Current Account Deficit
-
మెరుగుపడిన కరెంట్ అకౌంట్ లోటు
దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) పరిస్థితి కొంత మెరుగుపడింది. 2024–25 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 11.2 బిలియన్ (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ 1.2 శాతం) డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో క్యాడ్ 11.3 బిలియన్ (జీడీపీ 1.3 శాతం) డాలర్లు. దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు ఇవీ... 2024–25 క్యూ2లో: 11.2 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు. 2023–24 క్యూ2లో: 11.3 బిలియన్ (జీడీపీలో 1.3 శాతం) డాలర్లు. 2024–25 తొలి భాగం (ఏప్రిల్–సెప్టెంబర్ ): 21.4 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు. 2023–24 తొలి భాగం (ఏప్రిల్–సెప్టెంబర్): 20.2 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు.వాణిజ్య లోటు ఇలా... 2024–25 రెండో త్రైమాసికంలో ఎగుమతి–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 75.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2023–24 ఇదే కాలంలో ఈ లోటు 64.5 బిలియన్ డాలర్లుగా ఉంది.నికర సేవల ఆదాయం 2024–25 రెండో త్రైమాసికంలో నికర సేవల ఆదాయం 44.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 39.9 బిలియన్ డాలర్లుగా ఉంది. సమీక్షా కాలంలో కంప్యూటర్, వ్యాపార, ప్రయాణ, రవాణా సేవల వంటి రంగాలలో సేవల ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. -
పెరిగిన కరెంట్ అకౌంట్ లోటు.. కారణాలు..
దేశానికి వచ్చి-పోయే విదేశీమారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ) పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 9.7 బిలియన్ డాలర్ల(రూ.81 వేలకోట్లు) కరెంట్ అకౌంట్ లోటు నమోదైంది. అదే త్రైమాసికానికి చెందిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ 1.1 శాతంగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో (2023 ఏప్రిల్–జూన్) దీని విలువ 8.9 బిలియన్ డాలర్లు(రూ.74 వేలకోట్లు)గా నమోదైంది. అయితే 2024 జనవరి–మార్చి మధ్య కరెంట్ అకౌంట్ 4.6 బిలియన్ డాలర్ల(రూ.38 వేలకోట్లు) మిగులును నమోదుచేసుకుంది. ఈమేరకు ఆర్బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది.సీఏడీ పెరుగుదలకు కారణాలు..క్యూ1లో కరెంట్ అకౌంట్ లోటు పెరగడానికి వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం) కారణమని ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023 క్యూ1లో వస్తు వాణిజ్యలోటు 56.7 బిలియన్ డాలర్లు(రూ.4.7 లక్షల కోట్లు)కాగా, 2024 ఇదే కాలంలో ఈ విలువ 65.1 బిలియన్ డాలర్ల(రూ.5.4 లక్షల కోట్లు)కు ఎగసింది.ఎన్నికల అనిశ్చితి నేపథ్యంలో నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు (ఎఫ్‌పీఐ) 2024–25 ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో కేవలం 0.9 బిలియన్ డాలర్లు(రూ.7.5 వేలకోట్లు)గా నమోదయ్యాయి.ఏప్రిల్– జూన్ మధ్య విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) 5.6 బిలియన్ డాలర్ల(రూ.47 వేలకోట్లు) నుంచి 1.8 బిలియన్ డాలర్ల(రూ.15 వేలకోట్లు)కు పడిపోయాయి.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..రెమిటెన్సులు (ఎన్ఆర్ఐలు దేశానికి పంపిన మొత్తం) మాత్రం 27.1 బిలియన్ డాలర్ల(రూ.2.2 లక్షల కోట్లు) నుంచి 29.5 బిలియన్ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)కు పెరిగాయి. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం 4.7 బిలియన్ డాలర్ల(రూ.39 వేలకోట్లు) నుంచి 6.3 బిలియన్ డాలర్ల(రూ.52 వేలకోట్లు)కు ఎగిసాయి.ఎన్ఆర్ఐ డిపాజిట్లు 2.2 బిలియన్ డాలర్ల(రూ.18 వేలకోట్లు) నుంచి 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు చేరాయి. -
ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్
ముంబై: ఎగుమతులు పెరగడం, కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) తగ్గడం, తయారీ మెరుగుపడటం వంటి అంశాలు దేశ ఎకానమీ ఆరోగ్యకర స్థాయిలో వృద్ధి రేటును సాధించేందుకు తోడ్పడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సరీ్వసుల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను అధిగమించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2022– 23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా, 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాభరణాల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. భారత వృద్ధి గాధపై ఇన్వెస్టర్లలో గణనీయంగా విశ్వాసం ఉందని, పరిశ్రమలోనూ.. ఎగుమతిదారుల్లోను సెంటిమెంటు అత్యంత మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రత్యేక ఆరి్థక మండళ్లపై (సెజ్) ప్రభుత్వం నిర్దిష్ట సవరణ బిల్లు ఏదైనా తెచ్చే యోచనలో ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు సిఫార్సులు పరిశీలనలో ఉన్నట్లు గోయల్ వివరించారు. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేస్తుంది. -
డిసెంబర్ త్రైమాసికంలో క్యాడ్ 2.2 శాతం
ముంబై: దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) డిసెంబర్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.2 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 18.2 బిలియన్ డాలర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. రెండవ త్రైమాసికంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో క్యాడ్ గణనీయంగా తగ్గింది. రెండవ త్రైమాసికంలో క్యాడ్ 30.9 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 3.7 శాతం. వస్తు ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు రెండవ త్రైమాసింకంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో 78.3 బిలియన్ డాలర్ల నుంచి 72.7 బిలియన్ డాలర్లకు తగ్గడం క్యాడ్ తగ్గుదలకు దారితీసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ కాలంలో సేవల రంగం ఎగుమతులు కూడా గణనీయంగా 24.5 శాతం మేర పెరిగాయి. అయితే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రం 2021 ఇదే కాలంతో పోల్చితే 4.6 బిలియన్ డాలర్ల నుంచి 2.1 బిలియన్ డాలర్లరు తగ్గాయి. నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా 5.8 బిలియన్ డాలర్ల నుంచి 4.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మద్య చూస్తే, కరెంట్ అకౌంట్‌లోటు జీడీపీలో 2.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ లోటు 1.1 శాతం. -
క్యాడ్ 3 శాతం లోపే ఉండొచ్చు!
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మెజారిటీ అంచనాలకన్నా తక్కువగా 3 శాతమే (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. 2022–23లో కనీసం 3.5 శాతం క్యాడ్ నమోదవుతుందన్న మెజారిటీ అంచనాలకు భిన్నంగా ఎస్బీఐ నివేదిక ఉండడం గమనార్హం. సాఫ్ట్వేర్ ఎగుమతులు, రెమిటెన్సులు (ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు దేశానికి పంపే డబ్బు) పెరగడం, స్వాప్ డీల్స్ ద్వారా ఫారెక్స్ నిల్వలలో ఐదు బిలియన్ డాలర్లు పెరిగే అవకాశాలు దీనికి కారణమని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. క్రూడ్ 10 డాలర్ల పెరుగుదలతో క్యాడ్ 0.4 శాతం అప్ క్రూడ్ ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల క్యాడ్‌ను 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) వరకు ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రతి 10 డాల ర్ల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలకు, 23 బేసిస్ పాయింట్ల వృద్ధి కోతకు దారితీస్తుందని నివేదిక విడుదల సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఎక్సే్ఛంజ్ రేటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న నివేదిక, రూపా యి ప్రతి 100 పైసలు పతనం వల్ల మన సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 మిలియన్ డాలర్లమేర పెరుగుతాయని విశ్లేషించింది. భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువతో పోల్చి) లేదా 23.9 బిలియన్ డాలర్లుగా నమోదయిన విషయాన్ని నివేదిక ప్రస్తావిస్తూ, పటిష్ట రెమిటెన్సులు, సాఫ్ట్వేర్ ఎగుమతు లు క్యాడ్‌ను జూన్ త్రైమాసికంలో 60 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే రెండవ త్రైమాసికంలో కూడా క్యాడ్ 3.5% లోపే నమోదుకావచ్చని పేర్కొంది. చమురు ధరలు భారీ గా పెరిగితే మాత్రం 2022–23 క్యాడ్‌పై ప్రతికూలత తప్పదని విశ్లేషించింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణమవుతోంది. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
కట్టు తప్పనున్న కరెంట్ అకౌంట్ లోటు!
ముంబై: భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్–సీఏడీ) మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో మూడేళ్ల గరిష్ట స్థాయి 43.8 బిలియన్ డాలర్లకు ఎగసే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 1.8 శాతం ఉంటుందని రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. 2020–21లో కరెంట్ అకౌంట్ 23.91 బిలియన్ డాలర్ల మిగుల్లో ఉంది. జీడీపీలో ఇది 0.9 శాతం. దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. రేటింగ్స్ సంస్థ తాజా నివేదికలోని అంశాలను పరిశీలిస్తే.. – 2021–22 చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) క్యాడ్ 17.3 బిలియన్ డాలర్లు (త్రైమాసిక జీడీపీలో 1.96 శాతం) నమోదయ్యే అవకాశం ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో క్యాడ్ 8.2 బిలియన్ డాలర్లుగా (1.03 శాతం) ఉంది. - ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ముఖ్యంగా కమోడిటీ ధరల పెరుగుదల సమస్య తీవ్రమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి, అస్థిరత వల్ల భారత్ ఎగుమతులు గణనీయమైన ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ వృద్ధి అంచనాలను కుదించింది. ఇంతక్రితం ఈ రేటు 4.7 శాతం అంచనాలను తాజాగా 3 శాతానికి కుదించింది. - ప్రపంచ వాణిజ్య సంస్థ భారతదేశం కీలక ఎగుమతి భాగస్వాములైన ఉత్తర అమెరికా, యూరప్‌ల దిగుమతుల వృద్ధిని 2022లో వరుసగా 3.9 శాతం మరియు 3.7 శాతంగా అంచనా వేసింది, తొలి అంచనాలు 4.5 శాతం, 6.8 శాతం కావడం గమనార్హం. - అధిక చమురు ధరలు సౌదీ అరేబియా వంటి చమురు–ఎగుమతి దేశాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది అధిక వాస్తవ ఆదాయాలకు దారి తీస్తుంది. చమురు ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో దిగుమతి డిమాండ్ తొలి అంచనా 8.7 శాతం నుంచి 11.7 శాతానికి పెరుగుతుందని తాజా అంచనా. - పెరిగిన కమోడిటీ ధరలు, రూపాయి క్షీణత నేపథ్యంలో భారత్ దిగుమతులు పెరగవచ్చు. - ఇక భారత్ ఎగుమతులు 2022–23 తొలి త్రైమాసికంలో 17.7 శాతం పెరిగి 112.5 బిలియన్ డాలర్లకు చేరుతాయని భావిస్తున్నాం. ఇక దిగుమతులు 44.1 శాతం వృద్ధితో 120.9 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. - డాలర్ మారకంలో రూపాయి విలువ మొదటి త్రైమాసికంలో సగటున 77.1గా ఉంటుందని భావిస్తున్నాం. 2021–22 ఇదే త్రైమాసికంలో పోల్చితే ఇది 4.5 శాతం తక్కువ. చదవండి: ఎకానమీకి ‘రూపాయి’ కష్టాలు.. సామాన్యులకు భారం.. -
పడిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా
ముంబై: విదేశీ ఇనిస్టిట్యూషన్స్ భారత స్టాక్స్‌లో పెట్టుబడులను గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గించుకున్నాయి. 2020–21లో 23 బిలియన్ డాలర్లు (రూ.1.72 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయగా.. 2021–22లో కేవలం 3.7 బిలియన్ డాలర్లు (రూ.27,750 కోట్లు) పెట్టుబడులకే పరిమితమయ్యాయి. దీంతో ఎన్ఎస్ఈ 500 కంపెనీల్లో వాటి మొత్తం మొత్తం వాటాలు 19.9 శాతానికి, 582 బిలియన్ డాలర్ల విలువకు (రూ.43.65 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ వారం ఆరంభం వరకు చూస్తే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల ఉపసంహరణ 14.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో మార్చి నెలలోనే 5.4 బిలియన్ డాలర్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో 4.7 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. మరింత వివరంగా.. ► 2022 మార్చి 15 నాటికి ఎఫ్‌పీఐల హోల్డింగ్స్ విలువ 582 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021 సెప్టెంబర్‌లో ఇది 667 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ► ఐటీ రంగంలో ఎఫ్‌పీఐల వాటాలు 0.87 శాతం పెరిగి 15 శాతానికి, ఇంధన రంగ కంపెనీల్లో 0.44 శాతం పెరిగి 15.5 శాతానికి, హెల్త్‌కేర్ రంగంలో 0.22 శాతం పెరిగి 4.9 శాతానికి చేరాయి. ► ఫైనాన్షియల్ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల పెట్టుబడులు 1.07 శాతం తగ్గి 31.5 శాతానికి పరిమితం అయ్యాయి. డిస్క్రీషనరీ కంపెనీల్లో 0.49 శాతం తగ్గి 9.1 శాతం మేర ఉన్నాయి. ► దేశీ ఇనిస్టిట్యూషన్స్ ఎన్ఎస్ఈ కంపెనీల్లో 2022 ఫిబ్రవరి నాటికి 265 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కలిగి ఉన్నాయి. 13.1 బిలియన్ డాలర్లను తాజాగా కేటాయించాయి. ► ఎఫ్‌పీఐల వాటాల విలువ 2021–22 మొదటి త్రైమాసికం నాటికి 667 బిలియన్ డాలర్లుగా ఉంటే, అక్కడి నుంచి 112 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. ► దేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చురుగ్గా పెట్టుబడులు పెడుతుండడం వల్లే మార్కెట్లు మరీ పతనాన్ని చూడలేదని బ్యాంకు ఆప్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. ► 2022 మార్చిలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల నుంచి 5.4 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. వరుసగా ఆరో నెలలోనూ వారు పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించారు. దీంతో మొత్తం మీద ఆరు నెలల్లో 14.6 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ► దేశీ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటాలు 2020 డిసెంబర్లో 21.4 శాతం స్థాయిలో ఉన్నాయి. అక్కడి నుంచి 19.9 శాతానికి దిగొచ్చాయి. -
Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్..!
దేశ కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)పై ప్రభావం చూపే భారతదేశ బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో సుమారు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో(ఏప్రిల్-ఫిబ్రవరి 2021లో) ఈ దిగుమతులు విలువ 26.11 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 2022లో విలువైన లోహం దిగుమతులు 11.45 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత 11 నెలల కాలంలో బంగారం దిగుమతుల పెరగడంతో వాణిజ్య లోటు 176 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు దిగుమతిదారుగా ఉంది. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ నుంచి ఎక్కువ డిమాండ్ రావడంతో దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో రత్నాలు & ఆభరణాల ఎగుమతులు 57.5 శాతం పెరిగి 35.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు 9.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దిగుమతులు పెరిగి కరెంట్ ఖాతా లోటుపై మరింత ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. (చదవండి: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన మరో కంపెనీ..!) -
ఈ ఏడాది 78 స్థాయికి రూపాయి!
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది 78 స్థాయిని చూసే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ కార్వీ తెలియజేసింది. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటులు దీనికి ప్రధాన కారణం కానున్నాయని సంస్థ తన వార్షిక కమోడిటీ, కరెన్సీ నివేదికలో పేర్కొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు సైతం ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా కార్వీ కమోడిటీస్ అండ్ కరెన్సీల విభాగం సీఈఓ రమేశ్ వరకేద్కర్ తెలిపారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 68– 69.50 శ్రేణి బేస్‌గా 73.70– 74.50 శ్రేణి కనిష్ట స్థాయికి రూపాయి చేరవచ్చు. ఈ స్థాయి కిందకు పడితే, ఖచ్చితంగా ఇదే ఏడాది రూపాయి 78 దిశగా పతనం అయ్యే అవకాశం ఉంది. ► ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితంపై తీవ్ర అనిశ్చితి ఉంటుంది. అందువల్ల అటు విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టర్లు ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులకు తక్షణం దూరంగా ఉండే వీలుంది. ► 2017–18 పూర్థి ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 48.72 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచే నాటికే ఈ విలువ 34.94 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే విధంగా రెండవ ఆరునెలల గణాంకాలూ నమోదయితే, క్యాడ్ దేశానికి తీవ్ర భారంగా తయారయ్యే అవకాశం ఉంది. ► ఒపెక్, రష్యాలు తమ ఉత్పత్తుల కోత నిర్ణయం తీసుకుంటే, అంతర్జాతీయంగా క్రూడ్ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ► వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయంగా వృద్ధి భయాల వల్ల కాపర్, అల్యూమినియంసహా బేస్‌మెటల్ ధరలు బలహీనంగానే ఉంటాయి. ► సరఫరాల సమస్యల వల్ల పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది. ► అధిక పంట దిగుబడుల వల్ల సొయాబీన్ మార్కెట్లో ఈ ఏడాది రెండవ భాగంలో అమ్మకాలు ఒత్తిడి ఉండే వీలుంది. ► తక్కువ దిగుబడివల్ల జీర, చిక్కుడు ధరలు సానుకూలంగా ఉండవచ్చు. 71.56 వద్ద రూపాయి... డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం కేవలం ఒక్కపైసా లాభంతో 71.56 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 71.68–71.49 శ్రేణిలో తిరిగింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 10 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడు బల్లమీదకు ఎక్కింది. ఇప్పటికిప్పుడు రూపాయి 68 దిశగా బలపడే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి. -
కరెంట్ అకౌంట్ లోటు భయాలు
ముంబై: దేశంలో కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భయాలు నెలకొన్నాయి. రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) నమోదయిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే క్యాడ్ 2.9 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 19.1 బిలియన్ డాలర్లు. రెండవ త్రైమాసికంలో ఇది 15.9 బిలియన్ డాలర్లే (జీడీపీలో 2.4 శాతం). గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 6.9 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.1శాతం). కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) జీడీపీలో కాŠయ్డ్ 1.8 శాతం నుంచి 2.7 శాతానికి పెరిగింది. ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం (ఎప్ఐఐ, డీఐఐ, ఈసీబీలుమినహా) మధ్య నికర వ్యత్యాసమే కరెంట్ అకౌంట్‌లోటు. దిగుమతుల బిల్లు తగ్గింపు, ఎగుమతుల పెంపుసహా పలు మార్గాల ద్వారా క్యాడ్‌ను కట్టడి చేయాల్సి ఉంటుంది. ఎక్కువ క్యాడ్ ఆ దేశాన్ని ఇతర దేశాలకు రుణగ్రస్థ దేశంగా మార్చుతుంది. క్యాడ్ పెరుగుదల కరెన్సీ విలువల పతనానికీ దారితీస్తుంది. ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు పెరగడం తాజా క్యాడ్ గణాంకాలు పెరగడానికి కారణం. -
భారతీయులు అమితంగా ప్రేమించేది వాటినే..
న్యూఢిల్లీ : బంగారమంటే భారతీయులకు ఎనలేని ప్రేమ. కొంత డబ్బు కూడబెట్టగానే బంగారాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు. తాజాగా బంగారాన్ని మించి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను అమితంగా ప్రేమిస్తున్నారట. తాజాగా వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోళ్లు అలుపు లేకుండా పెరుగుతూ ఉన్నాయని తెలిసింది. ఆయిల్ తర్వాత భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువులుగా ఎలక్ట్రానిక్సే ఉన్నాయని తాజా గణాంకాల్లో వెల్లడైంది. దీంతో దేశీయ వాణిజ్య లోటు కూడా పెరిగిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది రూపాయికి బ్యాడ్ న్యూస్ అని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఆయిల్ దిగుమతులతో ఖరీదైనదిగా మారిన రూపాయి, ఎలక్ట్రానిక్స్ దిగుమతులతో మరింత ఆందోళనకరంగా మారిందని తెలిపారు. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కరెంట్ అకౌంట్ లోటు 2.3 శాతానికి పెరుగుతుందని బ్లూమ్‌బర్గ్ పోల్‌లో తెలిసింది. ప్రస్తుతం ఇది 1.9 శాతంగా ఉంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు దిగుమతలు పెరుగుతుండటం ఇప్పటికే కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం చూపుతుందని ముంబైకి చెందిన యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ ఎకనామిస్ట్ సౌగత భట్టాచార్య చెప్పారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మేకిన్ ఇండియా ప్రొగ్రామ్‌తో స్థానిక తయారీ పెరిగి, దిగుమతులు తగ్గుతుండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు, పీసీలు, ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసేందుకు చైనా అతిపెద్ద వనరుగా ఆర్థిక వేత్తలన్నారు. మొత్తంలో 60 శాతం అక్కడి నుంచే వస్తున్నాయని చెప్పారు. కేవలం ఆయిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్ కూడా దేశీయ కరెంట్ అకౌంట్‌కు సవాల్‌గా నిలుస్తున్నాయని కొటక్ మహింద్రా బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ ట్వీట్ చేశారు. 5 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు రెండింతలు పైగా పెరిగాయని చెప్పారు. కాగ, గత 13 నెలల కాలంలో బంగారం దిగుమతులు 35.8 బిలియన్ డాలర్లుగా ఉంటే, బంగారం కంటే అధికంగా ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 57.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఇక బంగారం కంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్నే భారతీయులు అమితంగా ప్రేమిస్తున్నారని వెల్లడవుతోంది. -
బంగారు నాణేల దిగుమతులపై ఆంక్షల తొలగింపు
ముంబై: బంగారం నాణేలు, మెడల్స్ దిగుమతులకు సంబంధించి బ్యాంకులు, ట్రేడింగ్ హౌస్‌లపై ఉన్న ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఎత్తివేసింది. కరెంట్ అకౌంట్ లోటు తీవ్రత నేపథ్యంలో ఆగస్టు 2013లో కేంద్ర బ్యాంక్ బంగారు నాణేలు, మెడల్స్ దిగుమతులపై ఆంక్షలను విధించింది. అప్పట్లో దిగుమతులపై విధించిన ఆంక్షల్లో 80:20 నిబంధన ఒకటి. ఈ నిబంధనను 2014 నవంబర్ 28న కేంద్రం తొలగించింది. దీని ప్రకారం కొత్త లాట్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముందు, అప్పటికే దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తప్పనిసరిగా ఎగుమతి చేయాలి. కాగా ఈ నిబంధన రద్దయినప్పటికీ, నవంబర్ 28ని ముందు దిగుమతి చేసుకున్న బంగారం నిల్వలకు సంబంధించి, ఎగుమతుల నిబంధనను (20% తప్పనిసరిగా ఎగుమతి) ఇప్పటికీ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆర్బీఐ తాజాగా పేర్కొంది. -
పసిడిపై దిగుమతి సుంకం తగ్గింపు?
బడ్జెట్లో ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తి అదుపులో ఉన్న నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రానున్న బడ్జెట్లో 2 నుంచి 4 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. దేశంలో రత్నాలు, ఆభరణాల తయారీ విభాగం వృద్ధికి, ఎగుమతులు పెరగడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేశ ఎగుమతుల్లో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో ఈ రంగం నుంచి ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా (2013 డిసెంబర్‌తో పోల్చితే) 1.2 శాతం క్షీణించి (మైనస్) 2.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు 35 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నవంబర్‌లో 152 టన్నుల పసిడి దిగుమతులు డిసెంబర్లో 39 టన్నులకు పడిపోయాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగాలుగా గుర్తించిన 25 విభాగాల్లో రత్నాలు, ఆభరణాల రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని 2- 4 శాతం శ్రేణిలో తగ్గించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2013లో క్యాడ్ 4 శాతానికి పైగా పెరిగి, డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 68 వరకూ బలహీనపడిన పరిస్థితుల్లో పసిడి దిగుమతులపై కేంద్రం 10 శాతానికి సుంకాలను పెంచింది. ఆభరణాల విషయంలో ఈ దిగుమతి సుంకం 15 శాతంగా ఉంది. దీనితో అంతర్జాతీయంగా పసిడి ధర దిగివచ్చినా, ఆ ప్రభావం దేశంలో కనబడలేదు. ఒక దశలో 10 గ్రాములకు ప్రీమియం (దేశీయ-అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం) రూ.3 వేలకు పైగా కనబడింది. దీనితో దేశంలోకి బంగారం అక్రమ రవాణా పెరుగుతూ వస్తోంది. -
భారత్ రేటింగ్ పెరిగే చాన్స్!
సార్వభౌమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు అవకాశాలున్నాయి: ఎస్అండ్పీ ఈ ఏడాది క్యాడ్ 2% దిగువనే.. న్యూఢిల్లీ: భారత్‌కు త్వరలో రేటింగ్ బూస్ట్ లభిస్తుందా? మోదీ సర్కారు సంస్కరణల జోరు నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) నుంచి సానుకూల వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారత సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్‌ను రానున్న కాలంలో పెంచే అంశాన్ని కొట్టిపారేయలేమని శుక్రవారం పేర్కొంది. అయితే, వచ్చే రెండేళ్లలో దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పనితీరుపైనే రేటింగ్ అప్‌గ్రేడ్ ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. గతేడాది సెప్టెంబర్‌లో భారత్ సావరీన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ఎస్అండ్పీ ప్రతికూలం(నెగటివ్) నుంచి స్థిరానికి(స్టేబుల్) పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌కు ఎస్అండ్పీ బీబీబీ మైనస్(అవుట్‌లుక్ స్టేబుల్) దీర్ఘకాలిక రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఈ రేటింగ్‌ను గనుక పెంచితే భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరావడంతోపాటు... దేశీ కార్పొరేట్లు, ప్రభుత్వానికి విదేశీ నిధుల సమీకరణలో మరింత తోడ్పాటు లభిస్తుంది. కాగా, అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఎస్అండ్పీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 5.5 శాతం పైన కొనసాగడంతోపాటు.. ద్రవ్య, వాణిజ్య, కరెంట్ అకౌంట్ లోటులు కట్టడి కావడం, ద్రవ్యోల్బణం ప్రస్తుతమున్న దిగువ స్థాయిల్లో కొనసాగితే భారత్ రేటింగ్‌ను పెంచేందుకు ఆస్కారం ఉందని ఏజెన్సీ వివరించింది. ప్రస్తుత ఏడాది(2014-15)లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) జీడీపీలో 2% లోపునకే పరిమితం కావచ్చని ఎస్అండ్పీ అంచనా వేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల భారీ పతనం ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యం(జీడీపీలో 4.1%) సాకారం కావడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడింది. -
పుత్తడి పై కొత్త ఆంక్షలు ఉండవు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై కొత్త ఆంక్షలను కేంద్రం విధించబోదని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ బుధవారం తెలిపారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తిగా అదుపులో ఉండడమే దీనికి కారణమని తెలిపారు. క్యాడ్‌కు మరింత సానుకూలమైన రీతిలో 2014 డిసెంబర్లో కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి జరిగినట్లు వెల్లడించారు. జనవరిలో ఇప్పటి వరకూ 7 టన్నుల దిగుమతి జరిగిందన్నారు. భారత్ బంగారం దిగుమతులు నవంబర్‌లో 151.59 టన్నులు. పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం: విలేకరులతో మాట్లాడడానికి ముందు రాజీవ్ ఖేర్ పసిడి పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత్ రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య డెరైక్టర్ బాచ్రాజ్ బమల్వా విలేకరులతో మాట్లాడుతూ, ‘దిగుమతి సుంకాన్ని సైతం తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది’’ అని తెలిపారు. -
గోల్డ్ డిపాజిట్లకు కొత్త స్కీమ్!
న్యూఢిల్లీ: పసిడి డిపాజిట్ పథకాన్ని ఆధునీకరించి, పునఃప్రారంభించాలని గోల్డ్ అండ్ సిల్వర్ రిఫైనర్ ఎంఎంటీసీ పీఏఎంపీ సూచించింది. ప్రభుత్వరంగ ఎంఎంటీసీ- స్విట్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రపంచ ప్రముఖ గోల్డ్ రిఫైనర్ పీఏఎంపీ జాయింట్ వెంచర్ (జేవీ)గా ‘ఎంఎంటీసీ పీఏఎంపీ’ ఏర్పాటయ్యింది. ఏ విధంగా ప్రతిపాదిత పథకాన్ని పునఃప్రారంభించాలన్న అంశాన్ని కూడా జేవీ వివరించింది. జేవీ ఎండీ రాజేష్ ఖోస్లా తెలిపిన ఈ వివరాల ప్రకారం... కనీసం 40 గ్రాములు డిపాజిట్ చేయగలిగిన విధంగా పథకాన్ని మార్చాలి. దేశ వ్యాప్తంగా బీరువాల్లో దాదాపు 25,000 టన్నుల పసిడి నిల్వలు నిక్షిప్తమయ్యాయి. ఇలాంటి పథకం ద్వారా మొత్తం నిల్వల్లో ఒక శాతం సమీకరించగలిగినా... కనీసం ఒక యేడాదిలో 250 టన్నుల పసిడి దిగుమతులను కట్టడికి చేయవచ్చు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి ఈ చర్య దోహదపడుతుంది. దేశ వ్యాప్తంగా 500 గృహాల సర్వే ప్రాతిపదికన తాజా ప్రతిపాదనను జేవీ చేసింది. 1999లో ప్రారంభించిన ప్రస్తుత గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం కనీస పసిడి డిపాజిట్ 500 గ్రాములు. ఇందువల్ల ఈ పథకం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఈ పథకం వల్ల కేవలం దేవాలయాలు, ట్రస్టులు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతున్నాయి. ఆర్బీఐ ఇలాంటి ప్రతిపాదన ఒకటి ఇప్పటికే చేసింది. దీనిపై నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నాం. దిగుమతులపై నిబంధనలను మరింత కఠినతరం చేసినా, భారత్‌లో పసిడి డిమాండ్ ప్రస్తుత స్థాయి (వార్షికంగా దాదాపు 850 టన్నులు) దిగువకు పడిపోయే అవకాశం లేదు. {పతిపాదిత గోల్డ్ కొత్త పథకాన్ని ప్రవేశపెడితే, దీని ద్వారా లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ధ్రువీకరణ పొందిన ఏకైక రిఫైనరీగా ఎంఎంటీసీ పీఏఎంపీ మంచి ప్రయోజనం పొందగలుగుతుంది. బ్యాంకులు నిర్దేశించిన విధంగా సమీకరణ, నాణ్యత నిర్ధారణ, రవాణా, రిఫైనింగ్, రి-ట్రాన్స్‌పోర్ట్‌సహా దేశంలో పసిడి సర్క్యులేషన్‌కు సంబంధించి విస్తృతస్థాయిలో సేవలను జేవీ నిర్వహిస్తుంది. -
సుంకాల తగ్గింపు యోచన లేదు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సుంకాల తగ్గింపు తక్షణ యోచన లేదని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పేర్కొన్నారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా గత యేడాది బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకాల పెంపు వల్లే బంగారం అక్రమ రవాణా పెరిగిందని తాను చెప్పలేనని అన్నారు. మోడీ సర్కారు అధికారం చేపట్టి వంద రోజులు పూర్తై సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. విభిన్నంగా నూతన విదేశీ వాణిజ్య విధానం 2014-19 కాలానికి త్వరలో ప్రకటించనున్న నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) గత విధానాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తయారీ, ఎగుమతుల రంగాల్ని ప్రోత్సహించేదిగా నూతన విధానం ఉంటుందని అన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్యం... యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడానికి ఇండియా సుముఖంగా ఉందనీ, అయితే భారత్ లేవనెత్తిన అంశాల పరిష్కారానికి ఈయూ కృషిచేయాలని కోరుకుంటున్నామనీ నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈయూ రాయబారి ఇటీవల తనతో సమావేశమైనపుడు ఈ విషయం ఎఫ్‌టీఏ ప్రస్తావన వచ్చిందని పేర్కొన్నారు. జీ-20లో భారత్‌కు నిర్మల ప్రాతినిధ్యం ఆస్ట్రేలియాలో ఈ నెల 20,21 తేదీల్లో నిర్వహించనున్న జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మధుమేహానికి చికిత్స తీసుకుంటుండడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సోలార్ ప్యానెళ్లపై సుంకాలు ఉండావు.. అమెరికా, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే సోలార్ ప్యానెళ్లపై యాంటీ డంపింగ్ సుంకం విధించరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీతారామన్ తెలిపారు. యాంటీ డంపింగ్ సుంకం విధిస్తే సౌర పరికరాల ధరలు పెరుగుతాయంటూ విద్యుదుత్పత్తి సంస్థలు ఈ సుంకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే, దేశీయ పరిశ్రమను కాపాడేందుకు అమెరికా, చైనా, మలేసియాల నుంచి దిగుమతి చేసుకునే సోలార్ సెల్స్‌పై ఒక వాట్‌కు 0.11-0.81 డాలర్ల సుంకం విధించాలని వాణిజ్యశాఖ గత మేనెలలో సిఫార్సు చేసింది. -
9వ రోజూ మార్కెట్ దూకుడు
ఇటీవల జోరుమీదున్న స్టాక్ మార్కెట్లలో నవవసంతం వెల్లివిరిసింది. సెన్సెక్స్ వరుసగా తొమ్మిదో రోజు లాభపడింది. 120 పాయింట్లు పెరిగి 27,140 వద్ద ముగిసింది. తద్వారా 9 రోజుల్లో 825 పాయింట్లు జమ చేసుకుంది. ఇక నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని 8,115 వద్ద నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ కొత్త గరిష్టాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ 27,226వద్ద, నిఫ్టీ 8,142 వద్ద కొత్త రికార్డును నెలకొల్పాయి. ప్రధానంగా ఐటీ ఇండెక్స్ 2.5% పుంజుకోవడం ద్వారా మార్కెట్లకు అండగా నిలిచింది. సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3.5-2.5% మధ్య పురోగమించాయి. దీంతో నెల రోజుల తరువాత మళ్లీ టీసీఎస్ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకుంది. అమెరికాలో జూలై నెలకు కన్స్ట్రక్షన్ రంగ గణాంకాలు మెరుగుపడగా, ఆగస్ట్ నెలకు తయారీ రంగ వృద్ధి మూడున్నరేళ్ల గరిష్టానికి చేరడంతో ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. జీడీపీ పురోగమనం, కరెంట్ ఖాతా లోటు భారీగా తగ్గడం, విదేశీ పెట్టుబడులు కొనసాగుతుండటం వంటి అంశాలు పటిష్టర్యాలీకి కారణ మవుతున్నట్లు వివరించారు. వీటికితోడు రష్యా-ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ముడిచమురు ధరలు 16 నెలల కనిష్టానికి చేరాయి. దీంతో సెంటిమెంట్ మరింత మెరుగుపడిందని నిపుణులు చెప్పారు. రియల్టీ దూకుడు బుధవారం ట్రేడింగ్‌లో రియల్టీ ఇండెక్స్ సైతం 2% లాభపడింది. రియల్టీ షేర్లలో ఒబెరాయ్ 15% జంప్‌చేయగా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఫీనిక్స్, హెచ్‌డీఐఎల్, శోభా 6-3% మధ్య ఎగశాయి. ఇక మరోవైపు సెన్సెక్స్‌లో కోల్ ఇండియా, భారతీ 3% స్థాయిలో పుంజుకోగా, గెయిల్, ఐటీసీ, ఓఎన్జీసీ 2-1.5% మధ్య తిరోగమించాయి. -
ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డాకే...
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితి మెరుగుపడిన తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే వెంటనే ఆంక్షలు సడలించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి కుదటపడనంత వరకు ఆంక్షలు ఎత్తివేయడం సాధ్యం కాదని అన్నారు. కరెంట్ ఎకౌంట్ లోటు(సీఏడీ), ఆర్థిక లోటుపై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని గతేడాది ఆగస్టు నుంచి 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకం పెంచడంతో 2013-14లో ఈ రెండు లోహాల దిగుమతులు 40% క్షీణించాయన్నాయి. కాగా, సుంకాన్ని 10 నుంచి 2 శాతానికి తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) కేంద్రాన్ని కోరింది. -
ధరల కట్టడే లక్ష్యం...
ఇరాక్ సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంటాం తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయ్... క్యాడ్ కూడా భారీగా దిగొచ్చింది... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడి ముంబై: ధరల పెరుగుదలకు కళ్లెం వేయడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రానున్న కొద్ది త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా తమ చర్యలు కొనసాగుతాయని... దీనిపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో అధిక ధరలకు అడ్డుకట్టవేయాలంటే ప్రభుత్వం ఆహారోత్పత్తులకు సంబంధించి తగిన నిర్వహణ విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్బీఐ, ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నాయని, గత రెండు మూడు నెలలుగా ఆహార ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారమిక్కడ ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే నెలలో టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణంరేటు ఐదు నెలల గరిష్టానికి(6.01%) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ రేటు 5.2%. ఆహారోత్పత్తులు, నిత్యావసరాల రేట్లు ఎగబాకడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. కాగా, ఎల్ నినోతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవచ్చని... దీంతో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే ప్రమాదం పొంచిఉందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కాగా, రాజన్ తాజా వ్యాఖ్యలతో ఇప్పట్లో పాలసీ వడ్డీరేట్ల తగ్గింపు ఉండబోదన్న సంకేతాలు బలపడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇరాక్ అనిశ్చితిపై... ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం సహా ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కోగల సత్తా భారత్‌కు ఉందని రాజన్ పేర్కొన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకోవడంలో మనం మరింత మెరుగైన స్థితిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘దేశంలో తగినన్ని విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా భారీగా దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాక్ సహా ఇతరత్రా ఎలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనా మనకు ముప్పేమీ లేదు. ఇరాక్‌లో చమురు నిల్వలన్నీ దక్షిణ ప్రాంతంలోనే ఉన్నాథ యి. అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం ఆ దేశ క్రూడ్ బిజినెస్‌పై పెద్దగా ప్రభావమేమీ చూపకపోవచ్చు. అయినప్పటికీ ఈ అంశం కొంత ఆందోళనకరమైనదే. అక్కడి సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నాం’ అని రాజన్ పేర్కొన్నారు. బంగారం ఇతరత్రా దిగుమతులు దిగిరావడంతో గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో క్యాడ్ జీడీపీలో 1.7 శాతానికి(32.4 బిలియన్ డాలర్లు) తగ్గడం రూపాయిపై కొంత ఒత్తిడి తగ్గించింది. అంతేకాదు ఆఖరి త్రైమాసికంలో అయితే, ఈ లోటు ఏకంగా 0.2 శాతానికి(1.2 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టమైన 4.7 శాతానికి(87.8 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇరాక్ ప్రభుత్వంపై సున్నీ తీవ్రవాదుల భీకర దాడులు... చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో చమురు ధరలకు రెక్కలు రావడం తెలిసిందే. ఈ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలోనూ తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి కూడా. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ కూడా మళ్లీ 60 దిగువకు పడిపోవడం గమనార్హం. క్రూడ్ రేట్ల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం కూడా ఎగబాకే ప్రమాదం పొంచిఉంది. కాగా, చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్‌కు క్రూడ్ రేట్ల పెరుగుదల ఇబ్బందికర అంశమే. -
‘లోటు’ దిగొచ్చింది!
ముంబై: దేశాన్ని వణికించిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కళ్లెం పడింది. ప్రధానంగా బంగారం ఇతరత్రా దిగుమతులు దిగిరావడంతో గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో క్యాడ్ జీడీపీలో 1.7 శాతానికి తగ్గింది. అంటే 32.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో ఈ లోటు చరిత్రాత్మక గరిష్టమైన 4.7 శాతానికి(87.8 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. సోమవారం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. దిగుమతుల భారం కారణంగా ఈ లోటు ఆందోళనకస్థాయికి ఎగబాకి... డాలరుతో రూపాయి మారకం విలువ భారీ పతనం ఇతరత్రా అనేక ఆర్థిక ఇబ్బందులకు కారణమైంది. గతేడాది ఆగస్టులో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టస్థాయి అయిన 68.85కు కరిగిపోయింది. దీంతో క్యాడ్ కట్టడి కోసం ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఎట్టకేలకు సత్ఫలితాలిచ్చాయి. ముఖ్యంగా బంగారం దిగుమతులపై నియంత్రణలతో క్యాడ్ దిగొచ్చేందుకు దోహదం చేసింది. మార్చి క్వార్టర్లో మరింత ఉపశమనం... గతేడాది ఆఖరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో క్యాడ్ ఏకంగా జీడీపీలో 0.2 శాతానికి(1.2 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో 3.6 శాతం(18.1 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వాణిజ్య లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) తగ్గుముఖం పట్టడం.. తాజాగా విదేశీ నిధు ప్రవాహం పుంజుకోవడం కూడా క్యాడ్ భారీగా రికవరీ అయ్యేందుకు తోడ్పడింది. ఎగుమతులు మెరుగుపడటం.. దిగుమతుల కట్టడి కారణంగా గతేడాది వాణిజ్య లోటు 147.6 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. అంతక్రితం ఏడాది వాణిజ్య లోటు 195.7 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, గతేడాది దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా తగ్గి.. 48.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతక్రితం ఏడాదిలో ఈ మొత్తం 89 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. ప్రధానంగా విదేశీ రుణాలపై నికర చెల్లింపులు పెరగడం ఇతరత్రా అంశాలు దీనికి కారణమైనట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. భారీగా తగ్గిన బంగారం దిగుమతులు గతేడాది చివరి క్వార్టర్(క్యూ4)లో బంగారం దిగుమతులు మరింత దిగొచ్చాయి. విలువపరంగా 5.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో దిగుమతులు(15.8 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే భారీగా పడిపోయాయి. ఇక వాణిజ్య లోటు కూడా క్యూ4లో 45.6 బిలియన్ డాలర్ల నుంచి 30.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. గతేడాది మొత్తం తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడిన రూపాయి ప్రస్తుతం అట్టడుగు స్థాయి నుంచి భారీగా కోలుకుని కొంత స్థిరత్వాన్ని కూడా సంతరించుకుంటోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 58-59 స్థాయిలో కదలాడుతోంది. ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తుండటం... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) నిధుల ప్రవాహం కూడా రూపాయికి బలాన్నిస్తున్నాయి. -
ఈ ఏడాది వృద్ధి రేటు 5.4%
వాషింగ్టన్: గతేడాది 4.4 శాతంగా ఉన్న భారత ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 5.4 శాతానికి చేరే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్)తెలిపింది. ప్రపంచ వృద్ధి స్వల్పంగా బలపడడం, ఎగుమతుల సామర్థ్యం పుంజుకోవడం, ఇటీవల ఆమోదించిన పెట్టుబడుల ప్రాజెక్టులను అమలు చేయడం అభివృద్ధి రేటు పెరగడానికి దోహదపడతాయని పేర్కొంది. ‘ఇటీవలి నెలల్లో భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. పసిడి దిగుమతులపై ఆంక్షల ఫలితంగా కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) తగ్గింది. వినియోగ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా తిరోగమనం పట్టవచ్చు గానీ, అదో ముఖ్యమైన సవాలుగానే కొనసాగవచ్చు. 2015లో భారత్ 6.4 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశముంది. అయితే, ఇందుకు పెట్టుబడులు పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సఫలం కావాలి, ఎగుమతులు మరింత వృద్ధి చెందాలి. ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంపాటు తక్కువ స్థాయిలో ఉంచడానికి భారత ప్రభుత్వం మరింత కఠినమైన ద్రవ్య విధానాలను అవలంబించాల్సి ఉంది...’ అని ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన తాజా నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు ద్రవ్య విధాన రూపకర్తలు నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించాలని ఐఎంఎఫ్ సూచించింది. సహజ వనరులకు మార్కెట్ ఆధారిత ధరలను నిర్ణయించాలనీ, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల అమల్లో జా ప్యాన్ని తొలగించాలనీ పేర్కొంది. విద్యుత్తు, గనుల రంగాల్లో విధానాలను మెరుగుపర్చాలని కోరింది. భారత్ వృద్ధి బలహీనమే: ఓఈసీడీ కాగా, భారత్ వృద్ధి బలహీన ధోరణిని సూచిస్తోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 33 దేశాల ఆర్థిక విశ్లేషణా సంస్థ- ఓఈసీడీ (ఎకనమిక్ కో-ఆపరేటివ్ అండ్ డెవలప్మెంట్) పేర్కొంది. దీనిప్రకారం జనవరిలో 97.7 పాయింట్లుగా ఉన్న ఓఈసీడీ కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్ (సీఎల్ఐ) సూచీ ఫిబ్రవరిలో 97.6కు తగ్గింది. నవంబర్‌లో ఈ రేటు 97.9. డిసెంబర్లో 97.8గా ఉంది. భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యాలు సైతం ఆర్థికంగా బలహీనతలోనే ఉన్నాయి. చైనా పరిస్థితి మాత్రం కొంత మెరుగుపడింది. -
గడ్డుకాలం ముగిసినట్లే: మూడీస్
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థకు గడ్డురోజులు ఇక తొలగినట్లేనని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కార్పొరేషన్‌కు చెందిన మూడీస్ ఎనలిటిక్స్ పేర్కొంది. అయితే, సామర్థ్యానికి అనుగుణంగా వృద్ధి మాత్రం 2015లోనే సాధ్యమవుతుందని బుధవారమిక్కడ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటు 5.5%గా ఉండొచ్చని... వచ్చే ఏడాది ఇది 6 శాతం పైనే నమోదయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆర్థిక పరిశోధన, విశ్లేషణలను అందించే ఎనలిటిక్స్ విభాగం ఈ నివేదికను స్వతంత్రంగా ఇచ్చింది. క్రెడిట్ రేటింగ్ విభాగం(మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్) అభిప్రాయాలు ఇందులో లేవని కూడా తెలిపింది. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వ్యాపార విశ్వాసాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రూపాయి విలువ స్థిరీకరణ, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) దిగిరావడంతో ఆర్థిక వ్యవస్థ దిగజారే రిస్క్‌లు తగ్గాయి. ఇటీవలి త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడింది. అయితే, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి సామర్థ్యానికంటే దిగువనే కొనసాగుతోంది. 2013 మధ్య నుంచి ఎగుమతులు వృద్ధి బాటలోకి రావడం ఇతరత్రా సానుకూల అంశాలతో వృద్ధి నిలకడగా నమోదవుతోందని... పెట్టుబడులు కూడా మళ్లీ పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనుందని నివేదికలో మూడీస్ ఎనలిటిక్స్ విశ్లేషకుడు గ్లెన్ లెవిన్ అభిప్రాయపడ్డారు. {పపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రికవరీ మెరుగవుతోంది. ఈ ఏడాది ఎగుమతులు మరింత పెరిగేఅవకాశం ఉంది. దీంతో క్యాడ్ ఇంకా తగ్గొచ్చు. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి ఉండొచ్చు. క్యాడ్‌కు కళ్లెం పడటం(క్యూ2లో 1.2%)తో రూపాయికి సానుకూలం. {దవ్యోల్బ ణం దిగివస్తుండటం వ్యాపార విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ ఏడాదంతా టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖ ధోరణిలోనే ఉండొచ్చు. -
ముందుంది మంచికాలం
గ్రేటర్ నోయిడా: రాబోయే మూడేళ్లలో భారత్ క్రమంగా మళ్లీ అధిక వృద్ధి బాటలోకి మళ్లగలదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 2012-13, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో మందగమనానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పారు. పెట్రోటెక్ 2014 సదస్సులో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి ముందు భారత్ తొమ్మిది శాతం స్థాయిలో వృద్ధిని సాధించిన విషయాన్ని చిదంబరం ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచ ఎకానమీ కోలుకుంటోందని, కొత్తగా తీసుకుంటున్న చర్యల ప్రభావంతో భారత్ కూడా క్రమంగా అధిక వృద్ధి బాట పట్టగలదని చిదంబరం పేర్కొన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనాలు (సవరించినవి) మెరుగ్గా ఉండగలవని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 31న ప్రభుత్వం వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటును (దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ మారకం) 50 బిలియన్ డాలర్లకు కట్టడి చేయగలమని చిదంబరం చెప్పారు. భారీ స్థాయిలో ఉన్న చమురు దిగుమతులను నియంత్రించడం ఇందుకు తోడ్పడగలదన్నారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఇది రికార్డు స్థాయిలో 88.2 బిలియన్ డాలర్లకు ఎగిసిన సంగతి తెలిసిందే. ఇంధన రంగంలో అపార అవకాశాలు.. అపార అవకాశాలు ఉన్న భారత ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇన్వెస్టర్లను చిదంబరం ఆహ్వానించారు. వారికి కావాల్సిన సహకారం అందించగమన్నారు. అలాగే, చమురు కంపెనీలు, చమురు ఉత్పత్తి దేశాలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీతో చమురుకు కూడా డిమాండ్ పెరగగలదని, ఫలితంగా ధరల్లో మళ్లీ భారీ హెచ్చుతగ్గులు తలెత్తవచ్చని చిదంబరం చెప్పారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అధిక ధరల కారణంగా వర్ధమాన దేశాలు కనీసం 1-2 శాతం దాకా తమ వృద్ధి రేటును నష్టపోయాయన్నారు. చమురు ఉత్పత్తి, వినియోగ దేశాల మధ్య అసమానతలు ఉన్నంత కాలం ఇంధన భద్రతపై ఆందోళన తప్పదని చిదంబరం చెప్పారు. -
వృద్ధి అవకాశాలు బలహీనం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉన్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ మంగళవారం పేర్కొంది. అయితే వచ్చే ఏడాది రికవరీకి కొంత అవకాశం ఉందని తన తాజా నివేదికలో తెలిపింది. క్లిష్టంగా ఉన్న పన్నులు, నిబంధనల అంశాలు, బలహీన మౌలికరంగం, బలహీన కేంద్ర ప్రభుత్వం వంటి అంశాలు ఆర్థికరంగానికి సంబంధించి ‘విశ్వాసం, డిమాండ్’పై ప్రస్తుతం ప్రభావితం చూపుతున్నట్లు పేర్కొంది. మే ఎన్నికల తర్వాత పాలనాపరంగా కొంత పురోగతికి అవకాశం ఉందని అభిప్రాయపడింది. అధిక ద్రవ్యోల్బణ నేపథ్యంలో రెపోరేటు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని కూడా మూడీస్ అంచనావేసింది.