Amani
-
బుల్లితెర ప్రియులకు సరికొత్త సీరియల్.. ఎప్పుటినుంచంటే?
తెలుగులో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తున్న ఛానల్ "స్టార్ మా". సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోంది. తాజాగా "ఇల్లు ఇల్లాలు పిల్లలు" అనే సరికొత్త సీరియల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథే ఇల్లు ఇల్లాలు పిల్లలు.ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ ఉంది. అంతే కాదు - మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా ఉంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే... ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథేంటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటోసరికొత్త సీరియల్ "ఇల్లు ఇల్లాలు పిల్లలు" చూడాల్సిందే.ఈ సీరియల్ ఈ నెల 12 నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం చేయనున్నారు. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ. తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు నిర్మాత, ప్రభాకర్ ఈ సీరియల్లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని.. ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చూపించనున్నారు. -
అనులో మంచి పాత్ర చేశాను
కార్తీక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తీ చక్రవర్తి, ఆమని, దేవీ ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, ΄ోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అను’. సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. చక్కని సందేశాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇదే తొలి చిత్రం. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సందీప్ గోపిశెట్టి. ‘‘ఈ సినిమాలో విలన్‌గా చేశాను’’ అన్నారు ప్రశాంత్ కార్తి. దేవీ ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, లైన్ ్ర΄÷డ్యూసర్ కల్యాణ్ చక్రవర్తి ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. -
సైన్స్‌కు ఆధారం ఆధ్యాత్మికతేనా?
శేర్ (సిరాజ్) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హర ఓం హర’. అశోక్ కుల్హర్, దేవేంద్ర మదన్ సింగ్ నేగి నిర్మిస్తు్తన్న ఈ చిత్రంలో గంగాధర్, కర్ణిక ఇతర ముఖ్య తారాగాణం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలో ముగి సింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఆధ్యాత్మికత అంతా సైన్స్‌తోనే ముడిపడి ఉందని, సైన్స్‌కు ప్రధాన వనరు ఆధ్యాత్మికతేనని నిరూపిస్తూ రూపొందిస్తున్న సినిమా ఇది. తెలుగుతో ΄ాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో సుమన్, ఆమని కీలక ΄ాత్రధారులు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హర ఓం హర’
కనిక, ఆమని, రవిశర్మ, జ్యోతిరెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హర ఓం హర’. షేర్ దర్శకత్వంలో దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసిన సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మంచి విజయం సాధించాలి. దర్శకుడు షేర్ కెరీర్ ఈ చిత్రంతో మరో స్థాయికి వెళ్లాలి’’ అన్నారు. ‘‘మాది సినిమా కుటుంబం కాకపోవడంతో కెరీర్ స్టార్టింగ్‌లో కష్టాలు పడ్డాను. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర కూడా చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు షేర్. ఈ సినిమాలో జబర్దస్త్ రాకేష్, జబర్దస్త్ కట్టప్ప, వైజాగ్ షరీఫ్, షెల్జా, నేహా బెన్, సంగీత, విలన్‌గా ప్రకాష్ నాగ్, షేర్ వంటి వారు నటిస్తున్నారు. -
యువతరం ఆలోచనలతో...
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మది’. రామ్ కిషన్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు సుమన్, నటి ఆమని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ ధనుష్ మాటాడుతూ– ‘‘యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా వినూత్నరీతిలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘నటుడు కావాలని వచ్చిన నేను.. నా ఫ్రెండ్ బాధ చూడలేక ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’ అన్నారు రామ్ కిషన్. ‘‘ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది’’ అన్నారు శ్రీరామ్. కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, దర్శకుడు జై శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: పీవీఆర్.రాజా. -
హీరోయిన్గా ఆమని మేనకోడలు.. పోస్టర్ విడుదల
Aamani Niece Hrithika Nari Nari Naduma Murari Poster Released: సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరో, హీరోయిన్లు కావడం సర్వసాధరణమే. కొంచెం టాలెంట్ ఉండి, వారసత్వం తోడేతే చిత్ర పరిశ్రమలో త్వరగా నిలుదొక్కుకోవచ్చు. ఇదే తరహాలో మరో బ్యూటీ వెండితెరకు పరిచయం కానుంది. హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆమని. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్ పెళ్లాం వంటి తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. ఆమని నట వారసురాలిగా ఆమె మేనకోడలు హృతిక వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. బాల నటిగా 3 సినిమాల్లో నటించిన హృతిక హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అభిలాష్ భండారి హీరోగా, హృతిక హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే దర్శకత్వంలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై వెంకటరత్నం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవీకే మాట్లాడుతూ.. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి యానాం, అమలాపురం, వైజాగ్, లంబసింగి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేశాం. సింధు కే ప్రసాద్ సంగీతం, జే. ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. చదవండి: చరణ్ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి కానిస్టేబుల్‌గా కీర్తి సురేష్.. 24 హత్యలు.. ఆసక్తిగా 'చిన్ని' ట్రైలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోయిన్గా నటి ఆమని మేనకోడలు..
విశ్వకార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్ (నటి ఆమని మేనకోడలు) జంటగా చలపతి పువ్వుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లంత దూరాన’. కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను దర్శకుడు బాబీ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇది మంచి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ’’అన్నారు చలపతి. ‘‘షూటింగ్ పూర్తయింది. తిరుపతి, కేరళ, చెన్నై, పాండిచ్చేరిలోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఇందులో తెలుగువారితో పాటు, తమిళ నటీనటులు కూడా నటించారు. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు ఎన్.చంద్రమోహన్‌రెడ్డి. -
సౌందర్య ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బంగ్లా ఇప్పుడెలా ఉందంటే!
సౌందర్య... తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ఆమె పేరు తలుచుకోగానే చక్కటి చీరకట్టులో ఓ అందమైన రూపం కళ్లముందు కదులుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా సౌందర్య చాలా ప్రత్యేకం. చనిపోయే వరకు ఎక్స్పోజింగ్, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఆమె ఈ లోకాన్ని విడిచి 17 ఏళ్లవుతున్నాఇప్పటికీ ఆమెను మరిచిపోలేని అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతలా తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆమె. ఏ పాత్రలో అయినా ఓదిగిపోయే సౌందర్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే సౌందర్య మరణం ఆమె అభిమానులను ఎంతగానో కలిచివేసింది. కాగా కెరీర్ చివర్లో సంచలన సినిమాలు చేసిన సౌందర్య జీవితంలో ఎన్నో చెప్పుకొదగ్గ ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆమె బతికున్న రోజుల్లో తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు. 2004లో జరిగిన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడూ మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వారు లేకపోయిన ఇప్పటికీ ఆ స్కూల్స్‌కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి లెక్కల ప్రకారం సౌందర్యకు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గతంలో ఆమె కుటుంబ సభ్యులే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నటి ఆమని కూడా ఓ ఇంటర్వ్యూలో సౌందర్య ఆస్తుల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో సౌందర్య తనకు మంచి సన్నిహితురాలని, తామిద్దరం ప్రాణ స్నేహితులుగా ఉండేవారమని ఆమె చెప్పారు. సౌందర్య చనిపోయిన విషయం తాను నమ్మలేకపోయానని.. అయితే సౌందర్య మరణించిన కొన్నాళ్ళకు బెంగళూరులోని ఆమె బంగ్లాకు వెళ్లినట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. ‘సౌందర్య ఉన్నపుడే ఆ బంగ్లాను ఎంతో ఇష్టపడి కొనుక్కుంది. తను బతికున్నపుడు బంగ్లా దేదీప్యమానంగా వెలిగిపోయేది. కానీ ఇప్పుడు అది ఓ బూత్ బంగ్లా మారిపోయింది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సౌందర్య మరణించిన అనంతరం కొన్నాళ్లకు ఆ బంగ్లాకు తాను వెళ్లానని, అక్కడ ఎవరూ లేరని ఆమని పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందటి వరకు సౌందర్య తల్లి అక్కడ ఉండేవారని, తనని కలుద్దామని అక్కడి వెళ్లేసరి ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి బూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సౌందర్య పేరుతో బయోపిక్ వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. -
‘అర్థ శతాబ్దం’మూవీ రివ్యూ
టైటిల్ : అర్థ శతాబ్దం నటీనటులు : కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ ఆమని తదితరులు నిర్మాణ సంస్థ : రిషితా శ్రీ క్రియేషన్స్ ఎల్ఎల్పీ, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ దర్శకత్వం : రవీంద్ర పుల్లె సంగీతం : నోఫెల్ రాజా సినిమాటోగ్రఫీ : అస్కర్, వెంకట్, ఈజే వేణు ఎడిటింగ్ : జె.ప్రతాప్ కుమార్ విడుదల తేది : జూన్ 11, 2021(ఆహా) సీరియస్ కథాంశాలతో తెరకెక్కె చిత్రాలు ఇటీవల టాలీవుడ్లో ఎక్కువయ్యాయి. నూతన దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్నారు. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక సీరియస్ కథాంశంతోనే తెరకెక్కిన చిత్రం ‘అర్థ శతాబ్దం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీ బాటపట్టింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(జూన్ 11)ప్రముఖ ఓటీటీ ఆహా విడుదలైన ‘అర్థ శతాబ్దం’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ సిరిసిల్ల గ్రామానికి చెందిన కృష్ణ (కార్తీక్ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ రామన్న(సాయికుమార్) కూతురు పుష్ప(కృష్ణ ప్రియ)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే తన ప్రేమను ఆమెతో పంచుకోలేకపోతాడు. అతని వయసుతో పాటు పుష్పపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు దారి తీస్తుంది. అసలు కృష్ణ చేసిన పని ఏంటి? దాని వల్ల ఆ ఊళ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏంటి? చివరకు పుష్ప ప్రేమని కృష్ణ పొందాడా లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు ‘కేరాఫ్ కంచరపాలెం’లో జోసెఫ్‌గా నటించి ఆకట్టుకున్న కార్తీక్ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక హీరోగా కాకుండా, విలేజ్‌కి చెందిన అబ్బాయిగా చాలా సహజంగా తన పాత్ర సాగుతోంది. లవర్ బాయ్‌గా జోష్‌గా కనిపిస్తూ.. బావోధ్వేగ నటనను ప్రదర్శించాడు. ఇక పల్లెటూరికి చెందిన పుష్ప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృష్ణప్రియ. సంప్రదాయ దుస్తుల్లో తెరపై అందంగా కనిపించింది. మాజీ నక్సటైట్ రామన్నగా సాయికుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వ్యవస్థపై చిరాకు పడే ఎస్సై రంజిత్‌గా నవీన్ చంద్ర పర్వాలేదనిపించాడు. ఆమని, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ విప్లవం, కులాల మధ్య గొడవలు, వర్గ పోరు, శ్రమదోపిడి లాంటి నేపథ్యంతో వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి ప్రేమ, కమర్షియల్ హంగులు జోడించి విజయం అందుకున్న చిత్రాలు చాలానే ఉనాయి. అయితే ఇలాంటి కథలను డీల్ చేయడం కత్తిమీద సాము లాంటిదే. కొంచెం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుంది. ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో.. దానిని బలంగా తెరపై చూపించాలి. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడి భావోద్వేగాల్ని తట్టిలేపాలి. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ఈ విషయంలో అర్ధశతాబ్దం దర్శకుడు రవీంద్ర పుల్లె కాస్త తడబడ్డాడు. కుల వ్యవస్థ, వర్గ పోరాటం, రాజ్యాంగం.. అంటూ బలమైన విషయాల్నే ఎంచుకొని, దాన్ని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మనిషి పుట్టుక మొదలు.. ప్రేమ, కులం, రాజకీయం, రాజ్యాంగం వరకు చాలా విషయాలకు తెరపై చూపించాలనుకొని, దేనికి పూర్తి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కృష్ణ ప్రేమ చుట్టే తిరుగుతుంది. పుష్పపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి కృష్ణ పడే ఆరాటం, రోటీన్ సన్నివేశాలతో నెమ్మదిగా సా..గుతోంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ సీరియస్ టర్న్ తీసుకొని ఏవైనా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయా అని ఆశపడే ప్రేక్షకుడి నిరాశే మిగులుంది. ఎవరు ఎవరిని చంపుతున్నారో ఎవరికీ అర్థం కాదు. ఒక గ్రామంలో ఇంత జరుగుతున్నా.. మంత్రి(శుభలేఖ సుధాకర్), డీఎస్పీ(అజయ్) ఇద్దరు టీ తాగుతూ పిట్టకథలు చెప్పుకోవడం అంత కన్విసింగ్‌గా అనిపించదు. సినిమా మూలాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలతో ముంగించారు. సాయికుమార్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర అజయ్, ఆమని, పవిత్ర వంటి అగ్ర నటులు ఉన్నా వారిని సరిగా వాడుకోలేకపోయాడు. ఇక సహజత్వం కోసం అసభ్య పదజాలాన్ని యదేచ్ఛగా వాడేశారు. రక్తపాతం, హింస మరీ ఎక్కువైంది. క్లైమాక్స్ లో..‘గతించిన క్షణాలన్నీ, గ్రంధాలుగా లిఖించబడినరోజున…కలవని అడుగులన్నీ కలయికగా కలబడే రోజు.. గెలువని ప్రేమలు అన్ని స్మృతులుగా పిలవబడే రోజున.. రాయని అక్షరాలని రాజ్యాంగంగా రాయబడిన రోజున.. మనిషిలో జనించిన ప్రేమ, మనిషిని జయించిన కులాన్ని చిల్చిన రోజున పుడతాను పువ్వునై మరలా ఈ పుడమిలోనే’అనే భారీ ఎమోషనల్ డైలాగ్ సగం అర్థమై, అర్థం కానట్లుగానే ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాకు ప్రధాన బలం నోఫెల్ రాజా సంగీతం బాగుంది. ‘ఏ కన్నులు చూడని’పాట సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. అస్కర్, వెంకట్, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ నటన దర్శకుడు ఎంచుకున్న పాయింట్ నేపథ్య సంగీతం, పాటలు మైనస్ పాయింట్స్ ఫస్టాప్ అగ్రనటీనటులను సరిగా ఉపయోగించుకోలేకపోవడం మోతాదు మించిన రక్తపాతం, హింస బలమైన సన్నీవేశాలు లేకపోవడం -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌గా ‘అర్థ శతాబ్దం’
ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌గా మార్చి 26న ‘అర్ధ శతాబ్దం’ మూవీ విడుదల కానుంది. ఈ మూవీని జాతీ, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంగా 2003లో జరిగిన నిజ జీవితం కథ ఆధారంగా ‘అర్ధ శతాబ్దం’ మూవీని దర్శకుడు రూపొందించాడు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26 నుంచి ఆహా వరల్డ్ ప్రీమియర్‌గా స్ట్రీమ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. ‘పెద్ద డైరెక్టర్ అయిన క్రిష్‌కు కథ నచ్చడంతో ఆయన మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. కార్తీక్‌కు హీరో రానా బర్త్ డే విషెస్ తెలపడం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికి మా టీంతో టైం స్పెండ్ చేసి మా చిత్రం గురించి తెలుసుకుని టీజర్‌ను లాంచ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక సాంగ్ లాంచ్ చేశారు. ఇలా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ఈ ‘అర్ధశతాబ్దం’ సినిమా 1950 నుంచి 2003 వరకు జరుగుతుంది. ఇండియన్ డెమాక్రసీ మాములు పబ్లిక్పై ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని ఎలా అర్థం చేసుకుని యుటిలైజ్ చేసుకుంటున్నాం. అలాగే దాని ఎలా మిస్ యూజ్ చేసుకొంటున్నాం అనే కథాంశంతో అద్భుతమైన లవ్ స్టొరీని జోడించి సినిమాను తెరకెక్కించడం జరిగింది. నిర్మాతల సపోర్టుతో చిత్రాన్ని పూర్తి చేసి చిత్ర టీజర్‌ను విడుదల చేశాము. ఆహా వారికి మా టీజర్ నచ్చడంతో ఈ సినిమాను ఆహాలో విడుదల చేయమని ఆఫర్ రావడంతో సినిమాను మార్చి 26 నుంచి వరల్డ్ ప్రీమియర్‌గా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. అలాగే నిర్మాత చిట్టి కిరణ్ మాట్లాడుతూ.. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో ఈ నెల 26వ తేదీన వస్తున్న ‘అర్ధ శతాబ్దం’ మూవీని ఆదరించి మాకు సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని అన్నారు. ఇక నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ... 22 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్‌గా మీ అందరికీ పరిచయస్తున్నే. అయితే రవి, కిరణ్‌లు షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నాకు ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో నిర్మాతగా వారితో కలసి నిర్మించడం జరిగింది. సినిమా పూర్తి అయిన తరువాత థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశాము. అయితే కరోనా టైంలో థియేటర్స్ మూతపడటంతో మూవీని ఎలా విడుదల చేయాలని అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఈ క్రమంలోఆహా నుండి తమకు కాల్ వచ్చిదని, ఈ ఆఫర్‌ను మిస్ చేసుకోకుండా ప్రస్తుతం జనాల్లోకి వెళ్లేలా ఆహాలో విడుదల చేస్తే మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని ఈ నెల 26 న ఆహా లో విడుదల చేస్తున్నామన్నారు. అందరు అర్థ శతాబ్ధం మూవీ చూసి తమని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు. ఇందులో ప్రముఖ నటీనటులు కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్ర లోకేష్, అజయ్, శుభలేఖ సుధాకర్, రాజా రవీంద్ర, రామ రాజు, దిల్ రమేష్, టీఎన్ఆర్, శరణ్య, నవీన్ రెడ్డి, ఆమనిలు నటిస్తున్నారు. -
ప్రకాశ్‌రాజ్‌తో నటించాలంటే భయం: ఆమని
‘‘ఇన్నేళ్ల నా సినీ కెరీర్లో ఏ సినిమాకూ ముందు రోజు స్క్రిప్ట్ తీసుకెళ్లి డైలాగులు నేర్చుకున్నది లేదు. ‘చావు కబురు చల్లగా’లో వైజాగ్ యాసలో పెద్ద పెద్ద మాస్ డైలాగ్స్ చెప్పాల్సి రావడంతో రాత్రిళ్లు బట్టీపట్టి ఉదయం షూటింగ్లో పాల్గొనేదాన్ని. ఈ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని నటి ఆమని అన్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం 19న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించిన ఆమని మాట్లాడుతూ– ‘‘అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా చేస్తున్నప్పుడు ‘చావు కబురు చల్లగా’లో నటించమని బన్నీ వాసు అనడంతో కథ, నా పాత్ర ఏంటని అడగకుండా ఒప్పుకున్నా. ఇందులోని సన్నివేశాలు చూస్తే కౌశిక్ అనుభవం ఉన్న దర్శకునిలా తీశాడు. నేను ఎంతోమందితో నటించా. కానీ ప్రకాశ్‌రాజ్‌గారితో నటించడం భయం. ఆయన ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకే ఒక్క టేక్‌లో చేస్తారు. ఆయనతో నటించేటప్పుడు నాకు రెండో టేక్ తీసుకోవాలంటే భయం. విలన్ పాత్ర చేయాలన్నది నా కల. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇప్పుడు నటీనటులకు ఉన్నన్ని సౌకర్యాలు లేవు. అప్పుట్లో షాట్ గ్యాప్‌లో చెట్లకింద కూర్చుని సరదాగా మాట్లాడుకునేవాళ్లం. దీంతో నటీనటుల మధ్య బాండింగ్ బాగుండేది. ఇప్పుడు షాట్ గ్యాప్ వస్తే క్యారవాన్‌లోకి వెళ్లిపోతున్నారు. లేకుంటే మొబైల్స్‌తో బిజీ అయిపోతున్నారు’’ అన్నారు. చదవండి: ఆ అభినందనలను ఎప్పటికీ మర్చిపోలేను: రాజేంద్ర ప్రసాద్ శుభలగ్నం మేడమ్ అని పలకరిస్తుంటారు -
థ్రిల్... కామెడీ
అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అర్థం’. పలు చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసిన మణికాంత్ తెల్లగూటి ఈ సినిమాకి రచయిత, దర్శకుడు. ‘నాటకం’ చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. త్వరలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాస్తున్నారు’’ అన్నారు. ‘‘కుటుంబ విలువలను కాపాడటంతో పాటు మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. సైకలాజికల్ థ్రిల్లర్ కథకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం’’ అన్నారు మణికాంత్ తెల్లగూటి. ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన మహేంద్ర, రామ్‌గోపాల్ వర్మ ‘మర్డర్’లో కథానాయికగా నటించిన సాహితీ అవంచ, దేవి ప్రసాద్, సాయి దీనా, వాసు విక్రమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ గంగనమోని, సంగీతం: సన్నీ ఆస్టిన్, చిన్న స్వామి, అసోసియేట్ నిర్మాత: ఉమా కూచిపూడి, సహనిర్మాతలు: పవన్ జానీ, వెంకట రమేష్. -
జీవిత చేతుల మీదుగా ‘అమ్మ దీవెన’ ట్రైలర్..
సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గురవయ్యలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను నటి, దర్శకనిర్మాత జీవిత రాజశేఖర్ విడుదల చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘అమ్మ దీవెన డైరెక్టర్ శివ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఈ చిత్ర హీరోయిన్ ఆమని మంచి నటి. రాజశేఖర్‌తో అమ్మా కొడుకు మూవీలో నటించినప్పటి నుంచి ఆమని నాకు పరిచయం. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మేము ఆమని మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నాము, అలాగే ఆమని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తరువాత తాను మంచి చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి, మళ్లీ కొత్త దర్శకులు సమంత, తాప్సి వంటి వారితో మంచి సినిమాలు తీస్తున్నారు. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. అమ్మదీవెన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరి ఆధర అభిమానాలు పొందాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ట్రైలర్ లాంచ్ చేసిన జీవిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆమని గారికి కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా మిగులుతుంది, సినిమా చాలా బాగా వచ్చింది. ఒక బాధ్యతలు లేని భర్తతో ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు పడింది. వారిని ఎలా ప్రయోజకుల్ని చేసింది అనేది కథాంశం’ అని నిర్మాత మారయ్య అన్నారు. పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, యశ్వంత్, నాని యాదవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వెంకట్ అజ్మీర సంగీతమందిస్తున్నాడు. -
అమ్మ గొప్పతనం
‘ఆడపిల్లలంటే అమ్మతో సమానం... అమ్మ బాగుంటే లోకమంతా బాగుంటుంది’ అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మ దీవెన’. ఆమని, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో శివ ఏటూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి గురవయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈ నెల 17నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శివ ఏటూరి మాట్లాడుతూ– ‘‘అమ్మతోనే పుట్టుక ప్రారంభం.. అమ్మే సృష్టికి మూలం.. అమ్మ లేని లోకం చీకటిమయం అంటూ మాతృమూర్తుల గొప్పతనం తెలియజేసే చిత్రమిది. మా నిర్మాత గురవయ్య జీవితంలో జరిగిన కథ ఇది. ప్రతి తల్లి గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. మనుసును హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ప్రతి తల్లికి అంకితం ఇస్తున్నాం. ఆమని, పోసానిగారి నటన ఆకట్టుకుంటుంది. టాకీపార్ట్ పూర్తి అయింది. చివరి షెడ్యూల్లో పాటలు చిత్రీకరిస్తాం. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.వి.హెచ్, కెమెరా: సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్. -
నరుడా...వోనరుడా
అద్దెకు ఉండడం అంటే ఫస్ట్ తారీఖు వోనరంకుల్ చేతిలో డబ్బు పెట్టడం మాత్రమే కాదు... నెలలోని 30రోజుల్లో ప్రతిరోజు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష గట్టెక్కితేనే... ఇంట్లో అద్దెకుండే అర్హత కంటిన్యూ అవుతుంది. లేనిచో...ఏ క్షణమైనా ఇల్లు ఖాళీ చేయాల్సిందే. మరో ఇల్లు చచ్చినట్లు వెదుక్కోవాల్సిందే...‘వెధవ జీవితం’ అని తిట్టుకోవాల్సిందే.అది ఒక పట్టణం. ఆ పట్టణంలోని ఒక ఇంటిలో సుబ్బారావు–ఆమని అనే దంపతులు అద్దెకుంటున్నారు. వారు ఫేస్ చేస్తున్న పరీక్షలు మచ్చుకు కొన్ని... నా పేరే కాంచనమాల....రగిలిస్తా అగ్నిజ్వాలా: ‘‘ఏమ్మా ఆమని ఇంట్లో ఉన్నావా!’’ అంటూ సరాసరి ఇంట్లోకి దూసుకు వచ్చింది వోనరాంటీ కాంచనమాల (ఇంటి యజమాని భార్య)‘‘రండీ ఆంటీ’’ అంటూ భయంభయంగా ఇంట్లోకి స్వాగతం పలికింది ఆమని.‘‘ఏమ్మా...రాత్రి నువ్వూ మీ ఆయన తెగ వాదులాడుకుంటున్నారు. ఏంటీ విషయం?’’ అని అడిగింది వోనరాంటీ.ఆమె చెవుల నిండా పరమ ఆసక్తి.‘‘ఏదో లెండి. భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా...’’ అంటే సరిపోయేది.కానీ ఆమని కళ్ల కన్నీళ్ల ఆనకట్ట తెగిపోయింది.‘‘ఏం చెప్పమంటారు ఆంటీ...ఈయనకు కట్టబెట్టి నా గొంతు కోశారు. పెళ్లయినప్పుడు ఈయన జీతం ఎంతో...ఇప్పుడూ అంతే. గొర్రె తోకైనా పెరుగుతుందేమోగానీ ఈయన జీతం పెరగడం లేదు...ఎప్పుడూ డబ్బులకు కటకటే’’ అని ఏడుస్తూ ముక్కు చీదింది ఆమని.‘‘పెళ్లయిన కొత్తలో మా ఆయన కూడా ఇంతేనమ్మా...’’ అంటూ ఆ ఏడుపు జ్వాలల్లో వోనరాంటీ లీటర్ పెట్రోలు పోసింది.సుమారు రెండు గంటల తరువాత...‘‘అత్తా ఒకింటి కోడలే సీరియల్ టైమవుతుంది.... నేను వెళ్తొస్తానమ్మా...’’ అంటూ లేచింది వోనరాంటీ.‘‘కాఫీ తాగి వెళ్లండి ఆంటీ’’ మాటవరసకు అంది ఆమని.‘‘ఎందుకే లేమ్మా’’ అంటూనే కుర్చీలో మళ్లీ కూర్చుంది వోనరాంటీ. :ఎక్కడికీ పోతావు చిన్నవాడా: ‘‘ఏమిటోయ్ సుబ్బారావు హడావుడిగా వెళుతున్నావు?’’ దారిలో తనకు ఎదురైనా సుబ్బారావును అడిగాడు వోనరంకుల్ అప్పారావు.‘‘ఆఫీసులో అర్జంటుగా పని ఉంది అంకుల్’’ అన్నాడు సుబ్బారావు.(పనా పాడా! వోనరంకుల్ ఎదురొస్తున్నాడని, దొరికితే అతడి సుత్తి కత్తికి బలికావాల్సి వస్తుందనే భయంతో వేగంగా నడుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడుగానీ...వీధిరాత వల్ల ఇలా దొరికిపోయాడు)‘‘పద టీ తాగి వెల్దువుగానీ’’ అని సుబ్బారావును ఇరానీ కేఫ్‌లోకి తీసుకెళ్లాడు వోనరంకుల్.‘‘రెండు గరం గరం టీ’’ అని ఆర్డర్ ఇచ్చాడు.వోనరంకుల్ జేబులో నుంచి చిల్లిగవ్వ కూడా తీయడు. పొరపాటున ఎక్కడ తీయాల్సివస్తుందేమోనని చొక్కకు, ప్యాంటుకు జేబులు కుట్టించుకోడు. మరి అలాంటి అంకుల్ నోరారా రెండు టీలకు ఆర్డర్ ఇచ్చాడంటే? వామ్మో! సుబ్బారావు గుండెల్లో ఖాళీ కప్పులు పడ్డాయి.‘‘ఇంతకీ పెద్దనోట్ల రద్దు సక్సెస్ అయినట్లేనంటావా...మోదీ మళ్లీ వస్తాడంటావా?’’ టీ గట్టిగా జుర్రుతూ అడిగాడు వోనరంకుల్.ఏమాత్రం ‘తెలివి’ ప్రదర్శించిన సునామి ఒడిలో తలదాచుకోవడమే అనే విషయం తెలిసిన సుబ్బారావు...‘‘నాకు పాలిటిక్స్ మీద పెద్దగా ఐడియా లేదండీ’’ అన్నాడు.‘ఐడియా’ అనే మాట వినగానే వోనరంకుల్ ఫేస్ వేయి బల్బులతో వెలిగిపోయింది.‘‘ఏది ఏమైనా వొడాఫోన్ ఇండియా, ఐడియా మెర్జ్ కావడం అనేది ఒక చారిత్రక పరిణామమేనని చెప్పుకోవాలి. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అంటే...’’ దంచుకుపోతున్నాడు వోనరంకుల్.వరదకు అడ్డుకట్ట వేయాలని...‘‘మీకు సెల్ఫోన్లపై మంచి పట్టు ఉంది అంకుల్’’ అన్నాడు సుబ్బారావు దీనంగా.‘‘సెల్ఫోన్లేమి ఖర్మ, హ్యూమన్ సెల్స్ట్రక్చర్ మీద కూడా మనకు బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ది హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. దే ప్రొవైడ్ స్ట్రక్చర్ ఫర్ ది బాడీ...’’ నాన్‌స్టాప్‌గా దూసుకుపోతున్నాడు వోనరంకుల్.‘‘ఆపవయ్యా నీ సుత్తి’’ అంటే ఎక్కడ అద్దె పెంచుతాడో అనే భయం చేత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వింటూనే ఉన్నాడు సుబ్బారావు. ఆహా ఏమి రుచి తినవోయ్ మై మరచి: ఆమె వోనరంకుల్ కోడలు. పేరు రుచిత.ఎప్పుడు చూసిన యూ ట్యూబ్‌లో వంటల వీడియోలు చూస్తుంటుంది. అప్పుడప్పుడు వంటింట్లోకి దూరుతుంది. అప్పుడే ప్రాబ్లం. మచ్చుకు ఒకటి: ‘‘ఆమనిగారు...ఆమనిగారు...ఇంట్లో ఉన్నారా?’’‘‘ వచ్చేయమ్మా. అలా కూర్చోమ్మా.....ఏంటీ విశేషాలు..’’‘‘జంపక్ జంపక్ జపాక్...అని కొత్తరకం మైసూరుపాక్ తయారుచేశాను. మీకిచ్చి వెళ్దామని వచ్చాను. బాగా కుదిరింది. మీకు బాగా నచ్చుతుంది...’’‘‘థ్యాంక్యూ తల్లీ...ఇలా ఇవ్వు’’‘‘వెళ్తొస్తాను ఆమనిగారు’’రుచిత అలా బయటికి వెళ్లిందో లేదో ‘జంపక్ జంపక్ జపాక్’ను వేడివేడిగా చెత్త బుట్టలో వేస్తుంది ఆమని. సాయంత్రం మాత్రం...‘‘నీ చేతులు ఇంత అద్భుతం చేస్తాయనుకోలేదు తల్లీ. జంపక్ జంపక్ జపాక్ ఎంత బాగుందో. మళ్లీ మళ్లీ తినాలనిపించిదనుకో...’’ అంటుంది.ఈ పొగడ్తల పుణ్యమా అని రెండో రోజు మరో కొత్త రకం వంటకంతో ఇంట్లోకి దూరుతుంది రుచిత.‘‘ఆమనిగారు...ఇంట్లో ఉన్నారా...ఏమీలేదండీ...కందగడ్డ బొందగడ్డ అని కొత్తరకం పులుసు చేశాను. బాగా కుదిరిందండీ...ఎలా ఉందో చెప్పరా’’ అని గోముగా అడుగుతుంది. ‘‘ఏమిటి చెప్పేది నీ బొంద. నీ యెంకమ్మ....నీ ప్రయోగాలకు నేనేమన్నా ఎలుకలాగా కనిపిస్తున్నానా....నోర్ముసుకొని ఇక్కడి నుంచి వెళ్లు’’ అని ఆమనికి అనాలనే ఉంటుంది....కానీ అనలేదు. అలా అంటే అద్దె పెరగవచ్చు. ఏదో సాకుతో ఇంటి నుంచి ఖాళీ చేయించవచ్చు. ఈ రెండు కాకపోతే ‘కరెంటు ఎక్కువ కాలుస్తున్నారు’ ‘నీళ్లు ఎక్కువ వాడుతున్నారు’లాంటి సాకులతో పొద్దస్తమానం తిట్టనూ వచ్చు. ఎందుకొచ్చిన లొల్లి! అని అడ్జెస్టై ‘నీ వెరైటీ వంటలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది తల్లీ’ అంటూ ఎప్పటికప్పుడు కృత్రిమ లొట్టలు వేస్తుంటుంది ఆమని. – యాకుబ్ పాషా -
కథ విన్నాక ఏం మాట్లాడలేదు – ఆమని
‘‘అమ్మ దీవెన’ మంచి సబ్జెక్ట్. కుటుంబసభ్యులందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలో తల్లి బాధ్యత ఏంటి? పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడానికి అమ్మ ఎంత కష్టపడుతుంది? అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం’’ అని నటి ఆమని అన్నారు. ఆమె కీలక పాత్రలో శివ ఏటూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మ దీవెన’. పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, దినేష్, శరత్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పద్మ సమర్పణలో లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి గురవయ్య రూపొందిస్తోన్న ఈ చిత్రం మంగళవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఆమని మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నన్ను కలిసి ‘అమ్మ దీవెన’ కథ చెబుతామన్నప్పుడు ఆలోచించాను. కానీ, కథ విన్నాక ఏం మాట్లాడలేదు.. చేస్తానని చెప్పా. ఇలాంటి కథను తీయడానికి నిర్మాతలు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా వైవిధ్యమైంది’’ అన్నారు. ‘‘ఉమ్మడి కుటుంబంలోని బంధాలను చక్కగా ఆవిష్కరించే చిత్రమిది’’ అన్నారు శివ ఏటూరి. ఎత్తరి గుర వయ్య, నటుడు అజయ్ ఘోష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.వి.హెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పద్మజ నాయుడు, ఎత్తరి చినమారయ్య. -
గెస్ట్‌హౌస్‌కు రమ్మనే వారు : సీనియర్ హీరోయిన్
సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పలువురు నటీమణులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. గతంలో మీటు అంటూ సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ కూడా నడిచింది. అయితే ఇటీవల టాలీవుడ్‌ను ఇదే అంశం కుదిపేస్తోంది. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆమని స్పందించారు. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల గురించి వివరించారు. కాస్టింగ్ కౌచ్ అన్నది కొత్త అంశమేం కాదని గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయని తెలిపారు. స్వయంగా తాను కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. సినిమా గురించి మాట్లాడేందుకు సంప్రదించిన కొందరు అంతా ఓకె అనుకున్న తరువాత గెస్ట్‌హౌస్‌కు రమ్మనే వారని తెలిపారు. అంతేకాదు ప్రత్యేకంగా మీ అమ్మను వెంట తీసుకురాకు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. వాళ్ల మాటలను బట్టే అంతా అర్ధమయ్యేదని అందుకే అలాంటి వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించానని తెలిపారు. పెద్ద నిర్మాణ సంస్థల్లో ఇంలాంటి ఇబ్బందులు ఉండేవి కావన్న ఆమని, చిన్నకంపెనీల నుంచి ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు. -
విడుదల రోజు ఉదయం ఆట ఉచితం!
శరత్ చంద్ర, నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా.. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ఐపిసి సెక్షన్ భార్యాబంధు’ ఆలూరి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్ విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శించేందుకు నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్స్ మినహా ఈ చిత్రం విడుదలవుతున్న అన్ని థియేటర్స్ (సింగిల్ స్క్రీన్స్)లో తొలి షోను ఉచితంగా ప్రదర్శించనున్నారు. దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. సినిమాపై నమ్మకంతో నిర్మాత ఆలూరి సాంబశివరావు ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పదిమందికి చెబుతారనే నమ్మకంతో ఈ ఆఫర్ ఇస్తున్నామని దర్శకుడు తెలిపారు. -
మిస్సయిపోతానేమోనని ‘యస్’ చెప్పా
‘‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’లో ఓ ఇంపార్టెంట్ రోల్‌కి అడిగినప్పుడు చేయాలా? వద్దా? అనుకున్నా. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమాలో కొత్త హీరో. అయితే కథ విన్నాక ఒకవేళ చేయనని చెబితే మంచి సినిమా మిస్సయినట్లే అనిపించింది. అందుకే యస్ చెప్పా’’ అన్నారు ఆమని. ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’ తదితర చిత్రాల్లో కథానాయికగా మంచి స్థానం సంపాదించుకున్న ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలు చేస్తున్న విఫయం తెలిసిందే. శరత్ చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మించిన ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’లో ఆమె ఓ కీలక పాత్ర చేశారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆమని మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నేను స్వాతీ శ్రీపాద అనే రైటర్ కమ్ కౌన్సిలర్‌గా చేశాను. ఇందులో నాకు పెళ్లి నేపథ్యంలో వచ్చే ఓ పాట కూడా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన పెళ్లి పాటల్లో టాప్ టెన్‌లో ఈ పాట కూడా ఉంటుంది. వివాహ బంధం గొప్పతనం తెలియక చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. ఆ నేపథ్యంలో చక్కని సందేశం, మంచి వినోదంతో రెట్టడి శ్రీనివాస్ ఈ సినిమా తీశారు. ఎంతో ప్యాషన్‌తో ఆలూరి సాంబశివరావుగారు ఈ సినిమా నిర్మించారు. హీరో శరత్ చంద్రకు మంచి భవిష్యత్ ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
కెమెరామెన్ కావాలనుకున్నా.. నిర్మాతనయ్యా
‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘చెంబు చినసత్యం’ నన్ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆర్థికంగానూ నష్ట పరిచింది. ఆ సినిమా నేర్పిన పాఠాలతో ఇప్పుడు రెండు మంచి సినిమాలు నిర్మిస్తున్నాను. వాటిలో ఒకటి ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’. రెండో చిత్రం ‘నేనే ముఖ్య మంత్రి’ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నిర్మాత ఆలూరి సాంబశివరావు అన్నారు. శరత్చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా ఆమని, మధునందన్ ముఖ్య పాత్రల్లో రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ– ‘‘కెమెరామెన్ కావాలని కలలు కన్నా. కుదరకపోవడంతో నిర్మాతనయ్యా. మహిళల రక్షణ కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఓ సెక్షన్‌ని కొందరు మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశానికి వినోదం జోడించి నిర్మించాం. ఈనెల 29న మా సినిమాతో పాటు ఏడెనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మా సినిమాపై మాకు నమ్మకముంది. ‘నేనే ముఖ్యమంత్రి’ చిత్రాన్ని రెండు మూడు నెలల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మగజాతి స్వాతంత్య్రం పోయింది
‘‘యువరానర్.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947 ఆగస్టు 15. కానీ, అదే స్వాతంత్య్రం మగజాతి కోల్పోయింది 1983 డిసెంబర్ 25.. నాలాంటి భార్యా బాధితులను రక్షించడానికి పైనుంచి వచ్చిన పరమాత్ముడిలా కనిపిస్తున్నావు రా’’ వంటి డైలాగులు ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. శరత్చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా ఆమని, మధునందన్ ముఖ్య పాత్రల్లో రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన చిత్రం ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’.‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ అన్నది ఉపశీర్షిక. నిర్మాత రాజ్ కందుకూరి, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ట్రైలర్స్ విడుదల చేశారు. రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ వినూత్న కుటుంబ కథా చిత్రమిది. విజయ్ కురాకుల సంగీతం, మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం హైలైట్’’ అన్నారు.‘‘సిని మా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. శరత్చంద్ర, విజయ్ కురాకుల, మౌనశ్రీ మల్లిక్ పాల్గొన్నారు. -
మా ఆవిడా... గ్యాస్ సిలిండరూ
సమ్సారం సంసారంలో సినిమా అప్పటికీ మా నాన్నతో అంటానే ఉన్నాను... నాన్నా ఆ మనిషి పాత సాక్సులతో పెళ్లిచూపులకు వచ్చాడు పిసినారి అయి ఉంటాడు అని. వింటేనా. నా గొంతు కోశారు...అప్పుడే మా నాన్నతో చెప్పాను.. నాన్నా.. అతడు పెళ్లిచూపులకు వచ్చి కర్చీఫ్ మర్చిపోయాడు ఉత్త మతిమరుపు మనిషిలా ఉన్నాడు చూసుకోండి అని. నా గొంతు కోశారు...మంచం మీద ఉండగానే హడావిడి తెలుస్తూ ఉంది.కుర్చీ బర్రున లాగి అటక మీద ఉన్న మినీ గ్యాస్ స్టవ్‌ను కిందకు దించింది.అందులో గ్యాస్ లేదు.ఫైవ్ జీరో త్రీకి వెళ్లొచ్చింది.‘అబ్బే’ అన్నారు.టూ జీరో టూకు వెళ్లొచ్చింది.‘అయ్యో... నిన్ననే మా మరదలు అడిగితే ఇచ్చామే’ అని సానుభూతి చూపించారు.ఇంకా ఇంట్లో టీ కూడా పెట్టలేదు. పిల్లలకు ఇడ్లీ పెట్టాల్సి ఉంది. ఆ తర్వాత వొండి బాక్సులు కట్టాల్సి ఉంది. ఇప్పుడు గ్యాస్ అయిపోయిందంటే దానికి వెంటనే ప్రత్యామ్నాయందొరకలేదంటే దుప్పటి కప్పుకున్నా గడగడమని వణుకు వస్తోంది.‘గ్యాస్ బుక్ చేయమన్నాను కదా’ అని ఇప్పుడొచ్చి అడుగుతుంది.మర్చిపోయాడు.ఆ గ్యాస్ వాళ్ల దగ్గర ఫోన్ నంబరేదో ఆవిడది రిజిస్టర్ అయినా పోయుండేది. ఆవిడే బుక్ చేసుకుంటూ ఉండేది. ఖర్మగాలి తన నంబరు నుంచే బుక్ చేయాలి. ప్రతిసారీ మర్చిపోతున్నాడు.వచ్చింది. కప్పుకున్న దుప్పటి మీద నుంచే టపాటపా చరిచి ‘గ్యాస్ అయిపోయింది’ అంది.అప్పుడామె ముఖం ఎలా ఉందంటే కిమ్గాడు ట్రంప్‌గాడు నువ్వెంత అంటే యూ హౌమచ్ అనుకొని చెరో రెండు హైడ్రోజన్ బాంబులు ప్రపంచం మీద విసిరి లోకమంతా నాశనమై పోయి ఇక బతకడానికి ఏ ఆశా లేనట్టుగా ఉంది.‘నేను వెళ్లి ఏజెన్సీ వాణ్ణి బామాలి తెచ్చి పెడతానులే పదకొండు లోపు’‘అప్పటి వరకూ?’ పెదాలు బిగించి తీక్షణంగా చూస్తూ అడిగింది.‘అప్పటి వరకూ అంటే తత్త..మమ్మా’..‘తత్తా.. మమ్మా అంటే అయిపోతుందా? నీళ్లు నమిలి నీళ్లు తాగితే సరిపోతుందా? జవాబు చెప్పి తప్పించుకోవడం కాదు... పని టయానికి చేసి ఇంటికి చక్కదిద్దాలి. అదీ ఒక మగవాడి బాధ్యత. ఒక భర్తగా మీరు ఇంటిని ఏనాడు పట్టించుకున్నారు కనుక. అరె గ్యాస్ బుక్ చేసి నెల అయిపోయిందే బుక్ చేయకపోతే ఇబ్బంది పడతామే అనే ఇంగితం ఉందా. జ్ఞానం ఉందా. ఒంట్లో భయం ఉందా. ఆ.. ఏముందిలే... ఇంట్లో ఉందిగా ఒకత్తి. అదే ఏదో తిప్పలు పడుతుంది అనేగా మీ ధైర్యం. అసలు మిమ్మల్ని కాదు. మీ అమ్మననాలి’‘మా అమ్మని ఏమీ అనొద్దు’ ‘ఎందుకు అనను. లక్ష అంటాను. కోటి అంటాను. కావాలంటే బిగ్‌బాస్ హౌస్‌కు గెస్ట్‌గా వెళ్లి అల్లా నవదీప్కూ దీక్షకూ శివబాలాజీకి కూడా చెప్తాను. కనగానే సరిపోదు. సరిగ్గా పెంచాలి. పెంచిన మనిషిని మనిషో కాదు చెక్ చేసి పెళ్లి చేయాలి. అరె... పుచ్చొంకాయకీ మంచొంకాయకీ తేడా తెలియని మనిషి పెళ్లెందుకు చేసుకోవాలీ అంటా’‘మొన్న అన్నీ మంచి వంకాయలే తెచ్చాను’తెచ్చారు. హూ... కాలీఫ్లవర్ తెమ్మంటే క్యాబేజీని తేలేదు మీరూ. పిల్లలు క్యాబేజీ తినరని మీకు తెలియదూ. ఎలా తెలుస్తుంది. పిల్లల సంగతి మీకు పడితే కదా. అసలు పెద్దాడు ఏం చదువుతున్నాడో చెప్పండి?’ ‘వాడి హోమ్‌వర్క్ నువ్వు చేయించి చదివిస్తున్నందుకు మొన్నోసారి వెంకటగిరి చీర కొనిచ్చాను మర్చిపోయావా?’కొనిచ్చారులేండి పెద్ద నిజామ్ నవాబు తన పట్టమహిషికి కొనిచ్చానన్నంత సంబరంతో. ఎంత అది? ఎంత? పన్నెండొందల ముప్పై రూపాయలు. అదా నా విలువ. ఏం... ఏడు వేలో ఎనిమిది వేలో పెట్టి ముత్తయిదు పట్టుతో నేసిన నిమ్మకాయరంగు చీరను చెన్నై సిల్క్స్లో కొనివ్వడానికి మీకు చేతులు రావేం? అప్పటికీ మా నాన్నతో అంటానే ఉన్నాను... నాన్నా ఆ మనిషి పాత సాక్సులతో పెళ్లిచూపులకు వచ్చాడు పిసినారి అయి ఉంటాడు అని. వింటేనా. నా గొంతు కోశారు.’ ‘ఫోరెన్సిక్ వాళ్లని పిలుస్తానులే. హంతకులెవరో తెలుస్తుంది’ పంచ్లొకటి మళ్లీ. అసలు గ్యాసు, మంచినీళ్లు, టీ డబ్బాలో టీ పౌడరూ లేకపోతే వెర్రెక్కిపోతుంది నాకు. అన్నం లేకుండా అయినా ఉంటానుగాని ఇంట్లో గ్యాస్ లేకుండా ఉండను. ఓలా బుక్ చేయండి. మా అమ్మా వాళ్లింటికి వెళ్లిపోతాను’‘పిల్లల స్కూలు’‘స్కూలు. మీ కడుపున పుట్టాక వాళ్లకు స్కూలు కూడానా. ఇద్దరు రత్నాల్లాంటి పిల్లల్ని కనిచ్చాను. అరె... ఆవగింజంత కృతజ్ఞత కూడా లేదే. ఇదిగో ఇంటిఇల్లాలికి అప్పుడప్పుడైనా మల్లెపూలు తెద్దాం. మిఠాయి డబ్బా తెద్దాం. మంచి మాట పక్కన కూర్చుని మాట్లాడదాం. ఆహా. అది లేదు. ఎంత సేపు ఆఫీసుఫోన్లు.. ఆ టక్కులాడితో కబుర్లు ఈ తిప్పులాడితో జోకులు’ ‘అదొకటుందా నా ప్రాణానికి’‘ఏం.. అంతమాత్రం తెగింపు కూడా లేకపోతే ఇక ఏమిటుంటుంది జీవితంలో సరదా. అయినా నా ముఖమే సరిగ్గా చూడని మీరు ఎవరి ముఖమో ఏం చూస్తారులేండి. అలా ఇంకెవరినైనా చూస్తే సాధిద్దామనుకుంటే ఆ ముచ్చట తీరే భాగ్యం కూడానా’...మానవత్వానికి ఇవి రోజులు కావు’‘మానవత్వం. మా మేనల్లుడి బారసాలకి పది గ్రాముల గొలుసు వేద్దామని నేనంటే తొమ్మిది పాయింట్ అయిదు గ్రాముల గొలుసు వేసినప్పుడే తెలిసింది మీ మానవత్వం. అదే మీ మేనకోడలి బారసాలకు మీరు బెల్లంకొట్టిన రాయిలా ఉంటే అదేమిటండీ... ఏ నూరో రెండునూర్లో పెట్టి వెండి పట్టీలు వేద్దాం అన్నానే... అదండీ మానవత్వం అంటే. నా మానవత్వం ముందు మీ మానవత్వం ఎంత?’దిగ్గున లేచాడు.కిచెన్‌లోకి వెళ్లాడు. స్టవ్ కిందున్న కప్‌బోర్డులో సిలిండర్‌ని కదిల్చాడు. ఖాళీగా ఉంది. పక్కన ఉన్న సిలిండర్‌ని కదిల్చాడు. బరువుగా ఉంది. మారు మాట్లాడకుండా దానిని తీసి స్టవ్‌కు అమర్చి స్టవ్ వెలిగించి మౌనంగా వచ్చి కూర్చున్నాడు. గ్యాస్ భయంతో పోయిన నెలలోనే రెండో సిలిండర్ తెచ్చి పెట్టాడు. ఇద్దరూ మర్చిపోయారు.క్షణాల్లో వచ్చిన సిలిండర్‌ను చూసి ఆ.. అంటూ ఆశ్చర్యపోయింది. నాలుక కరుచుకుంది. సర్దుకుంది. హు.. ఇది ఈ మనిషి ఘనకార్యం. ఎలా చేసేదమ్మా ఈ మనిషితో కాపురం. అరె ఇంట్లో అన్నీ పెట్టుకుని ఊరంతా వెతుకుతాడే ఈ మనిషి రేపు నన్ను, నా పిల్లలను ఏ ఇనార్బిట్ మాల్కో తీసుకెళ్లి మర్చిపోయి రాడని ఏమిటి గ్యారంటీ. అప్పుడే మా నాన్నతో చెప్పాను.. నాన్నా.. అతడు పెళ్లిచూపులకు వచ్చి కర్చీఫ్ మర్చిపోయాడు ఉత్త మతిమరుపు మనిషిలా ఉన్నాడు చూసుకోండి అని. నా గొంతు కోశారు’... ఆ పాశ్చాత్య సంగీతపు పెనుతుఫాను అలా కొనసాగుతూనే ఉంది. మీరేం చేస్తున్నారు? సినిమాలో సంసారం బాలాజీ (రాజేంద్రప్రసాద్)– ఝాన్సీ (ఆమని) లది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు పిల్లలు. బాలాజీ బ్యాంకు ఉద్యోగి. తోటి ఉద్యోగులు అవినీతి నేరం మోపి ఉద్యోగం పోయేలా చేస్తారు. దాంతో తప్పనిసరై ఝాన్సీ ఉద్యోగంలో చేరుతుంది. అప్పుడు ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం బాలాజీపై పడుతుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని ఇంటి దగ్గర ఉన్న భర్తకు చెబుతుంది ఝాన్సీ. పిల్లలు తండ్రి మాట వినకుండా అల్లరి చేస్తుంటారు. రోజూ ఉదయం పాపని స్కూల్‌కి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొస్తుంటుంది ఝాన్సీ. భార్య ఆఫీసుకు వెళుతుండటంతో ఆ బాధ్యత బాలాజీపై పడుతుంది. ఝాన్సీ ఆఫీసు తరఫున ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ బిగిస్తారు. దీంతో ఇరుగు పొరుగు బాలాజీ దగ్గరకొచ్చి కబుర్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఆ హడావిడిలో పాప సంగతి మర్చిపోతాడు బాలాజీ. తాను వచ్చేటప్పుడు పాపను తీసుకొచ్చిన ఝాన్సీ కోపంగా ‘‘మీరేం చేస్తున్నారు. పిల్లకోసం స్కూల్‌కి వెళ్లలేదు. అది దిక్కులేక ఏడుస్తూ రోడ్డుకు అడ్డం పడిపోతోంది. ఇంటికొస్తుంటే నా కారు కిందే పడి.. అంటూ ఎందుకెళ్లలేదు?’’అని నిలదీస్తుంది. ‘నేను మొగుణ్ణి, మొగాణ్ణి. సంజాయిషీ చెప్పను’ అని బదులిస్తాడు బాలాజీ. ‘ఛీ ఛీ.. మిమ్మల్ని నమ్ముకుని పిల్లల్ని వదిలి వెళ్లడం నాదీ బుద్ధి తక్కువ’ అంటుంది. నేనే ఎలాగోలా సంపాదిస్తా నువ్వు ఉద్యోగం మానేయ్ అంటాడు బాలాజీ. నా పిల్లల కంటే నాకు ఏదీ ముఖ్యం కాదండీ. మానేస్తాను అంటుంది ఝాన్సీ. ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలోని ఇటువంటి సన్నివేశాలు మన నిజ జీవితంలో, ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవే. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – నిష్ఠల -
మంచి ఫీల్ ఉన్న చిత్రం
‘‘ఎన్నో అడ్డంకులు అధిగమించి మా ‘పరంపర ’ చిత్రాన్ని విడుదల చేశాం. మూడో వారంలోకి ప్రవేశించడం ఆనందంగా ఉంది. ఈ 28న వైజాగ్, విజయవాడ, రాజమండ్రిల్లో విడుదల చేయనున్నాం’’ అని దర్శక, నిర్మాత మధు మహంకాళి తెలిపారు. సీనియర్ నరేశ్, ఆమని, రావి కొండలరావు ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘పరంపర’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నరేశ్ మాట్లాడుతూ -‘‘జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ వచ్చింది. ఈ తరహా చిత్రాలు తీయడానికి నిర్మాతలకు ధైర్యం కావాలి. మంచి ఫీల్ ఉన్న చిత్రం’’ అన్నారు. ఒక మంచి చిత్రం నిర్మించామనే సంతృప్తి దక్కిందని నిర్మాతల్లో ఒకరైన రూపాదేవి అన్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు వినోదపు పన్ను మినహాయింపునివ్వాలని రావి కొండలరావు కోరారు. యువతరాన్ని మేలుకొలిపే చిత్రమిదని మనోవైజ్ఞానిక విశ్లేషకులు సి. నరసింహారావు అభిప్రాయపడ్డారు. -
మానవతా విలువలకు పట్టం
అంతరించిపోతున్న సంస్కృతీ సంప్రదాయాలను, సన్నగిల్లుతున్న బాంధవ్యాలను తిరిగి స్వాగతించడమే ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం - ‘పరంపర’. నరేశ్, ఆమని జంటగా నటించిన ఈ చిత్రాన్ని రూపాదేవి మహంకాళితో కలిసి మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మహోన్నతమైన మానవతా విలువల నేపథ్యంలో సాగే కథాంశమిది. తెలుగు తెరపై ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నం రాలేదని నమ్మకంగా చెప్పగలం. ఆర్ష సంప్రదాయానికి పూర్వవైభవం తేవడమే పరమావధిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇందులో నరేశ్, ఆమని పోటీ పడి నటించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రావి కొండలరావు, సంతోష్, మనీషా, మాస్టర్ సాయితేజ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసన్న జైన్, సంగీతం: అర్జున్, కూర్పు: పరేష్ కాందార్, పాటలు: రాణి పులోమజాదేవి, నిర్మాణం: ధృతి మీడియా ప్రై. లిమిటెడ్. -
దేవుడు నాకు అన్నీ ఆలస్యంగానే ఇస్తాడు...
తెలుగింటి మధ్యతరగతి ఇల్లాలంటే ఎలా ఉంటుంది? కొంచెం కారంగా... ఇంకొంచెం గారంగా... మరికొంచెం మమకారంగా... కాస్తంత వెటకారంగా... అసలు ఇదంతా ఎందుకు? అచ్చం ఆమనిలా ఉంటుందంటే సరిపోతుందిగా. నిజమే... ఆమె చేసిన పాత్రలన్నీ అలాంటివే. శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం, శుభసంకల్పం, ఆ నలుగురు... కన్నడ అమ్మాయి అయిన ఆమని ఇలాంటి సినిమాలతో తెలుగింటి పిల్ల అయిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై అప్పుడప్పుడూ తళుక్కుమంటోన్న ఆమని గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ చదివితే కొంతలో కొంతైనా ఆ లోటు తీరుతుంది. మీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అనిపిస్తోంది? తృప్తికరంగా ఉంది. ఇప్పుడిప్పుడే మంచి పాత్రలకు అవకాశం వస్తోంది. ‘ఆ నలుగురు’ తర్వాత ‘దేవస్థానం’కి దాదాపు ఎనిమిదేళ్లు విరామం తీసుకున్నారు. మళ్లీ రెండేళ్లకు ‘చందమామ కథలు’ చేశారు. ఎందుకీ గ్యాప్? ‘ఆ నలుగురు’ తర్వాత నాకు మంచి పాత్రలు రాలేదు. వచ్చినవి కూడా నా వయసుకు మించిన పాత్రలు కావడంతో నేనే ఆసక్తి కనబరచలేదు. నాలుగు పదుల వయసులో ఉన్నా మరీ ముసలి వయసు పాత్రలు చేయడం సరిగ్గా అనిపించలేదు. అందుకే తిరస్కరించా. ఒకవేళ నేను వృద్ధ పాత్ర చేసినా, సినిమాలో దానికో అర్థం ఉండాలి. అలాంటివైతే తప్పకుండా చేస్తా. రానున్న మీ ‘చందమామ కథలు’లో మీకు నచ్చిన అంశాలేంటి? నా కెరీర్లో ఇప్పటివరకు నేనిలాంటి సినిమా చేయలేదు. ఒక సినిమాలో ఎనిమిది కథలు అనగానే, భలే అనిపించింది. అన్ని కథలూ బాగుంటాయి. పెద్ద నరేష్ గారిది, నాదీ ఒక కథ. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలుస్తుందనీ, ప్రతి ఒక్కరికీ ఒక తోడు కావాలనీ మా కథ చెబుతుంది. తెలుగులో నా తొలి హీరో నరేష్. ‘జంబలకిడి పంబ’ తర్వాత ఇద్దరం కొన్ని సినిమాలు చేశాం. మళ్లీ ఇన్నేళ్లకు మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. కథానాయికగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. అది తొందరపాటని ఎప్పుడైనా అనిపించిందా? లేదు. అప్పటికే చాలా సినిమాలు చేసేశాను. ఇక, జీవితంలో స్థిరపడితే బాగుంటుందనే ఆలోచన బలంగా ఉండటంతో పెళ్లి చేసుకున్నాను. ‘ఇన్నేళ్లూ తీరిక లేకుండా సినిమాలు చేశావ్ కదా.. ఇక విశ్రాంతి తీసుకో’ అని మావారు అనడంతో, సినిమాలు చేయలేదు. మీది ప్రేమ వివాహం... పైగా మతాంతర వివాహం కాబట్టి, అత్తగారింట్లో సర్దుకుపోవడానికి ఏమైనా ఇబ్బంది అనిపించిందా? నాకు కుల, మతాల పట్టింపు లేదు. కానీ, అత్తగారింటి వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పట్టింది. ఏ ఆడపిల్ల విషయంలో అయినా ఇది సహజమే కదా. అయితే, మా ఇల్లు సర్వమత సమ్మేళనం అనొచ్చు. అన్ని దేవుళ్లూ ఒకటే అని మా భావన. దేవాలయాలతో పాటు దర్గాలకూ, చర్చిలకూ వెళతాను. మావారు కూడా నాలానే! గతంలో ఆయన సినిమాలు నిర్మించేవారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మళ్లీ సినిమాల్లో నటించాలని అనిపించడానికి కారణం? కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి తీరిక లేనంతగా పని చేసిన తర్వాత ఒక్కసారిగా ఖాళీగా ఉంటే, కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత బోర్ కొట్టడం, బాధ కలగడం రెండూ జరుగుతాయి. అలాంటి పరిస్థితిలోనే నేను మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్నాను. సినీ ప్రపంచంలోని జోష్‌కి దూరం కావాలని దాదాపు ఎవరూ అనుకోరు. మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నానని మావారితో అనగానే ‘ఓకే’ అన్నారు. మీ వైవాహిక జీవితంలో ఏవో ఆటుపోట్లు ఎదురయ్యాయని వార్త వచ్చిందే! నా వైవాహిక జీవితం బాగుంది. నాకూ, మావారికీ మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవు. హైదరాబాద్‌కు మారిపోవచ్చు కదా అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. మావారు స్థిరపడింది చెన్నై అని తెలిసిందే. మా అత్తగారింటిని వదులుకుని నేను హైదరాబాద్‌కు రాలేను. కానీ, నా కారణంగా షూటింగ్‌లకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. అందుకే, హైదరాబాద్‌కు మారకపోయినా ఫరవాలేదు. ఒకవేళ నా వైవాహిక జీవితం గనక సరిగ్గా లేకపోతే, నేను హైదరాబాద్‌కు షిప్ట్ అయిపోయి ఉండేదాన్ని కదా! సినిమాలపరంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న మీరు ఆ మధ్య వివాదాల్లో నిలిచారు. మీరు తనను హింసించారంటూ మీ మరదలు పేర్కొన్నారు కదా? డబ్బులు ఆశించి ఆడిన డ్రామా అది. నా సోదరుడు, అతని భార్య విడిపోవాలనుకున్నారు. కానీ, నన్ను కూడా వివాదంలోకి లాగితే డబ్బులు తీసుకోవచ్చు కదా! వాళ్లు అనుకున్నది సాధించారు. అది సాధించే క్రమంలో లేనిపోని దుష్ర్పచారంతో నన్ను చెడ్డదాన్ని చేశారు. నేనేంటో, నా స్వభావం ఎలాంటిదో సినిమా పరిశ్రమలో ఉన్న అందరికీ తెలుసు. షూటింగ్ లొకేషన్లో ఎంత క్రమశిక్షణగా ఉంటానో, అందరినీ ఎలా గౌరవిస్తానో కూడా తెలుసు. నేను వరకట్నం కోసం వేధించానని నిందించారు. కథానాయికగా ఓ ఏడెనిమిదేళ్లు విరామం లేకుండా సినిమాలు చేసి, చాలా డబ్బు సంపాదించుకున్నాను. ఇక, నాకు వేరేవాళ్ల డబ్బు ఎందుకు? ఒక్కసారిగా ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాధపడ్డా. ఆ అమ్మాయి నాతో బాగానే మాట్లాడేది. నిజానికి తాను నన్ను నిందించలేదనీ, అదంతా మీడియా వాళ్ల సృష్టే అనీ ఆ తరువాత ఓ సందర్భంలో పేర్కొంది. కానీ, పనిగట్టుకుని అలా చేయాల్సిన అవసరం మీడియాకు ఎందుకుంటుంది? నన్ను బజారుకీడ్చడానికి ప్రయత్నం చేయలేదంటూ ఆమె నన్ను నమ్మించే ప్రయత్నం చేసింది. నేనేమీ అనలేదు. అంతా ఆ పైవాడు చూసుకుంటాడని వదిలేశాను. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా మా మధ్య గొడవలేం లేవు. తను, నా సోదరుడు నాతో బాగానే ఉంటున్నారు. వాళ్ల పిల్లలను నా సొంత పిల్లల్లా చూసుకుంటాను. మరి.. మీ పిల్లల గురించి..? ఇంకా లేరు. ఆ దేవుడు నాకన్నీ ఆలస్యంగానే ఇస్తాడు. ఇది కూడా అంతే అనుకుంటున్నాను. కానీ, ఆలస్యంగా ఇచ్చినవన్నీ నాకు ఆనందాన్నే ఇచ్చాయి. కాబట్టి, ఈ ఆనందాన్ని కూడా చవి చూస్తాననే నమ్మకం ఉంది. అన్నీ ఆలస్యంగా అంటే.. సినిమాల్లో అవకాశాలకి చాలా కష్టాలు పడ్డారా? కొంతమంది నాయికల్లా సులువుగా హీరోయిన్ను అయిపోలేదు. చాలా కష్టాలు పడ్డా. అవకాశాలు తెచ్చుకోవడానికి సమయం పట్టింది. అందుకే నాకు ఆ విలువ తెలుసు. సినిమా మీద ప్రేమే కాదు భక్తి కూడా ఉంది నాకు. హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా? మా నాన్నగారు చలనచిత్రాల పంపిణీదారుడిగా చేసేవారు. కానీ, నేను పెరిగి పెద్దయ్యేసరికే విరమించుకున్నారు. దాంతో సినిమా రంగంలో ఉన్నవాళ్లతో టచ్‌లో లేరు. నాకేమో చిన్నప్పటి నుంచీ హీరోయిన్ కావాలని ఉండేది. కానీ, హీరోయిన్గా అంటే నాన్న ఒప్పుకోలేదు. అమ్మ ప్రోత్సహించడంతో చెన్నైలో ఉన్న మా బంధువు ఇంటికెళ్లాను. ఆయన కూడా సినిమా రంగానికి చెందినవారే. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేవి. చివరికి ‘పుదియ కాట్రు’ అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేసినా, తెలుగులో వచ్చినంత గుర్తింపు రాలేదు. ఇక్కడ ‘మిస్టర్ పెళ్లాం’, ‘జంబలకిడి పంబ’, ‘శుభలగ్నం’... ఇలా మంచి మంచి సినిమాల్లో అవకాశం వచ్చింది. మాతృభాష కన్నడంలో కన్నా తెలుగులో పేరు రావడం పట్ల మీ ఫీలింగ్? ఇక్కడ గొప్ప గొప్ప పాత్రలు చేశాను. ఇప్పటికీ నన్ను చాలామంది ‘శుభలగ్నం ఆమని’ అంటున్నారు. నన్ను తమ కుటుంబ సభ్యురాలిలా ప్రేక్షక జనం భావిస్తున్నారు. ఏ నటికైనా ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. ఇంతకీ మీ అసలు పేరు? వెండితెరపై మిమ్మల్ని ‘ఆమని’ని చేసిందెవరు? నా అసలు పేరు మంజుల. దర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణ గారే నా పేరును ‘ఆమని’ అని మార్చారు. ‘నీ పేరు మార్చేశాం’ అని ఒకరోజు ఆయన చెబితేనే తెలిసింది... ‘ఆమని’ అని పెట్టారని. సినిమా రంగంలో మీకు అత్యంత సన్నిహిత మిత్రులెవరు? సౌందర్య, నేను ప్రాణ స్నేహితురాళ్లలా ఉండేవాళ్లం. ఇద్దరం బెంగళూరు వాళ్లమే. మా మధ్య స్నేహం పెరగడానికి అదో కారణం కావచ్చు. ఎందుకంటే, ఎప్పుడైనా షూటింగ్స్‌లో విరామం దొరికి, బెంగళూరులో ఉన్నామనుకోండి... తప్పకుండా కలిసేవాళ్లం. సౌందర్య వాళ్ల అమ్మ నన్ను కూడా ఓ కూతురు అనుకుంటారు. నేను, సౌందర్య వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేంత ఆప్తమిత్రులం. ఆమె మరణం నిజం కాకపోయి ఉంటే బాగుండు అని ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఆ మధ్య ఓ టీవీ షో చేశారు. మళ్లీ అలాంటి ఆలోచన ఉందా? అది సరదాగా చేశాను. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి, టీవీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ఇప్పుడూ అంతే. కాకపోతే మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను. - డి.జి. భవాని