Amaran Movie
-
అమరన్ టీమ్ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి: విద్యార్థి
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ విఘ్నేశన్ అనే విద్యార్థి చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్లు చేసి విసిగిస్తుండటంతో మానసిక వేదనకు లోనవుతున్నానన్నాడు.అసలేం జరిగిందంటే?అమరన్ సినిమాలోని ఓ సీన్లో సాయిపల్లవి హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అది నిజంగానే సాయిపల్లవి నెంబర్ అని భావించిన ఫ్యాన్స్ ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో చూపించిన నెంబర్ తనదేనని విఘ్నేశన్ అనే ఇంజనీర్ విద్యార్థి తెలిపాడు.ఇది సాయిపల్లవి నెంబర్ అనుకుని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కాల్స్ చేస్తున్నారని వాపోయాడు. వరుస ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందన్నాడు. తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకుగానూ అమరన్ టీమ్ రూ.1.1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. మరి ఈ గొడవపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి!చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
అమరన్ సక్సెస్.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో!
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్కే23 వర్కింగ్ టైటిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు. #Sivakarthikeyan served Biryani to #SK23 crew members on celebrating #Amaran Blockbuster success ❤️🔥❤️🔥pic.twitter.com/uAzB5PbXqh— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024 -
నయనతారను 10 కోట్లు డిమాండ్ చేసిన ధనుష్
-
వీడియో: అమరన్ సినిమా ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమరన్ సినిమా నడుస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్‌పై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. బాంబు దాడి నేపథ్యంలో పెద్ద శబ్ధం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ధియేటర్లో శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పెట్రోల్ బాంబు దాడులపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టినట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే, శివకార్తికేయన్ అంటే గిట్టని వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.A petrol bomb incident has stirred tension at Alangaar Theatre in Melapalayam, Tirunelveli, early this morning.The incident reportedly linked to opposition to actor Sivakarthikeyan's film #Amaran, was captured on CCTV footage. pic.twitter.com/jN3QoLrBzz— South First (@TheSouthfirst) November 16, 2024 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన అమరన్ నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ మలయాళ నటుడు శ్యామ్ మోహన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కంపెనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన భార్య గోపికతో కలిసి కారు ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ప్రేమలు, అమరన్ చిత్రాలతో మెప్పించిన మలయాళ నటుడు శ్యామ్ మోహన్. ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే నునాకుజి అనే చిత్రంలోనూ కనిపించారు. ఇటీవల విడుదలైన అమరన్ మూవీలో కీలక పాత్ర పోషించాడు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. View this post on Instagram A post shared by ShyaM Mohan M (@shyammeyyy) -
భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో.. అదేంటో తెలుసా?
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.అయితే శివ కార్తికేయన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్మీ డ్రెస్‌లోనే తన ఇంటికెళ్లి భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటిపనితో ఫుల్ బిజీగా ఉన్న ఆయన భార్య ఆర్తి దగ్గరికి వెళ్లి సైలెంట్‌గా నిల్చున్నారు. ఇదేమీ గమనించని ఆర్తి తనపని చేసుకుంటూ అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. తన భర్తను ఆర్మీ డ్రెస్‌లో చూసిన ఆర్తి ఆశ్చర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. Sivakarthikeyan and his wife Aarthi 😍 pic.twitter.com/YcOC9eL5CG— SmartBarani (@SmartBarani) November 13, 2024 -
'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
దీపావళికి హడావుడి లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా 'అమరన్'. తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. మేజర్ ముకందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు. విడుదలకు ముందు తెలుగులో పెద్దగా హైప్ లేదు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.ప్రస్తుతం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కి చేరువలో 'అమరన్' ఉంది. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. ఎందుకంటే హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరీ ఈ రేంజ్ సక్సెస్ అయితే ఊహించలేదు. దీంతో ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ప్లాన్ మార్చుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' ఓటీటీలోకి రావాల్సింది. అంటే డిసెంబరు తొలివారంలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ కావడంతో మరో 1-2 వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుంటోందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డిసెంబరు మూడో వారంలోనే ఓటీటీలోకి 'అమరన్' వచ్చే అవకాశముంది.అడివి శేష్ 'మేజర్' తరహా కథతోనే 'అమరన్' సినిమా తీసినప్పటికీ.. ముకుందన్ భార్య వైపు నుంచి స్టోరీ చెప్పడం, అలానే సాయిపల్లవి యాక్టింగ్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య 'కంగువ' చిత్రానికి రిలీజ్ ముంగిట తలనొప్పిగా మారింది. థియేటర్లు అనుకున్నంతగా దొరకడం కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
బాక్సాఫీస్ పై అమరన్ దండయాత్ర..
-
వాళ్ల కష్టం ఎక్కువ.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు: సాయిపల్లవి
ఇటీవల ఎక్కడ చూసినా సాయిపల్లవి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం అమరన్ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనే.అందరి హీరోయిన్ల రూటు వేరు సాయి పల్లవి రూటు వేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ మాటను మరోసారి సాయిపల్లవి నిరూపించారు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న చాలామంది హీరోయిన్లు తమకు తక్కువగా పారితోషికం ఇస్తున్నారని గగ్గోలు పెట్టడం మనం చూశాం. కానీ సాయిపల్లవి మాత్రం అందుకు భిన్నంగా ఒక సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారి కష్టానికి తగినంత పారితోషం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.సౌత్ ఇండియాలో సాయిపల్లవి పేరు ఎప్పటికీ ప్రత్యేకమే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఎలాంటి యాడ్స్ చేయనని చెప్పేస్తారు. కథకు అందులోని తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అది ఎంత భారీ చిత్రం అయినా, స్టార్ దర్శకుడు, కథానాయకుడు అయినా నో అనేస్తారు. ఇక పోతే స్కిన్ షో అనే విషయాన్నే దరిదాపులకు కూడా రానివ్వరు. అసలు మేకప్‌కు ప్రాముఖ్యతను ఇవ్వరు. అందుకే సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇక విజయాల విషయానికి వస్తే ఈమె నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక అమరన్ చిత్రంలోని తన నటనకు దర్శకుడు మణిరత్నం వంటి వారే ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో ఈమె నటుడు నాగచైతన్యతో జతకట్టిన తండేల్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా మరో హిందీ చిత్రం ప్రచారం జరుగుతోంది. తెలుగులోనూ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇలా వరుసగా చిత్రాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సాయిపల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సహాయ దర్శకుల గురించి మాట్లాడారు. సహాయ దర్శకులకు వారి అర్హతకు తగిన వేతనాలు ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్‌తో పోలిస్తే వేతనాలు చాలా తక్కువ తీసుకుంటున్న దర్శకులు మన చిత్ర పరిశ్రమంలో ఉన్నారని పేర్కొన్నారు. బాలీవుడ్లో ఒక చిత్రాన్ని చేసిన సహాయ దర్శకుడు వెంటనే మరో చిత్రానికి పనిచేయడానికి సిద్ధమవుతున్నారని, ఇది చాలా మంచి విషయమని అన్నారు. అయితే. దక్షిణాదిలో పరిస్థితి వేరు అని పేర్కొన్నారు వారి శ్రమకు, అర్హత తగిన వేతనం లభించడం, లభించకపోవడం బాధ కలిగిస్తోందని సాయిపల్లవి పేర్కొన్నారు. -
సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్ కాల్స్
ఇటీవల శివకార్తికేయన్ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం అమరన్. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, అమరన్ చిత్రంలో ఉపయోగించ్చిన ఓ ఫోన్ నంబరు ప్రస్తుతం ఓ యువకుడిని ఇరకాటంలో పడేసింది. తన సెల్ నంబరును ఆ చిత్రంలో చూపించడంతో వస్తున్న కాల్స్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.తాజాగా ఈ ఘటన చైన్నెలో వెలుగు చూసింది. వివరాలు.. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోకు హీరోయిన్ ఓ పేపర్లో ఫోన్ నంబర్ రాసి ఇచ్చినట్టుగా కొన్ని సెకన్ల పాటు ఓ దృశ్యం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ఫోన్ నంబరు వాహీసన్ అనే చైన్నె యువకుడి పాలిట శాపంగా మారింది. తాను ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్‌ను ఆ చిత్రంలో చూపించడంతో సంతోష పడ్డప్పటికీ ఆ తదుపరి పరిణామాలు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి. సాయిపల్లవి గారితో మాట్లాడాలంటూ అనేక మంది ఆ నంబర్‌కు ఫోన్ చేసి విసిగిస్తుండటంతో చివరకు అతడు తన తంటాలను ఆ సినీ యూనిట్‌కు తెలిసే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
క్రేజీ కాంబినేషన్.. 'అమరన్' దర్శకుడితో స్టార్ హీరో సినిమా ఫిక్స్
కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టారు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నట, దర్శక, నిర్మాత ధనుష్. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం రాయన్ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నాడీ కోపం చిత్రాన్ని కొత్తవారితో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కాగా ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగు, తమిళం భాషల్లో ఈయన కథానాయకుడిగా నటిస్తున్న కుబేర చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా మరో కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. ఇటీవల శివకార్తికేయన్ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం అమరన్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా రాజ్‌కుమార్ పెరియసామి ధనుష్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నటుడు ధనుష్ 55వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అన్భుచెలియన్ సమర్పణలో గోపురం ఫిలింస్ పతాకంపై సుస్మిత అన్భు చెలియన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుస్మిత అన్బుచెలియన్ పేర్కొంటూ ధనుష్, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి వంటి ప్రతిభావంతులతో చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇది వీరి కాంబినేషన్లో ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించే కథా చిత్రంగా ఉంటుందని ఆమె చెప్పారు. -
'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్
గతవారం దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కిరణ్ అబ్బవరం 'క', దుల్కర్ 'లక్కీ భాస్కర్' లాంటి తెలుగు మూవీస్‌తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'అమరన్' కూడా హిట్‌గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్ లేకుండా తెలుగులోనూ రిలీజైనప్పటికీ జనాలకు నచ్చేసింది.ఇప్పటికే 'అమరన్' మూవీకి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయిపల్లవి తమదైన యాక్టింగ్‌తో కట్టిపడేశారు. కంటెంట్ కూడా అంతకు మించి అనేలా క్లిక్ అయింది. 'హే రంగులే' లాంటి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్.. సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన జీవీ ప్రకాశ్ కుమార్‌కి హీరో శివకార్తికేయన్ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దాదాపు రూ.3 లక్షల విలువ చేసే టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా 1 బ్రాండ్‌కి చెందిన స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచీని తనకు ఇచ్చినట్లు జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా హీరోకి థ్యాంక్స్ చెప్పాడు.కశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా 'అమరన్' సినిమా తీశారు. ట్రైలర్ రిలీజైనప్పుడు అడివి శేష్ 'మేజర్'తో పోల్చి చూశారు. కానీ మూవీ రిలీజైన తర్వాత అలాంటివేం వినిపించలేదు. (ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ) -
శివ కార్తికేయన్ 'అమరన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'తెలుగు ఆడియన్స్ మాత్రమే అలా చేస్తారు'.. సాయిపల్లవి కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్‌పై ప్రశంసలు కురిపించారు. భాషతో సంబంధం లేకుండా ఆదరించేది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమేనన్నారు. గతంలో నన్ను భానుమతి, వెన్నెల అని పిలిచేవారు.. ఇప్పుడేమో ఇందు రెబెకా వర్గీస్ అని పిలుస్తున్నారు. సినిమాను గొప్పగా ప్రేమించే ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే అది తెలుగువారు మాత్రమేనని సాయిపల్లవి కొనియాడారు. మీ ప్రేమ, ఎంకరేజ్మెంట్ చూసి నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలని అనిపిస్తోందని అన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ సాయిపల్లవి మాట్లాడారు.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. "Telugu audience andariki chala pedda thanks" ❤️ Heroine @Sai_Pallavi92 at #Amaran Success Meet ❤️🔥#AmaranMajorSuccess #MajorMukundVaradharajan #saipallavisenthamarai #SaiPallavi #YouWeMedia pic.twitter.com/YYbGoGHPNU— YouWe Media (@MediaYouwe) November 6, 2024 -
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
-
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరన్. వీరసైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆరు రోజుల్లో రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో బుధవారం నాడు హైదరాబాద్‌లో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో నితిన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.మా నాన్న కూడా..శివకార్తికేయన్ మాట్లాడుతూ.. అమరన్ సినిమాలో ముకుంద్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. ఆయన పోలీసాఫీసర్. డ్యూటీలోనే మరణించారు. సినిమా రిలీజైనప్పటినుంచి నితిన్ ప్రతిరోజు కాల్ చేసి అప్డేట్స్ చెప్తూనే ఉన్నారు అని పేర్కొన్నాడు. అభిమానుల కోసం ఓ పాట కూడా పాడాడు. ఓ ప్రియా ప్రియా.. తెలుసా నీకైనా.. అంటూ నితిన్ ఇష్క్ సినిమాలోని పాటను రెండు లైన్లు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సినిమాఅమరన్ సినిమా విషయానికి వస్తే ఇందులో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
'ఇక నుంచి నువ్వు మా తెలుగు హీరో'.. నితిన్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో నితిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి హీరోయిన్ సాయిపల్లవి బ్యాక్‌బోన్ అంటూ కొనియాడారు. మీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఏదో ఒకరోజు మీతో డ్యాన్స్ చేయాలని ఉందని అన్నారు. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుంటున్నానని నితిన్ తెలిపారు.శివ కార్తికేయన్‌తో నాకు ప్రత్యేక అనుబంధముందని హీరో నితిన్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా మేము కలవడానికి కుదర్లేదన్నారు. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిశామని సంతోషం వ్యక్తం చేశారు. అమరన్ సినిమాకు శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డారని.. ఇక నుంచి మా తెలుగు హీరో, మా తెలుగబ్బాయి అయిపోయాడని నితిన్ అన్నారు. కాగా.. నితిన్ ప్రస్తుతం రాబిన్‌హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రష్మిక మందన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
అమరన్ మూవీ.. ఆరు రోజుల్లోనే ఆ మార్కు దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. కాగా.. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన అమరన్.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే గ్రాస్ కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో ఆ రికార్డ్‌ను అధిగమించే అవకాశముంది.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
కమల్ హాసన్ కళ్లలో నీళ్లు తిరిగాయి: ‘అమరన్’ డైరెక్టర్
‘అమరన్’ విడుదలకు ముందు కమల్ హాసన్ గారికి సినిమా మొత్తం చూపించాను. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా చోట్ల ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఫిమేల్ పర్స్పెక్టివ్ నుంచి ఈ కథని డ్రైవ్ చేయడం ఆయనకు చాలా నచ్చింది. 'ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ ని చాలా అద్భుతంగా తీసావ్' అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను’అన్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. ఆయన దర్శకత్వంలో ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. ఆర్. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ అమరన్ చిత్రానికి అన్ని చోట్ల హిట్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఇంతగొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. 'అమరన్'తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. →ఈ చిత్రానికి కమల్ హాసన్ చాలా సపోర్ట్ చేశారు.నాపై ఎంతో నమ్మకం ఉంచారు. పూర్తి స్వేఛ్చ ఇచ్చారు.→ ఈ కథ రాస్తున్నప్పుడే ఇందు క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. రియల్ ఇందు మేడంని కలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్, ఎమోషన్ హై ఉన్న క్యారెక్టర్ అది.→ అయితే ఈ చిత్రంలో హీరోగా శివకార్తికేయను తీసుకోవాలని మొదట్లో అనుకోలేదు. ఓసారి ఆయనకు కథని చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఇంతకుముందు ఆయన ఇలాంటి సినిమాలు చేయలేదు. అందుకే సినిమా చాలా ఫ్రెష్ గా కనిపించింది. ఆయన ఈ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు చేసేస్తానని చెప్పారు. తర్వాత కమల్ సార్ ని కలిసాం. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.→ ఇది రియల్ కథ. ఈ కథకు ప్రారంభం, ముగింపు తెలుసు. అలాంటి కథని ఆడియన్స్ కి ఎంగేజింగ్ చెప్పడం, రియాల్టీని, ఫిక్షన్ ని బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెంట్ ని రీ క్రియేట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ అనుకోను గాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. నాకు రియలిజం ఉన్న సినిమాలు ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.→ యాక్షన్స్ సీక్వెన్స్‌లు చేయడం, అలాగే కాశ్మీర్లో తీసిన సీక్వెన్సులు ఇవన్నీ ఛాలెంజ్ తో కూడినవి. నేను ప్రతి యాక్షన్ పార్ట్ ని క్లియర్ గా రాసుకున్నాను. ప్రతి షాట్ ని పేపర్ మీద ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ స్క్రీన్ మీదకు అచీవ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్.→ ఇందు గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశారు. సినిమా చివరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు.→ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను. -
అమరన్ మూవీ.. మేజర్ కుటుంబ సభ్యుల కోరిక అదే: డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ విషయంపై వివాదం..అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. అయితే ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ కులాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఓ వర్గం ప్రజలు ప్రశ్నించారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ విషయంపై స్పందించారు. ఈ సినిమాలో మేజర్ కులాన్ని ఎందుకు చూపించలేదన్న అంశంపై రాజ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు.మేజర్ కుటుంబం అభ్యర్థన ఇదే..ముకుంద్ భార్య ఇందు, అతని తల్లిదండ్రులు సినిమా తీయడానికి ముందే కొన్ని అభ్యర్థనలు చేశారని డైరెక్టర్ వివరించారు. మేజర్ ముకుంద్ తమిళియన్ కావడంతో.. ఆ పాత్రలో కచ్చితంగా తమిళ మూలాలు ఉన్న వ్యక్తిని నన్ను నటింపజేయాలని ఆమె కోరిందని తెలిపారు. అది నాకు శివకార్తికేయన్‌లో కనిపించిందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి తమిళ గుర్తింపు కూడా ఉండాలని ఆమె కోరుకుందని వెల్లడించారు.అదేవిధంగా ముకుంద్ తల్లిదండ్రులు తమ కుమారుడిని భారతీయుడిగానే చూపించాలని కోరినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా తన సర్టిఫికేట్లో కూడా భారతీయుడు, తమిళుడు తప్ప మరేలాంటి గుర్తింపు తమకు వద్దన్నారు. మేజర్ ముకుంద్‌ను ఆర్మీ మ్యాన్‌గా మాత్రమే గుర్తించాలని ఆయన తల్లిదండ్రులు నన్ను అభ్యర్థించారని వెల్లడించారు. అందుకే సినిమాలో ఎక్కడా కూడా ముకుంద్ కులాన్ని ప్రస్తావించలేదన్నారు. అలాగే మేజర్ కుటుంబం తనను ఎప్పుడూ కులం అడగలేదని.. అదే స్ఫూర్తితో అశోకచక్ర అవార్డు గ్రహీతకు బహుమతిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు డైరెక్టర్ వెల్లడించారు.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. -
'అమరన్' కలెక్షన్స్.. శివ కార్తికేయన్ కెరీర్లో అరుదైన రికార్డ్
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం 'అమరన్'. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. శివ కార్తికేయన్ కెరిర్లో ఒక మైల్స్టోన్ లాంటి సినిమాగా అమరన్ నిలిచిపోనుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు.వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటిరోజే రూ. 35 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మూడురోజులకు ప్రపంచవ్యాప్తంగా అమరన్ కలెక్షన్స్ రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరింది. కేవలం తమిళనాడులోనే రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన అమరన్.. శివ కార్తికేయన్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ కెక్కింది. ఆయన నటించిన గత సినిమాలు రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు డాక్టర్ (25 రోజులు), డాన్ (12రోజులు) పట్టింది. అయితే, ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమరన్ చిత్రాన్ని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు రజనీకాంత్ కూడా చూశారు. సినిమా బాగుందంటూ వారు ప్రశంసించారు. ఈ సినిమాను నిర్మించిన కమల్ హాసన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమిళనాడులోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మేజర్ 'ముకుంద్ వరద రాజన్' జీవిత కథతో ఈ సినిమాను రూపొందించారు. 2014లో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ ఆయన అసువులు బాసిన వీరుడిగా నిలిచారు. ఆయన పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి మెప్పించారు. -
నటుడు కాకముందే పెళ్లి.. ఇప్పుడేమో స్టార్ హీరో.. ఇతడెవరంటే?
సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఎలాంటి అంచనాల్లేకుండా నటుడు అయినోళ్లు.. కష్టంతో పాటు అదృష్టం కలిసొచ్చి స్టార్స్ అవుతారు. ఇతడు కూడా సేమ్ అలాంటివాడే. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పైన హీరో ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో ఉన్నది 'అమరన్' ఫేమ్ శివకార్తికేయన్. ఏంటి అతడా? అని ఆశ్చర్యపోతున్నారా! ఇది సినిమాల్లోకి రాకముందు, పెళ్లి టైంలో తీసుకున్న ఫొటో ఇది. శివకార్తికేయన్ పక్కనున్న ఉన్నది ఇతడి భార్య ఆర్తి. 2010లో వివాహం జరిగింది. తమిళనాడులో పుట్టిపెరిగిన శివకార్తికేయన్‌కి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కానీ పూర్తిస్థాయి నటుడు కావడానికి ముందే ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు 2013లో పాప పుట్టింది. ఆమె పేరు ఆరాధన.(ఇదీ చదవండి: అక్కడ సౌండ్ చేస్తే చచ్చిపోతారు.. ఓటీటీలోనే క్రేజీ మూవీ)ఓసారి ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. మరోవైపు యాంకర్‌గానూ పలు షోలు చేశాడు. ఇవి కాదన్నట్లు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. '3' సినిమాలో ధనుష్‌కి ఫ్రెండ్‌గా చేశాడు. 2013లో విడుదలైన 'కేడీ బిల్లా కిలాడీ రంగ' మూవీ హీరోగా శివ కార్తికేయన్‌కి ఇచ్చింది. అక్కడి నుంచి ఒక్కో మూవీతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లాడు. 'డాక్టర్' మూవీతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇదే సినిమాతో తెలుగులోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.'డాక్టర్' తర్వాత అయలాన్, మహావీరుడు, డాన్ తదితర చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు. కానీ రీసెంట్గా దీపావళికి రిలీజైన 'అమరన్' మూవీతో మాత్రం తనలోని అసలు సిసలు నటుడిని అందరికీ పరిచయం చేశాడు. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్స్‌కి దగ్గర్లో ఉంది. ఈ మూవీ వల్ల అప్పుడెప్పుడో పెళ్లినాటి ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైన ఫోటో అదే!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) -
అమరన్‌కి ప్రశంసలు
శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన చిత్రం ‘అమరన్’. ఈ చిత్రబృందాన్ని హీరో రజనీకాంత్ ప్రశంసించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అమరన్’ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి, అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే హీరో శివ కార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్, నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయిలని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకథ, కథనం, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నాయని రజనీకాంత్ ప్రశంసించారు. -
ఇక్కడ అమరన్ హిట్.. తమిళ్లో మాకు పది స్క్రీన్స్ ఇవ్వండి: కిరణ్
'క' సినిమాతో భారీ విజయాన్ని కిరణ్ అబ్బవరం అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 'క' సినిమాను విడుదల చేయాలనుకుంటే ఎదురైన ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడారు. అదే సమయంలో అమరన్ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు.దీపావళి సందర్భంగా క సినిమాతో పాటు అమరన్ కూడా విడుదలైంది. అమరన్ పూర్తిగా తమిళ్ సినిమా.. ఇక్కడ తెలుగు డబ్బింగ్ వర్షన్లో మాత్రమే విడుదలైంది. తమిళనాడులో ఏ స్థాయిలో అయితే అమరన్కు థియేటర్స్ దక్కాయో తెలుగులో కూడా అంతే స్థాయిలో దక్కాయి అనేది నిజం. ఇప్పుడు ఇదే విషయాన్ని కిరణ్ అబ్బవరం పరోక్షంగా ఇలా చెప్పుకొచ్చారు. 'తమిళనాడులో ఉండే మన తెలుగు వారు 'క' సినిమాను ఇక్కడ ఎందుకు విడుదల చేయలేదని కోరుతున్నారు. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. కానీ, అక్కడ తెలుగు సినిమాకు థియేటర్లు ఇవ్వలేదు. కనీసం తెలుగు వర్షన్లో విడుదలైతే చాలని కోరుకుంటున్నాను. మంచి విజయం సాధించిన సినిమాకు తమిళ్ కనీసం పది స్క్రీన్స్ ఇచ్చినా సంతోషమే. తమిళ్ సినిమా 'అమరన్'ను ఇక్కడ సూపర్ హిట్ చేశాం.. 'క' కోసం అక్కడ పది స్క్రీన్లు ఇస్తే చాలు అంటూ కిరణ్ అబ్బవరం కోరారు. ఇదే సమయంలో 'క' పార్ట్2 కూడా ఉంటుందని ఆయన ప్రకటించారు.కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. రెండురోజులకు గాను ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. -
దీపావళి హిట్ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
దీపావళి సందర్భంగా విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో థియేటర్లు అన్నీ ప్రేక్షకులతో సందడిగా కనిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్' బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి. మొదటిరోజు భారీ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలు ఏ ఓటీటీలో విడుదల కానున్నాయో తెలుసుకుందాం.లక్కీ భాస్కర్ (నెట్‌ఫ్లిక్స్ )మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి ,సాక్షి వైద్య హీరోయిన్లుగా మెప్పించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే, వారి అంచనాలు నిజం చేసేలా సినిమా ఉందని చెప్పవచ్చు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 12.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అమరన్ (నెట్‌ఫ్లిక్స్)శివకార్తికేయన్- సాయి పల్లవి కాంబినేషన్లో విడుదలైన చిత్రం అమరన్. వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు కంటతడి కూడా పెట్టేస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అమరన్ రూ. 34 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.కిరణ్ అబ్బవరం 'క' (ఓటీటీ పెండింగ్)కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైంది. కిరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. మొదటిరోజు 'క' సినిమా రూ. 6.18 కోట్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏ సంస్థ కొనుగోలు చేయలేదు. కానీ, ఆహా తెలుగు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నవంబర్ చివరి వారంలో ఓటీటీ విడుదల కావచ్చని సమాచారం.