకారణంగా అంతర్గతంగా పరిస్థితులు సర్దుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా రాజేను అధిష్టానం పక్కనబెట్టినప్పటికీ, రాష్ట్రంలో గహ్లోత్‌ను ఎదుర్కోగలిగి, ఓడించగలిగే బలమైన నాయకులు ఎవరూలేరనే అంశాన్ని అధిష్టానం అంగీకరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి సహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి కేవలం 14మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అయితే 2012, 2018ల్లో జరిగిన పరిణామాల సమయంలో అధిష్టానంపై పైచేయి సాధించిన పరిస్థితులు ప్రస్తుతం లేవన్న విషయాన్ని వసుంధరా రాజే అర్థంచేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మద్య నిషేధాన్ని కోరుతూ ప్రచార యాత్ర మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె మార్చి 8న ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో కమలదళ పెద్దలకు మరో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే మద్యపాన నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోకపోవటంపై సొంత పార్టీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ఆమె ఆరోపణలు చేశారు. మరోవైపు గత నెల 21న పార్టీ పాలిత అన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమాభారతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తు నేపథ్యంలో కేంద్రప్రభుత్వ విధానాలపై నేరుగా దాడి చేశారు. మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ మంత్రిగా గంగానది, దాని ప్రధాన ఉపనదులపై విద్యుత్ ప్రాజెక్టులను తాను వ్యతిరేకించారని ఉమాభారతి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ హైకమాండ్‌కు సవాలు విసురుతూ ఆమె రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధ అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం తనను పక్కనపెట్టేయడాన్ని ఉమాభారతి జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
వసుంధరా రాజెపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలు
జైపూర్ : అశోక్ గహ్లోత్ సారథ్యంలోని పాలక కాంగ్రెస్ సర్కార్‌పై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేల బేరసారాల వెనుక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధరా రాజె పాత్ర ఉందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. బీజేపీ నేత సంజయ్ జైన్ ఎనిమిది నెలల కిందట తనను కలిసి వసుంధర రాజెతో పాటు ఇతరులను సంప్రదించాల్సిందిగా కోరాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా పేర్కొన్నారు. జైన్‌తో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా గహ్లోత్ సర్కార్‌ను కూల్చేందుకు ప్రయత్నించారని, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సంజయ్ జైన్ చాలాకాలంగా ఇదే పనిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై సంజయ్ జైన్‌ను రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు వసుంధర రాజే సాయపడుతున్నారని బీజేపీ మిత్రపక్షం నుంచి ఆరోపణలు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, వసుంధర రాజే తనకు సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ గహ్లోత్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని రాష్ర్టీయ లోక్తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివల్ ట్వీట్ చేశారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు దూరంగా ఉండాలని సికర్, నగౌర్లకు చెందిన జాట్ ఎమ్మెల్యేలందరికీ వసుంధరా రాజే సూచిస్తున్నారని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాగా రాజస్తాన్‌లో పాలక కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షోభంలోకి బీజేపీ నేతలను ఎందుకు లాగుతున్నారని ఈ విమర్శలపై వసుంధర రాజే మండిపడ్డారు. ఇక తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా ఆయన వర్గానికి చెందిన 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్ధాన్ అసెంబ్లీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై పైలట్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పైలట్‌ను తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. చదవండి : పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్.. -
నేను బీజేపీతోనే..
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ పరిణామాలపై కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని బీజేపీ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోనే కొనసాగుతాననీ, పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, తిరుగుబాటు వర్గం నేత, మాజీ డిప్యూటీ సీఎం పైలట్ మధ్య విభేదాలతో తలెత్తిన సంక్షోభంలో గహ్లోత్‌కు వసుంధరా రాజే అంతర్గతంగా మద్దతిస్తున్నారంటూ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నేత, ఎంపీ హనుమాన్ బెణివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలతో గహ్లోత్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. బీజేపీ నేతలు, అధిష్టానంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నేతల ఫోన్లను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేయిస్తే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర బీజేపీ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఆడియో టేపులు విడుదల చేయడంపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర శనివారం స్పందించారు. ‘ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని, గహ్లోత్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఒక వేళ జరిగితే, నిర్దేశిత నిబంధనల మేరకే చేశారా? తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందా?’అని ప్రశ్నించారు. బీజేపీ తప్పు చేసినట్లే: కాంగ్రెస్ ఆడియో టేపుల వ్యవహారంలో బీజేపీ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అలాగైతే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై సచిన్ పైలట్ తదితరుల తిరుగుబాటు వెనుక తమ ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఒప్పుకున్నట్లే అవుతుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల ప్రమేయమే లేకుంటే హరియాణాలోని ఓ రిసార్టులో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి వెళ్లిన రాజస్తాన్ పోలీసులను ఎందుకు అనుమతించలేదని రాజస్తాన్ పీసీసీ నూతన అధ్యక్షుడు గోవింద్ సింగ్ ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పన్నిన కుట్రకు సంబంధించినవిగా చెబుతున్న రెండు ఆడియో క్లిప్పులపై చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ) కేసు నమోదు చేసింది. -
వసుంధర రాజేపై సంచలన ఆరోపణలు
జైపూర్: రాజస్తాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎల్పీకి హాజరుకాని తమపై అనర్హతను వేటువేస్తామంటూ స్పీకర్ జారీచేసిన నోటీసులపై సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే.. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్తాంత్రిక్(ఆర్ఎల్టీ) పార్టీ విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఆర్ఎల్టీ ఎంపీ హనుమాన్ బేనీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వర్గాన్ని దెబ్బతీయడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.(సంతోషంగా ఉంది: వసుంధరా రాజే) ఈ సందర్భంగా హనుమాన్ బేనీవాల్ ‘వసుంధర రాజే తనకు సన్నిహితులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిచి వారితో మాట్లాడుతున్నారు. అశోక్ గహ్లోత్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె ఎమ్మెల్యేలను కోరుతున్నారు. సచిన్ పైలట్‌కు దూరంగా ఉండాలని సికార్, నాగౌర్‌లోని ప్రతి ఒక్క జాట్ ఎమ్మెల్యేకు చెప్పారు. ఇందుకు ఆధారాలున్నాయి’ అని హనుమాన్ బేనీవాల్ ట్వీట్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గహ్లోత్‌కు వసుంధర రాజే సహకరిస్తున్నట్టు ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము సహకరించము’ అని అన్నారు. అయితే, వసుంధర రాజేపై హనుమాన్ విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి కాదు. తొలుత బీజేపీలో ఉన్న ఆయన 2018 ఎన్నికల ముందు ఆ పార్టీని వీడారు. (హైకోర్టుకు సచిన్ వర్గం) హనుమాన్ బేనీవాల్ విమర్శలపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా స్పందిస్తూ.. వసుంధర రాజేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. ఆమెతో అధిష్ఠానం మాట్లాడుతుందని, ఆమె తమ గౌరవ నేతని అన్నారు. ఇదిలా ఉండగా.. రాజస్తాన్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంపై వసుంధర రాజే ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మధ్యప్రదేశ్ తరహాలో సచిన్ పైలట్ తిరుగుబాటుకు బీజేపీ మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వసుంధర రాజే మౌనంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని బీజేపీ కూడా ఆచితూచి స్పందిస్తోంది. (పైలట్ మనవాడైతే విమానం హైజాక్ ఎందుకు?) -
సంతోషంగా ఉంది: వసుంధరా రాజే
జైపూర్: తన, తన కుమారుడికి సంబంధించిన కరోనా వైరస్ పరీక్షల ఫలితాల్లో నెగటివ్ అని తేలిందని రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో జరిగిన ఓ పార్టీలో వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన కనికాకు కరోనా సోకినట్లు వెల్లడికాడంతో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అంతేగాకుండా దుష్యంత్ సింగ్ వివిధ రాజకీయ నాయకులు, ఎంపీలను కలిసిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కనికా హాజరైన పార్టీకి వెళ్లిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!) ఈ క్రమంలో వసుంధరా రాజే, దుష్యంత్ సింగ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘‘ కోవిడ్-19 పరీక్ష నిర్వహించిన తర్వాత.. నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే ఫలితాలు నెగటివ్‌గా వచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మేం మరో 15 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాం’’అని వసుంధరా రాజే ట్వీట్ చేశారు. అదే విధంగా తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వైద్యుల సూచన మేరకు తాము నిర్బంధంలో ఉంటామంటూ దుష్యంత్ సింగ్ కూడా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా వీరితో పాటు పార్టీకి వెళ్లిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా నెగటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా కనికా కపూర్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (మాస్కు ధర రూ. 8, శానిటైజర్ ధర రూ.100) After conducting a #Covid19 test, I’m happy to inform you that the results came back negative. However, as a preventive measure, my son and I will continue to be in isolation for 15 days. — Vasundhara Raje (@VasundharaBJP) March 21, 2020 -
కనికా కపూర్‌కు కరోనా
బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏకంగా ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే గాయని కనికా కపూర్ ఇటీవల లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌లు పాల్గొన్నారు. ఇప్పుడు కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వసుంధర రాజే, దుష్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. రాజస్తాన్ నుంచి ఎంపీగా ఉన్న దుష్యంత్ పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారివురు కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ఉపాహార విందుకు పలువురు ఎంపీలతోపాటు దుష్యంత్ కూడా హాజరయ్యారని, బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్ 20 మంది ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన కోరారు. -
హోమ్ క్వారంటైన్లోకి వసుంధరా రాజే కుటుంబం
-
మేనల్లుడిని స్వాగతించిన మేనత్త
జైపూర్ : కేంద్రమాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంపై రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే స్పందించారు. సింధియా బీజేపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన స్వభావం, బలం, ధైర్యాన్ని తాను ఎప్పటికీ గౌరవిస్తానని రాజే తెలిపారు. కాగా జ్యోతిరాదిత్య సింధియాకు వసుంధర స్వయానా మేనత్త అన్న విషయం తెలిసిందే. బుధవారం జేడీ నడ్డా సమక్షంలో సింధియా బీజేపీలో చేరిన అనంతరం ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. ‘మా అమ్మ (రాజమాత విజయ రాజే సింధియా) ఆరోజు ఉండి ఉంటే ఈ ఆనందక్షణాలను చూసి ఎంతో గర్వించేంది’ అని వ్యాఖ్యానించారు. చివరికి ఇద్దరం ఒకే పార్టీలో ఉండటం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. మరో మేనత్త, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సైతం సింధియా చేరికపై సంతోషం వ్యక్తం చేశారు. మహారాజ్‌కు స్వాగతం అంటూ తన నిర్ణయాన్ని స్వాగతించారు. -
రాగా తంత్రమా ? నమో మంత్రమా ?
రాజస్తాన్‌లో ప్రధాని మోదీ గాలి వీస్తోందా ? 2014 ఎన్నికల మాదిరిగా ప్రభంజనం సృష్టించకపోయినా భారీగానే సీట్లు కొల్లగొడతారా ? గత అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజెపై వ్యతిరేకతతో రాణిగారి కోటను కూలగొట్టిన ఓటర్లు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలనేసరికి మళ్లీ నమో మంత్రమే జపిస్తారా ? పాక్‌కు సరిహద్దు రాష్ట్రంలో దేశభక్తే ఉప్పొంగుతుందా ? స్థానిక సమస్యలనే ఎన్నికల అస్త్రంగా మలచుకున్న కాంగ్రెస్ తంత్రం నెగ్గుతుందా ? మొత్తం 25 స్థానాలకు గాను 13 సీట్లలో నాలుగోదశలో పోలింగ్ జరిగింది. మిగిలిన పన్నెండు సీట్లలో మే 6న పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి ? రాజస్తాన్ ప్రజల మొగ్గు ఎటు ? ఓట్లు, సీట్లు లెక్కలు ఏం చెబుతున్నాయ్ ? 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో బీజేపీ 25కి 25 సీట్లు క్లీన్ స్వీప్ చేసింది. ఓట్లు కూడా ఇంచుమించుగా 56 శాతం వచ్చాయి. కానీ అయిదేళ్లలో పరిస్థితుల్లో భారీగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా వసుంధరా రాజెపై వ్యతిరేకత, కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి భారీగా ఓట్లను చీల్చడం, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 38.8శాతం మాత్రమే ఓట్లతో 73 స్థానాలను దక్కించుకుంది. అలాగని కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాజేపై నెలకొన్న వ్యతిరేకతకి భారీగా సీట్లు, ఓట్లు కొల్లగొట్టాలి. కానీ 39.3 శాతం ఓట్లతో 100 స్థానాల్లో మాత్రమే గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లలో తేడా కేవలం 0.5శాతం మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఓట్లను భారీగా చీల్చాయి. కొత్త పార్టీలే 9 శాతం ఓటు షేర్‌తో 12 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి గుడ్‌బై కొట్టేసి కొత్త పార్టీ పెట్టిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) హనుమాన్ బేనీవాల్ 2.4శాతం ఓట్లతో మూడు అసెంబ్లీ స్థానాలను సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్‌సభ ఎన్నికలు వేరు అన్న చైతన్యం ఈ మధ్య ఓటర్లలో బాగా పెరుగుతోంది. అదే ఈ సారి బీజేపీకి కలిసి వస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయత వర్సస్ స్థానికత పాకిస్థాన్‌కు సరిహద్దు రాష్ట్రం కావడంతో రాజస్తాన్‌లో బీజేపీ ప్రధానంగా సర్జికల్ స్ట్రయిక్స్, దేశభక్తినే ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది. జై జవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్ అన్న నినాదంతో ప్రచారం చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి యువకులు ఎక్కువగా సైన్యంలో చేరుతూ ఉండడంతో పుల్వామా దాడులు, అభినందన్‌ని వెనక్కి తీసుకురావడం వంటి అంశాలతో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ అమలు సరిగా జరగకపోవడం కూడా బీజేపీకి కలిసివస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. సీఎం పదవికి పోటీ ఉండడంతో కలిసికట్టుగా పనిచెయ్యలేదు. కానీ ఈ సారి ఉమ్మడిగా వ్యూహాలు రచించారు. కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకం (న్యాయ్) సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైనప్పటికీ, గ్రామీణ సంక్షోభం, రైతు సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అల్వార్, అజ్మీర్ పరిస్థితులు మారుతున్నాయా ? రాజస్తాన్ లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి అందరి దృష్టి అల్వార్, అజ్మీర్ నియోజకవర్గాలపైనే ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఆ తర్వాత తన హవాను నిలబెట్టుకోలేక 2018 జనవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను కోల్పోయింది. ఎవరికీ అందుబాటులో ఉండకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న నాటి బీజేపీ సీఎం వసుంధర రాజె వ్యవహారశైలిపై నెలకొన్న అసంతృప్తి సెగలు ఉప ఎన్నికల్లోనే తగిలాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అల్వార్, అజ్మీర్‌ల నుంచి బీజేపీ తరఫున నెగ్గిన చాంద్‌నాథ్, సన్వర్‌లాల్ జాట్ మృతి చెందడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన రఘుశర్మ అజ్మీర్ నుంచి 84 వేల ఓట్ల తేడాతో, కరణ్ సింగ్ యాదవ్ అల్వార్ నుంచి ఇంచుమించుగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి ఈ స్థానాల్లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నాయని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవా పనిచేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల్ని మార్చేసిన కాంగ్రెస్ అల్వార్, అజ్మీర్ ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థుల్ని మార్చేసింది. అజ్మీర్‌లో రఘుశర్మని తప్పించిన కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖమైన రిజు ఝున్‌ఝున్‌వాలాకు టికెట్ ఇచ్చింది. ఆయన స్థానికుడు కాకపోవడంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 2014 ఎన్నికల్లో సన్వర్‌లాల్ చేతిలో ఓటమిపాలైన సచిన్‌పైలట్ మద్దతు కలిగిన ఝన్‌ఝన్‌వాలా పైలట్‌కున్న పాపులారిటీనే నమ్ముకున్నారు. ఇక బీజేపీ తరపున స్థానిక వ్యాపారవేత్త, కశింగఢ్ ఎమ్మెల్యే భగీరథ్ చౌ«ధరీ పోటీ చేస్తున్నారు. లోకల్ అభ్యర్థి కావడం ఆయనకు కలిసివస్తోంది. ఇక అల్వార్ మూకదాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ప్రాంతం. హరియాణాకు చెందిన పాలవ్యాపారి పెహ్లూఖాన్‌ను హిందూ మతోన్మాదులు కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లే కీలకం. ఆ తర్వాత మియో ముస్లింలు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. గోసంరక్షణ పేరిట జరిగిన మూక దాడుల ప్రభావం ఉప ఎన్నికల్లో బీజేపీపై పడింది. అయినప్పటికీ ఈ సారి కూడా మతపరమైన విభజననే ఆ పార్టీ నమ్ముకుంది. గత ఎన్నికల్లో నెగ్గి మృతిచెందిన చాంద్‌నాథ్ శిష్యుడు, బాబా బాలక్‌నాథ్‌ను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున భన్వర్ జితేంద్ర సింగ్ ఆయనకి గట్టిపోటీయే ఇస్తున్నారు. బీఎస్పీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌కు టికెట్ ఇవ్వడంతో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి బీజేపీకి లాభం చేకూరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దౌసా లోక్‌సభ ఎంపీ హరీశ్ మీనా బీజేపీకి గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ శిబిరానికి చేరుకోవడం కమలనాథులకి ఎదురు దెబ్బే. పింక్ సిటీ జైపూర్‌లో ఒక మహిళా అభ్యర్థికి 48 ఏళ్ల తర్వాత పోటీ చేసే అవకాశం రావడం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌చరణ్ బొహ్రా ఏకంగా 5.40 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత మహేశ్ జోషిని మట్టికరిపించారు. క్లీన్ ఇమేజ్ కలిగిన బొహ్రాకు కార్యకర్తల్లో కూడా మంచి ఆదరణ ఉంది. . పార్లమెంటు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 110 చర్చల్లో పాల్గొన్ని 312 ప్రశ్నలు వేశారు.అయితే నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలూ ఉన్నాయి. అలాంటి గట్టి అభ్యర్థిని ఢీకొనడానికి ఏరికోరి ఒక మహిళకు సీటు ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ నగర మాజీ మేయర్ జ్యోతి ఖండేల్వాల్ను బరిలో దింపింది. దీంతో ఇక్కడ హోరాహోరి పోరు నెలకొంది. చివరిసారిగా1971లోజైపూర్ మాజీ మహారాణి గాయత్రిదేవి స్వతంత్రపార్టీ తరఫున ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు, రాజపుత్రుల ఓట్లే ఇక్కడ కీలకం.రాజస్థాన్‌లోని జైపూర్ (రూరల్) నియోజకవర్గంలో ఇద్దరు క్రీడాకారుల మధ్య పోరాటానికి తెరలేచింది. బీజేపీ ఎంపీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ గురితప్పని షూటర్. 2014లో మోదీ హవాతో రాథోడ్ జయపూర్ రూరల్ నుంచి సులభంగా నెగ్గారు. ఆ వెంటనే మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ పూనియా డిస్కస్ త్రోలో అంతర్జాతీయంగా భారత కీర్తిపతాకను రెపపలాడించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయిదేళ్లలో సీన్ మారిపోయింది. వసుంధర రాజెకి వ్యతిరేక పవవాలు వీయడంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పూనియా సదూల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిగా రాథోడ్ మంచిపేరే సంపాదించుకున్నారు. ఆయనపై పోటీకి నిలబడడమే ఒక సాహసం. అలాంటి సాహసాన్ని ఒక క్రీడాకారిణి చేయడంతో కృష్ణ పూనియాపై కూడా అంచనాలు పెరిగాయి. బీజేపీ, ఆరెస్సెస్ అండదండలు, మోదీ ఇమేజ్ రాథోడ్‌కు కలిసి వస్తే, జాట్ సామాజిక వర్గానికి చెందిన పూనియాకు కులసమీకరణలు అనుకూలం. రాథోడ్‌ని ఎదుర్కోవడానికి చేతికి గ్లౌజులు ధరించి సిద్ధంగా ఉన్నానంటూ పంచ్ డైలాగ్‌లతో పూనియా ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు. ‘‘నేను రైతు బిడ్డని. నాకు గ్రామీణుల పడే బాధలేంటో తెలుసు. క్రీడల్లో కూడా నేను గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆడే డిస్కస్ త్రోనే ఎంచుకున్నా. ఏసీ హాళ్లలో కూర్చొని ఆటలాడే గేమ్స్ నాకు తెలీవు‘‘అని రాథోడ్ పైకి మాటల తూటాలు పేల్చారు.. మరోవైపు గత అయిదేళ్లలో నియోజకవర్గానికి తాను ఎంత చేస్తున్నారో చెబుతున్న రాథోఢ్ యువతరం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. బికనీర్ అన్నదమ్ముల సవాల్ బికనీర్ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వ్డ్) బీజేపీకికంచుకోట. గత 15 ఏళ్లుగా ఈ సీటు బీజేపీకే దక్కుతోంది. 2004లో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ప్రాతినిధ్యం వహించిన స్థానం. ఈ సారి ఒక మాజీ ఐఎఎస్ మాజీ ఐపీఎస్ మధ్య ఉత్కంఠభరిత పోరాటానికి తెరలేచింది. వీళ్లిద్దరూ బంధువులు కూడా కావడం విశేషం. గత రెండు దఫాలుగా బీజేపీకిచెందిన అర్జున్ రామ్ మేఘవాల్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి, కేంద్ర మంత్రి అయిన అర్జున్ రామ్‌కు నియోజకవర్గంలో మంచిపేరు ఉంది. చేనేత కుటుంబానికి చెందిన ఆయన కష్టపడిచదువుకొని ఐఎఎస్ అయ్యారు. చురు జిల్లాకు కలెక్టర్‌గా పని చేసిన అర్జున్‌రామ్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భూ వివాదం కేసు ఆయన పర్యవేక్షణలోనే సాగింది. నీటివనరులు, గంగాప్రక్షాళన శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్‌రామ్ ఇప్పటికీ పార్లమెంటుకి సైకిల్‌పై వచ్చే అతి కొద్ది మంది ఎంపీల్లో ఒకరు. ఈయనపై పోటీకి కాంగ్రెస్ పార్టీ ఆయన పిన్ని కుమారుడు ఐపీఎస్అధికారి అయిన మదన్‌గోపాల్‌ను రంగంలోకి దింపింది. ‘‘అర్జున్‌రామ్ మా పెద్దమ్మ కొడుకు. నా కన్నా పెద్దవాడు. కానీ మా ఇద్దరి భావజాలంలో చాలా తేడాలున్నాయి. నేనుఎన్నికల్లో పోటీపడడం . అయినా దీనిని సవాల్‌గా తీసుకున్నా‘అని మదన్ అంటున్నారు. జాట్లు ఆధిక్యం కలిగినబికనీర్లో ముస్లింలు, రాజపుత్రులు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. మే6న పోలింగ్ జరిగే స్థానాలు(మొత్తం – 12) ►గంగానగర్, బికనీర్, చురు, ఝున్ఝునూ, సీకర్, ►జైపూర్ (రూరల్), జైపూర్, అల్వార్, భరత్పూర్, ►కరౌలీ–ధోల్పూర్, దౌసా, నాగౌర్ ►‘‘ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. ఎందుకంటే ఆ ఓటు ప్రధానిని ఎన్నుకోవడానికి కాదు. కేవలం వసుంధరా రాజెను ఇంటికి పంపించడానికే. మా లక్ష్యం నెరవేరింది. మోదీపై మాకు ఎప్పుడూ వ్యతిరేకత లేదు’’ – జితేంద్ర చౌదరి, ధర్మపుర గ్రామస్తుడు ►‘‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో జరగకపోతే పదకొండో రోజునే సీఎంను మారుస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. మా రుణాలు మాఫీ కూడా కాలేదు. ఆయన సీఎంనూ మార్చలేదు. ఇక కాంగ్రెస్‌కి మేమెందుకు ఓటు వేయాలి‘‘ – బుద్ధరామ్ జాట్, అల్వార్ రైతు ►‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని మోదీ చెప్పారు. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టారు. కానీ గత అయిదేళ్లలో మాకు ఒక్క రోజు కూడా పని దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి’’ – రాహుల్ మీనా, గమ్రీ గ్రామస్తుడు ►‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను మార్చేసి, ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తారు. సుప్రీం తీర్పుల్ని కూడా ఆయన లెక్కచేసే పరిస్థితి ఉండదు’’ – కన్నయ్యలాల్ భుజ్, ఆదివాసీ యువకుడు -
వసుంధర రాజేకు ఘోర అవమానం...
జైపూర్ : రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజేను దారుణంగా అవమానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ లీడర్ రామ్‌లాల్ మీన మాజీ సీఎం వసుంధర రాజే ప్రస్తుతం అభివృద్ధి పనులను పక్కన పెట్టి మద్యం బాటిళ్లు ఒపెన్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన మీనా మాట్లాడుతూ.. ‘నూతన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. కానీ మాజీ సీఎం రాజే మాత్రం పని పక్కన పెట్టి లిక్కర్ బాటిళ్లు ఒపెన్ చేయడంలో బిజీగా ఉన్నారం’టూ వ్యాఖ్యనించారు. రామ్‌లాల్ మీనా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి. -
నువ్వు ఏదో ఒకరోజు సీఎం అవుతావు!
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, వసుంధర రాజేల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వసుంధర రాజే, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ కూడా రాజవంశీకులన్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా సింధియాను పలకరించిన రాజే.. రాజవంశీకుల ఆచారం ప్రకారం ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో... రాజకీయ పరంగా సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ రక్తసంబంధీకుల మధ్య ఉన్న ఆప్యాయతల్లో ఎటువంటి తేడా ఉండదు అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ అంటూ వీరి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గాసిప్ రాయుళ్లు మాత్రం...’ ఈ వేడుకలో భాగంగా మేనత్త వసుంధర.. తన మేనల్లుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనందపడుతూనే.. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా మధ్యప్రదేశ్ సీఎం అవుతావంటూ ఆశీర్వదించి ఉంటారు’ అంటూ కథనాలు అల్లేస్తున్నారు కూడా. కాగా సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. -
ప్రజా విశ్వాసం పొందని ‘రాణి’
రాజస్తాన్‌లో వసుంధరా రాజే స్వయం కృతాపరాధమే పార్టీ ఓటమికి దారి తీసింది. బీజేపీపై వ్యతిరేకత కంటే కూడా వసుంధరాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పరిస్థితికి దారి తీసింది. వసుంధరా రాజే ఈ ఎన్నికలను తన చుట్టూనే తిప్పుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా తాను ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా వంటి పథకాలే పార్టీని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆ అతి విశ్వాసంతోనే అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి ప్రచారం వరకూ అంతా తానై వ్యవహరించారు. చివరి నిమిషంలో కుల సమీకరణలపై రాజే ఆశలు పెట్టుకున్నప్పటికీ రాజ్పుట్లు, జాట్లు కలిసిరాలేదు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న అధిష్టానం 100 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వసుంధర రాజే మెజారిటీ సైతం బాగా తగ్గిపోయింది. యూనస్ ఖాన్, రాజ్‌పాల్ సింగ్ షెకావత్, అరుణ్ చతుర్వేది, శ్రీచంద్ క్రిప్లానీ వంటి మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ నేతలే కలిసిరాలేదు.. అన్నదాతల ఆక్రోశాన్ని వసుంధరా రాజే సర్కార్ ఎన్నడూ పట్టించుకోలేదు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. కుల సమీకరణలు అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రాజ్పుత్రులు వెర్సస్ రాజేగా మారిపోయాయి. రాజ్‌పుత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ ఎన్కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌పుత్ నాయకుడికి అవకాశం దక్కకుండా రాజే అడ్డుకోవడం వంటివి వసుంధరపై ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. రహదారుల వెడల్పు, సుందరీకరణ అంటూ రోడ్డు పక్కనున్న చిన్న గుడుల్ని తొలగించడం, గోరక్షకుల పేరుతో జరిగిన మూకదాడులు కూడా బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. రాజే నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ఆరెస్సెస్ కూడా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేదు. ఆరెస్సెస్ యంత్రాంగం రాజే సర్కార్‌ను గెలిపించడానికి పెద్దగా కృషి చేయలేదు. ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా బీజేపీని ముంచినా, తేల్చినా అందుకు రాజేదే బాధ్యత అన్నట్టుగా వదిలేశారు. మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగలేదు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలను రాజే ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. పైలెట్+ గెహ్లాట్= కాంగ్రెస్ గెలుపు బీజేపీ సర్కారుపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా..అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇచ్చిన హామీ బాగా పనిచేసింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌లు సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్‌కి ప్లస్ పాయింట్ అయింది. సీనియర్ నేత గెహ్లాట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మంచి అనుబంధం ఉంది. వారిలో ఉత్సాహం నింపి కష్టించి పనిచేసేలా చేయడం లో గెహ్లాట్ సక్సెస్ అయ్యారు. ఇక సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర్రవ్యాప్తంగా బలపం కట్టుకొని తిరిగారు. ఉద్యోగాలు రాక అసహనంతో ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేలా సచిన్ వ్యూహరచన చేశారు. వారి సమష్టి కృషి కాంగ్రెస్ విజయానికి కారణమైంది. కాంగ్రెస్‌కు సవాలే రాజస్తాన్‌లో కష్టపడి సాధించుకున్న ఈ విజయం కాంగ్రెస్‌కు ఏమంత ఆశాజనకంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించు కోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేది అనుమానంగానే మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాష్ట్రీయ లోక్తంత్ర పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ వంటివి గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే. టిక్కెట్ల పంపిణీ సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడైనా సీఎంగా సరైన నేతను ఎంపిక చేయకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం వినవస్తోంది. -
వసుంధరా రాజె రాజీనామా
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వసుంధరా రాజె తన పదవికి రాజీనామా చేశారు. హోరాహారీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీని మట్టికరిపించింది. కాగా, నూతన ప్రభుత్వం రాజస్ధాన్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని వసుంధరా రాజె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్ర అభ్యర్ధుల సహకారం కూడా తీసుకుంటామని సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తెలిపారు. రాజస్ధాన్ సీఎం రేసులో అశోక్ గెహ్లాట్‌తో పాటు యువ నేత సచిన్ పైలట్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. -
ఒకడే ఒక్కడు.. అతడే కేసీఆర్
న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమి ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. మిజోరాంలో మాత్రం ఎమ్ఎన్ఎఫ్ గెలుపొందింది. మిజోరాం ఓటమితో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇక తెలంగాణలో మాత్రం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దాదాపు 76 స్థానాల్లో గెలుపొంది సిగిల్ మెజారిటీ పార్టీగా నిలిచింది. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీసగఢ్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమి పాలు కాగా.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ పార్టీనే మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఆ వివరాలు.. తెలంగాణ : కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ ప్రభంజనం సృష్టించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ముందస్తుకెళ్లి 2018 ఎన్నికల్లో కూడా ప్రభంజనం సృష్టించారు. కూటమిని కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు. ప్రస్తుతానికి 65 స్థానాల్లో గెలుపొంది.. 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది టీఆర్ఎస్. అయితే ఈ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మీద 51,546 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్ : శివరాజ్ సింగ్ చౌహన్ ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ - కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగుతుంది. రెండు పార్టీలు దాదాపు 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో 116 స్థానాల్లో గెలుపొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సీహోర్ జిల్లా బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2005 నుంచి శివరాజ్ సింగ్ ఈ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి అరుణ్ యాదవ్, శివరాజ్ సింగ్‌పై పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అరుణ యాదవ్ చాలా దూకుడగా వ్యవహరించారు. ముఖ్యంగా విదిశలో జరిగిన ఇసుక మాఫీయా గురించి ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. అరుణ్ యాదవ్ ఎంత ధీటుగా ప్రచారం నిర్వహించినప్పటికి.. శివరాజ్ సింగ్ చౌహనే ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. రాజస్తాన్ : వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝలావర్ పట్టణంలోని ఝలపతాన్ నుంచి ఎన్నికల బరిలో ఈ పాల్గొన్నారు. 2003, 2008, 2013 ఎన్నికల్లో రాజే ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం నాలుగో సారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు రాజే. అయితే ఈ సారి రాజే గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్, రాజేకు గట్టి పోటీ ఇస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాన్వేంద్ర సింగ్ తండ్రి జస్వంత్ సింగ్ బీజేపీ తరఫున గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మాన్వేంద్ర సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ వసుంధర రాజేనే అధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ పార్టీ ఓడిపోయింది. చత్తీస్‌గఢ్ : రమణ్ సింగ్ రమణ్ సింగ్ 2003 నుంచి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో రమణ్ సింగ్ లోక్‌సభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. 2004 లో చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లాలో దొంగార్గావ్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు రమణ్ సింగ్. 2008 లో అసెంబ్లీ ఎన్నికలో ఆయన రాజ్నాంద్గావ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో రమణ్ సింగ్ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రమణ్ సింగ్ ప్రత్యర్థిగా కరుణ శుక్లా పోటీ చేస్తున్నారు. ఈమె మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మేనకోడలు. 2013 వరకూ బీజేపీలో ఉన్నారు కరుణ. జంజిగిర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2004, 2009లో గెలుపొందిన కరుణ.. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మోదీ, బీజేపీ నాయకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అటల్ బిహారి వాజ్‌పేయి పేరును వాడుకుంటున్నారని ఆరోపించిన కరుణ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఇమె కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్‌నందగావ్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ రమణ్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ ఓటమి వైపు అడుగులేస్తోంది మిజోరాం : లాల్ తన్హావాలా మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా సెర్చిప్, చంపాయి స్థానాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 26, కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది. -
బాడీ షేమింగ్
‘బోండాం’ అనడం బాడీ షేమింగ్. ‘బక్క పీనుగ’ అనడమూ బాడీ షేమింగే. స్త్రీని పురుషుడు చేసే బాడీ షేమింగ్ అయితే ఇంకా రకరకాలుగా ఉంటుంది. బాడీ షేమింగ్ అని అతడికి తెలియకపోవచ్చు. ఆమెకు తెలుస్తుంది. హర్ట్ అవుతుంది. ఏ విధంగానైనా స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడం అంటే ప్రకృతి ధర్మాన్నే అవమానించడమే. స్త్రీ దేహధర్మాలు, స్త్రీ దేహ స్వభావాలు విలక్షణమైనవి. ఆ విలక్షణతల కారణంగా కొన్ని విభిన్నతలకూ ఆమె దేహం లోనవుతూ ఉండొచ్చు. ఆ విభిన్నతలను ఎత్తిచూపుతూ ఒక మాట అనడం అంటే.. జన్మనిచ్చే జెండర్‌ను కించపరచడమే. వసుంధరారాజే (65) సీనియర్ లీడర్. రాజస్తాన్ తొలి మహిళా ముఖ్యమంత్రి. మళ్లీ కనుక ఆమె ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్ అవుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆమెను అడ్డుకోవాలంటే ఆమె ప్రభుత్వంలోని బలహీనతలేవో ఎత్తి చూపాలి. చేస్తానని చెయ్యని పనులేవైనా ఉంటే వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అయితే శరద్ యాదవ్, వసుంధరా రాజే ‘ఒంటిని’ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు! ఆయన కూడా సీనియర్ లీడరే. 73 ఏళ్లు. ‘ఏళ్లొచ్చాయ్ ఎందుకు?’ అనిపిస్తుంది రాజేను ఆయన చేసిన కామెంట్‌ని వింటే! వినే ఉంటారు. ‘‘వసుంధర కో ఆరామ్ దో. బహుత్ థక్ గయీ హై. మోటీ హో గయీ హై’’ అన్నారు. పోలింగ్‌కి ముందురోజు ప్రత్యర్థిపై ఆయన సంధించిన చివరి అస్త్రం అది! ‘‘వసుంధరకు విశ్రాంతి ఇవ్వండి. మనిషి బాగా లాౖÐð పోయి ఆయాస పడుతోంది’’ అని. స్త్రీని సవ్యంగా ఎదుర్కోలేకపోయినప్పుడే పురుషుడు ఇలా ఉక్రోషంతో ఆమె ఒంటి పైకి నోటిని ప్రయోగిస్తాడు. వాస్తవానికి శరద్, రాజే సమీప ప్రత్యర్థి ఏమీ కాదు. అయన్ది రాజస్తాన్ కూడా కాదు. ఎన్నికల ప్రచారం కోసం బిహార్ నుంచి వచ్చారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పడక, గతేడాది జేడీయూ నుంచి బయటికి వచ్చి, ఈ ఏడాది మే నెలలో సొంతంగా ‘లోక్తాంత్రిక్ జనతాదళ్’ పార్టీ పెట్టుకుని రాజస్తాన్ ఎన్నికల్లో రాజేకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ సందర్భంగానే శరద్, రాజే ఒంటిపై కామెంట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన వివరణ కూడా ఆయన స్థాయికి తగినట్లుగా లేదు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు క్యాబినెట్ మినిస్టర్‌గా చేసిన శరద్ యాదవ్.. ‘ఊరికే జోక్ చేశాను’ అన్నారు! ‘‘ఆమెను హర్ట్ చెయ్యాలని నా ఉద్దేశం కాదు. తనతో నాకు పాత పరిచయం ఉంది. ఆమెను కలిసినప్పుడు కూడా నేనిదే చెప్పాను.. మీరు లావౌతున్నారని’’ అన్నారు. శుక్రవారం జలావర్‌లోని ‘మహిళా పోలింగ్ బూత్’ నుంచి ఓటేసి వస్తూ.. ‘‘అతడి కామెంట్‌పై నేను ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయబోతున్నాను’’ అని రాజే మీడియా ప్రతినిధులతో అనగానే.. శనివారం ఆమెకు క్షమాపణలు చెబుతూ శరద్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్మృతి ఇరానీ (శరద్ యాదవ్) శరద్ యాదవ్ ఇలా మహిళల్ని కించపరుస్తూ, ‘బాడీ షేమింగ్’ (ఒంటి సైజు, ఒంటి షేప్, ఒంటి రంగును అవమానించడం) చెయ్యడం ఇదే మొదటి సారి కాదు. మూడేళ్ల క్రితం స్మృతి ఇరానీని ఇలాగే పార్లమెంటులో.. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అన్నారు. గత ఏడాది విచిత్రంగా ఓటుకు, ఆడపిల్లలకు ముడిపెట్టి మాట్లాడారు. ఆడపిల్ల పరువు కన్నా ఓటు పరువు ముఖ్యమట. ‘‘ఆడపిల్ల అమ్ముడుపోతే ఇంటి పరువు, ఊరి పరువు మాత్రమే పోతాయి. ఓటు అమ్ముడు పోతే దేశం పరువే పోతుంది’’ అన్నారు. ఏంటో దానర్థం! ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని స్మృతి ఇరానీని అన్న మాటల్లోని పరమార్థం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. రాజ్యసభలో ఇన్సూరెన్స్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు డిబేట్ ఎటు నుంచి ఎటో వెళ్లిపోయి, ‘‘ఇండియాలో అందరికీ తెల్లగా ఉండే అమ్మాయిలే కావాలి. నల్ల అమ్మాయిలను ఎవరూ వధువుగా కోరుకోరు. దక్షిణాది మహిళలంతా నల్లగా ఉంటారు. అయినప్పటికీ వారిలో మెరుపు కనిపిస్తుంది..’’ అని యాదవ్ అన్నారు. అక్కడితో ఊరుకోకుండా ఇంకా వివరణ ఇవ్వబోతుంటే.. మంత్రి స్మృతి ఇరానీ డిప్యూటీ చైర్మన్ వైపు చూస్తూ ‘ఇక ఆపమనండీ’ అని అభ్యర్థించారు. దానికి యాదవ్ అసహనంతో.. ‘ఐ నో వాట్ యు ఆర్’ అని స్మృతిపై మండిపడ్డారు. రేణుకా చౌదరి (వెంకయ్య నాయుడు) ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ సభ్యత్వపు పదవీకాలం పూర్తి చేసుకున్నవారిలో రేణుకా చౌదరి ఒకరు. ఆ వీడ్కోలు సభలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు, రేణుకా చౌదరికి మధ్య జరిగిన సంభాషణలోనూ రేణుక బాడీషేమింగ్‌కి గురయ్యారు. అయితే వారిద్దరి మధ్య ఉన్న చిరకాల పరిచయం కారణంగా అది కేవలం ఉల్లాసభరితమైన వాగ్వాదంగా మాత్రమే మిగిలిపోయింది. బరువు టాపిక్ తెచ్చింది మొదట రేణుకే. తన వీడ్కోలు ప్రసంగంలో ఆమె వెంకయ్యనాయుడును ఉద్దేశించి.. ‘సర్.. నా వెయిట్ గురించి అంతా వర్రీ అవుతున్నారు. కానీ ఇది మన వెయిట్ ఏంటో చూపించాల్సిన జాబ్ కదా’’ అన్నారు. అందుకు వెంకయ్యనాయుడు.. ‘‘మీరు వెయిట్ తగ్గండి. మీ పార్టీ వెయిట్ పెంచండి’’ అని సలహా ఇచ్చా రు. ఆ మాటకు రేణుక హాయిగా నవ్వేస్తూ.. ‘మా పార్టీ వెయిట్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదు సర్. ఇటీస్ ఫైన్’ అన్నారు. అప్పటికే నాయుడు ఉపరాష్ట్రపతి. రేణుక గానీ, ఇతర మహిళలు కానీ పాయింట్ అవుట్ చెయ్యకపోవడంతో అది పెద్ద ఇష్యూ కాలేదు. షేక్ హసీనా (నరేంద్ర మోదీ) గత ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ఆడమనిషై ఉండీ టెర్రరిజాన్ని జీరో టాలరెన్స్ (ఏమాత్రం సహించకపోవడం)తో నియంత్రిస్తోంది’ అని ఆయన అన్నారు. ‘ఆడ మనిషై ఉండీ’ అనడంలో మెచ్చుకోలు ఉన్నప్పటికీ.. ‘కంపారిటివ్లీ బలహీనమైన’ అనే అర్థం ధ్వనిస్తుండడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇందులో బాడీ షేమింగ్ ఎక్కడున్నట్లు? ఉంది. ‘ఆడపిల్ల నయం కదా, ధైర్యంగా పోరాడింది’ అంటే.. అంతర్లీనంగా ఆమె బలహీనత స్ఫురిస్తుంది కదా. బలహీనమైన బాడీ అనడం షేమింగ్ కాక మరేమిటి?! మహిళల మీద (అబూ అజ్మీ) ఐదేళ్ల క్రితం సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ అజ్మీ ఒక కామెంట్ చేశాడు. ఆడవాళ్లను స్వేచ్ఛగా వదిలిపెడితే దోపిడికీ గురవుతారట. ఎందుకనంటే.. ‘‘వాళ్లు బంగారంలా విలువైనవారు. బాహాటంగా పెడితే ఆ బంగారాన్ని దోచుకునిపోతారు’’ అని ఆయన ఆందోళన. అందుకే ఆడవాళ్లు.. తోడు లేకుండా బయట తిరగకూడదు. చీకటైతే అసలు బయటికి రాకూడదు అని కూడా అన్నారు అజ్మీ. ఇదొక రకం బాడీ షేమింగ్. తమని తాము కాపాడుకోలేని దేహాలు అని చెప్పడమేగా! చివరికి ఆయన మాటలకు ఆయన కోడలు (కొడుకు ఫర్హాన్ భార్య) అయేషా టాకియా సోషల్ మీడియాలోకి వచ్చి క్షమాపణ చెప్పారు. ‘‘మా మామగారు అలా అని ఉండాల్సింది కాదు’’ అని. భార్యల మీద (శ్రీ ప్రకాశ్ జైస్వాల్) శ్రీ ప్రకాశ్ జైస్వాల్ అయితే ఏకంగా యావత్ద్దేశంలోని భార్యలనే బాడీ షేమింగ్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, మంత్రి ఆయన. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకు రెండేళ్ల క్రితం కాన్పూర్‌లోని ఒక మహిళా కాలేజ్‌లో ప్రసంగిస్తూ... ‘‘ఈ భార్యలున్నారే.. ముసలివాళ్లయిపోతారు. అప్పుడు వాళ్ల మీద ఏ ఆకర్షణా కలగదు’’ అన్నారు. ఎంత ఘోరమైన బాడీ షేమింగ్! పెద్ద చదువులుండి, పెద్ద హోదాలుండీ.. ఎందుకీ పెద్దవాళ్లు ఇలా చిన్న మాటలు మాట్లాడతారు? ఒక్క రాజకీయ నాయకులనే కాదు, ఏ రంగంలోని పురుషులైనా.. స్త్రీలను అవమానించడానికి, వ్యంగ్యంగా మాట్లాడటానికి వారి దేహాలను టార్గెట్ చెయ్యడం సంస్కారమేనా? బలవంతుణ్ని అనుకుంటాడు కదా మగవాడు! స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడమేనా అతడి బలం?! ప్రియాంకా చోప్రా (రాజ్‌నాథ్ సింగ్) కొన్ని కామెంట్లు పైకి బాడీ షేమింగ్‌గా అనిపించవు కానీ, లోతుగా చూస్తే వాటిల్లోనూ బాడీ షేమింగ్ కనిపిస్తుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్‌గా ఎన్నికైనప్పుడు రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా ప్రియాంక లక్నోలో ఉంటోంది. సీఎం స్థాయిలో ఉండి ఆయన ప్రియాంకను ప్రశంసించాల్సింది పోయి, ‘ఈ అందాలపోటీలను బ్యాన్ చెయ్యాలి. మన సంస్కృతిని ఇవి దిగజారుస్తున్నాయి’ అన్నారు. ఆయన ఉద్దేశం.. ఆడపిల్లలు వేదికలెక్కి ఒళ్లు చూపిస్తున్నారని! బ్యూటీ షేమింగ్‌లా కనిపించే బాడీ షేమింగ్ ఇది. -
‘చాలా అవమానకరం.. చర్యలు తీసుకోవాల్సిందే’
పట్నా : రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే తన మాటల వల్ల బాధ పడి ఉంటే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని జేడీ(యూ) బహిష్కృత నేత శరద్ యాదవ్ అన్నారు. ఈ మేరకు క్షమాపణ కోరుతూ ఆమెకు లేఖ కూడా రాస్తానని పేర్కొన్నారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్ యాదవ్ వసుంధర రాజేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అల్వార్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న యాదవ్... ‘వసుంధరకు కొంత విశ్రాంతి ఇవ్వండి.. ఈ మధ్య ఆమె చాలా అలసిపోయారు. అలాగే లావయ్యారు కూడా. ఆమె సన్నబడాల్సి ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే బాడీ షేమింగేనని బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అంతేకాకుండా శరద్ యాదవ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన విమర్శల పాలయ్యారు. కాగా శరద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన వసుంధర రాజే శుక్రవారం మాట్లాడుతూ.. ‘ షాక్‌కు గురయ్యాను. నిజంగా చాలా అవమానకరంగా అన్పించింది. ఇలా మహిళలను కించపరచడం ద్వారా యువతకు ఆయన ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల నేతలు వారి భాషను నియంత్రించుకోవాలి’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
ఎడారి గడ్డపై.. సోషల్ ఇంజనీరింగ్
‘మోదీ, మీరంటే కోపం లేదు. కానీ.. రాజేని సహించే ప్రసక్తే లేదు’ రాజస్తాన్‌లో ఎక్కడికి వెళ్లినా ఇదే నినాదం వినిపిస్తోంది. ఎవరికీ అందుబాటులో ఉండరు, తలబిరుసు ఎక్కువ వంటి విమర్శల్ని ఎదుర్కొంటూ ఎన్నికలకు ముందే ప్రజాగ్రహం వేడిని చూస్తున్న వసుంధరా రాజే.. కుల సమీకరణలతోనైనా నెగ్గడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ రాజస్తాన్‌లో కులమే అత్యంత కీలకమని, అభ్యర్థుల జయాపజయాల్ని అదే శాసిస్తుందని బలంగా నమ్ముతున్న రెండు పార్టీలు టిక్కెట్ల పంపిణీ సమయంలో కులాల లెక్కల్ని పక్కాగా వేసుకొని బరిలోకి దిగాయి. దీంతో 30 చోట్ల ఒకే కులానికి చెందిన అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. 15 నియోజకవర్గాల్లో జాట్లు తలపడుతుండగా.. 7 స్థానాల్లో బ్రాహ్మణులే బ్రాహ్మణులతో తలపడాల్సి వస్తోంది. 4 సీట్లలో రాజ్‌పుత్‌లు ఒకరిపై మరొకరు సై అంటుండగా.. 2 చోట్ల గుజ్జర్లు, యాదవ్‌లు నువ్వా నేనా అని సమరశంఖం పూరిస్తున్నారు. రాజపుత్‌లు ఎవరివైపు? రాజస్తాన్ జనాభాలో 9% ఉన్న రాజపుత్‌లు ఓట్లు ఏ పార్టీకైనా అత్యంత కీలకం. గతసారి ఎన్నికల్లో బీజేపీ అండదండగా ఉన్న ఈ సామాజిక వర్గం ఇప్పుడు కమలనాథులపై ఆగ్రహంతో ఉంది. రాజ్‌పుత్ అయిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ నకిలీ ఎన్కౌంటర్, పద్మావత్ సినిమా విడుదలకు రాజే సర్కార్ సై అనడం, ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు వంటివి బీజేపీపై రాజ్‌పుత్‌లలో కోపాన్ని పెంచాయి. రాజ్‌పుత్ సంఘాలు బహిరంగంగానే సభలు నిర్వహిస్తూ గతంలో కమలం పార్టీకి ఓటు వెయ్యడం తాము చేసిన తప్పిదమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ సారి బీజేపీని ఓడించాలంటూ శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కన్వీనర్ లోకేంద్ర కాల్వీ పిలుపునిచ్చారు. వీరి ఓట్లన్నీ ఈ సారి కాంగ్రెస్‌కు మళ్లే అవకాశం ఉంది. ఇక రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన నేత జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అయితే, రాజపుత్ర సేనను చీల్చిన సుఖ్‌దేవ్ సింగ్ గోగామేధీ బీజేపీకి మద్దతు ప్రకటించారు. రాజ్‌పుత్‌లు - 9% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 26 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 15 గుజ్జర్ల అండ దక్కేదెవరికి? రాష్ట్ర జనాభాలో 9%శాతం ఉన్న గుజ్లర్లు కూడా ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన ఈ వర్గం తమను సంచార తెగగా గుర్తించి ఎస్టీ హోదా కల్పించాలంటూ దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఎస్టీ కులమైన మీనాలతో రాజకీయంగా పోటీపడుతున్నారు. రాజే సర్కార్ గత జులైలోనే గుజ్లర్లను తిరిగి ఓబీసీల్లోకి చేర్చింది. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న 21% రిజర్వేషన్లు వారికీ వర్తిస్తాయి ఇక అదనంగా ఒక్క శాతాన్ని అత్యంత వెనుకబడిన వర్గాల్లోకి (ఎంబీసీ) చేర్చింది. ఈ చర్యతో రాష్ట్రంలో సుప్రీం అనుమతిచ్చిన 50% రిజర్వేషన్లు పూర్తయ్యాయి. అయినా గుజ్లర్లు సంతృప్తిగా లేరు. మరోవైపు కాంగ్రెస్‌లో గుజ్జర్ అయిన సచిన్ పైలెట్ సీఎం అభ్యర్థి రేసులో ముందు ఉండడంతో ఈ ఎన్నికల్లో గుజ్లర్లు కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ‘ప్రభుత్వంలో మా ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంది. గుజ్జర్ నేతలు ఎక్కువ మంది ఎన్నికైతేనే మా డిమాండ్లు సాధించుకునే అవకాశం ఉంటుంది. సచిన్ పైలెట్ సీఎం రేసులో ఉండడం హర్షణీయం. ఈ సారి మా మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుంది’ అని గుజ్జర్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి శైలేంద్ర సింగ్ ధభానీ వెల్లడించారు. గుజ్జర్లు- 9% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 12 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 10 జాట్లు రూటు ఎటు? గ్రామీణ రాజస్థాన్‌లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 15% ఉన్న వీరు మొదట్నుంచి కాంగ్రెస్ పక్షమే. కానీ ఆ పార్టీ తమకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి వీరిలో ఉంది. పరశురామ్ మధేర్నా, రామ్నివాస్ మీర్ధా, శీష్‌రాం ఓలా వంటి బలమైన జాట్ నేతలను కాంగ్రెస్ ఎప్పుడూ సీఎంను చేయలేదని జాట్లు అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పరశురామ్ మధేర్నాను సీఎంగా కాంగ్రెస్ ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ మాలీ వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో వీరంతా కాంగ్రెస్‌కు దూరమయ్యారు. జాట్లలో అత్యధికులు వ్యవసాయ రంగం మీద ఆధారపడే ఉన్నారు. అయితే రైతాంగ సమస్యల కారణంగా వారు బీజేపీ వైపు కూడా ఉండే అవకాశం లేదు. తిరిగి జాట్లను తమ గూటికి లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా ప్రయత్నించింది. వ్యూహాత్మకంగా ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ముందుకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో ప్రముఖ జాట్ నాయకుడు హనుమాన్ బేనీవాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతోబరిలో దిగడంతో జాట్ ఓటు బ్యాంకు అటు మళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాట్లు- 15% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 60 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 33 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 33 సర్వేలు ఏం చెబుతున్నాయంటే ఏబీపీ సీఎస్డీఎస్ బీజేపీ - 84 కాంగ్రెస్- 110 ఇతరులు-06 టైమ్స్ నౌ సీఎన్ఎక్స్ బీజేపీ - 70-80 కాంగ్రెస్- 110-120 బీఎస్పీ- 1-3 ఇతరులు- 7-9 ఇక ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో వసుంధా రాజే ప్రభుత్వం మారాలని 48% మంది కోరుకుంటే, రాజే ప్రభుత్వ పనితీరుపై 32% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల వివరాలు.. ఎన్నికలు – డిసెంబర్ 7 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కౌంటింగ్, ఫలితాలు – డిసెంబర్ 11 రాష్ట్ర జనాభా– 6.86 కోట్లు హిందువులు– 88.49%, ముస్లింలు– 9.07% ఓటర్ల సంఖ్య – 4,77,89,815 పోలింగ్ కేంద్రాల సంఖ్య– 51,965 అసెంబ్లీ స్థానాలు – 200 పోలింగ్ జరిగే సీట్లు– 199 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు– 34 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు– 25 జనరల్ సీట్లు– 141 పోటీలో ఉన్న అభ్యర్థులు–2,873 మహిళా అభ్యర్థులు– 189 సీఎం – వసుంధరా రాజే (బీజేపీ) 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–163 సీట్లు– 45,17% కాంగ్రెస్–22 సీట్లు– 33.07% ఇతరులు–17 సీట్లు– 22% -
‘తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది’
జైపూర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పుష్కర్‌లోని బ్రహ్మ దేవాలయాన్ని సందర్శించినప్పుడు రాహుల్ గాంధీ తన గోత్రానికి బదులు తన నానమ్మ తండ్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గోత్రం చెప్పారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ర్యాలీలో రాజే మాట్లాడుతూ ‘రాహుల్ తన గోత్రం ఏంటో చెప్పలేదు. ఆయన పేర్కొన్నది నెహ్రూ గోత్రం. పూజ సందర్భంగా రాహుల్ తన తండ్రి రాజీవ్ గాంధీ, తాత ఫిరోజ్ గాంధీల గోత్రాన్ని చెప్పి ఉండాల్సింది. కానీ ఆయన ఎందుకనో అలా చేయలేదు’ అని రాజే వ్యాఖ్యానించారు. కాగా పుష్కర్ ఆలయంలో రాహుల్ తన గోత్రం ‘దత్తాత్రేయ’ అని, తాను కశ్మీరీ బ్రాహ్మణుడిని అని తెలిపినట్లు ఆ పూజ నిర్వహించిన పూజారి వెల్లడించిన విషయం తెలిసిందే. -
రాణికి రాజ్‌పుత్ సవాల్!
రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఝల్రాపాటన్. రాష్ట్ర రాజధాని జైపూర్‌కు 347 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణంలో గుళ్లు గోపురాలు ఎక్కువ. అందుకే గుడి గంటలు అన్న అర్థంలో ఝల్రాపాటన్ పేరు వచ్చింది. వరుసగా మూడుసార్లు అక్కడినుంచి వసుంధరా రాజే సులభంగానే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడి ఎన్నిక ఏకపక్షంగానే ఉంటుందని భావించిన నేపథ్యంలో.. చివరి నిమిషంలో కాంగ్రెస్ కత్తిలాంటి అభ్యర్థిని రంగంలోకి దించింది. మొన్నటివరకు బీజేపీ ముఖ్య నేతగా ఉండి.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మానవేంద్ర సింగ్ (బీజేపీ మాజీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు)ను రాజేపై పోటీలో నిలబెట్టింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. మొన్నటివరకు రాజే, మానవేంద్ర సింగ్.. బీజేపీలోనే ఉన్నా.. ఒకరంటే ఒకరికి పడదు. అదే వైరం ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి కత్తులు దూసుకునేవరకు వచ్చింది. ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఆ తర్వాత రాజకీయ వైరం ముదిరి.. వంశ ప్రతిష్ట, ఆత్మగౌరవం వంటి మాటలు తెరపైకి రావడంతో వ్యక్తిగత దూషణలు మొదలయ్యాయి. 2014కు ముందు వరకు వసుంధర రాజే, జస్వంత్ సింగ్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యమే ఉండేది. అయితే.. గత సార్వత్రిక ఎన్నికల్లో జస్వంత్ సింగ్ తన సొంత రాష్ట్రమైన రాజస్తాన్‌లో బర్మార్ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించడమే వీరి మధ్య వివాదాన్ని రాజేసింది. జస్వంత్ ఎక్కడ తన సీటుకు ఎసరు పెడతారోననే భయంతో ఆయనకు టికెట్ రాకుండా రాజే అడ్డుకున్నారు. తీవ్ర మనస్తాపంతో జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బర్మార్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. 4లక్షల ఓట్లను సాధించి ప్రజల్లో తనకున్న పట్టును చాటుకున్నారు. ఆ తర్వాత బాత్రూమ్లో పడిపోయి కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం ఆయన కుమారుడు మానవేంద్ర సింగ్‌ను కూడా పార్టీలో పైకి రాకుండా రాజే అడ్డుకున్నారు. దీంతో నాలుగేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న మానవేంద్ర సెప్టెంబర్‌లో బర్మార్‌లో స్వాభిమాన్ ర్యాలీ నిర్వహించారు. రాజే హయాంలో రాజ్‌పుత్‌లకు జరుగుతున్న అవమానాలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాతే కాంగ్రెస్ గూటికి చేరారు. సత్సంబంధాలపైనే రాజే విశ్వాసం ఝల్రాపాటన్ నియోజకవర్గంపై వసుంధర రాజేకు మంచి పట్టుంది. మూడు సార్లుగా ఆమె ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికవుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ చంద్రావత్‌పై ఏకంగా 60వేల ఓట్ల మెజార్టీని సాధించారు. తన నియోజకవర్గం విషయంలో మాత్రం ఆమె పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అక్కడి ప్రజలతో ఒకరకంగా కుటుంబ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి కూడా బాగా కృషి చేశారు. అద్భుతమైన రోడ్లు వచ్చాయి. విమానాశ్రయం ఏర్పాటైంది. కోటాలో 300పైగా సున్నపురాయి ఫ్యాక్టరీల్లో కార్మికుల మెరుగైన జీవన ప్రమాణాల కోసం చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలు. అయితే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో కొందరు వ్యాపారస్తుల్లో నెలకొన్న అసంతృప్తి, నియోజకవర్గంలో విస్తారంగా సంత్రాలు సాగు చేస్తున్న రైతులు నిండా అప్పుల్లో మునిగిపోవడం, ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల్ని శాసించే రాజ్‌పుత్‌లు సర్కార్‌పై కోపంగా ఉండడం వంటి అంశాలు రాజేకు ఇబ్బందిగా మారాయి. స్థానికుడు కాదు.. కానీ! మానవేంద్ర సింగ్ స్థానికుడు కాకపోవడం ఆయనకు ముళ్లబాటగానే మారొచ్చనే విశ్లేషణలు వినబడుతున్నాయి. బర్మార్ పార్లమెంటు పరిధిలో ఉన్న షియో నియోజకవర్గానికి మానవేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ నియోజకవర్గ అభివృద్ధికి చాలా చేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బర్మార్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ రాజేపై యుద్ధానికి అధిష్టానం మానవేంద్ర సింగ్‌ను ఎంపిక చేయడంతో.. మొదట్లో ఆశ్చర్యపోయినా తర్వాత పోటీకి సిద్ధమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, రాజ్‌పుత్‌ల మద్దతుతోనే నెగ్గడానికి వ్యూహాలు పన్నుతున్నారు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవ నినాదాన్ని బాగా జనంలోకి వెళ్లేలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వసుంధరా రాజేకున్న అహంకారాన్ని, తాను ఎదర్కొన్న అవమానాల్నే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ఈ పోరాటాన్ని రాజే వర్సెస్ జస్వంత్ సింగ్ మధ్య పోరాటంగా ఆయన చిత్రీకరిస్తున్నారు. సీఎంగా ఉన్న రాజేను ఆమె సొంత నియోజకవర్గంలో ఢీకొట్టడం అంతం సులభం కాదని మానవేంద్రకూ తెలుసు. ఇవీ కులం లెక్కలు ఈ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నాయి. ముస్లింలు అత్యధికంగా 50వేల మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో దళితులు (35 వేలు)న్నారు. ధకారాలు, రాజ్‌పుత్‌లు చెరో 20 వేల మంది వరకున్నారు. సోంధియా రాజ్‌పుత్‌లు 15వేలు, బ్రాహ్మణులు, వైశ్యులు 20 వేల మంది ఉంటే.. గుజ్జర్లు 12 వేలు, దాంగి , పటీదార్ సామాజిక వర్గాల ఓటర్లు 16 వేల వరకు ఉన్నారు. సంప్రదాయంగా ఇక్కడ బీజేపీకి ముస్లింలు, దళితులు అండగా ఉంటున్నారు. ఈసారి వారి ఓట్లనే రాజే నమ్ముకున్నారు. గతంలో రాజ్‌పుత్‌లు కూడా బీజేపీ వెంటే నడిచినప్పటికీ ఈసారి ఆ పరిస్థితి లేదు. -
రాజ్‌పుత్ వర్సెస్ రాజ్‌పుత్
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీ చేసేందుకు తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కొడుకు, శివ్ ఎమ్మెల్యే మాన్వేంద్ర సింగ్ పేర్కొన్నారు. రాజ్‌పుత్ నాయకుడిని అవమానించినందుకు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ టికెట్‌పై గెలుపొందిన మన్వేందర్ సింగ్ ఇటీవలే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం విడుదల చేసిన తొలి జాబితాలో ఆయనకు చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం.. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలరాపటాన్ నుంచి మన్వేంద్ర పోటీ చేస్తారని పేర్కొంది. ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మన్వేందర్ సింగ్‌కు ఏ సీటు కేటాయించాలో అర్థం కాకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చోట ఆయనను నిలబెట్టారని వసుంధర రాజే అన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని ఆమె వ్యాఖ్యానించారు. 2003 నుంచి మూడు పర్యాయాలు అక్కడి నుంచి గెలిచిన విషయాన్ని మరోమారు గుర్తుచేశారు. కాగా వసుంధర రాజే నాయకత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్వేంద్ర సింగ్‌ను ఆమెపై పోటీకి దించడం ద్వారా సీఎంను చాలా తేలికగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ సంకేతాలు జారీ చేస్తోంది. అంతేకాకుండా ఈ టికెట్‌ను రాజ్‌పుత్‌కే కేటాయించడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
నయా 'రాజ'రికం
రాచరికం అంతమైపోయినా, రాజ్యాలు మాయమైనా.. వాళ్ల రక్తంలో మిళితమైన అధికార ఆరాటం తగ్గలేదు. మారిన సామాజిక పరిస్థితుల్లో నాటి రాజ్యాధికారానికి సమానమైన వేదిక రాజకీయమేనని వాళ్లకు అర్ధమైంది. ఇదే రాజకుటుంబాలను పాలిటిక్స్‌వైపు నడిపించింది. రాజుల గడ్డ రాజస్తాన్‌లో అధికార పీఠంపై రాజ కుటుంబీకుల ముద్ర స్పష్టంగా కనబడుతోంది. వీరు అధికారంలో ఉండటమో.. లేక వీరి మనుషులు ప్రభుత్వాలను శాసించడమో పరిపాటిగా మారింది. రాజా హనుమంత్ సింగ్, రాణీ గాయత్రీ దేవి మొదలుకుని నేటి వసుంధరా రాజే వరకు రాజకుటుంబాలకు రాజకీయాలపై ఆసక్తి చాలా ఉంది. దాదాపు అన్ని రాజ కుటుంబాలు స్వాంతంత్య్రానంతరం తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఒక దశలో ఎంఎల్ఏ, ఎంపీ సీట్ల వరకు పరిమితమైన రాజకుటుంబీకులు క్రమంగా రాష్ట్రం మొత్తం ప్రాభవాన్ని విస్తరించుకొని చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా చేజిక్కించుకున్నారు. అయితే దీన్నుంచి ఒక్క రాజ కుటంబానికి మినహాయింపు ఇవ్వాల్సిందే. రాజస్తాన్‌లోని ‘టాంక్’రాజవంశీయులు ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. భారీ వరాలతో విలీనం స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో 500కు పైగా చిన్నా చితకా సంస్థానాలుండేవి. పటేల్ వ్యూహంతో ఇవన్నీ ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయాయి. అయితే ఈ విలీనాలకు అంగీకరించేందుకు రాజకుటుంబాలకు భారీ వరాలు ఇవ్వాల్సివచ్చింది. తర్వాత కాలంలో ఇందిరాగాంధీ ఈ రాజభరణాలను రద్దు చేసింది. అప్పటికే రాజకుటుంబాలకు ప్రాముఖ్యత మెల్లిగా తగ్గుతూ వస్తోంది. అయితే.. తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు రాజకీయాలే సరైన మార్గమని నాటి మహారాజులు భావించారు. దీంతో ప్రజాజీవితాలతో సంబంధం లేని పలు రాజకుటుంబాలు.. తమ వంశం పేరు ఆధారంగా రాజకీయ నాయకులుగా మారిపోయారు. రాజస్తాన్‌లో ఈ తరహా మార్పు ఎక్కువగా కనిపించింది. 1950–70 దశకాల్లో రాజ కుటుంబీకులు ఎక్కువమంది రాజకీయాల్లోకి ప్రవేశించారు. చక్రం తిప్పిన విజయ, వసుంధర రాజస్తాన్ రాజకీయాల్లోకి రాజకుటుంబీకుల రాక ఆకస్మికంగా జరగలేదు. తగ్గుతున్న ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నమే వారిని రాజకీయాలవైపు నడిపించింది. వీరంతా మొదట్లో స్వతంత్ర సభ్యులుగానే పోటీ చేశారు. దీంతో వీరికి గెలిచిన ప్రాంతాలపై మాత్రమే వీరికి పట్టుండేది. ఈ సమయంలో జోధ్‌పూర్‌కు చెందిన రాజా హనుమంత్ సింగ్ రాజస్తాన్‌లోని మాజీ మహారాజులు అందరినీ ఏకం చేసి ‘రామరాజ్య పరిషత్’అనే ఓ గ్రూపును ఏర్పాటుచేశారు. అయితే 1952లో ఆయన అనూహ్య మరణంతో ఈ సమాఖ్య చెల్లాచెదురైంది. తర్వాత కాలంలో బికనేర్ మహారాజా కర్నిసింగ్ ఈ నియోజకవర్గంలో వరుసగా ఐదు సార్లు గెలిచారు. ఆ తర్వాత మహారాణి గాయిత్రీ దేవి స్వతంత్రపార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి ఎదురు నిలిచారు. తొలిసారి ఎంపీగా ఎన్నికై అందరినీ ఆకర్శించారు. గ్వాలియర్ మహారాణి విజయరాజే సింధియా, ధోలపూర్ రాణి వసుంధర రాజే రాజకీయాల్లో ఎదిగారు. వసుంధర రాజే రాజ కుటుంబం నుంచి తొలి సీఎంగా నిలిచారు. మైభీ రాజా హూ! రాజస్తాన్‌లో సంస్థానాలు, రాజకుటుంబాలు ఎక్కువ. ఈ కుటుంబాల్లోని ప్రముఖులు క్రమంగా ఆయా పార్టీల తరుఫున తమకు పట్టున్న ప్రాంతాల్లో పోటీ చేశారు. పేదల గుడిసెల్లో రొట్టెలు చేయడం, రోడ్లు శుభ్రపరచడం వంటి పనులతో ప్రజలతో బంధం ఏర్పరుచుకున్నారు. దీంతో కాస్త పేరున్న వారు కూడా తామూ రాజకుటుంబీకులమని చెప్పుకున్నారు. ఈ విపరీత ధోరణులను నిరసిస్తూ 1962 ఎన్నికల్లో రామ్ మనోహర్ లోహియా ఒక రాజ ప్రముఖుడికి వ్యతిరేకంగా పేద దళిత మహిళను నిలబెట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నేతలు ఎక్కువగా తమను తాము రాజకుటంబీకులుగా చెప్పుకుంటుంటారు. ‘టోంక్’ల రూటే సెపరేటు! రాజకీయాలకు ఈ నవాబులు దూరం రాజస్తాన్ రాజవంశీకులందరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటే.. టోంక్ సంస్థానం మాత్రం ఈ వాసనకు దూరంగా ఉంది. టోంక్ స్టేట్ ఖాందాన్ నిబంధనలు–1944 కింద ఈ వంశానికి చెందిన దాదాపు 615 మంది నెలకు వెయ్యిరూపాయల పింఛను అందుకుంటున్నారు. జైపూర్, అల్వార్, భరత్పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైసల్మేర్, పాలి తదితర సంస్థానాధీశులంతా నేతలవుతున్నా టోంక్ నవాబులు మాత్రం ఆసక్తి చూపలేదు. 19వ శతాబ్దిలో ఈ రాజవంశం బలమైన మిలటరీ శక్తిగా పేరొందింది. బ్రిటీషర్లకు, అఫ్గాన్లకు కుదిరిన ఒప్పందం కింద 1808లో టోంక్ సంస్థానం ఆవిర్భవించింది. అయితే ఇందిర అధికారంలోకి వచ్చి రాజభరణాల రద్దు, లాండ్ సీలింగ్ తెచ్చాక పరిస్థితులు మారిపోయాయి. నవాబు వంశ మూల ఆర్థిక వనరులపై ఈ రెండు అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ మార్పు తర్వాత ప్రధాన పార్టీల తరఫు అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడానికే నవాబులు పరిమితం అయ్యారు. బైరాన్‌సింగ్ షెకావత్‌కు వీరి మద్దతు ఉండేది. ప్రస్తుత నవాబు ఢిల్లీలో నివసిస్తుండగా, కుటుంబంలోని వారంతా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. -
హనుమతో కలవరం!
రాజస్తాన్‌లో చిన్న పార్టీలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొన్నటివరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గానే ఉంటుందన్న పోరు ఇప్పుడు మూడో కూటమి రంగంలోకి దిగటంతో మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఈ మూడో కూటమే ఇరు జాతీయ పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. గత ఎన్నికల వరకు బీజేపీలోనే బలమైన జాట్‌వర్గం నేతగా ఉన్న హనుమాన్ బేణీవాల్.. గతనెల 29న రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ)ని స్థాపించారు. బీజేపీ సీనియర్ నేతగా ఉండి.. రాజేతో విభేదించి బయటకొచ్చి భారత్ వాహినీ పార్టీ (బీవీపీ)ని ఏర్పాటుచేసిన బీజేపీ ఎమ్మెల్యే ఘన్‌శ్యామ్ తివారీ కూడా ఆర్ఎల్పీతో కలిశారు. మరికొన్ని చిన్న పార్టీలను కలుపుకుని మూడో ఫ్రంట్ ఏర్పాటుకు వీరు సిద్ధమవుతున్నారు. అయితే.. 130 స్థానాలే టార్గెట్‌గా పనిచేస్తున్న ఈ కూటమితో బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కలవరం మొదలైంది. 30 చోట్ల పవర్ఫుల్ హనుమ జాట్ వర్గం నేతగా బీజేపీ విజయాల్లో హనుమాన్ పాత్ర విస్మరించలేనిది. రాజస్తాన్‌లో 14–15% జనాభా ఉన్న జాట్లు దాదాపు 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో హనుమాన్ బేణీవాల్ ఈ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరనేది సుస్పష్టం. కులాభిమానాలు బలంగా పనిచేసే రాజస్తాన్‌లో ఆర్ఎల్పీ ప్రభావం గణనీయంగా ఉంటుందనేది బీజేపీ, కాంగ్రెస్‌లకు జీర్ణించుకోలేని విషయం. ‘అయితే బీజేపీ లేదంటే.. కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీలను చూసి చూసి జనం విసుగెత్తిపోయారు. ఈ పార్టీల అవినీతితో విరక్తిచెందారు. అందుకే రాష్ట్ర ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. వారి నమ్మకాలను వమ్ము చేయబోం’ అని బేణీవాల్ ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈయన ‘కిసాన్ హుంకార్ మహా ర్యాలీ’లకు జనం పోటెత్తుతుండటంతో.. ఏ స్థాయిలో ఈయన ప్రభావం ఉండొచ్చనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. ఘనశ్యాముడూ కలిస్తే.. భారత్ వాహినీ పార్టీ (బీవీపీ)ని స్థాపించిన మాజీ బీజేపీ సీనియర్ నేత ఘన్‌శ్యామ్ తివారీ తక్కువోడేం కాదు. రాష్ట్రంలో 7% ఉన్న బ్రాహ్మణ ఓట్లకు ఘన్‌శ్యామ్ తివారీ నేతగా ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన్‌శ్యామ్ కూడా సొంతపార్టీ పెట్టుకోవడం బీజేపీకి పెద్ద దెబ్బే. దీనికి తోడు ఘన్‌శ్యామ్ కనీసం 20 స్థానాలను ప్రభావితం చేయగలడు. ఈయనకు బ్రాహ్మణులతోపాటు ఇతర అగ్రవర్ణాల్లోనూ మంచి పట్టుంది. దీంతో ఆర్ఎల్పీ, బీవీపీ కలిసి మూడో ఫ్రంట్‌గా ఏర్పడి పోటీచేయాలని నిర్ణయించాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే బీజేపీకే ఎక్కువ నష్టం అని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అయితే కాంగ్రెస్‌కు కూడా జాట్, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ఓట్లు తగ్గతాయనే భావనా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన హనుమాన్, ఘన్శ్యామ్లు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. 130 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన భావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్ఎల్పీ 30 చోట్ల గెలవగలదని బేణీవాల్ అంచనా. బీజేపీ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టిన గిరిజన నాయకుడు కిరోలీలాల్ మీనా తిరిగి బీజేపీలో చేరడంతో.. మీనా ప్రభావం ఉన్న 70 చోట్ల వదిలిపెడితే.. మిగిలిన 130 సీట్లలో క్రియాశీలకంగా మారాలని వ్యూహాలు పన్నుతున్నారు. ఎవరీ హనుమాన్? హనుమాన్ బేణీవాల్ 2013 వరకు బీజేపీలో సీనియర్ నాయకుడు. వసుంధరా రాజేపై తరచూ అసమ్మతి గళం వినిపించేవారు. 2013 ఎన్నికలకు ముందు కూడా రాజేపై అవినీతి ఆరోపణలు చేయడంతో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ఎన్నికల్లో ఖిన్వసార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. గత అయిదేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతినే ప్రధానాస్త్రం చేసుకొని విమర్శలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం ఆర్ఎల్పీని స్థాపించి.. రాష్ట్రంలో మూడో కూటమి రాగాన్ని ఆలాపిస్తున్నారు. బలమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత. జాట్, ముస్లిం, యాదవ, కుమావట్ వంటి సామాజిక వర్గాల మద్దతు తమకే ఉంటుందని హనుమాన్ భావిస్తున్నారు. ముసుగులో ‘డేరా’ వద్దకు... గత ఎన్నికల సమయంలో డేరా బాబా ఆశీస్సుల కోసం, ఆయన శిష్యగణం ఓట్ల కోసం రాజకీయ నాయకులు బహిరంగంగా ‘డేరా సచ్చా సౌదా’ కేంద్రాలకు క్యూ కట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి బాబా జైలుపాలయ్యాడు. అయితే ఇప్పటికీ డేరా బాబాను అభిమానించే అనుచరగణం గణనీయంగానే ఉంది. దీంతో రాజకీయ నాయకులు సచ్చా సౌదా కేంద్రాల్లో కీలక వ్యక్తుల మద్దతు కోసం పాకులాడుతున్నారు. కానీ గతంలోలాగా బహిరంగంగా ఆయా కేంద్రాల వద్దకు పోతే విమర్శల పాలవుతామన్న భయంతో రహస్యంగా సచ్చాసౌదాల లీడర్లతో మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. పంజాబ్, హర్యానాల్లో డేరా బాబాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ రాష్ట్రాలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ముఖ్యంగా శ్రీగంగానగర్, హనుమాన్‌నగర్ లాంటి ప్రాంతాల్లో చాలామందికి ఇప్పటికీ డేరాబాబా దేవుడికిందే లెక్క. ఎన్నికల వేళ డేరా భక్తగణం అండ ఉంటే ఈజీగా గట్టెక్కవచ్చని నాయకుల అంచనా. అయితే ఇప్పటివరకు ఫలానా నాయకుడికి ఓటేయమని డేరా నుంచి భక్తులకు అధికారిక ఆదేశాలు రాలేదు. గత ఎన్నికల్లో డేరా పాపులారిటీ ఉన్న 11 సీట్లలో 9 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల పరిధిలో డేరాకు దాదాపు 10 లక్షల మంది అనుచరులున్నారు. ఇంత కీలకం కాబట్టే రాజకీయపార్టీల నేతలు డేరా అనుగ్రహం కోసం పాకులాడుతున్నారు. సామాన్య ప్రజల్లో పలచనకాకుండా ఉండేందుకు తమ యత్నాలను సీక్రెట్‌గా కొనసాగిస్తున్నారు. -
ట్వీట్..హీట్!
సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నామని బీజేపీ అంటోంది. కానీ..కొన్ని కొన్ని సార్లు ఆ దూకుడే పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. బీజేపీలో ఉన్న విభేదాలను బట్టబయలు చేస్తోంది. బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పుట్టిన రోజునాడు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రాజస్థాన్ బీజేపీ శాఖ చేసిన ట్వీట్ కలకలం రేపింది. ట్విట్టర్లో పోస్టు చేసిన శుభాకాంక్షల పోస్టర్లో యశ్వంత్ సిన్హాను బీజేపీ నేత అని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను దుయ్యబడుతూ, ఆయనపై తిరుగుబాటు చేసి పార్టీకి గుడ్‌బై చెప్పిన ఒక నేతకి జన్మదిన శుభాకాంక్షల్ని చెప్పడం వెనుక రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అన్న దిశగా రాష్ట్ర బీజేపీలో పుకార్లు వినిపిస్తున్నాయి. వసుంధరా రాజే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు మధ్య నెలకొన్న విభేదాలు అందరికీ తెలిసినవే. ఆరెస్సెస్ అండదండలతోనే నెగ్గుకొస్తున్న రాజే...æ అడ్వాణీ శిబిరంలోనే మొదట్నుంచి కొనసాగుతూ ఉన్నారు. చాలా మంది సీఎంల్లాగా ప్రధాని మోదీ ఇమేజ్‌తోనే పార్టీ గెలుస్తుందని ఆమె ఎన్నడూ చెప్పలేదు. తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉందన్న ధీమాతోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ, షా ద్వయానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన యశ్వంత్ సిన్హాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం అంటే అమిత్ షాపై యుద్ధం ప్రకటించిందని అనుకోవాలా? లేదంటే బీజేపీ ఐటీ సెల్ తప్పిదమా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. శుభాకాంక్షలు చెబితే తప్పేంటి? బీజేపీ ఐటీ సెల్ మాత్రం దీనిని చాలా తేలిగ్గా తీసుకుంది. పార్టీకి చెందినవారైనా, ప్రతిపక్షంలో ఉన్నవారైనా ఒక నేతకి శుభాకాంక్షలు చెబితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తోంది. ‘రాజకీయ నాయకులకి శుభాకాంక్షలు అందజేయడం మా సంస్కృతి. ప్రత్యర్థి పార్టీల నేతల్ని విష్ చేస్తే తప్పేంటి? సచిన్ పైలట్, అశోక్ గెహ్లట్ల పుట్టిన రోజులకూ పోస్టర్లు విడుదల చేశాం. వారికి శుభాకాంక్షలు చెప్పాం. అదేవిధంగా ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన సిన్హాకు చెప్పాం’ అని బీజేపీ రాజస్థాన్ ఐటీ సెల్ఇన్చార్జ్ హీరేంద్ర కౌశిక్ అన్నారు. సోషల్ మీడియా పోస్టుపై ప్రధాన మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. అయితే పోస్టర్లో బీజేపీ నేతగా సిన్హాను పేర్కొనడం పొరపాటేనని అంగీకరించారు. అయితే పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే సిన్హాకు శుభాకాంక్షలు చెప్పారని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొరపాటే అయితే ఎన్నికల వేళ ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని అంటున్నారు. రాజస్తాన్‌లో ‘శ్యానా కాకా’ సిరీస్ రాజకీయ నాయకులు ఓట్ల కోసం వింత వింతగా ప్రచారాలు చేయడం చూస్తున్నాం. రాజస్తాన్‌లో పాలన అధికారులు కూడా కొత్త శైలిలో ప్రచారానికి శ్రీకారం చూట్టారు. అయితే వీరి ప్రచారం ఓట్ల కోసం కాదు.. ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రజలపైన ఎక్కువగా ఉండడంతో.. దాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుని..రాజస్తాన్‌లోని బూందీ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అయిన మహేశ్ చంద్ డిజిటల్ కార్టూన్ సిరీస్ ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో ఓటు హక్కు పట్ల చైతన్యం కల్పించడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి, ప్రముఖ కార్టూనిస్ట్ సునీల్ జంగీద్తో కలిసి ‘శ్యానా కాకా’ (తెలివైన కాకా) అనే కార్టూన్ సిరీస్‌ను ప్రారంభించారు. ఆసక్తి గొలిపే కార్టూన్లతో సందేశాలను ఓటర్ల ఫోన్లకు వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పంపిస్తున్నారు. కార్టూన్ రూపంలో సందేశం పంపితే ఓటర్లలో ఆసక్తి పెరగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రాజేపై ఎస్పీ భార్య పోటీ! సీఎం వసుంధరా రాజేపై.. రాజస్తాన్ పోలీస్ శాఖలో ఎస్పీగా పనిచేస్తున్న ఓ అధికార భార్య పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముకుల్ చౌదరీ.. తన భర్త ఎస్పీ పంకజ్ చౌదరీతో కలిసి నేరుగా సోనియా గాంధీని కలవడం రాజస్తాన్‌లో చర్చనీయాంశమైంది. ఝల్రాపటన్లో రాజేపై పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాతో మాట్లాడారని సమాచారం. ముకుల్ తల్లి బీజేపీ ప్రభుత్వంలో (బైరాన్‌సింగ్ షెకావత్ సీఎంగా ఉన్నప్పుడు) మంత్రిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? లేదా? అన్న అంశాన్ని పక్కనపెట్టి రెండు నెలల క్రితమే రాజే లక్ష్యంగా ముకుల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం అవినీతిలో కూరుకుపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఝల్రాపటన్ నేను పుట్టిన ఊరు. అందుకే ఈ గడ్డకు న్యాయం చేయాలని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. వసుంధర రాజే ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. నాకు అవకాశం ఇవ్వండి మార్పు చేసి చూపిస్తా’ అని ఆమె తన ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈమె భర్త పంకజ్ ప్రస్తుతం రాజస్తాన్ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్సీఆర్బీ) ఎస్పీగా పనిచేస్తున్నారు. -
'ప్రగతి' ప్రదాత ఆమే 'నిర్ణేత'
ఆడది వంటింటి కుందేలనే సామెత ఎప్పుడో పాతదైపోయింది. ఆకాశంలో.. అవకాశంలోనూ సగమని నిరూపిస్తూ అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాల్లో ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. అయితే అతివలు తక్కువగా రాణిస్తున్న, వీరి ప్రభావం కొంతమేర మాత్రమే కనిపిస్తున్న ఏకైక రంగం రాజకీయమే. పురుషాధిక్య రాజకీయ రంగంలో చోటుకోసం మహిళ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. వీరికి పట్టు చిక్కడం లేదు. ఆడవారికి 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండూ అటకెక్కింది. ఇంత జరుగుతుంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏదైనా సాధించగలిగే సత్తా ఉందా? అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వమే. ఎందుకంటే వరల్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనలో అవాక్కయ్యే వాస్తవాలు వెల్లడయ్యాయి. మహిళా ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాలు.. పురుషులతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఈ పరిశోధనలో స్పష్టమైంది. భాగస్వామ్యం పెరుగుతోంది అసలు రాజకీయ నాయకురాళ్లు దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యానికి సమర్థులేనా? అనే అంశంపై జరిపిన పరిశోధనలో.. మహిళల సామర్థ్యంపై ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు ఎమ్మెల్యేలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధిపై జరిపిన పరిశోధనలు సరికొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ‘ప్రభుత్వ ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే అంశాల్లో మహిళా రాజకీయ నేతల భాగస్వామ్యం మెల్లిగా పెరుగుతోందని మా సర్వేలో తేలింది’ అని పరిశోధకులు తెలిపారు. అభివృద్ధిలో ముందంజ 1992 నుంచి 2012 వరకు దేశవ్యాప్తంగా 4,265 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. దీంట్లో.. మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 4.5% నుంచి 8% పెరిగినట్లు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే మహిళా రాజకీయ నేతలకు నేరచరిత తక్కువగా ఉంటోంది. మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పురుష ఎమ్మెల్యేల కన్నా 15.25% అభివృద్ధి ఎక్కువగా జరిగినట్లు వెల్లడైంది. ఈ స్థానాల్లో జీడీపీలోనూ 1.85% ఎక్కువ వృద్ధి కనిపించింది. పనిపైనే శ్రద్ధ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే.. పురుషులపై కేసులు మహిళలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పురుష ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటం, ఆస్తులు సంపాదించుకోవడం వంటి కార్యక్రమాలపైనే ఆసక్తి చూపుతున్నారు. మౌలిక వసతుల కల్పనలోనూ మహిళా నేతలున్న నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయి. ఇద్దరూ నిధులు తీసుకురావడంలో సమానమైన ఆసక్తులే కనబరుస్తున్నప్పటికీ.. పని పూర్తిచేయడంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికితోడు అనవసర ఖర్చుల్లేకుండా.. ప్రతిపాదిత మొత్తంలోనే ప్రాజెక్టులు పూర్తిచేస్తున్న ఘనత కూడా మహిళలకే దక్కుతోంది. స్ఫూర్తితో ముందుకు పనిలో సాధించిన విజయంతో స్ఫూర్తిని ముందుకు పోవడంలోనూ మహిళలో ముందువరుసలో ఉన్నారు. పనిని విభజన చేసుకుని పూర్తి చేయడంలోనూ వీరిదే పైచేయి. అవకాశవాదంగా వ్యవహరించడంలో మహిళల శాతం తక్కువే. ప్రస్తుత భారతదేశంలో 4,118 ఎమ్మెల్యేలుండగా.. మహిళల సంఖ్య 9% మాత్రమే. 2018 జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం దేశ జనాభాలో మహిళల సంఖ్య 48.5%. ఆ రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యమూ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే. 2013 ఎన్నికల్లో వసుంధరా రాజేని గద్దెనెక్కించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ఈ సారి కూడా మహిళలనే ఆమె నమ్ముకున్నారు. మరి మహిళా ఓటర్లు రాజేను మళ్లీ సీఎం చేస్తారా? వాస్తవానికి ఒకప్పుడు రాజస్తాన్‌లో మహిళలు ఓటరు జాబితాలో కూడా పేరు ఇవ్వడానికి ముందుకురాలేదు. కానీ వసుంధర రాజే ప్రచార శైలి కారణంగా మహిళల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘మన రాష్ట్రంలో రెండే కులాలు ఉన్నాయి. ఒకటి పురుషులు, రెండు మహిళలు. మహిళా సాధికారత కోసం మేము ఎన్నో పథకాలు తెచ్చాం. ఇక మనం ఎవరి ఎదుట చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు’ అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఎన్నికల ర్యాలీల్లో పదే పదే మహిళా ఓటర్లను ఉద్దేశించి చెబుతున్నారు. వసుంధరా రాజేలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఎనలేని ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, మధ్య మధ్యలో జోకులు వేస్తూ, తన సంభాషణా చాతుర్యంతో ఓటర్లను కట్టిపడేస్తుంటారు. ఎన్నికల సభల్లో ఆమె మాట్లాడుతూ ఉంటే మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఆమె ఎన్నికల ర్యాలీలకు మహిళలు పోటెత్తుతున్నారు. రాజే పట్ల ఎనలేని ఆరాధనాభావం కనబరుస్తున్నారు. అయితే అన్ని రంగాల్లోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వసుంధర కేవలం మహిళల అండదండలతో అధికారాన్ని సంపాదించుకోగలరా అన్నది ప్రశ్నే. మరోవైపు కాంగ్రెస్ కూడా మహిళలే తమ తురుపు ముక్కలంటూ ప్రసంగాలు చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళల్ని అందలం ఎక్కిస్తామని, మరో అయిదేళ్లలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సగం వాటిల్లో మహిళల్నే ముఖ్యమంత్రుల్ని చేస్తామంటూ హామీలైతే గుప్పిస్తున్నారు. కానీ సీట్లు విషయానికొచ్చేసరికి మొండిచేయి ఇస్తు్తన్నారు. వెనుకబాటులో మొదటి స్థానం బడికి వెళ్లాల్సిన చిన్నారుల కాళ్లకి మెట్టెలు కనిపిస్తాయి. బంగారం లాంటి బాల్యం నాలుగ్గోడల మధ్య నలిగిపోతుంటుంది. బాల్యవివాహాల్లో ఇప్పటికీ రాజస్థానే టాప్. మహిళలపై అకృత్యాల్లో మూడో స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నలుగురి మధ్యలోకొచ్చి మాట్లాడరు. ఓటరు జాబితాలో పేరు ఇవ్వడానికీ ఇష్టపడరు. ఓటు వెయ్యడానికి వచ్చినా తండ్రి, భర్త, కొడుకు ఎవరికి వెయ్యమంటే వారికే. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత కేవలం 52%. చదువులేకపోవడం, చిన్నప్పుడే సంసార భారాన్ని మోయాల్సి రావడం వల్ల మహిళల్లో చైతన్యం తక్కువ. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలతో వేలి చుక్కే వజ్రాయుధం అన్న సంగతి గ్రహిస్తున్నారు. 2013లో మొదటిసారిగా అత్యధికంగా మహిళలు ఓటు వినియోగించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జలోర్ జిల్లా దాదల్ గ్రామంలో 2013లో మొదటి సారిగా మహిళలు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు. చట్టసభల్లో ఎక్కువే రాజస్థాన్ మహిళల్లో వెనుకబాటు కనిపించినా చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రం ముందువరసలోనే ఉంది. బీహార్ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం రాజస్థానే. మొత్తం 200 స్థానాలున్న అసెంబ్లీలో 2008లో తొలిసారి 29 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ 23 మందికి టిక్కెట్లు ఇస్తే, బీజేపీ 32 మందికి ఇచ్చింది. ఇక 2013లో కాంగ్రెస్ 24 మందికి ఇస్తే, బీజేపీ 26 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 27 మంది మహిళలు ఎన్నికైతే అందులో బీజేపీ నుంచే 23 మంది ఎన్నికయ్యారు. రాజేతో పాటు నలుగురు మంత్రులుగా ఉన్నారు. రాజే పథకాలు అమ్మాయి పుట్టినప్పటి నుంచి యుక్తవయసు వచ్చే వరకు, పెళ్లి నుంచి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేంతవరకు వసుంధర రాజే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం దగ్గర్నుంచి, నిరుపేద మహిళలకు ఉచితంగా మొబైల్ ఫోన్ల వరకు పలు పథకాలు మహిళల మనసుని దోచుకున్నాయి. రాజశ్రీ యోజన , జనని సురక్ష యోజన, మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరేలా భామాషా యోజన, ‘ఈ– సఖి’ పేరుతో డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమం, మహిళలకు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ, ఇలా మహిళలకు అండగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అంతకు ముందు అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నప్పుడు కూడా జనని శిశు సురక్ష యాత్ర, శుభలక్ష్మి యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, రాజే తన పథకాలతో మహిళా ఓటర్లను పూర్తిగా తనవైపు తిప్పుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి మద్దతుతో ఈ సారి రాజే గట్టెక్కుతారా వేచి చూడాల్సిందే. రాజస్థాన్ మొత్తం ఓటర్లు 4.74 కోట్లు మహిళా ఓటర్లు 2.27 కోట్లు - 1972లో వెయ్యి మంది పురుషులకు 723 మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటే 2013 నాటికి వెయ్యి మంది పురుషులకు 899 మంది మహిళలు ఓటు వేశారు. - 2008లో 65% మంది మహిళా ఓటర్లు మాత్రమే ఓటు వినియోగించుకుంటే 2013 వచ్చేసరికి అది 10% పెరిగింది. గత ఎన్నికల్లో 75% మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. (భారత్‌లో మహిళా ఓటర్ల వినియోగం సగటున 65%) మహిళా ఓటర్లు పెరగడం వెనక.. - పెరుగుతున్న అక్షరాస్యత - రాజకీయ వార్తలపై ఆసక్తి పెరగడం - రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరగడం - స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం లాభమెవరికి? మహిళా ఓటర్ల సంఖ్య పెరగడంతో మొదట వీరంతా కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహిళాధ్యక్షులున్న పార్టీకే ఆడవారి ఓట్లు ఎక్కువగా పడ్డాయి. కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, యూపీలో మాయావతి, తమిళనాట జయలలిత, పశ్చిమబెంగాల్లో మమత ఈ వర్గం ఓట్లను సంపాదించుకోగలిగారు. అయితే రాను రానూ వీరిలో వస్తున్న మార్పు కారణంగా ఈ ఓటు బీజేపీవైపు మళ్లుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల పురుషుల్లోనూ, మహిళల్లోనూ సరిసమానమైన ఆదరణ కనిపిస్తున్నట్లు లోక్‌నీతి – సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల మొగ్గు బీజేపీ వైపు పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 30% మహిళలు బీజేపీ వైపు ఉంటారన్న సీఎస్డీఎస్ అంచనా వేసింది. మహిళల క్యూ పెరుగుతోంది దేశవ్యాప్తంగా మహిళల ఓటింగ్ శాతం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) అనే సంస్థ చేసిన పరిశోధనలో మహిళల ఓటింగ్ శాతానికి సంబంధించి ఆసక్తికర అంశాలు తెలిశాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ 65.5% కాగా.. పురుషులు 67% మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. సీఎం అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు మిజోరంలో కాంగ్రెస్, మిజోనేషనల్‌ఫ్రంట్ తరఫున సీఎం అభ్యర్థులుగా పోటీ పడుతున్న లాల్ థన్వాలా, జోరామ్తంగపై పెండింగ్ క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలు వీరిద్దరే కావడం గమనార్హం. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలను గౌహతి హైకోర్టు అందించింది. ఈ కేసులు నిరూపితమైతే ఈ ఇద్దరు జైలు శిక్ష అనుభవించక తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నామినేషన్ పేపర్లలో కొన్ని స్థిరాస్తులను దాచిపెట్టి చూపించారని లాల్ థన్వాలాపై కేసు ఉంది. తనపై ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు థన్వాలా తాజా నామినేషన్ పేపర్లలో వెల్లడించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడనుంది. ప్రతిపక్ష నేత జోరామ్తంగపై రెండు పెండింగ్ కేసులున్నాయి. కుట్ర, విధ్వంసం, సాక్ష్యాల విధ్వంసం, అనైతికంగా అధిక ఆస్తులుండడం తదితరనేరాలు ఈకేసుల్లో పోలీసులు ఈయనపై ఆరోపించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు దాదాపు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఎన్నికలపై 12 లక్షల ట్వీట్లు ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గత వారం రోజుల్లో 12 లక్షల ట్వీట్లు రికార్డయ్యాయని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ట్వీట్లలో వినియోగించేందుకు ఒక ప్రత్యేక ఎమోజీని సైతం అందుబాటులోకి తెచ్చామని ట్విట్టర్ తెలిపింది. ప్రజల్లో ప్రముఖంగా చర్చకు వచ్చే అంశాలకు ప్రాచుర్యం కల్పించే చర్యలు చేపట్టామని తెలిపింది. డిసెంబర్ 23 వరకు ప్రజలు AssemblyElections2018 emoji పేరిట ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ట్వీట్లు చేయవచ్చని తెలిపింది. అన్ని రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్స్ కేటాయించామని ట్విట్టర్ తెలిపింది. వసుంధరా రాజే.. ఫస్ట్ దేశంలోనే వరుసగా అత్యధిక కాలం మహిళా సీఎంగా పనిచేసిన రికార్డును రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఆమె...సోమవారానికి 3,639 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నారు. ఈమె 2,735 రోజులు మహిళా సీఎంగా పనిచేశారు. ఇంకా కొనసాగుతున్నారు. వివిధ దశల్లో ఎక్కువ రోజులు పనిచేసిన సీఎంగా షీలాదీక్షిత్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈమె మొత్తం వివిధ కాలాల్లో 5504 రోజులు సీఎంగా పనిచేశారు. వీధినాటకాలు..ఇంద్రజాల ప్రదర్శనలు.. సోషల్ మీడియాతో ప్రతి ఓటర్ను చేరవచ్చని ప్రతి పార్టీ భావిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ బీజేపీ కొత్తపంథా అవలంబిస్తోంది. నవీన సాంకేతికత ఆధారంగా పనిచేసే సోషల్ మీడియాతో పాటు సాంప్రదాయ రూపాలైన వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనలతో ఓటర్లను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రచారం చేయనుంది. ఇందులో భాగంగా పార్టీ ఆఫీసుకు పలు డ్రామా గ్రూపులను, ఇంద్రజాలికులను పిలిపించి వారిలో సరైనవారిని ఎంచుకొంది. ఇలా ఎంపికైన వారు ఇకమీదట రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పయనమై బీజేపీ ప్రభుత్వం చేపట్టినఅభివృద్ధి పనులను ప్రజలకు వీధినాటకాల రూపంలో వివరించనున్నారు. ఎంతో వడపోత అనంతరం తాను ఎంపికయ్యానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తానని ఒక కళాకారుడు చెప్పాడు. ఈ విధంగా సాంప్రదాయ కళారూపాలను పార్టీ ప్రచారానికి వాడుకోవడం గతంలో కూడా చేశామని బీజేపీ ప్రతినిధి చెప్పారు. వీధినాటకాల కళాకారులతో పాటు ఆరుగురు ఐంద్రజాలికులను కూడా పార్టీ ప్రచారం నిమిత్తం ఎంచుకున్నట్లు చెప్పారు. 2013 ఎన్నికల్లో కూడా చౌహాన్ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు ఇదే తరహాలో మ్యాజిక్ ప్రదర్శకులను ఎంచుకున్నామని, గుజరాత్ గత ఎన్నికల్లో సైతం ఇలా కళారూపాలతో ప్రదర్శనలు జరిపామని పార్టీ వర్గాలు చెప్పాయి. వీటి ద్వారా మరింత ప్రభావంతంగా ప్రజల్లోకి వెళ్తామన్నాయి. -
'రాజే'యోగం కోసం..
రాజస్తాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. సర్వేల్లో వెల్లడవుతున్న అంచనాలు నిజం కాకుండా ఉండేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలుచేస్తోంది. ప్రభుత్వంపై ఐదేళ్లలో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకోవడంతోపాటు.. విపక్షంలో చీలిక తేవడం, సోషల్ ఇంజనీరింగ్, హిందువుల శ్రేయస్సును కోరే ఏకైక పార్టీ బీజేపీయేనన్న భావనను ప్రచారం చేయడం అన్న మూడు అంశాలపై దృష్టిపెట్టారు. డిసెంబర్ 7న ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ వ్యూహాలను అమలుచేసేందుకు కమలనాథులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అనైక్యతపై దృష్టి! ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌లో సహజంగానే అనైక్యత ఎక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది వసుంధరా రాజే వ్యూహం. అందుకే తన ప్రచారంలోనూ కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థే లేరంటూ విమర్శలు చేస్తున్నారు. సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సీఎం పీఠం కోసం ఎలా కొట్లాడుకుంటున్నారో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఇద్దరు తమను తాము సీఎంలుగా ప్రకటించుకుంటూ.. కేబినెట్లను రెడీ చేసుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అటు, బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా తన ప్రచారంలో కాంగ్రెస్ అనైక్యతపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో ఇంకా రాహుల్‌కే అర్థం కావడం లేదంటున్నారు. అశోక్ గెహ్లాట్ సీఎంగా రెండుసార్లు ఎలా విఫలమయ్యారో వివరిస్తున్నారు. అటు బీజేపీ నేతలు కూడా తమ క్షేత్రస్థాయి ప్రచారంలో గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన పైలట్‌పైకి మీనాలను ఎగదోస్తున్నారు. మీనాలు, గుజ్జర్ల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. రాజస్తాన్‌లో కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ప్రజల్లో కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చితిని మరింత ఎక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. మదన్‌లాల్ సైనీ వంటి సాధారణ కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడిగా చేశామని బీజేపీ అంటోంది. సూరజ్ గౌరవ్ యాత్రతో.. ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించేందుకు సీఎం వసుంధర ‘సూరజ్ గౌరవ్ యాత్ర’ పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. సీఎంగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న అపవాదును తొలగించుకుంటూ.. తమ ప్రభుత్వం ఏమేం చేసిందో, చేస్తుందో వివరిస్తున్నారు. నియోజకవర్గం వారిగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, గోవధ నిషేధం, జీఎస్టీ, పెట్రోలుపై రాష్ట్ర ప్రభుత్వ పన్ను తగ్గింపు, రైతులకు రూ.50వేల లోపు రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్‌కు ఏటా పదివేల వరకు సబ్సిడీ వంటి అంశాలను ప్రజలకు వివరిస్తూ వారి అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కొంతమేర తగ్గిందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. రాజస్తాన్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న విషయంలో సీఎం, బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు. సోషల్ ఇంజనీరింగ్‌తో.. ఇన్నాళ్లుగా రాజస్తాన్‌లో బీజేపీకి బలం రాజ్‌పుత్‌లు. ఈసారి వీరు పార్టీకి దూరమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. కనీసం 30 చోట్ల వీరి ప్రభావం ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది. దీంతో వీరిని మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జాట్లకు బీజేపీపై ఉన్న కోపం తగ్గేందుకు 14 మంది జాట్లను షెడ్యూల్ విడుదలకు కొద్దిరోజుల ముందే ఎస్పీలుగా నియమించింది. దీనికి తోడు రాష్ట్రంలో 88% ఉన్న హిందువుల ఓట్లను కాపాడుకునేందుకు యోగి ఆదిత్యనాథ్‌ను సున్నితమైన ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనుంది. గౌరవ్ యాత్ర సందర్భంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో కులసమీకరణాలు, అభ్యర్థి సత్తా ఆధారంగా గెలిచే అవకాశమున్న బీజేపీ అభ్యర్థులతో ఓ జాబితాను తయారుచేశారు. ఇందులో 60 మంది సిట్టింగ్‌లకు చోటు దక్కలేదు. అయితే తన ప్రమేయం లేకుండా రాజే జాబితా రూపొందించడాన్ని అమిత్ షా అంగీకరించడం లేదని సమాచారం. దీనిపై చిక్కుముడి వీడితే అభ్యర్థుల ప్రకటనతోపాటు ప్రచారం మరింత జోరందుకునేందుకు ఆస్కారం ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. వంద మంది ఔట్! బీజేపీ అధిష్టానంతోపాటు పలు సంస్థలు జరిపిన సర్వేల్లో.. బీజేపీకి ప్రస్తుతం ఉన్న 161 మంది ఎమ్మెల్యేల్లో 100 మంది మళ్లీ గెలిచే పరిస్థితుల్లేవని స్పష్టమైంది. దీంతో ఈ స్థానాల్లో కొత్త అభ్యర్థులకోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. నియోజకవర్గానికి ముగ్గురు బలమైన అభ్యర్థులను పరిశీలించి.. అందులో కులం, స్థానికంగా బలం ఆధారంగా ఒకరికి టికెట్ ఇవ్వనుంది. దీనికితోడు టికెట్ రాని వారు రెబెల్స్‌గా పోటీలో ఉండకుండా బుజ్జగింపుల పనులూ ప్రారంభించారు. అయితే కనీసం 15 రిజర్వ్డ్ స్థానాల్లో బీజేపీ నుంచి టికెట్ రాని నేతలు బీఎస్పీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు, రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన 23 మందిలో 15 మంది అసెంబ్లీలో పోటీకి సిద్ధమవుతున్నారు. -
వసుంధర రాజెకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ భూమిని ఎన్హెచ్ఏఐకి విక్రయించి రూ 1.97 కోట్లు స్వీకరించారనే ఆరోపణలపై రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌లకు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఉదంతంలో వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. 2010లో జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వ భూమిని వారు ఎన్హెచ్ఏఐకి విక్రయించే సమయంలో రూ 1.97 కోట్ల పరిహారం పొందారని ఆరోపణలున్నాయి. భూమిని విక్రయించే సమయంలో వసుంధరా రాజె అధికారంలో లేరు. ఆ సమయంలో విపక్ష నేతగా ఉన్న వసుంధర రాజె, ఆమె కుమారుడు కలిసి ధోల్పూర్లోని ధోల్పూర్ ప్యాలెస్ వద్ద 567 చదరపు మీటర్ల భూమిని అక్రమంగా సొంతం చేసకుని దాన్ని ఎన్హెచ్ఏఐకి విక్రయించడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పిటిషన్ ఆరోపించింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ రాజె, ఆమె కుమారుడి నుంచి వివరణ కోరింది. తన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ రాజస్ధాన్‌కు చెందిన న్యాయవాది సృజన శ్రేష్ట సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. -
రాజేకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.. షా వ్యూహమేంటి?
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ (బీహార్ మినహా) ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించిన వ్యూహకర్త, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన సర్వశక్తులను రాజస్థాన్‌లో ధారపోస్తున్నారు. మూడు బీజేపీ పాలిత హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే ఆస్కారముందని పలు ఎన్నికల సర్వేలు సూచిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్ష కానున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్.. మిగతా రెండు రాష్ట్రాలకన్నా రాజస్థాన్‌లోని వసుంధర రాజె ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలులేని వసుంధర రాజెకు రాష్ట్రంలో ఆరెస్సెస్‌తో కూడా సత్సంబంధాలు లేవు. పైగా ఆమె పట్ల ఆరెస్సెస్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో పలుకుబడి కలిగిన పలు కులాలు, వర్గాలకు చెందిన నాయకులంటే కూడా ఆమెకు పడదు. ఆమెతో పడక అనేకమంది బీజేపీ నాయకులే బయటకు వెళ్లారు. మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర సింగ్ సెప్టెంబర్ 22వ తేదీనే బీజేపీకి గుడ్‌బై చెప్పారు. బ్రాహ్మణ శాసన సభ్యుడు ఘన్‌శ్యామ్ తివారీ పార్టీ నుంచి బయటకు వెళ్లి భారత్ వాహిణి పార్టీని ఏర్పాటు చేశారు. జాట్ నాయకుడు, స్వతంత్ర ఎమ్మెల్యే హనుమాన్ బెనివాల్‌కు జాట్లలో మంచి పలుకుబడి ఉంది. ఆయన గత మూడేళ్లుగా వసుంధర రాజెకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్నారు. ఇప్పుడు వారంతా ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సచిన్ పైలట్ ఆమెకు గట్టి పోటీనిస్తున్నారు. ఇటు పార్టీ వారిని, అటు ప్రజా నాయకులను ఎవరిని పట్టించుకోకుండా కేవలం బ్యూరోక్రసిని నమ్ముకొని పాలన సాగిస్తుండడంతో వసుంధర రాజె ప్రభుత్వంపై వ్యతిరేకత మరీ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించడం కోసం అమిత్ షా పదే పదే రాజస్థాన్ వస్తున్నారు. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మంతనాలు జరుపుతూ వ్యూహాలపై వ్యూహాలు రచిస్తున్నారు. అమిత్ షా ప్రోద్బలంతోనే అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని మొన్న శనివారం నాడు వసుంధర రాజె ప్రకటించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నరేంద్ర మోదీ పాల్గొన్న తొలి ఎన్నికల సభలో ఆమె ఈ వాగ్దానం చేయడానికే ఆ రోజున 12.30 గంటలకు జరగాల్సిన విలేకరుల సమావేశాన్ని ఎన్నికల కమిషన్ మూడున్నర గంటలకు వాయిదా వేసిందని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను తెలంగాణతోపాటు డిసెంబర్ ఏడున నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. రాజస్థాన్‌తో పోలిస్తే బీజేపీకి మధ్యప్రదేశ్, ఛత్తీగ్గఢ్లలో పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆ రెండు రాష్ట్రాలో పార్టీ కాస్త వెనకబడినప్పటికీ ముఖ్యమంత్రులుగా శివరాజ్ సింగ్ చౌవాన్, రమణ్ సింగ్‌లనే ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఏ మాత్రం రాణించినా దాని ప్రభావం రాజస్థాన్‌పై పడుతుందన్న ఆశ. ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్ 11 నాటికి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ సోషల్ మీడియా విస్తరించిన నేటి పరిస్థితుల్లో ఓట్ల సరళి తెలిసిపోవడం చాలా తేలిక. నవంబర్ 28న జరిగే మిజోరం ఎన్నికలకు, రాజస్థాన్ ఎన్నికలు జరిగే డిసంబర్ ఏడవ తేదీకి మధ్య ఏకంగా తొమ్మిది రోజుల సమయం ఉంది. అంటే, మిగితా రాష్ట్రాల ఎన్నికలను ముగించుకొని తొమ్మది రోజులు ఒక్క రాజస్థాన్పైనే దష్టిని కేంద్రీకరించేందుకు బీజేపీకి అవకాశం చిక్కింది. ఒక్క రాజస్థాన్ ఎన్నికలనే చివరన పెడితే బాగుండదు కనుక తమకు అంతగా ముఖ్యంగానీ తెలంగాణను ఈ రాష్ట్ర ఎన్నికలతో కలిపారు. తెలంగాణలో బీజేపీకి అంతగా పట్టులేని విషయం, తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే కేంద్రంలో రేపు బీజేపీకే మద్దతిస్తుందని తెలుస్తోంది. రాహుల్ తప్పటడుగువేస్తే..... అన్ని విధాలుగా ఓటమి అంచుకు చేరుకున్న వసుంధర రాజె ప్రభుత్వాన్ని పడకొట్టడం కాంగ్రెస్‌కు పెద్ద కష్టమేమి కాదు గానీ స్వీయ తప్పిదాలకు పేరుపొందిన రాహుల్ నాయకత్వం మళ్లీ అలాంటి తప్పులే చేస్తే కష్టమే అవుతుంది. రాహుల్ గాంధీ అహంకారంతో ‘రాహుల్ వర్సెస్ మోదీ’ అన్న ప్రచారాన్ని తీసుకొస్తే కొంప మునిగే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో వసుంధర రాజె అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నరేంద్ర మోదీ అంతగా వ్యతిరేకత లేకపోగా అంతో ఇంతో గౌరవం ఉంది. అందుకని అమిత్ షా కూడా ‘రాహుల్ వర్సెస్ మోదీ’ ప్రచారం జరగాలని కోరుకుంటున్నారు. అందుకని అమిత్ షా సూచనల మేరకు ఆరెస్సెస్ కార్యకర్తలు వసుంధర రాజెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ నినాదం మనకెందుకని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా ఉండే ‘మోదీ వ్యతిరేక’ నినాదాలు అందుకుంటుందన్నది అమిత్ షా వ్యూహం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు సబంధించి ఇప్పటికే బీఎస్పీకి, ఎస్పీకి దూరమైన రాహుల్ మరో వ్యూహాత్మక తప్పిదం చేయకుండా ఉన్నప్పుడే కాంగ్రెస్‌కు మంచి ఫలితం లభిస్తుంది. -
వాళ్లవి విభజన రాజకీయాలు
అజ్మీర్: అధికారం కోసం ప్రజలను విడదీస్తూ కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని పతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు చెబుతూ, అనుమానాలు పెంచుతూ ప్రజలను భయ పెడుతోందన్నారు. ఆ పార్టీకి అధికారం దక్కనివ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే చేపట్టిన ‘రాజస్తాన్ గౌరవ యాత్ర’ ముగింపు సందర్భంగా శనివారం అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కాలేదు. అధికారంలో ఉండగా ప్రభుత్వ యంత్రాంగంలోనూ చిచ్చుపెట్టింది. పర్యవసానంగా పరిపాలన దెబ్బతింది. ఓటు బ్యాంకు దృష్టితోనే నిధులు కేటాయించడంతో సమగ్ర అభివృద్ధి జరగలేదు. 60 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ఈ దుస్సంప్రదాయాన్ని కొనసాగించింది. అతికష్టంమీద, 60 ఏళ్ల తర్వాత ప్రస్తుతం వ్యవస్థ గాడినపడింది. వారికి మళ్లీ అవకాశం ఇవ్వకండి. కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఒక కుటుంబం. ఆ కుటుంబానికి భజన చేయడం ద్వారానే వారు రాజకీయాలు సాగిస్తున్నారు’ అని పేర్కొన్నా రు. ‘రెండేళ్ల క్రితం సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘సర్జికల్ స్ట్రైక్’ను సైతం కాంగ్రెస్ ప్రశ్నించింది. సైనికులను అగౌరవపరిచింది అని అన్నారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ అంశాల వారీగా ఎందుకు పోరాడటం లేదు? అబద్ధాలు చెప్తూ ప్రజల్లో అనుమానాలను పెంచడమే వారికి ఇష్టం’ అని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు రైతులందరికీ ఉచిత విద్యుత్ అందజేస్తామని రాజస్తాన్ సీఎం వసుంధర ప్రకటించారు. ఎన్నికల కమిషన్ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించటానికి కొద్దిసేపటికి ముందు జరిగిన ‘రాజస్తాన్ గౌరవ యాత్ర’ ర్యాలీలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సత్వరమే నియమావళి అమల్లోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని జనరల్ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులందరికీ పరిమితికి లోబడి ఉచిత కరెంటు అందజేసే పథకాన్ని 5న ప్రారంభించామన్నారు. ఈ పథకం అన్నదాతల ఆదాయం పెరిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గృహానికి విద్యుత్ సౌకర్యం కల్పించిందని తెలిపారు. రూ.40 వేల కోట్లతో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచామన్నారు. విద్యుత్ సౌకర్యమే లేని గ్రామాల్లో సైతం ప్రస్తుతం 20 నుంచి 22 గంటలపాటు నిరాటంకంగా కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. -
‘ఆయన వస్తే.. ఆమె వెళ్లిపోతున్నారు’
జైపూర్ : బీజేపీలోలాగా తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తమ నాయకులంతా ఒకే మాటకు కట్టుబడి ఉంటారని రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ అన్నారు. ఆదివారం రాజసమండ్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సభలో ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి వసుంధర రాజేకి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకి మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. అమిత్ షా పాల్గొన్న మీటింగ్‌లో వసుంధర రాజె పాల్గొనరని, ఆమె పాల్గొన్న సభలో అమిత్ షా పాల్గొనరని విమర్శించారు. ఆయన వస్తే.. ఆమె వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా ప్రతిసారి పశ్చిమ బెంగాల్, అస్సాం, కశ్మీర్ రాష్ట్రాల గురించే మాట్లాడుతారు కానీ, రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి ప్రస్తావించరని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదనడానికి అమిత్ షా ప్రసంగాలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ఉద్యోగులు ధర్నాకి దిగినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరుగలేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. సులభంగా రైతులకు రుణాలు అందేలా చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేయని వసుంధర రాజే ప్రభుత్వాన్ని గద్దె దింపి తమకు అవకాశం కల్పించాలని సచిన్ ప్రజలను కోరారు. -
సీఎం యాత్ర అంత ఖరీదా..!
జైపూర్ : పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంటూ రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వసుంధర రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ్ యాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ నెల 4 నుంచి10 వరకు ఉదయ్‌పూర్ డివిజన్లోని 23 నియోజకవర్గాల్లో వసుంధర పర్యటించారు. ఈ యాత్రకు ప్రభుత్వం ప్రజల సొమ్మను దుర్వినియోగపరుస్తోందని, ఇప్పటి వరకు ఎంత మొత్తం ఖర్చు చేశారో తెలియాజేయాలని రాజస్తాన్ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన హైకోర్టు బెంచ్ దీనిపై అఫడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు రోజుల సీఎం యాత్రంలో కోటీ పదిలక్షల రూపాయాలను ఖర్చు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ హైకోర్టుకు తెలిపారు. యాత్రలో భాగంగా టెంట్‌కు 38.98 లక్షలు, బ్యానర్స్‌కు 25.99 లక్షలు చొప్పున ఖర్చు చేసినట్లు సైనీ వెల్లడించారు. సీఎం ఉపయోగించే పెన్‌డ్రైవ్ కోసం ఏకంగా 16వేలు, పాటల కోసం 3.50 లక్షలు ఖర్చు చేసినట్లు అఫడవిట్లో సైనీ తెలియజేశారు. వసుంధర ఖర్చు పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రజల సొమ్మును పార్టీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన సైనీ ఈ యాత్ర పార్టీ కార్యక్రమాల్లో ఓ భాగమని, దీని ఖర్చు మొత్తం పార్టీ యూనిట్ నేతలే చెల్లిస్తున్నారని తెలిపారు. కాగా వసుంధర తదుపరి యాత్ర ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు 165 నియోజకవర్గాల్లో 6000 కిలోమీటర్లు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. -
మూక హత్య కేసులో మరో ట్విస్ట్
జైపూర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ మూక హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో గత శుక్రవారం రక్బర్ ఖాన్ (28) అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో అతను మరణించిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల నిర్లక్ష్యమే బాధితుడి మృతికి కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ అక్బర్ ఖాన్‌ను సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రికి తరలించకుండా బాధితుడిని 3గంటల 45 నిమిషాల పాటు పోలీస్ కస్టడీలో ఉంచారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో కేసును స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్‌కు బదిలీ చేసినట్లు, పోలీసుల నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు జైపూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ హేమంత్ ప్రియదర్శి తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. దాడి జరిగినట్లు పోలీసులకు అర్థరాత్రి 12.41 సమాచారం ఇచ్చామని, వారు 1,20కు ఘటనాస్థలికి వచ్చినట్లు స్థానిక మానవ హక్కుల కార్యకర్త నవల్ కిషోర్ తెలిపారు. బురదతో ఉన్న బాధితుడు రక్బర్ ఖాన్‌కు పోలీసులు స్నానం చేయించారని, అనంతరం తన ఇంటికి వచ్చి ఆవులను తరలించడానికి వాహనం ఏర్పాటు చేయమని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో పోలీసులు బాధితుడిపై చేయిచేసుకున్నట్లు కిషోర్ కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు. అతను అప్పుటికి బతికే ఉన్నాడని కూడా తెలిపారు. మరోవైపు బాధితుడు గాయాలతో అరుస్తున్నా.. పోలీసులు పట్టించుకోకుండా టీ తాగుతూ కాలక్షేపం చేశారని కిషోర్ పేర్కొన్నారు. అనంతరం తను ఆవులను గోశాలకు తీసుకెళ్లానని, పోలీసులు బాధితుడిని స్టేషన్ తీసుకెళ్లారని చెప్పారు. ఇక ఆసుపత్రి డాక్టర్‌ను సంప్రదించగా.. పోలీసులు బాధితుడి తీసుకొచ్చేలోపు అతను మరణించాడని స్పష్టం చేశారు. రక్బర్ ఖాన్, అతని స్నేహితుడు అస్లాం లాడ్‌పూర్‌లో రెండు ఆవులను కొనుగోలు చేసి, హరియాణాలోని కొల్గాన్‌కు తీసుకువెళ్తుండగా.. అల్వార్ జిల్లాలోని లాలావండి అటవీ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. అస్లాం వారి నుంచి తప్పించుకోగా రక్బర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే బాధితుడి మరణానికి పోలీసులు కూడా కారణమని ఆరోపణలు రావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇప్పటికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ ఘటన పట్ల సీరియస్‌గా ఉన్నారు. గతంలో కూడా గోరక్షణ పేరిట అల్వార్ జిల్లాలో ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పాలరైతు పెహ్లూ ఖాన్ గతేడాది ఏప్రిల్‌లో చనిపోగా.. అతని బంధువు ఉమర్ అహ్మద్ నవంబర్‌లో మృతిచెందాడు. చదవండి: రాజస్తాన్‌లో మూక హత్య.. -
వసుంధరే రాజస్తాన్ సీఎం అభ్యర్థి
జైపూర్: రాబోయే రాజస్తాన్ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధరా రాజేనే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. భారీ మెజారిటీతో గెలిచి ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పారు. జైపూర్‌లో శనివారం ముగిసిన రెండురోజుల రాష్ట్ర బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పేదల అభ్యున్నతి కోసం గత నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని గడువులోగా(2022 నాటికి) చేరుకుంటామని షా విశ్వాసం వ్యక్తం చేశారు. చివరిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని వసుంధరా రాజే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లనూ కైవసం చేసుకుంటామని చెప్పారు. జైపూర్‌లో శనివారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కుమారుడి వివాహానికి షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ హాజరయ్యారు. -
అత్యంత అమానుషంగా కొట్టి చంపారు
జైపూర్ : గోరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు హెచ్చరించినా అలాంటి దాడులు మాత్రం ఆగడం లేదు. రాజస్థాన్‌లో ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే నెపంతో ఇద్దరి యువకులపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తప్పించుకున్నారు. గత అర్ధరాత్రి మృతుడు అక్భర్(28), అస్లామ్ అనే మరో వ్యక్తితో ఆవులను తీసుకెళ్తుండగా.. రామ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్వార్ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో భయాందోళనలకు గురైన ఆ యువకులు ఆవులను వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు వారిని వెంబడించి మరీ అక్బర్‌ను పట్టుకోగా.. అస్లామ్ తప్పించుకున్నాడు. అక్భర్పై మూకుమ్మడిగా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడి, మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఆ రెండు ఆవులను సమీప గోశాలకు తరలించామని, ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసునమోదు చేశామన్నారు. అయితే మృతుడు హర్యానాకు చెందినవాడని, ఆవుల అక్రమ రవాణకు పాల్పడ్డారా లేదా అనే విషయం తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గతంలో కూడా గోరక్షణ పేరిట అల్వార్ గ్రామంలో ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పాలరైతు పెహ్లూ ఖాన్ గతేడాది ఏప్రిల్‌లో చనిపోగా.. అతని బంధువు ఉమర్ అహ్మద్ నవంబర్‌లో మృతిచెందాడు. చదవండి: గోరక్షణ దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
కాంగ్రెస్‌ది బెయిలు బండి
జైపూర్: కాంగ్రెస్ పార్టీని ఇప్పుడంతా ‘బెయిలు బండి’ అని పిలుస్తున్నారనీ, ఆ పార్టీలో పెద్దపెద్ద నేతలుగా చెప్పుకుంటున్న వారంతా ఇప్పుడు బెయిలుపై బయట ఉన్నారంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆర్మీ సామర్థ్యాన్నే శంకిస్తోందనీ, ఆ పార్టీ దురుద్దేశాలు ప్రజలందరికీ తెలుసునని మోదీ విమర్శించారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో ఒకటైన రాజస్తాన్‌లో మోదీ శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. జైపూర్‌లో జరిగిన ఈ ర్యాలీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు హాజరయ్యారు. ‘ఆర్మీ సామర్థ్యాలను శంకించడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు పాపానికి ఒడిగట్టారు. ఎన్నడూ ఇలా జరగలేదు. ఇలాంటి రాజకీయాలు చేసే వారిని ప్రజలు క్షమించరు’ అంటూ కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. 2,100 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన రాజస్తాన్‌లో పర్యటన సందర్భంగా మోదీ రూ. 2,100 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. రాజస్తాన్‌లోని బర్మార్ ముడిచమురు శుద్ధి కర్మాగారానికి కాంగ్రెస్ శంకుస్థాపన చేసినా, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ పనులు వేగం పుంజుకున్నాయన్నారు. పర్బాతీ–కాళీసింధ్–చంబల్ నదుల అనుసంధానాన్ని జాతీ య ప్రాజెక్టుగా చేపట్టాలని వసుంధర రాజే కోరగా మోదీ సానుకూలంగా స్పందించారు. బీజేపీ పేరు వింటే కలవరం.. ‘బీజేపీ పేరు వింటే కొంత మంది కలవరపడతారు. మోదీ లేదా వసుంధర రాజేల పేర్లను ఎవరైనా ప్రస్తావిస్తే వారికి జ్వరం పట్టుకుంటుంది. అలాంటి వారికి ఈ ర్యాలీలంటే అసహ్యం. కానీ వీటితోనే ప్రభుత్వ పథకాల గురిం చి అందరికీ తెలుస్తుంది’ అంటూ మోదీ కాం గ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ర్యాలీ లో రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, సీఎం వసుంధర రాజే, తదితరులు పాల్గొన్నారు. దివ్య శక్తులున్నాయి.. వేదికను పేల్చేస్తా మోదీ ర్యాలీ వేదికను పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ‘నాకు దివ్య శక్తులున్నాయి. వేదికను పేల్చేస్తా’ అని బెదిరించాడు. వెంటనే ఫోన్ నంబర్ ద్వారా అతణ్ని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. మరోవైపు మోదీ సభ కోసం వచ్చిన వారిలో నల్ల దుస్తులు ధరించిన లేదా నలుపు రంగు వస్త్రం కలిగిన వారిని లోపలికి అనుమతించలేదు. ఎవరైనా నల్ల రంగు వస్త్రంతో నిరసన తెలుపుతారనే అనుమానంతో భద్రతాధికారులు ఈ ముందస్తు చర్య తీసుకున్నారు. బీజేపీ అవినీతిపరులు జైలుకే: కాంగ్రెస్ న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడుతున్న బీజేపీ మంత్రులు, నేతలను మోదీ కాపాడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ నేతలపై ఉన్న కేసులను విచారించి, శిక్ష పడేలా చేస్తామంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకుసహా అనేక మంది బీజేపీ మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా, మోదీ అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ దుయ్యబట్టారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 20 లక్షల కోట్ల విలువైన జీఎస్పీసీ కుంభకోణం జరిగిందన్నారు. -
వసుంధర, అమిత్ షా మధ్యన రాజీ
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి 74 ఏళ్ల మదన్ లాల్ సాహినిని నియమించడంతో ఈ విషయమై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు గత మూడు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడినట్లయింది. గత ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో జరిగిన రెండు కీలకమైన లోక్‌సభ, ఒక అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయం పొందడంతో అప్పటి వరకు రాష్ట్ర పార్టీ చీఫ్, వసుంధర రాజే వీర విధేయుడు అశోక్ పర్నామీని రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది. దాంతో ఆయన ఏప్రిల్ నెలలోనే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ చీఫ్ విషయంలో అమిత్ షాకు, వసుంధర రాజెకు రాజీ కుదరక పోవడంతో ఆ పోస్టు ఇంతకాలం ఖాళీగానే ఉండిపోయింది. అశోక్ రాజీనామా నుంచి ఆ పదవికి జోద్పూర్ ఎంపీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫ్రంట్ రన్నర్‌గా ఉంటూ వచ్చారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిత్వాన్ని ఆరెస్సెస్ కూడా సమర్థించింది. వివాదాస్పద ‘పద్మావత్’ సినిమా విడుదల విషయంలో సరిగ్గా వ్యవహరించని వసుంధర రాజె పట్ల కోపంతో ఉన్న రాజ్‌పుత్ వర్గాన్ని మెప్పించడం కోసం షెకావత్ పేరును అమిత్ షా తీసుకొచ్చారని అప్పుడు అందరూ భావించారు. అయితే ఆయన ప్రతిపాదనను వసుంధర రాజె తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్‌పుత్‌లకు పార్టీ రాష్ట్ర చీఫ్ పదవినిస్తే జాట్లను దూరం చేసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. చారిత్రకంగా రాజ్‌పుత్‌లకు, జాట్లకు పడదు. రాజ్‌పుత్, జాట్లకు చెందిన వారు కాకుండా ఇతర వర్గాలకు చెందిన వారిని తీసుకోవాలని వసుంధర రాజె డిమాండ్ చేయడంతో షెకావత్ ప్రతిపాదనను అమిత్ షా వదులుకోవాల్సి వచ్చింది. చివరకు మూడు నెలల సుదీర్ఘ మంతనాల అనంతరం మదన్ లాల్ సాహిని విషయంలో ఇరువురు నాయకులు ఓ అంగీకారానికి వచ్చారు. పార్టీ పాతకాయిన మదన్ లాల్ సాహినీ ఆరెస్సెస్ మద్దతుదారు. రాష్ట్రంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాయాలు పనిచేశారు. సికార్ జిల్లాకు చెందిన ఆయన ఇటీవలనే ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ జూలై ఏడవ తేదీన రాష్ట్ర రాజధాని జైపూర్ వస్తున్నందున ఆయన వచ్చే నాటికి ఎలాగైనా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న లక్ష్యాన్ని నెరవేర్చారు. రాజస్థాన్‌కు ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెల్సిందే. -
బీజేపీని కలవరపెడుతున్న రాజస్తాన్ పరిణామాలు
జైపూర్ : రాజస్తాన్‌లో జరుగుతన్న రాజకీయ పరిణామాలు బీజేపీని కలవరానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే పార్టీకి రాజీనామ చేసిన సీనియర్ ఎమ్మెల్యే ఘన్‌శ్యామ్ తివారీ ప్రభత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం పార్టీని ఇబ్బందులోకి నెట్టింది. చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తు వస్తున్న ఘన్‌శ్యామ్ తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయల్లో మరింత వేడిని రగిలించాయి. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వసుంధర రాజే పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అగ్ర కులాలకు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నించడం లేదని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో అపక్రటిత ఎమర్జెన్సీ అమల్లో ఉందన్నారు. ఇంతకాలం బీజేపీలో కొనసాగిన ఘన్‌శ్యామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఏడాది రాజస్తాన్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలపై అధినాయకత్వం జోక్యం చేసుకోకపోవడం పార్టీ శ్రేణులను అభద్రత భావానికి గురిచేస్తోంది. దళిత, మైనార్టీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీఎస్పీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. మరోపక్క ఘన్‌శ్యామ్ కుమారుడు అఖిలేశ్ భారత్ వాహిని పార్టీ పేరుతో 200 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘన్‌శ్యామ్ గత ఎన్నికల్లో(2013) రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. -
కోటలో లక్ష మందితో...
కోట/జైపూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డుకెక్కింది. యోగా గురు రామ్‌దేవ్ సారథ్యంలో గురువారం కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఒకేసారి 1.05 లక్షలకు పైగా ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించి రాజస్తాన్ ప్రభుత్వం, పతంజలి యోగా పీఠ్, కోట జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు నెలకొల్పాయి’ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది. గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్‌ను సీఎం రాజే, రామ్‌దేవ్‌లకు అందజేశారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 6.30 నుంచి 7 గంటల వరకు 15 రకాల యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు రెండు లక్షలకు పైగా ప్రజలు కోటలోని ఆర్ఏసీ గ్రౌండ్‌కు తరలివచ్చారు. 2017లో మైసూర్లో 55,524 మంది యోగాసనాలు వేసి రికార్డు సృష్టించగా తాజాగా ఆ రికార్డును కోట అధిగమించింది. రాజస్తాన్‌లోని ప్రతి జిల్లాలో ‘ఆచార్య’ పేరుతో యోగా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వసుంధరా రాజే ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్లో రవిశంకర్ బెంగళూరు: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ పాల్గొన్నారు. బెల్జియంలో భారత రాయబార కార్యాలయం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, యూరోపియన్ పార్లమెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఎంబసీ అధికారులు, 250 మంది పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసంగిస్తూ..నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన సమస్యలైన విద్వేషం, కుంగుబాటును యోగా మాదిరిగా మరే మార్గం పరిష్కరించలేదని అన్నారు. -
బిగ్ బీ అస్వస్థతకు కారణం ఇదే...
న్యూఢిల్లీ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా షూటింగ్లో మంగళవారం అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. బిగ్ బీ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడుతుండగా ఆయన భార్య జయాబచ్చన్ మాట్లాడుతూ ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ‘ఈ సినిమాలో పాత్ర కోసం అమితాబ్ కోసం ప్రత్యేక దుస్తులు రూపొందించారు. అవి చాలా బరువుగా ఉన్నాయి. ఈ దుస్తులను ధరించడం వల్లే అమిత్‌జీకి వెన్ను నొప్పి, మెడనొప్పి వచ్చాయి, తప్ప ఆయనకు వేరే ఆరోగ్య సమస్యలు ఏమి లేవు’ అని జయాబచ్చన్ తెలిపారు. కాగా అస్వస్థతకు గురైన అమితాబ్‌కు చికిత్స చేసేందుకు ముంబాయి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం జోథ్‌పూర్ వచ్చింది. కాగా బిగ్ బీ త్వరగా కోలుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విట్ చేశారు. బిగ్ బీ ప్రస్తుతం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’తో పాటు ‘102 నాట్ అవుట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు రిషికపూర్ కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది మేలో ‘102 నాట్ అవుట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అప్రమత్తమైన వసుంధరా రాజే
సాక్షి, జైపూర్ : ఉప ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అప్రమత్తమయ్యారు. తన కుర్చీకే ఎసరుపడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఆమె నేతృత్వంలో పార్టీ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. ‘‘ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది. అందుకే అప్రమత్తమయ్యాం. అభివృద్ధి పనులు జరుగుతున్నా ఇంత దారుణమైన ఫలితం ఎందుకొచ్చిందో సమీక్షించబోతున్నాం’’ అని సమావేశానికి ముందు ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాది ఎన్నికలు ఉన్న ఆమె నేపథ్యంలో సమావేశంలో నేతలకు ధైర్యాన్ని నూరిపోసినట్లు సమాచారం. ఓటమి గురించి వదిలేయండి. అధైర్య పడవద్దు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి. ఎట్టి పరిస్థితుల్లో విజయం మనదే కావాలి అని నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటమికి బాధ్యుల్ని చేస్తూ సీఎం వసుంధర రాజేతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణమిని మార్చాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా, ఫిబ్రవరి 1న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా అజ్మీర్, అల్వార్ లోక్ సభ స్థానాలను, మండల్‌గఢ్ శాసన సభ సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమితో బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీఎం వసుంధరా రాజే రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. -
వసుంధర కుర్చీకి ఎసరు?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ కంగుతింది. ఆ అవమానకర ఓటమి నుంచి ఇంకా తేరుకోని కమలం పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ ఓటమికి బాధ్యుల్ని చేస్తూ రాబోయే రోజుల్లో సీఎం వసుంధర రాజేను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణమిని మార్చాలనే ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. 1999 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాజస్తాన్ పెట్టని కోటగా ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తోన్న ప్రస్తుత తరుణంలో 3 స్థానాల్ని చేజార్చుకోవడం బీజేపీనీ కలవరానికి గురిచేస్తోంది. అల్వార్ లోక్‌సభ స్థానంలో దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడంపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడిని అమిత్ మందలించినట్లు తెలుస్తోంది. అర్జున్ మేఘ్వాల్తో అమిత్‌షా చర్చలు రాజస్తాన్ పరిణామాలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్తో అమిత్ షా శనివారం దాదాపు గంటకుపైగా చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రత్యామ్నాయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి నుంచి వసుంధర రాజేను తప్పిస్తే ఆమె వర్గం ఎలా స్పందిస్తుందోనన్న ఆందోళనలో బీజేపీ నాయకత్వం ఉంది. తనను తప్పించే ప్రయత్నాలు చేస్తే ధీటుగా స్పందిస్తానని ఇప్పటికే వసుంధరా రాజే అధినాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఆమె వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారన్న దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. పార్టీలోని కొందరు సీఎం పదవికి అర్జున్ మేఘ్వాల్ పేరుపై ఆసక్తి చూపుతుండగా.. జాట్ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి చౌదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అమిత్ షాకు సన్నిహితుడిగా పేరుపడ్డ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపిందర్ యాదవ్ పేరుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో సీఎం మార్పుతో పార్టీకి నష్టం జరవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్
-
కమల దళానికి దిమ్మతిరిగింది!
జైపూర్: ఈ ఏడాది ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరిగిన కీలకమైన ఉప ఎన్నికల్లో కమలదళానికి చుక్కెదురైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని మండల్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో విజయకేతనం ఎగరవేసింది. అలాగే అజ్మీర్, అల్వార్ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ మూడు స్థానాల్లో విజయం.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఈ విజయంతో జైపూర్‌లోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం సంబరాలతో కోలాహలంగా మారగా.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం జనంలేక వెలవెలపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక.. తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో రెండు లోక్‌సభ స్థానాలు ఆ పార్టీ కైవసం చేసుకోబోతుండటం గమనార్హం. ఉప ఎన్నికలు జరిగిన ఈ మూడు స్థానాలు అధికార బీజేపీవే.. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు సన్వర్ లాల్ జాట్ (అజ్మీర్), మహంత్ చంద్ నాథ్ యోగి (అల్వార్), సిట్టింగ్ ఎమ్మెల్యే కీర్తి కుమారీ (మండల్‌గఢ్) చనిపోవడంతో ఉప ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడు నెలల ముందు జరిగిన ఈ ఉప ఎన్నికలను అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ పోరుకు సెమీఫైనల్‌గా భావించి.. సీఎం వసంధరారాజే, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ హోరాహోరీగా ప్రచారం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అజ్మీర్ సీటు నుంచి కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ పరాజయం పాలవ్వగా.. ఈసారి ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ లంబాపై కాంగ్రెస్ అభ్యర్థి రఘు శర్మ భారీ మెజారిటీతో గెలుపొందగా.. అల్వార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌సింగ్ యాదవ్.. బీజేపీ అభ్యర్థి జస్వంత్‌సింగ్ యాదవ్‌పై విజయం సాధించారు. రాహుల్ గాంధీ కీలక అనుచరులుగా భావించే సచిన్ పైలట్, సీపీ జోషీ, జితేంద్రసింగ్ భన్వర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ పార్టీ విజయానికి కృషి చేశారు. -
వెనక్కి తగ్గిన వసుంధరా రాజే!
జైపూర్: సర్వత్రా విమర్శల నేపథ్యంలో క్రిమినల్ లా బిల్లుపై వసుంధరా రాజే ప్రభుత్వం వెనుకకు తగ్గింది. వివాదాస్పద ఈ బిల్లును అసెంబ్లీ సెలక్ట్ కమిటీకి నివేదిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ప్రజాసేవకులపై ఆరు నెలలపాటు విచారణ జరపకుండా రక్షణ కల్పిస్తూ.. రాజస్థాన్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా సేవకులు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లును సోమవారం విపక్షాల ఆందోళనల నడము అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సర్వత్రా విమర్శల నేపథ్యంలో సీఎం వసుంధరా రాజే పునరాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై వివాదం మరింత ముదరకుండా ప్రభుత్వం సెలక్ట్ కమిటీకి బిల్లును నివేదించినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోగా బిల్లును పరిశీలించి..సిఫారసులు చేయాలని కమిటీని ప్రభుత్వం కోరింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ప్రభుత్వ సిబ్బందిపై ముందస్తు అనుమతి లేకుండా విచారణ జరపకూడదంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం 180 రోజులపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాసేవలకులపై విచారణ చేపట్టకూడదు. సదరు అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా మీడియా కథనాలు ప్రచురించడానికి వీల్లేదు. ఈ మేరకు మీడియాపై సైతం ఆంక్షలు ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టంలో హెచ్చరించారు. అవినీతి అధికారులపై మీడియా, విచారణాధికారుల చేతులు కట్టేసేలా తీసుకొచ్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బిల్లు ద్వారా అవినీతిని వ్యవస్థీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మండిపడిన సంగతి తెలిసిందే. -
అవినీతికి రాజస్తాన్ రక్ష!
మీడియా గొంతు నులమాలనుకునేవారు దేశంలో ఈమధ్య ఎక్కువయ్యారు. ఆ జాబితాలో తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా వచ్చి చేరారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలనాడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు బిగించి దాని పర్యవసానాలు అనుభవించారు. అయినా ఏదో రూపంలో మీడియాను అదుపు చేయాలన్న యావ పాలకుల్లో పోలేదు. అయితే వసుంధర ఈ మాదిరి పాలకు లందరినీ తలదన్నారు. మీడియా గొంతు నొక్కడమే కాదు... అసలు అవినీతికి వ్యతిరేకంగా ఎవరూ పోరాడే అవకాశమే లేకుండా నేర శిక్షాస్మృతికి సవరణలు తెస్తూ గత నెల 7న ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. నిరసనలు వెల్లువెత్తుతున్నా ఖాతరు చేయకుండా సోమవారం ఆ ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దాని ప్రకారం సర్వీసులో ఉన్న లేదా రిటైరైన అధికారులు, న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలొస్తే ప్రభుత్వం అనుమతి మంజూరు చేసేవరకూ వాటిపై ఎలాంటి దర్యాప్తూ జరపకూడదు. ఆ అవినీతి ఆరోపణల గురించి మీడియా సంస్థలేవీ మాట్లాడకూడదు. ఆరోపణలపై దర్యాప్తు అవసరమో కాదో ప్రభుత్వం ఆర్నెల్ల వ్యవధిలోగా నిర్ణయిస్తుందట. ఆ సమయం దాటితే దర్యాప్తునకు ప్రభుత్వం అంగీ కరించినట్టే భావించవచ్చునట! గతంలో కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్నప్పుడు ఈ మాదిరి బిల్లునే రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నీతిమంతులైన అధికారులను కాపాడటానికే బిల్లు తీసుకొస్తున్నట్టు అప్పట్లో ఆ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అలాంటి ఆరోపణలొచ్చిన ప్రభుత్వ లేక రిటైర్డ్ అధికారుల, న్యాయమూర్తుల పేర్లను మీడియా వెల్లడించకూడ దంటూ ఆంక్షలు పెట్టింది. దాన్ని ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకూ జైలుశిక్ష విధించేం దుకు వీలు కల్పించింది. నేర శిక్షాస్మృతిలో చేర్చిన సెక్షన్ 156(3), సెక్షన్ 190(1)ల ప్రకారం పబ్లిక్ సర్వెంట్ అన్న పదానికిచ్చిన నిర్వచనాలకు అవధుల్లేవు. ప్రస్తుత లేదా పదవీకాలం పూర్తయిన పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌లు, సహకార సంస్థల కార్యనిర్వాహకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశ్వవిద్యాలయ అధికారులు, న్యాయ మూర్తులు, మేజిస్ట్రేట్లు తదితరులంతా ఈ నిర్వచనాల పరిధిలోకొస్తారు. ఇప్పుడు అనుసరిస్తున్న ప్రక్రియ ప్రకారం కేసు పెట్టదగిన నేరం జరిగిందని భావించినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ వెంటనే నేరంపై దర్యాప్తు ప్రారంభిస్తారు. అది పూర్తయ్యాక సంబంధిత కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తారు. ఆ చార్జిషీటును పరిశీలించి ముద్దాయిపై విచారణ ప్రారంభించడానికి తగిన ఆధారాలున్నాయో లేదో మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు.ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించిన పక్షంలో ఎవరైనా జిల్లా ఎస్పీని ఆశ్రయించ వచ్చు లేదా దర్యాప్తు జరపమని పోలీసుల్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ మేజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమాన్నంతటినీ రాజస్థాన్ ప్రభుత్వం కాలరాసింది. అసలు దర్యాప్తు కోసమే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటున్నది. ఆఖరికి మేజిస్ట్రేట్ అయినా సరే దీనికి లోబడవలసిందే! అది అవసరమో కాదో తేల్చడానికి ప్రభుత్వం ఆర్నెల్ల గడువు కోరుతోంది. ఈ నిబంధనల వరస గమనిస్తే బిల్లు రూపొందించినవారికి ఇంగిత జ్ఞానం కొరవడిందా లేక ఎవరేమనుకుంటే మనకేమిటన్న తెగింపు తలకెక్కిందా అన్న అనుమానం రాకమానదు. ఈ బిల్లు చట్టమైతే పోలీసులు మాత్రమే కాదు... లోకాయుక్త వంటి సంస్థ సైతం అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టడం అసాధ్యం. పైగా ఈ బిల్లులో న్యాయ వ్యవస్థను కూడా చేర్చి దానికి సైతం మకిలి అంటించే పనిచేశారు. మేజి స్ట్రేట్లపైనా, న్యాయమూర్తులపైనా ఆరోపణలొస్తే ఏంచేయాలన్న అంశంలో న్యాయవ్యవస్థకు వేరే విధానాలున్నాయి. దాన్ని గురించిన కనీస అవగాహన బిల్లు రూపొందించినవారికి కొరవడిందని అర్ధమవుతుంది. నిజాయితీపరులైన అధి కారులు అనవసర నిందల వల్ల వ్యధ చెందకూడదన్న సదుద్దేశంతో బిల్లు తీసు కొచ్చామని వసుంధర సర్కారు పైకంటున్నా అవినీతిపరులైనవారిని కాపాడేందుకే దీన్ని ప్రవేశపెట్టారని ఎవరికైనా అనిపిస్తుంది. తమపై ఆరోపణలొచ్చాయని తెలి యగానే ఎవరైనా చేతులు ముడుచుకుని కూర్చోరు. వెనువెంటనే రంగంలోకి దిగి ఆధారాలన్నీ మటుమాయం చేసే ప్రయత్నాలు మొదలెడతారు. అలాంటివన్నీ తీరిగ్గా చక్కబెట్టుకునేందుకు రాజస్థాన్ బిల్లు వీలు కల్పిస్తోంది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తోంది. అవినీతి ఆరోపణ లొచ్చినప్పుడు దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరమన్న నిబంధనను మూడేళ్లక్రితమే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పాలన పారదర్శకంగా ఉండాలని, ఏం జరుగుతున్నదో ప్రజలకు తేటతెల్లం కావాలని అందరూ ఘోషిస్తున్న తరుణంలో పాలకులకు ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చినట్టు? ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లోనూ అవినీతి పెరిగిపోయిందని నాలుగేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వందలాది అవినీతి కేసుల్లో దర్యాప్తు సాగుతున్నా శిక్షలు పడిన కేసులు స్వల్పం. ఈమధ్య కాలంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అవినీతి ఆరోపణల కారణంగా అరెస్టు చేయాల్సివచ్చింది కూడా. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇదంతా కొంప ముంచుతుందన్న భయం ప్రభుత్వాన్ని వెన్నాడుతోంది. పర్యవసానంగానే ఆర్డినెన్స్, ఆ తర్వాత బిల్లు పుట్టుకొచ్చాయి. ఈ నిబంధనలే అమలైతే బోఫోర్స్ కేసు మొదలుకొని 2 జీ స్కాం, బొగ్గు కుంభకోణం వరకూ ఏదీ బయటికొచ్చేది కాదు. అసలు అన్నా హజారే ఉద్యమమే ఉండేది కాదు. ఆ కుంభకోణాలనూ, వాటిపై వెల్లువెత్తిన నిరసనలనూ ఆసరా చేసుకునే అధికారంలోకి రాగలిగామన్న సంగతిని బీజేపీ పెద్దలైనా వసుంధర రాజే సింధియాకు గుర్తుచేయాలి. అవినీతి రహిత పాలన అందించాల్సింది పోయి, ఆ అవినీతికి ముసుగు కప్పే, మీడియా గొంతు నొక్కే ఇలాంటి అనాగరిక చర్యలకు ఎంత త్వరగా స్వస్తి పలికితే అంత మంచిదని గ్రహించాలి. -
ఇది 1817 కాదు..
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ముందస్తు అనుమతి లేకుండా జడ్జీలు, మేజిస్ట్రేట్లు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి విచారణ చేపట్టరాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్లో తీవ్రంగా మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి గారూ, మీకు వినయంగా తెలియజేసేది ఏంటంటే.. మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. ప్రస్తుతం నడుస్తున్నది 2017 అంతేతప్ప 1817 కాదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతోపాటు ‘రాజస్తాన్ ఆర్డినెన్స్ వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకమంటున్న న్యాయ నిపుణులు’ అని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని జతచేశారు. తాజాగా రాజస్తాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం సంబంధిత అధికారుల నుంచి అనుమతి లభించేంతవరకు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగుల విచారణపై మీడియా ఎలాంటి వార్తలు ప్రచురించరాదు. ఈ చట్టం ప్రకారం అనుమతులు పొందడానికి 6 నెలలు పడుతుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ స్పందిస్తూ.. ఈ ఆర్డినెన్స్ ద్వారా అవినీతిపరులను రక్షించి మీడియా గొంతు నొక్కడానికి ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. -
టార్గెట్ వసుంధర రాజె
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తరచూ పంచ్‌లు పేల్చుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాజాగా రాజస్థాన్ సీఎం వసుంధర రాజెను టార్గెట్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లపై విచారణ చేపట్టరాదన్న రాజస్థాన్ సర్కార్ వివాదాస్పద ఆర్డినెన్స్‌ను రాహుల్ తీవ్రంగా తప్పుపట్టారు. పౌర హక్కుల కార్యకర్తల నుంచి పలు విమర్శలు ఎదురైన ఈ నిర్ణయం నేపథ్యంలో రాజస్థాన్ సీఎంపై రాహుల్ విమర్శలతో విరుచుకుపడ్డారు.‘మేడమ్ సీఎం...మనం 21వ శతాబ్ధంలో ఉన్నాం..ఇది 2017..1817 కాద’ని రాజస్థాన్ సీఎం వసుంధర రాజేను ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు. వివాదాస్పద ఆర్డినెన్స్‌ను వెనక్కితీసుకోవాలని పౌర హక్కుల సంస్థ పీయూసీల్ ఇప్పటికే డిమాండ్ చేసింది. తన అనుమతి లేకుండా రాజస్థాన్‌లోని న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్లు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి విచారణ చేపట్టరాదని వసుంధర రాజె ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించేంతవరకూ ఆరోపణలకు సంబంధించి మీడియా ఎలాంటి కథనాలూ ప్రచురించరాదని కూడా ఈ ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. -
కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ప్రజాసేవకులపై ఆరు నెలలపాటు విచారణ జరపకుండా రక్షణ కల్పిస్తూ.. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 'అవినీతిని వ్యవస్థీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది' అని రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలట్ అన్నారు. 'తమ అవినీతి బాగోతాలకు అండగా ఉండే ప్రజా సేవకులను రక్షించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' అని పైలట్ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా సేవకులు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ స్థానంలో వసుంధరారాజే ప్రభుత్వం తాజాగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం 180 రోజులపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాసేవలకులపై విచారణ చేపట్టే హక్కు ఎవరికీ ఉండదు. సదరు అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా మీడియా కథనాలు ప్రచురించడానికి వీల్లేదు. ఈ మేరకు మీడియాపై సైతం ఆంక్షలు ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టంలో హెచ్చరించారు. రాజే సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరు నెలలో కేసును తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయని.. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ చట్టం సరికాదంటూ వసుంధరా రాజేపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
మనిషి ప్రాణానికి రూ.26, ఆవు ప్రాణానికి రూ.70
న్యూఢిల్లీ: సాంస్కృతికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్న భారత దేశంలో మనిషి ప్రాణాలు ఎక్కువ విలువైనవా? ఆవు ప్రాణాలు ఎక్కువ విలువైనవా? అని ఎవరైనాఅడిగితే గతంలోనైతే ఏమాత్రం ఆలోచించకుండా మనిషి ప్రాణాలే ఎక్కువ విలువైనవని చెప్పేవారు. గోమాంసం పేరిట మనుషులను గొడ్డులాబాది ప్రాణాలను తీస్తున్న ప్రస్తుతం పరిస్థితుల్లో మనిషి ప్రాణం కన్నా ఆవు ప్రాణమే కచ్చితంగా విలువైనదని చెప్పవచ్చు! అందుకే రాజస్థాన్‌లోని వసుంధర రాజే ప్రభుత్వం కూడా పేదలకిచ్చే విలువకన్నా ఆవులకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు వసుంధర రాజె ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద ప్రతి వ్యక్తిపై రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ప్రతి ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను ఖర్చు పెడుతున్నది. అదే దూడలపై 35 రూపాయల చొప్పున ఖర్చు చేస్తోంది. ఇది కేవలం వాటి దాణా కోసం వెచ్చిస్తున్న సొమ్ము మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ప్రజల నుంచే రాబట్టేందుకు 33 రకాల ప్రజల లావాదేవీలపై పది శాతం ఆవు సెస్సును విధిస్తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై కూడా ఎన్నడూ శ్రద్ధ పెట్టని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గోసంరక్షణ శాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. జైపూర్‌లోని హింగోనియా గోసంరక్షణ శాలలో వేలాది ఆవులు మరణించడమే అందుకు కారణం కావచ్చు. అధునాతన హంగులతో రాష్ట్రంలో పలు గోసంరక్షణ శాలలను నిర్మించాలని, వేళకు వాటికి దాణా అందుతుందో, లేదో తెలుసుకోవడానికి సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంతోకాలంపాటు గోవుల ఆలనా, పాలనా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నెలలో గోసంరక్షణ కోసం ఓ ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ సమావేశమై ఆవుల మేత కోసం ఒక్కో ఆవుపై రోజుకు 32 రూపాయలను, ప్రతి దూడపై 16 రూపాయలను ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మూడు నెలలపాటు అమలు చేయాలని నిర్ణయించి, అమలు చేసింది కూడా. మళ్లీ ఏప్రిల్ మాసంలో ఈ కమిటీ రాజస్థాన్‌లోని 13 జిల్లాల మున్సిపల్ అధికారులతో సమావేశమై ఒక్కో అవుపై ఖర్చుపెట్టే మొత్తాన్ని 70 రూపాయలకు, దూడపై పెట్టే ఖర్చుపెట్టే మొత్తాన్ని 35 రూపాయలకు పెంచాలని తీర్మానించింది. పెరిగిన ఈ అదనపు భారాన్ని ప్రజల నుంచి ఏ రూపంలో వసూలు చేయాలని ఇప్పుడు మున్సిపాలిటీలు కసరత్తు చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాకు చెందిన రషీద్ దారిద్య్ర రేఖకు దిగువున జీవిస్తున్నాడు. ఆయన రోజు రిక్షా తొక్కడం ద్వారా రోజుకు 60 నుంచి 70 రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో తన ఖర్చులుపోనూ ఉంటున్న గుడెశెకు అద్దె చెల్లించాలి. భార్యా, ఇద్దరు పిల్లలను పోషించాలి. రాజస్థాన్‌లో దాదాపు 30 శాతం మంది రషీద్ లాంటి వారు ఉన్నారు. వారి బతుకులు అలా తెల్లారిపోవాల్సిందేనా!. -
సుష్మాకు రెస్ట్.. వసుంధరకు విదేశాంగం?
- ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్! న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు ముగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో భారీ స్థాయిలోనే మార్పులు జరుగుతాయని తెలిసింది. ఇటీవలే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న సుష్మా స్వరాజ్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారని, ఆమె స్థానంలో విదేశాంగ మంత్రిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు అవకాశం కల్పిస్తారని ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఏప్రిల్ 12తో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాతిరోజే కేబినెట్ విస్తరణ జరుగుతుందని సమాచారం. మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దరిమిలా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. కీలకమైన రక్షణ శాఖకు పూర్తిస్థాయి మంత్రి అవసరమైన నేపథ్యంలో.. వచ్చేవారం జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దీనిపై వచ్చే అవకాశంఉంది. రక్షణ శాఖను అరుణ్ జైట్లీకి అప్పగించి, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ కేటాయిస్తారని తెలిసింది. ఇక యూపీ ముఖ్యమంత్రి పదివి బరిలో చివరిదాకా బరిలో నిలిచిన కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హాకు ప్రమోషన్ దక్కనున్నట్లు, ఆయనను పూర్తిస్థాయి కేబినెట్ మంత్రిగా నియమించనున్నట్లు సమాచారం. అయితే అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతేగానీ శాఖల కేటాయింపులపై స్పష్టతరాదు. -
కేంద్ర మంత్రిగా మహిళా సీఎం?
-
కేంద్ర మంత్రిగా మహిళా సీఎం?
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాదిలోని బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశముందని సీనియర్ ప్రధాన కార్యదర్శి ఒకరు వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ కేంద్రం బృందం ఉత్తరాది రాష్ట్రానికి వెళ్లనుందని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను కేంద్ర మంత్రిగా నియమిస్తారని సూచనప్రాయంగా వెల్లడించారు. 'పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశముంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పనితీరుపై తీవ్ర మదింపు జరుగుతోంది. ఉదాహరణకు రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే పేరును కేంద్ర మంత్రి పదవికి పరిశీలిస్తున్నారు. వాజపేయి హయాంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ కే చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఓమ్ మాథుర్ ను అక్కడికి పంపించే అవకాశముంది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కు ఎవరినైనా పంపిస్తే కేబినెట్ మరిన్ని ఖాళీలు ఏర్పడతాయ'ని విశ్వసనీయ వర్గాలు వివరించాయి. మనోహర్ పరీకర్ ఇప్పటికే రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎం పగ్గాలు చేపట్టేందుకు వెళ్లారు. పరీకర్ కోసం రాజీనామాకు సిద్ధపడిన గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిన్ డిసౌజాను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. పెరిగిన మోదీ పట్టు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ, ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ పట్టు పెరిగిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రులతో సహా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయకపోవచ్చని పేర్కొన్నాయి. పార్టీలోనూ భారీ మార్పులు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. -
కిడ్నీ ఫెయిల్యూర్.. ఆస్పత్రిలో సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు. ఏయిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు సుష్మా స్వరాజ్ ఆ వివరాలను ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రస్తుతం తాను ఢిల్లీలోని ఏయిమ్స్‌లో జాయిన్ అయ్యాయని.. డయాలిసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిమిత్తం తనకు ఏయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు. కృష్ణ భగవానుడి ఆశీస్సులతో తిరిగి కోలుకుంటానని సుష్మా దీమా వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా స్పందించారు. సుష్మా ఆనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలన్నారు. తమ ప్రార్థనలు, భగవంతుడి ఆశీస్సులతో సుష్మ ఆరోగ్యం మెరుగవుతుందని వసుంధర రాజే తన ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సుష్మా త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. I am in AIIMS because of kidney failure. Presently, I am on dialysis. I am undergoing tests for a Kidney transplant. Lord Krishna will bless — Sushma Swaraj (@SushmaSwaraj) 16 November 2016 @SushmaSwaraj My prayers & good wishes with you, Sushma ji. May you get well soon. — Vasundhara Raje (@VasundharaBJP) 16 November 2016 You are in our prayers. Get well soon Sushma ji !! https://t.co/jEDnFOr2ug — Kavitha Kalvakuntla (@RaoKavitha) 16 November 2016 -
సరిహద్దు రక్షణకు ప్రత్యేక ప్రార్థనలు..!
రాజస్థాన్ బిజేపి ప్రభుత్వం దేశ రక్షణకు ఆధ్యాత్మికతను జోడించింది. సర్జికల్ దాడుల నేపథ్యంలో 'రాష్ట్ర రక్ష యజ్ఞ' పేరిట సరిహద్దు దళాలకోసం 21 మంది బ్రాహ్మణులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వసుంధరా రాజే సూచనల మేరకు శత్రువుల నుంచి దేశ రక్షణ కోసం రాజస్థాన్ సంస్కృత అకాడమీ గురువారం ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని శ్రీ మాతేశ్వరీ టెనోట్ రాయ్ ఆలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జైసల్మేర్ లో నెలవైన దేవాలయంలో జరుగుతున్న రాష్ట్ర రక్ష యజ్ఞానికి వసుంధరా రాజేతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ యజ్ఞం భాగంగా అకాడమీ ఇప్పటికే రాష్ట్రంలోని సుమారు 26 వేద విద్యాలయాల్లో దేశ శాంతికోసం ప్రత్యేక శ్లోక పఠనాది కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు నవరాత్రులు పూర్తయ్యేవరకూ కొనసాగించనుంది. శ్లోక పఠనంలో అకాడమీకి చెందిన సిబ్బంది సహా సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని ముక్తకంఠంతో శ్లోకాలను పఠిస్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే సైతం పాల్గొని సరిహద్దుల్లోని దళాలు, ప్రజల రక్షణకోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ఓ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి సహా కేంద్ర హోం మంత్రి ఈ యజ్ఞం పాల్గొనే అవకాశం ఉన్నట్లు అకాడమీ డైరక్టర్ రాజేంద్ర తివారి సైతం తెలిపారు. మన పురాతన గ్రంథాలు, శ్లోకాల ఏకీకృత పఠనంవల్ల విశ్వశక్తిని లభిస్తుందని, ఈ శక్తిని మన సైనికులకు అందించి, శత్రువులనుంచి రక్షణతోపాటు, జయాన్నిపొందవచ్చని రాజస్థాన్ సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ జయదేవ్ చెప్పారు. అందుకే ప్రత్యేకంగా ఈ శ్లోక పఠనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం మన సనాతన పరంపరగా వస్తున్నఆచారమని అన్నారు. పూర్వకాలం రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో కూడా బ్రాహ్మణులు వారి రక్షణకోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేవారని ఉదహరించారు. దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సైన్యానికి అన్ని విధాలుగా అండదండలను అందించి, వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో భాగస్వాములు కావాలన్నసందేశాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించేందుకు అకాడమీ దుర్గా సప్తశతిని కూడా పారాయణ చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆవు లెటర్ రాయడం చూశారా!
ఐపూర్/జైసల్మీర్: విద్యాసంస్థలకు రాజకీయ రంగు తప్పడం లేదు. బీజేపీ హిందూత్వ భావజాల ప్రభావమో, వ్యక్తిగత ఉద్దేశమో.. మరేదైనా కారణమో.. మొత్తానికి రాజస్థాన్ లో తొలిసారి పాఠ్యంశాల్లో గోవు పేరిట ఓ లేఖను చేర్చి అలాంటి పాఠం పెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అందులో గోవు ఓ తల్లి మాదిరిగా విద్యార్థులకు లేఖ రాసినట్లు పాఠ్యాంశాన్ని చేర్చగా దానిపై పలువురు పెదవి విరుస్తున్నారు. బీజేపీ తన హిందూత్వ భావజాలాన్ని వసుంధరా రాజేతో జొప్పిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఐదో తరగతి హిందీ పుస్తకాల్లో ఓ చాప్టర్ లో రెండు ఆవుల ఫొటోలను ముద్రించి.. గోవును తమ తల్లిగా పూజిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఇందులో ఆ గోవు సంభాషణ విద్యార్థులతో ఎలా ఉందంటే.. 'నా కుమారుల్లారా.. కూతుర్లార.. నేను ప్రతి ఒక్కరికి శక్తిని ఇస్తాను. తెలివిని ఇస్తాను. సుదీర్ఘ ఆయుష్షును ఇస్తాను. నా గొప్పతనాన్ని గురించి ఎవరు తెలుసుకుంటారో వారు కచ్చితంగా మంచి అనుభూతిని, ఆనందాన్ని పొందుతారు. ఎవరు నన్ను తల్లిలాగా భావిస్తారో నేను వారిని నా బిడ్డలుగా భావిస్తాను. నేను పాలను, పెరుగును, నెయ్యిని ఇస్తాను. నా మలమూత్రములతో మెడిసిన్, ఫెర్టిలైజర్స్ తయారవుతాయి. నా సంతానమైన ఎద్దులు మీకు వ్యవసాయంలో సాయం చేస్తాయి. నా వల్ల వాతావరణం కూడా స్వచ్ఛంగా మారిపోతుంది' అంటూ లేఖ సాగింది. అయితే, గోవునుంచి పొందే లాభాలపై అవగాహన కల్పించేందుకే ఈ పాఠం పెట్టినట్లు మంత్రి ఓతారామ్ దేవాసి చెప్పారు. -
సుష్మకు వసుంధరా హామీ
న్యూఢిల్లీ : స్పానిష్ పర్యాటకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఇద్దరు స్పానిష్ పర్యాటకులపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరారాజేతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడారు. దీంతో వసుంధరా రాజే పై విధంగా స్పందించారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మంగళవారం వెల్లడించారు. -
ఆటోలో షికారు కొట్టిన సీఎం
ముఖ్యమంత్రి అంటే.. మందీ మార్బలంతో.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో ఆ హంగూ.. ఆర్భాటాలే వేరు. సీఎం కాలు బయట పెడితే.. కనీసం 10 వాహనాల కాన్వాయ్ బయలుదేరుతుంది. అయితే.. అవన్నీ బోర్ కొట్టాయో.. ఏమో రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే ఆటో ఎక్కి జైపూర్ లో షికార్లు కొట్టారు. అంతే కాదు... ఇలాంటి అందమైన ఆటోలు కనిపిస్తే వాటిలో ప్రయాణపు మజా ఆస్వాదించండి అని కామెంట్ చేశారు. తెల్లటి రంగులో.. అందంగా ముస్తాబు చేసిన ఆటోలో షికారు కొట్టిన రాజే.. ఆటో ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. జైపూర్ లో ఎవరైనా.. ఇలాంటి కళాత్మక ఆటోలను చూసినట్లైతే.. వాటి ఫొటోలను ఆర్ట్ ఆన్ వీల్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారి ట్వీట్ కు స్పందన కూడా బాగానే వచ్చింది. My wonderful ride today -- when you catch these beautiful autos in Jaipur, tweet back with pictures! #ArtOnWheels pic.twitter.com/kDmpPwxEoV — Vasundhara Raje (@VasundharaBJP) November 3, 2015 -
అక్కడ మొత్తం రిజర్వేషన్లు 68 శాతం!
-
సీఎం రాజేకు షాక్
⇒ ముఖ్యమంత్రికి పట్టున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పాగా ⇒ రాజస్తాన్ స్థానిక ఎన్నికల్లో పుంజుకున్న హస్తం ⇒ ఈ ఎన్నికలు బీజేపీ సర్కారుపై అవిశ్వాసం లాంటివి: పైలట్ జైపూర్: రాజస్తాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి వసుంధరారాజేకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈనెల 17న జరిగిన ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 129 మున్సిపాలిటీల్లో బీజేపీ 66 చోట్ల మెజారిటీ సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరిచిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బాగా పుంజుకుంది. ఆ పార్టీ సుమారు 35 మున్సిపాలిటీల్లో దాదాపు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. 17 చోట్ల బీజేపీతో నువ్వానేనా.. అన్నట్టుగా పోటీనిచ్చింది. ఏడు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. మొత్తం 3,351 వార్డులకుగాను బీజేపీ 1,443 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 1,164 వార్డులను కైవసం చేసుకుంది. సీఎం వసుంధరా రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న జలావర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు మున్సిపాలిటీల్లో మెజారిటీ సాధించింది. ఈ జిల్లాలో బీజేపీ మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక ధోల్పూర్ జిల్లాలో ఉన్న మూడూ మున్సిపాలిటీలు బడీ, ధోల్పూర్, రాజఖేరాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. వసుంధర ధోల్పూర్ రాజ కుటుంబీకురాలు కావడం గమనార్హం. ఇక దుశ్యంత్‌సింగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బరన్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ మెజారిటీ కోల్పోయింది. ప్రజలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు: పైలట్ ఈ ఫలితాలు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసం లాంటివని కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సచిన్‌పైలట్ అభివర్ణించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఓట్లతేడా 26 శాతం ఉండగా, ఈ ఎన్నికల్లో అది ఒక శాతానికి తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని, ఇప్పుడు వారు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారని పైలట్ మీడియాతో అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. పార్టీలు గెలుచుకున్న వార్డుల వివరాలు బీజేపీ - 1,443 కాంగ్రెస్ - 1,164 ఎన్సీపీ - 19 బీఎస్పీ - 16 సీపీఐ - 5 సీపీఎం - 1 ఇండిపెండెంట్లు - 703. -
కుదరని సయోధ్య
ఫలితం లేకుండా ముగిసిన అఖిలపక్షం * రాజీనామా డిమాండ్‌పై వెనక్కి తగ్గని కాంగ్రెస్ * రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: 15 రోజులుగా పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ సీఎంలు వసుంధరా రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజీనామాల డిమాండ్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. అయితే రాజీనామా డిమాండ్‌కు ప్రభుత్వం ససేమిరా అనడంతో సోమవారం జరిగిన అఖిలపక్ష భేటీ ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. కాంగ్రెస్ డిమాండ్‌కు జేడీయూ, లెఫ్ట్ పూర్తి మద్దతు తెలుపగా.. తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ తదితర ప్రాంతీయ పార్టీలు మాత్రం పార్లమెంట్లో ప్రతిష్టంభనపై రెండు జాతీయ పార్టీల తీరును తప్పుపట్టాయి. భేటీ అనంతరం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ సమావేశం వల్ల ఫలితం శూన్యం. మేము డిమాండ్‌కు కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. పార్లమెంటును అడ్డుకునే సంస్కృతిని ప్రారంభించింది బీజేపీయే అని ఆరోపించారు. ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనా లేకుండా వచ్చిందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. కాంగ్రెస్ విమర్శలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ఖండించారు. ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం ఎప్పుడు ఒక అడుగు ముందుకే వేసిందని చెప్పారు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులను సెలక్ట్ కమిటీకి అప్పగించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రధాని కూడా వీటిపై స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే ఎన్డీఏ మంత్రులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని, వారు ఎటువంటి అక్రమాలకు.. అనైతిక చర్యలకు పాల్పడలేదని చెప్పారు. -
మూడు రోజులు ఆలయంలో ఓ సీఎం !!
దతియా: గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు హోమాలు, ప్రత్యేక పూజలు తమను కొంతైనా కాపాడతాయని నమ్మేవారి జాబితాలో ఆ ముఖ్యమంత్రి పేరు ముందుంటుంది. ఇప్పటికే పలుమార్లు రకరకాల క్రతువులు నిర్వహించిన ఆ సీఎం.. మూడురోజులపాటు ఏకాంతంగా ఓ ఆలయంలో గడిపారు. ఇంతకీ ఎవరా సీఎం? ఎక్కడుందా ఆలయం? గడిచిన రెండు నెలలుగా దేశాన్ని.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న 'లలిత్ గేట్'లో రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొటున్నసంగతి తెలిసిందే. ఆమెతోపాటు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం రాజే గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. విపక్షాల దూకుడుతో రాజకీయంగా ఈ అంశం ఇప్పుడప్పుడే పరిష్కారం కాదనుకున్నారో ఏమోగానీ.. అడ్డంకులు తొలిగిపోవాలని అమ్మవారిని ఆశ్రయించారు వసుంధరా రాజే. ఆ క్రమంలోనే తన తల్లిగారి ఊరికి సమీపంగా ఉండే (మధ్యప్రదేశ్, గ్వాలియర్ లోని) దతియా పట్టణంలోని పీతాంబర అమ్మవారి ఆలయంలో ఏకధాటిగా మూడురోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు ప్రారంభమైననాటి నుంచి ముగిసే వరకు ఆలయంలోని ఒక గదిలో ఏకాంతంగా గడిపారు. ప్రధాన పూజారి మినహా ఎవ్వరితోనూ మాట్లాడలేదు. జులై 29న ఆలయానికి చేరుకున్న ఆమె.. 31న గురుపౌర్ణిమనాడు ప్రత్యేక పూజల అనంతరం తిరిగి రాజస్థాన్ వెళ్లిపోయారు. జులై ప్రారంభంలోనూ ఓ సారి ఆలయానికి వచ్చిన వసుంధర.. కుమారుడు దుష్యంత సింగ్ తో కలిసి పూజలు చేశారు. ఇక్కడి పీతాంబర మాతా భక్తుల కష్టాలను దూరం చేస్తుందని ప్రతీతి. దేశం నలుమూలల నుంచి అనేక మంది రాజకీయనాయకులు దతిచా అందుకే ఎంతో మంది రాజకీయనాయకులు దతియాకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూంటారు. -
సుష్మ, రాజే, లలిత్లపై ఫిర్యాదు
పట్నా: విదే శాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీకి వ్యతిరేకంగా పట్నాలోని జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భరత్సింగ్కు శుక్రవారం ఫ్రెండ్ ఆఫ్ బిహారీ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వినయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. కానీ కోర్టు ఈ కేసులో వాదనలు వినేందుకు శనివారం అనుమతి ఇవ్వలేదు. ఈ కేసు విచారణార్హమా కాదా అనే విషయాన్ని మరో రోజు తేలుస్తామని కోర్టు తెలిపింది. లలిత్ అక్రమాలకు సంబంధించి తన ట్విటర్ ఖాతా ద్వారా ఒకరి పేరు తర్వాత మరొకరి పేరు వెల్లడిస్తూ దేశాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారని వినయ్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనికోసం మీడియాలో వచ్చిన పలు కథనాలను పొందుపరుస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, ఐసీసీ 120, 124 సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, లలిత్ మోదీలపై కడమ్ కౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని వినయ్ కోర్టును అభ్యర్థించాడు. -
లలిత్-రాజే కుటుంబాల నేరపూరిత కుమ్మక్కు
న్యూఢిల్లీ: పలు కేసుల్లో నిందితుడైన ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోదీ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే కుటుంబాలు నేరపూరితంగా కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన ధోల్పూర్ ప్యాలెస్‌ను రాజే కుటుంబం, లలిత్‌తో కలిసి ఒక సంస్థ ద్వారా అక్రమంగా ఆక్రమించిందని ఆయన బుధవారం మళ్లీ ఆరోపణలు గుప్పించారు. ధోల్పూర్ ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదేనని 1949 నాటి ఒక పత్రాన్ని బుధవారమిక్కడ చూపారు. రాజే కుమారుడు దుష్యంత్‌కు సంబంధించిన కోర్టు సెటిల్మెంట్లో.. ఆయనకు కేవలం చరాస్తులు మాత్రమే దక్కాయని, ప్యాలెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ ప్యాలెస్ పరిధిలోని కొంత భూభాగాన్ని జాతీయ రహదారుల కోసం తీసుకున్నందుకు గాను.. దుష్యంత్‌సింగ్‌కు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించటం వెనుక స్కాం ఉందని, దానిపై దర్యాప్తు జరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అలాగే.. లలిత్‌మోదీ వివాదంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అంశాన్ని తాము విస్మరించలేదని వ్యాఖ్యానించారు. -
ఆ రాజసౌధంపై సవాల్ కు సిద్ధమా?
జైపూర్:ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిలో భాగమని.. ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీలు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ సవాల్ విసిరిన బీజేపీ.. ధోల్ పూర్ ప్యాలెస్ వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఆస్తిగా స్పష్టం చేసింది. దీనిపై తాము విసిరిన ఛాలెంజ్ కు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అని పార్టీ చీఫ్ అశోక్ పర్నామీ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ ప్యాలెస్ కు చెందిన డాక్యుమెంట్లను, కోర్టు, కుటుంబ సంబంధిత సెటిల్ మెంట్ పేపర్లను ఆయన మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ధోల్ పూర్ ప్యాలెస్ పూర్తిగా దుశ్యంత్ కు చెందిన ఆస్తిగానే ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తూ, నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. అవసరమైతే ఆర్టీఐ నుంచి డాక్యుమెంట్లను తెప్పించుకుని పరీక్షించుకోవచ్చని అశోక్ పేర్కొన్నారు. ఒకవేళ ప్యాలెస్ కు సంబంధించి ఎటువంటి అవతవకలకు పాల్పడినా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు. రాజే.. లలిత్‌తో కలసి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో విలేకర్లకు చెప్పారు. 1954 - 2010 మధ్య కాలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పత్రాలు కొన్ని.. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని చూపుతున్నాయని.. కానీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజే, లలిత్‌లు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారని, రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని చెప్పారు. -
ఆ ముఖ్యమంత్రి తప్పుకోవాల్సిందే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజస్థాన్‌లోని దోల్పూర్ ప్యాలెస్ ప్రభుత్వ ఆస్తి అని, రాజె కుటుంబం దీన్ని అక్రమంగా పొందారని పునరుద్ఘాటించింది. ఈ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. దోల్పూర్ ప్యాలెస్‌కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కొత్త డాక్యుమెంట్లను విడుదల చేశారు. దోల్పూర్ ప్యాలెస్‌లోని చరాస్థులపై మాత్రమే రాజె కొడుకు దుష్యంత్ సింగ్, ఆయన తండ్రి హేమంత్ సింగ్ ఓ అంగీకారానికి వచ్చినట్టు దస్తావేజుల్లో ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ప్యాలెస్ ప్రభుత్వానికి సంబంధించినదేనని చెప్పారు. -
రాజసౌధాన్ని ఆక్రమించారు
వసుంధర, లలిత్మోదీలపై కాంగ్రెస్ దాడి తీవ్రం * ధోల్పూర్ ప్యాలెస్‌ను అక్రమంగా ఆక్రమించారని జైరాం రమేష్ ధ్వజం * ఆ ప్యాలెస్‌లోని హోటల్లో రాజే, ఆమె కుమారుడు దుష్యంత్, కోడలితో పాటు లలిత్మోదీకీ వాటాలు ఉన్నాయని ఆరోపణలు * రాజే ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం చెప్పారని వెల్లడి న్యూఢిల్లీ/జైపూర్: లలిత్ మోదీ వివాదంలో చిక్కుకున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై కాంగ్రెస్ సరికొత్త ఆరోపణలతో ఒత్తిడి తీవ్రం చేసింది. ధోల్పూర్ రాజసౌధాన్ని(ప్యాలెస్‌ను) రాజే.. లలిత్‌తో కలసి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించింది. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో విలేకర్లకు చెప్పారు. 1954 - 2010 మధ్య కాలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పత్రాలు కొన్ని.. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని చూపుతున్నాయని.. కానీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజే, లలిత్‌లు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారని, రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని చెప్పారు. అయితే.. ఇది రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2009 సంవత్సరానికి ముందు జరగటం గమనార్హం. నియత్ హెరిటేజ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో.. తన కుమారుడు, ఎంపీ అయిన దుష్యంత్ సింగ్, కోడలు నీహారిక, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీలతో పాటు తనకూ వాటాలు ఉన్నాయని రాజే 2013 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని రమేష్ తెలిపారు. ఆ సంస్థలో రాజేకు 3,280 షేర్లు, ఆమె కుమారుడికి 3,225 షేర్లు, కోడలికి మరో 3,225 షేర్లు, లలిత్‌కు చెందిన ఆనంద హెరిటేజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 815 షేర్లు ఉన్నాయని అఫిడవిట్ చూపుతోందన్నారు. ఇది.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు లలిత్‌కు రాజేకు మధ్య వ్యాపార సంబంధం, భాగస్వామ్యం, పన్నుల భారం లేని ప్రాంతం నుంచి విదేశీ పెట్టుబడులు పెట్టటాన్ని నిర్ధారిస్తోందని జైరాం పేర్కొన్నారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు లలిత్‌మోదీ మారిషస్ మార్గాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు. లలిత్‌గేట్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనాన్ని కొనసాగించటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయనను ‘స్వామి మౌనానంద బాబా’గా జైరాం అభివర్ణించారు. ప్యాలెస్ యజమాని దుష్యంత్సింగే: బీజేపీ జైరాం ఆరోపణలను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేంద్ర రాథోడ్‌లు జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ తిరస్కరించారు. ఈ రాజసౌధాన్ని హేమంత్‌సింగ్.. వసుంధర కుమారుడు దుష్యంత్‌సింగ్‌కు అప్పగించారని స్పష్టంగా చెప్తున్నాయంటూ పలు పత్రాలను ప్రదర్శించారు. రాజే ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పది రోజులుగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వపు సాధారణ పరిపాలన విభాగం 1956 డిసెంబర్లో ఒక నోటిఫికేషన్లో, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో.. ధోల్పూర్ ప్యాలెస్‌కు చట్టబద్ధ వారసుడిగా మహారాజా రాణా హేమంత్‌సింగ్ (దుష్యంత్ తండ్రి)ను ప్రకటించారని వివరించారు. అనంతరం 2007లో భరత్‌పూర్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ధోల్పూర్ ప్యాలస్‌ను దుష్యంత్‌కు అనుకూలంగా నిర్ణయించిందని.. దీనికి సంబంధించి హేమంత్‌సింగ్ డిక్రీ ఇచ్చారని, అది రిజిస్టరు కూడా అయిందని తెలిపారు. మునిసిపల్ పత్రాల్లో సైతం ఆ ప్యాలెస్ యజమానిగా దుష్యంత్ పేరునే పేర్కొన్నారని చూపారు. ధోల్పూర్ ప్యాలెస్‌పై యాజమాన్య హక్కులు దుష్యంత్‌కు ఉన్నాయనేందుకు తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయని.. దీనికి సంబంధించి వాస్తవాలు తెలియకుండా సీఎంపై, ఆమె కుటుంబ సభ్యులపై జైరాం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు. జవాబులెందుకు నిలిపేశారు?: చిదంబరం న్యూఢిల్లీ: లలిత్‌మోదీ గేట్ అంశంపై ఆర్టీఐ చట్టం కింద తాను అడిగిన ఏడు ప్రశ్నలకు సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని విదే శాంగ శాఖ జవాబులను ఎందుకు నిలిపివేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం సోమవారం ట్విటర్లో ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానాలను నిలిపివేసిన విషయం మంత్రి సుష్మకు తెలుసా అని కూడా ఆయన ప్రశ్నించారు. లలిత్ పాస్‌పోర్టు పునరుద్ధరణ వివాదంపై సమాచారమిచ్చేందుకు విదేశాంగ శాఖ నిరాకరించిందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చిదంబరం పై ప్రశ్నలు వేశారు. -
‘లలిత్‌గేట్’ మూసేదెలా?
జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పాలనలో వేగం పెంచడానికి, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, భూ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి ఈ సమావేశాలు సజావుగా సాగడం మోదీ ప్రభుత్వానికి చాలా అవసరం. ఈ సమావేశాలు ఫలప్రదం కావాలంటే కాంగ్రెస్ సహా విపక్షాల సహకారం చాలా అవసరం. అదీ, రాజ్యసభలో ప్రభుత్వ పక్షానికి మెజారిటీ లేనందున విపక్షాల మద్దతు లేకుండా ముందుకెళ్లడం ఎన్డీయే సర్కారుకు కత్తి మీద సామే. ఈ పరిస్థితుల్లో తాజాగా తెరపైకి వచ్చిన ‘లలిత్ గేట్’ కేంద్రానికి కొత్త తలనొప్పి తీసుకువచ్చింది. 20-20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ నిర్వహణలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఈడీ సహా పలు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే వేర్వేరు సందర్భాల్లో సహకరించారన్న ఆరోపణలు టీ కప్పులో తుఫానులా ప్రారంభమై.. సునామీలా మోదీ సర్కారును కుదిపేస్తున్నాయి. విపక్ష కాంగ్రెస్‌కు అంది వచ్చిన అస్త్రాలుగా మారాయి. సుష్మా స్వరాజ్, వసుంధర రాజేలు రాజీనామా చేయడమో లేక వారిని పదవుల నుంచి తొలగించడమో చేయకపోతే.. పార్లమెంటు సమావేశాలను సాగనివ్వబోమని కాంగ్రెస్ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో.. సమావేశాల సజావు నిర్వహణ కోసం కాంగ్రెస్ డిమాండ్లకు తలొగ్గడమో.. లేక ప్రతిపక్షాలతో తాడో పేడో తేల్చుకునే ఉద్దేశంతో తమ సీనియర్ నేతలకు బాసటగా నిలవడమో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నెలకొంది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న తాజా సంక్షోభంపై ‘సాక్షి’ ఫోకస్.. - నేషనల్ డెస్క్ * మోదీ సర్కారు మల్లగుల్లాలు * పార్లమెంటు సమావేశాల ముందు ప్రభుత్వానికి తలనొప్పి తెరపైకి రాజే! లలిత్‌గేట్‌లో తొలుత కేంద్రమంత్రి సుష్మ తర్వాత వసుంధర రాజే ప్రవేశించారు. 2011లో లలిత్ మోదీ బ్రిటన్ ఇమిగ్రేషన్ పొందేందుకు బ్రిటన్ అధికారుల ముందు అందించాల్సిన లిఖితపూర్వక సాక్ష్యం రాజేనే ఇచ్చారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా లలిత్మోదీనే ట్వీట్ చేశారు. ఆ తరువాత సంబంధిత డాక్యుమెంట్ కూడా వెలుగులోకి వచ్చింది. మొదట్లో, అదేంలేదంటూ బుకాయించిన వసుంధర.. ఆ తరువాత ఆ డాక్యుమెంట్, దానిపై తన సంతకం బయటపడటంతో పార్టీ అగ్ర నాయకత్వానికి వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. కేన్సర్‌కు చికిత్స పొందుతున్న సమయంలో తన భార్యతో పాటు పోర్చుగల్ వచ్చింది వసుంధర రాజేనే అని, తన ఇమ్మిగ్రేషన్‌కు మద్దతుగా సాక్ష్యమిచ్చేందుకు బ్రిటన్ కోర్టు ముందుకు రావడానికి కూడా వసుంధర సంతోషంగా ఒప్పుకున్నారని, అయితే, అప్పటికే ఆమె సీఎం కావడంతో అది కుదరలేదని అని సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ కుండబద్ధలు కొట్టారు. తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయని వివరించారు. దీంతో వసుంధర రాజే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇది మోదీ వ్యూహమే! ఈ వివాదంలోకి వసుంధర రాజేను లాగడం లలిత్‌మోదీ వ్యూహమే. దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కొన్ని కారణలతో దెబ్బతినడం, తనను కావాలనే రాజే పక్కన పెడ్తున్నారని లలిత్ మోదీ భావించడం.. ఈ వివాదంలోకి రాజేను లాగడానికి కారణమైంది. 2005లో జరిగిన రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) ఎన్నికల్లో.. గత 40 ఏళ్లుగా రాష్ట్ర క్రికెట్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రుంగ్తా కుటుంబానికి చెందిన కిషోర్ రుంగ్తాను, అప్పటివరకు అంతగా ఎవరికీ తెలియని లలిత్‌మోదీ ఓడించారు. నిజానికి రుంగ్తాను ఓడించింది లలిత్ మోదీ కాదు.. ఆయన వెనకున్న నాటి ముఖ్యమంత్రి వసుంధర రాజే. ఆ తరువాత వసుంధర రాజే మద్ధతుతో రాజస్తాన్‌లో మోదీ శకం ప్రారంభమైంది. ఒక దశలో మోదీని అంతా ‘సూపర్ సీఎం’ అనుకునేవారు. దాదాపు 2 వేల గజాలున్న, పురాతత్వ ప్రాముఖ్యత ఉన్న రెండు హవేలీలను కారుచవకగా కేవలం రూ. 30 లక్షలకు మోదీకి చెందిన కంపెనీకి అమ్మేయడం రాజేపై అవినీతి ఆరోపణల్లో అతి పెద్దది. మోదీ, రాజేల అవినీతితో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ఆ తరువాత ఐపీఎల్లో అవకతవకలు బయటపడిన తరువాత బీసీసీఐ లలిత్‌మోదీపై జీవిత కాల నిషేధం విధించింది. అయినా, పట్టించుకోకుండా, రాజే 2014(అప్పటికి ఆమె మళ్లీ సీఎం అయ్యారు) మేలో ఆర్సీఏ అధ్యక్షుడిగా మోదీ ఎన్నికయ్యేలా చూశారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో ఆర్సీఏ ఉపాధ్యక్షుడు అమిన్ పఠాన్ ఆర్సీఏ అధ్యక్ష పదవి నుంచి మోదీని తొలగించి తాను అధ్యక్షుడయ్యారు. దీని వెనుక వసుంధర రాజేనే ఉన్నారని లలిత్ భావించారు. అమిన్ పఠాన్ అధ్యక్షుడవడాన్ని లలిత్ మోదీ సవాలు చేయడంతో.. 2015 మార్చిలో జనరల్ బాడీ సమావేశం పెట్టి మరీ లలిత్‌ను ఆర్సీఏ నుంచి సాగనంపారు. ఇదంతా రాజే కుట్రనే అని లలిత్ భావించడంతో వారిద్దరి మధ్య విబేధాలు తీవ్రమయ్యయి. దాంతో సమయం చూసుకుని లలిత్ వదిలిన ట్వీట్లలో రాజే చిక్కుకున్నారు. పెట్టుబడులు కూడా! వసుంధర రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు చెందిన నియంత్ హెరిటేజ్ హోటల్స్ కంపెనీలో లలిత్ మోదీ దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడి పెట్టారని, ఆ పెట్టుబడులు షేర్ల రూపంలో పరోక్షంగా రాజే ఖాతాలోకే వెళ్లాయని వార్తలు వెలువడటంతో వసుంధర మరింత చిక్కుల్లో పడ్డారు. నియంత్ కంపెనీలో రూ.10 విలువైన షేరును అత్యధికంగా రూ. 96 వేల పైచిలుకు ప్రీమియంతో మోదీ కొనుగోలు చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఎలా మొదలైంది? లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్స్ లభించేలా సుష్మా స్వరాజ్ సహకరించారనే విషయాన్ని నిర్ధారించే పత్రాలు వెల్లడి కావడంతో ‘లలిత్‌గేట్’ గేట్లు తెరుచుకున్నాయి. ఆ విషయం వాస్తవమేనని ఒప్పుకున్న సుష్మ.. మోదీ భార్య కేన్సర్‌తో బాధ పడుతోందని, ఆమె చికిత్స కోసం తాను పోర్చుగల్ వెళ్లాల్సి ఉందని మోదీ అభ్యర్థించడంతో మానవతా దృక్పథంతో మాట సాయం చేశానని చెప్పారు. అయితే, తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ, పరారీలో ఉన్న నిందితుడికి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి సహకరించడం నేరమే అవుతుందని, అందువల్ల సుష్మా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబడ్తున్నాయి. మరోవైపు, సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బాన్సురి స్వరాజ్ తనకు చాలా సంవత్సరాలు ఉచితంగా న్యాయ సేవలందించారంటూ లలిత్ చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యంలా మారింది. సుష్మాకు మద్దతు.. రాజేకు మౌనం! సుష్మా స్వరాజ్ అంశం వెలుగులోకి రాగానే తక్షణమే స్పందించిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆమెకు బాసటగా నిలిచాయి. సుష్మా తప్పేం చేయలేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాయి. ఈ విషయంలో ఆమెకు ఆరెస్సెస్ కూడా మద్దతుగా నిలిచిందని సమాచారం. అదే వసుంధర రాజే విషయానికి వచ్చేసరికి.. మొదట్లో ప్రభుత్వం, పార్టీ మౌనం వహించాయి. బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. దాంతో సుష్మాను కాపాడేందుకు రాజేను బలి చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తరువాతే, చర్చోపచర్చల అనంతరమే రాజేకు మద్దతుగా నిలవాలనే నిర్ణయం మోదీ సర్కారు తీసుకుంది. వసుంధర రాజే రాజస్తాన్‌లో పార్టీకి ఉన్న ఏకైక, ప్రజాకర్షక నేత కావడం, ఆమెకు రాజస్తాన్ బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించడం, ఎమ్మెల్యేల మద్దతుతో అవసరమైతే అగ్ర నాయకత్వాన్నైనా ఎదుర్కొనేందుకు రాజే సిద్ధమవుతున్నారని, సంతకాల సేకరణ కూడా ప్రారంభించారని వార్తలు రావడం, ఆరెస్సెస్ సపోర్ట్ కూడా ఆమెకే ఉండటం.. తదితర కారణాల వల్లనే బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని, ఆమెకు బేషరతుగా మద్దతు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడిందని జైపూర్ వర్గాల సమాచారం. కిం కర్తవ్యం!? ఊహించని ఉత్పాతంగా మారిన ‘లలిత్‌గేట్’తో మోదీ సర్కారు ఆత్మ రక్షణలో పడింది. ఇప్పుడే ఈ విషయంలో కాంగ్రెస్ విమర్శలకు సరిగ్గా సమాధానమివ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక సకల అస్త్రాలతో సన్నద్ధంగా ఉన్న ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం ముందు రెండే మార్గాలున్నాయని.. ఒకటి, విపక్ష ఒత్తిడికి తలొగ్గి రాజేతో రాజీనామా చేయించడం.. రెండోది, ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం, అందుకు అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకోవడమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
'సుష్మ, రాజే వైదొలగాల్సిందే'
పార్లమెంటులో నిలదీస్తామని హెచ్చరిక నీతులు చెప్పే నరేంద్రమోడీ మౌనమెందుకు ? మోదీ కార్మిక వ్యతిరేకి ఐఎన్టీయూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే హైదరాబాద్: లలిత్‌మోదీ వ్యవహారంలో దోషులైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తక్షణమే పదవుల నుంచి వైదొలగాలని లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అఖిలభారత ఐఎన్టీయూసీ సమావేశం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. అవినీతి రహితంగా సుపరిపాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్రమోదీ ఏడాదిపాలన పూర్తికాకముందే నలుగురు బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లలిత్‌మోదీ వ్యవహారంలో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా సుష్మా స్వరాజ్‌పై, వసుంధర రాజే మీద రోజూ విమర్శలు వస్తున్నా.. ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నాడని ఖర్గే ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో అవినీతి పరులపై ప్రధానమంత్రి మోదీ మౌనాన్ని పార్లమెంటులో నిలదీస్తామని ఖర్గే హెచ్చరించారు. సామాన్యులను, కార్మికులను బీజేపీ మోసగిస్తున్నదని ఆయన విమర్శించారు. కేవలం బడా వ్యాపారులను, బహుళజాతి కంపెనీలను, పారిశ్రామికవేత్తలను దగ్గర పెట్టుకుంటున్న ఎన్డీయే ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. కార్మిక వ్యతిరేకిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నాడని ఖర్గే విమర్శించారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, పనిలో రక్షణకోసం కాంగ్రెస్ హయాంలో అనేక విప్లవాత్మక చట్టాలను తెచ్చామని చెప్పారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం అంబానీ, అధానీలకు తప్ప సామాన్యులకు, కార్మికులకు ఉపయోగపడే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కార్మిక, కర్షక చట్టాలను వ్యాపారులకు అనుకూలంగా, వారికే మేలు చేసే విధంగా మారుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవడానికి, భూములపై రైతులకు హక్కుల్లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతాంగానికి శాశ్వతంగా తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని విస్మరించి, కార్మిక వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడటానికి ఐఎన్టీయూసీ అగ్రభాగాన ఉంటుందని స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మెకు పిలుపును ఇస్తున్నట్టుగా ఖర్గే ప్రకటించారు. నవంబరు 23న రైల్వే సమ్మెకు పిలుపును ఇచ్చారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని, కార్మిక హక్కులకోసం చేస్తున్న పోరాటాల్లో కార్మికులంతా ముందుండాలని ఖర్గే సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక సంక్షేమం కోసం పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కేవలం బడా వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు కొమ్ముగాస్తున్నదని విమర్శించారు. కార్మిక సంక్షేమంకోసం పోరాడుతున్న కార్మికసంఘాలు చేసే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జనక్ ప్రసాద్, టీపీసీసీ కార్మిక విభాగం అధ్యక్షుడు ఆర్.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజెకు ముఖంచాటేసిన బీజేపీ పెద్దలు !
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంలో కూరుకుపోయిన తమ మహిళానేతలను సమర్థిస్తూ వస్తోన్న బీజేపీ అధిష్ఠానం తాజాగా తన పంథాను మార్చుకుందా? ఆధారాలతో సహా దొరికిపోయిన నాయకురాళ్లపై చర్యలకు ఉపక్రమిస్తుందా? అంటే అవుననే సమాధానాలు వినిపస్తున్నాయి. శనివారం ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. విజ్క్షాన్ భవన్లో ఏర్పటుచేసిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు జైపూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఢిల్లీకి వచ్చిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే.. సమావేశం అనంతరం బీజేపీ పెద్దలెవ్వరినీ కలుసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. నిజానికి ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుస్తారని అంతా భావించారు. అయితే రాజేకు మోదీ, షాల అపాంయింట్‌మెంట్ ఖరారయిందీ లేనిదీ ఆ పార్టీ నేతలెవ్వరూ పెదవి విప్పడంలేదు. ఇదే వివాదానికి సంబంధించి అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీలు బుధవారం ప్రధాని మోదీతో సమాలోచనలు జరిపి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు రాజే సహాయం చేశారనే విషయం వెలుగులోకి రావడంతో విపక్షాలన్నీ ఆమె రాజీనామాకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. -
'రాజెకు మోదీ వ్యాపార భాగస్వామి'
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెకు ఐపీఎల్ మాజీ వివాదాస్పద కమిషనర్ లలిత్ మోదీ వ్యాపార భాగస్వామి అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలో మోదీ 13 కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టారని పేర్కొంది. 2013 ఎన్నికల సందర్భంగా రాజె దాఖలు చేసిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నియంత్ హెరిటేజ్ హోటల్స్ లిమిటెడ్‌లో 3 వేల షేర్లు ఉన్నట్టు రాజె ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని వెల్లడించింది.