digvijaya singh
-
అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్‌పై వేటు తప్పదా?
న్యాయ్యవస్థలో అత్యంత కీలమైన వారు న్యాయమూర్తులు. రాగద్వేషాలకు అతీతంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) మద్దతుగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిచేందుకు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు యత్నిస్తున్నాయి.అసలేంటి వివాదం?ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం (డిసెంబర్ 8) అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు.పదవి నుంచి తొలగించాల్సిందేజస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతసామరస్యాన్ని భంగపరిచేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తాయి. న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తప్పించేందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేయగా సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా బలపరిచారు. రాజ్యసభలో విపక్ష సభ్యుల నుంచి బుధవారం నాటికి 38 మంది సంతకాలు సేకరించారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది.అంత ఈజీ కాదు..హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుడిని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద వ్యవహారమే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లో దీని ప్రస్తావన ఉంది. న్యాయమూర్తిని తొలగించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌ను అందజేయాలి. పార్లమెంట్లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని అదే సెషన్లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.చదవండి: మందిర్- మసీదు పిటిషన్లపై ‘సుప్రీం’ సంచలన ఆదేశాలుఅయితే ఇదంతా మనం చెప్పుకున్నంత సులభమేమీ కాదు. పార్లమెంట్లో తీర్మానాన్ని చర్చకు అంగీకరించడానికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించిన పక్షంలో లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తి పదవీత్యుడయ్యారనేలా ఈ వ్యవహారం సాగుతుంది. కాగా, తాజా వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.గతంలోనూ తీర్మానాలుహైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. 1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు. 2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. -
మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించిన దరిమిలా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు. కోవిడ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను కలుసుకునేందుకు కొద్ది రోజులపాటు ఎవరూ రావద్దని దిగ్విజయ్ కోరారు. मेरा COVID test पॉजिटिव आया है। मुझे ५ दिनों के लिए आराम करने के लिये कहा गया है। इसलिए मैं कुछ समय के लिए नहीं मिल पाऊँगा। क्षमा करें। आप सभी भी COVID से बचने के लिए अपना ख़्याल रखें।— Digvijaya Singh (@digvijaya_28) August 20, 2024 -
‘ఆఖరి పోరాటం’లో దిగ్విజయ్‌కు పరాభవం?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ పలువురు సీనియర్ నేతల అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తనకు ఇవే చివరి ఎన్నికలంటూ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచిపోటీకి దిగారు.భవిష్యత్‌లో తాను పోటీ చేయబోనని, యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పిస్తానని రాజ్‌నాథ్ తెలిపారు. పీపుల్స్ ఇన్సైట్, పోల్‌స్ట్రాట్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ డేటా దిగ్విజయ్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురుకానున్నదని చెబుతున్నాయి.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క లోక్‌సభ సీటు కూడా దక్కదని పీపుల్స్ ఇన్సైట్, పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో 2019లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. రాజ్‌గఢ్ సీటు బీజేపీ ఖాతాలో పడింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కూడా ఈ సీటును బీజేపీ కైవసం చేసుకోనుంది.దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ రోడ్మల్ నాగర్‌ను పోటీకి నిలబెట్టింది. 2014, 2019లలో రాజ్‌గఢ్ లోక్‌సభ ఎన్నికల్లో రోడ్మల్ విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసారి కూడా రోడ్మల్‌కే విజయ సంకేతాన్ని చూపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. -
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మూడో దశలో పోలింగ్ మే 7న జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన ఇవి తన జీవితంలో చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు.దిగ్విజయ్ సింగ్ తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’ హ్యాండిల్లో రాజ్‌గఢ్ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. దానిలో ఆయన ‘నేను నా తండ్రి మరణించాక ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని రాజ్‌గఢ్ వచ్చాను. నాడు ఇక్కడి ప్రముఖుడు కస్తూర్ చంద్ జీ కఠారీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన నాతో ప్రతీ వ్యక్తి జీవితంలో 12 లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించేంతటి సంపాదన ప్రతీ వ్యక్తికి అవసరమని, అలాగే పొదుపు చేయాలని, నగలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఇవన్నీ సమకూరితే అదృష్టవంతుడివని, అప్పుడు పేరు సంపాదించుకోవాలని వివరించారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాగే ప్రయత్నించాను. అందులో నేను ఎంతవరకూ సక్సెస్ అయ్యానో నేనే అంచనా వేయలేను. సామాన్యులు మాత్రమే అలా చేయగలరు. ఇవి నా జీవితంలో చివరి ఎన్నికలు. వీటిలో నేను ఎంతవరకు విజయం సాధిస్తానో మీరే నిర్ణయిచాలి’ అని పేర్కొన్నారు.మే 7వ తేదీన రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దిగ్విజయ్ సింగ్ 10 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980- 90వ దశకంలో రాజ్‌గఢ్ నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత తన సొంత ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలు దిగ్విజయ్ సింగ్ ప్రతిష్టకే కాదు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భవిష్యత్తుకు కూడా కీలకం కానున్నాయి. -
‘400 మందితో నామినేషన్ వేయిస్తా’
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్‌గఢ్‌లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. రాజ్‌గఢ్‌లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. "రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు. -
కాంగ్రెస్ 4వ జాబితా
-
33 ఏళ్ల తర్వాత రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని అధిష్ఠానం తనను ఆదేశించిందని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి నుండి నిరాకరిస్తూనే వస్తున్నారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని గతంలో స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని 29 లోక్‌సభ స్థానాలకు బీజేపీ జాబితా విడుదల చేసినా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీలోని దిగ్గజ నేతలను రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ప్రకటనతో కాంగ్రెస్ మద్దతుదారులు బాణాసంచా కాల్చి, తమ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల తర్వాత తిరిగి రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గమనార్హం. కాగా ఇవే ఆయనకు ఆఖరి ఎన్నికలు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
మోదీ ‘అన్యాయ్‌కాల్’కు కౌంట్‌డౌన్ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ హయాంలోని పదేళ్ల ‘అన్యాయ్‌కాల్’కు కౌంట్‌డౌన్ మొదలైందని, త్వరలోనే అది ముగుస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మోదీ ఇచ్చిన హామీలు గత పదేళ్ల కాలంలో ఒక్కటి కూడా అమలు కాలేదని, కానీ వాగ్దానాలతో చేసిన ఆయన ప్రసంగాలు ఇంకా ప్రజల జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తున్నాయని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన సందర్భంగా పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీని రెండేళ్లయినా పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలో రైతుల తాజా ఆందోళనను నిలువరించేందుకు డ్రో న్లు ఉపయోగించి గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో గ్యాస్ సిలెండర్ ధరలు రెండింతలు పెరిగాయని, దేశ అప్పులు మూడు రెట్లు పెరిగాయని, దేశంలోని ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరిన పఠాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన నీలం మధు గురువారం దీపాదాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయనను దీపాదాస్మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Video: పార్టీ కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతల ఘర్షణ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్ నాథ్ మద్దతుదారుల మధ్య వివాదం చెలరేగింది. నేతలు ఒకరిపై మరొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార ప్రతినిధి షహర్యార్ ఖాన్, కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం మాజీ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ మధ్య వివాదం చెలరేగింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై దిగ్విజయ్ సింగ్‌ని ప్రదీప్ దుర్భాషలాడాడని షహర్వార్ ఖాన్ ఆరోపించారు. కార్యాలయంలోనే నేతలు వాగ్వాదానికి దిగారు. మాటలు తీవ్రస్థాయికి చేరాక ఘర్షణకు దిగారు. కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇతర నేతలు, సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. कमलनाथ जी समर्थक द्वारा दिग्विजय सिंह जी को गाली बकने को लेकर पीसीसी में जमकर चले लात-ठूँसे... कुर्सियाँ चली , जमकर एक दूसरे को गालियाँ बकी गई... बीचबचाव करने आये कमलनाथ समर्थक एक नेता को भी लात-ठूँसें पड़े... pic.twitter.com/wtWQ0sFsWp — Narendra Saluja (@NarendraSaluja) January 29, 2024 మధ్యప్రదేశ్‌లో గత నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. బీజేపీ గణవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న కమల్ నాథ్ సారథ్యంలో దిగ్విజయ్ సింగ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన లాలూ కుమారుడు -
Madhya Pradesh: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 230 స్థానాలు ఉండగా ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ 163 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ 66 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు అయితే ఈ ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులలో చాలా మంది ఓటమిని చవిచూశారు. ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్, మేనల్లుడు ప్రియవ్రత్ సింగ్ సహా చాలా మంది బంధువులు వారి వారి నియోజకవర్గాల్లో పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కొడుకు జైవర్ధన్ సింగ్ మాత్రమే రఘోఘర్ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇక దిగ్విజయ్ మద్దతుదారులు అనేక మంది ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యంగా లహర్ నియోజకవర్గం నుంచి డాక్టర్ గోవింద్ సింగ్, రౌ నియోజకవర్గం జీతూ పట్వారీ ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాలకు ముందు దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ గెలుపు పట్ల చాలా విశ్వాసంగా కనిపించారు. శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి ఎలాగైనా గణనీయమైన స్థానాలు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకోవాలని భావించినా ప్రజలు భిన్న తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతోపాటు దేశంలో అత్యంత సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు ప్రస్తుత ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయనే చెప్పుకోవాలి. -
Madhya Pradesh: ఇప్పుడా ద్రోహి లేడు.. దిగ్విజయ్ తీవ్ర వ్యాఖ్యలు
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శనివారం ఆయన రాష్ట్ర రాజధాని భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ద్విగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ‘మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా దగ్గర సింధియా లేడు. కాబట్టి ద్రోహి లేడు’ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌లోని దాతియాలో ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ సింధియాపై 'ద్రోహి' అంటూ విరుచుకుపడ్డారు. సింధియా తనతో ఎమ్మెల్యేలతో కలిసి 2020 మార్చిలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ 130 సీట్లకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత, దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ కూడా తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పారు. -
ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు?
మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ పూర్తయింది. డిసెంబర్ 3న వెలువడే ఫలితాల కోసం అటు ప్రజానీకం, ఇటు రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఫలితాలకు ముందే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైవిధ్యంగా ఉన్నాయని అన్నారు. దీని గురించి మేం ఇప్పుడే ఏమీ చెప్పలేమని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 130కి పైగా సీట్లు వస్తాయని భావిస్తున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనపై విసిగిపోయారని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో తమకు పోటీ లేదని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అన్నారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశం, అమిత్ షా వ్యూహాలు, జేపీ నడ్డా నాయకత్వం, కార్యకర్తల కృషి, బీజేపీ ప్రభుత్వ పథకాలు.. మొదలైనవన్నీ రాష్ట్రంలో బీజేపీకి మెజారిటీ వస్తుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవి-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 140 నుంచి 159 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది కూడా చదవండి: ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర! -
‘నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ దాడులు’
భోపాల్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు సోదాలు జరిపే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఇటీవలే రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై సోదాలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఆదివారం భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ దాడులను ప్రస్తావించారు. ఒకపక్క అధికారులను వేధిస్తున్న బీజేపీ నేతలు, మరోపక్క రాజస్తాన్ లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ సోదా లు జరిపిస్తారని అన్నారు. దాడులు జరగటానికి అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లను ఆయన పేర్కొన్నారు. -
దిగ్విజయ్–కమల్నాథ్లది జై– వీరూ బంధం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. దిగ్విజయ్, కమల్‌నాథ్‌ల మధ్య రాజకీయ సమీకరణాలను.. బ్లాక్ బస్టర్ ‘షోలే’ చిత్రంలోని ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు పోషించిన జై, వీరూ పాత్రల మధ్య బంధంతో కాంగ్రెస్ పార్టీ పోల్చింది. రాష్ట్రంలో టిక్కెట్ల కేటాయింపులో ఇద్దరు నేతల మధ్య విభేదాల వార్తలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా శనివారం పైవ్యాఖ్యలు చేశారు. ‘షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్‌ల మధ్య విలన్ గబ్బర్ సింగ్ ఎలా గొడవ పెట్టలేకపోయాడో.. రాష్ట్రంలో గబ్బర్ సింగ్ వంటి బీజేపీ కూడా మధ్య విభేదాలను సృష్టించలేకపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. -
Madhya Pradesh Election 2023: బరిలో డిగ్గీ సొంత సైన్యం!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలపై తన పట్టును మాజీ రాజ కుటుంబీకుడు దిగ్విజయ్ సింగ్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది... న్యూఢిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి పని చేసే పరిస్థితి లేనప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపే అంశాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. తమతో వారి (కాంగ్రెస్) ప్రవర్తన లాగే వారితో తమ ప్రవర్తన ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను మోసగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో తమకు తగిన బలం ఉందని, గతంలో రెండో స్థానంలో నిలిచామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చివరకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల విడు దల చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయా లపై తన పట్టును మా జీ రాజ కుటుంబీకుడు దిగ్వి జయ్సింగ్ మరో సారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది...తొలి జాబితా చాలా కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం! వివాదాస్పదుడైన సోదరుడు లక్ష్మణ్‌సింగ్‌తో పాటు కుమారుడు జైవర్ధన్, అల్లుడు ప్రియవ్రత్, అదే వరుసయ్యే అజయ్‌సింగ్ రాహుల్ పేర్లకు జాబితాలో చోటు దక్కింది. అజయ్‌సింగ్ రాహుల్ 68 ఏళ్లు. దిగ్విజయ్‌కి వరసకు కోడలి భర్త. రక్త సంబంధీకుడు కాకున్నా డిగ్గీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఐదుసార్లు ఎమ్మెల్యే. వింధ్య ప్రాంతంలో గట్టి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సిద్ధి జిల్లాపై పలు దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం ఆయన కుటుంబానిదే. ‘మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగింది కేవలం కుటుంబ పాలన మాత్రమేనని దిగ్విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. నా కుమారుడు ఆకాశ్ తనకు టికెటివ్వొద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇవీ మా పార్టీ పాటించే విలువలు!’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో పార్టీ సీనియర్ నేత. లక్ష్మణ్‌సింగ్ 68 ఏళ్లు. దిగ్విజయ్ తమ్ముడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీనీ వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు! 2004లో బీజేపీలో చేరి రాజ్‌గఢ్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. 2010లో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని విమర్శించి బహిష్కారానికి గురయ్యారు. 2018లో రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రియవ్రత్‌సింగ్ 45 ఏళ్లు. దిగ్విజయ్ మేనల్లుడు. కిల్చీపూర్ సంస్థాన వారసుడు. ఆ స్థానం నుంచే 2003లో అసెంబ్లీకి వెళ్లారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకుని 2008లో మళ్లీ నెగ్గారు. 2013లో ఓడినా 2018లో మంచి మెజారిటీతో గెలిచారు. కమల్‌నాథ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ దక్కించుకున్నారు. జైవర్ధన్‌సింగ్ 37 ఏళ్లు. దిగ్విజయ్ కుమారుడు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో సింధియాల కంచుకోట లను చేజిక్కించుకోవడంపై ఈసారి దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయుల్లో పలువురిని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేర్చారు. డూన్ స్కూల్లో చదివిన ఆయన కొలంబియా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమ మాజీ సంస్థానమైన రాఘవ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి 59 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. 2018లో దాన్ని 64 వేలకు పెంచుకోవడమే గాక కమల్ నాథ్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించు కున్నారు. -
దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. క్లారిటి
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. నకిలీ లేఖ అని పేర్కొంటూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు అభ్యర్థుల లిస్టు ప్రకటించిన వెంటనే దుష్ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలు ఈ ఘటనకు పాల్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. 'అబద్ధాలు అడటంలో బీజేపీకి మంచి పట్టుంది. 1971లో ఎలాంటి ఆశ లేకుండా కేవలం పార్టీ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకున్నాను. చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటాను. రాజీనామాకు సంబంధించి నకిలీ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న 230 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 144 మంది అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. ఇందులో దిగ్విజయ్ సింగ్ కుమారుడితో సహా సిట్టింగ్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగి పేర్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన రాజీనామా లేఖలో తన అనుచరులకు సీట్లు దక్కనందుకు దిగ్విజయ్ విచారం వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు దుండగులు పేర్కొన్నారు. భారమైన హృదయంతో పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడానికి నిర్ణయించుకున్నట్లు లేఖలో ఉంది. కాంగ్రెస్ తన మొదటి లిస్టులో పార్టీ చీఫ్ కమల్‌నాథ్‌తో పాటు 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది. ఇదీ చదవండి: ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు -
మూడు నెలలకోసారి సైబర్ రిస్క్ మదింపు
న్యూఢిల్లీ: టెక్నాలజీ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ సైబర్ రిస్కులను ఏడాదికోసారి కాకుండా మూడు నెలలకోసారి మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని డెలాయిట్ ఇండియా రిస్క్ అడ్వైజరీ పార్ట్నర్ దిగ్విజయసింహ చుదసమా తెలిపారు. కంపెనీలే కాకుండా ప్రజలు కూడా సైబర్ రక్షణ కోసం స్వీయ–మార్గదర్శకాలను రూపొందించుకోవాలని, కీలకమైన డేటాను షేర్ చేయడం వల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హ్యాకర్లు మరింత అధునాతనమైన పద్ధతుల్లో సైబర్ దాడులకు దిగుతున్నందున ఈ తరహా రక్షణాత్మక చర్యలు అవసరమని చుదసమా వివరించారు. తమ ప్రయోజనాలను, తమ డేటాను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడే విధానాలను రూపొందించుకోవడంపై కంపెనీలు కసరత్తు ప్రారంభించాలని ఆయన సూచించారు. -
ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. హైదరాబాద్‌లో రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ ముక్కుసూటి మనిషి.వైఎస్సార్‌తో నా అనుబంధం విడదీయరానిది. పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే వైఎస్సార్ కీలకం గా పనిచేసారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక. ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్సార్ చలువే.. అవే విధానాలను జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారు. నక్సలైట్లతో చర్చలు జరిపి జనజీవన స్రవంతి లోకి తీసుకురావడంలో వైఎస్సార్ కీలక భూమిక పోషించారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి. శత్రువులు కూడా మెచ్చేగుణం వైఎస్సార్‌కు ఉంది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. వైఎస్సార్ బతికి ఉంటే బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో ధర్నా కు దిగేవాడు. వైఎస్సార్ లేకపోయి ఉంటే 2004,2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడకపోయేది. వైఎస్సార్ బతికి ఉంటే దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారు.’ అని తెలిపారు. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తో నేను రాజకీయంగా విభేదించొచ్చు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శం. నేను హైకోర్టు జస్టిస్ గా ఉన్న సమయంలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా..రాజ్యాంగ వ్యవస్థ ల ఒత్తిడి చేయలేదు. సుధీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి.. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు. కాంగ్రెస్ అదిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చి మ్యానిఫెస్టో లో ఉచిత విద్యుత్ చేర్చారు. జాతీయ పార్టీ లకు ప్రాంతియ ప్రయోజనం అవసరం లేదా అనివైఎస్సార్ ప్రశ్నించారు.జాతీయ పార్టీ లో ఉన్నా ప్రాంతియ స్పృహ ఉన్న వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు. చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి -
మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్
భోపాల్: ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక, మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. మాజీ సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల కమిటీలో భాగమైన దిగ్విజయ్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత భజరంగ్ దళ్‌ను నిషేధించబోమని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో అల్లర్లను, హింసను ప్రేరేపించే వారిని మాత్రం విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదేసమయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. భజరంగ్ దళ్‌లో కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారని అన్నారు. రామ మందిరం ఉద్యమం సమయంలో ఏర్పాటైన బజరంగ్ దళ్ అనేది విశ్వహిందూ పరిషత్ కు యువజన విభాగం. నేను కూడా హిందువునే. హిందువుగానే ఉంటాను. నేను హిందు మతాన్ని అనుసరిస్తూనే సనాతన ధర్మాన్ని పాటిస్తానని తెలిపారు. భారతదేశం అన్ని మతాలకు చెందుతుంది. దేశంలో శాంతిని నెలకొల్పడమే కావాలి అంటూ కామెంట్స్ చేశారు. 'MP में बनी कांग्रेस सरकार तो नहीं लगेगा बजरंग दल पर बैन' ◆ बजरंग दल को लेकर दिग्विजय सिंह का बड़ा बयान#BajrangDal | #DigvijayaSingh | @digvijaya_28 pic.twitter.com/VEm9N6E3Sm — News24 (@news24tvchannel) August 16, 2023 ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సందర్భంగా కర్నాటకలో కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని వాగ్దానం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ! -
Digvijaya Singh: ర్యాష్ డ్రైవింగ్‌తో బైకర్‌ను ఢీ కొట్టి..
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కారు.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. గురువారం రాజ్‌గఢ్‌లో ఓ బైకర్‌ను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్‌కు గాయాలు కాగా, దిగ్విజయ్ సింగ్ దగ్గరుండి మరీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేయించి.. అరెస్ట్ చేయించి, దగ్గరుండి మరీ ఆ వాహనాన్ని పోలీసులతో సీజ్ చేయించారాయన. గురువారం రాజ్‌గఢ్‌లోని కొడయాకా గ్రామంలో జిల్లా స్థాయి అధ్యక్షుల సమావేశం జరిగింది. దానికి హాజరైన దిగ్విజయ్ సింగ్ మధ్యాహ్నం తిరుగుపయనం అయ్యారు. ఆ సమయంలో జీరాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద బైకర్‌ను వేగంగా ఢీ కొట్టింది డిగ్గీ రాజా ప్రయాణిస్తున్న కారు. ఆ కొట్టడంలో పది అడుగుల దూరం వెళ్లి పడ్డాడు బైకర్. వెంటనే కార్యకర్తలతో పాటు ముందు సీటులో కూర్చున్న ఆయన కారు దిగి.. బాధితుడ్ని కార్యకర్తల సాయంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని పరవాలియాకు చెందిన రాంబాబు బాగ్రి(20)గా గుర్తించారు. ప్రమాదం అనంతరం ఆస్పత్రికి వెళ్లి అతని పరిస్థితి గురించి ఆరా తీసి, అతన్ని పరామర్శించారు దిగ్విజయ్ సింగ్. దేవుడి దయ వల్ల యువకుడికి తీవ్ర గాయాలు కాలేదని, అతని చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని మీడియాకు చెప్పారాయన. స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అతన్ని భోపాల్‌కు రిఫర్ చేశారు వైద్యులు. ఇదిలా ఉంటే.. తన కారు డ్రైవర్‌పై దగ్గరుండి పోలీసులతో కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు దిగ్విజయ్ సింగ్. అనంతరం వాహనాన్ని సైతం సీజ్ చేయించారు. జీరాపూర్ పోలీస్ వద్ద ఆ వాహనాన్ని వదిలేసి.. స్థానిక ఎమ్మెల్యే కారులో ఆయన వెళ్లిపోయారు. आज राजगढ़, एमपी में एक बाइक सवार युवक पूर्व मुख्यमंत्री @digvijaya_28 जी की कार से टकरा गया। दिग्विजय सिंह ख़ुद सबसे पहले कार से उतरे और घायल शख़्स को अस्पताल लेकर पहुँचे। सीसीटीवी से पता चलता है कि ग़लती बाइक सवार युवक की है, युवक फ़िलहाल ठीक है।#DigvijayaSingh #MadhyaPradesh pic.twitter.com/tNalWUfWNu — विवेक सिंह नेताजी (@INCVivekSingh) March 9, 2023 Disclaimer: పై వీడియో కేవలం సమాచార సంబంధిత పోస్ట్ మాత్రమే. ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదు.. -
ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుందని తేల్చి చెప్పారు. తాము దిగ్విజయ్ సింగ్ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని కరాఖండీగా చెప్పారు. తాను ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పారు. అయినా సాయుధ దళాలు ఒక పనిని చాల అనుహ్యంగా చేయగలవు, వారి సామర్థ్యం గురించి కూడా తనకు తెలుసనని అన్నారు. దీనికి ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విమర్శలు రావడంతో రాహుల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, దిగ్విజయ్ సింగ్ మాటిమాటికి సర్జికల్ స్ట్రైక్ జరిగింది ఇంతమందిని చంపాం అంటూ కేంద్రం కబుర్లు చెబుతోందే గానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. రాహుల్ సూచన మేరకే దిగ్విజయ్ సింగ్ అలా విషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆర్మీపై గట్టి విశ్వాసం ఉండాలని, అది రాజకీయాలకు అతీతమైనదంటూ తిట్టిపోసింది బీజేపి. అయినా పదేపదే సర్జికల్ స్ట్రైక్ గరించి పూఫ్ అడుగుతున్నారు, అసలు ఆర్మీపై మీకు నమ్మకమే లేదనేది స్పష్టమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. అయినా కాంగ్రెస్‌కి ఇలా భాద్యతరహితమైన ప్రకటనలు ఇవ్వడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాహుల్, దిగ్విజయ్‌లకు నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషం కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని బాటియా దుయ్యబట్టారు. (చదవండి: వాటికి ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు) -
వాటికీ ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఉగ్రదాడి, సర్జిక్ స్ట్రైక్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామ ఉగ్రదాడిలో సుమారు 40 మంది భ్రదతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. "పుల్వామ ఉగ్రవాదానికి కేంద్రం, పైగా అక్కడ ప్రతి కారుని కూడా తనిఖీ చేస్తారు. అలాంటప్పుడూ రాంగ్‌సైడ్ నుంచి వచ్చిన స్కార్పియో కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. అప్పుడే కదా ఈ స్కారిపియో కారు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని ఢీ కొనడంతో అంతమంది జవాన్లు చనిపోయారు" అంటూ కేంద్రంపై విరుచకుపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సరైనా సమాధానం ఇవ్వలేదన్నారు. అదీగాక పార్లమెంటులో బహిరంగంగా ప్రధాని మోదీ పదేపదే సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడతారంటూ విమర్శించారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌తో ఇంతమందిని చంపాం అని ఏవో ప్రగాల్పాలు చెబుతుంటారని మండిపడ్డారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు సరైనా ఆధారాలను అందించలేకపోయిందంటూ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ జమ్మూలోని భారత్ జోడోయాత్రలో రాహుల్‌తో కలసి ఈ విషయాలు గురించి మాట్లాడారు. అంతేగాదు 300 కిలోల ఆర్డిఎక్స్ ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో సుమారు18 మంది సైనికులు మరణించారు. దీంతో 2016లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించింది.అయితే కాంగ్రెస్ పార్టీ పుల్వామా దాడి, వైమానిక దాడుల గురించి బీజేపీ కొంతకాలం వరకు ప్రశ్నలు సంధించింది. ఐతే బీజేపీ మన సైన్యాన్నే అనుమానిస్తున్నారా? అని గట్టి కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. पुलवामा हादसे में आतंकवादी के पास ३०० किलो RDX कहॉं से आई? देवेंद्र सिंह डीएसपी आतंकवादियों के साथ पकड़ा गया लेकिन फिर क्यों छोड़ दिया गया? पाकिस्तान व भारत के प्रधानमंत्री के मैत्री संबंधों पर भी हम जानना चाहते हैं। pic.twitter.com/1wVbJEDPIC — digvijaya singh (@digvijaya_28) January 23, 2023 (చదవండి: వీడియో: అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి: మరోసారి స్పష్టం చేసిన రాహుల్ గాంధీ) -
దిద్దుబాటు ప్రారంభిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ట్రబుల్ షూటర్ దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకు వచ్చి వెళ్లాక పార్టీలో ఏం జరుగుతుందనే ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. టీపీసీసీలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం అధిష్టానం దూతగా వచ్చిన ఆయన ఏం చేస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రానుంది. దిగ్విజయ్ పర్యటన అనంతరం హైలెవల్ కమిటీ ఆయనతో సమావేశమవుతుందని, ఆ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి రాష్ట్ర నేతలను ఒప్పించాకే దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని సమాచారం. అయితే అందరినీ మూకుమ్మడిగా రమ్మంటారా? లేక విడివిడిగా పిలిచి మాట్లాడతారా? అన్నదానిపై స్పష్టత రాలేదు. మొత్తంమీద త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లో దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని, మొదటగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్థానంలో కొత్తగా సీనియర్ నాయకుడిని పంపిస్తారనే చర్చ జరుగుతోంది. ఆ మాటల ఆంతర్యమేంటో? కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్‌కు పెద్ద బాధ్యతే అప్పగించిందని ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతోంది. ఎవరూ పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడితే ఎంత పెద్ద నాయకుడినైనా ఉపేక్షించేది లేదని దిగ్విజయ్ హెచ్చరించడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. సీనియర్లను కంట్రోల్ చేయడంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవిని సమర్థంగా నిర్వహించడం గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని నిర్వర్తించడంలో వయసుతో పనిలేదని, అనుభవం లేకపోయినా అందరినీ కలుపుకొని వెళ్తే విజయవంతం కావచ్చని ఆయన ఇచ్చిన సలహా రేవంత్ వ్యవహారశైలిని ఉద్దేశించి చేసిందేనని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఉన్నతస్థాయి కమిటీకి దిగ్విజయ్ నివేదిక! తన రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులను అవగాహన చేసుకున్న దిగ్విజయ్‌సింగ్... పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. పలు రాష్ట్రాల్లోని అంతర్గత అంశాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థాయి కమిటీకి ఆయన నివేదిక ఇస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ రావడానికి ముందే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌తోపాటు ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వచ్చాక 54 మందికిపైగా నేతలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి దిగ్విజయ్ ఇచ్చిన నివేదికలో ఆయన పలు సిఫారసులు కూడా చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిఫారసుల అమలుపై చర్చించడం కోసమే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులను త్వరలో ఢిల్లీకి పిలిచే అవకాశముందని తెలుస్తోంది. -
తెలంగాణలో సీనియర్ నేతలు సమన్వయం పాటించాలి
-
తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. డిగ్గీ రాజా హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘తెలంగాణలో సీనియర్ నేతలు సమన్వయం పాటించాలి. పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దు. ఎంతపెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలి.ఇప్పటికే రేవంత్‌రెడ్డి నన్ను కలిశారు. చిన్న వయస్సులో ఉన్నవారికి పీసీసీ ఇస్తే తప్పేంటి?. కొత్తవారికి పీసీసీ చీఫ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అని ద్విగిజయ్ పేర్కొన్నారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమయ్యిందని మోదీ పాలనలో మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఈ స్థాయిలో ధరలు ఎప్పుడూ పెరగలేదన్నారు. ‘‘రాహుల్ యాత్రకు మంచి స్పందన వస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగింది.కార్పొరేట్ల సంస్థలకే మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది.ప్రత్యర్థులపై ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పుతున్నారు.ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు.మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నారు. జోడో యాత్రను అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తోంది’ అని ద్విగిజయ్ అన్నారు. ‘‘ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా?. ప్రజలకు హామీ ఇచ్చాం. తెలంగాణను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారు. కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారు.తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోంది. అవినీతిపై తెలంగాణ రికార్డు సాధిస్తోంది.బీజేపీకి మద్దతు పలికేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేసింది. తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్లపై ఓవైసీ మౌనంగా ఎందుకున్నారు?. కేసీఆర్‌కు ఓవైసీ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. బీజేపీని గెలిపించేందుకు ఓవైసీ పోటీ చేస్తున్నారు’’ అని ద్విగిజయ్ సింగ్ దుయ్యబట్టారు.