Eat
-
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్‌ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్‌ఫుడ్‌కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్‌తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ కన్సల్టంట్ -
ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటారు?
ఆరోగ్యాన్ని నిర్ణయించేది ప్రధానంగా మనం తీసుకునే ఆహారమే. అదే మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల మన ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయంపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు నిపుణలు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో వారి మాటల్లోనూ చూద్ధామా..!.చాలామందికి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే ఆలోచన వస్తుంటుంది. కానీ అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు పాటించారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో సవివరంగా చూద్దామా..!శరీరానికి అవసరమైన పోషకాలతో కూడిన సమతుల ఆహారం తినాలి.ఆకలికి, హిత, మిత ఆహారం అత్యంత ఆరోగ్యదాయకం.వృక్ష సంభందిత ఆహారాలు ఆరోగ్య ఆనంద దాయకమయినవి.ఆకుకూరలు, పళ్ళు, ధాన్యాలు, పప్పులు, విత్తనాలు వంటి సార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.పచ్చి కూరగాయలు, పళ్ళలోను వివిధ రంగురంగుల కూరగాయలను తినాలి. అవి విటమిన్లు, ఖనిజ లవణాలతో నిండిఉంటాయి.కొవ్వులు, ఉప్పు, చక్కెరలు తక్కువ ఉండే ఆహారాలను ఎంచుకోవాలి.ఎక్కువ పీచు పదార్థాలను తీసుకోవాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.శరీర కార్యకలాపాలకు అనుగుణంగా నిర్జలీకరణ రాకుండా సరిపడా తగినంత నీరు త్రాగాలిఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్, ఫ్రిజ్డ్, ఫ్రై ఆహారాలను తప్పించాలి లేదా తగ్గించాలి.పాలు, మాంసం, పప్పులు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తీసుకోవాలి.తరచుగా వేర్వేరు రకాల ఆహారాలను మార్చుకుంటూ తినాలి. వైవిధ్యంగా తినడం మంచిది. కనీసం వారానికోసారి ఉపవాసం ఉండటం మంచింది. అలాగే ఒకరోజు మొత్తం ద్రవపదార్థాలపై ఆధారపడటం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం గురించి అవగాహన కోసమే ఇచ్చాం. పాటించే ముందుకు నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. (చదవండి: పార్టనర్‌కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..?) -
రెయిన్బో డైట్: రంగురంగుల ఆహారాలతో ఆరోగ్యం పదిలం..!
మనం తినే ఆహారంలో వివిధ రకాల పోషకాలు సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అందుకే పోషకాహార నిపుణులు మనం తినే ఆహారంలో అన్ని రంగుల్లోని పండ్లు, కూరగాయలు ఉండాలంటున్నారు. ముఖ్యంగా రెయిన్బో(ఇంద్ర ధనుస్సు) డైట్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఏంటీది అనేకదా..!. ఏం లేదండీ ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లో ఉండే కూరగాయాలు, పండ్లు తీసుకుంటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడమే గాక చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుందని చెబుతున్నారు. ఈ డైట్ వల్ల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చని అంటున్నారు. అలాంటి ఈ రెయిన్బో డైట్లో రంగుల వారీగా ఉండే కూరగాయాలు, పండ్లు వర్గీకరణ, వాటి ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయని మనకు తెలుసు. అలాగే రెయిన్బో డైట్ అంటే ఎరుపు, పసుపు, ఊదా, ఆకుపచ్చ, నారింజ వంటి వివిధ రంగుల్లో పండ్లు, కూరగాయలను కలిగి ఉంటుంది. అందులోని ప్రతి రంగుతో కూడిన కూరగాయాలు, పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో చూద్దామా..!రెడ్ ఫుడ్స్: ఇవి లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ రంగు కూరగాయలు, పండ్లు ప్రోస్టేట్, మూత్ర నాళం, డీఎన్ఏ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. అందువల్ల ఎరుపు రంగులో ఉండే యాపిల్స్, చెర్రీస్, నారింజ, బెర్రీలు, పుచ్చకాయలు, ఎర్ర ద్రాక్ష, బీట్రూట్లు, టమోటాలు మొదలైనవి తప్పక తినమని నిపుణులు చెబుతున్నారు.గ్రీన్ ఫుడ్స్: క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల అవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి జీర్ణక్రియకు తోడ్పడతాయి. అలాగే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారాలు కంటి, ఊపిరితిత్తులు, కాలేయం, కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. త్వరగా గాయాలు నయం అవ్వడంలో, చిగుళ్ల ఆరోగ్యంలో సహయపడతాయి. ఆకుపచ్చ రంగులో ఉండే అవోకాడో, ద్రాక్ష, కివి, బేరి, బ్రోకలీ, దోసకాయ, ఆస్పరాగస్, క్యాబేజీ, బీన్స్, మొదలైనవి తీసుకోవాలి.వైట్ ఫుడ్స్: దీనిలో అల్లిసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు మద్దతునిస్తాయి. అలాగే గుండె జబ్బులు, కేన్సర్‌తో పోరాడుతాయి. అందుకోసం అరటిపండ్లు, వెల్లుల్లి, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, అల్లం, ముల్లంగి మొదలైనవి తినండి.పసుపు ఆహారాలు: వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రస్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మ సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకోసం నిమ్మకాయలు, పైనాపిల్, అత్తి పండ్లను, మొక్కజొన్న, పసుపు మిరియాలు, పసుపు టమోటాలు, మామిడి, బంగారు కివి మొదలైనవి. ఈ ఆహారాలు కళ్ళకు, రోగనిరోధక వ్యవస్థకు మంచివిపర్పుల్ ఫుడ్స్: వీటిలో ఆంథోసైనిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కడుపులోని మంటను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గుండెకు, మెదడుకు, ఎముకలకు, ధమనులకు, జ్ఞానానికి మేలు చేస్తాయి. ఈ ఆహారాలు కేన్సర్‌తో పోరాడటమే గాకుండా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కూడా తోడ్పడతాయి. అందుకోసం ప్లం, ప్రూనే, బ్లాక్‌బెర్రీ, అత్తి పండ్లను, ఎండుద్రాక్ష, వంకాయ, ఊదా క్యాబేజీ, బ్లూబెర్రీస్, పర్పుల్ ద్రాక్ష మొదలైనవి.ఆరెంజ్ ఫుడ్స్: వీటిలో ఉండే బీటా-కెరోటిన్‌తో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. నరాలు, కండరాల ఆరోగ్యానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇవి చాలా అవసరం. దీని కోసం నారింజ, గుమ్మడికాయ, బొప్పాయి, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి తీసుకోవాలి.ఎల్లప్పుడూ వివిధ రంగుల కూరగాయలు, పండ్లు తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఈ ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, అభిజ్ఞా పనితీరును పెంచుతాయి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. పాటించేమందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం మంచిది. -
చార్‌ధామ్‌లో భక్తుల నిలువు దోపిడీ
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కేదార్నాథ్ యాత్రలో వ్యాపారుల నిలువు దోపిడీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు కేదార్నాథ్ మార్గంలో ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా పరిణమించింది.వైరల్ అయిన ఆ వీడియోలో ఓ వ్యక్తి కేదార్‌నాథ్‌లోని ఆహార పదార్థాల ధరలను తెలియజేశాడు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో వివిధ వస్తువులు, ఆహార పదార్థాల ధరలు అధికంగానే ఉంటాయి. అయితే చార్ధామ్ యాత్ర సందర్భంగా ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేయడం భక్తులకు భారంగా మారింది. సాధారణ రోజులలో రూ. 10కి దొరికే టీ రూ. 30కి, రూ. 20కి లభించే వాటర్ బాటిల్ రూ. 100కు విక్రయిస్తున్నారు. అలాగే కాఫీ ధరను రూ. 50కి పెంచేశారు. శీతల పానీయాల ధరలను కూడా విపరీతంగా పెంచారు. ఇతర ఆహార పదార్థాల ధరలను కూడా రెట్టింపు చేశారు.ఈ వీడియోలో వ్యాపారులను వివిధ వస్తువుల ధరలను అడిగిన ఆ వ్యక్తి వాటి ధరలు ఎందుకు పెరిగాయో కూడా తెలిపాడు. ఆయా వస్తువులను కింది నుంచి పైకి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని తెలిపాడు. అయితే వైష్ణోదేవి యాత్రలో ఇంత భారీ ఖర్చులు ఉండవని కూడా పేర్కొన్నాడు. -
అమెరికాకు వెళ్తే పొట్ట తిప్పలేనా?
"తినుటకు ఉన్నచాలు అతిథిం గనినంతనె తల్పుతీసి రమ్మనుటకు ఉన్నచాలు తగ ఆలును బిడ్డలు ఒక్కచోట కూర్చొనుటకు ఉన్నచాలు ! " అన్నాడు కవి. ఇది అత్యాశకు పోకుండా ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే పాత కాలం నాటిమాట. ఇపుడు కాలం మారింది , మనుష్యుల మనస్తత్వాలు మారాయి. మామూలు నడకతో లాభం లేదని అంతా పరుగులు తీస్తున్న రోజులు ఇవి. కుటుంబంతో కలిసి కూర్చొని ఉన్నదేదో తినాలంటే కుదరడం లేదు, మనిషి లేనిదాని కోసం అర్రులు చాస్తున్నాడు, కొత్తకొత్త రుచులు కోరుకుంటున్నాడు. ‘ గడుకంబలైన దొర్కక ఆకలిని దీర్ప కల్లు దాగితిమి మా కరువు దీర ‘ అన్నది మా మాతామహుడు వరకవి భూమగౌడు కాలంనాటి మాట. అంతటి దారిద్యం, కరువుకాలం నేను మాత్రం చూడలేదు. నా చిన్నప్పుడు , మా తల్లి దండ్రులు ఉన్నప్పుడు బడికి పోవడానికి ముందు మేము ఊదుకుంటూ తాగింది వేడివేడి గడుకంబలి, అంచుకు పెట్టుకున్నది వక్కకారం. మధ్యాహ్నం బడి వదలగానే ఆకలితో పరుగు పరుగున ఇంటికి వచ్చి ఆవురావురుమని ఆరగించింది పప్పన్నం. సాయంత్రం బడి చుట్టి కాగానే పొలోమని బయటికి వచ్చి ఆడిపాడి అలసిసొలసి ఇంటికి వచ్చి , చేతులు కూడా సరిగా కడుక్కోకుండా తిన్నవి, రాత్రి దీపాలకన్న ముందే కట్టెల పొయి వెలిగించి మా అమ్మ చేసిపెట్టిన జొన్నరొట్టెలు కాయగూరల కూరతో. మధ్య మధ్య సర్వపిండి , మొలక బియ్యం, వరి కుడుములు, మక్క కంకులు, జొన్నపిసికిళ్ళు, అనుప, అలిసంద గుడాలు లాంటి చిరుతిళ్ళు సరేసరి, చుట్టాలు వచ్చినప్పుడు ఒక కోడి ప్రాణం హరీ ! పండగల ప్రత్యేక వంటకాలు దసరా గారెలు, ఉగాది బూరెలు, సంక్రాతి చకినాలు ఉండనే ఉంటాయి. జీవితంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లో.. ఆ తర్వాత మజిలీ మారింది అమెరికాకు. దేశం కానీ దేశం వచ్చాక.. ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య భోజనం. ఇండియాలో ఏ మాటకు ఆ మాట.. ఉద్యోగాలు చేసే వాళ్లంతా ఇంట్లో భార్యలు చేసింది పుష్టిగా తినడమే కాకుండా.. బాక్సుల్లోనూ ఇంటి భోజనం తీసుకుని వస్తారు. ముంబై లాంటి చోట్ల అయితే వేడివేడిగా సమయానికి ఇంటి భోజనం తెచ్చిచ్చే "డబ్బావాలా"లు కూడా ఉన్నారు. ఎటొచ్చి అమెరికాలో ఈ పరిస్థితి లేదు. బాగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి.. ఆడా,మగా అంతా సమానమే. అంటే భర్తకు సమయానికి వండి పెట్టే భార్య కనిపించడం అరుదు. ఎవరి మానాన వాళ్లు ఉదయాన్నే లేచి హడావిడిగా రెడీ అయి ఉద్యోగాలకు, వ్యాపారాలకు పరుగులు తీస్తారు. ఇక ఇంటి భోజనమా.? ఆ మాట వారాంతాల్లో తప్ప చాలా మందికి సాధ్యం కాదు. మరి బయటికెళ్లిన వాళ్లు ఏం తినాలి? అమెరికాలో ప్రతీ గల్లీలో ఫుడ్ సెంటర్లు కనిపిస్తాయి. ఆఫీసు క్యాంటీన్లు, బస్స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు ఎక్కడ చూసినా.. ఏదో బ్రాండ్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లన్నింటిలో కలిపి ఎక్కువగా కనిపించేవి ఇవి సబ్వే స్టార్‌బక్స్ మెక్ డొనాల్డ్స్ డంకిన్ బర్గర్ కింగ్ టాకో బెల్ డొమినో పిజ్జా హట్ వెండీస్ డైరీ క్వీన్ సగటు భారతీయుడి కంటే.. నాలుగింతలు నాన్‌వెజ్ ఎక్కువగా తింటారు. అక్కడి వాళ్ల అలవాటు ఇది. ఇక ఎక్కువ మంది ఉదయం పూట లాగించేవి శాండ్విచ్లు. కాల్చిన బ్రెడ్, మధ్యలో ఆమ్లెట్ లేదా వెజ్ పీస్‌లు. పక్కన ఫ్రెంచ్ ఫ్రైస్. కొందరు ఓట్స్ తింటారు. పళ్ల ముక్కలు తినేవాళ్లు కూడా బాగానే కనిపిస్తారు. మన దగ్గరి కంటే ఎక్కువగా కాఫీలు పీపాల కొద్దీ తాగేస్తుంటారు. అయితే కాఫీలో పాలు, చక్కెర కలుపుకుని కమ్మగా తాగే మనకు ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే, చల్లటి ప్రాంతం కాబట్టి చాలా మంది రోజుకు ఐదారు కాఫీలు తాగేస్తుంటారు. మధ్యాహ్నం భోజనంలో ఎక్కువ మంది తినేవి బర్గర్లు, పిజ్జాలు. ఇందులో వందల వెరైటీలున్నాయి. ఏది తిన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కన నంజుకోవచ్చు. గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ చీస్ కూడా బాగానే తింటారు. ఉడికించిన కోడిగుడ్లు, బంగాళ దుంప, ఫ్రైడ్ చికెన్, బార్బెక్యూలు ఎక్కువగా కనిపించే, తినే ఫుడ్లు. తినే తిండికి అదనంగా గ్లాసుల కొద్దీ కూల్డ్రింకులు తాగుతూనే ఉంటారు. కూల్‌డ్రింక్ సర్వసాధారణం అని వచ్చిన వారానికి తెలిసిపోయింది. హాట్ డాగ్స్, లాబ్‌స్టర్ రోల్స్, బఫెలో వింగ్స్ వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా.. మన వాళ్లు కూడా నంజుకుని తినేస్తున్నారు. సాయంత్రం అయితే మాత్రం చాలా మంది ఇష్టపడేది డ్రింక్‌తో కలిపి తినే ఫుడ్. వీటికి అదనంగా మిల్క్ షేక్‌లు, ఐస్‌క్రీంలు. మరి ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి పరిస్థితి కాస్తా విచిత్రంగా మారుతుంది. వీకెండ్లో వీలైనన్ని కూరలు వండుకోవడం, బకెట్ నిండా సాంబారు తయారు చేసుకోవడం, దోశ/ఇడ్లీ పిండి రుబ్బుకోవడం, శనగలు/రాజ్మా లాంటివి నానబెట్టుకోవడం.. ఓ రకంగా శని/ఆది ఇంటి చాకిరిలో మునిగి తేలుతారు. ఇళ్లలో మన బీరువాల కంటే పెద్ద ఫ్రిడ్జ్లుండడం వల్ల తయారు చేసిన వాటన్నింటిని మళ్లీ వినియోగించుకునేలా ఐస్ట్రే తరహాలో ఉన్న బాక్స్‌ల్లో పెట్టి ప్యాక్ చేస్తారు. వాటిని ఏ రోజు అవసరం బట్టి ఆ రోజు తీసి మైక్రోఓవెన్లో పెట్టి వేడి చేసుకుని తింటారు. వీలైనన్ని సార్లు ఇంట్లో... తప్పనిసరి పరిస్థితుల్లో బయట తినడం మనవాళ్ల అలవాటు. కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఖర్చు తగ్గించుకుందామనుకున్న వాళ్లు.. చిన్న హీటర్ బాక్సుల్లో నూడుల్స్/కూరగాయ ముక్కలు వేసుకుని ఆఫీసుకు వస్తారు. సరిగ్గా లంచ్ సమయానికి పావుగంట ముందు దానికి ప్లగ్ పెడితే.. వేడి వేడి భోజనం రెడీ. ఇప్పుడు అమెరికాలోనూ ఇండియన్ ఫుడ్ బాగా పెరిగింది. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్లతో పాటు స్వీట్లు, హాట్లు.. అన్నీ దొరుకుతున్నాయి. ఈస్ట్ కోస్ట్ అంటే న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్‌లోని హూస్టన్, డాలస్లలో ఎక్కడ పడితే అక్కడ బోలెడు ఇండియన్ రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. ఏ మాటకా మాట.. రుచి కూడా బాగుండేలా బ్రహ్మండంగా చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చే చాలా మంది విద్యార్థులకు ఇక్కడే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు. పైగా మోటెల్స్‌లో, ఔట్స్కర్ట్స్లో దాబాల తరహాలో ఇంట్లోనే ఉండే రెస్టారెంట్లను కూడా మనవాళ్లు మెయింటెయిన్ చేస్తున్నారు. ఏ రోజుకా రోజు ఓ పది రకాల వెజ్/నాన్‌వెజ్ ఐటమ్లు కావాల్సినన్నీ లాగించొచ్చు. దీన్నే అక్కడి పరిభాషలో బ్రంచ్ అంటారు. అంటే బ్రేక్‌ఫాస్ట్ సమయం దాటిన తర్వాత.. లంచ్ కంటే కొంచెం ముందు.. ఉదయం 11గంటల నుంచి ఒంటి గంటలోపు పూటుగా తినే రకం అన్నమాట. పది నుంచి 15 డాలర్లు ఇస్తే.. మన నోటికి , కడుపుకు సంతృప్త స్థాయిలో తిని రావొచ్చు. పిల్లలు పెద్దలై దేశ సరిహద్దులు దాటాక , మేమే వాళ్లకు అమెరికా లో అతిథులమయ్యాక , వాళ్ల మాట వినాలి కదా. ఇండియాలో తిన్నట్టు వెజిటేరియనే కావాలి అంటే కుదరదు. అది వాళ్ళు ఇంట్లో గ్రిల్ మీద కాల్చిన మాంసాహారమైనా తిన్నాం. బయట స్ట్రీట్ ఫుడ్ పాయింట్, రెస్టారెంట్ లకు తీసుకుపోయినా వాళ్ళ వెంట నడిచాము. అది మెక్ డోనాల్డ్స్ సాండ్ విచ్, మెక్సికన్ చిపొట్లే , మాంగోలియన్ చికెన్, ఇటాలియన్ పిజ్జా తాజాతాజా ఫుడ్ ఏదైనా తిన్నాం. జపనీస్ సుశి పచ్చి చేపయినా కళ్ళు మూసుకొని నోట్లో పెట్టాము. సముద్రతీర విహారయాత్రల్లో ప్రాణంతో ఉన్న ఎండ్రకాయలు, పాముల్లాంటి జీవులను మా కళ్ళముందే క్రూరంగా, వేడివేడి కడాయి నూనెలో వేయించి ఇస్తుంటే మాత్రం తినడానికి మాకయితే మనసొప్పలేదు. అలా ఒకానొక ఆదివారం ఓ అమెరికన్ రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు, అరగంట వెయిటింగ్ తర్వాత లభించిన సీట్లలో కూర్చొని, మా పిల్లలు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వచ్చిన బర్గర్ లాంటి ఫుడ్ , దాని ఊరూ పేరూ తెలియకుండా నోట్లో పెట్టిన మరుక్షణం మాకో అనుమానం వచ్చింది. నేను కాస్త నమిలి చూసాక తెలిసింది, ఎప్పుడో సర్వీస్ లో ఉన్నప్పుడు పాతబస్తీలో ఓ మిత్రుడితో కలిసి వెళ్లి సరదాగా తిన్నప్పటి ఫుడ్ రుచి అది అని. నేను అదే మాట మా వాళ్ల చెవిలో వేశాను. వెంటనే వాష్ రూం వైపు పరుగున వెళ్ళి బొళ్లుమని వాంతి చేసుకున్నారు, ఏదో ఘోరం జరిగినట్లు. ఎవరి దేశ కాల పరిస్థితులను బట్టి వాళ్ళవాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న అది ఆరోగ్య కరమైందా కాదా, అయితే ఆ ఆహారం మనకు సరిపడుతుందా లేదా? అన్నదే, అంతేకానీ అందులో అపచారమేమీ లేదు ‘ అని ! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?
బిజీ లైఫ్‌లో ఏ రోజు కారోజు తాజాగా ఉండే కూరగాయాలు తెచ్చుకోవడం అందరికీ కుదరదు. అందులోనూ కొన్ని కాయగూరలు తొందరగా మెత్తగా లేదా మొలకెత్తడం, కలర్ మారిపోవడం జరుగుతుంది. అన్ని డబ్బులు పెట్టి కొని పాడేయడానికి మనసొప్పక ఏదో రకంగా వండేస్తాం. కొందరైతే పాడైన భాగాన్ని తొలగించి మిగతా భాగం నుంచి వండేస్తారు.ఇలా చెయ్యొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా..? కొన్ని కూరగాయాలు కొద్ది రోజులే నిల్వ ఉంటాయి. మరికొన్ని పాడైపోయినా ఆ విషయం తెలియదు. మెత్తబడటం లేదా మొలకెత్తుతుంటాయి ఇంకొన్ని కూరగాయాలు. మనం పడేయబుద్ధికాక వండేస్తుంటాం. అయితే ఇలా ఉంటే కొన్ని రకాల కూరగాయాలు అస్సలు వాడకూడదట. అవేంటో సవివరంగా చూద్దామా..! బంగాళదుంపం: బంగాళ దుంపపై మొలకలు వస్తే కొందరూ వెంటనే పడేస్తారు. మరొకందరూ వాటిని తొలగించి వండేస్తారు. మరీ వాడొచ్చా అంటే..నిజానికి బంగాళదుంపలో సహజంగా సోలనిన్ , చకోనిన్ అనే రెండు రకాల టాక్సిన్లు ఉంటాయి. అయితే బంగాళదుంపపై మొలకలు వచ్చి, ఆకుపచ్చని రంగు కనిపిస్తే వెంటనే పడేయ్యడం మంచిది. జస్ట్ అప్పుడే చిన్నగా మొలకలు వచ్చి ఆకుపచ్చ రంగు కనిపించనట్లయితే వినయోగించొచ్చు. కానీ మొలకలు, ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినయోగించొద్దిన నిపుణులు చెబుతున్నారు. ఈ సోలనిన్ విష పదార్థం అని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఉల్లిపాయలు వద్దకు వస్తే బయటి తొక్కలు పొడిగా ఉంటాయి. కానీ లోపాల చాలా వాటికి నల్లటి రంగు ఉంటుంది. మనం వాటిన కడిగేసి వాడేస్తుంటా. అయితే ఇదేం అంత ప్రమాద కాదని చెబుతున్నారు నిపుణులు. మట్టిలో ఉండటం వల్ల వచ్చే కొద్దిపాటి ఫంగస్ అని, దీన్ని చక్కగా కడగడం లేదా ఆ భాగాన్ని తీసేయండి చాలు అని సూచిస్తున్నారు. కానీ ఒక్కోసారి బయటపోరలు తీస్తుండగా మెత్తగా కుళ్లినట్టు ఉండి లోపల భాగం బాగుంటే అస్సలు వంటకు వినయోగించొద్దుని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆకుకూరలు వద్దకు వస్తే.. ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వడలిపోయి, కలర్ మారిపోతే వాడొద్దని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఆకులు పసుపురంగులో ఉంటే ఆయా ఆకులను తీసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఆకుకూర కాళ్లుభాగం లేదా, ఆకులు కుళ్లినట్లు ఉంటే అస్సలు వినయోగించొద్దని చెబతున్నారు. మొత్తని టొమాటాలు.. దెబ్బతగిలిన టొమాటాలు, కొన్ని లేత మచ్చలు ఉన్నా..ఆ ప్రాంతం వరకు కట్ చేసి తీసేసి వాడుకోవచ్చు. అదే టమాట బూజు పట్టి ఉండి మొత్తం మొత్తగా ఉంటే వెంటనే పారేయండి. కొన్ని టమాటాలు మెత్తగా అయిపోతాయి. అవి వాడుకోవచ్చని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. వెల్లుల్లి.. భారతీయ వంటశాలల్లో ప్రధానమైనది. ఇవి గోధుమ రంగులోకి మారిన, దానిపై గోధుమ కలర్ మచ్చలు ఉన్నా.. వెల్లుల్లి పాడైందని అర్థం. కొన్నింటికి ఆకుపచ్చగా మొలకలు వస్తాయి. అలాంటి వెల్లుల్లిలోని ఆకుపచ్చ భాగాన్ని తొలగించి హాయిగా వాడుకోవచ్చు. ఎందుకంటే..? వెల్లుల్లిలోని మొలకెత్తిన ఆకుపచ్చ భాగం చేదుగా ఉంటుంది. కూరల్లో వినయోగిస్తే టేస్ట్ మారుతుంది కాబట్టి వాటిని తొలగించాలి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ముడతలు పడినట్టు ఉండి జిగటగా ఉండి పాడైపోయినట్లు సంకేతం. అలాగే వాటిపై నల్ల మచ్చలు చెడిపోవటాన్ని సూచిస్తాయి. ఇలాంటివి వినియోగించకపోవటమే మేలు. దోసకాయలు.. దోసకాయ సాధారణంగా ఫ్రిజ్‌లో ఒక వారం పాటు తాజగా ఉంటుంది. దోసకాయ మెత్తబడితే అది పాడైపోయిందని అర్థం. మొత్తంగా కాకుండా కేవలం దోసకాయ చివరి భాగం మాత్రమే మెత్తగా ఉంటే ఆ భాగాన్ని తీసేసి వాడుకోవచ్చు. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్‌వెజ్‌గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్‌వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి చికెన్ లేదా మటన్‌ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్‌వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్‌వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్‌లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్‌గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్‌వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్‌ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
ఆ చాక్లెట్లు తిని మత్తులోకి జారి!
కొత్తూరు: స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో విక్రయిస్తున్న చాక్లెట్లు తిని విద్యార్థులు మత్తులోకి జారుకోవడం, వింత వింతగా ప్రవర్తిస్తున్న దృష్టాంతాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగుచూశాయి. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో లభించే చాక్లెట్లను తరచూ కొని తింటున్న పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్ల వల్లనే అని తేలింది. వీటిని మొదట పాన్ డబ్బాల వ్యాపారులు ఉచితంగా విద్యార్థులకు అందించారని, క్రమంగా వాటికి బానిసలైన విద్యార్థులకు ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయుల సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు మంగళవారం సదరు పాన్ డబ్బాలపై దాడిచేయగా స్వల్ప మొత్తంలో చాక్లెట్లు లభించాయి. అయితే ఈ చాక్లెట్లలో ఏముందనేది తెలియరాలేదని చెబుతున్నారు. హెచ్ఎం అంగోర్ నాయక్‌ను వివరణ కోరగా విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. -
డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..
ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్లో బాగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో మన రైతులు వీటి సాగుతో లాభలార్జిండంతో మార్కెట్లో బాగా విరివిగా లభిస్తున్నాయి. అలాంటి ఈ పండు ధర కూడా కాస్త ఎక్కువ. చాలామందికి దీన్ని ఎలా తిన్నాలనే తెలియదు. బాగా దీని రుచి కూడా కాస్త పులుపు స్వీట్‌తో కూడిన తాటి ముంజుల్లా ఉంటాయి. వీటిని ఎలా తినాలి. తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తదితరాల గురించి ఆయుర్వేద డైటిషిన్ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందాం.! డ్రాగన్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలంటే.. పొలుసులుగా పొడుచుకు వచ్చిన ఆకులతో వెలుపలి భాగం కఠినంగా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని ముక్కలు చేయడం మాత్రం చాలా సులువే. కట్టింగ్ బోర్డు మీద డ్రాగన్ ఫ్రూట్ ఉంచి పండును సగానికి పొడవుగా కత్తిరించండి. అందుకు పదునైన చెఫ్ కత్తిని ఉపయోగించండి. పైభాగంలో ప్రారంభించి, ఆపై మందమైన కాండంలోకి వెళ్లేలా కట్ చేయండి. ఆ తర్వాత ఒక చెంచా ఉపయోగించి గుజ్జును సగం నుండి నేరుగా తినవచ్చు. లేదా పండును రెండు సగభాగాలుగా కోసి పూన ఉన్న మందపాటి చర్మాన్ని తొలగించి ముక్కలుగా చేసుకుని తినేయొచ్చు. ఈ ఫ్రూట్ ఉపయోగాలు.. ఇందులో మాంసకృతులు, పీచు, పిండి పదార్ధాలు, తీపి, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఎ, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ ఇ, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫోస్ఫరస్, బెటాలైన్స్, హైడ్రాక్సీసిన్నమేట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది. శిశవు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. గర్భిణికి నీరసం రాకుండా చూస్తుంది. ఎముకల ఆరోగ్యం కాపాడుతుంది. కీళ్లలో ఎముకల రాపిడి జరగకుండా ఉండే మృదులాస్థి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వలన ఎముకల మధ్య రాపిడి ఉండదు దాని వలన నొప్పిలు ఉండవు. కండరాలు మరియు రక్త నాళాలు పని తీరును మెరుగు పరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రీబయోటిక్ ఉంటాయి. దాని వలన ప్రోబైయటిక్ పెరిగి జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తాగించడం ద్వారా మధుమేహం రాకుండా చూస్తుంది. మధుమేహం ఉంటే స్థాయిలను నిర్వహింస్తుంది. క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మంపై అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కళ్ల ఆరోగ్యం కాపాడుతుంది. చెడు కొవ్వు నియంత్రిస్తుంది. మంచి కొవ్వుని పెంచుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగు పరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తాగిస్తుంది. కాలేయంలో కొవ్వుని నియంత్రిస్తుంచి ఆరోగ్యగా ఉంచుతుంది. అయితే ఈ డ్రాగన్‌ఫ్రూట్‌ని తొక్క తోపాటుగా తింటే మాత్రం అజీర్తీ వస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అలా తిని లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే తొక్క కాస్త మందంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల ఉన్నవారికి ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాల కన్నా చెడు ఎక్కువ అవుతుంది. అందువల్ల దయచేసి పైన ఉన్న తొక్కను తీసివేసి తినండి. --శిరీష రాకోటి, ఆయుర్వేద డైటిషిన్ (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
దోమలను ఎందుకు ఇష్టంగా తింటారు? ఒక టిక్కీకి ఎన్ని దోమలు కావాలి?
ప్రస్తుత కాలంలో మనుషులు దోమల కారణంగా ఇబ్బంది పడినంతగా మరే ఇతర జీవుల వల్ల కూడా ఇబ్బంది పడివుండరంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం కాగానే దోమల సైన్యం మన ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చేస్తుంది. ముఖ్యంగా ఇంటికి సమీపంలో నీరు నిల్వ ఉండే ప్రాంతం ఉంటే దోమల దాడి మరింత అధికంగా ఉంటుంది. దోమలను నివారించడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే దోమలను లొట్టలేసుకుంటూ తినేవారి గురించి మీకు తెలుసా? ఇది మీ ఊహలోకి కూడా రాకపోవచ్చు. దోమలను ఎంతో ఇష్టంగా తినే ప్రజలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను లొట్టలేసుకుంటూ తినే ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఈ సంఘాన్ని మిడ్జెస్ అంటారు. వారు దోమలను వేటాడేవారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు, అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి అప్పుడు మిడ్జెస్ జాతి ప్రజలు ఈ దోమలను వేటాడి, ఇష్టంగా తింటారు. వర్షాల సమయంలో దోమలను పట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు పలు రకాల పాత్రలను ఉపయోగిస్తారు. సాయంత్రం పూట దోమలను అధికంగా సేకరించి, వాటిని దగ్గరగా కలిపి, బాగా మెత్తగా చేసి, రుచికరమైన టిక్కీలు తయారు చేస్తారు. పలు నివేదికల ప్రకారం వారు ఒక్కో టిక్కీని తయారు చేయడానికి కనీసం 5 లక్షల దోమలను ఉపయోగిస్తారు. అక్కడ ఒక వ్యక్తి రోజుకు కనీసంగా రెండు టిక్కీలు తింటే, అతను 10 లక్షల దోమలను తిన్నాడని అర్థం. ఈ దోమలు ప్రొటీన్ కారకాలని, వాటిని తింటే తమ శరీరానికి సరిపడా ప్రొటీన్లు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇది కూడా చదవండి: ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? -
వెరైటీగా మొక్కజొన్న తినాలకుంటే జుట్టూడింది!
సోషల్ మీడియా అనేది వాకింగ్ కామెడీ షో లాంటిది. ఎవరైనా సోషల్ మీడియా సముద్రంలోకి దూకినప్పుడు వింతలు విడ్డూరాలు అనేకం కనిపిస్తాయి. ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిలో ఒక యువతి మొక్కజొన్న తినడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించి భంగపడింది. ఈ వీడియోను చూసిన వారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. వైరల్ వీడియోలో డ్రిల్ మెషిన్‌కు మొక్కజొన్న పొత్తు గుచ్చి, ఒక అమ్మాయి దానిని తినేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వరకు అంతా బాగానే ఉంది. తరువాత ఒక్కసారిగా ఆమె జుట్టు కొద్దిమేరకు మెషీన్లో ఇరుక్కుపోయి ఊడిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో Twitter)లో @ZeroIQPeople అనే పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ 15 వేల 600 మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్.. ‘అందుకే యువతులు పవర్ టూల్స్‌కు దూరంగా ఉండాలని చెప్పేది’ అని రాశాడు. మరో యూజర్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు? pic.twitter.com/DQVFNWZH5P — People With 0 IQ (@ZeroIQPeople) October 1, 2023 -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్‌తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు) -
ఇవి తింటే.. ఆస్తమా అటాక్ అవ్వదు!
ఆస్తమా నివారణ ఇలా... ఆస్తమా ఊపిరాడనివ్వకుండా చేస్త... ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిన విషయమే. పైగా వర్షాలతో ఇప్పుడున్న వాతావరణం ఆస్తమాకు మరింత దోహదం చేస్తుంది. కొన్ని ఆహారాలతో ఆస్తమా అటాక్ రాకుండా నివారణ ఇలా... తమకు సరిపడని పదార్థాలతో ఆస్తమా ట్రిగర్ అవుతుంది. అందుకే ఆహారాల్లో తమకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి. భోజనంలో... ఆకుకూరల్లో పాలకూర, బచ్చలి వంటి వాటివి... కాయగూరల్లో కాకర, గుమ్మడి, క్యారట్, బీట్రూట్, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యాలు తీసుకోవాలి. పండ్లలో పుల్లటి పండ్లయిన కమలాలు, నిమ్మ, బత్తాయి, అరటిపండు వంటి వాటిని మినహాయించి, మిగతావాటిని అంటే ఉదాహరణకు బెర్రీ, బొప్పాయి వంటి పండ్లను తీసుకోవచ్చు. ఆహారాన్ని వండేందుకు ఉపయోగించే దినుసుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు వంటి సహజ మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..
మనదేశంలోని యమునా నది ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో యుమునలో రకరకాల చేపలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. గతంలో ఇన్ని చేపలు కనిపించేవి కాదని యమున పరీవాహక ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కాగా యమునా నదిలో ఇటీవలి కాలంలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తున్నాయి. యూపీలోని కౌశంబి జిల్లాలో పిపరీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్న నలుగురు మత్స్యకారులు యమునలోని డాల్ఫిన్లను పట్టుకుని, కూర చేసుకుని తినేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో పోలీసులు నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. పిపరీ పోలీసు అధికారి శ్రవణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర కుమార్ నసీర్పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులపై ఫిర్యాదు చేశారన్నారు. ఆ మత్స్యకారుల తమ వలలో పడిన డాల్ఫిన్‌ను ఇంటికి తీసుకుపోయి, కూర వండుకున్నారని రవీంద్రకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ ఉదంతం గురించి పోలీసులు మాట్లాడుతూ ఆ మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళ్లడాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి, నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో రాజేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మిగిలినవారు పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్! -
యూరోపియన్ స్టైల్లో..సాగర తీరాన ఈట్ స్ట్రీట్స్..
చల్లనిగాలి..సముద్ర అందాలు.. ఇష్టమైన ఆహారం..లైఫ్ బిందాసే కదా..అటువంటి యూరోపియన్ ఫుడ్స్టైల్స్ ఇక విశాఖలో నోరూరించనున్నాయి. ఇష్టమైన వంటకాలను తినాలనే కోరిక ఉండే ఆహారప్రియుల కల త్వరలో నెరవేరనుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యూరోపియన్ స్టైయిల్లో ‘ఈట్ స్ట్రీట్స్’ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాగర్‌నగర్ వద్ద ఒకటి, డిఫెన్స్ కాలనీ వద్ద మరొకటి ఏర్పాటుకు సిద్ధమయ్యింది. ఇందుకు అనుగుణంగా టెండర్లను కూడా ఆహా్వనించింది. ఈట్ స్ట్రీట్స్ పేరుతో అందమైన ఆర్చ్‌తో ఆహార ప్రియులను ఆహ్వానించనున్నాయి. మొత్తం రూ.6.24 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్.. వైజాగ్ వాసులకు కొత్త వంటకాల రుచులను పరిచయం చేయనున్నాయి. ఆధునిక పద్ధతిలో.. ఆధునిక పద్ధతిలో ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు పెద్దగా ఉపయోగించని ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేశాం. యూరోపియన్ స్టైల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాం. వెరైటీ వంటకాలకు ఈట్ స్ట్రీట్స్ కేంద్రంగా మారనున్నాయి. నగరవాసులు ఆహ్లాదంగా సేద తీరేందుకు ఈట్ స్ట్రీట్స్ రానున్న రోజుల్లో దోహదం చేయనున్నాయి. – సాయికాంత్ వర్మ, జీవీఎంసీ కమిషనర్ నగర వాసుల కోసం ప్రజలకు ఎప్పటికప్పుడు కొంగొత్తగా విశాఖ నగరాన్ని పరిచయం చేసేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ వ్యూ పాయింట్‌తో పాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మెరిడీయన్ అభివృద్ధి చేస్తున్నాం. కొత్త బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరింతగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఆహార ప్రియులకు కొంగొత్త వంటకాలతో పాటు ప్రశాంతమైన వాతావరణంతో ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. అధునాతన పద్ధతిలో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్ నగర వాసులను ఆకట్టుకోనున్నాయి. టెండర్లు పూర్తి అయిన తర్వాత 6 నెలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నాం. – గొలగాని హరి వెంకట హరికుమారి, జీవీఎంసీ మేయర్ రూ. రూ. 6.24 కోట్లతో.. వాస్తవానికి ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే, ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో పార్క్ హోటల్‌కు ఎదురుగా ఉన్న డిఫెన్స్ కాలనీ వద్ద, సాగర్‌నగర్‌లో ఒకటి ఏర్పాటు చేసేందుకు తాజాగా జీవీఎంసీ అడుగులు వేసింది. డిఫెన్స్ కాలనీ వద్ద రూ. 3.24 కోట్ల వ్యయంతో, సాగర్‌నగర్ వద్ద రూ.మూడు కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. యూరోపియన్ స్టైయిల్లో ఈ ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. 6 నెలల కాలంలో పూర్తి చేయాలని భావిస్తోంది. అన్ని వేళల్లో అందుబాటులో.. జీవీఎంసీ ఏర్పాటు చేయనున్న ఈట్స్ట్రీట్స్ను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. మనకు కావాల్సిన వివిధ రకాల వంటకాలు ఇక్కడ లభించడంతో పాటు అప్పటికప్పుడు మన కళ్ల ముందే తయారుచేయడాన్ని కూడా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది. అంతేకాకుండా విశాలమైన స్థలం...ప్రశాంతంగా వంటకాలను ఆస్వాదించడం ఇక్కడి ప్రత్యేకత. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని సమయాల్లో అందుబాటు ఉండనుంది. ఇష్టమైనవి తింటూ..కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసేలా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ తీర్చిదిద్దనుంది. ఈట్స్ట్రీట్స్ డిజైన్లను కూడా ఇప్పటికే జీవీఎంసీ తయారు చేసింది. మొత్తంగా విశాఖ వాసులకు త్వరలో వెరైటీ వంటకాల కోసం ఈట్ స్ట్రీట్స్ అందుబాటులోకి రానున్నాయి. (చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల చుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..) -
బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా? ఆరోగ్యానికి మంచిది కాదా!
పోషకాహార ప్రపంచంలో బంగాళ దుంపలను విలన్‌గా చూస్తారు. అమ్మో! బంగాళదుంప తింటే..ఇంకేమైనా ఉందా..! బరువు పెరిగిపోతాం అని భావిస్తారు చాలామంది. దాని జోలికి పోవడానికే భయపడిపోతారు. ఇందులో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయని తీసుకోవడానికే జంకుతారు. కానీ ఇది నిజం కాదంటున్నారు ఆహార నిపుణలు. ఇవి ఆరోగ్యానికి చాలమంచి సమతుల్య ఆహారం అని చెబుతున్నారు. అందరూ బంగాళ దుంపలను చూసి భయపడటానికి కారణం వేయించిన ఆహారంగా భావించడమేనని నిపుణులు చెబుతున్నారు. నిజానికి బంగాళ దుంప ఆరోగ్యానికి చెడ్డది కాదని అంటున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ తదితర పోషక విలువలు ఉంటాయి. ఐతే ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి కాబట్టి రైస్‌తో జోడించి తీసుకోవద్దని సూచిస్తున్నారు న్యూట్రీషియన్లు. ప్రతిరోజు మీడియం సైజులోని బంగాళదుంపలను నిరంభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు. ఇందులో స్టార్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని జత చేయకూడదు. వేయించిన బంగాళ దుంపలను అస్సలు దగ్గరకు రానీయద్దు. కేవలం ఉడకబెట్టడం, లేదా వేరే కాయగూరలతో కలిసి తీసుకోవడం వంటివి చేయొచ్చు. వీటిలో ఉండే పోషకాలు.. బంగాళదుంపల్లో విటమిన్ సీ, పోటాషియం, విటమిన్ బీ6 ఉంటాయి. వీటిలో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే తయరీ విధానం అనుసరించి పోషక కంటెంట్ మారుతుంది ఇందులో ప్రధానంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది శరీరానికి మంచి శక్తినిస్తుంది. ఇందులో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఈ ఫైబర్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆరోగ్య ప్రయోజనలు ►దీనిలో ఉండే విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థకు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది ►గుండె, కండరాల పనితీరుకు ఇందులో ఉండే విటమిన్ సీ, ఫైటోకెమికల్స్ రక్షణగా ఉంటాయి. ►ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. అయితే ఈ బంగాళదుంపల్లో గ్లైసెమిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచే అవకాశం ఉంది. అందుకే దీన్నీ ఆకుకూరలు, వంటి ఇతర కూరగాయాలతో మిక్సింగ్ చేసి తీసుకోవడమే ఉత్తమం. చక్కెర స్థాయిలను తగ్గించేలా చేసుకునే బంగాళదుంపల వంటలను ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే స్టార్చ్, అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా మితంగా ఉపయోగించడమే మంచిది. గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. (చదవండి: బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..) -
ఓ విద్యార్థి ఆకలితో..ఏకంగా రూ. 98 లక్షలు ఖరీదు చేసే..
ఓ విద్యార్థి ఆకలితో ఉండటంతో చేసిని తమషా పని చూస్తే ఆశ్చర్యం తోపాటు కోపం కూడా వస్తుంది. ఆకలిగా ఉందని ఏకంగా ఓ కళాకృతి లాగించేస్తాడు. ఈ విచిత్ర ఘటన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ మ్యూజియం సందర్శించడానికి వచ్చిన విద్యార్థికి మంచి ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తోచక ఆ మ్యూజియంలో కమెడియన్ అనే గోడపై ఉన్న బనానా ఆర్ట్‌గా పిలిచే అరపండు కళాకృతిని లాగించేశాడు. అసలు ఏంటి ఇది అంటే.. ఒక గొడకు అరటిపండును టాప్ చేసే పెట్టే ఒక రకమైన ఆర్ట్ వర్క్ ఇది. ఆ విద్యార్థి ఆకలివేయడంతో ఆ అరటిపండుని కామ్‌గా తినేసి, తొక్కను గోడకు టాప్ చేసి రకరకాలుగా ఫోజులిచ్చి వెళ్లిపోయాడు. ఐతే ఆ కళాకృతి ధర ఏకంగా రూ. 98 లక్షలట. ఇలా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన బనానా కళాకృతిని లాగించేయడం మొదటిసారి కాదట. ఇంతకు మునుపు 2019లో కూడా ఈ కళాకృతి సుమారు రూ. 98 లక్షలకు విక్రయించబడ్డక తినేశారట. ఈ కళాకృతిని కళాకరుడు మారిజియో కాటెలన్ రూపొందించాడు. ఆయన ప్రతి ఏడాది మ్యూజియంలో ఈ కళాకృతిని ప్రదర్శిస్తాడని, అరటిపండును మార్చడం జరగుతుంటుందని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: అమెరికాలో తుపాకీ అప్పగిస్తే.. గిఫ్ట్ కార్డు బహుమానం) -
వేటగాడే వేటకు బలి.. అరుదైన దృశ్యం నెట్టింట వైరల్..
బలహీనుడిపై బలవంతుడుపై చేయి సాధించడం తెలిసిందే.. అయితే ఇద్దరు బలవంతుల మధ్య పోటీ జరిగితే విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో చిరుతపులిని తింటున్న పులి చిత్రాన్ని నెట్టింట షేర్ చేశారు. రణతంబోర్ నేషనల్ పార్క్‌లో అనూహ్యంగా ఒక పులి చిరుతను వేటాడింది. వాటి మధ్య జరిగిన బీకర పోరులో చిరుత పులి చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది. చిరుతను చంపిన పులి ఆ తర్వాత దాని మాంసాన్ని ఎంతో ఇష్టంతో తింటోంది. అందులో సఫారీకి వచ్చిన పర్యాటకులు కొందరు ఈ ఘటనను ఫోటో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు పులి, చిరుతపులి మధ్య పోరాటం చాలా అరుదని కామెంట్లు పెడుతున్నారు. Wild wild world. The tiger name is T 101 of Ranthambore. @HJunglebook recently captured it and want everyone to witness it. pic.twitter.com/dAT7WNvxtv — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 1, 2023 -
వింత ఘటన: పెంపుడు పిల్లిని దొంగిలించి.. తిన్న ముగ్గురు వ్యక్తులు..
సాక్షి, అల్వాల్: పెంపుడు పిల్లిని దొంగిలించి..కోసుకుని తిన్న ముగ్గురు నిందితులను నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ జీకే కాలనీలో నివాసం ఉండే తాలూరి రూత్‌వర్ష పెంచుకుంటున్న పిల్లి గత నెల 29వ తేదీ నుండి కనిపించడం లేదు. ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో చొరబడి పిల్లిని అపహరించి సంచిలో వేసుకొని పారిపోయినట్లు గుర్తించారు. దీంతో నేరేడ్మెట్ పోలీసులకు రూత్‌వర్ష ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వినాయక్‌నగర్‌కు చెందిన నర్సింహ, కిరణ్, శంకర్ నిందితులుగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. ఆహారం కోసమే పిల్లిని దొంగిలించామని నిందితులు తెలిపారు. (చదవండి: తెలంగాణ కొత్త సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్) -
ఆస్తి తన పేరుమీద రాయలేదని భర్త చెవికొరికిన భార్య
ముంబై: భర్త పేరు మీద ఉన్న భూమిని తనపేరిట రాయలేదన్న కోపంతో భర్త చెంప కొరికింది ఓ భార్య. కోన్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాలూకాలోని ఠాక్రాచపాడ గ్రామంలోని ఆటస్థలం ప్రక్కనున్న శంకరుని మందిర పరిసర ప్రాంతానికి చెందిన ప్రకాశ్ మారుతీ ఠాకూర్ (67) తన పూర్వీకుల స్థలాన్ని భార్య సునంద పేరు మీద రాయాల్సిందిగా పట్టుబట్టింది. అయితే ఆ స్థలం తన తల్లి, సోదరుడి పేరుతో ఉందని, పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని భర్త చెప్పడంతో కోపంతో రగిలిపోయిన సునంద తన భర్తను వేధింపులకు గురిచేసింది. ఈ క్రమంలో కుమారుడు స్వప్నిల్, సునంద కలసి భర్త చెంప, వేళ్లను గట్టిగా కొరికేయడంతో ప్రకాశ్ ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డాడు. సునంద, స్వప్నిల్‌పై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా..ఐపీసీ 324, 506, 504,34 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: విషాదం.. 75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. -
బండరాయిపై భోజనం
-
పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత..
నాదెండ్ల: బొడ్డుపేగు తింటే పిల్లలు పుడతారనే మూఢ నమ్మకానికి ఓ వివాహిత బలైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని తూబాడుకు చెందిన ఆటో డ్రైవర్ రవికి రెండేళ్ల కిందట సన్నితతో వివాహమైంది. పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 13వ తేదీన వేరే మహిళ ప్రసవించడంతో బొడ్డుపేగు తెచ్చిన కుటుంబ సభ్యులు సన్నిత చేత తినిపించారు. చదవండి: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. ఇంటి నుంచి తీసుకెళ్లి.. రెండు రోజుల తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. శనివారం సన్నిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే తన కుమార్తెను అత్తింటి వారు తరచూ వేధిస్తూ ఆమె చేత విషపదార్థం తినిపించి హత్య చేశారంటూ సన్నిత తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉదయాన్నే తినేస్తే బెటర్!
ఒక రోజులో ఎనిమిది – పది గంటల వ్యవధిలో ఆహారం మొత్తం తీసుకోవడం వల్ల మన జీవక్రియలు మెరుగవుతాయని అంటున్నారు డాక్టర్ సచిన్ పాండా. ‘ద సిర్కాడియన్ కోడ్’ పేరుతో జీవక్రియలు, ఆహారం మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించారు పాండా. సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అనుగుణంగా మన శరీరం పనిచేస్తుందని.. హార్మోన్లు, ఎంజైమ్‌లు, జీర్ణ వ్యవస్థ కూడా ఉదయం వేళ, సాయంకాలానికి కొంచెం ముందు ఆహారాన్ని సమర్థంగా జీర్ణం చేయగలవని సచిన్ అంటున్నారు. క్లోమ గ్రంథి ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేదీ, కడుపు/పేగుల్లో బ్యాక్టీరియా చైతన్యవంతంగా ఉండేదీ ఈ సమయాల్లోనేనని ఆయన అంటున్నారు. రాత్రిపూట అవయవాలన్నీ నెమ్మదిస్తాయని, మెదడు నిద్రకు పనికొచ్చే మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుందని.. ఆ సమయంలో ఆహారం తీసుకుంటే.. మెదడు గందరగోళంలో పడిపోతుందని అన్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. 2012లో తాను ఈ విషయంపై ఒక పరిశోధన కూడా నిర్వహించానని, నచ్చినప్పుడు తిన్న ఎలుకలు అనారోగ్యం పాలు కాగా.. నిర్ణీత సమయంలో మాత్రమే ఆహారం తీసుకున్నవి ఆరోగ్యంగా ఉన్నాయని వివరించారు. మధుమేహం ఛాయలున్న వారిపై జరిపిన ఇంకో ప్రయోగంలో రోజులో ఆహారాన్ని తీసుకునే సమయాన్ని తగ్గించినప్పుడు అనేక ఆరోగ్య లాభాలు చేకూరినట్లు సచిన్ గుర్తించారు. -
నాటు బాంబు తిని ఆవు మృతి
-
కొండచిలువ భారీ దుప్పిని మింగి.. చివరికిలా
అహ్మదాబాద్: తాను తినగలిగిందానికంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న దుప్పిని మింగిన పైథాన్(కొండచిలువ) చివరికి ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. జగన్నాధ్ జిల్లాలోని బలియవాడ్ గ్రామంలో 20 అడుగుల కొండచిలువ ఓ భారీ దుప్పిని మింగింది. అనంతరం దానిని అరిగించుకోవడంలో విఫలమైందని స్థానిక అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి భారీ పరిమాణంలో ఉన్న జంతువులను అహారంగా తీసుకున్న సమయంలో అది జీర్ణం కావడానికి కొండచిలువలకు కొన్ని రోజులు పడుతుంది. కొన్నిసార్లు పూర్తిగా జీర్ణమవడానికి కొన్ని వారాలు కూడా పట్టొచ్చు. అయితే భారీ పరిమాణంలో ఉన్న ఆ దుప్పిని మింగడం మూలంగా పైథాన్‌కు అంతర్గతంగా గాయాలయ్యాయని అందుకే అది మరణించిందని అధికారులు వెల్లడించారు. దుప్పిని మింగిన అనంతరం రోడ్డుపై కదలలేని స్థితిలో ఉన్న పైథాన్‌ను గ్రామస్తులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే.. పైథాన్‌ను రక్షించే ప్రయత్నం చేసేలోపే అది మరణించిందని అధికారులు వెల్లడించారు. ఇంత భారీ పరిమాణంలో ఉండే కొండచిలువలు చాలా అరుదు అని, అది మరణించడం బాధాకరమని వారు వాపోయారు.