darling
-
బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. భర్త ఎమోషనల్ పోస్ట్!
యంగ్ హీరో డార్లింగ్ కృష్ణ తండ్రయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకు కూతురు పుట్టిందని ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ప్రయాణంలో తన భార్యను చూసి గర్వపడుతున్నానని హీరో ఎమోషనల్ అయ్యారు. ప్రపంచంలో ఇలాంటి బాధను భరిస్తోన్న తల్లులందరికీ నమస్కారం అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. లవ్ మాక్‌టైల్ అనే కన్నడ సినిమాతో డార్లింగ్ కృష్ణ, నటి మిలానా నాగరాజ్ జంటగా నటించారు. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా నమ్మ దునియా నమ్మ స్టైల్, చాల్తి అనే సినిమాలలో నటించారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుకలో కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) -
‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్‌కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...మొక్కే కదా అని... ‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం. సైకిల్ చైన్‌తో... నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ. మమ్మమ్మాస్ ‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్‌కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్. తిక్క చూపిస్తా... ‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ధూల్‌పేట్ ఈశ్వర్ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్‌ను చూపించారు. కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ లోని లవర్ బాయ్‌ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్‌డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్. మళ్లీ కొలవెరి ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్‌గా నిలిచింది. రామ్‌గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్‌ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వారంలో ఇండిపెండెన్స్ ఉండడంతో పెద్ద సినిమాలన్నీ ఆ రోజే వచ్చేస్తున్నాయి. టాలీవుడ్లో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి చిత్రాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి తంగలాన్ లాంటి భారీ యాక్షన్ చిత్రం కూడా వస్తోంది. అంతేకాకుండా ఆయ్ సినిమాలాంటి ఒకటి, రెండు చిన్నచిత్రాలు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ సందడి చిత్రాలు రెడీ అయిపోయాయి. వీటిలో టాలీవుడ్ మూవీ డార్లింగ్‌తో పాటు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రధానపాత్రల్లో నటించిన మనోరతంగల్ స్ట్రీమింగ్కు రానుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మాట్ రిఫే: లూసిడ్ - ఏ క్రౌడ్ వర్క్ స్పెషల్- ఆగస్టు 13డాటర్స్ (డాకుమెంటరీ)- ఆగస్టు 14రెన్‌ఫీల్డ్ (హాలీవుడ్)- ఆగస్టు 14వరస్ట్ ఎక్స్ ఎవర్(క్రైమ్ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15యావరేజ్ జో సీజన్ -1- ఆగస్టు 15బ్యాక్యార్ట్ వైల్డర్నెస్- ఆగస్టు 15ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4- పార్ట్ 1- ఆగస్టు 15కెంగన్ అసుర సీజన్ 2- పార్ట్ 2- ఆగస్టు 16ఐ కెనాట్ లైవ్ వితౌట్ యూ- ఆగస్టు 16పెరల్- ఆగస్టు 16షాజమ్- ఫ్యూరీ ఆఫ్ గాడ్స్- ఆగస్టు 17ది గార్ఫీల్డ్ మూవీ(యానిమేషన్ చిత్రం)- ఆగస్టు 17జీ5మనోరతంగల్(తమిళ సిరీస్)- 15 ఆగస్టుకంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15 డిస్నీ ప్లస్ హాట్స్టార్స్టార్ వార్స్: యంగ్ జేడి అడ్వెంచర్స్(యానిమేషన్)- సీజన్ 2- ఆగస్టు 14డార్లింగ్ -టాలీవుడ్ మూవీ- ఆగస్టు 13మై ఫర్ఫెక్ట్ హస్బెండ్- ఆగస్టు 16 జియో సినిమాఇండస్ట్రీ సీజన్-3(వెబ్ సిరీస్)- ఆగస్టు12శేఖర్ హోమ్(బెంగాలీ వెబ్ సిరీస్) - ఆగస్టు 14బెల్ ఎయిర్ సీజన్-2 - ఆగస్టు 15సోనీలివ్చమక్: ది కంక్లూజన్(హిందీ సినిమా) - ఆగస్టు 16హోయ్చోయ్పరిణీత- ఆగస్టు 15 -
ఆ నాలుగు సినిమాల్లో ‘డార్లింగ్’ ఉంటుంది: ప్రియదర్శి
ఏడాదికి వందకు పైగా కామెడీ సినిమాలు వస్తే.. థియేటర్స్‌లో చూసి గుర్తు పెట్టుకునే సినిమాలు నాలుగైదు మించి ఉండవు. వాటిలో ఈ ఏడాది ‘డార్లింగ్’ కూడా ఉంటుంది. ఇందులో కావాల్సినంత కామెడీ ఉంది. మంచి మ్యూజిక్ ఉంది. ఆడియన్స్‌కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అన్నారు హీరో ప్రియదర్శి . ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్’. నభా నటేష్ హీరోయిన్. ఆశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే... ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ ఉందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్ సొసైటీలో ఎవర్ గ్రీన్. నటుడిగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా ఉంటుంది.→ డార్లింగ్ సినిమాలో విమన్ క్యారెక్టర్‌కి స్ప్లిట్ పర్షనాలిటీ అనే స్పెషల్ కండీషన్ ఉంటుంది. దిన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు క్యారెక్టర్ లు సీరియస్ గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో వున్న మ్యాజిక్ ఇది. డార్లింగ్ లో అది చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.→ నభా లాంటి యాక్టర్ తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్ తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్ గా ఉందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్ తో ఒక వర్క్ షాప్ చేశాం.15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లుగా మంచి ఎక్స్ పీరియన్స్ అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.→ డైరెక్టర్ అశ్విన్ రామ్‌ని సందీప్ కిషన్ 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం కలిశాను. తను ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్ షిప్ క్యాలిటీస్ , కమ్యునికేషన్ స్కిల్, క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.→ డార్లింగ్ లో డ్యాన్సులు కూడా చేశాను. నేను కూడా డాన్స్ చేస్తానాని నాకే తెలియదు(నవ్వుతూ).ఈ క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీ కి దక్కుతుంది. → ఆగస్ట్ 15న నేను నటించిన 35 ‘చిన్న కథ కాదు’ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్ లో రోషన్ తో ఓ సినిమా ఉంది. సేవ్ టైగర్స్ సీజన్ 3 కూడా చేయాలి. -
Darling Movie Pre Release Event: ప్రియదర్శి ‘డార్లింగ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాం: నాని
‘‘ఈ మధ్య సినిమాల్లో యాక్షన్ ఎక్కువైపోయి ప్రేమకథలు, వినోదం చాలా మిస్ అవుతున్నాం. చిన్నప్పుడు అన్నిరకాల జానర్స్ మూవీస్ వచ్చేవి.. అన్నింటినీ ఎంజాయ్ చేసేవాళ్లం. థియేటర్స్‌కి వెళ్లడానికి ఎక్కువ కారణాలుండేవి. కానీ, ఇప్పుడు మనకు తెలియకుండానే ఒకే జానర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాం. అందరం కామెడీ, లవ్‌స్టోరీ, ఎమోషనల్, యాక్షన్.. ఇలా అన్ని జానర్స్ టచ్ చేయాలి. ప్రియదర్శిలాంటి ప్రతిభ ఉన్న నటుడు వైవిధ్యమైన జానర్స్ ఎంచుకోవడం గర్వంగా ఉంది’’ అని హీరో నాని అన్నారు.ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనన్య నాగళ్ల కీలక పాత్ర చేశారు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ–‘‘డార్లింగ్’ మూవీ టీజర్, ట్రైలర్ చాలా వినోదాత్మకంగా ఉంది. సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి. ‘హను–మాన్’ మూవీ స్థాయిలో ‘డార్లింగ్’ విజయం సాధించాలి.వివేక్ సాగర్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే అశ్విన్ రామ్ ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తోంది. నభా నటేశ్.. ప్రమాదం తర్వాత నీ కొత్త అధ్యాయం ‘డార్లింగ్’ తో ప్రారంభమైంది. దర్శి అంటే నాకు చాలా ఇష్టం. తన నటన, చేసే పాత్రలు ఇష్టం. అందుకుని ‘డార్లింగ్’ ఈవెంట్‌కి రాలేదు. నాకు ఇష్టమైన ‘బలగం’ మూవీ హీరో అని, ‘బలగం’ మూవీ అభిమానిగా వచ్చా. ‘బలగం’ స్థాయిలో ‘డార్లింగ్’ విజయం సాధించాలి.ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలి. నా వాల్‌పోస్టర్ ప్రొడక్షన్లో నేను నిర్మించనున్న తర్వాతి సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తాడు. జగదీశ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తాడు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ నరేశ్ రామదురై, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అనన్య నాగళ్ల, డైరెక్టర్స్ వీఐ ఆనంద్, వేణు యెల్దండి పాల్గొన్నారు. -
ఒక ప్రమాదంతో ఇంటికే పరిమితం.. అప్పుడే అర్థమైంది!
‘‘నాకు జరిగిన ప్రమాదంలో భుజానికి గాయమైంది. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో ఇలా జరగడంతో కాస్త బాధపడ్డాను. ఆ బాధ సహజమే. అయితే ఇంతటితో నా కెరీర్ ముగిసిపోయిందని మాత్రం అనుకోలేదు. ఒక్క ప్రమాదంతో అంతా అయిపోతుందని నిరుత్సాహపడలేదు. ప్రమాదం జరిగాక ఇంటికే పరిమితం అయిన నేను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేసినప్పుడు నెటిజన్లు బాగా స్పందించేవారు. నన్ను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని ఉందని కామెంట్స్ పెట్టేవారు. దీంతో నా ప్రేక్షకులు నన్ను చూడటానికి ఎదురు చూస్తున్నారని అర్థమైంది.వారి మాటలు నాలో ఆత్మవిశ్వాసం కలిగించాయి. అలాగే యాక్సిడెంట్ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కానీ నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలని ఆ చాన్స్‌లు వదులుకున్నాను. దాదాపు మూడేళ్ల తర్వాత ‘డార్లింగ్’ సినిమాతో నన్ను నేను థియేటర్స్‌లో చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో అశ్విన్ రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డార్లింగ్’. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న ఆనంది పాత్ర చేశాను. ఒకే సినిమాలో రెండు పాత్రలు చేసినట్లనిపించింది. సవాలుగా తీసుకుని చేశాను. ప్రస్తుతం నిఖిల్ పీరియాడికల్ మూవీ ‘స్వయం భూ’లో ఓ పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. -
ఇంటర్వ్యూ మొత్తం నవ్వులే నవ్వులు
-
తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్ : డైరెక్టర్ అశ్విన్ రామ్
‘‘చిన్నప్పట్నుంచీ తెలుగు సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నాను. తమిళ దర్శకుడు అట్లీ తీసిన ‘రాజా రాణి’కి దర్శకత్వ విభాగంలో చేశాను. దర్శకుడు మురుగదాస్ ప్రొడక్షన్లోని మూడు సినిమాల్లో భాగమయ్యాను. ధనుష్‌గారి సినిమాలకూ వర్క్ చేశాను. తమిళంలో ఓ సినిమాకు దర్శకత్వం వహించాను. తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్ (నవ్వుతూ). ఇప్పుడు తెలుగులో ‘డార్లింగ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అశ్విన్ రామ్. ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డార్లింగ్’. కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్ రామ్ మాట్లాడుతూ– ‘‘భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ‘డార్లింగ్’. ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ మా ‘డార్లింగ్’ కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ మా సినిమాను చూసిన నలభైమంది ఈ కొత్తదనాన్నే ఫీలయ్యారు. ఈ సినిమా ట్రైలర్ చూసి నభా ΄ాత్రలో స్లి్పట్ పర్సనాలిటీ ఉంది కాబట్టి కొందరు ‘అపరిచితుడు’తో ΄ోల్చుతున్నారు. ‘డార్లింగ్’, ‘అపరిచితుడు’ సినిమాల మధ్య ఉన్న కామన్ ΄ాయింట్ స్లి్పట్ పర్సనాలిటీ మాత్రమే’’ అన్నారు. -
డార్లింగ్ విజయం సాధిస్తుంది: విశ్వక్ సేన్
‘‘డార్లింగ్’ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సమయంలో నన్ను వేదికపైకి ఆహ్వానించి సైకో వివేక్‌గా పరిచయం చేశాడు ప్రియదర్శి. ‘మల్లేశం, బలగం’ లాంటి సినిమాలు అందరికీ పడవు.. రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు తను ‘డార్లింగ్’ తో రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శి గెలిస్తే నేను గెలిచినట్లు అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డార్లింగ్ అనగానే ప్రభాస్అన్న పేరు గుర్తొస్తుంది. అలాంటి టైటిల్ పెట్టుకోవాలంటే భయంగా ఉండేది. అయితే కథని నమ్మి ‘డార్లింగ్’ టైటిల్ పెట్టుకున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘నేను ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అని ఆలోచిస్తున్నపుడు ‘డార్లింగ్’ అవకాశం వచ్చింది’’ అన్నారు నభా నటేష్. ‘‘మూడేళ్ల ప్రయాణం ‘డార్లింగ్’. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది’’ అన్నారు అశ్విన్ రామ్. ‘‘కథని నమ్మి తీసిన ఈ మూవీకి ప్రేక్షకుల ్రపోత్సాహం కావాలి’’ అన్నారు చైతన్య. -
యాక్సిడెంట్‌తో ఓ రకమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లా: నభా నటేష్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నభా నటేష్. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు కానీ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో నభా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదం నభా భుజానికి తీవ్ర గాయం అయింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తాజాగా ‘డార్లింగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నభా మీడియాతో మాట్లాడుతూ..యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మానసిన పరిస్థితి ఎలా ఉందో వివరించింది. (చదవండి: అందరినీ మెప్పించేలా 'డార్లింగ్'.. ఆసక్తిగా ట్రైలర్)‘నా సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఓ రకమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లిపోయాను. ఆపరేషన్ అయిన పది రోజులకే షూటింగ్లో పాల్గొన్నాను. దీంతో నా హెల్త్ మళ్లీ ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకో సర్జరీ జరిగింది. నా శరీరానికి కచ్చితంగా రెస్ట్ ఇవ్వాలనిపించింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమని ఫిక్స్ అయ్యాను. చాలా కేర్ తీసుకొని 6 నెలల పాటు నా ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. ఫిజికల్‌గా ఫిట్ లేకుంటే సినిమాలు చేయలేం. అందుకే సమయం తీసుకున్నాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యాకే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. చాలా గ్యాప్ తార్వత ‘డార్లింగ్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇస్మార్ట్ శంకర్ లాంటి కమర్షియల్ సినిమా తర్వాత ‘డార్లింగ్’ లాంటి సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. బట్ ఆడియన్స్‌కి తెలుసు..ఇప్పుడు కంటెంట్ అనేది న్యూ కమర్షియల్ అని. డైరెక్టర్ అశ్విన్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాకి ఒప్పుకున్నాను. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని నభా చెప్పుకొచ్చింది. -
హను–మాన్ మాకు ఓ వరం: నిర్మాత చైతన్య
‘‘మా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థలో నిర్మించే సినిమాలకు కథే హీరో. ‘డార్లింగ్’ సినిమాకూ అంతే. ఈ చిత్రంలో ప్రియదర్శి, నభా నటేశ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చైతన్య. ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెతన్య మాట్లాడుతూ– ‘‘డార్లింగ్ కథను నిరంజన్రెడ్డిగారే ఓకే చేశారు. మాది ప్రేమ వివాహం. దర్శకుడు రామ్ అశ్విన్‌ది కూడా ప్రేమ వివాహం. సో.. ప్రేమ నేపథ్యంలో రామ్ చెప్పిన ‘డార్లింగ్’ సినిమా పాయింట్‌కు నిరంజన్ కనెక్ట్ అయ్యారు. సింపుల్‌గా ఉండే అబ్బాయి పాత్రలో ప్రియదర్శి, కొంచెం హైపర్ యాక్టివ్‌గా ఉంటూ స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో నభా కనిపిస్తారు.ఇక ‘హను–మాన్’ సినిమా మాకు ఓ వరంలా లభించింది. సంక్రాంతి సమయంలో విడుదల కావడం, అంత పెద్ద హిట్ కావడం అనేది ఆ హనుమంతుడి దయ వల్లే జరిగిందని భావిస్తున్నాం. ‘హను–మాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నావరకైతే ‘జై హనుమాన్’లో చిరంజీవి, రామ్‌చరణ్‌గార్లు అయితే బాగుంటుందని అనుకుంటున్నా. సాయితేజ్‌గారితో ఓ సినిమా ప్రకటించాం. ఇంకో పది సినిమాలుప్రోడక్షన్లో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మా బేనర్ నుంచి పది సినిమాలు రిలీజ్ అవుతాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రెండు మాస్టర్స్ డిగ్రీలు చేశాను. టెక్నికల్ సపోర్ట్ ఉంది. సో.. బిజినెస్‌ను నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది’’ అన్నారు. -
Darling Movie: ఆకట్టుకుంటున్న నభా నటేశ్ ‘రాహి రే’ సాంగ్
ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ‘వై దిస్ కొలవెరి’ అన్నది ట్యాగ్‌లైన్. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాహి రే...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. ‘‘యునిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డార్లింగ్’. ‘రాహి రే...’ పాట మెలోడియస్గా సాగుతుంది. నభా నటేశ్ పై సాగే ఈ పాటను సినిమాటోగ్రాఫర్ నరేష్ రామదురై అందంగా చిత్రీకరించారు’’ అన్నారు మేకర్స్. -
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్! అంత మాట అనేసిందేంటి!
టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్. ఆమె ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభూ చిత్రంలో నటిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా.. నభా నటేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా నభా నటేశ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ డార్లింగ్ అంటూ చెప్పే డైలాగులతో ఓ వీడియోను పంచుకుంది. ఇది చూసిన ప్రియదర్శి పులికొండ.. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్ ఉన్నావ్ డార్లింగ్.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే ప్రియదర్శి చేసిన కామెంట్స్‌పై నభా నటేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిస్టర్.. ఒకరిని కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త, హద్దులు దాటొద్దు.. అంటూ మండిపడింది. అలాగే పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే లైంగిక వేధింపులకు కిందకే వస్తుందని గతంలో కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చిందంటూ దానికి సంబంధించిన వార్త క్లిప్‌ను నభా నటేశ్ షేర్ చేసింది. ఇది చూసిన ప్రియదర్శి సైతం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మీరేమో డార్లింగ్ అని పిలవొచ్చు.. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్ అంటూ పోస్ట్ చేశారు. ఇదంతా కేవలం ఫన్నీ కోసమే చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీరిద్దరి మధ్య సంభాషణ మాత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా.. ప్రియదర్శి ఇటీవల సేవ్ ది టైగర్స్-2 సీజన్‌తో ప్రేక్షకులను అలరించారు. Ohoo! Why this Kolaveri 😉🙃 https://t.co/r7DZYWTCtB — Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024 WOW Superrrrrr 🤩 Darlinggggg 😍 Kirrrraakkk Unnav Darling😘🤌🏼 https://t.co/fIYSCaCfYo — Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024 -
Calcutta High Court: వారిని డార్లింగ్ అనడం లైంగిక వేధింపే
కోల్‌కతా: ఫూటుగా తాగి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలిచిన ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరిచింది. పరిచయం లేని మహిళను అలా పిలవడడాన్ని ‘లైంగిక వేధింపు నేరం’గా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా ఇదే కేసులో గతంలో కింది కోర్టు ఇచి్చన తీర్పును హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 354ఏ (మహిళా గౌరవాన్ని భంగపరచడం), 509 సెక్షన్ల కింద అతడిని దోషిగా తేలి్చంది. మహిళా కానిస్టేబుల్‌ను మద్యం మత్తులో డార్లింగ్ అని పిలిచిన జనక్ రామ్ అనే వ్యక్తికి గతంలో పడిన శిక్షను సమరి్థస్తూ జస్టిస్ జై సేన్ గుప్తా నేతృత్వంలోని ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పును వెలువరిచింది. ‘‘ పరిచయంలేని మహిళను తాగిన/తాగని వ్యక్తి నడి వీధిలో డార్లింగ్ అనే పిలిచే ధోరణి భారతీయ సమాజంలో లేదు. నిందితుడు మద్యం మత్తులో ఉంటే అప్పుడు నేరాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తాం’ అని జడ్జి వ్యాఖ్యానించారు. అండమాన్ నికోబార్ ద్వీపంలోని మాయాబందర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనాన్ని అదుపు చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ‘చలాన్ వేయడానికి వచ్చావా డార్లింగ్?’ అంటూ జనక్‌రామ్ వేధించాడు. -
Prabhas: ‘డార్లింగ్’ వెనుక ఇంత సీక్రెట్ ఉందా?
ప్రభాస్... ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ‘ఏక్ నిరంజన్’లా దూసుకెళ్తున్న ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ ప్రభాస్. మాస్ ఆడియన్స్‌కు ఆయన ‘రెబల్’. క్లాస్ ఆడియన్స్‌కు ‘డార్లింగ్’.వెండితెరకు ‘బాహుబలి’. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ చరిత్ర చాలానే ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. టాలీవుడ్‌కి మాత్రం ఎప్పుడూ ‘డార్లింగే’. తెలుగు ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనను ముద్దుగా ‘డార్లింగ్’అని పిలుస్తుంటారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘డార్లింగ్’ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. బుజ్జిగాడు సినిమా తర్వాత అందరూ ప్రభాస్‌ని ‘డార్లింగ్’అని పిలవడం స్టార్ చేశారు. ఆ సినిమా ప్రభాస్ డార్లింగ్ ఊతపదం వాడుతాడు. ప్రభాస్ నోటి నుంచి వచ్చిన ఆ పదం.. ఫ్యాన్స్ తెగ నచ్చేసింది. దీంతో ప్రభాస్‌కు ‘డార్లింగ్’అనే నిక్ నేమ్‌ని ఇచ్చేశారు ఫ్యాన్స్. ఈ పేరు తెగ పాపులర్ కావడంతో ప్రభాస్ తరువాతి సినిమాకు ఏకంగా ‘డార్లింగ్’అనే పేరే పెట్టేశారు. అది కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ప్రభాస్‌కు డార్లింగ్ అనే పేరు ఫిక్సయిపోయింది. అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే.. సినిమాల్లోనే కాదు.. నిజంగా ప్రభాస్ ఊతపదం ‘డార్లింగ్’. బుజ్జిగాడు సినిమాలో నటించకముందు నుంచే తన ఫ్రెండ్స్‌ను ప్రభాస్ డార్లింగ్ అని పిలిచేవాడంట. అయితే ఈ విషయం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి తెలియదట. ఒకసారి బుజ్జిగాడు సినిమా సెట్స్‌లో ప్రభాస్ పూరిని డార్లింగ్ అని పిలిచేశాడట. అది నచ్చడంతో సినిమాలో ఆ ఊతపదాన్ని వాడేసినినట్లు పూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘బుజ్జిగాడు సినిమా సెట్స్‌లో ప్రభాస్ నన్ను డార్లింగ్ అని పిలిచేవాడు. నన్ను మాత్రమే అలా పిలుస్తున్నాడేమో అని చాలా సంతోషపడ్డా. కానీ వేరేవాళ్లను కూడా ప్రభాస్ డార్లింగ్ అని పిలవడం చూశా. అప్పుడు డార్లింగ్ అనేది ప్రభాస్ ఊతపదం అని నాకు అర్థమైంది’అని పూరి ఓ ఇంటర్యూలో చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభాస్ కూడా స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ప్రస్తుతం ఓంరౌత్‌తో కలిసి ఆదిపురుష్ , ‘కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్, చేస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా, మారుతి దర్శత్వంలోనూ ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. -
ప్రభాస్ కోసం ఆయన ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
Happy Birthday Prabhas: ప్రభాస్.. నాట్స్ జస్ట్ ఏ నేమ్.. ఇట్స్ ఏ బ్రాండ్ అంటారు డార్లింగ్ ఫ్యాన్స్. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభాస్‌కు అభిమానులున్నారు.బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌కు విదేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు సలార్, ప్రాజెక్ట్ కేల నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మరోవైపు ప్రభాస్ నటించిన క్రేజీ సినిమా బిల్లా 4కెలో బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నేడు(అక్టోబర్23)న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన వరల్డ్ వైడ్ క్రేజీ ఫ్యాన్స్‌పై ఓ లుక్కేద్దాం. బాహుబలి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్ బస్టర్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ఇక బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, శివగామి పాత్రలు జనాల మదిలో ఎప్పటికీ నిలిచిపోయేంత క్రేజ్‌ను దక్కించుకున్నాయి. దీన్ని కొన్ని హోటల్స్ తమ ప్రమోషన్స్‌కి ఇప్పటికీ వాడుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బాహుబలి థాలీ, దేవసేన పరాఠా, కట్టప బిర్యానీ, భల్లదేవ పాటియాలా లస్సీ, శివగామి షాహి పక్వాన్ వంటి స్పెషల్ వంటకాలను తమ మెనూలో చేర్చారు. ఇప్పటికీ బాహుబలి థాలీకి మంచి డిమాండ్ ఉంది. ప్రభాస్ మిర్చిలాంటి కుర్రాడు. సరిగ్గా ఇదే పాయింట్‌ను తమ బిజినెస్ ప్రమోషన్‌కు వాడేసింది జపాన్‌లోని ఓ హోటల్. అక్కడ దొరికే ఓ స్పైసీ డిష్ ప్యాకేజింగ్‌లో ప్రభాస్ ఫోటోను అతికించి తమ బిజినెస్‌కు ప్రమోట్ చేసుకున్నారు. జపాన్‌లో ప్రభాస్‌కు క్రేజీ ఫ్యాన్స్ ఉండటంతో దీనికోసం అక్కడి ప్రజలు ఎగబడ్డారు. ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ఫ్యాన్ ఏకంగా తన వీపుపై బాహుబలి టాటూను వేయించుకున్నారు. ఈ టాటూ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. రష్యన్‌కు చెందిన ఓ లేడీ ఫ్యాన్ లవ్ ప్రభాస్ అంటూ తన వీపుపై టాటూ వేయించుకుంది. మరికొందరు అమ్మాయిలేమో ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఇప్పటికీ రిక్వెస్టులు పెడుతూనే ఉంటారు. మరి ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలికి పెద్ద వాళ్ల నుంచి చిన్నపిల్లల దాకా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే కొన్ని టాయ్స్ కంపెనీలు బాహుబలి బొమ్మలను రూపొందించి బాగా లాభాపడ్డాయి.ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో డార్లింగ్‌కు క్రేజీ గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓసారి జపాన్ లేడీ ఫ్యాన్స్ అంతా కేవలం ప్రభాస్‌ను కలవడానికే ఇండియాకు వచ్చారు. స్వయంగా ఆయన ఇంటి ముందు కూడా కొన్ని ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కే చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా, మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. -
‘డార్లింగ్ కాదు తేజ్ ఐ లవ్ యు’
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో తేజ్ ఐ లవ్ యు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ గిటార్ తగిలించుకొని మైక్ పట్టుకొని పాట పాడుతున్న స్టిల్ ను రిలీజ్ చేశారు అయితే ఈ స్టిల్ డార్లింగ్ సినిమాలో ప్రభాస్ స్టిల్ లా ఉందంటు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన సాయి ధరమ్ ‘కేవలం గిటార్ తగిలించుకొని మైక్ పట్టుకున్నంత మాత్రానా డార్లింగ్ కాదు.. ఇది తేజ్ ఐ లవ్ యు’అంటూ కామెంట్ చేశాడు. Just because I have a guitar and I hold a 🎤 doesn’t mean its darling..... and it’s Tej...I love you 😉 pic.twitter.com/aSzk8QDYnq — Sai Dharam Tej (@IamSaiDharamTej) 30 May 2018 -
పసి ప్రేమకు తొలి అంకురం డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్
చిన్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఆ అమ్మాయితో దాగుడుమూతలు బాగుంటాయి. ఆ అమ్మాయి వెనుక వెనుకే తిరగడం బాగుంటుంది. ఆ అమ్మాయి పక్కనే కూర్చుని క్లాసు వినడం బాగుంటుంది. స్కూలు వదిలాక పక్కనే నడుస్తూ ఇల్లు చేరడం బాగుంటుంది. అమ్మాయి చాలా బాగుంటుంది. ఎందుకో అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ ఉండ బుద్ధేస్తుంది. వయసు పెరుగుతుంది. వయసుతో పాటు మనమూ పెరిగితే బాగుంటుంది. కాదూ కూడదని ఆ చిన్నప్పుడు ఆ అమ్మాయి దగ్గరే ఉండిపోతే మాత్రం కథ ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ అవుతుంది. ఎట్రాక్షన్‌కి తిథి, ముహూర్తమూ ఉండవు. మీసం వచ్చిందా, ఎత్తు అయిదడుగులు దాటిందా, కాళ్లు కాలేజీ దారిలో ఉన్నాయా అన్నది చూడదు. ఎట్రాక్షన్‌కి ఎదురుగా ఉన్నది యజమాని కూతురా పాలేరు కూతురా అన్నది కూడా తెలియదు. ఊహ తెలిసిన క్షణం నుంచి ఆకర్షణ ఉంటుంది. ఎవరి కోసమో ఒకరి కోసం మనసు గాఢంగా కోరుకుంటూ ఉంటుంది. అది సేమ్‌సెక్స్ అయితే స్నేహం. ఆపోజిట్ సెక్స్ అయితే ఇష్టం. ఈ సినిమాలో భాగ్యరాజ్ తన యజమాని కూతురైన పూర్ణిమా జయరామ్ పట్ల అలాంటి ఇష్టం పెంచుకుంటాడు. పెద్దయ్యాక కాదు. చిన్నప్పుడే. పదేళ్ల వయసులో. ఇద్దరూ ఊటీలో చదువుకుంటూ ఉంటారు. ఒకే క్లాసులో ఒకరిని ఒకరు విడవకుండా ఉంటారు. మ్యూజికల్ చైర్స్‌లో ఒక్క చైరే మిగిలితే ఇద్దరూ నిలబడిపోతారు తప్ప ఒకరి మీద మరొకరు గెలవడానికి కూర్చోరు. స్కూల్లో మార్చింగ్ జరిగి ఎదురూ బొదురూ వస్తే ఆగిపోయి ఉన్న చోటే మార్చ్ చేస్తారు తప్ప ముందుకు కదలరు. ఆటల్లో ఒకరు ఫస్ట్ వస్తే ఒకరు సెకండ్. పోటీల్లో ఒకరు సెకండ్ వస్తే మరొకరు ఫస్ట్. కాని ఊటీలో కూడా ఎండ కాస్తుంది. వాళ్ల జీవితంలో కూడా ఎండ వచ్చింది. ఆ అమ్మాయి తండ్రికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ అమ్మాయి పోతూ పోతూ ‘నేను తిరిగి వచ్చే వరకూ నన్ను గుర్తు పెట్టుకుంటావ్‌గా’ అని అడుగుతుంది. అంతేకాదు చనిపోయిన తన కుక్కపిల్ల సమాధి దగ్గర రోజూ పూలు పెడతావుగా అని కూడా అడుగుతుంది. ఆ అమ్మాయి ఎక్కిన రైలు వెళ్లిపోతుంది. దాని చక్రాల కింద ఆమె అంత వరకూ పెంచుకున్న జ్ఞాపకాలు కూడా జారిపోయాయి. కాని ఆ పిల్లవాడు మాత్రం ఆ క్షణం దగ్గరే ఫ్రీజ్ అయిపోయాడు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పదేళ్ల పాటు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉండిపోయాడు. అనుక్షణం ఆమె తలపులు. జ్ఞాపకాలు. కుక్కపిల్ల సమాధి మీద రోజూ పూలు పెట్టి ఎంతో గాఢంగా మౌనం పాటిస్తుంటాడు. ఇదంతా ఎవరి కోసం. తన కోసమే. ఏదో ఒక రోజు రాకపోదు తనని చూసి గుండెల్లో పొదువుకోకపోదు అని ఆశ.అమ్మాయి వచ్చింది. రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లి స్టైల్‌గా ‘హాయ్... ఐయామ్ రాజా’ అన్నాడు.ఆ అమ్మాయి అతణ్ణి ఎగాదిగా చూసి ‘అయితే లగేజ్ అందుకో’ అంది.ఒక ఆశల బుడగ సూది మొన తగలకనే టప్పున పేలింది. ఆ అమ్మాయికి అసలు ఏమీ గుర్తు లేదు. చాలా జీవితం చూసింది. విదేశాల్లో చదువుకుంది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. రేపోమాపో పెళ్లి. ఈలోపు సరదాగా ఊటీ చూద్దామని ఫ్రెండ్స్‌తో వచ్చింది. ఇక్కడ చూస్తే అమర ప్రేమికుడు భాగ్యరాజ్. కళ్ల నిండా మనసు నిండా ఆమెను చూసుకోవడమే. అడిగితే డీసెంట్‌గా ప్రాణమిచ్చేసేలా ఉంటాడు. మొదట ఇతని వాలకం ఏమీ అర్థం కాదు. కాని మెల్లమెల్లగా అతడి మనసులోని లోతు అర్థం చేసుకుంటుంది. మరో వైపు తాను నిశ్చితార్థం చేసుకున్న వరుడు సుమన్ తన కోసం ఊటీ వస్తే అక్కడ అతడి కుసంస్కారం గమనిస్తుంది. భాగ్యరాజ్ దగ్గర డబ్బు లేదు. అతడు వాచ్మెన్ కొడుకు నిజమే. కాని అతడి లాంటి మనసు ఎక్కడ ఉందని? అందుకే ఎంగేజ్‌మెంట్‌ను కాదని భాగ్యరాజ్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటుంది. అయితే ఈలోపే ఆమె మీద కృతజ్ఞతాభారం పడుతుంది. వ్యాపారంలో నష్టపోయిన తండ్రిని స్నేహితుడైన సుమన్ తండ్రి ఆదుకున్నాడు కనుక ఈ క్షణంలో సుమన్‌ని కాదని భాగ్యరాజ్‌ని చేసుకోవడానికి ఆమెకు కృతజ్ఞత అడ్డు వస్తుంది. నలిగిపోతున్న ఆమెను సుమన్ తండ్రి గమనిస్తాడు. అసలు సంగతి గ్రహిస్తాడు. ఆయన పెద్దమనిషి. సంస్కారవంతుడు. అందుకే నిజమైన ప్రేమికునికే ఆమె చెందాలని నిర్ణయిస్తాడు. పదేళ్ల సుదీర్ఘప్రేమ ఫలవంతమైంది. చిన్నప్పటి స్నేహితురాలు ప్రియురాలైంది. ఇప్పుడు ఇల్లాలైంది. కలలు నిజమవుతాయి. తపస్సులు కూడా వరాలిస్తాయి. కావలసిందల్లా సిసలైన తపస్సే. ఈ సినిమాలో హాస్యం, ఆర్తి సమపాళ్లలో ఉంటాయి. తన చిన్ననాటి స్నేహితురాలు తిరిగి వస్తుందన్న ఆనందంలో స్వాగతం చెప్పడానికి కొత్త బట్టలు కుట్టించుకుంటాడు భాగ్యరాజ్. కాని షూస్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. ఏదో పెళ్లికి పెద్దమనిషిగా వెళ్లి అక్కడ మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా ఎవరివో కొత్త షూస్‌లో కాళ్లు దూర్చి చక్కా వచ్చేస్తాడు. నవ్వు వస్తుంది. దూరంగా కరాటే సాధన చేస్తున్న కుర్రాళ్లను కారులో ఉన్నామన్న ధైర్యంతో ఏడిపిస్తారు పూర్ణిమ జయరామ్ ఆమె స్నేహితులు. వాళ్లు వెంటపడతారు. వీళ్లు పారిపోతారు. కాని కారు ఆగిపోతుంది. పట్టుకుంటారు. మాతో ఫైట్ చేసి గెలుస్తారా అని ఛాలెంజ్ చేస్తారు. అప్పటి వరకూ డ్రైవర్‌గా ఉన్న భాగ్యరాజ్ కారులోని ఒక సంచి వెతికి అందులోని ఎల్లో కలర్ కరాటే డ్రస్సు వేసుకొని చాలా ప్రొఫెషనల్‌గా ఫైట్ చేసి గెలుస్తాడు. మళ్లీ నవ్వు. ఇలా నవ్వించిన భాగ్యరాజే తాను పదేళ్లుగా దాచిపెట్టుకున్న ఫొటోలను పూర్ణిమకు ఇస్తే ఆమె వాటిని తీసుకుని అతని ముందే తన ముక్క వరకూ కట్ చేసి అతని ముక్కను చేతిలో పెడితే కంట తడి పెట్టిస్తాడు. లోకంలో అందరూ వీరులూ శూరులూ ఉండరు. భాగ్యరాజ్ వంటి ఆర్డనరీ మనుషులే ఉంటారు. కాని వాళ్ల దగ్గర కూడా చాలా అట్రాక్షన్ ఉంటుంది. కోటాను కోట్ల సఫల ప్రేమలు ఈ ఆర్డనరీ ఫెలోల అట్రాక్షన్ నుంచి పుట్టినవే.తెర మీద మాత్రం ఇది మొదటిది.భాగ్యరాజా చేతిలో మెరిసిన భాగ్యరేఖ. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ కె.భాగ్యరాజ్ తమిళంలో హీరోగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన 1982నాటి సినిమా ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’. తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై భాగ్యరాజ్‌ని తెలుగువారికి అభిమాన దర్శకుడిగా మార్చింది. ఈ సినిమా హిట్‌తో భాగ్యరాజ్ చాలా సినిమాలు ‘చిన్న ఇల్లు’, ‘అమ్మాయిలూ ప్రేమించండి’, ‘నేనూ మీవాడినే’, ‘చిన్నరాజా’ వరుస విజయాలు సాధించాయి. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’... చిన్నప్పటి నుంచి రూపుదిద్దుకునే ప్రేమను మొదటిసారి చూపింది. దీని ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. నిన్నమొన్నటి ‘హలో’ దగ్గరి నుంచి ఆ మొన్నటి ‘మనసంతా నువ్వే’ వరకు ఎన్నో సినిమాలు ఈ సినిమా మూల కథ నుంచే పుట్టాయి. తరుణ్ ‘నువ్వు లేక నేను లేను’లో కూడా ఈ సినిమా లైన్ కనిపిస్తుంది. ఇక కరుణాకరన్ తీసిన ‘తొలి ప్రేమ’కు ఈ సినిమా పూర్తిగా స్ఫూర్తి. సైట్ ఉన్నవాడు కూడా హీరో కావచ్చని, మామూలుగా కనిపించేవాడు కూడా ప్రేమలో గెలవ్వచ్చని భాగ్యరాజ్ చాలామందికి ధైర్యం ఇచ్చాడు. అన్నట్టు ఈ సినిమాలో తనతో నటించిన పూర్ణిమా జయరామ్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. మన దగ్గర పెద్ద హిట్టయిన ‘మూడుముళ్లు’, ‘రాధా కల్యాణం’, ‘అబ్బాయి గారు’ భాగ్యరాజ్ సినిమాలకు రీమేక్‌లే. భాగ్యరాజ్ స్కూల్లో తెలుగులో ఇటీవల వచ్చిన సినిమాలు ‘మళ్లీ రావా’ (సుమంత్), ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (శ్రీనివాసరెడ్డి). – కె -
లబ్ డబ్... లవ్ డబ్!!
లబ్ డబ్.. లబ్ డబ్.. గుండె చప్పుడు ఇది! మరి, ఆ గుండెకి ప్రేమ తోడైతే... లవ్ డబ్.. లవ్ డబ్... లవ్ డబ్... అంటుంది! తెలుగు అయినా.. హిందీ అయినా... తమిళ్ అయినా.. ప్రేమ.. ఇష్క్.. కాదల్... పిలుపు మారుతుందేమో కానీ గుండె చప్పుడు మారదు! లవ్ మీటర్ ఎక్కడైనా ఒక్కటే తెలుగు ప్రేక్షకుల హృదయాలను మీటిన డబ్బింగ్ లవ్వులు ఎన్నో... లబ్ డబ్.. లవ్ డబ్.. డబ్ డబ్ డబ్... చక్కనైన ఓ చిరుగాలి... ఒక్క మాట వినిపోవాలి! తెలుగు చిత్రాలే కాదు... ప్రేమ నేపథ్యంలో వచ్చిన అనువాదాలూ అదరగొట్టాయి. అందులో ముఖ్యమైనది ‘ప్రేమ సాగరం’. యువ తమిళ హీరో శింబు తండ్రి టి. రాజేందర్ ముఖ్య పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఉయిరుళ్ల వరై ఉష’. ఈ చిత్రమే ‘ప్రేమ సాగరం’ పేరుతో తెలుగులో విడుదలైంది. కాలేజీలో చదువుకుంటూ హీరో, హీరోయిన్ లవ్‌లో పడతారు. హీరోయిన్ అన్నయ్య వీళ్ల ప్రేమకు విలన్. చివరికి ప్రేమికులిద్దరూ ఎలా కలిశారు? అనే పాయింట్‌తో తీసిన సినిమా ఇది. ‘అందాలొలికే సుందరి రాత్రి..’, ‘హృదయమనే కోవెలలో...’, ‘చక్కనైన ఓ చిరుగాలి..’ వంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో సినిమా మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అప్పటి ప్రేక్షకులకు ప్రేమ మత్తు ఎక్కించింది. కథానాయిక నళినిని స్టార్‌ని చేసిన సినిమా ఈ ‘ప్రేమ సాగరం’. ‘అల్లరి వెన్నెల జల్లులు...’ ఎనభైలలో వచ్చిన ఘాటు ప్రేమకథల్లో ‘డార్లింగ్ డార్లింగ్’ ఒకటి. ఇందులో కె. భాగ్యరాజా హీరో. మామూలుగా భాగ్యరాజా చేసే సినిమాలన్నీ కామెడీ టచ్‌తోనే ఉంటాయి. ఈ సినిమాలో ఆ డోస్ తక్కువ ఉంటుంది. భాగ్యరాజాలో మరో యాంగిల్ చూపించిన సినిమా ఇది. చిన్నప్పుడే స్నేహంగా మెలిగిన ఓ అమ్మాయితో ్రపేమలో పడతాడు అబ్బాయి. ఆ అమ్మాయి కుటుంబం ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ, చిన్ని హృదయంలో నాటుకుపోయిన అమ్మాయి బొమ్మ అలా ఉండిపోతుంది. తాను పెరుగుతూ ఆ అమ్మాయి మీద ప్రేమను పెంచేసుకుంటాడు. అమ్మాయి పెద్దింటి పిల్ల. అబ్బాయి పేదవాడు. పెద్దయ్యాక ఊరు తిరిగొచ్చే ఆ అమ్మాయితో తన ప్రేమను చెప్పాలనుకుంటాడు. అమ్మాయి మాత్రం పనివాడిలానే చూస్తుంది. అక్కణ్ణుంచి అతను పడే నరక యాతన చూసేవాళ్ల హృదయాలను మెలిపెడుతుంది. భాగ్యరాజానే డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సుమన్ నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేశారు. ఎంత పెద్ద విలన్ అయినా ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. చివరికి ప్రేమ గెలుస్తుంది. అందరి మనసులకూ దగ్గరై ‘డార్లింగ్’ అనిపించుకుందీ సినిమా. ఇందులో ఉన్న ‘ఓ చెలీ ఈ నా భావగీతాలే.. కదలాడే నీటిపై తేలు దీపాలే...’, ‘అల్లరి వెన్నెల జల్లులు..’ అనే హిట్ సాంగ్స్‌ని మరచిపోవడం అంత సులువు కాదు. ‘హృదయమా.. హృదయమా..నీ మౌనమెంత వేదన... ఓ మెడికో తన జీవితాంతం ప్రేమను చెప్పలేక సతమతమయ్యి, చివరకు గుండెపోటుతో చచ్చిపోయే వినూత్నమైన కథతో వచ్చిన సినిమా ‘ఇదయం’. ఈ సినిమా ‘హృదయం’ పేరుతో తెలుగులో విడుదలైంది. ప్రేమకథా చిత్రాల్లో ‘హృదయం’ది ప్రత్యేకమైన స్థానం. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల మనసులలో హీరో తన ప్రేమను హీరోయిన్ దగ్గర త్వరగా చెబితే బాగుండు అనే భావన కలుగుతుంది. హీరో మురళి అద్భుతంగా నటించారు. హీరోయిన్ హీరా రూపం మనసులో అలా నిలిచిపోతుంది. ‘ఊసులాడే ఒక జాబిలమ్మ... సిరిమువ్వలుగా నన్ను తాకెనా..’, ‘హృదయమా.. హృదయమా.. నీ మౌనమెంత వేదన...’ పాటలు ఎవర్గ్రీన్. ఈ ‘హృదయం’ ప్రేమ హృదయాలను మీటింది. ఓ చెలియా.. నా ప్రియ సఖియా ‘పేటా ర్యాప్..’, ‘ముక్కాలా.. ముక్కాబులా.. లైలా..’, ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా..’ 1990లలో విడుదలైన ‘కాదలన్’లోని ఈ పాటలు ఇప్పటికీ కొత్తగా ఉంటాయి. అదే సినిమాలో ‘ఊర్వశీ.. ఊర్వశీ..’ కూడా సూపర్ హిట్. సినిమా సూపర్ డూపర్ హిట్. ప్రేమ మహిమ అలాంటిది మరి. హీరోది మధ్యతరగతి కుటుంబం. హీరోయిన్ గవర్నర్ కూతురు. అందనంత ఎత్తు. ప్రేమకు తేడా తెలియదు కదా. కుర్రాడు చిన్నదాని మీద మనసు పారేసుకుంటాడు. పంజరంలో చిలకలా బతుకున్న చిన్నదానికి కుర్రాడు స్వేచ్ఛాప్రపంచాన్ని చూపిస్తాడు. తనూ ప్రేమలో పడుతుంది. గవర్నర్ మనసు ఊరుకుంటుందా? అబ్బాయిని జైల్లో పెట్టించి, చిత్రహింసలు పెట్టిస్తాడు. అయినా ప్రేమికుడు గెలుస్తాడు. ప్రేయసిని తనదాన్ని చేసుకుంటాడు. ఈ సినిమాలో ప్రభుదేవా, నగ్మా కెమిస్ట్రీ బాగుంటుంది. దర్శకుడు శంకర్ తీసిన ఈ లవ్‌స్టోరీ చాలా సై్టలిష్‌గా ఉంటుంది, ‘ప్రేమికుడు’ పేరుతో విడుదలై, ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. ఉరికే చిలకా... ఆమె ముస్లిమ్.. అతను హిందు. ప్రేమకు కులమతాలతో పని లేదు. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెద్దలను ఒప్పించడం కష్టమని తెలుసు.. అందుకే ఇద్దరూ వెళ్లిపోయి, పెళ్లి చేసుకుంటారు. బొంబాయి వెళ్లిపోతారు. కాపురం హాయిగా సాగుతుంది. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులవుతారు. ఉన్నట్టుండి మత ఘర్షణలు మొదలువతాయి. హిందువులు–ముస్లిమ్‌ల మధ్య చంపుకునేంత ద్వేషం. పెద్ద పెద్ద అల్లర్లు. ఈ అల్లర్లో పిల్లలు గల్లంతు. పిచ్చి పట్టినట్లు పిల్లల కోసం వెతుకుతారు. చివరికి దొరుకుతారు. కాపాడింది వేరే మతం వాళ్లు. అదే సమయంలో ఇద్దరి కుటుంబాలకు సంబంధించిన పెద్దవాళ్లు వీళ్లను వెతుక్కుంటూ బొంబాయి వస్తారు. వాళ్లకూ కనువిప్పు అవుతుంది. ఒక లవ్‌స్టోరీకి సామాజిక అంశాన్ని ముడిపెట్టి తీయడం మణిరత్నంలాంటి కొంతమంది దర్శకులకు మాత్రమే కుదురుతుందేమో. ఈ సినిమాలో ‘ఉరికే చిలకా వేచి ఉన్నాను నీ కొరకు...’, ‘కన్నానులే...’, ‘అది అరబిక్ కడలందం...’ వంటి ఎ.ఆర్. రహమాన్ పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక, అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా జంట పండించిన కెమిస్ట్రీని కూడా మరచిపోలేం. పిచ్చి ప్రేమ! పెళ్లికి ముందు భార్య ఒక వ్యక్తిని ప్రేమించిందని తెలిస్తే చాలామంది భర్తలు విడాకులు ఇచ్చేస్తారు. కానీ, తన భార్య మాజీ ప్రియుడికి పిచ్చి పట్టిందని తెలిసి, అతన్ని తీసుకొచ్చి చికిత్స చేయించే భర్త ఉంటాడా? తమిళనాడులో ఉన్నాడు. ఆ సంఘటన తెలిసి, దర్శకుడు బాలాజీ శక్తివేల్ సినిమాగా తీశారు. అదే ‘కాదల్’. భరత్, సంధ్య జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే’గా విడుదలైంది. ఈ టీనేజ్ లవ్‌స్టోరీ యూత్‌కి బాగా పట్టేసింది. పెద్దవాళ్లకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే టీనేజ్ జంటను ఆ తర్వాత పెద్దవాళ్లే విడదీస్తారు. ఆ తర్వాత అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. అబ్బాయి పిచ్చివాడైపోతాడు. ఈ ట్రాజెడీ లవ్‌స్టోరీకి బోల్డన్ని అభినందనలు అందాయి. అప్పటికే భరత్ ‘బాయ్స్’తో పాటు ఓ మూడు సినిమాల్లో నటించాడు. సంధ్యకి ఇది మొదటి సినిమా. ఈ ఒక్క సినిమాతో ఇద్దరికీ ఫుల్ పాపులార్టీ వచ్చేసింది. ప్రేమ పరీక్షలో... ఓ రోజు ఓ నిరుపేద విద్యార్థికి గొప్ప కాలేజీలో సీటొస్తుంది. గొప్పింటి అమ్మాయి మనసులో చోటూ దక్కింది. ఆ తర్వాతే జీవితంలో అసలైన సంఘర్షణ మొదలైంది. ఎక్కువశాతం ప్రేమకథలు చివరికి సుఖాంతం అవుతాయి. ‘ప్రేమికుల రోజు’లోనూ అంతే. కానీ, కథలో ట్విస్ట్ ఏంటంటే.. కాలేజీలో ఆ కుర్రాడికి సీటిచ్చిన ప్రిన్సిపాలే అమ్మాయి తండ్రి. ప్రేమ సంగతి గురువుకి చెప్పలేక నిరుపేద విద్యార్థి సంఘర్షణకు లోనయ్యే తీరు ప్రతి ఒక్కరి మనసులనూ మీటింది. చెప్పుకోవాలంటే ఇది మామూలు కథే. కానీ, దర్శకుడు ఖదీర్ కథకు అద్దిన మోడరన్ మెరుగులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఇప్పుడంటే ఈ–మెయిల్స్, చాటింగ్ అందరికీ తెలుసు. పదిహేనేళ్ల క్రితం ఎవరికి తెలుసు? అప్పుడే ఇవన్నీ ఊహించి ఖదీర్ సినిమాలో చూపించారు. మెయిల్లో అమ్మాయి ఫొటో చూసి ప్రేమలో పడడం.. రైల్వే స్టేషన్లో కలుసుకోవడం... సినిమాలో ప్రతిదీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో ప్రేమలో పడడానికి మరో ముఖ్య కారణం ఏఆర్ రెహమాన్ పాటలు. ‘వాలు కనులదానా..’, ‘దాండియా ఆటలు ఆడ..’, ‘రోజా రోజా..’ పాటలు సూపర్‌హిట్. ఇక, ‘ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని..’ పాట వన్‌సైడ్ లవర్స్ నోట ఇప్పటికీ మార్మోగుతోంది. మనిషికి ఆక్సిజన్ లేకపోతే ఊపిరాడదు. సినిమాకి ప్రేమ కథ లేకపోతే ఊపిరాడదు. ఇది సత్యం. ఇప్పుడైనా. అప్పుడైనా. ఎప్పటికి అయినా. -
ఈ నెల 15న 'ప్రభాస్ బాహుబలి' రిలీజ్
బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న పరభాషా నిర్మాతలు. గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాలను ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కొంత మంది నిర్మాతలు మరో అడుగు ముందుకేసి బాహుబలి పేరును కూడా మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు. అదే బాటలో 2010లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన డార్లింగ్ సినిమాను ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఏకంగా 'ప్రభాస్ బాహుబలి' అని టైటిల్ పెట్టేశారు. ఇప్పటికే బాహుబలి సినిమా అదే పేరుతో తమిళనాట ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పేరుకు ముందు ప్రభాస్ అని అతికించి కొత్త సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 15న రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్గా నటించిన డార్లింగ్ సినిమాకు కరుణాకరన్ దర్శకుడు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా తమిళ నాట కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. మరి ఈ ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. -
స్కూల్ డేస్ గుర్తొస్తాయి!
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ దృష్టంతా ఇప్పుడు యాక్టింగ్‌పై ఉంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ప్రేమకథా చిత్రమ్’ తమిళ రీమేక్ ‘డార్లింగ్’ ద్వారా జీవీ హీరోగా మారారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ ఉత్సాహంతో ‘త్రిష ఇల్లేనా నయనతార’లో హీరోగా నటించారు. ఇప్పుడు జీవీ నటించిన మూడో చిత్రం ‘పెన్సిల్’ ఈ నెల 13న విడుదల కానుంది. తెలుగమ్మాయి శ్రీదివ్య ఇందులో కథానాయిక. ఎం.పురుషోత్తం సమర్పణలో మణి నాగరాజ్ దర్శకత్వంలో జి.హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘పాఠశాల జీవితాన్ని, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసే చిత్రం ఇది. పాటలకు, ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది’’ అని జీవీ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన నేను తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం ఇది. జీవీ ప్రకాశ్‌గారు హీరోగా నటించడంతో పాటు మంచి పాటలిచ్చారు’’ అని నిర్మాత హరి చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం. -
సాహసరాణి నిక్కీగల్రాణి
కొన్ని సార్లు రిస్కీ ఫైట్స్ అనిపిస్తే ప్రముఖ హీరోలకే డూప్‌లను నటింపజేస్తారు. అలాంటిది నటి నిక్కీగల్రాణి ఏకంగా కరాటే ఫైట్‌లోనే డూప్ లేకుండా నటించేసిందట. ముద్దుగా డార్లింగ్ అంటూ దెయ్యంగా తమిళ ప్రేక్షకుల్ని భయపెట్టేసి గుర్తింపుపొందేసిన నటి నిక్కీగల్రాణి. ఆ తరువాత యాగవరాయనుమ్ నాకాక్క తదితర చిత్రాల్లో మెరిసి వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఎళిల్ దర్శకత్వంలో విష్ణువిశాల్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో నిక్కీగల్రాణి పోలీస్ అధికారిణిగా కనిపించనుందట. ఇందులో ఫైట్ సన్నివేశాల్లోనూ దడదడలాడించిందట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తన సాహస దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయట. ఒక ఫైట్ సన్నివేశంలో కరాటే విద్యను కూడా ప్రదర్శించిందట. ఆ ఫైట్ సన్నివేశంలో గాయాలకు గురై అస్పత్రి పాలైందట. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ రిస్కీ సన్నివేశం అయిన తెలిసినా డూప్ లేకుండా తానే నటించాలని భావించానని చెప్పింది. అలా రిస్క్ తీసుకుని నటించడంతో తన కుడి చెయ్యి వేలు విరిగిందని దాంతో వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినట్లు తెలిపింది. తాను రికవరీ అవ్వడానికి రెండు వారాలకు పైనే పట్టిందని చెప్పింది. అదే విధంగా లారెన్స్ సరసన మొట్ట శివ కెట్ట శివ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. అందులో విలేకరిగా నటిస్తుండటంతో ఆ పాత్రకు తగ్గట్టుగా కనిపించడానికి బరువు చాలా తగ్గినట్లు చెప్పింది. తమిళం,తెలుగు,కన్నడం,మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. కన్నడం కంటే తమిళంలో ఆదరణ బాగుండడంతో చెన్నైకి మకాం మార్చినట్లు నిక్కీగల్రాణి తెలిపింది. తెలుగులో మలుపు, క్రిష్ణాష్టమి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని,అలాగే తమిళంలో కో-2 చిత్రం త్వరలో విడుదలకానుందని నిక్కీగల్రాణి వెల్లడించింది. -
డార్లింగ్ కాంబినేషన్ రిపీట్
చెన్నై : ఒక చిత్రం విజయం సాధిస్తే ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడితో మళ్లీ చిత్రాలు తీయడానికి నిర్మాతలు ఆసక్తి చూపడం అన్నది సర్వసాధారణ విషయం. అలాంటి ఆసక్తే డార్లింగ్ చిత్ర దర్శక కథానాయకులపై నెలకొంది. యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన డార్లింగ్ చిత్రాన్ని శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఆనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో జీవీకి హీరోగా డిమాండ్ పెరిగిపోయింది. వద్దంటే అవకాశాలు అన్నట్టుగా ఉందాయన పరిస్థితి. ఈ మధ్య విడుదలైన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం కలెక్షన్లను ఇరగదీసింది. ప్రస్తుతం బ్రూస్లీ అనే యాక్షన్ కథా చిత్రంలో నటిస్తున్న జీవీ ప్రకాశ్‌కుమార్ తదుపరి కెట్టవన్ ఇంద కార్తీ చిత్రంలో నటించనున్నారు. తాజాగా డార్లింగ్ చిత్ర దర్శకుడికి జీవీ పచ్చజెండా ఊపారు. ఈ హిట్ కాంబినేషన్లో చిత్రం చేయడానికి పలువురు నిర్మాతలు ప్రయత్నించారు. డార్లింగ్ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా కూడా ఈ కాంబినేషన్లో చిత్రం చేయడానికి ముందుకు వచ్చారని, అయితే ఆయన తక్కువ పారితోషికం చెల్లిస్తాననడంతో అంతకంటే అధిక పారితోషికం అందిస్తానన్న లైకా ప్రొడక్షన్లో జీవీ హీరోగా శ్యామ్ ఆంటన్ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. లైకా సంస్థ ఇంతకు ముందు విజయ్ హీరోగా కత్తి చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో సూపర్‌స్టార్‌తో శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంస్థా లైకానేనన్నది గమనార్హం.