Chief Minister Devendra Fadnavis
-
ఫడ్నవిస్‌పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: తన సొంత పార్టీపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బీజేపీ ఎంపీ నానా పటోలే మరోసారి అదే పని చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గత కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. అన్నదాతల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి నేను ఒకే పార్టీకి చెందిన వారం కావొచ్చు. మంచి స్నేహితులమే అయి ఉండొచ్చు. అయినా తప్పు చేస్తే వెలెత్తి చూపి, అది సరిదిద్దుకునే దాకా ఫడ్నవిస్‌ను వదలను’’ అని పటోలే చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో రైతుల రుణమాఫీ కోసం ఫడ్నవిస్ ప్రభుత్వం 34 వేల కోట్ల ప్యాకేజీని విడుదల చేసింది. అదే సమయంలో నిబంధనలను కఠిన తరం చేయటం, దరఖాస్తులు ఆన్ లైన్లోనే చేసుకోవాలని సూచించటం, పైగా ఒక కుటుంబానికి 1.5 లక్షల పరిమితి మాత్రమే విధించటంపై పలువురు మండిపడుతున్నారు. వారిలో భండారా-గోండియా ఎంపీ నానా పటోలే కూడా ఉన్నారు. ఇక నానాకి సొంత పార్టీనే విమర్శించటం కొత్తేం కాదు. గతంలోనూ చాలాసార్లు బహిరంగంగానే బీజేపీ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్న భయం లేదా? అన్న ప్రశ్నకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదని, ప్రజలు తనను ఎన్నుకున్నారు కాబట్టి వారు గురించి మాత్రమే ఆలోచిస్తానని పటోలే స్పష్టం చేశారు. నానా.. కొంచెం నోరు మూసుకుంటావా! ఇప్పటిదాకా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులలో 10 లక్షలు నకిలీవే ఉన్నాయంటూ మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన ఓ ప్రకటన తీవ్ర దుమారం రేపింది. వాటి వెరిఫికేషన్ ఇంకా పూర్తికాకముందే అవి ఫేక్ అని ఎలా తేల్చారంటూ నానా పటోలే ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రిని కలిసి చర్చించగా, పాటిల్ ప్రకటనను ఫడ్నవిస్ కూడా ఖండించారు. -
'ప్రధాని వరకు ఎందుకు.. నన్ను ఢీకొట్టు చాలు'
ముంబై: తమ ప్రభుత్వానికి ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదని, దీనిపై ఏ సందేహాలు అక్కర్లేదని మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలోని బీజేపీ పార్టీ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో తమ బంధం నోటీసు పీరియడ్ లో ఉందని ఆ పార్టీ మిత్రపక్షమైన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించిన మరుసటిరోజే ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీని ఢీకొనే సాహయం చేయవద్దని, అంతగా చేతనైతే ముందుగా తనతో పోటీ పడాలని ఉద్ధవ్ ఠాక్రేకు సంకేతాలిచ్చారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 21న జరగనున్న బీఎంసీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేనిఫెస్టో రూపొందించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పులేదని, ఐదేళ్ల కాలం ఇలాగే అధికారంలో కొనసాగుతామని సీఎం ఫడ్నవీస్.. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. వాటర్ ట్యాక్స్ రేట్లలో మార్పు ఉండదని, స్ట్రీట్ ట్యాక్స్ లు వసూలు చేసే ఉద్దేశం లేదని, రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. మిత్ర పక్షాలైన బీజేపీ, శివసేన ఈ బీఎంసీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ సెగ రోజురోజుకు పెరిగిపోతోంది. మోదీ వచ్చి ఇక్కడ ర్యాలీలు నిర్వహించి, బీజేపీ తరఫున ప్రచారం చేసినా శివసేనదే విజయమని ఉద్ధవ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఫడ్నవీస్.. రాజకీయంగా తామే స్ట్రాంట్ అని, శివసేన లేకపోయినా ఏం కాదని సంకేతాలు పంపారు. -
వచ్చే నెల 15న ‘మహా’ ఒప్పందం
* అంతర్రాష్ట్ర బ్యారేజీల నిర్మాణ ఒప్పందం ముహూర్తం ఖరారు * ఇది చారిత్రకమవుతుందన్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై నిర్మించే మూడు బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఒప్పందాలకు ముహూర్తం ఖరారైంది. ముంబాయిలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్ వేదికగా వచ్చే నెల 15న బ్యారేజీ నిర్మాణాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మేరకు సోమవారం అంత ర్రాష్ట్ర బోర్డు కార్యదర్శి అజయ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. జూలై 15న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంతరాష్ట్ర బోర్డు సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణపు ఎత్తు, ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణ వ్యయ వాటాలు, మహారాష్ట్ర పింపర్డ్ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు, బోర్డు కార్యాలయ ఏర్పాటు అంశాలు ఎజెండాగా చేర్చినట్లు తెలిపారు. మహారాష్ట్రతో ఒప్పందం చరిత్రాత్మకమవుతుందని హరీశ్‌రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల మహారాష్ట్ర సీఎంతో హరీశ్‌రావు జరిపిన చర్చల సందర్భంగానే తమ్మిడిహెట్టి, మేడిగడ్డ ఎత్తుపై స్పష్టత వచ్చింది. మేడిగడ్డ 101 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో పెద్దగా ముంపులేని దృష్ట్యా, బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే 100 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయాలని ఫడ్నవీస్ సూచించారు. ముంపు ప్రాంతం, పరిహారం చెల్లింపుల ప్రక్రియ ముగిశాక 101మీటర్ల ఎత్తుకు నీటి నిల్వ పెంచే అంశమూ పరిశీలిస్తామన్నారు. ఇక తమ్మిడిహెట్టి 148 మీటర్ల ఎత్తుకు పూర్తి సమ్మతి తెలిపా రు. పర్యావరణ, అటవీ, కేంద్ర జలసంఘం అనుమతుల ప్రక్రియ కొలిక్కి వస్తున్న దృష్ట్యా దీనిపై అభ్యంతరం లేదన్నారు. ఛనాఖా-కొరటలకు సంబంధించి అటవీ, వైల్డ్‌లైఫ్, మైనింగ్‌కు అనుమతులు ఇచ్చినందున 213 మీటర్ల ఎత్తులో నిర్మాణం తమకు అంగీకారమేనని ప్రకటించారు. ఇవే వివరాలపై బోర్డు సామవేశంలో మరోమారు చర్చింది తుది నిర్ణయానికి రానున్నారు. -
101 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ
* నీటి నిల్వ ప్రస్తుతానికి 100 మీటర్ల ఎత్తులో.. * తర్వాత 101 మీటర్లకూ అనుమతి: ఫడ్నవిస్ * మహారాష్ట్ర సీఎంతో హరీశ్ చర్చలు సఫలం * ఇతర బ్యారేజీలకు మహారాష్ట్ర ఓకే * జూలై రెండోవారంలో హైదరాబాద్‌లో ఒప్పందాలు సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై తలపెట్టిన మూడు బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందాలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. జూలై రెండో వారంలో ఒప్పందం కుదుర్చుకునేందుకు మహారాష్ట్ర సమ్మతించింది. ఒప్పంద మార్గదర్శకాలపై ప్రాథమిక ప్రక్రియ పూర్తవగానే తేదీని నిర్ణయించనున్నారు. నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఈ విషయమై జరిపిన భేటీ ఫలప్రదమైంది. బ్యారేజీల ఒప్పందాలు, ఇరు రాష్ట్రాల సీఎంలతో కూడిన అంతర్ రాష్ట్ర అపెక్స్ కమిటీ భేటీ తేదీ ల ఖరారుకు హరీశ్ గురువారం ఢిల్లీ నుంచి నేరుగా ముంబై వెళ్లి ఫడ్నవిస్‌తో గంటకుపైగా సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి గిరీశ్ మహాజన్, ఇరు రాష్ట్రాల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, చాహాల్, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్రావు, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ సీఈ భగవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. 101 మీటర్ల మేడిగడ్డ డిజైన్‌కు ఓకే మూడు బ్యారేజీల నిర్మాణ అవసరాన్ని హరీశ్ ఈ సందర్భంగా వివరించారు. గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయి లో వినియోగించుకునేందుకు రూపొం దించుకున్న డిజైన్లపై స్పష్టత ఇచ్చారు. కాళేశ్వరం ద్వారా 160 టీఎంసీల నీటిని మళ్లిం చేందుకు మేడిగడ్డ అనువైన ప్రాంతమని, ఈ బ్యారేజీతో పెద్దగా ముంపు లేదని వివరించారు. 102 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో 399 హెక్టార్లు, 101.5 మీటర్లయితే 315 హెక్టార్లు, 101 మీటర్లయితే 240 హెక్టార్లు, 100 మీటర్లయితే 83 హెక్టార్ల ముంపునకు గురవుతుందని వివరించారు. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 102 మీటర్ల ఎత్తుతో 22 టీఎంసీ, 101 మీటర్లయితే 19.73 టీఎంసీ, 100 మీటర్లకు 16.5 టీఎంసీల సామర్థ్యముంటుందని వివరించారు. మహారాష్ట్ర 101 మీటర్లకు అంగీకరిస్తే తమకు సహాయకారిగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఫడ్నవిస్ తెలిపారు. అయితే నీటిని 100 మీటర్ల ఎత్తులో నిల్వ చేయాలని సూచించారు. ముంపు ప్రాంతం, పరిహారం చెల్లింపు ప్రక్రియ ముగిశాక నీటి నిల్వను 101 మీటర్ల ఎత్తుకు పెంచే అంశమూ పరిశీలిస్తామని తెలిపారు. ఇక తమ్మిడిహెట్టి ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర సీఎం పూర్తి సమ్మతి తెలిపారు. పర్యావరణ, అటవీ, కేంద్ర జల సంఘం అనుమతుల ప్రక్రియ కొలిక్కి వస్తున్నందున దీనిపై అభ్యంతరం లేదన్నారు. ఛనాఖా-కొరటకు అటవీ, వన్యప్రాణి, గనుల శాఖల అనుమతులొచ్చినందున 213 మీటర్ల ఎత్తులో నిర్మాణం తమకు అంగీకారమేనని ప్రకటించారు. ఈ బ్యారేజీల ఒప్పందాల ప్రక్రియ నిమిత్తం జూలై రెండో వారంలో హైదరాబాద్ వస్తానని కూడా హరీశ్‌కు ఫడ్నవిస్ హామీ ఇచ్చారు. దీనిపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
ముంబైలో ఆర్బిట్రేషన్ సెంటర్
ముంబై: సింగపూర్ ఇంటర్నేషన్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) త్వరలో తీవ్ర పోటీ ఎదుర్కోనుంది. వ్యాపార సంఘాల కోసం ఎస్ఐఏసీ తరహాలో ముంబైలో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ లా కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మేరకు వెల్లడించారు. ‘ముంబైలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వివాదాల పరిష్కారం కోసం ఎక్కువ మంది సింగపూర్‌కు తరలి వెళ్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలకు చెందిన సీఈవోలకు ముంబై నెలవు కాబట్టి ఈ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అని సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్‌ను ముంబైలో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ ఆర్బిట్రేషన్ సెం టర్ ఎంతో అవసరమని సీఎం అన్నారు. పెట్టుబడులకు న్యాయవ్యవస్థ కీలకమని చెప్పారు. ముంబైలో ఏర్పాటు చేస్తున్న ఆర్బిట్రేషన్ సెంటర్ దేశంలోనే మొదటిది. లాభాపేక్ష లేకుండా.. 1991 నుంచి ఎస్ఐఏసీ కొనసాగుతోంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పని చేస్తోంది. ముంబైలోని ఇండియా బుల్స్ సెంటర్ వద్ద 2013లో ఎస్ఐఏసీ అనుసంధాన సంస్థను ఏర్పాటు చేశారు. దేశానికి చెందిన వ్యాపారవేత్తలు ఎక్కువగా ఎస్ఐఏసీని ఆశ్రయిస్తున్నారని, 2014 లో విదేశీ వినియోగదారుల్లో దేశానిది మూడో స్థానమని ఎస్ఐఏసీ వెబ్సైట్ వెల్లడించింది. కోర్టు వ్యాజ్యాల కన్నా తక్కువ దీని పరిధి, అధికారం తక్కువే అయినప్పటికీ కోర్టు వ్యాజ్యాల కన్నా తొందరగా, ఖర్చు లేకుండా వివాదాలు పరిష్కారమవుతాయి. నిర్మాణ, వాణిజ్య, ఇంజినీరింగ్, కార్పొరేట్, రవాణా, సముద్ర రవాణా, బీమా సంబంధ వివాదాలను ఎస్ఐఏసీ ఎక్కువగా పరిష్కరిస్తుంది. 9-12 నెలల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. సింగపూర్‌తో సంబంధం లేని సంస్థలు కూడా ఎస్‌ఐఏసీలో వివాదాలు పరిష్కరించుకోవచ్చు. చర్చలు కూడా సంబంధిత సంస్థల దేశాల్లోనే జరుగుతాయి. దిగువ న్యాయస్థానాలు అవసరం: సీఎం కోర్టుల్లో న్యాయం పొందడానికి ఎక్కువ మొత్తంలో ధనం వెచ్చిస్తుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సత్వర అభివృద్ధికి దిగువ న్యాయస్థానాల ఆవశ్యకత ఉందని అన్నారు. తద్వారా సుప్రీం, హైకోర్టుపై భారం కూడా తగ్గుతుందని చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారుల అవసరార్థం మానవ వనరులను పెంచాలని ఎన్ఎల్యూని కోరారు. ఆస్తి హక్కులు, ఐటీపై మరింత పట్టు సాధించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. -
ఆ గ్రామాలకు రూ.5 లక్షలు
ముంబై: బాలికల జననరేటు ఎక్కువగా ఉన్న గ్రామాలకు ప్రభుత్వం త్వరలో రూ.5 లక్షల నజరానా ప్రకటించనుంది. అమ్మాయి పుట్టిన తర్వాత పిల్లలు వద్దు అనుకున్న కుటుంబాలకు బంగారు నాణేన్ని బహూకరించనుంది. మరో పక్షం రోజుల్లో కేబినెట్ ఆమోదానికి వెళ్లనున్న ‘మంజి కన్య భాగ్యశ్రీ’ పథకంలో ప్రభుత్వం వీటిని పొందుపరిచింది. అమ్మాయి పుట్టిన నాటి నుంచి ఐదేళ్ల వరకు రూ.2 వేలు బాలిక తల్లికి ఇవ్వనున్నట్లు పథకంలో పేర్కొంది. తర్వాత రూ.2,500 కు పెంచి 15 ఏళ్ల వరకు ఇవ్వనున్నారు. 15-18 ఏళ్ల మధ్య రూ.3,000 అమ్మాయి లేదా తల్లి అకౌంట్లో జమచేస్తారు. రెండో అమ్మాయి పుడితే ఈ మొత్తంలో సగం వర్తిస్తుంది. తొలి ఐదేళ్లు రూ. వెయ్యి, 5 నుంచి 15 ఏళ్ల మధ్య రూ. 1,250, 15-18 ఏళ్ల మధ్య రూ.1,500 ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు పథకం వర్తింపజేయనున్నారు. ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా.. తొలుత ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే గత మార్చిలో ప్రకటించారు. నటి భాగ్యశ్రీని పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. అయితే ఎక్కువ మొత్తంలో నిధులు అవసరమవటంతో పథకానికి ఆదిలోనే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఆర్థిక శాఖ పలు అభ్యంతారాలు వ్యక్తం చేసినప్పటికీ.. ప్రతిపాదనను కేబినెట్ ఆమోదానికి సిద్ధం చేశారు. కాగా, బాలికల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి సుకన్య పథకంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని చేర్చింది. ప్రస్తుతం ఆడపిల్ల పుడితే రూ.21,000 అమ్మాయి పేరిట ప్రభుత్వం డబ్బు జమ చేస్తోంది. దానితో పాటు రూ.లక్ష బీమాను కూడా వర్తింపజేస్తోంది. కాగా, అమ్మాయి నైపుణ్యాభివృద్ధికి పైన పేర్కొన్న సొమ్ములో కనీసం రూ.10,000 ఖర్చు చేయాలి. ముఖ్య వివరాలు.. * బాలికల జననరేటు ఎక్కువగా ఉన్న గ్రామాలకు రూ. 5 లక్షల నజరానా * అమ్మాయి పుట్టిన తర్వాత పిల్లలు వద్దనుకున్న కుటుంబాలకు బంగారు నాణెం * పుట్టిన మొదటి అమ్మాయికి ఐదేళ్ల వరకు రూ. 2,000, 5-15 ఏళ్ల వరకు రూ. 2,500, 15-18 ఏళ్ల మధ్య రూ. 3,000 నెలవారీ ఖర్చులు ఇవ్వడం * రెండో అమ్మాయికి ఐదేళ్ల వరకు రూ. 1,000, 5-15 ఏళ్ల వరకు రూ. 1,250, 15-18 ఏళ్ల మధ్య రూ. 1,500 నెలవారీ ఖర్చులు -
ఏ ముహూర్తంలో ప్రమాణం చేశారో?
- బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఠాక్రే - ఫడ్నవీస్ ప్రభుత్వానికి చురకలంటించిన ఉద్ధవ్ - సీఎం ఇబ్బందుల్లో పడే అవకాశముందని వ్యాఖ్య సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ మంత్రులపై వస్తున్న ఆరోపణ లు, వివాదాలపై శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం ఫడ్నవీస్, మంత్రి మండలి ఏ ముహుర్తంలో ప్రమాణస్వీకారం చేశారో మరోసారి పరిశీలించాలని ఎద్దేవా చేశారు. సామ్నా దినపత్రికలో ‘ఆది బసూ మగ్ బోలూ’ (ముందు కూర్చుందాం, ఆ తర్వాత మాట్లాడదాం) అనే శీర్షికతో వచ్చిన సంపాదకీయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ మంత్రులకు తనదైన శైలిలో ఉద్దవ్ ఠాక్రే చురకలంటించారు. కొద్ది రోజులుగా ఫడ్నవీస్ కేబినె ట్లోని మంత్రులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఫడ్నవీస్ వల్లే గంటన్నరపాటు ఆలస్యమైందన్న వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లిన రోజున ప్రవీణ్ పరదేశి అనే ఐఏఎస్ అధికారి వీసా, పాస్‌పోర్టుతోపాటు మరికొన్ని పత్రాలు ఇంటివద్ద మరిచిపోయారని, దీంతో విమానం గంటపాటు ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై పీఎంఓ కార్యాలయం కూడా నివేదిక కోరింది. అయితే సీఎం ఫడ్నవీస్ ఘటన విషయమై సహనం కోల్పోయి మీడియాపై రుసరుసలాడారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని ఉద్ధవ్ పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఫడ్నవీస్ మంత్రిమండలిలోని నీటిపారుదల శాఖ మంత్రి లోణికర్ నకిలీ డిగ్రీ వివాదం, అనంతరం వినోద్ తావ్డే బోగస్ యునివర్సిటీ అంశం బయటికివచ్చింది. దీంతోపాటు తావ్డే శాఖలో రూ. 191 కోట్లు, పంకజా ముండే శాఖలో రూ. 206 కోట్ల కాంట్రాక్టుల కుంభకోణం విషయంపై వివాదాలు బహిర్గతమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. శివసేన లేకుండానే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ఇలా జరగడం మహారాష్ట్ర కులదైవమైన శివాజీ మహారాజుకు నచ్చలేదేమోనన్నారు. అందుకే ఫడ్నవీస్ ప్రభుత్వం అనేక వివాదాల్లో చిక్కుకుంటోందని సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రమాణస్వీకారం ఎప్పుడు చేశారనేదానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. -
మా వల్లే అధికారంలోకి..
సాక్షి, ముంబై: బీజేపీపై తమ మిత్రపక్షం శివసేన మరోమారు ఫైర్ అయ్యింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు గెలుపొందినా.. శివసేన లేకుండా అధికారం దక్కించుకోలేక పోయిందని ఆ పార్టీ నేత అనీల్ దేశాయ్ ఎద్దేవా చేశారు. ‘ఒంటరిగా పోటీ చేయడం వల్లే మా బలం తెలిసింది. పొత్తు లేకుండా పోటీ చేయడం వల్లే 120 స్థానాలు గెలుపొందాం’ అని ఆదివారం కొల్హాపూర్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర ్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన అనీల్ సోమవారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలే శివసేన బలమని, శివసేన అనేది ఒక శక్తి అని అభివర్ణించారు. అయితే బీఎంసీ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నట్టు ఫడ్నవీస్ ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. రాష్ట్రంలో బీజేపీతో కలసి ప్రభుత్వంలో పాలుపంచుకుంటున్నా.. తమ పాత్రను శివసేన స్పష్టంగా తెలుపుతూ వస్తోందని అన్నారు. వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. -
చైనా స్పందనకు కృతజ్ఞతలు
సీఎం ఫడ్నవీస్ - ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన - సోమవారం అర్ధరాత్రి ముంబై చేరుకున్న సీఎం - అక్కడి కంపెనీలతో పలు ఒప్పందాలు - రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చైనా కీలకపాత్ర పొషిస్తుందని వెల్లడి ముంబై: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చైనా వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం అర్ధరాత్రి ముంబై చేరుకున్నారు. ‘చైనా స్పందనకు కృతజ్ఞతలు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చైనా ముఖ్య పాత్ర పోషించనుంది’ అని నగరానికి చేరుకున్న తర్వాత ఆయన ట్వీట్ చేశారు. ప్రధానితో కలసి మే 14 చైనా పర్యటనకు వెళ్లిన సీఎం ఫడ్నవీస్.. బీజింగ్‌లో జరిగిన రాష్ట్రాలు, ప్రావిన్సుల ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ‘స్థిర పట్టణీకరణ, స్మార్ట్ సిటీ, స్మార్ట్ లివింగ్’, అలాగే దేశాల అభివృద్ధిలో రాష్ట్రాల పాత్రపై చర్చించారు. పర్యటనలో భాగంగా ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కార్యక్రమం గురించి చైనా కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు వివరించారు. పలు చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ టెర్రీ గూ, చైనీస్ ఆటోమోబైల్ సంస్థ బిక్వీ ఫోటాన్ చైర్మన్, సీఈవో జిన్ యూ వాంగ్‌తో సీఎం సమావేశమయ్యారు. బీజింగ్, హాంగ్జూ, చెంగ్డూ నగరాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతోనూ భేటీ అయ్యారు. అజంతా-ఎల్లోరా గుహలున్న ఔరంగాబాద్ నగరాన్ని ‘సిస్టర్ సిటీ’లో భాగంగా డొంగ్వాన్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. హెయర్, యాప్, సీజీజీసీ, తైవాన్ పరిశ్రమ, గ్రేట్ వాల్ మోటార్స్ ఇతర అతిపెద్ద పారిశ్రామికాధికారులతో ఆయన సమేశమయ్యారు. గత నెలలో కూడా సీఎం జర్మనీ, ఇజ్రాయెల్ దేశాలలో పర్యటించి ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ ప్రయోజనాల గురించి వివరించారు. -
‘ప్రమోద్’ గార్డెన్‌ను ప్రారంభించిన సీఎం
- మంత్రి సుభాష్, రేఖా మహాజన్ హాజరు సాక్షి, ముంబై: దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ పేరిట దాదర్‌లో ఏర్పాటు చేసిన గార్డెన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. గార్డెన్ పనులన్నీ పూర్తయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా పలు కారణాల వల్ల ప్రారంభం కాలేదు. ప్రమోద్ మహాజన్ వర్ధంతిని పురస్కరించుకుని ఉద్యానవనాన్ని ఆదివారం ప్రారంభించినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ప్రారంభోత్సవానికి మంత్రి సుభాశ్ దేశాయ్, ప్రమోద్ భార్య రేఖా మహాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉద్యానవన నిర్వహణ బాధ్యతలను 2014 ఆగస్టు నుంచి చూస్తూ వస్తున్న బీఎంసీకి చెందిన సేవ్రేజ్ ఆపరేషన్స్ (ఎస్వో) విభాగమే చూసుకోనుంది. కార్యక్రమంలో ఎంపీ పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. నగరవాసులకు పచ్చదనంతో కూడిన ఉద్యానవనం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సేవ్రేజ్ ఆపరేషన్స్, ఉద్యాన వన విభాగానికి మధ్య సయోధ్య లేకపోవడం వల్ల ఉద్యానవన ప్రారంభం ఆలస్యం అయిందని చెప్పారు. ఉద్యానవనంలో మామిడి, కొబ్బరి, గుల్మోహర్, బన్యన్, రావి తదితర భారీ వృక్షాలు ఉన్నాయి. పూల కుండీల్లో సమారు 2.5 లక్షల మొక్కలు ఉన్నాయి. దీని అభివృద్ధికి దాదాపుగా రూ.30 కోట్ల వ్యయం అయినట్లు సమాచారం. 75 శాతం కంటి వ్యాధులను నయం చేయొచ్చు! ‘కంటికి సంబంధించిన 75 శాతం వ్యాధులను నయం చేయవచ్చు. అయితే ప్రజల్లో వ్యాధులకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం, తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా మందికి చికిత్స అందడం లేదు’ అని రాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య శాస్త్రం పురోగతి చెందుతోందని, సాధారణ ప్రజానీకానికి వైద్య శాస్త్ర ఫలాలు అందించాలని కోరారు. యువ వైద్యులు ప్రజాసేవకు అంకితం కావాలనే ఆకాంక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సబర్బన్ ముంబైలోని ‘అనిదీప్ కంటి ఆస్పత్రి’ని ఫడ్నవీస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో కంటి చూపు ఇవ్వడం కంటే గొప్ప దీవెన ఇంకోటి లేదు. కళ్లు లేని వారికి చూపు ప్రసాదించడం కూడా దీవెన లాంటిదే. 75 శాతం వ్యాధులను నయం చేయవచ్చు. అయితే ప్రజల్లో వ్యాధులకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం వల్లే ఆశించనంత మేర బాధితులకు సాయం జరగలేదు’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి దీపక్ సావంత్, ఆయన కుమారుడు ప్రముఖ సర్జన్ స్వప్నేశ్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. -
1న సీఎం నివాసం ముట్టడి
- డిమాండ్ల పరిష్కారం కోసం మిల్లు కార్మికుల నిర్ణయం - గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడి సాక్షి, ముంబై: డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసం వర్షా బంగ్లాను ముట్టడించాలని మిల్లు కార్మికులు నిర్ణయించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మే ఒకటిన గ్రాంట్రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ గా బయలుదేరి వెళ్లి వర్షా బంగ్లాను ఘేరావ్ చేయనున్నట్లు గిరిణ కామ్‌గార్ కృతి సమితి సభ్యులు తెలిపారు. మిల్లు కార్మికులకు ఇళ్లు నిర్మించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వ హ యాంలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే అప్పటి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. ఆ సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని బీజేపీ తెలిపింది. సమస్యల పరి ష్కారానికి 2015 జనవరి 20న గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి రవీంద్ర వాయ్‌కర్, అనంతరం ఫడ్నవీస్‌తో కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం సమావేశమై నివేదిక సమర్పించింది. అయితే అధికారంలోకొచ్చి ఏడునెలలు అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న కార్మికులు ఎంహెచ్ఏడీఏ వద్ద అందుబాటులో ఉన్న మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించే పనులు ప్రారంభించింది. ఇక్కడ సుమారు ఎనిమిది వేల ఇళ్లు లభించనున్నాయి. అలాగే ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) 11 వేల ఇళ్లు నిర్మించింది. మొత్తం 19 వేలకుపైగా నివాసాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే వీటిని కార్మికులకు అందజేసే విషయంపై గాని, లాటరీ వేసే విషయం గానీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. -
రాష్ట్రంలో ఏం జరుగుతోంది?
సాక్షి, ముంబై: ‘‘ఎమ్మెల్యేలకు బెదిరింపులు వస్తున్నాయి. పట్టపగలే నేరాలు జరుగుతున్నాయి. పోలీసుల ఇళ్లలో మాద కద్రవ్యాలు దొరుకుతున్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’ అని మాజీ ముఖ్యమంత్రి అజీత్ పవార్ ప్రశ్నించారు. అసెంబ్లీలో గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పవార్ నిలదీశారు. ఇటీవల హత్యకు గురైన కమ్యునిస్టు సీనియర్ నేత గోవింద్ పాన్సరే హంతకులు ఇంతవరకు పట్టుబడలేదని, రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, రాష్ట్ర ఉప రాజధాని, ఫడ్నవీస్ నియోజకవర్గమైన నాగపూర్‌లో సైతం నేరాలు అధికమవుతున్నాయని విమర్శించారు. పెరుగుతున్న నేరాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫడ్నవీస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పవార్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. మోడీకి ముస్లింలు కూడా ఓటు వేశారనే విషయం గుర్తుంచుకోవాలని చురకలంటించారు. ధన్గర్ సమాజానికి ఇచ్చిన హామీ నెరవేర్చడంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంపై విమర్శల వర్షం గవర్నర్ ప్రసంగంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. స్వైన్ ఫ్లూ రాష్ట్రంలో స్వైర విహారం చేస్తోందని, అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ తన ప్రసంగంలో ఏమాత్రం ఫ్లూ గురించి ప్రస్తావించలేదన్నారు. శివాజీ పేరు చెప్పుకుని ఓట్లడిగిన బీజేపీ, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన స్మారకం నిర్మించే ఊసే ఎత్తడం లేదన్నారు. ఆర్.ఆర్.పాటిల్ వృుతితో ఖాళీ అయిన తాస్గావ్ శాసనసభ నియోజకవర్గంలో ఉపఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా చూడాలని ఈ సందర్భంగా అన్ని పార్టీలను కోరారు. ఠాక్రేను మర్చిపోకండి ముంబై: శివసేన సుప్రీం బాల్‌ఠాక్రే సహకారాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మర్చిపోకూడదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో పవార్ మాట్లాడుతూ.. ఠాక్రేకోసం ప్రతిపాదించిన స్మారకం గురించి ప్రభుత్వం మాట్లాడలేదని విమర్శించారు. గో వధ గురించి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న పశువులకోసం ప్రభుత్వం రైతులకు ఏం చేయబోతోందని ప్రశ్నించారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఠాక్రే స్మారకం నిర్మాణానికి తమకు పవార్ సిఫార్సు అవసరం లేదన్నారు. ముంబైలో ఠాక్రే కోసం అద్భుతమైన స్మారకాన్ని నిర్మిస్తామన్నారు. ఎన్నికల ముందు బీజేపీ-శివసేన పొత్తు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఠాక్రే సహకారం తమకు గుర్తుందన్నారు. గవర్నర్ ప్రసంగంలో శివాజీ స్మారకం గురించి ప్రస్తావించలేదన్న ప్రతిపక్ష మాటలకు స్పందిస్తూ..పదిహేనేళ్లుగా స్మారకం గురించి తాము ప్రస్తావిస్తున్నామన్నారు. -
బడ్జెట్లో ‘ముస్లిం’లే కీలకం
సాక్షి, ముంబై: బడ్జెట్ సమావేశాల్లో ముస్లిం రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. ఎన్నికలకు ముందు విడిపోయిన రెండు కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా రిజర్వేషన్ల విషయంపై బీజేపీకి వ్యతిరేకత తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మొదటి బడ్జెట్ సమావేశాలు మార్చి తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమవనున్నాయి. మార్చి 18న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఒక్కటి కానున్న కాంగ్రెస్, ఎన్సీపీ? ముస్లీం రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలకు ముందు విడిపోయిన రెండు కాంగ్రెస్‌లు ఒక్కటయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ముస్లిం ఓటర్లలో ‘ఎంఐఎం’ పార్టీ ఆదరణ పెరుగుతున్న తరుణంలో రిజర్వేషన్లపై ముస్లింలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆదేశాలు వెనక్కితీసుకోవాలని బీజేపీని పట్టుబడుతున్నాయి. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించాయి. గతంలో ముస్లిం వర్గం ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ఓటుబ్యాంకుగా ఉండేవి. అయితే ఎంఐఎం వచ్చిన తర్వాత అనేక మంది ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకోవడమే ఇందుకు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యంగా రాబోయే ఔరంగాబాద్, ముంబై, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచకుని ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఎంపీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్‌తోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరే బీజేపీ తన ఆదేశాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేదిలేదని సమాచారం. రిజర్వేషన్ రద్దు కాలేదు-ముఖ్యమంత్రి.. ముస్లీం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదని అలానే కొనసాగుతాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు. రిజర్వేషన్లు రద్దు చేశారనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తమ ప్రభుత్వం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ (అందరితో, అందరి వికాసం) అనే నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. -
శివాజీ కోటలు లేనందునే ఉగ్రవాదుల చొరబాటు
పింప్రి, న్యూస్‌లైన్: సముద్ర తీరాల వెంట ఛత్రపతి శివాజీ నిర్మించిన కోటలను మనం భద్రంగా కాపాడుకొని ఉంటే కసబ్ లాంటి ఉగ్రవాదులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారు కాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. నిర్వహణ లోపం కారణంగా ఆ కోటలు కనుమరుగైపోయాయని అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన జన్మస్థలమైన పుణే జిల్లా, జున్నర్ కోటపై ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫడ్నవీస్‌తోపాటు గ్రామాభివృద్థి శాఖ మంత్రి పంకజా ముండే, పాలవే, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి గిరీష్ బాపట్, సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి దిలీప్ కాంబ్లే, జలవనరుల శాఖ సహాయ మంత్రి విజయ్ శివ్‌తారే, ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే, శిరూర్ ఎంపీ శివాజీరావ్ పాటిల్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రదీప్ కంద్, ఎమ్మెల్యే వినాయక్ మేటే, జున్నర్ ఎమ్మెల్యే శరద్ సోనవణే తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వంశపారపర్యంగా వస్తున్న శివాజీ జయంతి వేడుకలు, ఆయన తల్లి జిజావు విగ్రహానికి జరిగిన అభివందన కార్యక్రమంలో ఫడ్నవీస్ పాల్గొన్నారు. అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ కోటలను పరిరక్షించుకోవల్సిన అవసరం ఉందని, అందుకు ఖజానాపై ఎంత భారం పడినప్పటికీ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. శివాజీ హయాంలో కోటల కారణంగానే రాజ్య ప్రజలు క్షేమంగా, ధైర్యంగా ఉండేవారని గుర్తుచేశారు. ఖిల్లాల పరిరక్షణ, పునర్నిర్మాణం కోసం కేంద్రం సహకారంతో రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థను స్థాపిస్తామని అన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ముంబైలోని అరేబియా సముద్రంలో భారీ శివాజీ స్మారకాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఎనిమిదేళ్ల నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని శాఖల నుంచి అనుమతులు లభించాయని త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. శివాజీ దయవల్ల ఐదేళ్లలో రాష్ట్రం రూపురేఖలు మార్చివేస్తామని ఉద్ఘాటించారు. శివాజీ వంశంలో 13వ తరానికి చెందిన ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే మాట్లాడుతూ శివాజీ పేరు ఉచ్ఛరిస్తే చాలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని శరీరంలో ఒక విధమైన శక్తి వస్తుందని అన్నారు. నేటి యువకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశం మరింత పటిష్టం అవుతుందన్నారు. ఛత్రపతి శివాజీకి గవర్నర్ ఘన నివాళి సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావ్ గురువారం శివాజీపార్క్ మైదానంలో అశ్వాన్ని అధిరోహించిన శివాజీ విగ్రహానికి భారీ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి సుభాష్ దేశాయ్, రవాణ శాఖ మంత్రి దివాకర్ రావుతే, ముంబై మేయర్ స్నేహల్ ఆంబేకర్, బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం బీఎంసీ తరఫున మేయర్ బంగ్లాలో ఏర్పాటుచేసిన శివ్ జయంతి ఉత్సవాలకు కూడా గవర్నర్ హాజరయ్యారు. అక్కడ సంగీత కళా అకాడమి ఆధ్వరంలో జరిగిన దేశ భక్తి గీతాల ఆలాపన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం ధారవికి చెందిన ఛత్రపతి శివాజీ విద్యాలయం ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రదర్శించిన జీజామాత, శివాజీ జీవిత చరిత్రపై నాటకాలను వీక్షించారు. భివండీలో... భివండీ, న్యూస్‌లైన్: ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం భివండీ మహానగర్ పాలిక ముఖ్య కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ తుషార్ చౌదరి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నజరానా సర్కిల్లో ఉన్న శివాజీ విగ్రహానికి కమిషనర్ జీవన్ సోనావునే, డీసీపీ సుదీర్ దాబాడే పూలమాల వేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంతోష్ ఎం. శెట్టి, వికాస్ పాటిల్, కాలీద్ గుడ్డూతో పాటు కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పుణే, పింప్రి-చించ్వడ్ నగరాలలో... పింప్రి, న్యూస్‌లైన్: శివాజీ జయంతిని పురస్కరించుకుని పింప్రి-చించ్వడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగర మేయరు శకుంతలా ధరాడే, కమిషనరు రాజీవ్ జాదవ్, ఉప మేయరు ప్రభాకర్ వాఘర్ ఇతర అధికారులు శివాజీ విగ్రహానికి పుష్పహారాలు వేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. నగరంలో శివాజీ విగ్రహాలను అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ప్రతి రథం ముందు శివాజీ కోటలను, ఇతర చారిత్రాత్మిక కట్టడాల నమూనాలతో రథాలను అలంకరించారు. హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో సాక్షి, ముంబై: కింగ్సర్కిల్కు చెందిన ఆంధ్ర హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం దాదర్‌లోని చైత్యభూమి వద్ద శివాజీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ పదాధికారులు గుమ్మడి బొందయ్య శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సముద్రతీరం వెంట ఉన్న కోటలు, ఖిల్లాలు మన తెలుగు ప్రజలే కట్టారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు శశికాంత్ మేకల, సహాయ కార్యదర్శి తెడ్డుబాయి, భీంరావు మాదిగ, ఎంటీజాక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీల సాధికారతపై నఖ్వీ సమీక్ష
ముఖ్యమంత్రి ఫడ్నవీస్, సంబంధిత అధికారులతో భేటీ ♦ మోడల్ కార్పొరేషన్లుగా మూడు నగరాల అభివృద్ధి ముంబై: మైనారిటీల సాధికారతకు సంబంధించిన అంశాలపై కేంద్ర మైనారిటీల సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం ఇక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమాన్ని గూర్చిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించానని చెప్పారు. అంతకుముందు మైనారిటీల సంక్షేమంపై రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సే, సంబంధిత అధికారులతో కూడా సమావేశమయ్యానని తెలిపారు. మైనారిటీల సాధికారత కోసం రాష్ట్రంలోని మూడు నగర కార్పొరేషన్లను మోడల్ కార్పొరేషన్లుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఈ సమావేశాల్లో ముందుకొచ్చిందని నఖ్వీ చెప్పారు. ఈ అంశంపై తాను ఫడ్నవీస్‌తో సవివరంగా చర్చించానని, ఆ మూడు నగరాలను జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుందని తెలిపారు. చాందసవాద శక్తులు, తాలీబానీ మనస్తత్వం అభివృద్ధికి శత్రువులని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే ఈ శక్తులను ఓడించగలమని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు లౌకికవాదులం అని చెప్పుకుంటూనే మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేసి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తుంటాయని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజలందరి సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని నఖ్వీ చెప్పారు. దేశ పురోగతి దృష్ట్యా ఈ సమావేశాలు ఎంతో ప్రాముఖ్యమైనవని అన్నారు. బడ్జెట్‌తో పాటు సంస్కరణల ప్రక్రియకు సంబంధించిన అనేక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. అందుకోసం తాము ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటున్నామని చెప్పారు. తమ ప్రయత్నాల్లో భాగంగానే ఈ నెల 22న న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించి బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేయగలవని నఖ్వీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
మహాకూటమిలో పెరుగుతున్న దూరాలు!
మంత్రివర్గంలో అధికారాల వికేంద్రీకరణపై విభేదాలు ⇒ ఉద్ధవ్‌కు రాజీనామా లేఖ పంపిన శివసేన మంత్రి సాక్షి, ముంబై: ఢిల్లీ ఫలితాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల మధ్య దూరం మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. బీజేపీపై శివసేన బహిరంగంగానే విమర్శలు సంధిస్తుండగా, స్వాభిమానీ షేట్కారీ సంఘటన్, ఆర్పీఐలు కూడా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పటికీ తనకు అధికారాలు లేవని ఆరోపిస్తూ శివసేనకు చెందిన ఓ సహాయ మంత్రి తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు పంపించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, మంత్రి పదవులు అనుభవిస్తున్న శివసేన అవకాశం దొరికినప్పుడల్లా దుమ్మెత్తిపోస్తోంది. రైతుల ఆత్మహత్యలను అరికట్టలేకపోయారని, గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని, ఇంకా అనేక అంశాల్లో విఫలమయ్యారని శివసేన ఆరోపణలు గుప్పించింది. ప్రభుత్వంలో ఉంటూ ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం తగదని బీజేపీ తొలుత సున్నితంగా మందలించింది. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శివసేన, ఇది మోదీ ఓటమి అని వ్యాఖ్యానించింది. తాజాగా బుధవారం బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ మురికి కింద జమకట్టి ఊడ్చిపారేసిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఎదురు దాడికి దిగింది. ధైర్యముంటే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని సవాలు చేసింది. మంత్రి మండలిలో బహిర్గతమైన విబేదాలు... ఇక రాష్ట్ర మంత్రివర్గంలో కూడా రెండు పార్టీల నేతల మధ్య సవతుల పోరు నడుస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేబినెట్ హోదా ఉన్న బీజేపీకి చెందిన మంత్రులు తమకు అధికారాలను వికేంద్రీకరించడం లేదని, పేరుకే తాము పదవిలో కొనాసాగుతున్నామని శివసేన మంత్రులు వాపోతున్నారు. బీజేపీ ధోరణిపై విసుగు చెందిన రెవిన్యూ శాఖ సహాయ మంత్రి సంజయ్ రాఠోడ్ ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తున్న పత్రాన్ని పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు పంపించారు. శివసేన మంత్రుల ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఎదురుదాడికి దిగారు. నాసిక్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఢిల్లీలో బీజేపీ పరాజయం అనేక మందికి ఆనందాన్నిచ్చింది. అయితే పక్కింట్లో పిల్లలు పుట్టారన్న ఆనందం ఎక్కువ రోజులు ఉండదు. కష్టసమయంలో ఎవరైతే అండగా నిలుస్తారో వారే నిజమైన మిత్రులవుతారు’’ అని పరోక్షంగా శివసేనకు చురకలంటించారు. మంత్రుల అధికారాలపై మాట్లాడుతూ, ‘‘కేబినేట్ స్థాయి వారికే ఆయా శాఖలకు సంబంధించిన అధికారాలుంటాయి. సహాయక మంత్రులకు ఆయా శాఖల మంత్రులు బాధ్యతలు అప్పగిస్తారు. మంత్రుల మధ్య కొన్ని విషయాలపై విభేదాలు రావడం సహజం. సహాయ మంత్రులుగా ఉన్న బీజేపీ సభ్యులు కూడా శివసేన మంత్రులు అధికారాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు’’ అని చెప్పారు. మంత్రుల మధ్య ఇటువంటి సహాయ నిరాకరణ ధోరణితో వారి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయన్న సంగతి వెల్లడవుతోంది. వంద రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉండటంతో ఈ కలహాల కాపురం ఎంత కాలం సాగుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్వాభిమాని షేట్కారీ సంఘన్ నేత రాజు శెట్టి, ఆర్పీఐ నాయకులు రామ్‌దాస్ ఆఠవలేలతోపాటు ఇతర మిత్రపక్షాలు మంత్రి పదవులు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు ఈ విషయం బయటికితెలిపారు. మార్చిలో పుణేలో జరగబోయే పార్టీ సమావేశంలో మహాకూటమి నుంచి విడిపోయే అంశంపై నిర్ణయం తీసు కుంటామని రాజు శెట్టి పేర్కొన్నారు. -
ఉత్తమ మంత్రిగా పంకజా ముండే
►రెండో స్థానంలో ముఖ్యమంత్రి ►మరాఠీ చానెల్ సర్వేలో ప్రజాభిప్రాయం సాక్షి, ముంబై : బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఉత్తమ మంత్రిగా పంకజా ముండే ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా రాష్ట్రాధినేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోగా, తృతీయ స్థానంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ శిందే నిలిచారు. బీజేపీ, శివసేనల ప్రభుత్వం శనివారంతో వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ మరాఠీ న్యూస్ చానెల్ మంత్రుల పనితీరుపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. దాదాపు లక్ష మంది పాల్గొన్న ఈ సర్వేలో అత్యధిక ఓట్లతో పంకజా ముండే అందరికంటే ముందు నిలిచారు. మంత్రిగా ఆమె పనితీరు బాగుందంటూ 11,760 మంది ఓటు వేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మెచ్చకుంటూ 9,545 మంది ఓటేశారు. మరోవైపు ఏక్నాథ్ శిందే పనితీరుబాగుందని 8,093 మంది ఓటేశారు. ఇక అత్యల్పంగా కేవలం 3,267 ఓట్లతో చంద్రశేఖర్ బావన్కులే చివరి స్థానంలో నిలిచారు. మిగిలిన మంత్రుల్లో వినోద్ తావ్డే (7,411) నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తరువాత వరుసగా సుభాష్ దేశాయి (6,726), రామ్‌దాస్ కదం (6,694), దివాకర్ రావుతే (6,024), దీపక్ సావంత్ (5,473), సుధీర్ మునగంటివార్ (5,466), ఏక్నాథ్ ఖడ్సే (5,320), చంద్రకాంత్ పాటిల్ (5,186), గిరీష్ మహాజన్ (4,930), గిరీష్ బాపట్ 860)లున్నారు. -
ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ కల్పించాలి
సాక్షి, ముంబై: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అనేక అవకతవకలు, కుంభకోణాలను బయటపెట్టిన సామాజిక కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, కొన్ని అసాంఘిక శక్తుల నుంచి వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. దీంతో వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర సమాచార శాఖ కమిషన్ ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విజ్ఞప్తి చేసింది. సమాజ హితవు కోసం సమాచార హక్కు కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వ విభాగాలు, పురపాలక సంస్థల్లో పని చేసే అధికారులు, రాజకీయ నేతలు, పదవీచ్యుతులైన మంత్రుల అవినీతి భాగోతాలను బయటపెట్టిన సందర్భాలునానయి. దీంతో తమ గుట్టు రట్టు చేసిన సమాచార హక్కు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. బెదిరింపులు, పరోక్ష దాడులు జరుగుతున్నాయని సమాచార హక్కు కమిషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. కొద్ది రోజుల కిందట ఆర్టీఐ కార్యకర్త సతీష్ శెట్టిపై దాడి చేసినవారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేసింది. కొన్ని కేసుల్లో దాడులకు పాల్పడిన దుండగుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీంతో సమాచార హక్కు కార్యకర్తలకు భద్రత లేకుండా పోయిందని సమాచార కమిషనర్ రత్నాకర్ గైక్వాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమైన సందర్భంగా ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకొచ్చామని గైక్వాడ్ చెప్పారు. సంబంధిత పోలీసు అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం తమకు హామీ ఇచ్చారని చెప్పారు. -
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై నిషేధం
త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్న సీఎం ముంబై: బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినిమయంపై త్వరలోనే నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ల వాడకం వల్ల ఆ ఒక్క వ్యక్తి మాత్రమే రోగాల బారిన పడబోరని, అతని కుటుంబమంతా నష్టపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడి టాటా మెమోరియల్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై త్వరలోనే నిషేధం విధిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్యాన్సర్ సంభావ్యత 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నారు. అందువల్ల క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థల దరిదాపుల్లో పొగాకు, పాన్ మసాలాల అమ్మకాలు బాగా పెరిగినట్టు తెలుస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అందువల్ల హోం శా, విద్యా విభాగం సహకారంతో వాటి అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. పొగాకు ఉత్పత్తులపై పంజాబ్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించిందని అన్నారు. అయితే ఆ పన్నుల వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయో మాత్రం స్పష్టం కాలేదన్నారు. ఏదైనా మంచి ఫలితం ఉంటే ఆ విధానాన్ని తాము కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఫడ్నవీస్ చెప్పారు. -
ప్రజలు - ప్రభుత్వం మధ్య ‘ఆప్లే సర్కార్’
ముంబై: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్షమైన, సన్నిహితమైన సంబంధాలను నెలకొల్పేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారితమైన వేదికను ‘ఆప్లే సర్కార్’ పేరిట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండేందుకు ఈ వెబ్సైట్ అవసరమైన పారదర్శకతను అందించగలదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో ఆప్లే సర్కార్‌ను ప్రధాన వెబ్ పోర్టల్‌గా రూపుదిద్దుతామని, సేవాహక్కు చట్టాన్ని కూడా దీనికి అనుసంధానం చేస్తామని తెలిపారు. సేవా హక్కు ముసాయిదా బిల్లును ప్రజల సూచనలు, అభిప్రాయాల కోసం అందరికీ అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆప్లే సర్కార్ వెబ్‌పోర్టల్ పూర్తిగా రూపుదిద్దుకున్న తరువాత ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక కటాఫ్ తేదీని నిర్ణయిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ చెప్పారు. ఆప్లే సర్కార్ వెబ్‌సైట్‌కు వచ్చిన ఫిర్యాదులను 21 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రాలయలోని ప్రభుత్వ విభాగాల పనితీరు, అవి అందించే సేవలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్సైట్లో ఉంచుతామని చెప్పారు. ఇక రెండో దశలో జిల్లా, మున్సిపల్, తెహసిల్ స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలను దానిలో చేరుస్తామని అన్నారు. మహారాష్ట్రలో వ్యాపారంపై ప్రపంచ పెట్టుబడిదారుల ఆసక్తి సాక్షి, ముంబై: మన రాష్ట్రంలో సమాచార సాంకేతిక రంగం, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పెట్టుబడిదారులు ఆసక్తితో ఉన్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత్ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అన్నారు. ఐటీ, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉన్న 30 సమావేశాల్లో తాను పాల్గొన్నానని తెలిపారు. ఈ రంగాల్లో భాగస్వాములయ్యేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారని, మన రాష్ట్రం వారికి ఏమి ఇవ్వగలదో వివరించానని ఫడ్నవీస్ చెప్పారు. దావోస్ నుంచి సోమవారం ఇక్కడికి తిరిగి వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్ట వ్యతిరేకమైనందునే నదుల క్రమబద్ధీకరణ జోన్ (ఆర్‌ఆర్‌జెడ్) విధానాన్ని రద్దు చేశారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఈ విషయంలో తాము కేంద్ర విధానాన్ని అనుసరిస్తామని అన్నారు. -
అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ముంబై
- ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కోసం కృషి - దావోస్‌లో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దావోస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’తో స్ఫూర్తి పొందిన తాము ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కార్యక్రమం కోసం కృషి చేస్తున్నామని, ముంబైని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలోని రాష్ట్రాల మధ్య పోటీ పెరిగిందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఫడ్నవీస్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కార్యక్రమానికి ఒక రూపునిచ్చామని ‘లెసైన్స్ రాజ’ను ముగించడంపైనే ఇక దృష్టిని కేంద్రీకరిస్తామని చెప్పారు. భూ సంస్కరణలను ప్రారంభించామని, అనుమతుల మంజూరును స్వయంచాలితం చేశామని అన్నారు. ఇదివరకు పరిశ్రమలు నెలకొల్పాలంటే కంపెనీలే ఏండ్లకొద్దీ వేచి చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు కొద్ది నెలల్లో పని పూర్తవుతుందని చెప్పారు. ముంబైని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మార్చే ప్రయత్నాలు ఇదివరకు విఫలమయ్యాయి కదా అన్న ప్రశ్నకు ఈసారి తప్పకుండా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ముంబై ఆర్థిక కేంద్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) ప్రాంతంలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఉన్నాయని, మరిన్ని రావాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. అనుసంధానం, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ముంబై పరిసరాల్లో మరిన్ని నగరాలను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఇక్కడ కనీసం 30 మంది ప్రపంచ వ్యాపారవేత్తలతో ఫడ్నవీస్ ముఖాముఖి సమావేశం కానున్నారు. -
విస్తరణపై చర్చలకు ఢిల్లీకి సీఎం
సాక్షి, ముంబై: మంత్రిమండలి విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ ఢిల్లీ పయనం కానున్నారు, మిత్రపక్షాలైన స్వాభిమాని షేట్కారీ సంఘటన్, రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా (ఆర్పీఐ), శివసంగ్రామ్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్ (ఆర్ఎస్పీ) పార్టీల నుంచి మంత్రి పదవుల కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగింది. మంత్రి మండలిలో చేరాలనుకునేవారి సంఖ్య బీజేపీలో కూడా పెద్దగానే ఉంది. దీంతో ఎటూ తేల్చుకోలేని ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో చర్చలు జరుపుతారని తెలిసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం జనవరి మొదటివారంలో మంత్రి మండలిని విస్తరిస్తామని దేవేంద్ర ఫడణ్‌వీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలను అధికారంలో భాగస్వాములను చేసుకునే విషయంపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మిత్రపక్షాల నాయకులైన రామ్‌దాస్ ఆఠవలే, వినాయక్ మెటే, మహాదేవ్ జాన్కర్లు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రీయ సమాజ్ పక్ష్ నేత మహాదేవ్ జాన్కర్ మినహా మిగత పార్టీల నాయకులెవరూ ఉభయ సభల్లోనూ సభ్యులు కారు. పైగా ఈ పార్టీలకు చెందిన ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలుగా లేరు. ఇలాంటి నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన వారికి మంత్రిమండలిలో స్థానం కల్పిస్తే వారికి శాసనమండలిలో లేదా శాసన సభలో సభ్యత్వం ఇప్పించాల్సిన బాధ్యత కూడా బీజేపీపైనే పడనుంది. ప్రస్తుతం శాసనమండలిలో అయిదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో బీజేపీకి మూడు లభించనున్నాయి. ఈ స్థానాల కోసం బీజేపీకి చెందిన నాయకులే పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వీటన్నింటిపై బీజేపీ అధిష్టానంతో చర్చించి, నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. -
సీఎంతో ఖడ్సేకు విభేదాలు..?
సాక్షి, ముంబై: రాష్ట్ర బీజేపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ 42 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే . ఈ సమయంలో విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీరుపై పార్టీ సీనియర్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే గుస్సాగా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీల నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా మనుకుమార్ శ్రీవాస్తవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బదిలీ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎంకు రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే లేఖను రాసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దాంతో తాను బదిలీలకు సంబంధించి సీఎంకు ఎటువంటి లేఖ రాయలేదని ఖడ్సే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, ఖడ్సే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, ఆయన మా పార్టీ సీనియర్ నాయకుడని దీంతో తాము కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఆయనతో కూడా చర్చలు జరిపామని సీఎం స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, మరోవైపు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర సహకార మంత్రి రావ్‌సాహెబ్ దానవే పేరును ప్రకటించడంపై కూడా ఖడ్సే అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. -
శివాజీ స్మారకానికి రూట్ క్లియర్
సాక్షి, ముంబై: గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటి వద్ద అరేబియా సముద్రంలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఛత్రపతి శివాజీ స్మారకం నిర్మాణానికి మార్గం సుగమమైంది. అందుకు సంబంధించిన సర్క్యులర్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జారీ చేసింది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ స్మారకానికి భూమిపూజ చేయించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో సామాన్య పరిపాలన విభాగం నిమగ్నమైంది. అరేబియా సముద్రంలో శివాజీ స్మారకాన్ని నిర్మించాలని 2001లో ప్రతిపాదించారు. 2004లో అప్పటి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ స్మారకాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. కాని అందుకు వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులు లభించలేకపోయాయి. 2004, 2009, 2014లో జరిగిన లోక్‌సభ, శాసన సభ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్మారకం విషయాన్ని పొందుపర్చాయి. కాని గత పదేళ్ల నుంచి కేంద్ర పర్యావరణ శాఖ, సీఆర్‌జెడ్ అనుమతుల వలయంలో చిక్కుకుంది. కాని గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి రావడంతో స్మారకం నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ లభిస్తున్నాయని సాధారణ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. రాజ్ భవన్‌కు 1.2 కి.మీ. దూరంలో చర్నిరోడ్ చౌపాటివద్ద తీరం నుంచి మూడు కి.మీ. దూరంలో సముద్రంలో అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మించనున్నారు. 190 మీటర్ల ఎత్తులో అశ్వాన్ని అధిరోహించిన శివాజీ భారీ విగ్రహం, అక్కడ శివాజీ జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు, మ్యూజియం, ప్రపంచంలోనే అత్యంత పెద్ద మత్స్యాలయం (ఫిష్ ఆక్వేరియం) ఇలా అనేక ప్రత్యేకతలు ఉంటాయి. -
కేబినెట్ విస్తరణ ఎప్పుడు?
సాక్షి, ముంబై: మంత్రి మండలి విస్తరణకు ముహూర్తం ఇప్పట్లో ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మంత్రి మండలిలో స్థానం దక్కించుకునేందుకు అనేక మంది శివసేన, బీజేపీ నాయకులు ఆసక్తి చూపుతుండడంతో విస్తరణ మరింత జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నూతన సంవత్సరం మొదటివారంలో మంత్రి మండలిని విస్తరించనున్నట్టు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మంత్రి మండలిలో మరో 12 మందికి అవకాశం కల్పించనున్నారు. దీంతో శివసేన, బీజేపీ నాయకులతోపాటు ఇతర మిత్రపక్షాలు కూడా మంత్రిమండలిలో తమకు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణ్వీస్పై ఒత్తిడి తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీతో సయోధ్య అనంతరం శివసేన మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శివసేనకు 12 మంత్రి పదవులను కేటాయించారు. ఆ పార్టీకి మరో పదవులను ఇవ్వనున్నారు. ఆ రెండు పదవుల కోసం శివసేన నాయకుల్లో పోటీ ఏర్పడినట్టు తెలిసింది. అందిన వివరాల మేరకు శివసేన నుంచి నీలం గోరే, గులాబ్రావ్ పాటిల్, విజయ్ ఔటి, అర్జున్ ఖోత్కర్, రాజేష్ క్షీరసాగర్, సుజిత్ మించేకర్లు మంత్రిపదవి కోసం పడుతున్నట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ సభ్యులు మంత్రులయ్యేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఆ పార్టీ నుంచి అశీష్ శెలార్, మంగల్‌ప్రభాత్ లోదా, పాండురంగ్ ఫుండ్కర్, చైన్సుఖ్ సంచేతి తదితరులతోపాటు మరి కొందరు ఎమ్మెల్యేల పేర్లు విన్పిస్తున్నాయి. మరోవైపు ఇతర మిత్రపక్షాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రీయ సమాజ్ పార్టీ’ (ఆర్ఎస్పి) నేత మహాదేవ్ జాన్కర్, స్వాభిమాని శేత్కరి సంఘటన నాయకులు సదాభావు ఖోత్లకు చోటు దక్కనుందని తెలిసింది. మరోవైపు ఆర్పీఐ కోటాలో ఆ పార్టీ నాయకుడు రామ్‌దాస్ ఆఠవలే మంత్రి మండలిలో చేరేందుకు అంగీకరిస్తే కేబినేట్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని లేదా ఇతర ఎమ్మెల్యేను ప్రతిపాదిస్తే సహాయ మంత్రి పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి మండలిలో చేరేందుకు ఆసక్తి కనబరిచేవారి సంఖ్య అధికంగా ఉండడంతో, ఎమ్మెల్యేలు, జిల్లాల వారీగా పదాధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని బీజేపీ, శివసేనలు భావిస్తున్నాయి. ఫలితంగా నూతన సంవత్సరం మొదటివారంలో మంత్రి మండలిని విస్తరించాలని భావించినప్పటికీ జాప్యమయ్యే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి.