controversial
-
నేపాల్ కొత్త కరెన్సీ నోట్లలో భారత్ ప్రాంతాలు? మరోమారు ఉద్రిక్తతలు?
ఖాట్మండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాతో జతకట్టి, భారత్‌తో శత్రుత్వాన్ని పెంచుకునే దిశగా తప్పటడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్, నేపాల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.చైనాపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తున్న ఓలీ.. ఆ దేశపు సూచనల మేరకు భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేపీ ఓలీ తన తప్పుడు నిర్ణయాలతో భారతదేశంతో సంబంధాలను చెడగొట్టారు. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టారు. నేపాల్ ప్రభుత్వం తాజాగా తమ దేశ మ్యాప్‌లో భారతదేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశ ప్రాంతాలుగా చూపించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేపాల్ కొత్త నోట్లను ఆయుధంగా వాడుకుంటోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ త్వరలో సవరించిన మ్యాప్‌తో కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘నేపాల్ ఖబర్ డాట్ కామ్’ తాజాగా నేపాల్ దేశ బ్యాంక్ జాయింట్ ప్రతినిధి డిల్లిరామ్ పోఖరేల్ తెలిపిన వివరాలను వెల్లడించింది. భారత్‌లో భాగమైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలతో కూడిన కొత్త మ్యాప్‌తో బ్యాంక్ నోట్ల ముద్రణను నేపాల్ దేశ బ్యాంక్ ఇప్పటికే ప్రారంభించిందని పేర్కొంది. ఏడాదిలోగా నోట్ల ముద్రణ పూర్తి కానున్నదని కూడా వెల్లడించింది.కాగా, గతంలో అప్పటి నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని నేపాల్ క్యాబినెట్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని, సవరించిన మ్యాప్‌తో కూడిన కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇదేపని చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర తమ భూభాగాలు అని భారత్ స్పష్టం చేసినప్పటికీ, చైనా సూచనలతో నేపాల్ ఈ దుశ్చర్యకు పాల్పడుతోదనే వార్తలు వినిపిస్తున్నాయి. -
Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్‌ను అప్పగిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్‌కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. -
10 అత్యంత వివాదాస్పద ‘వికీలీక్స్’
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఐదేళ్లకు పైగా బ్రిటీష్ హై-సెక్యూరిటీ జైలులో, ఏడేళ్లపాటు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన తర్వాత బుధవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. 2010లో వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్‌లో విడుదల చేయడంతో చిక్కుల్లో పడి న్యాయపోరాటం సాగించారు. ప్రపంచాన్ని కదిలించిన 10 వికీలీక్స్ ఇవే..1. ఇరాక్ యుద్ధం2010లో వికీలీక్స్ ఇరాక్ యుద్ధంలో పౌరుల ప్రాణనష్టం, వివాదాస్పద వ్యూహాలను బహిర్గతం చేసే రహస్య యూఎస్ఏ సైనిక పత్రాలను విడుదల చేసింది. దీంతో సైనిక కార్యకలాపాలలో పారదర్శకత ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అమెరికా సంకీర్ణ దళాల చర్యల కారణంగా చోటు చేసుకున్న పౌర మరణాలు వికీలీక్స్ కారణంగా వెల్లడయ్యాయి.2. గ్వాంటనామో ఫైల్స్వికీలీక్స్ గ్వాంటనామో బేలో జరుగుతున్న కార్యకలాపాలను వివరించే పత్రాలను ప్రచురించింది. ఖైదీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను దీనిలో బహిర్గతం చేసింది. ఇది అంతర్జాతీయ నిరసనలకు ఆజ్యం పోసింది. ఖైదీలను హింసించడం, వారి హక్కులను కాలరాడయం లాంటి వివరాలు దీనిలో వెల్లడయ్యాయి.3. ఆఫ్ఘన్ వార్ డైరీఆఫ్ఘన్ వార్ డైరీ పత్రాలను వికీలీక్స్ విడుదల చేసింది, పౌర మరణాలు, రహస్య కార్యకలాపాలు, తాలిబాన్ వ్యూహాలను దానిలో బహిర్గతం చేసింది. యూఎస్ఏ కాంట్రాక్టర్లు ఆఫ్ఘనిస్తాన్‌లో కుర్రాళ్లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్న తీరు దీనిలో వెల్లడయ్యింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ బలోపేతమవుతున్నదని వికీలీక్స్ వెల్లడించింది.4. కొల్లేటరల్ మర్డర్ వీడియోబాగ్దాద్లో యూఎస్ అపాచీ హెలికాప్టర్ దాడికి సంబంధించిన ఒక రహస్య వీడియోను వికీలీల్స్ విడుదల చేసింది. హెలికాప్టర్ సిబ్బంది పౌరులను సాయుధ తిరుగుబాటుదారులుగా పొరపాటుగా గుర్తించి, వారితోపాటు రాయిటర్స్ ఫోటోగ్రాఫర్, అతని డ్రైవర్‌పై కాల్పులు జరుపుతున్నట్లు ఉన్న వీడియోను బయటపెట్టింది. నాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలంగా మారింది.5. ప్రపంచ నేతలపై ఎన్ఎస్ఏ టార్గెట్అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) ప్రపంచ నేతలను టార్గెట్ చేసిందని వికీలీక్స్ వెల్లడించింది. బెర్లిన్‌లో అప్పటి యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మధ్య జరిగిన ప్రైవేట్ సమావేశాన్ని ఎన్ఎస్ఏ బగ్ చేసిందని వికీలీక్స్ పత్రాలు వెల్లడించాయి.6. డీఎన్సీ ఈ మెయిల్ వివాదం2016లో వికీలీక్స్.. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ)కి చెందిన ఈ మెయిల్స్‌ను విడుదల చేయడం ద్వారా పార్టీ అంతర్గత విభేదాలు ప్రపంచం ముందు వెల్లడయ్యాయి. లీకైన ఈ మెయిల్స్‌లో డీఎన్సీ అధికారులు బెర్నీ సాండర్స్ కన్నా హిల్లరీ క్లింటన్‌కు ప్రాధాన్యతనిచ్చారని వెల్లడయ్యింది. ఈ వివాదం సాండర్స్ మద్దతుదారులలో అపనమ్మకాన్ని పెంచింది. ఇది అమెరికన్ రాజకీయ వ్యవస్థలో పారదర్శకతపై చర్చకు దారితీసింది.7. సౌదీ కేబుల్స్సౌదీ దౌత్య వ్యవహరాలకు సంబంధించిన కీలక విషయాలను వికీలీక్స్ బయటపెట్టింది. లీకైన పత్రాలలో సౌదీ వ్యూహాత్మక పొత్తులు, రహస్య కార్యకలాపాలు, దౌత్య వివరాలున్నాయి. ఈ లీక్‌లు సౌదీ అరేబియా విదేశీ విధానాలను, ప్రాంతీయ సంఘర్షణలను బహిర్గతం చేసింది.8. స్నోడెన్ ఎన్ఎస్ఏ పత్రాలుఎడ్వర్డ్ స్నోడెన్తో కలిసి, వికీలీక్స్ గ్లోబల్ నిఘా కార్యక్రమాలను బహిర్గతం చేసే క్లాసిఫైడ్ ఎన్ఎస్ఏ పత్రాలను ప్రచురించింది. ఇది గోప్యతా హక్కులు, ప్రభుత్వ పర్యవేక్షణ, విజిల్బ్లోయర్ల పాత్రపై చర్చలకు దారితీసింది. ఈ వెల్లడి జాతీయ భద్రత, పౌర స్వేచ్ఛల మధ్య సమతుల్యతపై పలు సందేహాలకు పురిగొల్పింది.9. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వికీలీక్స్ హిల్లరీ క్లింటన్ ప్రచారం, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన ఈ మెయిల్స్‌ను ప్రచురించింది. ఇది సైబర్ భద్రత, రాజకీయ పారదర్శకత, విదేశీ జోక్యంపై ఆందోళనలకు దారితీసింది.10. వాల్ట్ 72017లో వాల్ట్ 7 సిరీస్‌ను వికీలీక్స్ విడుదల చేసింది. దీనిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) హ్యాకింగ్ సాధనాలు, నిఘా పద్ధతులను బహిర్గతం చేసింది. ఇది ప్రభుత్వ నిఘా సామర్థ్యాలు, డిజిటల్ గోప్యతపై ఆందోళను లేవనెత్తింది. -
వివాదాస్పద వ్యాఖ్యలు.. శామ్ పిట్రోడాకు కాంగ్రెస్‌కు కీలక పదవి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ దక్షిణాది భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయుల చర్మ రంగుపై జాతివివక్షతో వ్యాఖ్యలు చేయడంతో ఆయన కోల్పోయిన పదవి మళ్లీ దక్కింది. శామ్ పిట్రోడాను బుధవారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా హస్తం పార్టీ తిరిగి నియమించింది.శామ్ పిట్రోడాను తక్షణమే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించినట్లు సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు.కాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తూర్పు భారతీయులు చైనియుల్లా, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్ల కనిపిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. -
లోక్‌సభలో నినాదాల వివాదం.. స్పీకర్ కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండోరోజు మంగళవారం(జూన్25) కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణాలు చేసిన తర్వాత పలువురు ఎంపీలు చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు.BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024తమిళనాడులోని తిరువళ్లూర్ ఎంపీ శశికాంత్ సెంథిల్ రాజ్యాగం చేత పట్టుకుని తమిళ్లో ప్రమాణం చేశారు. ఈయన కూడా తన ప్రమాణం ముగిసిన తర్వాత ‘ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి. జై భీం, జై సంవిధాన్’అని నినదించారు. ఈయన కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. The IAS officer who resigned after the abrogation of #Article370 in #Kashmir and #Tiruvallur's #Congress MP #SasikanthSenthil took oath in Tamil.When he said, "Stop the shameful atrocities against the Minorities, Dalits & Adivasis. Jai Bhim, Jai Sanvidhan" #BJP MPs protested.… pic.twitter.com/jv1uyp2pGu— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2024సభలో అసదుద్దీన్, శశికాంత్ సెంథిల్ చేసిన నినాదాలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఎంపీలు చేసిన వివాదాస్పద నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
న్యూఢిల్లీ: దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల విశ్వసనీయతపై చర్చ జరగడం సాధారణమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతాలు ఆలస్యంగా ప్రకటించడంపైకి చర్చ మళ్లింది. దీనికి కారణం ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్‌కు సంబంధించి ఫైనల్ ఓటర్ టర్నవుట్ డేటాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్(ఈసీ) వారాల కొద్ది సమయం తీసుకోవడమే. డేటా ఆలస్యమవడంతో పాటు పోలింగ్‌రోజు రాత్రి ప్రటించిన పోలింగ్ శాతానికి సమయం తీసుకుని ప్రకటించన డేటాకు మధ్య భారీ వ్యత్యాసముండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఎన్జీవోలు ఈ విషయంలో కోర్టుల తలుపులు తడుతున్నాయి. పోలింగ్ శాతం డేటాల్లో భారీ వ్యత్యాసాలపై ఇప్పటికే అసోసియేట్ ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను మే17న తొలుత విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్ టర్నవుట్‌లు ప్రకటించడానికి ఆలస్యమెందుకవుతోంది, డేటాల్లో భారీ వ్యత్యాసమెందుకు ఉంటోందని ఈసీని ప్రశ్నించింది. మే 24న మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తొలి దశ పోలింగ్ శాతం డేటాకు ఏకంగా 11 రోజులు... అంకెల్లోనూ భారీ వ్యత్యాసం..లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరిగితే ఈసీ యాక్చువల్ పోలింగ్ పర్సెంటేజీ ప్రకటించడానికి ఏకంగా 11 రోజులు పట్టింది. ఇక డేటా విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన రోజు డేటా 60 శాతం అని తెలపగా 11 రోజుల తర్వాత ఈడేటా ఏకంగా 6 పర్సెంటేజీ పాయింట్లు పెరిగి 66.14 శాతానికి చేరింది.దీనిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్జీవోలు విస్మయం వ్యక్తం చేశాయి. పోలింగ్ శాతాల్లో ఇంత వ్యత్యాసమెందుకు వస్తోంది.. డేటా వెల్లడించడానికి ఎందుకంత సమయం తీసుకోవాల్సి వస్తోందని ఈసీకి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాయి. ఇదే తంతు సెకండ్ ఫేజ్ పోలింగ్‌కు మళ్లీ రిపీట్ అయింది. ఏప్రిల్ 26న సాయంత్రం పోలింగ్ శాతం 60.96 శాతం అని ప్రకటించగా అది కాస్తా ఏప్రిల్ 30న వాస్తవ డేటా ప్రకటించే సరికి 66.71శాతానికి పెరిగిపోయింది.నాలుగు దశల్లో 1.07 కోట్ల ఓట్ల తేడా..ఎన్నికల నాలుగు దశల పోలింగ్ శాతాల్లో ఈసీ ప్రకటించిన తొలి, తుది డేటాల వ్యత్యాసాన్ని ఓట్లలో పరిశీలిస్తే 1.07 కోట్ల ఓట్ల వ్యత్యాసం వచ్చింది. ఇప్పటివరకు పోలింగ్ పూర్తయిన 379 నియోజకవర్గాలకు ఈ ఓట్లను పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 28 వేల ఓట్ల తేడా వస్తున్నట్లు అంచనా. అన్నింటికంటే ఎక్కువగా మే 13న పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా చూసినపుడు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతాల డేటాల్లో తేడా అభ్యర్థుల గెలుపోటములను ఈజీగా ప్రభావితం చేయగలదన్న వాదన వినిపిస్తోంది. 2019లో ఎలా ప్రకటించారు.. ఇప్పుడేమైంది..ఐదోవిడత పోలింగ్ సోమవారం(మే20)న జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఓటర్ టర్నవుట్ 60.09గా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ఫైనల్ పోలింగ్ శాతం డేటాను ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై అనేక ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారిగా, స్ట్రీ,పురుషుల వారిగా అన్ని రకాల డేటాను ప్రకటించిందని, ఇప్పుడెందుకు ఈసీకి అది సాధ్యమవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.17సి ప్రామాణికం కాదా...సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ప్రతి పోలింగ్ బూత్‌లో ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఆ బూత్‌లో పోలైన ఓట్ల వివరాలను 17సి ఫామ్‌లో ఎన్నికల అధికారులు అందిస్తారు. ఇది నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లోనూ జరుగుతుంది. 17సి ఫామ్‌లతో అభ్యర్థులకు నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. ఇంత క్లియర్‌గా 17సి ఉండగా ఫైనల్ డేటా విషయంలో సమస్య ఎక్కడ వస్తోందని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ప్రశ్నించడం గమనార్హం. -
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
సాక్షి, విజయవాడ: వివాదాస్పద ఎస్పీలపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అభియోగాలపై నోటీసులు జారీ చేసింది. ఈసీ సస్పెండ్ చేసిన ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్‌కు నోటీసులు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల లో ఎస్పీల వైఫల్యం, పాత్రపై విచారణ జరగనుంది. ఎస్పీల వివరణ ఆనంతరం నేరుగా విచారించే అవకాశం ఉంది.ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. -
అయోధ్యపై టీఎంసీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు. హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తృణమూల్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సువేందు తన ట్విట్టర్ హ్యాండిల్లో తృణమూల్‌పై విరుచుకుపడ్డారు.. అధికార పార్టీ నేతల మాటలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిదర్శనం అని అన్నారు. శ్రీరాముని ఆలయాన్ని ‘అపవిత్రం’ అని అభివర్ణించేంతలా వారి వైఖరి మారిపోయిదన్నారు. ఇది తృణమూల్ నేతల భావజాలాన్ని వెల్లడిస్తుందన్నారు. Simply Outrageous. TMC MLA of Tarakeswar Assembly Constituency - Ramendu Sinha Roy, who is also the TMC President of Arambagh Organizational District has labeled the Grand Ram Mandir as 'UNHOLY'. He has also stated that no Indian Hindu should offer Puja at such unholy site.… pic.twitter.com/xBBQuqpTzn — Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) March 4, 2024 -
AP : జస్టిస్ రాకేష్ వివాదాస్పద తీర్పు రద్దు
ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్ 31, 2020న జస్టిస్ రాకేష్‌కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్ రాకేష్.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది. కేసు పూర్వపరాలేంటీ? ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రాకేశ్‌కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్‌కుమార్ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్‌కుమార్ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్ రాకేష్‌కుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్‌కుమార్ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ రాకేశ్‌కుమార్ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్ -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యాయవ్యవస్థపై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
నాగ్‌పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత జితేంద్ర అవద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈసారి ఆయన దేశంలోని న్యాయవ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపుతున్నాయి. ‘నాకు చాలా బాధగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు పెట్టాల్సింది. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల 80 శాతం సమాజానికి అన్యాయం జరుగుతోంది. న్యాయ వ్యవస్థ చేసే కొన్ని నిర్ణయాల్లో కుల వివక్ష వాసన వస్తోంది. ఇది న్యాయవ్యవస్థ నుంచి ఆశించ లేదు’ అని నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్సీపీ సమతాపరిషద్ మీటింగ్‌లో అవద్ మాట్లాడారు. బహుజనులు ఇప్పుడిప్పుడే బార్ కౌన్సిల్లలో కనిపిస్తున్నారని అవద్ అన్నారు. తరాలుగా వారికి విద్య అందకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇదీచదవండి.. అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరి బలి -
కృత్రిమ దీవిలో వివాదాస్పద భవంతి
పోలండ్‌లోని నోటెకా అభయారణ్యంలో ఈ భవంతి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. నదిలో కృత్రిమ దీవిని ఏర్పాటు చేసుకుని, దానిపై మధ్యయుగాల శైలిలో దాదాపు ఎనిమిదేళ్లుగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించిన వివరాలు ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియవు. ఎవరు ఎందుకు ఈ భవంతిని నిర్మిస్తున్నారనే దానిపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ భవంతి నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇది 2025 నాటికి పూర్తి కాగలదని అంచనా. అభయారణ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించి జనాలకు కొంత ఆలస్యంగా తెలిసింది. దీనిపై స్థానిక పర్యావరణవేత్తలు గగ్గోలు చేయడంతో 2020లో ఏడుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణం సాగుతున్నా, దీనిపై పట్టించుకోనందుకు స్థానిక గవర్నర్‌కు పదవి ఊడింది. అయినా, ఈ భవంతి నిర్మాణం వెనుక ఎవరు ఉన్నారనేది మాత్రం స్పష్టంగా బయటపడలేదు. ఈ పరిణామాల తర్వాత కూడా ఈ భవంతి నిర్మాణం యథా ప్రకారం కొనసాగుతూనే ఉంది. ఈ భవంతి నిర్మాణానికి దాదాపు 75 మిలియన్ పౌండ్లు (రూ.78.94 కోట్లు) ఖర్చవుతుందని ఒక అంచనా. ఈ భవంతి నిర్మాణం వెనుక జాన్ కుల్సిక్ అనే పోలిష్ కోటీశ్వరుడు ఉన్నట్లు ఒక వదంతి ప్రచారంలో ఉంది. నిజానికి అతడు ఈ నిర్మాణం ప్రారంభించే నాటికే 2015లో మరణించాడు. అయితే, తాను జీవించి ఉండగానే, మరణించినట్లు ప్రచారం చేసుకుని, తెరవెనుక ఉండి ఈ నిర్మాణం కొనసాగిస్తున్నాడనే ప్రచారం బలంగా ఉంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాన్ని నిలిపివేయడానికి పోలిష్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేవీ నెరవేరలేదు. అలాగే ఈ నిర్మాణం వెనుక ఎవరున్నారో, దీనిని ఏ ఉద్దేశంతో నిర్మిస్తున్నారో ఇప్పటి వరకు బయటపడకపోవడమే ఆశ్చర్యకరం. -
అలాంటి వ్యక్తితో నటించకపోవడం సంతోషం
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ–‘‘నేను గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్లతో బెడ్ సీన్లలో నటించా. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను. అయితే అలాంటి సన్నివేశం లేకపోవడం బాధపడ్డాను. కశ్మీర్ షెడ్యూల్ అయిపోయే వరకు త్రిషను చూసే అవకాశం కూడా చిత్రయూనిట్ ఇవ్వలేదు’’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలు త్రిష వద్దకు చేరడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ‘‘మన్సూర్ అలీఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వ్యక్తులతో నటించకపోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ ఆయనతో, అలాంటి వారితో నటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది’’ అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మన్సూర్ అలీఖాన్ స్పందిస్తూ–‘‘త్రిష అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు.. నా మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు’’ అన్నారు. -
కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు
ముంబయి: ఇండియా- కెనడా మధ్య వివాదాస్పద పరిస్థితుల ప్రభావం ఓ సింగర్ సంగీత కచేరి మీద పడింది. ముంబయిలో జరగనున్న ఖలిస్థానీ మద్దతుదారుడైన కెనడియన్ పంజాబీ సింగర్ శుభ్ సంగీత కచేరీ రద్దైంది. సింగర్ శుభ్ భారత పర్యటన కూడా రద్దైంది. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంగీత కచేరి కోసం టికెట్ బుక్ చేసుకున్నవారికి బుక్ మై షో ఇప్పటికే రీఫండ్ కూడా చేసేసింది. ఖలిస్థానీలకు మద్దతు తెలుపుతున్నట్లు సింగర్ శుభ సోషల్ మీడియాలో పోస్టులు ఉన్న నేపథ్యంలో.. సంగీత కచేరీని రద్దు చేయాలని భారతీయ యువ మోర్చా డిమాండ్ చేసింది. దీంతో శుభ్ పర్యటనకు స్పాన్సర్షిప్ చేసిన కంపెనీ బీఓఏటీ ఈ మేరకు సంగీత కచేరిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ కెనడాకు చెందిన ఈ పంజాబీ సింగర్ శుభ్ వివాదాస్పద భారత్ చిత్రపటాన్ని షేర్ చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేని భారత్ మ్యాప్‌ను షేర్ చేయడంతో క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా శభ్ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ -
ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబయి: దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరలు కాకరేపుతున్నాయి. క్వింటాల్ ధర రూ.2415కు పైగా అమ్ముడుపోతోంది. ఉల్లి ధరను కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. అయినప్పటికీ ఉల్లికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనలేనివారు కొన్నాళ్లు ఉల్లికి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదని అన్నారు. 'రూ.10 లక్షల కారు కొనగలిగినవారికి రిటైల్ ధర రూ.10 నుంచి 20 పెరిగితే సమస్య ఏమీ ఉండదు. కొనలేనివారు ఓ నాలుగు నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఒక్కసారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200 మాత్రమే ఉంటుంది. మరికొన్నిసార్లు రూ.2000 వరకు పెరుగుతుంది. ఎగుమతి సుంకాన్ని పెంచి ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.' అని చెప్పారు. కేంద్రం ఉల్లి ధరలపై ఎగుమతి పన్నును 40 శాతానికి పెంచడంతో రైతులు ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలో అతి పెద్దదైన హోల్‌సెల్ మార్కెట్‌తో సహా ఉల్లి వేలాన్ని నిలిపివేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు! -
డామిట్!.. కథ అడ్డం తిరిగింది.. టీడీపీకి పెద్ద షాకే తగిలింది..
ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఎంతకీ ప్రజలు గుర్తించడం లేదని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. అధికార పార్టీ మీద బురద జల్లి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఒంగోలులో లోకేష్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేసింది. విషయం తెలిసి ప్రజలు అసహ్యించుకోవడంతో సైలెంట్‌గా వాటిని తొలగించింది. ఇంతకీ ఒంగోలులో జరిగిందేంటి? ప్రకాశం జిల్లాలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటున్న తెలుగుదేశం, జనసేన నానా రకాల పాట్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీ మీద విషం చిమ్మడం, ప్రజలతో చీవాట్లు తినడంతో తాజాగా ఫ్లెక్సీల వివాదానికి తెర తీశాయి. వైఎస్సార్సీపీ మీద విషం చిమ్ముతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీ, జనసేనలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలను తెలియచేస్తున్నాయి. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, దర్శి, కొండెపి పట్టణాల్లో నరకాసుర వధ అంటూ కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కించరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు. ఈ ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న పోలీసులపై కూడా దాడికి ప్రయత్నం చేసారు జనసేన కార్యకర్తలు. ఆ గొడవతో మైలేజ్ పొందుదామనుకున్నవారికి ప్రజల్లో అవమానాలు తప్పలేదు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి స్పందనే కనిపించడంలేదు. పాదయాత్ర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ఫ్లెక్సీల వివాదంను తెరపైకి తెచ్చింది. ఒంగోలు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడుకి పండగ అనే కామెంట్స్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తెల్లవారు జాము నుండే ఎల్లో మీడియాకు లీకులిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. అయితే తాము ఒకటి అనుకుంటే మరొకటి జరగడంతో ఉదయం 8 గంటలకల్లా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేశారు. చదవండి: ‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేస్తున్నారా?’ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా లబ్దిపొందుదామనుకున్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాకే తగిలింది. నారా లోకేష్‌ను కొసరోడు అంటూ తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. తమ నాయకుడిని తామే ఎగతాళి చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆఫీసుల్లోనే చర్చ జరిగింది. పార్టీకి జరిగిన డ్యామేజ్ గురించి అర్థం చేసుకునేలోగా.. చంద్రబాబు నుంచి చీవాట్లు రావడంతో సైలెంట్ అయిపోయారు. కొందరు వాలంటీర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ మీడియాకు చెప్పి మిన్నకుండిపోయారు. తర్వాత వాటిని తొలగించేశారు. తమ పార్టీని పైకి లేపుతూ...అధికార పార్టీ పరువు తీయాలని టీడీపీ వాళ్లు చేసే ప్రతి పనీ వారికే ఎదురుకొడుతోంది. ఎప్పటికప్పుడు తమ పరువును తామే తీసుకుంటున్నారంటూ టీడీపీ దీనస్థితిపై టాక్ నడుస్తోంది. -
టాయిలెట్ల వెనక చాలా కథ ఉంది.. ఈ వింతలు, విశేషాలు తెలుసా? (ఫోటోలు)
-
తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తీరు మరోసారి వివాదాస్పదమైంది. తండ్రిని హత్యచేసిన వారికి శిక్షలు పడేందుకు పోరాడుతున్నానని చెబుతున్న ఆమె వ్యవహారశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం అనేకానేక సందేహాలు లేవనెత్తుతోంది. వివేకాను హత్యచేశానని స్వయంగా ఒప్పుకున్న దస్తగిరికి ఆమె పూర్తి అండదండలు అందిస్తుండటం తెలిసిందే. మరోవైపు.. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో కలిసేందుకు సునీత శుక్రవారం ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దస్తగిరి బెయిల్ వ్యవహారంలో సునీత వ్యవహారశైలి.. అనంతరం ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె యత్నించడానికి సంబంధం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. తన తండ్రి హత్య కేసులో ప్రధాన నిందితులను ప్రభావితం చేయడం ద్వారా ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఆమె యత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. అసలు వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఆయన హత్యకు దారితీసి ఉండొచ్చన్న బలమైన ఆరోపణలకు సునీత ప్రస్తుత వ్యవహారశైలి బలం చేకూరుస్తోంది. హంతకుడు దస్తగిరికి సునీత అండదండలు.. సాధారణంగా తండ్రిని హత్యచేసిన వారిపై ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది. కానీ, వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న దస్తగిరిపై ఆయన కుమార్తె సునీత అంతులేని సానుకూలత ప్రదర్శిస్తున్నారు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని ఆమె ఏమాత్రం వ్యతిరేకించలేదు. అనంతరం.. బెయిల్ కోసం దస్తగిరి పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. అంతేకాదు.. సునీత కూడా అతని బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించలేదు. మరోవైపు.. అసలు హత్యచేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని వివేకా పీఏ కృష్ణారెడ్డి న్యాయస్థానంలో సవాల్ చేశారు. అతనికి ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కూడా కోర్టును కోరారు. కానీ, సునీత వెంటనే ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం విస్మయపరిచింది. అలాగే, దస్తగిరి బెయిల్‌ను రద్దుచేయాల్సిన అవసరంలేదని ఆమె న్యాయస్థానికి తెలపడం గమనార్హం. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డికి ఎలాంటి అర్హతలేదని.. బాధితురాలిగా తనకే అది ఉందని ఆమె వాదించారు. దస్తగిరి బెయిల్‌పై బయట ఉండటంపట్ల తనకేమాత్రం అభ్యంతరంలేదని చెప్పుకొచ్చారు. అసలు తన తండ్రిని హత్యచేసిన వ్యక్తి జైలులో ఉండాలని కోరుకోవాల్సిన సునీత.. అతను బయట ఉండాలని ఆశిస్తుండటం వెనుక ఏదో మతలబు ఉందన్నది స్పష్టమవుతోంది. దస్తగిరి వాంగ్మూలాన్ని బలపర్చాలనే.. నిజానికి.. దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలతో ఎర్ర గంగిరెడ్డి విభేదించారు. సీబీఐ నమోదు చేసిన దస్తగిరి అప్రూవర్ వాంగ్మూలంలో చెప్పినవన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. దాంతో దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలం అంతా కట్టుకథేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో.. ఎర్ర గంగిరెడ్డిని కలిసి దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను బలపరచాలని ఒత్తిడి చేయడమే సునీత ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకోసం ఎర్ర గంగిరెడ్డిని ప్రలోభాలకు గురిచేయడం.. ఆయన బెయిల్‌కు సీబీఐ సహకరించేట్లుగా చేస్తానని హామీ ఇవ్వడం ఆమె ప్రణాళికగా ఉంది. వివేకా హత్య అనంతరం అక్కడ ఆధారాలను ధ్వంసం చేయాలని ఎర్ర గంగిరెడ్డిని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. ఇదే అంశం సునీత, ఆమె భర్తకు ప్రతికూలంగా మారింది. ఈ విషయంలో మాట మార్చాలని.. ఆధారాల ధ్వంసంతో తన భర్తకు సంబంధంలేదని ఎర్ర గంగిరెడ్డితో చెప్పించాలన్నది సునీత ఉద్దేశం. తాను చెప్పినట్లు చేస్తే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చేందుకు యత్నించినట్లు తెలిసింది. ఎర్ర గంగిరెడ్డిని కలిసే ప్రయత్నం ఎందుకో!? ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జైల్లో కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు విస్మయపరుస్తోంది. గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె జైలు అధికారులను అనుమతి కోరగా వారు నిరాకరించారు. దాంతో ఆమె తన న్యాయవాది ద్వారా కొన్ని పత్రాలు ఆయన వద్దకు పంపి సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. అసలు తన తండ్రి హత్యకేసులో ఏ–1గా ఉన్న గంగిరెడ్డిని సునీత కలిసేందుకు యతి్నంచడం సందేహాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దుచేయడంతో ఎర్ర గంగిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. తాను చెప్పినట్లుగా చెబితే దస్తగిరికి సహకరించినట్లుగానే ఎర్ర గంగిరెడ్డికి సహకరిస్తామని ఆయనకు చెప్పేందుకే సునీత ప్రయత్నించినట్లు సమాచారం. వేళ్లన్నీ సునీత, ఆమె భర్తవైపే.. ఈ మొత్తం పరిణామాలతో వివేకా హత్యకేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు సునీత ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమైంది. ఆమె ఎందుకు హంతకులకు కొమ్ముకాస్తూ మరీ హత్య కేసు దర్యాప్తు దారి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయన్నది బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో.. వివేకా హత్యకు గురికావడంతో ఆయన సొంత కుటుంబ సభ్యులపై సందేహాలు వ్యక్తమయ్యాయి. చదవండి: ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు వివేకా హత్య తరువాత ఆయన రాసిన లేఖ, సెల్ఫోన్లను పోలీసులకు వెంటనే ఇవ్వకుండా గోప్యంగా ఉంచమని పీఏ కృష్ణారెడ్డితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఇదే అంశంపై సీబీఐ ఇటీవల వారిని విచారించింది కూడా. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే వివేకా హత్య స్థలంలో ఆధారాల ధ్వంసం చేశారన్నది వెల్లడైంది కూడా. వివేకా రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ నేత బీటెక్ రవి, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావగారు శివప్రకాశ్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారన్నది కూడా బహిరంగ రహస్యంగా మారింది. వాస్తవాలు వెల్లడి కాకూడదనే.. ఈ నేపథ్యంలో.. వివేకా హత్య కేసులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డిల పాత్ర ఉందనే వాదన బలపడుతోంది. అంటే ఈ కేసులో వారిని నిందితులుగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తాము బాధితులమని.. తమకే అర్హత ఉందని చెప్పేందుకు వారు నైతిక హక్కు కోల్పోయారు. మరోవైపు.. ఎర్ర గంగిరెడ్డి సీబీఐ ముందు నిజాలు వెల్లడిస్తే తమ కుటుంబానికి ఇబ్బందిగా మారుతుందని సునీత ఆందోళన చెందుతున్నారు. అందుకే వాస్తవాలు వెల్లడించకుండా కట్టడి చేసేందుకే ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు సునీత యత్నించినట్లు స్పష్టమవుతోంది. -
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు అధికార పార్టీ బీఆర్ఎస్కు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డిపై సొంత కూతురే కేసు పెట్టడం కలకలం రేపుతోంది. నాచారంలో తన పేరిట ఉన్న ప్లాట్ ను ఫోర్జరీ సంతకాలతో లీజ్ అగ్రిమెంట్ చేయించాడని కూతురు తూల్జ భవాని రెడ్డి ఉప్పల్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పై చీటింగ్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు కొంత కాలంగా వివాదస్పదంగా బయటకు వస్తోంది. నోటి దురుసుతనం, వ్యవహార శైలితో ఇంటా బయట విమర్శలు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా సొంత కూతురు తూల్జ భవాని రెడ్డి తన పేరిట నాచారంలో ఉన్న 159 గజాల కమర్షియల్ బిల్డింగ్‌కు సంబంధించి తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి కినారా గ్రాండ్‌కు అక్రమంగా లీజ్ అగ్రిమెంట్ చేయించాడని ఉప్పల్ పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పిబ్రవరి 4న ముత్తిరెడ్డి పై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదు చేశారు. ముత్తిరెడ్డిపై ఆరోపణలు ► యశ్వంతపూర్‌లో బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించారని గతంలో హైకోర్టుకు వెళ్ళారు మాజీ సర్పంచ్. బతుకమ్మ కుంట భూఆక్రమణపై అప్పటి కలెక్టర్ దేవసేనతో ముత్తిరెడ్డికి గొడవ సైతం జరిగింది. ► నర్మెట్ట మండలం హన్మంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలు ఎమ్మెల్యే కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. ► చేర్యాల మండల కేంద్రంలోని అంగడి స్థలం ఎకరం 20 గుంటలు ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై గతంలో అఖిలపక్షం ఆందోళనకు దిగి చెర్యాల బంద్‌కు పిలుపునిచ్చింది. ► గొల్లకురుమలు జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని సైతం ఎమ్మెల్యే వదల లేదనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె -
PM Modi:వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కేరళలో ప్రకంపనలు సృష్టించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఉగ్ర కుట్రల ఆధారంగా తీశారని, తీవ్రవాదానికి సంబంధించిన చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. కర్ణాటక బల్లారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసింగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ చిత్రంపై తొలిసారి స్పందిస్తూ దానికి మద్దతు తెలిపారు. 'కొద్ది రోజులుగా ది కేరళ స్టోరీ చిత్రంపై పెద్ద చర్చ జరుగుతోంది. కేరళలో ఉగ్ర శక్తుల గురించి ఈ చిత్రం బహిర్గతం చేసింది. ఉగ్రవాదం గురించి తెలియజేసింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయల కోసం కాంగ్రెస్ ఉగ్ర శక్తులకు మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు ఉగ్రశక్తులతో ఆ పార్టీ గుట్టుగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి' అని మోదీ పేర్కొన్నారు. కాగా.. ది కేరళ స్టోరీ చిత్రంపై సీఎం పినరయి విజయన్ సహా చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రం గురించి ఈ సినిమాలో తప్పుగా చూపించారని, కేవలం తమపై ధ్వేషంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని మండిపడ్డారు. కేరళవ్యాప్తంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేఫథ్యంలో గురువారం కొచ్చిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న పీవీఆర్ సినిమాస్.. షోను అర్ధాంతరంగా రద్దు చేసింది. మరోవైపు చిత్ర నిర్మాత, దర్శకులు మాత్రం దీన్ని వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించామని చెబుతున్నారు. కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయులు మతం మార్చుకుని సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇది పూర్తిగా అసత్యమని, విద్వేషంతో రూపొందించిన చిత్రమని కేరళ సహా దేశంలోని పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. చదవండి: శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ -
Manchu Vishnu Vs Manoj: మంచు మనోజ్, విష్ణుల మధ్య వివాదం.. షాకింగ్ వీడియో వైరల్
మంచు ఫ్యామిలీలో విభేదాలంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, విష్ణుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌ని నిజం చేస్తూ ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. తన అన్నతో విభేదాలు ఉన్నాయంటూ స్వయంగా మంచు మనోజ్ బయటపెట్టాడు. విష్ణు ఇంట్లోకి చొరబడి తన అనుచరులపై దాడి చేశాడంటూ తాజాగా మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టంట సంచలనం రేపుతోంది. విష్ణు ఇంట్లోకి చోరబడి మనోజ్ సన్నిహితుడు అయిన సారథితో వివాదానికి దిగడమే కాదు అతడిపై దాడి చేశాడంటూ మనోజ్ వీడియో విడుదల చేశాడు. ‘ఇదీ పరిస్థితి.. కొంతకాలంగా మా అన్న విష్ణు వ్యవహరం ఇలా ఉంది’ అంటూ మనోజ్ అసలు విషయం బయటపెట్టాడు. -
మోదీ వివాదాస్పద వ్యక్తి!: మస్క్‌తో కలిపి ఒకేగాటన కట్టిన చాట్‌జీపీటీ
న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీని ‘వివాదాస్పద వ్యక్తి’గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ పేర్కొంది! ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్‌ను ‘అత్యంత వివాదాస్పద వ్యక్తి’గా అది ఇటీవలే పేర్కొనడం తెలిసిందే. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖుల్లో వివాదాస్పదుల జాబితాను చాట్‌జీపీటీ తాజాగా వెల్లడించింది. అందులో మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తదితరులున్నారు. వీరందరినీ ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని కూడా చాట్‌జీపీటీ పేర్కొనడం విశేషం. వివాదాస్పదులు కాని వారి జాబితాలో అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, మాక్రాన్, కుబేరులు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ తదితరులను పేర్కొంది. -
అనసూయ వాలంటైన్స్ డే స్పెషల్ పోస్ట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వాగ్వాదం!
ప్రేమికుల రోజున నటి అనసూయకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. వాలంటైన్స్ డే సందర్భంగా అనసూయ చేసిన స్పెషల్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో రకరకాలు రెస్పాన్స్ వస్తోంది. పలువురు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది అనసూయ. ‘నీతో లైఫ్ చాలా క్రేజీగా ఉంటుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అదేం లేదు అక్క.. వాడి దగ్గర డబ్బు చాలా ఉంది అందుకే’ అంటూ కామెంట్ చేశాడు. ఇక అతడి కామెంట్‌పై అనసూయ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై స్పందిస్తూ సదరు నెటిజన్ను చెప్పుతో కొడతానంటూ చెప్పకనే చెప్పి కౌంటర్ ఇచ్చింది. ‘అదేంట్రా తమ్ముడు అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? చెప్పు.. నాకు లేదా మనీ మరి? నీకు అన్ని తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది. చెంపలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. సారి అదే చెంపలేస్తానంటున్నా’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇక అనసూయ రెస్పాన్స్ రికౌంటర్ సదరు నెటిజన్ మరో కామెంట్ చేశాడు. ‘మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. రియాలిటీని అర్థం చేసుకోండి. మీరు ఎన్ని చెప్పినా నిజమ నిజమే’ అని అన్నాడు. దీనిపై కూడా అనసూయ రిప్లై ఇచ్చింది. ‘నీ బొందరా నీ బొంద.. ముందు మాట్లాడటం నేర్చుకో. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా.. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నీ బుద్ధి మనీ ఒకటే కాబట్టి.. అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే నీ బుద్ధి మార్చుకో.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’ అని అంటూ కామెంట్స్ చేసింది. ఒకరి కామెంట్‌పై ఒకరు స్పందిస్తూ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అనసూయ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, కామెంట్స్ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా గతంలోనూ ఇలానే అనసూయ నెటిజన్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ట్విటర్లో తనని ట్రోల్ చేసిన వారినిక సమాధానం ఇస్తూ ఇలా రెండు, మూడు రోజుల పాటు అనసూయ గొడవ పడింది. అప్పట్లో ఇది చర్చనీయాంశమైంది. అంతేకాదు దనని ట్రోల్ చేసిన వారిపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ -
Malla Reddy: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో..
సాక్షి, మేడ్చల్‌జిల్లా: మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఆది నుంచి వివాదస్పద ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కటం చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా పలు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మరో వివాదంలో చిక్కుకున్నారు. ►జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సొంత నియోజకవర్గమైన మేడ్చల్‌కు పెద్దపీట వేస్తూ మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారనేది సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీలో జిల్లా అధ్యక్షుడితో కలిసి గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడ్చుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ►జయాపజయాలు ఏదైనా కాని తత్తరపాటు వ్యవహారంతో వివాదాల వరకు తొంగి చూసి.. అదే రీతిలో సమర్థించుకోవటంలోనూ మంత్రి మల్లారెడ్డి దిట్ట. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోవటం మొదలుకొని మంత్రి పదవిని సాధించటం వరకు ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి. ►స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని సహకార సంఘాలు, మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రి పలు వివాదాలకు నెలవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు.. కొన్ని పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పలు పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచ్ అభ్యర్థుల ఖరారు వరకు పలు వివాదాలను మంత్రి మల్లారెడ్డి అధిగమించారు. టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలను సైతం మంత్రి సొంత పార్టీతో సహా విపక్షాల నుంచి మూట గట్టుకున్నారు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల తన విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు కొత్త వివాదంలో చిక్కున్న మంత్రి ఏ విధంగా బయట పడతారని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. నామినేటెట్ పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తాడోపెడో తెల్చుకుంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. భూ వివాదాల్లోనూ... అలాగే జిల్లాలో పలు భూ వివాదాల్లో కూడా మంత్రి పలు ఆరోపణలను మూటగట్టుకుని వివాదంలో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో మంత్రి అయ్యాక మేడ్చల్, జవహర్‌నగర్, శామీర్‌పేట, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ సహా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ భూముల కొనుగోళ్లలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. వివాదాల నడుమ ఉన్న భూములను గుర్తించి, ఇరు వర్గాలను ఒప్పించి ఆయా స్థలాలను తనకు విక్రయించేలా చేయడంలో సిద్ధహస్తుడనే పేరు ఆయనకు ఉంది. మూడు చింతలపల్లి పరిధిలో ఈ తరహాలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
రామకృష్ణ రూటే సెపరేటు.. నిజాలు తెలిసి నాలుక మడత
కమ్యూనిస్టు పార్టీలంటే ప్రజా సమస్యల మీద పోరాడతారనే పేరుండేది. కాని ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కన పెట్టి టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులకు మద్దతుగా ఆయన చేస్తున్న ప్రకటనలు అనుమానాలకు తావిస్తోంది. సిద్ధాంతాలకు తిలోదకాలు భారత కమ్యూనిస్టు పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణ.. పాతికేళ్ళ క్రితం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే కొంతకాలంగా రామకృష్ణ అనుసరిస్తున్న తీరుతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని సీపీఐ వర్గాలే చెబుతున్నాయి. అవినీతి, అక్రమాలు ఎవరు చేసినా పోరాడే పార్టీగా తమ పార్టీ సీపీఐకి బ్రాండ్ ఉందని, ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ... అక్రమాలకు కొమ్ము కాస్తున్నారని రామకృష్ణపై సీపీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు రామకృష్ణ. అనంతపురం కేంద్రంగా గత కొన్ని రోజులనుంచి జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జాకీపై పచ్చ పడగ అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు జాకీ కంపెనీ ముందుకొచ్చింది. 129 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనంతపురంరాప్తాడు మధ్య 27 ఎకరాల భూమిని సేకరించి కంపెనీకి ఇచ్చింది. 2018లోపు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఏమైందో తెలియదు కానీ జాకీ కంపెనీ రాప్తాడులో ఏర్పాటు కాలేదు. రాప్తాడుకు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ఈ కంపెనీని ఇరవై కోట్ల రూపాయల కమిషన్లు అడిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా ఆ రోజున సీపీఐ నేత రామకృష్ణ టీడీపీ నేతల అవినీతి గురించి ప్రశ్నించలేదు. అర్థాంతరంగా పనులు నిలిపివేసి వెళ్లిపోయిన జాకీ పరిశ్రమపై ఆయన ఏ మాత్రం స్పందించలేదు. నిజాలు తెలిసి నాలుక మడత నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జాకీ అంశం చర్చనీయాంశంగా మారింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డబ్బు డిమాండ్ చేయటం వల్లే జాకీ పరిశ్రమ ఏర్పాటు కాలేదని మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాం ఆరోపించారు. దీన్నే ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించింది. తెలుగుదేశం నాయకుల ఆరోపణలకు మద్దతుగా రంగంలోకి దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి వల్లే జాకీ పరిశ్రమ రాలేదంటూ టీడీపీ ఆరోపణలను రామకృష్ణ కూడా వల్లె వేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల వల్లే జాకీ కంపెనీ వెళ్లిపోతే..అప్పుడు సీపీఐ నేత రామకృష్ణ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. సీపీఐ నేత రామకృష్ణ మాజీ మంత్రి పరిటాల సునీతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె కనుసన్నల్లోనే ప్రభుత్వంపైనా, ఎమ్మెల్యే తోపుదుర్తిపైనా ఆరోపణలు చేస్తున్నారని అనంతపురంలో టాక్ నడుస్తోంది. ఏమైంది చిత్తశుద్ధి? ఆనాడు మౌనంగా ఉండి నేడు హడావిడి చేయడానికి కారణం టీడీపీకి మద్దతుగా నిలవడమేనని కమ్యూనిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామకృష్ణకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ నేతల అవినీతి, జాకీ పరిశ్రమ తరలిపోవటంపై నిలదీసి ఉండోచ్చని అంటున్నారు. హింసా రాజకీయాలు అవినీతి, అక్రమాలు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పరిటాల కుటుంబాన్ని వెనకేసుకు రావటం ద్వారా సీపీఐ నేత రామకృష్ణ కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బతీశారంటూ జిల్లాలోని వామపక్ష వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com