administrative officer
-
డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం
భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్... 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.60వేల వేతనం అందుకోవచ్చు!! ► పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ► మొత్తం పోస్టుల సంఖ్య: 300(అన్ రిజర్వ్డ్–121, ఓబీసీ–81, ఎస్సీ–46, ఎస్టీ–22, ఈడబ్ల్యూఎస్–30, పీడబ్ల్యూబీడీ–17) ► వేతనం: ఎంపికై ఉద్యోగంలో చేరిన వారికి వేతన శ్రేణి రూ.32795–రూ.62315 లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. ప్రారంభంలోనే మెట్రోపాలిటిన్ సిటీల్లో నెలకు రూ.60వేల వరకూ వేతనం అందుకోవచ్చు. ► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 30.09.2021 నాటికి విద్యార్హతల సర్టిఫికెట్ ఉండాలి. ► వయసు: 01.04.2021 నాటికి వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► ప్రిలిమినరీ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్ విధానంలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో ప్రతి విభాగంలో కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పోస్టుల సంఖ్యకు 15 రెట్ల మందిని మెయిన్ రాసేందుకు అనుమతిస్తారు. ► మెయిన్ పరీక్ష: మెయిన్ పరీక్షలో ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్కులకు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు టెస్టులుఆన్‌లైన్ విధానంలోనే జరుగుతాయి. ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50మార్కులకు, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 50మార్కులకు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారి డిస్క్రిప్టివ్ పరీక్ష పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. ► డిస్క్రిప్టివ్ పద్ధతిలో 30 మార్కులకు జరిగే పరీక్షలో.. ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరీక్షించేలా లెటర్ రైటింగ్ పది మార్కులకు, ఎస్సే 20 మార్కులకు అడుగుతారు. ► మెయిన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ► మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన స్కోర్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 21.09.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 2021 ► ఆన్లైన్ మెయిన్ పరీక్ష: నవంబర్ 2021 ► వెబ్సైట్: www.newindia.co.in/portal -
తొలిసారి: హిందూ యువతికి పాక్‌లో అత్యున్నత పదవి
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో ఓ హిందూ యువతి సత్తా చాటింది. ఆ దేశంలోని అత్యున్నత పదవిని అధిష్టించనుంది. ఆ దేశ అత్యున్నత ఉద్యోగానికి ఎంపికై అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఆ దేశంలో ఓ హిందూ యువతి ఆ బాధ్యత చేపట్టడం ఇది తొలిసారి. ఆమెనే పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని షికార్పూర్ జిల్లాకు సనా రామ్‌చంద్. మన దేశంలో సివిల్స్ మాదిరి పాకిస్తాన్లో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్). సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్ఎస్)లో హిందూ యువతి సనా రామ్‌చంద్ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్)కు ఎంపికైంది. అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఈ సీఎస్ఎస్ పరీక్షను 18,553 మంది రాయగా వారిలో 221 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో సనా రామ్‌చంద్ ప్రతిభ కనబర్చడంతో ఆమె పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌కు ఎంపికైంది. అంటే మనదేశంలో ఐఏఎస్ మాదిరి. సనా వృత్తిరీత్యాఆ వైద్యురాలు కూడా. సింధ్ ప్రావిన్స్‌లోని చంద్కా వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం సింధ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీలో ఎఫ్‌సీపీఎస్ చదువుతున్నది. సర్జన్ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. చదవండి: మేకను తప్పించి సింహానికి బలైన యువకుడు చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ -
ఆయన సేవలు మాకొద్దు
సాక్షి, వేంపల్లె(కడప) : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ అర్జున్ నాయక్ సేవలు మాకొద్దంటూ ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ కె.చెంచురెడ్డి, ట్రిపుల్ ఐటీ పరిపాలనా అధికారి మోహన్‌కృష్ణ చౌదరిలు పేర్కొన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలో అర్జున్ నాయక్ (సీఐ) మహిళా సెక్యూరిటీ గార్డులను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు అందాయన్నారు. గత రెండేళ్లుగా సెక్యూరిటీ ఆఫీసర్‌గా సీఐ కేడర్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారన్నారు. అయితే ఇక్కడి అధికారులకు తెలియకుండానే బయోమెట్రిక్ యంత్రాలు ఒక్కరోజు రాత్రి ట్రిపుల్ ఐటీలోని తన గెస్ట్‌హౌస్‌కు షిప్టు చేశారని తెలిసింది. ఈ విషయం సెక్యూరిటీ ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. అంతేకాకుండా మహిళా సెక్యూరిటీ గార్డులపట్ల ఆయన అసభ్యకరంగా మాట్లాడుతున్నారని గత కొద్దిరోజుల నుంచి ఆరోపణలు రావడంతో బాధితులను పిలిపించి మాట్లాడామన్నారు. రెండు నెలల నుంచి ఆయన ఆరాచకాలు భరించలేకపోతున్నామని చెబితే తమ ఉద్యోగాలు ఎక్కడపోతాయోనని బాధితులు అధికారుల ముందు కన్నీరుమున్నీరు పెట్టుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం అర్జున్ నాయక్ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కావదతడంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ట్రిపుల్ ఐటీ అధికారులు లేఖ పంపనున్నట్లు వారు తెలిపారు. -
ఏసీబీ గాలానికి చిక్కిన ఇంజనీర్..
సాక్షి, గుంటూరు : పట్టణంలో మరో అవినీతి అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు ఏసీబీ అధికారులు. ఏఓగా పనిచేస్తున్న మధవరావు అక్రమాస్తుల చిట్టా ఒక్కక్కటిగా విప్పారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఇతనికి ఇరవై విలువైన ఇళ్ల స్థలాలు, నాలుగు నివాస గృహాలకు సంబంధించిన రికార్డులను గుర్తించారు. అంతేకాక ఏడు లక్షల రుపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు ఆరు కోట్ల రుపాయలు. ఏకకాలంలో ఇతని బంధువుల ఇంటిపై కూడా అధికారులు దాడి చేశారు. పొన్నూరు మండలం మాచవరంలో ఇతని బినామీ చిట్టిబాబు ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం (గుంటూరు)/విశాఖ క్రైం/శ్రీకాకుళం/హైదరాబాద్: విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న జి. లక్ష్మీప్రసాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు హైద్రాబాద్‌లో మొత్తం 20చోట్ల బుధవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. దాడుల్లో రూ.1.84 కోట్ల విలువ చేసే చరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ వెల్లడించారు. లక్ష్మీప్రసాద్‌తోపాటు ఆయన బంధువులు, బినామీల నివాసాల్లో జరిపిన సోదాల్లో పలు ఇళ్లు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటికి సంబంధించిన దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో లక్ష్మీప్రసాద్ అత్త పేరిట రెండు ఎకరాల వ్యవసాయ భూమి, తెలంగాణలోని మహేశ్వరం మండలం అమీర్‌పేటలో ఆయన బంధువు పేరిట రెండెకరాల వ్యవసాయ భూమి, పరిగిలో నాలుగు ప్లాట్లు, 30తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, విలువైన సెల్ఫోన్లు, రూ.34లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన చరాస్తుల్లో.. రూ.కోటి విలువ చేసే ప్రాంసరీ నోట్లు, బ్యాంకు నిల్వ రూ.34 లక్షలు, నగదు రూ.32 వేలు, రూ.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు రూ.10 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక లాకర్ ఉన్నాయి. స్థిరాస్తుల విలువ తెలియాల్సి ఉంది. శ్రీకాకుళంలోని లక్ష్మీప్రసాద్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న అధికారులు -
సోషల్ వెల్ఫేర్ అధికారి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
పులివెందుల: ప్రస్తుం కర్నూలు జిల్లా ఆత్మకూరులో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి కార్యాలయంలో ఏవో గా పనిచేస్తున్న రాజ కుళ్లాయప్ప ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో కర్నూలు, కడప జిల్లాల్లో ఏడుచోట్ల తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగిస్తోంది. గతంలో ఈయన పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి బీసీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయన్న అభియోగంపై పులివెందుల, వేంపల్లిలోని ఆయన ఇళ్లలో, ప్రైవేట్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఆయన స్నేహితుడు, సెరికల్చర్ ఉద్యోగి అయిన జగన్మోహన్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు నిర్వహించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. -
ఏఓ కిరణ్‌కుమార్‌రెడ్డి సస్పెన్షన్
అనంతపురం అగ్రికల్చర్: కళ్యాణదుర్గం భూసంరక్షణా విభాగంలో పనిచేస్తున్న వ్యవసాయాధికారి (ఏఓ) కె.కిరణ్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. బ్రహ్మసముద్రం మండలానికి ఇన్చార్జ్ ఏఓగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ విత్తన పంపిణీతో ఇతర వ్యవసాయ పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నందున ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. -
ఆ ఒప్పందంతో 2 వేల ఉద్యోగాలు ఢమాల్
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా వెలిగిన యాహూను సొంతం చేసుకున్న వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్ ఉద్యోగులపై భారీ వేటు వేయనుంది. యాహూ కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో రెండు కంపెనీలకు చెందిన దాదాపు 2 వేల మందిని ఇంటికి పంపించనుందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం 2 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంక్ తొలగించనుంది. మొత్తం 4.48 బిలియన్ డాలర్లు ఒప్పందం పూర్తయిన అనంతరం ఈ తొలగింపులను చేపట్టనుంది. రెండు యూనిట్లకు చెందిన 15శాతం ఉద్యోగులను తగ్గించనుంది వీటిలోముఖ్యంగా కాలిఫోర్నియా సహా, అమెరికా వెలుపల ఉద్యోగులు ఇందులో ఉన్నారు. మరోవైపు యాహూ- వెరిజోన్ విలీనానికి వాటాదారుల సాధారణ సమావేశం గురువారం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం కంపెనీ విక్రయ ప్ర్రకియ మంగళవారం పూర్తి కానుంది. వెరిజోన్ , యాహూ విలీనంతో కొత్త వెంచర్ ఓథ్ ఉనికి లోనికి రానుంది. వెరిజోన్‌కు చెందిన అమెరికన్ మల్టీనేషనల్ మాస్ మీడియా కార్పొరేషన్ ఏఓఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ ఆర్ స్ట్రాంగ్ నేతృత్వంలోని ఓథ్ అనే నూతన సంస్థగా రీబ్రాండ్ అయింది. కాగా 2012లో యాహూ సీఈవోగాఎంపికైన మెరిస్సా మేయర్ పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడంతో వివాదం రగిలింది. ఈ క్రమంలోనే 2015లో యాహూ, తన వ్యాపారంలోని ముఖ్య విభాగాలైన డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఈ-మెయిల్, మీడియా విభాగాలను వేరిజోన్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు!
వికారాబాద్: బీటెక్ విద్యార్థి కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన కేసులో సస్పెండైన వ్యవసాయ అధికారిణి (ఏవో) నీరజ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడారు. ఎరువుల దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు తాను లంచం అడిగినట్టు కన్నారెడ్డి కుటుంబసభ్యులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె చెప్పారు. వెంటిలేటర్ లేకపోవడంతోనే ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతించలేదని అన్నారు. వ్యవసాయ కార్యాలయంలో తనతోపాటు మరో ఇద్దరు మహిళా అధికారులున్నారని, తమ పట్ల కన్నారెడ్డి, వారి కుటుంబసభ్యులే అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాకుండా తమ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని, అందుకే పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. రాత్రికి రాత్రే తనను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందని ఊహించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరగా.. ఏవో నీరజ రూ. 20 వేలు లంచం ఇవ్వాలని అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో అతనిపై స్థానిక పోలీసులతో దాడి చేయించినట్టు కథనాలు వచ్చాయి. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. దీంతో తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్‌పేట్ ఎస్సై రాజులపై పోలీసుల కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఏవో నీరజను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
కన్నారెడ్డి కేసు: సర్కారు సీరియస్
లంచం ఇవ్వబోనని చెప్పడమే కాక లంచగొండి అధికారిని ఏసీబీకి పట్టించాలని అనుకున్నందుకు పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కన్నారెడ్డి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కన్నారెడ్డిని చితకబాదిన కేసులో మోమన్‌పేట ఎస్ఐ రాజు, ఏఎస్ఐ వీరాస్వామితో పాటు హెడ్ కానిస్టేబుళ్లు వెంకటయ్య, శంకరయ్య, కానిస్టేబుళ్లు శివయ్య, రాఘవేందర్‌లను హెడ్ క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు. ఫెర్టిలైజర్ షాపు అనుమతి కోసం వ్యవసాయాధికారి నీరజను కన్నారెడ్డి కలిశారు. అయితే అందుకు అతడి నుంచి నీరజ రూ. 20వేల లంచం డిమాండ్ చేశారు. లంచం ఎందుకివ్వాలని అడిగినందుకు కన్నారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా నీరజ ఫిర్యాదుతో ఎస్ఐ రాజు, సిబ్బంది కలిసి కన్నారెడ్డిని చితకబాదారు. రాజు దాడితో కన్నారెడ్డి రెండు కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. దాంతో అతడు హైదారబాద్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
కన్నారెడ్డిపై దుర్మార్గం.. నీరజ, ఎస్సైపై కేసు
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ బీటెక్ విద్యార్థినిపై అమానుషంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. లంచం ఇవ్వలేనన్నందుకు పోలీసులు, స్థానిక వ్యవసాయ అధికారిణి నీరజ కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ కేసులో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్‌పేట్ ఎస్సై రాజులపై తాజాగా మంగళవారం పోలీసుల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందాలని భావించాడు. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా స్థానిక వ్యవసాయ అధికారి నీరజను కోరగా.. లైసెన్స్ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం ఇవ్వాలని ఆమె అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై కన్నారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ ఆధారాలు కోరడంతో ఆధారాలు సేకరించేందుకు అతను ప్రయత్నిస్తుండగానే.. ఈ విషయం తెలుసుకున్న నీరజ తన భర్తను పిలిపించుకొని అతనిపై దాడి చేసింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. అత్యంత దారుణంగా అతనిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని కుటుంబసభ్యులుఆరోపిస్తున్నారు. పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. చేతులతో కనిపించని దెబ్బలు కొట్టడంతో కన్నారెడ్డి రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని, ఇప్పటికే ఓసారి డయాలసిస్ చేశామని, భవిష్యత్తులోనూ ఈ దెబ్బల వల్ల అతని ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముందని వైద్యులు చెప్తున్నారు. తమ కొడుకును దారుణంగా కొట్టి హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే లంచం అడిగిన ఏవో నీరజపైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్నారెడ్డి కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
యాహూ ఇక గతమే.. కొత్త పేరెంటో తెలుసా?
ఇంటర్నెట్ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహూ కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. యాహూను సొంతం చేసుకున్న వెరిజాన్ కంపెనీ.. తన ఏవోఎల్ మెయిల్‌ను దానితో విలీనం చేసి.. ఓథ్ (ప్రమాణం) పేరిట కొత్త బ్రాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇకమీదట ఓథ్ మెయిల్, ఓథ్ ఫైనాన్స్ కంపెనీలు ఇంటర్నెట్ యూజర్లను పలుకరించనున్నాయి. వెరిజాన్ కంపెనీ 4.8 బిలియన్ డాలర్ల మొత్తానికి యాహూ కంపెనీని కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏవోఎల్ మెయిల్లో యాహూ విలీనమైన తర్వాత ఈ రెండింటినీ కలిపి.. ఓథ్ అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకురానున్నట్టు ఏవోఎల్ సీఈవో టిమ్ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్విట్టర్లో వెల్లడించారు. 'వందకోట్లకుపైగా వినియోగదారులు, 20కిపైగా బ్రాండ్లు, ఎదురులేని బృందం.. టేక్ ద ఓథ్ (ప్రమాణం చేయండి)' అంటూ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్వీట్ చేశారు. -
ఇన్ఫోసిస్ బైబ్యాక్ దిశగా తొలి అడుగు!
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు వీలుగా తొలి అడుగు పడింది. ఇందుకు వీలుగా నూతన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ)లో నిబంధనల మార్పు ప్రతిపాదనకు వాటాదారులు పోస్టల్ బ్యాలట్ విధానంలో ఆమోదం తెలిపినట్టు ఇన్ఫోసిస్ కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే, కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హోల్‌టైమ్ డైరెక్టర్ యూబీ ప్రవీణ్‌రావు పారితో షికం పెంపునకు కూడా వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. నూతన ఏఓఏ ప్రకారం ఇన్ఫోసిస్ సొంత కంపెనీ ఈక్విటీ షేర్లను లేదా సెక్యూరిటీలను బైబ్యాక్ విధానంలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ వివరించింది. ఇన్ఫోసిస్ వద్ద రూ.35,697 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రూ.12,000 కోట్ల మేర విలు వైన షేర్ల బైబ్యాక్ నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
ఏవో, ఏఈవో, హెచ్‌వో పోస్టుల భర్తీకి
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీకి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈ వో), ఉద్యానవన అధికారుల (హెచ్‌వో) పోస్టుల భర్తీకి ఉమ్మడి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ సమయంలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌ల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వ్యవసాయాధి కారులు, విస్తరణాధికారులు, ఉద్యానవన అధికారుల పోస్టుల భర్తీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, రాత పరీక్షకు అనుమతినిస్తూ ఫలితాలను వెల్లడించవద్దని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. తరువాత వీటిపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే మిగిలిన అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘ఏవో, ఏఈవో’ ఫలితాలను ఇవ్వండి
సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) పోస్టుల ఫలితాలను సీల్డ్కవర్లో తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏవో, ఏఈవోల పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
రూ.4 లక్షల ఎరువుల సీజ్
శింగనమల : ఎరువుల దుకాణలలో బయోపెస్టిసైడ్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని ఏఓ పవన్‌కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని నాయనపల్లిక్రాస్ వద్ద నున్న సాయిబాబా, ఆదిత్య ఎంటర్‌ప్రైజర్, లక్ష్మినరసింహా ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. జేడీఏ ఆదేశాల మేరకు ఈతనిఖీలు చేపట్టామని పవన్‌కుమార్ చెప్పారు. ఈమూడు షాపులలో నిల్వ ఉంచిన రూ. 4 లక్షల స్టాక్‌ను సీజ్ చేశామన్నారు. -
ఏఓపై దాడికి ఏఆర్ ఎస్సై యత్నం
సస్పెన్షన్‌కు రంగం సిద్ధం నెల్లూరు (క్రైమ్): జిల్లా పోలీస్ కార్యాలయ ఏఓపై ఏఆర్ ఎస్సై దాడికి యత్నించిన ఘటన శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చోటుచేసుకుంది. పోలీస్ అధికారుల సమాచారం మేరకు.. నాగభూషణం ఏఆర్ కానిస్టేబుల్‌గా గతంలో డిప్యూటేషన్‌పై చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలలో రైటర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన అందరితో పాటు 15 శాతం అలవెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంజూరులో జాప్యం జరగడంతో పలుమార్లు మినిస్టీరియల్ సిబ్బందిని కలిశారు. సమాధానం రాకపోవడంతో ఏఓ రాజశేఖర్‌ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించే వారికి అలవెన్స్ వర్తించదని ఏఓ ప్రభుత్వ జీఓను చూపించారు. ఈ విషయమై నాగభూషణం ఏఓపై కక్ష పెంచుకున్నారు. ఇటీవల ఆయన ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొంది జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏఓ పోలీస్ కార్యాలయానికి వచ్చి కారు దిగుతుండగా నాగభూషణం కర్రతో వెళ్తున్న విషయాన్ని గమనించిన డ్యూటీ ఆర్ఎస్సై అంకమరావు గార్డ్‌ను అప్రమత్తం చేయడంతో వారు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు నాగభూషణం యత్నించిచా సాధ్యం కాకపోవడంతో ఏఓను దుర్భాషలాడారు. విధుల బహిష్కరణ ఏఓపై దాడికి యత్నం విషయం తెలుసుకున్న మినిస్టీరియల్ సిబ్బంది విధులను బహిష్కరించారు. నాగభూషణంపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. నాగభూషణం వ్యవహారశైలిని వారు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎస్పీ విచారించి నివేదికను సమర్పించాల్సిందిగా ఏఆర్ ఆర్ఐ శ్రీనివాసరావును ఆదేశించారు. దీంతో మినిస్టీరియల్ సిబ్బంది ఆందోళనను విరమించారు. ఆర్ఐ పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఎస్పీకి నివేదికను సమర్పించారు. నాగభూషణాన్ని విధుల నుంచి సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. గతంలోనే రాజీనామా లేఖ నాగభూషణం వ్యవహారశైలి ఆది నుంచే భిన్నంగా ఉండేదని సమాచారం. ప్రమోషన్ విషయంలో కలత చెంది రెండు సార్లు తన ఉద్యోగానికి రాజీనామా లేఖను ఏఆర్ ఉన్నతాధికారులకు నాగభూషణం సమర్పించారు. ఉన్నతాధికారులు ఆయనకు కౌనెలింగ్ నిర్వహించి మంచిపద్ధతి కాదని సూచించడంతో తన యత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. -
పరడలో పంటపొలాలు పరిశీలన
కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామంలో బుధవారం వ్యవసాయ అధికారి బి. సన్నిరాజ్ పంటపొలాలను, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి ఆకు ఎరుపురంగులోకి మారితే మెగ్నిషియం లోపనివారణగా గుర్తించి ఒక లీటరు నీటి రెండు గ్రాముల మెగ్నిషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలని సూచించారు. వరి ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారటంతో పాటు వడ్ల గింజలపై నల్ల మచ్చలు ఏర్పడితే దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ఫ్రొఫెనోపాస్ కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట రైతులు ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శశిపాల్‌రెడ్డి, మాండ్ర వీరయ్య ఉన్నారు. -
సస్యరక్షణకు సమయమిదే..
సోయాబీన్‌కు తెల్లదోమ బెడద ఆందోళన అవసరం లేదు వ్యవసాయ జిల్లా ఉపసంచాలకులు మాధవి శ్రీలత జగదేవ్‌పూర్: రైతులు పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా వ్యవసాయ సంచాలకులు మాధవిశ్రీలత అన్నారు. గురువారం సాయంత్రం సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సాగవుతున్న సోయాబీన్ పంటలను జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు గ్రామాల్లో సోయాబీన్ సంటలు బాగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సోయాబీన్ పంటలను సాగు చేసిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పంటలు ఆర్థిక వయో పరిమితి దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు లేనందున్న పంటలకు తెల్లదోమ సోకే అవకాశం ఉందని, దోమ నివారణకు రైతులు తగిన పురుగుల మందులను కొట్టాలన్నారు. లార్వీన్, అవైట్, రీమాన్‌లాంటి మందులను పంటలకు పిచికారీ చేయాలని సూచించారు. వర్షం కురిసిన వెంటనే పంటలకు పోటాషియం వేయాలన్నారు. కార్యక్రమంలో వీడీసీ గౌరవ అధ్యక్షులు బాల్‌రాజు, ఏఓ నాగరాజు, ఏఈఓ దామోదర్, గ్రామ రైతులు సత్తయ్య, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
‘ఫసల్‌ను సద్వినియోగం చేసుకోండి
కందుకూరు : రైతులుప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఓ గీత సూచించారు. దానికి సంబంధించిన వివరాలను ఆమె మంగళవారం వెల్లడించారు. ఈ పథకంలో అన్ని ఖరీఫ్ పంటలకు రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియంను నిర్ధారించడం జరిగిందన్నారు. మొక్కజొన్న హెక్టార్‌కు రూ.50 వేల బీమాకు రైతు వాటాగా రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తే గ్రామం యూనిట్‌గా తీసుకుంటారన్నారు. వరి హెక్టార్‌కు రూ.70 వేలకు ప్రీమియం రైతు వాటాగా రూ.910, జొన్న హెక్టార్‌కు రూ.25 వేలకు గాను ప్రీమియం రూ.500, కంది హెక్టార్‌కు రూ.32,500 బీమాకు గాను రూ.650, పెసర, మినుము హెక్టార్‌కు రూ.25 వేల బీమా మొత్తానికి గాను ప్రీమియం రూ.500 చొప్పున చెల్లించాలని చెప్పారు. మొక్కజొన్న మినహా మిగతా పంటలన్నీ మండలం యూనిట్‌గా తీసుకుని నష్టపరిహారాన్ని అంచనా వేస్తారని వివరించారు. రుణం తీసుకోని రైతులు ప్రీమియంను ‘ఏఐసీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’పేరుతో డీడీ తీసి సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు డీడీ, పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్, బ్యాంక్ ఖాతాను జతచేసి సంబంధిత బ్యాంక్‌లో అందజేయాలన్నారు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతులకు ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంక్ నుంచి రుణం తీసుకునే రైతులకు సెప్టెంబర్ ఆఖరు వరకు గడువు ఉంటుందన్నారు. దరఖాస్తులు మీ-సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వరిలో జింక్ లోపం..
► జాగ్రత్తలు తీసుకోకుంటే పంట నాశనమే ► మెలుకువలు పాటిస్తే పంటకు చీడపీడలు దూరం ► మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్ : కరువులో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాస్తోకూస్తో రైతులు అక్కడక్కడా వరి పంటలను వేసుకుంటున్నారు. వాటిని కాపాడుకోవాలంటే మెలుకువలు తప్పవని.. అవి పాటించకుంటే పంట పాడవడం ఖాయమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. జింక్ లోపంతో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులు తప్పకుండా మెలుకువలు పాటిస్తే పంట దక్కుతుంది. వరిలో జింక్‌లోపం వల్ల కలిగే నష్టాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్ రైతులకు సూచించారు. జింక్ సల్పేట్ లోపిస్తే వచ్చే లక్షణాలు వరి ఆకుల పై నుంచి 3లేదా 4 ఆకుల మధ్య ఈనె పాలిపోతుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనెకు ఇరు పక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నదిగా , పెళుసుగా ఉండి వంచగానే శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బి చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు జాగ్రత్తలు ఇలా.. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి , రెండు పంటలు పండించేట్టయితే ప్రతి రబీ సీజ¯ŒSలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరు పై జింక్ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 5 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి. జింక్ లోపం వల్ల దాదాపు 10 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా జింక్ సల్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. వ్యవసాయ శాఖ తరఫున సబ్సిడీపై జింక్ సల్ఫేట్ అందుబాటులో ఉంది. ఇబ్రహీంపట్నం వ్యవసాయ శాఖ వద్ద సుమారు 5టన్నుల జింక్ అందుబాటులో ఉంది. రైతులు సద్విని యో గం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్ కోరుతున్నారు. పంటను కాపాడుకోవాలంటే జింక్ వేయాలి ప్రస్తుతం కరువులో వరిపంట వేసుకున్న రైతులు తప్పకుండా మెలుకువలు పాటించాలి. ఎప్పటికప్పుడు పంట ఏ రకంగా పెరుగుతుందో రైతు రోజూ పరిశీలించుకోవాలి. ఇటుక రంగుతో పైరు ఎర్రబారిన వెంటనే జింక్ వేసుకోవాలి . జింక్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట పాడువుతుంది. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుంటే మంచిది. – శ్రవణ్‌కుమార్, వ్యవసాయ శాఖ అధికారి -
ఉద్యోగులను ఐరన్ రాడ్‌తో బెదిరించి..
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ వర్క్స్(జేఎస్‌డబ్ల్యూ) ఓ పరిపాలన అధికారిని సస్పెండ్ చేసింది. ఆ సంస్థలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులపై ఆయన ఐరన్ రాడ్డుతో దాడి చేయడంతోపాటు అసభ్యకరపదజాలంతో తిట్టడంతో అతడిని సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. దీంతో సంస్థ ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కింది స్థాయి ఉద్యోగుల విషయంలో అంత దారుణంగా ప్రవర్తిస్తారా అని మందలిస్తూ అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
దిగొచ్చిన రవిశంకర్
న్యూఢిల్లీ :ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఎట్టకేలకు దిగి వచ్చారు. నిన్నటివరకు పైన్ కట్టేది లేదని భీష్మించిన రవిశంకర్ చివరికి అంగీకరించారు. కోర్టు తమకు విధించిన ఫైన్ చెల్లించేందుకు గడువు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు వారాల్లోగా అయిదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని శుక్రవారం కోర్టును ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వేడుకుంది. అంత పెద్ద మొత్తాన్ని ఇప్పటికిపుడు చెల్లించలేమని తెలిపింది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, కల్చరల్ ఫెస్టివల్ ఆరంభమయ్యేలోపు అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్లో పేర్కొంది. అటు జైలుకైనా వెళతాకానీ, ఫైన్ కట్టేదిలేదన్న రవిశంకర్ వ్యాఖ్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన లాంటి వారినుంచి అలాంటి ప్రకటనను ఊహించలేమని, ట్రిబ్యునల్ ను వివాదాస్పదం చేయొద్దని హెచ్చరించింది. బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే తక్షణమే రూ.25 లక్షలు చెల్లించాలని, మిగిలిన రూ 4.75 కోట్లు చెల్లించడానికి వీలుగా 3 వారాల గడువును ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ ఈరోజు రూ .25 లక్షల చెల్లించడంలో సంస్థ విఫలమైతే ప్రభుత్వం జారీ చేసే 2.5 కోట్ల రూపాయలు ఎటాచ్ చేయబడతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఏ్రపిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమునా నది తీరంలో వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కు గ్రీన్ సిగ్నల్ పడినట్టయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నారు. అటు పండిట్ రవిశంకర్ నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవంపై ఇవాళ కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. రాజ్యసభలో రవిశంకర్ వైఖరిపై జేడీయూ నేత శరద్ యాదవ్ మండిపడ్డారు. కల్చర్ ఈవెంట్‌తో పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ ఆరోపించారు. -
ఏఈఈ, ఏవో పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 17, 18వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (సీబీఆర్టీ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్‌లో 48 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు దాదాపు 18 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, 18న ఉదయం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... ఏఈఈ పోస్టులకు 18న ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని వివరించారు. జనరల్ స్టడీస్ పేపర్ తెలుగు, ఇంగ్లిషు రెండు మాధ్యమాల్లోనూ ఉంటుందని.. ఆప్షనల్ (సబ్జెక్టు) పేపర్ మాత్రం ఇంగ్లిషులోనే ఉంటుందని తెలిపారు. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్ష కేంద్రాన్ని ముందుగానే చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో రిజిస్ట్రేషన్, తనిఖీలకు సమయం పడుతుందని, అందువల్ల ముందుగానే పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 లోపే, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 1:45 లోపే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పకడ్బందీగా నిర్వహించేందుకు నలుగురు జోనల్ అధికారులను, 800 మంది ఇన్విజిలేటర్లను, 700 మంది సపోర్టింగ్ స్టాఫ్, 150 మంది కమిషన్ అబ్జర్వర్లు, 12 స్పెషల్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్సైట్లో (tspsc.gov.in) పొందవచ్చని వివరించారు. -
రైతులకు పింఛన్ అందించాలి: వైఎస్ఆర్ సీపీ
ఆదిలాబాద్ అర్బన్ : రైతు సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. సమస్యలు పరిష్కరించాలని, కరువు మండలాలను ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్నరైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లి ఏవో రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. కరువు మండలాలు ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా తక్షణమే అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరువుతో ఇబ్బుందులు పడుతున్న రైతులకు రూ.5 వేల చొప్పున పింఛన్ అందించాలని, పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు దానాను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర రూ.6 వేలు ప్రకటించాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల కళ్లలో ఆనందం చూడాలనుకున్నారని, రైతు సంతోషంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుందనే వారని, కానీ ఈ ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్నా పాపన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం.గంగన్న, ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.