dhone
-
బుగ్గన వస్తున్నారని తెలిసి... ఇదేం చిల్లర రాజకీయం
-
డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వాకింగ్ కోసం మున్సిపల్ పార్క్‌కు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేశారు. వాకింగ్ పార్క్‌లో బుగ్గనను సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేస్తే కూడా మున్సిపల్ కమిషనర్ స్పందించలేదు.మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్‌కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు. వాకింగ్ పార్కు తాళం వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. -
అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...
-
ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు
-
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
-
రాళ్ల దాడులు.. పిడిగుద్దులు.. తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం!
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. కోట్ల సూర్యప్రకాశ్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. చంద్రబాబు వచ్చి సర్ది చెప్పి పోయినా సొంత క్యాడర్ సహకరించలేదు.తాజాగా ప్యాపిలి మండలం పెద్దపూదెళ్లలో తెలుగు తమ్ముళ్లు దారుణంగా తన్నుకున్నారు. 'కోట్ల' ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాన్వాయ్ ఎవరెక్కాలనేదానిపై ఘర్షణ మొదలైంది.రాళ్లదాడులు, పిడిగుద్దులతో రెండు వర్గాలు విరుచుకుపడ్డాయి. సమన్వయం పాటించాలని కోట్ల సూర్యప్రకాశ్ కోరినా తెలుగు తమ్ముళ్లు లెక్కచేయలేదు. ‘కోట్ల’ చెప్పినా ఓ వర్గం మరింత రెచ్చిపోయి రాళ్లు రువ్వి దాడులకు దిగింది.ముందే ప్లాన్ చేసి టీడీపీలోని ఓ వర్గం దాడికి పురిగొల్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు డోన్ బహిరంగ సభలో పదే పదే సుబ్బారెడ్డి పేరు పలకడంపైనా ఓ వర్గం తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'కోట్ల' కన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంపై కోట్ల వర్గం కూడా అసంతృప్తితో ఉంది.టీడీపీకి వలసలుగా వెళ్లిన వారు కూడా ఎందుకొచ్చాం రా బాబూ అనుకునేలా కూటమిలో పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల బాహాబాహీతో తెలుగుదేశం బండారం బయటపడింది. -
డోన్ లో టీడీపీకి బిగ్ షాక్..
-
నీటి బొట్టు.. విలువ తెలుసు: సీఎం జగన్
రాష్ట్రంలో నాలుగేళ్లలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? లేదా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆపై ఓట్లు వేసేందుకు ఎన్నికల్లో అడుగులు వేయాలి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్! మారిందల్లా సీఎం మాత్రమే. కానీ అప్పుల రేటు గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ. మీ బిడ్డ వచ్చాక అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ఏకంగా రూ.2.35 లక్షల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు హయాంలో ఇది ఎందుకు జరగలేదు? నాడు జన్మభూమి కమిటీల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి దాకా దోచుకోవడం, పంచుకోవడమే! మన పాలనలో ప్రతి అడుగు మంచి కోసమే. విద్య, వైద్యంతోపాటు మహిళా సాధికారత దిశగా వేగంగా అడుగులు వేశాం. సామాజిక న్యాయంలో మన ప్రభుత్వానికి ఎవరూ సాటి లేరు. మీకు మంచి జరిగి ఉంటే సైనికుల్లా మీ బిడ్డకు తోడుగా నిలబడి ప్రోత్సహించండి. దేవుడి దయతో మీకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వినాయక చవితి సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువైన వరాలను అందించారు. 2 జిల్లాల్లో 77 చెరువులకు హంద్రీ–నీవా నీటితోపాటు తాగునీటిని కూడా అందించే ప్రాజెక్టును సీఎం మంగళవారం ప్రారంభించారు. పత్తి కొండ నియోజకవర్గం లక్కసాగరం సమీపంలోని ఆలంకొండ పంప్‌హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. పక్కనే శ్రీశైలం ఉన్నా.. ఇది నీటి విలువ తెలిసిన మనందరి ప్రభుత్వం. రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా శాశ్వత మార్పులు తెచ్చేందుకు నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి 77 చెరువులను నింపుతు న్నాం. రోజుకు 160 క్యూసెక్కుల చొప్పున 90 రోజు ల్లో 1.24 టీఎంసీల హంద్రీ–నీవా జలాలతో చెరు వులను నింపుతాం. ఆశ్చర్యమేంటంటే పక్కనే శ్రీ శైలం ఉన్నా మెట్ట ప్రాంతాలైన పత్తికొండ, డోన్‌కు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. డోన్ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా నికరజలాలు లేని పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులున్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. 2019 ఎన్ని కలకు కేవలం 4–5 నెలల ముందు చంద్రబాబు ఒక జీవో ఇచ్చి టెంకాయ కొట్టారు. కనీసం పైపులు వేసేందుకు భూసేకరణ కూడా జరగలేదు. హడా వుడిగా టెంకాయలు కొట్టేందుకు మాత్రం 8 ఎకరా లు కొనుగోలు చేశారు. అలాంటి దారుణమైన మోసాలకు పాల్పడ్డారు. చంద్రబాబు మాదిరిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా పనులు చేపట్టే ప్రభుత్వం మాది కాదు. మనందరి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నీటి విలువ తెలిసిన రాయలసీమ బిడ్డగా రూ.253 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. నాలుగేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. ఈ ప్రాంతంలో 8 మండలాలు కరువుతో ఉన్నాయి. మొత్తం 10,130 ఎకరాలకు సాగునీటితోపాటు ఈ ప్రాంతంలోని గ్రామాలకు తాగునీరు అందించే పనులు పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టుతో డోన్, పత్తికొండ నియోజకవ ర్గాలకు మంచి జరుగుతుంది. ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది. వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ–నీవా కాలువ నుంచి ఇప్పటికే పైపులైన్ కనెక్టివిటీ పూర్తయింది. ట్రైల్ రన్ చేస్తున్నాం. కృష్ణగిరి, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, పత్తికొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైపులైన్ కనెక్టివిటీ పూర్తయి ట్రైల్ రన్ జరుగుతోంది. ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైపులైన్ పూర్తయింది. జొన్నగిరి, డోన్, తుగ్గలి మండలాల్లోని మరో 7 చెరువులకు ట్రైల్‌రన్ పూర్తయి చెరువులకు నీళ్లు ఇస్తున్నాం. డోన్ నియో జకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకూ నీరిస్తున్నాం. మొత్తంగా 77 చెరువులకు సంబంధించి ప్రాజెక్టు పనులను పూర్తి చేశాం. గాజులదిన్నె సామర్థ్యం పెంపుతో సాగుకు భరోసా.. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద ఉన్న సంజీవయ్యసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీంఎంసీలు. 24,372 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వర్షాధారంతో నిండాల్సిందే. కృష్ణా జలాల కేటాయింపు లేదు. పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు, కృష్ణగిరి మండలంలో 55 ఆవాసాలకు, గోనెగండ్ల మండలంలోని 10 ఆవాసాలకు, డోన్ మునిసిపాలిటీకి ఇది తా గునీరు అందిస్తోంది. కర్నూలు కార్పొరేషన్‌కు కూడా తాగునీటిని అందిస్తోంది. ఇన్ని రకాలుగా ఉప యోగపడే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మనం వచ్చిన తర్వాత 4.5 నుంచి 5 టీఎంసీలకు పెంచాం. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి రూ.57 కోట్లతో నీళ్లు ఇస్తున్నాం. ఆ పనులు కూడా పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా. ఈ ప్రాంతానికి ఇంత ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై గతంలో ఎప్పు డూ ఎవరూ ఆలోచన చేయలేదు. ఇక్కడ వర్షాలు పడితేనే వ్యవసాయం. చెరువులున్నా నింపాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఎన్నికల సమయంలోనే కొందరికి టెంకాయలు, జీవోలు గుర్తొస్తాయి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన రాదు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇక్కడకు వచ్చి నప్పుడు మీ కష్టాలు చూశా. మీకు నేనున్నానని చెప్పా. మాట ప్రకారం నాలుగేళ్లలో పూర్తి చేసి ఆశీస్సుల కోసం మీ ముందు నిలబడుతున్నా. ఆ రోజు వైఎస్సార్.. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం రాయలసీమలో ఎంత దుర్భిక్ష పరిస్థితులున్నాయో నాకు తెలుసు. ఈ రోజు హంద్రీ–నీవా నుంచి తూ ము పెట్టి 77 గ్రామాలకు జలాలు ఎత్తిపోస్తున్నాం. ఆ ప్రాజెక్టు కట్టింది ఎవరు? అని అడుగుతున్నా. చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉండి ఖర్చు చేసింది కేవ లం రూ.13 కోట్లు. దివంగత వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎం అయ్యాక రూ.6 వేల కోట్లతో హంద్రీ–నీవా కాలువ నిర్మించారు. అందువల్లే ఈ రోజు కాలువ లపై తూములు ఏర్పాటు చేసి లిఫ్ట్‌లు పె ట్టుకుంటున్నాం. రాయలసీమ సాగునీటి కష్టాల ను తీర్చేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రజల గురించి ఎవరైనా ఆలోచించారంటే అప్పుడు వైఎస్సార్ హయాంలో.. ఆ తర్వాత దేవుడి దయ, మీ అందరి దీవెన లతో ఏర్పడ్డ మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పోతిరెడ్డి పాడును 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లేలా అడు గులు పడుతున్నాయి. గత పాలకుల నిర్వాకా లను మనమంతా చూశాం. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదలా లంటే శ్రీశైలం నిండాలి. 881 అడుగులకు చేరితే త ప్ప నీళ్లు రాని పరిస్థితి. శ్రీశైలం నిండేదెప్పుడు? నిండినా ఎన్ని రోజులు నీళ్లు ఉంటాయి? తెలంగాణ ప్రాజెక్టులకు 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకుంటున్నా రు. 790 అడుగులకే పవర్ జనరేషన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆ లోచించాం. 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకునేలా రా యలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి. ప్రకాశం కరువూ తీరుస్తాం కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా కరువు కూడా తీరుస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే నీళ్లు వస్తాయి. ఇక్కడ రెండు టన్నెళ్లు ఉన్నాయి. వైఎస్సార్ హయాంలో ఒక్కో టన్నెల్ 18 కిలోమీటర్లతో పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే టన్నెల్–1లో 12 కిలోమీటర్లు, టన్నె ల్–2లో 8 కిలోమీటర్లు మేర పనులు జరిగా యి. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కరు వుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మీ బిడ్డ మొదటి టన్నెల్ పూర్తి చేశాడు. రెండో టన్నెల్‌ను అక్టోబర్‌లో జాతికి అంకితం చేస్తున్నాం. నాడు వెలవెల.. నేడు కళకళ బాబు హయాంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయలేదు. గండికోటకు 27 టీఎంసీల సామర్థ్యం ఉంటే 10–12 టీంఎసీలు కూడా నిల్వ చేయలేదు. చిత్రావతి సామ ర్థ్యం 10 టీఎంసీలు కాగా 2–3 టీఎంసీలను కూడా నిల్వ చేయని దుస్థితి. బ్రహ్మంసాగర్‌కు 17 టీఎంసీల సామర్థ్యం ఉంటే నాడు నీళ్లు అందని పరిస్థితి. మీ బిడ్డ సీఎం అయ్యాక కాలువల సామర్థ్యాన్ని పెంచాం. ప్రతి ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ కోసం డబ్బులిచ్చాం. దీంతో పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేయగలుగుతున్నాం. గాలేరు –నగరి సుజల స్రవంతిలో అవుకు రెండో టన్నెల్ పనులను పూర్తి చేసింది కూడా ఈ ప్రభుత్వమే. ఇవన్నీ మంచి మనసు పెట్టి చేసిన పనులు. గతానికి, ఇప్పటికీ తేడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.2.35 లక్షల కోట్ల ను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. మరి నాడు బాబు ఎందుకు చేయలేకపోయారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో కలసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) లక్ష్యంగా వ్యవహరించారు. కళ్లెదుటే మార్పులు.. గ్రామ స్థాయిలో మీ స్కూళ్లలో గతానికి, ఇప్పటికీ మధ్య తేడాను గమనించండి. స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వచ్చింది. బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ ఇస్తున్నాం. ఆరో తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతిలో ట్యాబ్‌లు ఇస్తు న్నాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, అభివృద్ధి చేసిన పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు ఎప్పడూ చూడని విధంగా కనిపి స్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తు న్నాం. 53 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తు న్నాం. వ్యవసాయంలో ఆర్బీకేలు రైతన్నలను చేయి పట్టుకుని నడిపి స్తున్నాయి. ఈ– క్రాపింగ్ నుంచి పంట కొనుగోలు వరకు మంచి జరుగుతోంది. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్న మన ప్రభు త్వానికి ఆశీస్సులు అందించాలని కోరుతున్నా. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు గుమ్మనూరు, అంబటి, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్, ఎమ్మెల్యేలు ఆర్థర్, శిల్పా రవి, కంగాటి శ్రీదేవి,రాంభూపాల్‌రెడ్డి, చక్రపాణి రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్‌ఖాన్, చెన్నకేశవరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఇషాక్, మధుసూదన్, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సుగుణాల మారాజు – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి ‘కరువు సీమకు పండుగ పూట బహుమానం ఇచ్చేందుకు సీఎంజగన్ వచ్చారు. కర్నూలు జిల్లా శతాబ్దాలుగా ఎన్నో కరువులు చూసింది. ఒక్క ఎకరాకూ నీటి పారుదల లేని ప్రాంతం డోన్. రెయిన్‌గన్ ద్వారా నీళ్లిస్తామని గత పాలకులు బూటకపు మా టలు చెబితే ఈ రోజు 77 చెరువులు, వంద గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం మాది. చెరువులకు నీళ్లు ఇవ్వడంతో భూగర్భ జలాలు పెరిగి భూములు సస్యశ్యామలం కానున్నాయి. సుగుణాలన్నీ ఉన్న మారాజు మన జగన్. అ వినీతికి పాల్పడి చంద్రబాబు జైలుకు వెళితే నిరసన దీక్షలు ఏమిటి? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి దీనికి మద్దతు ప్రకటించడం ఎంత దారుణం? ప్రజలకు చైతన్యం లేదని, పిరికి వాళ్లు కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కుంభకోణాలు, కుట్రలను చట్ట సభల సాక్షిగా ప్రజలకు తెలియచేస్తాం’ -
నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది: సీఎం జగన్
సాక్షి, నంద్యాల/డోన్: రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు కాబట్టే సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది అని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్. కాగా, ముఖ్యమంత్రి జగన్ డోన్ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నమ్మకం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. చంద్రబాబు ఉద్దేశ్యం రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఇవన్నీ ఈనాడు రాయదు.. చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం ఢంకా భజాయిస్తుంది. ఒక టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసి బ్రహ్మండంగా చేసిందని చెబుతుంది. ఇలా దుర్మార్గమైన ఆలోచనతో చేసిందే చంద్రబాబు పాలనంతా. టీడీపీ హయంలో జరిగిదంతా.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. దోచుకోవడం గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలో ప్రారంభమైతే.. చివరకు దత్తపుత్రుడి షేరింగ్‌తో ఎండ్ అవుతుంది’ సీమ కష్టాలు మీ బిడ్డకు తెలుసు.. రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. కరువు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మెట్ల ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందుతుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదు. కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం.. నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నాను. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. హంద్రీనీవాను దివంగత మహానేత వైఎస్సార్ పూర్తి చేశారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు తీసుకున్నాం. రూ. 253 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పట్టించుకోని పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టాం. వెలుగొండ ప్రాజెక్ట్‌ను వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నాం. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది మన ప్రభుత్వం. మీ బిడ్డ ప్రభుత్వంలో తేడాను గమనించండి.. గతంలో ఇదే బడ్జెట్. అప్పటి కంటే ఇప్పుడు అప్పులు తక్కువ చేశాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2లక్షల35వేల కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది?. మా ఊరిలో స్కూళ్లను, ఆసుపత్రులను గమనించండి. వైద్య, విద్య, సంక్షేమంలో మన ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దొంగల ముఠా అబద్దాలు, మోసాలను ప్రజలు నమ్మవద్దు. ఈ ముఠా రానున్న కాలంలో మరిన్ని అబద్దాలను వడ్డిస్తుంది. మన ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. -
నంద్యాల జిల్లా డోన్ లో నూతన పురపాలక భవనాన్ని ప్రారంభించిన మంత్రులు
-
టీడీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలికి వేధింపులు
సాక్షి, డోన్: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత చండ్రపల్లె వెంకటరమణ ఆచారి.. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని లొంగదీసుకునేందుకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు సోమవారం పోలీసులను కలిసి వెంకటరమణ ఆచారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డోన్ సీఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పీఏనంటూ వెంకటరమణఆచారి విశాఖకు చెందిన బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె విసుగు చెంది సోమవారం కొందరు మహిళా ప్రతిని«ధులను వెంట తీసుకుని వైజాగ్ నుంచి డోన్‌కు వచ్చి వెంకటరమణ ఆచారిని నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆచారి, ఆయన కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. సొంత పార్టీలోనే మహిళా నేతకు రక్షణ కరువైంది.. రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న తన పట్ల ఆచారి ప్రవర్తించిన తీరుపై పలు మార్లు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నత పదవిలో ఉన్న తనకే సొంత పార్టీ నేతల నుంచి రక్షణ కరువైందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం) -
చంద్రబాబుపై కేఈ ధిక్కార స్వరం
డోన్: తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ధిక్కార స్వరం వినిపించారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని ప్రభాకర్ తిరస్కరించారు. డోన్ నియోజకవర్గంలో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేఈ ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నారు. తన జన్మదిన వేడుక సందర్భంగా బుధవారం డోన్‌లో ఓ ఫంక్షన్ హాలులో సభ నిర్వహించి, తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘40 ఏళ్లుగా కేఈ కుటుంబానికి డోన్ కంచుకోట. నేను జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా జనామోదంతో రాష్ట్ర మంత్రి వరకు ఎదిగాను. ఇప్పుడు ఎలాంటి అనుభవం, జనామోదం లేని వ్యక్తికి నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. తమకు జన బలం, ధన బలం కూడా ఉందనే సంగతి ఎవ్వరూ మర్చిపోవద్దని అన్నారు. ఒంట్లో శక్తి కూడా తగ్గలేదని అన్నారు. కచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఈ విషయంలో కార్యకర్తలు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టిక్కెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతామని నేరుగా చంద్రబాబుకే స్పష్టం చేసినట్లు కేఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కేఈ జన్మదిన వేడుకకు హాజరుకాకుండా ఉండేందుకు సుబ్బారెడ్డి బుధవారమే నంద్యాలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. -
గుండెల్ని కదిలించేలా.. ఈపాటి విశ్వాసం మనిషికెక్కడిది?
మనిషికి విశ్వాసం ఏమాత్రం?.. మూగజీవాలతో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువే!!. ఇది నిరూపించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది. ఆప్యాయంగా ఆయన్ని చూస్తూ.. హత్తుకుని.. కాసేపు అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్.. అడవి నుంచి వచ్చిన ఓ కొండముచ్చుకు రోజూ తిండి పెట్టేవారట. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన పార్థీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. ఆ కొండముచ్చు ఇలా తన విశ్వాసం.. ప్రేమను ప్రదర్శించింది. మరో ఘటనలో.. నంద్యాల డోన్ పట్టణం పాతపేటలో తనకు తిండి పెట్టిన ఓ మహిళ చనిపోతే శవయాత్రలో ఆ కొండ ముచ్చు పరుగులు తీసిన వీడియో ఒకటి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బలిజ లక్ష్మీదేవి అనే మహిళ బజ్జీల కొట్టు నడిపిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది. అలా రోజూ వచ్చే కొండముచ్చుకు.. మంగళవారం నాడు లక్ష్మీదేవి కనిపించలేదు. ఆకస్మాత్తుగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బంధవులు అంత్యక్రియల కోసం శవయాత్రను ఓ వాహనంలో నిర్వహించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఆ కొండముచ్చు ఆ వాహనం వెంట పరుగులు తీయడాన్ని కొందరు రికార్డు చేసి వైరల్ చేశారు. All lives, #animals #birds #plants have intelligence & emotions. #Monkey mourns death of man who fed every day. By kissing him. Touching. Happened in #Srilanka. Mattaglabbu. pic.twitter.com/nBLKEW2JUZ — Straight Talk India (@sttalkindia) October 20, 2022 -
Dhone: ఆలంకొండలో విషాదం
డోన్ (నంద్యాల): ఆకర్షణకు, ప్రేమకు మధ్య వ్యత్యాసం తెలియని వయస్సు వారిది. సినిమాల ప్రభావంతోనో, సామాజిక మాధ్యమాల్లో అతి స్పందనలతోనో.. మరే కారణంతోనో ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు పెద్దలు అడ్డుచెప్పారు. అబ్బాయికి బలవంతంగా అక్కకూతురుతో పెళ్లి చేశారు. తమ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు తెలియక మనస్తాపం చెందిన ఇద్దరు ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణగిరి మండలం అలంకొండ గ్రామానికి చెందిన బోయ మాదులు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు బోయ ప్రసాద్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు. గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చాకలి రామాంజనేయులు, లింగమ్మ దంపతుల కుమార్తె అనిత (16) పదో తరగతి పూర్తి చేసింది. వీరిరువురూ రెండు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. బోయ ప్రసాద్‌కు రెండు నెలల క్రితం అతని సొంత అక్క కూతురుతో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు మంగళవారం రాత్రి వారివారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి డోన్ మండల పరిధిలోని మల్యాల గ్రామం సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి అత్మహత్య చేసుకున్నారు. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) బుధవారం ఉదయం రైల్వే ట్రాక్‌మెన్ సుధాకర్ మృతదేహాలను చూసి మల్యాల స్టేషన్ మేనేజర్ రాంబాబుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి వెల్దుర్తి సీఐ యుగంధర్, సీఆర్పీఎఫ్ పోలీస్ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ కిరణ్‌కుమార్ తెలిపారు. ఆలంకొండలో విషాద ఛాయలు కృష్ణగిరి: ప్రేమజంట గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో ఆలంకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలభై రోజుల క్రితం ఈతకెళ్లి నలుగురు చిన్నారులు కరెంట్‌షాక్‌తో మృతి చెందారు. అదే రోజు బోయ ప్రసాద్ తన అక్క కూతురుతో పెళ్లి చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మరో అమ్మాయితో కలిసి ప్రసాద్ రైలు కిందపడి మృతి చెందడం అందరినీ కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గ్రామానికి తీసుకురాగా బందోబస్తు మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com -
నేనేమి పాపం చేశానమ్మా..
సాక్షి, కర్నూలు రాజ్‌విహార్: కన్నపేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు తల్లిదండ్రులు. ఆడపిల్లా అని అలా చేశారో మరెమో తెలియదు కానీ తల్లి ఒడిలో ఉండాల్సిన పాప అనాథగా మిగిలింది. డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న యశోద ఆసుపత్రికి గత నెల 30 తేదీ తెల్లవారు జామున ఒక నిండు గర్బిణి పురిటి నొప్పులతో వచ్చింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వివరాలు ఏమీ అడగకుండా తొలుత కాన్పు చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత వివరాలు అడగగా తన భర్త, తల్లిదండ్రులు కింద ఉన్నారని వారిని కలవమంది. వారిని సంప్రదించగా కొద్ది సేపటి తర్వాత ఇస్తామని చెప్పి శిశువును అక్కడే వదిలేసి బాలింతతో కలిసి ఉడాయించారని డాక్టర్ సుంకన్న తెలిపారు. మాట్లాడుతున్న ఐసీడీఎస్ అధికారులు ఈ విషయం పోలీసులకు తెలియజేసి.. పాప కోసం ఎవ్వరైనా వస్తారేమోనని వేచి చూశామన్నారు. శుక్రవారం వరకు ఎవ్వరూ రాకపోవడంతో ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆశిశువును కర్నూలు శిశుమందిర్‌కు తరలించారు. చిన్నారిని 30 రోజుల్లోపు సంబంధికులు తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీర్మానం ద్వారా అనాథగా గుర్తించి చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికార అధికారి కేఎల్‌ఆర్‌కే కుమారి తెలిపారు. వివరాలకు కర్నూలు కలెక్టరేట్లోని తమ కార్యాలయం లేదా సి.క్యాంప్ వద్ద ఉన్న శిశుగృహంలో సందర్శించాలని సూచించారు. -
భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం
సాక్షి, డోన్ టౌన్: మండలంలోని చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన మాధవి అనే నవ వధువు అదృశ్యమైనట్లు రూరల్ ఎస్ఐ సురేష్ మంగళవారం తెలిపారు. ఈనెల 10వ తేదీన మాధవికి అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నేపల్లె గ్రామానికి చెందిన కొత్తరాయుడితో వివాహమైంది. తిరిగింపు, మరిగింపుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన నూతన దంపతులు చిన్నమల్కాపురానికి చేరుకున్నారు. అదే రోజు భర్తకు అన్నం వడ్డించి పక్కనే ఉన్న అంగడికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మాధవి తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువుల ఊళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం ఆమె భర్త కొత్తరాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ.. భరించలేక..) -
దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో..
డోన్ టౌన్: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ఏటీఎంలో డబ్బు పెట్టిన అధికారులు, ఆ తర్వాత మిషన్ తాళాలు కూడా అక్కడే మరచిపోయారు. ఈ సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. ఇటీవల పట్టణంలో ఎస్బీఐ ఏటీఎంను దొంగలు కొల్లగొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్ అధికారులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్ పోచా ప్రభాకర్‌రెడ్డి క్లినిక్ ఎదురుగా ఉన్న సిండికేట్ ఏటీఎంలో డబ్బులు పెట్టి తాళాలు వేశారు. అయితే మిషన్‌కు సంబంధించిన తాళాలు అక్కడే మరచిపోయారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాళాలు గుర్తించి బ్యాంక్ అధికారులకు అప్పగించారు. ఒక వేళ దొంగల చేతికి తాళాలు చిక్కి ఉంటే మరో చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇవీ చదవండి: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! -
గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంలు తెరిచి.. రూ.65 లక్షలు ఊడ్చేశాడు
డోన్ టౌన్: కర్నూలు జిల్లా డోన్ పట్టణ నడిబొడ్డున గల ఏటీఎం సెంటర్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న రెండు ఏటీఎం మెషిన్లను గ్యాస్ కట్టర్ సహాయంతో తెరిచి రూ.65,44,900ను అపహరించుకుపోయాడు. స్థానిక శారద కాన్వెంట్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం కేంద్రానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న రెండు మెషిన్లలో శుక్రవారం బ్యాంక్ అధికారులు రూ.80 లక్షల నగదు ఉంచారు. ఆదివారం రాత్రి వరకు రూ.14,55,100 నగదును వినియోగదారులు విత్ డ్రా చేసుకోగా.. మిగిలిన రూ.65,44,900ను దుండగుడు అపహరించాడు. మంకీ క్యాప్ ధరించి.. ఆపై టోపీ పెట్టాడు ఆదివారం రాత్రి 2.50 గంటల సమయంలో మంకీ క్యాప్, దానిపై మరో టోపీ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కేంద్రం ముందు బయట వైపున ఉన్న సీసీ కెమెరా ధ్వంసం చేసి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశాడు. తన వెంట తెచ్చుకున్న చిన్న గ్యాస్ కట్టర్, ఐరన్ రాడ్డు, వాటర్ బాటిల్ సాయంతో రెండు ఏటీఎంలను లాఘవంగా తెరిచాడు. గ్యాస్ కట్టర్ వినియోగించే సమయంలో నోట్లు కాలిపోకుండా నీళ్లు పోస్తూ పని ముగించినట్టు లోపల ఉన్న మరో సీసీ కెమెరాలో రికార్డయింది. సోమవారం ఉదయం ఏటీఎం కేంద్రం బయట సీసీ కెమెరా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ విషయం వెలుగు చూసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం పడటంతో ఆ దారిలో ఎవరూ వెళ్లకపోవడం కూడా ఆగంతకుడికి అనుకూలించింది. సీఐ మల్లికార్జున, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా క్రైం విభాగపు డీఎస్పీ శ్రీనివాస్ ఏటీఎం కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంక్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ బి.ప్రాన్సిస్ రుబిరో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తుడా లేక ఏటీఎం మెషిన్ల తయారీ, మెకానిజంలో నైపుణ్యం గల వ్యక్తా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దొంగను గుర్తించేందుకు పట్టణంలో అన్నివైపులా గల సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
వృత్తి భిక్షాటన.. సంపాదన రూ.2.04 లక్షలు
సాక్షి, కర్నూలు : డోన్ పట్టణంలోని కొండపేట బీసీ హాస్టల్ పక్కన ఉన్న మసీదు వద్ద భిక్షాటన చేసే శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.2,04,459 నగదు లభించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను అనే వృద్ధుడు మూడేళ్ల నుంచి డోన్‌లో భిక్షాటన చేస్తున్నాడు. స్థానికుల కోరిక మేరకు అతనికి సపర్యలు చేసేందుకు ద్రోణాచలం సేవా సమితి సభ్యులు సోమవారం ఉపక్రమించగా అతని వద్దనున్న 14 చొక్కాల్లోని ప్లాస్టిక్ కవర్లలో మడత వేసి ఉంచిన రూ.2.04 లక్షల విలువైన నోట్లను గుర్తించారు. మహబూబ్‌నగర్ పోలీసుల సహాయంతో శ్రీను చిరునామా తెలుసుకునేందుకు డోన్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ద్రోణాచలం సేవా సమితి సభ్యుడు ఆలా మధు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్ ) -
తిట్టుకున్న ‘తమ్ముళ్లు’
కర్నూలు, డోన్: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఏర్పాటుచేసిన టీడీపీ డోన్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నేతల ప్రమేయముందని పోలీసుల విచారణలో వెల్లడికావడంతో శుక్రవారం జరిగిన సమావేశం పట్ల పార్టీ కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే సభావేదిక ఏర్పాటులో లోటుపాట్లపై రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్.. కార్యక్రమ నిర్వాహకులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కోట్రికె ఫణిరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. చేతకాకపోతే కార్యక్రమాల నిర్వహణ నుంచి తప్పుకోవాలని నాగేశ్వరరావ్ అనగా.. చేతకాని వాళ్లే ఎక్కువ మాట్లాడతారని ఫణిరాజ్ దీటుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. ధర్మవరం సుబ్బారెడ్డి వర్సెస్ పెద్ద కేశవయ్య గౌడ్ .. గత ఎన్నికల్లో పార్టీ ఓటమిపై డోన్ మాజీ సర్పంచ్ పెద్ద కేశవయ్య గౌడ్ మాట్లాడుతుండగా.. ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎలా పాల్గొంటావని ధర్మవరం సుబ్బారెడ్డి ఆగ్రహంతో కేశవయ్య గౌడ్ వైపు దూసుకువెళ్లి ప్రశ్నించారు. దీనికి కేశవయ్య గౌడ్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ టీడీపీలో ఉండి కూడా నీ మాదిరి ద్వంద్వ ప్రమాణాలు పాటించనని ఎత్తిపొడిచారు. దీంతో ఒక్కసారిగా సమావేశం రసాభాసాగా మారింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కలుగచేసుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. నకిలీ మద్యం వ్యవహారంలో స్పష్టత ఇస్తారని ఆశించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సమావేశం తీవ్ర నిరాశ కలిగించింది. పార్టీ ఓడిన తర్వాత కూడా టీడీపీ అగ్ర నాయకులు ఆత్మ విమర్శ చేసుకోకుండా పరస్పరం నిందించుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం చూసి కార్యకర్తలు నివ్వెరపోయారు. ఇలాంటి వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సమైక్యంగా నిలబడి పార్టీని ఎలా గెలిపించగలరనే సందేహాన్ని టీడీపీ కార్యకర్తలు బాహాటంగావ్యక్తపరుస్తున్నారు. -
అమ్మ ఎక్కడుంది నాన్నా?!
సాక్షి, కర్నూలు : అమ్మతోటే వారి లోకం..ఏ అవసరమొచ్చినా తల్లినే అడిగేవారు.. ఆకలేసినా..ఆపదొచ్చినా..అమ్మ ఉందనే ధైర్యం వారిలో ఉండేది. తండ్రి మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకునే వాడు కాదు.. తల్లే పిల్లల ఆలనాపాలనా చూస్తుండేది. అయితే మద్యం పెట్టిన చిచ్చు ఆ ఇంట్లో ఇల్లాలిని బలితీసుకుంది. నలుగురు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. ‘‘నాన్నా..అమ్మ ఎక్కడుంది’’ అంటూ చిన్నారులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వివరాలు ఇవీ.. డోన్ పట్టణం ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఈరన్నకు సమీపంలోని అబ్బిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వరలక్ష్మికి 2004లో వివాహమైంది. ఈరన్న గతంలో గౌండా పని చేసుకుని జీవనం సాగించేవాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనికి సంబంధించిన రేకులు బాడుగకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య వరలక్ష్మి(30) ఇళ్లకు పెయింటింగ్ వేసే పనికి వెళ్లేది. వీరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో మద్యం చిచ్చుపెట్టింది. సరదాగా ప్రారంభమైన మద్యం అలవాటుకు ఈరన్న క్రమంగా బానిసయ్యాడు. చీకటి పడగానే పని నుంచి ఇంటికి వచ్చే భర్త తాగి రావడం భార్య వరలక్ష్మికి నచ్చలేదు. మద్యం మానాలని పలుమార్లు చెప్పి చూసింది. మద్యం వల్ల కలిగే అనర్థాలు, చుట్టుపక్కల జరిగిన ఘటనల గురించి భర్తకు చెప్పేది. రోజూ మద్యం మానతానని చెప్పి తిరిగి తాగి రావడంతో వరలక్ష్మికి విసుగు పుట్టింది. ఈ విషయమై ఆదివారం రాత్రి భర్తతో గొడవ పడింది. ఈ క్రమంలో ఇరువురి మధ్యా వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో చేయి చేసుకున్నాడు. దీంతో వరలక్ష్మి మనస్తాపానికి గురై సోమవారం ఉదయం భర్త ఇంట్లో లేని సమయంలో టీలో పేల నివారణకు ఉపయోగించే మందును కలిపి ముందుగా పిల్లలకు ఇచ్చింది. ఆ తర్వాత తానూ తాగింది. కాసేపటికి భర్త ఇంటికి వచ్చి నోట్లో నురగలు కక్కుతున్న వారిని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరలక్ష్మి కొద్దిసేపటికే మృతిచెందింది. పిల్లలు ఇందు(12), ఉమాదేవి(10), ఉదయ్‌కుమార్(6), ఐశ్వర్య(4)చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. వీధిలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, ఆత్మహత్యాయత్నం చేసినా ఎందుకిలా చేశారంటూ ధైర్యం చెప్పే తన భార్య ఇంత పని చేస్తుందనుకోలేదని భర్త ఈరన్న కన్నీరుమున్నీరయ్యాడు. కాగా తల్లి మరణ విషయం తెలియక అమ్మ ఎక్కడుందని పిల్లలు అడుగుతుండటం చూసి పలువురు కంట తడిపెట్టారు. డోన్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి శంషాద్ బేగం డోన్‌లోని మృతురాలి ఇంటి వద్దకు చేరుకొని ఇరుగు పొరుగును విచారించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వారి వారి పరిధుల్లోని ప్రజల జీవన పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు. -
విషం కలిపిన కాఫీ పిల్లలకు ఇచ్చి.. తల్లీ అఘాయిత్యం
సాక్షి, కర్నూలు: జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. డోన్ తారకరామ నగర్‌కు చెందిన వరలక్ష్మీ అనే మహిళ.. విషం కలిపిన కాఫీని తన నలుగురు పిల్లలకు ఇచ్చి.. ఆ తర్వాత తాను కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. నలుగురు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. బాధితులకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం : మంత్రి బుగ్గన
సాక్షి, ప్యాపిలి/డోన్: తాము టీడీపీ నేతల మాదిరి మోసం చేసే వాళ్లం కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా ఆదివారం ఆయన ప్యాపిలి పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా నిర్వహించిన సభలో బుగ్గన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు పాదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతి పనికీ సర్‌చార్జ్ వసూలు చేశారన్నారు. కందులు, శనగలు కొనుగోలులో రైతుల నుంచి ఖాళీ సంచులు కూడా వదిలిపెట్టలేదన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సైతం భోంచేసిన ఘనత టీడీపీ నాయకులకే దక్కిందన్నారు. అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ప్యాపిలి బహిరంగ సభకు హాజరైన ప్రజలు ఈ పరిస్థితులను చూసి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. నీతి, నిజాయతీతో కూడిన పాలన అందించాలన్న తపనతో నియోజకవర్గంలోని అన్ని కార్యాలయాల్లో చిత్తశుద్ధి కలిగిన అధికారులను నియమించామన్నారు. కేకే (కోట్ల, కేఈ కుటుంబాల)ల పాలనలో డోన్ నియోజకవర్గం ఈ 50 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో ఈ ఐదేళ్లలో చేసి చూపుతామన్నారు. కార్యక్రమంలో ప్యాపిలి, డోన్ జెట్పీటీసీ సభ్యులు దిలీప్ చక్రవర్తి, శ్రీరాములు, మండల నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, రాజా నారాయణమూర్తి, గౌసియాబేగం, వెంకటేశ్వరరెడ్డి, బోరా మల్లికార్జునరెడ్డి, బషీర్, శ్రీనివాసరెడ్డి, సీమ సుధాకర్ రెడ్డి, జంగం చంద్రశేఖర్, కమతం భాస్కర్ రెడ్డి, బోరెడ్డి పుల్లారెడ్డి, సోమశేఖర్, రామచంద్రారెడ్డి, కొండయ్య, ఎస్కే వలి, జలదుర్గం రసూల్, రమేశ్ రెడ్డి, ఇమాముద్దీన్, రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్యను గాలికొదిలారు గత పాలకులు డోన్ పట్టణంలో నీటి సమస్యను గాలికి వదిలేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన మండి పడ్డారు. మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం డోన్‌లో మునిసిపాలిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గం మంచినీటి పంపిణీ వ్యవస్థపై నిర్లక్ష్యం వహించిందన్నారు. భవిష్యత్తులో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలను తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. డోన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయాలని, పాత బోర్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలని మంత్రికి వైఎస్సార్సీపీ నాయకులు కోట్రికె పద్మజ, చిన్నకేశవయ్య గౌడ్, కోట్ల హరిశ్చంద్రారెడ్డి విన్నవించారు. సమీక్షలో మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, ఈఈ రామ్మోహన్ రెడ్డి, డీఈ నాగభూషణం పాల్గొన్నారు. -
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
డోన్ రూరల్ : గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ ఖాదబాషా అన్నారు. మండల పరిధిలోని కోట్లవారిపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో సోమవారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలను భయభ్రాంతుకు గురిచేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదన్నారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మట్కా, పేకాట, మద్యం వంటి వాటికి గ్రామ ప్రజలు దూరంగా ఉండాలన్నారు. గొడవలు సృష్టిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పారు. గ్రామాలల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హోటల్, దుకాణాల వారు తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ.మధుసుధన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రియురాలే హంతకురాలు
సాక్షి, డోన్(కర్నూల్) : ప్రియుడి హత్య కేసులో ప్రియురాలితో పాటు మరో ఇద్దరిని డోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కంబగిరి రాముడు తెలిపిన వివరాలు..మండలంలోని ఉంగరానిగుండ్ల గ్రామానికి చెందిన ఖాజావలి అలియాస్ కుంటోడు (38), కృష్ణగిరి మండలం కటారుకొండకు చెందిన బలిజ అనసూయమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని డోన్ పట్టణంలోని వైఎస్సార్ నగర్లో కాపురం ఉండేవాడు. అనసూయమ్మ ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తుండేది. ఇంటికి వచ్చిన అమ్మాయిలను ఖాజావలి మద్యం తాగి వేధిస్తుండటం, డబ్బుల కోసం తరచూ గొడవ పడి కొడుతుండటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఈ క్రమంలో స్థానికులు కమ్మరి సురేంద్రమోహన్, షేక్ ముక్తియార్ అలీతో కలిసి హత్యకు పథకం రచించింది. ఇందులో భాగంగా గత నెల 12న రాత్రి 10 గంటలకు మద్యం తాగేందుకని ఖాజావలిని సురేంద్రమోహన్, షేక్ ముక్తియార్ అలీ బయటకు తీసుకెళ్లారు. పూటుగా మద్యం తాపి బండరాళ్లతో తలపై మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు ఈడ్చుకెళ్లి ట్రాక్‌పై పడేశారు. మరుసటి రోజు ఉదయం సమాచారం అందుకున్న హతుని సోదరుడు హుసేన్‌అలీ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం అర్బన్ స్టేషన్‌కు బదిలీ చేయడంతో పది రోజుల క్రితం సురేంద్రమోహన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి డోన్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారని సీఐ తెలిపారు.