Advani
-
బాబ్రీమసీదు కూల్చివేత నేరస్తునికి భారతరత్నా?
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్తునిగా ఉన్న అడ్వాణీకి భారతరత్న ఇవ్వడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. హైదరాబాద్ మగ్ధూంభవన్‌లో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, తీర్మానాలు తదితర అంశాలను ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ట పండా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్, లోక్‌సభాపక్ష నేత బినాయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలుపొందితే దేశానికి విపత్తేనని, ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకుని, బీజేపీని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఆ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం ప్రతిపక్ష హక్కు అని, కానీ మోదీ, బీజేపీ ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందని ఆరోపించారు. రానున్న లోక్ ఎన్నికలకు తాము సన్నద్ధమవుతున్నామని, ఇండియా కూటమి కామన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తుందని, అదే సమయంలో తమ పార్టీ తరపున మేనిఫెస్టోను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ రాహుల్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే కేరళలో పోటీచేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో కేరళలో రాహుల్ పోటీ చేయడం ఆరోగ్య వాతావరణం కాదన్నారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ సమితి ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్ కౌర్, డాక్టర్ బి.కె.కంగో, నాగేంద్రనాథ్ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సంతోష్ కుమార్‌లను ఈ కమిటీ సభ్యులుగా నియమించారు. -
సైకిల్‌పై అద్వానీ.. పోస్టాఫీసులో కమల.. పెళ్లి జరిగిందిలా!
బీజేపీ మాజీ అధ్యక్షుడు, అటల్ ప్రభుత్వంలో ఉప ప్రధాని సేవలందించిన లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. కమలా అద్వానీ పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. విభజన తర్వాత వారి కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల చదువు పూర్తి చేసుకున్నాక, ఢిల్లీ పోస్టాఫీసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇదీ చదవండి: ఎల్కే అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం అదే సమయంలో ఆమెకు లాల్ కృష్ణ అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో లాల్ కృష్ణ అద్వానీ జర్నలిస్టుగా పనిచేసేవారు. ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారు. కమల అద్వానీలకు 1965, ఫిబ్రవరి 25న వివాహం జరిగింది. అద్వానీ భార్య కమలా అద్వానీ రాజకీయాల్లో కాలుమోపనప్పటికీ, పలు కార్యక్రమాలలో అద్వానీతో పాటు కనిపించారు. ఆమె అద్వానీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అలాగే అద్వానీ తినే ఆహారం మొదలుకొని, అతనిని కలుసుకునే వారి జాబితా వరకు అన్నింటిపై కమలా అద్వానీ ఒక కన్నేసి ఉంచేవారు. అద్వానీ ఒక సందర్భంలో తాను దేశానికే హోంమంత్రినని, ఇంటిలో తన సతీమణి కమలనే హోంమంత్రి అంటూ చమత్కరించారు. -
అయోధ్య రామ 'ప్రతిష్ట'
అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, శ్రీరాముని విగ్రహ ప్రతిష్టతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ట దేశ వ్యాప్తంగా ద్విగుణీకృతమైంది. వందల ఏళ్ళ నిరీక్షణకు నేటితో తెరపడింది. సనాతన సంప్రదాయవాదులంతా జై మోదీ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది రామభక్తులు చేసిన జైశ్రీరామ్ నినాదం దుందుభి వలె దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో, బీజేపీ మళ్ళీ విజయదుందుభి మోగిస్తుందనే విశ్వాసం రెట్టింపు శబ్దం చేస్తోంది. అయోధ్యలో బాలరాముని పునఃప్రతిష్ఠతో చరిత్ర పుటల్లో నరేంద్రమోదీ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్నారు. బీజేపీ కురువృద్ధులైన వాజ్పెయి, అద్వాణీకి కూడా దక్కని ఖ్యాతి మోదీకి దక్కింది. ఐదు వందల ఏళ్ళ ఆధునిక భారతంలో ఏ పాలకుడికి దక్కని కీర్తి మోదీకే దక్కింది. ఈ ఆలయ స్థాపన కోసమే నరేంద్రమోదీని విధి ఎంచుకుందని అద్వాణీ అన్న మాటలు అక్షరసత్యాలు. న్యాయ స్థానాల తీర్పుతో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ మహాక్రతువు సంపూర్ణమైంది. నరేంద్రమోదీ ఈ విధంగా చరిత్రలో గొప్పగా మిగిలిపోనున్నారు. అశేష ప్రశంసలతో పాటు విమర్శలు, వాదనలు వెల్లువెత్తాయి, ఎత్తుతూనే వున్నాయి. ప్రతిపక్షనేతలు, కొందరు పీఠాధిపతులు ఏ రీతిన, ఏ తీరున, ఏ స్థాయిలో వాగ్బాణాలు సంధించినా, బీజేపీ ప్రభుత్వం చెక్కు చెదరలేదు. తను సంకల్పించుకున్న యజ్ఞాన్ని సుసంపన్నం చేసుకుంది. పరమ భక్తి ప్రపత్తులతో నరేంద్రమోదీ నడుచుకున్న వైనం అందరినీ అబ్బురపరిచింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత జాతిని ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం కూడా ఎంతో ఆకట్టుకుంది. 11రోజులు పాటు ఉపవాస దీక్ష చేసి, విగ్రహ ప్రతిష్ట చేసి, ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి కోట్లాదిమందిని ఆయన ఆకట్టుకున్నారు. దేశభాషలలోని అన్ని ప్రసిద్ధ రామాయణాలను కూడా అంతే శ్రద్ధతో విని రామాయణ జ్ఞానాన్ని కూడా పరిపుష్టం చేసుకున్నారు. ఆ జ్ఞాన సంస్కార ఫలంతో శబరి, గుహుడు, ఉడుత నుంచి జటాయువు వరకూ ఆయా పాత్రల నుంచి ఎటువంటి స్ఫూర్తిని పొందాలో జాతికి మోదీ సవివరంగా చాటిచెప్పారు. దేశంలోని ప్రముఖులంతా అయోధ్యలో బారులుతీరారు. కోట్లాదిమంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అయోధ్యలో ఇక కాల్పులు, కర్ఫ్యూలు ఉండవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేశారు. అంతకంటే కావాల్సింది ఇంకేముంది? మతకల్లోలాలు లేకుండా శాంతి స్థాపన జరిగితే ఎల్లరకూ సంతోషమే. భిన్న మతాలకు, సంస్కృతులకు ఆలవాలమైన భారతదేశంలో సర్వమత సోదరత్వం సౌందర్య శోభితం. సహనం సదా శక్తిమంతం. మెజారిటీ ప్రజలు హిందువులే అయినప్పటికీ, అందరి ఆలనాపాలనా పాలకుల ప్రథమ కర్తవ్యం. రాజకీయ ప్రయోజనాలు, ఓటుబ్యాంక్ రాజకీయాలు ఉండవచ్చు గాక. దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట చిరకాల స్వప్నమే. న్యాయ, రాజకీయ పోరాటలన్నింటినీ అధిగమించి.. రామునికి శాశ్వత మందిరం నిర్మించిన ఘనత నరేంద్రమోదీ సారథ్యంలోనే బీజేపీకే నూటికి నూరు శాతం దక్కుతుంది. దక్కింది కూడా. ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ క్రితం 1528 ప్రాంతంలో మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ వద్ద జనరల్ హోదాలో వున్న మీర్ బాఖి అయోధ్యలో మసీదు నిర్మించారు. శ్రీరాముడి జన్మస్థలానికి గుర్తుగా అప్పటికే అక్కడ వెలసి వున్న ఆలయంపై మసీదు నిర్మించారన్నది వాదన. ఇలా మొదలైన ఈ వివాదం రకరకాల రూపు తీసుకుంది. ఇప్పటికి ఆలయం మళ్ళీ వెలసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ అగ్రనేత అద్వాణీ చేపట్టిన రధయాత్రను తలచుకొని తీరాలి. 1990లో చేపట్టిన ఈ యాత్ర ప్రభావం ఈరోజు ఈ ఫలితానికి పునాదియై నిలవడమే కాక, నేటి బీజేపీ ప్రాభవానికి, మోదీ వైభవానికి మూలమై నిలిచింది. చలి ఎక్కువగా ఉందనే కారణంతో అయోధ్య ఉత్సవానికి అద్వాణీ రాలేదు. నిజానికి! గర్భగుడిలో ఈరోజు ప్రవేశం పొందిన ఐదుగురుతో పాటు అద్వాణీ కూడా ఉండవలసింది. కారణాలు ఏవైనా ఆయనకు ఆ ప్రతిష్ట దక్కలేదు. బహుశా! అందుకే ఆయన రాలేదేమో! చట్టపరమైన గండాలన్నింటినీ దాటుకొని, 2020 ఆగస్టు 5 వ తేదీన ఆలయ నిర్మాణానికి శ్రీకారం జరిగి, నేటికి ప్రాణప్రతిష్ఠ పూర్తిచేసుకొని, కోట్లాదిమంది భక్తుల సందర్శనానికి సిద్ధమైంది. వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా వుండేలా నిర్మాణం పూర్తి చేసుకుంది. నేటి నుంచి అయోధ్య గొప్ప పర్యాటక ప్రాంతంగా వెలుగనుంది. రామవిగ్రహ స్థాపన జరిగింది. ఆ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని, సర్వజనహితంగా ధర్మపాలన సాగిస్తే, అదే నిజమైన రామరాజ్యం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
కూల్చివేతపై కేసు ఎందుకు..?: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు చట్ట విరుద్ధమైతే కూల్చివేతపై కేసు ఎందుకు నడుస్తోంది, అద్వానీపై విచారణ ఎందుకు జరుగుతోందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూటిగా ప్రశ్నించారు. మిలాద్–ఉన్–నబీ సందర్భంగా శనివారం అర్ధ రాత్రి హైదరాబాద్‌లోని దారుస్సలాం మైదానంలో జరిగిన రహమతుల్–లిల్–అలామీన్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బాబ్రీ మసీదు చట్టవిరుద్ధమైతే కూల్చివేతకు పాల్పడిన వారు భూమిని ఎలా పొందగలుగుతారని చెప్పారు. సాధారణంగా ఒకరి ఇంటిని కూల్చేసిన వ్యక్తికి అదే ఇల్లు మరలా ఎలా లభిస్తుందని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు తీర్పుపై రాజ్యాంగబద్ధంగా అభిప్రా యాన్ని వ్యక్తం చేసే హక్కు తమకు ఉందని గుర్తు చేశారు. బాబ్రీ మసీదుపై చట్టపరమైన హక్కు కోసం పోరాటం చేశామని, మసీదుకు ప్రత్యామ్నాయంగా 5ఎకరాల భూమి ఇవ్వ డం అవమానించడమేనన్నారు. సుప్రీంలో ముస్లింల పక్షాన ప్రాతినిధ్యం వహించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఇస్లామిక్ స్కా లర్స్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
అద్వానీ ఇంటికి నరేంద్ర మోదీ
-
నేడు సీబీఐ కోర్టుకు అద్వానీ, జోషీ
-
‘అద్వానీ కాదు నేను.. ఉరికి కూడా రెడీ’
ఫైజాబాద్: ‘అద్వానీకి సంబంధం లేదు.. ఆ రోజు కరసేవకులను రెచ్చగొట్టింది నేను. శిక్ష అనుభవించేందుకు నేను సిద్ధం. ఉరి తీయించుకునేందుకు కూడా రెడీ’ అంటూ బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి కుట్ర పూరిత నేరం కేసు దర్యాప్తు జరగాల్సిందేనని, అందులో బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి తదితర సీనియర్ నేతలను చేర్చాల్సిందేనని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ విలాస్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బాబ్రీ ఘటనలో అద్వానీ పాత్ర లేదు. ఆ రోజు కూల్చివేత జరుగుతున్నప్పుడు నేను వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్‌తో ఉన్నాను. కర సేవలకులను రెచ్చగొట్టింది నేను. నేను మరికొందరితో కలిసి ఆ రోజు కరసేవకులను రెచ్చగొడుతుంటే జోషీ, అద్వానీ, విజయ్ రాజే సింధియా మాత్రం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతియుత పరిస్ధితులు నెలకొల్పేందుకు ప్రయత్నించారు’ అని ఆయన చెప్పారు. బాబ్రీ కేసులో ఈయన పేరు కూడా ఉంది. -
హరే రామ సారీ కృష్ణా..!
-
‘అద్వానీపై కుట్రేనేమో’ కతియార్ సంచలనం
న్యూఢిల్లీ: బీజేపీ నేత వినయ్ కతియార్ సంచలన వ్యాఖ్య చేశారు. బాబ్రీ కేసు విషయంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీపై నిజంగానే కుట్ర జరిగి ఉండొచ్చని అన్నారు. ఆయనను రాష్ట్రపతి రేసులో నుంచి తప్పించేందుకు ఇప్పుడు ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా అంగీకరించారు. రాష్ట్రపతి రేసులో లేకుండా చేసేందుకు అద్వానీపై ప్రధాని నరేంద్రమోదీ కుట్ర చేశారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కతియార్‌ను మీడియా ప్రశ్నించగా ‘ఏమో అతడు(లాలూ ప్రసాద్ యాదవ్) చెప్పినదాంట్లో నిజం ఉండొచ్చేమో. నాకు తెలియదు’ అని అన్నారు. బజరంగ్దళ్ వ్యవస్థాపకుల్లో కతియార్ ఒకరిగా ఉండటమే కాకుండా మంచి సీనియర్ నాయకుడు. ఈయనపై కూడా బాబ్రీ కేసుకు సంబంధించి ఆరోపణలు మొదలయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్ జోష సహా 16మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం, విచారణకు ఆదేశించింది. అద్వానీతోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపై విచారణ ఉపసంహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి పదవి రేసులో లేను: అద్వానీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవిపై బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవి... ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. గత కొంతకాలంగా ఈ పదవికి సంబంధించి అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే దీనిపై మోహన్ భగవత్ కూడా గతంలోనే స్పష్టత ఇచ్చారు. తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని, ఇలాంటి వార్తలన్నీ వినోదం కోసం సృష్టించినవే అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కాగా పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తామని సోమనాథ్ జ్యోతిర్లింగం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మోదీ ఇటీవల గుజరాత్లో పర్యటించినప్పుడు చెప్పారు. తనకు అద్వానీ గురువు అని, ఆయనకు సముచిత స్థానం కల్పించి గురుదక్షిణ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దీంతో రాష్ట్రపతిగా అద్వానీని చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా అద్వానీ కూడా తాను ప్రెసిడెంట్ రేస్‌లో లేనంటూ ఆ వదంతులకు బ్రేక్ వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. -
బాబ్రీ కూల్చివేత కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసం కేసు విచారణను సుప్రీంకోర్టు రెండువారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 6తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమాభారతి సహా 13మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలు తొలగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ్టికి కేసు వాయిదా వేసింది. మరోవైపు కుట్ర అభియోగాలకు సంబంధించి తమ వాదనలు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. వాస్తవానికి ఈ అంశంపై బుధవారమే తీర్పు రావాల్సి ఉన్నా జడ్జి గైర్హాజరుతో తీర్పు ఇవాళ్టికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా తీర్పు ప్రకటించలేదు. కాగా బాబ్రీ ఘటనకు సంబంధించి అద్వానీ, వినయ్ కటియార్, కళ్యాణ్ సింగ్ సహా 13 మంది బీజేపీ నేతలపై కేసు నమోదైంది. అయితే అద్వానీ సహా 12 మందిపై నమోదైన కుట్ర అభియోగాలను లక్నోలోని ట్రయల్ కోర్టు కొట్టేయగా... అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ నిర్ణయాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఈ నెల 6వ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కుట్ర అభియోగాల తొలగింపును తప్పుబట్టింది. -
వాజ్‌పేయిని దింపి.. అడ్వాణీని కూర్చోబెట్టాలని..!
న్యూఢిల్లీ: ఆప్తమిత్రుడు అడ్వాణీ నుంచే తనకు పదవీగండం ఉందని మాజీ ప్రధాని వాజ్‌పేయి భయపడ్డారా? ప్రధాని పదవి నుంచి తనను తొలగించి అడ్వాణీని నియమించేందుకు కొందరు తెరవెనుక మత్రాం గం చేశారని వాజ్‌పేయి భావించారా? ఈ ప్రశ్నలకు తాజాగా ప్రఖ్యాత జర్నలిస్ట్ ఎన్ పీ ఉల్లేఖ్ రాసిన ‘ది అన్ టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారడాక్స్’ అనే పుస్తకం అవుననే బదులిస్తోంది.ఉపప్రధానిగా అడ్వాణీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తరువాత ఈ కుట్ర జరిగిందని అందులో పేర్కొన్నారు. ఒకరోజు ఒక మంత్రిని తన నివాసానికి పిలిపించుకున్న వాజ్‌పేయి.. ఈ కుట్ర గురించి ఆయనకు చెప్పారని, అందుకు ఆ మంత్రి అంతగా భయపడాల్సిన అవసరం లేదని సమాధానమివ్వగా.. ఈ కుట్రను తాను నమ్ముతున్నానని, అయితే, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలియదని వాజ్‌పేయి పేర్కొన్నారని ఉల్లేఖ్ రాశారు. అంతకు కొన్ని రోజుల ముందే.. వాజ్‌పేయికి రాష్ట్రపతి బాధ్యతలు అప్పగించి.. ప్రధానిగా అడ్వాణీకి అవకాశమివ్వాలని ఆరెస్సెస్ చెప్పడాన్నీ ప్రస్తావించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి గుజరాత్ సీఎం మోదీ పదవి నుంచి దిగిపోవాలని వాజ్‌పేయి బలంగా వాదించారని, అయితే, అలా జరిగితే గుజరాత్లో మరిన్ని అల్లర్లు చెలరేగుతాయంటూ అడ్వాణీ అడ్డుకున్నారన్నారు. -
డిల్లీ లో తలైవా
♦ మోదీ, అద్వానీలతో భేటీ కసరత్తు ♦ కమలంలో జోష్ దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీలతో భేటీకి కసరత్తుల్లో ఉన్నారన్న సమాచారం రాష్ర్టం లోని కమలనాథుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సాగనున్న ఈ భేటీని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. సాక్షి, చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అశేషాభిమానుల గురించి తెలిసిందే. ఆయన్ను రాజకీయాల్లో రప్పిం చేందుకు అభిమానులతో పాటు పలు పార్టీలు తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నాయి. అయితే తలైవా ఎక్కడా చిక్కడం లేదు. దేవుడు ఆదేశిస్తే...అంటూ తనదైన బాణిలో ముందుకు సాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సమయాల్లో మాత్రం ఆయన వ్యవహార శైలి మీద అభిమానులు ఓ కన్ను వేయడం సహజం. ఆ దిశగా గతంలో ఓ మారు బీజేపీకి అనుకూలంగా ఆయన పరోక్ష సంకేతం ఇవ్వడం జరిగింది. అయితే, ఆ ఎన్నికల్లో రజనీకాంత్ సంకేత పాచికలు పారలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు అనుకూలంగా పరోక్షం వ్యాఖ్యలతో ముందుకు సాగిన రజనీకాంత్, తదుపరి మౌన ముద్ర అనుసరించడం మొదలెట్టారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ స్వయంగా రజనీకాంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఆ సమయంలో తలై‘వా’ అంటూ అభిమానులు నినదించినా రాజకీయాల వైపు మాత్రం తలెత్తి చూడలేదు. యథాప్రకారం తన దైన శైలిలో పరోక్ష సంకేతంతో లింగా సినిమా మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత కొంత కాలంగా రాజకీయ వార్తలకు దూరంగా ఉన్న రజనీకాంత్ పేరును మళ్లీ తెరమీదకు తెచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికలు దోహదకారిగా మారి ఉన్నాయి. ఆయన్ను రాజకీయాల్లో రప్పించేందుకు ప్రయత్నాలు చేసి చివరకు మద్దతు కోసం కమలనాథులు తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నారు. మెగా కూటమి యత్నాలు పటాపంచెలు కావడంతో, ఇక, కథానాయకుడి మద్దతు కూడగట్టుకుని ఎలాగైనా తమ ప్రతినిధుల్ని అసెంబ్లీలో అడుగు పెట్టించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నారు. ఈ సమయంలో సూపర్ స్టార్ ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నేత అద్వానీలను కలవడానికి అనుమతి కోరిన సమాచారంతో కమలనాథుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ భేటీని తమకు అనుకూలంగా మలచుకుని సూపర్ స్టార్ పరోక్ష సంకేతాలు తమ వైపు ఉండేందుకు తగ్గ వ్యూహాల్ని రచించే పనిలో పడ్డారు. ఢిల్లీలో తలైవా : స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ రోబో -2(2.వో) చిత్రీకరణ ఢిల్లీలో సాగుతోంది. నెల రోజుల పాటుగా అక్కడి ఓ స్టేడియంలో ఈ షూటింగ్‌కు ఏర్పాట్లు చేసి ఉన్నారు. నెల రోజులు అక్కడే బస చేయాడానికి సూపర్‌స్టార్ నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెలాఖరులో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సైతం ఉండడంతో పనిలో పనిగా అక్కడే ఉండి ఆ పురష్కారం అందుకునేందుకు రజనీ కాంత్ సిద్ధమవుతున్నారు. షూటింగ్లో భాగంగా ఢిల్లీలో తిష్ట వేసిన రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్‌నేత అద్వానీలను కలవడానికి అనుమతి కోరి ఉండడం గమనార్హం. రజనీకాంత్ తరఫున ఈ అనుమతి కోరుతూ, వినతి పత్రం ఈ- మెయిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నేత అద్వానీల కార్యాలయాలకు చేరాయి. పద్మా అవార్డుల ప్రదానోత్సవానికి ముందే ఈ భేటీకి తగ్గ అనుమతి రజనీ కాంత్‌కు దక్కవచ్చని కమలనాథులు పేర్కొంటుంన్నాయి. ఈ భేటీ ద్వారా రానున్న ఎన్నికల్లో తమకు అనుకూలంగా కథానాయకుడు ఏదేని పరోక్ష సంకేతాం ఇస్తారన్న భావనలో కమలనాథులు పడ్డారు. -
మూల్యం తప్పదు: శివసేన
పాక్ గడ్డను ముద్దాడితే..వాజ్‌పేయి, అద్వానీలకూ అదే గతి పట్టింది ‘సామ్నా’లో చురకలు ముంబై: ఎన్డీఏ భాగస్వామి శివసేన మరోసారి ప్రధానిపై ధ్వజమెత్తింది. పాకిస్తాన్ గడ్డను ముద్దాడినందుకు మోదీ భారీ మూల్యం చెల్లించకతప్పదని మండిపడింది. పాక్‌కు దగ్గరయ్యేందుకు యత్నించిన వాజ్‌పేయి, అద్వానీ లాంటి బీజేపీ అగ్రనేతల రాజకీయ గ్రాఫ్ ఎంతగా పడిపోయిందో మోదీ గుర్తుంచుకోవాలంది. ‘ఎల్కే అద్వానీ ఒకసారి ముహమ్మద్ అలీ జిన్నా సమాధి వద్దకు వెళ్లి ఆయనను కీర్తించారు. ఆ తర్వాతే అద్వానీ రాజకీయ గ్రాఫ్ పతనం ప్రారంభమైంది.’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది. ‘ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి లాహోర్ బస్సు దౌత్యం నెరిపారు. ఆ దేశ మాజీ నియంత ముషార్రఫ్‌తో ఆగ్రాలో చర్చలు జరిపారు. ఆ తర్వాత వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ ఎన్నడూ అధికారంలోకి రాలేదు’ అని శివసేన పేర్కొంది. అయితే కాంగ్రెస్ ప్రధాని ముందస్తుగా ప్రకటించకుండా పాకిస్తాన్‌కు వెళ్తే బీజేపీ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలని ఉందని తెలిపింది. మోదీ మాదిరి కాంగ్రెస్ ప్రధాని కూడా అకస్మాత్తుగా లాహోర్‌కు వెళ్తే బీజేపీ ఇలాగే స్వాగతిస్తుందా అని యావద్దేశం ప్రశ్నిస్తోందని చెప్పింది. పాక్ గడ్డ శాపగ్రస్తమైందని, దాన్ని ముద్దాడినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని, ఎందుకంటే లక్షలాది మంది అమాయక భారతీయుల నెత్తురు రగిలిపోతుందని పేర్కొంది. -
అద్వానీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత ఎల్‌కె. అద్వానీకి మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు నుంచి విముక్తిపై న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. అద్వానీతో పాటుమురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు వీహెచ్‌పీ నేతలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో న్యాయస్థానం వివరణ కోరింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాగా బాబ్రీ కేసు నుంచి అలహాబాద్ కోర్టు అద్వానీకి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసు నుంచి అద్వానీ సహా 19 మందికి ఉపసమనం కల్పిస్తూ అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పును సిబిఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారన్న కేసు నుంచి అద్వానీ, కల్యాణ్ సింగ్, ఉమాభారతి, వినయ్ కటియార్, మురళీ మనోహర్ జోషి తదితరులకు అలహాబాద్ హైకోర్టు ఉపశమనం కల్పించింది. సతీష్ ప్రధాన్, సిఆర్ బన్సల్, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, సాధ్వీ రితంబర, విహెచ్ దాల్మియా, మహంత్ అవైధ్యనాథ్, ఆర్వి వేదాంతి, పరమ్ హాన్స్ రామ్ చంద్రదాస్, జగదీష్ ముని మహారాజ్, బిఎల్ శర్మ, నృత్యగోపాల్ దాస్, ధరమ్‌దాస్, సతీష్ నాగర్, మరేశ్వర్ సావే పేర్లను తొలగించారు. మరణానంతరం బాల్ థాకరే పేరును జాబితాలోంచి తీసివేశారు. -
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
-
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, యోగా గారు బాబా రామ్‌దేవ్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, పండిట్ రవిశంకర్‌లను కేంద్రం పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించనుంది. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌తో పాటు మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామిలకు పద్మభూషణ్ పురస్కారాలు లభించనున్నాయి. భారత హాకీ టీం కెప్టెన్ సర్దార్‌సింగ్, తెలుగు తేజం-స్టార్ షట్లర్ పీవీ సింధులు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌లను కూడా కేంద్రం పద్మ పురస్కారాలతో సత్కరించనుంది. ఈ నెల 25న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. * ఎల్.కె.అద్వానీ, అమితాబ్, శ్రీశ్రీ రవిశంకర్, బాబా రాందేవ్లకు పద్మవిభూషణ్ * దిలీప్ కుమార్ ఎన్. గోపాలస్వామికి పద్మభూషణ్ * పి.వి.సింధు, సర్దార్ సింగ్‌లకు పద్మశ్రీ * ప్రకాశ్ సింగ్ బాదల్, రజనీకాంత్లకు పద్మ అవార్డులు -
'వాజ్‌పేయిని స్కూటర్‌పై తీసుకెళ్లేవాణ్ని'
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్‌పేయితో తన స్నేహం అపూర్వమైనదని బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని ఎల్ కే అద్వానీ అన్నారు. వాజ్‌పేయికి అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో అద్వానీ మాట్లాడుతూ.. వాజ్‌పేయితో తన సుదీర్ఘ స్నేహబంధాన్నిగుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి తాను యువకులుగా ఉన్నప్పుడు స్కూటర్‌పై తిరిగేవాళ్లమని అద్వానీ చెప్పారు. వాజ్‌పేయిని తన స్కూటర్‌పై వెనుక కూర్చొబెట్టుకుని చాట్ తినేందుకు ఢిల్లీలోని కనాట్ ప్లేస్ కు వెళ్లేవారిమని గుర్తుచేసుకున్నారు. అటల్ జీకి చాట్ అంటే చాలా ఇష్టమని ఆయన కోసం తాను వెళ్లేవాడినని చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీగా ఎదుగుదలలో వాజ్‌పేయి, అద్వానీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధానిగా పనిచేశారు. -
సాక్షి కార్టూన్ (23-12-2014)
పార్టీలో, ప్రభుత్వంలో మీకు న్యాయం జరగడం లేదని ప్రభుత్వం పడిపోయి సంకీర్ణం వస్తుందంటారా! -
ఆస్తులు చెప్పని 401 మంది ఎంపీలు
జాబితాలో సోనియా గాంధీ, అద్వానీ, రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, ఉమాభారతి, నితిన్ గడ్కారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్... వీరంతా తమ ఆస్తులు, అప్పుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 26 నాటికి మొత్తం 401 వుంది ఎంపీలు తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాల్సి ఉందని సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు లోక్‌సభ సెక్రటేరియెట్ బదులిచ్చింది. నిబంధనల ప్రకారం ఎంిపీగా ప్రమాణం చేసిన 90 రోజుల్లోగా సభ్యులు తమ ఆస్తుల వివరాలను తెలపాలి. ఆస్తుల వివరాలు తెలియజేయని ఎంపీలలో 209 మంది బీజేపీ వారే. కాంగ్రెస్ నుంచి 31, టీఎంసీ 27, బీజేడీ 18, టీడీపీ 14, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలు కూడా ఆస్తుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. అక్రమ సంపాదన కాదు: సదానందగౌడ బెంగళూరు: ఎన్నికల తర్వాత తన ఆస్తి భారీగా పెరిగిందని, ఇదంతా అక్రమ సంపాదనే అని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని రైల్వే మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. మంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆస్తి విలువ పెరిగినంత మాత్రాన అదంతా అక్రమ సంపాదన అనడం సరికాదన్నారు. ఎన్నికల అనంతరం ఫెడరల్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు అప్పు తీసుకున్నానని, బెంగళూరు న్యూ బీఈఎల్ రోడ్‌లోని తన బహుళ అంతస్తుల భవనంలో కిరాయిదారుల నుంచి రూ.2 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నానని వెల్లడించారు. ఇందువల్ల ఎన్నికల అనంతరం తన ఆస్తి విలువ పెరిగిందే కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. -
దేశమంతటా ఉద్యమస్ఫూర్తి
న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా దాదాపు అన్ని వర్గాల ప్రజలు గురువారం దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో ఉద్యమస్ఫూర్తితో పాలు పంచుకున్నారు. గాంధీ జయంతి సందర్బంగా సెలవురోజైనప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. చీపుర్లు పట్టి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. లక్నోలోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో, అనంతరం బాలు అడ్డాలోని వాల్మీకి ఏరియాలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అలహాబాద్‌లో బీజేపీ అగ్రనేత అద్వానీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం ఝాన్సీలోని పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి ఉమాభారతి పరిశుభ్ర భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్లాస్టిక్‌ను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
అద్వానీని వరించిన పదవి
న్యూఢిల్లీ: వృద్ధాప్యం కారణంగా నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకోలేని 86 ఏళ్ల బిజెపి సీనియర్ నేత అద్వానీని మరో పదవి వరించింది. 75 ఏళ్లు దాటిన వారిని తన మంత్రి వర్గంలోకి మోడీ తీసుకోదలచుకోని విషయం తెలిసిందే. లోక్‌సభ నైతికవిలువల కమిటీ అధ్యక్షుడుగా ఎల్‌కె ఆద్వానీని స్పీకర్ సుమిత్రా మహాజన్ నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మల్కాజిగిరి టిడిపి ఎంపి చామకూర మల్లారెడ్డిని కూడా ఈ కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఈ కమిటీలో అరుమోజితెవాన్, నినాంగ్ రింగ్, షేర్ సింగ్ గుబే, హేమంత్ తుకారాం,ప్రహ్లాద జోషి, భగత్ సింగ్ కోష్యారి, అర్జున్ రామ్ మెగ్వాల్, భత్రుహరి, కరియా ముండే, జయశ్రీబెన్ పటేల్, సుమేథనాద్ సరస్వతి, భోల్ సింగ్‌లను సభ్యులుగా నియమించారు. ** -
‘హిందూ’ కేసులకు ప్రత్యేక కోర్టు
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో హిందూనేతల హత్యలు పెరిగిపోతున్నాయి. 2011 నుంచి వరుసగా హిందూ నేపథ్యం కలిగిన సంస్థల నేతల హత్యలు సాగుతూనే ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచారంలో భాగంగా 2011 అక్టోబర్ 28న భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వాని సాగే మార్గంలో పైప్ బాంబును కనుగొన్నారు. 2012 అక్టోబర్ 24వ తేదీన వైద్యవిభాగం సెల్ రాష్ట్ర అధ్యక్షులు అరవింద్‌రెడ్డి వేలూరులో దారుణ హత్యకు గురయ్యారు. గత ఏడా ది మార్చి 19వ తేదీ బీజేపీ మాజీ కౌన్సిలర్ పరమకుడి మురుగన్, జూన్ 26వ తేదీన మధురైలో పాలవ్యాపారి సురేష్లను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. జూలై 1వ తేదీ హిందూ మున్నని రాష్ట్ర కార్యదర్శి వెల్లయప్పన్, 19న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆడిటర్ రమేష్ సేలంలో హత్యకు గురయ్యారు. హిందూ మున్నని నేతలు మరికొందరు దుండగుల చేతిలో బలయ్యారు. ఈ హత్యలతో సంబంధం ఉన్న పోలీస్ ఫక్రుద్దీన్, ప న్నా ఇస్మాయిల్, బిలాల్ మాలిక్‌లను అరెస్ట్ చేశా రు. ఈ ముఠాలో సభ్యుడైన అబూబకర్ సిద్దిక్ పోలీ సులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రాష్ట్రంలో ఉద్రిక్తకు దారితీసిన ఈ హత్యలను ఇతర కేసులతో కలపకుండా త్వరితగతిన విచారించేందు కు ప్రత్యేక కోర్టును నెలకొల్పబోతున్నారు. కోర్టు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన గెజి ట్లో ప్రకటించింది. పూందమల్లిలోని టాడా కోర్టు పరిసరాల్లోనే ఈ కోర్టును కూడా ఏర్పాటు చేయాల ని నిర్ణయించారు. కేసుల్లో వాదోపవాదాలను వేగి రం ముగించి నేరస్తులకు త్వరగా శిక్ష విధించేలా చ ర్యలు చేపట్టనున్నారు. -
బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ వల్లే: అద్వానీ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ పాత్ర ఉందని బీజేపీ అగ్ర నేత వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అవినీతి, తప్పిదాలకు పాల్పడటమే బీజేపీ ఘనవిజయానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. మోడీ నాయకత్వంలో ప్రచారం కూడా విజయానికి దోహదపడిందన్నారు. బీజేపీకి గొప్ప రోజు...అమిత్ షా: ఎర్రకోటపై బీజేపీ కార్యకర్త(మోడీ) చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరగడం పార్టీ క్యాకర్తలందరికీ గొప్ప రోజని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా.. సంపూర్ణ మెజారిటీ రావడం ఇదే తొలిసారన్నారు. -
బీజేపీ ఎంపీలకు సంఘ్ ‘క్లాస్’
మే16.. ఆగస్టు 16ను తలపిస్తోందన్న సంఘ్ మోడీ తొలి టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేశారు: అద్వానీ సూరజ్‌కుండ్ (హర్యానా): తొలిసారిగా ఎన్నికైన 161 మందికిపైగా ఎంపీలకు బీజేపీ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో రెండోరోజురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పాల్గొంది. శిక్షణ కార్యక్రమం ముగింపు రోజైన ఆదివారం సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేశ్ సోని పాల్గొని.. కొత్త ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 16వ తేదీ.. బ్రిటిష్ పాలకులు భారత్‌ను వీడి వెళ్లిపోయిన ఆగస్టు 16(1947)ను తలపిస్తోందని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. ‘‘మీలో చాలా మందికి ఆర్ఎస్ఎస్, దాని సిద్ధాంతాల గురించి తెలుసు. సిద్ధాంతమే మన ఆత్మ. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వీడరాదు’’ అని సూచించారు. బీజేపీ చేపట్టిన శిక్షణ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి హాజరుకావడం ఇదే ప్రథమం. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష అర్హతా దక్కలేదు: అద్వానీ ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత అద్వానీ(86) మాట్లాడుతూ.. ‘‘మోడీ తొలి టెస్ట్‌లో ట్రిబుల్ సెంచరీ (లోక్‌సభ ఎన్నికలల్లో ఎన్డీఏ సాధించిన సీట్లు) చేశారు. ఆయనలాంటి రాజకీయ క్రికెటర్‌ను ఇంతవరకూ నేను చూడలేదు’ అని కొనియాడారు. పదేళ్లపాటు దేశాన్ని పాలించి.. చివరికి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన అర్హత కూడా పొందలేని పార్టీని చూడదలేని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ నాయకుడు రామ్ నాయక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై.. తమ నియోజకవర్గాలతో అనుబంధాన్ని మరింత దృఢపరచుకోవాలని చట్టసభ సభ్యులకు సూచించారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తదితరులు మాట్లాడారు. సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోండి సామాజిక సంబంధాల వెబ్సైట్లను సమర్థంగా వినియోగించుకోవాలని బీజేపీ తమ ఎంపీలకు సూచించింది. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆదివారం సోషల్ మీడియా ప్రాధాన్యంపై చర్చ జరిగింది. ఈ మాధ్యమాన్ని అనువుగా మలచుకుని పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సురేశ్ సోని ఎంపీలకు సూచించారు. ఈ మాధ్యమాన్ని ఉపయోగించేప్పుడు ఏమాత్రం పొరపాటు చేసినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయని ్ఠగోయల్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఈ తరహా వెబ్సైట్ల వాడకంలో తమకు పెద్దగా అనుభవం లేదని పలువురు ఎంపీలు అన్నట్టు తెలింది. అనేకమంది ఎంపీలు వీటిని వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభ, లోక్‌సభలకు మొదటిసారి ఎన్నికైన సుమారు 150 మంది ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హుడు: గడ్కారీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అద్వానీకి రాష్ట్రపతి పదవి చేపట్టే అర్హత ఉందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు. అందరూ గౌరవించే అద్వానీ స్థాయికి అదే తగిన పదవి అని ఆయన చెప్పారు. ఇండియా టీవీ చానల్ నిర్వహించే ఆప్ కి అదాలత్ కార్యక్రమంలో మంత్రి ఈ అభిప్రాయాలను వెల్లడించారు. ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీకి స్పీకర్ పదవి తగినది కాదన్నారు. ఇక 75 ఏళ్లు దాటిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం అనేది.. ప్రధాని మోడీ విజ్ఞతతో తీసుకున్న నిర్ణయమన్నారు. దానివల్లే అద్వానీ, జోషీ లాంటి సీనియర్లలకు కేబినెట్లో చోటు దక్కలేదన్నారు. ప్రస్తుత తరంలో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ లాంటి పరిస్థితే తమ పార్టీలోని సీనియర్లదని.. మరో పదేళ్లలో తాను కూడా కొత్తవారికి చోటిస్తూ పదవులనుంచి తప్పుకుంటానని గడ్కారీ చెప్పారు. -
రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హులు
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాష్ట్రపతి పదవికి అర్హులని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అద్వానీ స్థాయికి ఆ పదవే సరైనదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీని లోక్‌సభ స్పీకర్‌ను చేయడం సముచితం కాదని గడ్కరీ అన్నారు. అద్వానీ అంటే బీజేపీలో అందరికీ గౌరవమని, ఆయన స్థాయికి తగిన పదవిని అలంకరించాలని కోరుకుంటున్నామని గడ్కరీ వ్యాఖ్యానించారు. అద్వానీ, మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ వంటి వారికి కేబినెట్లో చోటు కల్పించడం కష్టమని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్ల పైబడిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోరాదని నిర్ణయించారని తెలిపారు. సీనియర్ నేతలు అద్వానీ, జోషీలను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పోల్చారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని జోషీ ఆశిస్తున్నారన్న వార్తలను గడ్కరీ కొట్టిపారేశారు. జోషీ తెలివితేటలు, అనుభవాన్ని పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల సహకరిస్తాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పమన్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడులూ.. మోడీ తరపున చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనిస్తాయని అన్నారు. ఈ సభలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గదర్శనం
-
వ్యక్తిపూజకు దూరంగా ఉండండి
విజయంతో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వొద్దు నియోజకవర్గాలను తరచూ సందర్శించండి కష్టపడి పనిచేసి 2019లో మళ్లీ గెలవండి బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గదర్శనం న్యూఢిల్లీ: వ్యక్తిపూజకు దూరంగా ఉండాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. తనతోపాటు ఇతరుల పాదాలకు మొక్కే విధానానికి స్వస్తి పలకాలని కోరారు. వ్యక్తి పూజను తాను ఆమోదించనని, దానికి బదులు పార్లమెంటు సభ్యులుగా కష్టపడి పనిచేయాలని హితవు పలికారు. శుక్రవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అగ్రనేతలు అద్వానీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలకు మోడీ మార్గనిర్దేశం చేశారు. 20 నిమిషాల ప్రసంగంలో... తగిన అధ్యయనం, ప్రవర్తన, సత్సంబంధాలపై దృష్టి సారించాలని మోడీ ఎంపీలకు గీతోపదేశం చేశారు. విజయంతో నిర్లక్ష్యానికి అవకాశమివ్వకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సందేశాలను క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను తెలియజేయాల్సిన గురుతర బాధ్యత ఎంపీలపై ఉందని స్పష్టమైన సందేశమిచ్చారు.వినయంగా ఉండాలని, నియోజకవర్గాలను తరచూ సందర్శించాలని చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసి 2019లో మళ్లీ ఎన్నికవ్వాలని వారికి లక్ష్యాన్ని నిర్దేశించారు. పార్లమెంటు సమావేశాలకు సజావుగా హాజరై, సమావేశా లు సాఫీగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు.పార్లమెంటులో జరిగే చర్చల్లో పాల్గొనే ముందు సంబంధిత అంశాలపై తగినంత అధ్యయనం చేసి రావాలని కోరారు. చర్చల్లో పాల్గొనడం ద్వారా అనుభవాన్ని గడించవచ్చని పేర్కొన్నారు.మీడియాతో పార్టీ ప్రతినిధులుగా మాట్లాడవద్దని, దానికి బదులు తమ ప్రాంత, నియోజకవర్గ అంశాలపై మాట్లాడాలని సూచించారు.అగ్రనేత అద్వానీ మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం కోసం పనిచేయడాన్ని ఇక ముందూ కొనసాగించాలని సూచించారు. 2 ఎంపీ స్థానాల నుంచి 282 ఎంపీ స్థానాలకు పార్టీ సాధించిన ప్రగతిని నిలబెట్టాలని, చెడ్డపేరు తేవద్దని కోరారు. మరింత కష్టపడి పనిచేయాలని రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు. తొలి విదేశీ పర్యటన భూటాన్‌లో! నూతన ప్రధాని నరేంద్రమోడీ తొలి విదేశీ పర్యటన కింద భూటాన్‌కు ఈ నెలాఖరులో వెళ్లనున్నారు. ఆ తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్య దేశం జపాన్‌లో పర్యటించనున్నారు. ఆ తర్వాత ప్రధాని బ్రెజిల్, అమెరికా పర్యటనలు ఉంటాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. అలాగే, బ్రిక్స్ సమావేశం కోసం జూలై మధ్య భాగంలో బ్రెజిల్‌కు వెళ్లనున్నారని చెప్పారు. ఇక, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశంలో పర్యటించనున్నారని, ఈ విషయమై ఇరువురికీ ఆమోదయోగ్యమైన తేదీపై అమెరికా అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. -
అద్వానీతో జశ్వంత్ మంతనాలు
న్యూఢిల్లీ: బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్‌సింగ్ అగ్రనేత అద్వానీని శుక్రవారం ఢిల్లీలో కలుసుకున్నారు. అద్వానీ నివాసానికి వచ్చిన జశ్వంత్ అరగంటపాటు ఉన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్ లోక్ సభ స్థానం టికెట్‌ను తనకు ఇవ్వకపోవడంతో, ఎన్నికల్లో అదే స్థానం నుంచి జశ్వంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే. తాజా భేటీ నేపథ్యంలో బీజేపీలోకి జశ్వంత్ తిరిగి రానున్నారంటూ వదంతులు మొదలయ్యాయి. అయితే, అద్వానీ వర్గాలు మాత్రం దీన్ని మర్యాద పూర్వక భేటీగా పేర్కొన్నాయి. జశ్వంత్ తన కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వేంద్రసింగ్ భవిష్యత్తుపై అద్వానీతో చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే అయిన మన్వేంద్ర కూడా సస్పెండ్ అయ్యారు. బార్మర్‌లో తన తండ్రి జశ్వంత్ తరఫున ప్రచారం చేసి, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించినందున బీజేపీ ఆయనపై ఈ చర్య తీసుకుంది. -
21న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం!
న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈనెల 21న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆయనకు ఎల్కే అద్వానీ, రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ తదితరులు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ ఎన్నికపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎయిర్ పోర్ట్ నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకూ మోడీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆయన రాకతో కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు కార్యాలయాన్ని పూలతో అలంకరించి, పూల జల్లు కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. మోడీ మోడీ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ప్రధాన కార్యాలయం హోరెత్తింది. అనంతరం కార్యకర్తల నుద్దేశించి మోడీ ప్రసంగించారు. బీజేపీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. -
పదవులపై బీజేపీ కుస్తీ
సాక్షి, న్యూఢిల్లీ: ఫలితాలు లాంఛనప్రాయమే, గెలుపు తథ్యం అనే ధీమాతో ఉన్న బీజేపీ.. ప్రభుత్వం ఏర్పాటు కోసం, పార్టీలో మార్పు చేర్పుల కోసం తర్జన భర్జనలు ప్రారంభించింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో సీనియర్ నేతలు ఎవరెవరికి ఏయే పదవులు కట్టబెట్టాలనే దానిపై చర్చోపచర్చలను ముమ్మరం చేసింది. మోడీ నేతృత్వంలో ఏర్పాటయ్యే సర్కారులో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు కీలక పదవి అప్పగించాలని ఆరెస్సెస్ ఒత్తిడి చేస్తోంది. సీనియర్ నేత అద్వానీకి స్పీకర్ పదవి ఇవ్వజూపగా, ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఎన్డీఏ చైర్మన్ వంటి రాజకీయ ప్రాధాన్యం గల పదవులను ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అద్వానీతో రాజ్‌నాథ్ గురువారం చర్చలు జరిపారు. అంతకు ముందు రాజ్‌నాథ్ నివాసంలో బీజేపీ, ఆరెస్సెస్ సీనియర్ నేతలు సమావేశమై దాదాపు రెండు గంటల సేపు చర్చలు సాగించారు. ఈ భేటీలో ఆరెస్సెస్ నేతలు సురేశ్ సోనీ, రామ్‌లాల్, సౌదాన్ సింగ్, వి.సతీశ్ తదితరులు పాల్గొన్నారు. చర్చలు కొనసాగుతుండగా, మోడీ సహచరుడు అమిత్ షా వారితో చేరారు. మరోవైపు బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఢిల్లీలో ఆరెస్సెస్ నేతలతో చర్చలు జరిపారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ వం టి వారి పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జోషీ, సుష్మ వేచి చూసే వైఖరిని అవలంబిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అద్వానీ స్పీకర్ పదవిని స్వీకరిస్తే, జోషీకి, సుష్మకు కేబినెట్లో చోటు లభించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీకి మరింత భద్రతకు ఏర్పాట్లు: ప్రస్తుతం జెడ్ కేటగిరీ భద్రత ఉన్న మోడీకి మరింత భద్రత కల్పించేందుకు ఎస్పీజీ సన్నాహాలు చేస్తోంది. మోడీకి, ఆయన భార్య యశోదాబెన్, తల్లి హీరాబెన్‌లకు కూడా ఎస్పీజీ భద్రత కల్పించనున్నారు. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ వస్తే, రాష్ట్రపతి ప్రకటన వరకు ఆగకుండా వెంటనే మోడీకి భద్రత కల్పించేలా ఎస్పీజీ ఏర్పాట్లు చేసుకుంటోంది. -
అద్వానీ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత అద్వానీ అధికారిక వైబ్‌సైట్ (ఠీఠీఠీ.జ్చుఛీఠ్చిజీ.జీ)పై పాకిస్థాన్ హ్యాకర్లు సోమవారం దాడి చేశారు. కాశ్మీర్‌ను విముక్తం చేయాలంటూ అందులో సందేశాలను పోస్ట్ చేశారు. మహహ్మద్ బిలాల్‌గా తన పేరును పరిచయం చేసుకున్న హ్యాకర్ శుభోదయం నరేంద్ర మోడీ అంటూ ప్రారంభించి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు. ‘పాకిస్థాన్ జిందాబాద్, కాశ్మీర్లో సైనిక పాలన ముగిసిపోవాలి’ అంటూ సందేశాలను పోస్ట్ చేశాడు. కాశ్మీర్ విషయంలో మోడీ తన దగ్గరకు ఇద్దరు దూతలను పంపారని కాశ్మీర్ నేత గిలానీ ప్రకటన చేసిన నేపథ్యంలో... హ్యాకర్లు ఈ చర్యకు పాల్పడడం గమనార్హం. -
అద్వానీ ఆస్తుల విలువ రూ. 7 కోట్లు
గాంధీనగర్: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీకి దాదాపు ఏడు కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. అద్వానీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఈ ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌తో పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో 3.5 కోట్ల రూపాయిల విలువైన ఆస్తులు ఉన్నాయని, ఐదేళ్లలో వీటి విలువ రెట్టింపు అయ్యిందని అద్వానీ పేర్కొన్నారు. గుర్గావ్లో రెండు ఇళ్లు, గాంధీనగర్‌లో ఓ ఇల్లు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ 5.57 కోట్ల రూపాయిలుగా చూపారు. అద్వానీ పేరిట 97.23 లక్షలు, ఆయన భార్య పేరిట 67.13 లక్షల రూపాయిల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయని వెల్లడించారు. 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయని పేర్కొన్నారు. అద్వానీ దగ్గర 25 వేలు, భార్య దగ్గర 15 వేలు నగదు ఉందని తెలిపారు. తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని అద్వానీ తెలిపారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
మోడీ ప్రధాని అవుతారు: అద్వానీ
గాంధీనగర్: బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో విబేధాలు పక్కనపెట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, మోడీ ప్రధాని అవుతారని అద్వానీ చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేశారు. 1998 నుంచి అద్వానీ ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అద్వానీ నామినేషన్ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేసేందుకు అద్వానీ విముఖంగా ఉన్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలను ఖండించారు. గాంధీనగర్‌కు దూరం కావాలని తానెప్పుడు కోరుకోలేదని చెప్పారు. మోడీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అద్వానీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాంధీనగర్‌లో జరిగిన ర్యాలీలో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. -
గాంధీనగర్‌లో అద్వానీ కుమార్తె ప్రచారం
-
అద్వానీ గురించి మీడియా దుష్పృచారం
-
కాంగ్రెస్ బురదజల్లుడు ప్రచారం : ఎల్‌కె అద్వానీ
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ హత్యతో ఆరెస్సెస్‌కు సంబంధం లేదని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ బుధవారం తన బ్లాగులో పేర్కొన్నారు. గాంధీ హత్య ఆరెస్సెస్ పనేనని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ దేశ తొలి హోం మంత్రి వల్లభాయ్ పటేల్‌పై రాసిన పుస్తకాన్ని అద్వానీ ఉటంకించారు. గాంధీ హత్యకు సంబంధించి ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ బురదజల్లుడు ప్రచారాన్ని ఈ పుస్తకం సమర్థంగా అడ్డుకుందని వ్యాఖ్యానించారు. రాజ్‌మోహన్ పుస్తకంలో పేర్కొన్న పటేల్ లేఖను అద్వానీ ప్రస్తావించారు. 1948 ఫిబ్రవరి 27న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు రాసిన ఆ లేఖలోని వివరాలు.. ‘బాపూ హత్య కేసు దర్యాప్తు పురోగతిని రోజూ తెలుసుకుంటున్నాను. నిందితులందరూ సుదీర్ఘ, సవివర వాంగ్మూలాలు ఇచ్చారు. హత్య వెను ఆరెస్సెస్ ప్రమేయం లేదని వీటితో స్పష్టంగా తేలింది.’ కాగా, ప్రధాని అభ్యర్థి ఎంపికపై గాంధీ సరైన నిర్ణయం తీసుకోలేదని రాజ్‌మోహన్ అన్నారని, గాంధీ తొలి ప్రధానిగా నెహ్రూను కాకుండా పటేల్‌ను ఎంచుకుని ఉంటే స్వతంత్ర భారత తొలినాళ్ల చరిత్ర మరోలా ఉండేదని అద్వానీ వ్యాఖ్యానించారు. దేశానికి పటేల్ చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. -
నర్మద, క్షిప్ర రివర్ లింక్ ప్రారంభం
-
సోనియాపై సుష్మా ప్రశంసల జల్లు
హుందా మనిషి అని కితాబు సుష్మా గొంతు మిఠాయికంటే మధురమన్న షిండే అద్వానీని పొగిడిన సుష్మా.. కన్నీటిపర్యంతమైన అద్వానీ న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో నిత్యం విమర్శలు, ఎద్దేవాల్లో మునిగితే లిన అధికార, ప్రతిపక్షాలు పర స్పరం ప్రశంసల వర్షం కురిపించుకున్నాయి! శుక్రవారం లోక్‌సభ చివరి సమావేశాల్లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. సోనియా గాంధీ దేశానికి ప్రధాని అయితే గుండు గీయించుకుంటానని ఒకప్పుడు శపథం చేసిన బీజేపీ నేత, సభలో ప్రతిపక్షనాయకురాలు సుష్మా స్వరాజ్ ఆ విషయం పక్కన పెట్టి కాంగ్రెస్ అధ్యక్షురాలిపై పొగడ్తలు కురిపించారు. సోనియా హుందా నేత అని కొనియాడారు. స్వపక్ష నేత అద్వానీనీ ప్రశంసలతో ముంచెత్తుతూ.. ఆయనది ‘న్యాయ్ ప్రియతా’(న్యాయ సంధత) మార్గమన్నా రు. దీంతో అద్వానీ ఉద్వేగం తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. సుష్మా ఏమన్నారంటే.. సోనియా హుందాతనం, ప్రధా ని మృదుత్వం 15వ లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగడానికి దోహదపడ్డాయి. పార్లమెంటరీ వ్యవహారాల మం త్రి కమల్‌నాథ్ షరారత్(కొంటె తనం) ప్రయత్నాలు చేయగా, సభా నేత షిండే షరాఫత్(మంచితనం) ప్రదర్శించారు.(దీంతో సభలో చప్పట్లు మోగాయి) ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను మాతో తీసుకెళ్తున్నాం. 15వ లోక్‌సభ చరిత్రను రాసినప్పుడు ఎక్కువ కాలం అవాంతరాలతో నడిచినా పెండింగ్‌లోని చాలా బిల్లులు పాసయ్యాయన్న సంగతీ నమోదవుతుంది. మేం విపక్ష సభ్యులమే కానీ, శత్రువులం కాము. ఎంత ఘాటుగా విమర్శించినా అది వ్యక్తిగతం కాదు. సభా మర్యాదలకు అనుగుణంగా నడుచుకోవాలని అద్వానీ నాకెప్పుడూ సూచిస్తుంటారు. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. బీజేపీ టీ బిల్లుకు మద్దతిస్తుందనుకోలేదు: షిండే ‘తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందన్న విషయంలో నాకు మొద ట్లో నమ్మకం లేదు. అయితే పదేళ్ల కిందట సోనియా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఏర్పాటు చేసే అంశంలో మీరు(బీజేపీ) ప్రతిష్ట కోసం పాకులాడలేదు. మీరూ తెలంగాణ ఇస్తామని గతంలో ప్రకటిం చారు’ అని షిండే అన్నారు. ప్రత్యేకించి సుష్మాను ఉద్దేశిస్తూ.. ‘మీ గొంతు చాలా తియ్యగా ఉంటుంది.. మిఠాయికంటే తీయగా ఉం టుంది’ అని అన్నారు. టీ బిల్లుకు మద్దతు విషయంలో సుష్మా తీరు అభినందనీయమన్నారు. ఇతర విపక్షాలనూ పొగిడారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ప్రయోగించిన అంశాన్ని గుర్తుచేస్తూ.. సభలో తోపులాటలు, నెట్టుకోవడాలు చూసినప్పుడు భయమేసిందని అన్నారు. ఈ సమయంలో ఇతర సభ్యులు జోక్యం చేసుకుని.. హోం మంత్రి దేనికీ భయపడకూడదన్నారు. బాధ్యత తీసుకోవడానికి ఎప్పుడూ భయపడనని షిండే అన్నారు. -
అద్వానీతో YS జగన్ భేటీ
-
తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వలేం: అద్వానీ
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో బీజేపీపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే. తెలంగాణ బిల్లుకు తాము మద్దతు ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ టీ.టీడీపీ నేతలు మంగళవారం బీజేపీ నేతలు అద్వానీ, అరుణ్‌జైట్లీని కలిశారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని వారు ఈ సందర్బంగా కోరారు. కాగా బిఎసి అసలు ఎజెండాలో తెలంగాణ విషయం లేదని సమావేశం మొదలయ్యాక టేబుల్ ఐటంగా సర్క్యులేట్ చేశారని తెలంగాణటిడిపి నేతలు అద్వానీకి వివరించారు. అయితే తెలంగాణ విషయంలో తాము స్పష్టంగా ఉన్నామనీ.. కాంగ్రెస్ డ్రామాలాడుతోందని అద్వానీ అన్నట్టు టిడిపి నేతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బిల్లుకు సపోర్టు చేయలేమని అద్వానీ అన్నారని వారు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు తప్పుల తడకగా ఉందని...న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని ...ఇటువంటి బిల్లును తన జీవితంలో చూడలేదని అద్వానీ వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
విజయంపై అతివిశ్వాసం వద్దు: అద్వానీ
ఢిల్లీ: 2014 ఎన్నికల విజయంపై అతివిశ్వాసం వద్దని బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ ఆ పార్టీ నేతలకు హితవు పలికారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఇది కూడా ఓ కారణం అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి చేసే యత్నాల్లో ఎలాంటి లోపం ఉండకూడదని జాగ్రత్తలు చెప్పారు. -
కాశ్మీర్‌కు బలగాలు పంపవద్దన్న నెహ్రూ: అద్వానీ
తాజాగా బ్లాగులో అద్వానీ కామెంట్లు న్యూఢిల్లీ: అప్పట్లోప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ‘పచ్చి మతతత్వవాది’ అని అన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్రనేత అద్వానీ మరో ఆసక్తికర అంశం వెల్లడించారు. 1948లో పాకిస్థాన్ సేనలు కాశ్మీర్ వచ్చేసినప్పటికీ.. వాటిని ప్రతిఘటించేందుకు సైన్యాన్ని పంపడానికి నెహ్రూ విముఖత వ్యక్తంచేశారని తెలిపారు. కానీ నాటి హోం మంత్రి ఆయన్ను ఒప్పించి సైన్యాన్ని పంపారని వెల్లడించారు. సీనియర్ జర్నలిస్టు ప్రేమ్ శంకర్ ఝాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్యామ్ మానెక్షా(అప్పట్లో కల్నల్) ఇచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ అద్వానీ గురువారం తన బ్లాగ్‌లో ఈ విషయం పేర్కొన్నారు. ‘‘పాకిస్థాన్ దళాల తోడ్పాటుతో గిరిజనులు పెద్ద ఎత్తున శ్రీనగర్ దగ్గరకు వచ్చేశారు. అక్కడికి భారత బలగాలను పంపే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే నెహ్రూ మాత్రం దానికి విముఖత వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని ఐక్య రాజ్య సమితి దృష్టికి తీసుకుపోదామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు’’ అని మానెక్షా అన్నట్లు అద్వానీ పేర్కొన్నారు. -
ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాల స్వాధీనం
వేలూరు(తమిళనాడు), న్యూస్‌లైన్: చెన్నై, పుత్తూరులలో అరెస్టు చేసిన ఉగ్రవాదుల నుంచి పది కిలోల పేలుడు పదార్థాలను, వాటికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీసీఐడీ ఎస్పీ అన్బు చెప్పారు. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత, హిందూ మున్నని రాష్ట్ర కార్యదర్శి హత్యలతో పాటు బీజేపీ అగ్రనేత అద్వానీ పర్యటనలో పైపు బాంబు వేసిన సంఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను రెండు రోజుల కిందట అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో గాయపడిన ఉగ్రవాది బన్నీ ఇస్మాయిల్ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఫక్రుద్దీన్, బిలాల్ మాలిక్‌లను పోలీసులు వేలూరు సెంట్రల్ జైలులో విచారిస్తున్నారు. హిందూ మున్నని నేత వెల్లయప్పన్, బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ అరవిందరెడ్డి హత్యలకు సంబంధించి వేలూరులో ఈ ఉగ్రవాదులకు ఎవరైనా సాయం చేశారా, వారితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా, బెంగళూరులోని బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి కేసుకు సంబంధించి ఆదివారం రాత్రి బెంగళూరు సీబీసీఐడీ పోలీసులు వేలూరు వచ్చి ఫక్రుద్దీన్‌ను విచారించినట్లు సమాచారం. కాగా, బిలాల్ మాలిక్‌ను పదకొండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి శివకుమార్ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. -
అద్వానీ ప్రశంస ఊహాజనితం
ప్రత్యేక విమానం నుంచి: కోర్టుల్లో దోషులుగా తేలే ప్రజాప్రతినిధులను అనర్హత వేటు నుంచి కాపాడే అర్డినెన్స్ ఉపసంహరణ ఘనతను తనకు కట్టబెడుతూ బీజేపీ నేత అద్వానీ చేసిన వ్యాఖ్య ఊహాజనితమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ఉపసంహరణతో తనకెలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ‘విపక్ష అభిప్రాయాలపై స్పందించను. నాతో భేటీ కావాలని కోరిన వాళ్లందరికీ అపాయింట్మెంట్ ఇచ్చాను. బీజేపీ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నన్ను కలిశారు. ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ వినతులు ఇచ్చారు’ అని చెప్పారు. ఆయన శనివారం బెల్జియం పర్యటన ముగించుకుని విమానంలో టర్కీ వెళ్తూ విలేకర్లతో మాట్లాడారు. ప్రధానితో తన చర్చల గురించి అందరికీ తెలుసని, ఆర్డినెన్స్‌పై తనకు అసంతృప్తి ఉన్నట్లు ఆపాదించకూడదని అన్నారు. ‘ఆర్డినెన్స్‌కు తల్లి కేబినెట్. అది వివేచనతో ఆర్డినెన్స్‌ను వాపసు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి ఎవరు, ఎలా, ఎంతవరకు కారణం అన్నవి ఊహాజనితాలు మాత్రమే’ అని పేర్కొన్నారు. ప్రణబ్ కారణంగానే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్నారని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కటువైన మాటలతో ప్రధాని, యూపీఏ సర్కారు అధికారాలను కాలరాశారని అద్వానీ విమర్శించడం తెలిసిందే. నవాజ్ హామీ నిలబెట్టుకోవాలి: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ పట్ల సానుకూల వైఖరితో స్పందించడం అభినందనీయమని ప్రణబ్ పేర్కొన్నారు. అయితే ఆయన ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటేనే మెరుగైన సంబంధాలు నెలకొంటాయని స్పష్టం చేశారు. నిధుల లేమితో అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడడంపై స్పందిస్తూ.. ఈ పరిణామం మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుందన్నారు. కాగా మూడు రోజల టర్కీ పర్యటన కోసం ప్రణబ్ శనివారం ఇస్తాంబుల్ చేరుకున్నారు. ఆయనకు ఇస్తాంబుల్ వర్సిటీ రాజనీతి శాస్త్రంలో గౌరవ పట్టా ప్రదానం చేసింది. -
మోడీ పట్ల ముభావంగా అద్వానీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ, అద్వానీల నడుమ నెలకొన్న లుకలుకలు ఆదివారం రామ్ జెఠ్మలానీ 90వ పుట్టినరోజు వేడుకల్లో బయటపడ్డాయి. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అద్వానీ కినుక వహించిన సంగతి తెలిసిందే. జెఠ్మలానీ పుట్టినరోజు వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు. మోడీ గౌరవసూచకంగా అద్వానీకి పాదాభివందనం చేశారు. అయితే, అద్వానీ ముభావంగా స్పందించారు. ఒకరినొకరు ముక్తసరిగా పలకరించుకున్నాక, మోడీ నేరుగా జెఠ్మలానీకి చేరువలో కూర్చున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం కనిపించలేదు. -
చల్లారని అద్వానీ
న్యూఢిల్లీ: అద్వానీ కోపం చల్లారడం లేదు. మోడీని ప్రధాని రేసులో నిలపడంతో భగ్గుమంటున్న ఆయనను శాంతింపజేసేందుకు పార్టీ సీనియర్ నేతలు శనివారం ప్రయత్నించారు. సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, రవిశంకర్ ప్రసాద్, బల్బీర్ పుంజ్‌లు శనివారమిక్కడ అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అద్వానీ రాజ్‌నాథ్‌కు రాసిన లేఖ చర్చకు వచ్చినట్లు తెలిసింది. మోడీ విషయంలో ఎవరికీ అసంతృప్తి లేదని సుష్మా భేటీ తర్వాత విలేకర్లతో అన్నారు. అద్వానీ వైఖరి ఏమిటని అడగ్గా ఈ విధంగా బదులిచ్చారు. అయితే మోడీపై పార్టీ నిర్ణయం పట్ల అద్వానీ అసంతృప్తి వీడలేదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. -
యడ్డి పునరాగమనంపై అధిష్టానందే తుది నిర్ణయం
సాక్షి, బళ్లారి : మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పను తిరిగి బీజేపీలోకి చేర్చుకునే విషయంపై పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి అన్నారు. శనివారం ఆయన నగరంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. యడ్యూరప్పను పార్టీలో చేర్చుకునే విషయంపై ఇప్పటికే పార్టీలో పలుమార్లు చర్చించారన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడంపై యడ్యూరప్ప స్వాగతించడం, ఎన్డీఏ కూటమికి తాను మద్దతు ఇస్తానని చెప్పడం వంటి పరిణావూలు ఆయన బీజేపీలోకి తిరిగి వచ్చే శుభసూచనలన్నారు. మొత్తం మీద యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి వస్తారనే విషయం ఆయన పరోక్షంగా వెల్లడించారు. ధరల పెరుగుదల ఓ వైపు, అవినీతి కుంభకోణాలు మరో వైపు ఉండడంతో యూపీఏపై ప్రజలు విసిగిపోయారన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పాలనకు తెరపడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కాంగ్రెస్ రహిత భారత్ ఏర్పడాలంటే మోడీ ద్వారానే సాధ్యమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని జోస్యం చెప్పారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ మార్గదర్శనం, మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. లోక్‌సభకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు, అభ్యర్థుల ఎంపికపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత లోక్‌సభ సభ్యులకు తిరిగి బీజేపీ టికెట్ ఖరారు చేసేది లేనిది పార్టీ హైకమాండ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకుంటారన్నారు. బళ్లారిలో లోక్‌సభ అభ్యర్థిగా ఇంతవరకు ఎవరి పేరూ ప్రకటించలేదని, ఎవరైనా వారికి వారే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించుకుని ఉంటే తమకు సంబంధం లేదన్నారు. అలాంటి వారిపై పార్టీ హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీటీ రవి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అద్వానీని బుజ్జగించే పనిలో బిజెపి సీనియర్లు
-
గుర్రుగానే ఉన్న అద్వానీ, బుజ్జగింపు యత్నాలు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ అలక వహించిన అగ్రనేత అద్వానీని సముదాయించేందు భారతీయ జనతా పార్టీ ముమ్మర యత్నాలు చేస్తోంది. పార్టీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, అనంతకుమార్, బల్బీర్ పుంజ్ తదితరులు శనివారం అద్వానీ నివాసానికి వెళ్ళి మూడు గంటలకు పైగా చర్చలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన సుష్మ... మోడీ అభ్యర్ధిత్వంపై పార్టీలో ఎవ్వరికీ విభేదాలు లేవన్నారు. ఎవ్వరూ అసంతృప్తి చెందలేదని చెప్పారు. అయితే అద్వానీ మాత్రం ఇంకా గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. ఎందువల్ల ఆయన మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించారో కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. -
మోడీ నాటకాల రాయుడు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శల బాణం ఎక్కుపెట్టారు. మోడీ నాటకాల రాయుడని దిగ్విజయ్ సింగ్ శనివారమిక్కడ ఎద్దేవా చేశారు. ఎవరు సహకరిస్తే వారిని ముంచే తత్వం మోడీదని ఆరోపించారు. తనకు సహకరించిన కేశూభాయ్ పటేల్, శంకర్ సింఘ్ వాఘేలా, అద్వానీలను మోడీ ముంచారని డిగ్గీరాజా గుర్తు చేశారు. మోడీ ప్రధాని అభ్యర్ధిత్వంపై ఎన్‌డిఏలో కానీ, బిజెపిలో కానీ ఏకాభిప్రాయం లేదన్నారు. -
కమలంలో జోష్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ రాష్ట్ర శాఖ నాయకుల్లో సంతోషం వ్యక్తమైంది. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పార్టీ రాష్ట్ర శాఖలో మోడీ అభ్యర్థిత్వంపై సర్వానుమతి ఉంది. ముఖ్యంగా యువకులు మోడీ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని ఉబలాటపడుతూ వచ్చారు. అద్వానీ నాయకత్వంలో గతంలో జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోవడంతో మోడీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించరేమోననే ఆదుర్దా పార్టీ కార్యకర్తల్లో కనిపించింది. అద్వానీ అభ్యంతరాలను తోసిరాజని ఎట్టకేలకు మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. మాజీ మంత్రి ఆర్. అశోక్ నాయకత్వంలో టౌన్ హాలు వద్ద స్కూటర్ ర్యాలీని నిర్వహించారు. -
బీజేపీలో తారాస్థాయికి చేరిన చర్చలు
న్యూఢిల్లీ : ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడంపై బీజేపీలో చర్చలు తారాస్థాయికి చేరాయి. మోడీ అభ్యర్థిత్వం ఆపార్టీకి బిగ్ ఫ్రైడ్ అయ్యింది. సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మోడీ పేరును అధికారికంగా ప్రకటించవచ్చనే సంకేతాలు జోరుగా వినిపిస్తున్నాయి. మోడీ అభ్యర్థిత్వత్వాన్ని బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్ వ్యతిరేకిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగేంత వరకూ ఆగాలని మోడీని వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది అందరిలో ఆసక్తిని నింపుతోంది. మోడీ అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, మురళీ మనోహర్ జోషీలకు నచ్చచెప్పడానికి పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో పాటు సీనియర్ నేతలు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీలు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారు. ఈ ముగ్గురిలో జోషీ కాస్త మెత్తబడ్డారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అద్వానీ, సుష్మా మాత్రం ఇంకా అంగీకరించడం లేదు. పార్లమెంటరీ బోర్డు భేటీకీ గైర్హాజరు కావాలని తొలుత భావించిన సుష్మా చివరకు మనసు మార్చుకుని అంబాలా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. చివరగా అద్వానీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీయే !
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందుకోసం అద్వానీ సహా పార్టీ నేతలందరినీ ఒప్పించి, ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా పార్టీలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, అనంతకుమార్ తదితరులు రంగంలోకి దిగారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత అద్వానీతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషీ తదితర నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సమావేశం అనంతరం మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిత్వంపై పార్టీ సీనియర్ నేత అద్వానీతో పాటు ఆయన వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కానీ, వీలైనంత త్వరగా ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని, ఇందుకోసం అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆర్ఎస్ఎస్తో పాటు మోడీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం అద్వానీ సహా పార్టీ నేతలందరినీ ఒప్పించి, ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా పార్టీలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, అనంతకుమార్ తదితరులు గురువారం అద్వానీని కలిసి చర్చించారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించవద్దని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అనంతకుమార్ సుష్మాస్వరాజ్‌తో కూడా భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా సీనియర్ నేతలతో సమావేశమవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించినా అది శుక్రవారమే జరగనుందని, ఆ లోపే ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాయి. ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో అద్వానీకి మద్దతుగా ఉన్న సుష్మాస్వరాజ్, మురళీ మనోహర్ జోషీలతో రాజ్‌నాథ్‌సింగ్ గురువారం భేటీ అయ్యారు. కాగా, మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై పార్టీలో భేదాభిప్రాయాలు లేవని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మౌనంగానే అద్వానీ పార్టీ నేతలు తనను కలుస్తున్నా, ప్రధాని అభ్యర్థిత్వం అంశంపై చర్చలు జరుపుతున్నా అద్వానీ మాత్రం గురువారం రాత్రి వరకూ కూడా బహిరంగంగా ప్రకటనా చేయలేదు. అద్వానీ అనుచరుడు సుధీంద్ర కులకర్ణి మాత్రం నరేంద్ర మోడీపై ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. అంతేగాకుండా శుక్రవారమే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్నా.. ఆ సమావేశంలో అద్వానీ మద్దతుదారులు, సీనియర్ నేతలైన సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషీ పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. సుష్మా వ్యక్తిగత పనిమీద అంబాలా వెళుతుండగా.. జోషీ ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. కాగా, మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి బీజేపీ కర్ణాటక శాఖ మద్దతు పలికింది. -
అద్వానీని ఒప్పించలేకపోయిన రాజ్‌నాథ్
న్యూఢిల్లీ : పార్టీ అగ్రనేత అద్వానీ ఆమోదం లేకుండానే బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించనున్నారా? తాజా పరిణామాలు, బీజేపీలో కొనసాగుతున్న తర్జనభర్జనలు అవుననే సమాధానమిస్తున్నాయి. మోడీని ఇప్పుడిప్పుడే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించవద్దని అద్వానీ, సుష్మాస్వరాజ్, మురళీ మనోహర్ జోషీలు గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ నిర్ణయం వెలువడి తీరుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్ఎస్ఎస్తో పాటు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు సహా కొందరు పార్టీ నేతలు మోడీ విషయంలో పట్టుదలతో ఉండడంతో అద్వానీ ఒప్పుకోకపోయినా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 13న ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ఒక్కొక్కరినే ఢిల్లీకి రప్పిస్తున్నారు. ఈ సమావేశంలోనే మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత అదే రోజు లేదా ఈ నెల 19న మోడీని బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అటు రాజ్‌నాధ్‌సింగ్ ఇవాళ మరోసారి సుష్మా స్వరాజ్‌తో సమావేశం కానున్నారు. మరోవైపు.... పార్టీలో అద్వానీ శకం ముగిసిపోయిందని బీజేపీ బీహార్ శాఖ నేత సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యానించారు. -
మోడీ విషయంలో హామీ ఇవ్వని అద్వానీ
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత ఎన్‌కె అద్వానీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఈరోజు అద్వానీతో సమావేశమయ్యారు. ప్రధాని అభ్యర్థి విషయమై వారు చర్చించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. అయితే అద్వానీ మాత్రం రాజ్‌నాథ్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ కోరుతున్న విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వచ్చేవారం సమావేశం కానుంది. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు. ఆలోగానే ఆయనను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఆరెస్సెస్ కసరత్తు!
న్యూఢిల్లీ: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం కట్టబెట్టేందుకు ఏకాభిప్రాయ సాధన కోసం ఆరెస్సెస్ కసరత్తు చేస్తోంది. సంస్థ సీనియర్ నేత సురేశ్ భయ్యాజీ జోషీ ఆదివారమిక్కడ ఈ అంశంపై పార్టీ సీని యర్ నేతలైన అద్వానీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీఅయ్యారు. ఈ భేటీలో మోడీని ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకురావాల్సిన అవసరం, ఆయనను ఎప్పుడు అభ్యర్థిగా ప్రకటించాలి వం టి వాటిపై భయ్యాజీ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మోడీ ప్రధాని అభ్యర్థిగా వద్దని అద్వానీ, సుష్మా తదితరులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆయనపై వ్యతిరేకతను తొలగించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాకే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అద్వానీ, సుష్మా చెబుతుండగా, అంతవరకు వేచి చూడొద్దని రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ అంటున్నారు.