Dasun Shanaka
-
3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్న శ్రీలంక బౌలర్
అబుదాబీ టీ10 లీగ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనక చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ లీగ్‌లో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షనక.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ వేసిన షనక తొలి నాలుగు బంతులకు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఇందులో రెండో నో బాల్స్ ఉన్నాయి. అనంతరం ఐదో బంతి సిక్సర్ కాగా.. ఆరో బంతి నో బాల్ అయ్యింది. తిరిగి ఏడో బంతి కూడా నో బాల్ కాగా.. ఈ బంతి బౌండరీకి తరలివెళ్లింది.మొత్తంగా షనక ఓవర్ తొలి మూడు బంతుల్లో 4 నో బాల్స్ వేశాడు. దీంతో మూడు బంతులు ఏడు బంతులయ్యాయి. ఏడు బంతుల్లో బ్యాటర్ నిఖిల్ చౌదరీ ఐదు బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఓ బాల్ డాట్ బాల్‌గా మారింది. ఓవర్ చివరి మూడు బంతులకు సింగిల్స్ రావడంతో ఈ ఓవర్లో మొత్తంగా 33 పరుగులు వచ్చాయి.ఢిల్లీ బుల్స్, బంగ్లా టైగర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. బుల్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిథ్ 1, టామ్ బాంటన్ 8, జేమ్స్ విన్స్ 27, రోవ్‌మన్ పావెల్ 17, టిమ్ డేవిడ్ 1, షాదాబ్ ఖాన్ 10 (నాటౌట్), ఫేబియన్ అలెన్ 6 పరుగులు చేశారు. ఆఖర్లో నిఖిల్ చౌదరీ మెరుపు వేగంతో 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. లియామ్ లివింగ్‌స్టోన్ (15 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించడంతో 9.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
కివీస్‌తో సిరీస్‌లకు లంక జట్ల ప్రకటన.. వాళ్లకు మరోసారి మొండిచేయి
న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో టీ20, వన్డేలకు పదిహేడు మందితో కూడిన జట్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. చరిత్ అసలంక వన్డే జట్టుకు సారథిగా కొనసాగనుండగా.. మాజీ కెప్టెన్ దసున్ షనకకు ఈ జట్టులో స్థానం లభించలేదు.వారికి మొండిచేయిఇక వరల్డ్‌కప్-2023 తర్వాత కుశాల్ పెరీరా తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. మహ్మద్ షిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. షనకతో పాటు పేసర్ దుష్మంత చమీరాకు మరోసారి మొండిచేయి ఎదురుకాగా.. భనుక రాజపక్స కూడా జట్టుతో కొనసాగనున్నాడు.టీమిండియా, విండీస్లపై వరుస సిరీస్ విజయాలుకాగా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రీలంక వన్డేల్లో అద్వితీయ విజయాలు సాధించింది. స్వదేశంలో తొలుత టీమిండియాను 2-1తో చిత్తు చేసి సిరీస్ గెలుచుకున్న లంక.. తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది.ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు అసలంక బృందం సిద్ధమైంది. కాగా ఇటీవల శ్రీలంకలో పర్యటించిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. అయితే, వెంటనే ఇండియా టూర్లో 3-0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.ఇప్పుడు మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు తిరిగి రానుంది. ఇందులో భాగంగా రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబరు 8, 10 తేదీల్లో లంక- కివీస్ మధ్య టీ20లకు డంబుల్లా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 13, 17, 19 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో వన్డేలకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, సదీర సమరవిక్రమ, నిషాన్ మదుష్క, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక, మహ్మద్ షిరాజ్. న్యూజిలాండ్‌తో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక, పాతుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండీమాల్, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, నువాన్ తుషార, మతీషా పతిరానా, బినూరా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
LPL 2024: ఫాల్కన్స్‌ను గెలిపించిన షకన, మెండిస్.. కొలొంబో ఔట్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ నుంచి కొలొంబో స్ట్రయికర్స్ నిష్క్రమించింది. నిన్న (జులై 18) క్యాండీ ఫాల్కన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ జట్టు 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన కొలొంబో.. స్వల్ప స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. కమిందు మెండిస్ (54), దుసన్ షనక (39) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఫాల్కన్స్‌ను గెలిపించారు.రాణించిన సమరవిక్రమసమరవిక్రమ (62) అర్ద సెంచరీతో రాణించడంతో కొలొంబో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కొలొంబో ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (30), వెల్లలగే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. ఫాల్కన్స్ బౌలర్లలో హస్నైన్ 3, హసరంగ 2, ఏంజెలో మాథ్యూస్, షనక తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. కమిందు మెండిస్, షనక సత్తా చాటడంతో 18.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కొలొంబో బౌలర్లలో బినర ఫెర్నాండో, మతీష పతిరణ తలో 3, ఇషిత విజేసుందర, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో గెలుపొందిన ఫాల్కన్స్.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2లో జాఫ్నా కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 21న జరిగే ఫైనల్లో గాలే మార్వెల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
షనక ఊచకోత.. చాప్మన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ క్యాండీ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో దంబుల్లా సిక్సర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), చమిందు విక్రమసింఘే (42 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. గుణతిలక 11, కుశాల్ పెరీరా 0, నువనిదు ఫెర్నాండో 4, తౌహిద్ హ్రిదోయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో షనక 3 వికెట్లు పడగొట్టగా.. హస్నైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. దినేశ్ చండీమల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), షనక (15 బంతుల్లో 46 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. షనక సిక్సర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముస్తాఫిజుర్ వేసిన 16వ ఓవర్లో మూడు సిక్సర్లు, బౌండరీ సహా 23 పరుగులు పిండుకున్నాడు. సిక్సర్స్ బౌలర్లలో నువాన్ తుషార, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఖిల ధనంజయ, చమిందు విక్రమసింఘే తలో వికెట్ పడగొట్టారు.లీగ్‌లో భాగంగా ఇవాళ (జులై 2) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, గాలే మార్వెల్స్.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్, క్యాండీ ఫాల్కన్స్ పోటీపడనున్నాయి. -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్‌గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్‌కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
శ్రీలంకకు బిగ్ షాక్.. వరల్డ్‌కప్ నుంచి కెప్టెన్ ఔట్
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనక గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. అతడు తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా దృవీకరించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 10న హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షనక కుడి తొడకు గాయమైంది. అతడు కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ కరుణరత్నేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. మరోవైపు యువ పేసర్ మతీషా పతిరానా కూడా భుజం గాయం కారణంగా ఈ టోర్నీలో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో లంక బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌లలోనూ శ్రీలంక ఓటమి పాలైంది. చదవండి: World Cup 2023: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్ శర్మ.. ఎందుకంటే? వీడియో వైరల్ -
వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు బిగ్ షాక్.. కెప్టెన్‌కు గాయం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనకతో పాటు యువ పేసర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యారు. నెట్‌ప్రాక్టీస్‌లో షనక మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు పూర్తిగా ప్రాక్టీస్ సెషన్స్ మొత్తానికి దూరమయ్యాడు. మరోవైపు పతిరానా భుజం గాయంతో బాధపడుతున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా పతిరానాకు భుజానికి గాయమైంది. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌కు షనక దూరం కావడంతో కుశాల్ మెండిస్ లంక సారధిగా వ్యవహరించనున్నాడు. షనక స్ధానంలో దుషాన్ హేమంత, పతిరానా స్ధానంలో లహురు కుమార తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 16న లక్నో వేదికగా ఆసీస్‌తో శ్రీలంక తలపడనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. చదవండి: Ind Vs Pak: పాక్ బ్యాటర్లకు చుక్కలు.. వారెవ్వా.. ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు! అతడొక్కడే పాపం.. -
CWC 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) పాకిస్తాన్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇర్లు జట్లు చెరో మార్పు చేశాయి. కసున్ రజిత స్థానంలో తీక్షణ లంక జట్టులోకి రాగా.. ఫకర్ జమాన్ స్థానంలో షఫీక్ పాక్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేరాడు. శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ -
CWC 2023: శ్రీలంకతో మ్యాచ్.. పాకిస్తాన్ చరిత్ర పునరావృతం చేసేనా..?
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంలో ఉన్న పాక్ టోర్నీలో రెండో విజయంపై కన్నేయగా.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. పాక్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. పాక్‌పై ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంక.. పాక్‌పై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు. మెగా టోర్నీలో ఇరు జట్లు 7 సందర్భాల్లో ఎదురెదురుపడగా అన్ని సార్లు పాకిస్తాన్‌దే పైచేయిగా నిలిచింది. దీంతో నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాక్‌కు ఓటమి రుచి చూపించాలని శ్రీలంక జట్టు కసిగా ఉంది. మరోవైపు పాక్ ప్రపంచకప్‌లో శ్రీలంకపై తమ జైత్రయాత్రను కొనసాగించేందుకు ప్రణాళికలతో సిద్దంగా ఉంది. ఓవరాల్‌గా కూడా పాక్‌దే పైచేయి.. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై పాకిస్తాన్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 156 వన్డేల్లో తలపడగా.. పాక్ 92, శ్రీలంక 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్ టై అయ్యింది. ఈసారి లంకతో అంత ఈజీ కాదు.. ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై స్పష్టమైన ఆథిక్యం కలిగిన పాక్‌కు లంకేయులతో ఈసారి అంత ఈజీ కాదని అనిపిస్తుంది. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన చాలా రెట్లు మెరుగుపడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతి భారీ లక్ష్యన్ని (429) ఛేదిస్తూ కూడా శ్రీలంక అంత ఈజీగా చేతులెత్తేయలేదు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు పరాజయంపాలైనప్పటికీ, బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చారు. కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు అసమానమైన తెగువను చూపి భారీగా పరుగులు సాధించారు. కుశాల్ మెండిస్ (76), అసలంక (79), కెప్టెన్ షనక (68) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. లంక బ్యాటర్లు మరోసారి మెరుపులు మెరిపిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు. -
వేటు తప్పదా? ‘అతడే జట్టును ముందుండి నడిపిస్తాడు! సెలక్టర్ల నిర్ణయం ఇదే’
Asia Cup 2023- ICC ODI WC 2023: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది శ్రీలంక. గతేడాది టీ20 ఫార్మాట్లో చాంపియన్‌గా నిలిచిన దసున్ షనక బృందం.. ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ధాటికి 50 పరుగులకే ఆలౌటై చెత్త గణాంకాలు నమోదు చేసింది. వన్డే ఈవెంట్ ఆసాంతం.. ముఖ్యంగా ఫైనల్లో కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది. వేటు తప్పదంటూ వార్తలు ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్-2023కి ముందు అతడిపై వేటు వేయడం ఖాయమని.. షనక స్థానంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌ను శ్రీలంక సారథిగా నియమించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ... సెలక్టర్ల నిర్ణయం ఇదే ‘‘వరల్డ్‌కప్-2023 ముగిసేంత వరకు కెప్టెన్‌గా దసున్ షనకకే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపినట్లు న్యూస్‌వైర్ పేర్కొంది. దీంతో శ్రీలంక కెప్టెన్ మార్పు ఇప్పట్లో లేదని స్పష్టమైంది. కాగా ప్రపంచకప్‌లో అక్టోబరు 7న శ్రీలంక తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అంతకంటే ముందు సెప్టెంబరు 27న అఫ్గనిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్‌కప్ జట్టును ప్రకటించేందుకు సెప్టెంబరు 28 వరకు సమయం ఉన్న నేపథ్యంలో శ్రీలంక ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. మొన్ననే సెలక్టర్లకు థాంక్స్ చెప్పిన షనక.. మెరుగ్గానే టీమిండియాతో ఫైనల్‌కు ముందు దసున్ షనక మాట్లాడుతూ.. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్‌గా తనను నమ్మినందుకు సెలక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం సారథ్య బాధ్యతలపైనే తన దృష్టి కేంద్రీకృతం అయి ఉందని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా వన్డేల్లో షనక రికార్డు బాగుంది. 37 వన్డేల్లో 23 గెలిపించాడు. వన్డే సారథిగా దసున్ షనక విజయాల శాతం 60.5. ఈ నేపథ్యంలో అతడిపై ఇప్పట్లో వేటుపడే అవకాశం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఆసియాకప్-2023 ఫైనల్లో భారత్ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఈ ఘోర పరాభావం నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దసున్ షనకను జట్టు కెప్టెన్సీ నుంచి తొలిగించాలని శ్రీలంక క్రికెట్ భావిస్తున్నట్లు సమాచారం. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందే లంక బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని శ్రీలంక క్రికెట్ ప్రణాళికలలు సిద్దం చేస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ విషయంపై చర్చించనున్నట్లు వినికిడి. కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు శ్రీలంక జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షనక జట్టును విజయ పథంలోనే నడిపించాడని చేప్పుకోవాలి. ఇప్పటివరకు దసున్ షనక కెప్టెన్సీలో 37 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. 23 విజయాలు సాధించింది. కేవలం 14 మ్యాచ్‌ల్లోనే ఓటమి పాలైంది. కెప్టెన్‌గా అతడి విజయం శాతం 60.5గా ఉంది. అదే విధంగా షనక సారథ్యంలోనే 8 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం సాధించింది. గతేడాది ఆసియాకప్‌ను కూడా షనక నాయకత్వంలోని శ్రీలంకనే సొంతం చేసుకుంది. చదవండి: IND vs AUS: అశ్విన్.. ఆసీస్‌తో ఆడినంత మాత్రాన సరిపోతుందా?: ఇర్ఫాన్ పఠాన్ -
అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్
ఆసియాకప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. లీగ్,సూపర్-4 దశలో అదరగొట్టిన లంకేయులు.. ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.భారత పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో లంక పతనాన్ని శాసించంగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన ఫలితంగా ప్రత్యర్థి లంక కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. అంతర్జాతీయ వన్డేల్లో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. లంక బ్యాటర్లలో 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఈ దారుణ ఓటమి లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు గాయాలు కూడా శ్రీలంక క్రికెట్‌ను వెంటాడుతున్నాయి. హసరంగా, చమీరా, అవిష్క ఫెర్నాండో, థీక్షణ వంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. వీరు వరల్డ్‌కప్ సమయానికి కోలుకుంటారన్నది అనుమానమే. ఇక భారత చేతిలో ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ దసున్ షనక స్పందించాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తమ ఓటమిని శాసించాడని షనక తెలిపాడు. అతడే మా కొంపముంచాడు.. మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ పిచ్ బ్యాటర్లకు బాగా అనుకూలిస్తుందని నేను భావించాను. అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ నిర్ణయం మిస్‌ఫైర్ అయింది. వాతవారణ పరిస్ధితులు కూడా కీలక పాత్ర పోషించాయి. మేము ఇది మర్చిపోలేని రోజు. మేము మా బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుచుకుని క్రీజులో నిలదొక్కుకుని ఉండి ఉంటే బాగుండేది. కానీ అది మేము చేయలేకపోయాం. ఫైనల్లో మేము ఓడిపోయినప్పటికీ మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో సదీర, కుసల్ మెండీస్ స్పిన్నర్లను ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అదేవిధంగా ఆసలంక కూడా తన మార్క్‌ను చూపించాడు. ఈ ముగ్గురూ భారత పిచ్‌లపై కూడా అద్భుతంగా ఆడగలరు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఓడించి ఫైనల్‌కు వచ్చాం. మా బాయ్స్ గత కొంతకాలంగా బాగా రాణిస్తున్నారు. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. అయితే మా ఆటతీరుతో మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. అదే విధంగా విజేత భారత్‌కు నా అభినందనలు అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షనక చెప్పుకొచ్చాడు. చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ -
అస్సలు ఊహించలేదు.. కలలా ఉంది! పెద్ద మనసు చాటుకున్న సిరాజ్
Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ‘‘అంతా ఓ కలలా అనిపిస్తోంది. గతంలో త్రివేండ్రంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగింది. ఆరంభంలోనే నాలుగు వికెట్లు పడగొట్టాను. ఐదు వికెట్ల హాల్ నమోదు చేయలేకపోయాను. అయినా.. మన విధిరాతలో ఇలా జరగాలని రాసి ఉన్నపుడు కచ్చితంగా జరిగే తీరుతుందని నాకిప్పుడు అర్థమైంది. నమ్మలేకపోయాను నిజానికి ఈరోజు ఆరంభంలోనే వికెట్లు తీయడానికి నేను పెద్దగా ప్రయత్నించలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నేను ఎల్లప్పుడూ స్వింగ్ కోసమే చూస్తూ ఉంటా. గత మ్యాచ్‌లలో అస్సలు ఇలా లేదు. ఈరోజు మాత్రం బాల్ ఫుల్‌గా స్వింగ్ అయింది. అసలు నేనే నమ్మలేకపోయాను. అవుట్ స్వింగర్లు సంధించి ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను. బ్యాటర్లు ముందుకు వచ్చి ఆడేలా ట్రాప్ చేసి విజయవంతమయ్యాను. చాలా సంతోషంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ బౌలర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 సిరాజ్ దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతో విజృంభించిన సిరాజ్ మియా.. మొత్తంగా 7 ఓవర్ల బౌలింగ్‌లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(2) సహా కుశాల్ మెండిస్(17), సమరవిక్రమ(0), చరిత్ అసలంక(0), ధనుంజయ డి సిల్వ(4), దసున్ షనక(0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 ఇక జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేయగా.. హార్దిక్ పాండ్యా దునిత్ వెల్లలగే(8), ప్రమోద్ మదుషాన్(1), మతీశ పతిరణ(0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 15.2 ఓవర్లలో 50 పరుగులకే లంక ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్ 23, శుబ్‌మన్ గిల్ 27 పరుగులతో అదరగొట్టి 6.1 ఓవర్లలోనే విజయ లాంఛనం పూర్తి చేశారు. దీంతో టీమిండియా ఎనిమిదో సారి ఆసియా కప్ విజేతగా అవతరించింది. పెద్ద మనసు చాటుకున్న సిరాజ్ ఇక విజయానంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. తన ప్రణాళికలను పక్కాగా అమలు చేశానన్నాడు. బుమ్రా, పాండ్యాల నుంచి సహకారం అందిందని.. సమిష్టిగా రాణించి జట్టుకు విజయం అందించామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా.. తనకు లభించిన ప్రైజ్‌మనీని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద చాటుకున్నాడు సిరాజ్. కాగా కొలంబోలో వర్షాల నేపథ్యంలోనూ సిబ్బంది ఎప్పటికప్పుడు మ్యాచ్ సజావుగా సాగేలా శ్రమించిన విషయం తెలిసిందే. దీంతో వారి పట్ల ఈ విధంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు సిరాజ్. చదవండి: ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే -
సిరాజ్ సంచలనం.. తమ వరల్డ్ రికార్డును తామే బ్రేక్ చేసిన శ్రీలంక! చెత్తగా..
Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ హైదరాబాదీ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంకతో మొదలుపెట్టిన సిరాజ్ వరుసగా వన్‌డౌన్ బ్యాటర్ సదీర సమరవిక్రమ, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన చరిత్ అసలంక, ధనుంజయ డి సిల్వ, కెప్టెన్ దసున్ షనకలను పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ విశ్వరూపం.. బెంబేలెత్తిన లంక బ్యాటర్లు 12వ ఓవర్ ముగిసే సరికి ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో మెరిశాడు. జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి లంకను దెబ్బకొట్టగా.. సిరాజ్ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో సింహళీయుల జట్టు వన్డే చరిత్రలో తన పేరిట ఉన్న చెత్త రికార్డును తానే బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు ఆరు వికెట్లు కోల్పోయిన జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది. 2012లో పర్ల్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక 13 పరుగులకు ఆరో వికెట్ కోల్పోయింది. తాజాగా టీమిండియాతో ఆసియా కప్ ఫైనల్లో 12 పరుగుల వద్దే ఆరో వికెట్ పారేసుకుంది. అసోసియేట్ దేశాలు మినహా టెస్టు ఆడే జట్లలో శ్రీలంక రెండుసార్లు ఈ మేరకు ఘోర పరాభవం మూటగట్టుకోవడం గమనార్హం. కెనడా లంక చేతిలో.. లంక ఇలా కాగా 2003లో శ్రీలంకతో పర్ల్‌లో 12 పరుగులకు.. అదే విధంగా 2013లో నెట్ కింగ్ సిటీతో మ్యాచ్‌లో 10 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం సహా ప్రత్యర్థి చేతిలో ఇలా భంగపడటం రెండూ శ్రీలంక జట్టుకే చెల్లిందని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత పేసర్ల ధాటికి 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఒకటి, సిరాజ్ ఆరు, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
#lndVsSL: టాస్ గెలిచిన శ్రీలంక.. అక్షర్ అవుట్.. వాషీ ఇన్! తుదిజట్లు ఇవే
Asia Cup Final 2023- ndia vs Sri Lanka Playing XI: ఆసియా కప్-2023 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీమిండియా- శ్రీలంక టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ పటేల్ అవుట్.. వాషీ ఇన్ ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరంకాగా యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. తీక్షణ స్థానంలో అతడే మరోవైపు.. స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయంతో వైదొలగడంతో దుషాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక సారథి దసున్ షనక వెల్లడించాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగా ఉన్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నట్లువెల్లడించాడు. కాగా రోహిత్ శర్మ సైతం.. తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో కొలంబో వేదికగా ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం విశేషం. తుదిజట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్. శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరానా. చదవండి: బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్ The stage is set! It's the FINAL battle for Asian supremacy! 💥 Who'll come out on top - #India or #SriLanka? Tune-in to the final, #INDvSL in #AsiaCupOnStar Today | 2 PM | Star Sports Network #Cricket pic.twitter.com/k2FJk5egJz — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup, 2023- India vs Sri Lanka, Final: ఆసియా కప్-2023 ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమిండియాను హెచ్చరించాడు. శ్రీలంకను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై పటిష్టంగా కనిపిస్తున్న దసున్ షనక బృందాన్ని ఓడించడం అంత తేలికేమీ కాదని వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఊహించారా? కొలంబో వేదికగా ఆదివారం టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోతుందని ఊహించామా? కానీ అదే జరిగింది. అలాగే పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లా చేతిలో టీమిండియా ఓటమి కంటే పాక్ నిష్క్రమణ మరీ ఘోరం. ఏదేమైనా.. ఇప్పటికీ భారత జట్టుకు అవకాశం ఉంది. వాళ్లు ఫైనల్ ఆడబోతున్నారు. టీమిండియా సత్తాకు పరీక్ష కానీ అంతకంటే ముందే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పరాజయం వారికి కనువిప్పు కలిగించిందనే అనుకుంటున్నా. కఠినంగా శ్రమించి.. వ్యూహాలు పక్కాగా అమలు చేస్తేనే ఫైనల్లో అనుకున్న ఫలితం రాబట్టగలరు. శ్రీలంకను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. టీమిండియా సత్తాకు పరీక్ష ఇది. శ్రీలంకను తక్కువ అంచనా వేయకండి రోహిత్ సేనను ఎలాగైనా ఓడించి ట్రోఫీ గెలవాలని శ్రీలంక కాచుకుని కూర్చుంది. ప్రపంచకప్ టోర్నీకి ముందు ఏ జట్టుకైనా ఇలాంటి విజయాలు అవసరం. ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఇప్పటికైనా టీమిండియా కళ్లు తెరవాలి. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని మర్చిపోవద్దు’’ అని చెప్పుకొచ్చాడు. సమిష్టిగా రాణిస్తూ విజయపరంపర కాగా స్టార్లు ప్లేయర్లు లేకుండా.. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఒక్కో అవరోధం దాటుకుంటూ ఫైనల్ వరకూ చేరుకుంది. ఇక గతేడాది టీ20 ఫార్మాట్లో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ విజేతగా దసున్ షనక జట్టు నిలిచిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించడం శ్రీలంకకు బలం. ఈ నేపథ్యంలోనే రోహిత్ సేనను ఉద్దేశించి అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన WC 2023: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! ఆసియా కప్ పోయింది.. ఇక.. -
Ind vs SL: అభిమానులకు చేదువార్త! లంకను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక!
Asia Cup, 2023- India vs Sri Lanka, Final Predicted Playing XI: గతేడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో సూపర్-4 దశలోనే ఇంటిబాట పట్టిన టీమిండియా వన్డే ఫార్మాట్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్-2023 ఆరంభానికి ముందే అంతర్జాతీయ టైటిల్ గెలిచి అభిమానులను ఖుషీ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంకతో ఆసియా కప్-2023 ఫైనల్‌కు అన్ని రకాలుగా సిద్ధమైంది. సూపర్-4లో ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఐదు మార్పులతో బరిలోకి దిగిన భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చేదు అనుభవం విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చిన మేనేజ్మెంట్.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణను ఆడించారు. అయితే, వెస్టిండీస్‌తో టీ20లలో అదరగొట్టినప్పటికీ.. వన్డే అరంగేట్రంలో తడబడ్డాడు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ. సూర్య కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక బుమ్రా ఉన్నాడు కాబట్టి తుదిజట్టు నుంచి మరోసారి షమీకి ఉద్వాసన తప్పదు. వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్! సిరాజ్ రాకతో ప్రసిద్ తప్పుకోవాల్సిందే. కానీ బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరం కావడంతో ఇప్పటికే వాషింగ్టన్ సుందర్ శ్రీలంకకు చేరుకున్నాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్‌ను తప్పించి ఈ చెన్నై కుర్రాడిని ఆడించవచ్చు. లంక స్పిన్నర్ దూరం.. తక్కువ అంచనా వేస్తే అంతే ఇక టీమిండియా పరిస్థితి ఇలా ఉంటే.. కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ దూరం కావడం శ్రీలంక అవకాశాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అయితే, యువ స్పిన్ సంచలనం దునిత్ వెల్లలగే సూపర్‌ఫామ్‌లో ఉండటం.. అతడికి తోడుగా ఆల్‌రౌండర్లు అసలంక, ధనంజయ డి సిల్వా రాణించడం దసున్ షనక బృందానికి సానుకూలాంశాలు. కుశాల్ మెండిస్, నిసాంక, సమరవిక్రమ బ్యాట్ ఝలిపిస్తే తిరుగే ఉండదు. ఇక స్టార్లు లేకపోయిన్పటికీ ఫైనల్ దాకా చేరుకున్న.. డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను టీమిండియా లైట్ తీసుకునే పరిస్థితి లేదు. సూపర్-4 మ్యాచ్‌లోనే రోహిత్ సేనకు ఈ విషయం బాగా అర్థమైంది. టాస్ గెలిచిన జట్టు తొలుత.. ఇక కొలంబో వాతావరణం మరోసారి టీమిండియా- శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆసియా కప్‌లో కొలంబో వేదికగా జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ ఇప్పటి వరకు 15 సార్లు జరిగింది. 13 సార్లు వన్డే ఫార్మాట్లో, రెండుసార్లు టి20 ఫార్మాట్లో నిర్వహించారు. భారత్, శ్రీలంక జట్లు ఆసియా కప్ ఫైనల్స్‌లో ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగుసార్లు భారత్, మూడుసార్లు శ్రీలంక గెలుపొందాయి. ఓవరాల్‌గా ఆసియా కప్ టైటిల్‌ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. ఆరుసార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది శ్రీలంక. మరి ఈసారి ఎవరిది పైచేయి కానుందో! పిచ్, వాతావరణం గత తొమ్మిది రోజుల్లో ప్రేమదాస స్టేడియంలో ఆరు మ్యాచ్‌లు జరిగాయి. దాంతో పిచ్ మందకొడిగా మారింది. స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశముంది. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. ఆదివారం సాయంత్రం, రాత్రి వేళల్లో ఒకట్రెండుసార్లు ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు. ఒకవేళ వర్షంవల్ల ఆట సాధ్యపడకపోతే రిజర్వ్ డే సోమవారం ఫైనల్‌ను కొనసాగిస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్. శ్రీలంక: షనక (కెప్టెన్), కుశాల్ పెరీరా, నిసాంక, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వా, దునిత్ వెల్లలగే, దుషాన్ హేమంత, పతిరణ, కసున్ రజిత. చదవండి: న్యూజిలాండ్‌పై గెలుపు.. ఇంగ్లండ్‌దే సిరీస్ The big day has arrived! #India locks horns with #SriLanka in the #AsiaCup2023 final. Get ready for a cricketing spectacle! 🇮🇳🆚🇱🇰 Tune-in to #INDvSL in #AsiaCupOnStar Tomorrow | 2 PM | Star Sports Network#Cricket pic.twitter.com/R4PfMv29XR — Star Sports (@StarSportsIndia) September 16, 2023 -
Asia Cup: నిరీక్షణ ముగించాలని టీమిండియా! సమష్టిగా రాణిస్తూ శ్రీలంక
Asia Cup 2023 Final Ind VS SL: ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా మూడు అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ టోర్నీలలో భారత జట్టు విజేతగా నిలిచి ఐదేళ్లయింది. 2018లో ఆసియా కప్ టైటిల్ సాధించాక భారత జట్టు మరో టోర్నీలో చాంపియన్‌గా నిలువలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో, 2022 టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌లో ఓడిన టీమిండియా... 2019, 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతుల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టోర్నీ టైటిల్ నిరీక్షణ ముగించేందుకు భారత జట్టుకు ఆసియా కప్ రూపంలో మరో అవకాశం దక్కింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకుంటున్న శ్రీలంకతో నేడు జరిగే ఫైనల్లో టీమిండియా ‘ఢీ’కొంటుంది. తుది పోరులో గెలిచి భారత జట్టు టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందా లేదా మరికొన్ని నెలలు పొడిగిస్తుందా మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. కొలంబో: వర్షంతో దోబూచులాడిన ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. వచ్చే నెలలో మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భారత్, శ్రీలంక జట్లకు ఈ టోర్నీ ఉపయోగపడుతోంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్–4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత జట్టు ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. వాళ్లంతా వచ్చేస్తున్నారు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా ఫైనల్లో బరిలోకి దిగుతారు. అక్షర్ పటేల్ చేతి వేళ్లకు గాయం కావడంతో అతను ఫైనల్‌కు దూరమయ్యాడు. అక్షర్ పటేల్‌కు ప్రత్యామ్నాయంగా టీమ్ మేనేజ్మెంట్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను శనివారం కొలంబోకు రప్పించింది. బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఈ టోర్నీలో గిల్, కోహ్లి, రాహుల్ ఒక్కో సెంచరీ కూడా చేశారు. బౌలింగ్‌లోనూ భారత్ సమతూకంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, పాండ్యా పేస్‌తో ఆకట్టుకుంటే.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. సమష్టిగా రాణిస్తూ... ఆసియా కప్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక ఏడో టైటిల్‌పై గురి పెట్టింది. భారత్ అత్యధికంగా ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. పలువురు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా ఈ టోర్నీలో శ్రీలంక స్ఫూర్తిదాయక ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. దాసున్ షనక నాయకత్వంలో తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో కుశాల్ మెండిస్, నిసాంక, అసలంక, సమర విక్రమపై లంక ఆశలు పెట్టుకుంది. షనక, ధనంజయ డిసిల్వా, వెలలాగె ఆల్‌రౌండ్ పాత్రలను పోషిస్తారు. గాయం కారణంగా స్పిన్నర్ తీక్షణ ఫైనల్‌కు దూరమయ్యాడు. పతిరణ, కసున్ రజిత తమ పేస్‌తో భారత బ్యాటర్లను ఏమేరకు కట్టడి చేస్తారో చూడాలి. -
3 సింగిల్ డిజిట్ స్కోర్లు! అయినా నన్ను నమ్మిన సెలక్టర్లకు థాంక్స్: కెప్టెన్
Asia Cup 2023- India Vs Sri Lanka In Final: ‘‘నాయకుడిగా జట్టును ముందుకు నడిపించే సమయంలో నా బ్యాటింగ్‌తో కెప్టెన్సీని పోల్చుకోను. మిడిలార్డర్లో బ్యాటర్‌గా ఎలా ఆడాలన్న విషయం కంటే.. సారథిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం మీదే నా దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. బ్యాటింగ్ ముఖ్యం కాదని నేను చెప్పను గానీ.. ఫామ్ గురించి మర్చిపోయి కెప్టెన్‌గా ముందుకు సాగిపోతాను. ఎందుకంటే.. డెసిషన్ మేకింగ్ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నాపై నమ్మకం ఉంచిన సెలక్టర్లకు థాంక్స్ నిజానికి ఫామ్‌లేమితో సతమతమవుతున్నా.. నాపై నమ్మకం ఉంచిన సెలక్టర్లకు ధన్యవాదాలు. అదే విధంగా నాలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఎప్పుటికప్పుడు సహాయసహకారాలు అందిస్తు కోచింగ్ సిబ్బందికి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఆటగాడిగా విఫలమవుతున్నా.. నాయకుడిగా రాణించడానికి వీరే కారణం. అందుకే వాళ్లందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక అన్నాడు. బ్యాటర్‌గా విఫలమవుతున్నా.. తనపై విశ్వాసం ఉంచి, అండగా నిలుస్తున్న సెలక్టర్ల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు కాగా ఆసియా కప్-2023లో అసాధారణ పోరాటంతో ఫైనల్‌కు చేరింది శ్రీలంక. సమిష్టిగా రాణిస్తూ.. సెప్టెంబరు 17న టీమిండియాతో కొలంబో వేదికగా తలపడేందుకు సిద్ధమైంది. అయితే, ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు కెప్టెన్ దసున్ షనక బ్యాట్ ఝులిపించకపోవడం కాస్త జట్టును కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఈ ఆల్‌రౌండర్ ఆరు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు కేవలం 54. అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లే ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 14 నాటౌట్, అఫ్గనిస్తాన్‌పై 5, బంగ్లాదేశ్ మీద 24, టీమిండియాపై 9, పాకిస్తాన్‌పై 2 పరుగులు మాత్రమే సాధించాడు. నాయకుడిగా సూపర్ హిట్ అయితే, బ్యాటర్‌గా విఫలమైనా.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును విజయవంతంగా ముందుకు నడిపించడంలో మాత్రం సఫలమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడి అండర్‌డాగ్స్‌గా ఆసియా కప్ బరిలోకి దిగిన లంకను ఫైనల్‌కు తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో తుదిపోరుకు ముందు మీడియాతో మాట్లాడిన దసున్ షనక.. తన బ్యాటింగ్ వైఫల్యాల గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఆటగాడిగా కంటే నాయకుడిగా రాణించడం మీదే ఎక్కువగా దృష్టి సారించానని పేర్కొన్నాడు. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ WATCH: Dasun Shanaka previews Asia Cup 2023 Finals against Indiahttps://t.co/vdpKwgkdrm #AsiaCup2023 #SLvIND — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2023 -
మేము పాకిస్తాన్‌కు ఛాన్స్ ఇచ్చాం.. కానీ మా వాడు అదరగొట్టాడు: షనక
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: ‘‘ముందు నుంచి మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అయితే, వికెట్లు పడుతూ ఉండటం వల్ల చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. తిరిగి పుంజుకునేందుకు మేము పాకిస్తాన్‌కు అవకాశం ఇచ్చాము. కానీ.. చరిత్ అసలంక మమ్మల్ని గెలిపిస్తాడని మాకు ముందే తెలుసు. టీమిండియాతో మ్యాచ్‌లో తప్పిదాలు బ్యాటింగ్‌కు వెళ్లే ముందు.. టీమిండియాతో మ్యాచ్‌లో మేము చేసిన తప్పిదాల గురించి చర్చించుకున్నాం. మొదటి 10 ఓవర్లలో వికెట్లు పారేసుకున్నాం. ఏదేమైనా కుశాల్, సదీర అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వారిద్దరు శ్రీలంక జట్టులో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లు. అయితే, ఆఖరి వరకు చరిత్ పట్టుదలగా పోరాడిన తీరు ప్రశంసనీయం’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక హర్షం వ్యక్తం చేశాడు. వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు. అదరగొట్టిన కుశాల్, సదీర ఆసియా కప్-2023 సూపర్-4 దశలో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే. కొలంబోలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లంక టార్గెట్ 252గా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(91), నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సదీర సమరవిక్రమ(48) అద్భుత ఇన్నింగ్స్‌తో లంక గెలుపునకు బాటలు వేశారు. అసలంక ఆదుకున్నాడు అయితే, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో మిగతా వాళ్లంతా విఫలం కాగా ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో ఒత్తిడిని జయించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసియా కప్‌లో శ్రీలంక ఏకంగా 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్‌కు చేరింది. గతేడాది చాంపియన్ శ్రీలంక.. ఈసారీ ఫైనల్లో ఇక ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ దసున్ షనక కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీలో శ్రీలంక చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఈసారి ఫిఫ్టీ ఓవర్ల ఫార్మాట్లో సెప్టెంబరు 17న టీమిండియాతో ఫైనల్లో దసున్ షనక బృందం తలపడనుంది. చదవండి: అతడు ఆడాలంటే కోహ్లి ఉండొద్దు.. రోహిత్ మాత్రం: భారత మాజీ బ్యాటర్ మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 -
Asia Cup: మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు లంక! పాక్ సంగతి అంతే ఇక..
కొలంబో: ఆసియా కప్‌లో ‘సెమీఫైనల్’లాంటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్–4 దశలో భాగంగా నేడు జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్తాన్ తలపడుతుంది. రెండు వరుస విజయాలతో భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించగా... భారత్‌తో తుది పోరులో తలపడే ప్రత్యర్థిని ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. నాలుగో జట్టయిన బంగ్లాదేశ్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లోకి అడుగు పెడుతుంది. భారత్ చేతిలో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు రన్‌రేట్‌లో పాక్ భారీగా వెనుకబడగా... టీమిండియా చేతిలో ఓడినా చివరి వరకు పోరాడిన లంక మెరుగైన స్థితిలో ఉంది. వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే లంక లాభపడుతుంది. మెరుగైన రన్‌రేట్‌తో ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది. బలాబలాల దృష్ట్యా చూస్తే పాకిస్తాన్, శ్రీలంక సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే సొంతగడ్డపై లంకకు అదనపు ప్రయోజనం ఉంది. భారత్‌తో పోరులో పాక్ పేలవ బ్యాటింగ్ బయటపడింది. ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్ అంతంత మాత్రమే ఆడుతుండగా, వరల్డ్ నంబర్‌వన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ దానికి తగినట్లుగా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. మిడిలార్డర్లో రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తికార్ కూడా జట్టు ఆశించిన రీతిలో స్కోర్లు చేయలేకపోతున్నారు. అయితే అన్నింటికంటే మించి ప్రధాన బౌలర్లు హారిస్ రవూఫ్, నసీమ్ షా ఈ మ్యాచ్‌కు దూరం కావడం పాక్‌కు పెద్ద దెబ్బ. నసీమ్ అధికారికంగా తప్పుకోగా అతని స్థానంలో జమాన్‌ను ఎంపిక చేశారు. రవూఫ్ కూడా ఆడే తక్కువగా ఉండటంతో దమాని బరిలోకి దిగవచ్చు. పాక్ స్పిన్ కూడా బలహీనంగా ఉంది. మరోవైపు లంక స్పిన్ బలమేంటో గత మ్యాచ్‌లో కనిపించింది. ఇదే జోరు కొనసాగిస్తే పాక్‌ను ఆ జట్టు సునాయాసంగా అడ్డుకోగలదు. వెలలాగె, అసలంక, తీక్షణలను పాక్ ఎలా ఆడుతున్నది చూడాలి. ప్రధానంగా కుశాల్ మెండిస్, నిసాంక, సమరవిక్రమ, ధనంజయలపై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్‌గా కెపె్టన్ షనక కీలక ప్రదర్శన చేయాల్సి ఉంది. 155 ఇప్పటి వరకు శ్రీలంక, పాకిస్తాన్ జట్లు 155 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 92 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, 58 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. -
Ind vs SL: అస్సలు ఊహించలేదు.. కోహ్లి వికెట్ తీశాడు.. కానీ!
Asia Cup 2023- India vs Sri Lanka: ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమిపై శ్రీలంక కెప్టెన్ దసున్ షనక స్పందించాడు. కొలంబో వికెట్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని భావించామని.. కానీ అనూహ్యరీతిలో బంతి టర్న్ అయిందని పేర్కొన్నాడు. ఇక దునిత్ వెల్లలగే అద్భుతం చేయగలడని తాను ముందే ఊహించానన్న షనక.. అందుకు తగ్గట్లే అతడి ఆట తీరు కొనసాగిందని హర్షంవ వ్యక్తం చేశాడు. అదే విధంగా చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. టాపార్డర్‌ను కుదేలు చేసిన వెల్లలగే కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని.. లంకను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. వెల్లలగే ఐదు, అసలంక నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణకు ఒక వికెట్ దక్కింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(53)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. 49.1 ఓవర్లలో టీమిండియా 213 పరుగులు చేయగలిగింది. అసలంక, ధనంజయ పోరాడినా లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను స్పిన్ ఆల్‌రౌండర్లు చరిత్ అసలంక(22), ధనంజయ డి సిల్వ(41) ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్ల ధాటికి లంక జట్టు 172 పరుగులకే చాపచుట్టేయగా.. 41 పరుగులతో గెలిచి రోహిత్ సేన ఫైనల్‌కు చేరింది. కాగా ఈ ఓటమితో వరుసగా 13 వన్డే విజయాలు సాధించిన షనక బృందం జోరుకు బ్రేక్ పడింది. బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ నేపథ్యంలో దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘వికెట్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. బ్యాటింగ్ పిచ్ అనుకున్నాం.. కానీ అలా జరుగలేదు. వెల్లలగే అద్భుతంగా రాణించాడు. ధనంజయ, అసలంక కూడా గొప్పగా బౌలింగ్ చేశారు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అందుకే టీమిండియాతో మ్యాచ్లోనాకు వారిద్దరి రూపంలో రెండు మంచి స్పిన్ ఆప్షన్లు కనిపించాయి’’ అని పేర్కొన్నాడు. ఇక వెల్లలగే అద్భుతంగా ఆడగలడని అంచనా వేశానన్న షనక.. అతడు విరాట్ కోహ్లి వికెట్ తీయడం ప్రత్యేకమని హర్షం వ్యక్తం చేశాడు. ఈరోజు వెల్లలగేదే అంటూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో వెల్లలగే శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి(3), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వికెట్లు తీశాడు.ఘ తదుపరి పాకిస్తాన్‌తో చావోరేవో ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో చావోరేవో తేల్చుకోనుంది. గురువారం నాటి ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లంక ఫైనల్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? Sri Lanka's young sensation finishes with a maiden five-for🤩#INDvSL📝: https://t.co/PCYHPHAr6B pic.twitter.com/dLKo0UrIJc — ICC (@ICC) September 12, 2023 -
Ind vs SL: శ్రీలంక పై భారత్ విజయం
Asia Cup, 2023 India vs Sri Lanka, Super 4 Updates: ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టార్గెట్ 214 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక 172 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీతో (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (42: 46 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్కోర్లు: భారత్ 213(49.1), శ్రీలంక 172 (41.3) ASIA CUP 2023. India Won by 41 Run(s) https://t.co/P0ylBAiETu #INDvSL — BCCI (@BCCI) September 12, 2023 తొమ్మిదవ వికెట్ కోల్పోయిన శ్రీలంక 172 పరుగుల వద్ద శ్రీలంక తొమ్మిదవ వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రజిత ఔటయ్యాడు. ఎనిమిదవ వికెట్ కోల్పోయిన శ్రీలంక 171 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదవ వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి మహేష్ తీక్షణ (2) ఔటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక 162 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి ధనుంజయ్ డిసింగ్వా (41) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక 99 పరుగుల వద్ద శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి షనక (9) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 73 పరుగులకే శ్రీలంక సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ పట్టడంతో అసలంక (22) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రాహుల్ స్టంపింగ్ చేయడంతో సమరవిక్రమ (17) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 73/4. అసలంక (22), ధనంజయ డిసిల్వ (5) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన శ్రీలంక స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడుతుంది. కేవలం 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి కుశాల్ మెండిస్ (15) ఔట్ కాగా.. సిరాజ్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నే (2) పెవిలియన్ బాటపట్టాడు. 7.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 25/3. బుమ్రా 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. టార్గెట్ 214.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 214 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (6) ఔటయ్యాడు. తిప్పేసిన లంక స్పిన్నర్లు.. 213 పరుగులకే ఆలౌటైన భారత్ లంక స్పిన్నర్లు దునిత్ వెల్లలగే (5/40), చరిత్ అసలంక (4/18) ధాటికి భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ (26) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటింది. వరణుడి ఆటంకం సమయం సాయంత్రం 06:23 నిమిషాలు: టీమిండియా- శ్రీలంక మ్యాచ్‌కు వరణుడి ఆటంకం. వర్షం కారణంగా ఆట నిలిపి వేసే సమయానికి 47 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 197 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 15, సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 42.2: వరుసగా రెండో వికెట్ తీసిన అసలంక. కుల్దీప్ యాదవ్ డకౌట్ ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 42.1: అసలంక బౌలింగ్‌లో బుమ్రా(5) బౌల్డ్ 40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 180-7 అక్షర్, బుమ్రా క్రీజులో ఉన్నారు. ఏడో వికెట్ డౌన్ 38.5:అసలంక బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన జడేజా(4) 35.6:వెల్లలగేబౌలింగ్లో పాండ్యా(5) అవుట్ ఐదో వికెట్ కోల్పోయిన భారత్ 34.2: అసలంక బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(33) అవుట్. పాండ్యా, జడేజా క్రీజులో ఉన్నారు. స్కోరు: 172/5 (35.5) FIFTY UP! 👏🏻😍 Back to back half centuries for #TeaIndia skipper, @ImRo45! Will he notch up his 31st 💯 today? 👀 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/N9eImshbuf — Star Sports (@StarSportsIndia) September 12, 2023 29.6: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న రాహుల్‌ను వెల్లలగే బౌల్డ్ చేశాడు. దీంతో 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు నిష్క్రమించాడు. ఇషాన్ కిషన్(24), హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. స్కోరు: 154-4(30) 25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 128-3 కేఎల్ రాహుల్18, ఇషాన్ కిషన్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 109-3 రోహిత్ శర్మ అవుట్ 15.1: లంక స్పిన్నర్ వెల్లలగే ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కోహ్లి వికెట్ తీసిన తన మరుసటి ఓవర్లోనే రోహిత్(53)ను బౌల్డ్ చేశాడు. స్కోరు: 91/3. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13.5: లంక యువ స్పిన్నర్ వెల్లలగే మరోసారి మెరిశాడు. తొలుత గిల్ వికెట్ తీసిన అతడు.. ఈసారి ఏకంగా కింగ్ కోహ్లిని అవుట్ చేశాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి షనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ హాఫ్ సెంచరీ 12.2: బౌండరీతో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న రోహిత్ శర్మ. 44 బంతుల్లో 51 పరుగులు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 11.1: శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వెల్లలగే బౌలింగ్‌లో గిల్(19) బౌల్డ్ అయ్యాడు. కోహ్లి, రోహిత్ క్రీజులో ఉన్నారు. ►10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 65/0 వారెవ్వా హిట్‌మ్యాన్ 6.5: కసున్ రజిత బౌలింగ్‌లో సిక్స్ బాది రోహిత్ శర్మ వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ►6 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 31/0 రోహిత్ 17, గిల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►2 ఓవర్లలో టీమిండియా స్కోరు: 10-0. రోహిత్ శర్మ 7, గిల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అక్షర్‌కు పిలుపు.. అతడు అవుట్ ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్ స్థానంలో అక్షర్‌కు చోటిచ్చినట్లు టీమిండియా సారథి రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ శ్రీలంక: పాథుమ్ నిస్సాంకా, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లగే, మహీష్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ 15 గంటలలోపే మళ్లీ పాకిస్తాన్‌తో రిజర్వ్ డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తిరిగి 15 గంటలలోపై మళ్లీ మ్యాచ్‌కు సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో రోహిత్ సేన శ్రీలంకతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా విశ్రాంతినిచ్చే అవకాశం ఉందా? భారత తుది జట్టులో ఎవరెవరుంటారు అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. కాగా భారత్- లంక మ్యాచ్ కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్న విషయం తెలిసిందే. -
శ్రీలంక లయన్స్ వర్సెస్ బంగ్లా టైగర్స్.. గెలుపెవరిది?
ఆసియాకప్-2023లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా క్యాండీ వేదికగా గురువారం శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓ లూక్కేద్దం శ్రీలంక.. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు ఆతిథ్య శ్రీలంక వరుస షాక్‌లు తగిలాయి. దుష్మంత చమీర, లహిరు కుమార, దిల్షన్ మధుశంక, వనిందు హసరంగ, అవిష్క ఫెర్నాండో వంటి స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. బ్యాటింగ్ పరంగా లంక పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పేలవంగా ఉంది. లహురు కుమారా,థీక్షణ మినహా పెద్దగా అనుభవం ఉన్న బౌలర్లు లేరు. యువ సంచలనంచ,పేసర్ మతీషా పతిరానా అద్బుతమైన ఫామ్‌లో ఉండడం లంకకు కలిసిచ్చే ఆంశం. అదే విధంగా స్వదేశంలో శ్రీలంకకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా ఆడిన 5 వన్డేల్లోనూ లంక విజయం సాధించింది. సొంత గడ్డపై ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న లంక.. వన్డే ప్రపంచకప్ క్వాలిఫియర్స్లోనూ దుమ్మురేపింది. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్‌ను శ్రీలంకనే సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బంగ్లా జట్టు తమ ఆఖరి రెండు వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లా జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్ కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో అనముల్ హక్కు అవకాశం ఇచ్చారు. లిట్టన్ దాస్ దూరమైనప్పటికీ అఫీఫ్ హొస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, తోవిద్ హృదయ్ రూపంలో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా బౌలింగ్‌లో కూడా టాస్కిన్ అహ్మద్, ముస్తిఫిజర్ రెహ్మన్, షకీబ్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. వీరి చెలరేగితే లంక బ్యాటర్లకు కష్టాలు తప్పవు. తుది జట్లు(అంచనా) బంగ్లాదేశ్ అఫీఫ్ హొస్సేన్, నయీమ్ షేక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తోవిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్ శ్రీలంక పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, మతీశ పతిరణ చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
LPL 2023: చెలరేగిన కుశాల్ పెరీరా.. ఫైనల్లో డంబుల్లా
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 17) జరిగిన క్వాలిఫయర్-1 ఫలితంతో ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మరో బెర్త్ కోసం ఇవాళే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వాలిఫయర్-1 విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌పై డంబుల్లా ఔరా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో లసిత్ ఒక్కడే రాణించగా.. మిగతావారంతా చేతులెత్తేశారు. షకీబ్ (19), షనక (12), లహీరు సమరకూన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. డంబుల్లా బౌలర్లలో హేడెన్ కెర్ 3, నూర్ అహ్మద్ 2, ఫెర్నాండో, హసన్ అలీ, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కుశాల్ పెరీరా (53), కుశాల్ మెండిస్ (49) రాణించగా.. అవిష్క షెర్నాండో (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టైటాన్స్ బౌలర్లలో షకీబ్, ప్రసన్న, షంషి, షనక తలో వికెట్ పడగొట్టారు.