Booster Dose
-
కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను మాములుగా హడలెత్తించలేదు. అది పెట్టిన భయం అంత ఇంత కాదు. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ మార్పు చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్‌తో ఎంతలా భయబ్రాంతులకు గురించేసిందో తెలిసిందే. ఎటూ చూసిన ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. క్రమేణ ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించనంత స్థాయిలో మాయం అయ్యింది కూడా. హమ్మాయా! అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 హడలెత్తిస్తోంది. ఒకటో రెండో కేసులే కదా అనకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇది వరకటి పరిస్థితికే చేరుకుంటామా? అని గుబులు తెప్పించేస్తుంది. ఇప్పటికే నిపుణుల భయపడొద్దని సూచిస్తూ మరోవూపు మాస్క్‌లు సామాజిక దూరం అని చెబుతుంటే మళ్లీ టెన్షన్.. టెన్షనే..అని భయాందోళనకు గురవ్వుతున్నారు. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే వైద్యులు ఏమంటున్నారంటే.. ఈ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే గత నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా వ్యాక్సినేషన్లు వేశారు. 95% మంది తొలి రెండు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా, సుమారు 25% మంది బూస్టర్ డోస్‌లను కూడా వేయించుకున్నారు. మరీ ఇప్పుడూ ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్ డోస్లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా? అని పలువురిని వేధిస్తున్న సందేహం. అయితే నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గానీ మరో బూస్టర్ తీసుకోవద్దదని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంత్లాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లో ఉండటం వంటివి చేయాలని సూచించారు. మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా..? ఐతే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారుఉన్నారని అన్నారు నిపుణులు. అలాగే రెండు సార్లు కరోనాని ఫేస్ చేసిన వారకు కూడా ఉన్నారు. అయితే వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు, పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 దగ్గరకొచ్చేటప్పటికీ.. రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవికూడా తేలికపాటి లక్షణాలే అని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ నాలుగైదు రోజుల్లో నయం అయిపోతుంది. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి, లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి, వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ప్రమాదకారి కావొచ్చు కాబట్టి వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు సరిగా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్నా..అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్‌డోస్ లేదు రెండు వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. ఐతే కొద్దిమంది ఆరోగ నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్‌లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. మళ్లీ వేయించుకుంటే మంచిదేనా..? అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్‌ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం. కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిదా? కాదనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు పరిశోధకులు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న రోగులకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. (చదవండి: ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?) -
Karnataka election results 2023: హస్తానికి బూస్టర్ డోసు
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన అఖండ విజయం కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. కీలకమైన రాష్ట్రంలో పాగా వేయడంతో పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలాఏళ్లుగా గెలుపు రుచి లేకుండా నీరసించిపోయిన కాంగ్రెస్‌కు ఇది నిజంగా ఒక బూస్టర్ డోసు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేయనుంది. కేంద్రంలో అధికార బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న ప్రశ్నకు కొంతవరకు సమాధానం దొరికినట్లే. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సాకారం కావడం లేదు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అనే ప్రయత్నాలకు బ్రేక్ పడొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో విజయం నేపథ్యంలో ఇతర పార్టీలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఏకైక విపక్ష కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు. ఇక నాలుగు రాష్ట్రాలపై గురి లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసం నుంచి ఆయనను బలవంతంగా ఖాళీ చేయించడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి కలిగించాయి. రాహుల్ బీసీల వ్యతిరేకి అంటూ బీజేపీ చేసిన ప్రచారం ఫలించలేదు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కర్ణాటకలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితోనే ఎక్కువగా ప్రచారం చేయించడం కాంగ్రెస్‌కు లాభించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 15కు పైగా సీట్లు సాధించింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ ఏడాది తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ నెగ్గడంతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కర్ణాటకలో విజయంతో ఆ పార్టీ ఇక మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఈ గెలుపు జాతీయ స్థాయిలో తమ పార్టీ పునర్వైభవానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. -
తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ బూస్టర్ డోసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి(బుధవారం) నుంచి కోవిడ్ బూస్టర్ డోసుల పంపిణీ ప్రారంభించనుంది ప్రభుత్వం. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా వెళ్లిన వారికి ముందు వ్యాక్సిన్ ఇచ్చేలా వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఐదు లక్షల కార్బోవ్యాక్స్ డోసుల్ని సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో అందుబాటులో ఈ బూస్టర్ డోసుల్ని ఉంచనుంది. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. హైదరాబాద్‌లో తాజాగా 21 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మొదటి రెండు డోసులు కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ తీసుకున్నా.. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్‌ను తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. అందరికీ మూడో బూస్టర్ డోసు అందుతుందని అధికారులు అంటున్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ సమాంతరంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..! -
కోవిడ్ ఫ్రీ బూస్టర్ డోస్‌లు నిల్.. కొనుక్కోవాల్సిందే!
చైనాలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అందులో భాగంగా కోవిడ్ బూస్టర్ డోస్‌లను త్వరిగతిన తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది. ఐతే 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందిచ్చే కోవిడ్ బూస్టర్ డోస్‌లు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లేవని, కనీసం దేశ రాజధాని ఢిల్లీలో సైతం తగినంత మొత్తంలో అందుబాటులో లేవని సమాచారం అలాగే సుమారు రూ. 400లు వసూలు చేసి బూస్టర్ డోస్‌లు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి గానీ అవికూడా రానున్న కొద్ది రోజుల్లో అయిపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే అధికారిక లెక్కల ప్రకారం కోవిన్ వెబ్ పోర్టల్‌లో కూడా ఎన్నో బూస్టర్ డోస్‌లు అందుబాటులో లేవని స్పష్టంగా చెబుతోంది. ఐతే కొన్ని ప్రైవేట్ సెంటర్లో మాత్రం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ప్రభుత్వం మాత్రం చైనా మాదిరిగా కేసులు పెరగకుండా ప్రజలను సత్వరమే బూస్టర్ డోస్‌లు తీసుకోమని చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, దేశంలో సాధారణ టూ డోస్ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు 90 శాతం మంది తీసుకోగా, బూస్టర్ డోస్‌ను ఢిల్లీలో కేవలం 20 శాతం మంది తీసుకోగా, భారత్ అంతటా 30 శాతం మంది తీసుకున్నారు. ప్రజలంతా కూడా వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యంతో ధీమాగా ఉన్నారని కేంద్రం నొక్కి చెబుతోంది. అయినప్పటికీ అవగాహన డ్రైవ్‌లను నిర్వహించమని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం భారత్‌లో కేసుల తక్కువుగానే ఉన్నాయని, సగటున 200 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. (చదవండి: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!) -
బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందన్న భయాల వేళ మరో టీకా అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో నాసల్ వ్యాక్సిన్ ధరను మంగళవారం ప్రకటించింది భారత్ బయోటెక్. ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు టీకా ధర రూ.800(పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది ఈ నాసల్ వ్యాక్సిన్. ‘ఇంకోవాక్’(iNCOVACC)గా పిలిచే ఈ నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా ఇప్పటి నుంచే స్లాట్స్ బుక్సింగ్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకోవాక్ నాసల్ టీకాను బూస్టర్‌గా పొందవచ్చు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బీబీవీ154గా పిలిచే ఈ నాసల్ టీకా ఇంకోవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రాథమిక, బూస్టర్ డోసు కోసం అనుమతులు పొందిన ప్రపంచంలోనే తొలి నాసల్ వ్యాక్సిన్‌గా ఇంకోవాక్ నిలిచినట్లు పేర్కొంది భారత్ బయోటెక్. ఇదీ చదవండి: Corona New Variant BF.7: కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే? -
కోవిడ్ భయాలు: తెలంగాణలో బూస్టర్డ్రైవ్.. ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు తక్షణమే బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేపడతారు. అందుకు సంబంధించి జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. మొత్తం 1,571 కేంద్రాలలో ప్రత్యేకంగా బూస్టర్‌డోసు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. రద్దీ ప్రాంతాల్లో మొబైల్వ్యాక్సినేషన్జరగనుంది. మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర కేంద్రాల వద్ద ప్రత్యేక వాహనాల్లో టీకాల పంపిణీ చేస్తారు. 50 మందికి మించి, ముందస్తు విజ్ఞప్తి చేస్తే, వారికి ఆ మేరకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 1.60 కోట్ల మంది బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంది. అలాగే 9 లక్షల మంది రెండో డోస్ టీకా వేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా రెండో డోసు, బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్దఎత్తున ప్రజలు తరలివస్తే ప్రస్తుతం ఉన్న టీకాలు సరిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే కరోనా టీకాలు సరఫరా చేయాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విన్నవించిన సంగతి తెలిసిందే. కొత్తగా 12 కరోనా కేసులు రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన 4,367 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 12 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఆరుగురు కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 65 యాక్టివ్ కేసులున్నాయి. -
Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. చైనాలో అలా ఎందుకంటే? చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్ పాలసీతో అక్కడ కఠినమైన లాక్డౌన్ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వాతావరణం కూడా.. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్–7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. రెండు మూడు నెలల క్రితమే.. మన దేశంలో బీఎఫ్–7 వేరియంట్ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. -
Covid-19 Fourth Wave: చైనాలో కరోనా కల్లోలం.. ‘మనకు ముప్పు లేదు’
చైనాలో కరోనా కల్లోలం భారత్‌లోనూ భయభ్రాంతులకు కారణమవుతోంది. దేశంలో నాలుగో వేవ్ మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బిఎఫ్.7 చైనా, అమెరికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తూండడంతో కేంద్రం అప్రమత్తమై కరోనా నిబంధనల్ని పాటించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే చైనాతో పోల్చుకుంటే మనకు ప్రమాదం దాదాపుగా ఉండదని అంటువ్యాధి నిపుణులు భరోసా ఇస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలతో ఈ వేరియెంట్‌ను కూడా సులువుగా ఎదుర్కోవచ్చంటున్నారు. మనకి ఫోర్త్ వేవ్ ముప్పు పెద్దగా ఉండకపోవడానికి గల కారణాలేంటో చూద్దాం... కరోనా వ్యాక్సినేషన్ భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా జరిగింది. కరోనా సోకిన తొలి రోజుల్లో కేంద్రం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూసింది. అత్యధికులు రెండు డోసుల్ని తీసుకుంది. అక్టోబర్ నాటికి 220 కోట్ల వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. మనం అధికంగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎక్కువ మంది తీసుకుంటే, చైనా అచేతన వైరస్‌తో తయారు చేసిన కరోనా వాక్, సినోఫామ్ వ్యాక్సిన్లు ఇచ్చింది. కరోనా వేరియెంట్లను ఎదుర్కోవడంలో ఇవి విఫలమవుతున్నాయని అంటున్నారు. అత్యధికులకు కరోనా కరోనా మహమ్మారి మొదలైన దగ్గర్నుంచి భారత్‌లో ఇప్పటి వరకు 4.5 కోట్ల కేసులు నమోదయ్యాయి. కరోనాలో ఉన్న అన్ని వేరియెంట్లు దాదాపుగా భారత్‌లో వ్యాపించడంతో ప్రజలందరిలోనూ ఈ వేరియెంట్లను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి బలపడింది. అదే చైనాలో ఇప్పటివరకు ఏ వేరియెంట్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. జీరో కోవిడ్ విధానం కారణంగా ఇప్పటివరకు 20 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో అధిక శాతం ప్రజల్లో కరోనా వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు ఉత్పన్నం కాలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ సెప్టెంబర్ నుంచే బీఎఫ్.7 కేసులు మన దేశంలో ఒమిక్రాన్ ఉపవేరియెంట్ బీఎప్.7 కేసులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చాయి. కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పటికే భారత్‌లో తొలి వేవ్ 2020 ఆగస్టు–సెప్టెంబర్‌లో సార్స్–కోవ్–2తో చాలా ఇబ్బందులు పడ్డాం. 2021 ఏప్రిల్–మే నెలల్లో సెకండ్‌వేవ్‌లో డెల్టా వేరియెంట్ దేశాన్ని వణికించింది. మందులకి, ఆక్సిజన్‌కి కరువు వచ్చి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ కాస్త తక్కువ ప్రభావాన్నే చూపించింది. అందుకే ఈ సబ్ వేరియెంట్ ఏమంత ప్రభావం చూపించదని ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసులు ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభించారు. జనాభాలో 28% మందివరకు బూస్టర్ డోసులు తీసుకున్నట్టు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. చైనాలో 50% మంది బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ 80 ఏళ్లకు పైబడిన 90 లక్షల మంది తీసుకోలేదు. వారికే ఎక్కువగా వైరస్ సోకడం గమనార్హం. మన దేశంలో ప్రజలు కూడా బూస్టర్ డోసులు తీసుకుంటే మంచిదని వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంత్ సూచించారు. బూస్టర్ డోసు వేరే కంపెనీది తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితేమిటి? మన దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజుకి సగటున 150 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అదే మిగిలిన ప్రపంచ దేశాల్లో రోజుకి సగటున 5.9 లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వేరియెంట్లు అన్ని దేశాలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపించడం లేదు. ఎక్స్ఎక్స్బీ వేరియెంట్‌తో మన దేశంలో కేసులు 8% నుంచి ఒకానొక దశలో 69శాతానికి చేరినప్పటికీ ఆ తర్వాత వ్యాప్తి తగ్గిపోయింది. నవంబర్ 10న అత్యధికంగా 4,500 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వేరియెంట్ కూడా ప్రమాదకరం కాదని తేలిపోయింది. -
పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: చైనా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని, టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో ఫిబ్రవరి వరకు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని... అప్పటివరకు జాగ్రత్తలు పాటిస్తే మార్చి నుంచి ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ మేరకు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి మహమ్మారి (పాండెమిక్) దశ నుంచి స్థానికంగా సోకే (ఎండెమిక్) వ్యాధి దశకు తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అందుకే అది కొన్ని దేశాల్లోనే వెలుగుచూస్తోందని, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీని పాటించారని... సుమారు 70 శాతం మందికి టీకాలు వేయలేదని... వ్యాక్సినేషన్లో చైనా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... జాగ్రత్తలు పాటి స్తే సురక్షితంగా ఉండొచ్చన్నారు. పండుగలు, పెళ్లిళ్ల సందర్భంలో ప్రజలు మాస్క్‌లు ధరించాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. దేశంలో కేవలం 28 శాతం మందే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, మిగిలినవారు వెంటనే తీసుకోవాలన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 6 నెలల్లో బూస్టర్ తీసుకోవాలని, ఏడాదైనా పరవాలేదని.. ఆలస్యమైతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. వరుసగా మూడేళ్లపాటు బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదన్నారు. బీఎఫ్–7 ప్రమాదకరం కాదు... ‘దేశంలో ఒమిక్రాన్ రకానికి చెందిన ఎక్స్‌బీబీ వైరస్ 80 శాతం ఉంది. బీఎఫ్–7 వేరియంట్ అక్టోబర్‌లోనే భారత్‌లోకి వచ్చింది. కానీ 10 కేసులే నమోదయ్యాయి. అది పెద్దగా మనపై ప్రభావం చూపలేదు. హైదరాబాద్‌లో ఎక్స్‌బీబీ వైరస్ కేసులు 60 శాతం ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్‌లో బీఎఫ్–7 కేసులు ఎక్కువగా ఉన్నాయి. బీఫ్–7 వైరస్ ఒకరికి వస్తే వారి ద్వారా 10 మందికి వ్యాపిస్తుంది. అదే ఒమిక్రాన్ ఒకరికి వస్తే ఐదుగురికి వ్యాపిస్తుంది. బీఎఫ్–7 డెల్టా అంత ప్రమాదకరమైంది కాదు. బీఎఫ్–7 రకం వైరస్ గొంతు, నోటి వరకే వెళ్తుంది. రోగనిరోధకశక్తి తక్కువున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్ వెళ్లే ప్రమాదముంది. వారికి సీరియస్ అయ్యే అవకాశముంది’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్... ‘దేశంలో మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్... వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. రెండు కోవాగ్జిన్... ఇన్‌యాక్టివేటెడ్ వ్యాక్సిన్. మూడోది కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్. ఇది పెపిటైట్ ఆధారిత టీకా. ఈ ఏడాది జనవరిలోనే కార్బెవ్యాక్స్ వచ్చింది. జూన్‌లో దానికి బూస్టర్‌గా అనుమతి లభించింది. కార్బెవ్యాక్స్ చాలా సురక్షితమైనది. వ్యాక్సిన్లను దశలవారీగా వేర్వేరు కంపెనీలవి వేసుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్ వేసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. దీనిపై మేం అధ్యయనం చేశాం. కార్బెవ్యాక్స్ 95 శాతం సామర్థ్యంతో కూడినది. దీన్ని వేసుకుంటే కరోనా గురించి మనం మరిచిపోవచ్చు. ఇతర వ్యాక్సిన్లతో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. -
కరోనాపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచాలి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఏమరుపాటు వద్దు కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. 24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్‌లు విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్‌పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది. ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్ కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్‌సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు. -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ రెడీ!
పలు దేశాల్లో కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్ డోస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్ స్ప్రే) కోవిడ్ వ్యాక్సిన్‌ను త్వరలో దేశంలో బూస్టర్ డోస్‌గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్ డోస్ రిలీజ్చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్ వ్యాక్సిన్‌కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్ డోస్‌గా నాజల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాజల్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం? నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. #Breaking | Bharat Biotech’s nasal Covid vaccine to be rolled out as booster dose #6PMPrime #Covid #India | @Akshita_N @milan_reports pic.twitter.com/HutHQ7tLMj — IndiaToday (@IndiaToday) December 22, 2022 -
COVID-19 Vaccine: నోటి ద్వారా కరోనా టీకా.. ప్రపంచంలో ఇదే మొదటిది
బీజింగ్: సూది(సిరంజీ)తో అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకొనే కోవిడ్–19 టీకా చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా టీకా ప్రపంచంలో ఇదే మొదటిదని చెబుతున్నారు. టీకా తీసుకున్న తర్వాత 5 సెకండ్ల పాటు శ్వాస పీల్చుకోవడం ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ 20 సెకండ్లో పూర్తవుతుంది. ఈ టీకా తీసుకుంటే ఒక కప్పు టీ తాగినట్లే ఉందని షాంఘై వాసి ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇన్హేలర్ లాగా నోటి ద్వారా తీసుకొనే ఈ టీకాను బూస్టర్ డోసుగా ఉచితంగా ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సూదితో కంటే ఇది సులభంగా అందజేయవచ్చన్నారు. -
మరణించిన వ్యక్తికి.. బూస్టర్ డోస్
బయ్యారం(వరంగల్): మరణించిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మండల కేంద్రానికి చెందిన బొందలపాటి కృష్ణయ్య(87) అనారోగ్యంతో గత నెల 28న మృతి చెందాడు. అంతకుముందు కృష్ణయ్య సంగారెడ్డి జిల్లా పరిధిలో నివాసం ఉండేవారు. కోవిడ్ టీకా రెండు డోసులూ సంగారెడ్డి జిల్లా బానూర్ పీహెచ్సీ పరిధిలో వేసుకున్నాడు. అయితే ఈనెల 17న క్రిష్ణయ్యకు బూస్టర్‌డోస్ వేసినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై ఆన్లైన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పరిశీలించారు. అందులోనూ బూస్టర్‌డోస్ వేసినట్టు ఉంది. -
కోవిడ్ వ్యాక్సిన్‌పై మాట మార్చిన కేంద్రం.. తెరపైకి కొత్త కంపెనీ!
న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాలు తీసుకున్న వ్యక్తులు బూస్టర్ డోసుగా బయోలాజికల్–ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోర్బావ్యాక్స్ వ్యాక్సిన్ వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. ఇప్పటివరకు ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నామో బూస్టర్ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్ బూస్టర్ వేసుకోవాలని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చింది. కోవిడ్–19పై నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫార్స్ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఈ అనుమతులు మంజూరు చేసింది. కోవిషీల్డ్ లేదంటే కోవాగ్జిన్ తీసుకున్న ఆరు నెలలు లేదంటే 26 వారాల తర్వాత కోర్బావ్యాక్స్‌ను 18 ఏళ్లకు పైబడిన వారు బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. చదవండి: ధనికులకు మాఫీలు.. పేదలకు పన్నులు: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ -
Free Chhole Bhature: బూస్టర్ డోస్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్!
చండీగఢ్: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది కేంద్రం. అయితే.. ప్రజల నుంచి స్పందన లేకపోవటం వల్ల ఉచితంగా అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 రోజుల పాటు ఈ ఉచిత డోసులు అందిస్తామని తెలిపింది. మరోవైపు.. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు కొందరు తమ వంతుగా పాటుపడుతున్నారు. చండీగఢ్‌కు చెందిన స్ట్రీట్ వెండర్ ఉచితంగా ఛోల్ భతుర్(సెనగ మసాల పూరీ) టిఫిన్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నవారికేనని ఓ షరతు పెట్టారు. ఉత్తర భారతంలో చోల్ భతురే చాలా ఫేమస్. సెనగ మసాలా కర్రీతో పూరీని అందిస్తారు. ఈ స్నాక్స్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ స్ట్రీట్ ఫుడ్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు 45 ఏళ్ల సంజయ్ రాణా. చండీగఢ్‌లో తన ద్విచక్రవాహనంలో ఛోలో భతురేను విక్రయిస్తారు సంజయ్. గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. ‘అర్హులైన ప్రతిఒక్కురు ముందుకు వచ్చి మూడో డోసు తీసుకోవాలి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా పెరుగుతోంది. పరిస్థితులు చేతి నుంచి చేజారేవరకు ఎందుకు వేచి చూడాలి? ప్రికాషన్ డోసు వేసుకున్న రోజున తన వద్దకు వస్తే ఉచితంగా ఈ ఛోలో భతురేను ఇస్తున్నా.’ గత ఏడాది సైతం తొలి డోసు వేసుకున్న వారికి ఉచితంగా అందించారు సంజయ్. ఈ విషయాన్ని మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంజయ్ రాణాపై ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎలాగంటే -
ఉచిత బూస్టర్ డోస్ 24/7
సాక్షి, హైదరాబాద్: నగర వ్యాప్తంగా ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం ఊపందుకుంటోంది. గత ఏప్రిల్ 10 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్లు పైబడిన వారికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమం నిర్వహించగా, తాజాగా దీనిని 18 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా విస్తరించారు. రెండో డోస్ నుంచి 6 నెలల వ్యవధి వచ్చిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ టీకా అందించే ప్రక్రియను గత శుక్రవారం ప్రారంభించారు. నగర వ్యాప్తంగా మొత్తం 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం కొనసాగనుంది. ఆఫీసులు.. కళాశాలల్లోనూ.. ఇటీవల కోవిడ్ కేసులు పెరగడం, కొత్త వేరియంట్ల రాకపై అంచనాల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కోవాగ్జిన్, కోవిషీల్డ్ బూస్టర్డోస్లకు ఆర్డర్ ఇచి్చంది. ఇవి అందుబాటులోకి రావడంతో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో కూడా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలలోనూ ఏర్పాటు చేస్తున్నారు. గత శనివారం వరకూ వానల కారణంగా విద్యా సంస్థలు మూసి ఉండడంతో సోమవారం నుంచీ వీటి ఏర్పాటు మొదలైంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి స్పందన చాలా బాగుందని, తొలిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యవధి నిర్ణయించుకోగా లబి్ధదారులు పెరగడంతో రాత్రి 8 గంటల దాకా కూడా కొనసాగించామని సెంటర్ ఇన్చార్జి సుధా ఓంకార్ చెప్పారు. 20 వేలు దాటిన ఫ్రీ బూస్టర్ గత 15వ తేదీ నుంచి మంగళవారం దాకా 20,485 వరకు వ్యాక్సిన్లు అందించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో కాకుండా అభ్యర్థనను అనుసరించి 100 మందికి మించి విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ బూస్టర్ డోస్ కేంద్రాలను నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 24/7 కొనసాగుతుందన్నారు. (చదవండి: డిటెన్షన్ సెంటర్ @ వికారాబాద్! ) -
AP: బూస్టర్ డోస్ తప్పనిసరి
మహారాణిపేట(విశాఖ దక్షిణ): కరోనా బూస్టర్ డోస్ అమలుకు అధికార యంత్రాంగం శుక్రవారం శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లాలోని కేజీహెచ్, ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఒకటి, రెండు డోస్‌లు వేసుకున్న అందరికీ దీనిని వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 14,57,463 మందికి బూస్టర్ డోస్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందులో 18 నుంచి 44 ఏళ్ల వయసున్న 9,02,463 మంది, 45 నుంచి 59 ఏళ్ల లోపు 5,60,340 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 5,340 మందికి బూస్టర్ డోస్ వేశారు. ఈ నెల 15 నుంచి రెండున్నర నెలల పాటు(సెప్టెంబర్ 30 వరకు) వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సమయం లోగా ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 800 మందికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆమె చెప్పారు. ఫస్ట్, సెకండ్ డోస్‌లు పూర్తయిన వారు.. విశాఖ జిల్లాలో మొత్తం 20,85,216 మందికి కరోనా మొదటి డోస్.. 21,81,642 మందికి రెండో డోస్ టీకాలు వేశారు. మొదటి డోస్‌లో 115.5 శాతం మంది, రెండో డోస్‌లో 104.60 శాతం మంది ఉన్నారు. హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 18 నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు, 45 నుంచి 59 ఏళ్ల వయస్సు గలవారు, 60 ఏళ్లు దాటిన వారు, 12 నుంచి 14 ఏళ్ల లోపు వారు, 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. బూస్టర్ డోస్ తప్పనిసరి జిల్లాలోని కేజీహెచ్‌తోపాటు 63 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక ఏరియా ఆస్పత్రి, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్ వేస్తున్నారు. మొదటి, రెండో డోస్‌లు వేసుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత కాలంలో ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకొని బూస్టర్ డోస్ వేయించుకోవాలి. – డాక్టర్ కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
Booster Dose: ఇకపై ఫ్రీగా కరోనా బూస్టర్ డోస్
ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 199.72 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు 18-59 ఏళ్ల వారికి రెండు డోసులు ఉచితంగా అందించింది కేంద్రం. ఆ తర్వాత ఏప్రిల్ 10న ప్రికాషన్ డోసుల పంపిణీ ప్రారంభించింది. అయితే.. 18-59 ఏళ్ల వారు ప్రికాషన్ డోస్‌ను ప్రైవేటు కేంద్రాల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. అలాగే 60 ఏళ్లుపైబడిన వాళ్లకు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లకు మూడో డోసు ఫ్రీగానే అందించింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రికాషన్ డోస్‌పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవటం వల్ల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా ప్రికాషన్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. జులై 15న మొదలై 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా మూడో డోసు అందించనున్నారు. 'దేశ జనాభాలో ఎక్కువ మంది తొమ్మిది నెలల క్రితమే రెండు డోసులు తీసుకున్నారు. ఐసీఎంఆర్, ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలింది. 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో 18-59 ఏళ్ల వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్ డోసు అందించనున్నారు. జులై 15న ప్రారంభం కానుంది.' అని అధికారులు తెలిపారు. కేవలం ఒక శాతమే.. ఇప్పటి వరకు దేశంలోని 77 కోట్ల మంది ఉన్న 18-59 ఏళ్ల వయసు వారిలో కేవంల 1 శాతం మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు. అర్హత కలిగిన 60 ఏళ్లు పైబడినవారు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 16 కోట్ల మంది ఉండగా.. అందులో 26 శాతం మంది మూడో డోసు తీసుకున్నారు. వ్యవధి తగ్గింపు.. కొద్ది రోజుల క్రితమే ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉండగా.. ఆ సమయాన్ని ఆరు నెలలకు కుదించింది. వ్యాక్సినేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ వేగం పెంచేందుకు ఇంటింటికీ టీకా 2.O పథకాన్ని జూన్ 1న ప్రారంభించింది కేంద్రం. ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 96 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 87 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ఇదీ చదవండి: కోవిడ్ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత? -
ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్: బూస్టర్ డోస్‌పై కేంద్రం కీలక నిర్ణయం
Covid booster dose.. దేశంలో ఫోర్త్ వేవ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డోసుల మధ్య గ్యాప్‌ను ఆరు నెలలకు తగ్గించింది. సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధిని తగ్గించాలని వ్యాక్సినేషన్‌పై సలహా మండలి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) సూచించింది. ఈ మేరకు తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సెకండ్ డోస్‌కు, బూస్టర్ డోస్‌కు మధ్య 9 నెలల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను తాజాగా 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, 18-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు.. సెకండ్ డోస్ తీసుకున్న ఆరు నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, నిర్వాహకులకు లేఖ ద్వారా తెలిపారు. Gap between second COVID jab and booster dose reduced from 9 to 6 months Read @ANI Story | https://t.co/Ej35O8Q0ef#Covid_19 #Covidbooster #Covidvaccination #CovidVaccine #BoosterDoseGap pic.twitter.com/fj0WZYydQQ — ANI Digital (@ani_digital) July 6, 2022 ఇది కూడా చదవండి: తెలంగాణలో జికా వైరస్ కలకలం.. హెచ్చరించిన వైద్యులు -
‘భిన్న’ బూస్టర్‌డోస్‌గా కార్బెవ్యాక్స్
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ తయారుచేసిన కార్బెవ్యాక్స్ కోవిడ్ టీకాను బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు ఆ సంస్థకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) తాజాగా అనుమతులిచ్చింది. దేశంలోనే హెటిరోలోగస్ బూస్టర్ డోస్‌గా అనుమతి పొందిన తొలి సంస్థ తమదే అని బయోలాజికల్ ఈ శనివారం ప్రకటించింది. ముందుగా తీసుకున్న రెండు టీకాల తర్వాత వేరే తయారీ సంస్థకు చెందిన కోవిడ్ టీకా మూడోదిగా తీసుకుంటే దానిని హెటిరోలోగస్ బూస్టర్ డోస్‌గా వ్యవహరిస్తారు. దేశంలో 18 ఏళ్లు, ఆపైబడిన వయసు వారు కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ రెండు డోస్‌లు తీసుకున్న 6 నెలల వ్యవధి తర్వాత బూస్టర్‌డోస్‌గా కార్బెవ్యాక్స్‌ను తీసుకోవచ్చు. -
మూడో టీకా ఎక్కడ?
శివాజీనగర: రానున్న రోజుల్లో కరోనా నాలుగో దాడి నుంచి బయటపడడానికి మూడవ టీకా.. బూస్టర్ డోస్ తీసుకోవటం అనివార్యం. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ లభించకపోవడంతో జనం ఆందోళనకు కారణమైంది. బెంగళూరులోని పాలికె ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ ఉండడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం కావలసింత టీకా నిల్వలు ఉన్నాయి. బూస్టర్ డోస్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ధరను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్థోమత ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేసుకొంటున్నారు. అంత డబ్బు పెట్టలేనివారు ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరుగుతూ లేదని చెప్పించుకుంటున్నారు. సామాన్యులకు కష్టం మరోవైపు మంత్రులేమో ఆస్పత్రుల్లో బూస్టర్ టీకా ఉచితంగా వేస్తున్నట్లు రోజూ చెబుతుంటే వాస్తవం మరోలా ఉంది. సామాన్యులు, పేదలు మూడో టీకా కోసం వేచి చూస్తున్నారు. రెండు డోస్‌ల టీకాలను ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం నాలుగో దాడి పొంచి ఉన్న సమయంలో చేతులెత్తేయడం ఏమిటని పలువురు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తక్షణం ఉచిత బూస్టర్ డోస్‌ను అందరికీ పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. (చదవండి: పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..) -
ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోస్.. ధర ఎంతంటే ?
కరోనా తీవ్రత తగ్గి జనజీవతం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.అయితే ఇప్పటికీ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో 18 ఏళ్లు పైబడి ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు బూస్టర్ డోసు వేసుకోవడం మంచిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో బూస్టర్ డోస్‌ను ఓపెన్ మార్కెట్లో అందిస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. దేశంలోనే తొలి కరోనా టీకా కోవిషీల్డ్‌ని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది. మొదటి రెండు డోసులు దాదాపుగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించింది. కాగా బూస్టర్ డోసును ప్రభుత్వ ఆధ్వర్యంతో ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం అందించింది. కాగా ఇప్పుడు బూస్టర్ డోసును ఓపెన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో బయట మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోసుకు రూ. 600లుగా సీరమ్ నిర్ణయించింది. దీనికి స్థానిక పన్నులు అదనం అని సీరమ్ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కొనుగోలుకు రూ. 600 ధర వర్తిస్తుందని, ఆస్పత్రులకు తక్కువ ధరకే సరఫరా చేస్తామని కూడా తెలిపింది. ఈ వ్యాక్సిన్ 2022 ఏప్రిల్ 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును ప్రభుత్వం ఉచితంగా అందివ్వనుంది. #LargestVaccineDrive Precaution/ booster Dose to be now available to all 18+ population group from 10th April, 2022, at Private Vaccination Centres.https://t.co/f0QDul20gz#CovidVaccine #IndiaFightsCorona @narendramodi @mansukhmandviya @blsanthosh @saudansinghbjp pic.twitter.com/dinGOwC4aq — Tajinder Singh Sran (@TajinderSTS) April 8, 2022 చదవండి: గుడ్ న్యూస్: బహిరంగ మార్కెట్లో విక్రయానికి 2 వ్యాక్సిన్లకు అనుమతి -
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోసు!
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాలు, క్రీడలు, అధికారిక, వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్లేవారికి కరోనా టీకా బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం త్వరలోనే అనుమతిచ్చే అవకాశముందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. దీన్ని ప్రైవేట్ కేంద్రాల్లో ఇవ్వాలా, ఉచితంగానా, రుసుముతోనా అనేదానిపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించాయి. 60 ఏళ్లు దాటిన వారితోపాటు హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇప్పటికే బూస్టర్ డోసుఇస్తున్నారు. కొన్ని దేశాలు బూస్టర్ డోసు తీసుకున్నవారినే దేశంలోకి అనుమతిస్తున్నాయి. భారత్‌లో ఆదివారం నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విదేశాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పాలంటే సాధ్యమైనంత త్వరగా బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలి. -
చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కొత్త మల్లారెడ్డి (రిటైర్డ్ హెడ్మాస్టర్) ఈనెల 11న చనిపోయారు. కానీ వైద్య శాఖ సిబ్బంది మాత్రం ఫిబ్రవరి 16, బుధవారం రోజున బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయం సెల్‌ఫోన్‌కు మెసేజ్ రాగా, వాళ్ల కుటుంబ సభ్యులు కోవిన్ యాప్‌లో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి చూస్తే, అందులో కూడా ఇవాళ వ్యాక్సిన్ వేసినట్టుగా ఎంట్రీ చేశారు. మల్లారెడ్డి భార్య కళావతికి కూడా ఇవాళ బూస్టర్ డోస్ వేయకున్నా, వేసినట్టుగా మెసేజ్ రావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి రానున్న సమ్మక్క)