Chittoor District News
-
ఎర్రచందనం పరిరక్షణకు కృషి చేయాలి
తిరుపతి మంగళం : అరుదైన, అత్యంత విలువైన ఎర్రచందనం పరిరక్షణకు అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా కృషి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) ఎస్ఎస్.శ్రీధర్ సూచించారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. శేషాచలంలోని ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఉందన్నారు. స్మగ్లర్లను నిలువరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కూంబింగ్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, చెక్ పోస్టులు పనితీరుపై చర్చించారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయం గోడలు పెచ్చులు ఊడుతున్నాయని, స్మగ్లర్లను ఉంచేందుకు పట్టిష్ట గదులు అవసరమని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఎఫ్ సె ల్వం, డీఎఫ్ఓ వివేక్, ఏసీఎఫ్ శ్రీనివాస్, టాస్క్ఫో ర్స్ డీఎస్పీ బాలిరెడ్డి, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐ సురేష్, ఎస్ఐ రఫీ, ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు. -
ఎర్రచందనం పరిరక్షణకు కృషి చేయాలి
తిరుపతి మంగళం : అరుదైన, అత్యంత విలువైన ఎర్రచందనం పరిరక్షణకు అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా కృషి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) ఎస్ఎస్.శ్రీధర్ సూచించారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. శేషాచలంలోని ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఉందన్నారు. స్మగ్లర్లను నిలువరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కూంబింగ్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, చెక్ పోస్టులు పనితీరుపై చర్చించారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయం గోడలు పెచ్చులు ఊడుతున్నాయని, స్మగ్లర్లను ఉంచేందుకు పట్టిష్ట గదులు అవసరమని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఎఫ్ సె ల్వం, డీఎఫ్ఓ వివేక్, ఏసీఎఫ్ శ్రీనివాస్, టాస్క్ఫో ర్స్ డీఎస్పీ బాలిరెడ్డి, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐ సురేష్, ఎస్ఐ రఫీ, ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు. -
No Headline
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు వృత్తిరీత్యా, బతుకుదెరువు కోసమో తమిళనాడులో ఆంధ్రులు.. ఆంధ్రా రాష్ట్రంలో తమిళవాసులు స్థిరపడ్డారు. ఏడు దశాబ్దాల కిందట భాష ప్రాతిపదికన నాటి పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా వేరుపడింది. అయితే అప్పటికే ఆయా తమిళనాడు, ఆంధ్రాలో స్థిరపడిన వారు అలాగే ఉండిపోయారు. ఎవరు ఎక్కడ నివశిస్తున్నా.. తమ సొంత ప్రాంతం ఆచారాలను, సంస్కృతి సంపద్రాయాలను మాత్రం వీడలేదు. ఆంధ్రాలో ఉన్నవారు తమిళులు తమ పిల్లలను వారి తమిళ మాధ్యమంలో, తమిళనాడులో ఉన్న తెలుగువారు తెలుగు మాధ్యమంలో చదివిస్తూ మాతృభాషపై మమకారం చాటుకుంటున్నారు. -
No Headline
తమిళంలోనే చదువుకుంటున్నా.. మా పూర్వీకులు అందరూ తమిళ సంస్కృతిని పాటించేవారే. తరతరాలుగా ఇంట్లో మాట్లాడే భాష కూడా తమిళమే. పాటించే ఆచారాలు కూడా తమిళ సంస్కృతివే. అందుకే ఆంధ్రరాష్ట్రంలో ఉన్నా తల్లిదండ్రులు నన్ను తమిళ మాధ్యమంలో చేర్చారు. తమిళంతో పాటు ఒక సబ్జెక్ట్ తెలుగు కూడా నేర్చుకుంటున్నా. – చిత్ర, సత్రవాడ, నగరి మున్సిపాలిటీ ఆ విద్యార్థులు ఎక్కువే ఉన్నారు.. సత్రవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను తమిళ మాధ్యమం చదువుకుంటున్నా. నాలాగే పలువురు విద్యార్థులు తమిళంలోనే చదువుకుంటున్నారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మాకు పాఠాలు చెబుతుండడంతో చక్కగా చదువుకుంటున్నాం. మాతృభాష తమిళంతో పాటు రాష్ట్ర భాష తెలుగును కూడా నేర్చుకుంటున్నాం. – జయలక్ష్మి, సత్రవాడ, నగరి మున్సిపాలిటీ భాషపై మక్కువతోనే తెలుగు మీడియం.. మా మాతృభాష తెలుగు. ఇంటిలో మేము తెలుగే మాట్లాడుకుంటాం. అందుకే భాషపై మక్కువతో నా తల్లిదండ్రులు నన్ను తెలుగు మీడియంలో చేర్పించారు. తెలుగు సబ్జెక్ట్‌తో పాటు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే చెబుతున్నారు. వీటితో పాటు తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నా. – కరిష్మా, చంద్రప్పనాయుడు కండ్రిగ, తిరుత్తణి తాలుకా -
డ్రోన్ తయారీపై ఎంఓయూ
తిరుపతి సిటీ: డ్రోన్ వ్యవస్థపై శిక్షణ, తయారీ, పరిశోధనలపై ఎస్వీయూ పలు సంస్థల తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు వీసీ సీహెచ్ అప్పారావు పేర్కొన్నారు. వర్సిటీ వీసీ చాంబర్లో గురువారం ఆయన రిజిస్ట్రార్ భూపతినాయుడితో కలసి పలు సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీసీ మాట్లాడుతూ విద్యాపరమైన పరిశోధన, ఆవిష్కరణలు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, డ్రోన్ల తయారీ, మహిళల కోసం డ్రోన్ వంటి కార్యక్రమాల్లో బలమైన సహకారం కోసం డ్రోన్ వ్యవస్థలకు సంబంధించిన పలు సంస్థలతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమన్నారు. ఇందుకోసం ‘డ్రోన్స్, స్పేస్ టెక్నాలజీస్ కన్సార్టియం’ ప్రతినిధులు అధికారికంగా సంతకం చేశారన్నారు. ఒప్పందపు పత్రాల్లో సంతకం చేసిన వారిలో ఆర్ఎఫ్ఎల్వై ఇన్నోవేషన్స్ సంస్థతో పాటు ఎర్త్నౌ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మిస్టర్ రితేష్ కుమార్ సింగ్, ఏరో హబ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బరహలికర్ నర్సింగ్ రావు, ఔరంటియస్ డైరెక్టర్ ప్రణవ్‌కుమార్ చిట్టే, టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస్‌ప్రసాద్, రుసా అధికారులు ఉన్నారు. -
వేగానికి కళ్లెం
● మెసానిక్ మైదానం రోడ్డులో భారీ వాహనాలు నిషేధం ● సాక్షి కథనానికి స్పందించిన పోలీసులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మెసానిక్ మైదానం–రిజర్వు ఫారెస్టు రోడ్డులో వేగానికి కళ్లెం పడింది. ఈ మార్గంలో ఓ తల్లి తన కుమారున్ని ద్విచక్రవాహనంలో తీసుకెళ్తుండగా.. ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఎమిదేళ్ల పిల్లాడు ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తరువాత కూడా ఈ రోడ్డులో భారీగా ట్రాక్టర్లు, వాహనాలు అత్యంత వేగంతో వెళుతున్నాయి. ఈ పరిస్థితిపై ‘సాక్షి’ దినపత్రికలో మూడు రోజుల క్రితం ‘అతివేగం.. పడదా కళ్లెం?’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు స్పందించారు. గురువారం ఈ మార్గంలో వెళ్తున్న ఇసుక, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేని వాటికి జరిమానాలు విధించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మెసానిక్ రోడ్డు గుంతలమయంగా మారడంతో ఇటువైపు వెళ్లే వాహనాలు, ఒక్కోసారి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొడుతున్నాయన్నారు. బైక్‌లు, కార్లు, ఆటోలు తప్ప మరే ఇతర వాహనాలు మెసానిక్ రోడ్డు మీదుగా వెళ్లడానికి వీల్లేదన్నారు. వాహన చోదకులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. -
26న ధర్నా
చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలో పలు కార్మిక సంఘాల నాయకులకు కరపత్రాలను అందజేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా రాష్ట్రప్రభుత్వం బీజేపీ వైఖరిని అనుసరిస్తోందన్నారు. కార్మికులు, ఆకలి తీర్చే రైతులకు కాకుండా కార్పొరేట్ వర్గాలకు మోదీ ప్రభుత్వం లాభం చేకూరుస్తోందన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.19.28 లక్షలకోట్లు రుణమాఫీ, పన్నురాయితీ, ప్రోత్సాహాల పేరిట ప్రజల ధనాన్ని దోచిపెట్టిందన్నారు. విశాఖస్టీల్ ప్లాంట్‌తో సహా భారీ పరిశ్రమలు, గనులు, సముద్రతీరాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. గత పదేళ్లుగా కనీస వేతనం కోసం కార్మికులు పోరాడుతున్నా అమలుకు నోచుకోలేదని, 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కేంద్రం మార్చడం అన్యాయమన్నారు. -
● ఏడు దశాబ్దాల కిందట ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్రా ● తమిళనాడులో తెలుగు వారు.. ఆంధ్రాలో స్థిరపడిన తమిళవాసులు ● వేరుపడినా మాతృభాషపై ఎవరి మమకారం వారిదే ● తమిళనాడులో తెలుగును అభ్యసిస్తున్న 11,028 మంది విద్యార్థులు ● ఆంధ్రాలో తమిళ మాధ్యమంలో చదు
నగరి : భాష ప్రాతిపదికన ఏడు దశాబ్దాల క్రితమే రాష్ట్రాలు విడిపోయాయి. 1956 వరకు ఒక్కటిగా ఉన్న ప్రాంతం ఆ ఏడాది రెండుగా విడిపోయి తెలుగు భాష ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్రం, తమిళ భాష ప్రాతిపదికన తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది. నివాసిత ప్రాంతం మధ్య సరిహద్దు రేఖ వచ్చింది. పరిస్థితుల దృష్ట్యా తెలుగు మాతృభాషగా ఉన్న కుటుంబాలు తమిళనాడులో, తమిళం మాతృభాషగా ఉన్న కుటుంబాలు మన రాష్ట్రంలోనూ స్థిరపడాల్సి వచ్చింది. ప్రాంతాలపై సరిహద్దు వేసిన ప్రభుత్వాలు మాతృభాషపై ప్రజలకు ఉన్న మమకారంపై సరిహద్దు వేరు చేయలేకపోయింది. రాష్ట్రాలు వేరై ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ వారు మాతృభాషనే అభ్యసిస్తున్నారు. వీరి మాతృభాషా అభిమానాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వాలు సరిహద్దుల్లో రెండు మాధ్యమాలు ఉన్న పాఠశాలలను నడుపుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లోనే ఎక్కువ.. మన రాష్ట్ర సరిహద్దును ఆనుకుని తమిళనాడు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని బోధించే 391 ప్రాథమిక పాఠశాలలు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు, 60 ఉన్నత పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో 11,028 మంది విద్యార్థులు తెలుగు మాధ్యమం అభ్యసిస్తున్నారు. 786 మంది ఉపాధ్యాయులు తెలుగును బోధిస్తున్నారు. అలాగే తమిళనాడు సరిహద్దును ఆనుకుని మన రాష్ట్రంలో తమిళ మాధ్యమం కలిగిన 15 ఉన్నత పాఠశాలలు, 36 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత స్కూళ్లు, 3 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 10 వేల మంది విద్యార్థులు తమిళ మాధ్యమం అభ్యసిస్తున్నారు. 252 మంది ఉపాధ్యాయులు తమిళ భాషను బోధిస్తున్నారు. ఇలాఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలో చదువుకునేందుకు సహకారం అందిస్తున్నాయి. దీంతో మాతృభాష హద్దులు దాటి తనకంటూ ఒక ప్రత్యేక బంధాన్ని పెనువేసుకుంది. రాష్ట్ర భాష తప్పనిసరి.. సరిహద్దును ఆనుకుని మన రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో తమిళం బోధించినా సెకండ్ లాంగ్వేజిగా తెలుగు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే వారికి తెలుగులో పాస్ మార్కులు వందకు 20 మాత్రమే. సరిహద్దును ఆనుకుని తమిళనాడులో ఉన్న పాఠశాలల్లో తెలుగు చదివే విద్యార్థులు తప్పనిసరిగా ఒక లాంగ్వేజ్ తమిళం చదవాల్సిందే. పాస్ కావాలంటే 35 మార్కులు సాధించాల్సిందే.పుస్తకాల పంపిణీ ఇలా.. తమిళనాడులో అన్ని తరగతులకు కేటాయించిన సిలబస్‌ను అనుసరించి పాఠ్యాంశాలను తెలుగులోకి అనువదించి రాష్ట్ర ప్రభుత్వమే పుస్తకాలను అందజేస్తుంది. మన రాష్ట్రంలో తమిళ పాఠ్యాంశం మినహా ఇతర పాఠ్యాంశాల పుస్తకాలు మన ప్రభుత్వమే అనువదించి అందజేస్తుంది. తమిళ పాఠ్యాంశానికి మాత్రం తమిళనాడు నుంచి సీడీలు తెచ్చి ఇక్కడ ముద్రించి ఇస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పుస్తకాలు అందడంలో ఆలస్యమవుతుండడంతో గత మూడేళ్లు అప్పటి మంత్రిగా ఉన్న ఆర్కేరోజా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించి సీడీలకు బదులుగా పుస్తకాలే తెచ్చి అందజేశారు. ఈ ఏడాది తమిళ విద్యార్థులకు అవసరమైన తమిళ పాఠ్యాంశ పుస్తకాలు ఇంకా అందలేదు.తెలుగు చక్కగా బోధిస్తున్నారు మాది తెలుగు మాట్లాడే కుటుంబం. నివశించేది తమిళనాడులోనే అయినా మాట్లా డేది తెలుగే. మాకు బంధువు లు కూడా ఎక్కువగా ఆంధ్రలోనే ఉన్నారు. దీంతో మా తల్లిదండ్రులు తెలుగులోనే చదివించాలనుకున్నారు. ఇక్కడే తెలుగు భాష నేర్పిస్తుండడంతో కీచలం స్కూల్ లో చేరి తెలుగులోనే చదువుకుంటున్నా. రాష్ట్ర భాష తమిళం కూడా అభ్యసిస్తున్నా. – ఫాజల్ బాషా, చంద్రప్పనాయుడు కండ్రిగ, తిరుత్తణి తాలుకా -
రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని కాపుగున్నేరి సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్కే కే.రాజ్‌కుమార్ (29) గురువారం విధులు ముగించుకుని సాయంత్రం 6.30 సమయంలో ఇంటికి వెళ్లేందుకు కాపు గున్నేరి హైవే రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో శ్రీకాళహస్తి వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. దీంతో రాజ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సహచర ఉద్యోగులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారుని పోలీస్ స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 59,231 మంది స్వామివారిని దర్శించుకోగా 22,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.08 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతి, చిత్తూరు జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గరురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డికి రీజనల్ కో–ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది. స్టోర్‌కు చేరిన విద్యుత్ పరికరాలు చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా ట్రాన్స్‌కో స్టోర్స్‌కు విద్యుత్ పరికరాలు వచ్చిందని ఎస్ఈ సురేంద్రనాయుడు గురువారం తెలిపారు. 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 40, కండక్టర్ 168 కిలోమీటర్లు వచ్చిందన్నారు. వీటిని సీనియారిటీ వారీగా దరఖాస్తు చేసుకున్న వారికి, పరిశీలించి అందజేయాలని సూచించారు. ఏఈలు వర్క్ఆర్డర్లు పెట్టి మెటీరియల్స్ డ్రా చేసుకోవాలని వివరించారు. నూతన కమిటీ ఎన్నిక చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)ల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పోరాడుదామని నూతన వీఆర్ఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోదండన్, దేవరాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవనంలో రెవెన్యూ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోదండన్, ప్రధాన కార్యదర్శిగా దేవరాజు, సహధ్యక్షుడిగా ఇర్ఫాన్ అలీ, గౌరవ అధ్యక్షుడిగా లక్ష్మన్, జిల్లా ఉపాధ్యక్షులుగా యాగమూర్తి, జయబదూరి, మంజుల, మాధవి, వాణి, జిల్లా ట్రెజరర్‌గా అశోక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన విద్య అందించండి రామకుప్పం: స్థానిక డా.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పారిశుద్ధ్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన భోజనం వడ్డించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. సకాలంలో విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు, సామగ్రిని అందజేయాలన్నారు. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా భోదన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదనపు గదులు కావాలని పాఠశాల ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, అవసరమైన సౌకర్యాలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన రామకుప్పం సమీపంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కుప్పం కడ ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.21.53 కోట్లు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో రోడ్ల మరమ్మతుల కోసం రూ.21.53 కోట్లు నిధులు విడుదల చేశారని ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. సంక్రాంతిలోపు రోడ్లపై గుంతలకు మరమ్మతు చేయనున్నట్లు చెప్పారు. చిత్తూరు నియోజకవర్గంలో 117 కిలోమీటర్లకు రూ.2.86 కోట్లు, పూతలపట్టులో 267 కి.మీ.కు, రూ.3.18 కోట్లు, జీడీనెల్లూరులో 301 కి.మీ.కు, రూ.4.08 కోట్లు, నగరిలో 147 కి.మీ.కు, రూ.2.88 కోట్లు, పలమనేరులో 224 కి.మీ.కు, రూ.2.05 కోట్లు, పుంగనూరు 107 కి.మీ.కు, రూ.2.65 కోట్లు, కుప్పం 547 కి.మీ, రూ.3.83 కోట్లు చొప్పున కేటాయించారన్నారు. మొత్తం 1646 కిలోమీటర్లకు, రూ.21.53 కోట్లతో గుంతలు పూడ్చనున్నట్లు చెప్పారు. వీటికి టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నట్లు వివరించారు. -
పారదర్శక సేవలకు ‘సహకారం’
ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత్ర కీలకం. వాటిని మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర సహకార మంత్రిత్వశాఖ అడుగులు వేసింది. ఇంతవరకు చేతిరాతలతోనే కొనసాగిన సహకార సంఘాల ఆర్థిక లావాదేవీలు, రుణాల మంజూరు, వ్యాపారాల నిర్వహణలో అవకతవకలకు చెక్ పెడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. అక్రమాలకు తావులేకుండా సంఘాల రికార్డులు, నిర్వహణకు సంబంధించి ఇకపై అన్నీ కంప్యూటరీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో సభ్యులు, ఖాతాల లెక్కలు తేల్చి ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం అవుతున్నాయి. కాణిపాకం: ప్రాథమిక సహకార సంఘాలు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ సంఘాల రికార్డుల నిర్వహణ పూర్తిగా చేతిరాతలతోనే జరుగుతున్నాయి. నిర్వహణలో పారదర్శకత లేకపోవడంతో కోట్ల రూపాయలు అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర సహకార మంత్రిత్వశాఖ నడుం బిగించింది. దీంతో ప్రతి సహకార సంఘ రికార్డులను నాబార్డు నిధులతో కంప్యూటరీకరణ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయారు. జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వాటి పరిధిలో సుమారు 1.50 లక్షల మంది సభ్యులు, ఖాతాదారులు ఉన్నారు. దాదాపు రూ.300 కోట్లు రుణాలు సైతం అందజేశారు. సాంకేతికతకు పెద్దపీట.. అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా చేయూతనిచ్చి రైతులకు సాయం అందించాలని ముందుకొచ్చింది. నాబార్డు ద్వారా తోడ్పాటునందించి మరింత బలోపేతం చేయాలని సంకల్పించింది. ఇందుకు లావాదేవీలు, ఖాతాల నిర్వహణ, రికార్డులు, సభ్యుల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటరీకరణ సేవలను కల్పించేందుకు ఒక్కో పరపతి సంఘానికి రూ.3.90 లక్షలు కేటాయించారు. కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతం, నాబార్డు లేదా పీఏసీఎస్ 10 శాతం ఖర్చు చేసే విధంగా అనుమతిచ్చారు. కంప్యూటరీకరణ, ఆన్లైన్ సేవలందించడానికి ప్రతి సభ్యుడు, ఓటరు సమాచారాన్ని నమోదు చేయడానికి ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాలని ఆదేశాలందాయి. ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తూ..నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకార సంఘాల అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రికార్డుల కంప్యూటరీకరణ నాబార్బు నిధులతో శరవేగంగా ప్రక్రియ ఈ నెలాఖరుకు ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు ఇప్పటికే 80 శాతం సొసైటీల రికార్డుల కంప్యూటరీకరణ పూర్తి త్వరలో పూర్తి చేస్తాం.. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సేవలను మరింత విస్తృతం చేసేందుకే నవీకరణ దిశగా శ్రీకారం చుట్టాం. అక్రమాలకు తావులేకుండా పారదర్శక సేవలు అందాలన్నదే లక్ష్యం. ఈ ప్రక్రియ అమల్లోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఆన్లైన్లో నమోదు కొనసాగుతోంది. ఉద్యోగులంతా దీనిపైనే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 80 శాతానికి పైగా డేటా ఎంట్రీ పూర్తయింది. ఈ నెలాఖరుకు వందశాతం పూర్తి చేస్తాం. – మనోహర్‌గౌడ్, సీఈఓ, జిల్లా సహకార సంఘ బ్యాంక్, చిత్తూరు ఉపయోగం ఇలా.. పీఏసీఎస్‌లను నాబార్డు సాఫ్ట్వేర్ ద్వారా డీసీసీబీలకు జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేసేలా కేంద్ర సహకార మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. దీంతో సొసైటీలో నమోదైన ప్రతి ఖాతాదారుడికీ కంప్యూటరైజ్డ్ పాసుబుక్ వస్తుంది. అందులో తీసుకున్న రుణం, చెల్లిస్తున్న సొమ్ము ఖాతాకు జమవుతున్న వడ్డీ, తదితర వివరాలను ఆధార్ అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ నేరుగా రైతుల ఖాతాలకే జమకానున్నాయి. -
ఆటో బోల్తా : ముగ్గురికి గాయాలు
చౌడేపల్లె: మండలంలోని బాలసముద్రం సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చుక్కావారిపల్లెకు చెందిన గంగులమ్మ, వసంతమ్మ, నీలమ్మతో మరికొందరు కలిసి చౌడేపల్లెలో ఆధార్ కార్డుల కోసం ఆధార్ సెంటర్ఽ వద్దకు బయలుదేరారు. మార్గమధ్యలో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వారిని 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సారా, మద్యం తరలిస్తున్న వారి అరెస్టు చిత్తూరు అర్బన్: నిషేధిత సారా తీసుకెళ్తున్న ఇద్దరు నిందితులను ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పవన్ తన సిబ్బందితో కలిసి గుడిపాల మండలం రఘునాథపురం కూడలి వద్ద తనిఖీలు చేస్తుండగా.. ఇదే మండలానికి చెందిన ఆర్.వెంకటేష్, శ్రీనివాసులు బైక్‌పై సారా తీసుకెళ్తుండగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17 లీటర్ల సారా ప్యాకెట్లను, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సిబ్బంది దేవప్రసాద్, రాజేష్, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంటి వద్దే మద్యం విక్రయించడానికి (బెల్టు దుకాణం) మద్యం తీసుకెళ్తున్న మల్లిక (30) అనే మహిళను చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు–పొన్నై రోడ్డులో తాళంబేడుకు చెందిన మల్లిక అనే మహిళ ఓ సంచి తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. చిత్తూరులోని పలు మద్యం దుకాణాల్లో 30 మద్యం బాటిళ్లను తీసుకుని ఇంటి వద్ద విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు గుర్తించి నిందితురాలిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. -
ప్రజలతో మర్యాదగా ప్రవర్తించండి
● చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ● నేరాల నియంత్రణ, కేసుల వివరాలపై ఆరా గంగాధర నెల్లురు: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో సిబ్బంది సఖ్యతతో మెలగాలని ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు. గురువారం ఆయన జీడీ నెల్లూరు పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసులకు సంబంధించి దర్యాప్తులో పురోగతి, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్టేషన్ పరిధిలో తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. బ్లాక్ స్పాట్స్ దగ్గర రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హత్యలు, హత్యాయత్నాలు, మహిళలు, బాలికల మిస్సింగ్, ప్రాపర్టీ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. సివిల్, భూతగాదాలు, పాత గొడవల్లో అనుమానం ఉన్న వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న స్కూళ్లు, హోటళ్లు ఉండే ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేసి విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలన్నారు. అదేవిధంగా రాత్రివేళ బీట్ పని తీరును నిరంతరం మానిటరింగ్ చేయాలని, రౌడీ షీటర్ల కదలికలు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మహిళా పోలీసులు ఇంటింటికీ వెళ్లి మహిళలపై జరుగుతున్న నేరాలు, కొత్త చట్టాల గురించి, సైబర్ నేరాలు, ముఖ్యంగా లోన్ యాప్‌ల మోసాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జీడీనెల్లూరు సీఐ లక్ష్మీనారాయణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
వక్ఫ్ చట్ట సవరణపై ముస్లింల కన్నెర్ర
నినాదాలు చేస్తున్న ముస్లింలు నగరి: వక్ఫ్ చట్టాలను సవరిస్తూ, వక్ఫ్ బోర్డులో ప్రభుత్వ జోక్యం కల్పించడంపై నగరి మున్సి పల్, మండల పరిధిలోని ముస్లింలు కన్నెర్ర చేశారు. ఉదయం బస్టాండు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు అత్యధిక సంఖ్యలో చేరుకున్నవారు ప్లకార్డులు చూపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తౌహిద్ జమాత్(ఏఐటీజే) మండల అధ్యక్షుడు కేఎం బషీర్ మాట్లాడుతూ వక్ఫ్ అన్నది తాతముత్తాతలు తమకు ఇచ్చిన ఆస్తి అన్నారు. వక్ఫ్ కింద పాఠశాలలు, షాదీ మహల్లు, ఆస్పత్రులు, మసీదులు, శ్మశానాలు ఉన్నాయన్నారు. వాటి నుంచి వచ్చే ఆదాయంతో దానధర్మాలు చేస్తున్నామన్నారు. దాన్ని సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ సవరణలను ఖండిస్తున్నామన్నారు. రుణాలివ్వమని, ఇళ్లు కట్టించమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యడం లేదని, హక్కులను కాలరాయవద్దని కోరుతున్నామన్నారు. యాక్ట్ 370, త్రిపుల్ తలాక్, వక్ఫ్ చట్టాలు అంటూ అన్నీ మార్పు చేస్తూ ముస్లింలను చిన్నచూపు చూస్తున్నారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పోరాటం మళ్లీ ప్రారంభిస్తామన్నారు. ఆజాదీ.. ఆజాదీ.. అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద మసీదు అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, మాజీ అధ్యక్షులు షంషుద్దీన్, తౌహిద్ జమాత్ సభ్యులు, ముస్లింలు పాల్గొన్నారు. హక్కులు హరిస్తున్నారంటూ నినాదాలు పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల్లో జోక్యం తగదు హక్కుల సాధనకు పోరాటం తప్పదు ఏఐటీజే మండల అధ్యక్షులు బషీర్ -
రైస్ పుల్లింగ్ వ్యవహారంలోనే కిడ్నాప్
● రూ.100 కోట్ల రూ.2 వేలు నోట్లను మార్చేందుకు డీల్ ● బేరం కుదరకపోవడంతోనే ఆదాయ పన్ను శాఖ అధికారులమంటూ కిడ్నాప్‌కు యత్నం ● పోలీసుల గస్తీతోకుటుంబాన్ని వదిలేసిన నిందితులు ● 12 మందిపై కేసు నమోదు.. ఏడుగురి అరెస్టు ● పరారీలో ముగ్గురు నిందితులు ● పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ కుప్పం: రైస్ పుల్లింగ్ స్మగ్లింగ్ వల్ల భారీ నగదు పంపకాల్లో వచ్చిన విభేదాలతో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు కుప్పం ఇన్చార్జ్ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. కుప్పం రూరల్ సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇటీవల ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రామకుప్పం మండలం పెద్దకురబలపల్లికి చెందిన గోవిందప్ప తమ్ముడు జయరఘురాం రైస్ పుల్లింగ్ చేసేవాడు. ఈ నేపథ్యంలో జయరఘురాంకు రూ.2 వేలు నోట్లు రూ.100 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ నగదు మార్చి ఇస్తే 50 శాతం నగదు ఇస్తామని బెంగళూరుకు చెందిన స్వర్ణలతతో ఒప్పందానికి ప్రయత్నించాడు. అయితే అది కుదరకపోవడంతో బెంగళూరుకు చెందిన స్వర్ణలత, నవీన్‌కుమార్, రామకుప్పం మండలం జౌకుపల్లికి చెందిన సుబ్రమణ్యం కలిసి గోవిందప్ప కుటంబాన్ని కిడ్నాప్ చేసేందుకు తిరుపతికి చెందిన అరుణ్‌కుమార్‌కు వాహనం ఇచ్చి పురమాయించారు. గత గురువారం అర్ధరాత్రి గోవిందప్ప ఇంటికి వెళ్లి తాము ఆదాయ పన్ను శాఖ అధికారులమని నమ్మించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసుల గస్తీ వల్ల కిడ్నాపర్లు గోవిందప్ప కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లారు. ఈ కేసు పూర్తి దర్యాప్తు అనంతరం 12 మంది నిందితులపై కేసు నమోదు చేసి ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రామకుప్పానికి చెందిన సుబ్రమణ్యం, బెంగళూరుకు చెందిన నవీన్ కుమార్, అరుణ్ కుమార్, కడపకు చెందిన వరప్రసాద్, శివశంకర్, ఖాదర్‌బాషా , మదర్వళ్లీ అనే వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు చెప్పారు. సమావేశంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐలు శ్రీనివాసులు, నరేష్, వెంకటమోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
● అండర్–14 విభాగంలో 13 జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొననున్న బాలబాలికలు ● అరగొండలో క్రీడామైదానాలు ఏర్పాటు ● క్రీడా పోటీలను ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తవణంపల్లె: 68వ రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ బాలబాలికల టోర్నమెంట్ పోటీలు శుక్రవారం అరగొండ బాలుర హైస్కూల్ క్రీడామైదానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ జె.వసంతవాణి, మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజులు రెడ్డి, సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణ, అరగొండ బాలుర హైస్కూల్ హెచ్ఎం భువనేశ్వరి తెలిపారు. ఏపీ పాఠశాల విద్య సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ, జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అరగొండ బాలుర హైస్కూల్ క్రీడామైదానం, అరగొండ టోటల్ హెల్త్ క్రీడామైదానంలో అండర్–14 బాల, బాలికలకు సాఫ్ట్‌బాల్ టోర్నీ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు 13 జట్లు, బాలికలు 13 జట్లు పాల్గొంటాయి. క్రీడాకారులతో పాటు కోచ్‌లు, మేనేజర్లు, పీడీలు వచ్చారన్నారు. వీరికి అరగొండ బాలికల హైస్కూల్లో, బాలికలకు మాత్రం వినాయక విద్యామందిర్‌లో వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని శుక్రవారం 10.30 గంటలకు క్రీడాపోటీలను ప్రారంభిస్తారన్నారు. అలాగే డీఈఓ వరలక్ష్మి, డీవైఈఓ చంద్రశేఖర్, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఎంఈఓలు పాల్గొంటారని తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ మృతి
చౌడేపల్లె: కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా రాయలపాడు పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నాయకుడు, సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ బాజిగం చిట్టిబాబు(45) మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా.. చిట్టిబాబు ముదిమడుగు హరిజనవాడలో గల తన బామ్మర్ది చంద్రమోహన్ వివాహానికి హాజరయ్యాడు. బుధవారం సాయంత్రం సత్రం నుంచి కడప–బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో బైక్‌లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిట్టిబాబును కోలార్ జాలప్ప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా బైక్‌లో వెనుక వైపు కూర్చున్న మరో మహిళకు తీవ్ర గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఏ.కొత్తకోటకు తరలించారు. చిట్టిబాబు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఫోన్లో చిట్టిబాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీలో కీలక నాయకున్ని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. అలాగే జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు, పలువురు పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. -
ఇంటి వద్దనే గంజాయి సాగు
● అక్రమంగా విక్రయాలు ● పక్కా సమాచారంతో దాడులు జరిపిన అధికారులు ● ఒకరి అరెస్ట్, మరొకరు పరారీ ● నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తిగా సమాచారం గంగవరం: ఇంటి వద్దే గంజాయి మొక్కలు పెంచి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు గంగవరం అర్బన్ సీఐ ప్రసాద్, పోలీసులు, తహసీల్దార్ శివకుమార్, రెవెన్యూ సిబ్బంది కలిసి గురువారం దాడులు చేశారు. పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐ తెలిపారు. వివరాలు.. గంగవరం మండలంలోని సామరాజుపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తి తన ఇంటి వద్దనే గంజాయి పెంచుతూ అప్పుడప్పుడూ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్టు తమకు తెలిసిందని చెప్పారు. కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులతో పాటు, రెవెన్యూ సిబ్బందితో కలిసి సామరాజుపల్లిలో హరికృష్ణ ఇంటి వద్ద దాడులు చేపట్టామన్నారు. దాదాపు 1 కిలో గంజాయి, కొన్ని మొక్కలు ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. హరికృష్ణను అదుపులోకి తీసుకుని, విడిగా ఉన్న కిలో గంజాయితో పాటు మొక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వ్యాపారంలో భాగస్వాముడైన కేశవులు పరారయ్యాడని, ఇద్దరిపై కేసు నమోదు చేసి పట్టుబడిన హరికృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు. అయితే గంజాయి సాగుచేసి విక్రయిస్తున్న వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తి అని సమాచారం. ఉత్సాహంగా పోలీస్ డ్యూటీ మీట్ చంద్రగిరి: కల్యాణీ డ్యాం సమీపంలోని పోలీసు ట్రైనింగ్ కళాశాల(పీటీసీ)లో వార్షిక పోలీస్ డ్యూటీ మీట్‌ను గురువారం నిర్వహించారు. ప్రిన్సిపల్ సుబ్రమణ్యం జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిబ్బందికి వాలీబాల్, షటిల్, షార్ట్‌పుట్, జావెలిన్ త్రో ఆటల పోటీలను నిర్వహించారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
కరోనా తర్వాత..
కరోనా వ్యాప్తితో పలు రకాల జబ్బులు మూటకట్టుకున్నాయి. తొలి విడతలో ఆ లక్షణాలే ప్రజలను భయపెట్టాయి. వైద్య నిపుణుల సూచనలతో మందులు, మాత్రల వాడకం వల్ల కరోనా మహమ్మారి నుంచి ఊపిరి పీల్చుకున్నారు. తక్కువ సంఖ్యలో మరణాలు చోటుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కరోనా కట్టడికి యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టింది. అయితే కరోనా రెండో విడత ధాటికి జనం విలవిల్లాడిపోయారు. ఆక్సిజన్ అవసరమైంది. ఆ ప్రభావం గుండైపె పడింది. అప్పట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గుండె జబ్బు సమస్యలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. ఈ సంఖ్య గణనీయంగా పెరగడంతో అప్పటి రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించింది. పేదలకు ఊపిరి పోయడంతో పాటు గుండె జబ్బుల నివారణకు స్టెమీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. -
నవజాత శిశుమరణాల నివారణకు కృషి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నవజాత శిశుమరణాల నివారణకు సమిష్టిగా కృషి చేద్దామని డీఐఓ హనుమంతరావు అన్నారు. చిత్తూరు నగరం టెలిఫోన్ కాలనీలోని అర్బన్‌హెల్త్ సెంటర్లో బుధవారం జాతీయ నవజాత శిశు వారోత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రసవం తర్వాత బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలని, తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి నవజాత శిశు ఎదుగుదలకు దోహద పడతాయన్నారు. బాల్య వివాహాలు, టీనేజ్‌లో గర్భం వల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు ఉషశ్రీ, లత, జానకీరావ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల కడుపు కొడితే ఊరుకోం
ఏ ప్రభుత్వమైనా పేదల కోసం పనిచేయాలి.. మైనారిటీ వర్గానికి చెందిన ఓ పేద కుటుంబం ఇల్లు లేక తాత్కాలికంగా నిర్మించుకున్న ఇంటిని కూల్చి వేస్తే ఆ కుటుంబం బజారున పడుతుందని వైఎస్సార్సీపీ గంగాధరనెల్లూరు ఇన్చార్జ్ కృపాలక్ష్మి మండిపడ్డారు. బుధవారం వెదురుకుప్పం మండల కేంద్రంలో అధికారులు నిరుపేద అయిన ఖాదర్ బాషా ఇంటిని కూల్చివేయడంపై ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడుతూ అక్రమంగా భవనాలు నిర్మించుకున్న వారిని వదిలేసి, ఇలా పేదవారిపై కక్ష కట్టడం ఏంటని ప్రశ్నించారు. మైనారిటీ వర్గానికి చెందిన వారని తెలిసి అధికారులు విచక్షణారహితంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా బలవంతంగా మహిళలన్న విచక్షణ లేకుండా కొట్టి, రోడ్డుపైకి ఈడ్చి చిత్రహంసలకు గురి చేయడం ఏంటన్నారు. కనీసం వారికి ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు కూడా చేయకుండా ఇంటిని కూల్చితే వారు ఎక్కడ ఉండాలని తహసీల్దార్ రమేష్‌బాబును అడిగారు. నిబంధనల ప్రకారం పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఆక్రమణను తొలగించారని తహసీల్దార్ చెప్పారు. ముందుగానే నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చెరువులో ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చినప్పుడు అందరివీ కూల్చకుండా.. కేవలం ఒక్కరిపైనే ఎందుకు కక్ష సాధింపు ఏంటని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయక్తు కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామయ్య ప్రశ్నించారు. వారికి ముందుగా ఇంటి స్థలం చూపించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తహసీల్దార్ స్పందిస్తూ ఇంటి స్థలం మంజూరుకు చర్యలు తీసుకుంటామని, తంగేళిమిట్ట సమీపంలో ఉన్న లేఅవుట్లో ఇంటి స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో బొమ్మయ్యపల్లె సర్పంచ్ గోవిందయ్య, జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు శివాజి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గఫూర్ ఉన్నారు. -
కాళ్లా వేళ్లా పడి బతిమాలినా..
‘‘పొట్టకూటి కోసం వచ్చాం.. చిన్న షెడ్డుకుని జీవనం సాగిస్తున్నాం.. కడు నిరుపేదలం.. మాకు ఎవరూ దిక్కు లేరు.. మాపై మీ ప్రతాపం ఏంది సారూ.. మీ కాళ్లు మొక్కుతాం.. మమ్మల్ని రోడ్డున పడేయవద్దు.. మాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. ఉన్నఫళంగా మా ఇల్లు కూలగొడితే మేం ఎక్కడికెళ్లి ఉండాలి ? సారూ..’’ అంటూ వెదురుకుప్పం మండలకేంద్రంలో నిరుపేద కుటుంబం అధికారుల కాళ్లా వేళ్లా పడి బతిమాలినా.. కనికరించలేదు. చెరువు పక్కన చిన్న షెడ్డు వేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబంపై అధికారులు తమ ప్రతాపం చూపారు. -
స్టెమీతో గుండెకు రక్ష
● కరోనా తరువాత పెరిగిన గుండెజబ్బుల కేసులు ● ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు స్టెమీకి శ్రీకారం చుట్టిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ● జిల్లావ్యాప్తంగా 23 స్పోక్స్ సెంటర్ల ఏర్పాటు ● రెండేళ్లుగా 132 మందికి ఆయుష్షు ● స్పోక్స్ సెంటర్లను మళ్లీ ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు కాణిపాకం: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా గుండె పోటుతో మరణిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో పాటు మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహార నియమాల లోపం గుండె జబ్బులకు ప్రధాన కారణాలని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. సరైన నియమాలు పాటించకపోవడంతో బీపీ, మధుమేహ వ్యాధులు సైతం విస్తరిస్తున్నాయి. దీని కారణంగా కూడా గుండె లయ తప్పుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టెమీ అమలు ఇలా .. స్టెమీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఏపీవీపీలో పరిధిలో ఉన్న 23 ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లకు బయోనెట్ కంపెనీకి సంబంధించిన 12 లీడ్స్ ఉండే ఈసీజీ మిషన్ అందజేశారు. అలాగే కంప్యూటర్ అందజేసి స్టెమీ సాఫ్ట్‌వేర్‌ను అందులో అప్లోడ్ చేయించారు. ఐసీయూ బెడ్, ఐవీ స్టాండ్, మల్టీ పారా మానిటర్, 26 రకాల అత్యవసర డ్రగ్స్‌ను అందుబాటులో ఉంచారు. అత్యవసర విభాగంలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందితో పాటు ప్రత్యేకంగా ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్‌నర్సును కేటాయించారు. గుండె నొప్పితో స్పోక్స్ సెంటర్‌కు వచ్చిన వారికి తక్షణమే ఈసీజీ తీసి ఆ రిపోర్ట్‌ను స్టెమీ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఇలా చేసిన వెంటనే రెండు నిమిషాల్లో ఆ వివరాలు తిరుపతి రుయాలోని హబ్‌కు చేరుతాయి. అక్కడున్న గుండె వైద్య నిపుణులు రిపోర్ట్ చూసి ఎలాంటి చికిత్స ఇవ్వాలో ఆ యాప్‌లోనే నమోదు చేస్తారు. గోల్డెన్ అవర్‌లో వెళ్తే.. సెంటర్లోనే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇస్తారు. తరువాత హబ్‌కు రెఫర్ చేస్తారు. ఈ ఇంజెక్షన్ ధర మార్కెట్లో రూ.45 వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రచార ఆర్భాటం కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో కొత్తగా ప్రారంభిస్తున్నట్లు చూపించుకోవాలని పాలకులు యత్నిస్తున్నారు. దీనిపై వైద్యశాఖ నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న కేసులు.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సుమారు 46 లక్షల మంది జనాభా ఉన్నారు. రెండేళ్ల కిందట ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఎన్సీడీ సర్వేలో భాగంగా 42 లక్షల మందిని పరీక్షించారు. అందులో 12,02,431 మంది మధుమేహం, 1,96,772 మంది రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. బీపీ, షుగర్ రెండూ ఉన్నవారు సుమారు 80 వేల మంది వరకు ఉన్నారని నిర్ధారణ అయింది. అలాగే 12 వేల మంది గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. స్టంట్ వేసుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అంటున్నారు. వీరి సంఖ్య కూడా రెండు జిల్లాల్లోనూ 8వేలకు పైగా దాటిందని నిపుణుల గణంకాలు చెబుతున్నాయి. సైలెంట్ కిల్లర్.. స్టెమీతో 132 మందికి ఊపిరి.. ఒకప్పుడు గుండెపోటు అటే మధుమేహం ఉన్నవారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీదపడిన వారికి, ఊబకాయం ఉన్నవారికి మాత్రమే వస్తుంది అనేకునేవాళ్లం. కానీ ప్రస్తుత కాలంలో గుండెపోటు తీరు మారింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా స్ట్రోక్ వస్తోంది. మరీముఖ్యంగా జిమ్ చేస్తున్న వారు, ఎక్కువ జిమ్ చేస్తున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల గ్యాస్ట్రిక్, ఛాతీలో నొప్పి లాంటివి కనిపించగానే టక్కుమని ఆస్పత్రికి వెళ్తున్నారు. తీరా వెళ్లాక నిజంగానే స్ట్రోక్ వచ్చిందని స్టంట్ వేయడం లేదంటే శస్త్ర చికి త్స చేయాల్సి రావడమో జరుగుతోంది. భి న్నంగా కనిపించే కేసులు కూడా ఉంటున్నా యి. పూర్తిగా గుండె నొప్పి రావడం, ఆయాసంగా అనిపించడం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటివి కూడా గుండె సంబంధిత సమస్యలు కావొచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 23 స్పోక్స్ సెంటర్లలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 26వేల మందికి ఈసీజీ తీశారు. వారిలో 195 మంది గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 132 మందికి థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ రక్షణగా నిలిచింది. 125 మందిని తిరుపతిలోని హబ్‌కు రెఫర్ చేశారు. తద్వారా గుండెనొప్పితో బాధపడుతున్న వారికి స్టెమీ కార్యక్రమం భరోసా కల్పిస్తోంది. గుండెకు మేలు.. ఇటీవల కాలంలో చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా స్ట్రోక్ వస్తోంది. కరోనా సమయంలో చాలామంది స్ట్రోక్‌తో మరణించారు. స్టెమీతో గుండెకు సత్వర చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోల్డెన్ అవర్‌లో వచ్చిన బాధితులకు రూ.45 వేలు విలువ చేసే ఇంజెక్షన్‌ను స్పోక్స్ సెంటర్లో ఉచితంగా అందిస్తారు. ఇప్పటి వరకు 132 మందికి ఈ ఇంజెక్షన్ ఇచ్చాం. ప్రతి సెంటర్లోను 5 ఇంజక్షన్ల చొప్పున్న ఉన్నాయి. – ప్రభావతి, డీసీహెచ్ఎస్, చిత్తూరు జిల్లా -
స్టెమీతో గుండెకు రక్ష
పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగావైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల సుస్థిర పాలన అందించింది. వైద్యరంగలో సరికొత్త మార్పులు తీసుకురావడంతో పాటు ప్రధానంగా గుండెకు ఆయుష్షు పోసింది. హార్ట్ స్ట్రోక్ నియంత్రణలో భాగంగా సత్వర వైద్యం అందించేందుకు స్టెమీ (ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫరక్షన్) అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దీంతో వేలాది మంది పునర్జన్మ పొందారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఈ నెలలో హంగూ ఆర్భాటాల మధ్య మళ్లీ ప్రారంభించి డప్పు కొట్టుకోవాలని చూస్తోంది. -
జీడీనెల్లూరు ఎమ్మెల్యేపై తమ్ముళ్ల ఫైర్
గంగాధర నెల్లూరు: గంగాధర నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. తమకు విలువ ఇవ్వడం లేదని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదుపై బుధవారం గంగాధరనెల్లూరు ఆ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే థామస్ తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆది నుంచి ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారని, పార్టీకి మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలు, నాయకులను పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు . ప్రభుత్వ కార్యక్రమాల సమావేశాల్లో వారిని అందలం ఎక్కిస్తున్నారని, అదేవిధంగా ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడికి గోడు వినిపించారు. అనంతరం ఒక తీర్మానం చేసి, సమావేశానికి వచ్చిన సభ్యుల దగ్గర సంతకాలు సేకరించి పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికే విలువ ఇస్తారా? అధిష్టానానికి తెలుగు తమ్ముళ్ల ఫిర్యాదు