check posts
-
చెక్ పోస్టుల వద్ద అవినీతికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: ‘సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిలపాలి.. అనుమతులు తీసుకోవాలి.. అందుకోసం లంచాలు ఇవ్వాలి’. ఇదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇటువంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద లంచాల బెడదను శాశ్వతంగా నిర్మూలించింది. రవాణా శాఖ అందించే అన్ని రకాల సేవలు, అనుమతుల జారీని ఆన్లైన్ విధానంలోకి మార్చింది. అంతేకాదు రాష్ట్రంలోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అనుమతులన్నీ ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో దశాబ్దాల నుంచి 15 రవాణా శాఖ చెక్ పోస్టులున్నాయి. వాటిలో 13 రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మిగిలిన రెండింటిలో ఒకటి తిరుపతి జిల్లా రేణిగుంటలోనూ, మరొకటి కాకినాడ జిల్లా తేటగుంటలోను ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీలతోపాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ అనుమతుల జారీ పేరుతో అక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విధానాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను గతేడాది జూలై నుంచి ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దకు వచ్చే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సులభంగా, పారదర్శకంగా అనుమతులు జారీ అవుతున్నాయి. ఆన్లైన్ విధానం లేని 2022–23లో వివిధ అనుమతుల జారీ కింద మొత్తం రూ.51.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాక 2023 జూలై నుంచి 2024 ఫిబ్రవరి వరకు వివిధ అనుమతుల జారీ కింద రూ.62.82 కోట్లు రావడం గమనార్హం. గతంలో అధికారిక అనుమతులు లేకుండా లంచాలు తీసుకుని మరీ వాహనాల ప్రవేశానికి అనుమతించేవారన్నది స్పష్టమవుతోంది. ఆన్లైన్ విధానం సరుకు రవాణా వాహనదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచింది. ప్రయోజనాలు ఇవీ... ♦ సరుకు రవాణా వాహనాలను ఇక రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతుల కోసం నిలపాల్సిన అవసరం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు సగటున గంటకు 35 కి.మీ.మేర ప్రయాణిస్తున్నాయి. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో సగటున గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ♦ ప్రస్తుతం దేశంలో సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 360 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రోజుకు సగటున 1,200 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో రాష్ట్రంలో రోజుకు సగటున 550 కి.మీ. దూరం ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది. -
ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా మంగళవారం రాత్రి మొదలు నిరంతర పర్యవేక్షణ పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఆదేశించాం. ప్రతి ఫిర్యాదుపై దగ్గర్లోని వీడియో సర్వేలన్స్ బృందాలు వెళ్లి విచారణ చేస్తాయి.’అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకల పంపిణీని కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా 24్ఠ7 పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా కంట్రోల్ రూమ్స్ నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. స్థానికేతరులందరూ వెళ్లిపోవాలి... ఎన్నికల ప్రచారానికి తెరపడిందని, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైందని వికాస్ ప్రకటించారు. రాజకీయ, ప్రచార కార్యక్రమాలపై నిషేధాజ్ఞలతో పాటు 114 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులందరూ నియోజకవర్గాలను విడిచి తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు ప్రతి పార్టీ నిషేధాజ్ఞలు పాటించాలి నిషేధాజ్ఞలను అనుసరించాలనీ, టీవీ, సినిమా, రేడియో వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదనే నిబంధనలను పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు వికాస్‌రాజ్ సూచించారు. ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధ గంట వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించరాదని స్పష్టం చేశారు. ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదన్నారు. మీడియా సర్విఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆమోదంతోనే పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజేస్లపై నిషేధం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీల స్టార్ క్యాంపైనర్లు పత్రికా సమావేశాలు పెట్టరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని స్పష్టం చేశారు ఈవీఎంల తరలింపును ఫాలో కావచ్చు.. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించడం, మొబైల్ ఫోన్స్, కార్డ్‌లెస్ ఫోన్లు, వాహనాలతో రావడంపై నిషేధం ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకుని రావడం, తీసుకెళ్లడం కోసం వాహనాలను సమకూర్చడం నేరమని హెచ్చరించారు. ఈవీఎంల మూడో ర్యాండమైజేషన్ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపుపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేందాలకు బుధవారం ఉదయం పోలింగ్ సిబ్బంది వచ్చాక వారికి ఈవీఎంలను ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత ఈవీఎంలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో అభ్యర్థుల ఏజెంట్లు తమ వాహనాల్లో ఫాలో కావచ్చని సూచించారు. నిర్దేశిత రూట్లలోనే ఈవీఎంలను రవాణా చేయాల్సి ఉంటుందని, మధ్యలో ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు అభ్యర్థి ఒక వాహనం వాడడానికి మాత్రమే అనుమతిస్తామని, ఏజెంట్‌కు మరో వాహనం అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు పంపిణీ చేసే ఓటర్ స్లిప్పుల్లో అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ గుర్తు ఉండరాదన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదు.. పోలింగ్ రోజు మాక్ పోల్ కోసం అభ్యర్థుల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు మాక్‌పోల్ నిర్వహించిన తర్వాత వీవీ ప్యాట్ కంపార్ట్మెంట్ను ఖాళీ చేయాల్సి ఉంటుందని, కంట్రోల్ యూనిట్ మెమోరీని సైతం డిలీట్ చేయాలన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదని, లేనిపక్షంలో ప్రిసైడింగ్ అధికారులు వారిని బయటికి గెంటివేస్తారన్నారు. పోస్టల్ బ్యాలెట్లో విఫలం కాలేదు.. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పనలో విఫలమైనట్టు వచ్చిన ఆరోపణలను వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. ఇంటి నుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి సదుపాయం కల్పించామన్నారు. 27,178 మంది ఇంటి నుంచే ఓటేయగా, వారిలో 15,999 మంది 80ఏళ్లుపైబడినవారు, 9459 మంది దివ్యాంగులు, 1720 మంది అత్యవసర సేవల ఓటర్లున్నారని వెల్లడించారు. మరో 10,191 మంది సర్విసు ఓటును ఎల్రక్టానిక్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్నారని, డిసెంబర్ 3న ఉదయం 7.59 గంటలకు అవి సంబంధిత కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 1.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నాటికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సంబంధిత నియోజకవర్గానికి పంపించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఎక్ఛేంజ్ కేంద్రం పెట్టామని ఆయన వివరించారు సెక్టోరియల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు... ప్రతి నియోజకవర్గం పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఒక్కో సెక్టోరియల్ అధికారిని నియమించామని ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారని వికాస్‌రాజ్ తెలిపారు. శాంతిభద్రతల సమస్యలొస్తే చర్యలు తీసుకునే మెజిస్టీరియల్ అధికారాలు వారికి ఉంటాయన్నారు. ఎక్కడైన ఈవీఎంలు పనిచేయని పక్షంలో తక్షణమే ప్రత్యామ్నాయ ఈవీఎంలను వారే సమకూర్చుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ లోకేష్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహమద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్ 30న పోలింగ్ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు. -
తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్టులు
సాక్షి, అమరావతి: ఈ నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయంతో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి చెప్పారు. ఈ నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతర్ రాష్ట్ర సరిహద్దు అంశాలపై గురువారం ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవో, ఇతర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ మద్యం, డబ్బు అక్రమ రవాణాను నియంత్రించేందుకు తెలంగాణతో సరిహద్దు గల జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆ రాష్ట్ర అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్త, జీఎస్టీ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎస్ఈబీ డైరెక్టర్ రవిప్రకాష్, ఆర్.పి.మీనా తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం చిల్లకల్లు (జగ్గయ్యపేట): తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు సమీపంలోగల భీమవరం జీఎమ్మార్ టోల్‌ప్లాజాలో గురువారం ఏపీ, తెలంగాణలకు చెందిన ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ మద్యం, నగదు అక్రమ తరలింపు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీలు
-
పాస్ ఉంటే పగటి పూటే అనుమతిస్తాం
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. డీజీపీ ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ (అనుమతి) పొందాలని సూచించారు. పాస్ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్ చెక్‌పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తారన్నారు. పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. -
'ఢిల్లీ వెళ్లిన వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది'
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎస్పీల ద్వారా అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పంపిస్తున్నట్లు వెల్లడించారు. కాగా పోలీస్ సిబ్బంది షిప్ట్ ల వారీగా 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామని, విదేశాల నుంచి వచ్చినవారి వల్లే తొలుత ఏపీలో వైరస్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. (కావాలని కరోనా అంటించుకున్న జర్మనీ మేయర్) ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొనడం ద్వారా ఊహించని విధంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఏపీ నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నట్లు అధికారికంగా తేలింది.. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నామన్నారు. మర్కజ్లో పాల్గొన్న వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జాబితా ఆధారంగా చాలా మందిని ఆస్పత్రికి తరలించాం. సీఎం వైఎస్ జగన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. 'ఆలస్యం అయ్యే కొద్దీ ప్రాణాలు కోల్పొతారు.. ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలి..ఇప్పటికే పది రోజులు లాక్డౌన్ పాటించారు.. మరో పది రోజులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. కొత్త చాలెంజ్ ను ఎదుర్కొనేందుకు డాక్టర్ లు, నర్సులు, పోలీసులు, చాలా శ్రమ పడుతున్నారు.. మీ కోసం వారంతా త్యాగం చేస్తున్నారు.. మీరు ఇళ్లు వదలి రాకండి' అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా కేసుల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తే శిక్షలు తప్పవని, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. -
‘డిసెంబర్ 31 వరకు చెక్‌పోస్టులు ప్రారంభించాలి’
సాక్షి, అమరావతి:రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 31 వరకు అన్ని జిల్లాలో చెక్ పోస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఆయా జిల్లాల్లో చెక్‌పోస్టుల పనితీరును క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వ్యక్తిగతంగా పర్యటించాలని ప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. దీంతోపాటు గనులు, పంచాయతీరాజ్, పోలీసు శాఖలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది. ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల ఏర్పాటుకు గతంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతి చెక్‌పోస్టు వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఇసుక అక్రమ రవాణాకు జీపీఎస్‌తో 'చెక్'!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా.. ఇసుకను వినియోగదారులకు చేరవేసే వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను తప్పనిసరి చేయనుంది. రీచ్ నుంచి ఇసుకను తీసుకెళ్తున్న వాహనం స్టాక్ పాయింట్‌కు వెళుతుందా? లేక పక్కదారి పట్టిందా? అనే వివరాలను ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసేందుకు వీలు కలగనుంది. జీపీఎస్‌ను తప్పనిసరిగా సోమవారం(25వ తేదీ) నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జీపీఎస్ అమర్చుకోవాల్సిందే.. ‘‘ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు ఇసుకను తీసుకెళ్లే అన్ని వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. స్టాక్ పాయింట్ నుంచి బల్క్ ఆర్డర్లకు సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని కాంట్రాక్టు సంస్థలకు స్పష్టం చేశాం’’ – మునిస్వామి, ఏపీఎండీసీ జిల్లా మేనేజర్, అనంతపురం జీపీఎస్‌తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నదుల్లో వరదలు తగ్గిపోవడంతో ప్రస్తుతం రీచ్‌ల్లో పూర్తిస్థాయిలో ఇసుక వెలికితీసేందుకు అవకాశం ఏర్పడింది. రీచ్ నుంచి వెలికితీసిన ఇసుకను మొదట స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నారు. ఏయే స్టాక్ యార్డు నుంచి ఏయే స్టాక్ పాయింట్‌కు ఇసుకను తరలించాలనేది అధికారులు నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా దగ్గరలోని స్టాక్ పాయింట్లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఇసుక యార్డు నుంచి ఇసుకను తీసుకెళ్లిన టిప్పర్లు నేరుగా స్టాక్ పాయింట్‌కు వెళుతున్నాయా? లేక పక్కదారి పడుతున్నాయా అనేదానిపై పర్యవేక్షణ నిరంతరం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సదరు వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చడం ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని ట్రాక్ చేసే వీలుంటుంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లే వాహనాలను అమరావతిలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. తద్వారా రీచ్‌లో వెలికితీసిన ఇసుక కచ్చితంగా స్టాక్ పాయింట్‌కు చేరనుంది. అంతేకాకుండా బల్క్ ఆర్డర్లకు ఇసుక సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ అమర్చడం ద్వారా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నేరుగా వినియోగదారుడికే ఇసుక చేరనుంది. -
పట్టుబడిన టీడీపీ నగదెంత?
సాక్షి, రాజాం: నగర పంచాయతీ పరిధి పొనుగుటివలస కూడలి చెక్‌పోస్టు వద్ద ఈ నెల 18న పట్టుకున్న నగదు వ్యవహారం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లో రాజాం టీడీపీ నేతల కారులో ప్రచార పత్రాలు మాత్రమే ఉన్నాయని సంతకవిటి ఎన్నికల అధికారులు సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. అయితే కారులో రూ. 5 కోట్లకుపైగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ మేరకు ఎస్పీ ఏ వెంకటరత్నంను ప్రభుత్వానికి రెండ్రోజుల క్రితం సరెండ్ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడినప్పటికీ అధికారులు ఉదాసీనతగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని బాహాటంగానే పలువురు విమర్శిస్తున్నారు. అయితే రోజూ ఇదే తరహాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నగదును రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎంత? కరపత్రాలతోపాటు నగదును రవాణా చేస్తున్న ఈ కారు రాజాంకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిది కావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి టీడీపీ రాజాం ఇన్చార్జి ప్రచార పత్రాలను, నగదును కారులో తరలిస్తునట్లు తెలుస్తోంది. ఈ కారును పట్టుకున్న వెంటనే పెద్ద ఎత్తులో టీడీపీ నేతల నుంచి ఫోన్లు రావడంతో మొదటి నుంచి ఈ తంతు అనుమానాస్పదంగా మారింది. ఇదే విషయమై చోద్యం చూడటంపై ఎన్నికల సంఘం ఎస్పీపై బదిలీ వేటు వేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయినప్పటికీ ఆ రోజు తనిఖీల్లో ఎంత నగదు పట్టుకున్నారో తెలియరావడం లేదు. రూ.5 కోట్ల అని కొందరూ, రూ. 10 కోట్లు అని మరికొందరూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. చివరకు నగదు దొరికిందా లేదా..ఎంత దొరికింది... అసలేం జరిగిందనేది మాత్రం ఇటు తనిఖీ అధికారులుగానీ, అటు పోలీసులుగానీ వెల్లడించకపోవడం గమనార్హం. ఈ తంతు కారణంగా రాజాం నియోజకవర్గ ఎన్నికల తనిఖీ అధికారుల్లో ప్రస్తుతం గుబులు అధికమైంది. -
ఇక కంటైనర్ చెక్‌పోస్టులు
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని వివిధ ప్రాంతా లకు గంజాయి అక్రమ రవాణా చేసే ప్రాంతాల్లో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. విశాఖ ఏజెన్సీలో ఏటా పది వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. డిసెంబర్ నాటికి గంజాయి సాగు పూర్తవుతుంది. జనవరి నుంచి గంజాయి రవాణా ఊపందుకుంటుంది. దీంతో స్మగ్లర్లు గంజాయి రవా ణాకు ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు. ఎక్సైజ్, పోలీసుల కళ్లుగప్పి స్మగ్లర్లు గంజా యిని వివిధ వాహనాలు, రైళ్లలో ఇతర ప్రాంతా లు, రాష్ట్రాలకు తరలించుకుపోతూనే ఉన్నారు. గంజాయి సాగు సీజను ముగిశాక స్మగ్లర్లు వాటి రవాణాపైనే దృష్టి సారిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పట్నుంచో ఆలోచన చేస్తున్నారు. తొలుత విశాఖ జిల్లాలో పది చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఇందుకు స్థలం సమస్య అడ్డంకిగా మారింది. కొన్నిచోట్ల రెవెన్యూ, మరికొన్ని చోట్ల అటవీ భూములు ఉన్నాయి. ఆ స్థలాల్లో చెక్‌పోస్టులకు అవసరమైన నిర్మాణాలకు ఆయా శాఖల నుంచి అనుమతులు రావాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది. దీంతో చెక్‌పోస్టుల ఏర్పాటు ఆలోచన ఉన్నా అడుగు ముందుకు పడడం లేదు. తాత్కాలికంగా కొన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నా అంతగా ఫలితం ఉండడం లేదు. ఫలితంగా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం కొత్త ఆలోచన చేశారు. చెక్‌పోస్టుల నిర్మాణాలకు జాప్యం జరుగుతుందన్న ఉద్దేశంతో కంటైనర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికయితే భూమి కేటాయింపులకు అవసరమైన ప్రక్రియలో పెద్ద జాప్యం ఉండదు.కంటైనర్లను కొనుగోలు చేసి వాటిని నిర్దేశిత ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ వాటిని చెక్‌పోస్టులకు వీలుగా మార్పులు చేసి వినియోగంలోకి తెస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో కంటైనర్‌ను రూ.4.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. కాగా కంటైనర్ చెక్‌పోస్టులను ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలోనే విశాఖలో తొలిసారిగా ఏర్పాటు చేస్తుండడం విశేషం. వంద మందికి పైగా అవసరం.. ఒక్కో చెక్‌పోస్టులో షిఫ్టుకు ఒక సీఐ/ఎస్ఐ, ఏడెనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబు ళ్లు అవసరమవుతారు. ఈ లెక్కన ఒక్కో చెక్‌పోస్టుకు 20–25 మంది చొప్పున ఐదింటిలో 100 మందికి పైగా సిబ్బంది కావల్సి ఉంటుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. అయినప్పటికీ గంజాయి రవాణాకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో సిబ్బందిని చెక్‌పోస్టులకు సర్దుబాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే.. ఏజెన్సీ నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా జరిగే ప్రధాన జంక్షన్లయిన కేడీపేట సమీపంలోని భీమవరం, చింతపల్లి రోడ్డులోని డౌనూరు, పాడేరు సమీపంలోని వంట్లమామిడి, అరకు చేరువలో ఉన్న సీతన్నపాలెం, దేవరాపల్లిలో ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. తమ శాఖ కమిషనర్ ప్రతిపాదించిన కంటైనర్ చెక్‌పోస్టులు సాధ్యమైనంత త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. -
చివరి దశలో ప్రచారం.. భారీగా పట్టుబడుతున్న నగదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇన్నాళ్లు మూటల్లో మూలిగిన డబ్బంతా బయటకు వస్తోంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నేతలు సిద్దమయ్యారు. దానిలో భాగంగానే భారీగా నగదును తరలిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు వివిధ రూపాల్లో లభించిన మొత్తం రూ. 100 కోట్లు దాటింది. ప్రచారం చివరిదశ కావడంతో అక్రమ నగదును అడ్డుకునేందుకు అధికారులు ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఒక్కరోజే ఆలేరులో 6 కోట్లు, పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద 5.80 కోట్లు, జూబ్లీహిల్స్‌లో 2 కోట్ల నగదును తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదే కాకుండా 9 కోట్లు విలువ చేసే మద్యం కూడా పట్టుబడింది. ఓటర్లను ఆకర్షించేందుకు కేవలం డబ్బు మాత్రమే కాకుండా నేతలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. దానిలో భాగంగా మోబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికారాలు, చీరలు, చేతి వాచీలను నేతలు ఎరగా చూపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇదివరకే అధిక మొత్తంలో తనిఖీల్లో నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.75 కోట్లు, ఐటీ అధికారులకు రూ. 25కోట్లు పట్టుబడింది. పోలింగ్‌కు మరో రెండు రోజుల గడవు మాత్రమే ఉండటంతో మరింత నగదు తరిలించే అవకాశం ఉందిని అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
ప్రత్యేక నిఘా..!
సాక్షి, కందనూలు: బిజినేపల్లి మండలంలో సమస్యాత్మక ప్రాతాలపై ప్రత్యేక నిఘా పెంచనున్నారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండటంతో మండలంలో ప్రశాతంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బిజినేపల్లి మండల కేంద్రంతోపాటు మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మండల కేంద్రంతోపాటు, మంగనూర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా (హైపర్ సెన్సిటీవ్ ) గుర్తించారు. మిగతా గ్రామాలను సాధారణ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసులను పటిష్ట బందోబస్తు చేస్తున్నారు. మండలంలో 14పోలింగ్ స్టేషన్లు మండలంలో 24పంచాయతీల పరిధిలో మొత్తం 64 పోలింగ్ స్టేషన్లును ఏర్పాటు చేస్తున్నారు. అందులో బిజినేపల్లిలో 6, మంగనూర్ 5, షాయిన్‌పల్లి 1, వట్టెం 1, నందివడ్డెమాన్‌లో 1పోలింగ్ స్టెషన్ చొప్పున మొత్తం 14 పోలింగ్ స్టేషన్లను హైపర్ సెన్సీటీవ్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి, వీటిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 50 పోలింగ్ స్టేషన్లను సాధారణ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి, ప్రతిరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించడంతో, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతం చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలే మండల కేంద్రంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ లక్ష్మీనర్సింహు ఆధ్వర్యంలో 100మంది పోలీసులతో కవాత్ నిర్వహించారు. ఇప్పటివరకు 13మంది బైండోవర్.. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగురు రౌడిషీటర్లు, శాయిన్‌పల్లిలో గత ఎన్నికలో గొడవలు సృష్టించిన ఆరుగురిని, ఆయా గ్రామాలకు చెందిన బెల్టుషాపుల నిర్వహుకులను బైండోవర్ చేశారు. నిఘా పెంచాం.. బిజినేపల్లితోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నిఘా పెంచాం. కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. మండలంలో ఎవరైన శాంతిభంద్రతలకు విఘాతం కలిగిస్తే వెంటనే అరెస్టు చేయడంతోపాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా అవగాహణ కార్యక్రమాలు చేపడుతున్నా. – లక్ష్మీనర్సింహులు, ఎస్ఐ, బిజినేపల్లి -
అడవి బిడ్డలపై ఆంక్షలు
మన్ననూర్ (అచ్చంపేట): అడవి బిడ్డలపై ఆంక్షలు విధిస్తున్నారు.. తమ గూడాలకు వెళ్లాలన్నా.. అవసరాలకు అడవి వీడి మన్ననూర్, అమ్రాబాద్ తదితర ప్రాంతాలకు రావాలన్నా.. ఇతర ప్రాంతాల్లో చదివే పిల్లలను పలకరించడానికి వెళ్లాలన్నా అటవీశాఖ నిబంధనలు అడ్డొస్తున్నాయి. అధికారుల అనుమతి లేనిదే మన్యం దాటే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవి తల్లికి ద్రోహమా.. అడవిలోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుని తాత ముత్తాతల కాలం నుంచి అక్కడే నివసిస్తున్నామని.. ఏ నాడూ అడవి తల్లికి ద్రోహం తలపెట్టని తమపై ఎందుకు అనుమానం అంటూ చెంచులు వాపోతున్నారు. తమ ఇళ్లకు వెళ్లాలంటే కూడా అధికారుల అనుమతి తీసుకోవాలా.. అంటూ వాపోతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలోని మల్లాపూర్, పుల్లాయిపల్లి, అప్పాపూర్, రాంపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమల్కల, సంగిడిగుండాలు తదితర పెంటలో చెంచులు తమ జీవనం సాగిస్తున్నారు. గతంలో చెంచులు కాయలు, పండ్లను అడవిలో దొరికే దుంపలతో ఆకలి తీర్చుకునే వారు. రోగమోస్తే ఆకు పసర్లతోనే సర్దుకునేవారు. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అలవాటు పడిన చెంచులు మైదాన ప్రాంతాల్లో ఉండే ప్రజలతో సంబందాలు ఏర్పరచుకుంటున్నారు. నిబంధనలు కఠినతరం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్యప్రాణి సంరక్షణ చట్టాలను సవరిస్తూ అమ్రాబాద్‌ను పులుల రక్షిత ప్రాంతంగా గుర్తించింది. వన్యప్రాణుల మనుగడకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు చట్టాల్లో అనేక సవరణలు తీసుకొచ్చింది. అదేవిధంగా అటవీ ప్రాంతంలో ముమ్మరంగా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు హద్దులు నిర్ణయించింది. అయితే ఎప్పటిలాగే చెంచులు అడవిని వదిలి అవసరాలకు వస్తుండగా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చెంచులతోపాటు ఇతరులు అభయారణ్యంలోకి అనుమతి లేకుండా రాకపోకలు చేస్తున్నారనే అనుమానంతో చెంచులకు సైతం అనుమతి తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఫర్హాబాద్ వద్ద చెకింగ్ చెంచు పెంటలకు వెళ్లాలన్నా.. బయటికి రావాలన్నా ఫరహాబాద్ వద్ద అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు నుంచి వెళ్లాల్సిందే. ఈ క్రమంలో అనేకసార్లు చెంచులు, అటవీశాఖ అధికారులు, సిబ్బందికి వాగ్వివాదం, ఘర్షనలు చోటు చేసుకున్నాయి. అధికారులు, చెంచులు తరుచూ ఒకరినొకరు చూసుకుంటూనే ఆంక్షలు విధించడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అడవి బిడ్డలపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కావాలనే చేస్తున్నరు.. మా ఇళ్లకు వెళ్లకుండా ఫారెస్టోళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నరు. జబ్బు చేసినా, దవాఖానకు వెళ్లాలన్నా, పిల్లలను చదువులకు పంపించాలన్న ప్రతిసారి పర్మీషన్ తీసుకోవాలంటే ఎట్లా.. చెకింగ్ చేసేటోళ్లు కూడా మా చెంచు బంధువులే కదా. మా గురించి వాళ్లకు తెల్వదా.. మా నుంచి నుంచి ఎవరికి ముప్పు వస్తది. – చిర్ర రాములు, చెంచుల హక్కుల సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. చెంచులను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. వారివెంట వచ్చే అనుమానితులు, ఇతరులు తారసపడినప్పుడు మాత్రమే చెక్‌పోస్టు వద్ద మా సిబ్బంది అడ్డుకుంటున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అనుసరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నాం. చెంచులతో మాకు ఎలాంటి వివక్ష లేదు. – శ్రీదేవి, ఫారెస్టు రేంజ్ అధికారి, మన్ననూర్ -
సరిహద్దుల్లో అప్రమత్తం
• 16 చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులు గిరిజన గ్రామాల్లో ఆరా • ముమ్మరంగా తనిఖీలు అయ్యప్ప భక్తులకు తంటాలు కేరళ నుంచి తప్పించుకున్న మావోరుుస్టులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశాలు ఉండడంతో సరిహద్దుల్లో అప్రమత్తంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం వ్యవహరించే పనిలో పడింది. పదహారు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ, అనుమానితులు ఎవరైనా సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలని సూచించే పనిలో పడ్డారుు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని ఒకప్పుడు మావోరుుస్టులు తమ కార్యకలాపాల్ని సాగించిన విషయం తెలిసిందే. కొడెకైనాల్లో గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో మావోరుుస్టులు అన్న పేరుకు ఆస్కారం లేకుండా పోరుుంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోరుుస్టుల్ని ఉక్కుపాదంతో అణచి వేస్తుండడంతో, అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్లు మళ్లీ పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకునే పనిలో పడ్డట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చారుు. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు చేపట్టడంతో పశ్చిమ పర్వత శ్రేణుల్లో మళ్లీ కూంబింగ్ సాగుతూ వస్తున్నది. ఈ తనిఖీల్లో అజ్ఞాతంలో ఉన్న మావోరుుస్టు నాయకుడు రూబేష్, సైనాలతో పాటు ఐదుగురు పట్టుబడడం, తదుపరి అజ్ఞాత మావోరుుస్టులు ఒక్కొక్కరుగా పట్టుబడుతుండడంతో సరిహద్దుల్లో అప్రమత్తం వేట ముమ్మరం అరుుంది. పశ్చిమ పర్వత శ్రేణుల వెంబడి ఉన్న కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్, తేని, తిరునల్వేలి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లో , సరిహద్దు చెక్ పోస్టుల్లో అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో గురువారం కేరళలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోరుుస్టులు మరణించారు. మరో పది మంది వరకు పశ్చిమ పర్వత శ్రేణుల్లోకి దూసుకెళ్లిన సమాచారంతో సరిహద్దుల్లో మరింత అలర్ట్ చేస్తూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. కేరళలో తప్పించుకున్న మావోరుుస్టులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశం ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. పశ్చిమ పర్వత శ్రేణులపై అధికార వర్గాలు నిఘా పెంచారు. క్యూబ్రాంచ్, ప్రత్యేక బలగాలు శనివారం ఉదయం నుంచి జల్లెడ పట్టే రీతిలో గాలింపు తీవ్రతరం చేశారు. గిరిజన గ్రామాల ప్రజల వద్ద అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.ఎవరైనా సంచరిస్తుంటే, తమకు సమాచారం ఇవ్వాలని సూచించి, అందుకు తగ్గ ఫోన్ నంబర్లను వారికి ఇస్తున్నారు. ఇక, అటవీ గ్రామాల్లో అనేక చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అటు వైపుగా వచ్చే వాహనాలను, అందులోని ఉన్న వాళ్లను తనిఖీల అనంతరం అనుమతించే పనిలో పడ్డారు. నీలగిరి జిల్లాల్లో అరుుతే, కోరంకుత్తు, హ్యారింగ్ టన్, వెల్లింగ్టన్, అప్పర్, లోయర్ భవానీ, కీన్న కొలవై, ఇలియ సిగై, ముత్తులి కేరళ సరిహాద్దుచెక్ పోస్టుల్లో భద్రతను మరింతగా కట్టు దిట్టం చేశారు. అలాగే, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల పరిధిలో అటవీ గ్రామాలను అనుసంధానించే విధంగా అనైకట్టు, మంగలై, పాలమలై, ముర్చి తదితర పదహారు ప్రాంతాల్లో కొత్తగా శనివారం చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సెంగోటై్ట చెక్ పోస్టులనూ భద్రతను మరింతగా పెంచారు. ఆయా గ్రామాల మీదుగా వెళ్లే చిన్నచిన్న రోడ్లలోనూ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది ద్వారా వాహనాల తనిఖీలు సాగిస్తున్నారు. ఇక, డిఐజీ దీపక్ , ఎస్పీ రమ్యభారతి, ఏడీఎస్పీ మోహన్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఆయా చెక్ పోస్టుల్ని పరిశీలించారు. వాహనాల తనిఖీ ముమ్మరం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కేరళ నుంచి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి వాహనం తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. అయ్యప్ప భక్తుల సీజన్ కావడంతో ఈ తనిఖీలతో వారికి ఇబ్బందులు తప్పలేదు. కేరళ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు భద్రతా పరంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అక్కడ కూడా భక్తులకు తనిఖీల కష్టాలు తప్పడం లేదు. -
సరిహద్దుల్లో సమీకృత చెక్‌పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెంపు లక్ష్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో సమీకృత చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్కెటింగ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు, మార్కెట్ యార్డుల పరిధిలో చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నా.. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సరిపడినంత సిబ్బంది, పర్యవేక్షణకు అవసరమైన మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలతో కలిసి సమీకృత చెక్‌పోస్టుల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులను నిర్వహిస్తుండగా.. ఇతర శాఖలతో కలిసి సమీకృత చెక్‌పోస్టుల సంఖ్యను 16కు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై మార్కెటింగ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. చెక్‌పోస్టుల వద్ద రవాణా వాహనాలతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను తరలించే వాహనాల వివరాల నమోదుకు కామన్ ఎంట్రీ పాయింట్ ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. కామన్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యం, ఫర్నీచర్ తదితర మౌలిక సౌకర్యాల కల్పన వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించారు. మూడు షిఫ్టుల్లో వాహనాల తనిఖీ, వివరాల నమోదుకు.. షిఫ్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. ఈ ఇద్దరిలో ఒకరు సహాయ కార్యదర్శి, మరొకరు సూపర్వైజర్ ఉంటారు. వాహనాల బరువును తూకం వేసేందుకు చెక్‌పోస్టుల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నివేదికలో పేర్కొన్నారు. వివిధ వాహనాల బరువును తూకం వేసేందుకు ప్రత్యేక వరుసలను ఏర్పాటు చేయాలని.. సీజ్ చేసే వాహనాలను నిలిపేందుకు షెడ్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకే! రాష్ట్రంలో ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయి. చెక్‌పోస్టుల ద్వారా లభించే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తంగా రూ.358.57 కోట్లను మార్కెట్ ఫీజు లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాభావంతో సాగు విస్తీర్ణంపై ప్రభావం, పత్తి విత్తనాలు, బియ్యంపై మార్కెట్ ఫీజు వసూలు విషయంలో అస్పష్టత నేపథ్యంలో మార్కెట్ ఫీజు వసూలుపై ప్రభావం పడుతోంది. వరి ధాన్యం, వేరుశనగ, ఇతర పప్పుధాన్యాలను రాష్ట్ర సరిహద్దులు దాటకుండా చూడటం ద్వారా మార్కెట్ ఫీజు వసూలును పెంచాలని భావిస్తున్నారు. అయితే సొంతంగా చెక్‌పోస్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక సౌకర్యాలు మార్కెటింగ్ శాఖకు లేకపోవడంతో.. తనిఖీలు, ఆదాయంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు అలంపూర్ క్రాస్ రోడ్డు వంటి జాతీయ రహదారులపై సొంతంగా చెక్‌పోస్టుల ఏర్పాటు, నిర్వహణ కష్టసాధ్యమని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. రవాణా, వాణిజ్య, ఎక్సైజ్ శాఖలు సమీకృత చెక్‌పోస్టుల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆయా శాఖలతో కలిసి వీటిని ఏర్పాటు చేయడం ద్వారా నిర్వహణ భారం తగ్గించుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. -
కారు ఢీకొని యువకుని మృతి
చిట్యాల(నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సైకిల్‌పై వెళుతున్న ఒక యువకుని కారు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. సంజీవరెడ్డి(23) అనే యువకుడు వ్యవసాయ పనుల నిమిత్తం సైకిల్‌పై పొలానికి వెళుతుండగా విజయవాడ నుంచి చిట్యాల వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో సంజీవరెడ్డి మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుని మృతికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. కారును పట్టుకునేందుకు సమీప చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెంచుల మెడపై తనిఖీల కత్తి!
► సొంతింటికీ వెళ్లాలంటేఅనుమతి తప్పనిసరి ! ► బయటికి వెళ్లాలన్నా..రావాలన్నా చెప్పి వెళ్లాల్సిందే ► నల్లమలలో అడవిబిడ్డలను అడ్డుకుంటున్న అధికారులు వారు సొంతింటికీ వెళ్లాలంటే చెక్‌పోస్టుల వద్ద రిజిస్టర్లో తమపేర్లు నమోదు చేసుకోవాల్సిందే..! మందు బిళ్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల ఏది కావాలన్నా అధికారులకు చెప్పి వెళ్లాల్సిందే..! అడవినుంచి బయటికిపోతే ఎక్కడికి వెళ్తున్నారో... ఎప్పుడు వస్తారోననే విషయాలూ చెప్పాల్సిందే..! జిల్లాలోని నల్లమల లోతట్టు అటవీప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కొన్నిరోజులుగా అమలుచేస్తున్న నిబంధనలివి.. మన్ననూర్: వందల ఏళ్లుగా ఇక్కడే పుట్టిపెరిగిన చెంచుబిడ్డలకు కొత్త ఆపదవచ్చి పడింది. నల్లమల లోతట్టు ప్రాంతం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు 12పెంటల చెంచులు మైదానప్రాంతాలకు పోవాలన్నా.. అక్కడినుంచి రావాలన్నా అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి అనే నిబంధనలు విధించారు. వారిని తనిఖీచేసేందుకు మన్ననూర్ ముఖ్యకూడలి, దుర్వాసుల చెరువు ఫర్హాబాద్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. చెంచులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. ఎప్పుడు వస్తారు..? తదితర అంశాలను నమోదుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక చెక్‌పోస్టు వద్ద చెంచుగిరిజనులు, ఫారెస్ట్ అధికారులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో వారంరోజుల క్రితం చెంచుపెంటలలోని బాలబడులకు ఆటోలో పౌష్టికాహారం తీసుకువెళ్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డగించారు. ఈ ఘటనను నిరసిస్తూ డీఎఫ్ఓ వినయ్‌కుమార్ సమక్షంలోనే మల్లాపూర్, పుల్లాయిపల్లి, అప్పాపూర్, రాంపూర్, భౌరాపూర్, సంగిడిగుండాలు, మేడిమల్కల, పందిబొర్రె, ఈర్లపెంట తదితర పెంటల చెంచులు మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద గంటపాటు ఆందోళనకు దిగారు. తరచూ అడ్డంకులు హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారికి అటవీలోతట్టులో 12కిలో మీటర్ల దూరం ఉన్న పుల్లాయిపల్లిలో ఆరు కుటుంబాల్లో 20మంది నివాసం ఉన్నారు. 18కి.మీ దూరంలో ఉన్న రాంపూర్పెంటలో 16 కుటుంబాల్లో 60మంది ఉన్నారు. 16 కి.మీ దూరంలో ఉన్న అప్పాపూర్‌లో సుమారు 34 కుటుంబాల్లో 150మంది నివాసం ఉంటున్నారు. 22కి.మీ దూరంలో ఉన్న బౌరాపూర్ చెంచుపెంటలో 15 కుటుంబాల్లో 60మంది ఉంటున్నారు. 28కి.మీ ఉన్న మేడిమల్కల పెంటలో 8 కుటుంబాలు ఉన్నాయి. 34కి.మీ ఉన్న సంగిడిగుండాలలో 14 కుటుంబాలు ఉండగా 30మంది జనాభా ఉంది. 31కి.మీ దూరంలో ఉన్న ఈర్లపెంటలో 40కుటుంబాలు ఉన్నాయి. 33కి.మీ దూరంలో ఉన్న పందిబొర్రె పెంటలో 20మంది నివాసం ఉంటున్నారు. ఆరు కి.మీ దూరంలో ఉన్న మల్లాపూర్‌లో 70మంది నివాసం ఉంటున్నారు. ఇదిలాఉండగా, శ్రీశైలం- నాగార్జునసాగర్ పులుల రక్షణప్రాంతంగా పిలిచే ఈ ప్రాంతాన్ని రెండేళ్లుగా అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంగా మార్చారు. ఇక్కడే చెంచులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పెంటల్లోని తమ ఇంటికి వెళ్తున్న తరచూ అడ్డుకుంటున్నారని, తాత్కాలిక ఉద్యోగాల ఎరచూపి చెంచుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని స్థానిక అడవిబిడ్డలు ఆరోపిస్తున్నారు. అడవికి దూరం చేసేందుకేనా..? నల్లమలను పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో చెంచు గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించాలని కొన్ని ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కొందరు చెంచులను రెండేళ్లక్రితం కర్ణాటక సరిహద్దు, కొల్లాపూర్, పరిగి, శంషాబాద్ తదితరులు ప్రాంతాలకు తిప్పి చూపించారు. ఇక్కడ నివాసాలను ఏర్పాటుచేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అటవీప్రాంతాన్ని విడిచివెళ్తే కుటుంబానికి రూ.10లక్షలు కూడా ఇస్తామని అధికారులు వారిని సన్నద్ధం చేసేందుకు యత్నిస్తున్నారు. గతంలో కొందరు చెంచులను గ్రూపులుగా చేసి ఆయా ప్రాంతాలను చూపించారు. కానీ వారిలో కొందరు సమ్మతించగా.. ఎక్కువ మంది అంగీకరించలేదు. దీంతో చెంచుల తరలింపు ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడుతున్నారు. ఈ క్రమంలోనే నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే అటవీప్రాంతం నుంచి బయటికి పోతారనే.. అధికారులు వేధిస్తున్నారని స్థానిక చెంచులు ఆరోపిస్తున్నారు. -
పశువులేగా తోలెయ్!
సిబ్బంది చెక్‌పోస్టులో..అడ్డదారిలో పశువుల రవాణా లారీల్లో కుక్కి... ఘోరంగామూగజీవాల తరలింపు చేతులు మారుతున్న రూ.కోట్లుఅమలుకు నోచుకోని చట్టాలు చోద్యం చూస్తున్నఅధికార యంత్రాంగం పెద్దఎత్తున జంతువుల అక్రమ రవాణా జరుగుతుంటే పోలీ సులు, అటు రెవెన్యూ, పశుసంవర్థక శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు.? రోజు మనకు పాలిచ్చే ఆవులను లారీల్లో కుక్కి హింసిస్తూ తరలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారా.? జంతువులపై జరుగుతున్న హింసాత్మక చర్యలను అడ్డుకోకపోవడం దారుణం.. - హైకోర్టు రోడ్డుపై లారీ ఊగుతూ మం దుకు కదిలిపోతోంది. లారీలోంచి అంబా..అంబా..అంటూ అరుపులు.. పశువుల మందను కుక్కేశారు. కొన్ని పశువుల మెడల నుంచి రక్తం కారుతోంది. తల ఎత్తేందుకు కూడా వీలులేకుండా తాళ్లతో బంధించారు. బాధతో రోదించి నోటి వెంట నురగ కారుతోంది. ఈ దృశ్యాలు ఎవరికైనా కళ్లు చెమర్చక మానదు. అయ్యో..పాపం అనకతీరదు. నెల్లూరు(అగ్రికల్చర్) : మూగజీవాల రవాణాలో హింసను నివారించేందుకు ఎన్నో చట్టాలు వచ్చినా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. మానవాళికి ఎంతో మేలు చేస్తున్న పశువులను కనీస కనికరం లేకుండా లారీల్లో కుక్కి తీసుకెళ్లే దృశ్యాలు నిత్యం హైవేపై కన్పిస్తునే ఉన్నాయి. జంతు ప్రేమికుల వేదన అరణ్య రోదనగానే మిగులుతోంది. వేలాదిగా ఫిర్యాదులు, కోర్టు వ్యాజ్యాల అనంతరం కొత్తగా ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి వచ్చిన నిబంధనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. లారీల్లో కుక్కి మూగజీవాల తరలింపు చర్యలు ఆగడం లేదు. కబేళాకు పోతున్నాయి.. మూగజీవాల తరలింపులో నిబంధనలు తప్పక పాటించాని చట్టం చెబుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పశువుల సంతల నుంచి గేదెలు, దున్నలు, ఆవులు, ఇతర మూగజీవాలను కబేళాకు తరలిస్తుంటారు. ఏపీ నుంచి ఎక్కువగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పశువులను తరలిస్తుంటారు. జంతు హ క్కుల కార్యకర్తలు ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టం ఈ ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి అమలులోకి వచ్చింది. నిబంధనలు ఇవీ.. ►ఆర్టీవో నుంచి అనుమతి పొందిన వాహనాల్లోనే పశువులను రవాణా చేయాల్సి ఉంటుంది. ►బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ధేశించిన కొలతల మేరకు రవాణా వాహనంలో ప్రత్యేకక్యాబిన్నుఏర్పాటు చేయాలి. ►దున్న లేదా ఆవు వంటివి తరలిం చేందుకు ఒక్కొక్క క్యాబిన్‌ను రెండు చదరపు మీటర్ల మేర ఏర్పాటు చేయాలి. ►గుర్రాలకైతే 2.5 చ.మీ, గొర్రె, మేకలకు 0.3 చ.మీ, పందులకు 0.6 చ.మీ, కోళ్ల కోసం 40 సెంమీటర్ల వైశాల్యంతో కూడిన ప్రత్యేక క్యాబిన్లు ఉండాలి. ►ప్రత్యేక లెసైన్స్ పొందిన వాహనాల్లో మాత్రమే మూగజీవాలను తరలించాలి. ► పశువులను తరలించే వాహనాల్లో నీటి తొట్టి, పశుగ్రాసం ఏర్పాటు చేయాలి. ► పశువుల ఆరోగ్యంపై స్థానిక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జారీచేసే సర్టిఫికెట్ తప్పనిసరి. పశువుల ఆరోగ్యం పరిరక్షణను పశుసంవర్థక శాఖ పర్యవేక్షించాలి. ► చెక్‌పోస్టుల వద్ద జిల్లా నుంచి తరలిస్తున్న, జిల్లాకు తీసుకొస్తున్న పశువులను, జీవాల నుంచి వ్యాధులు వ్యాప్తిచెందకూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► నిబంధనలు పాటించని పక్షంలో వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహన యజమానిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ► అక్రమరవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల్లో పోలీసు, రెవెన్యూ, రవాణా, పశుసంవర్థక శాఖల అధికారులు ఉమ్మడిగా తనఖీలు నిర్వహించాలి. సిబ్బంది చెక్‌పోస్టులో... అడ్డదారిలో పశువుల తరలింపు పశువుల రవాణాను పర్యవేక్షించాల్సిన అధికారులు తడ ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఉంటున్నారు. అయితే అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాలు నాయుడుపేట మీదుగా ఇతర జిల్లాలకు ఆపై ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. జిల్లాకు రావాల్సిన ఆదాయానికి భారీస్థాయిలో గండిపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అక్రమ రవాణాదారులు మాఫియాగా ఏర్పడి నాయుడుపేట మీదుగా భారీస్థాయిలో పశువులను తరలిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో గంటకు ఒక వాహనం చొప్పున తరలివెళ్తుందంటే ఏస్థాయిలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారో అర్ధమవుతుంది. అమలుకాని నిబంధనలు... జిల్లాలోని మనుబోలు సంత నుంచి ఒక్కనెలలోనే వేలాది పశువులు తరలివెళ్తుంటాయి. వీటిని తరలిం చే క్రమంలో నిబంధనలు అమలు కాకపోవడంపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి.... ఎన్ని జంతువులను రవాణా చేసింది తదితర వివరాలను పర్యవేక్షించేందుకు సంత పర్యవేక్షణ కమిటీల ను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే పశుసంవర్థక శాఖ ఈ మేరకు జీఓ నం. 23ను 2015 అక్టోబర్ 1న జారీ చేసింది. ప్రతినెల ఈ కమిటీ ద్వారా ఏపీసీఏ(సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్) చైర్మన్ అయిన కలెక్టర్‌కు నివేదిక అందజేయాల్సి ఉంటుంది. మా దృష్టికి రాలేదు : పశువులను నాయుడుపేట మీదుగా తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. తనిఖీ కేంద్రాల వద్ద పశువులకు ఆరోగ్యపరీక్షలు చేస్తున్నాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం. పశువులు తరలించే వాహనాల్లో నీటి సదుపాయం, పశుగ్రాసం కచ్చితంగా ఉండాలి. ఏ పశువును తరలించాలన్నా స్థానిక పశువైద్యుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. - శ్రీధర్‌కుమార్, పశుసంవర్థకశాఖ జేడీ -
పోలవరం ముంపు గ్రామాల్లో 144 సెక్షన్ విధింపు
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాల్లో సోమవారం పోలీసులు ఆంక్షలు విధించారు. బయటివారు ముంపు గ్రామాల్లోకి ప్రవేశిస్తే కేసు నమోదుకు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. చెక్‌పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో ముంపు గ్రామాల గిరిజనులు భయాందోళనలో ఉన్నారు. -
జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద అక్రమాలు పెరిగిపోయాయి. ఈ విషయంపై నిఘా పెట్టిన మీడియా ప్రతినిధులు కవరేజ్ కోసం వెళ్లారు. లంచాలు తీసుకుంటుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ విషయాన్ని గ్రహించిన చెక్ పోస్ట్ అధికారులు మీడియా వారిపై దాడికి పాల్పడ్డారు. తమపై జరిగిన దాడికి నిరసనగా రేణిగుంట-చెన్నై రహదారిపై జర్నలిస్టులు ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై 4 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. -
జీరో దందా జోరు
♦ నెలకు రూ.300 కోట్లు ♦ రాష్ట్ర సరిహద్దుల ద్వారా దర్జాగా అక్రమ రవాణా ♦ ఏపీ సరిహద్దుల్లో ఇప్పటికీ ఏర్పాటు కాని చెక్‌పోస్టులు ♦ అతీగతీ లేని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: జీరో దందా జోరుగా సాగుతోంది. పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటూ అక్రమార్కులు సరుకులు తరలిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది. ప్రతిరోజు కోట్ల రూపాయల విలువైన వస్తు సామగ్రి అక్రమంగా రాష్ట్రానికి తరలివస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 19 నెలలు గడుస్తున్నా ఏపీ సరిహద్దుల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఏడు చెక్‌పోస్టుల్లో ఒక్కదానికీ మోక్షం లభించలేదు. దీంతో ప్రతినెలా సుమారు రూ.300 కోట్ల విలువైన వస్తు సామగ్రి అక్రమంగా రాష్ట్రానికి తరలివస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తెలియజేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. వాణిజ్యపన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గత ఆరునెలల్లో జరిపిన దాడుల్లోనే రూ.1,300 కోట్లకుపైగా విలువైన జీరో వ్యాపారాన్ని కనుగొన్నారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఈ సరుకుకు సంబంధించి రూ.100 కోట్ల మేర వాణిజ్యపన్నుల శాఖ అపరాధరుసుము, పన్నుల కింద నోటీసులు పంపించడమేగాక, అందులో రూ. 45 కోట్ల మేర ఇప్పటికే వసూలు చేసింది. కట్టుదిట్టమైన నిఘా ఉంటే అధికారికంగానే నెలకు రూ.30 కోట్ల వరకు పన్ను రూపంలో ప్రభుత్వానికి సమకూరుతుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులే అంగీకరించడం గమనార్హం. హైదరాబాద్‌లోని బేగంబజార్, ఫీల్‌ఖానా, సిద్దిఅంబర్‌బజార్, అబిడ్స్‌తోపాటు సికింద్రాబాద్‌ల నుంచే ఈ దందా పెద్దఎత్తున సాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో 80 శాతం ట్రక్కులు అక్రమ రవాణాకే వినియోగిస్తున్నారంటే దందా ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల నకిలీ వేబిల్లులు, ట్రాన్సిట్ పాస్‌లతో అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, జైపూర్‌ల నుంచి అక్రమ రవాణా సాగుతుండగా, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ ట్రాన్సిట్ పాస్‌లతో కేరళ, కర్ణాటకల నుంచి సరుకు రవాణా జరుపుతున్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులే పరిష్కారం తెలంగాణ, ఏపీల మధ్య ఏర్పాటు చేయతలపెట్టిన 7 చెక్‌పోస్టులతోపాటు ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక సరిహదుల్లో ఉన్న మరో 7 చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్(సకల హంగులతో గల చెక్‌పోస్టులు)గా మార్చాలని వాణిజ్య పన్నుల శాఖ కోరుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. సీసీ కెమెరాలతోపాటు, స్కానర్లు, జీపీఎస్ విధానం, ఇతర అధునాతన హంగులన్నీ ఉండే ఈ చెక్‌పోస్టుల వద్దకు లారీ వస్తే అందులో ఉన్న సరుకు ఏంటో, ఏ రాష్ట్రం నుంచి వస్తోందో కనుగొనే వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం సీఎం కేసీఆర్‌కు వాణిజ్యపన్నుల శాఖ ప్రతిపాదనలను వివరించారు. రూ.400 కోట్లు ఖర్చు చేస్తే 14 చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్‌గా మార్చవచ్చని, అదనంగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరుతుందని ఆయన వివరించారు. వచ్చే బడ్జెట్లో ఈ మొత్తాన్ని కేటాయించాలని కోరారు. -
చెక్ పోస్టులపై ఏసీబీ పంజా
* ఒకేరోజు ఎనిమిది ఆర్టీఏ చెక్పోస్టులపై దాడి... * లెక్కచూపని లక్షలాది రూపాయలు సీజ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించే వాహనాలను సరిహద్దుల వద్దే తనిఖీలు చేసి, నిరోధించాల్సిన ఆర్టీఏ (రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ) అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. చెక్‌పోస్టులను అడ్డాగా చేసుకొని చెలరేగిపోతున్న వ్యవహారం అవినీతి నిరోధక శాఖ దాడుల్లో వెలుగుచూసింది. లక్షలాది రూపాయల ‘అక్రమ’సొమ్మును స్వాధీనం చేసుకుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది సరిహద్దు చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ చెక్‌పోస్టు వద్ద లెక్కలోకి రాని రూ.84 వేలు లభించాయి. నల్లగొండ జిల్లా కోదాడలో రూ.30 వేలు, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద రూ.7 వేలు, ముత్తగూడెం వద్ద రూ.15 వేలు పట్టుబడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి వద్ద రూ.58 వేలు, బోరాస్ చెక్‌పోస్టు వద్ద రూ.45 వేలు, నిజామాబాద్ జిల్లా మగ్నూర్ వద్ద రూ.44 వేలు, మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద రూ.52వేలు లెక్కలోకి తేలని సొమ్ము దొరికింది. ఖజానాకు భారీగా గండి! రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ముఖ్యశాఖల్లో ఆర్టీఏ (రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ) కూడా ఒకటి. వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు రహదారి చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే సరుకులకు విభాగాల వారీగా ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. కానీ మామూళ్లకు అలవాటు పడిన కొందరు అధికారులు పన్ను ఎగవేతదారులను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్, పర్మిట్, ఓవర్‌లోడ్ చెకింగ్ చేయకుండానే లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు. దీంతో కోట్ల విలువ చేసే వస్తువులు అక్రమ మార్గంలో రాష్ట్రంలోకి ప్రవేశించి నల్లబజారుకు చేరుతున్నాయి. ఇలాంటి అధికారులు, సిబ్బంది సహకారంతో బడా వ్యాపారవేత్తలు ప్రభుత్వం కళ్లుగప్పి యథేచ్చగా జీరో దందా చేస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారు. ఇలా రాష్ట్రంలోకి గ్రానైట్, మార్బుల్స్, ఎలక్ట్రికల్ పరికరాలు వంటివి పన్నులు చెల్లించకుండా వచ్చేస్తున్నట్లు ఇటీవల వాణిజ్యపన్నుల శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ శాఖలో ప్రభుత్వం నిర్దేశించుకున్న పన్నుల లక్ష్యం తగ్గిపోతోంది. అంతా ప్రైవేట్ సైన్యమే! రాష్ట్రంలో పన్నుల ఆదాయం భారీగా తగ్గడంతో వాస్తవాలను తేల్చేందుకు ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక బృందాలను నియమించింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న సరుకులు, సరిహద్దుల్లోని చెక్పోస్టులపై అధ్యయనం చేసింది. దీంతో ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద జరుగుతున్న తతంగం బయటపడింది. ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద ఎంవీఐ (మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్) ఒకరు ఇన్చార్జిగా పూర్తిబాధ్యత నిర్వర్తిస్తారు. వీరి కింద ముగ్గురు ఏఎంవీఐలు మూడు షిప్టుల్లో ఉండాలి. కానీ అధికారుల అవగాహనతో రోజంతా ఒక్కరే ఉంటున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది సైతం యూనిఫామ్‌ను ధరించరు. అసలు ఏఎంవీఐలు ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వారు సైతం ప్రతీ గంటకు ఒకరి చొప్పున మారుతూ డబ్బులను తరలిస్తుంటారు. ఫిర్యాదులు ఎన్నో.. అవినీతిని నిరోధించడం కోసం సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరి 11న ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రకటించారు. దాదాపు ఎనిమిది నెలల కాలంలో దీనికి ఆర్టీఏ శాఖపై 106 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై ఏసీబీ పక్కా సమాచారాన్ని సేకరించి, దాడులు చేస్తోంది. ఇంతకుముందు ఒకేసారి ఆరు చెక్పోస్టులపై దాడి చేయగా... మంగళవారం ఒకేసారి ఎనిమిది చోట్ల దాడులు చేసి, లెక్కలోకి రాని లక్షలాది రూపాయలను గుర్తించింది. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చెక్‌పోస్టుపై రెండు సార్లు దాడులు చేయగా రూ.లక్షకు పైగా పట్టుబడింది. తాజా దాడిలోనూ అత్యధికంగా రూ. 84 వేలు పట్టుబడటం గమనార్హం. -
చెక్‌పోస్టులలో ఏసీబీ తనిఖీలు
వాంకిడి (ఆదిలాబాద్) : తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆర్టీఏ, కమర్షియల్ ట్యాక్స్ చెక్‌పోస్టులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మంగళవారం చేసిన ఈ సోదాల్లో లెక్కలు చూపని రూ. 58 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
138 మంది హోంగార్డుల డిప్యుటేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో సిబ్బంది కొరతను తీర్చేందుకు వాణిజ్య పన్నుల శాఖ విజ్ఞప్తి మేరకు పోలీస్‌శాఖ 138 మంది హోంగార్డులను డిప్యుటేషన్‌పై పంపింది. తెలంగాణకు నాలుగు వైపులా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటకల సరిహద్దుల నుంచి వచ్చే వాహనాల తనిఖీకి 12 చెక్‌పోస్టులు ఉన్నాయి. అయితే సిబ్బంది కొరత కారణంగా చెక్‌పోస్టులు నామమాత్రంగా మిగిలాయి. ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ డీజీపీ 138 మందిని డిప్యుటేషన్ మీద పంపించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఎంట్రీ’ అదిరింది!
4 చెక్‌పోస్టుల నుంచి ఒక్కరోజే రూ. 1.34 కోట్లు పన్ను వసూలు సాక్షి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్: రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించే వాహనాలకు అంతర్రాష్ట్ర పన్ను విధింపు ద్వారా బుధవారం ఒక్కరోజే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని నాలుగు చెక్‌పోస్టుల నుంచి మొత్తం రూ. 1.34 కోట్లు వసూలయ్యాయి. వీటిలో ఏపీ నుంచి వచ్చిన బస్సుల ద్వారా వసూలైన మొత్తం రూ. 35 లక్షలని సమాచారం. నల్లగొండ జిల్లాలోని మూడు చెక్‌పోస్టుల నుంచి రూ. 54 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ చెక్‌పోస్టు నుంచి రూ. 80 లక్షలు వచ్చినట్లు రవాణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నల్లగొండ జిల్లాలోని నల్లబండగూడెం(కోదాడ), వాడపల్లి, నాగార్జునసాగర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ చెక్‌పోస్టు వద్ద పన్ను వసూలు ప్రారంభించారు. ప్రైవేటు ట్రావెల్స్ నుంచి త్రైమాసిక పన్ను(సీటుకు రూ. 3,675 చొప్పున), క్యాబ్‌ల నుంచి వారం రోజుల పన్ను(సీటుకు రూ. 220 చొప్పున), లారీలకు సాధారణ పన్ను వసూలు చేశారు. నల్లగొండ జిల్లాలోని మూడు చెక్‌పోస్టుల వద్ద దాదాపు 250 వాహనాలను తనిఖీ చేయగా వాటిలో 33 ప్రైవేట్ ట్రావెల్స్, 30 మ్యాక్సీ క్యాబ్‌లు, 187 లారీలు, ఇతర వాహనాలు ఉన్నాయి. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ చెక్‌పోస్టు వద్ద 37 ప్రైవేటు బస్సుల నుంచి రూ.56.32 లక్షలు, లారీలు, ఇతర గూడ్స్ వాహనాల నుంచి రూ.16,800, క్యాబ్‌ల నుంచి రూ.16,450 వసూలు చేసినట్లు స్థానిక ఆర్టీవో కిష్టయ్య తెలిపారు. పన్ను విధింపును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన బస్సులను సరిహద్దు ఆవలికే పరిమితం కావడంతో 37 బస్సులు మాత్రమే రాష్ర్టంలోకి ప్రవేశించాయి.