broken
-
మంత్రి గారి బంధువు చెప్పారు.. వదిలేయండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆ ఓడ మనోళ్లదే.. వదిలేయండి. బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ బియ్యం ఎందుకు కలుస్తాయి? తనిఖీలు చేసి నిర్ధారించాల్సింది ఏముంటుంది? ఓడ పోర్టులో నిలిచిపోయి చాలా రోజులైంది. తక్షణం ఎగుమతికి అనుమతిచ్చి ఓడను వదిలేయండి’ అంటూ మూడు వారాలుగా కాకినాడ పోర్టులో నిలిపివేసిన నౌకకు కూటమి నేతలు ఆఘమేఘాలపై అనుమతిచ్చేశారు. మంత్రిగారి బంధువుకు చెందిన ఎక్స్‌పోర్టు కంపెనీ తరలిస్తున్న బియ్యం ఇందులో ఉందని, అందువల్లే బ్రోకెన్ రైస్ కాబట్టి అందులో పీడీఎస్ బియ్యం కలవలేదని ఎలా నిర్ధారిస్తారన్న మిగతా ఎగుమతిదారుల ప్రశ్నలకు సమాధానం రాకుండానే ఆ నౌక విదేశాలకు తరలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పిన మంత్రిమరోపక్క మంత్రి బంధువుల కన్సైన్మెంట్లు ఉండటంతో బ్రోకెన్ రైస్ అంటూ కాకినాడ నుంచే పున్నీ నౌకను పంపించేశారు. ఆఫ్రికా ఖండంలోని డక్కర్ దేశానికి కాకినాడ పోర్టు నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఇటీవల కేంద్రం అనుమతించింది. ఈ ఎగుమతి హక్కులను పట్టాభి ఆగ్రోస్, కేఎన్ రిసోర్సెస్, మురళీమోహన్, సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. డక్కర్‌కు బ్రోకెన్ రైస్ ఎగుమతి కోసం ఎంవీక్యూ పున్నీ నౌక గత నెల 28న కాకినాడ వచ్చింది. అదే సమయానికి కాకినాడ పోర్టులో ఉన్న స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యంపై రాద్ధాంతం మొదలైంది. ఈ నౌకను పోర్టులో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పున్నీ నౌకను కూడా పోర్టులో మూడు వారాలుగా నిలిపివేశారు. ఈ నౌకను పంపించేయడానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఒక ఎక్స్‌పోర్టర్ నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ ద్వారా లాబీయింగ్ చేశారని సమాచారం. ఇందుకోసం ఆయన తన బంధువైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కేబినెట్ మంత్రి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పినట్లు సమాచారం. సహజంగా రా రైస్ లేదా బ్రోకెన్ రైస్‌లో పోర్టిఫైడ్ రైస్‌లోని కేర్నల్స్ (పేదలకు పంపిణీ చేసే బియ్యంలో పౌష్టికాహారం కలిపే ప్రక్రియ) ఒక శాతం అనుమతిస్తారు. అంతకు మించి ఉంటే 6ఏ కేసు అవుతుంది. డక్కర్ దేశానికి ఎగుమతికి సిద్ధం చేసిన బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలిసి ఉండవచ్చుననే అనుమానంతో ఇన్ని రోజులూ నిలిపివేశారు. అయినా నౌకలో తనిఖీలు లేకుండా అనుమతివ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా, స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో గుర్తించిన పీడీఎస్ బియ్యం మొత్తం సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు ప్రైవేట్ లిమిటెడ్దేనని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్వయంగా ప్రకటించారు. పున్నీ నౌకలో బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఆర్డర్ పొందిన నాలుగు సంస్థలో సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు కూడా ఉంది. అటువంటప్పుడు బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలవలేదని ఎలా నిర్థారిస్తారని, కనీసం శాంపిళ్లు తీయకుండా, కెమికల్ టెస్ట్ చేయకుండా ఎగుమతికి ఎలా అనుమతిస్తారని ఎక్స్‌పోర్టర్లు ప్రశ్నిస్తున్నారు.కాకినాడ పోర్టుపై నానాయాగీకూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోతోందంటూ కాకినాడ పోర్టులో యాగీ ప్రారంభించారు. రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి నుంచి విదేశాలకు తరలించేసి కోట్లు కొల్లగొట్టేశారని గత ప్రభుత్వంపై విషం చిమ్మారు. ఆఫ్రికా ఖండానికి స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయని, సినిమా స్టైల్లో ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ పెద్ద బిల్డప్పే ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల విశాఖ పోర్టుకు వెళ్లి, అక్కడ కూడా పీడీఎస్ బియ్యం తరలిపోతోందంటూ హడావుడి చేశారు. అయితే, ఆ బియ్యం టీడీపీ నేతల అనుచరులదేనని తెలియడంతో మారు మాట్లాడలేదు. -
విడిపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమై వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే.. ఆ బంధం విడిపోవడమే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోవడం అనేది నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని స్పష్టంచేసింది. సెక్షన్ ప్రకారం 306 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించగలమని వెల్లడించింది. ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన కమ్రుద్దీన్ దస్తగిర్ సనాదీ, మరో మహిళ ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. 2007 ఆగస్టులో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమ్రుద్దీన్ అరెస్టయ్యాడు. అతడిౖపై ఐపీసీ సెక్షన్ 417(మోసం), సెక్షన్ 306(ఆత్మహత్యకు పురికొల్పడం), సెక్షన్ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. కమ్రుద్దీన్ నిర్దోషి అని గుర్తిస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్ చేస్తూ పోలీసులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కమ్రుద్దీన్‌ను దోషిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ.25 వేల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది బంధం విడిపోయిన కేసు తప్ప నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
Hathras Incident: ఊపిరాడక కొందరు.. ఎముకలు విరిగి మరికొందరు..
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 121 మంది మృతిచెందారు. వీరికి సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదికలలో వీరంతా ఎలా మృతి చెందినదీ తెలియవచ్చింది. ఈ వివరాలు ఎవరినైనా కంటతడి పెట్టించేలా ఉన్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం అలీఘర్‌లో 37 మందికి పోస్టుమార్టం నిర్వహించగా, వారిలో 10 మంది ఊపిరాడక మృతి చెందారని వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడం, ఎముకలు విరిగిపోవడం, బ్రెయిన్ హెమరేజ్ మొదలైనవి పలువురి మృతికి కారణంగా నిలిచాయి. 12 నుంచి 15 మంది కాలేయం, ఊపిరితిత్తులు పగిలిపోవడంతో మృతి చెందారు. తల, భుజం, మెడ, వెన్నెముకపై తీవ్రమైన గాయాల కారణంగా మరికొందరు మృతి చెందారు.జిల్లా ఆస్పత్రిలోని పోస్ట్‌మార్టం హౌస్‌కు మృతదేహాలు చేరుకోగానే.. అప్పటికే అక్కడికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారిని చూసుకుని బిగ్గరగా రోదించారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా కంటతడి పెట్టుకున్నారు. పోస్టుమార్టం హౌస్ వద్దకు అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల్లో మృతదేహాలను వరుసగా తీసుకువస్తుండటంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. మృతదేహాలను ఉంచేందుకు జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ, పోస్ట్‌మార్టం హౌస్ సరిపోలేదు. దీంతో వాటిని తెల్లటి వస్త్రాలలో చుట్టి, ఆస్పత్రి ఆవరణలోనే ఉంచారు. -
ఉత్తరప్రదేశ్‌లో ‘వందేభారత్’పై రాళ్ల దాడి!
ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనతో రైల్వేశాఖలో కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై ఈ రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని సీ-3 కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. రైలు టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. -
బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో..
మహబూబాబాద్: హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న హుజూరాబాద్ డిపోనకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఓవర్ లోడ్‌తో వెళ్తుండగా ఎల్కతుర్తి సమీపంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఓవర్ లోడ్ కారణంగా ఘటన జరగలేదని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవి కూడా చదవండి: అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి.. -
కూల్చేయండి..! లేదంటే మేమే కూల్చేస్తాం..!!
కరీంనగర్: ‘ఇందు మూలంగా మీకు తెలియచేయునది ఏమనగా.. మీ భవనం శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్నదని గుర్తించడమైనది. కావున ఇంటిలో నివసించే వాళ్లు తక్షణమే ఖాళీ చేసి.. ఇల్లును కూల్చుకోమని.. మరమ్మతులు చేసుకోమని హెచ్చరించనైనది. లేని యెడల సెక్షన్ 182, మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కూల్చివేసి చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.’ ఇది వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లకు నగరపాలకసంస్థ అంటిస్తున్న హెచ్చరిక నోటీ సు. తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని శిథిలావస్థలో (కూలడానికి సిద్ధంగా) ఉన్న ఇళ్లపై నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. పురాతన నిర్మాణాలతో ప్రమాదాలు పొంచి ఉన్నందున ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేసుకోవాలని లేదంటే మరమ్మతులు చేసుకోవాలని నోటీసులు జారీ చేస్తోంది. 57 ఇళ్లకు హెచ్చరిక నోటీసు వర్షాలతో కూలే ప్రమాదం ఉన్న ఇళ్లను మూడురోజులుగా గుర్తించే పనిలో నగరపాలకసంస్థ అధికా రులు బిజీగా ఉన్నారు. గురువారం నాటికి ఇలాంటి పడిపోయే 57 ఇళ్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. యజమానులకు నోటీసులు జారీ చేశా రు. కార్ఖానగడ్డ, సాయినగర్ తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలికంగా బసకోసం తరలాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వర్షాలకు కూలే ప్రమాదం ఉండడంతో ముందుగానే ఇండ్లను స్వచ్ఛందంగా కూల్చుకోవాలని, మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. స్పెషల్ టీమ్స్ ఆన్ డ్యూటీ మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన నగరపాలకసంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం తెలిసిందే. ఎనిమిది గంటలకు ఒక బృందం చొప్పున మూడు విడుతలుగా 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. నగరంలో ఎక్కడ వర్షపు నీళ్లు నిలిచినా, డ్రైనేజీలు పూడుకుపోయినా, చెట్లు విరిగి పడిపోయినా ఈబృందాలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాయి. కట్టరాంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో విరిగిన చెట్లను రెస్క్యూ టీం గురువారం తొలగించింది. నగరంలోని ప్రధాన రహదారుల నుంచి డ్రైనేజీలకు వెళ్లే హోల్స్ మట్టి, చెత్తతో మూసుకుపోగా సిబ్బంది తొలగించారు. రోడ్లు, పల్లపు ప్రాంతాల్లో నిలుస్తున్న నీళ్లను డ్రైనేజీలకు వెళ్లేలా మళ్లిస్తున్నారు. ప్రజల రక్షణే ముఖ్యం.. వర్షాలు కురుస్తున్న సమయంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు తొలగించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటి గృహ యజమానులకు నచ్చచెప్పి తొలగిస్తాం. పురాతన ఇండ్ల సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలి. రెస్క్యూ టీం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి. – మేయర్ యాదగిరి సునీల్‌రావు -
ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని ఝజ్జర్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల జరగుతున్నాయి. ఐతే పోలింగ్ బూత్ వద్ద మిషన్ చెడిపోవడంతో రెండు వర్గాల మధ్య బీకర పోరు జరిగింది. ఓటింగ్ వేస్తున్న సయయంతో అనుహ్యంగా ఈవీఎం మిషన్ పాడైందని రెండు ప్రత్యర్థి వర్గాలు ఊగిపోయి ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. రెండు వర్గాలు వేరు చేయడానికి ప్రయత్నించిన దాడులు చేసుకోవడం ఆపలేదని అన్నారు. అలాగే హర్యానాలో నుహ్‌లో రెండు గ్రామాల్లో కూడా కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. హర్యానాలో తొమ్మిది జిల్లాలో జరగనున్న మూడు దశల ఎన్నికల్లో ఇది మొదటిది. (చదవండి: వింత ఘటన: చెయ్యిని చుట్టేసి మరీ కాటేసిన నాగు.. కసితో కొరికి చంపాడు) -
ఓటమితో మైండ్ బ్లాంక్.. టీవీ పగలగొట్టిన అభిమాని..అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు! ట్విస్ట్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అధ్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ యావత్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్ విజయంతో భారత అభిమానులు ఒకరోజు ముందే దీపావళి చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత్ చేతిలో తమ జట్టు ఓటమికి జీర్ణుంచుకోలేక ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. మ్యాచ్ అయిపోగానే కొందరు టీవీలు పగలగొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియో ఇప్పటిది కాదు ఇందుకు సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అయిపోగానే ఓ పాక్ అభిమాని తన టీవీని పగలగొట్టినట్లుగా ఇందులో కనిపించిది. దానిపైకి వస్తువును విసరడమే గాక.. కాలుతో తన్ని దాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ఆ దృశ్యాల్లో ఉంది. అతడి ఆగ్రహాన్ని చూసి సెహ్వాగ్ సైటెర్లు వేశాడు. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. రిలాక్స్ అవ్వండి. మేము ఇక్కడి దీపావళి టపాసులు పేల్చుతుంటే.. మీరేమో టీవీలు పగలగొడుతున్నారు. పాపం టీవీలు ఏం చేశాయి? అని రాసుకొచ్చాడు. నవ్వే ఓ ఎమోజీ కూడా పెట్టాడు. దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అయితే, నిజానికి ఇది టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్- పాక్ నాటి మ్యాచ్‌కు సంబంధించింది కాదు. 2016లో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడగా.. దీనిని భారత్- పాక్ మ్యాచ్‌కు లింక్ చేసి వైరల్ చేయడం గమనార్హం. Relax Padosi , it’s only a game. Hamaare yahan Deepawali hai toh pataakhe phod rahe hain aur aap bevajah TV 📺 phod rahe hain 🤣. Nahin yaar, TV ka kya kasoor. pic.twitter.com/AvVL4fOmny — Virender Sehwag (@virendersehwag) October 23, 2022 చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
పుల్కిత్ ఆర్య రిసార్ట్ కు నిప్పు పెట్టిన స్థానికులు
-
తిరుమల నడకదారిలో విరిగిపడ్డ కొండచరియలు
సాక్షి, తిరుపతి: గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను టీటీడీ మూసేసింది. చదవండి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ నిన్నంతా కురిసిన భారీ వర్షానికి శ్రీవారి మెట్టు మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. టన్నుల బరువున్న కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడానికి కష్టతరంగా మారింది. మరోపక్క ఘాట్ రోడ్డులో కూడా అనేక ప్రాంతాలలో కొండచరియలు పడిపోవడంతో వీటిని తొలగించే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. మరిన్ని రోజులు నడకదారులను టీటీడీ మూసివేయనుంది. తిరుమల ఘాట్‌రోడ్డులో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. -
యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
యాదగిరిగుట్ట: భారీ వర్షాల కారణంగా గురువారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డులోని రెండో మూలమలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షానికి మరిన్ని బండరాళ్లు పడే అవకాశం ఉందని వాహనాలను మొదటి ఘాట్ రోడ్డు గుండా మళ్లించారు. తర్వాత ఆర్అండ్బీ అధికారులు రోడ్డుపై ఉన్న బండరాళ్లను జేసీబీతో తొలగించారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా బాలాలయ ఆవరణలో గతంలో వేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. కొండపై నూతనంగా నిర్మించిన క్యూలైన్లల్లోకి వర్షపు నీరు చేరింది. కాగా, కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు వర్షం కారణంగా నిలిచిపోయాయి. -
ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు
-
వైరల్ : ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు
రోమ్ : మ్యూజియం అంటేనే పురాతన వస్తువులు, శిల్పాలు ఉంటాయి. వీటిని ఏ మాత్రం కదిలించినా విరగడం ఖాయం. అందుకే ప్రతి శిల్పానికి తాకేందుకు వీలు లేకుండా అద్దాలు అమర్చి ఉంటాయి. కానీ ఇటలీలోని పోసాగ్నోలోని జిప్సోథెకా ఆంటోనియో కనోవా మ్యూజియంలో శిల్పాలను అద్దాల్లో పెట్టకుండా మూములుగానే పెట్టి ప్రదర్శనకు ఉంచారు. మ్యూజియంకు వచ్చే పర్యాటకులు శిల్పాల మీద కూర్చొని మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. తాజాగా ఆస్ట్రియాకు చెందిన ఒక టూరిస్ట్ మ్యూజియంను సందర్శించాడు. దాదాపు 200 ఏండ్ల పురాతనమైన ఒక శిల్పం మీద కూర్చొని ఆ పర్యాటకుడు ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది.(మాస్క్ పెట్టుకోలేదని చితకబాదారు) ఫోటో దిగిన తర్వాత అతని ప్రవర్తన కొంత వింతగా కనిపించింది. ఏదో జరిగిపోయినట్టు అక్కడే నిలబడి అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. మ్యూజియంలో ఉన్నవాళ్లు అన్ని వైపులకు వెళ్లి శిల్పాలను చూస్తుంటే ఆ వ్యక్తి మాత్రం అక్కడక్కడే తిరుగుతున్నాడు.అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడనేది అక్కడున్నవారికి అర్థం కాకపోయినా.. సీసీ కెమెరాలు పసిగట్టాయి. ఇంతకీ విషయమేంటంటే.. అతను ఫోటో దిగుతున్నప్పుడు చేయి బలంగా తాకడంతో శిల్పం కుడికాలి బొటనవేలు విరిగిపోయింది. అది ఎవరికీ కనిపించకూడదనే ఉద్దేశంతోనే అక్కడే తిరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అతనికి కొంచెమైనా బుద్దుండాలి.. సున్నితంగా ఉండే శిల్పాల మీద కూర్చొని ఎవరైనా ఫోటోలు దిగుతారా' .. 'శిల్పాల చుట్టూ కనీస భద్రత లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
విరిగిన మూసీ ప్రాజెక్టు గేటు
కేతేపల్లి:నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ రెగ్యులేటరీ గేట్ విరిగిపోయింది. దీంతో దిగువకు 5వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. 20 రోజులుగా హైదరాబాద్‌తో పాటు వరంగల్, జనగాం ప్రాంతాలలో కురిసిన వర్షాలకు మూసీ బిక్కేరు, వసంత వాగు ద్వారా మూసీ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చింది. ప్రాజె క్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులకు చేరడంతో 2 గేట్లను కూడా ఎత్తారు. నీటిమట్టం 644.5 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చూసి మూసివేశారు. శనివారం సాయంత్రం 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా నీటిమట్టం 644.8 అడుగులకు చేరుకుంది. కాగా, రాత్రి 7 గంటల సమయంలో 6వ నంబర్ రెగ్యులేటరీ గేటు విరిగిపోయింది. ఈ గేటు ఇరువైపులా ఉన్న గొలుసు ఆధారంతో వేలాడుతోంది. గేట్ విరగడంతో దాదాపు 5వేల క్యూసెక్కుల మేర నీరు వృథాగా దిగువకు పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెల్లవారే సరికి ప్రాజెక్టులో ఐదారడుగుల మేర నీటిమట్టం తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మూసీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. నీటిపారుదల శాఖ ఈఈ భద్రునాయక్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమై గేటును సరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. -
బాలింత రక్తనాళంలో విరిగిన సూది
సాక్షి, హైదరాబాద్: అత్యవసర రోగులకు ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించేందుకు అమర్చే సెంట్రల్ వీనస్ కేథటర్లు రక్తనాళంలోనే విరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా బయటపడిన విషయం మరిచిపోక ముందే ఈ ఘటన వెలుగు చూడటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న మందులు, సెలైన్ బాటిళ్లతోపాటు సెంట్రల్ వీనస్ కేథటర్ల, ఇంట్రా కేథటర్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో రోగికి మత్తుమందు, యాంటిబయాటిక్ ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించేందుకు ప్రధాన రక్తనాళానికి వీటిని అమర్చుతారు. కొంతమందికి చేతి నరానికి అమర్చితే.. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మరికొంత మందికి గొంతు దగ్గర ఉన్న ప్రధాన రక్తనాళానికి అమర్చుతుంటారు. సాధారణంగా ఇవి విరిగిపోవడం అనేది జరగదు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్న ఈ కేథటర్లు తొలగించే సమయంలో రక్తనాళంలోనే విరిగి పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రక్తనాళంలో విరిగిపోయిన సూది.. మహబూబ్‌నగర్‌కు చెందిన గర్భిణి (21) ప్రసవం కోసం గత నెల 27న పేట్లబురుజు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఒక్కసారిగా హైబీపీ రావడంతో ఈ నెల 3న ఆమెకు ఆస్పత్రి వైద్యులు మెడ వద్ద సెంట్రల్ వీనస్ కేథటర్‌ను అమర్చారు. దీని ద్వారా మత్తుమందు ఇచ్చి ఆమెకు సిజేరియన్ డెలివరీ చేశారు. అయితే కేథటర్‌ను తొలగించే సమయంలో సూది మధ్యకు విరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సదరు బాలింతను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియాకు తరలించారు. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రి కార్డియోథొరాసిక్ వైద్యులు ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. సీటీ, ఎంఆర్ఐ పరీక్షలు చేశారు. విరిగిపోయిన నీడిల్ ఏ వైపు వెళ్లిందో గుర్తించారు. సర్జరీ చేస్తే బాలింత ప్రాణాలకే ప్రమాదమని భావించి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో కార్డియోథొరాసిక్ వైద్య బృందం శుక్రవారం ఉదయం ఆమెకు సర్జరీ చేసి, దవడ కింది భాగంలోని ప్రధాన రక్తనాళానికి అడ్డుగా ఉన్న నీడిల్‌ను విజయవంతంగా తొలగించింది. నాణ్యతపై అనుమానాలు: ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల పరిధిలో పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రి, చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ), సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, చాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 300పైగా సర్జరీలు అవుతుంటాయి. నగరంలోని వివిధ ప్రసూతి ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు అవుతుంటాయి. అత్యవసర చికిత్సలు అవసరమైన రోగులతోపాటు ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు రోజుకు నాలుగైదు ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లు ఎక్కించాల్సి వస్తుంది. ఇంజక్షన్ల కోసం పదేపదే నీడిల్‌తో గుచ్చడం వల్ల రోగికి నొప్పితో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఐవీ కేథటర్లను అమర్చుతుంటారు. ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జ్ చేసే సమయంలో చేతికి, మెడ భాగంలో ఉన్న కేథటర్లను తొలగిస్తుంటారు. అయితే నాణ్యతా లోపం వల్ల కేథటర్‌ను తొలగించే సమయంలో రక్తనాళంలో నీడిల్ మధ్యకు విరిగి రక్తంతోపాటే ఇతర భాగాలకు చేరుతుంది. రోగుల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. నాసిరకం కేథటర్లను సరఫరా చేస్తుండటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భర్తను ఆరు నెలలుగా ఇంట్లో నిర్బంధించి..
-
భర్త కాళ్లు, చేతులు విరగొట్టి.. ఇంట్లో బంధించి!
సాక్షి, రాజమండ్రి: భర్త అనే మర్యాద, ప్రేమ లేదు.. కనీసం సాటి మనిషి అనే కరుణ లేదు. కట్టుకున్నవాడిని ఇంట్లో నిర్బంధించి ఆరు నెలలుగా చిత్రవదకు గురిచేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమరగిరిపట్నానికి చెందిన సత్యనారాయణకు కొన్నేళ్ల క్రితం వివాహమయింది. మొదట్లో బాగానే నడిచిన వీరి కాపురం, తర్వాత గొడవలకు దారి తీసింది. ఒక రోజు గొడవ పెరిగి కోపోద్రిక్తురాలైన భార్య సత్యనారాయణ కాళ్లు, చేతుల విరగొట్టింది. బయటకు పొక్కకుండా ఆరు నెలలుగా అతడిని ఇంట్లోనే బంధించి, ప్రతిరోజు అతడిని చిత్రవదలకు గురిచేసింది. భార్య చెర నుంచి తప్పించుకున్న సత్యనారాయణ బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించి సత్యనారాయణను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
జైంట్‌వీల్ విరిగి పడి చిన్నారి మృతి
-
ఈసారి షమీ సొంతూళ్లో...
ఆమ్రోహా: భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి పోలీసుల్ని ఆశ్రయించింది. షమీ సొంతూరైన ఉత్తరప్రదేశ్‌లోని సహస్ గ్రామానికి వెళ్లేందుకు తనకు రక్షణగా రావాలంటూ డిడౌలీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామ్‌సింగ్ కటారియాను కోరింది. సహస్ చేరిన అనంతరం షమీ ఇంటి తాళాన్ని పగులగొట్టాలని జహాన్ పోలీసుల్ని డిమాండ్ చేసింది. అయితే ఆమె డిమాండ్‌ను వారు తోసిపుచ్చారు. ఇంట్లో ఎవరూ లేనందున తాళం పగలగొట్టేందుకు నిరాకరించామని కటారియా స్పష్టం చేశారు. ఆమెతో పాటు తన రెండేళ్ల కూతురు, లాయర్ జాకీర్ హుస్సేన్ ఉన్నట్లు ఆయన చెప్పారు. జహాన్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ గ్రామానికి వచ్చిందని అక్కడే నివాసముంటున్న షమీ బంధువు మొహమ్మద్ జమీర్ తెలిపారు. ఆమెను తన ఇంట్లోకి ఆహ్వానించానని ఆయన చెప్పారు. కానీ షమీ సొంతూరు వెళ్లిన కారణాన్ని చెప్పేందుకు హసీన్ జహాన్ నిరాకరించింది. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని పేర్కొంది. -
వినాయకుడి విగ్రహం ధ్వంసం
కావలిరూరల్: వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మంగళవారం రాత్రి లక్ష్మీపురం గ్రామంలో జరిగింది. రూరల్ పోలీసులు, లక్షీపురం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లక్ష్మీపురం గ్రామం చివరన చెరువు కట్ట సమీపంలో వినాయకుడి విగ్రహం ఉంది. కొన్ని తరాలుగా అక్కడ ఉన్న విగ్రహానికి స్థానికులు పూజలు చేస్తున్నారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులకు విగ్రహం కనిపించలేదు. దీంతో పరిసరాల్లో వెతకగా చెరువులోని నీటిలో సగం విరిగిన విగ్రహం కనిపించింది. దీంతో ఊర్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పూజలు చేసి.. ఏకశిల విగ్రహమైన వినాయకుడి ప్రతిమను అపహరించి ధ్వంసం చేశారు. చాతి భాగం నుంచి కింది భాగం వరకు తీసుకెళ్లారు. మిగిలిన పైభాగం అక్కడ చెరువులోని నీటిలో పడవేశారు. వినాయక నిమర్జనం సమయంలో చేసే పూజలు ఇక్కడ చేశారు. పూలు, పండ్లు, నవధాన్యాలు నీటిలో వేసి ఉన్నారు. సమీపంలో పూజలకు ఉపయోగించిన నూనె, కర్పూరం అగ్గిపెట్టె ఉన్నాయి. దుండగులు చెరువు వద్ద మద్యం సేవించిన ఆనవాళ్లున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఊరికి అరిష్టం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. గుప్తనిధి కోసమేనా? వినాయకుడి విగ్రహం బొజ్జలో బంగారం, వజ్రాలు ఉంటాయని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. పొరుగునే ఉన్న పేపాలవారిపాలెంలో సుమారు 6 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విరిగిపడిన మట్టిచరియలు
ఒకరి మృతి, నలుగురికి గాయాలు తుని : కూలీ పనికి వెళితే నాలుగు రాళ్లు సంపాదించుకుందామని ఇంటి నుంచి తెల్లవారుజామున వెళ్లి మట్టిలో కలిసిపోయాడు. పనికి వెళితే పూట గడవని కూలీలు చెరువులో మట్టి తవ్వుతుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. తుని రూరల్ ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం చిన్న నరసాపురంకు చెందిన ఐదుగురు, తుని పట్టణం రామకృష్ణాకాలనీకి చెందిన ఒకరు ట్రాక్టరు పనికి శనివారం తెల్లవారుజామున వెళ్లారు. తుని మండలం వి.కొత్తూరు పెద్దచెరువులో వీరు మట్టి తవ్వుతుండగా ఒక్కసారిగా పైన ఉన్న చరియలు విరిగిపడిపోయాయి. మట్టికింద చిక్కుకు పోయిన మాసా పాపారావు, జెక్కల సత్యనారాయణ, వై.సింహాచలం, వంతాడ అప్పన్నలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మట్టిలో కూరుకుపోయిన జెక్కల నాగబాబు (45) మృతి చెందాడు. గాయపడిన వారిని తుని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతిచెందిన నాగబాబును సంఘటనా స్థలం నుంచి నేరుగా నరసాపురానికి తీసుకుపోయారు. జరిగినది ప్రమాదం కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లమని గ్రామస్తులు చెప్పడంతో ఉదయం 10 గంటలకు తీసుకువచ్చారు. మృతుడు నాగబాబుకు భార్య కరుణ, నలుగురు పిల్లలు ఉన్నారు. దీంతో బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటనా స్థలం పరిశీలన మట్టి చరియలు పడి ప్రమాదం జరిగిన పెద్ద చెరువును రూరల్ ఎస్సై ఆశోక్ పరిశీలించారు. చెరువు గర్భంలో మెత్తటి మట్టి ఉన్న చోట లోతుగా తవ్వడంతో ప్రమాదం జరిగిందన్నారు. నీరూ చెట్టు పథకంలో ఇటీవల పనులు చేశారని స్థానికులు చెప్పడంతో తహసీల్దార్ సూర్యనారాయణకు సమచారం ఇచ్చారు. ప్రస్తుతం మట్టి తవ్విన ప్రాంతానికి అనుమతులు లేన ట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రెవెన్యూ అధికారుల విచారణ చేసిన తర్వాత కాంట్రాక్టరుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో మట్టిని తరలిస్తున్న సదరు కాంట్రాక్టరు పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మట్టిని తరలించడానికి ఉపయోగించిన ట్రాక్టరును సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. -
దుగ్గిరాలలో విరిగిన రైలుపట్టా
పాయింట్స్‌మెన్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం గుంటూరు: విరిగిన రైలు పట్టాను సిబ్బంది సకాలంలో గుర్తించడం తో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ–చెన్నై రైలుమార్గంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6.30 గంటలకు పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చేందుకు దుగ్గిరాల రైల్వే స్టేషన్లో పాయింట్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న డి. నాగరాజు రైలు పట్టాలు దాటి అవతలివైపునకు వెళ్లాడు. పినాకిని ఎక్స్‌ప్రెస్ స్టేషన్ దాటి వెళ్ళిన తరువాత తిరిగి పట్టాలు దాటుతున్న సమయంలో పట్టా విరిగినట్లు గమనించి స్టేషన్‌మాస్టర్‌కు, రైల్వే కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను దారిమళ్లించారు. -
వర్దా తుపానుకు బస్సు కూడా
-
పగిలిన ‘భగీరథ’ పైప్‌లైన్
వర్గల్: మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలింది. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా వర్గల్ సత్యసారుు మందిరం సమీపంలో ప్రధాన రహదారిపై జరిగింది. ఒంటి గంట ప్రాంతంలో రోడ్డు కింద ఉన్న పైప్ లైన్ ధ్వంసమై భారీ లీకేజీ ఏర్పడింది. తారురోడ్డును బద్దలు చేస్తూ లీకేజీ నుంచి నీళ్లు ఎగసిపడ్డాయి. విద్యుత్ స్తంభం వైర్లు తాకుతూ నీళ్లు నింగికి ఎగిసాయి. దీంతో ముందుజాగ్రత్తగా ట్రాన్స్‌కో ఏఈ వేణుగోపాలాచార్యులు విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. మధ్యాహ్నం 3 గంటల దాకా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ ఘటన వల్ల సమీప గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయి0ది. -
మూలనపడేశారు..
చాలాపాఠశాలల్లో విరిగిపోయిన ‘స్నేహబాల’ ఫర్నీచర్ పట్టించుకోని అధికారులు విద్యాశాఖాధికారుల ఆదేశాలు పాఠశాలలో అమలుకు నోచుకోవడంలేదు. విద్యార్థులు కోసం ఫర్నీచర్ ఏర్పాటుచేసినా అవి వినియోగంలోలేవు. మూలనపడి విరిగిపోయే స్థితికి చేరుకున్నా క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం వాటి గురించి పట్టించుకోవడంలేదు. పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్‌ను ఫర్నీచర్ మరమ్మతులకు వినియోగించుకునే అవకాశం ఉన్నా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపడంలేదు. కోట : 2004 సంవత్సరంలో వచ్చిన సునామీ వల్ల తీరప్రాంతం అతలాకుతలమైంది. పాఠశాలల భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో తీరప్రాంత మండలాల్లోని పాఠశాలలకు స్నేహబాల కార్యక్రమం ద్వారా ఫర్నిచర్, విద్యాసామగ్రిని అందజేశారు. జర్మనీకి చెందిన యూనిసెఫ్ బందం ఈ కార్యక్రమానికి చేయూతనందించింది. ఈ బందం అన్నీ తీరప్రాంత మండలాల్లోనూ పర్యటించి పాఠశాలల వివరాలు సేకరించి సహాయసహకారాలు అందించింది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని 210 పాఠశాలల్లో విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు వీలుగా ఫర్నిచర్ ఇచ్చారు. కోట మండలంలో 67 పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువుగా ఉన్న నాలుగు పాఠశాలలు మినహా అన్నీ పాఠశాలలకు ఫర్నిచర్‌ను కేటాయించారు. దీనికోసం ఒక్కో పాఠశాలకు రూ.50వేలు వరకు నిధులు వెచ్చించారు. విరిగిన కుర్చీలే దర్శనం.. ఫర్నీచర్ సమకూరినా వినియోగించకపోవడతో కొద్ది సంవత్సరాలుగా పాఠశాలల్లో విరిగిన కూర్చీలే కనబడుతున్నాయి. అనేక పాఠశాలల్లో ఫర్నిచర్ సామగ్రి దెబ్బతిని, మరమ్మతులకు గురయ్యాయి. వీటి మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో ఉపాధ్యాయులు వాటిని మూలనపడేశారు. యూనిసెఫ్ ఫర్నీచర్‌ను వినియోగించాలని ఓసారి ఖచ్చితమైన ఆదేశాలు అందడంతో కొందరు ఉపాధ్యాయులు తమ సొంతనిధులతో మరమ్మతులు జరిపించారు. ఇటీవల మండలంలో పర్యటించిన విద్యాశాఖ మానిటరింగ్ టీం సభ్యులు ఫర్నిచర్ ఉపయోగించని నాలుగు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నివేదిక పంపారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమయ్యారు. మండలంలో 27 పాఠశాలల్లో ఫర్నీచర్‌ను విద్యార్థుల అవసరాల మేరకు వినియోగిస్తున్నారు. మిగతా పాఠశాలల్లో అవి ఎందుకూ పనికిరాకుండా మూలనపడే ఉన్నాయి.