Bhagamathi
-
భాగమతి 2.. దర్శకుడు కీలక వ్యాఖ్యలు
అందంతో, అభినయంతో అందరినీ అబ్బురపరిచే బ్యూటీ అనుష్క శెట్టి. అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం లిఖించుకున్న ఈమె దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో భాగమతి సినిమా 2016లో వచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందని కొన్నేళ్లుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు.భాగమతి సీక్వెల్..ఇన్నాళ్లకు భాగమతి సీక్వెల్‌పై దర్శకుడు అశోక్ స్పందించాడు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. భాగమతి సీక్వెల్లో అనుష్క మరింత పవర్ఫుల్ రోల్లో కనిపించనుందని చెప్పాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నాడు. 2025లో సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్తుందన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా నిర్మిస్తుందని తెలిపాడు. ఈ విషయం తెలిసి స్వీటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.చేతిలో రెండు చిత్రాలుగతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అలరించిన అనుష్క ప్రస్తుతం ఘాటి సినిమా చేస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. అలాగే మలయాళంలో తొలిసారిగా కథనార్- ద వైల్డ్ సోర్సరర్ అనే చిత్రంలో నటిస్తోంది.చదవండి: జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నా, కోలుకోవడానికి.. -
Birthday Special: సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే స్పెషల్
-
అనుష్క పుట్టినరోజు గిఫ్ట్.. ఆ హిట్ సినిమా పార్ట్-2 ప్రకటన
టాలీవుడ్లో అనుష్క పేరు వినగానే స్టార్ హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అనే అంశం గుర్తుకు వస్తుంది. ఒక సినిమాలో హీరోయిన్ అంటే రెండు సీన్లు, మూడు పాటలకు మాత్రమే పరిమితం కాదు.. అవసరమైతే తనే ఒక సినిమాని ఒంటిచేత్తో నడిపించగలదు. ఈ విషయాన్ని అనేకసార్లు నటి అనుష్క నిరూపించింది. అందుకే ఆమెకు ఇక్కడ అంత క్రేజ్.. సినీ కెరియర్ ఆరంభంలో అందాలు ఆరబోసినా... ఆ తర్వాత అరుంధతిలో జేజమ్మగా దుమ్ములేపింది. ఆ తర్వాత దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే ఫస్ట్ ఛాయిస్ అనుష్క పేరు గుర్తొచ్చేలా ఆమె మాయ చేసింది. 'వేద' సినిమాలో సరోజ పాత్రలో తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగించింది అనుష్క.. బిల్లాలో తన గ్లామర్‌తో కిక్ ఇచ్చింది. తాజాగా విడుదలైన 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి'లో అన్విత పాత్రలో అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టింది. అనుష్క సినీ కెరియర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం భాగమతి.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. నేడు (నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు సందర్భంగా భాగమతి 2 చిత్రం గురించి యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రకటన అధికారికంగా వస్తే తన కెరియర్లో 50వ చిత్రంగా రికార్డుకెక్కనుంది. -
రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది
‘‘ఎవరైనా వాళ్ల సినిమాను ప్రేక్షకులకు థియేటర్స్‌లోనే చూపించాలనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల తప్పనిసరి అయింది’’ అన్నారు దర్శకుడు జి. అశోక్. అనుష్క ముఖ్య పాత్రలో అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. అశోక్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ‘దుర్గామతి’ టైటిల్‌తో హిందీలో రీమేక్ అయింది. భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్ర చేశారు. అక్షయ్ కుమార్ ఓ నిర్మాత. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా అశోక్ చెప్పిన విశేషాలు. ► ఓ పెద్ద హీరోతో హిందీ సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు ‘భాగమతి’ రీమేక్ కోసం హిందీ నిర్మాతలు నన్ను కలిశారు. అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది దాటడంతో ఇప్పుడు రీమేక్ చేస్తే చూస్తారా? అనుకున్నాను. రీమేక్ చేయాలని, నేనే చేయాలని నిర్మాతలు అడిగారు. అప్పటికే అక్షయ్ కుమార్‌గారు ఈ సినిమా రీమేక్‌ని నిర్మించే ఆలోచనలో ఉన్నారు. రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది. ఒరిజినల్లో మనం సరిగ్గా చెప్పలేదు అనుకున్న సీన్లను ఇంకా బాగా చెప్పొచ్చు ► దర్శకుడిగా నాకు ఏది కావాలంటే అది ఎంపిక చేసుకునే స్వేచ్ఛని ఇచ్చారు. భూమి పెడ్నేకర్ ఈ పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుందనుకున్నాం. చాలా బాగా చేసింది. ఈ పాత్రకు న్యాయం చేసింది. లాక్డౌన్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. లాక్డౌన్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేశాం. షూటింగ్ కంటే నిర్మాణానంతర కార్యక్రమాలు చాలా కష్టం అయ్యాయి. లాక్డౌన్ సమయంలో టెక్నీషియన్లు బయటకు రావడానికి కాస్త భయపడ్డారు. ► ఈ సినిమా థియేటర్స్ కోసం చేశాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇంట్లోనూ వీలైనంత ఆస్వాదించేలా ఈ సినిమాను రెడీ చేశాం. ‘సినిమా బుల్లెట్లా పరిగెడుతోంది. చాలా బావుంది’ అని చూసిన తర్వాత అక్షయ్ కుమార్‌గారు అన్నారు. ► హన్సికతో ఓ వెబ్ సిరీస్ పూర్తి చేశాను. అదీ అమెజాన్‌లో త్వరలోనే విడుదల కానుంది. అలానే ఓ రెండు హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఒక సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. తమిళంలోనూ ఓ పెద్ద హీరోతో కథా చర్చలు జరుగుతున్నాయి. -
దుర్గా మాత ఆశీర్వాదంతో...
‘దుర్గావతి’ ప్రయాణం మొదలైంది. భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దుర్గావతి’. తెలుగులో హిట్ సాధించిన అనుష్క ‘భాగమతి’ (2018) చిత్రానికి ఇది హిందీ రీమేక్. అక్షయ్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భాగమతి’ చిత్రానికి దర్శకత్వం వహించిన జి. అశోకే ‘దుర్గావతి’ని తెరకెక్కిస్తుండటం విశేషం. దర్శకుడిగా హిందీలో అశోక్‌కి ఇది తొలి చిత్రం. ఐపీఎస్ ఆఫీసర్‌గా భూమి ఫడ్నేకర్ నటిస్తోన్న ఈ చిత్రంలో మహీ గిల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ‘‘దుర్గా మాత ఆశీర్వాదంతో ‘దుర్గావతి’ చిత్రీకరణ మొదలైంది. నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాను. టాల్ అండ్ స్ట్రాంగ్‌గా నిలబడటానికి నేను రెడీ అక్షయ్ సార్’’ అన్నారు భూమి. ‘దుర్గావతి’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. -
దుర్గావతి
బాలీవుడ్ ‘దుర్గావతి’గా మారారు కథానాయిక భూమీ ఫడ్నేకర్. అనుష్క టైటిల్ రోల్లో జి. అశోక్ దర్శకత్వంలో ‘భాగమతి’ (2018) చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ కానుంది. తెలుగులో అనుష్క చేసిన పాత్రను హిందీలో భూమీ ఫడ్నేకర్ పోషించనున్నారు. తెలుగు ‘భాగమతి’ చిత్రాన్ని తెరకెక్కించిన జి. అశోకే హిందీ రీమేక్ ‘దుర్గావతి’కి దర్శకుడు కావడం విశేషం. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నటుడు అక్షయ్ కుమార్, నిర్మాత భూషణ్ కుమార్ సమర్పణలో విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తారు. ‘‘దుర్గావతి’లో నటించబోతున్నానని చెప్పాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. శనివారం అధికారికంగా ప్రకటించాం. చాలా సంతోషంగా ఉంది. దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు భూమీ ఫడ్నేకర్. -
ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం
తమిళసినిమా: ఎంత కష్టపడి నటించినా ఫలితం శూన్యమే నంటోంది నటి అనుష్క. ఇప్పుడు అగ్రనటి అనే పదానికి అడ్రస్ అనుష్క. టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ బాలీవుడ్ అవకాశాలు వచ్చినా, దక్షిణాది సినిమానే చాలు, ఇక్కడే సంతృప్తిగా ఉందంటూ హిందీ చిత్రాలపై ఆసక్తి చూపని అనుష్క ఈ రెండు భాషల్లోనూ స్త్రీ ప్రధాన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే చెప్పాలి. అరుంధతి చిత్రం అందలం ఎక్కించడంతో బాహుబలి, భాగమతి వంటి చిత్రాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారింది. అలాంటి అనుష్క తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పటి వరకూ స్పష్టత లేదు. అలాంటి తీయని వార్త గురించి ఆమె అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పలు అవకాశాలు తలుపు తడుతున్నా, సరైన కథా పాత్ర కోసం ఎదురు చూస్తున్నానంటున్న అనుష్క తాను 13 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తునందుకు కారణం అభిమానులేనంటోంది. దీని గురించి ఈ స్వీటీ ఒక భేటీలో పేర్కొంటూ నటీనటులు సినిమా అవకాశాలను దక్కించుకున్నా, ప్రతిభను చాటుకున్నా అభిమానుల ఆదరణ లభిస్తేనే గౌరవం దక్కుతుందని అని పేర్కొంది. వారికి నచ్చకపోతే ఎంత కష్టపడి నటించినా ఫలితం శూన్యం అని అంది. తనకు అభిమానుల ఆదరణ చాలానే ఉందని చెప్పింది. అరుంధతి, బాహుబలి, భాగమతి చిత్రాల తరువాత ప్రతిభావంతమైన నటి అని ప్రశంసిస్తున్నారంది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లో నటించగలిగే నటి అని కీర్తిస్తున్నారని అంది. అలా తనకు నటిగా మంచి స్థాయిని అందించారని చెప్పింది. అయితే ముందు తరంలో 30, 40 ఏళ్ల పాటు కథానాయికలను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగానూ, గర్వంగా ఉందని అంది. ఇప్పటి సౌకర్యాలు అప్పటి కథానాయికలకు లేవని, వాళంతా కష్టపడి ప్రతిభను చాటుకుని రాణించారని పేర్కొంది. అలాంటి వారితో పోల్చుకుంటే తాను, ఇతర నటీనటులు సాధారణమైన వాళ్లం అని అంది. తాము పడే కష్టం కూడా తక్కువేనని, ప్రస్తుతం ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే చాలని నటి అనుష్క పేర్కొంది. -
మరో తెలుగు సినిమాలో మాధవన్
చెలి, సఖి లాంటి సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్ ఇంతవరకు తెలుగులో ఒక్క స్ట్రయిట్ సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాతో తొలిసారిగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మాధవన్ మరో తెలుగు సినిమా అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. భాగమతి సినిమా తరువాత అనుష్క ఇంతవరకు మరో సినిమా మొదలు పెట్టలేదు. సరైన కథ కోసం ఎదురుచూస్తున్న స్వీటీ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారట. థ్రిల్లర్ జానర్‌తో తెరకెక్కనున్న ఈసినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు.ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
నువ్వు నన్నేం చేయలేవురా అనలేకపోయా!
‘హలో అండీ... ఎలా ఉన్నారు?’ అని స్వీట్‌గా పలకరిస్తారు స్వీటీ. అంతేనా? తెలుగులో చక్కగా మాట్లాడతారు. మరి.. నిత్యామీనన్, రకుల్, అనుపమా పరమేశ్వరన్, సాయిపల్లవి, కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్.. రష్మిక మండన్నలా అనుష్క తన పాత్రకు ఎందుకు డబ్బింగ్ చెప్పుకోరు? వీళ్లందరికన్నా స్వీటీ సీనియర్. పైగా తెలుగు చక్కగా మాట్లాడతారు. ఇదే విషయం అనుష్క ముందుంచితే – ‘‘నేను తెలుగు మాట్లాడగలను. అయితే.. డబ్బింగ్ చెప్పేంత సాహసం చేయలేను. నా మాట చిన్నపిల్లల మాదిరిగా ఉంటుంది. నేను మాట్లాడుతుంటే పక్కవాళ్లకు కూడా వినిపించదని మా కుటుంబ సభ్యులే అంటుంటారు. అటువంటప్పుడు నేను డబ్బింగ్ చెబితే ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. అంతెందుకు? ‘అరుంధతి’ సినిమాలో ‘నువ్వు నన్నేం చేయలేవురా’ డైలాగ్ ఇంటి వద్ద చాలాసార్లు ప్రాక్టీస్ చేసినా అంత గట్టిగా చెప్పలేకపోయాను. ఇటీవల వచ్చిన ‘భాగమతి’ సినిమాలోని ‘ఇది భాగమతి అడ్డా’ డైలాగ్ కూడా అంతే. ఆ పాత్రలకు తగ్గ గంభీరమైన గొంతు నాకు లేదు. అందుకే డబ్బింగ్ చెప్పడం లేదు’’ అన్నారు. పాయింటే కదా. -
మంచి టీమ్ కుదిరితేనే అది సాధ్యం – అనుష్క
‘అరుంధతి, రుద్రమదేవి’ చిత్రాలకు అనుష్క ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేశారో ‘భాగమతి’కి కూడా అంతే కష్టపడ్డారు. అందుకు తనకు హ్యాట్సాఫ్. ఈ సినిమా పాయింట్‌ను నమ్మి అశోక్ ఇన్నేళ్లు ట్రావెల్ చేశాడు. తన నమ్మకం ఈరోజు నిజమైంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అనుష్క టైటిల్ రోల్లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘భాగమతి’ హిట్‌తో కొత్త కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. వంశీ, ప్రమోద్, విక్కీలను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది. నేను ఆరేళ్లలో ఐదు హిట్స్ కొట్టినట్లే, యు.వి. క్రియేషన్స్‌పై ఆరేళ్లలో ఐదు హిట్స్ సాధించారు’’ అన్నారు. ‘‘భాగమతి’ విడుదలైన రోజు నుంచి నేటి వరకు పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు బాగా చేస్తున్నావని చాలామంది అంటుంటారు. ఒక మంచి బ్యానర్, టీమ్ కుదిరినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అన్నారు అనుష్క. ‘‘ఇది సక్సెస్‌మీట్ కాదు.. సక్సెస్ఫుల్ ప్రయాణం. 2012లో స్టార్ట్ చేసిన జర్నీ ఇది. అçప్పటి నిర్ణయం సరైనదని ఈరోజు రుజువైంది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా అనుష్క, నిర్మాతలకే చెందుతుంది’’ అన్నారు అశోక్. ఈ కార్యక్రమంలో వంశీ, ప్రమోద్, విక్కీ, రవీందర్, తమన్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
హీరోలు అందుకు అర్హులే
తమిళసినిమా: హీరోలు అందుకు అర్హులే అంటోంది నటి అనుష్క. ఈ స్వీటీ సినీ జీవితం అరుంధతికి ముందు, ఆ తరువాత అన్నట్టుగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చింది. అనుష్క అంటే ఫైట్స్ చేయగలదు. పంచ్ డైలాంగ్స్ చెప్పగలదు. కత్తి పట్టి వీరనారిలా యుద్ధభూమిలో కదం తొక్కగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోలకు దీటుగా నటించి చిత్ర కథను తన భుజస్కందాలపై వేసుకుని విజయ తీరం దాటించగలదు. అది భాగమతి చిత్రంతో మరోసారి నిరూపించింది. అనుష్క టైటిల్ పాత్ర పోషించిన భాగమతి చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి ఒక్క భాష అని కాకుండా దక్షణాది భాషలన్నిటిలోనూ కలెక్షన్లను ఇరగదీస్తోంది. చిత్రం నిర్మాణం ఆలస్యమైంది. అనుష్క బరువు పెరిగింది. భాగమతికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అన్న అనుమానం చాలా మందిలో ఉంది. అలాంటి వాటిని పటాపంచల్ చేస్తూ చిత్రం విజయం వైపు దూసుకుపోతోంది. ఇక అసలు విషయానికి వస్తే చాలా మంది హీరోయిన్లు ప్రారంభ దశలో అవకాశాలు వస్తే చాలని భావిస్తారు. రెండు మూడు విజయాలు తమ ఖాతాలో పడగానే పారితోషికం విషయంలో అసంతృప్తి రాగం తీస్తుంటారు. హీరోల పరంగా చూస్తే హీరోయిన్ల పారితోషికాలు చాలా తక్కువని, ఇది హీరోల ఆధిపత్య రాజ్యం అని ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఇందుకు అనుష్క అతీతం అనే చెప్పాలి. ఈ బ్యూటీ హీరోల పక్షాన మాట్లాడుతోంది. ఇటీవల భాగమతి చిత్ర ప్రమోషన్లో భాగంగా కేరళకు వెళ్లిన అనుష్కను హీరోహీరోయిన్ల మధ్య పారితోషిక తారతమ్యం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అనుష్క బదులిస్తూ హీరోయిన్ల కంటే అధిక పారితోషికం తీసుకోవడానికి హీరోలు అర్హులేనని చెప్పింది. చిత్రం కోసం వారు ఎంతో శ్రమిస్తారని అంది. అంతే కాదు చిత్రం అపజయం పాలయితే అందుకు హీరోలే బాధ్యత వహిస్తారని, హీరోయిన్లకు ఆ బాధ ఉండదని చెప్పింది. -
భాగమతి బాగుందంటున్నారు
‘‘నాకు అవసరమైన టైమ్‌లో ‘భాగమతి’ సినిమా రూపంలో బిగ్ సక్సెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ వర్క్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. అనుష్క యాక్టింగ్ సూపర్’’ అన్నారు దర్శ కుడు అశోక్. అనుష్క లీడ్ రోల్లో ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ– ‘‘మనిషి మెదడును మించిన దెయ్యం ఉందా? లేదా మనిషి తెలివితేటలకు మించిన దెయ్యం ఉందా? అన్న ప్రశ్నలను రైజ్ చేస్తూ చేసిన సినిమా ‘భాగమతి’. సినిమాలో భయం అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. అంతకు మించిన ట్విస్ట్ సినిమాలో ఉందని ముందే చెప్పాం. అనుç ష్కను మా ఇంటి అమ్మాయి అని ప్రేక్షకులు మరోసారి దగ్గరకు తీసుకుని మంచి హిట్ అందించారు. కథ విని భాగమతి బంగ్లా ఇలా ఉండబోతుంది సార్ అని చూపించినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. ‘భాగమతి బంగ్లా’ అనే క్యారెక్టర్‌ను సూపర్‌గా ఫెర్ఫార్మ్ చేయించిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌కి కృతజ్ఞతలు. తమన్‌తో పాటుగా టీమ్ అందరూ చాలా శ్రమపడ్డారు. మార్నింగ్ షో నుంచే ‘భాగమతి’ సినిమాకు మంచి టాక్ తెచ్చుకుంది. తమిళనాడు, కేరళ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి రివ్యూస్ అండ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పైరసీని ప్రోత్సహించకండి’’ అన్నారు. ‘‘టెక్నీషియన్స్‌కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. అనుకున్న టైమ్‌లోనే సెట్‌ను కంప్లీట్ చేయగలిగాం. ‘భాగమతి’ టీమ్ తరఫున ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. -
‘భాగమతి’ మూవీ రివ్యూ
టైటిల్ : భాగమతి జానర్ : థ్రిల్లర్ తారాగణం : అనుష్క, ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ సంగీతం : తమన్.ఎస్ దర్శకత్వం : జి. అశోక్ నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ అరుంధతి, రుద్రమదేవి, పంచాక్షరి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న అనుష్క లీడ్ రోల్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ భాగమతి. పిల్ల జమీందార్, సుకుమారుడు లాంటి క్లాస్ సినిమాలను తెరకెక్కించిన అశోక్ తొలిసారిగా తన స్టైల్ మార్చి చేసిన సినిమా భాగమతి. అనుష్కను భాగమతిగా చూపించిన దర్శకుడు అశోక్ సక్సెస్ సాధించాడా..? ఇటీవల లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ఈ సినిమాతో లుక్స్ పరంగా ఆకట్టుకుందా..? భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భాగమతి ఆ అంచనాలను అందుకుందా..? కథ : సెంట్రల్ మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ (జయరామ్) నిజాయితీ గల రాజకీయనాయకుడు. ఆయనకు ఉన్న ఇమేజ్ చూసి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎలాగైన ఈశ్వర్ ప్రసాద్ ను కట్టడి చేయాలని భావిస్తారు. అందుకోసం ఎలాగైన ఈశ్వర్ ప్రసాద్ అవినీతి పరుడని నిరూపించాలని.. ఆ బాధ్యతను సీబీఐ జాయింట్ డైరెక్టర్ వైష్ణవి నటరాజన్(ఆశా శరత్)కు అప్పగిస్తారు. వైష్ణవి, ఈశ్వర్ ప్రసాద్ ను ఇరికించేందుకు ఆయన దగ్గర రెండు సార్లు సెక్రటరీగా పనిచేసిన చెంచలా ఐఏఎస్ (అనుష్క)ను విచారించాలని నిర్ణయించుకుంటుంది. తన ప్రియుడ్ని చంపిన కేసులో జైల్లో ఉన్న చెంచలను ప్రజల మధ్య విచారించటం కరెక్ట్ కాదని, ఊరికి దూరంగా అడవిలో ఉన్న భాగమతి బంగ్లాలో విచారించాలని నిర్ణయిస్తారు. (సాక్షి రివ్యూస్)బంగ్లాలోకి ఎంటర్ అయిన తరువాత చెంచల వింతగా ప్రవర్తిస్తుంది. తనను ఎవరో కొడుతున్నారని అరుస్తూ, అప్పుడప్పుడూ అరబిక్ భాషలో మాట్లాడుతూ పోలీసులను భయపెడుతుంది. చెంచల అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి..? మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ మీద మచ్చ వేయాలన్న కుట్ర ఎందుకు జరిగింది..? చెంచల తన ప్రియుడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఈ సమస్యల నుంచి చెంచల ఎలా బయటపడింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : అరుంధతి, రుద్రమదేవిగా చరిత్ర సృష్టించిన అనుష్క భాగమతిగా మరోసారి అదే స్థాయి పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఐఏఎస్ ఆఫీసర్ చెంచలగా హుందాగా కనిపించిన స్వీటీ, భాగమతిగా రౌద్ర రసాన్ని కూడా అద్భుతంగా పలికించింది. (సాక్షి రివ్యూస్)భాగమతి గెటప్ లో అనుష్క మరోసారి అరుంధతి సినిమాని గుర్తు చేసింది. మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్‌గా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జయరామ్ నటన ఆకట్టుకుంటుంది. హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా తనదైన హావ భావాలతో మెప్పించాడు . సీబీఐ జేడీ పాత్రలో ఆశా శరత్ నటన బాగానే ఉన్నా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న నటి కాకపోవటంతో అంతగా కనెక్ట్ కాలేదు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, ధనరాజ్, విధ్యుల్లేఖ రామన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : గత ఏడాది చిత్రాంగద లాంటి థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్ ఈ ఏడాది, అనుష్క లీడ్ రోల్ లో తెరకెక్కిన భాగమతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే భారీ ప్రచారం లభించటంతో అదే స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఆ అంచనాలు అందుకునే స్థాయి భాగమతిని తీర్చి దిద్దాడు అశోక్. భారీ కథ కాకపోయినా.. అద్భుతమైన టేకింగ్, థ్రిల్లింగ్ విజువల్స్‌లో ఆడియన్స్‌ను కట్టి పడేశాడు. ముఖ్యంగా భాగమతి బంగ్లాలో జరిగే సన్నివేశాలు వావ్ అనిపిస్తాయి. ఆడియన్స్‌కు షాక్ ఇచ్చే ట్విస్ట్‌లు కూడా చాలానే ఉన్నాయి. ఒక దశలో అనుష్క విలనేమో అనేంతగా కథను మలుపు తిప్పాడు దర్శకుడు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పార్ట్ లు పార్ట్ లుగా రావటం. కొన్ని జరగని సంఘటనలు జరిగినట్టుగా భ్రమ కలిగించటంతో ఆడియన్స్ కాస్త తికమక పడే అవకాశం ఉంది. (సాక్షి రివ్యూస్) సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. మది సినిమాటోగ్రాఫి కూడా సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నేపథ్య సంగీతం అనుష్క నటన మైనస్ పాయింట్స్ : అక్కడక్కడ తికమక పెట్టే కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఆమె లేకపోతే భాగమతి లేదు
‘‘భాగమతి’ కథను 2012లో యూవీ క్రియేషన్స్ వారికి చెప్పాను. తర్వాత ప్రభాస్‌కి వినిపించాను. ఆ తర్వాత అనుష్కకి చెప్పా. అందరికీ కథ నచ్చడంతో చేద్దామని డిసైడ్ అయ్యాం. అలా ఈ ప్రాజెక్ట్ కుదిరింది’’ అని దర్శకుడు జి.అశోక్ అన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► ఇదొక యూనివర్శల్ సబ్జెక్ట్. ఏ నేపథ్యానికైనా సరిపోతుంది. కోలీవుడ్.. మాలీవుడ్.. బాలీవుడ్... ఇలా ఏ ఇండస్ట్రీలో చేసినా హిట్టవుతుంది. ఇందులో కథ ప్రతి చోటా జరిగేదే.. అందరికీ పరిచయమైనదే. ► ‘బాహుబలి’ మొదటి పార్ట్ షూటింగ్‌కు వెళ్లకముందే అనుష్క ‘భాగమతి’ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే.. ‘బాహుబలి’ కమిట్మెంట్ వల్ల చాలా రోజులు ఆగాల్సి వచ్చింది. మధ్యలో రెండు సార్లు ‘భాగమతి’ మొదలుపెడదామని ప్రయత్నించినా కుదరలేదు. ► ‘భాగమతి’ పాట్రన్ క్యారీ చేయాలంటే ఒక స్టేచర్ ఉండాలి. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండాలి. అవి రెండూ అనుష్కలో కనిపించాయి. అందుకే.. ఆమె తప్ప ఈ కథకి ఎవరూ న్యాయం చేయలేరనే ఇన్నేళ్లు ఆగాను. ఆమె లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు అనుష్క. ఎడమ చేతి భుజానికైన గాయం బాధపెడుతున్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొన్నారు. ► ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కాదు. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఈ సినిమాకు అదే బలం. ఈ చిత్రంలోని బంగ్లా సెట్ కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ దాని చుట్టూ తిరుగుతుంది. తొలుత నార్మల్‌గా వేద్దామనుకున్నాం. అది సరిపోదని భారీగా వేశాం. 75 శాతం సినిమా కోట సెట్లోనే జరుగుతుంది. ► ప్రస్తుతానికి నా దృష్టంతా ‘భాగమతి’ పైనే ఉంది. అందుకే ఇంకా కొత్త ప్రాజెక్టులేవీ అనుకోలేదు. ‘భాగమతి’ విడుదల తర్వాత ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. అన్నీ పూర్తయ్యాక తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తా. -
అరుంధతిలా భాగమతి హిట్ కావాలి – అల్లు అరవింద్
‘‘భాగమతి’ ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తే కాస్త భయమేసింది. ఏడాదికిపైగా ఈ సినిమా తీస్తున్నారు. అనుష్కకి ఉన్న ఏకైక లక్షణం.. ఓపిక చాలా ఎక్కువ. ఇండస్ట్రీలో అది ఎవరికీ లేదు. ఆ విషయాన్ని ‘అరుంధతి’ చిత్రంతో నిరూపించుకున్నారు. ఆ సినిమాలా ‘భాగమతి’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. అనుష్క టైటిల్ రోల్లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ‘భాగమతి’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు అశోక్ మాట్లాడుతూ– ‘‘గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఈ రెండూ సమాంతరంగా నడుస్తుంటాయి. తను గెలుస్తూ.. తన చుట్టూ ఉన్నవారిని గెలిపిద్దాం అని ఎవరైనా ఆలోచిస్తే.. అతనిలో దైవత్వం మొదలైనట్లు. అలాంటి దేవుడైన ప్రభాస్ ముందు ఈ కథ విని, ఇక్కడిదాకా నడిపించారు. వంశీ, ప్రమోద్, విక్కీగారు త్రిమూర్తులు. వీరితో ఐదేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. సినిమాను బిడ్డలా చూసుకున్నారు. ‘భాగమతి’ కోసం అనుష్క విపరీతమైన డస్ట్‌లో 45 రోజులు పని చేశారు’’ అన్నారు. ‘‘2012లో ‘భాగమతి’ కథ వినగానే నచ్చిందన్నా. కానీ, డేట్స్ లేకపోవడంతో చేయలేనని చెప్పా. ఈ సినిమా నేను కాకుండా వేరే ఎవరైనా చేసి ఉంటే బాధపడేదాన్ని. ఎందుకంటే నా హృదయానికి బాగా దగ్గరైన కథ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అనుష్క. ‘‘నాతో ‘పిల్లజమీందార్’ చేసిన తర్వాత అందరూ ఆశోక్‌ను ‘పిల్లజమీందార్ అశోక్’ అని పిలుస్తున్నారు. జనవరి 26 తర్వాత అందరూ ‘భాగమతి అశోక్’ అని పిలుస్తారు. ఈ ఏడాది టాలీవుడ్‌కి సరైన హిట్ పడలేదు. ‘భాగమతి’తో ఆ హిట్ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు హీరో నాని. ‘‘సాధారణంగా నటీనటులు, దర్శకులకు అభిమానులుంటారు. కానీ, నిర్మాతలకు ఉండరు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు అభిమానులుంటారు’’ అన్నారు దర్శకుడు మారుతి. దర్శకులు మేర్లపాక గాంధీ, రాధాకృష్ణ, నటులు ప్రభాస్ శ్రీను, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలి బెస్ట్ ఫ్రెండ్... భల్లాలదేవ బ్రదర్
... ఇదిగో ఇలాగే చెప్పారు దేవసేన. అదేనండీ అనుష్క. అదేంటీ? దేవసేన మీద భల్లాలదేవుడు (రానా) పగ సాధించాలనుకున్నాడు కదా! బాహుబలి (ప్రభాస్)తో దేవసేన వివాహం అయ్యింది కదా అంటే.. అవును. అవి రీల్ లైఫ్ క్యారెక్టర్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ రియల్ లైఫ్‌లో ప్రభాస్, రానా, అనుష్కల బాండింగ్ వేరు. ఆ అనుబంధం గురించి అనుష్క స్వయంగా చెప్పారు. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ‘భాగమతి’లో అనుష్క టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. చెన్నైలో జరిగిన తమిళ ‘భాగమతి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుష్క కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ‘‘రానా నన్ను బ్రదర్ అని పిలుస్తాడు. నేనూ తనని అలాగే పిలుస్తాను. ప్రభాస్ నాకు బ్రదర్ కాదు. బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అయినా అందరూ బ్రదర్స్ అవ్వాలనేం లేదుగా?’’ అన్నారామె. పెళ్లి గురించి మాట్లాడుతూ – ‘‘పెళ్లి గురించిన ఆలోచన ప్రస్తుతానికి లేదు. మీకు తెలిసిన అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పండి. (నవ్వుతూ). నా నెక్ట్స్ సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఉండొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో మరోసారి నటించాలని ఉంది’’ అన్నారు అనుష్క. భాగమతి సినిమా గురించి చెబుతూ– ‘‘ఇందులో సంచల అనే ఐఏఎస్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను. నిజానికి ఈ కథను నేను 2012లో విన్నా. కానీ లింగా, సైజ్ జీరో, బాహుబలి 1 అండ్ 2 సినిమాలను ముందు కమిట్ అయ్యాను. సో.. మేకర్స్ నాకోసం ఫోర్ ఇయర్స్ వెయిట్ చేశారు. ‘భాగమతి’ ట్రూ స్టోరీ కాదు. ఫిక్షన్. దర్శకుడు అశోక్ సినిమాను బాగా తీశారు’’ అన్నారు. -
ఇది భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి
‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వను’ అంటూ అనుష్క చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌తో రిలీజైంది ‘భాగమతి’ట్రైలర్. అనుష్క టైటిల్ రోల్లో ‘పిల్ల జమీందార్’ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం ‘భాగమతి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ సినిమాతో సూపర్ ఫామ్‌లో ఉన్న అనుష్కతో ‘భాగమతి’ చిత్రం నిర్మించినందుకు గర్వంగా ఉంది. అనుష్క నటన ఈ సినిమాకు హైలైట్. ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అద్భుతమైన కథని అంతే అద్భుతంగా అశోక్ తెరకెక్కించారు. ‘భాగమతి’ కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాయి. కథకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. తమన్ పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్’’ అన్నారు. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: మథి. -
డబుల్ అనుష్క
న్యూ ఇయర్ సందర్భంగా ‘భాగమతి’ చిత్రబృందం అనుష్కకు సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేసింది. వీరోచిత పోరాట పటిమను ప్రదర్శిస్తున్న ఓ వీర వనిత చిత్రపటం వైపు తదేకంగా చూస్తున్నారు అనుష్క. ఎప్పటి నుండో సమాధానం తెలియని ఓ ప్రశ్నను అన్వేషిస్తున్నట్టున్నాయి ఆమె చూపులు. విశేషం ఏంటంటే ఆమె చూస్తున్న ఆ చిత్రపటంలో ఉన్న వీరనారి కూడా అనుష్కే. అంటే... ‘భాగమతి’లో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నారా? ఇంతకీ వీళ్లిద్దరికి మధ్య ఉన్న బంధం ఏంటీ? ఆమె వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం తెలిసిందా? వీరిలో భాగమతి ఎవరు? వీటన్నింటికి సమాధానం తెలియాలంటే మాత్రం ఈనెల 26 వరకు ఆగాల్సిందే. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ సినిమాకు జి.అశోక్ దర్శకత్వం వహించారు. యూవీ క్రి యేషన్స్ పతాకం పై వంశీ–ప్రమోద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: మది. -
స్వీటీ డిఫరెంట్
ఎప్పటి నుంచో ఉపయోగంలో లేని పాడుబడ్డ భవంతి అది. అందులోకి వెళ్లాంటే గుండె నిండా ఖలేజా కావాలి. ఓ రోజు మెరుపుల శబ్దాల మధ్య ఆ భవంతి తలుపులు తెరుచుకున్నాయి. వెలుగును వెంబడిస్తూ భయంతో వడివడిగా అడుగులు వేస్తున్న ఒకరి చూపులు దేన్నో ఆత్రుతగా వెతుకున్నాయి. అంతే.. హఠాత్తుగా పెద్ద శబ్దం. దేన్నో వెతుకున్న ఆ మనిషి చేతిలోని టార్చ్‌లైట్ వెలుగు గోడపై ఫ్లాష్ అయ్యింది. కట్ చేస్తే.. ఓ అమ్మాయి. చేతిలో మేకును సుత్తితో బలంగా కొట్టుకుంది. ఆ అమ్మాయి తనని తాను ఎందుకలా శిక్షించుకుంది? బుధవారం రిలీజైన ‘భాగమతి’ టీజర్ కహానీ ఇది. అసలు కహానీ ఏంటో వెయిట్ అండ్ సీ. టైటిల్ రోల్లో అనుష్క నటించిన ఈ చిత్రాన్ని అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. జనవరి 26న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. భాగమతికి బాహుబలికి కితాబు ప్రభాస్ – అనుష్క కలసి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అందుకే స్వీటీ (అనుష్క ముద్దు పేరు)ని అభినందించారు ప్రభాస్. ‘‘డిఫరెంట్‌గా ట్రై చేయడంలో అనుష్క ఫస్ట్ లేడీ. ప్రతి సినిమాలోనూ ఆమె క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. గుడ్‌లక్ టు స్వీటీ అండ్ యూవీ క్రియేషన్స్ టీమ్’’ అంటూ ప్రభాస్ తన ఫేస్బుక్ ఖాతాలో ‘భాగమతి’ టీజర్‌ను పోస్ట్ చేశారు. -
ఆ థీమ్ మ్యూజికే హైలెట్..!
బాహుబలి సీరీస్ లో దేవసేనగా అలరించిన స్వీటీ అనుష్క, త్వరలో భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ భాగమతి లుక్ లో ఎలా కనిపించనుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. స్వీటీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ బుధవారం భాగమతి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. టీజర్ లో హామర్ (సుత్తి) థీమ్ హైలెట్ గా నిలవనుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫస్ట్ లుక్ లో అనుష్క చేతిలో సుత్తి పట్టుకొని కనిపించింది. ఇప్పుడు టీజర్ లోనూ అనుష్క అదే లుక్ లో కనిపించనుంది. #TholipremaTeaser #bhaagamathieteaser Both r coming tom morning !! Wat a start mama !! #themeoftholiprema ♥️ with Lyrics By @ManiShreewriter amazingly sung by @kaalabhairavudu Followed by #thehammertheme 🔨 for #bhaagmathie From the heart to U all Let’s do the kicking pic.twitter.com/NFSJKizCK7 — thaman S (@MusicThaman) 19 December 2017 So proud and happy to score for this !! #hammertheme from the score of #bhaagamathie will be on the teaser which is releasing tom !! Can’t wait u guys to listen to IT !! @UV_Creations u guys r the best ♥️#hammertheme 🔨 #bgm Godbless Thaman pic.twitter.com/XXIONRpRUB — thaman S (@MusicThaman) 19 December 2017 -
స్వీటీ ఫ్యాన్స్‌కి స్వీట్ న్యూస్
స్వీటీ అంటే అనుష్క అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బొమ్మాళి ముద్దు పేరు స్వీటీ అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. స్వీటీ ఫ్యాన్స్‌కి ఓ న్యూ ఇయర్ గిఫ్ట్. ‘బాహుబలి’లో దేవసేనగా కనిపించిన అనుష్క త్వరలో భాగమతిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ‘పిల్ల జమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తోన్న చిత్రం ‘భాగమతి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. టీజర్‌ను ఈ నెలాఖరుకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అంటే... న్యూ ఇయర్ గిఫ్ట్ అన్న మాట. జనవరి 26న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేయటానికి హైదరాబాద్‌కు చెందిన నాలుగు కంపెనీలతో సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్ చేయిస్తున్నారట. -
భాగమతి కమింగ్
డిసెంబర్లో రిలీజ్ చేస్తారా? గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయట కదా.. డిసెంబర్లో కష్టం. సంక్రాంతికి రేస్‌లో ఉంటుందేమో? ఊహూ.. సమ్మర్‌కి వస్తుందేమో? – ఇదిగో ఇలాంటి చర్చలే ‘భాగమతి’ సినిమా రిలీజ్ గురించి ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి. ఆ చర్చలకు ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే... ‘భాగమతి’ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క ముఖ్యపాత్రలో రూపొందుతున్న సినిమా ‘భాగమతి’. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆషా శరత్, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘సూపర్‌ఫామ్‌లో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భాగమతి’ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్‌కి వచ్చిన స్పందన చిత్రబృందానికి మంచి ఎనర్జీ ఇచ్చింది. దర్శకుడు అశోక్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అనుష్క నటన సినిమాకు హైలైట్. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. తమన్ సంగీతం సూపర్. సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
అనుష్క స్లిమ్ లుక్ గ్రాఫిక్సేనా..!
సైజ్ జీరో సినిమా కోసం లుక్ విషయంలో రిస్క్ చేసిన అనుష్క, కెరీర్ ను కష్టాల్లో పడేసుకుంది. ఈ సినిమా కోసం బొద్దుగా తయారైన స్వీటీ తరువాత స్లిమ్ అయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాల్లో అనుష్క లుక్‌పై విమర్శలు వచ్చాయి. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి 2లో అనుష్క స్లిమ్‌గా చూపించేందుకు గ్రాఫిక్స్ వినియోగించారన్న ప్రచారం జరిగింది. బాహుబలి 2 తరువాత భాగమతి షూటింగ్ లో బిజీ అయ్యింది అనుష్క. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లో అనుష్క స్లిమ్‌గా దర్శనమిచ్చింది. దీంతో అనుష్క తిరిగి స్లిమ్ లుక్ లోకి వచ్చేసిందంటూ స్వీటీ ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అదే సమయంలో భాగమతి ఫస్ట్ లుక్‌లో అనుష్కను స్లిమ్ గా చూపించేందుకు గ్రాఫిక్స్ వినియోగించారన్న ప్రచారం జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న కొన్ని ఫొటోలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా భాగమతి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న హాస్యనటి విధ్యుల్లేక రామన్ ఆన్‌లోకేషన్ ఫొటోలను ట్వీట్ చేసింది. ఈ ఫొటోలలో అనుష్క కాస్త బొద్దుగానే కనిపిస్తోంది. దీంతో ఫస్ట్ లుక్‌లో అనుష్క స్లిమ్ గా కనిపించటం గ్రాఫిక్స్ వల్లే సాధ్యమయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Happiest birthday to a lovely friend, human being and fellow scorpion! Much love to you Sweety! #Bhaagamathie #HBDAnushkaShetty pic.twitter.com/uSu2EAFOw4 — Vidyu (@VidyuRaman) 7 November 2017 -
భాగమతీ... ఏంటిది?
...తప్పదు మరి! ‘భాగమతి’ చేసిన పని చూస్తే ఆ ప్రశ్నే వేయాలన్పించింది. ఎవరైనా తమకు తామే ఓ చేత్తో సుత్తి పట్టుకుని, మరో చేతిని గోడపై పెట్టి మేకు కొట్టుకుంటారా? ‘భాగమతి’ అంత పని చేసింది! శిక్ష విధించుకుంది. ఎందుకలా చేసింది? అంటే... త్వరలో తెలుస్తుంది! అనుష్క ముఖ్యతారగా నటిస్తున్న సినిమా ‘భాగమతి’. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సిన్మా ఫస్ట్ లుక్‌నే మీరు చూస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో లుక్ విడుదల చేశారు. లుక్‌లో గోడపై గమనిస్తే... సంకెళ్లతో మహిళ కాళ్లు ఉన్నాయ్ చూశారా? ఆమె ఆత్మ ‘భాగమతి’ అలియాస్ అనుష్కలో ప్రవేశించిందా? ఏమో? టీజర్ లేదా ట్రైలర్స్ వస్తే తెలుస్తుందేమో! ‘‘అనుష్క నటనలో మరో కోణాన్ని చూపించే చిత్రమిది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు అందర్నీ ఎంటర్టైన్ చేస్తాయి’’ అన్నారు దర్శకుడు. ‘‘అనుష్క నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అద్భుతమైన కథ. దర్శకుడు అశోక్ చెప్పినదానికంటే బాగా తీశాడు. తమన్ మ్యూజిక్, రవీందర్ సెట్స్, మధి సినిమాటోగ్రఫీ హైలైట్స్’’ అన్నారు నిర్మాతలు. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు. -
వన్ మోర్!
టాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు కథానాయిక అనుష్క. ‘అరుంధతి’, ‘పంచాక్షరి’, ‘బాహుబలి’ సినిమాల్లో ఆమె పవర్ఫుల్ రోల్స్ చేశారు. త్వరలో విడుదల కానున్న ‘భాగమతి’ కూడా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ చిత్రంలో అనుష్క నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో విడుదలైంది. గౌతమ్ మీనన్‌తో వన్ మోర్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చే చాన్సుందని వినికిడి. అదే నిజమైతే అతడితో అనుష్కకు ఇది రెండో సినిమా. ఇక, ‘భాగమతి’ విషయానికొస్తే... షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ నెల 7న అనుష్క బర్త్‌డే. ఆ సందర్భంగా ఆమె లుక్‌ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట.