dcm
-
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై హైదరాబాద్ లో కేసు
-
KSR: పవన్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?.. ప్రభుత్వంలో ఉంది మీరే కదా
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం..
వరంగల్: భూపాలపల్లి–కాటారం జాతీయ ప్రధాన రహదారిపై మల్లంపల్లి క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం వైపు నుంచి భూపాలపల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సును కాటారం వైపునకు వెళ్తున్న డీసీఎం ఢీకొంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మహాముత్తారం మండలం కనూకునూరుకు వెళ్లి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో మల్లంపల్లి క్రాస్ సమీపంలో భూపాలపల్లి వైపు నుంచి వస్తున్న డీసీఎం.. ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొంది. దీంతో డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు నలుగురు తీవ్రంగా, మరో 11 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్‌కు తరలించారు. ఆదివారంపేటకు చెందిన అతుకూరి సమ్మక్క, లావణ్య(ములుగుపల్లి), రాజేశ్వరి(కాటారం), లక్ష్మి (ముప్పారం) గ్రామాలకు చెందిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు కండక్టర్ ఎండీ హమీద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. కాగా, క్షతగాత్రులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ నవీన్‌కుమార్‌ను ఆదేశించారు. -
అదుపుతప్పి స్కూల్ విద్యార్థులపైకి దూసుకెళ్లిన డీసీఎం
-
హైదరాబాద్ ఆల్వాల్ లో డీసీఎం వ్యాన్ బీభత్సం
-
ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా?
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్తిపేట కమాన్ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఈర్ల ప్రేమ్‌కుమార్(28) కరీంనగర్లో ఉంటూ ఫ్లిప్‌కార్ట్ సంస్థలో డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి భూపాలపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రేగొండ మండలం భాగిర్తి పేట కమాన్ శివారులో భూపాలపల్లి నుంచి పరకాల వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రేమ్‌కుమార్ క్యాబిన్‌లోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లు వీరబోయిన రమేష్, మురళితో పాటు ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రేగొండ ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, తీగల మాధవ్ ఘటనా స్థలికి చేరుకుని ప్రేమ్‌కుమార్ మృతదేహాన్ని డీసీఎం క్యాబిన్ నుంచి బయటకు తీసి పరకాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈఘటనపై మృతుడి సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొగ మంచు, అతివేగమే కారణం? పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి పొగ మంచు, అతివేగమే కారణమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండడంతో వాహనాల వేగం ఎక్కువగా ఉంటుందని, దీనికి తోడు పొగ మంచుతో దారి, ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, భాగిర్తిపేట కమాన్ శివారు ప్రమాదాలకు అడ్డగా మారుతోంది. ఏటా కమాన్ సమీపంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి చదవండి: ఇద్దరు తీవ్ర నిర్ణయం! బావిలో దూకి.. -
ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో ఇరువురి పరిస్థితి విషమం
సాక్షి, ఎర్రవల్లి చౌరస్తా/ బాన్సువాడ టౌన్ (బాన్సువాడ): దైవదర్శనానికి కారులో వెళ్తున్న ఓ కుటుంబం జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటిక్యాల మండలంలోని ధర్మవరం స్టేజీ సమీపంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కోదండాపురం ఎస్ఐ వెంకటస్వామి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ప్రకాష్, భార్య లక్ష్మి(50), కూతుళ్లు శిరీష(21), మానసతో కలిసి తిరుపతి దర్శనం కోసం శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఇటిక్యాల మండలంలోని ధర్మవరం స్టేజీ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను వెనక నుంచి కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి, శ్రీలత తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రకాష్, మానసలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. ఈ ఘటనపై మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దైవ దర్శనానికి వెళ్తుండగా తల్లి, సోదరి మృతిచెందడంతో మానస కన్నీరుమున్నీరైంది. ప్రకాష్ మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రకాష్‌కు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె వివా హం కాగా శిరీష, మానస చదువుకుంటున్నారు. -
హృదయ విదారకర ఘటన: తండ్రి కళ్లెదుటే కొడుకు, కూతురు మృతి
సాక్షి, ఉండవెల్లి (మహబూబ్‌నగర్): ముక్కుపచ్చలారని చిన్నారులు.. తండ్రితో కలిసి నాన్నమ్మ, తాతయ్యలను చూసేందుకు బైక్‌పై ఎంతో ఆనందంగా బయలుదేరారు. మరికొద్దిసేపట్లో వారిని చేరుకుంటామనగా. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన డీసీఎం వారి ఆశలను ఆవిరి చేసింది. క్షణకాలంలో ఊపిరిని అనంత వాయువులో కలిపేసింది. కళ్లెదుటే కన్నబిడ్డలు ఇద్దరూ కాలం చెందడంతో ఆ తండ్రి విలవిలలాడిపోయాడు. ఈ హృదయ విదారకరమైన సంఘటన పుల్లూరు శివారులో చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఎదురుగా రావడంతో.. మానవపాడు మండలం చెన్నిపాడుకు చెందిన రవికుమార్, పుష్పలత దంపతులకు ముగ్గురు సంతానం. అఖిల్(12), రిషి(10), దీక్షిత(6) ఉన్నారు. వీరిలో చిన్నకొడుకు రిషి, దీక్షితలను రవికుమార్ తల్లిదండ్రులు ఉన్న ఈ.తాండ్రపాడులో వదిలిపెట్టి.. తాను ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతుండగా ట్రాక్టర్ ఎదురుగా వచ్చింది. దీంతో ట్రాక్టర్‌కు కుడివైపు బైక్‌ను తిప్పడంతో డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న చిన్నారులు కింద పడటంతో వారి తలపై డీసీఎం టైర్లు పోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రికి ఎలాంటి గాయాలు కాలేదు. నేషనల్ హైవే సిబ్బంది మృతదేహాలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను చెన్నిపాడుకు తరలించారు. ఈ ఘటనపై రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. -
‘మంట’ పుట్టిస్తున్న సూరీడు..!
సాక్షి, హైదరాబాద్ : ఎండ చండప్రచండమై మండుతోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో ఓవైపు జనం పిట్టల్లా రాలిపోతుండగా.. మరోవైపు వాహనాలు కూడా నిప్పుల్లో కలిసిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనం వద్ద ఆమనగల్ నుంచి షాద్‌నగర్ వైపు అట్టల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిండా అట్టలు ఉండటంతో క్షణాల్లో మంటలు వాహనమంతా వ్యాపించాయి. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనం దిగి ప్రాణాలు నిలుపుకున్నారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. అయితే, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం జరిగింది. ఇక అదే రోజు కోదాడ మండలం తోగర్రాయి వద్ద కూడా ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ప్రయాణికులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు (చదవండి : షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్దం) -
డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం
చాంద్రాయణగుట్ట: బ్రేకులు ఫెయిలై డీసీఎం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎస్సై మోజీరాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఫారూఖ్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గురువారం సాయంత్రం ఛత్రినాకలో ప్రయాణికులను దింపి....కందికల్ ఆర్వోబీ దిగువన యూటర్న్ తీసుకుంటుండగా బియ్యం లోడ్‌తో వస్తున్న డీసీఎం వ్యాన్ బ్రేక్‌లు పెయిల్ కావడంతో బస్సును వెనుక వైపు ఢీ కొట్టింది. ఈ ఘటనతో బస్సు కండక్టర్ నరేష్ తలకు స్వల్ప గాయమైంది. క్యాబిన్లో ఇరుక్కుని డీసీఎం బురాన్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్రినాక పోలీసులు, ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన వారిని బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సొరంగంలో దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి, సిద్దిపేట: రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ప్రాజెక్టు సొరంగ మార్గంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని, ప్రాజెక్టులో పనిచేస్తున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన కార్మికుడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది విద్యార్థులు, 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్ మూడవ సంవత్సరం చదువుతున్న 73 మంది విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ నిమిత్తం గురువారం కళాశాల నుంచి రంగనాయక సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తవ్విన సొరంగ మార్గం గుండా సంప్, పంప్‌హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ ఇంజనీర్లనుంచి వివరాలు తెలుసుకుని సొరంగం నుంచి పైకి వచ్చేందుకు విద్యార్థులు వాహనం వద్దకు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలోనే టన్నెల్లో పనిచేస్తున్న కార్మికులను మధ్యాహ్న భోజనం కోసం పైకి తీసుకొచ్చేందుకు డీసీఎం వాహనం తీసుకొచ్చారు. అయితే నిలిపి ఉన్న ఈ వాహనం టైర్ల కింద సపోర్టు కోసం ఎలాంటి రాయి పెట్టలేదు. దీంతో కూలీలు డీసీఎం ఎక్కుతుండగా.. అప్పుడే అటు నుంచి నడుచుకుంటూ వస్తున్న విద్యార్థులపైకి డీసీఎం దూసుకెళ్లగా పలువురు విద్యార్థులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ సంఘటనలో సిద్దిపేట పట్టణానికి చెందిన నాగలక్ష్మి(18), కశ్మీర్‌లోని జోడా గ్రామానికి చెందిన మహ్మద్ అక్రం (25) డీసీఎం కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది విద్యార్థులకు, ఎనిమిది మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో అక్కన్నపేటకు చెందిన అనూహ్య(18) వెన్నెముకకు దెబ్బతగలడంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. అదేవిధంగా చర్ల వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన ఉమారాణి (19) కాలు విరిగింది. దుబ్బాక మండలం దివ్య(18), వెల్దుర్తి మండలం చార్లపల్లికి చెందిన జి.దివ్య(18), ముస్తాబాద్‌కు చెందిన స్రవంతి(18), దుబ్బాక మండలం ఆరేపల్లికి చెందిన నవ్య(18), బస్వాపూర్‌కు చెందిన తేజ(19), భార్గవి(18), హుస్నాబాద్ మండలం గండిపల్లికి చెందిన మానస(18), గజ్వేల్‌కు చెందిన లావణ్య(19), కొండపాకకు చెందిన శ్రావణి(18), సంపూర్ణ(18), కానుగల్లుకు చెందిన వెంకటలక్ష్మీ(18), అదేవిధంగా అఖిల(18), రమ్య(19), శ్రావణి(18)లకు గాయాలు కాగా సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నేనూ చచ్చిపోతా... ‘నాకు చిట్టి (నాగలక్ష్మి) అంటే ప్రాణం. నాన్న చనిపోయాడు.. వద్దు బిడ్డా ఇంటి వద్దే ఉండూ అన్నా.. వినకుండా కాలేజీకి పోయింది. ఇప్పుడు శవంలా వచ్చింది. నేను ఎవరికోసం బతకాలి, నా చిట్టి నాకు కావాలి లేకుంటే నేనూ చచ్చిపోతా’ అంటూ ఆçస్పత్రిలో మృతురాలి తల్లి సుజాత రోదిస్తున్న తీరు అందరిని కలిచివేసింది. తండ్రి చనిపోయిన పదిరోజులకే.. సిద్దిపేటజోన్: పది రోజుల క్రితమే నాగలక్ష్మి తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు లేకపోవడంతో ఉన్న ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురుగా తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. బుధవారం తండ్రి దశదిన కర్మను దగ్గరుండి చేపట్టింది. ఇంతలోనే విధి మళ్లీ ఆ కుటుంబంపై పగ పట్టింది. పదిరోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో రెండు చావులు చోటుచేసుకోవడంతో నాగలక్ష్మి తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. హరీశ్‌రావు పరామర్శ ప్రమాద విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆసుపత్రికి వచ్చి బాధి తులను పరామర్శించారు. గాయాలైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలు నాగలక్ష్మి తల్లి సుజాతను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చా రు. తక్షణ సాయంగా రూ. లక్ష అందజేశారు. వెన్నెముకకు దెబ్బతలిగిన అనూహ్య తల్లిదండ్రులకు రూ.50 వేలు అందజేశారు. ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయిస్తామని చెప్పారు. గాయపడిన విద్యార్థులకు తక్షణసాయంగా రూ.10 వేలు చొప్పున అందజేస్తామన్నారు. -
ట్రాన్స్‌పోర్టు డీసీఎం సోదా
లింగాల (అచ్చంపేట) : హైదరాబాద్ నుంచి మండల కేంద్రమైన లింగాలకు వచ్చిన ట్రాన్స్‌పోర్టు డీసీఎంను బుధవారం ఆకస్మికంగా ఎస్సైజ్ శాఖ వారు సోదాలు నిర్వహించారు. డీసీఎంలో హైదరాబాద్ నుంచి సారాకు వినియోగించే బెల్లం రవాణా అవుతుందన్న సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు జరిపారు. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న వివిధ నిత్యావసర సరకులను కిందకు దింపి పరిశీలించడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. సోదాలను వ్యాపారులు, ప్రజలు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. డీసీఎం నుంచి దాదాపు 180 కిలోల బెల్లాన్ని ఎక్సైజ్ శాఖ వారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. అలాగే విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యాపారులపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చేశామన్నారు. ఇదిలా ఉండగా సోదాలను ఖండిస్తూ వ్యాపారులు దుకాణాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. తాము ప్రజలు నిత్యం వాడుకునే తెల్లబెల్లం మాత్రమే విక్రయిస్తున్నామన్నారు. వ్యాపారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. -
డీసీఎం శ్రీరామ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ తయారీ లైసెన్స్
న్యూఢిల్లీ: డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ తాజాగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, మానవ రహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), ఇతర ప్రొడక్టుల తయారీకి సంబంధించి కేంద్రం నుంచి లైసెన్స్ పొందింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) నేతృత్వంలోని ఆర్మ్స్ లైసెన్స్ అథారిటీ నుంచి ఇండస్ట్రియల్ లైసెన్స్ లభించిందని సంస్థ రెగ్యులేటరీకి తెలిపింది. వార్షికంగా వివిధ విభాగాల్లో ఉపయోగించే సాయుధ వాహనాలు, ప్రత్యేక వాహనాలు సహా 3,000 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్‌ను తయారు చేస్తామని పేర్కొంది. అలాగే గ్రౌండ్ డేటా టర్మినల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్స్, లాంచర్లతోపాటు 500 యూఏవీలను కూడా రూపొందిస్తామని తెలిపింది. కాగా కంపెనీ చెక్కర, ఇండస్ట్రియల్ ఫైబర్, రసాయనాలు వంటి విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
నల్గోండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 20మందికి గాయాలు
-
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన బస్సు
మూసాపేట (దేవరకద్ర): రిపేరు కోసం ఆగిన బొలెరో వాహనాన్ని కర్నూలు జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దానిని తప్పించబోయి ఆ పక్క నుంచే కూరగాయల లోడుతో వస్తున్న మరో డీసీఎం వాహనం బోల్తా పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున మూసాపేటలోని హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా నుంచి వస్తున్న హైటెక్ బస్సు తెల్లవారుజామున మూసాపేట హనుమాన్ జంక్షన్ సమీపంలోకి రాగానే రిపేరు నిమిత్తం రోడ్డు పక్కనే ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో బోల్తా పడింది. దానిని తప్పించబోయి వె నక నుంచే వస్తున్న డీసీఎం వాహనం బోల్తా పడింది. గురువా రం ఉదయం ఎల్అండ్టీ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా పడిన డీసీఎం వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్పగాయాలవడంతో ఎల్అండ్టీ సిబ్బంది అంబులెన్స్‌లో వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు బొలెరో వాహన యజమానిపై మూసాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు తెగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం మూసాపేట (దేవరకద్ర): హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సంఘటన మూసాపేటలోని హనుమాన్ జంక్షన్ దగ్గర గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా.. మూసాపేట పోలీసుస్టేషన్ ముందు నుంచి లాగిన 11 కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి జాతీయ రహదారిపై పడటంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి గాలి దుమారం లేకుండానే తీగలు తెగిపడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మూసాపేట పోలీసులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం చేరవేసి సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఘటనా స్థలానికి విద్యుత్ అధికారులు వచ్చి తీగలను తొలగించడంతో పోలీసులు ఇరువైపులా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండటలం వెలిమినేడు శివారులో సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతిచెందారు. దీంతోపాటు డీసీఎంలో తరలిస్తున్న 55 గొర్రెలు మృతిచెందాయి. -
డీసీఎం ఢీకొట్టడంతో కారు దగ్ధం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఆటోనగర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- డీసీఎం ఢీకొట్టిన సంఘటనలో డీసీఎం డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు దగ్ధమైంది. కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గేటు వేయకుండానే రాకపోకలు !
దేవరకద్ర: దేవరకద్రలోని రైల్వేగేట్‌ను సోమవారం రాత్రి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దీంతో గేటు ఓ పక్కకు వంగి పోయింది. ఈ సందర్భంగా సైరన్ అదేపనిగా మోగడంతో రైల్వే గేట్ పడుతుందేమోనని వాహనదారులు ఉరుకులు, పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వచ్చి సైరన్‌ను నిలిపివేశారు. అలాగే, వంగిపోయిన గేటు మరమ్మతులకు యత్నించగా పనులు పూర్తికాలేదు. దీంతో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను కాషన్ సిగ్నల్‌తో నడిపించారు. గేట్ వేయకుండానే సిగ్నల్ ఇస్తూ రైళ్లను ముందుకు కదిలించారు. కాగా, రాత్రి పొద్దుపోయే వరకు కూడా గేటు మరమ్మతు పూర్తికాకపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
బస్సు-డీసీఎం ఢీ, ఐదుగురికి గాయాలు
-
మూసాపేటలో డీసీఎం బీభత్సం
హైదారాబాద్: నగరంలోని మూసాపేట ఐడీఎల్ చెరువు కట్టపై ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో జ్యోతి(45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. రమ, ఉష, పుష్ప, కిశోర్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఇంట్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం
కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం కీసరలో శుక్రవారం తెల్లవారుజామున డీసీఎం బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టి.. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. డీసీఎంలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి గన్నవరం గొర్రెల సంతకు వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యలమంచిలికి చెందిన ఎస్కే సుభాని గన్నవరం నుంచి గొర్రెలు తీసుకెళ్లడానికి తన డీసీఎం వాహనంలో ఓ డ్రైవర్‌తో పాటు వచ్చాడు. ఈ క్రమంలో కీసర వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుభాని మృతి చెందగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన డీసీఎం
యాదాద్రి భువనగిరి: భువనగిరి మండలం జగదేవ్‌పూర్ రోడ్డులోని రైల్వే గేట్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో రైల్వేగేట్ ధ్వంసమైంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి వచ్చి మరమ్మతులు చేపట్టారు. -
సీనియర్ డీసీఎం ను బదిలీ చేయాలని మెరుపు ధర్నా
సీనియర్ డీపివో కార్యాలయం వద్ద ఎస్సీఆర్ఎంయూ ఆధ్వర్యంలో ఆందోళన నగరంపాలెం: గుంటూరు రైల్వే డివిజనులో ఉద్యోగుల సంక్షేమాన్ని మరిచి నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్న గుంటూరు రైల్వే డివిజను సీనియర్ కమర్షియల్ మేనేజరు ఉమామహేశ్వరావును వెంటనే బదిలీ చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యహ్నం పట్టాభిపురంలోని డివిజనల్ రైల్వే మేనేజరు కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగి సీనియర్ డీపీవో కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. ఎస్సీఆర్ఎంయూ డివిజనల్ సెక్రటరీ హనుమంతరావు మాట్లాడుతూ.. ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. రెండు నెలల్లో 14మంది ఉద్యోగులను బదిలీ చేశారన్నారు. స్పౌజ్ కేటగిరిలో ఉన్న వారిని కూడా ఇష్టానుసారంగా బదిలీ చేశారన్నారు. డివిజన్లో జరుగుతున్న ధర్నాను జోన్ పరిధిలోని సీజీఎం దృష్టికి జోన్ ప్రదాన కార్యదర్శి శంకర్రావు తీసుకెళ్లడంతో ఆయన హామీ మేరకు ముట్టడిని విరమించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పి సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ నారయణరెడ్డి, ట్రెజరర్ రవిశంకర్, ఏడీఎస్ రాజశేఖర్, సాంబశివరావు, హెడ్ బ్రాంచీ సెక్రటరి కె.వెంకట్రావు, స్టేషన్ బ్రాంచీ అధ్యక్షుడు శ్రీనివాస్, సెక్రటరి ఎమ్వీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. -
పెళ్లి డీసీఎం బోల్తా, 18 మందికి గాయాలు
భువనగిరి అర్బన్: పట్టణ శివారులో ఉన్న బైపాస్ రోడ్డులో పెద్దకందుకూరు నుంచి నాగోల్‌కు వెళ్తున్న పెళ్లి డీసీఎం ప్రమాదవశాత్తు బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు చెందిన జనకల నర్సయ్య, నర్సమ్మల కుమార్తెకు నాగోల్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తమ బందువుల అబ్బాయితో వివాహం ఆదివారం గ్రామంలోనే జరిగింది. సోమవారం రాత్రి సరూర్‌నగర్‌లో విందు ఉండటంతో అమ్మాయి తరుపు బంధువులు యాదగిరిగుట్టకు చెందిన సుడుగు Mýృష్ణారెడ్డి డీసీఎంలో Ðð ళ్తున్నారు. ఈ క్రమంలో భువనగిరి పట్టణ శివారులో బైపాస్ రోడ్డులో ఉన్న వివేరా హోటల్ దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న డీసీఎంను ఒక గుర్తు తెలియని కారు వచ్చి ఢికోట్టి వెళ్లి పోయింది. దీంతో డీసీఎం డ్రైవర్ స్టిరింగ్‌ను పక్కకు టార్నింగ్ చేసే ప్రయత్నం చేయగా స్టిరింగ్ రాడ్ విరిగంతోపాటు బ్రేక్ పైపులు పగిలి పోయాయి. దీంతో డీసీఎం రోడ్డు కిందకు దుసుకుపోయి బోల్తా పడింది. డీసీఎంలో ఉన్న 40 నుంచి 50 మంది వరకు ఉన్నారు. ఇందులో 18 మంది గాయపడ్డారు. పెళ్లి కుమార్తె తల్లి నర్సయ్య, బంధువులు సునిల్, మధు, మహేష్, సాయికుమార్, చందు, రాకేష్, రమేష్, స్వామి, కిష్టయ్య, నర్సయ్య, హరిMýృష్ణ, యాదగిరి, ఎల్లమ్మతో పాలు మారో ముగ్గురికి తలకు, కాలుకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది, హైవే అంబులెన్స్ ద్వారా బాధితులను ఏరియా ఆస్పత్రికి తరలించారు.