add
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. భూ యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టంపై చంద్రబాబు, ఆయన గ్యాంగ్ నానాయాగీ చేస్తోంది. ఇంకా అమల్లోకే రాని చట్టంపై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష కూటమికి ఎన్నికల్లో ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండంతో ఏం చేయాలో తోచక సీఎం జగన్‌పై, ఆయన ప్రభుత్వంపైన దుష్ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారం చేస్తూ.. ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది.తాజాగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదంపై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ చట్టంపై చంద్రబాబు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా ఆయన తిప్పికొట్టారు."ఈ ప్రకటనను ఇచ్చినది టీడీపీ తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ జాతీయ బీజేపీ. క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా?’ అని ట్వీట్ చేశారు..కాగా శుక్రవారం నాటి ఆంధ్రజ్యోతి ప్రతికలో ‘మీ భూమి మీది కాదు’ అనే నినాదంతో ఫస్ట పేజ్‌లో భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు.దీనిని కృష్ణారావు షేర్ చేస్తూ.. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త, కర్మ కేంద్రంలోని బీజేపీదేనని తెలిపారు. కేవలం అమలు చేసేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి ప్రకటనలో ఏపీ బీజేపీని భాగస్వామ్యం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిద్రపోతున్నారా? అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. లేదంటే ఇంకేమైనా కారణం వుందా? అని కూడా ఆయన నిలదీయడం గమనార్హం. ఈ ప్రకటనను ఇచ్చినది @JaiTDP తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో @bjp4andhra భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ @BJP4India . క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు @BJP4Andhra భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? @BJP4Andhra నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా? pic.twitter.com/rxbli0ZqFm— IYRKRao , Retd IAS (@IYRKRao) May 10, 2024 -
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి యాక్టింగ్ అంటే పిచ్చి. లాక్డౌన్ సమయంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్‌బాబు, దర్బార్‌లో రజినీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అవి వైరల్ అయ్యేవి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ఓ యాడ్‌లో నటించాడు. ఆ ప్రకటనలో దర్శకధీరుడు రాజమౌళి నటించడం మరో విశేషం. నవ్వులు పూయిస్తున్న యాడ్ ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. ఇందులో రాజమౌళి దర్శకుడిగా, వార్నర్ హీరోగా నటించారు. ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి’ అంటూ రాజమౌళి వార్నర్‌కి ఫోన్‌చేసి అడుగుతాడు. దానికి వార్నర్ బదులిస్తూ.. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అంటాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో ఓ సినిమా చేయమని అడుగుతాడు. ఒకవేళ తన సినిమాల్లో నిజంగానే వార్నర్ నటిస్తే ఎలా ఉండేదో రాజమౌళి ఊహించుకుంటాడు. సెట్స్‌లో వార్నర్ చేసే అల్లరి, వేసే స్టెప్పలు, డైగాల్స్ ..ఇవన్నీ ఊహించుకొని భయపడిపోయినట్లు యాడ్‌లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’ అని వార్నర్ అన్నప్పుడు రాజమౌళి చూసే చూపు నవ్వులు పూయిస్తుంది. కొన్ని సార్లు ఫేవర్ కూడా మార్కెట్ రిస్క్‌కి లోబడి ఉంటాయంటూ క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అటు సినీ ప్రియులతో పాటు ఇటు క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. Favours are subject to market risk. pic.twitter.com/QSPToEGYzg — CRED (@CRED_club) April 12, 2024 -
అందమైన అమ్మాయ్ అయితే ? అది ట్రాప్ బ్రో! అదిరిపోయే వీడియో
కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం అనేక రకాల వాణిజ్య ప్రకటనలను తయారుచేస్తాయి. భారీ ప్రకటనలతో చెప్పలేని కీలక అంశాలను ఒక చిన్న యాడ్ ద్వారా క్రియేటివ్‌గా చెబుతూ ఉంటాయి. క్రియేటివ్ ప్రమోషన్స్‌తో తమ ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి చెబుతూ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అలాంటి యాడ్ ఒకటి ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ కార్ల కంపెనీ టయోటాకు సంబంధించిన ఒక యాడ్‌ను పారిశ్రామిక వేత్త హర్షగోయెంకా ట్వీట్ చేశారు. ఈ యాడ్ వీడియో ప్రకారం.. కారు బ్రేక్ డౌన్ కావడంతో ఒక అందమైన యువతి వెనుక వస్తున్న యువకులను లిఫ్ట్ అడుగుతుంది. అమ్మాయిని చూసినా కానీ అతను కారు ఆపడు. అయితే కవ్వించే లుక్స్‌తో ఉన్న ఆ అమ్మాయిని చూసి కూడా కారు ఆపకపోవడంతో కారులో ఉన్న మరో వ్యక్తి అదోలాగా చూస్తాడు.. దీంతో ఇది ట్రాప్ బ్రో.. ఎపుడైనా టయోటా కరోలా కారు బ్రేక్ డౌన్ అవడం చూశామా? అంటూ ముందుకు పోతాడు. ఎండింగ్ మాత్రం మీరు చూసి థ్రిల్ అవ్వాల్సిందే.. ప్రత్యర్థులను పల్లెత్తు మాట అనకుండానే.. తమ టయోటా కరోలా స్టామినా, నాణ్యత ఎలాంటిదో చెప్పిన తీరు విశేషంగా నిలిచింది. Nice ad… pic.twitter.com/cMyGuAIotj — Harsh Goenka (@hvgoenka) April 2, 2024 -
ఆ విషయాలు పంచుకోవడంలో పురుషులకు సిగ్గు.. : టాప్ హీరో
మారుతున్న జీవనశైలి కారణంగా లైంగిక ఆరోగ్యం, సంరక్షణ పెద్ద సవాలుగా మారింది. అందుకోసం కొన్ని కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రానున్నరోజుల్లో ఆ సంస్థలకు ఆదరణ పెరుగుతుందని భావించి ప్రముఖులు సైతం అందులో పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా ‘బోల్డకేర్’ అనే సంస్థకు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ సహ యజమానిగా చేరారు. సమాజంలో లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో చాలా అవగాహన పెంపొందించాల్సి ఉందని, అందులో భాగంగా ఈ కంపెనీ ఎంతో కృషి చేస్తుందని రణ్వీర్ సింగ్ అన్నారు. ‘ఈ కంపెనీ లైంగిక ఆరోగ్య సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను అందిస్తోంది. బోల్డ్ కేర్ సహ యజమానిగా బోర్డులోకి రావడం సంతోషంగా ఉంది. లైంగిక ఆరోగ్యం, సమస్యలు, వాటికి పరిష్కారాలు అందించడం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా పురుషులు లైంగిక సమస్యలు, సంరక్షణ అంశాలను పంచుకోవడానికి సిగ్గుపడతారు. ఈ కంపెనీ అలాంటి వారికి ఎంతో మేలు చేస్తోంది’ అని ఆయన తెలిపారు. ‘లైంగిక సమస్యలు ఉన్న వ్యక్తులు మానసికంగా చాలా బాధను అనుభవిస్తారు. వారికి ఓదార్పుతోపాటు సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సమాజంలో ఇలాంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ ఆలోచన వల్లే నా కెరీర్ ప్రారంభంలో కండోమ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశాను. సమస్యతో బాధపడుతున్న ప్రతిఒక్కరిలో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని రణ్వీర్ సింగ్ వివరించారు. ఇదీ చదవండి: సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం.. 2021లో ప్రారంభమైన బోల్డ్ కేర్ కంపెనీ ఈ ఏడాదికిగాను రూ.40 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. సంస్థ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల యూనిట్లకు పైగా కండోమ్‌లను విక్రయించింది. కంపెనీ 15 లక్షలకు పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. -
మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి యాడ్ వివాదంలో చిక్కుకున్నారు. బిగ్‌బీ నటించిన తాజా ప్రకటన ఒకటి వివాదాస్పద మైంది. ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ కోసం ఇటీవల ఆయన చేసిన ప్రకటన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉందంటూ వ్యాపార సంఘం మండిపడింది. అంతేకాదు మోసపూరితంగా వినియోగదారులను ప్రభావితం చేస్తున్న ఈ యాడ్ ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అమితాబ్ బచ్చన్‌కు లేఖ రాసింది. Shri @SrBachchan ji, STOP HURTING SMALL BUSINESSES! You are the greatest showman of Bharat, which also means you have tremendous responsibility towards the nation and the citizens. In this advertisement for Flipkart you are demeaning the retailers of our nation by making… pic.twitter.com/wtHQkuw8M2 — Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) September 30, 2023 ఫ్లిప్‌కార్ట్ ఇటీవలి ప్రకటన చూసి చాలా నిరుత్సాహపడ్డాం. స్థానిక వ్యాపారాలను దెబ్బతీసేదిగా ఉన్న ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సియాట్ లేఖ రాసింది. దుకాణదారుల వద్ద డీల్‌లు , ఆఫర్లు అందుబాటులో లేవని, తద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించడం, ప్రభావితం చేయడమే. ఏ కారణంతో అలాంటి మాటలు చెప్పారో వివరించాలని కోరింది.అలాగే తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్లు లేదా ద్రవ్య లాభాల కోసం ప్రకటనలతో కస్టమర్లను ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మళ్లించడం మానుకోవాలంటూ అభ్యర్థించింది. మొబైల్ రీటైల్ అసోసియేషన్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవైపు దుకాణదారుల జీవనోపాధిని అనైతికంగా ,అన్యాయంగా ప్రభావితం చేస్తూనే మరోవైపు కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నందున, ప్రకటనను ఉపసంహరించు కోవాలని కోరింది. 📢 AIMRA India condemns the misleading advertisements by @SrBachchan for #Flipkart, and millions of shopkeepers seek immediate correction! 🛍️ We expect our Mahanayak to stand by the country's traders and avoid damaging their business with deceptive ads. 🙏 #StopMisleadingAds… pic.twitter.com/5Ex9Y6jINC — ALL INDIA MOBILE RETAILERS ASSOCIATION (@AimraIndia) September 29, 2023 జాగో గ్రాహక్ జాగో నినాదానికి తూట్లు పొడుస్తున్న ఫ్లిప్‌కార్ట్ యాడ్‌పై CAIT , AIMRA డిమాండ్‌ను అమితాబ్ పట్టించుకోలేదంటూ సియాట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జోక్యాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీనిపై ఫ్లిప్‌కార్ట్ , లేదా బిగ్‌బీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. Deep regrets that Shri @SrBachchan has ignored the demand of @CAITIndia & @AimraIndia for rejecting his endorsement on #Flipkart which has caused irreparable damage to the integrity of traders though @jagograhakjago has laid down a policy for not running any deceptive &… — Praveen Khandelwal (@praveendel) October 1, 2023 -
యూట్యూబ్ సెన్సేషన్.. ఈ మిస్టరీ గర్ల్ ఇన్నాళ్లకు దొరికింది
కొందరికి ఎంత కష్టపడ్డా స్టార్డమ్ అంత ఈజీగా రాదు. మరికొందరికేమో ఓవర్ నైట్‌లోనే పాపులారిటీ వస్తుంది. మీకు గుర్తుందా? యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తరచూ ఓ యాడ్‌లో ఓ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వుతున్న ఫోటో ఒకటి కనిపించేది. కేవలం ఆ ఒక్క యాడ్‌లోనే కనిపించిన ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉంది? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మొదట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రకటనల్లో నటించి వచ్చిన గుర్తింపుతో అవకాశాలను సంపాదించుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక యాడ్‌లో నటించే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంటారు. ఇలాంటి కోవలోకే వస్తుంది నుపుర్ చాబ్రా. అప్పట్లో యూట్యూబ్‌లో ఏ లింక్ ఓపెన్ చేసినా మొదట యాడ్‌లో ఓ అమ్మాయి ఫోటో కనిపించేది. ట్రెడిషనల్ డ్రెస్‌లో ఓ అందమైన అమ్మాయి స్మైల్ ఇస్తూ కనిపించేది. కానీ ఈ యాడ్ తర్వాత ఆ అమ్మాయి మరే ఇతర ప్రకటనల్లోనూ కనిపించలేదు. ఈ మిస్టరీ గర్ల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆరాతీస్తే ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో కనిపించే ఈ పాపులర్ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. ఇండియాకు చెందిన నుపుర్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్ బ్యాచలర్ డిగ్రీని అందుకున్న నుపుర్ ఫేస్బుక్ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ యాడ్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. పేదరికంలో ఉన్న చిన్నపిల్లలకు సహాయం చేసే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రకటన అది. ఆరేళ్ల క్రితమే నుపుర్ ఈ యాడ్‌లో నటించింది. ఇక 2020లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాహిల్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్‌గా కొనసాగుతూనే, లెట్స్ హాంగిన్ అనే మరో సంస్థకు కూడా కో ఫౌండర్‌గా ఉన్నారు నుపూర్. -
లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్
చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త యాడ్ ఇంటర్నెట్లోసందడి చేస్తోంది. విశ్వనాథన్ ఆనంద్ నటించిన అమెరికా ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సబ్వే కొత్త యాడ్ వైరల్ నెటిజన్లు మనసు దోచుకుంది. సబ్వేలో ఆన్లైన్ ఆర్డర్ల గందరగోళానికి చెక్ చెబుతున్నట్టుగా ఉన్న ఆర్డరింగ్ మేడ్ సూపర్ సింపుల్ అంటున్న ఈ యాడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. (రిలయన్స్ క్యాపిటల్‌పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్) సబ్వే అవుట్‌లెట్‌లో గ్రాండ్‌మాస్టర్ ఆర్డర్ చేయడం, దానికి సంబంధించిన రొట్టె రకం, ఫిల్లింగ్‌లో ఉపయోగించాల్సిన కూరగాయలు సాస్‌లు మసాలా దినుసులపై సిబ్బంది ప్రశ్నలతో ఆనంద్కి చెమటలు పట్టేస్తాయి. చెస్‌లో పావులను అలవోకగా కదిపి అనేక విజయాలను సాధించిన ఆనంద్ ఆలోచనలో పడిపోతాడు. ఒక జీనియస్ కూడా సబ్ ఆర్డర్ చేయడం కష్టమే అన్న ట్యాగ్‌లైన్‌తో 30 సెకన్ల వీడియో లక్షల కొద్దీ వ్యూస్‌ను, రీట్వీట్లను సాధించింది. చక్కటి స్క్రిప్ట్‌తో, ఆనంద్ నటనతో భలే ఉందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని సమయాల్లో మా పరిస్థితి కూడా అంతే అంటూ హిల్లేరియస్ కమెంట్స్ చేశారు. గత ఆరేడు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్నాము. ఎందుకంటే ఆ సమయంలో మెనూని మార్చాము. అలాగే దేశవ్యాప్తంగా చాలా స్టోర్లను కూడా తెరుస్తున్నాం. ఇది మెట్రో నగరాల్లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరిస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ దుకాణాన్ని తెరుస్తాం. లేదా కొనుగోలు చేస్తున్నామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయూర్ హోలా వివరించారు. ఏమైనా తినాలి అనిపించ గానే..ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని ఆస్వాదించడం చాలా సాధారణంగా మారిపోయింది ఇపుడు. అయితే సబ్వేలో ఫుడ్ ఆర్డర్ చేయడం అంటే అదో గందరగోళం అనే ఫిర్యాదులు చాలా ఉన్నాయి. ఈ విషయాన్నే మెన్షన్ చేస్తూనే సబ్వే శాండ్‌విచ్‌ని ఆర్డర్ చేయడం ఇపుడు చాలా సులువును అని తాజా యాడ్ లో పేర్కొంది. Admin paneer sub khaane gaya tha 😅 pic.twitter.com/4BqLUX3LdU — Viswanathan Anand (@vishy64theking) July 10, 2023 -
చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ కిడ్‌గా సోషల్ మీడియాలో సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో బాగా యాక్టివ్‌గా ఉండే సితార.. ఫ్యామిలీ మూమెంట్స్‌తో పాటు తనకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీనికి తోడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ కూడా నిర్వహిస్తుంది. మహేశ్ ముద్దుల కూతురిగానే కాకుండా తన స్పెషల్ టాలెంట్‌తో ఈ లిటిల్ సూపర్‌స్టార్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. సితారకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో ఉంచుకొని ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. ఇప్పటికే సితారతో మూడు రోజుల పాటు యాడ్ షూట్ చేశారట. ప్రముఖ టెక్నీషియన్లు ఈ యాడ్ కోసం పనిచేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన యాడ్ టీవీల్లో కనిపించనుంది. ఈ విషయం తెలిసి మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 🌟 Sitara Ghattamaneni, The Most Happening star kid to bag a major jewellery brand contract! 💎✨ Proud parents Mahesh Babu and Namrata are overjoyed! Stay tuned for the grand TVC launch! @urstrulyMahesh #NamrataShirodkar #Sitara pic.twitter.com/rOMfEjcrio — Mahesh Babu Space (@SSMBSpace) May 26, 2023 -
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్‌లైన్ ముగియకముందే మేల్కొండి!
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు నామినేషన్ సమర్పించేందుకు ఇచ్చిన గడువు మార్చి 31తో ముగియనుంది. ఎవరినైనా నామినీగా నమోదు చేయడం లేదంటే, నామినేషన్ ఆప్ట్ అవుట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడం తప్పనిసరి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇన్వెస్టర్ ఎంపిక చేసుకోకపోతే గడువు ముగిసిన తర్వాత వారి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులన్నీ స్తంభనకు గురవుతాయి. దాంతో పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. ఫండ్స్ పెట్టుబడులు, డీమ్యాట్ ఖాతాలకు నామినేషన్ లేదా నామినేషన్ వద్దంటూ డిక్లరేషన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ సెబీ 2022 జూన్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జూలై ఆఖరి వరకు గడువు ఇవ్వగా.. అక్టోబర్ వరకు పొడిగించారు. అప్పటికే పెట్టుబడులు కలిగిన వాటికి నామినేషన్ సమర్పించేందుకు 2023 మార్చి 31 వవరకు గడువు ఇచ్చింది. నామినేషన్ లేకుండా పెట్టుబడిదారు మరణించినట్టయితే.. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వారసులు లేదా కుటుంబ సభ్యులు క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా నామినేషన్‌ను సెబీ తీసుకొచ్చింది. -
జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?
సాక్షి,ముంబై: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ భారత్ మ్యాట్రిమోనీ వివాదంలో ఇరుక్కొంది. హోలీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కంపెనీ విడుదల చేసిన యాడ్‌పై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. పవిత్ర హోలీని అవమానకరంగా చిత్రీకరించి హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ భారత్ మోట్రిమోనీ అన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ యాడ్‌పై చర్చ కారణంగా ఇది ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. రంగుల పండుగ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై భారత్ మ్యాట్రిమోనీ ఒక వీడియోను పోస్ట్ చేసింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం,హోలీ సందర్బంగా మహిళలకు సురక్షిత వాతావరణాన్ని సృష్టించాలంటూ తన యాడ్‌లో కోరింది. కొన్ని కలర్స్( మరకలు) అంత తొందరగా మాసిపోవు. వేధింపుల వల్ల ప్రతీ ముగ్గురిలో ఒకమహిళ హోలీకి దూరంగా ఉంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం వారి శ్రేయస్సును గౌరవించే సమాజాన్ని సృష్టించడం ముఖ్యం అని పేర్కొంది. అంతే ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. ‘‘మీకు హిందూ వినియోగదారులంటే లెక్కలేదా..సిగ్గుపడండి..బ్యాన్ భారత్ మోట్రిమోనీ’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ట్విటర్లో #BoycottBharatMatrimony ట్రెండింగ్‌లో నిలిచింది. హోలీని తిట్టడమే లక్ష్యం. హిందూ పండుగలను హిందూ వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకోకండి అని ఒకరు ట్వీట్ చేయగా, భారత్ మ్యాట్రిమోనీ యాడ్ హిందూ సంప్రదాయాలను అగౌరవపరిచేదిగాను, హిందూ మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మరికొందరు ఆగ్రహించారు. హిందువుల పండుగలప్పుడు మాత్రమే మహిళల రక్షణ, కాలుష్యం, జంతువుల హక్కులు గుర్తొస్తాయా అంటూ ఇంకొకరు మండిపడ్డారు. ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేయడంతోపాటు భారత్ మ్యాట్రిమోనీని నిషేధించాల్సిందేనని కమెంట్ చేస్తున్నారు. ఈ యాడ్‌లో తప్పేమీ లేదంటూ సంస్థ భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థించిన వారు లేకపోలేదు. అలాగే సంస్కృతి పేరుతో ప్రతిదీ మంచిది కాదు. సతి, వరకట్నం కూడా భారతీయ సంస్కృతిలో భాగమే. చెడును వ్యతిరేకించాలి. హోలీ రోజున మహిళలపై వేధింపులు నిజమే. దీని వల్ల మొత్తం పండుగకే చెడ్డ పేరు వస్తుందని మరికొంతమంది యూజర్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో క్యాప్షన్‌ను సవరించి, సోషల్ మీడియా పేజీలలో తాజా పోస్ట్‌లను అప్లోడ్ చేసింది. అయినా విమర్శల సెగ చల్లార లేదు. కాగా ప్రకటనలపై విమర్శలు, వివాదం చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఫ్యాబ్ఇండియా, తనిష్క్, సియట్ టైర్లు, అమోజాన్ లాంటి పలు సంస్థలు దాదాపు ఇలాంటి వివాదాల్లో పడ్డాయి. ఇటీవల ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ హోలీ ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తాయి. హోలీ సందర్భంగా ప్రజలు ఒకరిపై ఒకరు గుడ్లు విసురుకోవద్దంటూ ఢిల్లీలోని స్విగ్గీ బిల్బోర్డ్ వివాదానికి దారితీయడంతో తరువాత, దాన్ని స్విగ్గీ తొలగించింది. I will be single in my entire life but i will never register in this #BHARATMATRIMONY@bharatmatrimony is fully hypocrisy all this gyans are vanished in Christian and Muslim festivals Total Boycott 🚫 #BoycottBharatMatrimony — ÂkaSH আকাশ (@itzmeakashmazz) March 8, 2023 pic.twitter.com/pMTJCNRBwV — Ankit Bhuptani 🏳️🌈 (@CitizenAnkit) March 8, 2023 -
‘నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను’.. వైరలవుతోన్న పేపర్ యాడ్
సాధారణంగా డెత్ సర్టిఫికెట్ చనిపోయిన తరువాత ఇస్తారు. డెత్ సర్టిఫికెట్ పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. ఈ మధ్య కాలంలో బతికున్న వారికి కూడా డెత్ సర్టిఫికెట్లు జారీ అవుతున్న ఘటనలు మచ్చుకు కొన్ని చూస్తూనే ఉన్నాం. అధికారుల తప్పిదాల కారణంగా మనిషి బతికున్నప్పటికీ చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కల్లో కొకొల్లలు ఉన్నాయి. తాజాగా డెత్ సర్టిఫికెట్ విషయంలో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నట్లు పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన మరణ ధ్రువీకరణ పత్రం పోయిందని ఒక పత్రికలో ప్రకటన ఇచ్చాడు. సదరు డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా అందులో పేర్కొన్నాడు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్ ప్రకటన ఫొటోను ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. ‘ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ప్రకటనను చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ‘ఆ వ్యక్తి స్వర్గంలో నుంచి సాయం కోరుతున్నాడా? ఒకవేళ ఆ ‘మరణ ధ్రువీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా? లేక నరకానికా? ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే తనకు ఇచ్చేయండి. దయచేసి దీనిని అత్యవసరంగా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది’ అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. చదవండి: షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి -
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డు.. ట్వీట్ వైరల్
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమాంతం పెరిపోయింది. దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారాయన. తాజాగా ఆయన ట్విట్టర్లో 7మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ బన్నీ ట్వీట్ చేశాడు. కాగా ఈ ట్వీట్లో బన్నీ షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: బన్నీ భార్య స్నేహారెడ్డి ఫోటోపై కల్యాణ్ దేవ్ కామెంట్ వైరల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో బన్నీ యమ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇది ఒక యాడ్ షూట్ కోసం దిగిన ఫోటో అని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పుష్ప-2 షూటింగ్ ప్రారంభం అవ్వడానికి ముందే బన్నీ ఈ యాడ్ షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తుంది. 7M … Thank you for all the love 🖤 pic.twitter.com/WMW8wrygWc — Allu Arjun (@alluarjun) August 17, 2022 -
మనసు కోరితే తగ్గేదేలే.. అదరగొట్టిన అల్లు అర్జున్..
ఇంతకముందు కేవలం సినిమాల వల్ల వచ్చే పారితోషికాల ద్వారా మాత్రమే సినీ నటులు డబ్బులు సంపాందించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాల ద్వారానే కాకుండా వ్యాపారాలు, వివిధ వాణిజ్య ప్రకటనల్లో నటించి కూడా కోట్ల సంపాదిస్తున్నారు. నిజానికి కొంతమంది తమ క్రేజ్‌ను ఉపయోగించుకొని సినిమాల కంటే కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. తాజాగా మహేశ్ కోవలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన చేతికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా బన్నీ మారారు. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో ఈ యాడ్ షూట్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బన్నీతోపాటు నటుడు సుబ్బరాజ్ కూడా కనిపించారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. వీరిద్దరి మధ్య ఫైట్ సీన్ జరగుతుండగా.. బన్నీ సుబ్బరాజ్‌ను ఒక్క కిక్కుతో గాల్లోకి లేపుతాడు. ఆ షాట్ స్లో మోషన్లో ఉండగా సుబ్బరాజ్..‘బన్నీ నన్ను కొంచెం తొందరగా కింద పడేయవా.. గోంగూర మటన్ తినాలని ఉంది. కింద పడేలోగా రెస్టారెంట్లు క్లోజ్ అవుతాయి’ అని కోరగా..‘ ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా’ అంటూ బన్నీ చెప్తాడు. ‘ఏం కావాలన్నా.. ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా.. మనసు కోరితే తగ్గేదేలే’ అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పే డైలాగ్‌తో యాడ్ ముగుస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సుబ్బరాజ్.. బన్నీ మధ్య సంభాషణ నెటిజన్ల ముఖాలపై నవ్వులు పూయిస్తోంది. అంతేగాక ఈ యాడ్‌లో బన్నీ లుక్ సూపర్ స్టైల్లో అదిరిపోయిందనే చెప్పాలి. చదవండి: అవును ఫర్హాన్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD — zomato (@zomato) February 4, 2022 -
వైరల్‌గా మారిన ‘మజ్ను మిస్సింగ్’ యాడ్.. పూర్తిగా చదవకపోతే పప్పులో కాలేసినట్టే!
లక్నో: సాధారణంగా షాపింగ్ మాల్స్‌లు కస్టమర్లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటాయి. కొన్ని చోట్ల డిస్కౌంట్ సేల్స్, గిప్ట్ కూపన్స్, వన్ ప్లస్ వన్ ఇలా అనేక మార్గాల్లో కస్టమర్లను తమ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో మాల్స్‌ల మధ్య విపరీత పోటీ పెరిగింది. అయితే, కొత్త పద్ధతుల్లో కస్టమర్లను ఆకట్టుకోవడానికి మాల్స్ నిర్వాహకులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం మాత్రం కస్టమర్లు తమ వైపునకు తిప్పుకోవడమే. తాజాగా, కోల్‌కతాకు చెందిన ‘సుల్తాన్’ అనే ఒక షాపింగ్ మాల్ నిర్వాహకులు కాస్త వెరైటీగా ఆలోచించారు. ఈ షాపింగ్ మాల్ షేర్వాణి, వివాహ వేడుకల్లో ధరించే సంప్రదాయ దుస్తులకు పెట్టింది పేరు. ఇక్కడ సంప్రదాయ దుస్తులు అనేక వెరైటీల్లో లభిస్తాయి. వీరు స్థానికంగా ఒక పత్రికలో వెరైటీ యాడ్ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా తప్పిపోతే బాధితుల తరుపు వారు మిస్సింగ్ (కనబడుట లేదు) అనే ప్రకటన ఇస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇక్కడ కూడా షాప్ నిర్వాహకులు కూడా ‘మజ్ను మిస్సింగ్’ అంటూ ఒక ప్రకటన ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే.. ‘ మజ్ను.. మీరు దయచేసి ఇంటికి వచ్చేయండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ వివాహం జరుగుతుంది. అదే విధంగా మీరు ఎంతగానో మెచ్చే ‘సుల్తాన్’ షాపింగ్ మాల్లోనే మీ పెళ్లి వేడుక కోసం షాపింగ్ చేద్దాం. ఎప్పటిలాగే షాపింగ్ మాల్స్‌లో అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్ సదుపాయానికి కూడా ఎలాంటి ఇబ్బందిలేదు. మీకు నచ్చిన షేర్వాణి కొనుక్కుందామంటూ ప్రకటనలో పొందుపర్చారు. అయితే, ప్రకటన పూర్తిగా చదివితేనే ఈ యాడ్ అర్థమవుతుంది. దీన్ని పూర్తిగా చదవని వారు మాత్రం ఎవరో కనిపించకుండా పోయారని భావిస్తారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. మీ క్రియేటివిటీకి హ్యట్సాఫ్..’, ‘ఎలా వస్తాయ్ బాబు... ఇలాంటి ఐడియాలు..’, ‘ ఇదో రకం మార్కెటింగ్ స్ట్రాటజీ..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Such an amazing ad! 😂😂😂 pic.twitter.com/g1fcE0WsJB — meghnad 🔗 (@Memeghnad) December 27, 2021 చదవండి: కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా -
#NoBindiNoBusiness: మరో వివాదంలో ఫ్యాబ్ఇండియా
సాక్షి, ముంబై: పండుగలు అంటే సాంప్రదాయబద్దంగా జరుపుకుంటాం. ఎవరి మతాచారాలకు తగ్గట్టు వాళ్లు పండగలు చేసుకుంటారు. ఇక హిందూ పర్వదినాల విషయానికి వస్తే.. ముఖ్యంగా మహిళలు.. సాప్రదాయబద్దంగా తయారవడానికి ఇష్టపడతారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండుగనాడు మాత్రం పట్టుబట్టలు, బొట్టు, పూలు, గాజులతో అందంగా ముస్తాబవుతారు. ఆధునికంగా కనిపిస్తూనే సాంప్రదాయంగా తయారవుతారు. ఇక హిందూ సమాజంలో బొట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్న పండుగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటారు. అలాంటిది దీపావళి వంటి పర్వదినం నాడు ఏ భారతీయ మహిళ కూడా ఇలా తయారవదు అంటూ ఫ్యాబ్ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. కారణం ఏంటంటే దీపావళి సందర్భంగా ఫ్యాబ్ఇండియా తీసుకువచ్చిన దుస్తుల కలెక్షన్ యాడ్ ఇప్పటికే వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా సద్దుమణగముందే మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఈ ఫ్యాబ్ఇండియా యాడ్‌లో మోడల్స్ ఎవరూ కూడా బొట్టు పెట్టుకోలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో నుదుటన బొట్టు ధరించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. (చదవండి: ఫ్యాబ్ ఇండియా యాడ్‌పై దుమారం, తొలగించిన సంస్థ) Speaking for myself. Not buying anything for #Deepawali from ANY brand that shows models without a bindi. #NoBindiNoBusiness — Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) October 20, 2021 ఈ యాడ్ చూసిన నెటిజనులు ఫ్యాబ్ ఇండియా యాడ్‌లో మోడల్స్ బొట్టు పెట్టుకోలేదని.. భారతీయ మహిళలు ఎవరూ పండగకి ఇలా తయారవ్వరని మండిపడుతున్నారు. అంతేకాక బిందీ, బొట్టుబిళ్లలు ధరించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో #Bindi, #NoBindiNoBusiness అనే హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. (చదవండి: ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’) Proudly flaunting my Bindi#NoBindiNoBusiness#BindiTwitter pic.twitter.com/xcrBLG40co — Adv Pragya Bhushan🌐 (@pragya_bhushan) October 21, 2021 రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన యాడ్‌పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసిన తన కలెక్షన్‌ను జష్న్-ఈ-రివాజ్ పేరిట బ్రాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు. దీంతో బాయ్‌కాట్ ఫ్యాబ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: కేవలం 'యాడ్స్'తో స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? My bindi (Tilak) is my identity. #BindiTwitter #NoBindiNoBusiness #NOFILTER pic.twitter.com/6jK3kozweD — Raghuram (@Raghura75818432) October 21, 2021 మరికొందరు ఈ హ్యాష్‌ట్యాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొట్టు పెట్టుకోకపోవడం పెద్ద నేరమేమి కాదు.. పుట్టుకతోనే ఎవరూ బొట్టుతో జన్మించలేదు. బొట్టు పెట్టుకోవాలో.. లేదో మేం నిర్ణయించుకుంటాం. దీనిలో పురుషుల జోక్యం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Most of the time I don't wear a bindi, and when I do, I wear it because I like it so all those preaching on Twitter that there should be bindi on a woman's forehead as it's mandatory in our religion can go to hell. Not wearing bindi won't make me any less hindu or Indian! — Pooja Kopargaonkar (@thekopargaonkar) October 19, 2021 -
ఏ భోజనమైనా హీరోగా నిలిచేది–చట్నీ !!
మార్ఫీ రిచర్డ్స్ బ్రూట్ మిక్సర్ గ్రైండర్తో అద్భుతమైన చట్నీ తయారుచేయండి. మీ అభిమాన రెస్టారెంట్లు మీరు అభిమానించే డిషెస్‌ను ఎప్పుడూ మీరు అభిమానించే రుచితోనే వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది కదూ ! కానీ, మీరు అభిమానించే డిషెస్‌తో పాటుగా అందించే చట్నీలను అపరిమితంగా అందిస్తే ఆ ఆనందం ద్విగుణీకృతమూ అవుతుంది. కాదంటారా ? ప్రామాణికమైన దక్షిణ భారతీయ వంటకమేదీ కూడా ఓ గిన్నెడు చట్నీ తోడు లేకుండా సంపూర్ణం కాదు. ఈ చట్నీలలోనూ కోకోనట్ థువాయల్ , పల్లీ చట్నీ, అల్లం పచ్చడి, టమోటా చట్నీ, ఈ జాబితా ఇలా వెళ్తూనే ఉంటుంది ! ఇంతగా మన అభిరుచులలో భాగమైన చట్నీని సైడ్ డిష్‌గా పేర్కొనడం సమంజసమేనా? మీరు చట్నీ రుచి చూసిన ప్రతిసారీ, ఈ రెస్టారెంట్ వాళ్లు ఇంత చక్కగా ఈ చట్నీని ప్రతిసారీ ఎలా తయారుచేస్తారని ఆశ్చర్యపోవచ్చు ! అదీ, ఎంతటి కఠినమైన పదార్థాలు ఉన్నప్పటికీ ఆదర్శవంతమైన స్ధిరత్వం మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. వాస్తవానికి రెస్టారెంట్ చెఫ్‌ల యొక్క రెసిపీ మరియు నైపుణ్యంకు తప్పనిసరిగా విలువను అందించాల్సిందే కానీ, చాలాసార్లు సరైన కిచెన్ అప్లయెన్సెస్ వాడితే మాత్రమే ఆ వంటకాల రుచిపరంగానూ వైవిధ్యత కనిపిస్తుంది. అద్భుతమైన చట్నీ తయారు చేయాలంటే, సరైన పదార్ధాలు వాడటంతో పాటుగా తగిన మొత్తంలో నీరు, అంతే రీతిలో స్పైసెస్, హెర్బ్స్ వాడాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఖచ్చితమైన మిక్సర్ గ్రైండర్ అత్యంత కీలకమైన పాత్రనూ పోషిస్తుంది. ఎందుకంటే చట్నీ కోసం ఎంచుకున్న పదార్థాలన్నీ సరిగా కలిపేది అదే ! దక్షిణ భారతీయ వంటకాలలో గ్రైండింగ్ కు ప్రత్యేకమైన. , శక్తివంతమైన మోటర్ మరియు బలమైన, మందపాటి బ్లేడ్స్ కావాల్సి ఉంటుంది. కొబ్బరి, ఉల్లి లేదా టమోటా.... ఇలా మీరు ఏది ఎంచుకున్నా అద్భుతాలనే అందిస్తుంది. ఒకవేళ మీరు విభిన్నమైన వంటకాల రుచి చూడాలనుకుంటూ, ప్రతి సారీ స్థిరంగా అద్భుతమైన రుచిని మాత్రమే పొందాలనుకుంటే, కుదరదు కదా అని నిరుత్సాహ పడవద్దు. ఎందుకంటే మీకోసం మేము ఒకటి తీసుకువచ్చాం ! మేము ఇటీవలనే నూతనంగా మార్ఫీ రిచార్డ్స్ బ్రూట్ మిక్సర్ గ్రైండర్‌ను తీసుకువచ్చాం. ఇది అత్యంత కఠినమైన పదార్థాలను సైతం నలగ్గొట్టి మీరు కోరుకునే చట్నీ అందిస్తుంది. మార్కెట్లో అందుబాటులోని అత్యుత్తమ ఆఫరింగ్స్లో ఒకటిగా, అత్యున్నత శ్రేణి ఫినీష్, అత్యద్భుతమైన నాణ్యత కలిగిన రొటేటరీ మోటర్ చక్కటి స్పిన్ అందిస్తుంది. గాలి జొరబడని జార్లు మరియు లిడ్లు అత్యంత సౌకర్యవంతమైన రీతిలో వంట ప్రక్రియను మారుస్తుంది. అత్యుత్తమ మిక్సర్ గ్రైండర్ సహాయంతో మీ మొత్తం భోజనంలో చట్నీ హీరోగా ఈ విధంగా నిలుస్తుంది. ఎలాంటి దక్షిణ భారతీయ వంటకమైనా, అంటే అవైల్, ఎర్రిసెరీ, పొరియాల్, కొబ్బరి చట్నీ మరియు మరెన్నో డిషెస్‌కు అత్యంత కఠినమైన పదార్ధాలు కావాల్సి ఉంటుంది. వీటిని మెత్తగా నలగ్గొట్టాల్సిన అవసరమూ ఉంది. ఈ మిక్సర్ గ్రైండర్ అత్యత్తమ సహచరునిగా మీ వంటగదిలో నిలుస్తుంది. దీనిలో శక్తివంతమైన కాపర్ మోటర్ మరియు స్టెయిన్లెస్ స్టీల్బ్లేడ్స్ ఉన్నాయి. వినూత్నమైన చెక్క ఫినీష్ కలిగిన ఈ మోడల్ , మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర మోడల్స్‌తో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో పాటుగా ఆధునిక భారతీయ వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనంగా నిలుస్తుంది. ఇటీవలనే సుప్రసిద్ధ నటి అమలాపౌల్ తన సోషల్ మీడియా ఖాతాలో దీని గురించి వెల్లడించారు. అంతేకాదు ఆమె ఓ కోడ్ AMALAPAUL10 అంటూ ఆఫర్ చేశారు. దీనిని Morphy Richards India వద్ద అప్లయ్ చేస్తే ఏదైనా మార్ఫీ రిచార్డ్స్ మిక్సర్ గ్రైండర్ కొనుగోలుపై 10% రాయితీని పొందవచ్చు. ఇప్పుడు మీరు సైతం ఆధీకృతమైనప్పటికీ, రెస్టారెంట్ తరహా ఆహారాన్ని ఇంటి వద్ద సృష్టించవచ్చు. అందువల్ల, ఇంకోసారి ఎప్పుడైనా మీకు ఈ రెస్టారెంట్లు తమ చట్నీలను అద్భుతంగా ఎలా తయారుచేస్తాయని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే, మార్చీ రిచార్డ్స్ బ్రూట్ మిక్సర్ గ్రైండర్ రూపంలో మీకు సమాధానం లభించింది! (అడ్వర్టోరియల్) -
ఫ్యాబ్ ఇండియా యాడ్‌పై దుమారం, తొలగించిన సంస్థ
సాక్షి, ముంబై: పాపులర్ డిజైనర్ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా వివాదంలో చిక్కుకుంది. రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన యాడ్‌పై దుమారం రేగింది. ప్రేమకు, కాంతికి చిహ్నమైన దీపావళికి పండుగకు స్వాగతం. జష్న్-ఇ-రివాజ్ పేరుతో ఫ్యాబ్ ఇండియా తీసుకొస్తున్న దీపావళి కలెక్షన్, భారతీయ సంస్కృతికి అందమైన సేకరణ అంటూ దీపావళి కలెక్షన్ యాడ్‌ను ట్వీట్ చేసింది. ఇదే ఇపుడు వివాదాస్పదమైంది. (Meghana Raj :ఇంతకంటే మంచి సమయం లేదు: మేఘన) రాబోయే దీపావళి పండుగ గురించి చేసిన ప్రకటనలో తమ కలెక్షన్‌ను 'జష్న్-ఇ-రివాజ్' గా బ్రాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై సోషల్ మీడియాలో ప్రతికూల స్పందనతో వివాదాస్పదమైంది. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు. దీంతో బాయ్‌కాట్ ఫ్యాబ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫలితంగా కంపెనీ తన అసలు ట్వీట్‌ను తొలగించింది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ట్విటర్లో ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఒ టీవీ మోహన్ దాస్ పై కూడా విమర్శలు గుప్పించడం గమనార్హం. మరోవైపు ఆ యాడ్‌లో తప్పేమీ లేదు. దయచేసి వివాదం సృష్టించ వద్దు అంటూ కొంతమంది ప్రముఖులు, ఇతర నెటిజన్లు కోరుతున్నారు. (Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత) Deepavali is not Jash-e-Riwaaz. This deliberate attempt of abrahamisation of Hindu festivals, depicting models without traditional Hindu attires, must be called out. And brands like @FabindiaNews must face economic costs for such deliberate misadventures. https://t.co/uCmEBpGqsc — Tejasvi Surya (@Tejasvi_Surya) October 18, 2021 Maan you do not get it! Use of Alien terms for a Hindu festival is a deliberate attempt to take away our heritage and subvert it! You can use any brand name you want post Diwali but at this time,linking it to Diwali shows a perverted mindset! @sankrant https://t.co/N1HRNPjHIc — Mohandas Pai (@TVMohandasPai) October 18, 2021 Hello @FabindiaNews , You have named your company as Fab India but don't even know how Indians dress up during Diwali . You call your collection traditional but forgot traditions of India. pic.twitter.com/xJP7KmsV4H — Superstar Raj 🇮🇳 (@NagpurKaRajini) October 18, 2021 -
వెడ్డింగ్ స్పెషల్ : 'మలబార్' పాట వైరల్
సాక్షి, బెంగళూరు : ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాహాది కార్యక్రమాల కోసం రూపొందించిన పాటకు అనూహ్య స్పందన వస్తోంది. 'మేక్ వే ఫర్ ది బ్రైడ్' అనే పేరుతో మూడు నిమిషాల సేపు సాగే పాటను యూట్యూబ్‌లో 48 గంటల్లో రెండు మిలియన్ల మంది వీక్షించారు. ఇందులో బాలీవుడ్ నటులు అనిల్‌కపూర్-కరీనా కపూర్ జంటగా కనిపిస్తారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లొ ఎక్కువగా వీక్షిస్తున్నట్లు తెలిపారు. -
కేవలం 'యాడ్స్'తో స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
స్నేహ..తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన స్నేహ తొలి చిత్రంతోనే బంపర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో వరుస అవకావాలు ఆమెను వరించాయి. ‘శ్రీ రామదాసు’, ‘సంక్రాంతి’,‘రాధా గోపాలం’ వంటి వరుస విజయాలతో స్నేహ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. మొదట్నుంచి గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ తన అభినయం, చీరకట్టుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్నేహను చాలామంది సౌందర్యతో పోల్చేవారు. ఇక అదే సమయంలో తమిళంలో ఆపర్లు వస్తుండటంతో కోలీవుడ్‌కు వెళ్లిన స్నేహ ఆ తర్వాత టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పింది. తమిళంలో ‘అచ్చాముందు అచ్చాముందు’ అనే సినిమా షూటింగు సమయంలో హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా పెద్దల అంగీకారంతో 2012లో వీరు వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఇద్దరూ జంటగా పలు అడ్వర్టైజ్మెంట్లలో మెరిశారు. ఇక స్నేహ-ప్రసన్న జోడీకి ప్రత్యేకంగా అభిమానులున్నారు. దీంతో పలు యాడ్ కంపెనీలు కూడా వీరిని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నాయి. అలా ఇద్దరూ జోడీగా ఇప్పటికే పలు యాడ్ షూట్లలో నటించారు. కేవలం యూడ్స్ రూపంలోనే వీరు రూ. 3.50కోట్లు సంపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు యాడ్ షూటింగ్‌లోనూ ఎంతో డెడికేషన్‌గా పనిచేస్తారని స్నేహ కపుల్స్‌కు మంచి పేరుంది. దీంతో వీరితో యాడ్స్ తెరకెక్కించేందుకు కంపెనీలు కూడా ఆసక్తిని చూపిస్తాయని సమాచారం. మొత్తానికి స్నేహ-ప్రసన్న దంపతులు అటు సినిమాలతో పాటు యాడ్ షూటింగ్స్‌లతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. -
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. నీలం రంగులోకి చిన్నారి శరీరం
అభిమన్యు బోసినవ్వులతో వెలిగిపోతున్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చిన్నారి రాకతో ఆ ఇంట ఆనందం వెల్లివెరిసింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఓ రోజు అతని శరీరం క్రమంగా నీలం రంగులోకి మారిపోతుండటంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే వైద్యులను సంప్రదించగా వారు చెప్పిన నిజం తెలిసి గుండె పగిలేలా రోదిస్తున్నారు. తీవ్రమైన టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్, పల్మనరీ స్టెనోసిస్ అనే వ్యాధితో చిన్నారి బాధపడుతున్నాడని వైద్యులు నిర్థారించారు. చిన్నారి పుట్టినప్పటి నుంచే గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు తెలిపారు. అయితే ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. సంవత్సరం క్రితమే అభిమన్యు మా జీవితాల్లోకి వచ్చాడు. అతని రాకతోనే ఎన్నో వెలుగులు తెచ్చాడు. ఆ బోసినవ్వులతో ఎంతో చక్కగా సాగిపోతున్న మా జీవితాల్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు కాబోతున్నాం అని ఎంత సంతోషించామో ఇప్పటికీ గుర్తు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు కొనసాగలేదు. నా బిడ్డ కొన్ని రోజుల నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణంగా అందరు పిల్లల్లో ఉండేదే అనుకున్నాం. కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం, క్రమంగా శరీరం నీలం రంగులోకి మారుతుండటంతో చాలా భయపడుతూనే హాస్పిటల్‌కి వెళ్లాం. అప్పుడు రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు నా చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పారు. వెంటనే బాబుకు చికిత్స చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ మొత్తానికి దాదాపు 10లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పనులు లేక కుటుంబ పోషణే జటిలమైపోయింది. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. అభిమన్యుకు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి మా బిడ్డను కాపాడండి. నా అభిమన్యుకు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్‌తో కొలాబరేట్ అయ్యి డబ్బులు లేని వారెందరికో సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ చేసి చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తోన్న యువ బృందం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రాణవాయువు కోసం పలువురు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో 250 మంది సభ్యులున్న ఓ యువ బృందం మిషన్-ఆక్సిజన్ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. అలా సేకరించిన డబ్బులతో దేశ వ్యాపంగా ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక.. ఆక్సీజన్ సిలిండర్లు లేక కరోనా బాధితులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారికి అండగా నిలబడుతున్న 'మిషన్-ఆక్సిజన్' గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేం ఈ మిషన్‌ను ప్రారంభించేనాటికి 100 ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయాలనుకున్నాం. సోషల్ మీడియా ద్వారా వెంటనే దానికి నిధులు సేకరించాం. అయితే మేం ఊహించిన దాని కంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మేం ఇది ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు కావాలని కొన్నివేల వినతులు వచ్చాయి. ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ ఇలా సామాజికి మాధ్యమాలను ఉపగయోగించుకొని ఫండింగ్ చేపట్టాం. దాదాపు 3900 సిలిండర్లను తక్షణ సాయం కింద చైనా నుంచి తెప్పిచ్చాం. ఇప్పటికే వివిధ ఆసుపత్రులకు వీటిని పంపిస్తున్నాం. మేం ప్రారంభించిన ఈ మిషన్ 100 శాతం లాభాపేక్షలేని, ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రమే. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ సహా పలువురు ప్రముఖులు తమ వంతుగా ముందుకు వచ్చి సహాయం చేశారు. ఏప్రిల్ 29న ప్రారంభించిన ఈ మిషన్ ద్వారా ఇప్పటికే 15కోట్ల నిధులను సేకరించి వాటి ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు అందించగలిగాం. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు మా సేవలు అందిస్తున్నాం. ఇందుకోసం డీజీ, బిఎస్ఎఫ్, మేజర్ జనరల్ (హెచ్‌క్యూ), ఇండియన్ ఆర్మీ, ఛైర్మన్ ఇఎస్ఐసి, డైరెక్టర్లు /మెడికల్ సూపరింటెండెంట్లు సహా వివిధ ప్రభుత్వ అధికారులతో మేం నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. నిజంగా అవసరం ఉన్న చోట ప్రభుత్వ అధికారులతోనూ అందుకు తగ్గ వాస్తవాలు తెలుసుకొని పూర్తి పారదర్శకతతో దీన్ని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చాలామంది ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరికీ మా మిషన్ ద్వారా మీరు సహాయం చేయగలరా? మీరు అందించే చిన్న సహాయం అయినా ఎంతో మంది ప్రాణాలను నిలబెబుతుంది. గూగుల్ పే లేదా ఏదైనా డిజిటల్ చెల్లింపుల ద్వారా మీరు మాకు ఫండ్స్ పంపొచ్చు. పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతున్నాం. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా మా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు నేరుగా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇది పూర్తి పారదర్శకతతో, నిస్వార్థంగా చేస్తోన్న ఓ ఉద్యోమం. ఇందులో మీరు కూడా భాగస్వాములు అవుతారా? ప్రాణ వాయువు కోసం అల్లాడిపోతున్న ప్రాణాలను మీ వంతు సహాయం చేసి రక్షించగలరా? మీరు ఇవ్వాలనుకునే ఫండింగ్‌ను డైరెక్ట్ క్యూఆర్ స్కాన్ ద్వారా మాకు పంపొచ్చు. -
ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’
సాక్షి, ముంబై: ప్రస్తుత టెక్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమకు నచ్చని అంశంపైన మాత్రమే గాకుండా, కొన్నిసునిశితమైన అంశాలను కూడా నెటిజన్లు పట్టేస్తారు. తాజాగా వినియోగదారులను బుట్టలో పడేసే వ్యాపార ప్రకటనలపై కూడా స్పందించడమే కాదు ట్రోలింగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేశారు. వ్యంగ్య బాణాలు, మీమ్స్‌తో తన అభిప్రాయాలను వెల్లడించారు. జనవరి 3 న తేలికపాటి గుండెపోటుకు గురైన తరువాత భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎండార్స్ చేసిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె ప్రకటనపై యూజర్లు భారీగా ట్రోల్ చేశారు. ఇది నిజంగా హెల్దీ అయిలేనా? అంటూ.. ఇప్పటికైనా తెలిసిందా దాదా.. గెట్ వెల్ సూన్ అంటూ.. గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ క్యాంపెయిన్‌పై సోషల్ మీడియా యూజర్లు విమర్శలు గుప్పించారు. క్రీడాకారుడైన గంగూలీ రోజూ వ్యాయామం చేస్తారు. ఫిట్‌గా ఉంటారు...అయినా గుండెపోటుకు గురయ్యారు. గంగూలీ యాడ్‌లో చెప్పినట్టుగా ఆ ఆయిల్ నిజంగా ఆరోగ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. ఒత్తిడే ప్రధాన కారణం కావచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా "దాదా త్వరగా కోలుకోవాలి. ఎపుడూ పరీక్షించిన, ప్రయత్నించిన ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలి. జాగ్రత్తగా ఉండాలి.. గాడ్ బ్లెస్’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు: దీంతో గంగూలీ నటించిన సదరు ప్రకటనను అన్ని ప్లాట్‌ఫాంనుంచి తొలగించడం గమనార్హం. ‘దాదా బోలే వెల్కం టూ ది ఫార్టీస్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె యాడ్ వస్తుంది. ఈ ప్రకటన ఏప్రిల్ 2020 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయం నుంచి వివిధ ఛానళ్ల సమయంలో ప్లే అవుతోంది. అంటే 40ల ఏళ్ల వయసులో కూడా తమ నూనె గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అనేది ఈ ప్రకటన సారాంశం. అయితే తాజాగా గంగూలీకి గుండెపోటు రావడం, గుండెలో రెండు బ్లాక్ ఉన్నాయని తేలడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ నూనె ప్రామాణికతపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని, బ్రాండ్ క్రియేటివ్ ఫార్చ్యూన్ క్రియేటివ్ ఏజెన్సీ ఓగిల్వి & మాథర్ ప్రతినిధి తెలిపారు. అటు కస్టమర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు సంస్థ వేగిరమే తగిన చర్యలు చేపట్టాలని యాడ్ ఏజెన్సీ నిపుణులు భావిస్తున్నారు. కాగా బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఛాతీ నొప్పితో( జనవరి 2 న) పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. మూడు కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. యాంజియోప్లాస్టీ అనంతరం, గూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని రేపు( బుధవారం) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 Seen many tweets on the irony in Sourav Ganguly endorsing Fortune RiceBran Oil. Got to realise it’s the risk one takes in any endorsement. It isn’t that Ganguly lived an unhealthy lifestyle. Importantly, sportsmen with a 10-15 year playing life need to keep the earnings coming in — Lloyd Mathias (@LloydMathias) January 3, 2021 Now you know .. #Fortune does not work .. @SGanguly99 dada get well soon pic.twitter.com/tawBK0Uv5Q — Jaspal Singh (@JaspalSinghSays) January 3, 2021 Dada @SGanguly99 get well soon. Always promote tested and tried products. Be Self conscious and careful. God bless.#SouravGanguly pic.twitter.com/pB9oUtTh0r — Kirti Azad (@KirtiAzaad) January 3, 2021 -
ఇన్ని లక్షణాలున్న వధువు దొరికేనా..!
రాంచీ: తమకు ఎలాంటి వధువు, వరుడు కావాలో వివరిస్తూ వార్తా పత్రికల్లో, వెబ్సైట్లలో, మ్యారేజ్ బ్యూరోల్లో అనేక ప్రకటనలు వస్తుంటాయి. వాటిని మనం పరిశీలిస్తే.. అందంగా ఉండాలని, డబ్బుండాలని, ఉద్యోగం ఉండాలని కొందరు, పెళ్లయితే ఉద్యోగం మానేయాలని మరికొందరు.. ఇలా అనేక షరతులు కూడా పెడుతుంటారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఏవైనా తక్కువయ్యాయా అన్నట్లుగా.. ఆ కొరత తీర్చడానికి ఓ బ్రాహ్మణ యువకుడు వింత కోరికలతో ఓ వినూత్న ప్రకటన ఇచ్చాడు. జార్ఖండ్‌కు చెందిన డాక్టర్ అభినవ్ కుమార్ అనే యువకుడు వధువు కోసం ఇచ్చిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. తన జీవితంలోకి రాబోయే వధువు అందంగా ఉంటూ నమ్మకమైన బ్రాహ్మణ వధువు కావాలని.. ఆమెలో అతివాద లక్షణాలున్నా అభ్యంతరం లేదని అంటున్నాడు. ఇవి మాత్రమే కాకుండా ఆమె ధనవంతురాలు, దేశభక్తురాలై ఉండాలని నిబంధనలు పెట్టాడు. ‘ఆమెకు మనదేశ సైనిక, క్రీడా సామర్థ్యాలను పెంచాలన్న కోరిక ఉండాలి. వంట కూడా బాగా వచ్చి ఉండాలి. పిల్లను పెంచడంలో నైపుణ్యం ఉండాలి, ఉద్యోగం చేస్తుండాలి' అని డిమాండ్లు పెట్టారు. ఇన్ని గుణాలున్న యువతి అసలు భూమి మీద ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతనిది అత్యాశ అని.. పురుషాధిపత్యానికి అద్దం పట్టేలా ఈ ప్రకటన ఉందంటూ అతడిని విమర్శిస్తున్నారు. -
రైతన్నకు కలుపు కష్టాలు
పంట పొలాల్లో పెరుగుతున్న గడ్డి వేధిస్తున్న కూలీల కొరత పెరిగిన పెట్టుబడుల ఆందోళనలో అన్నదాత కుంటాల : రైతన్నలకు సాగు కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లలో వర్షాలు లేక వేసిన పంట నష్టపోతే,ఈ సారి అధిక వర్షాల కారణంగా పంట పొలాల్లో గడ్డి ఎక్కువగా పెరిగింది.గడ్డిని తొలగించడానికి కూలీలు దొరక్క పక్క రాష్ట్రాల నుంచి ప్రయాణ ఖర్చులు కట్టించి కూలీలను తీసుకువస్తున్నారు.పెట్టిన పెట్టుబడిలో సగం కూలీలకే ఖర్చుచేస్తే మేమెలా బ్రతికేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటదిగుబడి రాక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు.గత ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురుస్తాయన్న ధీమాతో రైతులు మ గశిర కార్తెకు ముందే విత్తనాలు వేసినా సకాలంలో వర్షాలు లేక రెండుసార్లు విత్తనాలు వేసి నష్టపోయారు.ఈఏడు ఖరీఫ్‌ను నమ్ముకుని పంటలసాగు చేసిన రైతులకు మళ్లీ చేదు అనుభవమే ఎదురవుతోంది. పెరుగుతున్న గడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో ఈఖరీఫ్ సీజన్లో 3450 హెక్టార్లలో సోయా,1750 హెక్టార్లలో వరి,16280 హెక్టార్లలో పత్తి,420 హెక్టార్లలో కందులు,150 హెక్టార్లలో మినుములు,80హెక్టార్లలో పెసళ్లు,35 హెక్టార్లలో పసుపు పంటలను సాగుచేశారు.ఈసారి మ గశిర కార్తెనుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి.మండలంలోని రైతులు పత్తితోపాటు సోయా పంటను ఈసారి అధికమొత్తంలో సాగుచేశారు.ఎడతెరిపిలేని వర్షాల వల్ల పంటలు తక్కువగా ఎదిగి గడ్డి ఏపుగా పెరిగింది.వర్షాలు కురుస్తుండడంతోపాటు గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల కలుపుతీయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురవని సమయంలో కలుపుతీద్దామన్నా కూలీల కొరత రైతులను వేధిస్తోంది.గతేడాది కలుపుకు కూలీ ధర రూ.150 నుంచి 200 ఉంటే ప్రస్థుతం అదే కూలీకి రూ.250 నుంచి రూ.300 వరకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.కొందరు రైతులు ఇక్కడ కూలీలు దొరకక పోవడంతో మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకువచ్చి వారికి ప్రయాణ ఖర్చులతో పాటు కూలీలను చెల్లిస్తున్నారు.పంట పెట్టుబడిలో సగం ఖర్చు కూలీలకే అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది అధికవర్షాలతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!
న్యూఢిల్లీః మహిళల భద్రతకు భరోసాను కల్పిస్తూ కార్పన్ మొబైల్ మరో అడుగు ముందుకేసింది. పూర్తి భద్రతా సామర్థ్యం కలిగిన పరికరాన్నిఅందించేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ దేశీయ మొబైల్ సంస్థ కార్బన్ ప్రకటించింది. మరో రెండు నెలల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేసే మొబైల్ ఎస్ ఓఎస్ అనువర్తనాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నపుడు, వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లకు అత్యవసర సందేశాలను పంపించేందుకు వీలుగా ఈ కొత్త సేఫ్టీ యాప్ పనిచేస్తుంది. మొబైల్ స్క్రీన్ పై ఒక్కసారి టాప్ చేస్తే చాలు.. కుటుంబ సభ్యులు, ఇతర అత్యవసర కాంటాక్ట్ నెంబర్లకు సమాచారం నిమిషాల్లో అందిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ తో పాటుగా వారి లొకేషన్ ను కూడ ముందుగా షేర్ చేస్తే... అత్యవసర పరిస్థితుల్లో వారున్న ప్రదేశాన్ని సైతం గుర్తించేట్టుగా కార్బన్ మొబైల్ కొత్త ఫీచర్ ను అందిస్తోంది. తాజా సదుపాయంతో వినియోగదారులు అలర్ట్స్ మాత్రమే కాక అలారం మోగించే అవకాశాన్ని కూడ కల్పిస్తోంది. మొబైల్ స్క్నీన్ లాక్ ను అన్ లాక్ చేయకుండా మొబైల్ ను షేక్ చేస్తూ, పవర్ బటన్ ను నొక్కుతుంటే చాలు... అలర్ట్స్ తో పాటు, అలారం కూడ అందే సదుపాయం కార్బన్ కొత్త ఫీచర్ ద్వారా పరిచయం చేస్తోంది. 2017 జనవరి 1 నుంచి మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా పానిక్ బటన్ ఇన్ స్టాల్ చేయాలన్న ప్రభుత్వ సూచనను కార్బన్ అమల్లోకి తెచ్చింది. దీనితోపాటు అన్నిఫోన్లలో జనవరి 2018 నాటికి తప్పనిసరిగా ఇన్ బిల్ట్ జీపీఎస్ నేవిగేషన్ సిస్టమ్ ఉండాలని కూడ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ సూచనలను హ్యండ్ సెట్ ఇండస్ట్రీ బాడీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) కూడ స్వాగతించింది.