Deepthi Sharma
-
WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర!
Womens Big Bash League Draft- మెల్బోర్న్: భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మెరిపించనున్నారు. ఓపెనర్ స్మృతి, ఆల్‌రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌లు ఇది వరకే ఈ లీగ్‌లో ఆడారు. అయితే కొత్తగా ఆల్‌రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్‌బాష్ చాన్స్ లభించింది. కానీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను మాత్రం లీగ్ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.‘ప్లాటినమ్’ కేటగిరీలో జెమీమా, దీప్తిగతంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్లకు ఆడిన అనుభవమున్న సీనియర్ బ్యాటర్‌పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హిట్టింగ్తో ఆదరగొట్టే బ్యాటర్ జెమీమాకు బ్రిస్బేన్ హీట్ ‘ప్లాటినమ్’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్లో టాప్ 1, 2, 3 రిటెన్షన్ పాలసీలా డబ్ల్యూబీబీఎల్‌లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీలుంటాయి.మరో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు మెల్బోర్న్ స్టార్స్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది. శిఖా పాండేకు రూ. 51 లక్షలు‘గోల్డ్’ కేటగిరీలో బ్రిస్బేన్ హీట్‌కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్ డాలర్లు), అడిలైడ్ స్ట్రయికర్స్‌కు స్మృతి మంధాన, పెర్త్ స్కార్చర్స్‌కు హేమలత, మెల్బోర్న్ స్టార్స్‌కు యస్తిక భాటియా సిల్వర్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్ వచ్చే నెల 27న అడిలైడ్‌లో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో బ్రిస్బేన్ హీట్ జట్టు తలపడుతుంది. -
వేదిక మార్పు మా ఆటపై ప్రభావం చూపదు: దీప్తి
ముంబై: మహిళల టి20 ప్రపంచకప్ వేదిక మార్పు తమ సన్నాహాలపై ప్రభావం చూపదని భారత జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చింది.ఈ నేపథ్యంలో దీప్తి మాట్లాడుతూ.. ‘టోర్నీ ఎక్కడ జరిగినా అత్యుత్తమ ప్రదర్శన చేయడమే మా లక్ష్యం. వేదిక మార్పు వల్ల సన్నద్ధతపై ఎలాంటి ప్రభావం పడదు. ఐసీసీ ట్రోఫీ కోసం టీమిండియా చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. ఈ టోర్నీలో అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నా. యూఏఈలోని పిచ్‌లు ఎలా స్పందిస్తాయనే దానిపై కొంచెం అవగాహన ఉంది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండాఆటను ఆస్వాదిస్తున్నా’ అని దీప్తి పేర్కొంది. ఇక ఇటీవల లండన్‌లో జరిగిన హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దీప్తి... సీజన్ ఆసాంతం రాణించింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుదిపోరులోనూ సత్తా చాటిన దీప్తి భారీ సిక్సర్‌తో లండన్ స్పిరిట్ జట్టుకు తొలి హండ్రెడ్ టైటిల్‌ను కట్టబెట్టింది. -
బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్లు..!
సిడ్నీ: ఈ ఏడాది మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) టి20 టోర్నీలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఆడటం దాదాపు ఖరారైంది. డబ్ల్యూబీబీఎల్ డ్రాఫ్టింగ్ జాబితాలో ఈ ముగ్గురి పేర్లు ఉండటమే దీనికి కారణం. మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్‌ను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోనుంది. ఈ మేరకు ఫ్రాంచైజీలు సోమవారం అట్టిపెట్టుకోవాలనుకుంటున్న ప్లేయర్ల జాబితా విడుదల చేశాయి.అడిలైడ్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మను ఆ జట్టు రిటైన్ చేసుకోనుంది. సూజీ బేట్స్ (సిడ్నీ సిక్సర్స్), అలీస్ కాప్సీ (మెల్బోర్న్ స్టార్స్), సోఫియా ఎకెల్‌స్టోన్ (సిడ్నీ సిక్సర్స్), షబ్నిమ్ ఇస్మాయిల్ (హోబర్ట్ హరికేన్స్), హీతర్ నైట్ (సిడ్నీ థండర్), డానీ వ్యాట్ (పెర్త్ స్కార్చెర్స్) రిటెన్షన్ జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు డబ్ల్యూబీబీఎల్ సీజన్ జరగనుంది. -
Hundred League: అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీసిన దీప్తి శర్మ
మహిళల హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో లండన్ స్పిరిట్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీసింది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన దీప్తి.. తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టింది. నిన్నటి మ్యాచ్‌లో లండన్ గెలవాలంటే చివరి మూడు బంతులకు నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించింది. ఫైనల్లో దీప్తి చేసింది 16 పరుగులే అయినా జట్టు విజయానికి అవెంతో దోహదపడ్డాయి.హండ్రెడ్ లీగ్ ప్రారంభ మ్యాచ్ నుంచి దీప్తి ఇలాంటి ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఈ సీజన్లో బ్యాట్‌తో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె.. 212 సగటున, 132.50 స్ట్రయిక్‌రేట్‌తో 212 పరుగులు చేసింది. ఇందులో దీప్తి వ్యక్తిగత అత్యధిక స్కోర్ 46 నాటౌట్ కాగా.. 18 బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన దీప్తి.. 6.85 ఎకానమీతో ఎనిమిది వికెట్లు తీసింది. వెల్ష్ ఫైర్‌తో నిన్న జరిగిన ఫైనల్లో దీప్తి ఎల్విస్ వికెట్ పడగొట్టింది. -
WPL 2024: గుజరాత్‌ను గెలిపించిన వైజాగ్ అమ్మాయి
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్ జెయింట్స్‌కు విశాఖ బౌలర్ షబ్నమ్ షకీల్ బ్రేక్ ఇచ్చింది. యూపీ వారియర్జ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో షబ్నమ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (4-0-11-3) ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్ 8 పరుగుల తేడాతో వారియర్జ్‌ను ఓడించి సీజన్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. షబ్నమ్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో వారియర్జ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. షబ్నమ్ దెబ్బకు వారియర్జ్ 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. దీప్తి శర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరుపు అర్ధ సెంచరీతో (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగినా వారియర్జ్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా వారియర్జ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లారా వాల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. లక్ష ఛేదనలో షబ్నమ్ దెబ్బకు ఆదిలోనే తడబడిన వారియర్జ్ దీప్తి శర్మ రాణించినా ఓటమిపాలైంది. వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. దీప్తితో పాటు పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా వారియర్జ్‌కు గెలిపించలేకపోయారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా దీప్తి 2 సిక్సర్లు సహా 17 పరుగులు సాధించినప్పటికీ వారియర్జ్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే అవుతుంది. ఢిల్లీ, ముంబై ఇండియన్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. ఆర్సీబీ మరో బెర్త్ రేసులో ముందుంజలో ఉంది. సత్తా చాటిన విశాఖ అమ్మాయి.. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన షబ్నమ్ స్వస్థలం విశాఖపట్నం. 16 ఏళ్ల షబ్నమ్ డబ్ల్యూపీఎల్ బరిలోకి దిగిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. వేలంలో ఆమెను గుజరాత్ టీమ్ రూ. 10 లక్షలకు తీసుకుంది. తన తొలి మ్యాచ్‌లో వికెట్ దక్కకపోయినా చక్కటి బంతులతో ఆమె ఆకట్టుకుంది. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ నాట్ సివర్ బ్రంట్‌ను తొలి వికెట్‌గా అవుట్ చేసిన షబ్నమ్... ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. గత ఏడాదే అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో షబ్నమ్ సభ్యురాలిగా ఉంది. -
ఢిల్లీని ఓడించిన దీప్తి
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఉర్రూతలూగించిన మ్యాచ్ జరిగింది. గెలుపు దిశగా పయనిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను దీప్తిశర్మ (4/19) అద్భుత బౌలింగ్‌తో ఓడించింది. ఢిల్లీ లక్ష్యం 138 పరుగులు కాగా... ఒక దశలో 18 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద విజయానికి 12 బంతుల్లో 15 పరుగుల దూరంలో ఉంది. అయితే 11 బంతుల్లో 6 వికెట్లను కోల్పోయిన ఢిల్లీ గెలుపు వాకిట బొక్కబోర్లా పడింది. యూపీ వారియర్స్ ఆఖరి దాకా పోరాడి పరుగు తేడాతో గెలిచింది. 19వ ఓవర్ వేసిన దీప్తి 3 వికెట్లు తీసి 5 పరుగులే ఇవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆమె శ్రమను నీరుగార్చకుండా చివరి ఓవర్లో బౌలింగ్‌కు దిగిన గ్రేస్ హారిస్ (2/8) ఐదు బంతులేసి రెండు వికెట్లు తీసింది. దీంతో పాటు మరో రనౌట్ కూడా చేసిన యూపీ విజయాన్నందుకుంది. ఉత్కంఠ రేపిన ఈ పోరు అందర్ని మునివేళ్లపై నిలబెట్టింది. మొదట యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. దీప్తిశర్మ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో మళ్లీ ఒంటరి పోరాటం చేసింది. క్యాపిటల్స్ బౌలర్లు రాధా యాదవ్, టైటస్ సాధు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెపె్టన్ మెగ్ లానింగ్ (46 బంతుల్లో 60; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, తర్వాత వచ్చిన వారు చెత్తషాట్లతో ఓటమిని మూల్యంగా చెల్లించారు. జెమీమా (17), షఫాలీ (15), అలైస్ క్యాప్సీ (15) రెండంకెల స్కోర్లు చేశారంతే! ఎవరూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
దీప్తీ శర్మకు అరుదైన గౌరవం.. ఇక డీఎస్పీ హోదాలో
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) హోదాతో సత్కరించింది. భారత క్రికెట్ జట్టు తరపున గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తుండంతో దీప్తీకు గౌరవం లభించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతిల మీదగా దీప్తి తన నియామక పత్రాన్ని అందుకుంది. అదే విధంగా దీప్తికి డీఎస్పీ పోస్ట్‌తో పాటు రూ.3 కోట్ల రూపాయల నగదు బహుమతిని కూడా యూపీ ప్రభుత్వం అందజేసింది. ఇక డీఎస్పీ హోదాతో తనను సత్కరించినందుకు శర్మ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. యూపీతో పాటు భారత దేశ వ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఇండియా టూడేతో శర్మ పేర్కొంది. మరోవైపు పారా ఏషియన్ గేమ్స్‌లో భాగమైన అథ్లెట్లు జతిన్ కుష్వాహా, యశ్ కుమార్‌లకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు క్యాష్ ఫ్రైజ్‌ను యోగి అందజేశారు. అదే విధంగా నేషనల్ గేమ్స్‌లో పతకాలు సాధించిన స్నూకర్ ఛాంపియన్ పరాస్ గుప్తా, రైఫిల్ షూటర్ ఆయుషి గుప్తాలకు కూడా రూ. 5 లక్షల నగదు బహుమతి లభించింది. చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా? -
2023లో సాధించాల్సినవన్నీ సాధించిన పాట్ కమిన్స్.. తాజాగా..!
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ గతేడాది (2023) క్రికెట్లో సాధించాల్సిన ఘనతలన్నీ సాధించాడు. ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలబెట్టిన కమిన్స్.. ఆతర్వాత ఇంగ్లండ్‌పై యాషెస్ సిరీస్ విజయం, వన్డే వరల్డ్‌కప్ విక్టరీ, ఐపీఎల్ 2024 వేలంలో 20.25 కోట్ల రికార్డు ధర, బాక్సింగ్ డే టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, టెస్ట్‌ల్లో హ్యాట్రిక్ ఐదు వికెట్ల ఘనత.. ఇలా ఫార్మాట్లకతీతంగా గతేడాది అన్ని ఘనతలను సాధించాడు. తాజాగా కమిన్స్ 2023 డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా దక్కించుకుని గతేడాది అత్యధిక సక్సెస్ సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం బంగ్లాదేశ్ ఆటగాడు తైజుల్ ఇస్లాం, కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ పోటీ పడినప్పటికీ అంతిమంగా అవార్డు కమిన్స్‌నే వరించింది. కమిన్స్ డిసెంబర్లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నిప్పులు చెరిగాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అతను ఏకంగా 10 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు తైజుల్ ఇస్లాం, గ్లెన్ ఫిలిప్స్ సైతం గత నెలలో అద్భుతంగా రాణించారు. తైజుల్ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 6 వికెట్ల ప్రదర్శనతో రాణించి, బంగ్లాకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఇదే సిరీస్‌లో కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌లో 5 వికెట్ల ఘనతతో పాటు బ్యాటింగ్‌లో 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మహిళల విభాగంలో దీప్తి శర్మ.. మహిళల విషయానికొస్తే డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను వరించింది. ఈ అవార్డు కోసం మరో టీమిండియా ప్లేయర్ జెమీమా రోడ్రిగెజ్, జింబాబ్వే బౌలర్ ప్రీసియస్ మరంగే పోటీపడ్డారు. -
ఆసీస్‌తో మూడో వన్డే.. టీమిండియా బౌలర్ అరుదైన ఘనత
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఇవాళ (జనవరి 2) జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలకమైన లిచ్‌ఫీల్డ్ వికెట్ తీసిన దీప్తి.. మహిళల వన్డేల్లో 100 వికెట్లు (86వ మ్యాచ్‌లో) తీసిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. గతంలో జులన్ గోస్వామి (255 వికెట్లు), నీతూ డేవిడ్ (97 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు), అల్ ఖదిర్ (78 మ్యాచ్‌ల్లో 100) భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్ల మార్కును తాకారు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు టీమిండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి పేరిట ఉంది. గోస్వామి 204 వన్డేల్లో 255 వికెట్లు తీసి ఈ విభాగంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. వన్డే క్రికెట్లో 200కుపైగా వికెట్లు తీసిన ఏకైక బౌలర్ కూడా గోస్వామినే కావడం విశేషం. ఇదిలా ఉంటే, నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో (ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ ఇదివరకే కైవసం చేసుకుంది) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో ఆష్లే గార్డ్నర్ (30), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 9 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే చేసి ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యస్తికా భాటియా 6, స్మృతి మంధన 29 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు మెగాన్ షట్కే దక్కాయి. హర్మన్ప్రీతికౌర్, రిచా ఘోష్ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర
India Women vs Australia Women, Only Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. కాగా భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్ పోరాడినా ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు. టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది. మొట్టమొదటి టెస్టు గెలుపు ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్‌ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్‌తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్- ఆసీస్ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ డ్రా అయింది. చదవండి: WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై వేటు 𝙃𝙄𝙎𝙏𝙊𝙍𝙔 𝙄𝙉 𝙈𝙐𝙈𝘽𝘼𝙄! 🙌#TeamIndia women register their first win against Australia in Test Cricket 👏👏 Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/R1GKeuRa69 — BCCI Women (@BCCIWomen) December 24, 2023 -
ఆసీస్ బౌలర్లకు చుక్కలు.. బ్యాట్‌తో చెలరేగిన దీప్తి, పూజ
ఆస్ట్రేలియాతో టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ స్మృతి మంధానకు తోడు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ(70- నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆసీస్‌పై పైచేయి సాధించింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. కాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో భారత వుమెన్ టీమ్ ఏకైక టెస్టులో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇతర బౌలర్లలో స్నేహ్ రాణా మూడు, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆసీస్ మహిళా జట్టు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో తొలి రోజే ఆసీస్‌ను ఆలౌట్ చేసిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా ఓపెనర్ స్మృతి మంధాన 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా ఘోష్ 52 పరుగులతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో అదరగొట్టింది. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. గార్డ్నర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. యస్తికా భాటియా సైతం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న దీప్తి శర్మ ఓపికగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి 147 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా పూజా వస్త్రాకర్ సైతం 33 పరుగులతో క్రీజులో ఉంది. వీరిద్దరు కలిసి 102 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇదిలా ఉంటే.. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆష్లీ గార్డ్నర్కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కగా.. కిమ్‌గార్త్ ఒకటి, జెస్ జొనాసెన్ ఒక వికెట్ పడగొట్టారు. కిమ్ గార్త్, గార్డ్నర్ కలిసి స్మృతి మంధానను రనౌట్ చేశారు. -
చెలరేగిన టీమిండియా బౌలర్.. 136 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
నవీ ముంబై వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళా జట్టు పట్టు బిగించింది. బ్యాటర్లంతా తలో చేయి వేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. అనంతరం ప్రత్యర్ధిని 138 పరుగులకే ఆలౌట్ చేసి 292 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందింది. దీప్తి శర్మ టెస్ట్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు (5.3-4-7-5) నమోదు చేసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించింది. దీప్తికి స్నేహ్ రాణా (2/25), రేణుక సింగ్ (1/32), పూజా వస్త్రాకర్ (1/39) సహకరించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నాట్ సీవర్ బ్రంట్ (59) టాప్ స్కోర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. ఆమీ జోన్స్ 12, బేమౌంట్ 10, డంక్లీ 11, హీథర్ నైట్ 11, డేనియెల్ వ్యాట్ 19 పరుగులు చేయగా.. లారెన్ ఫైలర్ 5, కేట్ క్రాస్ ఒకటి, ఎక్లెస్టోన్, చార్లీ డీన్ డకౌట్లయ్యారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 69 పరుగులు చేసి, ఓవరాల్‌గా 361 పరుగుల లీడ్‌ను సాధించింది. స్మృతి మంధన 26 పరుగులు చేసి ఔట్ కాగా.. షఫాలీ వర్మ (32), యస్తిక భాటియా (7) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు శుభ సతీశ్ (69), జెమీమా రోడ్రిగెజ్ (68), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (67), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (49), స్నేహ్ రాణా (30) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. కేట్ క్రాస్, నాట్ సీవర్ బ్రంట్, చార్లెట్ డీన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
చరిత్రలో నిలిచిపోయే రనౌట్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్టన్నింగ్ రనౌట్లతో మెరిసింది. మాములుగానే తాను ఫీల్డ్‌లో ఉందంటే ప్రత్యర్థి బ్యాటర్ల పప్పులు ఉడకవు. ఎందుకంటే బంతి ఆమె చేతి నుంచి వెళ్లడం అసాధ్యం. అయితే పరుగులు సేవ్ చేయడమో లేదంటే ప్రత్యర్థి ఆటగాళ్లను రనౌట్ చేయడమో జరుగుతుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు రనౌట్లతో మెరవడం విశేషం. అయితే ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన తీరుకు మాత్రం ఆమెను మెచ్చుకోకుండా ఉండలేం. ఆఖరి ఓవర్‌ను దీప్తి శర్మనే వేసింది. ఓవర్ నాలుగో బంతిని ఇసీ వాంగ్ లాంగ్‌ఆఫ్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన వాంగ్ రెండో పరుగుకు పిలుపునిచ్చింది. అప్పటికే బంతిని అందుకున్న దీప్తి శర్మకు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. కానీ తను మరోలా ఆలోచించింది. స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ఇసీ వాంగ్‌ను రనౌట్ చేయాలనుకొని డైరెక్ట్ త్రో వేసింది. అంతే వాంగ్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీప్తి శర్మ కాన్ఫిడెంట్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. Right On Target 🎯 ft. Deepti Sharma#CricketTwitter #WPL2023 #MIvUPW pic.twitter.com/LkGcz9ubKt — Female Cricket (@imfemalecricket) March 18, 2023 చదవండి: విశాఖ చేరుకున్న క్రికెటర్లు; వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన -
యూపీ వారియర్జ్ విజృంభణ.. ముంబై ఇండియన్స్ 127 ఆలౌట్
ముంబై ఇండియన్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ బౌలర్లు విజృంభించారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసీ వాంగ్ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. తొలుత ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన దీప్తి.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సైకా ఇషాకిని డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడం విశేషం. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి -
స్టన్నింగ్ క్యాచ్.. క్యాచ్ ఆఫ్ సీజన్ అయ్యే అవకాశం!
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ నమోదు చేసింది. యూపీ వారియర్జ్ ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్ శిఖా పాండే వేసింది. ఓవర్ తొలి బంతిని దీప్తి శర్మ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న రాధా యాదవ్ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తూ లో క్యాచ్ తీసుకుంది. దెబ్బకు దీప్తి శర్మ మొహం మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్జ్ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్స్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. Catch of the WPL: Radha Yadav. pic.twitter.com/RTGoONifYT — Johns. (@CricCrazyJohns) March 7, 2023 చదవండి: Rahul Dravid: డబ్ల్యూటీసీ వల్లే ఇదంతా.. -
టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన శ్రీలంక బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
Women's T20 Rankings: తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్ ప్లేయర్స్ దుమ్మురేపారు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్‌కప్ సంచలన ప్రదర్శన నమోదు చేసిన శ్రీలంక యంగ్ గన్ విష్మి గుణరత్నే తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 169 ప్లేస్‌కు చేరుకుంది. 17 ఏళ్ల విష్మి.. టీ20 వరల్డ్‌కప్ రన్నరప్ సౌతాఫ్రికాపై 35 పరుగులు, సిక్స్ టైమ్ వరల్డ్ ఛాంపియన్, ప్రస్తుత జగజ్జేత ఆస్ట్రేలియాపై 24 పరుగులు సాధించడం ద్వారా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. బ్యాటర్ల విభాగంలో విష్మితో పాటు ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్న ప్లేయర్స్‌లో విండీస్‌కు చెందిన రషదా విలియమ్స్ (50 స్థానాలు), పాకిస్తాన్‌కు చెందిన ఫాతిమా సనా (36 స్థానాలు), బంగ్లా బ్యాటర్ నహిదా అక్తర్ (33 స్థానాలు), విండీస్ ప్లేయర్ చిన్నెల్ హెన్రీ (30 స్థానాలు) ఉన్నారు. ఈ విభాగంలో ఆసీస్ తహీల మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బెత్ మూనీ, స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్, సోఫీ డివైన్, లారా వొల్వార్డ్ట్, ఆష్లే గార్డెనర్, సూజీ బేట్స్, అలైసా హీలీ, నతాలీ సీవర్ టాప్ 10లో ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. సోఫీ ఎక్లెస్‌స్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మ్లాబా, డార్సీ బ్రౌన్, సారా గ్లెన్, దీప్తి శర్మ, మెగాన్ షట్, షబ్మిమ్ ఇస్మాయిల్, లీ తహుహు, రేణుకా సింగ్, ఆష్లే గార్డెనర్ టాప్-10లో ఉన్నారు. ఈ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 77 స్థానాలు ఎగబాకగా.. లారెన్ బెల్ (ఇంగ్లండ్) 60 స్థానాలు, కరిష్మా రామ్హరాక్ (విండీస్) 49 స్థానాలు, హన్నా రోవ్ (బంగ్లాదేశ్) 35 స్థానాలు, జార్జీనా డెంప్సీ (ఐర్లాండ్) 33 స్థానాలు మెరుగుపర్చుకుని, కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌లకు చేరుకున్నారు. ఆల్రౌండర్ల్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 103 స్థానాలు మెరుగుపర్చుకోగా.. తుబా హసన్ (పాక్) 47 స్థానాలు, కరిష్మా రమహరాక్ (విండీస్) 36 స్థానాలు, సాదియా ఇక్బాల్ (పాక్) 34 స్థానాలు, చిన్నెల్ హెన్రీ (విండీస్) 31 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్స్‌కు చేరుకున్నారు. ఈ విభాగంలో ఆష్లే గార్డెనర్ టాప్‌లో కొనసాగుతుండగా.. హేలీ మాథ్యూ, దీప్తి శర్మ, అమెలియా కెర్ర్, నతాలీ సీవర్, సోఫీ డివైన్, నిదా దార్, క్యాథరీన్ బ్రైస్, ఎల్లిస్ పెర్రీ, సల్మా ఖాతూన్ టాప్-10లో ఉన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహిళల ఐపీఎల్ 2023.. యూపీ వారియర్జ్ కెప్టెన్ ఎవరంటే..?
Alyssa Healy: మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కోసం ఆయా జట్లు ఒక్కొక్కటిగా తమ సారధుల పేర్లను ప్రకటిస్తున్నాయి. తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధనను ప్రకటించగా.. తాజాగా యూపీ వారియర్జ్ తమ కెప్టెన్ పేరును అనౌన్స్ చేసింది. యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా ఆసీస్ వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అలైసా హీలీ నియమితురాలైంది. యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్, యూపీకి చెందిన దీప్తి శర్మను ప్రకటిస్తారని అంతా ఊహించారు. అయితే యూపీ వారియర్జ్ మేనేజ్మెంట్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అలైసా వైపు మొగ్గు చూపింది. రెగ్యులర్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా సారధిగా వ్యవహరించిన 32 ఏళ్ల అలైసా.. ఆ జట్టు గెలిచిన 5 టీ20 వరల్డ్‌కప్‌ల్లో, 2022 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఉంది. అలైసా తన ఓవరాల్ కెరీర్లో ఆసీస్ తరఫున 139 టీ20లు, 94 వన్డేలు, 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 శతకాలు, 30 అర్ధశతకాల సాయంతో 5400కు పైగా పరుగులు సాధించింది. అలైసా.. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించింది. యూపీ వారియర్జ్ జట్టు: అలైసా హీలీ (కెప్టెన్), సోఫీ ఎక్లెస్‌స్టోన్, తహీలా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, గ్రేస్ హ్యారిస్, లారెన్ బెల్ (విదేశీ ప్లేయర్లు), దీప్తి శర్మ, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్, పర్షవీ చోప్రా, స్వేతా సెహ్రావత్, ఎస్ యషశ్రీ,, కిరణ్ నవ్‌గిరే, దేవిక వైద్య, లక్ష్మీ యాదవ్, షేక్ సిమ్రన్ హెడ్ కోచ్: జోన్ లూయిస్ (ఇంగ్లండ్) అసిస్టెంట్ కోచ్: అన్జు జైన్ బౌలింగ్ కోచ్: ఆష్లే నోఫ్కీ మెంటార్: లీసా స్తాలేకర్ యూపీ వారియర్జ్ తొలి మ్యాచ్: మార్చి 5న గుజరాత్ జెయింట్స్‌తో -
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీమిండియా తొలి బౌలర్‌గా
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ టి20 క్రికెట్లో చరిత్ర సృష్టించింది. టీమిండియా తరపున అటు పురుషుల క్రికెట్లో.. ఇటు మహిళల క్రికెట్లో టి20ల్లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆరీ ఫ్లెచర్‌ను ఔట్ చేయడం ద్వారా దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా దీప్తి శర్మ 89 టి20 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మార్క్‌ను అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గానూ చరిత్రకెక్కింది. టీమిండియా మహిళా వెటరన్ లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 72 మ్యాచ్‌ల్లో 98 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. టి20 క్రికెట్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న మహిళా క్రికెటర్ల జాబితాలో దీప్తి శర్మ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక మహిళల టి20 క్రికెట్లో సీనియర్ వెస్టిండీస్ స్పిన్నర్ అనీసా మహ్మద్ 125 వికెట్లు(117 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్ నిదాదార్(121 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ పెర్రీ (120 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియా మెన్స్ క్రికెటర్లలో యజ్వేంద్ర చహల్ 91 వికెట్లతో(75 మ్యాచ్‌లు) వంద వికెట్లకు చేరువగా ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో భువనేశ్వర్ కుమార్ 90 వికెట్లు(87 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. పురుషుల టి20 క్రికెట్లో వంద వికెట్ల మార్క్‌ను ఐదుగురు మాత్రమే అందుకున్నారు. టిమ్ సౌథీ 134 వికెట్లు(107 మ్యాచ్‌లు), షకీబ్ అల్ హసన్ 128 వికెట్లు(109 మ్యాచ్‌లు), రషీద్ ఖాన్ 122 వికెట్లు(74 మ్యాచ్‌లు), ఇష్ సోదీ 114 వికెట్లు( 91 మ్యాచ్‌లు), లసిత్ మలింగ 107 వికెట్లు( 84 మ్యాచ్‌లు) ఉన్నారు. 🚨Milestone Alert 🚨 A special TON for @Deepti_Sharma06 as she becomes #TeamIndia's leading wicket-taker in T20Is (in women's cricket) 👏 👏 Follow the match ▶️ https://t.co/rm4GUZIzSX #T20WorldCup | #INDvWI pic.twitter.com/7GDz93fgEH — BCCI Women (@BCCIWomen) February 15, 2023 చదవండి: Smriti Mandana: వచ్చీ రావడంతో స్టన్నింగ్ క్యాచ్‌తో.. -
ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో టీమిండియా ప్లేయర్ల హవా
ICC Womens T20I Team Of The Year 2022: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 అత్యుత్తమ పురుషుల టీ20 జట్టుతో పాటు మహిళల అత్యుత్తమ టీ20 జట్టును కూడా ఇవాళే (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు భారతీయ క్రికెటర్లను ఎంపిక చేసిన ఐసీసీ.. కెప్టెన్‌గా సోఫీ డివైన్ (న్యూజిలాండ్)ను ఎంచుకుంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీమిండియా ప్లేయర్స్ స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఐసీసీ బెస్ట్ టీ20 టీమ్‌కు ఎంపికయ్యారు. ఓపెనర్లుగా స్మృతి మంధన (భారత్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా)లను ఎంచుకున్న ఐసీసీ.. వన్‌డౌన్‌లో సోఫీ డివైన్ (న్యూజిలాండ్, కెప్టెన్), ఆతర్వాతి స్థానాలకు ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), తహిల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్తాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్, భారత్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇంద్‌కా రణవీరా (శ్రీలంక), రేణుక సింగ్ (భారత్)లను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా (ముగ్గురు) కంటే భారత్‌కే అధిక ప్రాతినిధ్యం లభించడం విశేషం. -
నీ పని నువ్వు చూసుకో ముందు! ఆ తర్వాత పక్కవాళ్ల గురించి మాట్లాడు
టీమిండియా బౌలర్ దీప్తి శర్మను ఉద్దేశించి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘క్రికెట్ నిబంధనలు తెలియకుండానే ‘స్టార్ బౌలర్’గా ఎదిగావా?.. అయినా నీ ఆట గురించి నువ్వు చూసుకోకుండా పక్కవాళ్ల గురించి కామెంట్లు చేయడం దేనికి’’ అంటూ భారత జట్టు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంగ్లండ్‌కు మద్దతుగా నిలవాలనుకుంటే అలాగే చేయొచ్చు.. కానీ అందుకు దీప్తి పేరు ప్రస్తావించాల్సి అవసరం లేదని మండిపడుతున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ చార్లీ డీన్‌ను దీప్తి శర్మ రనౌట్(మన్కడింగ్) చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బ్రిటిష్ మీడియా సహా పలువురు క్రీడా విశ్లేషకులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే స్థాయిలో దీప్తి శర్మకు మద్దతు కూడా లభించింది. నిబంధనలకు అనుగుణంగానే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఆమె రనౌట్ చేసిందని పలువురు అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి టీ20 మ్యాచ్ సందర్భంగా మిచెల్ స్టార్క్‌కు.. జోస్ బట్లర్‌ను రనౌట్ చేసే అవకాశం లభించింది. కానీ అతడు.. ఇంగ్లండ్ సారథికి కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ‘‘నేనేమి దీప్తిని కాదు.. మన్కడింగ్ చేయడానికి.. కానీ ఇది రిపీట్ చేయకు బట్లర్'’ అని వ్యాఖ్యానించడం అతడిపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇక ఈ విషయంపై భారత మాజీ ఆల్‌రౌండర్ హేమంగ్ బదాని స్పందిస్తూ.. ‘‘స్టార్క్ నువ్వింకా ఎదగాలి! నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు. ఆటలో భాగంగా దీప్తి చేసిన పని నిబంధనలకు అనుగుణంగానే ఉంది. నువ్వు ఒకవేళ నాన్‌స్ట్రైకర్‌ను హెచ్చరించాలని భావిస్తే అలాగే చేయి.. అది నీ సొంత నిర్ణయం. అంతేగానీ మధ్యలో దీప్తి పేరును ఎందుకు లాగావు? క్రికెట్ ప్రపంచం నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అంటూ మిచెల్ స్టార్క్‌ను విమర్శించాడు. ఈ మేరకు బదాని చేసిన ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు.. ‘‘అవును.. నువ్వు దీప్తిశర్మవు కావు. కాలేవు. ఎందుకంటే నీకు రూల్స్ ఫాలో అయ్యే ధైర్యం లేదు కదా! అయినా తనేదో నేరం చేసినట్లు నువ్వు తన పేరును వాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని స్టార్క్‌ను ఏకిపారేస్తున్నారు. చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్ Runout controversy: అప్పటికే పలుమార్లు హెచ్చరించా: రనౌట్ వివాదంపై దీప్తి శర్మ వివరణ Grow up Starc. That’s really poor from you. What Deepti did was well within the rules of the game. If you only want to warn the non striker and not get him out that’s fine and your decision to make but you bringing Deepti into this isn’t what the cricket world expects of you https://t.co/vb0EyblHB8 — Hemang Badani (@hemangkbadani) October 15, 2022 -
'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్)చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్ చట్టబద్ధం చేసినప్పటికి.. ఇంగ్లీష్ మీడియా సహా అక్కడి క్రికెటర్లు మాత్రం దీప్తి శర్మ ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ తమ వెర్రితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక్క ట్వీట్‌తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు,విశ్లేషకులు,విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియా..తన ముందున్న వారిని దాటేయడానికి గాను సైకిల్‌ను వేగంగా తొక్కి తర్వాత తన బాడీని సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.దీంతో సైకిల్.. తన ముందున్న సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ వీడియోను జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ''ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు.తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'' అని రాసుకొచ్చాడు. పేరు చెప్పకపోయినా జాఫర్ ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది. Italian cyclist Michael Guerra uses his knowledge of physics and aerodynamics to adopt a “plank” position and overtake his competitors. pic.twitter.com/EsRt16l2PT — Ian Fraser (@Ian_Fraser) September 27, 2022 Deepti Sharma nailed id today on field 😄 what she did it was heart breaking feeling for England . Superb #DeeptiSharma . Gore ko unki line se bahar jaane ki saja 😄🤣#ENGvsIND #womenscricket #JhulanGoswami #ODI pic.twitter.com/NKnoHhfRQD — Vishoka M🇮🇳 (@Vishokha) September 24, 2022 చదవండి: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్ -
రన్ఔట్ విషయం లో మమ్మల్ని హెచ్చరించలేదు : హీథర్ నైట్
-
హవ్వా... ఇంగ్లాండ్ లో క్రికెటర్ రూమ్ లో దొంగతనం
-
ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ను టీమిండియా 16 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే గాక చివరి మ్యాచ్ ఆడిన ఝులన్ గోస్వామికి విజయాన్ని కానుకగా అందించింది. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా నెలకొంది. ఇంగ్లండ్ చివరి వికెట్ వివాదాస్పదమైంది. దీప్తి శర్మ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్ (47; 5 ఫోర్లు) క్రీజు దాటి ముందుకు వెళ్లింది. యాక్షన్ పూర్తి చేసిన దీప్తి వెంటనే వికెట్లను గిరాటేసింది. దాంతో చార్లీ డీన్‌ను అంపైర్ రనౌట్‌గా ప్రకటించడంతో భారత విజయం ఖాయమైంది. ఇలా ఔట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన్కడింగ్‌పై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. కానీ ఇటీవలే క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. దీంతో మన్కడింగ్ ఇకపై రనౌట్‌గా పిలవనున్నారు. ఐసీసీ కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. కాగా అక్టోబర్ 1 నుంచి క్రికెట్లో మన్కడింగ్(రనౌట్) సహా పలు కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇక ఐపీఎల్లో రవిచంద్రన్ అశ్విన్.. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. తాజాగా టీమిండియా నుంచి అశ్విన్ తర్వాత మన్కడింగ్ చేసిన బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. దీంతో క్రికెట్ అభిమానులు.. ''ఇవాళ దీప్తి శర్మ మరో అశ్విన్‌లా కనబడింది.. తగ్గేదే లే'' అంటూ కామెంట్ చేశారు. What’s your take on this? A: What Deepti did was spot on! B: Hey mate, where is the spirit of the game? C: Stay within the laws (crease) or get OUT! Comment below!#ENGvIND | #DeeptiSharma | #ThankYouJhulan pic.twitter.com/CjWxr0xkiz — Women’s CricZone (@WomensCricZone) September 24, 2022 చదవండి: జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక -
NZ W Vs Ind W: అదరగొట్టిన తెలుగమ్మాయి.. భారీ స్కోరు.. అయినా తప్పని ఓటమి.. సిరీస్ వాళ్లదే
NZ W Vs Ind W 3rd ODI: - క్వీన్స్టౌన్: మళ్లీ భారీ స్కోరు చేసినా... భారత మహిళల జట్టు న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడో వన్డేలోనూ ఓటమి చవిచూసి మరో రెండు వన్డేలుండగానే సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట మిథాలీ రాజ్ బృందం 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (41 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. మిడిలార్డర్లో దీప్తి శర్మ (69 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించింది. 280 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. మహిళల వన్డే క్రికెట్లో ఇది రెండో అత్యుత్తమ ఛేజింగ్. అమెలియా కెర్ (67; 8 ఫోర్లు), అమి సాటెర్త్‌వైట్ (59; 6 ఫోర్లు), లారెన్ డౌన్ (52 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేటీ మారి్టన్ (37 బంతుల్లో 35) మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. జులన్ గోస్వామికి మూడు వికెట్లు దక్కాయి. చదవండి: Ind Vs Wi 2nd T20: ఆఖరి 2 బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాలి.. హర్షల్ ఆ అవకాశం ఇవ్వలేదుగా.. మనదే సిరీస్