anjaneyulu
-
అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుశ్చర్య
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త , ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనాకోట తండాలో కాపుకాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడిచేసి చేయి విరగ్గొట్టారు. కులం పేరుతో దూషించారు. తోటి కార్యకర్తను కాపాడిందని.. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 27న ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. అంగన్వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను వివరిస్తూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.పక్క గ్రామమైన నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త సుహాసినికి విషయం తెలియడంతో వెంటనే సదరు కేంద్రానికి వెళ్లి తోటివారితో కలిసి నాగమణిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగమణి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా.. నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె అనుచరుడు ఆంజనేయులు దాషీ్టకానికి ఒడిగట్టాడు. బాధితురాలు జాయింట్ కలెక్టర్ అభిõÙక్కుమార్, ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు, అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, గౌరవాధ్యక్షుడు వెంకటే‹Ù, అధ్యక్షుడు మహబున్నీషా, కోశాధికారి శ్రీదేవి,కార్యదర్శి దిల్షాద్ పాల్గొన్నారు. -
అవినీతి జీవి
సాక్షి, నరసరావుపేట/వినుకొండ/నూజెండ్ల: 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘జీవీ’ నీరు–చెట్టు, ఇసుక, మట్టిని అడ్డంగా దోచేశారు. బంధువులు, బినామీల ద్వారా పోరంబోకు, అగ్రహారం భూములను కబ్జా చేశారు. పేదలకు ప్రభుత్వం అందించిన భూములను స్వాహా చేసి చేపల చెరువుల తవ్వకాలు చేపట్టారు. ♦ బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెంలో 4,450 ఎకరాల కొత్త చెరువులో సర్వే నం.438లో 180 ఎకరాలు జీవీ బావమరిది కె.నరసింహారావు బినామీల ద్వారా ఆక్రమించుకున్నారు. ♦ గుమ్మనంపాడులో ఈనాం భూములను జీవీ, ఆయన బినామీలు వదలలేదు. పాలడుగు వెంకటరాయుడు, చిరుమామిళ్ల రామకృష్ణయ్య అగ్రహారికులుగా వ్యవహరిస్తున్న సమయంలో వారి పరిధిలో సర్వే నంబర్ 1 నుంచి 54 వరకు 5,968 ఎకరాల భూమి ఉంది. ఇందులో దేవుని మాన్యం భూమి సర్వే నం.43లో చెన్నకేశవస్వామి భూమి 200 ఎకరాలు, బంగారమ్మ తల్లి భూమి 16 ఎకరాలు, ఆంజనేయ స్వామి మాన్యం 13 ఎకరాలు, మరో కబ్జాలో భాగంగా ఊరచెరువు కింద 17 ఎకరాలను ఆక్రమించుకున్నారు. ♦ రేమిడిచర్ల గాలెయ్యకుంట సమీపంలోని ఎస్సీ భూములను గుంటూరుకు చెందిన జీవీ అనుచ రుడు కృష్ణ 110 ఎకరాలు చౌకగా చేజిక్కించుకున్నారు. బొల్లాపల్లి మండలంలోనే జీవీ బంధువులు, బినామీలు ఆక్రమించుకున్న భూము ల విలువ రూ.వందల కోట్లకు పైగా ఉంటుంది. కొప్పుకొండలో కబ్జా పర్వం వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ పరిధి కొప్పుకొండలోని వాగు పోరంబోకు భూములను 1940లో బ్రిటీష్ ప్రభుత్వం మత్స్య సహకార సంఘానికి పంపిణీ చేసింది. 1980లో అదే గ్రామానికి చెందిన రైతుల నుంచి 17.80 ఎకరాల భూమిని జేవీఎస్ ఆక్వా కల్చర్ రాజ్యలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. జీవీ మేనమామ, ఒంగోలు వెంకటేశ్వర్లు, మరో బినామీ రామకోటేశ్వరరావును అడ్డుపెట్టుకొని చుక్కల భూమిగా ప్రకటించి ఈ భూమిని కొనుగోలు చేశారు. ఆ భూముల చుట్టూ మూడు కిలోమీటర్ల మేర దాదాపు 25 చేపల చెరువులను అక్రమంగా సాగు చేస్తున్నారు. ఖాతా నం.585లో 136 ఎకరాలు, ఖాతా నంబరు 571లో 30 ఎకరాలతోపాటు సర్వే నంబరు 281లో మరికొంత భూమిని కలిపి సుమారు 300 ఎకరాల పోరంబోకు భూములను కబ్జా చేశారు. వీటి విలువ రూ.50 కోట్లు. శివశక్తి పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా శివశక్తి బయో కంపెనీ పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. రైతులకు అందించే సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం సల్ఫేట్, జింకు, బోరాన్, ఫెర్రస్ సల్ఫేట్ కొనుగోలుకు అప్పట్లో ప్రభుత్వం టెండర్లు వేయగా వరుసగా నాలుగేళ్లు కిలో రూ.35 లు, జీఎస్టీ లేకుండా రూ.28తో మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మల్టినేషనల్ కంపెనీలైన కోరమండల్, నాగార్జున, టాటా వంటి కంపెనీలు ఎరువులు తయారు చేస్తున్నప్పటికీ ప్రాచుర్యం లేని శివశక్తి కంపెనీకి టెండర్లను మార్క్‌ఫెడ్ ఖరారు చేసింది. ఏటా రూ.33.97 కోట్లు అదనంగా రాయితీ పొందింది. ఇలా నాలుగేళ్లు దాదాపు రూ.100 కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో బొక్కేశారు. శివశక్తి బయో టెక్నాలజీ లిమిటెడ్, విజయ గ్రోమిన్, నవభారత్ పలు కంపెనీల పేర్లతో నెల్లూరు జిల్లా వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి, కర్నూలు జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల్లో నకిలీ బయో ఎరువులు విక్రయించి రైతులను మోసగించారు. ఉద్యాన సబ్సిడీ స్వాహా ఉద్యాన శాఖ ద్వారా పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు అమలవుతున్న సబ్సిడీని రూ.10 కోట్లకు పైగా జీవీ స్వాహా చేశారు. వెల్లటూరు, మేళ్లవాగు, వడ్డెంగుంట, చీకటీగలపాలెం ప్రాంతాల్లో టమాటా, బొప్పాయి, పుచ్చ, నిమ్మ పంటలకు షేడ్‌నెట్, పాలి హౌస్, కూరగాయల పందిళ్ల పేరుతో వచ్చే సబ్సిడీని ఆయనే కైంకర్యం చేశారు. నూజెండ్ల, ఈపూరు మండలాల్లో మిర్చి రైతులు నష్టపోవడంతో రైతులకు ఇచ్చిన పరిహారాన్ని కాజేశారు. జీవీ అనుచరులు, బినామీలు బొల్లాపల్లి, వినుకొండ, రూరల్ మండలాల్లో ఉన్న అప్పటి అధికార పార్టీ నాయకులు రేషన్ మాఫియాగా ఏర్పడి రూ.200 కోట్లు దోపిడీ చేశారు. గుండ్లకమ్మలో ఇసుక దందా, ఉపాధి హామీ పనులు, నీరు చెట్టు పనులు, చెక్‌డ్యామ్‌లు, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల పేరుతో కోట్లల్లో స్వాహా చేశారు. ఈ అక్రమాలపై అప్పటి ఎంపీడీవో రవికుమార్‌తో పాటు 9 మంది ఉపాధి హామీ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. 2014లో నూజెండ్ల మండలం మూర్తింజాపురంలో 10 గ్రామాలకు తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణంలో అవినీతి జరిగింది. పనులు నాసిరకంగా చేయడంతో చెరువు నీరు నింపే క్రమంలోనే చెరువుకట్ట కొట్టుకుపోయింది. ఎన్ఎస్పీ కెనాల్ ఆధునికీకరణలో భాగంగా నాగార్జున సాగర్ మేజర్, మైనర్ కెనాల్స్ పనులు నాసిరకంగా చేపట్టి రూ.90 కోట్లు వెనకేసుకున్నారు. వినుకొండలో తాగునీటి సమస్య నెలకొనడంతో మంచినీటి సరఫరా కోసం రూ.2 కోట్లు మంజూరైంది. మంచినీటి ట్యాంకర్ల పేరుతో రోజూ లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులను దోచుకున్నారు. ఈపూరు మండలంలోని ఊడిజర్ల గ్రామ మరుగుదొడ్ల లబి్ధదారులకు తెలియకుండా రూ.35 లక్షల మేర దోచుకున్నారు. 15 ఎఫ్ఐఆర్లు తన వ్యాపార భాగస్వామిని హత్యచేయించడంలో జీవీపై కేసు నమోదైంది. తర్వాత హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులను బెదిరించి కేసులను రాజీ చేసుకొని 2009 ఎన్నికల్లో వినుకొండ నుంచి పోటీ చేశారు. జీవీపై ఇప్పటివరకు దౌర్జన్యం, ప్రభుత్వ విధుల నిర్వహణకు ఆటంకం తదితర నేరాలపై 15 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో తొమ్మిది, శావల్యాపురం 3, ఈపూరు, బండ్లమూడి, సత్తెనపల్లి ఒక్కో కేసు నమోదైంది. ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి. ♦ వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చెందిన వల్లభ డెయిరీలోకి జీవీ అనుచరులతో చొరబడి వస్తువులను ద్వంసం చేశారు. దీనిపై వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో జీవీపై 25–7–2023న క్రైం నంబర్ : 163/23తో 143, 447, 379, 506 రెడ్‌విత్ ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ♦ వినుకొండలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిబంధనలు అతిక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించినందుకు జీవీపై వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో 17–5–2023న క్రైం నంబర్ 130/23తో 143, 341, 188, రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ♦ ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేసి పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు ఈపూరు పోలీస్ స్టేషన్లో జీవీపై 12–12–2021న క్రైం నంబర్ 169/2021తో 341, 353 రెడ్ విత్ 34 ప్రకారం కేసు నమోదైంది. -
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్‌కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్‌పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్‌తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్‌రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్‌లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్‌ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
తహసీల్దార్, బీఎల్వోలపై టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి, నరసరావుపేట/శావల్యాపురం: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించేందుకు నోటీసులు ఇచ్చిన శావల్యాపురం తహసీల్దార్‌పై పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ సానుభూతిపరులు డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగిస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటారంటూ తహసీల్దార్, బీఎల్వోలను బెదిరించారు. పదుల సంఖ్యలో కార్యకర్తలను వెంటబెట్టుకుని తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి తహసీల్దార్ షేక్ జాన్ సైదులుపై అసభ్య పదాలతో దూషణలకు దిగారు. వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లు తీసివేయాలని భారీగా ఫారం–7లను దరఖాస్తు చేసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7 దరఖాస్తులు దురుద్దేశంతో చేసినవని అధికారులు నిర్ధారణకు వచ్చిన తర్వాత తగిన అధారాలతో తిరస్కరించినట్టు సమాచారం ఇచ్చారు. అయితే.. వాటిని తొలగించాల్సిందేనని జీవీ ఆంజనేయులు పట్టుబట్టారు. గట్టిగా కేకలు వేస్తూ తహసీల్దార్‌పై జులుం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రం మార్చడంపైనా రాజకీయం మండలంలోని గుంటుపాలెంలో 141 పోలింగ్ కేంద్రం గతంలో ప్రాథమిక పాఠశాలలో ఉండేది. పాఠశాల గదులు పాడవడం, శ్లాబు పెచ్చులు ఊడిపోతుండటం, కనీస వసతులు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాన్ని మార్చాలని జిల్లా ఎన్నికల అధికారి ఆ దేశాలు జారీ చేశారు. దీంతో అదే గ్రామంలో అన్ని సౌకర్యాలున్న సచివాలయంలోకి మార్చారు. దీనిపైనా జీవీ ఆంజనేయులు రాద్ధాంతం చేశారు. మరోవైపు టీడీపీ నేతలు పలువురికి వినుకొండ నియోజకవర్గంతో పాటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి చోట్ల ఓట్లు ఉంటున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సమాచారం మేరకు సదరు ఓటర్లకు స్థానిక అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. నోటీసులు ఇవ్వడంపై జీవీ ఆంజనేయులు తహసీల్దార్‌పై విరుచుకుపడ్డారు. డబుల్ ఎంట్రీలు తొలగిస్తే చూస్తు ఊరుకోనంటూ ఊగిపోయారు. కాగా.. విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులపై దుర్భాషలాడటం, బెదిరించడం సరికాదని జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అరికట్టాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్మే జీవీ ఆంజనేయులు అసభ్య పదజాలంతో దూషించటంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తహసీల్దారు షేక్ జాన్‌సైదులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓట్లు తొలగింపు, మార్పులు చేర్పులన్నీ సమగ్ర ఆధారాలతో అన్లైన్ విధానంలో జరుగుతున్నాయన్నారు. -
వారం రోజులు దాటింది.. మా బిడ్డ జాడ చెప్పండి!
రంగారెడ్డి: కళాశాల హాస్టల్ నుంచి తమ కుమారుడు అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మిస్సింగ్‌కు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ శనివారం స్టూడెంట్ యూనియన్లతో కలిసి ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ విద్యాసంస్థల్లో డిప్లొమా సెకండియర్ చదువుతున్న ఆంజనేయులు.. ఈనెల 20న కళాశాలకు చెందిన హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వారం రోజులుగా కుమారుడి జాడ లేకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, యాజమాన్యం స్పందించి ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
హౌసింగ్ డీఈఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఒంగోలు టౌన్/చీరాల/మేదరమెట్ల/నగరంపాలెం/ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గుంటూరులో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈగా పని చేస్తున్న చెంచు ఆంజనేయులు ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో గుంటూరు, ఒంగోలు, బాపట్ల జిల్లా మేదరమెట్ల, వేటపాలెం మండలం కొత్తపేట, కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులో ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఈ సోదాల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒంగోలులో జీ ప్లస్ త్రీ హౌసింగ్ కాంప్లెక్స్, ఒక ప్లాటు, కొప్పోలులో 8 ఇళ్ల స్థలాలు, చీరాలలో ఒక జీ ప్లస్ వన్ భవనం, రెండు స్థలాలు, కడవకుదురు వద్ద 1.9 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.53 లక్షల సేల్‌డీడ్ పత్రాలు లభించినట్లు తెలిపారు. కిలో బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ధరల మేరకు ఆస్తుల విలువ రూ.2.81 కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. ఆంజనేయులును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఎస్ఈబీ సీఐ ఇళ్లల్లో రూ.కోటి విలువైన అక్రమాస్తుల గుర్తింపు శ్రీకాకుళం జిల్లా పొందూరులో లంచం తీసుకుంటూ దొరికిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.కోటి విలువైన అక్రమాస్తులను గుర్తించారు. విశాఖలోని విశాలాక్షినగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ఇంటితోపాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలోని ఆయన బంధువుల ఇంట్లోనూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఎస్ఈబీ సీఐగా పనిచేసిన శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ ఈ నెల 7న ఏసీబీకి దొరి కారని తెలిపారు. అప్పటి నుంచి ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. గతంలో పాడేరు ఎస్ఐగా పనిచేస్తున్న కాలంలోనూ ఆయన గంజాయి కేసులో ఏ8 నిందితుడిగా పట్టు బడి ఏడాది జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. -
Srirama Navami 2023: పరిపూర్ణ పురుషోత్తముడు..
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అంతటా వ్యాపించి ఉన్న భగవానుడు మనకోసం ఒక రూపంలో ఒదిగిపోయి దివి నుంచి భువికి దిగి వస్తే, దాన్ని అవతారం అంటారు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మానవ జీవితానికి అతి దగ్గరగా ఉండే అవతారం రామావతారం. చైత్ర శుద్ధ నవమి రోజు, లోకాలన్నిటి చేత నమస్కరింపబడే రాముడు ఈ భూమి మీద జన్మించాడు. పుట్టింది మొదలు ధర్మాన్నే అనుసరించాడు. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం... ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. నేడు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా... ఆ పరిపూర్ణ పురుషోత్తముడి గురించి తెలుసుకుందాం. అప్పటికి కౌసల్యాసుతునికి పదిహేను పదహారేళ్ల వయసుండొచ్చు. ఒకానొక రోజు దశరథమహారాజు రాముణ్ణి పిలిచి విశ్వామిత్ర మహర్షివైపు చూపిస్తూ ‘‘ఈ మహర్షితోపాటు నువ్వు అడవులకు వెళ్లాలి నాయనా...’’ అని అంటాడు. మరో పిల్లాడయితే ఏమనేవాడో ఏమో కానీ, రాముడు మాత్రం తండ్రి చెప్పాడు కాబట్టి కిమ్మనకుండా బయలుదేరాడు. అనుగు సోదరుడు లక్ష్మణుడు తోడు రాగా అడవుల్లోకి దారితీశాడు. తాటక సంహారం చేశాడు. అహల్యకు విమోచన ప్రసాదించాడు. రాముడు ఎంతటి క్రమశిక్షణ కలవాడంటే అంతఃపురంలో ఉన్నంత కాలమూ కన్నవారి మాట జవదాటలేదు. అరణ్యాల్లో ప్రవేశించాక విశ్వామిత్రుని ఆజ్ఞ మీరలేదు. సీతాస్వయంవరానికి తీసుకువెళతానని ఆ గురువర్యుడంటే∙మారు మాట్లాడకుండా అనుసరించాడు. పెద్దల మాటకే ప్రాధాన్యం జనకమహారాజు నెలకొల్పిన స్వయంవరమంటపంలో శ్రీరాముడు అడుగుమోపినా శివధనుస్సు ఉండే చోటికి హడావుడిగా వెళ్లిపోలేదు. దాన్ని భళ్లున ఎత్తేసి, ఫెళ్లున విరిచేసి, చేతులు దులిపేసుకోలేదు. ఎలాంటి తొందరపాటూ పడకుండా సభాభవనంలో నిమ్మళంగా కూర్చున్నాడు. శివధనువును ఎత్తాలంటూ విశ్వామిత్రుడు అనుజ్ఞ ఇచ్చాకనే రాముడు ఆ పనికి పూనుకున్నాడు. ధనస్సును సున్నితంగా ఎత్తిపట్టుకుని, నారి సారించి, విరిచాడు. ఇదంతా ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా చేశాడు. అంత పెద్దపనీ పూర్తిచేశాక ధీర గంభీరంగా అడుగులు వేస్తూ తన ఉచితాసనానికి చేరుకున్నాడు. చిన్నపాటి విజయాన్ని సాధిస్తేనే మురిసి మెరిసిపోయే మనం, ఆ సందర్భాన రాముడి వర్తన నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో. చిన్న కష్టానికే కన్నీరొలికించడం. అల్పమైన సుఖాలకే అతిగా స్పందించడం.. లాంటి లక్షణాలను మరెంత సునాయాసంగా తొలగించుకోవచ్చో! వినయ విధేయతలు తొందరపాటు...తొట్రుపాటు అనేవి రాముడి నిఘంటువులోనే లేదు. శివధనువును విరవగానే సీతను రాముడికిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పిన మాట విని ఎగిరి గంతేయలేదు. వెంటనే సీత మెడలో మూడు ముళ్లూ వేసేయలేదు. జనకుని ప్రతిపాదనను తన కన్నవారికి తెలియజేయాలని, అందుకు వారి అనుమతి అవసరమనీ వినమ్రంగా చెప్పాడు. ఎవరి పట్ల ఏవేళ ఎలా ఆదరం చూపాలో రామునికి బాగా తెలుసుననడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. అలా ఆ పెద్దలందరి సమక్షంలోనూ మైథిలి చేయి అందుకున్నాడు. సీతారాముల కళ్యాణం జరిగి ఎంతోసేపు అవనే అవదు. పరశురాముడు వేంచేశాడు. పెళ్లివేదిక వద్దకు వస్తూనే ఆ మహాశయుడు వీరావేశాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలో రాముడంటే పరశురాముడేనని, మరో రాముడికి లోకాన చోటు లేనేలేదని వీరవిహారం చేశాడు. అటు జనకుడు, ఇటు దశరథుడు పరశురాముని క్రౌర్యాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. అయితే రాముడు ఏమాత్రం తొందరపడలేదు. పరశురాముడు ఎంతగా పేట్రేగిపోతుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉన్నాడు. పరశురాముడు అందించిన విష్ణుధనువును సునాయాసంగా పైకెత్తాడు. తను శ్రీహరి ప్రతిరూపమని చెప్పకనే చెప్పాడు. దీంతో పరశురాముడికి కమ్మిన పొరలు తొలగిపోయాయి. తారుమారైనా... మర్నాడు పొద్దున్నే పట్టాభిషేకం జరగాల్సి ఉంది. రాత్రికి రాత్రే కథ మారిపోయింది. కైకమ్మ స్వయంగా పిలిచి, తన మాటల్ని దశరథుని ఆదేశాలుగా వినిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసం చేయాలని ఆజ్ఞాపించింది. మారు తల్లి మాటలను మన్నించాడు. అడవుల్లోకి పోయేందుకు సిద్ధమేనంటూ అందుకు రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. మంగళస్నానాలు చేసి రాజదండాన్ని చేపట్టాల్సిన వేళ పత్నినీ, సోదరునీ వెంటబెట్టుకుని గుహుని పడవమీద నది దాటుకుంటూ పోయాడు. అడవుల్లోనూ ఆ రామునికి ప్రశాంతత లేనే లేదు. కష్టాలూ కన్నీళ్లే! సీతమ్మను రావణుడు అపహరించుకుపోయాక మానసికంగా నలిగిపోయాడు. చివరికి లంకలో అమ్మవారు ఉన్నారన్న సంగతి తెలిసి కొంత స్థిమితపడ్డాడు. తన ప్రియపత్నిని తన వద్దకు తెచ్చుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. వానరసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విభీషణునితో చెలిమిచేశాడు. ఓరిమితో వ్యవహరించాడు. తగిన సమయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. సముద్రం మీద సేతువును నిర్మించాడు. అందుబాటులో ఉన్న వానర సేన సహకారంతోనే అమిత బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేశాడు. విజేత తానే అయ్యాడు. స్థితప్రజ్ఞావంతుడు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాస క్లేశాలు ముదిరిపోయాయి. సరసరాజాన్నభోజనాల స్థానంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు. అయినా చలించలేదు. స్థిరంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. మరి ఇప్పటికాలాన మనం ఎలా ఉన్నాం..? బస్సు దొరక్కపోతే ఆందోళన. సినిమా టికెట్టు అందకపోతే అశాంతి. పరీక్షలో మార్కులు తక్కువయితే ఆవేదన. అన్నింటికీ తొందరే. ప్రేమ తొందర. పెళ్లి తొందర. ఇలా అయితే ఎలా. రాముని వంటి వారినే కష్టాలు కాల్చుకు తిన్నాయి. అన్నింటినీ ఆయన ఓపిగ్గా ఎదుర్కొన్నాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతటి వారం? ఆయన పడ్డ కష్టాలతో పోల్చి చూసుకుంటే మన కష్టాలు ఏపాటివి?ఎప్పటి త్రేతాయుగం? రాముడు పుట్టి రెండు యుగాలయింది. మనమిప్పుడు కలికాలంలో ఉన్నాం. అయినా ఆ ఆదర్శనీయుణ్ణి నేటికీ మరువలేకపోతున్నాం. అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే మానవుడిగా పుట్టినా, రాముడు మనకు దేవుడయ్యాడు. ఆయన నడిచిన బాట అయిన రామాయణం పఠనీయ కావ్యం అయింది. అందుకే రామాయణాన్ని పారాయణం చేయాలి. అందులోని మంచిని ఒంటబట్టించుకోవాలి. కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరువని సద్గుణ సంపన్నత రామునిది. అందుకే సీతమ్మ జాడతెలుసుకున్న ఆంజనేయస్వామిని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. తన ప్రేమను పంచాడు. సుగ్రీవుడికి పట్టం కట్టాడు. విభీషణునికి లంకేశునిగా మకుటం తొడిగాడు. ..జననీ జన్మభూమిశ్చ.. రావణ సంహారం జరిగాక ఆ రాక్షస రాజు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించాడు. విషయాన్ని అన్నతో చెప్పాడు. యావత్ లంకానగరమే మణిమయ నిర్మితమైనది. అందులోని రాజ సౌధం సామాన్యమైంది కాదు. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ఆయన ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు. అంటే పరాయి ప్రదేశం ఎంతటి గొప్పదైనా, సుందరమైనదైనా దానిని చూసి మనసు పారేసుకోలేదు. మాతృభూమిని మరువలేదు. పుట్టిన గడ్డపై ప్రేమను పోగొట్టుకోలేదు. రామ నైవేద్యం పానకం కావలసినవి: బెల్లం పొడి– పావు కేజీ; నీళ్లు– లీటరు; యాలకుల పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; శొంఠిపొడి– చిటికెడు తయారీ: బెల్లం పొడిలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠిపొడి కలిపితే పానకం రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి ముక్కలు – టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్; మామిడి కాయ తురుము– టేబుల్ స్పూన్ తయారీ: పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. గింజ మెత్తబడిన తర్వాత నీటిని వంపేసి అందులో పైన తీసుకున్న దినుసులన్నీ కలిపితే వడపప్పు రెడీ. వడపప్పు, పానకం ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. వేసవి మొదలైన ఈ సమయంలో ఆరోగ్యం ఒడిదొడుకులను పానకం నివారిస్తుంది. యాలకుల పొడి అతిదాహాన్ని తగ్గిస్తుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
కన్న బిడ్డలే కడతేర్చారు!
రాజంపేట: ఆస్తికోసం కన్న తండ్రినే కడతేర్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులు (80)కు ఇద్దరు భార్యలు ఉండగా, మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు 25 సంవత్సరాల క్రితమే మరణించాడు. మొదటి భార్య తనని సక్రమంగా చూడకపోవడంతో ఆంజనేయులు 20 సంవత్సరాల క్రితం బాలమణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆంజనేయులుకు నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండగా గ్రామంలో నివసిస్తున్న రెండో కూతురు లీలావతి పేరిట ఇదివరకే రెండెకరాలు పట్టా చేయించాడు. కూతురు లీలావతి, మొదటి భార్య లక్ష్మి తరచూ ఆంజనేయులుతో ఆస్తికోసం గొడవపడేవారు. మిగిలిన రెండెకరాల భూమి తనకే చెందాలని లీలావతి, ఆమె కొడుకు భానుప్రసాద్ కలసి ఆంజనేయులును వేధింపులకు గురిచేసేవారు. ఆదివారం ఉదయం లీలావతి, తన పెద్ద సోదరి లక్ష్మీ నర్సవ్వ, కొడుకు భానుప్రసాద్‌తో కలసి పథకం ప్రకారం ఆంజనేయులును ఇంట్లోనే చంపేసింది. అనంతరం తమ చెల్లెలు గంగమణి కూతురు విందు కార్యక్రమానికి హాజరై రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తిరిగివచ్చారు. తర్వాత ఆంజనేయులు ఉంటున్న ఇంటిని తగులబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, నిందితులను శిక్షించే వరకూ ఊరుకునేది లేదని రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో సీఐ తిరుపయ్య, డీఎస్పీ సురేశ్ పరిస్థితిని నియంత్రించి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుని అన్న కొడుకు కొప్పుల పెద్ద స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు
మహబూబ్‌నగర్ క్రైం: రెండు వారాల్లో పెళ్లి కాబోతున్న యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేయడమేగాక.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సదరు పెళ్లికొడుకుకి పంపారు. ఈ నెల 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్‌కి చెందిన ఓ అమ్మాయి(20) ప్రతిరోజూ మహబూబ్‌నగర్‌కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాపూర్కి చెందిన రాజేందర్‌రెడ్డి అలియాస్ రాజు కొత్లాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: (దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు) ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్ నుంచి బైక్‌పై మహబూబ్‌నగర్‌కు వచ్చి పెయింటింగ్ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలాసార్లు బైక్‌పై ఎక్కించుకుని రావడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈనెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆరోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని ఫతేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు అత్యాచారం చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా, ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఫొటోలు, వీడియోలను సదరు పెళ్లికొడుకు వాట్సాప్‌కు పంపారు. చదవండి: (సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి) ఆ ఫొటోలను పెళ్లికొడుకు అమ్మాయి తల్లిదండ్రులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై 2 రోజుల క్రితం అమ్మాయి, తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి శుక్రవారం రాజు, ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. -
190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగాల్లోని 190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు. -
2018 గ్రూప్–1 మెయిన్స్‌కు మాన్యువల్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ (2018 నోటిఫికేషన్) సమాధాన పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేయిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మూడు నెలల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనంపై హైకోర్టు తీర్పును గౌరవిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇది పూర్తి కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్–1లో ఇంటర్వ్యూల రద్దుకు జీవో వచ్చిందని.. దాని అమలుపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనంతోనే పారదర్శకత, నిష్పాక్షికత ముందుగా నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ మూల్యాంకనం ఎలా చేయిస్తారని మాత్రమే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ఈ విధానాన్ని తప్పుపట్టలేదని చెప్పారు. ఇకపై ముందుగానే ప్రకటించి డిజిటల్ మూల్యాంకనం చేపట్టవచ్చని సూచించిందన్నారు. రానున్న నోటిఫికేషన్లన్నిటికీ డిజిటల్ మూల్యాంకనాన్నే అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అధిక వ్యయమైనా పారదర్శకత, నిష్పాక్షికతతోపాటు అర్హులైన అభ్యర్థులకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. గ్రూప్–1 మెయిన్స్‌కు డిజిటల్ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనకపోయినా.. పరీక్షలకు ముందు నుంచే అభ్యర్థులకు తెలియజేస్తూ వచ్చామని గుర్తు చేశారు. దీన్ని అభ్యర్థులెవరూ వ్యతిరేకించకపోగా స్వాగతించారన్నారు. అయితే.. గ్రూప్–1 మెయిన్స్‌లో ఎంపిక కాని కొందరు డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుపడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో డిజిటల్ మూల్యాంకనం సివిల్స్‌లో విజయం సాధించిన కొందరు గ్రూప్–1లో ఎంపిక కాలేదని.. డిజిటల్ మూల్యాంకనంలో లోపాలున్నందు వల్లే ఇలా జరిగిందనే వాదన తప్పన్నారు. సివిల్స్‌లో ఐపీఎస్‌లుగా ఎంపికైనవారు తర్వాత ఐఏఎస్ కోసం మళ్లీ సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్ కూడా ఉత్తీర్ణులు కాని సందర్భాలు అనేకమున్నాయన్నారు. అభ్యర్థి ఆరోజు పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ఎంపికవ్వడం ఆధారపడి ఉంటుందని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనం ఎంతో శాస్త్రీయ విధానంలో జరిగిందన్నారు. ఏపీపీఎస్సీ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. గత 18 నెలల్లో కరోనా సమయంలోనూ 32 నోటిఫికేషన్లలోని 4 వేల పోస్టుల్లో 3 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పోస్టులు భర్తీ చేయలేదన్నారు. మిగిలిన పోస్టుల్లోనూ 450 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేక ఖాళీగా మిగిలిపోయాయన్నారు. మరో 550 పోస్టులు కోర్టు కేసులతో భర్తీ కాలేదని తెలిపారు. వరుసగా కొత్త నోటిఫికేషన్లు విడుదల కొత్తగా పలు పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. ఇప్పటికే పలు పోస్టుల నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని పోస్టులతో ఒకేసారి క్యాలెండర్‌ను ప్రకటించడం సాధ్యం కాదని వివరించారు. ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నందున పరీక్ష కేంద్రాల అందుబాటు, ఇతర విభాగాల పరీక్షల తేదీలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. -
అనుభవం లేదు.. సమర్థతా లేదు
సాక్షి, అమరావతి: ఏ రంగంలో అయినా, ఏ సంస్థలో అయినా ఉన్నత స్థానానికి వెళ్లాలంటే దానికి సంబంధించి ఎంతోకొంత అనుభవం ఉండాలి. దాన్ని నిర్వహించే సమర్థత ఉండాలి. అలాంటివేమీ లేకుండా.. అప్పటివరకు దాంతో సంబంధంలేని చలసాని ఆంజనేయులు ఒక్కసారిగా విజయ డెయిరీ చైర్మన్‌గా అందలం ఎక్కేశారు. దీనికి టీడీపీకి చెందిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ వ్యూహమే కారణమని చెబుతున్నారు. దాసరి బాలవర్థనరావు చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు ఆంజనేయుల్ని రంగంలోకి దించారు. అప్పటివరకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో ఎలాంటి సంబంధంలేని ఆయన్ని 2017లో ఆయన సొంత గ్రామం బాపులపాడు మండలం కాకులపాడు పాల సొసైటీకి చైర్మన్‌గా చేశారు. వెంటనే విజయ డెయిరీ డైరెక్టర్‌గా రంగంలోకి దింపి పాలకవర్గంలోకి వెళ్లేలా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బాలవర్థనరావును పక్కకునెట్టి మండవ జానకిరామయ్య స్థానంలో ఆంజనేయుల్ని చైర్మన్‌గా ఎన్నుకునేలా చేశారు. దీంతో వేలాది మంది పాడి రైతుల భవితవ్యంపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తికి పగ్గాలిచ్చారు. ఇప్పుడు ఆయన తప్పుడు నిర్ణయాలు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తనకు రాజకీయంగా లబ్ధి కలుగుతుందనే కారణంతో దేవినేని ఉమా ప్రతిష్టాత్మకమైన సంస్థకి చలసాని ఆంజనేయుల్ని చైర్మన్‌గా చేసేలా చక్రం తిప్పి రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని పలు సొసైటీల చైర్మన్లు ఆరోపిస్తున్నారు. ఎన్నో అవకతవకలు.. ఏ సంస్థలో అయినా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు ఒక విధానం ఉంటుంది. కానీ, విజయ డెయిరీలో మాత్రం చైర్మన్ తనకు కావాల్సిన వాళ్లకి ఒకలా, మిగిలిన ఉద్యోగులకు మరోలా ఇవ్వడంపై సంస్థలో దుమారం రేగుతోంది. తాను చెప్పినట్లు నడుచుకునే వారికి 15–20 శాతం ఇంక్రిమెంట్ ఇస్తూ మిగిలిన వారికి తూతూమంత్రంగా ఇస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. అంతేకాక.. ► 25 ఏళ్లుగా డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తికి సంస్థలో జరిగే వివిధ పనుల కాంట్రాక్టుల్ని ఎలాంటి టెండర్లు లేకుండా చైర్మన్ కట్టబెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ► ఇలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు చిల్లింగ్ సెంటర్, కళ్యాణ మండపం మరమ్మతుల పనుల్ని అతనికి అప్పగించారు. ► తాను చైర్మన్ అయ్యాక తనకు అనుకూలమైన అధికారుల్ని నియమించుకునే విషయంలో నిబంధనలకు పాతరేశారు. ► ఉదా.. హెరిటేజ్ సంస్థ తొలగించిన ఇద్దరిని డీజీఎం స్థాయిలో లక్షల జీతాలకు నియమించడంపై పలు సొసైటీల చైర్మన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ► ఇలా స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను భ్రష్టుపట్టిస్తున్నారని అన్ని వైపుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చైర్మన్ మాత్రం తాను డెయిరీని అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తిస్థాయి విచారణ జరిగితే అక్రమాలు బట్టబయలవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. ‘సాక్షి’ కథనంతో ఉలికిపాటు.. సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ‘సాక్షి’ మంగళవారం సంచికలో ప్రచురితమైన ‘‘పా‘పాల’ పుట్ట’’ కథనంతో చైర్మన్.. ఆయనకు మద్దతుదారులు ఉలిక్కిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని చైర్మన్ ఒక పత్రికా ప్రకటన తయారుచేసి జిల్లాలోని వివిధ పాల సొసైటీలకు పంపి మీడియా సమావేశాలు పెట్టించారు. ఇవేమీ తమకు తెలీదని కొందరు తప్పించుకున్నారు. సంస్థలోని పలువురు డైరెక్టర్లతో విజయవాడలో మీడియా సమావేశం పెట్టి తనకు అనుకూలంగా మాట్లాడించారు. ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న అంశాలకు వారు సమాధానం చెప్పకుండా చైర్మన్‌ను పొగడడానికి తాపత్రయపడ్డారు. భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వివరణ ఇవ్వకుండా గత పాలకవర్గం నుంచి భూములు కొంటున్నారంటూ కొత్త వాదన లేవనెత్తారు. అలాగే, విజయ పార్లర్లలో బయట ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ వ్యాపార సూత్రమని సమర్ధించుకున్నారు. రైతులకివ్వాల్సిన బోనస్ చెల్లించకపోవడం, కమీషన్ల కోసం జరిపిన కొనుగోళ్లు వంటి అంశాలపై డొంకతిరుగుడు వివరణలు ఇచ్చారు. మొత్తం మీద అవాస్తవాలు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీపీఎస్సీ సమాచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు కేటగిరీ నోటిఫికేషన్ల పరీక్షల్లో అర్హత సాధించిన, పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో విడుదల చేశారు. ► ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రయిబల్ వెల్ఫేర్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ ప్రకటించింది. దీన్ని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొంది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టుల పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ బుధవారం విడుదల చేసి.. కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. మైన్స్ అండ్ జియాలజీ మైన్స్ అండ్ జియాలజీ విభాగంలోని టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 27న పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఈ పరిశీలన జరగనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి మెమో, చెక్‌లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు, నాన్ క్రిమీలేయర్ ప్రొఫార్మా(బీసీ అభ్యర్థులు) డౌన్లోడ్ చేసుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో వాటిని కమిషన్‌కు అందించాలి. ఆగస్టు 6 నుంచి డిపార్టుమెంటల్ టెస్ట్ డిపార్టుమెంటల్ టెస్ట్‌ను ఆగస్టు 6వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఆగస్ట్ 28న రిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆగస్ట్ 28న నిర్వహిస్తున్నట్టు కమిషన్ వివరించింది. మేథమెటిక్స్, జనరల్ నాలెడ్జి, ఇంగ్లీషు సబ్జెక్టులకు సంబంధించి సెషన్లలో పరీక్ష జరగనుంది. -
మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం
-
సీనియర్ దర్శకుడు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నటుడు ఓఎస్ఆర్ ఆంజనేయులు కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఆయన దర్శకత్వ శాఖలో కృష్ణ, విజయనిర్మల, వీ.రామచంద్రరావు, కే.హేమాంబదరరావు, కే.ఎస్,ఆర్.దాస్ తదితరుల దగ్గర పలు చిత్రాలకు పనిచేశారు. అనంతరం కన్నెవయసు, లవ్ ఇన్ సింగపూర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. లవ్ ఇన్ సింగపూర్ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. ఇక పలువురు ప్రముఖ హీరోల చిత్రాలలో కూడా నటుడిగా కనిపించి తన అభిరుచిని చాటుకున్నారు. దాదాపు 70కి పైగా చిత్రాలలో ఆయన నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
చాలా.. లోపాలున్నాయ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్కమిషన్(ఏపీపీఎస్సీ)ను సమూలంగా ప్రక్షాళన చేయాలని పలువురు మేధావులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ నియంతృత్వ పోకడల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ఆయన్ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారి కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సోమవారం మేధావులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. కమిషన్‌లోని లోపాలు సరిదిద్దేందుకు సలహాలు, సూచనలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ కాన్ఫరెన్సు హాలులో జరిగిన ఈ సమావేశంలో చైర్మన్ ఉదయభాస్కర్‌పై పలువురు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన్ను తక్షణమే తొలగించకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగదని స్పష్టంచేశారు. నాలుగేళ్లుగా ఏపీపీఎస్సీ పనితీరు బాలేదు గత నాలుగేళ్లుగా ఏపీపీఎస్సీ పనితీరు సరిగా లేదని, చైర్మన్ నియంతృత్వం పోకడలు అవలంభించారని ఎమ్మెల్సీ కె.లక్ష్మణరావు ఆరోపించారు. ‘సిలబస్ కనీసం ఆరేళ్లపాటు కొనసాగేలా చూడాలి. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలి. అన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కులు తీసేయాలి. గ్రూప్–1కు మాత్రమే ప్రిలిమినరీ ఉండేది. చైర్మన్ అన్నిటికీ ప్రిలిమినరీ తప్పనిసరి చేశారు. బోర్డులోని సబ్జెక్టు నిపుణులపై చైర్మన్ ఒత్తిడి తెచ్చి తనవారికి ఎక్కువ మార్కులు వేయించారని ఆరోపణలున్నాయి. అందువల్ల రెండు మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటుచేయాలి’ అని సూచించారు. ఎమ్మెల్సీ కత్తి నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. పరీక్షలు సకాలంలో నిర్వహించి నియామకాలు వేగంగా పూర్తిచేయాలని కోరారు. ‘ప్రశ్నపత్రాల తయారీకి ప్యానెల్ ప్రొఫెసర్ల ఎంపిక పగడ్బందీగా ఉండాలి. సీల్డుకవర్లలో ఇచ్చే ప్రశ్నలను ఏపీపీఎస్సీలోని వారంతా చూస్తున్నారన్న అపవాదుంది. ప్రశ్నల రూపకల్పనలో సమతూకం ఉండాలి. ప్రశ్నల్లో తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల్లో అనేక అక్రమాలు పోస్టుల భర్తీలో అవినీతికి తావులేకుండా అడ్డుకట్ట వేసేలా సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టడం మంచి పరిణామమని మద్య నియంత్రణ ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ‘గత కొన్నేళ్లుగా ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల్లో అనేక అక్రమాలు జరిగాయి. ఎవరికెన్ని మార్కులు వేయాలో చైర్మన్ ఉదయభాస్కర్ ఒత్తిడి తెచ్చేవారని బోర్డులోని సబ్జెక్టు నిపుణులు చెప్పారు. రాజకీయ జోక్యంతో వారు చెప్పిన వారికి పోస్టులు దక్కేలా చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఉదయభాస్కర్‌ను తొలగిస్తేనే కమిషన్ ప్రక్షాళన సాధ్యం’ అని పేర్కొన్నారు. నిరుద్యోగులపై చైర్మన్ కేసులు పెట్టించి వేధించారని నిరుద్యోగ జేఏసీ నేతలు రామచంద్ర, సుకుమార్, రాజ్‌కుమార్‌లు నిరసన వ్యక్తంచేశారు. అక్రమ కేసులు ఎత్తివేసి, చైర్మన్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్‌చేశారు. వినతులు అందించేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఏఐఎస్ఎఫ్ నాయకుడు సుబ్బారావు పేర్కొనగా.. కమిషన్ కార్యాలయం మెట్లు ఎక్కనివ్వనంటూ బడుగు, బలహీనవర్గాలను చాలా చిన్నచూపు చూశారని మరో విద్యార్థి సంఘం నేత షానవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు ప్రతినిధులు ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం సూచనలు చేశారు. 1. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ విధానం కోసం కర్ణాటకలో మాదిరిగా చట్టం చేయాలి. 2. రాష్ట్ర సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. 3. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ వాడుకున్నా.. మెయిన్స్‌లో మెరిట్లో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇవ్వాలి. 4. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 75కు పైగా ప్రశ్నల్లో తప్పులు ఇతర లోపాలున్నందున దాన్ని రద్దుచేసి తిరిగి నిర్వహించాలి. 5. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆన్‌లైన్‌కు అలవాటు పడేవరకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలి. 6. నోటిఫికేషన్‌కు ప్రిలిమ్స్‌కు మధ్య 5 నెలలు.. అనంతరం మెయిన్స్‌కు 4 నెలల సమయమివ్వాలి. 7. వివిధ పరీక్షల మోడల్ పేపర్లను ముందుగానే విడుదల చేయాలి. 8. హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలి. 9. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నారు. దాన్ని వెంటనే అమలు చేయాలి. 10. ఆంగ్లం, తెలుగు ప్రశ్నల్లో ఏది తప్పైతే దాన్నే రద్దుచేయాలి. స్కేలింగ్‌ను కూడా రద్దుచేయాలి. 11. గ్రూప్–2లో ఎగ్జిక్యుటివ్ పోస్టులు యధాతథంగా భర్తీచేయాలి. 12. నిబంధన– 7ను పునరుద్ధరించి పోస్టుల్ని తదుపరి నోటిఫికేషన్లకు మళ్లించకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. 13. అభ్యంతరాలు నేరుగా లేదా పోస్టు ఇవ్వమనడంతో నష్టపోతున్నాం. ఆన్లైన్లో పొందుపరిచేందుకు అవకాశం కల్పించాలి. 14. మెయిన్స్ పరీక్షల్లో మార్కులను ఇంటర్వ్యూలకు ముందుగా ప్రకటిస్తూ కమిషన్‌లోని సభ్యులు బేరసారాలు సాగిస్తున్నారు. సెలెక్షన్ పూర్తయ్యాకే మార్కులు ప్రకటించాలి. 15. యూనివర్సిటీ అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులు ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా పాతవిధానంలో భర్తీచేయాలి. అన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ద్వారా అందరికీ మేలుజరిగేలా సలహాలు సూచనలకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సలహాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ పూర్తి న్యాయం చేసేందుకు మూడు వారాల్లో చర్యలు తీసుకుంటాం. నెగిటివ్ మార్కులు తీసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై కమిషన్లోనూ నిర్ణయం తీసుకుంటాం. సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ కమిషన్ కార్యదర్శి -
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి ‘వైఎస్సార్ వాహన మిత్ర’గా నామకరణం చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అక్టోబర్ 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రశీదులు అందిస్తామని చెప్పారు. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు అందించే రూ.10 వేలు వాహన బీమా, ఫిట్నెస్, మరమ్మతులకు ఉపయోగపడతాయన్నారు. బుధవారం అర్ధరాత్రితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిం దని.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుల్ని గ్రామ/వార్డు వలంటీర్లకు పంపించామని ఇప్పటి వరకు 74 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులపై పరిశీలన జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో అందిన దరఖాస్తుల్ని ఎంపీడీవోలు, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు 45,223 దరఖాస్తుల్ని ఆమోదించారన్నారు. 17,230 దరఖా స్తులకు కలెక్టర్లు మంజూరు అనుమతులిచ్చారని వివరించారు. అధికంగా విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. అక్టోబర్ 5న అర్హులైన డ్రైవర్లకు నగదు చెల్లింపుల రశీదులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారని చెప్పారు. -
మూఢనమ్మకం మసి చేసింది
మేడ్చల్/శామీర్‌పేట్: చేతబడి అనుమానమే ఓ అమాయకుడిని బలిగొంది.. ఆ మూఢనమ్మకమే ఆ యువకుడిని సజీవ దహనం చేసింది.. బతికుండగానే చితిలో పడేసి కాల్చేసేలా పురిగొల్పింది.. మానవత్వాన్ని మంటల్లో కాల్చేసిన ఈ ఘటన.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. అటుగా వెళ్లడమే పాపమైంది.. అద్రాస్‌పల్లికి చెందిన గ్యారలక్ష్మి (45)అనే మహిళ గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. గ్రామంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. చేతబడి చేయడంతోనే లక్ష్మి చని పోయిందని బంధువులు అనుమానించారు. అదే నిజమైతే చేతబడి చేసిన వారు.. చితి కాలిపోయే లోపు అక్కడికి వస్తారనే నమ్మకంతో.. రాత్రి లక్ష్మి బంధువులు బలరాం, కిష్టయ్య లు చితికి సమీపంలోనే కాపు కాస్తూ ఉన్నారు. అదే సమయంలో శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కెనాల్ కాలువ వద్దకు అదే గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (29) రోజూ మాదిరిగానే రాత్రి 8.30 గంటలకు బహిరంగ మలవిసర్జన కోసం రావడంతో అతడిని అనుమానించారు. ఆంజనేయులు తండ్రి కిష్టయ్య మంత్రాలు చేస్తాడనే ప్రచారం ఉండటంతో వారి అనుమానం బలపడింది. నగ్నంగా.. చితిలోకి నెట్టేసి.. ఆంజనేయులును గమనించిన బలరాం, కిష్టయ్యలు వెంటనే అతడిపై రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత ఆంజనేయులు శరీరంపై ఉన్న దుస్తులు తీసేసి.. కాలుతున్న లక్ష్మి చితిలో అతడిని పడేశారు. దీంతో అతడు అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ విషయం ఊరంతా పాకడంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో శామీర్ పేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు గ్యార బలరాం, గ్యార కిష్టయ్య, గ్యార నర్సింహతోపాటు మరో వ్యక్తి బండల శ్రీరాములును గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మి, అంజనేయులు అస్థికలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ కుటుంబం ఏకాకి.. పదో తరగతి వరకు చదువుకున్న ఆంజనేయులు కొంతకాలంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కిష్టయ్య క్షుద్రపూజలు చేస్తాడని ఆరోపణలు ఉండటంతో గ్రామస్తులంతా ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గతేడాది కిష్టయ్య చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకు గ్రామస్తులు ఎవరూ వెళ్లలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు: పద్మజారెడ్డి ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామంలోని రెండువర్గాల వారు వేర్వేరు వాదనలు వినిపించారు. క్షుద్రపూజల నెపంతోనే అంజనేయులును చితిలో పడేశారా లేదా అనేది తెలుసుకుంటున్నాం. చితిలో నుంచి అస్తికలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. నివేదిక వచ్చిన తర్వాత కొంత స్పష్టత వస్తుంది. ఘటనాస్థలి వద్ద రక్తపు మరకలు, చేతి రుమాలు లభ్యమయ్యాయి. -
యువకుడి అనుమానాస్పద మృతి
పరిగి మండలం పి.నరసాపురంలోని బిసప్ప గారి ఆంజనేయులు (24) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపాన వేపచెట్టు వద్ద విగత జీవిగా పడి ఉండటాన్ని తండ్రి బోయ సుబ్బరాయప్ప గమనించి కన్నీరుమున్నీరయ్యాడు. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో కుమారుడు చనిపోయాడన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయింది. అనంతపురం , పరిగి: పి.నరసాపురంలో మోటారు పంపులు మరమ్మతులు, దినసరి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న బిసప్పగారి ఆంజనేయులు అవివాహితుడు. ఇతని తండ్రి సుబ్బరాయుడు కూడా కూలి పనులు చేస్తుండేవాడు. కొంత కాలంగా ఆంజనేయులు తల్లి సుబ్బమ్మ మతిస్థిమితం కోల్పోయింది. కూలి పనులు చేసుకుంటున్న ఆంజనేయులు మంగళవారం మధ్యాహ్నం నుంచి గ్రామంలో కనిపించకుండా పోయాడు. బుధవారం ఉదయం ఊరిబయటకు వెళ్లిన కొందరికి వేపచెట్టు వద్ద ఆంజనేయులు మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న హిందూపురం రూరల్ సీఐ సుబ్రమణ్యం, పరిగి ఇన్చార్జ్ ఎస్ఐ శేఖర్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహం చూసి తండ్రి బోరున విలపించాడు. తల్లి అక్కడకు వచ్చినా కుమారుడిని గుర్తించలేని పరిస్థితి. మృతిపై అనుమానాలు ఆంజనేయులు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలి పనులతో బతుకుతున్న ఆంజనేయులు గతంలో గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ క్రమంలో ఆమె బంధువులే హత్య చేసి పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో మృతదేహం వద్ద ఓ టవల్ పడి ఉంది. ఆంజనేయులు చేతిపై ఉన్న పచ్చబొట్టు వద్ద, శరీరంలోను పలు చోట్ల గాయాలు కనిపిస్తున్నాయి. హత్య కోణంలో దర్యాప్తు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఆంజనేయులు హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురయ్యాడా.. ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు
-
టీడీపీ ఎమ్మెల్యే.. స్మగ్లర్లకు డాన్
సాక్షి, గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై హత్య కేసు బనాయించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు పోలీసులపై ఆయన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా ఈ కేసును విచారిస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆంజనేయులు ముగ్గురిని చంపినట్టు వినుకొండలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని అన్నారు. -
ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటాం
అల్గునూర్(మానకొండూర్): ఫిబ్రవరి 16న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ‘సాక్షి’ జగిత్యాల డెస్క్ ఇన్చార్జి శ్రీమూర్తి ఆంజనేయులు కుటుంబానికి ‘సాక్షి’ఫ్యామిలీ అండగా నిలిచింది. ఆంజనేయులు కుటుంబానికి సిబ్బంది తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారు. శుక్రవారం కరీంనగర్ యూనిట్ కార్యాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, నెట్వర్క్ ఇన్చార్జి శ్రీకాం త్ చెక్కురూపంలో ఆంజనేయులు భార్య శ్రావ్యకు అందించారు. మంత్రి మాట్లాడుతూ ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహచర జర్నలిస్టు కుటుంబానికి చేయూతనిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ‘సాక్షి’సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సాక్షి బ్రాంచి ఇన్చార్జి శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో ఇన్చార్జి గడ్డం రాజిరెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎడిషన్ ఇన్చార్జీలు బొల్లబత్తిని శ్రీనివాస్, సురేష్, ఆయా జిల్లాల డెస్క్ ఇన్చార్జీలు, స్టాఫ్ రిపోర్టర్లు పాల్గొన్నారు. -
ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి
-
ఆర్టిస్ట్ ఆంజనేయులుకు సోనియా అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓక్లా ఎన్ఎస్ఐసీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ‘హియర్ నౌ అండ్ దెన్’పేరుతో గత మూడురోజులుగా అంతర్జాతీయ ఆర్ట్ఫెయిర్ జరుగుతోంది. ఇందులో హైపర్ రియలిజం ఆర్ట్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన గుండు ఆంజనేయులు చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఎక్కువ సమయం తీసుకొనే ఈ ఆర్ట్‌లో ఆంజనేయులు ఏడాది కాలంలో ఐదు చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రాల ప్రత్యేకతను గుర్తించిన ‘ఆర్ట్ ఎలైవ్ గ్యాలరీ’వారు ఆంజనేయులు చిత్రాలకోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆంజనేయులు కావడం గమనార్హం. గ్యాలరీలో ప్రదర్శించిన ఐదు చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అతను గీసిన నులక మంచం, సోడా బండి, సైకిల్, తుమ్మకంప అందరి మన్ననలు పొందాయి. ఈ ఆర్ట్ఫెయిర్ను పరిశీలించేందుకు వచ్చిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆంజనేయులును ప్రత్యేకంగా అభినందించారు. -
టీడీపీ కౌన్సిలర్ దౌర్జన్యం
భీమవరం టౌన్: ప్రజా సమస్యలపై మునిసిపల్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్‌పై పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో ప్రధాన సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందుతున్న మునిసిపాలిటీ పండుగ రోజుల్లో వివిధ వర్గాల ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం మునిసిపాలిటీలో శాంతియుతంగా ధర్నా చేపట్టారు. వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా మునిసిపాలిటీకి చేరుకున్నారు. కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వన్‌టౌన్ సీఐ డి.వెంకటేశ్వరరావుఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరకుని విషయం తెలుసుకున్నారు. చైర్మన్ కొటికలపూడి గోవిందరావు చాంబర్లో ఉన్న కమిషనర్ బయటకు వచ్చి పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పోలీసులు ట్రాఫిక్సమస్యకు అవరోథంగా ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లు తొలగించాలని మునిసిపాలిటీని కోరారని, అనుమతి లేకుండా పెట్టిన బ్యానర్లను తొలగించేందుకు జీఓ కూడా ఉందన్నారు. దీనిపై పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు అభ్యంతరం తెలిపారు. సంక్రాంతి ముగిసే వరకూ ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి అనుమతి కోరతామని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి వైఎస్సార్ సీపీ శ్రేణులు సానుకూలంగా స్పందిస్తుండగా టీడీపీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దూకుడుగా ముందుకు వచ్చి కోడే యుగంధర్ మెడ పట్టుకుని వెనక్కి నెట్టి వేయడంతో అక్కడే ఉన్న సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్సై పి.అప్పారావు వెంటనే తేరుకుని అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు స్పందిస్తుండగానే కౌన్సిలర్ ఆంజనేయులను కొందరు అక్కడి నుంచి కమిషనర్ చాంబర్లోకి తీసుకువెళ్లి తలుపులు గడియ పెట్టారు. విషయం తెలుసుకున్న చైర్మన్ గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు అక్కడికి వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలపై అడిగేందుకు వస్తే కౌన్సిలర్ రౌడీయుజంతో దాడి చేస్తే వెనకేసుకువస్తారా అంటూ చైర్మన్‌ను వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరిద్దామని చైర్మన్ సూచించగా కౌన్సిలర్ ఆంజనేయులతో క్షమాపణ చెప్పించాలని నాయకులు కామన నాగేశ్వరరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, కొల్లి ప్రసాద్, సుంకర బాబూరావు, గూడూరి ఓంకారం, భూసారపు సాయి సత్యనారాయణ, కొప్పర్తి జనార్థన్, చికిలే మంగతాయారు, నెల్సన్, కందికట్ల డేవిడ్ డిమాండ్ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లు వైఎస్సార్ సీపీ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. కమిషనర్ చాంబర్లో ఇరువర్గాలు చర్చలు జరిపారు. బహిరంగంగా దాడి చేసిన కౌన్సిలర్ ఆంజనేయులు అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని సుంకర బాబూరావు కోరడంతో చైర్మన్ దానికి అంగీకరించకుండా లేచి వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు మళ్లీ ధర్నా చేపట్టారు. కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐలు డి.వెంకటేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నాయకులపై దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని పోలీసులను కోడే యుగంధర్ ప్రశ్నించడంతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. సమస్యలపై స్పందించమంటే దాడులు చేస్తారా? ప్రజా సమస్యలపై స్పందిస్తే పీక నొక్కి టీడీపీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పండుగ రోజుల్లో ప్రజల మనోభిప్రాయాన్ని గౌరవించి సంక్రాంతి వరకూ ఫ్లెక్సీలు తొలగించవద్దని ప్రజా స్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మునిసిపల్ కార్యాలయంలో అధికార పక్ష కౌన్సిలర్ దాడి చేయడం దారుణమన్నారు. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు, సీనియర్ నాయకుడు కామన నాగేశ్వరరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, నెల్సన్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షంపై రాష్ట్రంలో తెలుగు దేశం దాడులు చేసే విష సంస్కృతి భీమవరం మునిసిపాలిటీకి కూడా చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు పాలవెల్లి మంగ, కానుబోయిన వెంకటరమణ, వేండ్ర విజయదుర్గ, విజ్జురోతి రాఘవకుమారి, సుంకర విజయలక్ష్మి, చెన్ను శాం తి, నాయకులు గంటా సుందర్‌కుమార్, రేవూరి గోగురాజు, పెనుమాల నర్సింహస్వామి, బి.గోపి తదితరులు పాల్గొన్నారు.